ప్రభాస్ ఆదిపురుష్‌పై ట్రోల్స్‌.. డైరెక్టర్‌ను భయపెట్టారు: నటుడు కామెంట్స్! | Bollywood Actor Bijay Anand on criticism received by Adipurush | Sakshi
Sakshi News home page

Adipurush Movie: ఆదిపురుష్‌పై విమర్శలు.. డైరెక్టర్‌ పట్టించుకోలేదన్న నటుడు!

Apr 12 2024 11:33 AM | Updated on Apr 12 2024 12:05 PM

Bollywood Actor Bijay Anand on criticism received by Adipurush - Sakshi

టాలీవుడ్ యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్, కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరెకెక్కించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణాన్ని ఇప్పటి సినీ ప్రియులకు అనుగుణంగా తెరకెక్కించడంలో ఓం రౌత్‌ సక్సెస్‌ కాలేకపోయారు. దీంతో ఆదిపురుష్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. 

తాజాగా ఈ మూవీపై వచ్చిన విమర్శలపై ఆదిపురుష్‌ నటుడు బిజయ్ ఆనంద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ చేసే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళను విమర్శించడం సరికాదని హితవు పలికారు.  సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ..నటీనటులను, చిత్రబృందాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.

బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ..'మీకు సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. అంతే నటీనటులను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమా తీయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. మీకు నచ్చితేనే సినిమా చూడండి. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఓం రౌత్ అలాంటి భయపడలేదు. ట్రోల్స్ పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం' అని అన్నారు. తాజాగా బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. కాగా.. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ చిత్రంలో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్‌లో ఈ కామెంట్స్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement