
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ది కపిల్ శర్మ షో. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోకు హాజరవుతుంటారు. అయితే ఈ షో బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను తాను చూడడని.. వినోదం కంటే అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.
ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ..'ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ చేసేందుకు కపిల్ శర్మ కష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ది కపిల్ శర్మ షో, బిగ్‌బాస్‌ను కూడా నేను చూడను. ఎందుకంటే వాటిలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అది నాకు అస్సలు నచ్చదు. మరో రెండు సంఘటనల వల్ల నాకు కపిల్ అంటే చిరాకు కలిగింది. గతంలో ఓసారి ఆయన షో చూశా అందులో శక్తిమాన్ గెటప్ వేసుకొని.. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు. మేము ఎంతో గొప్పగా ఆ పాత్రను సృష్టిస్తే.. అలా చేయడం నచ్చలేదు. అవార్డుల ఫంక్షన్‌లో కూడా ఓసారి ఇలాగే ప్రవర్తించాడు. నా పక్కనే కూర్చున్నప్పటికీ నన్ను పలకరించలేదు. అందుకే అతనిపై ఉన్న కాస్తా గౌరవం కూడా పోయింది' అని ముఖేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బీటౌన్‌లో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment