Mukesh Khanna Comments Adipurush Makers Of Disrespecting Ramayana - Sakshi
Sakshi News home page

Mukesh Khanna: ఓం రౌత్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం లేదు:ముఖేశ్ ఖన్నా

Published Mon, Jun 19 2023 7:55 PM | Last Updated on Mon, Jul 31 2023 8:27 PM

Mukesh Khanna Comments Adipurush makers of disrespecting Ramayana - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈనెల 16న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత ‍అదే జోరును కొనసాగించింది.

(ఇది చదవండి: 'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని! )

అయితే ఈ సినిమాపై అంతేస్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆదిపురుష్‌పై రోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదిపురుష్‌పై శక్తిమాన్‌ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఈ చిత్రానికి రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆదిపురుష్‌పై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో షేర్‌ చేశారు.

ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ..'రామాయణానికి ఆదిపురుష్‌ను మించిన అగౌరవం ఇంకొకటి లేదు. దర్శకుడు ఓం రౌత్‌కు రామాయణంపై కొంచెం కూడా పరిజ్ఞానం లేదు. మనోజ్‌ రాసిన డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే చూసి నిద్రమాత్రలు కూడా సిగ్గుపడతాయి. ఇప్పటి వరకూ ఎంతోమంది రచయితలు రామాయణాన్ని రాశారు. ఆ రచనలతో  ఈ సినిమాకు అస్సలు పోలికలే ఉండవు. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ను స్ఫూర్తిగా తీసుకున సినిమా తీసినట్లు చూస్తేనే తెలిసిపోతుంది. సినిమాటిక్‌ స్వేచ్ఛ తీసుకోవాలనుకుంటే.. ఫిక్షనల్‌ సినిమా చేయాల్సింది. కథను అవమానించేలా చూపించకూడదు. ఆదిపురుష్‌ మూవీ ఓ పెద్ద జోక్‌. రామాయణం గురించి ఆదిపురుష్‌ మేకర్స్‌ కంటే కూడా సాధారణ పిల్లాడికే బాగా తెలుసు. అసలు ఈ సినిమాకు రూ.600 కోట్లు ఎలా ఖర్చు చేశారో అర్థం కావడం లేదు' అంటూ విమర్శలు చేశారు.

(ఇది చదవండి: ఉపాసన- రామ్‌చరణ్‌ బిడ్డకు సర్‌ప్రైజ్.. ఆర్ఆర్ఆర్ సింగర్ అదిరిపోయే గిఫ్ట్!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement