Om Raut
-
ఆదిపురుష్‌కు మంచి వసూళ్లు వచ్చాయ్.. ప్రభాస్‌తో పాటు ఆ హీరో..
ఫ్లాప్ అవడం వేరు, అప్రతిష్ట మూటగట్టుకోవడం వేరు. కొన్ని కథలు బాగున్నా కలెక్షన్స్ కూడబెట్టడంలో విఫలమై ఫ్లాప్‌గా నిలుస్తాయి. మరికొన్ని భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఊరిస్తూ ఊదరగొడుతూ బాక్సాఫీస్ ముందుకు వచ్చి అట్టర్‌ఫ్లాప్‌గా నిలుస్తాయి. అంతేనా దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతాయి. ఆదిపురుష్ సినిమా రెండో కోవలోకి వస్తుంది.ఆదిపురుష్‌పై ట్రోలింగ్భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అంతేకాదు, నటీనటుల లుక్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. వానరాలను చూపించిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. ఇలా ఒక్కటేమిటి, బోలెడు తప్పులను జనాలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ దర్శకుడు ఓం రౌత్‌ను ఏకిపడేశారు.బానే ఆడిందిఅయితే తన సినిమాకేమైందంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ మరాఠీ షోలో మాట్లాడుతూ.. సినిమాను విమర్శించడం వేరు, బాక్సాఫీస్ వద్ద దాని పనితీరు వేరు. ఆదిపురుష్ సినిమానే ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇది మొదటి రోజు ఒక్క ఇండియాలోనే రూ.70 కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. అంటే బాక్సాఫీస్ వద్ద బానే ఆడింది.నేను పట్టించుకోనుఇక్కడ డబ్బులు పోలేదు. కాకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు థియేటర్లో కొన్ని సీన్లు రికార్డు చేసి ఆన్లైన్లో ట్రోల్ చేశారు. అలాంటివాటిని నేనసలు పట్టించుకోను. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా తమ పాపులారిటీని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకునే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు సల్మాన్ ఖాన్. వారి ఇమేజ్ చెక్కుచెదరదువీరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా వీరి ఇమేజ్ అలాగే ఉంటుంది. సినిమా వైఫల్యంతో సంబంధం లేకుండా వారి క్రేజ్ అలాగే కొనసాగుతుంది అన్నారు. ఇకపోతే దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.393 కోట్లు వసూలు చేసింది.చదవండి: ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు -
‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది: ‘రామాయణ్’సీత
రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు. -
ప్రభాస్ ఆదిపురుష్‌పై ట్రోల్స్.. డైరెక్టర్‌ను భయపెట్టారు: నటుడు కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరెకెక్కించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణాన్ని ఇప్పటి సినీ ప్రియులకు అనుగుణంగా తెరకెక్కించడంలో ఓం రౌత్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆదిపురుష్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీపై వచ్చిన విమర్శలపై ఆదిపురుష్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళను విమర్శించడం సరికాదని హితవు పలికారు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ..నటీనటులను, చిత్రబృందాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ..'మీకు సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. అంతే నటీనటులను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమా తీయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. మీకు నచ్చితేనే సినిమా చూడండి. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఓం రౌత్ అలాంటి భయపడలేదు. ట్రోల్స్ పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం' అని అన్నారు. తాజాగా బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాగా.. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ చిత్రంలో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్‌లో ఈ కామెంట్స్ చేశారు. -
హను-మాన్కు హిట్ టాక్.. ఆదిపురుష్ డైరెక్టర్‌ను ఆడేసుకుంటున్నారు!
సినిమా బాగుంటే నెత్తిన పెట్టేసుకుంటారు జనాలు. అదే సినిమా షెడ్డుకెళ్లిపోయిందంటే మాత్రం చిత్రయూనిట్‌ను చెడుగుడు ఆడేసుకుంటారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద రిలీజైన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటినుంచే ట్రోలింగ్ బారిన పడింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో ఈ ప్రయోగాలేంటని అభిమానులు మండపడ్డారు. ఆ గ్రాఫిక్స్, గెటప్స్ మార్చమని మొత్తుకున్నారు. ఓం రౌత్‌పై ట్రోలింగ్ అబ్బే, దర్శకుడికి ఏది నచ్చితే అదే ఫైనల్! ఓం రౌత్ ఎవరి సలహాలను, సూచనలను పట్టించున్న పాపాన పోలేదు. చివరకు ఏమైంది? సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఆ సమయంలో ఓం రౌత్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. తాజాగా మరోసారి ఓం రౌత్‌పై సెటైర్లు వేస్తున్నారు సినీ లవర్స్. కారణం హను-మాన్ మూవీ. ఈ సినిమాకు ఓం రౌత్‌కు సంబంధం ఏంటనుకుంటున్నారా? మరేం లేదు. ఆదిపురుష్ అంత డిజాస్టర్ అవడానికి పేలవమైన వీఎఫ్ఎక్స్ కూడా ఓ ప్రధాన కారణం. వీఎఫ్ఎక్స్ వల్లే సినిమా.. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ విజయానికి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ప్రధాన బలంగా మారింది. ఇంకేముంది.. జనాలు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ఆకాశానికెత్తుతున్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను మళ్లీ ఆడేసుకుంటున్నారు. 'హనుమాన్ సినిమా ఆడే థియేటర్లలో ఓం రౌత్ కోసం ఓ సీటు వదిలేయండి', 'చిన్న సినిమా అయినా ఎలా తీశారో చూసి నేర్చుకో..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓం రౌత్.. ఆదిపురుష్ సినిమాను రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ప్రశాంత్ వర్మ.. హను-మాన్ చిత్రాన్ని కేవలం రూ.25 కోట్లలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్(ట్విటర్)లో నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో కింది ట్వీట్స్‌లో మీరే చూసేయండి.. After watching #Hanuman, i want to say #Omraut come to my cabin.#JaiShreeRam 🚩 #JaiHanuman 🚩 pic.twitter.com/e2V06FFEPR — Sanatani 🚩🔱 (@Vadapallisree) January 12, 2024 #Hanuman - #OmRaut will receive more criticism in the days to come than what he received after #Adipurush#PrasanthVarma will receive more offers and calls from producers spanning from North to South pic.twitter.com/7NC4l4eJLX — Daily Culture (@DailyCultureYT) January 11, 2024 Aa budget ki oka range output and response ante 🔥🔥🔥🔥🔥 Next movie in theatres #HanuMan 🛕 Still cannot forget what #OmRaut did to #Aadipurush with spectacular cast and budget …#HanuMan pic.twitter.com/mmcyrY9EsW — Vineeth K (@DealsDhamaka) January 11, 2024 Audience to #OmRaut after watching #Hanuman 😂😂🔥#HanumanOnJan12th pic.twitter.com/cSJetincsc — Asif (@DargaAsif) January 11, 2024 Everywhere in the world, wherever there is an #Hanuman show, I request the producer and distributor to keep one seat for #OmRaut Ji 🙏🏻 - Prashanth Varma pic.twitter.com/cKuDJa0nHz — भल्लालदेव (@bhallal_deva1) January 12, 2024 Audience attacking #Omraut after watching #Hanuman #PrashanthVarma bagane irikinchesavu ga 🤣🤣🤣#HanumanOnJan12th #HanumanReview #TejaSajja pic.twitter.com/kqrpbNYXGt — Cgma Memes 🗿 (@CgmaMemes) January 11, 2024 Pb fans to @omraut after watching #Hanuman vfx#Omraut #HanumanReview #HanumanOnJan12th pic.twitter.com/v772YAGRIh — Siddu Prabhas (@Siddhartha_002) January 11, 2024 చదవండి: హను-మాన్ రివ్యూ, సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే? భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!
జీవితంలో రెండో ఛాన్స్ ఉంటుందేమో గానీ సినిమాల్లో ఉండదు. అందుకే తీస్తున్నప్పుడు సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మధ్య అలా 'ఆదిపురుష్' విషయంలో జరిగింది. దర్శకుడు ఓం రౌత్‌ని అయితే ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. బండబూతులు తిట్టారు. దీంతో ప్రభాస్ 'కల్కి' జాగ్రత్త పడింది. అలా జరగకూడదని ముందే డిసైడ్ అయి ఓ పని చేసింది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 AD'. ప్రాజెక్ట్ k అనే వర్కింగ్ టైటిల్‌తో మొన్నటివరకు నడిపించారు. కొన్నిరోజుల ముందు అమెరికాలో జరిగిన కామికాన్ ఫెస్ట్‌లో టైటిల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై బోలెడన్ని విమర్శలు రాగా, గ్లింప్స్ మాత్రం బాగానే అనిపించింది. ఇప్పుడు వీటన్నింటిపై వచ్చిన రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తోంది. (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) ఇందులో భాగంగా గ్లింప్స్ వీడియోలో గ్రాఫిక్స్‌పై ఎలాంటి రివ్యూలు వచ్చాయనేది దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఆ ఫొటోని నిర్మాత ప్రియాంక దత్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీటిని బట్టి ముందు ముందు గ్రాఫిక్స్ ఎలా ఉండనేది జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వల్ల 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌కి కౌంటర్లు పడుతున్నాయి. అదేంటి 'కల్కి' గ్లింప్స్ గ్రాఫిక్స్ రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తే.. ఓం రౌత్‌ని ఎందుకు తిడుతున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది సెప్టెంబరులో 'ఆదిపురుష్' టీజర్ విడుదల చేయగానే ప్రతి ఒక్కరూ దర్శకుడిని విమర్శించారు. గ్రాఫిక్స్ సరిచేసేందుకు మరో ఆరు నెలలు సమయం తీసుకున్నప్పటికీ పెద్దగా మార్పులేం చేయలేకపోయాడు. దీంతో సినిమా రిలీజైన తర్వాత ఆ తిట్లు తప్పలేదు. ఇలా తమ మూవీ విషయంలో తప్పు జరగకుండా 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త తీసుకోవడం మంచి పనే. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) -
ఆదిపురుష్ డైరెక్టర్ పోస్ట్.. ఓ రేంజ్లో ఆడేసుకున్న నెటిజన్స్ !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: ఎక్కడైనా సరే 'తగ్గేదేలే'.. ఐకాన్ స్టార్ అరుదైన రికార్డ్!) ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ రచయిత మనోజ్ ముంతశిర్ డైలాగ్స్ రాశారు. పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఆదిపురుష్‌ను రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అయితే సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు దాటి పోవడంతో ఓం రౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తనకు ఇష్టమైన ఆలయాలను సందర్శించానని ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఓం రౌత్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'శ్రీ మంగేశి దేవాలయం, శ్రీ శాంతదుర్గ దేవాలయం దర్శనం చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తరచుగా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటా. ఈ రెండు పవిత్ర స్థలాలు నన్ను నా మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటా.' అని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. కొంతమంది రూ.600 కోట్లను ఆగం చేశావు కదా కామెంట్స్ చేయగా.. మరికొందరేమో అన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరొకరు రాస్తూ దయచేసి మీరు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయవద్దని సలహా ఇస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!) View this post on Instagram A post shared by Om Raut (@omraut) -
ఆదిపురుష్ 2 కి సిద్ధమైన ఓంరౌత్.. ప్రభాస్ రియాక్షన్..
-
ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్నెస్ ఏంట్రా బాబు!) అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్లైన్లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో హెచ్డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్‌లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: RRR Sequel: రామ్‌చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!) -
తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా మేకర్స్ చేసిన పొరపాట్లతో కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా' ) మనోజ్ ముంతశిర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. విజువల ఎఫెక్ట్స్ మినహాయిస్తే.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీంతో రచయిత మనోజ్ ముంతశిర్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. (ఇది చదవండి: 15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి) View this post on Instagram A post shared by Manoj Muntashir Shukla (@manojmuntashir) -
Adipurush Movie: దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు గుర్తించారా? (ఫోటోలు)
-
మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్‌పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్) అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్‌ఫుల్‌గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్‌లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు. విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన. ఆదిపురుష్ వివాదం ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ గుర్తొచ్చేది 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. మనం వాటిని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయాం. కానీ 'ఆదిపురుష్'పై వచ్చినన్నీ వివాదాలు మరే మూవీ విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. నిరాశపరిచిన 'ఆదిపురుష్'! 'బాహుబలి' తర్వాత ప్రభాస్.. పలు వైవిధ్యమైన సినిమాల్ని ఒప్పుకొన్నాడు. 'సాహో' యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, 'రాధేశ్యామ్' ఓ లవ్ స్టోరీ, ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్' మైథలాజికల్ చిత్రం. 'బాహుబలి' తప్పితే మిగతా మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు సాధించాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి! ఇలా అంటే ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. అయినా ఇదే నిజం! (ఇదీ చదవండి: 'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!) నో చెప్పిన ప్రభాస్! 'ఆదిపురుష్'లో రాముడిగా చేసిన ప్రభాస్ ని ఎవరూ పెద్దగా ఏం అనడం లేదు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ని బూతులు తిడుతున్నారు. ఇదంతా చూసి కూడా ప్రభాస్ దగ్గరకు సీక్వెల్ ప్రతిపాదనతో వెళ్లాడట. దీన్ని డార్లింగ్ హీరో సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంపైనే ఇన్ని వివాదాలు వచ్చాయి. సీక్వెల్ తీస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయోనని ప్రభాస్ భయపడి ఉండొచ్చు బహుశా! కలెక్షన్స్ ఎంత? తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్ల వసూళ్లు సాధించిన 'ఆదిపురుష్'.. నాలుగురోజు నుంచి డల్ అయిపోయింది. చెప్పాలంటే రోజురోజుకీ దారుణంగా పడిపోయాయి. అలా మొత్తంగా పది రోజుల్లో రూ.450 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం లెక్కలు చూస్తుంటే భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. అవి ఎంతనేది కొన్ని రోజులైతే క్లారిటీ వచ్చేస్తుంది. #Adipurush goes from strength to strength at the Global Box Office and collects Rs 450 CR in 10 days. Continues its steady march at the box office!#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @TSeries @Retrophiles1 @UV_Creations @peoplemediafcy… pic.twitter.com/ErYJ1F8Mce — People Media Factory (@peoplemediafcy) June 26, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కానీ అంతే అంతేస్థాయిలో విమర్శల దాడి ఎదుర్కొంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?) తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ ఆదిపురుష్ చిత్రం చూశానని తెలిపారు. అయితే ఈ చిత్రంలో రెండు అంశాలు మాత్రమే తనకు నచ్చాయని వెల్లడించారు. కానీ ఈ సినిమా చూసేందుకు ఎందుకు వచ్చానా? అనిపించిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. 'నేను ఆదిపురుష్ సినిమా చూశా. ఈ చిత్రంపై నాకు చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ చాలా నిరాశకు గురి చేసింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఈ చిత్రం ఎవరు తీశారు? నేను ఎందుకు సినిమా చూసేందుకు వచ్చానా అనిపించింది. హనుమాన్ను ఓ వీధి భాష మాట్లాడే వారిలా చూపించారు. సినిమాలో నాకు నచ్చినవి రెండే అంశాలు బాగున్నాయి. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. ఈ రెండు మినహాయిస్తే ఈ మూవీ చూసిన వారికి నిరాశ తప్పదు. సినిమా థియేటర్లో నా పక్కన కూర్చున్నవారు సైతం సినిమా బాగాలేదన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తప్పా.. చిత్రంలో ఏం లేదని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ రామాయణం పేరుతో ప్రజలకు ఏం చూపిస్తున్నారంటూ మండిపడ్డారని.' తెలిపారు. (ఇది చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని! ) -
ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు!
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీ జూన్ 16న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రంలోని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ తమ తప్పులను అంగీకరించి.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన డైలాగ్స్ మార్చేశారు. దీంతో ప్రస్తుతం థియేటర్లలో మార్చిన సినిమానే ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురవగా.. ఐదో రోజుకు వచ్చేసరికి భారీస్థాయిలో పడిపోయాయి. దీంతో మళ్లీ ప్రేక్షకుల కోసం ఆదిపురుష్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరను భారీగా తగ్గించారు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఈ ఆఫర్ చెల్లదని తెలిపారు. ఈ టికెట్లపై 3D గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే.. ) View this post on Instagram A post shared by T-Series (@tseries.official) -
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్‌పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్‌కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!
ఒక సినిమా చేస్తున్నప్పుడే హీరోలకు అది హిట్ అవుతుందా లేదా అనేది దాదాపుగా తెలిసిపోతుంది. ఒకవేళ ఏమైనా తేడా కొడితే రిజల్ట్ గురించి హీరోలు పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. వీలైనంత వరకు సైలెంట్ గానే ఉంటారు. 'ఆదిపురుష్' విషయంలో మాత్రం రిజల్ట్ గురించి హీరో ప్రభాస్ ముందే పసిగట్టేశాడా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓ పాత వీడియోలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే ఈ కొత్త డౌట్స్ వచ్చేలా చేస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. థియేటర్లలోకి రాకముందు కొన్ని విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత మరింతగా వివాదాలకు కారణమవుతోంది. కొందరికి ఈ మూవీ నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే ప్రభాస్ కి ఎందుకో సందేహం వచ్చింది. కానీ డైరెక్టర్ ఓం రౌత్.. ఇతడి మాట వినలేదనిపిస్తుంది. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ టైంలో ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇదే నిజమనిపించేలా ఉన్నాయి. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) 'ఆదిపురుష్ షూటింగ్ నాలుగు రోజులు జరిగిన తర్వాత నాకెందుకో ఔట్‌ఫుట్ మీద డౌట్ వచ్చింది. నేను ఈ సినిమా చెయ్యొచ్చా? ఇంతకుముందు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. మిగతా చిత్రాల విషయంలో తప్పు జరిగినా పర్లేదు కానీ రామాయణం విషయంలో తప్పు జరగకూడదు. ఆదిపురుష్ విషయంలో మనం తప్పు చేయకూడదు అని ఓం రౌత్ ని అడిగాను. అతను.. 'మీరు అలాంటి భయలేం పెట్టుకోవద్దు. సినిమా బాగా వస్తుంది, నేనున్నాను' అన్నాడు' అని ప్రభాస్ ఈ పాత వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్.. ప్రభాస్ ముందే 'ఆదిపురుష్' రిజల్ట్ ఊహించినట్లున్నాడు. అది చెబితేనే ఓం రౌత్ వినలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా 'రామాయణం' ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినా 'ఆదిపురుష్' విషయంలో జరిగినంత రచ్చ అయితే ఎప్పుడు జరగలేదు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్లు వసూలు చేసింది. సోమవారానికి దారుణంగా పడిపోయింది. కేవలం రూ.35 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ వారం నిలబడితేనే సినిమా గట్టెక్కుతుంది. లేదంటే నష్టాలు తప్పవేమో అనిపిస్తోంది. (ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!) -
Adipurush Mistakes: ఆదిపురుష్ మూవీ.. ఓం రౌత్ చేసిన అతిపెద్ద బ్లండర్స్ ఇవే!
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శల దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సినిమాలోని పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డైలాగ్స్, పాత్రల వేషధారణపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా విడుదలైన తర్వాత కూడా ఆదిపురుష్‌పై విమర్శల దాడి ఆగడం లేదు. అసలు మీరు రామాయణమే కాదంటూ నెటిజన్స్‌తో పాటు కొందరు నటీనటులు సైతం విమర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు ) ఇవన్నీ పక్కనబెడితే దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు ఏంటి? అసలు ఎక్కడ ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారు. రామాయణంలో పాత్రలకు ఆధునిక సాంకేతికతను జోడించడం సినిమాను దెబ్బతీసిందా? లేక పాత్రలను తీర్చిదిద్దడంలో.. వాస్తవాన్ని చూపించడంలో విఫలమయ్యారా? అనేది ఓ సారి పరిశీలిద్దాం. ఆదిపురుష్‌పై ఇంతలా విమర్శలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది. విమర్శలకు దారితీసిన ప్రధాన తప్పిదాలివే! 1. రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు. 2. సినిమాలోని హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్‌ను మారుస్తామని నిర్మాతలు ప్రకటించారు. 3.పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్‌లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. 4. సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో రాముడు, సీత అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించారు. 5. డైలాగ్స్ పక్కన పెడితే చిత్రనిర్మాతలు రాఘవ అని కూడా పిలువబడే రాముడిని కోపంగా, మరింత దూకుడుగా ఉండే వ్యక్తిగా ఆదిపురుష్‌లో చూపించారు. ఇది కూడా సినిమాకు ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి. 6. పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. 7. ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్‌కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెట్టిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు. (ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఇలాంటి పొరపాట్లతో ఆదిపురుష్ టీం ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకుంది. వాస్తవానికి భిన్నంగా పాత్రలను చూపించిన ఓం రౌత్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఏదేమైనా పురాణ ఇతిహాసాలను తెరపై చూపించాలంటే వాస్తవాలను మరో కోణంలో చూపిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రాబోయే సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతారని ఆశిద్దాం. -
‘ఆదిపురుష్’కు దెబ్బ మీద దెబ్బ.. రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు!
‘ఆదిపురుష్’ సినిమా మొదలెట్టినప్పుడు ఆ చిత్రానికి ఎంత హైప్ వచ్చిందో ప్రస్తుతం అంతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో బ్యాన్ చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి వేషధారణ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇన్ని వివాదాల నడుమ ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనొక భక్తుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్’ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవైపు భారీగా కలెక్షన్లను రాబడుతున్నా అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మాట్లాడుతూ.. ‘హనుమంతుడు దేవుడు కాదు. ఆయనొక భక్తుడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న వివాదాల నడుమ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆదిపురుష్ చిత్రానికి మరింత మైనస్‌గా మారే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని రెచ్చగొట్లే వ్యాఖ్యలు చేయకు అంటూ హెచ్చరిస్తున్నారు. “बजरंग बली भगवान नहीं हैं भक्त हैं हमने उनको भगवान बनाया बाद में” -@manojmuntashir तुम मूर्ख हो मनोज, मौन हो जाओ अभी भी समय है। pic.twitter.com/PSqLXpJ04q — BALA (@erbmjha) June 19, 2023 చదవండి: Salaar Movie: 'సలార్' కొత్త పోస్టర్ లో ఉన్నవి అవేనా? -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్‌గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
Adipurush: సినిమాను బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ
ప్రభాస్ రాముడిగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘ఆదిపురుష్’కు భారీగా విమర్శలు వస్తున్న తరుణంలో మూవీ మేకర్స్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే సోమవారం నాడు మూవీకి భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఇన నుంచి కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఈ తరుణంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. అంతే కాకుండా ఓటీటీలో కూడా సినిమా ప్రదర్శన జరగకుండా చూడాలని కోరారు. ఈ సినిమాలో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి పాత్రలను మలిచిన తీరు బాగాలేదని లేఖలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Adipurush: సోమవారం దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. కారణం ఇదే) భారతీయ ఇతిహాసమైన రామాయణం ఇమేజ్ను చెడగొట్టేలా ఆదిపురుష్ ఉంది. ఇందులోని డైలాగ్‌లు హిందూ మనోబావాలు దెబ్బతినేలా ఉన్నాయి. సినిమా కూడా చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్‌లా చిత్రీకరించారని ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు లేఖలో తెలిపారు. కాబట్టి సినిమా డైరెక్టర్ ఓం రౌత్‌తో పాటు రచయిత మనోజ్ ముంతాషిర్పై కేసు నమోదు చేసి భారతీయలు ప్రతిష్టను కాపాడాలంటూ వారు కోరారు. ఇలాంటి సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: లిటిల్ మెగా ప్రిన్సెస్ గురించి చిరు ఏమన్నారంటే?) All India Cine Workers Association write to Prime Minister Narendra Modi, requesting him to "stop screening the movie and immediately order a ban of #Adipurush screening in the theatres and OTT platforms in the future. "We need FIR against Director Om Raut, dialogue writer… pic.twitter.com/jYq3yfv05c — ANI (@ANI) June 20, 2023 -
ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈనెల 16న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది. (ఇది చదవండి: 'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని! ) అయితే ఈ సినిమాపై అంతేస్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆదిపురుష్‌పై రోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదిపురుష్‌పై శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఈ చిత్రానికి రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆదిపురుష్‌పై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు. ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ..'రామాయణానికి ఆదిపురుష్‌ను మించిన అగౌరవం ఇంకొకటి లేదు. దర్శకుడు ఓం రౌత్‌కు రామాయణంపై కొంచెం కూడా పరిజ్ఞానం లేదు. మనోజ్ రాసిన డైలాగ్స్, స్క్రీన్‌ప్లే చూసి నిద్రమాత్రలు కూడా సిగ్గుపడతాయి. ఇప్పటి వరకూ ఎంతోమంది రచయితలు రామాయణాన్ని రాశారు. ఆ రచనలతో ఈ సినిమాకు అస్సలు పోలికలే ఉండవు. హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్‌ను స్ఫూర్తిగా తీసుకున సినిమా తీసినట్లు చూస్తేనే తెలిసిపోతుంది. సినిమాటిక్ స్వేచ్ఛ తీసుకోవాలనుకుంటే.. ఫిక్షనల్ సినిమా చేయాల్సింది. కథను అవమానించేలా చూపించకూడదు. ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్. రామాయణం గురించి ఆదిపురుష్ మేకర్స్ కంటే కూడా సాధారణ పిల్లాడికే బాగా తెలుసు. అసలు ఈ సినిమాకు రూ.600 కోట్లు ఎలా ఖర్చు చేశారో అర్థం కావడం లేదు' అంటూ విమర్శలు చేశారు. (ఇది చదవండి: ఉపాసన- రామ్‌చరణ్ బిడ్డకు సర్ప్రైజ్.. ఆర్ఆర్ఆర్ సింగర్ అదిరిపోయే గిఫ్ట్!) -
'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని!
