Actor And Comedian Sunil Grover Sells Corn And Umbrellas By Roadside, Videos Goes Viral - Sakshi
Sakshi News home page

Sunil Grover Sells Umbrella And Corn: ప్రముఖ హాస్యనటుడు.. ఇలా మారిపోయాడేంటి?

Published Tue, Jul 25 2023 12:14 PM | Last Updated on Tue, Jul 25 2023 12:37 PM

Comedian Sunil Grover Sell Umbrella Corn Roadside - Sakshi

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కమెడియన్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదిస్తుంటారు. తెలుగులో బ్రహ్మానందం, అలీ తదితరులు ఇలా చాలా క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్ల జాబితాలో ఉంటారు. హిందీలో సునీల్ గ్రోవర్ అలాంటి వాడని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటిది రోడ్డు పక్కన గొడుగులు, మొక్కజొన్న పొత‍్తులు అమ్ముతూ కనిపించాడు. 

పలు సినిమాల్లో నటించిన సునీల్ గ్రోవర్.. 'కపిల్ శర్మ' షోతో బోలెడంత పాపులారిటీ దక్కించుకున్నాడు. డిఫరెంట్ గెటప్స్‌తో ఎంటర్‌టైన్ చేసేవాడు. కానీ కారణాలేంటో తెలియదు గానీ ఆ షో నుంచి తప్పుకొన్నాడు. ఇది జరిగిన చాన్నాళ్లు అయిపోయింది. అయితే కపిల్ శర్మ షోకి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు ఈ హాస్య నటుడు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!)

ఈ మధ్యే 'యునైటెడ్ కచ్చే' వెబ్ సిరీస్‌తో అలరించిన సునీల్ గ్రోవర్.. షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలోనూ నటించాడు. ఇది సెప్టెంబరు 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. దాని గురించి పక‍్కనబెడితే తాజాగా రోడ్ పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న పొత్తులు, గొడుగులు అమ్ముతూ ఈ హాస్య నటుడు కనిపించాడు. 

అలానే రోడ్ పక్కన ఓ స్టాల్‌లో చపాతీలు చేస్తూ కమెడియన్ సునీల్ గ్రోవర్ దర్శనమిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలని సదరు కమెడియన్ స్వయంగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం విశేషం. అయితే ఇది కేవలం ఫన్ కోసమా చేశాడా మరేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఏదైతేనేం ఇది చూసిన చాలామంది నెటిజన్స్ ఫస్ట్ అవాక్కయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు.

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement