ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer Reveals How He Waited For A Girl In His Debut IPL Season | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్‌ అయ్యర్‌

Published Tue, Apr 9 2024 3:25 PM | Last Updated on Tue, Apr 9 2024 4:00 PM

Shreyas Iyer Reveals How He Waited For A Girl In His Debut IPL Season - Sakshi

ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ హోస్ట్‌ చేసిన ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్‌మ్యాన్‌, శ్రేయస్‌ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్‌ చేసుకున్నారు. కపిల్‌ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుంది. 

ఆ అమ్మాయి మెసేజ్‌ కోసం ఎదురుచూశాను..
స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్‌ల ఫోకస్‌ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్‌ సీజన్‌లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్‌లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్‌బుక్‌ చాలా పాపులర్‌గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్‌ తన తొలి క్రష్‌ గురించి చెప్పుకొచ్చాడు.

శ్రేయస్‌ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్‌లు చేశారు. ఇదే షోలో శ్రేయస్‌ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్‌ అయినందుకు ఈ మాట చెప్పడం​ లేదని  అన్నాడు. సహచరులతో రోహిత్‌ చాలా నాటు స్టయిల్‌లో మాట్లాడతాడని శ్రేయస్‌ చెప్పగా.. రోహిత్‌ కూడా శ్రేయస్‌పై ఇదే కంప్లైంట్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే రోహిత్‌, శ్రేయస్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో రోహిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక​ విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా..  శ్రేయస్‌ నాయకత్వంలోని కేకేఆర్‌ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement