Kapil Sharma Show
-
అట్లీ కలర్‌పై కామెంట్స్.. గొర్రెలాగా అనుసరించొద్దు: నెటిజన్‌కు కపిల్ శర్మ కౌంటర్
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తన షోలో ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీని అభ్యంతకరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టార్‌గా ఎదిగారు.. ఎవరైనా స్టార్‌ను మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు అతనికి మీరు కనిపించారా? అంటూ కలర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి అట్లీ సైతం రిప్లై కూడా ఇచ్చారు. ఎవరినైనా సరే రూపాన్ని చూసి ఓ అంచనాకు రాకండి.. అతని హృదయాన్ని చూసి చెప్పాలంటూ సమాధానమిచ్చారు.అయితే ఈ షోలో అట్లీని అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కపిల్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లీ కలర్‌పై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అట్లీకి క్షమాపణలు చెప్పాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌పై కపిల్ శర్మ స్పందించారు.తనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కపిల్ శర్మ బదులిచ్చారు. డియర్ సర్.. నేను ఈ వీడియోలో అట్లీ లుక్స్ గురించి మాట్లాడినట్లు దయచేసి నాకు వివరించగలరా? దయచేసి సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మీకు ధన్యవాదాలు. అంతే కాదు అబ్బాయిలు మీ నిర్ణయం మీరే తీసుకోండి.. అంతేకానీ గొర్రెలాగా ఎవరో చేసిన ట్వీట్‌ను అనుసరించవద్దు' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే మరికొందరేమో కపిల్ శర్మ కామెంట్స్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. Dear sir, can you pls explain me where n when I talked about looks in this video ? pls don’t spread hate on social media 🙏 thank you. (guys watch n decide by yourself, don’t follow any body’s tweet like a sheep). https://t.co/PdsxTo8xjg— Kapil Sharma (@KapilSharmaK9) December 17, 2024 -
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్‌కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్‌గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్‌ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్‌ఫ్లెక్స్‌లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పారు..షాకయ్యాను : కాజోల్
సినీ తారలపై పుకార్లు రావడం సాధారణం. అయితే సినిమాల పరంగా వచ్చే గాసిప్స్ కొంతవరకు పర్వాలేదు. కానీ పర్సనల్ విషయాల్లోనూ లేనిపోని వార్తలు రావడంతో ఇబ్బందికరమే. అలాంటి ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నాను అంటోంది అందాల తార కాజోల్. ఆమె నటించిన తాజా చిత్రం ‘దో పత్తి’. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్ తన సీనీ కెరీర్ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. తనపై చాలా గాసిప్స్ వచ్చాయని..ఒకనొక సమయంలో తాను చనిపోయినట్లు కూడా వార్తలు రాశారని, వాటిని చూసి షాకయ్యానని చెప్పారు.‘నాపై చాలా రూమర్స్ వచ్చాయి. పర్సనల్ విషయాల్లోనూ పుకార్లు రాశారు. ఓ సారి గుర్తుతెలియని వ్యక్తి మా అమ్మకు ఫోన్ చేసి ‘విమాన ప్రమాదంలో మీ కూతురు చనిపోయారు’అని చెప్పాడు. ఇంట్లోవాళ్లు చాలా కంగారు పడ్డారు. ఆ మధ్య కూడా నేను చనిపోయినట్లు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టారు. అయితే ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. ఏదైనా ఇబ్బందికర వార్తలు రాస్తే..నా ఫ్రెండ్స్ నాకు పంపిస్తుంటారు. వాటిని చదివి ఇలా ఎలా రాస్తారు? అనుకుంటాను. అంతేకానీ పెద్దగా పట్టించుకోను’అని కాజోల్ అన్నారు. -
సినీ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ కమెడియన్.. దివాళా తీయాల్సి వచ్చింది!
సినీ ఇండస్ట్రీలో రిచెస్ట్ కమెడియన్ ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకు వస్తుంది. అంతలా ఫేమస్ అయ్యారు కమెడియన్ కపిల్ శర్మ. ది కపిల్ శర్మ షో ద్వారా బాలీవుడ్ మరింత ఫేమస్ అయ్యాడు. ఇటీవలే జ్విగాటో సినిమాతో ప్రేక్షకులను అలరించిన కపిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తకర విషయాలు పంచుకున్నారు.గతంలో తాను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయని కపిల్ శర్మ తెలిపారు. ఫిరంగి, సన్ ఆఫ్ మన్జీత్ సింగ్ చిత్రాలు ఆర్థికంగా చాలా దెబ్బ కొట్టాయని వెల్లడించారు. ఈ రెండు సినిమాలతో నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన భార్య సహకారంతోనే మళ్లీ తిరిగి కోలుకున్నట్లు కపిల్ శర్మ తెలిపారు.కాగా.. ఫిరంగి చిత్రంలో కపిల్ శర్మతో పాటు ఇషితా దత్తా, మోనికా గిల్ నటించారు. ఈ సినిమాకు రాజీవ్ దర్శకత్వం వహించారు. 2017లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పంజాబీలో తెరకెక్కించిన సన్ ఆఫ్ మంజీత్ సింగ్ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రానికి విక్రమ్ గ్రోవర్ దర్శకత్వం వహించారు. అంతకుముందు 2015లో తెరకెక్కిన కిస్ కిస్కో ప్యార్ కరోతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. -
జాన్వీకి రెండుసార్లు ఫుడ్ పంపించా.. కానీ: ఎన్టీఆర్
'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మొన్నటివరకు ప్రమోషన్స్ చేసి తెగ అలసిపోయారు. దాదాపు ఇంటర్వ్యూలన్నీ ఇప్పటికే ప్రసారం అయిపోగా.. 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో' మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా శనివారం సాయంత్రం 8 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)ఈ షోలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ప్రోమోనే ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా సాగింది. ఎపిసోడ్ వేరే రేంజులో ఉంటుందని చెప్పకనే చెప్పినట్లయింది. ఇకపోతే ప్రోమోలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని చూపించారు. 'దేవర' షూటింగ్ కోసం జాన్వీ హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ రెండుసార్లు ఫుడ్ పంపించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టాడు.కానీ జాన్వీ కపూర్ మాత్రం తనకు తానుగా ఫుడ్ వండుకునేదని, నాకు మాత్రం కొంచెమైనా పెట్టేది కాదని ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో జాన్వీ నవ్వేసింది. అలానే 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీన్లో తాను నిజమైన జంతువులు ఉన్న ట్రక్‌లో చాలా సేపు ఉన్నానని జనాలు అనుకుంటున్నారని, అది గ్రాఫిక్స్ అని చెప్పినా సరే నమ్మట్లేదని తారక్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ) -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. వచ్చే వారం థియేటర్లలోకి 'దేవర' రానుంది కాబట్టి ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో అందరూ ఓటీటీల్లో కొత్తగా ఏమొచ్చాయా అని చూస్తారు. అలా వాళ్ల కోసమా అన్నట్లు ఈ శుక్రవారం ఏకంగా 22 మూవీస్/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)ఈ వీకెండ్ ఓవరాల్‌గా 24 సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామి, పెచీ, సాలా, కాఫీ, రుస్లాన్ తదితర సినిమాలతో ద మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ కాస్తోకూస్తో కనిపిస్తున్నాయి. అయితే వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, పెచీ, రుస్లాన్ మూవీస్ మాత్రమే చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 20)నెట్ఫ్లిక్స్బ్లడ్ లెగసీ - ఇంగ్లీష్ సిరీస్హిజ్ త్రీ డాటర్స్ - ఇంగ్లీష్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 - హిందీ రియాలిటీ షో (సెప్టెంబరు 21)క్లాస్ 95: ద పవర్ ఆఫ్ బ్యూటీ - స్పానిష్ సిరీస్మోరిసన్ - థాయ్ సినిమానో మోర్ బెట్స్ - మాండరిన్ మూవీఅమెజాన్ ప్రైమ్పెచీ - తమిళ సినిమాతలైవేట్టాయామాపాళ్యం - తమిళ సిరీస్ద ట్రాజికల్లీ హిప్ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ - తెలుగు సిరీస్ద జడ్జి ఫ్రమ్ హెల్ - ఇంగ్లీష్ సిరీస్ (సెప్టెంబరు 21)ఆహామారుతీనగర్ సుబ్రమణ్యం - తెలుగు సినిమాతిరగబడరా సామీ - తెలుగు మూవీకాఫీ - తమిళ సినిమాసాలా - తమిళ మూవీజియో సినిమాద పెంగ్విన్ - ఇంగ్లీష్ సిరీస్జో తేరా హై వో మేరా హై - హిందీ మూవీరుస్లాన్ - హిందీ సినిమామనోరమ మ్యాక్స్సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ - మలయాళ సినిమాఆనందపురం డైరీస్ - మలయాళ మూవీఆపిల్ ప్లస్ టీవీలా మైసన్ - ఫ్రెంచ్ సిరీస్సన్ నెక్స్ట్సత్యభామ - తెలుగు సినిమాబుక్ మై షోషోసనా - ఇంగ్లీష్ మూవీఎమ్ఎక్స్ ప్లేయర్ఇష్క్ ఇన్ ద ఎయిర్ - హిందీ సిరీస్(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?) -
అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు.. డైట్ సీక్రెట్స్ ఇవే..
బాలీవుడ్ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్, ప్రోడ్యూసర్, సింగర్ అయిన కపిల్ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నెట్పిక్స్లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి. ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ సీక్రెట్స్ కూడా కపిల్ వెల్లడించడం జరిగింది. స్రీన్‌పై మంచి అందంతో, పిట్‌నెస్‌తో కనిపించే హీరో/హీరోయిన్ల బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..! జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు, మోడల్, నిర్మాత అయిన జాన్అబ్రహం ఫిజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్ చేస్తూ మంచి ఫిట్నెస్తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడూ తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ తన 'హౌస్‌ఫుల్ 3' చిత్రం ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆ షోలో అక్షయ్ కుమార్ ఫాలో అయ్యే స్ట్రీట్ డైట్ గురించి వెల్లడించారు. "తాను రితేష్ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్ చికెన్ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్‌గా డైట్ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్ ఇప్పటికీ యంగ్ లుక్‌లోనే కనిపస్తాడని". అమితాబ్ అన్నారు. కేక్ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్.. కపిల్ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కత్రినా తన డైట్ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్‌లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్‌లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్‌తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. గులాబ్ జామూన్లు, సమోసాలు తినాల్సిందే: రాజ్‌కుమార్ రావ్ కపిల్ శర్మ షో 2020లో రాజ్‌కుమార్ రావ్ సందడి చేశారు. అయితే రాజ్ కుమార్ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్ ఫిటనెస్ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్ గరించి క్లియర్‌గా చెప్పారు. "తనకు గులాబ్ జామూన్లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్‌లో ఉండగా వర్కౌట్స్ అయ్యాక తిన్నగా స్వీట్ షాక్కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్ జామూన్లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్ తినాలనుకుంటే మాత్రం లిమిట్‌గా తింటానని అన్నారు." ఆదిత్య రాయ్: అరకేజీ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే.. ఇక ఆదిత్య రాయ్ మృణాల్ ఠాకూర్‌తో కలిసి కపిల్ శర్మ షోకి వచ్చి డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్‌లోనే ఉంటాను కాబట్టి సడెన్‌గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్‌క్రీమ్‌లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్‌క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు. బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్లు చేయండి చాలు. మంచి ఫిట్నెస్గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్ స్కిప్ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్‌గా డైట్ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్. ఈ సెలబ్రిటీల డైట్ సీక్రెట్స్ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్ హాయిగా తినేసి కాస్త వర్కౌట్ డోస్ పెంచడం తోపాటు డైట్లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్‌ని స్కిప్ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్ నెస్‌తో బరువుని అదుపులో ఉంచుకోండి. -
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్‌మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్‌లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్‌గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్‌పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్‌మ్యాన్, శ్రేయస్‌లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్‌గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్‌మ్యాన్‌తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్‌ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్‌లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్‌కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్‌మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్‌వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో చక్కటి ఫాం హౌస్‌తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్‌తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్‌ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్‌లో అందమైన ఫామ్‌హౌస్‌ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్‌హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్‌వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కమెడియన్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదిస్తుంటారు. తెలుగులో బ్రహ్మానందం, అలీ తదితరులు ఇలా చాలా క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్ల జాబితాలో ఉంటారు. హిందీలో సునీల్ గ్రోవర్ అలాంటి వాడని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటిది రోడ్డు పక్కన గొడుగులు, మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ కనిపించాడు. పలు సినిమాల్లో నటించిన సునీల్ గ్రోవర్.. 'కపిల్ శర్మ' షోతో బోలెడంత పాపులారిటీ దక్కించుకున్నాడు. డిఫరెంట్ గెటప్స్‌తో ఎంటర్టైన్ చేసేవాడు. కానీ కారణాలేంటో తెలియదు గానీ ఆ షో నుంచి తప్పుకొన్నాడు. ఇది జరిగిన చాన్నాళ్లు అయిపోయింది. అయితే కపిల్ శర్మ షోకి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు ఈ హాస్య నటుడు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) ఈ మధ్యే 'యునైటెడ్ కచ్చే' వెబ్ సిరీస్‌తో అలరించిన సునీల్ గ్రోవర్.. షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలోనూ నటించాడు. ఇది సెప్టెంబరు 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. దాని గురించి పక్కనబెడితే తాజాగా రోడ్ పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న పొత్తులు, గొడుగులు అమ్ముతూ ఈ హాస్య నటుడు కనిపించాడు. అలానే రోడ్ పక్కన ఓ స్టాల్లో చపాతీలు చేస్తూ కమెడియన్ సునీల్ గ్రోవర్ దర్శనమిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలని సదరు కమెడియన్ స్వయంగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం విశేషం. అయితే ఇది కేవలం ఫన్ కోసమా చేశాడా మరేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఏదైతేనేం ఇది చూసిన చాలామంది నెటిజన్స్ ఫస్ట్ అవాక్కయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు. View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
నటికి ఘోర అవమానం.. ఏకంగా ఆ బాడీ పార్ట్స్‌పైనే కామెంట్స్!
Sumona Chakravarti Kapil Sharma Show: ఒకప్పుడు టీవీల్లో వచ్చే షోలు బాగుండేవి. బోలెడంత కామెడీ ఉన్నా అది ఎవరినీ ఎలాంటి ఇబ్బంది పెట్టేది కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. షోలు అంటేనే డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ పార్ట్స్ షేమింగ్ అన్నట్లు తయారైంది. మీకు అలాంటి కార్యక్రమాల ఏవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఓ నటి, తనకు ఓ షోలో జరిగిన అవమానం గురించి బయటపెట్టింది. స్వయానా యాంకరే కామెడీ అనగానే చాలామందికి తెలుగులో ఓ షో గుర్తొస్తుంది. కానీ దానికంటే 'కపిల్ శర్మ షో' చాలా ఫేమస్. చాలా ఏళ్లుగా ఇది సక్సెస్ ఫుల్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇందులోనే యాంకర్ కపిల్ శర్మ చేసే కామెడీ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. షోకి వచ్చే గెస్టులతో మస్తు ఫన్ జనరేట్ చేస్తుంటాడు. ఇక ఇదే షోలో కపిల్ శర్మకు భార్యగా సుమోనా చక్రవర్తి చేస్తోంది. అయితే ఈమె పాల్గొన్న తొలి ఎపిసోడ్‌లోనే మూతి-పెదాలని టార్గెట్ చేస్తూ కపిల్ శర్మ జోకులు వేశాడు. (ఇదీ చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) కొన్నాళ్ల తర్వాత తొలి ఎపిసోడ్ లో సుమోనాపై వేసిన జోక్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో కపిల్ శర్మ ఆ తరహా జోక్స్ ని వదిలేశాడు. కానీ కొన్నాళ్ల తర్వాత ఓ ఎపిసోడ్ సందర్భంగా కపిల్ శర్మ స్క్రిప్ట్ లో లైన్స్ మర్చిపోయాడు. ఏం చేయాలో తెలీక ఈ నటి మూతి-పెదాలపై కామెంట్స్ చేస్తూ కామెడీ జనరేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సుమోనా చక్రవర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అప్పుడు చాలా అప్సెట్ అయిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతా సెట్ షోలో జరిగిన దానికి బాధపడిన నటి సుమోనాని, అదే షోలో చేస్తున్న అర్చన పురానా సింగ్ ఓదార్చింది. అసలు కపిల్ శర్మ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సుమోనాకి వివరించింది. దీంతో కాస్త కుదుటపడింది. ఏదైతేనేం ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. మరీ బాడీ పార్ట్స్‌ని టార్గెట్ చేస్తూ కామెడీ చేయడం ఏంటని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్‌లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్బుక్ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? ) మహిళతో సహజీవనం.. వేధింపులు అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఆమె వల్లే అప్పులు చేశా ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం. - కె.తారకరామ కుమార్ (ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) -
బ్రిటన్ ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు: సుధామూర్తి
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి అందరికీ సుపరిచితురాలే. రచయిత్రి, విద్యావేత్త, సామాజిక వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కోట్ల సంపద ఉన్నప్పటికీ సాధారణ మహిళగానే జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తికి సొంత అల్లుడు అన్న విషయం తెలిసిందే. నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షరతో రిషి వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం(కృష్ణ సునక్, అనౌష్క సునక్). గతేడాది సెప్టెంబర్‌లో రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల సుధామూర్తి లండన్‌కు వెళ్లగా అక్కడ ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ టాక్‌షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొని పంచుకున్నారు. లండన్‌లో తన అడ్రస్ చెబితే ఇమిగ్రేషన్ అధికారులు నమ్మలేదని తెలిపారు. తాను ప్రధాని అత్తగారినంటే ‘జోక్ చేస్తున్నారా’ అని అడిగారని పేర్కొన్నారు. ‘నేను ఒకసారి యూకే వెళ్లాను. లండన్‌లో ఎక్కడ ఉంటారని ఇమిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ అడిగారు. నాతో పాటు మా అక్క కూడా ఉన్నారు. నా కొడుకు కూడా లండన్‌లో నివసిస్తున్నాడు. కానీ నాకు అతని పూర్తి అడ్రస్ తెలియదు. అందుకే అల్లుడు రిషి సునాక్ నివాసించే 10 డౌనింగ్ స్ట్రీట్’ను అడ్రస్‌గా రాశాను. అది చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నావైపు అదో రకంగా చూశారు. మీరు జోక్ చేస్తున్నారా అని అడిగారు. నేను నిజమే అని చెప్పాను. కానీ ఆయన నమ్మినట్లు నాకు అనిపించలేదు.72 ఏళ్ల వయసున్న నాలాంటి సాధారణ మహిళ బ్రిటన్ ప్రధాని రిషి అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు.’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, నిర్మాత గునీత్ మోంగా కూడా పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు.. -
మాటలు పలుచన
జె.డి.శాలింజర్ తన నవల ‘క్యాచర్ ఇన్ ద రై’తో ప్రఖ్యాతం. అమెరికాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకుని ఒక్కసారి కలిస్తే చాలు, చెప్పేది వింటే బాగుండు అని తహతహలాడించాడు. కాని ఎప్పుడూ జనం మధ్యలోకి రాలేదు. శాలింజర్‌ని ఇంటర్వ్యూ చేయడానికి మహామహులు ప్రయత్నిస్తే ఆశాభంగమే ఎదురైంది. అమెరికాలో తన నవల ‘హౌ టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’తో సంచలనం సృష్టించిన రచయిత్రి హార్పర్ లీ ఎవరినీ తన ఇంటిలోకి అడుగు పెట్టనీయలేదు. ఆమెని చూడాలని, ఇంటర్వ్యూ చేయాలని ఎందరో ప్రయత్నించి ఆమె ఇంటి గేట్ బయట నుంచే వెనుతిరిగే వారు. ప్రఖ్యాత కవి సాహిర్ లూధియాన్వీ తాను పాల్గొనే ముషాయిరాల్లో కవితా జ్ఞానం లేని శ్రోతలను గమనించాడంటే నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టేవాడు. సంఘంలో గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది శ్రీమంతులు అతడు పాల్గొనే ప్రయివేటు ముషాయిరాలకు వచ్చినా వారికీ అదే గతి పట్టేది. అతణ్ణి ఇంటర్వ్యూ చేయడం దుర్లభం. చేయాలనుకున్న వ్యక్తికి ఉర్దూ సాహిత్యం, కవిత్వం కూలంకషంగా తెలిసి ఉండాలి. ‘నా గురించి నీకేం తెలుసో చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను’ అనేవాడు. మాటలకు చాలా విలువ ఉంటుంది. మాట్లాడే మనిషిని బట్టి, మాటలను వెలికి తీసే మనిషిని బట్టి ఆ సంభాషణ, ముఖాముఖికి విలువ వస్తుంది. ఓప్రా విన్ ఫ్రే తన ఇంటర్వ్యూలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆమె తన నైపుణ్యంతో ఎదుటివారి మాటల్లో ఉండే జ్ఞాపకాల గాఢతను వెలికి తెస్తుంది. ఆమె మైకేల్ జాక్సన్‌ని ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజుల్లో కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఇప్పటికీ అమెరికన్ టెలివిజన్ చరిత్రలో అదే ఎక్కువ వ్యూయర్షిప్ పొందిన ఇంటర్వ్యూ. అడిగేవారి అంతస్తు చెప్పే వారి అంతస్తు తాలుమేలుగా కలిసినప్పుడు వచ్చే విలువ, గౌరవం అది. మన దేశంలో కూడా మంచి సంభాషణతో వ్యక్తిత్వాలను వెలికి తీసే పని స్త్రీలే మొదలెట్టారు. దూరదర్శన్‌లో నాటి బాలనటి తబస్సుమ్ చేసే టాక్ షోలకు విశేషంగా ఆదరణ ఉండేది. ఆమె తమను ఇంటర్వ్యూ చేయడం చాలామంది గౌరవంగా భావించేవారు. ఆ తర్వాత నటి సిమీ గెరేవాల్ చాలా విపులమైన ఇంటర్వ్యూలు చేసి అది చాలా శ్రద్ధతో పని చేయవలసిన రంగమని చాటింది. జయలలిత వంటి మొండిఘటం చేత తన ఇంటర్వ్యూలో పాట పాడించింది సిమీ. రతన్ టాటా, రాజీవ్ గాంధీ, రాజ్ కపూర్... వీరందరూ ఆమెతో మాట కలిపినవారిలో ఉన్నారు. రజత్ శర్మ ‘ఆప్ కీ అదాలత్’ ఒక భిన్నమైన ఫార్మాట్‌తో నింద–సంజాయిషీల ద్వారా చాలా మంది వ్యక్తిత్వాలను ప్రదర్శనకు పెట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆమిర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ షోతో ముఖాముఖి కార్యక్రమాలు తన వంటి సూపర్ స్టార్ నిర్వహించడం వల్ల వచ్చే సీరియస్‌నెస్‌ను, సామాజిక ప్రయోజనాన్ని లోకానికి తెలియచేశాడు. అయితే రాను రాను ఈ మాటల సేకరణ ఒక జీవనోపాధిగా మారింది. ప్రముఖులతో సంభాషణలు వినోదానికి, హాస్యానికి, కాలక్షేపానికి వనరుగా మారాయి. కరణ్‌జోహార్ వంటి హోస్ట్‌లు మునిగాళ్ల లోతుకే ఎదుటివారిని ఉంచుతూ సగటు ప్రేక్షకులను ఉత్సుకత పరిచే కబుర్లను వినిపించడం మొదలెట్టారు. శేఖర్ సుమన్ ‘మూవర్స్ అండ్ షేకర్స్’ ఇదే కోవలోకి వస్తుంది. కపిల్ శర్మ వంటి వారు బయలుదేరి హాస్యం కోసం ఎదుట ఉన్నది ఎవరైనాసరే వారితో నేలబారు మాటలు మాట్లాడించవచ్చని నిరూపించారు. ప్రచారం కోసం, ఏదో ఒక విధాన గుర్తుండటం కోసం ఒకనాడు తమ తమ రంగాలలో ఎంతో కృషి చేసినవారు కూడా ఇలాంటి షోలకు హాజరయ్యి ‘మీ ఇంట్లో సబ్బు అరిగిపోతే ఏం చేస్తారు?’ వంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వారి అభిమానులను చానల్ మార్చేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటల సేకరణ పతాక స్థాయికి చేరింది. యూ ట్యూబ్ పుణ్యాన ప్రతి ఒక్కరూ కాసిన్ని వీడియోల కోసం, వాటి మీద వచ్చే జరుగుబాటు కోసం మైక్ పట్టుకుని సాంస్కృతిక, కళారంగాల్లో ఉన్న రకరకాల స్థాయి పెద్దల వెంటబడుతున్నారు. వీరికి తాము ఇంటర్వ్యూ చేస్తున్న కళాకారుల/సృజనకారుల గురించి ఏమీ తెలియదు. అధ్యయనం చేయరు. గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో తెలుసుకోరు. ‘చెప్పండి సార్... చెప్పండి మేడమ్’ అంటూ ‘చెప్పండి’ అనే ఒక్కమాట మీద ఇంటర్వ్యూలు ‘లాగిస్తున్నారు’. విషాదం ఏమంటే గొప్ప గొప్ప గాయనీ గాయకులు, నటీనటులు, సంగీతకారులు, రచయితలు, రాజకీయవేత్తలు, దర్శకులు, నిర్మాతలు... వీరి ‘బారిన’ పడుతున్నారు. తమను అడుగుతున్నవారు ‘పిల్లకాకులు’ అని తెలిసినా క్షమించి జవాబులు చెబుతున్నారు. ‘హోమ్ టూర్’ అని వస్తే తమ ఇళ్లు బార్లా తెరిచి చూపిస్తున్నారు. పిచ్చి ప్రశ్నలకు హతాశులవుతూనే ఏదో ఒకటి బదులు ఇస్తున్నారు. వారికి ఉన్న అభిమానులు వారి పట్ల ఉండే గౌరవాన్ని పోగొట్టుకునేలా ఈ ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. అన్నింటినీ మించి వీరి ఇంటర్వ్యూలలోని శకలాలను వక్రీకరించే థంబ్‌నైల్స్‌తో పోస్ట్‌లు వస్తుండటం దారుణం. దినపత్రికలు పలుచబడి, అచ్చులో వచ్చే ఇంటర్వ్యూల స్థలం కుదింపునకు లోనయ్యాక సంభా షణలు, ముఖాముఖీలు ఇప్పుడు ఎలక్ట్రానిక్/డిజిటల్ మీడియాలోనే సాగుతున్నాయి. కొత్తగా మొదలైన ఓటిటి ప్లాట్‌ఫామ్స్ తమ సబ్స్క్రిప్షన్ లు పెంచుకోవడానికి పాపులర్ సినిమా స్టార్లను రంగంలోకి దింపి ఆ స్టార్ల ములాజాతో ఇతర స్టార్లను పిలిపించి టాక్‌షోలు నిర్వహిస్తున్నాయంటే ఊహించుకోవచ్చు. ఈ షోలన్నీ ఉంటే ఉండొచ్చు. కాని మాటను పలుచన చేయరాదు.పెద్దలారా! మాటకు విలువివ్వండి! మీ పెద్దరికానికి మాటతో మాట రానీకండి!! -
పాపులర్ కమెడియన్‌పై బయోపిక్.. అతనెవరంటే ?
Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్‌లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు, క్రికెట్ దిగ్గజాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వంటివారిపైనై ఈ బయోపిక్‌లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్‌పై ఎలాంటి బయోపిక్ తీయలేదు. దీన్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ కమెడియన్‌పై తాజాగా బయోపిక్ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్ పాపులర్ హిందీ కామెడీ టాక్ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' హోస్ట్ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్ ద్వారా తెలిపాడు. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్ జైన్ తెలిపారు. BIOPIC ON KAPIL SHARMA: 'FUKREY' DIRECTOR TO DIRECT... A biopic on #KapilSharma has been announced... Titled #Funkaar... #MrighdeepSinghLamba - director of #Fukrey franchise - will direct... Produced by #MahaveerJain [#LycaProductions]... #Subaskaran presents. #KapilSharmaBiopic pic.twitter.com/7LxhfKt4r6 — taran adarsh (@taran_adarsh) January 14, 2022 ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అందాల భామ సారా అలీ ఖాన్, తమిళ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు కలిసి నటించిన చిత్రం 'ఆత్రంగి రే'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో ప్రముఖ హిందీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో సందడి చేశారు అక్కీ, సారా. సినిమా చిత్రీకరణలో జరిగిన చిలిపి సన్నివేశాలు, సందడి గురించి ముచ్చటించారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను తనదైన రీతిలో అడిగి ఆకట్టుకున్నాడు కపిల్ శర్మ. అయితే ఈ క్రమంలో అక్షయ్ తనపై ఎలాంటి ట్రిక్ ప్లే చేశాడో చెప్పుకొచ్చింది సారా. నేను ఏం ట్రిక్ ప్లే చేశాను అని అక్షయ్ అడగ్గా.. సర్ మీరు నాకు స్వీట్ అని చెప్పి వెల్లుల్లి తినిపించారు. అది కూడా దేవుడి ప్రసాదం (నైవేద్యం) అని చెప్పారు మీరు. 'ఇదిగో బేటా ఇది దేవుడి ప్రసాదం' అని అన్నారు. అది కొంచెం వండిన వెల్లుల్లి కూడా కాదు. పచ్చి వెల్లికాయ.' అని తెలిపింది సారా. దీనికి 'అది నిన్ను బాధపెట్టిందా' అని అక్షయ్ అడిగితే 'అవును నాకు కొంచెం ఆనారోగ్యంగా అనిపించింది.' అని చెప్పింది సారా. ఈ మాటతో 'నువ్ తిన్నట్లు నీ కెరీర్‌పై ప్రమాణం చేసి చెప్పు' అని అడగ్గా 'నేను దాన్ని తింటే కచ్చితంగా అనారోగ్యంగా అనిపించేది' అని బదులిచ్చింది సారా అలీ ఖాన్. దీంతో ఒక్కసారిగా షోలో నవ్వులు చిందాయి. ఇదీ చదవండి: సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్ -
అవును, విషం తాగాను: కమెడియన్ ఎమోషనల్
Comedian Tirthanand Rao: కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా అతలాకుతలమైంది. సినిమానే నమ్ముకున్న ఎంతోమంది లాక్డౌన్ సమయంలో రోడ్డున పడ్డారు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులు ఇలా ఎందరో ఉపాధి లేక అల్లాడిపోయారు. ఈ క్రమంలో పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత షూటింగ్‌లు మొదలైనా కొందరు ఆర్టిస్టులకు మాత్రం అవకాశాలు రావడం లేదు. వచ్చినా సరిగా డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో సతమతమైన కమెడియన్ తీర్థానంద్ రావు గత నెలలో ఆత్మహత్యకు యత్నించాడు. అటు అప్పులు తీర్చలేక, ఇటు అయినవాళ్ల అండ లేదన్న బాధతో డిసెంబర్ 21న విషం తాగి అర్ధాంతరంగా తనువు చాలించడానికి సిద్ధపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చావు నుంచి తప్పించుకుని బతికి బట్టగట్టాడు. తాజాగా ఈ ఘటనపై తీర్థానంద్ స్పందిస్తూ తాను విషం తాగింది నిజమేనని అంగీకరించాడు. 'ఆర్థిక ఇబ్బందులతో నేను కొట్టుమిట్టాడుతున్నాను. పైగా నా కుటుంబం నన్ను ఒంటరిగా వదిలేసింది. అందుకే విషం తాగాను. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నా తల్లి, సోదరుడు కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు. మేమంతా అదే ప్రాంతంలో నివసిస్తున్నా వారు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక కూడా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాను. ఇంతకంటే ఘోరమైనది ఇంకేదైనా ఉందా?' అని ఎమోషనల్ అయ్యాడు. కాగా తీర్థానంద్ 2016లో కపిల్ శర్మ కామెడీ సర్కస్ షోలో కనిపించాడు. ఓ గుజరాతీ సినిమాలో అవకాశం రావడంతో కపిల్ శర్మ షోలో దీర్ఘకాలం కొనసాగలేకపోయాడు. ఇతడు నానా పటేకర్లా ఉండటంతో అతడి వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. -
ఎన్టీఆర్ ఈవెంట్‌కు 10 ప్రత్యేక రైళ్లు.. అభిమానుల కోసం
Junior NTR Reveals 10 Special Trains For Andhrawala Audio Launch: జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతుంటారు. అయితే తారక్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను పెంచుకునే పనిలో పడ్డాడు తారక్. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, థియేటర్ ఆక్యుపెన్సీలో ఆంక్షల వంటి పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అంతకుముందు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నారు తారక్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్‌కు అభిమానులు ఎలా వస్తారో చెప్పాలని హోస్ట్ కపిల్ శర్మ అడిగాడు. అందుకు ఎన్టీఆర్ తాను 2004లో నటించిన ఆంధ్రావాలా చిత్రం ఆడియో లాంచ్‌కు అభిమానులు ఎలా వచ్చారో తెలిపారు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన విధానం గురించి పేర్కొన్నారు. 'నా ఆంధ్రావాలా ఆడియో లాంచ్‌కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.' అని తారక్ వెల్లడించారు. ఆంధ్రావాలా సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. About #Andhrawala Audio launch 🔥#NTR @RRRMovie @tarak9999 pic.twitter.com/x9sYS7dIZK — NTR ARMY (@NTRARMYOFFICIAL) January 2, 2022 ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
ఒడిలో కూర్చోవాలనుందన్న నెటిజన్.. స్పందించిన నటి
హిందీ టీవీ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ ఉన్న షో ‘ది కపిల్ శర్మ షో’. ఇందులో షోకి గెస్ట్‌గా వచ్చిన సెలబ్రిటీలను రకరకాల ప్రశ్నలు వేస్తూ నవ్విస్తుంటాడు హోస్ట్ కపిల్ శర్మ. 'పోస్ట్ కా పోస్ట్‌మార్టం' విభాగంలో హోస్ట్ పోస్ట్‌లపై కామెంట్లను చదివి వినిపించగా.. ఫన్నీ రిప్లై ఇచ్చింది నటి ఆయేశా జుల్కా. ఇంతకుముందు ఓ సారి తన పెంపుడు పిల్లిని ఎత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఆయేశా. దానికి..‘నేను మియావ్ అంటా. మీ ఒడిలో కూర్చోబెట్టుకుంటారా?’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘రండి, మీరు కనుగొంటారు’ అంటూ కపిల్ షోలో ఫన్నీ రిప్లై ఇచ్చింది ఈ సీనియర్ నటి. అయితే ఈ కామెంట్‌కి మరో నెటిజన్ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే ఈ కామెంట్‌కి మరో నెటిజన్ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దానికి ఆయేషా నవ్వుతూ.. ‘అవును, ఆయనకి నిజం చెప్పారు’ అంటూ ఆ వ్యక్తికి సపోర్టు చేసింది. కాగా ఈ కపిల్ షోకి 90'లో కో స్టార్స్ అయిన జుహీ చావ్లా, మధుతో వచ్చింది ఈ సీనియర్ నటి. చదవండి: బూసన్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న అపర్ణ సేన్ ‘ది రేపిస్ట్’ View this post on Instagram A post shared by Ayesha Jhulka (official) (@ayesha.jhulka) -
ఏసీ రిపేర్, లీకేజీ ఉందని ఫోన్ చేసేవారు: సైఫ్ అలీఖాన్
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో సైఫ్ అలీఖాన్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ది కపిల్ శర్మ షోకి గెస్ట్‌గా వచ్చాడు. తన తాజా చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా హీరోయిన్లు యామీ గౌతమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ తరుణంలో ఫ్లాట్ల యజమానిగా ఉండే బాధలను తెలిపాడు. కపిల్ శర్మ షోలో ఫ్లాట్లు రెంట్‌కి ఇస్తే ఉండే ఇబ్బందుల గురించి హోస్ట్ కపిల్ మాట్లాడాడు. ఈ విషయాన్ని ఓన్ చేసుకున్న సైఫ్ తను చిన్నపాటి లాండ్లార్డ్నని, ఆ టార్చర్ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నాడు. ‘ఇంకా పాత మనస్తత్వం ఉండడం వల్ల, వచ్చే ఆదాయాన్ని ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టి.. అద్దెకు ఇస్తుంటా. చాలా సార్లు అద్దెకున్నవారు ఏసీ రిపేర్, లీకేజీలు ఉన్నాయంటూ ఫోన్ చేసేవారు. కొన్నిసార్లు ఈ పని కోసం ఎవరినైనా నియమించుకోవాలనిపించేదని’ తెలిపాడు. ‘ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడైతే ఓ మేనేజర్ని నియమించుకున్నాను. కానీ అంతకుముందు మాత్రం అన్నీ తానే చూసుకునేవాడినని’ అంటూ సైఫ్ చెప్పుకొచ్చాడు. అయితే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇటీవలే రెండో సంతానంగా జెమ్ పుట్టిన విషయం తెలిసిందే. అతను పుట్టడానికి ముందే ఉన్న ఇంటిని రూ.3.5లక్షలకు అద్దెకు ఇచ్చి, వేరే ఇంటికి మారారు. కాగా సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్’, ‘బంటీ ఔర్ బబ్లీ 2’ నటిస్తున్నాడు. చదవండి: కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్ అలీ ఖాన్ -
దారుణ స్థితిలో సిద్దార్థ్, మళ్లీ డ్రగ్స్ సేవించాడా?
Comedian Sidharth Sagar: మాదక ద్రవ్యాల నుంచి విముక్తి పొందిన నుంచి స్టాండప్ కమెడియన్ సిద్దార్థ్ సాగర్ అంతు చిక్కని పరిస్థితిలో పోలీసుల కంటపడ్డాడు. తనెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడో కూడా తెలియని దుస్థితిలో ఉన్న అతడిని పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. గతంలో మాదకద్రవ్యాలకు బానిసైన అతడు సుదీర్ఘ పోరాటం తర్వాత దాన్ని జయించి తిరిగి కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఫరాఖాన్ జడ్జిగా వ్యవహరిస్తున్న కామెడీ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. కానీ ఈ మధ్యే షో నుంచి సిద్దార్థ్ సడన్‌గా మాయమయ్యాడు. మరో కమెడియన్ జామీ లివర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. మరి సిద్దార్థ్ ఏమయ్యాడు? అని ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్టు 26న రాత్రి పూర్తి మైకంలో పడిపోయి ఉన్న సిద్దార్థ్‌ను ముంబై పోలీసులు గుర్తించి అతడి తల్లి అల్కా సాగర్‌కు సమాచారమందించారు. అయితే ఆ సమయానికి ఆమె ఢిల్లీలో ఉండటంతో తన అంగీకారంతో సిద్దార్థ్‌ను పునరావాస కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడు ఆ స్థితిలో ఉండటానికి గల కారణమేంటి? సిద్దార్థ్ మరోసారి డ్రగ్స్‌కు బానిసయ్యాడా? అన్న ప్రశ్నలకు అల్కా సాగర్ కింది విధంగా స్పందించింది. 'నేను చాలాకాలంగా సిద్దార్థ్‌ను అంటిపెట్టుకునే ఉంటున్నాను. కానీ నా పెంపుడు జంతువు అనారోగ్యం బారిన పడటంతో దాని వైద్యం కోసం ఢిల్లీ వచ్చాను. ఇంతలోనే సిద్దార్థ్ కండీషన్ బాగోలేదని తెలిసింది. అతడికి నా పేరు, నా ఫోన్ నంబర్ తప్ప మరేవీ గుర్తులేవని పోలీసులు చెప్పారు. దారుణమేంటంటే.. ఇలాంటి దుస్థితిలో ఉన్న సిద్దార్థ్‌కు సహాయం చేసేందుకు అతడి ఫ్రెండ్స్, తెలిసినవాళ్లు ఎవరూ ముందుకు రావట్లేదు. మేము మాత్రమే అతడి బాగోగులు చూసుకుంటాం కానీ కుటుంబానికి విలువివ్వడు. ఒక తల్లిగా అతడు వీలైనంత త్వరగా ఈ స్థితి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడూ తనని అంటిపెట్టుకునే ఉన్నాను. కానీ అనుకోకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నా పెంపుడు జంతువు కూడా చనిపోయింది. చాలామందికి తెలియని విషయమేంటంటే సిద్దార్థ్‌కు బైపోలార్ డిజార్డర్ ఉంది. దీనివల్ల ఎప్పుడూ ఊహల్లో తేలుతుండే అతడికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నాం. కానీ అతడు మెడిసిన్ తీసుకోవడం మానేశాడు. దీని వెనకాల ఏదో బలమైన కారణమే ఉంటుందనుకుంటున్నాను. తను మళ్లీ ఇలాంటి స్థితికి చేరుకున్నాడంటే కచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అతడికి నేనెప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేదాన్ని. నువ్వెంత పాపులర్ అవుతావో ఇండస్ట్రీలో నీకంతమంది శత్రువులు తయారవుతారు అని! జీవితాన్ని బ్యాలెన్సెడ్‌గా ఉంచుకోవాలని, డబ్బు వెనకాల పరిగెట్టకూడదని సూచించేదాన్ని. నిన్ను నేను పోషిస్తాను కానీ దయనీయ స్థితిలో మాత్రం చూడలేను అని చెప్పాను. నా కొడుకు కోసం తుదిశ్వాస వరకు పోరాడతాను. నేను ముంబైలో లేను కనుక అతడికి నిజంగా ఏం జరిగింది? అన్న దానిపై స్పష్టత రాలేదు. అతడు మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాడా? లేదా బైపోలార్ డిజార్డర్‌కు అందిస్తున్న చికిత్సను నిలిపివేయడం వల్ల ఇలా జరిగిందా? అన్నది అర్థం కాకుండా ఉంది. ఈరోజు నేను ముంబై వెళ్లి అతడిని కలుసుకుంటాను. అప్పుడే ఈ విషయంలో నాకో క్లారిటీ వస్తుంది' అని అల్కా సాగర్ చెప్పుకొచ్చింది. -
‘రణ్‌బీర్ నా దుస్తులను తన గర్ల్‌ప్రెండ్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు’
బాలీవుడ్ యంగ్ హీరో, లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్, సినిమాలతో ఎంత క్రేజ్ సంపాదించాడో, తన ప్రేమాయణాలతో అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్‌లో కొందరితో లవ్‌ట్రాక్ నడిపించాడు ఈ ప్లే బాయ్. అయితే గర్ల్‌ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేయడానికి తన సోదరి దుస్తులను వారికి గిఫ్ట్‌గా ఇచ్చేవాడట ఈ స్మార్ట్ హీరో. ఈ విషయాన్ని స్వయంగా తన సోదరి, జ్యువెలరీ డిజైనర్ రిద్దిమా కపూర్ సాహ్నీ చెప్పింది. తాజాగా ఆమె తన తల్లి, బాలీవుడ్ నటి నీతూ కపూర్‌తో కలిసి కపిల్ శర్మ షోలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమోని సోనీ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో రిద్దిమా రణ్‌బీర్ ప్రేయాయణాల గురించి మాట్లాడుతూ కొన్ని సిక్రెట్స్ని చెప్పింది. "ఒక రోజు రణ్‌బీర్ గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె వేసుకున్న టాప్ చూసిన తర్వాత అతను తనకి నా దుస్తులని గిఫ్ట్‌గా ఇచ్చాడని అర్థమైంది" అని రిద్దిమా పేర్కొన్నారు. కపిల్ శర్మ షోకి సంబంధించి సెట్స్‌లోని కొన్ని ఫోటోలని నీతూ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "తన కూతురితో కలిసి పాల్గొన్న కపిల్ శర్మ షో ఎంతో సరాదాగా సాగిందని" వ్యాఖ్యని వాటికి జోడించారు. కాగా, నీతూ కపూర్ భర్త, బాలీవుడ్ నటుడు రిషి కపూర్ క్యాన్సర్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 30న మరణించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
పంచ్‌లతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు!
ఒకేరకమైన ముఖ కవళికలతో కవలలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీళ్లు ఎక్కడ కనిపించినా కొన్ని క్షణాలు మన చూపు వాళ్లమీదే ఉంటుంది. వాళ్లల్లో పెద్ద ఎవరు.. చిన్న ఎవరబ్బా అనిపిస్తుంది. కాస్త అయోమయానికి గురైనప్పటికీ తరువాత తీక్షణంగా చూస్తేగానీ వారి గురించి అర్థం కాదు. అటువంటింది ఒకే రకమైన డ్రెస్‌లు వేసుకుని, ఏ విషయాన్ని అయినా ఇద్దరూ ఒకేసారి చెబుతూ అందర్నీ కన్ఫ్యూజ్ చేయడమేగాక, కామెడీ పంచ్‌లతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు చింకీ మింకీలు. ఏకరూప కవలలు కావడం, ఒకేరకమైన అభిరుచులు, అభిప్రాయాలతో.. రకరకాల ఫన్నీ కంటెంట్ వీడియోలు, లిప్ సింక్ కామిక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కోట్ల మందిని అలరిస్తున్నారు. ఇద్దరి డ్రెస్సింగ్ స్టైల్, గెటప్, హెయిర్ స్టైల్ ఒకే రకంగా ఉండడం వల్ల చింకీ ఎవరు? మింకీ ఎవరు? అని కనిపెట్టడం కూడా కష్టమే. సోషల్ మీడియా ట్రెండీ, సెన్సేషన్ చింకీ మింకీల అసలు పేర్లు సురభి మెహ్రా (చింకీ), సమృద్ది మెహ్రా (మింకీ). 1998లో నోయిడాలో పుట్టిన ఈ అక్కాచెల్లెళ్లు రూపంలో అచ్చుగుద్దినట్లు ఒక్కలాగే ఉంటారు. రూపంలోనేగాక వారి ఆలోచనలు, ఆహార్యాలు ఒకేవిధంగా ఉండడం విశేషం. నోయిడాలో పాఠశాల విద్యను పూర్తిచేసిన చింకీ మింకీలు పుణేలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశారు. చిన్నప్పటినుంచి చురుకుగా ఉండే వీరు డిగ్రీ అయ్యాక ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. రెండు నెలలు గడిచాక అక్కడ పని నచ్చకపోవడంతో ఉద్యోగం వదిలేసి మోడలింగ్ చేయాలని నిర్ణయిచుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ట్రెండ్‌కు తగ్గట్టుగా మోడ్రన్ డ్రెస్‌లు వేసుకుంటూ తమ ఫ్యాషన్ బ్లాగ్‌లో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసేవారు. ఈ వీడియోలకు మంచి ఆదరణ లభించడంతో... 2016లో టిక్‌టాక్ వీడియోలు చేయడం ప్రారంభించారు. ఇండియాలో టిక్‌టాక్ అనుమతించినంత కాలం‘చింకీ మింకీ’ అకౌంట్‌కు ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇన్‌స్టాగ్రాంలో కూడా ఈ ట్విన్ సిస్టర్స్‌కు ఫాలోవర్స్ లక్షల్లోనే ఉండడంతో చింకీ మింకీలు బాగా పాపులర్ అయ్యారు. కపిల్ శర్మ షో పాపులర్ టిక్‌టాక్ స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ట్విన్ సిస్టర్స్‌కు కపిల్ శర్మ షోలో నటించే అవకాశం దక్కింది. 2019లో జూన్ 9న ద కపిల్ శర్మ షోలో పొరిగింటి అమ్మాయిల్లా నటిస్తూ హాస్యాన్ని రసవత్తరంగా పండించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చింకీ మింకీలు మరింత ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ‘నాగిని’ సీరియల్, ‘కాలేజీ డ్రామా’ సిరీస్‌లో డబుల్ ట్రబుల్ ఎపిసోడ్లో రవీనా అండ్ కరిష్మా పాత్రలలో చక్కగా నటించారు. వీటితో పాటు టీవీ సీరీస్ అయిన ‘హీరో గాయబ్ మోడ్ ఆన్ ఎలాంగిసైడ్ అభిషేక్ నిగమ్’ వంటి కార్యక్రమం లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లిప్‌సింక్ కామెడీ గ్లామర్‌గా కనిపించడంలో ఎక్కడా తగ్గని ఈ ట్విన్ బ్యూటీస్‌కు యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యంగంతో కూడిన వీడియోలు, లిప్ సింక్ కామెడీ ప్రదర్శన, డ్యాన్సింగ్ వీడియోలను తమ ‘చింకీ మింకీ’ యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసి సోషల్ మీడియా సెన్సెషన్‌గా మారారు. ప్రస్తుతం వీరి ఛానల్‌ను ఫాలో అయ్యే సబ్‌స్కైబర్స్ సంఖ్య రెండున్నర కోట్లుగా ఉంది. ఎక్కువగా మ్యాచింగ్ డ్రెస్‌లు, ఫోటో షూట్స్, వారు ఏంచేస్తున్నారో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటున్నారు. తమకున్న కవలల రూపానికి కాస్త సృజనాత్మకత జోడించి సమయ స్ఫూర్తితో కామెడీ చేస్తూ ఆదాయంతోపాటు ఆదరణ పొందుతున్నారు చింకీ మింకీలు.