'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. రైటర్ మనోజ్ ముంతాషిర్ గత కొన్నిరోజుల నుంచి హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం సినీ వర్గాలు, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? మాట మార్చడమే కారణమా? 'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. అయితే ఒరిజినల్ స్టోరీతో పోల్చి చూస్తే.. ఇందులో కొన్ని సీన్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకొందరు ట్రోల్స్ చేశారు. ఈ విషయమై తాజాగా స్పందించిన రైటర్ మనోజ్.. తాము తీసింది రామాయణం కాదని, కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకొచ్చారు. Mumbai Police provides security to dialogue writer of #Adipurush, Manoj Muntashir after he sought a security cover citing a threat to his life. Police say that they are investigating the matter. (File photo) pic.twitter.com/1WiWiOhclo — ANI (@ANI) June 19, 2023 (ఇదీ చదవండి: రావణుడు లుక్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!) ఫ్యాన్స్ కి మండింది! అయితే 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఒకలా మాట్లాడిన రైటర్ మనోజ్.. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మాట మార్చడం అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకు పర్వాలేదు గానీ ఓ వ్యక్తి మాత్రం చంపేస్తా అంటూ సదరు రైటర్ ఇంటికి లెటర్ పంపించాడు. దీంతో ఇతడు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఇతడికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ లేఖ ఎవరు పంపించారనేది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. హద్దులు దాటుతున్న అభిమానం ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయం. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం వరకు ఓకే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం ఏదైనా సినిమాలో చిన్న సీన్ నచ్చకపోయినా సరే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. 'ఆదిపురుష్' రైటర్ విషయంలోనూ జరిగిందిదే అనిపిస్తోంది. ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియా వల్ల విపరీత పోకడలు కనిపిస్తుండటం భయం కలిగిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
నిజం చెప్తున్నా, ప్రభాస్ అంత ఈజీగా ఒప్పుకోలేదు: ఆదిపురుష్ డైరెక్టర్
డార్లింగ్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య జూన్ 16న రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్‌కు మాత్రం ఎటువంటి ఢోకా లేనట్లు కనిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నిజం చెప్తున్నా.. ప్రభాస్ ఈ సినిమాను అంత ఈజీగా ఒప్పుకోలేదు. కరోనా సమయంలో ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. నేను ఏ రోల్ చేయాలని ఆశిస్తున్నావ్? అని ప్రభాస్ అడిగాడు. జూమ్ కాల్.. ఆ తర్వాత హైదరాబాద్‌కు శ్రీరాముడి పాత్రలో అంటే రాఘవుడిగా నటించాలని చెప్పాను. నువ్వు సీరియస్‌గా అంటున్నావా? అని అడిగితే అవునని బదులిచ్చాను. అయినా ఇలా జూమ్ కాల్లో స్క్రిప్ట్ వివరించడం ఎలా కుదురుతుంది? అన్నాడు. నేను వెంటనే ఆలస్యం చేయకుండా హైదరాబాద్‌లో వాలిపోయాను. కథ చెప్పాను, పూర్తిగా విన్నాక అతడు ఓకే అన్నాడు. నాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడు. నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ దేవుడి దయ వల్ల భవిష్యత్తులో కూడా అతడు నావెంట ఉంటే బాగుండు. ఇప్పటి జనరేషన్ కోసం ఆదిపురుష్ ఆదిపురుష్‌లో రాఘవుడి పాత్రకు నేను అనుకున్న ఏకైక ఛాయిస్ ప్రభాసే.. నేను అనుకున్నట్లే అతడు దొరికాడు. ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కోసం తీసింది. యువత కోసం తీశాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్‌పై చూపించడం అసాధ్యం. అందుకే నేను యుద్ధకాండ భాగం తీసుకున్నాను. ఈ అధ్యాయంలో రాముడు పరాక్రమవంతుడిగా ఉంటాడు, నేను కూడా అదే చూపించడానికి ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు ఓం రౌత్. చదవండి: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. మూడో రోజు ఎన్ని కోట్లంటే? -
అలా అంటున్నవారంతా తెలివి తక్కువ వాళ్లే!: ఆదిపురుష్ డైరెక్టర్
ఆదిపురుష్ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. అంతే భారీగా విమర్శలు సైతం వస్తున్నాయి. దశరథుడిగా ప్రభాస్ లుక్ బాలేదని, కొన్ని డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ చాలా పేలవంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆదిపురుష్ టీం కొన్ని తప్పులను సరిదిద్దుకునేందుకు రెడీ అయింది. ముఖ్యంగా హనుమంతుడితో చెప్పించే మాస్ డైలాగ్స్‌ను తీసేసి ఆ స్థానంలో కొత్తవి చేర్చనున్నట్లు ప్రకటించారు. రామాయణం తెలుసంటే అబద్ధమే అయినప్పటికీ ఈ ట్రోలింగ్ ఆగడం లేదు. మరీ ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌కు అసలు రామాయణం తెలుసా? అని ఆడేసుకుంటున్నారు. నటీనటులను ఓం రౌత్ సరిగా వాడుకోలేకపోయాడని నెట్టింట రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఈ నెగెటివ్ రివ్యూలపై ఓం రౌత్ స్పందించాడు. 'బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి స్పందన వస్తుందన్నది ముఖ్యం. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇకపోతే నాకు రామాయణం అంతా తెలుసని చెప్తే అది అబద్ధమవుతుంది. ఎందుకంటే రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదని నేను భావిస్తున్నాను. అంత ఈజీ కాదు నాకూ, మీకూ తెలిసిన రామాయణం ఉడుత చేసే సాయమంత ఉంటుంది. నాకు అర్థమైన కొంత భాగాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్‌పై చూపించడం అంత సులువు కాదు, అందుకే యుద్ధకాండలోని కొంత భాగంపై నేను దృష్టి సారించా. అయినా రామాయణాన్ని సంపూర్ణంగా గ్రహించడం అంత సులువేమీ కాదు. నాకు రామాయణం మొత్తం తెలుసు అని ఎవరైనా అంటున్నారంటే వాళ్లు తెలివి తక్కువ వాళ్లైనా అయి ఉండాలి లేదంటే అబద్ధమైనా చెప్తుండాలి' అని చెప్పుకొచ్చాడు ఓం రౌత్. ఇకపోతే ఆదిపురుష్ మొదటి రోజు రూ.140 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.100 కోట్లు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే! చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? నన్ను, నా తల్లిని తిడుతున్నారు: ఆదిపురుష్ రచయిత -
ప్రేక్షకుల నుంచి అభ్యంతరం.. ‘ఆదిపురుష్’ టీమ్ కీలక నిర్ణయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.రెండు రోజుల్లోనే ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది డైలాగ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లంకలో ఆంజనేయస్వామి చెప్పే డైలాగ్‌ని నెట్టింట ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో ఇలాంటి సంభాషణలు పెట్టడం ఏంటని రామ భక్తులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల సూచనల మేరకు కొన్ని డైలాగ్స్‌ని మారుస్తామని వెల్లడించింది. (చదవండి: ఆదిపురుష్’ పేరు పురాణాల్లో ఎక్కడినుంచి వచ్చింది?) ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ను చూడవచ్చు’ అని చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. డైలాగ్స్ మార్పు పెద్ద సాహసమే అయినప్పటికీ.. ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. We hold immense gratitude for your valuable perspectives and thoughts! Your constant love and support is what keeps us going ❤️ Jai Shri Ram 🙏 Book your tickets on: https://t.co/2jcFFjFeI4#Adipurush now in cinemas near you! ✨ #Prabhas @omraut #SaifAliKhan @kritisanon… pic.twitter.com/EtaDsNsShz — T-Series (@TSeries) June 18, 2023