
బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు దబాంగ్ హీరో. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ చదువులో మాత్రం పూర్ స్టూడెంటేనట. ఎగ్జామ్ పేపర్ లీక్ చేయించుకుని పరీక్షలు పాస్ అయ్యేవారంట. ఈ విషయం గురించి స్వయంగా సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ చెప్పారు. కపిల్ శర్మ షోకు సలీం తన ముగ్గురు కొడుకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన కొడుకులు బాల్యంలో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు.
‘సల్మాన్ చిన్నతనంలో మా ఇంటికి గణేష్ అనే వ్యక్తి వచ్చేవాడు. అతను రాగానే నా కొడుకులు గణేష్ కోసం కూర్చి తీసుకురండి.. గణేష్ చాయ్ తాగండి అంటూ నాకంటే ఎక్కువ మర్యాద అతనికే ఇచ్చేవారు. దాంతో అసలు ఈ గణేష్ ఎవరూ.. ఎందుకు నా కొడుకులు అతనికి అంత ప్రధాన్యత ఇస్తున్నారని ఆలోచించగా అసలు విషయం అప్పుడు తెలిసిందే. ఈ గణేష్ అనే వ్యక్తి నా పిల్లల కోసం ఎగ్జామ్ పేపర్లు లీక్ చేయించి తీసుకొచ్చేవాడు. దాంతో నా పిల్లలు అతనికి అంత మర్యాద ఇచ్చేవారని అర్థమయ్యింద’న్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సల్మాన్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్, దిశా పాట్నీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘భారత్’ సినిమాతో బిజీగా ఉన్నారు.
Jab Kapil ke ghar aayi Khan family, dekhiye kiss kiss ki pol khul gayi! #TheKapilSharmaShow, 29 Dec se, har Sat-Sun raat 9:30 baje. @BeingSalmanKhan @SohailKhan @arbaazSkhan @KapilSharmaK9 @kikusharda @haanjichandan @Krushna_KAS @bharti_lalli @sumona24 @RochelleMRao @trulyedward pic.twitter.com/Aux3E7bXXg
— Sony TV (@SonyTV) December 26, 2018