Teaser Launch
-
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
మిస్టర్ రెడ్డిని ఆదరించాలి..– స్పీకర్ గడ్డం ప్రసాద్
‘‘మిస్టర్ రెడ్డి’ మూవీ టీమ్ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. దర్శకుడు వెంకట్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. హీరో, నిర్మాత నరసింహా రెడ్డి యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు. గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారావు–టీఎన్ఆర్) నటించి, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. వెంకట్ వోలాద్రి దర్శకత్వంలో టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి గడ్డం ప్రసాద్, పట్నం సునీతా రెడ్డి, నల్లగొండ గద్దర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ– ‘‘మిస్టర్ రెడ్డి’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. కొత్తవాళ్లమంతా చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలి. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం మేమంతా కష్టపడి పని చేశాం. ఔట్పుట్ బాగా వచ్చింది’’ అని వెంకట్ వోలాద్రి పేర్కొన్నారు. ‘‘మిస్టర్ రెడ్డి’ లాంటి మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు మహాదేవ్, అనుపమా ప్రకాశ్. -
కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్ కుమార్
‘‘కన్నప్ప’(Kannappa) మూవీ అవకాశాన్ని రెండు సార్లు తిరస్కరించాను. కానీ, భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా ఒప్పుకునేలా చేసింది. చాలా శక్తిమంతమైన కథ ఇది. లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా ఉంది’’ అని అక్షయ్ కుమార్ తెలిపారు. విష్ణు మంచు(Vishnu Manchu) హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’.ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. గురువారం ముంబైలో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’ కేవలం ఓ సినిమా కాదు.. నా జీవిత ప్రయాణం.కన్నప్ప కథతో నాకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది’’ అని చెప్పారు. ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ–‘‘విష్ణు, అక్షయ్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలను డైరెక్ట్ చేయడం అద్భుతమైన అనుభవం. వారి పాత్రలు తెరపై అద్భుతం చేయబోతున్నాయి’’ అన్నారు. ఈ ఈవెంట్లో చిత్ర ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి పాల్గొన్నారు. -
భరతనాట్యం నేపథ్యంలో...
ఇంద్రాణి దావులూరి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’(Andhela Ravamidhi movie). విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్యా మీనన్, జయలలిత, ఆది లోకేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శివ భట్టిప్రోలు సమర్పిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘మన కళలు, సంస్కృతీ సంప్రదాయాలపై ఇంద్రాణిగారికి ఎంతో మక్కువ.హద్దులు దాటుతున్న కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలు వస్తున్న ఈ ట్రెండ్‌లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన కల్చర్‌ను తెలియజెప్పాలనే ప్రయత్నంతో ‘అందెల రవమిది’ సినిమా తీశారు. ఇలాంటి సినిమాను సపోర్ట్ చేయాలి’’ అన్నారు. ‘‘భరతనాట్యం నేపథ్యంలో వస్తున్న ‘అందెల రవమిది’కి మన వంతు సహకారం అందించడం మన బాధ్యత’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘రెండువేల ఏళ్ల నాటి నృత్య కళ భరతనాట్యం. ఈ కళను బతికించుకోవాలి.వెస్ట్రన్ డ్యాన్స్‌లను 30 సంవత్సరాల తర్వాత మనం చేయలేం. కానీ భరతనాట్యాన్ని చనిపోయేవరకూ చేయవచ్చు. ఇప్పటివరకూ మా సినిమాకి డీసీ సౌత్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఉమెన్ మేడ్ మూవీ, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్‌గా పలు పురస్కారాలు దక్కాయి’’ అని తెలిపారు ఇంద్రాణి. -
సినిమా తీయడం సులభం కాదు: మంచు మనోజ్
‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం అంత సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఫ్యాషన్‌తో ‘జగన్నాథ్’(Jagannath) చిత్రం తీశారు. కోటి రూ పాయలతో తీసిన సినిమా చిన్నది, వెయ్యి కోట్లతో తీసినది పెద్ద చిత్రం అనడానికి లేదు. ఏదైనా సినిమానే. కాకపోతే ఆ సినిమా బాగుందా? బాగాలేదా అనేదే ఉంటుంది’’ అని నటుడు మంచు మనోజ్ అన్నారు.రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటించిన చిత్రం ‘జగన్నాథ్’. భరత్, సంతోష్ దర్శకత్వంలో పీలం పురుషోత్తం నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్(Manchu Manoj) మాట్లాడుతూ– ‘‘భరత్‌కి ‘జగన్నాథ్’ తొలి సినిమా అయినప్పటికీ ఎంతో ప్రొఫెషనల్‌గా నటించాడు. ఈ మూవీ హిట్ కావాలి’’ అన్నారు. రాయలసీమ భరత్ మాట్లాడుతూ– ‘‘సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను. ఐదేళ్లు కష్టపడి ‘జగన్నాథ్’ చిత్రం పూర్తి చేశాం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం–నేపథ్య సంగీతం: శేఖర్ మోపూరి. -
స్వచ్ఛమైన వినోదంతో...
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు రాగ్ మయూర్ మాట్లాడుతూ– ‘‘బద్మాషులు’ టీజర్ చాలా ఆర్గానిక్‌గా ఉంది. స్వచ్ఛమైన వినోదంతో రూపొందుతోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు. శంకర్ చేగూరి మాట్లాడుతూ– ‘‘టీజర్ జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చిన శంకర్‌గారికి కృతజ్ఞతలు. మా చిత్రాన్ని అందరూ స΄ోర్ట్ చేయాలి’’ అన్నారు మహేశ్ చింతల. ‘‘ఈ చిత్రంలో ఆరోగ్యకరమైన వినోదం పండించాం. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని విద్యాసాగర్ కారంపురి తెలిపారు. ‘‘నాకు ఈ మూవీ చేసే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని కెమేరామేన్ వినీత్ పబ్బతి చెప్పారు. -
మోహన్‌లాల్ 'లూసిఫర్2' మూవీ టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాలు తీయాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
‘‘ఎక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి, ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే.. తక్కువ బడ్జెట్లోనే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది. అలా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్‌తో వస్తున్న ‘ఎల్.వై.ఎఫ్’ వంటి చిత్రాలను ప్రోత్సహించడంలో నేను ముందుంటాను’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిశోర్ రాటి, మహేష్ రాటి, ఎ. రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని కోమటిరెడ్డి వెంకట రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్‌తో తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు బాగుంటాయి. ఇలాంటి చిత్రాలే మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ‘ఎల్.వై.ఎఫ్’ కూడా అదే విధంగా విజయం సాధించాలి’’ అన్నారు. ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, ‘షకలక’ శంకర్, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ. -
'పరదా' టీజర్ లాంచ్ ఈవెంట్..ఈవిడ ఎవరో తెలుసా .? (ఫొటోలు)
-
'భైరవం' టీజర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ సందడి (ఫొటోలు)
-
రాజుగారి దొంగలు వస్తున్నారు
లోహిత్ కల్యాణ్, రాజేశ్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి దొంగలు’. లోకేశ్ రనల్ హిటాసో దర్శకత్వంలో నడిమింటి లిఖిత సమర్పణలో నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకకి ప్రోడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు సురేష్ అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోహిత్ రనల్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ కావాలనే నా కలను, నన్ను నమ్మి మా నాన్న బంగారు నాయుడుగారు ఈ మూవీని నిర్మించారు. మా మూవీకి ప్రేక్షకాదరణ దక్కుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ‘‘టీజర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది’’ అని నడిమింటి బంగారు నాయుడు చెప్పారు. -
కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా ’మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
బార్బరిక్ కొత్తగా ఉంటుంది: మారుతి
‘‘మైథలాజికల్ పాయింట్లో ఉన్న పాత్ర ప్రస్తుత తరానికి వస్తే ఎలా ఉంటుందో ‘బార్బరిక్’(Barbaric) లో చూపించారు. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. కానీ, మోహన్, రాజేశ్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని చాలా ఖర్చు పెట్టి తీశారు. ఈ మూవీ సరికొత్తగా ఉంటుంది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహా, సాంచీ రాయ్, ‘సత్యం’ రాజేశ్, ఉదయ భాను ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘బార్బరిక్’(Barbaric) . మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు. ఈ మూవీ టీజర్ లాంచ్(Teaser Launch) ఈవెంట్‌కి మారుతి అతిథిగా హాజరై, విడుదల చేశారు.ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ– ‘‘ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది’’ అని విజయపాల్ రెడ్డి తెలిపారు. ‘‘బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు ఈ మూవీకి సంబంధించి నాకు మూడు అస్త్రాలు ఉన్నాయి. ఒకరు డీఓపీ రమేశ్, రెండు ఫ్యూజన్ బ్యాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్. ఈ మూడు అస్త్రాలతో నేను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు మోహన్ శ్రీవత్స. ‘‘బార్బరిక్’ మినీ ‘బాహుబలి’ మూవీలా ఉంటుంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. ‘‘ఇది నాకు తొలి తెలుగు సినిమా’’ అని సాంచీ రాయ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: కుశేందర్ రమేశ్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్. -
ఉల్లాసం... ఉత్సాహం
దాసరి లోకేశ్‌బాబు, శిరీష నులు జంటగా నటిస్తున్న సినిమా ‘ఉల్లాసంగానే ఉత్సాహంగానే.’. కేవీజీ రాజు దర్శకత్వంలో మైత్రీ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ ఉమా మహేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో లోకేశ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మంచి లవ్‌స్టోరీ. ఫీల్‌గుడ్ అంశాలతోపాటు అన్ని కమర్షియల్ హంగులు ఉన్న ఈ సినిమా మా టీమ్ అందరికీ సక్సెస్ ఇస్తుందని నమ్మతున్నాను’’ అన్నారు.‘‘లోకేశ్ ఎనర్జిటిక్‌గా నటించాడు. ఈ సినిమా విషయంలో మా నిర్మాతల సాయం మర్చిపోలేనిది’’ అని తెలిపారు కేవీజీ రాజు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు ఉమా మహేశ్వరరావు. ఈ సినిమా సహ నిర్మాతలు ఎండీ కలామ్, ఖదీర్, నటుడు జబర్దస్త్ ప్రవీణ్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడారు. -
అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
చంటబ్బాయిగారి తాలుకా..!
‘వెన్నెల’ కిశోర్ ప్రధానపాత్రలో చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. చంటబ్బాయిగారి తాలూకా’ క్యాప్షన్. ఈ చిత్రంలో అనన్యా నాగళ్ల, సీయా గౌతమ్ హీరోయిన్లుగా, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలో నటించారు. రైటర్ మోహన్ దర్శకత్వంలో లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది. నిర్మాత వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మోహన్ మాట్లాడుతూ–‘‘ఫస్ట్ కాపీ చూసిన తర్వాత వంశీగారు చెప్పిన మార్పులు, ఆయన ఈ సినిమా తీసుకోవడం మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి’’ అన్నారు.‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు ఫుల్‌మీల్స్ లాంటిది’’ అన్నారు అనన్యా నాగళ్ల. ‘‘కంటెంట్‌ని నమ్మి తీసిన చిన్న సినిమాలు ‘2018, కమిటీ కుర్రాళ్ళు, ఇటీవల రిలీజ్ అయిన ‘క’.., ఇవన్నీ ప్రేక్షకులను అలరించాయి. నిర్మాత వంశీగారిది గోల్డెన్ హ్యాండ్. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ విజయం సాధించి, మోహన్‌గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ‘కమిటీ కుర్రాళ్ళు’ ఫేమ్ దర్శకుడు యదు వంశీ. -
'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్‌పై ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ రిలీజైంది. ముందు నుంచే చెబుతున్నట్లు ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో తీస్తున్న సినిమా.. అందుకు తగ్గట్లే టీజర్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్‌కి చిరు గ్రేస్‌తో పాటు అన్నీతెగ నచ్చేస్తుంటే.. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)అలానే టీజర్ ప్రారంభంలో చూపించే అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా 'అవెంజర్స్' నుంచి తెచ్చి పెట్టారని ప్రూఫ్స్‌తో ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరైతే గ్రాఫిక్స్ నేచురల్‌గా లేవని అంటున్నారు. మూవీ రిలీజ్ టైంకి ఇవన్నీ కాస్త కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరంజీవిని ఏం అనట్లేదు గానీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ కేర్ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇతడిని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాని లెక్క ప్రకారం సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలి. కానీ 'గేమ్ ఛేంజర్' కోసం దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా ప్రకటించారు. అంటే 'విశ్వంభర' వచ్చేది వేసవికే అనమాట. ఏప్రిల్‌లో 'రాజా సాబ్' ఉంది కాబట్టి మేలోనే రిలీజయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి చూడాలి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)MEGA fans thappa andaru konchem disappointed feel lo ne unnaru ga teaser choosi 😴😴😴 Its nice that they postponed to Summer 2025 ..Work well on Vfx and bring out GRANDDD OUTPUT ..plz don't go PAN-INDIA with this movie @UV_Creations 🙏⭐️ @KChiruTweets⭐️ #ViswambharaTeaser 👎 pic.twitter.com/zOX9eJWOII— ★ Movie Monster ★ (@movie_monsterz) October 12, 2024#ViswambharaTeaser - Storyline definitely looks thrilling but VFX could have been better. Aa chota k naidu mida antha interest enti boss aadi cinematography outdated asalu, small range movies kuda adni consider cheyatle 🤦🏻♂️Btw, Boss in this frame 🔥 pic.twitter.com/CtYwzZZjMS— CK (@Chanti616) October 12, 2024 -
ఆ కష్టం నాకు తెలుసు: మనోజ్ మంచు
‘‘జీబ్రా’ సినిమా కోసం టీమ్ ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు. తన నటనకి నేను అభిమానిని. ‘జీబ్రా’ టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అని హీరో మనోజ్ మంచు అన్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో నటుడు సత్యరాజ్ కీలక పాత్ర చేశారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.ఈ మూవీ టీజర్‌ని హీరో నాని సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘జీబ్రా’ టీజర్‌లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా మనోజ్ మంచు హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘జీబ్రా’ నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘జీబ్రా’ కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పాను’’ అని డాలీ ధనంజయ తెలిపారు. ‘‘ఈ మూవీలో నా పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది’’ అని సత్య రాజ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులు మంచి కథని సపోర్ట్ చేస్తార నే నమ్మకంతోనే ఈ సినిమా చేశాం’’ అన్నారు ఈశ్వర్ కార్తీక్. ‘‘జీబ్రా’ చాలా కొత్త కంటెంట్. సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని నిర్మాతలు దినేష్ సుందరం, బాల సుందరం, ఎస్ఎన్ రెడ్డి తెలిపారు. జెన్నీఫర్ పిక్కీనాటో మాట్లాడారు. -
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
'మత్తు వదలరా 2' మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
నారా రోహిత్ 'సుందరకాండ' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం 'క' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘35’ (చిన్న కథ కాదు) మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సస్పెన్స్ థ్రిల్లర్
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘రా.. రాజా’. బి. శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రా..రాజా’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది.ఈ సినిమాలో నటించిన 24మంది పాత్రల ముఖాలు కనిపించవు. కృత్రిమ మేథస్సును వినియోగిస్తున్న ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి చిత్రం చేయడం ఓ కొత్త ప్రయోగమే. ఈ సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందనిపిస్తోంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్. -
'కమిటీ కుర్రోళ్లు' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
హిట్ లిస్ట్ టీజర్ బాగుంది: సూర్య
‘‘హిట్ లిస్ట్’ మూవీ టీజర్ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. విజయ్ కనిష్కతో పాటు టీమ్‌కి ఈ మూవీ మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో సూర్య అన్నారు. తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా సముద్ర ఖని, శరత్‌కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సూర్య కతిర్ కాకల్లార్, కె. కార్తికేయన్ దర్శకత్వం వహించారు.దర్శకుడు కేఎస్ రవికుమార్ నిర్మించారు. ఈ మూవీని శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్‌ని సూర్య లాంచ్ చేశారు. ‘‘యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జానర్లో రూపొందిన చిత్రం ‘హిట్ లిస్ట్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది’’ అన్నారు మేకర్స్. -
రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ సినిమా టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
‘భలే ఉన్నాడే!’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మెరుపుతీగలా నేహాశెట్టి.. చూస్తే మెల్ట్ అయిపోతారేమో! (ఫొటోలు)
-
గ్యాంగ్స్ అఫ్ గోదావరి టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
లైట్ బ్లూ సారీ లో నటి అంజలి లుక్స్.. ఫోటోలు
-
పిచ్చి పట్టిందా నీకు...
‘మంచిగా కనపడేవాళ్లందరూ మంచివాళ్లు కాదురా... ఫర్ ఎగ్జాంపుల్ నేను’ అంటూ మొదలవుతుంది ‘మనమే..’ సినిమా టీజర్. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్లేబాయ్ మనస్తత్వం ఉండే అబ్బాయి, బాధ్యతగా జీవించాలనుకునే ఓ అమ్మాయి జీవితాల్లోకి విక్రమాదిత్య అనే ఓ పిల్లవాడు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రం కథాంశమన్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘వాడప్పట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలేం చేశావ్... (కృతీ శెట్టి), ‘తాగటానికెళ్లొచ్చా..’ (శర్వానంద్), ‘ఇల్లు చూసుకోవడం రాదు... పిల్లవాడిని చూసుకోవడం రాదు... పిచ్చిపట్టిందా నీకు...’ (కృతీ శెట్టి), ‘ఇద్దరిలో ఒకళ్లు ఏడ్వండి’ (శర్వానంద్) వంటి సంభాషణలు విడుదలైన టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
'ఫైటర్ రాజా' థ్రిల్లింగ్ టీజర్‌ను లాంచ్ చేసిన విశ్వక్ సేన్ (ఫొటోలు)
-
‘ఓం భీమ్ బుష్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
మరింత నవ్వించాలనే ఈ సినిమా చేశాను
‘‘నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకి, మా ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునే హీరో కథ నాన్నగారి సినిమాలో ఉంటుంది. మా మూవీలో జీవితంలో స్థిరపడినా పెళ్లి కాని హీరో కథ. నా బలం వినోదం. ఈసారి మరింత నవ్వించాలని ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేశాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. మల్లి అంకం దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఆరోగ్యకరమైన కామెడీ ఉన్న ఎంటర్టైనర్ ఇది. మల్లిగారు క్లియర్ విజన్‌తో ఈ సినిమా తీశారు. రాజీవ్‌గారు ΄్యాషన్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘నిర్మాత కావాలన్న నా ఇరవై ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు రాజీవ్ చిలక. ‘‘ఫ్యామిలీతో కలసి ఆనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఒక కిక్ వచ్చింది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. -
జయం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
రోటి కపడా రొమాన్స్ మూవీ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
కొత్త పాయింట్‌తో తీశారనిపిస్తోంది
విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో..’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కలియుగం పట్టణంలో..’ టైటిల్ కొత్తగా ఉంది. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. నా ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు. ఇప్పుడు హీరోగా నటించాడు. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ఈ సినిమా తీశారు. చిత్రా శుక్లా ఓ స్పెషల్ రోల్ చేశారు’’ అన్నారు విశ్వ కార్తీకేయ. ‘‘మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమాకాంత్ రెడ్డి. ‘‘మా టీజర్, ట్రైలర్‌ను చూసి కథను అంచనా వేయలేరు. సినిమా అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణను కడపలోనే చేశాం’’ అన్నారు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి. ‘‘సినిమా అంతా కడపలోనే తీయడం ఇదే తొలిసారి. కడప నుంచి ఓ మంచి నిర్మాత రాబోతున్నాడు’’ అన్నారు దర్శకుడు నీలకంఠ. -
షరతులు వర్తిస్తాయి మంచి చిత్రంగా నిలవాలి
చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ముఖ్య అతిథి ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బలగం’ కంటే ఎక్కువగా తెలంగాణ నేటివిటీ ఈ సినిమాలో ఉంది. సాంగ్, టీజర్ బాగున్నాయి. ఇదొక మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సహజమైన కథా కథనాలతో, కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకుని ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమాను తీశారు’’ అన్నారు హరికృష్ణ. ‘‘నేను కరీంనగర్ వాసిని. పరిశ్రమలో నటుడిగా ఎదిగి మళ్లీ కరీంనగర్ వెళ్లి సినిమా షూటింగ్ చేయడం ఒక అఛీవ్‌మెంట్‌లా ఫీలవుతున్నాను’’ అన్నారు చైతన్య. ‘‘సినిమాలో మంచి కంటెంట్ ఉంది’’ అన్నారు కుమారస్వామి. ‘‘సమాజంలోని ఓ సమస్య పరిష్కారానికి హీరో ఎలా ముందుకు వచ్చాడన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు డా. కృష్ణకాంత్ చిత్తజల్లు. -
ప్రేమిస్తే తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
‘‘ప్రేమిస్తే’ అనే డబ్బింగ్ మూవీతో నా కెరీర్ ఆరంభమైంది. ‘ప్రేమిస్తే’ చూసి బాగుందనిపించి రిలీజ్ చేసి, హిట్ సాధించాం. ఇన్నాళ్లకు ‘ట్రూ లవర్’ చిత్రం చూడగానే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. ఈ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు.. ఇలా అందరూ చూడొచ్చు’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. మణికందన్, శ్రీ గౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ట్రూ లవర్’. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల మధ్య ఉంటున్న మోడ్రన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ‘ట్రూ లవర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. ‘ట్రూ లవర్’ చిన్న క్యూట్ సినిమా.. మా సినిమాని విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు మణికందన్. -
ప్రేమకు జై
అనిల్ బురగాని, ఆర్. జ్వలిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకు జై’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ని ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. నూతన నటీనటులు చాలా బాగా నటించారనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హీరో హీరోయిన్లతో పాటు ప్రతినాయకుడు దుబ్బాక భాస్కర్ బాగా నటించారు. మా సినిమాని నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నాం’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, లైన్‌ప్రోడ్యూసర్: మైలారం రాజు. -
రహస్యాలెన్నో..
‘కాలగర్భంలో కలిసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే అందులో ఊహకందని రహస్యాలెన్నో!’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది ‘తంత్ర’ సినిమా టీజర్. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అనన్యా నాగళ్ల, సలోని, ‘టెంపర్’ శీను ఇతర ప్రధాన పాత్రధారులు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో నరేశ్‌బాబు. పి, రవి చైతన్య నిర్మిస్తు్తన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ‘‘ఇందులో దుష్టశక్తి బారిన పడిన అమ్మాయి పాత్రలో అనన్య, తాంత్రికుడిగా ‘టెంపర్ శీను’, ఓ మిస్టీరియస్ పాత్రలో సలోని కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
బర్త్ డే కానుక?
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోందని, రజనీకాంత్– ఫాహద్ కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. అయితే ఈ సినిమా టీజర్ విడుదలకు వేళ అయిందట. ఈ నెల 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, ఫేక్ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. లైకా ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అప్డేట్ కూడా ఈ నెల 12న రావొచ్చని టాక్. -
కవిత్వం చెప్పగలడు
మూల విరాట్, పద్మ, రాజ్‌కుమార్, స్వప్న ముఖ్య తారలుగా ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రముఖ కవి కాళోజీ నారాయణ బయోపిక్‌గా విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణ మూర్తి, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, నిర్మాత రామసత్యనారాయణ, దర్శకులు వీయన్ ఆదిత్య, వేణు ఊడుగుల సినిమా హిట్టవ్వాలన్నారు. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘ఒక రిక్షావాడు కూడా కవిత్వం చెప్పగలడని ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘కాళోజీగారి ఆత్మ నా ద్వారా ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు కాళోజీ పాత్రధారి మూల విరాట్. -
Eagle Movie Teaser Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
Thangalaan Teaser Launch: విక్రమ్ ‘తంగలాన్’ మూవీ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
‘బేబి’ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజిత ΄÷న్నాడ కథానాయిక. నిరీష్ తిరువీధుల నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కృష్ణ చైతన్య, పలువురు ΄ాత్రికేయులు విడుదల చేశారు. అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. యువ తరానికి నచ్చే అంశాలతో అన్ని భావోద్వేగాలతో రూ΄÷ందించిన చిత్రం ఇది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’అన్నారు. -
వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
అన్నయ్య కోసం తమ్ముడు మార్చుకున్నాడు!
‘‘ఎలాంటి లెక్కలు వేసుకోకుండా నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. నా ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ, నాకు నచ్చింది వారికీ నచ్చుతుందనే భరోసా కల్పించారు. ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోసారి అది నిరూపితమవుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో నాని అన్నారు. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, శ్రుతీహాసన్, బాల నటి కియారా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ ఉంటుంది. అన్ని ఏజ్ గ్రూప్‌లకు నచ్చే సినిమాను కమర్షియల్ మూవీ అనుకుంటే..‘హాయ్ నాన్న’ మోస్ట్ కమర్షియల్ మూవీ. మా సినిమాను ముందు డిసెంబరు 21న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే ఓ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు, తమ్ముడు అనుకున్న తేదీకే అన్నయ్య వేడుక (ప్రభాస్ ‘సలార్’ సినిమా విడుదలను పరోక్షంగా ఉద్దేశించి..) కూడా ఖరారైతే.. తమ్ముడు తేదీ మార్చుకుంటాడు’’ అన్నారు. ‘‘ఒక మంచి కథతో ‘హాయ్ నాన్న’ తీశాం. నా దర్శకత్వంలోని తొలి సినిమాయే పాన్ ఇండియా స్థాయిలో రూపొందడం హ్యాపీ’’ అన్నారు శౌర్యువ్. ‘‘ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు మోహన్, విజయేందర్ రెడ్డి. ‘‘కథకు తగ్గట్లే మ్యూజిక్ ఇచ్చాను’’ అన్నారు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
నాకూ అలా అనిపిస్తోంది – విశ్వక్ సేన్
‘‘విధి’ నిర్మాత రంజిత్ నాకు మంచి స్నేహితుడు.ప్రోడక్షన్ లో సాయం చేసేందుకు, సపోర్ట్‌గా నిలిచేందుకు నాకూ ఓ బ్రదర్ ఉంటే బాగుండని ఈ దర్శకుల్ని(శ్రీకాంత్, శ్రీనాథ్) చూస్తుంటే అనిపిస్తోంది. ‘విధి’ టీజర్ బాగుంది.. సినిమా పెద్ద హిట్ కావాలి.. నిర్మాతకు మంచి లాభాలు రావాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకద్వయం తెరకెక్కించిన చిత్రం ‘విధి’. రంజిత్ ఎస్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రంజిత్ ఎస్ మాట్లాడుతూ–‘‘మా సినిమా కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కథ, కథనాలను ప్రేక్షకులు ముందుగా ఊహించలేరు’’ అన్నారు. ‘‘మనం మాట్లాడటం కంటే.. మనం తీసే సినిమానే మాట్లాడాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్. ‘‘మా సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి’’ అన్నారు రోహిత్ నందా, ఆనంది. -
ద్రోహి
సందీప్ కుమార్, దీప్తీ వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘ద్రోహి’. ‘ద క్రిమినల్’ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెలో మీడియా, సఫైరస్ మీడియా, వెడ్నెస్ డే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, డి. శ్రీకాంత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని మల్టీప్లెక్స్‌లో రూ. 112లకే సినిమా టిక్కెట్ ఇస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా టీజర్‌ని నటుడు త్రిగుణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘సందీప్, విజయ్‌లకు కళ అంటే ప్రాణం. దర్శకుడి పని తీరు టీజర్లో కనిపించింది. ఈ చిత్రం విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘అద్భుతమైన డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. క్రైమ్, థ్రిల్లర్‌తో పాటు అన్ని అంశాలున్నాయి’’ అన్నారు సందీప్ కుమార్. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.. ఎవర్నీ నిరాశపరచదు’’ అన్నారు విజయ్ పెందుర్తి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటి డెబా డాలీ. ఈ చిత్రానికి కెమెరా: అశోక దార్బీరు, సంగీతం: అనంత నారాయణ్. -
వినోదం..యాక్షన్
త్రిగుణ్ హీరోగా సురేష్ కుమార్ ఆకిరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గంజామ్’. ప్రణమ్ దేవరాజ్, హ్రితికా శ్రీనివాస్, విస్మయ, దేవరాజ్, రఘు కుంచె, అనితా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఏవీఆర్ ఆర్ట్స్, ఏయు–ఐ బ్యానర్స్‌పై రత్నాజీ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసున్న 23వ సినిమా ‘గంజామ్’. ఎప్పుడూ నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు. ‘‘వినోదం, యాక్షన్‌తో పాటు సామాజిక స్పృహ కలిగిన సినిమా ‘గంజామ్’. నాకు అవకాశం ఇచ్చిన రత్నాజీగారికి ధన్యవాదాలు. త్రిగుణ్‌కి ఈ సినిమా మరో మంచి హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు సురేష్ కుమార్ ఆకిరి. ‘‘ఒక మంచి ప్రయత్నం మా ‘గంజామ్’. ఈ సినిమా అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటుంది’’ అన్నారు రత్నాజీ. ‘‘కథా బలం ఉన్న ‘గంజామ్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు, నటుడు రఘు కుంచె. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
సూపర్ హీరోను పరిచయం చేస్తూ 'ఏ మాస్టర్ పీస్' ప్రీ టీజర్ రిలీజ్
టాలీవుడ్లో శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, అషురెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 'సినిమా బండి' ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్‌తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది. 'ఏ మాస్టర్ పీస్' ప్రీ టీజర్ చూస్తే..సమాజంలో జరిగే నేరాలపై స్పందించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటాడు హీరో. అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. కోరుకున్నట్లే పెరిగి పెద్దయ్యాక సూపర్ హీరో అవుతాడు. చిన్నప్పుడు గొడవలు ఎందుకని చెప్పిన తల్లే...అతను సూపర్ హీరో అయ్యాక..వాడు ఎదురొస్తే డీల్ చేయగలిగే దమ్ము మీకుందా అంటూ ధైర్యంగా సవాల్ చేస్తుంది. బలమున్న వాడిని పట్టుకోవాలంటే పవర్ కావాలి. కానీ నీలా బలం ఫ్లస్ పవర్ ఉన్నవాడిని పట్టుకోవాలంటే ఎమోషన్ కావాలి..అంటూ ప్రీ టీజర్లో వచ్చిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ తుది దశలో ఉన్న 'ఏ మాస్టర్ పీస్' సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్, సూపర్ విలన్ మనీష్ గిలాడ్ ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. -
జాతి రత్నాలులా అనిపిస్తోంది
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలి శెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు అతిథిగా హాజరై, టీజర్‌ను విడుదల చేసిన దర్శక–నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ టీజర్ బాగుంది. మరో ‘జాతి రత్నాలు’ సినిమాలా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో శివన్నారాయణగారు, నేను తండ్రీకొడుకులుగా చేశాం. ఇద్దరం ఫుల్‌గా నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘మా సినిమాను 28 రోజుల్లో పూర్తి చేయగలిగామంటే అది యూనిట్ సపోర్ట్ వల్లే’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే మా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు రవి పోలిశెట్టి. ‘‘నేను చేయాల్సిన ఈ సినిమాను మా తమ్ముడు సంజయ్‌తో చేయించాను. ‘సౌండ్ పార్టీ’ను ఆదరిస్తే జంధ్యాల, ఈవీవీగార్ల తరహా చిత్రాలు సంజయ్ నుంచి చాలా వస్తాయి’’ అన్నారు జయశంకర్. -
కొత్తవాళ్లు సక్సెస్ అవ్వాలి
విజయ్ రాజ్‌కుమార్, నేహా పఠాని జంటగా భరత్ మిత్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. నవీన్ కురవ, కిరణ్ కురవ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో కొత్తవాళ్లు విజయం సాధిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దర్శకుడు భరత్‌కు మంచి విజన్ ఉంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘18–30 వయసు మధ్య ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు భరత్ మిత్ర. ‘‘ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా, సెకండాఫ్‌లో ఆడియన్స్ తల తిప్పుకోలేని సీన్స్ ఉంటాయి’’ అన్నారు విజయ్ రాజ్‌కుమార్. -
సినిమా టీజర్ విడుదల చేసిన మంత్రి
అముద శ్రీనివాస్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘టీజర్ అద్భుతంగా ఉంది. హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ చక్కని ప్రతిభ కనబరిచారు. టీజర్‌ని చూస్తుంటే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంతో ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్‌కి మంచి లాభాలు రావాలి. అలాగే హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్‌కి మంచి అవకాశాలు రావాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్‌పి రాజా, కెమెరా: ఎంఎస్ కిరణ్ కుమార్. -
ఆసక్తికరంగా ‘పరమపద సోపానం’ టీజర్
అర్జున్ అంబటి, జెన్నిఫర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పరమపద సోపోనం’. నాగ శివ దర్శకత్వంలో గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా అక్రమాలు ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సహ–నిర్మాత: గుడిమిట్ల ఈశ్వర్. -
సిద్ధార్థ రాయ్ మూవీ టీజర్ లాంచ్ ఫోటోలు
-
ది ట్రయల్ భార్యాభర్తల కథ
యుగ్ రామ్, వంశీ కోటు హీరోలుగా, స్పందన పల్లి హీరోయిన్గా రామ్ గన్నీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ట్రయల్’. ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై స్మృతి సాగి, శ్రీనివాస్ కె. నాయుడు నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ను ‘పుష్ప’ చిత్ర రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, ‘పలాస’ హీరో రక్షిత్ అట్లూరి విడుదల చేశారు. రామ్ గన్నీ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ కథతో రూపొందుతోన్న చిత్రం ‘ది ట్రయల్’. ఓ మహిళ, ఆమె భర్త చుట్టూ ఈ కథ జరుగుతుంది’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ చాలా కష్టపడి ఈ మూవీ చేశాం’’ అన్నారు యుగ్ రామ్. ‘‘ది ట్రయల్’ థ్రిల్లర్ సినిమా అయినా చాలా వినోదం ఉంటుంది’’ అన్నారు స్పందన పల్లి. ‘‘ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు సతీష్ వర్మ. ‘‘సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ఎస్ఐ జాబ్‌ని వదులుకుని మరీ వచ్చి ఈ సినిమాని డైరెక్షన్ చేశారు రామ్ గన్నిగారు’’ అన్నారు వంశీ కోటు. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహ నిర్మాతలు: సుదర్శన్ రెడ్డి, కంచరన జయలక్ష్మి. -
పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ‘హ్యాపీ ఎండింగ్ ’
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీఎండింగ్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. ఈ టైటిల్ వినగానే చాలా ఊహించుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుందని నిర్మాత అనిల్ పల్లాల అన్నారు. (చదవండి: ఊ అంటావా మావా.. లాంటి పాటలు నేను చేయను: కృతీ శెట్టి) హీరో యశ్ మాట్లాడుతూ.. ‘హ్యాపీ ఎండింగ్ అనేది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథ. సినిమా మీద ప్రేమతోనే ఈ హ్యాపీ ఎండింగ్ తీశాం’ అన్నారు. చాలామంచి ప్యాసినేట్ మూవీ టీమ్ తో పనిచేశాను అని హీరోయిన్ అపూర్వ రావు పేర్కొంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మిత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు కార్తీక్ రత్నం, హీరో తిరువీర్ తదితరులు పాల్గొన్నారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న 30 ఇయర్స్ పృథ్వీ కుమార్తె
క్రాంతి హీరోగా, శ్రీలు హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. గుంటక శ్రీనివాస్ రెడ్డి, కె.కృష్ణారెడ్డి, పద్మ రేఖ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను నటుడు, నిర్మాత నాగబాబు విడుదల చేశారు. ‘‘కొత్త రంగుల ప్రపంచం’ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు క్రాంతి. ‘‘మా నాన్న(పృధ్వీ) దర్శకత్వం వహించిన తొలి సినిమాతో నేను హీరోయిన్గా పరిచయమవడం సంతోషంగా ఉంది’’అన్నారు శ్రీలు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
ఊరు పేరు భైరవకోన టీజర్ లాంచ్.. సందీప్ కిషన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అమరం.. అఖిలం.. సీతారాముల ప్రియనామం
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. శనివారం ‘సీతా నవమి’ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రామ్ సియా రామ్’ ఆడియో టీజర్‌ను విడుదల చేశారు. ఈ గీతాన్ని సచేత్ పరంపర స్వరపరిచారు. కాగా ఈ పాటలోని కృతీ సనన్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘అమరం, అఖిలం, ఈ నామం.. సీతారాముల ప్రియ నామం’ అంటూ చిత్రదర్శకుడు ఓం రౌత్ ఈ పాటను ఉద్దేశించి ట్వీట్ చేశారు. భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, రాజేష్ నాయర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. -
పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే
‘పుష్ప’ మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. దీంతో ఈ మూవీ పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో పుష్ప 2 అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేపు బన్నీ బర్త్‌డే సందర్భంగా తాజాగా క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన వీడియో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఎనిమిది బుల్లెట్లు తగిలిన గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ టీజర్ మొదలైంది. పుష్ప చనిపోయాడంటూ ప్రచారం చేస్తున్నట్టుగా టీజర్ మొదలైంది. ఇక సడెన్‌గా అడవిలో పులి ముందు నుంచి పుష్ప రాజ్ అలా నడుస్తూ వెళుతున్న వీడియో ఉత్కంఠ పెంచుతోంది. ‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని దాని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ వచ్చే ఈ డైలాగ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయం. మొత్తానికి ఎంతోకాలంగా పుష్ప 2 అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ టీజర్‌తో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు సుకుమార్. కాగా ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
అల్లరి నరేశ్ 'ఉగ్రం' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
బెదుర్లంక-2012 టీజర్ లాంఛ్ (ఫొటోలు)
-
యంగ్ హీరో అడవి శేష్ చేతుల మీదుగా ‘ఎంతవారుగాని’ టీజర్
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘ఎంతవారు గాని’. ఈ మూవీతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను బయటకు వచ్చింది. యంగ్ అడవి శేష్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అనంతరం అడవి శేష్ మాట్లాడుతూ.. ఈ టీజర్ తనకు నచ్చిందని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా మంచి విజయం సాధించాలని సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు అభినందనలు తెలిపాడు. కాగా ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది మూవీ టీం. తమ సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం పేర్కొంది. -
హెబ్బా పటేల్ 'బ్లాక్ అండ్ వైట్' టీజర్ అవుట్
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్ అండ్ వైట్ (Black and white). ఎన్‌ఎల్‌వీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘నో కమిట్మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్‌తో టీజర్ షురూ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
టీజర్ బాగుంది
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘ఎర్రర్ 500’ టీజర్ బాగుంది. యూనిట్ ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జస్వంత్ పడాల, నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో సందీప్ మైత్రేయ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రర్ 500’. యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. జస్వంత్ మాట్లాడుతూ– ‘‘ఎర్రర్ 500’ అందరికీ కనెక్ట్ అయ్యే కథ. నన్ను హీరోగా పరిచయం చేసిన బాలరెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ‘బిగ్ బాస్’ ఫేం జస్వంత్‌ని హీరోగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సందీప్. ఈ చిత్రానికి కెమెరా: శశాంక్ శ్రీరామ్– ప్రశాంత్ మన్నె, సంగీతం: ఫణి కల్యాణ్. -
సందీప్ కిషన్ 'మైఖేల్' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'హసీనా' టీజర్‌ను విడుదల చేసిన అడివి శేష్
‘‘హీరోయిన్ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రంలో 84 మంది కొత్తవారు నటించడం విశేషం. టీజర్ చాలా బాగుంది.. సినిమా ఘనవిజయం సాధించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయి తేజ గంజి, తన్నీవర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హసీనా’. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఎస్. రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ని అడివి శేష్ విడుదల చేశారు. ‘ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు’ అనే డైలాగ్‌తో ఆరంభమై, ‘నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తాగి ఉండాలి.. లేక మేధావి అయినా అయ్యుండాలి’ డైలాగ్‌తో ముగుస్తుంది. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ కందా, సంగీతం: షారుక్ షేక్, నేపథ్య సంగీతం: నవనీత్ చారి, లైన్ ప్రొడ్యూసర్: సాయితేజ గంజి. -
ఆదిపురుష్: 3డీలో టీజర్ చూసి థ్రిల్ అయ్యాను : ప్రభాస్
‘‘ఫస్ట్ టైమ్ ‘ఆదిపురుష్’ టీజర్‌ను 3డీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడిని అయిపోయాను. 3డీ ఫార్మాట్లో నేను కనిపించడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది.. థ్రిల్ అయ్యాను’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం ఇతివృత్తం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. భషణ్ కువర్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘ఆదిపురుష్’ 3డీ టీజర్‌ను ప్రదర్శించారు. ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘ఇండియాలో ఇప్పటివరకు వాడని టెక్నాలజీతో ‘ఆదిపురుష్’ తీశాం. బిగ్ స్క్రీన్ కోసం తీశాం’’ అని అన్నారు. అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఆది పురుష్’ టీజర్ ఎలా ఉందని నన్ను కొంతమంది అడిగారు. బాగుందని చెప్పాను. కానీ నా సిబ్బందిలో కొందరు ‘ఆదిపురుష్’ టీజర్ అలా ఇలా అని అనుకుంటున్నారని చెప్పారు. నేను ఒకటే చెబుతాను.. ‘బాహుబలి పార్ట్ 1’ అప్పుడు ఆ సినిమాను ట్రోల్ చేశారు. కానీ అదే రోజు నేను ప్రభాస్‌కు ఫోన్‌చేసి ‘సూపర్ హిట్’ అన్నాను. ‘లేదు.. భయ్యా..’ అంటూ ఏదో మాట్లాడబోయాడు ప్రభాస్. లేదు.. సపర్‌హిట్ నువ్వు హ్యాపీగా ఉండు అన్నాను. బిగ్ స్క్రీన్ ఫిలింస్ టీజర్లను సెల్‌ఫోన్స్‌లో అంచనా వేయలేం. వీఎఫ్క్స్ సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. అప్పుుడే ఆ సినిమా ఏంటో అర్థం అవుతుంది. ‘ఆదిపురుష్’ కూడా అలాంటి సినిమాయే. టీజర్‌ని నేను ఫోన్లో చూసిన తర్వాత మళ్లీ పెద్ద స్క్రీన్ పై చూశాను. ఇప్పుడు 3డీలో చూశాను. టీజర్ చూసి విజిల్స్ వేశాను. అలాగే రావణ పాత్రధారి పక్షి మీద ఎందుకు వస్తాడు? రాముడు ఇలా ఉంటాడా? అని చర్చలు జరుగుతున్నాయి. రామాయణం ఇతివృత్తాన్ని ఈ తరం ఆడియన్స్‌కు చెప్పేలా చేశారు. ‘ఆది పురుష్’ మ్యాజికల్ ఫిల్మ్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఆదిపురుష్’ను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఓం రౌత్ -
అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్‌లో అదరగొట్టిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' టీజర్ వచ్చేసింది. అయోధ్యలో గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్లో టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. రామాయణం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్ ఫిలింగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనండగా.. కృతీ సనన్ సీతగా కనువిందు చేయనుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా అలరించనున్నాడు. టీజర్ చూస్తే రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. రెబల్ స్టార్ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. టీజర్ చూస్తే విజువల్ వండర్‌ను తలపిస్తోంది. 'భూమి కుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..' అంటూ సాగిన టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్లో ఊపేస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు. -
నిజ జీవిత సంఘటన ఆధారం ‘గీతా సాక్షిగా’.. ఆసక్తి పెంచుతున్న టీజర్
నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘గీతా సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో ఆదర్శ్, చిత్ర శుక్లా జంటగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. ఈ టీజర్లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా, రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలిసి హీరోను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో ఆదర్శ్ పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యున్ని కాదని, వాడి బాబు అర్జునున్ని రా అంటూ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్రలతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. -
‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఏం జరిగింది?. ఆ డబ్బంతా ఏమైంది?
నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్నాడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ టీజర్ తాజాగా విడుదలైంది. నిమిషం 30 సెకన్లు నిడివి గల టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. తిరుపతిలో ఫోటో షాపు పెట్టుకోవాలని తపించే హీరో.. అతనికి ఒక అందమైన ప్రేమ కథ, సరదగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఒక మనీ బ్యాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథపై ఆసక్తిని పెంచాయి. ఫణి కళ్యాణ్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. తిరుపతి నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘తిరుపతి’పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈ సినిమా నాకు చాలా స్పెషల్: శ్రద్ధా దాస్
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ తాజాగా నటించిన చిత్రం 'అర్థం'. 'మాయ' అనే సైకియాట్రిస్ట్ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో రూపొందించారు. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు వీఎఫ్ఎక్స్ ఇంపార్టెంట్. డీవోపీ పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకేక్కించారు.ఈ మూవీలో గ్లామర్ రోల్లో సైకియాట్రిస్ట్‌గా నటించాను. ఇందులోని నా పాత్ర చాలా కు స్పెషల్ గా ఉంటుంది.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో, మంచి టీంతో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని పేర్కొంది. ''మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ స్టేజ్ పై ఉండడానికి మా నాన్నే ఇన్స్పిరేషన్. 'అర్థం' అంటే ఏమిటి అనుకుంటున్నారు . కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూపించాం. నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అర్జున్ రెడ్డికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే శ్రద్దా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ అవుతుంది'' అని డైరెక్టర్ మణికాంత్ తెల్లగూటి తెలిపారు. -
'గంగోత్రి' బాలనటి హీరోయిన్గా 'మసూద'.. భయపెట్టేలా టీజర్
Masuda Teaser Launched By Natural Star Nani: ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకుంది స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్. ఈ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మసూద’. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకోగా.. మంగళవారం (ఆగస్టు 2) నేచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు. ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని అనిపిస్తుందని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (లలన్ సింగ్ పాత్రధారి) నటిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాలనటిగా అలరించిన కావ్య కల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నానికి మా టీమ్ తరఫున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము. సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం’’ అని తెలిపారు. -
విశాల్‌తో ఇప్పటి వరకు నటించే అవకాశం రాలేదు: ఉదయనిధి స్టాలిన్
విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లత్తీ’(తెలుగులో లాఠీ). రానా ప్రొడక్షన్స్ పతాకంపై నటులు నందా, రమణ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. నటి సునైనా నాయకిగా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆదివారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ స్టడియోలో మూవీ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: యాక్టింగ్‌కి బ్రేక్ ఇస్తున్నా.. అయితే..!: నిత్యా మీనన్ ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడు లాఠీతో దెబ్బలు తినలేదన్నారు. అయితే ఈ చిత్రం షటింగ్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మినహా దెబ్బలు తిననివారు లేరన్నారు. చిత్ర టీజర్లో ‘ఊర్లో ఉండే పోకిరీలు, పొరంబోకులు అందరూ నన్ను చంపడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. రండిరా’ అని తాను చెప్పిన డైలాగు బాగా నచ్చిందన్నారు. నడిగర్ సంఘం నూతన భవనంలో కరుణానిధి, స్టాలిన్ల పేర్లను పొందుపరచాలనే కోరికను ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ వద్ద విశాల్ వ్యక్తం చేశారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. లాఠీ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. విశాల్ కాల్ షీట్స్ కోసం తాము చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, నందా, రమణ చాలా సులువుగా కాల్ షీట్స్ పొంది చిత్రం చేశారన్నారు. తాను విశాల్ మంచి స్నేహితులమని, కలిసే పాఠశాల, కళాశాలకు వెళ్లావారమన్నారు. ఆ సమయంలో జరిగిన విషయాలను చెప్పకూడదన్నారు. విశాల్ కలిసి చిత్రం చేయాల్సిందని అయితే అది ఇప్పటి వరకు జరగలేదనన్నారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా, కమిషనర్‌గా అన్ని పాత్రలు పోషించి ప్రస్తుతం కానిస్టేబుల్ అయ్యారని చమత్కరించారు. విశాల్ నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, త్వరగా పెళ్లి చేసుకోవాలని అన్నారు. -
విశాల్ ‘లాఠీ’ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
అఖిల్ 'ఏజెంట్' టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
అఖిల్‌ను 'వైల్డ్ సాలే' అన్న హీరోయిన్..
Akhil Agent Teaser Released: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తరెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్ యాక్టర్స్ శివకార్తికేయన్, కిచ్చా సుదీప్ విడుదల చేశారు. ఈ టీజర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్‌కు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్ బాగుంది. అలాగే యాక్షన్ సీన్స్, 'వైల్డ్ సాలే' అని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్.. అఖిల్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉందని చెప్పవచ్చు. కాగా 'ఏజెంట్' చిత్రాన్ని హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. -
అంతా ఆమెను మర్చిపోడానికే అంటున్న విక్రమ్.. ఆసక్తిగా టీజర్
Ponniyin Selvan Part 1 Teaser Released: స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' తెలుగు టీజర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా, హిందీలో అమితాబ్ బచ్చన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేశారు. టీజర్లో పోరాట ఘట్టాలు, నటీనటుల నటన ఆకట్టుకుంది. 'ఈ కల్లు, పాట, రక్తం, యుద్ధం అంతా దాన్ని మర్చిపోడానికే. ఆమెను మర్చిపోడానికి, నన్ను నేను మర్చిపోడానికి' అంటూ విక్రమ్ చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. From one of my favourite directors... #ManiRatnam sir! Thrilled to launch the Telugu teaser of #PonniyinSelvan1. Really looking forward to the film!https://t.co/Vepx93uY1z — Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2022 -
‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ బాగా ఆడాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎమ్.వినయ్ బాబు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై బీఉ చందర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రంతో రణధీర్, నందిని రెడ్డి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని తెలంగాణ మంత్రి శీనివాస్ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాటలు, టీజర్ చూశాక ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది. అందరూ కొత్తవారు నటించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకోవడానికి తక్కువ రేట్లతో పర్మిషన్స్ ఇస్తున్నాం. తెలంగాణలో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి కల్చర్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి అన్నివిధాలసహకరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భాష, యాసలో వచ్చే చిత్రాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఈ కోవలో సీతారామపురంలో ఒక ప్రేమ జంట చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు`` అన్నారు. దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ.. డిఫరెంట్ వేలో ఆలోచించి తీసిన లవ్ స్టోరి ఇది. ప్రేమించడం కాదు...ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్కడా వల్గారిటీకి తావుండదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది’అన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ…‘దర్శకుడు వినయ్ బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాం. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి. కథా పరంగా చాలా పెద్ద సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా అవుట్ పుట్ బాగొచ్చింది. దర్శకుడు చెప్పినదానికన్నా సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. -
'ఒక పథకం ప్రకారం' టీజర్ రిలీజ్ చేసిన రవితేజ
Raviteja Launched Sairam Shankar Oka Pathakam Prakaram Teaser: సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. జాతీయ అవార్డుగ్రహీత వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌పై వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. సినిమాని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో రామ–రావణ తరహా పాత్రలో నటించారు సాయిరామ్ శంకర్’’ అన్నారు. కాగా ఇంతకుముందు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. శృతీ సోధి, సముద్రఖని, కళాభవన్ మణి, భాను శ్రీ నటించిన ఈ చిత్రానికి రాహుల్ రాజ్ సంగీతం అందించగా రాజీవ్ రవి, వినోదిల్లంపల్లి, సురేష్ రాజన్ కెమెరా వర్క్స్ చేశారు. చదవండి: 'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు.. -
ఆయన లేకపోతే నేను లేను: హీరో
Kuppili Srinivas Meelo Okadu Teaser Trailer Launch: కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మీలో ఒకడు’. హ్రితికా సింగ్, సాధనా పవన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్రలో నటించారు. చిన్ని కుప్పిలి సమర్పణలో రూపొందింది. సోమవారం శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌ను ఆధ్యాత్మిక గురు, ‘ఏపీ సాధు పరిషత్’ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసనంద స్వామి లాంచ్ చేశారు. నిర్మాత సాయి వెంకట్, వ్యాపారవేత్త ఎస్వీఆర్ నాయుడు ఈ సినిమా టీజర్‌ను, సుమన్, ఆధ్యాత్మిక గురు యద్దనపూడి దైవాదీనం, పిట్ల మనోహర్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా ఊరి సర్పంచ్ ఎస్వీఆర్ నాయుడుగారు లేకపోతే నేను లేను. మా సినిమాలో చాలా ట్విస్టులుంటాయి’’ అన్నారు. ‘‘44 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాను. ఇన్నేళ్లుగా నాకు సహకరిస్తున్న నా నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, ఆదరిస్తున్న నా అభిమానులకు పాదాభివందనాలు’’ అని నటుడు సుమన్ అన్నారు. చదవండి:👇 అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'జ్వాల'ను రగిల్చిన రానా.. టీజర్ రిలీజ్
‘‘పాత రోమ్ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్ తలపడతారు, ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు.. బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి...’’. ఇటువంటి పవర్ఫుల్ డైలాగ్‌లు ఉన్న ‘జ్వాల’’ చిత్ర టీజర్‌ను శుక్రవారం యంగ్ హీరో రానా దగ్గుబాటి సోషల్ మీడియా ట్విటర్ ద్వారా విడుదల చేశారు. బేస్ వాయిస్‌తో తెరమీద కనిపించే సన్నివేశాలను గురించి విశ్లేషిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మనిషి కథలా చెప్తూ ఉంటారు. ‘సాహో’ ఫేమ్ అరుణ్ విజయ్, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని టీజర్లో పోటాపోటీగా నటించారు. అక్షర హాసన్ కీలక పాత్రలో నటించారు. ‘జ్వాల’ పాన్ఇండియా చిత్రాన్ని అమ్మ క్రియేషన్స్ టి.శివ సమర్పిస్తుండగా శర్వాంత్‌రామ్ క్రియేషన్స్ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్ పతాకంపై యం.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అరుణ్‌విజయ్, విజయ్ ఆంటోనీ, అక్షరహాసన్‌ల కెరీర్లోనే తెరకెక్కిన భారీబడ్జెట్ చిత్రం ‘జ్వాల’. ఈ చిత్రాన్ని నవీన్ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్, రైమాసేన్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా– కె.ఎ.బచ్చ, ఎడిటర్– వెట్రికృష్ణన్, సంగీతం– నటరాజన్ శంకరన్ పీ.ఆర్.వో– శివమల్లాల. -
'ఓ మై లవ్' టీజర్‌ను విడుదల చేసిన రాఘవేంద్రరావు
అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ఓ మై లవ్. స్మైల్ శ్రీను దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని జి.సి.బి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. రామంజిని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఓ మై లవ్" సినిమా క్వాలిటీ చాలా బాగుంది. ఈ చిత్రం తెలుగులో కూడా రావడం సంతోషంగా ఉంది. టీజర్ చూస్తే శీను టేలెంట్ తో బ్యూటిఫుల్ యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ తీసుకుని చాలా అందంగా చిత్రీకరించారు'' అని పేర్కొన్నారు. కాగా దర్శకుడు స్మైల్ శ్రీను మాట్లాడుతూ టీజర్‌ను విడుదలను చేసిన రాఘవేంద్రరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
నాని చేతులమీదుగా తెలుగు ఇండీ చిత్రం 'ముత్తయ్య' టీజర్..
