అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్‌లో అదరగొట్టిన ప్రభాస్ | Pan India Star Prabhas Adipurush Teaser Out Today At Ayodhya | Sakshi
Sakshi News home page

Prabhas Adipurush Teaser: 'వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి'.. ప్రభాస్ డైలాగ్ అదుర్స్

Oct 2 2022 7:06 PM | Updated on Oct 2 2022 7:36 PM

Pan India Star Prabhas Adipurush Teaser Out Today At Ayodhya - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' టీజర్ వచ్చేసింది. అయోధ్యలో గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. రామాయణం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్‌ ఫిలింగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనండగా.. కృతీ సనన్‌ సీతగా కనువిందు చేయనుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా అలరించనున్నాడు.  

టీజర్‌ చూస్తే రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. రెబల్ స్టార్ డైలాగ్ అభిమానులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. టీజర్ చూస్తే విజువల్ వండర్‌ను తలపిస్తోంది. 'భూమి కుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..' అంటూ సాగిన టీజర్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది. ఈ చిత్రాన‍్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement