
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు విజువల్ వండర్ అని కామెంట్స్ చేయగా.. మరికొందరు బొమ్మల సినిమాలా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ టీజర్‌పై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని చదవకుండానే సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై హీరో ప్రభాస్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్‌పై కోపంగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
(చదవండి: ‘ఆదిపురుష్ దర్శకుడికి రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు)
ఆదిపురుష్ టీజర్‌పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిరాశకు గురయ్యారు. టీజర్ కంటే ట్రైలర్, సినిమా బాగుండాలని అభిమానులు ఆశిస్తున్నారు. మైథలాజికల్ ఫిలింగా డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఆదిపురుష్‌లో నటిస్తున్నారు. గతంలో రిలీజైన సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద‍్ద విఫలమయ్యాయి. తాజాగా ఆదిపురుష్‌తోనైనా సక్సెస్ సాధించాలని ఫ‍్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం 12 జనవరి 2023న విడుదల కానుంది.
Om you coming to my room 🙂 pic.twitter.com/kM1UppGVr3
— Venu Prabhas™ (@TheVenuPrabhas) October 3, 2022
Comments
Please login to add a commentAdd a comment