Muthayya Movie Teaser Will Release By Nani: సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలు, పెద్ద హీరోల చిత్రాల హవా బాగానే ఉంది. వీటి కలెక్షన్లు, రికార్డులు ఎప్పుడూ హాట్ టాపిక్. అయితే పలు చిన్న సినిమాలు సైతం ప్రజా ఆదరణ పొందుతాయి. అలాంటి క్యాటగిరికి చెందినదే ఇండీ తెలుగు చిత్రం ముత్తయ్య. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కొత్త పోరడు ఫేమ్ కె. సుధాకర్ రెడ్డి నటించారు. యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైన విషయం తెలిసిందే. మే 9న ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కాగా ఈ సినిమా గురించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను నాచురల్ స్టార్ నాని విడుదల చేయనున్నారు. శనివారం (ఏప్రిల్ 30) సాయంత్ర 4.30 నిమిషాలకు ఈ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై బ్యానర్‌పై కేదార్ సెలగమ్ శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి: ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో 'తెలుగు ఇండీ' సినిమా 'ముత్తయ్య'.. తాప్సీ 'శభాష్ మిథు' అనిపించుకునేది ఆరోజే.. The journey of #Muthayya just got bigger. We are thrilled that @nameisNani is going unveil the teaser on April 30 at 4:30 PM. Presented by #Vamsi #Kedar @HylifeE. Produced by @vrindaprasad @FictionaryEnt. Directed by #BhaskharMaurya. 🎥 #DivakarMani. #DreamBig #MuthayyaTeaser pic.twitter.com/g2ziqFCB0e — Fictionary Entertainment (@FictionaryEnt) April 29, 2022 -
అంటే సుందరానికి టీజర్ లాంచ్ ఈవెంట్
-
'అంటే సుందరానికీ' టీజర్ విడుదల (ఫోటోలు)
-
సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ?
Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser: ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో సంతోశ్ శోభన్. పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్‌లో అలరించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్‌కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గౌరి జి. కిషన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరోయిన్ సమంత బుధవారం (ఏప్రిల్ 6) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. 'ఈరోజు మనం చెప్పుకోబోయే చిత్రం..' అంటూ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంత ఆసక్తిగా సాగింది. రేడియోలో స్టోరీ చెబుతున్నట్లుగా పాత్రలను పరిచయం చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సంతోష్ శోభన్, గౌరి నటన బాగుంది. 'నా ఇల్లు పట్టుకుని నీ ఇల్లు అంటావేంటీ' అని హీరో చెప్పే డైలాగ్ నవ్వు తెప్పించేలా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపిస్తోంది. కమ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది
Anasuya Darja Movie Teaser Launch By Producer Suresh Babu: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ యాంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకున్న అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'దర్జా'. సునీల్, అనసూయ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. చదవండి: యాంకర్ అనసూయకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి! ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేశారు. ‘‘దర్జా’ టీజర్ బాగుంది. ఆడియన్స్‌ను ఈ సినిమా ఎంటర్టైన్ చేసేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ‘ఈ బండి కనకమహాలక్ష్మిది. సరకు మీద చేయి పడితే చావు చూపిస్తది’, ‘ఎవరైనా ఈ కనకాన్ని టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ లాంచ్ వేడుకలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ అక్వా అసోసియేషన్ చైర్మన్ భూమాల శ్రీరామ్ మూర్తితో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. ఈ సినిమాను కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. చదవండి: అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్! -
'ఓకే ఒక జీవితం' టీజర్ లాంచ్ ఫోటోలు
-
నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇది
శర్వానంద్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా అమల ప్రధాన పాత్రలో శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం టీజర్ బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కథ చెప్పగానే అమలగారు చేస్తున్నారా? అని అడిగాను. ఎందుకంటే ఈ సినిమాకు ఆత్మ అమలగారి పాత్ర. ఈ సినిమాలోని అమ్మ పాటను ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు 9 నెలలు రాశారు. ఆయన మన మధ్య లేరు కానీ పాటల రూపంలో జీవించే ఉంటారు. ‘ఒకే ఒక జీవితం’ నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా’’ అన్నారు శర్వానంద్. ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు ఇందులోని అమ్మ పాత్రను నేనే చేయాలనుకున్నాను’’ అన్నారు అమల. ‘‘ముందు ఓ కథ అనుకున్నాను. కానీ అందులో ఎమోషన్ కనిపించలేదు. దురదృష్టవశాత్తు అదే సమయంలో మా అమ్మగారు చనిపోయారు. అమ్మను మళ్లీ చూడాలనిపించి రాసుకున్న ఒక సీన్ తర్వాత ‘ఒకే ఒక జీవితం’గా మారింది. శర్వా పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. శర్వా కచ్చితంగా ఏడిపిస్తాడు’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘ఈ సినిమాను ఓ కుటుంబంలా పూర్తి చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యాంకర్ సుమ జయమ్మ పంచాయితి టీజర్ లాంచ్ ఫోటోలు
-
అతడు ఆమె ప్రియుడు..టీజర్ చాలా బాగుంది
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్‌కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి. -
ఆకట్టుకుంటున్న ‘మైల్స్ అఫ్ లవ్’ టీజర్
హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాలుగు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని యంగ్ మరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మైల్స్ అఫ్ లవ్ టీజర్ చూశాను. చాలా ఫ్రెష్ గా ఉంది. హీరో అభినవ్ చాలా అందంగా కనిపించాడు.ఈ సినిమా కి అందరు కొత్తవాళ్లే పని చేశారు. ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. మెలోడీ మ్యూజిక్ తో ఈ టీజర్ మొదలవుతుంది. ఇది ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఎంతో ఫీల్ తో హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ ఉండబోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టీజర్ చివర్లో వచ్చే ఓ షాట్ ద్వారా చూపించారు. 'ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా కాకుండా సొల్యూషన్ లా చూస్తే సొల్యూషన్ ప్రాబ్లమ్ అవుతుంది.. ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది..' అనే డైలాగ్ చాలా బాగుంది. -
రోహిత్ ‘కళాకార్’ టీజర్ విడుదల చేసిన ప్రభాస్
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి హిట్లు కొట్టిన నటుడు రోహిత్. అనంతరం క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారి శంకర్‌దాదా MBBS, నవ వసంతం వంటి సినిమాల్లో నటించాడు. ఆయన చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేస్తున్న చిత్రం ‘కళాకార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదివారం (సెప్టెంబర్ 19న) విడుదల చేశాడు. ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఇటీవల నటుడు శ్రీకాంత్ విడుదల చేశాడు. ప్రభాస్ టీజర్ చూసి మెచ్చుకున్నారని, దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మూవీ టీం తెలిపింది. కాగా, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. -
ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా!
‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘క్లాప్’ టీజర్ చూస్తుంటే అథ్లెట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు హీరో చిరంజీవి. ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘క్లాప్’. ఐబీ కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, రాజశేఖర్ రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ‘క్లాప్’ సినిమా టీజర్‌ను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఆది పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుందనిపిస్తోంది. తన పాత్రలో ఉన్న ట్విస్ట్ తెలిసి ‘వావ్’ అనుకున్నాను. ఇళయరాజాగారు సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. -
ఒకింత భయపెడుతున్న ‘క్లాప్’ టీజర్, హీరోకి ఏమైంది..
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తనకి అత్యంత సన్నిహితుడు అయిన రవి రాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి తన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకడని. ఈ ‘క్లాప్’ టీజర్‌ను విడుదల చేయడం తనకి చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందంటూ చిత్రబృందానికి చిరు అభినందనలు తెలిపారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో రన్నింగ్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. నేషనల్ లెవెల్ రన్నింగ్ కాంపిటిషన్లో పాల్గొని విజేతగా నిలవాలని పరితపించే ఓ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. Mega🌟 @KChiruTweets garu launched thrilling teaser of @AadhiOfficial's #CLAP #ClapTeaserhttps://t.co/oFwulfYalg#ilaiyaraaja @aakanksha_s30 @actorbrahmaji @prakashraaj @KurupKrisha @prithivifilmist @BigPrintOffl @SRCOffl @SSSMOffl @pravethedop @LahariMusic @UrsVamsiShekar pic.twitter.com/2hARXSkGUV — BA Raju's Team (@baraju_SuperHit) September 6, 2021 అయితే అతనికి ఆవేశం కూడా ఎక్కువే. అందుకే గొడవలు పడుతున్నట్టు ఈ టీజర్లో చూపించారు.అలాగే ఆకాంక్ష సింగ్‌తో లవ్ ట్రాక్‌ను ఆసక్తిగా చూపించారు. టీజర్ చివర్లో ఆది .. ఒక కాలుతో మాత్రమే కనిపిస్తుండడం అందరినీ ఆలోచనలో పడేసిందని చెప్పాలి. హీరో ఏ కారణంతో తన కాలుని కోల్పోయాడు అనే విషయాన్ని సస్పెన్స్ నిస్తూ మేకర్స్ టీజర్‌ను వదిలారు. తెలుగు, తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
బ్యాచిలర్‌గా ఇదే నా చివరి చిత్రం : హీరో కార్తికేయ
‘‘ఇటీవల నిశ్చితార్థం (హైదరాబాద్‌కు చెందిన లోహితారెడ్డిని కార్తికేయ వివాహం చేసుకోనున్నారు) చేసుకున్నాను. బ్యాచిలర్‌గా నా చివరి చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి, జీవితంలో మరోస్థాయికి వెళితే బాగుంటుందని ఆశపడుతున్నాను. ‘రాజా విక్రమార్క’ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు కార్తికేయ. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరో హీరోయిన్లు. శ్రీ చిత్రమూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సినిమా టైటిల్‌ను పెట్టుకునే అదృష్టం ఈ చిత్రం ద్వారా కలిగింది. ఈ సినిమాను మేమే నిర్మించాలనుకున్నాం. ఫైనల్‌గా రామారెడ్డి, ఆదిరెడ్డిగారు నిర్మించారు’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో ‘రాజా విక్రమార్క’ ఉండాలి’’ అన్నారు సాయికుమార్. ‘‘ఈ సినిమాకు మూలస్తంభం కార్తికేయ’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. చదవండి : ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఓ పండుగ : మంచు విష్ణు నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ -
ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తానంటున్న సాయి కుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’.శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చెర్రీ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. దారం ప్రభుదాస్ సమర్పకులు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సాయికుమార్ని చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. అమ్మాయిలపై యాసిడ్ దాడులు, పసిపిల్లల పై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా వైల్డ్ గా ఉంది. ‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే’లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. మహిళల రక్షణ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ ‘వన్‌బై టు’అని టీజర్ తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ చేసి థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
సన్నీలియోన్ మెచ్చిన టీజర్ ఇది..
గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకత్వంలో మిత్రా శర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని నటి సన్నీ లియోన్ విడుదల చేసి, టీజర్ బాగుందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్, నిర్మాత మిత్రా శర్మ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్‌కి, రాజా హే రాజా.. అనే కాలేజ్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. సన్నీ లియోన్ విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పడవల బాలచంద్ర. -
‘బ్యాట్ లవర్స్’..
మణి సాయితేజ, హాసినీ రాయ్ జంటగా ఎ.రాబిన్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాట్ లవర్స్’. దీక్షిక సమర్పణలో కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. ‘‘క్రికెట్ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు’’ అన్నారు ఉపేందర్. ‘‘గ్రామీణ నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు ఎ.రాబిన్ నాయుడు. మణి సాయితేజ, హాసినీ రాయ్, మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్, సినిమాటోగ్రాఫర్ సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
దూసుకెళ్తున్న ‘హీరో’..అప్పుడే 4M వ్యూస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అమరరాజ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ఖారారు చేసింది చిత్రబృందం. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సూపర్ స్టార్ మహేశ్ విడుదల చేసిన ‘హీరో’ టీజర్‌కు మంచి ఆదరణ లబిస్తుంది. ఇప్పటికే టీజర్‌కు 4మిలియన్ల వ్యూస్ వచ్చాయి. Remarkable #𝐇𝐄𝐑𝐎TitleTeaser hits 4️⃣ Million Views! ▶️ https://t.co/OIenFMIfqL#Hero@AshokGalla_ @SriramAdittya #PadmavathiGalla @AgerwalNidhhi @IamJagguBhai @JayGalla @ravipatic @GhibranOfficial @amararajaent @WhackedOutMedia pic.twitter.com/54it7718FW — BARaju's Team (@baraju_SuperHit) June 24, 2021 టీజర్లో అశోక్ కౌబాయ్ గెటప్‌లో కనిపించారు. గుర్రంపై ఆ ట్రైన్‌ను ఫాలో అవుతూ ఇచ్చిన అశోక్ ఎంట్రీ టీజర్‌కు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అంతేగాక హీరో జోకర్ గేటప్‌లో సైకోగా కనిపించగా మరోచోట రోమియోగా దర్శనం ఇచ్చాడు. టీజర్ మొత్తంలో అశోక్ మూడు పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. చదవండి : ఆకట్టుకుంటున్న మహేశ్ మేనల్లుడి ‘హీరో’ టీజర్ -
డైలాగ్ కింగ్‌కి మెగా వాయిస్
మంచు మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం హీరో సూర్య సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌కు ప్రముఖ నటులు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ‘‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’’ అని మోహన్‌బాబు పాత్రను పరిచయం చేశారు చిరంజీవి. ఇంకా మోహన్‌బాబు చెప్పిన ‘నేను చీకట్లో ఉండే వెలుతుర్ని, వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ డైలాగ్స్‌తో టీజర్ సాగుతుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘టీజర్‌కు చిరంజీవి అంకుల్ వాయిస్ ఓవర్ అయితే బాగుంటుందని విష్ణు అన్నాడు. చిరంజీవికి ఫోన్ చేసి అడిగితే, ‘వాయిస్ ఓవర్ మ్యాటర్ పంపు’ అన్నాడు. ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ నేను అడిగిన మూడు రోజులకే నాకు చెప్పకుండా తనే థియేటర్ బుక్ చేసి డబ్బింగ్ చెప్పి, పంపాలనుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసి విష్ణుబాబును పంపాను. ‘నిన్ను (విష్ణును ఉద్దేశిస్తూ) ఎవరు రమ్మన్నారు. డబ్బింగ్ పూర్తి చేసి మీ నాన్నకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను’ అని విష్ణుతో చిరంజీవి అన్నాడు. నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించినందుకు చిరంజీవికి ధన్యవాదాలు. అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్యకు ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో వస్తాం’’ అని అన్నారు. -
‘సర్కారు వారి పాట’ టీజర్ వాయిదా, కారణం అదేనట!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చింది మూవీ టీం. ఆ తర్వాత హైదరబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాలనుకున్న మూవీకి కరోనా షాక్ ఇచ్చింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా మే 31న మహేశ్ తండ్రి కృష్ణ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా కారణంగా టీజర్‌ను విడుదల చేయడం సరికాదని మేకర్స్ భావిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వినిపంచాయి. తాజా బజ్ ప్రకారం.. టీజర్ కట్ చేసేందుకు సరిపడ ఫుటేజ్ లేదని, అందుకోసమే మూవీ టీం టీజర్ విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో 15 రోజుల పాటు జరుపుకున్న ఈ షూటింగ్ షెడ్యూల్లో కేవలం ఒక యాక్షన్ స్వీకెన్స్, రెండు సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరిగిందట. అందుకే టీజర్ కట్ చేసేందుకు సరిపడ సన్నివేశాలు లేకపోవడం వల్లే మూవీ టీం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ బర్త్‌డేకు ప్రత్యేకం కోసం టీజర్ కాకుండా కేవలం ఓ ఫొటోతో పోస్టర్ అయిన విడుదల చేయాలని, లేదంటే ఆ ఒక్క ఫైట్ షాట్‌ను తీసుకుని ఓ చిన్న వీడియో విడుదల చేయాలనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది 2022కు విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో అనుకున్న తేదీకి ఈ మూవీ విడుదల అవుతుందో లేదో చూడాలి. మహేశ్ ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28 సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అనంతరం రాజమౌళి, అనిల్ రావిపూడిలతో మహేశ్ తదుపరి సినిమాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు?
రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా విరాటపర్వం. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. వాస్తవ కథకు దగ్గరగా, ఎంతో రియలిస్టిక్‌గా టీజర్ ఉందంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. 1990ల నాటి విప్లవ కథ ఆథారంగా సినిమా తెరకెక్కుతుంది. టీజర్ ఎంతో ఆకట్టుకునేలా రూపొందించారు.'ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్ని నాళ్లు?తారతమ్య గోడలనే పికిలించగ ఎన్నినాళ్లు?దున్నేటోడి వెన్ను విడిచి భూస్వాములు ధనికులైరి' అనే రానా కవిత్వంతో టీజర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో రానా.. డాక్టర్ రవి శంకర్ నుంచి రవన్న అలియాస్ అరణ్యగా ఎందుకు మారాడనేదే స్టోరీ. అరణ్యను ఇష్టపడే వెన్నెల పాత్రల సాయి పల్లవి నటించింది. అతని కవిత్వానికి ప్రేరణ చెంది నక్సలైట్‌గా మారే అమాయక యువతి పాత్రలో సాయి పల్లవి నటించింది. ఇక ఈ చిత్రంలో భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. అలాగే నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తునన్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. Happy to launch #VirataParvamTeaser. It looks raw and realistic. Great storytelling by @venuudugulafilm. My best wishes to @RanaDaggubati and @Sai_Pallavi92. Good luck to the entire team @SLVCinemasOffl @SureshProdns. https://t.co/hkcQInKwQz — Chiranjeevi Konidela (@KChiruTweets) March 18, 2021 చదవండి : (వుమెన్స్ డే: రానా స్పెషల్ వీడియో) (అలా హిట్టు పడగానే ఇలా రేటు పెంచిన 'జాతిరత్నం'!) -
చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ ఫేమ్ శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు బెస్ట్ విషెస్ అందజేశారు. మరి కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన హీరో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం.. 'పెళ్లి తర్వాత జరగాల్సినవి పెళ్లికి ముందే జరిగిపోతే నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టముంటది' అని హీరో ఫ్రెండ్ వాదించడం లాంటి అంశాలతో టీజర్ మొదలవుతుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి హీరో తన లవ్ స్టోరీ గురించి వినిపిస్తూ..నువ్వు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ మర్యాదరామన్న' అంటూ చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన టీజర్..సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. చిత్ర షుక్ల, మిషా నారంగ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కొర్రపాటి సమర్పణలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సినిమా టైటిల్‌తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు ‘తెల్లవారితే గురువారం’ ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చదవండి : (అల్లు అర్జున్‌కు నో చెప్పడమా?: ప్రియా వారియర్) (అదీ ప్రభాస్ రేంజ్: వంద కోట్ల రెమ్యునరేషన్!) Here is super fun teaser of #ThellavaritheGuruvaram 💯https://t.co/WLo3DjgagU Looking forward for the release. Good luck to the entire team! 👍🏽@Simhakoduri23 @gellimanikanth @kaalabhairava7 @SaiKorrapati_ @Benny_Muppaneni @VaaraahiCC @Loukyaoffl @Chitrashukla73 @NarangMisha pic.twitter.com/jcxWmw8FA1 — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 26, 2021 -
ఇచ్చట టీజర్ వచ్చింది
సుశాంత్, మీనాక్షి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఎస్. దర్శన్ దర్శకత్వంలో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ఈ టీజర్లో నో పార్కింగ్ అని బోర్డ్ ఉన్నచోట తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను సుశాంత్ పార్క్ చేస్తే, కాలనీవాసులు దాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత కథ ఏంటనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
విభిన్న రాఘవన్
విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ఆయన నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్’. ఆత్మిక కథానాయిక. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. యాక్షన్ నిండిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ‘‘గతంలో విజయ్ ఆంటోనీ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: ఎన్.ఎస్. ఉదయ్ కుమార్, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలితా ధనుంజయన్, బి. ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్. విక్రమ్ కుమార్. -
జీఎస్టీ టీజర్ బాగుంది
‘‘నా శిష్యుడు జానకిరామ్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘జీఎస్టీ’(దేవుడు సైతాన్ టెక్నాలజీ). ఈ సినిమా టీజర్ చాలా బాగుంది.. సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను’’ అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆనంద్ కృష్ణ, అశోక్, స్వాతి మండల్, యాంకర్ ఇందు, పూజ సుహాసిని ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘జీఎస్టీ’(దేవుడు సైతాన్ టెక్నాలజీ). కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని పోసాని కృష్ణమురళి విడుదల చేశారు. జానకిరామ్ మాట్లాడుతూ–‘‘సమాజంలో ఎంతో మందికి దేవుడు, దెయ్యం, సైన్స్ పైన ఎన్నో ప్రశ్నలున్నాయి. ఇలాంటి ప్రశ్నలే ఇటీవల కరోనా టైంలో కూడా వచ్చాయి. లాక్ డౌన్లో భాగంగా అన్ని మాతాల ప్రార్థనాలయాలు మూత పడ్డాయి. ఈ సమయంలో కరోనా అనే సైతాన్ గెలిచిందా? దేవుళ్లు ఓడిపోయారా? ఆ ప్రశ్నల్ని కథగా మలిచి సినిమా తెరకెక్కించా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: యు.వి.నిరంజన్. -
ప్రతి అమ్మాయి జీవితకథ
నలుగురు ఆడవాళ్ల జీవితంలోకి మగవాళ్లు ఎంటర్ అయిన తర్వాత వాళ్ల జీవితం ఏ విధంగా మారిపోయింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కమిట్మెంట్’. తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో బల్దేవ్ సింగ్, నీలిమా .టి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఆడపిల్లలు కనపడితే కమిట్మెంటులు, కాంప్రమైజ్‌లు తప్ప ఇంకేమీ ఆలోచించరా’’ అంటూ తేజస్వి చెప్పే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ– ‘‘ప్రతి యాక్టర్ కెరీర్లో ఓ క్లిష్ట దశ ఉంటుంది. నేను కూడా అలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ అవకాశం నా దగ్గరకు వచ్చింది. మళ్లీ నాకు సినిమాలపై ఇంట్రస్ట్ రావటానికి కారణం డైరెక్టర్ లక్ష్మీకాంత్గారే. ఇది కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాదు, ప్రతి అమ్మాయి జీవితకథ’’ అన్నారు. అన్వేషి జైన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో తెలుగు నటీనటులతో కలిసి పనిచేయటం మంచి ఎక్స్పీరియన్స్. అన్ని అంశాలు కలగలిపి ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీకాంత్ మాట్లాడుతూ– ‘‘అన్ని ఇండస్ట్రీల్లో అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిన్ షో చేసి అమ్ముకోవాలని ఈ సినిమా చేయలేదు. కథను బలంగా నమ్మి తీసిన చిత్రమిది’’ అన్నారు. ‘‘అనిల్‌గారితో కలిసి ఈ సినిమా నిర్మించాను. దర్శకుడు చక్కగా తెరకెక్కించటంతో పాటు ప్రతి ఒక్కరూ బాగా నటించారు’’ అన్నారు నిర్మాత బల్దేవ్ సింగ్. ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్. -
కళాపోషకులు
విశ్వ కార్తికేయ, దీపా ఉమావతి జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాపోషకులు’. ఎమ్. సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదల చేశారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ చిత్రంలో బాల నటుడిగా నటించిన విశ్వ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమా అయినా బాగా నటించాడు. ప్రేమ కథతో పాటు కుటుంబ ఆంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘మేమందరం ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన ‘కళాపోషకులు’ చిత్రానికి ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు విశ్వ కార్తికేయ. -
ఆట ఇప్పుడే మొదలైంది
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇందులో విష్ణుకి సోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను అల్లు అర్జున్ శనివారం విడుదల చేశారు. ఇండియాలో మొదలై అమెరికాను వణికించిన భారీ ఐటీ స్కామ్‌కి పాల్పడిన వారిని వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిçస్తున్నట్లు టీజర్ మొదలవుతుంది. ‘మిమ్మల్ని కనిపెడతాం, నాశనం చేస్తాం. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను. ప్రిపేర్ అయ్యాను’ అని ట్రంప్ అంటారు. ఈ స్కామ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్స్ మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నోట్ల కట్టలు కుక్కిన బ్యాగుల మధ్య నిలబడి టీజర్లో కనిపిస్తారు. ‘ఇది సరిపోతుంది కదా’ అని కాజల్ అంటే, ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అంటారు విష్ణు. ‘మోసగాళ్లు’ టీజర్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్ ఆర్. -
అజయ్ గురించి ఏమైనా తెలిసిందా?
... అంటూ కొడుకు గురించి కీర్తీ సురేష్ అడగ్గానే... ‘ఈ అడవి విస్తీర్ణం వెయ్యి చదరపు కిలోమీటర్లు.. ఈ అడవిలో వాణ్ణి ఎక్కడని వెతుకుతాం.. అజయ్ చనిపోయి ఉంటాడు’ అంటాడు పోలీసాధికారి. ‘వాడికి ఏమీ అయ్యుండదు’ అంటుంది కీర్తీ సురేశ్. ‘పెంగ్విన్’ చిత్రం టీజర్‌లోని డైలాగులు ఇవి. కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెంగ్విన్’. కార్తీక్ ఈశ్వర్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై దర్శక–నిర్మాత కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయా భాషల ట్రైలర్స్‌ని గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తమిళ ట్రైలర్‌ని హీరో ధనుష్, మలయాళ ట్రైలర్‌ని హీరో మోహన్‌లాల్, తెలుగు ట్రైలర్‌ని హీరో నాని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. -
దక్షయజ్ఞం టీజర్ బాగుంది
‘‘దక్షయజ్ఞం’ టైటిల్ చాలా బాగుంది. చారిగారు మంచి అభిరుచి, అనుభవం గల నిర్మాత. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే కథలను ఎన్నుకోవడం ఆయన ప్రత్యేకత. దర్శకుడు తోట కృష్ణ నిర్మాతల పక్షపాతి. ‘దక్షయజ్ఞం’ టీజర్ చాలా బాగుంది’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. సూర్య, మధులగ్న దాస్, శివప్రసాద్, సంజన, మేఘనా చౌదరి, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దక్షయజ్ఞం‘ (ది టార్గెట్). మహతి సాయి జస్వంత్ సమర్పణలో కస్తూరి ఫిలిమ్స్, విజయలక్ష్మీ మూవీస్ పతాకాలపై మెట్రో స్టూడియోస్ అధినేత ఈవీఎన్ చారి సారధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని ఎన్. శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తోట కృష్ణ– చారిగారి కాంబినేషన్లో మరెన్నో మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్, కెమెరా: ఆనంద్, నిర్మాతలు: చిన్న శ్రీశైలం యాదవ్, పున్న శ్యామ్‌రావు, బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్. -
ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి
ఏడాది నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ బయటకు రానీయకుండా ఆడియన్స్‌ని ఊరిస్తున్నారాయన. శుక్రవారం ఓ ఊర మాస్ టీజర్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులకు ఊరట కలిగించారు. శుక్రవారం రామ్‌చరణ్ బర్త్‌డే. ఎన్టీఆర్ వాయిస్‌తో చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఆడు కనవడితే నిప్పు కణం నిలవడినట్టుంటది. కలవడితే ఏగుసుక్క ఎగవడినట్టుంటది. ఎదురువడితే చావుకైనా చమట ధార కడతది. బాణమైనా బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’’ అంటూ టీజర్లో రామ్‌చర ణ్ కసరత్తులు చేస్తుంటే ఎన్టీఆర్ పవర్ఫుల్ సంభాషణలు పలికారు. తమిళ, హిందీ, కన్నడ భాషల్లోని టీజర్స్‌కి ఎన్టీఆరే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘అందరూ ఇంట్లో ఉండటమే తనకి ఇచ్చే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్’’ అని చరణ్ ట్వీట్ చేశారు. అలాగే ఉపాసన తయారు చేసిన కేక్‌ని కట్ చేసి ఇంట్లోనే బర్త్‌డేని జరుపుకున్నారు చరణ్. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఉపాసన. -
మే 8న రవితేజ క్రాక్
‘ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ అంటూ మొదలవుతుంది ‘క్రాక్’ టీజర్. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి.మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ‘ఒరేయ్ అప్పిగా, సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంటి రా...’ ఇలా టీజర్లో వినిపించిన డైలాగ్స్‌ని బట్టి ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘టీజర్లో చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా ఉంది. టీజర్లోలాగే సినిమాలోనూ తమన్ మ్యూజిక్ అదిరిపోతుంది. విష్ణు మంచి విజువల్స్ ఇచ్చాడు. విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి. మధు, చిత్ర సహనిర్మాత అమ్మిరాజు, ప్రొడ్యూసర్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతిని కాపాడుకోవాలి
