Mukesh Khanna
-
అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సీనియర్ నటుడు ఆగ్రహం
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ది కపిల్ శర్మ షో. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోకు హాజరవుతుంటారు. అయితే ఈ షో బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను తాను చూడడని.. వినోదం కంటే అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ..'ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసేందుకు కపిల్ శర్మ కష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ది కపిల్ శర్మ షో, బిగ్‌బాస్‌ను కూడా నేను చూడను. ఎందుకంటే వాటిలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అది నాకు అస్సలు నచ్చదు. మరో రెండు సంఘటనల వల్ల నాకు కపిల్ అంటే చిరాకు కలిగింది. గతంలో ఓసారి ఆయన షో చూశా అందులో శక్తిమాన్ గెటప్ వేసుకొని.. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు. మేము ఎంతో గొప్పగా ఆ పాత్రను సృష్టిస్తే.. అలా చేయడం నచ్చలేదు. అవార్డుల ఫంక్షన్లో కూడా ఓసారి ఇలాగే ప్రవర్తించాడు. నా పక్కనే కూర్చున్నప్పటికీ నన్ను పలకరించలేదు. అందుకే అతనిపై ఉన్న కాస్తా గౌరవం కూడా పోయింది' అని ముఖేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. -
కల్కి మేకర్స్‌పై ప్రముఖ నటుడు ఆగ్రహం.. అలా చూపించడం సరైంది కాదు!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.అయితే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. కల్కి మేకర్స్ మహాభారతాన్ని వక్రీకరించారని అన్నారు. కొన్ని సన్నివేశాల్లో పురాణ ఇతిహాసాన్ని మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాజాగా కల్కి మూవీ వీక్షించిన ముకేశ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివ్యూను వెల్లడించారు. కల్కి చిత్రంలోని విజువల్స్, నటనను ప్రశంసించినప్పటికీ మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.ముఖేశ్ మాట్లాడుతూ.. "నన్ను బాధిస్తున్న ఒక విషయం ఏమిటంటే.. కల్కి మేకర్స్ ఈ చిత్రంలో మహాభారతాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అశ్వథామను వేడుకున్నట్లు చూపించారు. అశ్వథామ మణిని శ్రీకృష్ణుడు తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నా రక్షకుడివని అతన్ని శ్రీకృష్ణుడు వేడుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ విషయంపై నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా. మీకు వ్యాసముని కంటే ఎక్కువ తెలుసునని ఎలా ఊహించుకున్నారు. నేను నా చిన్నప్పటినుంచి మహభారతం చదువుతున్నా. అశ్వత్థామ 'మణి'ని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదు. ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి' అని అన్నారు.అనంతరం ముకేశ్ మాట్లాడుతూ..'నేను ఈ కథను ఇంత వివరంగా చెప్పడానికి కారణం. కృష్ణుడు భవిష్యత్తులో తనను రక్షించమని కల్కిలో అశ్వత్థామను ఎలా ఆజ్ఞాపించాడో నాకు అర్థం కాలేదు? అంత శక్తిమంతుడైన శ్రీకృష్ణుడు.. తనను రక్షించమని అశ్వత్థామను ఎలా అడగుతాడు? ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి. దక్షిణాది ఫిల్మ్ మేకర్స్‌కి మన సంప్రదాయాలపై ఎక్కువ గౌరవం ఉందని అనుకుంటున్నాం? కానీ రామాయణం, గీత, ఇతర పౌరాణిక అంశాలతో రూపొందిస్తున్న చిత్రాలను పరిశీలించాలి. అవసరమైతే సినిమా స్క్రిప్ట్ పరిశీలనకు కమిటీని వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా.. మహాభారత్ సీరియల్లో భీష్ముని పాత్రలో ముకేశ్ ఖన్నా కనిపించారు. -
ఛీ, ఒంటి మీద దుస్తుల్లేకుండా కనిపించే ఆ హీరోనా?: నటుడు ఫైర్
ఇండియా ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్.. ఈ సూపర్ హీరో పాత్రలో నటుడు ముకేశ్ ఖన్నా నటించాడు. నటించాడు అనడం కన్నా జీవించాడనే చెప్పాలి. అయితే కొన్నాళ్లుగా శక్తిమాన్ మళ్లీ రాబోతున్నాడని ప్రచారం జోరందుకుంది. అయితే ఈసారి టీవీలో కాకుండా వెండితెరపై రానుందని, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నోరు విప్పక తప్పట్లేదు ఈ క్రమంలో సదరు వార్తలపై ముకేశ్ ఖన్నా స్పందించాడు. 'రణ్వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని కొన్ని నెలలుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నేను మాత్రం సైలెంట్‌గానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఛానల్స్ కూడా రణ్వీర్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? ఇదేమైనా బాగుందా అసలు? ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? అతడు ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? నేనైతే నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడేమవుతుందో చూద్దాం.. విచ్చలవిడితనం సర్వసాధారణమైన విదేశాల్లో రణ్వీర్ తనకు నచ్చిన పాత్రలు చేస్తే బాగుంటుంది. నేను నిర్మాతలతో కూడా మాట్లాడాను. శక్తిమాన్ అంటే సూపర్ హీరో మాత్రమే కాదు సూపర్ టీచర్ అని నొక్కి చెప్పాను! ఒక నటుడు ఆ పాత్ర చేస్తున్నాడంటే చక్కగా మాట్లాడగలగాలి, జనాలు అతడు చెప్తే వినగలిగేలా ఉండాలి. కొందరు హీరోలు పేరుకే పెద్ద.. కానీ వారి ఇమేజ్ ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది' అని సెటైర్లు వేశాడు ముకేశ్. View this post on Instagram A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) చదవండి: లైసెన్స్ పొందా.. దుబాయ్‌లోనే ఉంచా.. అందులో తిరుగుతుంటే మజా.. -
ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈనెల 16న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది. (ఇది చదవండి: 'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని! ) అయితే ఈ సినిమాపై అంతేస్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆదిపురుష్‌పై రోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదిపురుష్‌పై శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఈ చిత్రానికి రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆదిపురుష్‌పై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు. ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ..'రామాయణానికి ఆదిపురుష్‌ను మించిన అగౌరవం ఇంకొకటి లేదు. దర్శకుడు ఓం రౌత్‌కు రామాయణంపై కొంచెం కూడా పరిజ్ఞానం లేదు. మనోజ్ రాసిన డైలాగ్స్, స్క్రీన్‌ప్లే చూసి నిద్రమాత్రలు కూడా సిగ్గుపడతాయి. ఇప్పటి వరకూ ఎంతోమంది రచయితలు రామాయణాన్ని రాశారు. ఆ రచనలతో ఈ సినిమాకు అస్సలు పోలికలే ఉండవు. హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్‌ను స్ఫూర్తిగా తీసుకున సినిమా తీసినట్లు చూస్తేనే తెలిసిపోతుంది. సినిమాటిక్ స్వేచ్ఛ తీసుకోవాలనుకుంటే.. ఫిక్షనల్ సినిమా చేయాల్సింది. కథను అవమానించేలా చూపించకూడదు. ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్. రామాయణం గురించి ఆదిపురుష్ మేకర్స్ కంటే కూడా సాధారణ పిల్లాడికే బాగా తెలుసు. అసలు ఈ సినిమాకు రూ.600 కోట్లు ఎలా ఖర్చు చేశారో అర్థం కావడం లేదు' అంటూ విమర్శలు చేశారు. (ఇది చదవండి: ఉపాసన- రామ్‌చరణ్ బిడ్డకు సర్ప్రైజ్.. ఆర్ఆర్ఆర్ సింగర్ అదిరిపోయే గిఫ్ట్!) -
సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది.. ముకేశ్ కన్నా తీవ్ర ఆగ్రహం
పఠాన్ మూవీలోని పాటపై వివాదం మరింత ముదురుతోంది. ఈ సాంగ్‌లో దీపికా పదుకొణె ధరించిన డ్రెస్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. రోజు రోజుకు ఈ పాటను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా బేషరమ్ రంగ్ పాటపై బాలీవుడ్ నటుడు, శక్తిమాన్ పాత్రధారి ముకేశ్ కన్నా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పాటను అత్యంత అసభ్యకరంగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. ఇతరుల ఫీలింగ్స్‌ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని నిలదీశారు. ముకేశ్ కన్నా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం సినీ పరిశ్రమ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువైంది. ఇప్పుడు కురచ దుస్తుల్లో నటీనటుల్ని చూపించిన ఫిల్మ్‌మేకర్స్.. భవిష్యత్తులో నగ్నంగా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మనమేమీ స్పెయిన్, స్వీడన్లో లేము. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలకు కించపరచకుండా సినిమాలు ఉండేలా చూసుకోవడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు అనుమతివ్వకూడదు. ఇతరుల ఉద్దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఇలాంటి వస్త్రధారణను ఎలా అంగీకరించారు.' అని ప్రశ్నించారు. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రంలోని బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ కాగా... దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా నుంచి ఈ పాటను తొలగించాలని లేదంటే రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
బెడ్ షేర్ అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు
శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా ఇటీవలే కపిల్ శర్మ కామెడీ షోను అసభ్యకరమైన షో అని విమర్శించి వార్తల్లోకెక్కాడు. ఇది మరువకముందే తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. శారీరక సంబంధాన్ని కోరుకునే అమ్మాయిలు అసలు ఆడవాళ్లే కాదు, సెక్స్ వర్కర్లు అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. 'ఏ అమ్మాయైనా ఒక మగవాడి దగ్గరికి వెళ్లి నీతో బెడ్ షేర్ చేసుకోవాలని ఉంది అని అందంటే ఆమె అసలు ఆడదే కాదు. ఈ సమాజంలో బతికేందుకు అర్హత లేని ఓ వ్యభిచారి. తను పెద్ద బిజినెస్ నడుపుతోందని అర్థం. ఎందుకంటే పద్ధతి గల అమ్మాయిలు మాటవరసకు కూడా అలా మాట్లాడరు. కాబట్టి మీరు అలాంటి అమ్మాయిల వలలో చిక్కుకోకండి, వారికి దూరంగా ఉండండి' అంటూ ఆన్లైన్ సెక్స్ రాకెట్ స్కామ్‌లో ఇరుక్కోవద్దని సూచించాడు ముకేశ్. అయితే చాలామంది శక్తిమాన్ మాటలను తప్పుపట్టారు. 'సారీ, ఈసారి మీరు తప్పుగా మాట్లాడారనిపిస్తోంది', 'గొప్ప లాజిక్‌లే! మిమ్మల్ని ఇంతవరకు ఇలా ఎవరూ అడగకపోవడంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు', 'అరేయ్ శక్తిమాన్, నువ్వు నెక్ట్స్ సభ్యసమాజంలోని పురుషుల గురించి ఓ వీడియో తీయ్' అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్ అంటున్న ఫ్యాన్స్! -
ఆమె చనిపోయింది, నిలువెల్లా వణికిపోతున్నాను: నటుడు
శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ను జయించిన అతడి సోదరి కమల్ కపూర్ అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని ముఖేశ్ ఖన్నా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ సోదరికి అశ్రునివాళులు అర్పించాడు. "నేను బతికుండగానే చనిపోయానంటూ వచ్చిన వార్తలు ఫేక్ అని చెప్పడానికి ఎంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఓ భయంకరమైన నిజం నన్ను ఇలా కుదిపేస్తుందని అస్సలు ఊహించలేదు. నా ఒక్కగానొక్క అక్క కమల్ కపూర్ ఢిల్లీలో చనిపోయింది. కరోనాతో 12 రోజులు పోరాటం చేసిన ఆమె ఆ మహమ్మారిపై పైచేయి సాధించింది. కానీ ఊపిరితిత్తుల్లో ఆటంకం కలగడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఆ దేవుడు రాసిన రాతలను మనం కలలో కూడా ఊహించలేము. నా జీవితంలో తొలిసారి బాధతో, భయంతో వణికిపోతున్నాను. కన్నీటితో నమస్కరిస్తూ.. భావోద్వేగ హృదయంతో నివాళులు అర్పిస్తున్నాను" అని ముఖేశ్ ఖన్నా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు తన సోదరితో కలిసి దిగిన ఫొటోను జత చేశాడు. View this post on Instagram A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) చదవండి: లాక్డౌన్లో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతీ రచ్చ, పోస్టు వైరల్ -
ఇది దారుణం, నేను బతికే ఉన్నా: శక్తిమాన్ నటుడు
కోవిడ్ కారణంగా తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు కరోనా సోకలేదని, ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించాడు. ఈమేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు.. "మీ ఆశీర్వాదాల వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చేరానని వస్తున్న వార్తలు అవాస్తవం. నాకసలు కరోనా రాలేదు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో, ఏ ఉద్దేశ్యంతో వాటిని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వారిని ఏం చేస్తే ఇలాంటివి మానేస్తారు? సోషల్ మీడియా వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. కానీ ఇలా ఫేక్ న్యూస్‌లతో ప్రజల ఎమోషన్లతో ఆడుకోవడం దారుణం, దీనికి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలి. ఈ వార్తలతో నేను విసిగి వేసారిపోయాను" అని ఆవేదన వ్యక్తం చేశాడు కాగా బతికుండగానే చనిపోయారంటూ నెట్టింట పుకార్లు లేపడం కొత్తేమీ కాదు. ఈ మధ్యే సింగర్ లక్కీ అలి కూడా చనిపోయాడంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో తానింకా బతికే ఉన్నానంటూ అతడే స్వయంగా ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ముఖేష్ ఖన్నా విషయానికి వస్తే.. అతడు సినిమాలతో పాటు టీవీ షోలలోనూ కనిపించాడు. శక్తిమాన్ సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. సౌధాగర్, యల్గార్, మేన్ కిలాడీ తు అనారీ వంటి పలు చిత్రాల్లోనూ నటనతో ఆకట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) చదవండి: Amitabh Bachchan: బిగ్ బీ రెండు కోట్ల విరాళం నేను చనిపోలేదు, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా: సింగర్ -
‘సైఫ్.. మాట్లాడే ముందు ఎందుకు ఆలోచించవ్’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో డైరెక్ట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో... ప్రభాస్ రాముడి పాత్రలో నటించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరూ నటించనున్నరనే వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అనేక మంది స్టార్ హీరోయిన్స్ ని పరిశీలించిన చిత్ర యూనిట్ చివరికి కృతి సనన్ ఫైనల్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. చదవండి: ప్రభాస్ మూవీపై కామెంట్.. సారీ చెప్పిన సైఫ్ అలీఖాన్ కాగా ఆదిపురుష్‌లోని రావణ పాత్రపై సైఫ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇటీవల సైఫ్ అలీఖాన్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేశారు. సినిమాలో రావణ పాత్ర చేయడం ఆసక్తికరంగా ఉందన్నారు. రావణుడు సీతను ఎందుకు అపహరించడని, రాముడితో యుద్దం ఎందుకు చేశాడనే కోణంలో సినిమా ఉండబోతుందని వెల్లడించారు. అలాగే రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నామన్నారు. దీంతో సైఫ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వివాదస్పదంగా మారాయి. హిందువులు రాక్షసుడిగా భావించే రావణాసురుడిని సైఫ్ పొగడటం ఓ వర్గానికి నచ్చడం లేదు. సైఫ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్స్ చేశారు. చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు తాజాగా సైఫ్ చెప్పిన క్షమాపన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖేష్ ఓ వీడియోను విడుదల చేశారు. ‘చిత్రనిర్మాతలు ఇప్పటికీ మన మతంపై దాడి చేయడానికి సినిమాలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. లక్ష్మి బాంబు ఇటీవలే పేలింది. ఇప్పుడు మరొక దాడి ప్రారంభమైంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇది చాలా తేలిక అని సైఫ్ ఎందుకు భావిస్తున్నాడో తెలియదు. లంకేష్ మీ బ్యాట్‌తో స్పిన్ చేయాలనుకునే బంతి కాదు. నేను మీ మాటలను అమాయకత్వం అనలా లేక మూర్ఖత్వం అని పిలవాలా?దేశంలోని కోట్ల మంది భారతీయుల విశ్వాసంతో వారు ఆడుతున్నారని, కనీసం అది తమకు తెలుసని లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాలు చెబుతున్నారని వారికి తెలియదు. తనను తాను మేధావి అని పిలిచే దర్శకుడు, నిర్మాతకు ఇలాంటి సినిమాలు చేయాలనే కోరిక ఇంకా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇతర మతాల పాత్రలతో ఇలాంటి ఆట ఆడటానికి ప్రయత్నించండి. చెడును మంచిగా, మంచిని చెడుగా చూపించండి. వారు మిమ్మల్ని కొట్టేస్తారు. రాముడు రావణుడు కాడు. అదే విధంగా రావణుడు రాముడు కాకూడదు. కాబట్టి దయ చేసే రావణుడికి ఈ ఆట ఎందుకు? ఇందులో కూడా ఏదైనా ఉద్దేశ్యం ఉందా? లేదా సినిమా ప్రమోషన్లో భాగమా..అని నేను చెప్పలేను. ప్రజలు దీని గురించి ఆలోచించాలి. నేను చెడుగా భావించాను కాబట్టి నేను ఈ విషయం చెప్పాను. మీరు కూడా ఆలోచించాలి ఇది సరైనదా కాదా అని అన్నారు. సైఫ్ క్షమాపణలు కోరడంపై స్పందిస్తూ.. ‘బాణం వేసి, బాంబ్ విసిరి, ఒకరిని కొట్టి ఆ తర్వాత క్షమించండి అంటే అంగీకరించలేము. మాట్లాడే ముందే మీరు ఎందుకు ఆలోచించరు’ .అంటూ ముగించారు. View this post on Instagram A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) -
మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు
ముంబై: సూపర్ హీరో ‘శక్తిమాన్’ ముఖేష్ ఖన్నా సహానటులపై, సామాజిక విషయాలపై తరచూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన మీ టూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయన మీ టూ ఉద్యమంపై మాట్లాడుతూ.. మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు అని వ్యాఖ్యానించారు. ‘మహిళలు ఇంటి పనికి బాగా సరిపోతారు. అయితే మీ టూ ఉద్యమం మొదలైంది వారి వల్లే. ఎందుకంటే ఇంటి పని చేసుకోవడం మహిళ బాధ్యత. కానీ వారు అది చేయకుండా బయటకు వచ్చి పురుషులకు పోటీ పడటం(పురుషులతో భుజం-భజం కొట్టుకోవడం) ప్రారంభించారు. అందువల్లే మీ టూ ఉద్యమం మొదలైంది. దీనికి బాధ్యత వహించాల్సింది కూడా మహిళలలే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ముఖేష్ కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: దానికంటే చెత్త షో మరొకటి ఉండదు: ముఖేష్ కన్నా) Actor turned right wing rabble rouser Mukesh Khanna says women going out to work and thinking of being equal to men is cause of #metoo pic.twitter.com/1sZ37GudTy — Hindutva Watch (@Hindutva__watch) October 30, 2020 ‘గతంలో మీరు చేసిన పాత్రలకు అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అలాంటి మీ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిరాశపరిచింది’, ‘ఈ వ్యక్తే మనం బాల్యంలో ఆదర్శంగా తీసుకున్న సూపర్ హీరో. చూడండి ఆయన ఆలోచనలు, మాటలు ఎలా ఉన్నాయో’, ‘మహిళలు పని చేయడానికి బయటకు వస్తే పురుషులు లైంగిక వేధింపులకు అర్హులు.. కానీ మహిళలు వారి భద్రత కోసం ఇంట్లోనే ఉండాలా?. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కోంచమైన సిగ్గండాలి ముఖేష్ కన్నా’ అంటూ నెటిజన్లు మండిపడుతూ ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. అయితే హీరోయిన్ సోనాక్షి సిన్హాకేబీసీలో రామాయణంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంపై ఆమెను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక నిర్మాత ఎక్తాకపూర్, ప్రముఖ కామెడీ కపిల్ శర్మ షోలను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అయితే బీఆర్ చొప్రా నిర్మించిన మహాభారతంతో భీష్మ పితామహా పాత్రలో నటించి అందరి మన్నలు పొందారు. అంతేగాక సూపర్ హీరో శక్తిమాన్‌లో లీడ్‌రోల్ చేసి చిన్నారులను ఆకట్టుకున్నారు. (చదవండి: ‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) -
ప్రముఖ కామెడీ షోపై నటుడి సంచలన వ్యాఖ్యలు
ముంబై: ప్రముఖ టీవీ నటుడు ముఖేష్ కన్నా తరచూ సహనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదంలో ఉంటారు. ఇటీవల హీరోయిన్ సోనాక్షి సిన్హాపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ కామెడీ కపిల్ శర్మ షోపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఆ షోకు ఆహ్వానం అందినప్పటికీ హాజరు కాకపోవడంపై గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ఇటీవల మహాభారతం సీరియల్ సభ్యులను కపిల్ శర్మ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో ముఖేష్ కన్నా కూడా ఉన్నారు. కానీ ఆయన షోకు హాజరు కాలేదు. దీంతో భీష్మా పితామాహ మహాభారతం ప్రదర్శనలో ఎందుకు పాల్గొనలేదు అంటూ షోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెతున్నాయి. (చదవండి: ‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) అంతేగాక ఆయనను షోకు ఎందుకు ఆహ్వనించలేదని కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ట్వీట్ చేస్తూ.. ‘నన్ను కపిల్ శర్మ షోకు నిరాకరించారని అందరూ అంటున్నారు. నేనే నిరాకరించానని మరి కొందరు అంటున్నారు. ఏదేమైనా షోకు నాకు ఆహ్వానం అందలేదన్న వార్తల్లో నిజం లేదు. నేనే కపిల్ శర్మ ఆహ్వానాన్ని తిరస్కరించాను. ఎందుకు తిరస్కరించానని కూడా నన్ను అడుగుతున్నారు. కపిల్ శర్మ తన షోకు మహాభారతం టీంను ఆహ్వానించనున్నట్లు గుఫీ నాకు ముందే చెప్పాడు. అప్పుడు మీరు వెళ్లండి నేను రాను అని చెప్పాను’ అని పేర్కొన్నాడు. (చదవండి: ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) అయితే ‘‘ఈ షోకు ప్రముఖ స్టార్ నటులంతా వెళ్తారు.. కానీ ముఖేష్ కన్నా మాత్రం వెళ్లడు. ఎందుకంటే కపిల్ షో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినప్పటికీ.. దాని కంటే చెత్త షో మరోకటి ఉండదని నా అభిప్రాయం. ఈ షో మొత్తం డబుల్ మీనింగ్ పదాలతో నిండి ఉంటుంది. ప్రతి క్షణం అసభ్యత ఉట్టిపడుతోంది. ఇందులో పురుషులు స్త్రీల దుస్తులు ధరించి చెత్త ప్రదర్శన ఇస్తారు. దానిని ప్రజలు నవ్వుతూ కడుపులు పట్టుకుంటారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే లాక్డౌన్ రామాయణం, మహాభారతం సీరియల్లు తిరిగి పున: ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ తన షోకు మహాభారతం తారాగాణాన్ని ఇటీవల ఆహ్వానించాడు. దీనికి నితీష్ భరద్వాజ్, పునీత్ ఇస్సార్, ప్రదీప్ కుమార్, గజేంద్ర చౌహాన్, గుఫీ పెయింట, అర్జున్ ఫిరోజ్ ఖాన్లు హాజరయ్యారు. View this post on Instagram Baat ki khaal, aao 🐃 behas kare’n 🤪 #thekapilsharmashow #comedy #comedyvideos #fun #laughter #weekend #masti #family #familytime don’t miss it this weekend 🥳🥳🥳🤪🤪 A post shared by Kapil Sharma (@kapilsharma) on Oct 1, 2020 at 9:55am PDT -
‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’
సోనాక్షి సిన్హా పేరును కేవలం ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించానని బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా సమాధానమిచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం దూరదర్శన్‌లో పునఃప్రసారమవుతున్న రామాయణం, మహాభారతం వంటి కార్యక్రమాలు భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. ముకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. (వినూత్న వేషం.. 150 కిమీ నడక ) రామాయణంపై సోనాక్షిని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని, ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉందంటూ ఘూటు విమర్శలు చేశారు. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారని, సోనాక్షి వంటి కూతురుకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదని, ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. (ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు) తన వ్యాఖ్యలపై శత్రుఘ్న ఫైర్ అవ్వడంతో తాజాగా సోనాక్షిపై చేసిన వ్యాఖ్యలను ముకేష్ ఖన్నా సమర్థించుకున్నాడు. సోనాక్షి సిన్హా పేరును ఒక ఉదాహరణగా మాత్రమే వెల్లడించానని, ఆమెను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. సోనాక్షి జ్ఙానాన్ని ప్రశ్నించలేదని, ఆమెను టార్గెట్ చేయడం తన ఉద్ధేశ్యం కాదని తెలిపారు. తన మాటలను శత్రుఘ్న తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తమ మధ్య (శత్రుఘ్న ) చాలా కాలం నుంచి పరిచయం ఉందని. శత్రుఘ్న పట్ల తనకు గౌరవం ఉందన్నారు. అలాగే ‘రామాయణం, హిందూ సాహిత్యానికి సంరక్షకుడిని అని నేను అనడం లేదు. ప్రస్తుత తరం కేవలం హ్యారీ పోటర్, టిక్‌టాక్ పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. భారత పౌరుడిగా దేశ చరిత్రను, సాహిత్యాన్ని వారికి తెలియజేయడం మన కర్తవ్యం. ఇందుకు సోనాక్షి పేరును ఉపయోగించడం శత్రుఘ్న తప్పుగా భావిస్తున్నాడు. కానీ అది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు’. అని తన వ్యాఖ్యాలపై సమధానమిచ్చారు. (శ్రియ భర్తకు కరోనా లక్షణాలు? ) -
ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్షాపై నటుడు ముఖేష్ కన్నా చేసిన వ్యాఖ్యలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా ఘాటుగా స్పందించారు. సోనాక్షికి తండ్రిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఇక బిగ్‌బీ హోస్టుగా వ్యవహరించిన ‘కోన్ బనేగా కరోడ్ పతి’ షోకు అతిథిగా వచ్చిన సోనాక్షి రామాయణాయానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమధానం ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన ఆ ఒక్క సమాధానం ఇవ్వనంతా మాత్రాన ఆమెకు హిందు పురాణాలపై అవగాహన లేదని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. కాగా దేశంలో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో రామాయణం, మహా భారతం వంటి ఇతిహాసాలను దూరదర్శన్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనిపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా స్పందిస్తూ.. రామాయణం, మహాభారతం పునఃప్రసార కార్యక్రమం భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. (నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి) ఇక ముకేష్ ఖన్నా వ్యాఖ్యలపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. పరోక్షంగా ముకేష్ ఖన్నాపై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి పేరును ప్రస్తావించకుండా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శత్రుఘ్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామాయణంపై అడిగిన ఒక ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉంది. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారు’ అని పరోక్షంగా ముకేష్‌పై విరుచుకుపడ్డారు. (పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా: చిరు) అలాగే.. ‘సోనాక్షితో సహా తన ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. సోనాక్షి కెరీర్‌ను నేను ప్రారంభించాల్సిన అవసరం లేదు. తన సొంత కాళ్లపై నిలబడి స్టార్ అయ్యింది. తను కుమార్తెగా ఉన్నందుకు ఏ తండ్రి అయినా గొప్పగా ఫీల్ అవుతాడు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదు. ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదు.’ అని ముకేష్ మాటలకు ఘాటుగా సమాధానమిచ్చారు. (ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) -
ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో
నిర్మాత ఎక్తా కపూర్ మహభారతాన్ని చంపేసిందంటూ నటుడు ముఖేష్ ఖన్నా ఆమెపై విరుచుకుపడ్డారు. 2008లో వచ్చిన ‘కహానీ హమారా మహాభారతం’ సీరియల్‌ను ఎక్తా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ నేపథ్యంలో ఈ సీరియల్ పునః ప్రసారం అవుతుంది. కాగా ముఖేష్ ఖన్నా హీరోగా నటించిన ‘శక్తిమాన్’ను కూడా పునః ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘శక్తిమాన్’ న్యూ వర్షన్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నాం. అయితే ఇది ఎక్తా ‘మహాభారతం’ తరహాలో ఉండదు. ఈ సీరియల్లో ద్రౌపతి పాత్రకు భుజంపై టాటూ ఉంటుంది. అయితే ఎక్తా మహాభారతాన్ని ఆధునికంగా తీస్తున్నట్లు సీరియల్ మొదట్లోనే చెప్పారు. సంస్కృతి అనేది ఎప్పుటికీ ఆధునికమైనది కాదు.. కాలేదు కూడా. ఒకవేళ ఆధునికం చేయాలని ప్రయత్నించిన రోజే.. సంస్కృతి అంతమైపోతుంది’ అని మండిపడ్డారు. ఒకవేళ ఈ సీరియల్ పేరు ‘క్యుంకీ గ్రీక్ భీ కబీ హిందూస్థానీ’ అయుంటే తాను ఎక్తా ‘మహాభారతాన్ని’ సమర్థించేవాడినని అన్నారు. ఒక ఇతిహాసాన్ని మార్చే హక్కు వారికి ఎవరూ ఇచ్చారని విమర్శించారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి కంటే ఎక్తా తెలివిగా ఉండాలని ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. రామయణం, మహాభారతాలు పురాణాలు మాత్రమే కాదని, అవి మన భారతదేశ చరిత్రలుగా ఎత్తిచూపాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. (మహాభారతం తిరిగి వచ్చేసింది) -
'పిల్లలు ఏవైతే చూడకూడదో అవే చూస్తున్నారు'
ముంబయి: సినిమాల్లోగాని, టీవీ కార్యక్రమాల్లోగానీ పిల్లలకు తగిన అంశాలేవీ కూడా ఉండటం లేదని ప్రముఖ నటుడు, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చైర్పర్సన్ ముఖేశ్ ఖన్నా(శక్తిమాన్) అన్నారు. 'భారతదేశంలో వీక్షించడానికి పిల్లలకు తగిన అంశమేది లేదు. వారు ఏమైతే చూడకూడదో అదే చూడాల్సి వస్తోంది. వారు ఇప్పుడు చూస్తున్న సీరియల్స్గానీ, సినిమాలుగానీ నిజంగా వారికోసం కావు' అని అన్నారు. మంగళవారం చిదియాఖానా అనే బాలల చిత్రం షూటింగ్ వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'నేను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగానే నిర్ణయించుకున్నాను. కేవలం పండుగల సందర్భాల్లోనే కాకుండా మిగితా సమయాల్లో కూడా పిల్లలకు సంబంధించిన సినిమాలు థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. థియేటర్లలో ఈ సినిమాలు విడుదల చేయకుంటే అవి ఎప్పటికీ వారిని చేరుకోలేవు' అని చెప్పారు.