Kapil Sharma
-
అట్లీ కలర్‌పై కామెంట్స్.. గొర్రెలాగా అనుసరించొద్దు: నెటిజన్‌కు కపిల్ శర్మ కౌంటర్
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తన షోలో ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీని అభ్యంతకరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టార్‌గా ఎదిగారు.. ఎవరైనా స్టార్‌ను మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు అతనికి మీరు కనిపించారా? అంటూ కలర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి అట్లీ సైతం రిప్లై కూడా ఇచ్చారు. ఎవరినైనా సరే రూపాన్ని చూసి ఓ అంచనాకు రాకండి.. అతని హృదయాన్ని చూసి చెప్పాలంటూ సమాధానమిచ్చారు.అయితే ఈ షోలో అట్లీని అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కపిల్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లీ కలర్‌పై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అట్లీకి క్షమాపణలు చెప్పాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌పై కపిల్ శర్మ స్పందించారు.తనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కపిల్ శర్మ బదులిచ్చారు. డియర్ సర్.. నేను ఈ వీడియోలో అట్లీ లుక్స్ గురించి మాట్లాడినట్లు దయచేసి నాకు వివరించగలరా? దయచేసి సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మీకు ధన్యవాదాలు. అంతే కాదు అబ్బాయిలు మీ నిర్ణయం మీరే తీసుకోండి.. అంతేకానీ గొర్రెలాగా ఎవరో చేసిన ట్వీట్‌ను అనుసరించవద్దు' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే మరికొందరేమో కపిల్ శర్మ కామెంట్స్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. Dear sir, can you pls explain me where n when I talked about looks in this video ? pls don’t spread hate on social media 🙏 thank you. (guys watch n decide by yourself, don’t follow any body’s tweet like a sheep). https://t.co/PdsxTo8xjg— Kapil Sharma (@KapilSharmaK9) December 17, 2024 -
స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్‌ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్‌కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ కమెడియన్.. దివాళా తీయాల్సి వచ్చింది!
సినీ ఇండస్ట్రీలో రిచెస్ట్ కమెడియన్ ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకు వస్తుంది. అంతలా ఫేమస్ అయ్యారు కమెడియన్ కపిల్ శర్మ. ది కపిల్ శర్మ షో ద్వారా బాలీవుడ్ మరింత ఫేమస్ అయ్యాడు. ఇటీవలే జ్విగాటో సినిమాతో ప్రేక్షకులను అలరించిన కపిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తకర విషయాలు పంచుకున్నారు.గతంలో తాను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయని కపిల్ శర్మ తెలిపారు. ఫిరంగి, సన్ ఆఫ్ మన్జీత్ సింగ్ చిత్రాలు ఆర్థికంగా చాలా దెబ్బ కొట్టాయని వెల్లడించారు. ఈ రెండు సినిమాలతో నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన భార్య సహకారంతోనే మళ్లీ తిరిగి కోలుకున్నట్లు కపిల్ శర్మ తెలిపారు.కాగా.. ఫిరంగి చిత్రంలో కపిల్ శర్మతో పాటు ఇషితా దత్తా, మోనికా గిల్ నటించారు. ఈ సినిమాకు రాజీవ్ దర్శకత్వం వహించారు. 2017లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పంజాబీలో తెరకెక్కించిన సన్ ఆఫ్ మంజీత్ సింగ్ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రానికి విక్రమ్ గ్రోవర్ దర్శకత్వం వహించారు. అంతకుముందు 2015లో తెరకెక్కిన కిస్ కిస్కో ప్యార్ కరోతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా
బాలీవుడ్లో స్టాండప్ కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మ నటించిన జ్విగాటో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నందిత దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. షహానా గోస్వామి హీరోయిన్గా నటించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండేళ్ల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానుంది.భువనేశ్వర్ నేపథ్యంలో సాగే ఫుడ్ డెలివరీ బాయ్ కథ ఇది. జ్విగాటో మూవీలో సాధారణ ప్రజల జీవితాన్ని ఎంతో అద్బుతంగా డైరెక్టర్ నందిత దాస్ చూపించారు. అయితే, ఈ సినిమా టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం, బుసాన్ అంతర్జాతీయ చిత్రోత్సవం వంటి వేదికలపై ప్రదర్శితమైంది. తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.సాధారణ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తూ ఉద్యోగం కోల్పోయాక ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారాల్సి వస్తుంది. అయితే, ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడనేది అసలు కధ. ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. ఐఎండీబీలో రేటింగ్ కూడా మెరుగ్గానే ఉంది. -
అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సీనియర్ నటుడు ఆగ్రహం
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ది కపిల్ శర్మ షో. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోకు హాజరవుతుంటారు. అయితే ఈ షో బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను తాను చూడడని.. వినోదం కంటే అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ..'ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసేందుకు కపిల్ శర్మ కష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ది కపిల్ శర్మ షో, బిగ్‌బాస్‌ను కూడా నేను చూడను. ఎందుకంటే వాటిలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అది నాకు అస్సలు నచ్చదు. మరో రెండు సంఘటనల వల్ల నాకు కపిల్ అంటే చిరాకు కలిగింది. గతంలో ఓసారి ఆయన షో చూశా అందులో శక్తిమాన్ గెటప్ వేసుకొని.. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు. మేము ఎంతో గొప్పగా ఆ పాత్రను సృష్టిస్తే.. అలా చేయడం నచ్చలేదు. అవార్డుల ఫంక్షన్లో కూడా ఓసారి ఇలాగే ప్రవర్తించాడు. నా పక్కనే కూర్చున్నప్పటికీ నన్ను పలకరించలేదు. అందుకే అతనిపై ఉన్న కాస్తా గౌరవం కూడా పోయింది' అని ముఖేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. -
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్‌మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్‌లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్‌గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్‌పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో బాలీవుడ్ నటులైన హుమా ఖురేషి, కపిల్ శర్మ, హీనా ఖాన్లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షుల హోదాలో ముగ్గురు నటులను విచారించనున్నట్లు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ప్రకారం వీరు ముగ్గురూ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వీరు డబ్బును కూడా స్వీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి కూడా కపిల్ శర్మ హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు) గడువు కోరిన రణ్‌బీర్ కపూర్! అయితే ఇప్పటికే అక్టోబర్ 6న అధికారుల ముందు హాజరు కావాలని నటుడు రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అయితే హాజరయ్యేందుకు రెండు వారాల మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహదేవ్ యాప్‌కి సంబంధించిన ప్రమోషన్ల కోసం అతను అందుకున్న మొత్తం... అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల గురించి వివరణ కోరాలని ఈడీ భావిస్తోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఏంటి? మహాదేవ్ బుక్ యాప్ అనేది ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరి 2023లో దుబాయ్‌లో తన వివాహ వేడుక కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, కృష్ణ, అభిషేక్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కాగా.. చంద్రాకర్.. మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌తో కలిసి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ముసుగులో బినామీ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. (ఇది చదవండి: రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?) ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources (file pics) pic.twitter.com/rKXxUgtucl — ANI (@ANI) October 5, 2023 -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్‌వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో చక్కటి ఫాం హౌస్‌తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్‌తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్‌ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్‌లో అందమైన ఫామ్‌హౌస్‌ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్‌హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్‌వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్‌లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్బుక్ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? ) మహిళతో సహజీవనం.. వేధింపులు అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఆమె వల్లే అప్పులు చేశా ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం. - కె.తారకరామ కుమార్ (ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) -
డబ్బు, గుర్తింపు ఉన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: కమెడియన్
నటించడం సులువేమో కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నటులే ఒప్పుకున్నారు. అయితే పైకి నవ్వుతూ కనిపించినంతమాత్రాన వారి జీవితాల్లో ఏ కష్టాలూ లేవనుకుంటే పొరపాటే! లోపల ఎన్ని బాధలున్నా బయటకు మాత్రం చిరునవ్వుతోనే దర్శనమిస్తారు. తాజాగా ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ ఒకానొక దశలో మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. నందితా దాస్ 'జ్విగాటో' సినిమాలో కపిల్ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్లలో తాను డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించాడు. 'ఒక సెలబ్రిటీగా కోట్లాది మందికి నేను తెలుసు.. ఎందుకంటే నేను వారికి వినోదాన్ని పంచుతాను. కానీ ఇంటి లోపల అడుగుపెట్టాక ఒంటరివాడిని అనిపించేది. సముద్రం ఒడ్డుకు వెళ్లి అలల అందాన్ని చూడాలనుకున్నా అది నాకు సాధ్యపడదు. రెండు గదుల రూములో ఒక్కడినే ఉండేవాడిని. సాయంత్రానికే అంతా చీకటయ్యేది. అప్పుడు నేనెంత విచారంగా ఫీలయ్యానో మాటల్లో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లైతే ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నా గుండెలోని బాధను చెప్పుకుని మనసు తేలిక చేసుకోవడానికి నాకంటూ ఎవరూ లేరని భావించాను. మానసికంగా కుంగిపోయాను. అలా జరగడం అదే మొదటిసారని నేను చెప్పను. నా బాల్యంలోనూ నేను ఒంటరితనాన్ని ఫీలయ్యాను. కానీ ఎవరూ దాన్ని గుర్తించలేదు. తర్వాత బాగానే పేరు తెచ్చుకున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ నాకంటూ ఎవరూ లేరు అన్న బాధ నన్ను వెంటాడేది. ఒక ఆర్టిస్టు అమాయకుడిగా ఉన్నాడంటే అతడు పిచ్చోడేం కాదు. కానీ నా చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించేకొద్దీ నా కళ్లు తెరుచుకున్నాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఏవీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు కపిల్ శర్మ. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్
బాలీవుడ్ స్టార్ కమెడియన్లలో కపిల్ శర్మ ఒకరు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించే ద కపిల్ శర్మ షో కొత్త సీజన్ త్వరలో మొదలు కాబోతోంది. దీనికోసం కమెడియన్ కొత్త అవతారమెత్తాడు. మరింత యంగ్‌గా తయారై ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ మేరకు ఓ ఫొటోను తన ట్విటర్లో వదిలాడు కపిల్. కొత్త సీజన్ కోసం కొత్త లుక్.. త్వరలోనే రాబోతున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో బ్లాక్ టీ షర్ట్‌పైన వైట్ కోట్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు కపిల్. అంతేకాదు, మునుపటి కంటే బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. అతడి లుక్ చూసి షాకైన అభిమానులు 'ఏంటి సర్, మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేకున్నాం.. మీ వయస్సును ఎలా రివర్స్ చేసుకోగలుగుతున్నారు?', 'వయసు పెరుగుతున్నా నిత్యం యంగ్‌గా ఉండే అనిల్ కపూర్ నుంచి ఏదైనా రహస్యాన్ని రాబట్టారేమో!', 'మీరు ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తున్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కపిల్ శర్మ షో మూడో సీజన్ ఈ ఏడాది జూన్‌లో ప్రసారమైంది. మరి నాలుగో సీజన్‌ను ఎప్పుడు మొదలు పెడ్తారనేది అధికారికంగా వెల్లడించేవరకు వేచి చూడాల్సిందే! ఇకపోతే ఈ షోలో కృష్ణ అభిషేక్, కికు శారద, సుదేశ్ లాహిరి, భారతీ సింగ్, సుమోన చక్రవర్తి పలువురు ఉండనున్నారు. New season, new look 🤩 #tkss #comingsoon 🙏 pic.twitter.com/Q9ugqzeEJO — Kapil Sharma (@KapilSharmaK9) August 21, 2022 చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు -
స్టార్ కమెడియన్ చెంప పగలగొట్టి బయటకు గెంటేశా: డైరెక్టర్
గదర్: ఏక్ ప్రేమ కథ.. బాలీవుడ్‌లోని మోస్ట్ ఐకానిక్ చిత్రాల్లో ఇది ఒకటి. సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరోహీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ డైరెక్టర్ టీను వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఇప్పటి స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కూడా నటించాడట. కానీ అతడి పార్ట్‌ను ఎడిటింగ్‌లో తీసేశారు. దానికన్నా ముందు అతడిని కొట్టి మరీ సెట్స్ నుంచి తరిమేశారట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా చెప్పుకొచ్చాడు. 'అది ఒక రైలు సన్నివేశం. సెట్స్‌లో చాలామంది ఉన్నారు. అందరూ రైలు వెంబడి పరిగెత్తాలని చెప్పాను. యాక్షన్ అనగానే అందరూ అదే చేశారు, ఒక్క వ్యక్తి తప్ప.. అతడే కపిల్. అందరూ ఒక వైపు పరిగెడుతుంటే కపిల్ మాత్రం రివర్స్‌లో పరిగెడుతున్నాడు. ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్పాను. నీవల్ల పదేపదే రీటేక్ తీసుకోవాల్సి వస్తోంది. సరిగ్గా చేయు అని ఎన్నిసార్లు హెచ్చరించినా అతడు తీరు మార్చుకోలేదు. నేను చెప్పింది కాకుండా తనకు నచ్చింది చేశాడు. దీంతో కోపం వచ్చి కెమెరా ఆఫ్ చేసి కపిల్ వెంట పరిగెత్తి అతడి చెంప చెల్లుమనిపించాను. వెంటనే అతడిని ఇక్కడి నుంచి పంపించేయమని అక్కడున్నవాళ్లకు చెప్పడంతో వాళ్లు అతడిని బయటకు గెంటేశారు' అని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ టీనూ వర్మ ఇక ఇదే సంఘటనను కపిల్ శర్మ టాక్ షోలోనూ బయటపెట్టాడు కపిల్. 'డైరెక్టర్ చెప్పినదానికి నేను వ్యతిరేక డైరెక్షన్లో పరిగెత్తాను.. అలా నాకు చీవాట్లు చెంపదెబ్బలు పడ్డాయి. సినిమా రిలీజయ్యాక నేను నటించిన సీన్ చూపిద్దామని మా ఫ్రెండ్స్‌తో థియేటర్‌కు వెళ్లాను. కానీ తీరా నేను ఉండే సన్నివేశాన్ని తొలగించారని అర్థమైంది' అని పేర్కొన్నాడు. చదవండి: నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్ సుహాస్ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్ లుక్కిచ్చారు -
ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్
సోషల్ మీడియాలో సెలబ్రెటీ షాకింగ్ ఫొటో దర్శనం ఇచ్చింది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రముఖ హాస్య నటుడు డెలివరి బాయ్‌గా అవతారం ఎత్తి ఒడిసా రోడ్లపై కనిపించాడు. ఇక ఆయనను లైవ్‌గా చూసిన వారంత నమ్మలేక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకి ఆ నటుడు ఎవరంటే బాలీవుడ్ పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ. ఆయన ఫుడ్ డెలివరి చేస్తూ ఒడిసా రోడ్లపై కనిపించాడు. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్ ఆయనను దగ్గరగా చూసినవారు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆయన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం కపిల్ శర్మ నటి, దర్శకురాలు నందిత దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన ఫుడ్ డెలివరి బాయ్ పాత్రలో కనిపించానున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ ఒడిసాలో షూటింగ్‌ను జరుపుకుంది. అక్కడ ఎల్లో కలర్ టీ-షర్ట్, డెలివరి బ్యాగ్, బ్లాక్ హెల్మెట్‌తో ద్విచక్ర వాహనంపై వెళుతూ కనిపించాడు. ఇక ఆయనను అలా చూసిన ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. దీనికి ‘సర్ మిమ్మల్ని నేను లైవ్‌లో చూశాను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్‌పై కపిల్ స్పందిస్తూ.. ‘ఎవరికి చెప్పకు’ అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ షోతో స్టార్ కమెడియన్‌గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. Kisi ko batana mat 🤓 https://t.co/3rCAjuPKva — Kapil Sharma (@KapilSharmaK9) March 18, 2022 -
డెలీవరీ బాయ్‌గా కమెడియన్ కపిల్ శర్మ
Kapil Sharma To Play Food Delivery Boy In Nandita Das Film: నందితా దాస్ మంచి నటి మాత్రమే కాదు.. మంచి దర్శకురాలు కూడా. 2008లో ‘ఫిరాక్’ చిత్రం ద్వారా దర్శకురాలిగా మారిన నందిత ఆ తర్వాత పదేళ్లకు ‘మాంటో’ చిత్రం తెరకెక్కించారు. ఈ గ్యాప్‌లో ఓ షార్ట్ ఫిలిం చేశారు. తాజాగా దర్శకురాలిగా మరో సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో టీవీ వ్యాఖ్యాత కపిల్ శర్మ మెయిన్ లీడ్ చేయనున్నారు. ఇందులో కపిల్ ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. సహానా గోస్వామి కథానాయిక. ‘‘మీ ఆర్డర్ స్వీకరించాం’’ అంటూ, ‘‘ఒక కామన్ మేన్ కథ ఇది అని, ఈ పాత్రకు కపిల్ సరిపోతారనిపించి తీసుకున్నాను’’ అని నందితా దాస్ పేర్కొన్నారు. -
అక్షయ్‌తో వివాదం.. వివరణ ఇచ్చిన ప్రముఖ కమెడియన్
Kapil Sharma Gave Clarity On Rift Between Him And Akshay: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ కమెడియన్లో నటుడు కపిల్ శర్మ ఒకరు. కమెడీ నైట్ విత్ కపిల్ శర్మ షో ఆయన ఎంతో పాపులర్ అయ్యారు. సినీ సెలబ్రెటీలతో చిట్‌చాట్ నిర్వహించి తనదైన కామెడీ పంచ్‌లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే కమెడియన్లో కపిల్ శర్మ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తన సినిమాల ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గతంలో పలుమార్లు ఈ షోలో పాల్గొన్నారు. చదవండి: Trolls On Kajal Aggarwal: కాజల్ బాడీపై ట్రోల్స్.. మద్దుతుగా నిలిచిన సమంత, లక్ష్మి మంచు ఈ క్రమంలో ఈ షోలో జరిగిన ఓ ఘటనపై అక్షయ్, కపిల్‌పై కోపంగా ఉన్నాడని, అందుకే తన తాజా చిత్రం బచ్చన్ పాండే ప్రమోషన్ కోసం ఈ షోకు రావడం లేదంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వివాదం బాగా ముదరడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వారిద్దరిపై వస్తున్న వార్తలపై రిసెంట్‌గా కపిల్ శర్మ స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అక్షయ్‌కి నాకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను చూశాను. అవును మా మధ్య చిన్నపాటి డిస్టబెన్స్ వచ్చింది. కానీ అప్పుడే దానిపై అక్షయ్‌తో మాట్లాడాను. సమచార లోపంతోనే ఇది జరిగింది. ఆ వెంటనే అక్షయ్‌కి ఫోన్ చేసిన మాట్లాడి వివరణ ఇచ్చాను. ఇప్పుడు అంతా సర్థుకుంది. చదవండి: రణ్‌బీర్‌తో నాకు పెళ్లయిపోయింది.. బయటపెట్టిన ఆలియా త్వరలోనే ఆయన బచ్చన్ పాండే ప్రమోషన్ కోసం మా షోలో సందడి చేయనున్నారు, అక్షయ్ నాకు పెద్దన్నలాంటివారు. ఆయన ఎప్పుడు నాపై కోపంతో ఉండరు’ అంటూ వివరణ ఇచ్చారు. కాగా ఇటీవల ఆత్రంగి రే మూవీ ప్రమోషన్స్ కోసం అక్షయ్ కుమార్ కపిల్ శర్మ షోకు వచ్చారు. ఈ సందర్భంగా అక్షయ్ గతంలో ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూలో చేయడంపై కపిల్ ఈ షో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్య్వూలో కపిల్ పలు సరదా ప్రశ్నలు వేసి అక్షయ్‌ని ఆటపట్టించారు. అయితే ఇది ఎడిటింగ్‌లో తీసేయాలని అక్షయ్ చెప్పడంలో షో నిర్వహకులు ఒకే అన్నారు. కానీ తీరా చూస్తూ ఈ సన్నీవేశాలు అనుకొకుండా నెట్టింట లీక్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహరంలోనే అక్షయ్, కపిల్‌పై కోపంగా ఉన్నారని సమాచారం. Dear friends,was reading all the news in media about me n Akshay paji, I have jus spoke to paji n sorted all this, it was jus a miss communication, all is well n very soon we r meeting to shoot Bachhan pandey episode. He is my big bro n can never be annoyed with me 😊thank you 🙏 — Kapil Sharma (@KapilSharmaK9) February 8, 2022 -
ఈ స్టార్ కమెడియన్ ఒక మిలియనీర్ !.. ఆస్తులు ఎంతంటే ?
Kapil Sharma Will Become Millionaire With His Shows: బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మతో స్టార్ కమెడియన్‌గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా కపిల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ స్టార్ కమెడియన్‌పై త్వరలో బయోపిక్ కూడా రానుంది. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఇదిలా ఉంటే పలు నివేదికల ప్రకారం కపిల్ శర్మ మొత్తం ఆస్తులు రూ. 242 కోట్లు అని తెలుస్తోంది. నెలకు రూ. 3 కోట్లకుపైగా సంపాదిస్తున్నాడట కపిల్. కపిల్ శర్మ తన నెల మొత్తం సంపాదనతో ఒక లక్జీరియస్ ఇల్లు కొనగలడని సమాచారం. ఇప్పటికే కపిల్ శర్మ ఇల్లు ముంబైలోని చాలా పాష్ ఏరియాలో ఉందట. ఇంతేకాకుండా అతను టీవీ ఎపిసోడ్ కోసం రూ. 40 నుంచి 90 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. కపిల్ శర్మకు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఆస్తులున్నాయట. ఇవికాకుండా మెర్సిడెస్ బెంజ్, వోల్వో ఎక్స్‌సీ 90, రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్డీ4 వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే ఈ స్టార్ కమెడియన్ ఒక రకంగా మిలియనీర్ అని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో 'ఐయామ్ నాట్ డన్ ఎట్' షోకు హోస్ట్‌గా కూడా చేస్తున్నాడు కపిల్. -
అర్ధరాత్రి షారుక్ ఇంటికి తాగి వెళ్లాను, అప్పుడు..: కమెడియన్
నటుడు, కమెడియన్ కపిల్ శర్మ ఓసారి పిలవని పార్టీకి వెళ్లాడట. అది కూడా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇంట్లో జరుగుతున్న పార్టీకి! తాజాగా ఈ విషయాన్ని ఆయన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న 'కపిల్ శర్మ: ఐయామ్ నాట్ డన్ ఎట్' అనే షోలో వెల్లడించాడు. 'కపిల్ శర్మ షోతో నాకు మంచి పాపులారిటీ వచ్చింది. కానీ ఇది నాలో కొన్ని తప్పుడు ఆలోచనలకు సైతం బీజం పోసింది. నా కజిన్ మన్నాత్లోని షారుక్ ఖాన్ ఇంటిని చూడాలని ఉందని చెప్పింది. అప్పుడు నేను తాగి ఉన్నాను. అయినా సరే అదేం పట్టించుకోకుండా చలో అంటూ కారు తీసుకుని వెళ్లాం. అక్కడ పార్టీ జరుగుతోంది. సెక్యూరిటీ గార్డులు నన్ను చూసి పార్టీకి ఆహ్వానించారేమోననుకుని గేట్లు తెరిచారు. లోపలకు ఎంటర్ అయ్యాం కానీ మేము చేస్తోంది తప్పనిపించింది. ఉన్నపళంగా బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అంతలోనే షారుక్ మేనేజర్ మమ్మల్ని చూసి లోనికి ఆహ్వానించాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 3 అవుతోంది. నేను నిక్కర్ వేసుకుని ఉన్నాను. అలాగే ఇంట్లో అడుగు పెట్టగా ఎదురుగా షారుక్ భార్య గౌరీ మేడమ్ తన ఫ్రెండ్స్‌తో ఉన్నారు. ఆమె కూడా నాకు ఇన్విటేషన్ అందిందేమోననుకుని పలకరించింది. షారుక్ లోపల ఉన్నాడంటూ ఓ గదివైపు వెళ్లమని సూచించింది. అలా గదిలోకి వెళ్లగానే ఆయన ఎప్పటిలాగే డ్యాన్స్ చేస్తున్నారు. కొంత కంగారుపడుతూనే తన దగ్గరకు వెళ్లి.. భాయ్ సారీ.. నా కజిన్ మీ ఇల్లు చూడాలనుందంటే తీసుకువచ్చాను అని చెప్పాను. అప్పుడతను నువ్వు ఇంట్లోకేంటి.. నా బెడ్రూమ్లోకి కూడా రావచ్చన్నాడు. ఆ తర్వాత ఇద్దరం డ్యాన్స్ చేశాం. తిరిగి వెళ్లేటప్పుడు అక్కడి స్టాఫ్ నాతో ఫొటోలు తీసుకున్నారు. వాటిని షారుక్ స్వయంగా తీశాడు' అని చెప్పుకొచ్చాడు. -
పాపులర్ కమెడియన్‌పై బయోపిక్.. అతనెవరంటే ?
Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్‌లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు, క్రికెట్ దిగ్గజాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వంటివారిపైనై ఈ బయోపిక్‌లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్‌పై ఎలాంటి బయోపిక్ తీయలేదు. దీన్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ కమెడియన్‌పై తాజాగా బయోపిక్ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్ పాపులర్ హిందీ కామెడీ టాక్ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' హోస్ట్ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్ ద్వారా తెలిపాడు. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్ జైన్ తెలిపారు. BIOPIC ON KAPIL SHARMA: 'FUKREY' DIRECTOR TO DIRECT... A biopic on #KapilSharma has been announced... Titled #Funkaar... #MrighdeepSinghLamba - director of #Fukrey franchise - will direct... Produced by #MahaveerJain [#LycaProductions]... #Subaskaran presents. #KapilSharmaBiopic pic.twitter.com/7LxhfKt4r6 — taran adarsh (@taran_adarsh) January 14, 2022 ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది: సోనూసూద్
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తాజా ఎపిసోడ్లో సోనూసూద్, కపిల్ శర్మ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా తన తల్లి సరోజ్ సూద్‌ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు సోనూసూద్. ‘మా అమ్మగారికి ఉత్తరాలు రాసే అలవాటు ఉంది. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ నాకు ఉత్తరాలు రాసేవారు అమ్మ. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం.. అయినా ఉత్తరాలెందుకు? అని మా అమ్మ గారిని ఓ సందర్భంలో అడిగాను. ‘నేను నిన్ను విడిచి వెళ్లిపోయినప్పుడు ఈ ఉత్తరాలు నీ దగ్గర ఉంటాయి. ఫోన్ రికార్డ్స్ చెరిగిపోతాయి’అన్నారు. మా అమ్మ రాసిన లేఖలు(దాదాపు 25)నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ నాతో లేరు. కానీ ఆ ఉత్తరాలు చదువుతుంటే మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. నేను కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది’ అన్నారు సోనూసూద్. అలాగే సరోజ్ రాసిన ఓ లేఖను షోలో చదివి వినిపించారాయన. -
‘మీకు డబ్బులు ఎలా వస్తాయి’.. నా భర్త చాలా కష్టపడతాడు: శిల్పా శెట్టి
Raj Kundra Arrest: లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. ఆ తర్వాత వారితో బలవంతంగా అడల్ట్ చిత్రాలు నిర్మించి.. వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడనే ఆరోపణల మీద పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా ఆదాయం గురించి భార్య శిల్పా శెట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కపిల్ శర్మ షోకు ఓ సారి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, సోదరి షమితా శెట్టి గెస్ట్లుగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ, రాజ్ కుంద్రాను ఉద్దేశిస్తూ.. ‘‘మీరు ఎప్పుడు చూసినా టైం పాస్ చేస్తూ.. జాలీగా గడుపుతారు. ఇంత లగ్జరీ బతకడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది.. అసలు ఏం పని చేయకుండా మీకు డబ్బు ఎలా వస్తుందని’’ ప్రశ్నిస్తాడు. అంతేకాక ‘‘మీరు ఎప్పుడు చూసినా పార్టీలకు వెళ్తూ, భార్యతో షాపింగ్ అంటూ తిరుగుతారు. సినీ తారలతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతుంటారు. ఇన్ని పనులు చేస్తూ, బిజీగా ఉంటారు.. మీకు డబ్బులు సంపాదించడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది’’ అని కపిల్ శర్మ ప్రశ్నిస్తాడు. అందుకు శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, షమితా ముగ్గురు పెద్ద పెట్టున నవ్వుతారు. ఆ తర్వాత శిల్పా శెట్టి బదులిస్తూ.. ‘‘నా భర్త చాలా కష్టపడతారు.. ఒక్కోసారి ఆయన గంటలకొద్ది పని చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్ అనేది దొరకదు’’ అని సమాధానం చెప్పారు. ఏళ్ల నాటి ఈ వీడియో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజనులు ‘‘కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇన్నాళ్లకు సరైన సమాధానం లభించింది’’.. ‘‘సినిమా అవకాశాల పేరుతో యువతుల జీవితాలను నాశనం చేస్తూ.. తాను మాత్రం ఖరీదైన జీవితం గడుపుతున్నాడు’’.. ‘‘అవును పాపం.. పోర్న్ సినిమాలు తీయడానికి.. అమాయకులైన ఆడవారిని మోసం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు’’ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. शिल्पा शेट्टी के पति राज कुंद्रा को क्राइम ब्रांच ने अश्लील फिल्में बनाने के आरोप मे किया गिरफ्तार. Finally everyone got the right answer of the question asked by kapil sharma on #TheKapilSharmaShow many years ago.#RajKundra #shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/TcMFujKiyu — Dessie Aussie 🇮🇳🇭🇲 (@DessieAussie) July 19, 2021 -
కపిల్ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా?
మీరు హాయిగా నవ్వుకోవాలనుకుంటున్నారా? కపిల్ శర్మ షో చూడండి. మనసారా నవ్వాలనుకుంటున్నారా? అతడే చిరునామా. పగలబడి? డిటో. తండ్రి చిన్నప్పుడే కేన్సర్‌తో చనిపోయాడు. చదువుకోవడానికి డబ్బులు లేకపోతే టెలిఫోన్ బూత్‌లో పని చేశాడు. నవ్వించాలి అనుకుని నవ్వించి తీరాడు. కపిల్ శర్మ ఒక నవ్వుల అంబాసిడర్. సగటు మనిషి బాధలకుఅతడు కాసేపు పని చేసేదైనా సరే బెస్ట్ వ్యాక్సిన్. 2005. దేశంలో నవ్వుల విస్ఫోటనం జరిగింది. స్టార్ టీవీలో ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మొదలయ్యింది. దాని విజేతగా ‘సునీల్ పాల్’ పది లక్షలు బహుమతి గెలుచుకున్నాడు. మొదటిసారి దేశంలో ‘నవ్వు’కు ‘నవ్వించేవారికి’ చాలా డిమాండ్ వచ్చి పడింది. రోజువారి బతుకులో జనం కాసేపు నవ్వుకోవడానికి అవసరమైన ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తున్నారని ఈ షో హిట్ కావడం వల్ల తెలిసింది. ఇవాళ తెలుగు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న కామెడీ షోస్‌కు ఈ ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మూలం. అలాంటి ప్రోగ్రామ్ ఆ సమయంలో చాలామందిని ఇన్‌స్పయిర్ చేసింది. అమృత్‌సర్‌కు చెందిన కపిల్ శర్మను కూడా. అమృత్సర్ కుర్రాడు కపిల్ శర్మ అమృత్‌సర్‌లో ఒక హుషారైన కుర్రాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. అయితే కేన్సర్ బారిన పడి కుటుంబాన్ని కష్టాల్లో పడేశాడు. ఆ కష్టాన్ని మర్చిపోవడానికి కపిల్ నవ్వును ఒక ఔషధంగా తీసుకున్నాడు. ఫ్రెండ్స్‌ను బాగా నవ్వించేవాడు. జీవితంలో నవ్వును వెతుక్కునేవాడు. కపిల్ చాలా మంచి గాయకుడు. నాటకాలు వేసేవాడు. కాలేజీలు అతణ్ణి పిలిచి సీట్లు ఇచ్చేవి. మా కాలేజీలో చదివి మా కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొను అని ఆహ్వానించేవి. కపిల్ శర్మ అలా కాలేజీల కోరిక మేరకు కమర్షియల్ ఆర్ట్ డిగ్రీని, కంప్యూటర్ కోర్సును చదివాడు. రెండూ అన్నం పెట్టలేదు. తాను నమ్ముకున్న నవ్వే అన్నం పెట్టింది. మొదట ఓడి తర్వాత గెలిచి 2005లో ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ చూసి 2006లో కపిల్ శర్మ ఆడిషన్స్‌కు వెళ్లాడు. అతను రిజెక్ట్ అయ్యి అతని ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు. కాని కపిల్ శర్మ ఓటమిని అంగీకరించలేదు. 2007లో మళ్లీ ఆడిషన్స్ కు వెళ్లాడు. ఈసారి సెలెక్ట్ అయ్యాడు. అంతేనా? పోటీదారులను దాటుకుని ఆ సీజన్ విజేతగా నిలిచాడు. ‘ఆ సమయంలో వచ్చిన 10 లక్షల డబ్బు నా చెల్లెలి పెళ్లికి ఉపయోగపడింది. లాఫ్టర్ చాలెంజ్‌లో గెలిచిన వెంటనే షోస్‌లో పాల్గొని 30 లక్షలు సంపాదించి చెల్లెలు పెళ్లి చేశాను’ అని కపిల్ శర్మ చెప్పుకున్నాడు. కపిల్ శర్మలో స్పీడ్, ఆర్గనైజ్ చేసే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షో ప్రారంభించి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత ‘ది కపిల్ శర్మ షో’ మొదలెట్టి హిట్ కొట్టాడు. అతని షో ఉన్న చానెల్ టిఆర్పిల్లో ముందుండేది. అందుకే చానల్స్ అతని కోసం వెంటపడ్డాయి. మరోవైపు ప్రయివేట్ షోస్, టూర్స్ అతి త్వరలో కపిల్ సంపన్నుడు అయిపోయాడు. ‘నా షోలో పాల్గొంటానని మీరు కల్లో అయినా అనుకున్నారా’ అని అమితాబ్ వంటి పెద్దలను తన షోలో అడిగి నవ్విస్తాడు కపిల్ శర్మ. నిజానికి అమితాబ్ లాంటి వాళ్లు ‘నేను నీ షోకు వస్తానని కల్లో అయినా అనుకున్నావా’ అని అడగాలి. కాని కపిల్ శర్మ రివర్స్. తన షోకు వచ్చిన సెలబ్రిటీలను మధ్యతరగతి సగటు మనషికి ఉండే డౌట్స్ అడుగుతాడు కపిల్ శర్మ. తన షోకు వచ్చినవారి గురించి పూర్తి హోమ్‌వర్క్ చేసి వారి మీద పంచ్‌లు వేస్తాడు కపిల్ శర్మ. అందుకే అతను షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారికి కూడా చాలా ఇష్టమైన కమెడియన్ అయ్యాడు. గతంలో రాజూ శ్రీవాత్సవ్, జానీలీవర్ వంటి కామెడీ స్టార్లు షోలు చేశారు. కాని వారికి కపిల్ శర్మ అంతటి సక్సెస్ రాలేదు. కపిల్లో ఉండే స్పాంటేనిటీ, నవ్వు, వెకిలితనం లేకుండా నవ్వు రాబట్టగలిగే ప్రతిభ అందుకు కారణం. డిప్రెషన్: కపిల్ తనకొచ్చిన పేరుకు తానే భయపడిపోయాడు. ఇది అందరు సెలబ్రిటీలకు ఉండే సమస్యే. కాని కపిల్ ఎక్కువ భయపడ్డాడు. ఈలోపు తన షో పార్ట్నర్ సునీల్ గ్రోవర్ అతనితో విడిపోయాడు. స్క్రిప్ట్స్ రాసేవాళ్లు కొందరు వెళ్లిపోయారు. ఈర్ష్యాసూయలు అతని మీద దుష్ప్రచారం చేశాయి. ఆ సమయంలో కపిల్ షో మూతపడింది. అతను డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. కపిల్ శర్మ ఔట్ అని చాలామంది అనుకున్నారు. కాని కపిల్ తన గర్ల్‌ఫ్రెండ్ జిన్నిని వివాహం చేసుకున్నాక ఆమె సపోర్ట్‌తో ఒకటిన్నర సంవత్సరం తర్వాత తిరిగి షో ప్రారంభించాడు. ఈసారి అతని శ్రద్ధ, ప్రవర్తన చూసి మెల్లగా ప్రేక్షకులు అతనికి పూర్వవైభవం తెచ్చారు. ఇప్పుడు ‘ది కపిల్ శర్మ’ షో అత్యంత సక్సెస్ఫుల్ షోగా నిలిచి ఉంది. మొన్నటి ఏప్రిల్ 2తో కపిల్ శర్మకు 40 ఏళ్లు వచ్చాయి. ఒక వ్యక్తి నలభై ఏళ్లకు ఎవరి మద్దతు లేకుండా ఇంత స్థాయికి ఎదగడం చాలా స్ఫూర్తినిచ్చే విషయం. -
వీల్‌చైర్‌లో కమెడియన్.. ఆందోళనలో ఫ్యాన్స్!
ముంబై: బాలీవుడ్ నటుడు, స్టార్ కమెడియన్ కపిల్ శర్మ వీల్‌చైర్‌లో ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కపిల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ఇప్పటికే సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారు. అత్యంత ఆదరణ పొందిన కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’కు విరామం ఇస్తున్నట్లు కపిల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భార్య గిన్నీ చరాత్ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆమెకు దగ్గరగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇక ఈ జంట ఫిబ్రవరి 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ శుభవార్తను కూడా కపిల్ అభిమానులతో పంచుకున్నాడు. వీల్‌చైర్‌లో కపిల్: ఫొటో కర్టెసీ: వైరల్ భయానీ అంతా సక్రమంగా సాగుతుందనుకున్న వేళ ముంబై ఎయిర్‌పోర్టులో కపిల్ వీల్‌చైర్‌లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కలవరానికి గురయ్యారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కపిల్.. ‘‘నేను బాగానే ఉన్నాను. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నపుడు వీపు భాగంలో గాయమైంది. త్వరగానే కోలుకుంటాను. నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. కాగా బుల్లితెరపై ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా కపిల్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక 2018 డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను పెళ్లి చేసుకోగా.. ఈ దంపతులకు 2019లో కుమార్తె అనైరా శర్మ జన్మించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రెండోసారి తండ్రైన స్టార్ కమెడియన్
ముంబై: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ రోజు ఉదయం ఆయన భార్య గిన్ని చరాత్ పండంటి మగ బిడ్డకు జన్మినించారు. ఈ విషయాన్ని కపిల్ శర్మ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. ‘నమస్కార్.. ఈ రోజు ఉదయం నా భార్య మగ బిడ్డకు జన్మినించింది. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటీనటులు, అభిమానులు కపిల్‌కు శభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే తమ ఇంట్లోకి చిన్న అతిథి రాబోతున్నాడన్న శుభవార్తను గతవారం కపిల్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: అందుకే బ్రేక్ తీసుకుంటున్నా: కపిల్ శర్మ) 2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో వివాహం చేసుకున్న కపిల్ శర్మ-గిన్ని చరాత్లకు 2019 డిసెంబర్లో కూతురు అనైరా శర్మ జన్మించింది. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. Namaskaar 🙏 we are blessed with a Baby boy this early morning, by the grace of God Baby n Mother both r fine, thank you so much for all the love, blessings n prayers 🙏 love you all ❤️ginni n kapil 🤗 #gratitude 🙏 — Kapil Sharma (@KapilSharmaK9) February 1, 2021 -
చిన్నప్పటి ఫోటో: స్టార్ కమెడియన్‌ను గుర్తుపట్టారా!
మనకు బాగా తెలిసిన సెలబ్రిటీలను తమ చిన్నప్పటి ఫోటోలు చూస్తే సులభంగా గుర్తుపట్టేస్తాం.. కానీ కొంత మందిని మాత్రం ఎంత చూసిన వారు వీరేనని గుర్తించడం చాలా కష్టం.. పేరు చెబితే కానీ వాళ్లేవరో అస్సలు మనసుకు తట్టదు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ బ్యాలం నాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు ఉన్న ఈ చిత్రంలో తలపై క్యాప్ ధరించి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న వ్యక్తి హిందీ బుల్లితెరపై పాపులర్ హాస్యనటుడు. పక్కన ఉన్నది తన సోదరుడు. ఇది సరిగ్గా 28 ఏళ్ల క్రితం దిగిన ఫోటో. దీన్ని చూస్తుంటే అతనెవరో గుర్తు పట్టడం కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. చదవండి: బ్రేక్ తీసుకుంటున్నా: స్టార్ కమెడియన్ అయినప్పటికీ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఏంటీ సాధ్యపడటం లేదా. సరే ఇక మేమే సమాధానం చెప్తాం. అతనెవరో కాదు.. బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ. అవును కపిల్, తన సోదరుడితో కలిసి 28 ఏళ్ల క్రితం దిగిన ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటో తీసినప్పుడు కపిల్‌కు 11 ఏళ్లు కాగా ఇప్పుడు 39 సంవత్సరాలు. అంతేగాక గతేడాది నవంబర్‌లో కపిల్ ఇంటర్ చదువుతున్నప్పటి ఓ ఫోటోను ఆయన ఫ్యాన్స్ పేజీలో షేర్ చేశారు. ఇదిలా ఉండగా విజయవంతంగా కొనసాగుతున్న కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’ కొన్నాళ్లపాటు వాయిదా పడనున్న విషయం తెలిసిందే. కపిల్ శర్మ భార్య గిన్నీ చరాత్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కావడంతో కొన్ని రోజులు కుటుంబంతో కలిసి గడిపేందుకు షోకు బ్రేక్ చెప్పాడు. View this post on Instagram A post shared by Kapil Sharma (@kapilsharma)