‘‘ప్రభు తెరకెక్కించిన ‘మైనా, కుంకి’ సినిమాలు బాగా నచ్చాయి. తను ‘అరణ్య’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఆయన ఇమేజినేష¯Œ , క్రియేటివిటీ నచ్చాయి. ప్రకృతిని కాపాడుకోవాలనే తన తత్వం అభినందనీయం’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. రానా టైటిల్ రోల్లో నటì ంచిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కించింది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్’ పేర్లతో రూపొందింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అరణ్య’ టీజర్‌ను విడుదల చేశారు. డి.సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటి సమాజానికి ఎంతో అవసరమైన చిత్రమిది. ప్రకృతిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా రూపొందడానికి ముఖ్యకారణమైన వారిలో సురేష్‌బాబుగారు, ఆ తర్వాత రానాగారు. ఈ సినిమా కోసం రానా తనని తాను అరణ్యగా మార్చుకున్నారు’’ అన్నారు ప్రభు సాల్మన్. ‘‘రానా, ప్రభుసాల్మ¯Œ , విష్ణు విశాల్.. ఇలా ఎంటైర్ టీమ్ ప్యాషన్‌తో, టాలెంట్‌తో తెరకెక్కించిన సినిమా అరణ్య’’ అన్నారు ఈరోస్ ఇంటర్నేషనల్ సీఎంఓ మానవ్ సేతీ. ‘‘తెలుగులో నేను నటించిన తొలి చిత్రమిది’’ అన్నారు విష్ణు విశాల్. రానా మాట్లాడుతూ– ‘‘రెండున్నరేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాం. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. ‘అరణ్య’ సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. కథ విని పాత్రను అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభుగారికి రుణపడి ఉంటాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది’’ అన్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ నందు అహుజా మాట్లాడారు. -
22 సినిమా హిట్ కావాలి
రూపేష్ కుమార్, సలోని మిశ్రా జంటగా బి. శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘22’. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున మాట్లాడుతూ–‘‘బి.ఎ రాజు, జయగార్ల అబ్బాయి శివ దర్శకుడు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘22’ సినిమా టీజర్ చూశాను. ఆసక్తికరంగా ఉంది.పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగార్జున విడుదల చేసిన టీజర్ వీడియో, ‘22’ క్యాలెండర్‌ను విడుదల చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ–‘‘కొత్తవారిని ప్రోత్సహించడంలో నాగార్జునగారు ముందుంటారు. కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ఓ ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ ఓ క్రైమ్ థ్రిల్లర్‌ను డైరెక్ట్ చేశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్ తెలుస్తోంది. హీరోగా రూపేష్ చాలా కష్టపడ్డాడనిపిస్తోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనుకుంటున్నాను’’ అన్నారు మారుతి. ‘‘టీజర్‌ను చూసినవారు శివ పెద్ద దర్శకుడు అవుతాడని అంటున్నారు. అది తప్పక జరగాలని కోరుకుంటున్నాను. శివకు జయ ఆశీస్సులు ఉంటాయి’’ అన్నారు బి.ఎ రాజు. ‘‘నాగార్జునగారు టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యారు’’ అన్నారు శివ. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సలోని మిశ్రా, నిర్మాత కొండా కృష్ణంరాజు, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిథులు మాధవ్, నిరంజన్‌రెడ్డి, కో డైరెక్టర్ పుల్లారెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు, సినిమాటోగ్రాఫర్ రవికిరణ్, నటుడు కృష్ణచైతన్య, ఎడిటర్ శ్యామ్ పాల్గొన్నారు. -
సెన్సార్ ఆలస్యం చేస్తున్నారు
రాజ్ సూరియన్ హీరోగా ఆకర్షిక, నస్రీన్ హీరోయిన్లుగా అశ్విన్ కృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘నా పేరు రాజా’. రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. రాజ్ సూరియన్ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ‘తిరుగుబోతు, జటాయువు’ సినిమాలు చేశాను. ఇప్పుడు చేసిన ‘నా పేరు రాజా’ కన్నడలో సెన్సార్ పూర్తయింది.. కానీ, తెలుగులో మాత్రం సెన్సార్ ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారు. వరుస ప్రకారం కాకుండా వెనక వచ్చిన పెద్ద సినిమాలకు సెన్సార్ ఇస్తున్నారు. అనుకున్న ప్రకారం సెన్సార్ పూర్తయితే ఈ నెల 31న సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా మూడో సినిమా. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోస్‌కి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ప్రభాకర్ రెడ్డి. ‘‘డైరెక్టర్‌గా ఇది నా తొలి సినిమా. ఉపేంద్ర , మురళీమోహన్గార్ల వద్ద దర్శకత్వ శాఖలో 20 ఏళ్లుగా పని చేస్తున్నా. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అన్ని రకాల వాణిజ్య అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాం’’ అన్నారు అశ్విన్ కృష్ణ. కెమెరామేన్ వెంకట్, నస్రీన్, ఆకర్షిక మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్ జాషువా. -
ప్రేమికుడు వచ్చేశాడు
‘‘ప్రేమంటే సర్దుకుపోవడం గౌతమ్. ప్రేమంటే త్యాగం. ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. ఇవేవీ నీలో కనపడట్లేదు’ అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం టీజర్లో విజయ్ దేవరకొండతో రాశీ ఖన్నా అంటున్నారు. ఈ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా హీరోయిన్లు. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించారు. టీజర్లో నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ కనిపించారు విజయ్. మరి సినిమాలో నాలుగు షేడ్స్‌లో కనిపిస్తారా? ద్విపాత్రాభినయం చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రేమికుల దినోత్సవానికి ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఖోఖో నేపథ్యంలో...
పూల సిద్ధేశ్వర్ రావ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రథేరా’. జాకెట్ రమేష్ దర్శకత్వం వహించారు. పూల సిద్ధేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. సిద్ధేశ్వర్ రావ్ మాట్లాడుతూ– ‘‘ఖోఖో నేపథ్యంలో వస్తోన్న చిత్రమిది. క్రీడా నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన వీవీ వినాయక్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘రథేరా’ సినిమాను చూసిన కొందరు సినీ ప్రముఖులు బాగుందన్నారు. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి అదే స్పందన వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు జాకెట్ రాకేష్. -
టైటిల్ నాకు బాగా నచ్చింది
విజయ్‌రామ్, శివశక్తి సచ్దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వంలో వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ‘ప్రేమించటం అంటే ప్రేమిస్తూనే ఉండటం’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్, కొరటాల శివ ఆవిష్కరించారు. ‘‘అమరం అఖిలం ప్రేమ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ప్రసాద్‌గారు నిర్మాతగా సక్సెస్ కావాలి’’ అన్నారు కొరటాల శివ. ‘‘ప్రసాద్, నేను లెక్చరర్స్‌గా కలిసి పనిచేశాం. ఆయన ఈ సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్టుగా బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే, హీరోగా చేయడానికి అంత కన్నా పెద్ద లక్షణం అవసరం లేదు. అది విజయ్‌రామ్‌లో చూశాను. జోనాథన్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసి స్ఫూర్తి పొందాను. జోనాథన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు శ్రీకాంత్ మంచి డైలాగ్స్ రాశాడు. అల్లు అర్జున్‌తో నేను తెరకెక్కిస్తున్న సినిమాకు శ్రీకాంత్ మాటలు రాస్తున్నాడు’’ అన్నారు. ‘‘సుకుమార్‌గారు లేకుంటే ఈ సినిమా ప్రారంభం అయ్యేది కాదు. ప్రసాద్‌గారు సహనశీలి’’ అన్నారు జోనాథన్. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఆడిన సినిమా పెద్ద సినిమా అవుతుంది. విజయ్‌రామ్ హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత ప్రసాద్. కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రధన్, దర్శకుడు హరి ప్రసాద్ జక్కా, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
క్లాస్ రాజా
రవితేజ మాస్‌రాజా. వీఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా కోసం ‘డిస్కో రాజా’గా మారారు. తాజాగా ‘డిస్కో రాజా’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో చాలా క్లాస్‌గా కనిపిస్తూ క్లాస్ రాజాలా ఉన్నారు రవితేజ. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. 1980–2019 ఇలా రెండు టైమ్‌లైన్స్‌లో కథ నడుస్తుందని సమాచారం. టీజర్‌ని చూస్తే రవితేజ మీద ఏదో ప్రయోగం జరిగినట్టు అర్థం అవుతోంది. మరి ఆ ప్రయోగం వల్ల రవితేజకు ఏం జరిగింది? దాని వల్ల విలన్స్‌కి ఏం జరిగిందో తెలియాలి. ‘‘రవితేజ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆయన రెట్రో గెటప్ ఉంటుంది. అందరికీ నచ్చే విధంగా సినిమాను సిద్ధం చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. 2020 జనవరి 24న ‘డిస్కో రాజా’ విడుదల కానుంది. -
స్నేహితుని ప్రేమ కోసం..
పవన్, శైలజ జంటగా జి. మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా దోస్త్’. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై పి. వీరారెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మేరా దోస్త్’ టీజర్ చాలా బావుంది. వీరారెడ్డి మంచి డాక్టర్ కాబట్టి మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీసి ఉంటారనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ నచ్చి సినిమా తీశాను’’ అన్నారు పి. వీరారెడ్డి. ‘‘ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. స్నేహితుని ప్రేమ కోసం మరో ఫ్రెండ్ ఎలాంటి సాహసం చేశాడు? ఆ ప్రేమికుల జంటను ఎలా కలిపాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు జి. మురళి. ‘‘ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించా’’ అన్నారు నటుడు అమిత్. ఈ కార్యక్రమంలో శైలజ, పాశం యాదగిరి, ధర్మాసనం, సుధీర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్న, కెమెరా: సుధీర్. -
ఇక వేటే
‘‘ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్ తీశానా... బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే’’ అని ‘రూలర్’ టీజర్లో విలన్‌కు పవర్ఫుల్ వార్నింగ్ ఇస్తున్నారు బాలకృష్ణ. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్ గురువారం రిలీజ్ అయింది. టీజర్లో రెండు డిఫరెంట్ గెటప్స్‌తో బాలకృష్ణ కనిపించారు. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్. -
దుర్గాపురం వారి నాటక ప్రదర్శన
‘మీరు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న శ్రీ దుర్గాపురం వారి నాటక ప్రదర్శన మరికాసేపట్లోనే మొదలవబోతోంది’ అంటూ విడుదలైన ‘అప్పుడు–ఇప్పుడు’ టీజర్ ఆసక్తిగా ఉంది. సుజన్, తనిష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటించారు. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసి, ‘టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ‘‘పూరి జగన్నాథ్‌గారు మా టీజర్‌ను విడుదల చేయడం సంతోషం. పాటలకు మంచి స్పందన వస్తోంది. టీజర్‌తో ఇటు సినీ అభిమానుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి, సంగీతం: పద్మానావ్ భరద్వాజ్. -
అంతా నిశ్శబ్దం
టైటిల్‌కి తగ్గట్టుగానే ఉంది ‘నిశ్శబ్దం’ టీజర్ కూడా. ‘భాగమతి’ వంటి హిట్ చిత్రం తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇది. ఈ సినిమాలో అనుష్క మాట్లాడలేని సాక్షి అనే అమ్మాయి పాత్రలో నటించారు. నేడు (నవంబర్ 7న) అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఒక్క డైలాగ్ కూడా లేదు. ఏదో విషయాన్ని అనుష్క సైగలతో చెప్పడానికి ప్రయత్నించే సన్నివేశాలతో టీజర్‌ని విడుదల చేశారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నిశ్శబ్దం’ తెలుగు టీజర్‌ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. తమిళ, మలయాళ టీజర్స్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, హిందీ టీజర్‌ను డైరెక్టర్ నీరజ్ పాండే రిలీజ్ చేశారు. ‘‘తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్ డియో, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ప్రేమతోనే సమస్య
నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సత్యప్రకాశ్ దర్శకత్వంలో ఎ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘అసలు నాకు నీతో కాదు.. ఆ ప్రేమతోనే ప్రాబ్లమ్, ఈ ప్రేమలూ ప్రేతాత్మలు నాకు అస్సల్ నచ్చవ్’, ‘నిన్ను అంత ఈజీగా వదులుకుంటానా?’ అనే డైలాగ్స్‌తో సాగే ఈ టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాశ్‌తో నా అసోసియేషన్ మూడు చిత్రాలే అయినప్పటికీ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తారు. మంచి నటుడు. ఇప్పుడు ఆయనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తన కొడుకు హీరోగా ఈ సినిమా చేయడం అభినందనీయం. ఈ చిత్రం విజయం సాధించాలి. నిర్మాత గురురాజ్ భవిష్యత్‌లో ఇంకా ఎన్నో పెద్ద చిత్రాలను నిర్మించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు సత్యప్రకాశ్. ‘‘నటరాజ్ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. జై రాయరాల మంచి సంగీతం ఇచ్చారు. త్వరలో ట్రైలర్, పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్. ‘‘టీజర్‌ను విడుదల చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. మా నాన్న సత్యప్రకాశ్, గురురాజ్ ఈ సినిమాకు రెండు కళ్లులాంటివారు’’ అన్నారు నటరాజ్. జై రాయరాల మాట్లాడారు. -
మహిళల గొప్పదనం చెప్పేలా...
దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. గురు రాఘవేంద్ర సమర్పణలో ఎ. సునీత మోహన్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలకు చాలా సమస్యలుంటాయి. మాకు ఇబ్బంది కలిగిన సందర్భాల్లో నిర్మాత మోహన్ రెడ్డిగారు ముందుకు నడిపించారు. నేటి యువత ఆకర్షణ మోజులో పడి అసలైన ప్రేమను మర్చిపోతున్నారు. అలాంటి వారికి ప్రేమ గొప్పదనం తెలియజేసే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘యువతకు ఒక ప్రతినిధిగా ఈ చిత్రంలో కనిపిస్తా’’ అన్నారు దిలీప్. ‘‘మహిళల గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని మోహన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్ రఫీ ఎస్కే. -
పరమానందయ్య శిష్యులు
పింక్ రోజ్ సినిమాస్ పతాకంపై కాటంరెడ్డి సంతన్‌రెడ్డి, సిహెచ్ కిరణ్‌శర్మ నిర్మాతలుగా వెంకట రాజేశ్ పులి దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీ పరమానందయ్య శిష్యుల కథ’. ఈ త్రీడీ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం మారుతి మాట్లాడుతూ– ‘‘చిన్నారుల కోసం ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని తీసిన చిత్రం ‘పరమానందయ్య శిష్యుల కథ’. ఈ చిత్రాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పరమానందయ్య కథలోని నీతిని చిన్నారులకు మరింతగా చేరవేయటం కోసం ఈ చిత్రాన్ని త్రీడీ చేశాం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: యాజమాన్య. -
మనిషిలో మరో కోణం
జీపీఎస్ హీరోగా కపిలాక్షీ మల్హోత్రా, సోనాక్షీ వర్మ కథానాయికలుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. మురళీ రామస్వామి దర్శకత్వంలో ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్, పి.ఎస్. రామకృష్ణ నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్‌లో అతిథిగా పాల్గొన్న పి.వి.ఆర్. విష్ణు మాట్లాడుతూ– ‘‘సినిమాల పట్ల మంచి అభిరుచి ఉన్న నిర్మాత రామకృష్ణ. టీజర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు మురళి కష్టం తెలుస్తోంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ఈ సినిమాతో జీపీఎస్ సంచలన హీరో అవుతారు. మురళి చాలా కష్టపడ్డారు. నా స్నేహితుడు యుగంధర్ వల్ల ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నాను. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు రామకృష్ణ. ‘‘కంటెంట్ నచ్చి ఈ సినిమాలో భాగమయ్యాను’’ అన్నారు. ఈ సినిమా సహ–నిర్మాత రాహుల్ పండిట్. ‘‘ప్రతి మనిషిలోనూ మరో కోణం ఉంటుంది. అదే మా సినిమా’’ అన్నారు మురళి. ‘‘బ్రేక్ ద రూల్స్ అనేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు జీపీఎస్. -
ప్రేమలో కొత్త కోణ ం
రమేష్ కుర్మాపు, గరిమా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కైలాసపురం కింగ్స్’. కులదీప్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రౌండ్ ఫండింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను. వైజాగ్ నేపథ్యంలో జరిగే మాస్ ఎంటర్టైనింగ్ చిత్రమిది’’ అన్నారు. ‘‘మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు కులదీప్. ‘‘పక్కా మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు రమేష్. ‘‘ప్రేమలోని కొత్త కోణాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు’’ అన్నారు గరిమా సింగ్. ‘‘ఈ సినిమాతో రమేష్‌కి ఇంకా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్. నిర్మాతలు రిజ్వాన్, తేజ్ వైజాగ్ పాల్గొన్నారు. -
గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే ఇష్టం
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందరూ తిడుతున్నారని గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీయడం లేదు. ‘పలాస 1978’ టీజర్ నాకు చాలా చాలా నచ్చింది. హీరో హీరోయిన్లు బాగున్నారు. కరుణ కుమార్ పనితనం నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘పూరీగారు మా టీజర్‌ను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఓ సొగసరి పాటతో పాటు టీజర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు కరుణ కుమార్. ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం కూడా అందించారు రఘు కుంచె. -
సినిమా సంఘటనలతో బజార్
‘‘మీనా బజార్’ సినిమా టీజర్ బాగుంది. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ ‘మీనా బజార్’ సినిమా మంచి విజయం సాధించి, రెండో భాగం కూడా రావాలని కోరుకుంటున్నా’’ అని సి.కళ్యాణ్ అన్నారు. మధుసూదన్, శ్రీజిత ఘోష్ జంటగా రానా సునీల్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.మీనాబజార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ని సి. కల్యాణ్ విడుదల చేశారు. ‘‘కన్నడలో ఒక సినిమా చేశాను. తెలుగులో మొదటి చిత్రమిది’’ అన్నారు రానా సునీల్ కుమార్ సింగ్. ‘‘మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’అన్నారు మధుసూదన్. -
కల్తీ మాఫియాపై పోరాటం
సిద్ధార్థ్ హీరోగా సాయి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలడు’. దెయ్యం అయినా సరే... అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా వచ్చే నెల 11న విడుదల కానుంది. టి. అంజయ్య సమర్పణలో పారిజాత క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్‌రెడ్డి, ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రటరీ నట్టికుమార్ కలిసి ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘పదేళ్లుగా అంజయ్యగారు నాకు పరిచయం. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తుంటారు’’ అన్నారు. ‘‘అంజన్న, నేను మంచి స్నేహితులం. ఆ మధ్య సిద్ధార్థ్ నటించిన ‘గృహం’ హిట్ చిత్రంగా నిలిచింది. ‘వదలడు’ అంతకన్నా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నట్టికుమార్. ‘‘రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగాం. అలాగే ఇండస్ట్రీలోనూ పైకి రావాలనుకుంటున్నాం. మా బ్యానర్లో వచ్చే సినిమాలు పూర్తి వినోదాత్మకంగా ఉండాలన్నదే మా లక్ష్యం. మా బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. రెండో చిత్రం ‘కిల్లర్’ మంచి విజయం సాధించింది. ‘మిస్టర్ కేకే’ చిత్రానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘వదలడు’ సినిమా విడుదల చేస్తున్నాం. విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు టి. అంజయ్య. ‘‘మేం అందించే ప్రతి సినిమాలో ఏదో ఒక మేసేజ్ ఉంటుంది. కల్తీ మాఫియాపై ఓ యువకుడు ఎలా పోరాటం చేశాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఇలాంటి సమయంలో హీరోయిన్‌కి ఏమైంది? అనే విషయాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. దాదాపు 450 థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత టి. శ్రీధర్. ‘‘మంచి కాన్సెప్ట్ సినిమాలను నిర్మించాలనే ఇండస్ట్రీలోకి వచ్చాం. ‘వదలడు’ సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు టి. నరేష్ కుమార్. -
నవ్వులే నవ్వులు
‘‘తొలిసారి నా పనిని సిన్సియర్‌గా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారిదే. ఈ సినిమాకు ఆయన దొరకడం నా అదృష్టం’’ అని సందీప్ కిషన్ అన్నారు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హన్సిక, సందీప్ కిషన్ రిలీజ్ చేశారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సినిమా మొత్తం నవ్వులే. నేను చాలా కొత్తగా కనిపిస్తాను. అన్నీ తానై చక్కగా రూపొందించారు నాగేశ్వరరెడ్డిగారు’’అన్నారు. ‘‘నిర్మాతలు బాగా సహకరించారు. వాళ్లకో మంచి సినిమా ఇవ్వడమే నేను వాళ్లకు ఇచ్చే గిఫ్ట్. సినిమా బాగా వచ్చింది. నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు నాగేశ్వరరెడ్డి. ‘‘ఈ సినిమాలో భాగమవ్వడం çహ్యాపీగా ఉంది’’ అన్నారు హన్సిక. ‘‘నాగేశ్వరరెడ్డి, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు నాగిరెడ్డి. ‘‘మేము షూటింగ్‌కి వెళ్లకపోయినా నాగేశ్వరరెడ్డి వన్‌మ్యాన్ ఆర్మీగా అన్నీ చూసుకున్నాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు సంజీవ్ రెడ్డి. ‘‘సంగీత దర్శకుడిగా ఇది నా 75వ సినిమా. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్. -
తెనాలి రామ కృష్ణ టీజర్ విడుదల
-
నేనొస్తున్నా
‘‘సార్ మనం (గూఢచారులు) రెండు లైఫ్‌లు లీడ్ చేస్తుంటాం. ఒకటి అబద్ధం. రెండోది నిజం’. ‘నా పేరు అర్జున్, ఐయామ్ యాన్ ఇండియన్’. ‘నీ గుండెల్లో దమ్ముంటే అక్కడే ఆగు బే, నేను వస్తున్నా’’ అంటూ పవర్ఫుల్ స్పైగా ‘చాణక్య’ సినిమాలో డైలాగ్స్ చెబుతున్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. మెహరీన్, జరీనా ఖాన్ హీరోయిన్లు. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్ సోమవారం విడుదలయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు కెమెరా: వెట్రి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
శత్రువు కూడా వ్యసనమే
‘మందు, సిగరెట్, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘తిప్పరా మీసం’ చిత్రం టీజర్ విడుదలైంది. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా కృష్ణ విజయ్.ఎల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్, శ్రీ ఓం సినిమా పతాకాలపై రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా టీజర్‌కు, శ్రీవిష్ణు డైలాగ్‌కి అనూహ్య స్పందన వస్తో్తంది. శ్రీవిష్ణుని కృష్ణ విజయ్ ఆవిష్కరించిన తీరు, లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత్ రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల, సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సిద్. -
ప్రతి ఫోన్లో సీక్రెట్ ఉంది
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రధారులుగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ‘ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్’ అనేది ట్యాగ్‌లైన్. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘మీ లాంటి వారు బ్రౌజర్ హిస్టరీ డిలిట్ చేస్తారు. కాల్ హిస్టరీ డిలిట్ చేస్తారు. వాట్సప్ చాట్ డిలిట్ చేస్తారు. అన్నీ దాచేసి దొరికిపోతే చీటింగ్ కాదంటారు’, ‘ప్లీజ్ నా గురించి తప్పుగా ఆలోచించొద్దురా.. బేసిక్‌గా నేను మంచోణ్ణి’ అన్న టీజర్‌లోని డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అంతిక మిశ్రా, వినయ్, జీవన్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు శివ కుమార్ దర్శకత్వం వహించారు. -
బాక్సాఫీస్ బద్దలయ్యే కథ
‘బాక్సాఫీస్ బద్దలయ్యేలాగా ఓ కత్తిలాంటి కథ చెబుతాను గురువుగారు’ అనే డైలాగ్‌తో విడుదలైన ‘ధమ్కీ’ టీజర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆదిలక్ష్మి, భాస్కరరావు సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మించారు. ఈ సినిమా టీజర్, బ్యానర్ లోగోను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సుంకర బ్రదర్స్ మా కుటుంబానికి కావాల్సిన వారు. వాళ్ల తమ్ముడికి మంచి లైఫ్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ బేనర్‌ని స్థాపించారు. కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా సుంకర బ్రదర్స్ బేనర్‌కి మంచి ఫౌండేషన్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాను’’ అన్నారు ఏనుగంటి. ‘‘సుంకర బ్రదర్స్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. అవుట్‌పుట్ చాలా బాగుంది. తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు రజిత్. ‘‘మా బేనర్లో ‘ధమ్కీ’ లాంటి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుంకర బ్రదర్స్ అభిలాష్. ఫైట్ మాస్టర్ రామ్ సుంకర పాల్గొన్నారు. శ్రవణ్, అజయ్, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, బిత్తిరి సత్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దీపక్ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్. -
ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్
బ్యాడ్ టైమ్‌లో బ్యాడ్ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏవిఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ... ‘నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు ఆర్కిటెక్ గా పని చేసేవాడ్ని ఒక ఫొటో వంద మాటలు చెపుతుంది అన్నట్లు ఒక సినిమా వెయ్యి మాటలను చెపుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అభిరామ్, కృతిక చాలా బాగా నటించారు. మా ఎడిటర్ అమర్ చాలా బాగా ఎడిట్ చేశారు. నాకు ఈ జోనర్ చాలా కంఫర్ట్ అనిపించింది’అన్నారు. ప్రొడ్యూసర్ స్వామి మట్లాడుతూ... ‘మాకు సినిమా గురించి ఏమీ తెలియదు. సుబ్బుగారు వచ్చి కథ చెప్పారు. కథ నచ్చి ఆయనతో కలిసి మరో ముగ్గురం మొత్తం నలుగురం కలిసి ఈ సినిమాని నిర్మించి ఇంత దూరం తీసుకువచ్చాం. ఇక దేవుడి పైనే భారం వేశాం’ అన్నారు. హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ... ‘ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాతో కలిసి ఈ సినిమా నటించిన అందరూ మంచి వారు. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. హీరో అభిరామ్ మాట్లాడుతూ... ‘సుబ్బుగారికి ప్రొడ్యూసర్స్‌కి నా థ్యాంక్స్. ఈ కథ విని నచ్చి చేశాను. కృతికి కూడా కృతజ్ఞతలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బి.వి.ఎస్.ఎన్గారికి, మధుర శ్రీధర్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు. బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ... ‘ఒక థ్రిల్లింగ్ చిత్రాన్ని ఇంత దూరం తీసుకురావడమే చాలా కష్టం. షూటింగ్ వరకు తీసుకువెళ్ళాక నాలాంటి వారు కొన్ని మార్పులు చెపుతారు కొంచెం, కామెడీ యాడ్ చెయ్యమని, కొన్ని మాటలని, కొంత లవ్ యాడ్ చెయ్యమని ఇలా అంటుంటారు. కాని వీళ్ళు అమెరికా నుండి వచ్చిన ఒక దర్శకుడిని నమ్మి ఈ అవకాశం ఇవ్వడం. ఈయన వాళ్ళని నమ్మించడం చాలా గ్రేట్ వారిద్దరికి ముందుగా అభినందనలు. చాలా మంది అనుకుంటారు విదేశాల్లో చదువుకుని వస్తారు వీళ్ళకు సినిమాల ఏమి తెలుసు అని. కాని శేఖర్‌కమ్ముల, అడవిశేషు ఇలా చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు’ అన్నారు. -
రచ్చ మళ్లీ మొదలవుతుంది
‘బావమరదలు’ చిత్రం ఫేమ్ మోహన్ కృష్ణ హీరోగా కిషోర్ బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ‘మళ్ళీ మొదలవుతుంది రచ్చ’ అనేది ఉపశీర్షిక. హరిణి రెyì ్డ కథానాయిక. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, మెగా అభిమాని మోహన్ కృష్ణ ఈ సినిమా టీజర్‌ను విడుదలచేశారు. సీహెచ్ రవికిషోర్ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడం వల్ల రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘స్వతహాగా చిరంజీవిగారి అభిమానినైన నేను ఆయన సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. మెగా అభిమానులను అలరించేలా టీజర్, సినిమా ఉంటుంది’’ అన్నారు.