paper leakage
-
మళ్లీ ‘నీట్’కు ఆదేశించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: నీట్–యూజీ 2024 పరీక్ష సమగ్రతకే తూట్లు పొడిచేంతటి భారీ స్థాయిలో వ్యవస్థీకృత లీకేజీ జరిగినట్టు ఇప్పటికైతే ఎలాంటి రుజువులూ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీజేఐ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్డీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున సీజేఐ 63 పేజీల తీర్పు రాశారు. ‘‘సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటివాది ద్వారా ప్రశ్నపత్రాన్ని విస్తృతంగా లీక్ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. లీకేజీ ప్రధానంగా పటా్న, హజారీబాగ్ ప్రాంతాలకే పరిమితమైనట్టు తేలింది. తద్వారా లబ్ధి పొందిన విద్యార్థులను గుర్తించడం కష్టమేమీ కాదు. వారెంత మందో సీబీఐ దర్యాప్తు ఇప్పటికే తేలి్చంది. కనుక మళ్లీ పరీక్ష నిర్వహించడం అనవసరం. పైగా దానివల్ల ఈ దశలో విద్యా సంవత్సరం దెబ్బ తింటుంది’’ అని పేర్కొన్నారు. ఎన్టీఏకి తలంటిన సీజేఐనీట్–యూజీ వంటి కీలక పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవహరించిన తీరు దారుణమని సీజేఐ దుయ్యబట్టారు. ముందు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తర్వాత దిద్దుబాటుకు దిగడం దారుణమన్నారు. ‘‘లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బృహత్తర కార్యక్రమమే. అందుకు భారీ వనరులు, సమన్వయం, ప్రణాళిక అవసరం. మేమేమీ కాదనడం లేదు. కానీ ఎన్టీఏ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది అందుకే కదా! ఈసారి జరిగిన తప్పిదాలను నివారించేందుకు కావాల్సినన్ని నిధులు, సమయం ఎన్టీఏకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఒకే కేంద్రంలో భారీ సంఖ్యలో అభ్యర్థులను అనుమతించడం వంటివి లీకేజీకి కారణాలని చెప్పడం కుదరదు. పైగా హజారీబాగ్ పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యమూ చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూం వెనక తలుపు తెరిచి అనధికార వ్యక్తులు ప్రశ్నపత్రాలను చేజిక్కించుకున్నారు. వాటిని ఇ–రిక్షాల్లో తరలించుకుపోయి అభ్యర్థల చేతిలో పెట్టారు. ఫలితంగానే 67 మందికి నూరు వాతం మార్కులొచ్చాయి. అనుమానితులైన 1,563 మందికి తిరిగి పరీక్ష పెడితే ఆ సంఖ్య అంతిమంగా 17కు తగ్గింది. అది కూడా అభ్యర్థుల ఆక్రందనలు, మీడియా రిపోర్టులు, కోర్టు జోక్యం అనంతరం! ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండానే ప్రజలు విశ్వసించేలా పనితీరు ఉండాలి. ఇకనైనా మరింత జాగరూకంగా ఉండండి’’ అంటూ ఎన్టీఏను మందలించారు. తీర్పులో పేర్కొన్న అన్ని అంశాలపైనా దృష్టి పెట్టి ఇకపై పరీక్షల నిర్వహణ పూర్తిగా దోషరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు సిఫార్సు చేసే విషయంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని రాధాకృష్ణన్ ప్యానెల్‌ను సీజేఐ నిర్దేశించారు. అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణ పద్ధతిని లోపరహితం చేయడం, పరీక్షల నిర్వహణ, ప్రక్రియ తాలూకు భద్రత, డేటా సెక్యూరిటీ తదితరాలపైనా సిఫార్సులు చేయాలని నిర్దేశించారు. -
Supreme Court: రెండిట్లో ‘సరైన’ సమాధానం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్–యూజీ, 2024 పరీక్షలో పేపర్ లీకేజీ ఉదంతంపై పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టులో సోమవారం ఒక ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు ఇచి్చన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులేసి రెండోది ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులు వేయలేదని దీనిపై తేల్చాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిŠట్స్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం విచారించింది. రెండింటిలో సరైన సమాధానం ఏది? అనే దానిపై స్పష్టత వస్తే అభ్యర్థుల తుది జాబితా మెరిట్ లిస్ట్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై తొలుత పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయతి్నంచిన అభ్యర్థుల్ని మూడురకాలుగా విడగొట్టాలి. ఎందుకంటే రెండు ‘సరైన’ సమాధానాల్లో ఒకదానికి ఎంచుకున్న వాళ్లకు నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఐదు మార్కులు పోయాయి. రెండో సమాధానం ఎంచుకున్న వాళ్లకు నాలుగు మార్కులు పడ్డాయి. రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక, నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్కులు పోతాయన్న భయంతో సమాధానం రాయకుండా వదిలేసిన వాళ్లూ ఉన్నారు’’ అని న్యాయవాది వివరించారు. దీంతో ధర్మాసనం స్పందించింది. ‘‘ ఫిజిక్స్ విభాగంలో అణువుకు సంబంధించిన ప్రశ్నలో నాలుగు ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయన్న వాదనల నడుమ అసలైన సమాధానాన్ని తేల్చాల్సిన సమయమొచి్చంది. అందుకోసం ముగ్గురు విషయ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మాకు సరైన సమాధానమేంటో నివేదించండి’’ అని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌కు చేరేలా చూడాలని సుప్రీంకోర్టులో సెక్రటరీ జనరల్‌కు ధర్మాసనం సూచించింది. ‘పరీక్ష నిర్వహణలో లోపాలు చూస్తుంటే ఇది వ్యవస్థాగత వైఫల్యమని తెలుస్తోంది. గుజరాత్లో ఒక విద్యార్థి 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడుగానీ నీట్ పరీక్షలో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కొన్ని కేంద్రాల్లో అడ్రస్ వెరిఫికేషన్ చేయలేదు. మరి కొన్నింటిలో సీసీటీవీ కెమెరాలే లేవు’ అని లాయర్ నరేందర్ హూడా వాదించారు.కొలిక్కి వస్తున్న నీట్–యూజీ వివాదం! నీట్ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని దాదాపు 40 పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. పరీక్ష రద్దు చేయాలంటూ, రద్దు చేయొద్దంటూ దాఖలు చేసిన వారి వాదనలు సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. ఇక కేంద్రం తరఫు వాదనలు మిగిలి ఉన్నాయి. మంగళవారం కేంద్రం వాదనలు పూర్తయితే త్వరగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
Parliament Special Session: పార్లమెంట్లో నీట్ రగడ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ) వ్యవహా రం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. నీట్ పరీక్షలో అవినీతి అక్రమాలపై, పేపర్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఇతర వ్యవహారాలు పక్కనపెట్టి నీట్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాపాడడంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. తర్వాత చర్చిద్దామని సభాపతులు కోరినన్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. దిగువ సభలో విపక్షాల ఆందోళన లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సుశీల్‌కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరని, ఈ నేపథ్యంలో జీరో అవర్ చేపట్టలేమని అన్నారు. కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నీట్–యూజీపై చర్చించాలని అన్నారు. డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్దే నిల్చొని నినాదాలు ప్రారంభించారు. రాహుల్ గాంధీ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్య క్రమాలు ప్రారంభించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని, ఆ తర్వాత నీట్‌పై చర్చకు సమయం కేటాయిస్తానని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పశి్చమ బెంగాల్‌కు చెందిన నురుల్ హసన్‌తో ఎంపీగా స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం లోక్‌సభలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. మరోవైపు నీట్–యూజీపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్‌సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచి్చన ఖర్గే నీట్ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. విపక్షాల నిరసనలు, నినాదాల వల్ల శుక్రవారం ఎగువ సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మూడుసార్లు వాయిదా వేశా రు. రాష్ట్రప తి ప్ర సంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. నీట్‌పై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని జేడీ(ఎస్) సభ్యుడు హెచ్.డి.దేవెగౌడ గుర్తు చేశారు. సభ సక్రమంగా జరిగేలా విపక్ష సభ్యులంతా సహకరించాలని కోరారు. నీట్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు. నీట్‌పై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల నుంచి 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. దీనిపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావడంపై రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకు డు వెల్‌లోకి రావడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని, పార్లమెంట్‌కు ఇదొక మచ్చ అని ఆక్షేపించారు. పార్లమెంటరీ సంప్రదాయం ఈ స్థాయికి దిగజారిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కరినీ మానసికంగా గాయపర్చిందని చెప్పారు. నీట్‌పై చర్చకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, సభలో మాట్లాడేందుకు చైర్మన్ ధనఖఢ్ అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాను వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. అయితే, ధన్‌ఖడ్ చెబుతున్నట్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెల్‌లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్‌లోకి వెళ్లారని గుర్తుచేశారు. స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతమ్ శుక్రవారం స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పార్లమెంట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. నేతమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కోలుకుంటున్నారని, ఈ మేరకు ఆసుపత్రి నుంచి తనకు సమాచారం అందిందని చైర్మన్ ధన్‌ఖఢ్ సభలో ప్రకటించారు. -
ఎన్టీఏ డీజీ సుబోద్‌పై వేటు
న్యూఢిల్లీ: కీలకమైన నీట్, నెట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, నెట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌పై శనివారం వేటు వేసింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్, ఎండీ ప్రదీప్‌సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. యూజీసీ–నెట్ పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే, ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల సమగ్రతకు భంగం వాటిల్లిందని హోంశాఖ తెలుపడంతో యూజీసీ– నెట్‌ను రద్దు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల ప్రవేశానికి నెట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. -
ఏడేళ్లు.. 70 లీకేజీలు
నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతం నానాటికీ పెరిగి పెద్దదవుతోంది. రోజుకోటి చొప్పున సంచలనాత్మక విషయాలు బయట పడుతూ దేశమంతటినీ కుదిపేస్తున్నాయి. మరోవైపు యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం లీకైనట్టు తేలడంతో ఆ పరీక్షే రద్దయింది. వీటి దెబ్బతో దేశవ్యాప్తంగా ప్రవేశ, పోటీ పరీక్షల సమగ్రత, విశ్వసనీయతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్న దుస్థితి! నిజానికి ప్రశ్నపత్రాల లీకేజీ మన దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న జాఢ్యమే. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడం సమస్య తీవ్రతకు, భారత్‌లో పరీక్షలపై పేపర్ లీకేజీ మాఫియాకు ఉన్న తిరుగులేని పట్టుకు అద్దం పడుతోంది. ఇవన్నీ అధికారికంగా వెలుగులోకి వచి్చనవి, దర్యాప్తు జరిగిన, జరుగుతున్న కేసులు మాత్రమే. అసలు వెలుగులోకే రాకుండా పకడ్బందీగా జరిగిపోయిన ప్రవేశ, పోటీ పరీక్షల లీకేజీ ఉదంతాలు ఇంకా ఎన్నో రెట్లుంటాయని విద్యా రంగ నిపుణులే అంటున్నారు! వాటి ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వోద్యోగాలు కొట్టేసిన అనర్హులు వేలు, లక్షల్లో ఉంటారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్–యూజీ పేపర్ లీక్ కావడంతో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. ఇలా గత ఏడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 70 పరీక్షల పేపర్లు లీకయ్యాయి. వాటికి 1.7 కోట్ల మందికి పైగా ఉన్నత విద్యార్థులు, ఉద్యోగార్థుల కలలు కల్లలైపోయాయి. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి పలు పెద్ద రాష్ట్రాలతో పాటు హరియాణా వంటి చిన్న రాష్ట్రాల్లో కూడా తరచూ పలు ప్రవేశ, పోటీ పరీక్షల పేపర్లు లీకవుతున్నాయి. ఈ లీకేజీ భూతం ఉన్నత విద్యకు, భారీ స్థాయి నియామక పరీక్షలకే పరిమితం కాలేదు. పదో తరగతి వంటి స్కూలు పరీక్షలకు కూడా పాకి కలవరపెడుతోంది. బిహార్‌లో పదో తరగతి ప్రశ్నపత్రాలు గత ఏడేళ్లలో ఆరుసార్లు లీకయ్యాయి. పశి్చమబెంగాల్లోనైతే స్టేట్ బోర్డు పరీక్ష పత్రాలు గత ఏడేళ్లలో ఏకంగా పదిసార్లు లీకయ్యాయి. తమిళనాడులో 2022లో 10, 12 తరగతుల ప్రశ్నపత్రాలు లీకై కలకలం రేపాయి. ఆ రాష్ట్రాల్లో అంతే...! రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కొన్నేళ్లుగా పరీక్షల లీకేజీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 2015–23 మధ్య రాజస్తాన్‌లో పలు పోటీ పరీక్షలకు సంబంధించి 14కు పైగా పేపర్లు లీకేజీ బారిన పడ్డాయి. 2022 డిసెంబర్లో సీనియర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ల నియామకానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రం లీకవడంతో ఆ పరీక్షనే రద్దు చేయాల్సి వచి్చంది. యూజీసీ నెట్, పోలీస్ రిక్రూట్మెంట్ గత రెండేళ్లు వరుసగా లీకయ్యాయి. గుజరాత్‌లోనూ గత ఏడేళ్లలో 14 లీకేజీ ఉదంతాలు నమోదయ్యాయి. సీపీఎస్సెస్సీ చీఫ్ ఆఫీసర్ పరీక్ష (2014), తలతీ పరీక్షలు (2015, 2016), టీచర్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ (2018), ముఖ్య సేవిక, నాయబ్ చిట్నిస్, డెక్ లోక్ రక్షక్ దళ్, నాన్ సచివాలయ క్లర్క్స్, హెడ్ క్లర్క్, సీఎస్‌ఎస్సెస్బీ (2021), సబ్ ఆడిటర్ (2021), ఫారెస్ట్ గార్డ్ (2022), జూనియర్ క్లర్క్ (2023), వంటి పలు పరీక్షలు ఈ జాబితాలో ఉన్నాయి. యూపీలో కూడా 2017–24 మధ్య కనీసం 9 లీకేజీ కేసులు వెలుగు చూశాయి. ఇన్స్పెక్టర్ ఆన్లైన్ రిక్రూట్‌మెంట్‌పరీక్ష (2017), యూపీ టెట్ (2021), 12వ తరగతి బోర్డు పరీక్ష వంటివి వీటిలో ముఖ్యమైవి. తాజాగా ఈ ఏడాది జరిగిన కానిస్టేబుల్ పేపర్ లీకేజీ ఏకంగా 48 లక్షల మంది దరఖాస్తుదారులను ఉసూరు మనిపించింది.అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టం నోటిఫై చేసిన కేంద్రం న్యూఢిల్లీ: పేపర్ లీకేజీల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అనైతిక కార్యకలాపాల నిరోధ) చట్టం, 2024ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్, యూజీసీ–నెట్ పేపర్ల లీకేజీ వివాదాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. పేపర్ల లీకేజీ ఉదంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంటు ఈ చట్టం చేయడం తెలిసిందే. దీని ప్రకారం లీకేజీ కేసుల్లో మూడు నుంచి పదేళ్ల జైలు, రూ.కోటి దాకా జరిమానా విధించవచ్చు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది. -
Rahul Gandhi: యుద్ధాలను ఆపే మోదీ పేపర్ లీకేజీలు ఆపలేరా?
న్యూఢిల్లీ: నీట్–యూజీ, యూజీసీ–నెట్ పరీక్షల్లో అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలను ఆపేసే శక్తి ఉందని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీకి మన దేశంలో పేపర్ లీకేజీలను ఆపే శక్తి లేదా? అని ప్రశ్నించారు. లీకేజీలను ఆపాలని మోదీ కోరుకోవడం లేదని ఆక్షేపించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలను అధికార బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చెరబట్టాయని, అందుకే పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి మారనంత వరకు పేపల్ లీక్‌లు అగవని తేలి్చచెప్పారు. రాహుల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షలాది మంది నీట్ అభ్యర్థుల ఆందోళనలను నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు పార్లమెంట్లో స్పీకర్‌ను ఎన్నుకోవడంపైనే ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలిపోయారని, ఇకపై ఆయన ప్రభుత్వాన్ని నడిపించేందుకు మరింత ఇబ్బంది పడుతారని చెప్పారు. పార్లమెంట్లో లేవనెత్తుతాం.. ‘‘నరేంద్ర మోదీకి ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. గతంలో ఆయన ఛాతీ 56 అంగుళాలు ఉండేది. ఇప్పుడది 32 అంగుళాలకు కుదించుకుపోయింది. భయపెట్టి, బెదిరించి పని చేయించుకోవడం మోదీకి అలవాటు. ఇప్పుడు ప్రజల్లో మోదీ అంటే భయం పోయింది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం’’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నీట్‌పై ఆందోళన అవసరం లేదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్ష విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎక్కడో జరిగిన చిన్నాచితక సంఘటనలు ఈ పరీక్ష సక్రమంగా రాసిన లక్షలాది మంది అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పారు. యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయ్యిందని, అందుకే పరీక్ష రద్దు చేశామని ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. -
రాష్ట్రంలో ‘నీట్’ మంటలు
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్/పంజగుట్ట: నీట్ పరీక్ష లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు తెలంగాణకూ పాకాయి. నీట్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో వివిధ విద్యార్థి సంఘాల నేతృత్వంలో స్టూడెంట్ మార్చ్ జరిగింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్ యూ, విద్యార్థి జనసమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యా ర్థి విభాగం, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్, వి ద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యా లీ జరిగింది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి అధ్యక్షతన సభ జరిగింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నా గరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ తదితరులు మాట్లాడారు.అవకతవకలకు పాల్పడిన, పేపర్ అమ్ముకున్న ఎన్టీఏ చైర్మన్, డైరెక్టర్ల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేసి తిరిగి ఆయా రాష్ట్రాలు పరీక్ష నిర్వహించుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న మంత్రులు దీనిపై స్పందించడం లేదని, పరీక్ష పే చర్చ అనే మోదీ పరీక్షలు లీకేజీలపై నోరుమెదపడం లేదని, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి రెండుచోట్ల అవకతవకలు జరిగాయని ఒప్పకున్న తర్వాత కూడా మౌనం పాటించడం వెనుక ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు. మళ్లీ పరీక్షపై విద్యార్థుల్లో భయం భయం అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చేవి. విద్యార్థులు తమకు ఎక్కడ సీటు వస్తుందోనన్న అంచనా కూడా వచ్చేది. కానీ నీట్ పేపర్ లీక్ కావడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు. మళ్లీ చదివి రాస్తే ఇవే ర్యాంకులు వస్తాయన్న గ్యారంటీ ఉండబోవన్నారు. అంతేగాక కాలేజీ యాజమాన్యాలు కూడా మళ్లీ పరీక్ష అంటే విద్యార్థులకు తీవ్రమైన మానసిక వేదనే ఉంటుందన్నారు. ఉద్రిక్తంగా మారిన చలో రాజ్‌భవన్ నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లు ఎక్కిన నాయకులను పోలీసులు అడ్డుకొని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్వీ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా ఒక ప్రవేశ పరీక్షలో 67 మంది అభ్యర్థులు 720కి 720 మార్కులు సాధించడం గిన్నిస్ రికార్డు సాధించినట్లే అని ఎద్దేవా చేశారు. -
అలా చేస్తే నీట్–యూజీ గౌరవం దెబ్బతింటుంది
సాక్షి, న్యూఢిల్లీ: పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలు పేరిట మళ్లీ నీట్–యూజీ పరీక్ష నిర్వహిస్తే ఈ పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుందని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. పేపర్ లీకేజీ ఆరోపణలు వెల్లువెత్తడంతో మీ స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆదేశించింది.వైద్యవిద్య ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్–యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయిందని, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపించడంతోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది.మళ్లీ అడిగితే పిటిషన్‌ను కొట్టేస్తాంఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల అడ్మిషన్లను నిలిపేయాలంటూ చేసిన పిటిషనర్ల తరఫున న్యాయవాది మ్యాథ్యూస్ జె.నెడుమ్‌పారా చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయి. ముందే ప్రశ్నపత్రం సంపాదించి పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. లక్ష సీట్లు ఉంటే 23 లక్షల మంది పరీక్ష రాశారు. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఏకంగా 67 మంది విద్యార్థులు 720 మార్కులకుగాను సరిగ్గా 720 మార్కులు సాధించారు.ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ మెహతా విద్యాలయలో ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముఠాతో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులుసహా నలుగురిని ఇప్పటికే అరెస్ట్‌చేశారు’’ అని లాయర్ వాదించారు. ‘‘కౌన్సిలింగ్‌ను ఆపేది లేదు. అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఆపాలని మీరు ఇలాగే వాదనలు కొనసాగిస్తే మీ పిటిషన్‌ను కొట్టేస్తాం’ అని లాయర్‌ను ధర్మాసనం హెచ్చరించింది. ‘‘ మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడమంటే ఆ పరీక్ష పవిత్రతను భంగపరచడమే.ఆరోపణలపై మాకు సరైన సమాధానాలు కావాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏలతోపాటు పరీక్షకేంద్రంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్న బిహార్ ప్రభుత్వానికీ కోర్టు నోటీసులు పంపించింది. శివాంగి మిశ్రా, మరో 9 మంది ఎంబీబీఎస్ ఆశావహులు పెట్టుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో దీనిపై స్పందన తెలపాలని ఎన్టీఏను కోర్టు ఆదేశించింది. కోర్టు వేసవికాల సెలవులు ముగిసే జూలై 8వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. -
పేపర్ లీక్‌లు ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28 నుంచి ఇంటర్మిడియెట్ థియరీ పరీక్షలు మొదలుకానున్నాయి. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షల నిర్వహణపై సమీక్షలు చేశారు. ముఖ్యమంత్రి కూడా పరీక్షల తీరుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ ఉండాలని చెప్పారు. ఎక్కడా పేపర్ లీక్‌లు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్ కన్పిస్తోంది. ప్రతీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని, వాటిని చేరవేయడం, పరీక్షల తర్వాత సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం, మూల్యాంకన నిర్వహించడం, ఫలితాల క్రోడీకరణ, వెల్లడి వరకూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఫిర్యాదులు లేని వారినే విధుల్లోకి తీసుకునేందుకు ప్రాధాన్యమి చ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ భయం తొలగేనా? కొన్నేళ్లుగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారుతోంది. హాల్‌టికెట్లు మొదలుకొని, ఫలితాల వరకూ ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. ప్రశ్నపత్రాల్లో తప్పులు సర్వసాధారణం అవుతున్నాయి. మూల్యాంకన, ఫలితాల వెల్లడిలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా 2019లో ఇంటర్ బోర్డ్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ సమయంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంటర్ బోర్డ్ పెద్దగా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. ఆ తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడం సమస్యలు తె చ్చిపెట్టింది. ఈసారి ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా బోర్డ్ ముందే అప్రమత్తమైంది. నిపుణులతో ప్రశ్నపత్రాలను రూపొందించారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని వారినే ఎంపిక చేసుకున్నారు. అధికారులు ముందే ఈ వివరాలను తెప్పించుకుని మరీ పరిశీలించారు. టెన్త్ పరీక్షలు గత ఏడాది వివాదాలకు దారి తీశాయి. పేపర్ లీకేజీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు, ప్రైవేటు స్కూళ్లతో సంబంధాలున్న ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. హాల్‌టికెట్ల ఆలస్యంపై దృష్టి : టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల ఆలస్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించనుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులపై ప్రైవేటు స్కూల్, కాలేజీలు పరీక్షల సమయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. డౌన్లోడ్ చేసుకునే హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్, స్కూల్ హెచ్ఎం సంతకాలు అవసరమన్న ఆందోళన కల్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే హాల్‌టికెట్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలోతప్పిదాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలుతీసుకోవాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు వేధించకుండా చూడాలి. పేపర్ లీకేజి వంటి ఘటనలు జరగకుండా చూడాలి. –చింతకాయల ఝాన్సీ (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) ప్రైవేటుకు కొమ్ముకాయొద్దు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సహక రిస్తున్నట్టు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. పరీక్షలు సజావుగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) -
Public Exam Bill 2024: పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఉదంతాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో పరీక్షల అక్రమార్కులపై కేంద్రం కఠిన చర్యల కొరడా ఝులిపించింది. పేపర్ లీకేజీలు, నకిలీ వెబ్సైట్లుసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు–2024’ను తీసుకొచ్చింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని తీసుకొచ్చారు. బిల్లులో ఏముంది? ► ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడి నా, కంప్యూటర్ నెట్వర్క్/ రీసోర్స్/ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసిన వ్యక్తులు/సంస్థలను కఠినంగా శిక్షిస్తారు ► నకిలీ వెబ్సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ/ప్రవేశ పరీక్షలు చేపట్టడం, నకిలీ అడ్మిట్ కార్డులు, ఆఫర్ లెటర్లు ఇవ్వడం, ఒకరి బదులు ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడం వంటి అవకతవకలు చేసి నగదు వసూళ్లకు పాల్పడితే గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ► వీటితో ప్రమేయమున్న వ్యక్తులు/సంస్థలు/ఏజెన్సీలు/వ్యాపారసంస్థలు/ సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి జరిమానా విధిస్తారు. ఇంకోసారి ప్రభుత్వం నుంచి సంబంధిత పనులు చేపట్టకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తారు. ► యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్‌లో కలగజేసుకున్న అక్రమార్కులను సంబంధిత నియమాల కింద శిక్షిస్తారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ ఈ బిల్లులోని నియమాలు వర్తిస్తాయి. ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది మొత్తం ఈ చట్టపరిధిలోకి వస్తారు. -
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొకరు అరెస్ట్ అయ్యారు. న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని సీసీఎస్/సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 100 మందికి చేరింది. సిట్ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో అధిక మంది విద్యార్ధులే ఉండటం గమనార్హం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: మంత్రి సబిత గన్‌మెన్ ఆత్మహత్య -
యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
‘‘విద్యార్థులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వాలపై, మన అందరి పైనా ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూ΄÷ందిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. యూనివర్సిటీల్లో పేపరు లీకేజీలు, గ్రూపు 1, 2 ప్రశ్నా పత్రాల లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై΄ోవాలి? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీగారు దయచేసి ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ΄ోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వంటి విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. -
మరోసారి కరీంనగర్ చుట్టూ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోసారి కరీంనగర్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. కరీంనగర్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో అరెస్ట్‌ల సంఖ్య 53 కు చేరింది. హైటెక్ మాస్ కాపీయింగ్‌లో వీరిద్దరూ పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. డీఈఈ పూల రమేష్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 10 లక్షలకు డీల్ ఖరారవ్వగా, ప్రశ్నపత్రం ఇచ్చే విధంగా ఏఈఈ, డీఏవో పరీక్షల కోసం ఒప్పందం కుదిరింది. చెరో రూ.5 లక్షలకు కుదిరిన డీల్ చేసుకున్నట్లు సిట్ విచారణలో బట్టబయలైంది. మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాలు లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ లో నిందితులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అరెస్టులు జరిగే అవకాశం ఉంది. చదవండి: TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్. -
నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?
ఆర్.నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘10వ తరగతిలో పేపరు లీకేజీలు.. గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరుగుతున్నాయి. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?. కుంభ కోణాలు చేసే వారి వల్ల విద్యావ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా?. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్ ప్లే–మాటలు– సంగీతం– దర్శకత్వం– నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ: తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లుగా ఉన్న రాహుల్, శాంతి, సుచరితలను సిట్ విచారిస్తోంది. నిందితులను విచారించేందుకు 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. చంచల్ గూడ నుండి నిందితులను కస్టడీని తీసుకుని సిట్ విచారిస్తోంది. మరో వైపు సిట్ ముందు విచారణకు రేణుకా హజరుకానుంది. ఇప్పటికీ యుజర్ ఐడి, పాస్ వర్డ్ వ్యవహారం కొల్లిక్కి లేదు. కస్టోడియన్ శంకర్ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకు శంకర్ లక్ష్మి కేవలం సాక్షిగా సిట్ పరిగణించింది. తవ్వేకొద్దీ నిందితుల పాత్ర బయట పడుతోంది. ఇప్పటి వరకు 37 మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొంత మందికి పరీక్ష కంటే ముందే పేపర్ వెళ్లినట్టు సిట్ గుర్తించింది. అరెస్ట్‌ల సంఖ్య 50కి చేరుకునే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ కాగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. -
పేపరు లీకేజీ.. విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి?: ఆర్. నారాయణ మూర్తి
‘‘పదో తరగతి పరీక్ష ప్రశ్నా ప్రతాల లీకేజీ, గ్రూపు 1, 2 వంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీ... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? అనే కథాంశంతో ‘యూనివర్సిటీ’ చిత్రం తీశాను’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. (చదవండి: ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!) ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, నిరుద్యోగులు రెక్కలు తెగిన పావురాల్లా నిస్సహాయ స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వల్ల విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి, త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–్రస్కీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి, కెమెరా: బాబూరావు. -
నేడు ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ సభ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ఉద్యమకార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సోమవారం ఖమ్మంలో భారీసభ నిర్వహించనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు టెన్త్ పరీక్షల లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో ప్రభు త్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ నిరసనసభలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా ఖమ్మ ంలో తొలిసభ జరగనుంది. ఈ సభ సందర్భంగా సోమవా రం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి మయూరి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని టీపీసీసీ తెలిపింది. సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు పాల్గొంటారని, కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఈ సభకు భారీగా తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. 27న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించినందుకు నిరసనగా ఈనెల 27న గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. దీక్షలో సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు దీక్షలో పాల్గొంటారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీపై తొలి సంతకం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం. త్యాగాలకు, పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు గడ్డపై నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. ఈ కేసును పక్కదోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో తనను ఇరికించారని ఆరోపించారు. శనివారం హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు వేలాది మందితో బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీలు చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్ రాథోడ్ సహా పలువురు రాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరుద్యోగ మార్చ్ ముగింపు సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించట్లేదేం? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తప్పు చేశాడు కాబట్టే నీ కొడుకును కాపాడుకోవాలనుకుంటున్నావు. వెంటనే నీ కొడుకును బర్తరఫ్ చెయ్. మెడపట్టి గెంటేయ్. తప్పు చేస్తే కేసీఆర్ కుటుంబానికి ఒక న్యాయం? సామాన్యులకు ఒక న్యాయమా? ‘ఈ వేదికపై సీఎంకు చెబుతున్నా.. సిట్ విచారణకు మేం ఒప్పుకోం. నయీం, మియాపూర్ ల్యాండ్ స్కాం, డ్రగ్స్ కేసులో సిట్ విచారణ నివేదికలు ఏమయ్యాయి? కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను కాపాడుకొనేందుకే సిట్ విచారణ చేస్తున్నారు. మీరు వేసుకొనే సిట్లను ఇంకా నమ్మాలా’ అని బండి ప్రశ్నించారు. నిరుద్యోగ మార్చ్‌లు ఆగవు... పేపర్ లీకేజీపై తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పున పరిహారమివ్వాలని, అందుకోసమే నిరుద్యోగ మార్చ్ చేపట్టామని, ఈ మార్చ్ ఇంతటితో ఆగదని, ఈ నెల 21న పాలమూరు గడ్డమీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. వరుసగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతామని, ఆ తరువాత హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తిగల పార్టీ బీజేపీనే... ‘సీఎం కేసీఆర్‌కు తెలంగాణతో తెగదెంపులయ్యాయి. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్. ఆయనకు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు. దళితులను అడుగడుగునా అవమానించిన పార్టీ బీఆర్ఎస్. అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ. దళిత, గిరిజన, బలహీనవర్గాల అభ్యున్నతికి పాల్పడుతున్న పార్టీ బీజేపీ. రాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర మంత్రులుగా దళిత, గిరిజన, బలహీన వర్గాల వారిని చేసిన ఘనత బీజేపీదే’ అని బండి వివరించారు. ఒక్క అవకాశం ఇవ్వండి... ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పీల్ చేస్తున్నా... నిరుద్యోగులారా నిరాశ పడకండి. బీజేపీ అండగా ఉంది. మాకు నేషన్ ఫస్ట్... ఫ్యామి లీ లాస్ట్. తెలంగాణలో యువత మాకు ఫస్ట్.. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. తెలంగాణ ప్రజలు, యువతను కోరుతున్నా. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగరేస్తాం. రామరాజ్యం ఏర్పాటు చేస్తాం’ అని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, విజయరామారావు, కన్నబోయిన రాజయ్య, దరువు ఎల్లన్న, ఆకుల విజయ పలువురు పాల్గొన్నారు. -
లీకేజీ కేసులో ఈడీ స్పీడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పీడ్ పెంచింది. పేపర్ లీకేజీలో హవాలా లావాదేవీలకు అవకాశం ఉన్నందున వీటిపై దర్యాప్తు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకమైన టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితోపాటు టీఎస్పీఎస్సీ తరఫున ఈ కేసులో ఫిర్యాదుదారు సత్యనారాయణలను గురువారం ఈడీ అధికారులు 10 గంటలపాటు విచారించినట్టు సమాచారం. శంకర లక్ష్మిని ఈ కేసులో కేవలం సాక్షిగానే సిట్ పేర్కొనగా.. ఇప్పుడు ఈడీ మాత్రం శంకర్ లక్ష్మి నుంచే దర్యాప్తు ప్రారంభించడం ఈ కేసు విచారణపర్వంలో కొత్త కోణంగా చెప్పవచ్చు. మొత్తం పేపర్ల లీకేజీ కుట్రకు శంకర్లక్ష్మి కంప్యూటర్ నుంచే మూలాలు ఉండడంతో తొలుత ఆమెను ఈడీ అధికారులు విచారించినట్టు సమాచారం. ప్రధా నంగా ఈ కేసులో కీలక నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారని విచారణానంతరం శంకరలక్ష్మి మీడియా ప్రతినిధులకు తెలిపారు. తన ఆధార్, పాన్ వివరాలు తీసుకున్నారని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని ఆమె చెప్పారు. మీ సిస్టంలోకి వాళ్లు యాక్సెస్ ఎలా అయ్యారు? శంకర్‌లక్ష్మికి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలతో ఉన్న పరిచయం, ఆఫీస్‌లో వారి ప్రవర్తన, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో వారు వచ్చేవారా..? డబ్బు లావాదేవీల గురించి మీతో ఎప్పుడైనా చర్చించే వారా..? మీ కంప్యూటర్లోకి యా క్సెస్ ఎలా అవుతారు..? ఈ కంప్యూటర్ పాస్వర్డ్లు ఇంకా ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా?..మీ కంప్యూటర్ పరిసరా ల్లో సీసీటీవీ కెమెరాలు ఏవైనా ఉంటాయా?.. అన్న అంశాలపై నా ప్రశ్నించినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ అధికారి సత్యనారాయ ణ నుంచి సైతం కీలక వివరాలు సేకరించినట్టు తెలిసింది. పేపర్‌లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ దృష్టికి ఎలా వచ్చింది? ఏయే పేపర్లు లీకైనట్టు గుర్తించారు..? ఉద్యోగుల పాత్రపై అంతర్గతంగా ఏ చర్యలు తీసుకున్నారు? ఇలాంటి వివరాలు సేకరించినట్టు తెలిసింది. వీటిని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. సిట్ అధికారులను వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం విచారణకు హాజరైన శంకర్లక్ష్మి, సత్యనారాయణలను అవసరం మేరకు మరోమారు పిలుస్తామని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ల ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్ పేపర్ల లీకేజీలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. గురువారం దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, ఈ కేసులో సిట్ వివరాలు ఇవ్వవడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. 8 డాక్యుమెంట్లు కావాలని, కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌ను ఆదేశించాలని ఈడీ కోరింది. అయితే కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలిపింది. -
రిమాండ్‌ను సవాల్ చేస్తూ బండి సంజయ్ పిటిషన్
-
బండి సంజయ్ పిటిషన్‌పై నేడు హై కోర్టు విచారణ
-
పరువునష్టం దావా ఉపసంహరించుకోండి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ తనకిచ్చిన లీగల్ నోటీసులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ ఉదంతంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా తనను అడ్డుకోవడంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన లీగల్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు తన న్యాయవాది కుమార్ వైభవ్ ద్వారా కేటీఆర్ న్యాయవాది ఇనుగంటి సుధాన్షురావుకు శనివారం సమాధానం పంపారు. కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలు.. ‘ఏదైనా ప్రజాసంబంధిత అంశంలో ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుంది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో నేను చేసింది కూడా అదే. కానీ ప్రతిపక్ష నేతగా ప్రజల వాణిని వినిపించే నా గొంతును నియంత్రించేందుకు కేటీఆర్ నాకు నోటీసులిచ్చారు. దర్యాప్తు సంస్థలనే కాకుండా ప్రజలను కూడా ప్రభావితం చేసేలా మాట్లాడారు. లీకేజీలో ఇద్దరు ఉద్యోగుల తప్పిదమే ఉందంటూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని నేను ప్రజలకు చెబుతూ కేటీఆర్ వైఖరిని ప్రశ్నించాను. మంత్రిగా కేటీఆర్ నాపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ దురుద్దేశాలతో కూడినవి. అందువల్ల కేటీఆర్ వెంటనే నోటీసులను ఉపసంహరించుకోవాలి. లేదంటే తదుపరి పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’అని రేవంత్ తన సమాధానంలో పేర్కొన్నారు. -
డీఏఓ పేపరూ అమ్మేశాడు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) క్వశ్చన్ పేపర్లతో పాటు డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్న పత్రాలనూ సూత్రధారి పి.ప్రవీణ్ కుమార్ విక్రయించినట్లు తాజాగా బయటపడింది. ఈ విషయం గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం ఖమ్మం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కమిషన్ నిర్వహించిన, నిర్వహించాల్సిన ఆరు పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్న పత్రాలు లీకైనట్లు ఇప్పటికే సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు పంచుకున్నారని, ఏఈ పరీక్షలవి విక్రయించారని, మిగిలినవి ఏ అభ్యర్థుల వద్దకూ వెళ్లలేదని భావించారు. అయితే కమిషన్ కార్యదర్శి అనిత రామ్‌చంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ బ్యాంకు ఖాతాను విశ్లేషించిన అధికారులు డీఏఓ పరీక్ష పత్రాన్ని కూడా ఇతడు విక్రయించాడని గుర్తించారు. సాయి లౌకిక్ ఖమ్మంలో కార్ల వ్యాపారం చేస్తుండగా, ఈయన భార్య సుస్మిత గతంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్–1, డీఏఓ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న సుస్మిత ఉద్యోగం మాని వీటికోసం సిద్ధమయ్యారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన ఈమె ఓఎంఆర్ షీట్‌ను రాంగ్ బబ్లింగ్ చేశారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల పెన్నుతో మార్కింగ్ చేశారు. దీంతో ఈమె జవాబు పత్రాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశంలో తనకు న్యాయం చేయాలని కోరడానికి సుస్మిత పలుమార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి, పలువురు అధికారులను కలిశారు. ఇలా కమిషన్ కార్యదర్శి వద్దకు వచ్చిన సందర్భంలోనే ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తాను డీఏఓ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది. జవాబులతో కూడిన మాస్టర్ పేపర్‌నే ఇస్తా.. ఫిబ్రవరి మూడో వారంలో డీఏఓ పేపర్ చేజిక్కించుకున్న ప్రవీణ్ ఆమెను సంప్రదించారు. తన వద్ద డీఏఓ పరీక్ష పత్రం ఉందని, రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్త లౌకిక్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ప్రవీణ్‌ను కలిసి బేరసారాలు చేశారు. తాను ఇచ్చేది జవాబులతో కూడిన మాస్టర్ పేపర్ అని చెప్పిన అతగాడు రేటు తగ్గించడానికి ససేమిరా అన్నాడు. దీంతో అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు ప్రవీణ్ ఖాతాకు బదిలీ చేసిన లౌకిక్ డీఏఓ ప్రశ్నపత్రం ప్రింటెడ్ కాపీ తీసుకున్నాడు. మిగిలిన రూ.4 లక్షలు ఫలితాలు వెలువడిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ ప్రశ్న పత్రం ఆధారంగానే తర్ఫీదు పొందిన సుస్మిత ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష రాసింది. నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడం, ప్రవీణ్ సహా మొత్తం 15 మంది అరెస్టు కావడం జరిగిపోయాయి. ప్రవీణ్‌ను సిట్ పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించినా సుస్మిత వ్యవహారం చెప్పలేదు. కేవలం ఏఈ పేపర్లు మాత్రమే విక్రయించానని పదేపదే చెప్తూ సిట్ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రూ. 6 లక్షలపై తీగ లాగితే... అతడి బ్యాంకు ఖాతాలోకి నగదు లావాదేవీలు పరిశీలించిన అధికారులు రూ.6 లక్షలు ఫిబ్రవరి మూడో వారంలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆ నగదు లావాదేవీల వివరాలు చెప్పాలంటూ విచారణ సందర్భంలో ప్రవీణ్‌ను తమదైన శైలిలో అడిగారు. తన కారు ఖమ్మంలోని కార్ల వ్యాపారి లౌకిక్‌కు విక్రయించానని, దానికి సంబంధించిన మొత్తమే అది అంటూ తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనిపై సందేహాలు వ్యక్తం చేసిన సిట్ లౌకిక్‌కు సంబం«దీకులు ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారా? అనే అంశంపై దృష్టి పెట్టారు. కమిషన్ నుంచి తీసుకున్న ఆయా పరీక్షల అభ్యర్థుల జాబితాలోని వివరాలను సరి చూశారు. దీంతో లౌకిక్ భార్య సుస్మిత గ్రూప్–1తో పాటు డీఏఓ పరీక్ష రాసినట్లు వెల్లడైంది. దీంతో భార్యాభర్తలను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. శుక్రవారం ఇరువురినీ అరెస్టు చేసిన సిట్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. వీరి నుంచి ఈ పేపర్ ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దంపతుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. -
ఆ ఆరు పరీక్షలపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దయిన, వాయిదా పడిన అర్హత పరీక్షలను మళ్లీ నిర్వహించడంపై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. ఈ వార్షిక సంవత్సరంలో 26 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన కమిషన్, ఏడు పరీక్షలను నిర్వహించగా ఇందులో నాలుగు రద్దయ్యాయి. రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేశారు. కాగా ఇప్పటికే గ్రూప్–1 పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించిన కమిషన్.. రెండ్రోజుల క్రితం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. మిగతా నాలుగు పరీక్షలకు అతి త్వరలో తేదీలను ప్రకటించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తేదీల సర్దుబాటు .. ఆ ఆరు పరీక్షలకు కొత్తగా ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీ తదితర ప్రక్రియను తిరిగి చేపట్టాల్సి ఉండగా.. ఈ మేరకు చర్యలను టీఎస్పీఎస్సీ వేగవంతం చేసింది. పరీక్షల తేదీలను ఖరారు చేసేందుకు వీలుగా.. వీటి తో పాటు ఇతర పరీక్షల తేదీల సర్దుబాటు చేపట్టింది. ఈ క్రమంలోనే వచ్చేనెల 4వ తేదీన నిర్వహించాల్సిన హార్టీకల్చర్ ఆఫీసర్ అర్హత పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏఈఈ పరీక్షలను మే నెల 8, 9, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మిగతా నాలుగు పరీక్షలు కూడా మే నెలాఖరులోగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికను తయారు చేస్తోంది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో.. ఒకసారి పరీక్ష రాసిన అభ్యర్థి మళ్లీ అదే పరీక్ష రాయాలంటే కష్టమే. పరీక్షకు తిరిగి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాల్సిందే. అయినా ఆశించిన ఫలితం రాకపోవచ్చనేది అభ్యర్థుల ప్రధాన ఆందోళన. ఈ నేపథ్యంలోనే ఎక్కువ జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. -
లీకేజీ దొంగలకు కేటీఆర్ అండ
సాక్షి, న్యూఢిల్లీ: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో దొంగలను కాపాడేందుకు మంత్రి కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ హడావుడి, తొందరపాటు తీరు చూస్తుంటే ప్రజలకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తనకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారని, మంత్రి కేటీఆర్‌కు మాత్రం విచారణకు సంబంధించిన కీలక సమాచారం సిట్ అధికారులు ఇస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ కొనసాగుతోందన్న రేవంత్‌రెడ్డి... విచారణ నివేదిక కోర్టుకు అందకముందే జగిత్యాలలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల సమాచారం కేటీఆర్‌కు ఎలా అందిందని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ విషయంలో కేటీఆర్ పీఏ తిరుపతి చిన్నపావు మాత్రమేనన్నారు. కేటీఆర్‌కు నిర్దిష్ట సమాచారం ఉన్నప్పు డు కేసుకు సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వకుండానే తమపై క్రిమినల్ కేసులు పెడతామని మీడియాకు లీకులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు నేరగాళ్లు సమాచారం ఇచ్చారో లేక సిట్ విచారణ అధికారి ఇచ్చారో కేటీఆరే ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. విచారణపై కేటీఆర్ ఒత్తిడి... పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలే ఎక్కువని.. ఇందులో రూ. కోట్లు చేతులు మారాయని రేవంత్ ఆరోపించారు. మనీలాండరింగ్, హవాలా, విదేశీ లావాదేవీలు జరిగినందున కేసును సీబీఐ, ఈడీ, ఏసీబీ విభాగాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు తమ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల అపాయింట్మెంట్లు అడుగుతున్నా తమకు సమయం ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసు కాబట్టి అవినీతి నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని... కానీ సిట్ ఈ చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా చేర్చలేదని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మంత్రి కేటీఆర్ విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెచ్చి ఎదురుదాడికి దిగుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వ అధికారులను రక్షించేందుకు ప్రభుత్వం కేసును సిట్‌కు అప్పగించిందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు లేదు.. గతంలో ఎంసెట్, నయీం కేసులు మొదలుకుని వివిధ కేసుల్లో సిట్ ఒక్క నివేదిక కూడా ఇవ్వలేదని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ గుర్తుచేశారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధి కారి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు బాగా లేదని, అంతకుముందు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆయనకు రెండు వారాల జైలు శిక్ష విధించిన విషయాన్ని గుర్తించాలన్నారు. ‘ఇది 50 లక్షల మంది నిరుద్యోగుల సెంటిమెంట్‌కు సంబంధించిన సమస్య. తెలంగాణ విద్యార్థులు కేసీఆర్‌కు నచ్చకపోవచ్చు. కానీ వారి జీవితాలతో చెలగాటమాడే హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదు’అని పేర్కొన్నారు. రాహుల్ భయ్యా... నా ఇంటికి రావయ్యా సాక్షి, హైదరాబాద్: బహిష్కృత ఎంపీ రాహుల్‌గాంధీని తన ఇంట్లో ఉండాలని ఆహ్వానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్ వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్ ఇచ్చిన నోటీసును జత చేస్తూ ‘రాహుల్ భయ్యా... నా ఇల్లు మీ ఇల్లే. నా ఇంటికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మనది ఒక కుటుంబం. ఇది మీ ఇల్లు కూడా..’అని మంగళవారం రేవంత్‌రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
కేటీఆర్‌ను విచారిస్తే నిజాలు తెలుస్తాయి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని తాను మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 సహా మిగిలిన పరీక్ష పేపర్ల లీకేజీలో ఐటీ శాఖకు ప్రత్యక్ష సంబంధం ఉందన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని, ఆయనను సిట్ విచారిస్తే నిజాలు తెలుస్తాయని అన్నారు. మంగళవారం ఆయన బీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ మార్కుల వివరాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించకున్నా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో, సిరిసిల్లలో ఎంతమంది పరీక్ష రాస్తే ఎందరు క్వాలిఫై అయ్యారో కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ఆ డేటా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డిగానీ, కమిషన్ సభ్యులుగానీ ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేశారు. పేపర్ల కుంభకోణానికి తనకు సంబంధం లేదంటూనే టీఎస్పీఎస్సీ తరపున కేటీఆర్ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు మాత్రమే లీకేజీ అంశాలను వెల్లడించాల్సి ఉండగా, ఆ సంస్థ అధికార ప్రతినిధిగా కేటీఆర్ ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ఆఫీస్ ఈ వ్యవహారంలో రిమోట్‌గా పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తూ కేటీఆర్‌కు మాత్రం డేటా ఇస్తున్నారన్నారు. పేపర్ లీకేజీపై చైర్మన్ జనార్దన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కమిషన్ చైర్మన్, సభ్యుల హస్తం ఉందని ఆరోపించారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ తారుమారు చేశారనే అనుమానం బలపడుతోందని, కీలకమైన సాక్ష్యాలను చెరిపివేశారనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. 80 నుంచి 90 మార్కులుపైగా వచ్చిన వాళ్ల ఓఎంఆర్ షీట్లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. -
భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలైన రేణుక భర్త డాక్యా ఆమెకు తెలియకుండానే మరో ఇద్దరికి ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి ప్రశ్నపత్రాలను మరో నిందితుడు ప్రవీణ్ నుంచి అందుకున్న రేణుక... తన బంధువు ద్వారా నీలేష్ , గోపాల్లతోనే పేపర్ల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కు చెప్పి ప్రశ్నపత్రాలు తీసుకునేప్పుడే రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డదారిలో రాసిన ‘ప్రవీణ్ అండ్ కో’మెయిన్స్‌ను అదే పంథాలో క్లియర్ చేయాలనే పథకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పేపర్ లీక్ చేయొద్దని ప్రవీణ్ రేణుకకు చెప్పాడు. అందుకే రేణుక తన భర్తతో కలిసి నీలేష్, గోపాల్‌లను ఇంటికే తీసుకెళ్లి చదివించింది. అయితే ఈ పేపర్లను మరో ఇద్దరికి అమ్మి ఎక్కువ మొత్తం సొమ్ము చేసుకోవాలని డాక్యా భావించాడు. ఇందులో భాగంగానే భార్యకు చెప్పకుండా తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్ అనే మరో ఇద్దరు అభ్యర్థులకు ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సులు సైతం తీసుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టకూడదనే ఉద్దేశంతోనే వారిని ఈ నెల 4న (పరీక్ష ముందురోజు రాత్రి) హైదరాబాద్‌లో తాము బస చేసిన ఓ లాడ్జికి రప్పించి పేపర్లు అందించాడు. ప్రవీణ్ ఇంటి నుంచి నగదు స్వాదీనం... ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా రూ. 14 లక్షల వరకు ఆర్జించిన రేణుక అందులో రూ. 10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. రెండు దఫాలుగా ఈ డబ్బు అందుకున్న ప్రవీణ్ అందులో కొంత మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. అకౌంట్లో ఉన్న డబ్బును ప్రవీణ్ అరెస్టు సందర్భంలోనే అధికారులు గుర్తించారు. అదనపు కస్టడీలో భాగంగా అతన్ని విచారిస్తున్న సిట్ అధికారులు సోమవారం బడంగ్‌పేటలోని మల్లికార్జునకాలనీలో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ లభించిన రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌లను అరెస్టు చేసిన సిట్ పోలీసులు... సోమవారం తిరుపతయ్యను అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. వారి నుంచి మరెవరికైనా పేపర్ అందిందా అనే కోణంలో ఆరా తీయనున్నారు. గ్రూప్–1 టాపర్లకు సామర్థ్య పరీక్షలు.. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100కుపైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో ఇప్పటికే 53 మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు... అభ్యర్థుల సమర్ధతను పరీక్షించడానికి ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. నిపుణులతో మరో ప్రశ్నపత్రం తయారు చేయించి వాటికి సమాధానాలు రాయించడం ద్వారా అభ్యర్థుల సమర్థతను పరీక్షిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి వచ్చి గతేడాది గ్రూప్–1 పిలిమ్స్ రాసి 100కుపైగా మార్కులు పొందిన మరో నిందితుడైన రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌కు సిట్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. హ్యాకింగ్ ద్వారానే... పేపర్ల లీకేజీ కేసులో అదనపు కస్టడీకి తీసుకున్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను రెండో రోజైన సోమవారం తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. ముఖ్యంగా కమిషన్ సెక్రటరీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.ప్రవీణ్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్‌లను లోతుగా విచారించి పేపర్ల లీకేజీ అంశంలో మరో చిక్కుముడిని విప్పారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న శంకరలక్ష్మి కంప్యూటర్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రవీణ్ సిస్టం ద్వారా హ్యాక్ చేసిన రాజశేఖర్ అందులోంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్నట్లు తేల్చారు. -
‘బండి’కి బదులు బీజేపీ లీగల్ టీమ్
హిమాయత్‌నగర్, సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ లీకేజ్ స్కామ్‌లో పలు ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎట్టకేలకు సిట్ రెండో నోటీసులకు స్పందించారు. శనివారం మలిసారి సిట్ నోటీసులు జారీ చేయడంతో ఆదివారం తమ పార్టీకి చెందిన లీగల్ టీమ్‌ను సిట్ కార్యాలయానికి పంపారు. లీగల్ సెల్ కన్వి నర్ రామారావు, లీగల్ సెల్ ఇన్చార్జి ఆంథోనిరెడ్డి నేతృత్వంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చిన బీజేపీ బృందం బండి సంజయ్ రాసిన లేఖను అధికారులకు అందించింది. ఆ లేఖలో సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను సిట్ ఎదుట హాజరుకాలేనని తెలియజేశారు. ఒక ప్రజాప్రతినిధిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ రూపాలు, మార్గాల్లో తనకు సమాచారం అందుతుందని, అదే విధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై తనకు వ చ్చిన సమాచారాన్ని ప్రజల సమక్షంలో (పబ్లిక్ డొమైన్) పెట్టానని సిట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలోనూ సిట్‌కు తెలిపానని, అయినప్పటికీ మరోసారి నోటీసులు ఇవ్వడానికి కారణాలను తాను ఊహించగలనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. బాధ్యత కలిగిన ఆ మంత్రి అలా ఎలా చెబుతారు? టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు, ముఖ్యంగా గ్రూప్–1 పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, రాష్ట్ర కేబినెట్లో ఓ బాధ్యత గల మంత్రి ఈ వ్యవహారంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పారని గుర్తు చేశారు. అయితే సిట్ ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసిందని, ఆది నుంచీ ఈ స్కామ్‌ను తక్కువ చేసి చూపడానికి, ఈ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించడానికి గట్టి ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెడితే ఈ కుంభకోణం వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకును దృష్టిలో పెట్టుకోవాలని సిట్‌కు విజ్ఞప్తి చేశారు. ఒకే గ్రామంలో అనేక మంది టీఎస్పీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించడంపై వ చ్చిన సమాచారాన్ని తాను పబ్లిక్ డొమైన్లో ఉంచానని, అందులోని అంశాలను దర్యాప్తు చేయడానికి బదులు తనకు నోటీసులు ఇచ్చారని సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. మార్చి 26 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు తాను సిట్ విచారణకు రాలేనని స్పష్టం చేశారు. సిట్ కార్యాలయానికి వెళ్లిన బృందంలో న్యాయవాదులు వేముల అశోక్, దేవినేని హంస, సుంకర మౌనిక తదితరులు ఉన్నారు. -
లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నీలేష్ , గోపాల్, డాక్యా, రాజేందర్లు ఈ నెల 4న రాత్రి హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసినప్పుడు వారిని మరో ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలతో గుర్తించారు. వారిని నవాబ్‌పేట్, షాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్గా నిర్ధారించారు. డాక్యా, రేణుకల విచారణలోనూ ఇదే విషయం రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ అభ్యర్థులిద్దరూ ప్రశ్నపత్రాన్ని రూ.18 లక్షలకు కొనేందుకు డాక్యా, ఇతరులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.10 లక్షల వరకు చెల్లించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌లోని సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య... ప్రశాంత్, రాజేంద్రకుమార్లతోపాటు పలువురు ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో దళారిగా వ్యవహరించాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి ఆధారాలు లభించాక అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తోంది. మరోవైపు గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల విచారణ కొనసాగుతోంది. ఆదివారం మరో 20 మంది అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు విచారించిన వారి సంఖ్య 50 దాటింది. అడ్డదారి తొక్కి.. అడ్డంగా బుక్కయ్యి.. షాద్‌నగర్ రూరల్: సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన రాజేంద్రకుమార్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నేరేళ్ల చెరువు గ్రామం. నిరుపేదలైన లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ దంపతుల నలుగురు సంతానంలో అతను పెద్ద కొడుకు. రాజేంద్రకుమార్ కొన్నేళ్లు ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం అప్పులు చేసి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే కచ్చి తంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడంతోపాటు ఇతరుల వద్ద అప్పు చేసి రూ.5 లక్షలకు డాక్యా నాయక్ ద్వారా ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ బండారాన్ని సిట్ నిగ్గుతేల్చడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 8 గంటలపాటు నిందితుల విచారణ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కోర్టు అదనపు కస్టడీకి అనుమతించడంతో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారిని ప్రశ్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం నుంచి సీసీఎస్‌కు తరలించారు. సోమ, మంగళవారాల్లోనూ వారిని విచారించనున్నారు. -
సిట్ విచారణపై విశ్వాసం లేదు
సాక్షి, హైదరాబాద్: ఒక లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని.. అందువల్ల తాను టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిట్‌కు లేఖ రాశారు. వాస్తవానికి తనకు సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఎలాంటి నోటీసులు అందలేదని, వాటిలో ఏముందో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. సిట్ నోటీసులు జారీ చేసినట్టు మీడియా వార్తల ద్వారా తన దృష్టికి రావడంతో లేఖ రూపంలో స్పందిస్తున్నట్టు వివరించారు. ‘‘టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఆ«దీనంలోని సిట్ జరుపుతున్న విచారణపై మాకు నమ్మకం లేదని పేపర్ లీకేజీ స్కాం బయటపడిన నాటి నుంచీ చెప్తున్నాం. అధికార పీఠానికి దగ్గరగా ఉన్న వారి అండదండలు లేకుండా ఇలాంటివి జరిగే అవకాశం లేదని మేం నమ్ముతున్నాం. ఈ కేసులో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మేం గట్టిగా నమ్ముతున్నందున.. సిట్ ఏర్పాటే సరైంది కాదని భావిస్తున్నాం. సిట్‌పై ఎలాంటి విశ్వాసం, నమ్మకం లేనప్పుడు పేపర్ లీకేజీకి సంబంధించి మా వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకునే విషయమే ఉత్పన్నం కాదు. అందువల్ల నమ్మకమున్న విచారణ లేదా దర్యాప్తు సంస్థలకే సమాచారాన్ని చేరవేసే మా హక్కును ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం..’’అని సిట్‌కు రాసిన లేఖలో సంజయ్ పేర్కొన్నారు. రావాలంటే.. హాజరవుతా.. ఈ అంశంలో తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని విచారణ సంస్థ భావిస్తే.. వచ్చేందుకు సుముఖంగానే ఉన్నానని పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ తేదీని తెలియజేయాలని కోరారు. -
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులతో కలసి నేడు(శనివారం) ధర్నాచౌక్ వద్ద బీజేపీ నిర్వహించనున్న మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇస్తూ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. 500 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనరాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆ పార్టీకి షరతులు విధించింది. షరతులను ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ధర్నాలో పాల్గొనే కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతల జాబితాను శుక్రవారంరాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. ఆ మేరకు పోలీసులు భద్రతాఏర్పాట్లు చేయాలని సూచించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ వ్యవహారంలో ప్రభుత్వతీరును నిరసిస్తూ ఈ నెల 25న హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగులతో కలసి మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ధర్నాకు అనుమతి కోరుతూ పోలీసులకు బీజేపీ నేతలు దరఖాస్తు చేసినా ఎటూ తేల్చకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాజకీయ పారీ్టలు నిరసనలు తెలపకూడదని లేదు కదా. ధర్నాచౌక్ ఉన్నది సమస్యలపై నిరసన నిర్వహించేందుకే.. ధర్నా చౌక్‌లో అనుమతి ఇవ్వకుంటే ప్రజలు ఎక్కడ ధర్నా చేసుకుంటారు? నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
టీఎస్పీఎస్సీ ఘటనపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ఘటనపై ఢిల్లీకి వెళ్లి సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల గూడుపుఠాణీ ఉందని, కేసును నీరుగార్చేందుకే సిట్‌కు అప్పగించారని ఆరోపించారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ఘటనలో పెద్దల పాత్రను కప్పిపుచ్చుకునేందుకే తమను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనను గృహ నిర్బంధం చేయడం ఆటవిక చర్య అని మండిపడ్డారు. అనర్హులను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారని, దీనిపై హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసి కౌంటర్ దాఖలు చేయాలని సూచించినా ప్రభుత్వం దాఖలు చేయకుండా వాయిదాలు కోరిందన్నారు. అనర్హులను అందలం ఎక్కించడం వల్లనే ఈ అనర్థం జరిగిందని చెప్పారు. లీకేజీ కేసులో మొదట విచారించాల్సింది సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మినని, ఏ1 ప్రవీణ్‌కుమార్‌పై ఏసీబీ సెక్షన్ల కింద కేసు పెట్టి ఉంటే విచారణ త్వరగా జరిగేదని, ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఆ పని చేయలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులను కూడా సిట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. లీకేజీలో మంత్రి కేటీఆర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందన్నది తమ నిర్దుష్ట ఆరోపణ అని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పెద్ద తలల్ని సిట్ విచారిస్తేనే నిజాలు బయటకు వస్తాయన్నారు. పాదయాత్ర ఏప్రిల్ 6 వరకు వాయిదా టీఎస్పీఎస్సీ లీకేజీ ఘటనపై న్యాయం కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున తన పాదయాత్రను ఏప్రిల్ ఆరో తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు రేవంత్ వెల్లడించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా, 24, 25 తేదీల్లో నిరసన తెలపాలని అనుకున్నా ప్రభుత్వం నియంతృత్వ పోకడతో తమను నిర్బంధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టీఎస్పీఎస్సీ లీకేజీ ఘటనపై ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్1 నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తామని, ఏప్రిల్ రెండో వారంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని రేవంత్ వెల్లడించారు. -
ఉస్మానియా యూనివర్సిటీ: నేడు రేపు క్యాంపస్‌లో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీపై విద్యార్థులు జ్యూడిషియల్ విచారణకి పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకి ప్లాన్ చేశారు. ఓ వైపు దీక్షకి పర్మిషన్ లేదంటూ యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా.. మరో వైపు దీక్ష చేస్తే కేసులు తప్పవని ఓయూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి సంఘాలు మాత్రం తాము దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశాయి. క్యాంపస్‌లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం చెప్పగా, వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం వారి రాకను స్వాగతిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తున్న క్రమంలో విద్యార్థులను ఓయూ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో క్యాంపస్‌లోకి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసింది. -
నో సెల్‌ఫోన్ జోన్లుగా ‘పది’ పరీక్ష కేంద్రాలు
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నందికొట్కూరు, కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె హైస్కూళ్లలో జరిగిన ఘటనల దృష్ట్యా ఈ ఏడాది ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. అదే విధంగా ప్రశ్నపత్రంలో ఏడు అంకెల ప్రత్యేక కోడ్‌ను ముద్రించారు. ఎక్కడైన ప్రశ్నపత్రం లీకేజీ అయినా.. ఆ పేపర్‌పై ఉన్న ఏడు అంకెల కోడ్‌ను బట్టి సులువుగా ఏ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిందో స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రాలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గదుల్లో లైటింగ్ ఉండేలా, ఫ్యాన్లు తిరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన బడి నాడు–నేడు కింద రెండో విడతలో చేపట్టిన పనులు పూర్తి చేసేలా సమగ్ర శిక్ష విభాగం, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల దగ్గర అదనపు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. 149 కేంద్రాల్లో పరీక్షలు వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 149 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు దగ్గర ఉండేవి) 79, బీ సెంటర్లు(పోలీసు స్టేషన్లకు 8 కి.మీ. లోపు ఉండేవి)56, సీ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు 8 కి.మీ.కు పైగా ఉన్నవి)14 ఉన్నాయి. ఈ కేంద్రాలలో 490 ఉన్నత పాఠశాలలకు చెందిన 32,780 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల విధులు నిర్వహించేందుకు 149 మంది ముఖ్య పర్యవేక్షకులను, 149 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 1,664 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 11 సమస్యాత్మమైక, 9 అత్యంత సమస్యాత్మకమైన పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఉండనున్నారు. అలాగే 7 ప్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు పనిచేయనున్నాయి. జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 149 పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించాం. నాతో సహా ఏ స్థాయి అధికారి అయినా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకపోకూడదు. కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు. ఏ చిన్న తప్పు జరిగినా సంబంధిత కేంద్రా ల్లో విధులు నిర్వహించే వారే బాధ్యులు అవుతారు. జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. – డాక్టర్ వెంకట రంగారెడ్డి, డీఈఓ నేడు, రేపు జిల్లాకు ప్రశ్నపత్రాలు పదో తరగతి ప్రశ్నపత్రాలు నేడు, రేపు జిల్లాకు రానున్నాయి. నేడు(గురువారం) మొదటగా సెట్–1, రేపు(శుక్రవారం)రెండో సెట్ ప్రశ్నపత్రాలు రానున్నాయి. వీటిని జిల్లాలో ఎంపిక చేసిన 38 స్టోరేజీ పాయింట్లకు చేర్చి అక్కడ భద్రపరచనున్నారు. ఇందుకు ఇప్పటికే 11 రూట్లకు ఆఫీసర్లను సైతం ఎంపిక చేశారు. -
ఆ ముగ్గురినీ ప్రాసిక్యూట్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు ఉద్యోగ నియామకాల పేపర్లను అమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు, ఇతర వ్యక్తులనే కాకుండా రాష్ట్ర మంత్రి కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దనరెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను కూడా ప్రాసిక్యూట్ చేసే విధంగా విచక్షణాధికారాలు ఉపయోగించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని 17మందితో కూడిన కాంగ్రెస్ బృందం గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదుతో కూడిన వినతిపత్రం అందజేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేతలతో 40 నిమిషాల చర్చ కాంగ్రెస్ నేతల వాదనలను విన్న గవర్నర్ తమిళిసై ఈ విషయమై దాదాపు 40 నిమిషాల పాటు వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలన్నింటినీ గమనిస్తున్నానని, ఈ విషయాన్ని తాను రాజ్యాంగపరమైన కోణంలోనే చూడాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. తాను రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, ఈ మేరకు అవసరమైన సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించానని, న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నానని కాంగ్రెస్ నేతలతో గవర్నర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై మనస్తాపంతో సిరిసిల్లకు చెందిన నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా గవర్నర్, కాంగ్రెస్ బృందం మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించినట్టు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లురవి, మహేశ్‌కుమార్‌గౌడ్, మల్రెడ్డి రాంరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాములు నాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్, రాములు నాయక్, రోహిణ్‌రెడ్డి, వల్లె నారాయణరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లున్నారు. కేటీఆర్‌దే బాధ్యత: రేవంత్ గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ ఎదుట రేవంత్ మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి ఈ కేసును విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న శాఖకు చెందిన ఉద్యోగులే పేపర్‌లీకేజీలో కీలకంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఘటనకు కేటీఆరే బాధ్యత వహించాలన్నారు. ఆర్టికల్ 317 ప్రకారం రాష్ట్ర గవర్నర్ కుండే విచక్షణాధికారం ప్రకారం వ్యవహరించి ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేయాలని కోరామని చెప్పారు. -
మా నౌకరీలు మాగ్గావాలే
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మహా ధర్నా’నిర్వహించనున్నారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలసి ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఇదివరకే రాసిన వివిధ పరీక్షలు రద్దయి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా తొలుత 25న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న వివిధ సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవాలని, వారి పక్షాన పోరాడాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వివిధ సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పార్టీనేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఆంటోనీరెడ్డి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు. -
'పేపర్ లీకేజీలు సర్వసాధారణం.. దీనికే మంత్రి కేటీఆర్ దోషా?'
నిర్మల్/నిర్మల్ టౌన్: ‘పేపర్ లీకేజీలు సర్వసాధారణంగా జరుగుతుంటాయ్.. అప్పుడప్పుడూ ఇంటర్, టెన్త్‌లో ఎన్నో రకాలుగా జరుగుతాయి. దీనికే మంత్రి కేటీఆర్‌ను దోషి అంటున్నారు. సీఎంకే నోటీసులు ఇవ్వాలంటున్నారు. కేటీఆర్ పీఏ తిరుపతికి చెందిన గ్రామంలోనే 100 మందికిపైగా నూరు మార్కులపైనే వచ్చాయని రేవంత్‌రెడ్డి అంటే ‘సిట్’ ఆయనకు నోటీసులిచ్చింది. ఆధారాలుంటే చూపెట్టాలి. నిజంగా ఉంటే తప్పు జరిగిందని ఒప్పుకోవచ్చు. ఆధారాలు చూపెట్టమనడంలో తప్పేంలేదు’ అని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆయన మాటలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. ఎమ్మెల్సీ కవిత విచారణ, పేపర్ లీకేజీ, పార్టీ ఆత్మీయ సమ్మేళనాలపై నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇందులో పేపర్ లీకేజీ అంశంపై మాట్లాడే సందర్భంలో సర్వసాధారణంగా క్వశ్చన్ పేపర్ల లీకేజీలు జరుగుతుంటాయని ఆయన అనడం చర్చనీయాంశమైంది. కవితను కేంద్రం వేధిస్తోంది.. తెలంగాణ కోసం ఉద్యమించిన కల్వకుంట్ల కవితను ఓ మహిళ అని కూడా చూడకుండా ఈడీ ద్వారా కేంద్రం వేధిస్తోందని ఇంద్రకరణ్ ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో విచారణ పేరుతో మళ్లీమళ్లీ పిలుస్తోందని విమర్శించారు. దేశంలోకెల్లా ప్రధాని మోదీపై ఎదురుదాడి చేసే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆరేనని చెప్పారు. కేంద్రానికి దమ్ముంటే సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవాలని, ఇలా మహిళలను అడ్డుపెట్టుకొని ఆటలడటం సరికాదని సూచించారు. బీజేపీ వాళ్లంతా సత్యపూసలా? బీజేపీలో ఎవరూ కూడా తప్పు చేయడం లేదా? వాళ్లంతా సత్యపూసలు, వేరే పారీ్టల వాళ్లే దోషులా? అని ఇంద్రకరణ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రజల కోసం చేసిన బిల్లులను నామినేటెడ్‌గా వచి్చన గవర్నర్ అట్టిపెట్టుకుంటే బీజేపీ నేతలు ఉత్సవాలు చేసుకుంటున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాజీనామా చేయమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లకు చెప్పుకోవడం రాదు కానీ.. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ 12 ఏళ్లు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. నా మాటలను వక్రీకరించారు.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాలుక కరుచుకున్నారు. తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. ‘బీజేపీ, కాంగ్రెస్ హయాంలో పేపర్ లీకేజీలు సర్వసాధారణమయ్యాయనే సందర్భంలోనే నేను మాట్లాడాను’అని వివరణ ఇచ్చారు. పేపర్ లీకేజీ దురదృష్టకరమని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. చదవండి: కొలువుల కలవరం -
టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కమిషన్ మాజీ ఉద్యోగి, తన స్నేహితుడైన సురేశ్‌కూ ప్రవీణ్‌కుమార్ గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం పంపినట్లు తేలింది. దీంతో మంగళవారం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశి్నస్తున్నారు. తమ అదుపులో ఉన్న తొమ్మిది మంది నిందితులను కూడా వరసగా నాలుగో రోజూ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. 10 మంది కమిషన్ ఉద్యోగులు క్వాలిఫై.. గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ప్రవీణ్‌కుమార్ గతేడాది జూన్ నుంచి ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కమిషన్‌లోనే నెట్వర్క్ అడ్మిన్‌గా పని చేస్తున్న రాజశేఖర్ సాయంతో కస్టోడియన్ కంప్యూటర్లో ఉన్న ఈ ప్రశ్నపత్రాన్ని గతేడాది అక్టోబర్ తొలి వారంలో చేజిక్కించుకున్నాడు. దీన్ని వినియోగించి తాను పరీక్షకు సిద్ధం కావడంతో పాటు తన స్నేహితుడైన సురేశ్‌కు వాట్సాప్ ద్వారా పంపాడు. అతడు కూడా మంచి మార్కులతో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో సురేశ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసు కుని ప్రశి్నస్తున్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు క్వాలిఫై అయినట్లు సిట్ గుర్తించింది. ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. గ్రూప్–1 అనుభవంతో మిగతా పేపర్ల కోసం.. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. రాజశేఖర్ కాంటాక్టుల పైనా ఆరా.. లీకైన ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్ సైతం తన పెన్డ్రైవ్లోని కాపీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతను ఎవరికైనా అమ్మడం, షేర్ చేయడం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూప్స్‌లో ఉన్న వారితో జరిగిన సంప్రదింపుల వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిలో ఎవరైనా గ్రూప్–1 సహా ఇతర పరీక్షలు రాశారా? ఉత్తీర్ణులయ్యారా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఏఈ ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నీలేష్, గోపాల్ రూ.14 లక్షల వరకు చెల్లించారు. ఇందులో రూ.లక్ష వీరికి కానిస్టేబుల్ శ్రీనివాస్ సర్దుబాటు చేసినట్లు సిట్ గుర్తించింది. నగదు ఇచి్చనందుకు అతడు సైతం ప్రశ్నపత్రాన్ని వీరి నుంచి పొందాడా? ఎవరికైనా పంపాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. ప్రవీణ్ ఇంట్లో సోదాలు ప్రవీణ్‌కుమార్ నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట కార్పొరేషన్ 19వ డివిజన్లోని మల్లికార్జుననగర్ కాలనీలో మంగళవారం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పేపర్ లీక్‌కు సంబంధించిన ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు, కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయ సమాచారం. కాగా కొన్ని వస్తువులను కూడా సిట్ బృందం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. చదవండి: కొలువుల కలవరం -
ప్రగతిభవన్‌లో పేపర్ లీకేజీ మూలాలు
లక్డీకాపూల్(హైదరాబాద్): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు మూలాలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే ఈ లీకేజీ జరిగిందన్నారు. ‘టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ– ప్రభుత్వ వైఫల్యం–నిరుద్యోగుల గోస’అనే అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యువజన సమితి, విద్యార్థి జన సమితి అధ్యక్షులు సలీం పాషా, సర్దార్ వినోద్ కుమార్ అధ్యక్షతన అఖిలపక్షాల రౌండ్‌టేబుల్ సమావేశంజరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నీళ్లు, నియామకాలు, నిధులు(ట్రిపుల్ ఎన్) కాస్తా లీకులు, లిక్కర్, లిఫ్ట్(ట్రిపుల్ ఎల్)గా మారిందని అన్నారు. పేపర్ లీకేజీ నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిరుద్యోగ అభ్యర్థులకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆవేశపూరితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు. కేసీఆర్ కాస్కో: కోదండరాం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ఈ లీకేజీ వ్యవహా రం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదని, పాలకులతో దీనికి సంబంధం ఉందని అన్నా రు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీ ఘటనకు సీఎం కేసీఆర్‌దే నైతిక బాధ్యత అని అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అరాచకాలపై ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. గెలుపు కేసీఆర్ పైసాదో, మా పోరాటపటిమదో చూద్దామని సవాల్ విసిరారు. ‘ఇక ఐక్యంగా ఉద్యమిస్తాం, కేసీఆర్ కాస్కో’అని హెచ్చరించారు. త్వరలో అన్ని పార్టీలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ తీరు ఇలా ఉంటే, మిగతా శాఖల్లో నియామకాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయంలేని వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా, సభ్యులుగా నియమించాలన్నారు. సమావేశంలో ప్రొ.హరగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వినర్ అంబటి నాగన్న, టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేశ్, కాంగ్రెస్ నేతలు కిరణ్‌రెడ్డి, భూపతిరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఝాన్సీ, ప్రవీణ్, విద్యార్థి సంఘాల నేతలు మహేశ్,, నాగేశ్వర్రావు, పుట్ట లక్ష్మణ్, ఓయూ జేఏసీ నేతలు శ్రీహరి, దయాకర్, నిరుద్యోగుల సంఘం నేత నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ‘ఎన్ఆర్ఐ’ లింకులు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న టీఎస్పీఎస్సీ లీకేజీలో ఎన్ఆర్ఐల పాత్ర ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కమిషన్‌లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొదలుకుని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా ఎన్ఆర్ఐలు కావడంపై సిట్ దృష్టి సారించినట్లు స్థానిక పోలీసు వర్గాల సమాచారం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డిది సాధారణ కుటుంబం. అతని అత్తింటివారిదీ అదే పరిస్థితి. అయితే రాజశేఖర్‌రెడ్డి ఎదగడానికి రాజకీయ పరిచయాలే కారణమని, విదేశాల్లో ఉండి రావడంతో హైదరాబాద్ ఎన్ఆర్ఐ సర్కిల్స్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. విదేశాల నుంచి వచి్చన ఓ నాయకుడి పైరవీతో రాజశేఖర్‌రెడ్డికి టీఎస్‌పీఎస్‌స్సీలో కొలువు దక్కిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గ్రూప్–1లో ‘విదేశీ’ కోణం పరిశీలించాలి.. రాజశేఖర్‌రెడ్డి ఎన్ఆర్ఐ మిత్రుల్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. 2018లో విదేశాల నుంచి వచ్చిన ఆ ఇద్దరికీ పేపర్ లీక్‌ల ద్వారా రాజశేఖర్‌రెడ్డే కొలువులు దక్కేలా చేశాడని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే సమయంలో రాజశేఖర్‌రెడ్డి మరో ఇద్దరు సన్నిహితులు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి బంధువులు మాత్రం వారు దసరా కోసం వచ్చారని అంటున్నారు. ఈ వ్యవహారం తేలాలంటే.. ఇలా ఎందరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్–1 రాశారో సిట్ పరిశీలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆస్తులపై ఆరా.. కంప్యూటర్, డిజిటల్ పరిజ్ఞానం మీద పూర్తిస్థాయి పట్టు ఉన్న వ్యక్తి కావడంతో రాజశేఖర్‌రెడ్డి పకడ్బందీగా లీకేజీ కథ నడిపాడని సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు రాజశేఖర్‌రెడ్డితో పాటు అతని సమీప బంధువుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న సిట్.. కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన ఇద్దరి వివరాలు సేకరించారని తెలిసింది. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కరీంనగర్‌తో లింకులు.. రాజశేఖర్ బంధువుల పాత్రపై అనుమానాలు -
నేటి నుంచి నిందితుల ఉమ్మడి విచారణ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలతో సహా తొమ్మిది మంది నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే. వీరిని శని, ఆదివారాల్లో విడివిడిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నమోదు చేసిన వాంగ్మూలాలను సరిపోల్చుతూ మొత్తం 30 ప్రశ్నలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసింది. దీని ఆధారంగా సోమవారం నుంచి నిందితులను ఉమ్మడిగా ప్రశ్నించాలని నిర్ణయించింది. ప్రవీణ్–రాజశేఖర్, ప్రవీణ్–రేణుక, రాజశేఖర్–రేణుక.. ఇలా ఇద్దరిద్దరు చొప్పున, ఆ తర్వాత అందరినీ కలిపి ప్రశ్నించడానికి సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు టీఎస్పీఎస్సీ నుంచి సీజ్ చేసిన కంప్యూటర్ తదితరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు (ఎఫ్ఎస్ఎల్కు) పంపింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక అందిన తర్వత కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. గ్రూప్–1 డిస్ క్వాలిఫై వెనుక కుట్ర! కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ గ్రూప్–1 పరీక్షలో డిస్ క్వాలిఫై కావడం వెనుకా కుట్ర ఉందని సిట్ అనుమానిస్తోంది. ప్రవీణ్ ఆ పేపర్ కూడా చేజిక్కించుకున్నాడని, దాని ఆధారంగా పరీక్ష రాసి 150కి 103 మార్కులు సాధించాడని భావిస్తోంది. ఈ లీకేజ్ విషయం వెలుగులోకి రాకుండా ఉండటానికే ఓఎంఆర్ షీట్‌ను తప్పుగా నింపి డిస్ క్వాలిఫై అయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలా చేస్తే ఎవరి దృష్టిలోనూ పడమని, తనకు ఎలాగూ ఎక్కువ మార్కుల రావడంతో ఆ తర్వాత అదును చూసుకుని మెయిన్స్ పరీక్ష లోపు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ఆ పరీక్ష రాయడానికి అనుమతి పొందాలనే పథకం వేశాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. మెయిన్స్ పేపర్‌ను సైతం చేజిక్కించుకునేందుకు ప్రవీణ్ పథకం వేశాడని అనుమానిస్తున్నారు. తనతో సన్నిహితంగా ఉన్న రేణుకతో ప్రవీణ్ ఈ వ్యవహారం చెప్పి ఉంటాడని, ఈ నేపథ్యంలోనే ఆమె మిగిలిన ప్రశ్నపత్రాల లీకేజ్ ఆలోచన చేసి ఉంటుందని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి జరిగే విచారణలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. మంచి మార్కులు వచ్చిన వారిపై నజర్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించిన వారినీ సిట్ అనుమానితులుగా చేర్చింది. ప్రాథమికంగా 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 28 మందితో జాబితా రూపొందించారు. వీరి కాల్ డిటైల్స్, వాట్సాప్ వివరాల్లో.. నిందితులతో లింకుల కోసం సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గ్రూప్–1 పేపర్ ప్రవీణ్ లేదా మరెవరి ద్వారా అయినా వారికి అందిందా? అనే అంశంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వీరిలో కొందరిని సిట్‌కు పిలిచి విచారించారు. కొందరు యూపీఎస్సీతో పాటు ఇతర పరీక్షలు కూడా రాసి మంచి మార్కులు పొందినట్లు గుర్తించారు. ఇద్దరి వ్యవహారశైలిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని మరికొన్ని కోణాల్లోనూ ప్రశ్నించనున్నామని ఓ అధికారి తెలిపారు. ఆదివారం అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్‌తో కలిసి హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివిధ సాంకేతిక అంశాలను పరిశీలించారు. మరింత మందికి పేపర్లు! రెండోరోజు నిందితులను 7 గంటలకు పైగా సిట్ విచారించింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలకు చెందిన వాట్సాప్ చాట్లను సైబర్ నిపుణులు రిట్రీవ్ చేశారు. వాటిని నిందితుల ముందుంచి ప్రశ్నించారు. వాట్సా‹³లు పరిశీలించిన నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలు చాలామందికి ప్రశ్నపత్రాలు పంపినట్లుగా ఆధారాలు లభించాయి. గ్రూప్–1 పేపర్‌ను కూడా చాలామందికి సర్క్యులేట్ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో కమిషన్ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ వినియోగించిన కంప్యూటర్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. పేపర్లు అందుకున్న వారిని నిందితుల జాబితాలో చేర్చి ప్రశ్నించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కరీంనగర్‌తో లింకులు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో సూత్రధారిగా భావిస్తోన్న రాజశేఖర్‌రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా లీకేజీ, డబ్బుల వసూలు, లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారంతో రాజశేఖర్‌రెడ్డి బంధువులపై సిట్ సభ్యులు దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో నిపుణుడని గ్రామస్తులు తెలిపారు. అదే అర్హత మీద అతను ఆఫ్గనిస్తాన్ వెళ్లి కొంతకాలంపాటు అక్కడ పనిచేశాడు. తరువాత టీఎస్‌పీఎస్‌లో చేరాక అతని లైఫ్‌స్టైల్ మారిందని అంటున్నారు. ఈ మొత్తం వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్లో ఉన్న అతని బంధువుల వివరాలు, వారి కార్యకలాపాలపై తీగ లాగుతున్నారు. బొమ్మకల్ వాసులే కీలకమా? రాజశేఖర్‌రెడ్డికి కంప్యూటర్ హ్యాకింగ్ కోర్సుపై అవగాహన ఉండే ఉంటుందని, దాని ఆధారంగానే అతను ప్రశ్నపత్రాలు తస్కరించి ఉంటాడని భావిస్తున్న సిట్ బృందం అతని మిత్రుల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకునే పనిలో పడింది. రాజశే ఖర్‌రెడ్డి గతంలో తన బంధువులు ఇద్దరికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించాడని జరుగుతున్న ప్రచారంపై కూడా దృష్టి సారించారు. ఈ మొత్తం వ్యవహారంలో కరీంనగర్‌లోని బొమ్మకల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రాజశేఖర్‌రెడ్డికి సహకరించారని తెలిసింది. వారిద్దరే లీకైన ప్రశ్నపత్రాలను కావాల్సిన వ్యక్తులకు అందజేయడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం తదితర వ్యవహారాలను చక్కదిద్దేవారని సమాచారం. ఉద్యోగార్థుల నుంచి మొత్తం నగదు రూపంలోనే డబ్బులు తీసుకునే వారని, బ్యాంకులు, ఆన్లైన్ లావాదేవీలు అస్సలు అంగీకరించలేదని తెలిసింది. ఆ అధికారి తన బంధువని చెప్పుకునే వాడు! వీరిద్దరే రాజశేఖర్‌రెడ్డికి బినామీలు వ్యవహరించారని, జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ వీరికి పలు ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే, ఈ ఆస్తులు 2017 రాజశేఖర్‌రెడ్డి టీఎస్పీఎస్సీలో చేరిన తరువాత సంపాదించారా? ముందే సమకూర్చుకున్నారా? అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డికి ఓ ఉన్నతాధికారితో దూరపు బంధుత్వం ఉందని, అతని సిఫారసుతోనే తను టీఎస్‌పీఎస్‌లో తాత్కాలిక పద్ధతిన కొలువు సాధించగలిగాడన్న ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది. ఆ అధికారిని పలుమార్లు తన బంధువుగా చెప్పుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. చదవండి: లీకేజీలో కేటీఆర్ పీఏ.. -
లీకేజీలో కేటీఆర్ పీఏ..
సాక్షి, కామారెడ్డి: టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి భాగస్వామ్యం ఉందని, ఆయన ద్వారా సిరిసిల్ల జిల్లా మల్యాల మండలానికి చెందిన వందమందికి వందకుపైగా మార్కులు వచ్చినట్టు తమకు సమాచారం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట కార్నర్ మీటింగ్, కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సీబీఐపై నమ్మకం లేకుంటే సిట్టింగ్ జడ్జి చేత ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీలో మంత్రి కార్యాలయానికి సంబంధం ఉండటం వల్లే విచారణ జరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో తొమ్మిది మందిని అరెస్టు చేస్తే, కేటీఆర్ మాత్రం ఇద్దరే దొంగలన్నట్టు చెప్పడంలో మతలబేంటని ప్రశ్నించారు. ఆ ఇద్దరి గురించి కేటీఆర్, బండి సంజయ్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని, వీరి వ్యవహారం చూస్తుంటే నిరుద్యోగుల జీవితాలతో రెండు పార్టీలు కూడబలుక్కుని ఆడుకుంటున్నట్టుగా ఉందని ఆరోపించారు. ఐటీ మంత్రిగా తాను బాధ్యుడినెట్లా అవుతానని మంత్రి కేటీఆర్ అంటున్నారని, అలాంటప్పుడు ఏ హోదాలో దానిపై సమీక్ష చేశారో చెప్పాలన్నారు. లీకేజీల్లో రికార్డులు 2015లో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల్లో ప్రశ్నపత్రాలు లీకైనందున ఒక కుటుంబంలో భార్య, భర్తకు, ఏబీసీడీలు రాని 30 మందికి కొలువులు వచ్చాయని రేవంత్ అన్నారు. గుర్గావ్ ప్రెస్‌లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయంటూ 2016లో మెడిసిన్‌కు సంబంధించి ఎంసెట్ పరీక్ష రద్దు చేశారని, 2017లో సింగరేణిలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఉద్యోగ పరీక్షపత్రాలు లీకయ్యాయన్నారు. 2022 లో సదరన్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు బయటపడ్డాయని, పోలీసు రిక్రూట్మెంట్ గందరగోళంగా తయారై వేలాదిమంది యువత ఇబ్బందులు పడ్డారన్నారు. పేపర్ లీకేజీపై ఈ నెల 21న కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలంతా గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. నేడు నిరుద్యోగ నిరసన దీక్ష... ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై విచారణ కోరుతూ ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి»ొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంతకాలం 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేశామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు టీఎస్పీఎస్సీ పత్రాలు లీకేజీ కావడంతో 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తనకు తానే బయటపెట్టిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో చిన్నచేపలను బలి చేసి, చైర్మన్, బోర్డు మెంబర్లు, సీఎం కేసీఆర్, కేటీఆర్ తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. -
‘లీక్’పై రాజ్యాంగ పరిధిలో చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కారకులు, దీని వెనుక ఉన్న వారిపై రాజ్యాంగపరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించి కొత్త బోర్డును నియమించే దిశలో తగిన విధంగా స్పందించాలని కోరింది. టీఎస్పీఎస్సీ అధికారుల కుమ్మక్కుతోనే ప్రశ్నపత్రాలు బయటికి వచ్చి నట్టుగా అనుమానాలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ నేతృత్వంలో పేపర్ లీకేజీపై పార్టీ ఏర్పాటు చేసుకున్న టాస్‌్కఫోర్స్ కమిటీ కన్వినర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, సభ్యులు మాజీ ఐఏఎస్ చంద్రవదన్, మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పార్టీ నేతలు ఎన్.రామచంద్రరావు, మర్రి శశిధర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పనిచేస్తున్నందున లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని.. ఐటీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వైఫల్యంతో లీకేజీకి ఆస్కారం ఏర్పడినందున ఐటీ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని తమ డిమాండ్లలో పేర్కొన్నారు. వివిధ పరీక్షలు రాసి నష్టపోయిన నిరుద్యోగ యువతకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. యువత బరిగీసి కొట్లాడాలి: ఈటల పేపర్ లీకేజీ నేపథ్యంలో యువత మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ధైర్యంగా బరిగీసి కొట్లాడాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులపక్షాన బీజేపీ నిలుస్తుందని, అందరం కలసి ప్రభుత్వం మెడలు వంచుదామని పేర్కొన్నారు. రద్దయిన పరీక్షలను వెంటనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ విద్యార్థుల కళ్లలో మట్టికొట్టారని మండిపడ్డారు. రద్దయిన పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి ప్రభుత్వమే రూ.లక్ష చొప్పున సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సూత్రధారి రాజశేఖరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పని చేస్తున్న ప్రవీణ్‌కుమార్ సూత్రధారి అని ఇప్పటివరకు భావించగా.. అతడిని పథకం ప్రకారం ప్రేరేపించినది రాజశేఖరేనని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. రాజశేఖర్‌కు రాజకీయ సంబంధాలు సైతం ఉండటంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఇక లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం టీఎస్పీఎస్సీకి ప్రాథమిక నివేదికను అందించింది. మొత్తం ఐదు పరీక్షల పేపర్లు లీకైనట్టుగా గుర్తించినట్టు తెలిసింది. ముందస్తు ప్లాన్‌తోనే.. రాజశేఖర్ టీఎస్టీఎస్ నుంచి టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రావడంలోనూ కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేపర్లపై కన్నేసిన రాజశేఖర్.. లీకేజీ కోసం ముందుగా ప్లాన్ చేసుకునే వచ్చాడని.. కార్యదర్శికి ప్రవీణ్ పీఏగా మారిన తర్వాత ప్లాన్ అమలు చేశాడని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్నాడని అంటున్నారు. సిస్టమ్ అడ్మిన్ అయిన రాజశేఖరే కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్ను హ్యాక్ చేసి, పేపర్లు తస్కరించాడని.. వాటిని ప్రవీణ్‌కు ఇచ్చి రేణుకతో అమ్మించాడని అనుమానిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్నీ రాజశేఖర్ ఇలానే చేజిక్కించుకుని ప్రవీణ్‌కు ఇచ్చి ఉంటాడని.. దాని ఆ«ధారంగా పరీక్ష రాయడంతోనే ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ పాత్ర కీలకం పేపర్ల లీకేజీపై సిట్ అధికారి, ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ పాత్ర కీలకంగా మారనుందని.. అతడే ప్రవీణ్‌తో కలిసి ఈ లీకేజ్ చేసినట్టుగా ఆధారాలు లభించాయని తెలిపారు. రాజశేఖర్ కొందరు రాజకీయ నాయకులతో కలిసి దిగిన ఫొటోలు లభ్యమయ్యాయని.. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ నేతల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచి మొత్తం ఐదు పేపర్లు తస్కరణకు గురయ్యాయని.. వాటిలో ఏయే పేపర్లు లీక్ అయ్యాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ వ్యవహారంతోపాటు, ఆ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు అన్ని మార్కులు రావడంపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రవీణ్ ఈ పరీక్ష పేపర్లను ఎవరెవరికి ఇచ్చాడన్నది ఆరా తీస్తున్నామ ని చెప్పారు. ప్రవీణ్, రాజశేఖర్ సహా నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. పోలీసు కస్టడీకి నిందితులు ఈ కేసులో అరెస్టయిన తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్ట డీకి ఇస్తూ నాంపల్లి కోర్టు శు క్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి 23వ తేదీ వ రకు పోలీసులు వారి ని ప్రశ్నించి.. ఈ వ్యవహారంలో అన్ని వివరాలను ఆరా తీయనున్నా రు. ఇదే సమయంలో ప్రవీణ్, రాజశేఖర్, శంకరలక్ష్యలను కలిపి విచారించి.. వాస్తవాలను వెలికితీయాలని అధికారులు నిర్ణయించారు. ఐడీ, పాస్వర్డ్ దొరికిందెలా? కస్టోడియన్ శంకరలక్ష్మి నోట్‌బుక్ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ తస్కరించామని.. వాటి ఆధారంగానే ఆమె కంప్యూటర్ను యాక్సెస్ చేసి పరీక్ష పేపర్లు కాపీ చేసుకున్నామని అరెస్టు సమయంలో ప్రవీణ్, రాజశేఖర్ చెప్పారు. కానీ అధికారులు శంకరలక్ష్యని ప్రశ్నించగా.. తాను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను ఎక్కడా రాసుకోలేదని చెప్పినట్టు తెలిసింది. దీనితో ఆమె నుంచి అధికారికంగా స్టేట్మెంట్ తీసుకోవడానికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..
పంజగుట్ట (హైదరాబాద్): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో మొత్తం బయటకు తీయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఏపీపీఎస్సీ పేపర్లు లీకేజీ కాలేదని, తొలిసారి తెలంగాణలో లీకేజీ కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదొక దుర్దినమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవిత ఉందా లేదా అనేదానికన్నా ఇది చాలా పెద్ద కేసని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం ఈ వ్యవహారంపై నోరువిప్పకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై బుధవారం ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన చోట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌ను టీఎస్పీఎస్సీలో పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ..తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి లీకేజీలు చూడలేదన్నారు. ఓఎమ్ఆర్ షీట్ నింపలేని వాడికి 103 మార్కులు వచ్చాయంటే కచ్చితంగా లీకేజీ జరిగిందని అర్థమవుతుందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అతడితోపాటు సీఎం కేసీఆర్ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ..ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తాను మాజీ సభ్యుడినని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందన్నారు. కనీసం సెక్రటరీకి కూడా చెప్పకుండా చైర్మన్ గోప్యతను పాటించాలని కానీ, ఒక సెక్షన్ ఆఫీసర్ చేతికే పేపర్లు వెళ్లిపోవడం దారుణమన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ విశ్వసనీయత, పేరు ప్రతిష్టలు దిగజారిపోయాయన్నారు. సమావేశంలో ఈడబ్ల్యూఎస్ జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీపీఐ యువజన నేత ధర్మేంద్ర, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, సీనియర్ జర్నలిస్టు విఠల్ పాల్గొన్నారు. -
దావత్లో గొడవ.. వెలుగులోకి లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఎస్పీఎస్సీ ఈ నెల ఐదో తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష అనంతరం ఈ కేసులో నిందితులతో పాటు మరికొందరు వనపర్తిలో దావత్ చేసుకున్నారని, ఆ సమయంలో ‘లీకేజీ డబ్బులు’విషయమై గొడవ జరిగిందని, ఆ గొడవతోనే పేపర్ లీక్ విషయం బయటపడిందని తెలిసింది. ఈ బాగోతంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆరుగురు పాలమూరుకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. పంచాంగల్లో ప్రిపరేషన్..వనపర్తిలో దావత్ ఏ–1 నిందితుడు ప్రవీణ్ నుంచి పేపర్ తీసుకున్న తర్వాత.. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు రేణు క, డాక్యా దంపతులు గండేడ్ మండలం పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చారు. వీరితో పాటు ఆమె పెద్ద నాన్న కొడుకు శ్రీనివాస్ (మేడ్చల్ కానిస్టేబుల్), ఈయన స్నేహితులు కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్ర నాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్ నాయక్ కూడా వచ్చినట్లు సమాచారం. రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా వీరితో జత కాగా.. వారిని అక్కడే చదివించి 5న సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్ష రాసిన తర్వాత రేణుక కారులో రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్, రాజేంద్ర నాయక్ వనపర్తి ఇంటికి వచ్చారని, అంతా కలిసి దావత్ చేసుకున్నారని సమాచారం. ఆ సమయంలో డాక్యా, గోపాల్‌నాయక్ వారితో ఉన్నారా? లేరా? అనేది తెలియలేదు. పేరులో తప్పు సరిచేసుకునేందుకు వెళ్లి.. రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పుదొర్లింది. దీన్ని సరిచేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు తరచుగా కలిసేవారని.. రేణుక టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేదని తెలిసింది. ఈ క్రమంలోనే కవిత, ఆమె భర్త డాక్యా, ప్రవీణ్‌తో కలిసి పేపర్ లీకేజీ స్కెచ్ వేశారు. రేణుక సొంతూరు గండేడ్ మండలంలోని మన్సూర్‌పల్లి కాగా అత్తగారిల్లు ఇదే మండలంలోని పంచాంగల్ తండా. ఇలావుండగా వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఈ రెండు తండాల్లో పర్యటించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘర్షణ, బెదిరింపుతో.. దావత్ క్రమంలో రేణుక డబ్బుల విషయం లేవనెత్తినట్లు సమాచారం. ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదరగా.. రూ.5 లక్షలు చొప్పున ఇచ్చి మిగతా డబ్బు తర్వాత ఇస్తామని రేణుకకు చెప్పారు. అయితే ఆమె ఇప్పుడే పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నీలేశ్‌నాయక్, రేణుక మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు సమాచారం. నీలేశ్‌ను రేణుక బెదిరించడంతో ఆయన బయటకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చి అందరినీ తీసుకెళ్లారు. వారు విచారించడంతో లీకేజీ డొంక కదిలినట్లు తెలుస్తోంది. -
తేనె పూసిన కత్తులు! హనీ ట్రాప్‌లు ఎన్నో రకాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్‌లు భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్బుక్ అకౌంట్‌తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్‌లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్‌రెడ్డిని 2022 జూన్‌లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హనీ ట్రాప్‌లు.. ఎన్నో రకాలు సోషల్ మీడియా ఆధారిత ట్రాప్‌లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్‌కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం సేకరిస్తారు. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫాంల ద్వారా: ఆన్లైన్లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్‌ల ద్వారా మెసేజ్‌లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్ల ఆధారిత హనీ ట్రాప్‌లు: అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్‌లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు. ఈ మెయిల్లో లింక్‌ల ద్వారా..: ఈ మెయిల్స్‌లో లింక్‌లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్‌లతో: డేటింగ్ యాప్‌లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. ♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు. ♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం. ♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు. అలా అడిగితే అనుమానించాల్సిందే హనీ ట్రాప్‌ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్‌ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
TSPSC: మెయిన్ సర్వర్ నుంచే పేపర్ కొట్టేశాడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకాంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన నేరాన్ని అంగీకరించినట్లు అందులో పేర్కొంటూనే.. ఈ మొత్తం తతంగం ఎలా జరిగిందనేది అందులో వివరించారు. మెయిన్ సర్వర్ నుంచే ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్. లూప్ ఉన్న కంప్యూటర్ల ద్వారా ఆ పేపర్‌ను సేకరించాడు. సేకరించిన పేపర్‌ను ప్రింట్ తీసుకుని తనతో సన్నిహితంగా ఉంటున్న రేణుకకు షేర్ చేశాడు ప్రవీణ్. ఆపై.. పేపర్ అమ్మేందుకు రేణుకు ఫ్యామిలీ చాలా ప్రయత్నాలే చేసింది. రేణుక తన కమ్యూనిటీలోని పలువురికి తన దగ్గర పేపర్ ఉందని సమాచారం ఇచ్చింది. ఈ ప్రచారంలో రేణుక భర్త, సోదరుడు ముఖ్యపాత్ర పోషించారు. ఒక్కో పేపర్‌కి రూ.20 లక్షలు డిమాండ్ చేసింది రేణుక. అయినప్పటికీ పేపర్ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. వాళ్లను తన ఇంట్లోనే ఉంచి ప్రిపేర్ చేసింది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి.. సరూర్‌నగర్‌లోని సెంటర్ వద్ద స్వయంగా దింపేసి వెళ్లిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ప్రవీణ్ ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లతో సంబంధాలు నడిపినట్లు నిర్ధారించుకున్నారు కూడా. అయితే ఇది హనీ ట్రాపా? లేదంటే పక్కా ప్రణాళికగా జరుగుతున్న స్కామా? అనేది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇదీ చదవండి: ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫొటోలు నిందితులకు 14 రోజుల రిమాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలోని నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరచగా, వారికి రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ క్రమంలోనే నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ కోరిన పోలీసులు పేపర్ లీకేజీ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మందిని.. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. -
లీకేజీ వ్యవహారం.. కేసీఆర్ సర్కార్‌పై బండి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈ పరీక్షా పత్రం లీక్ కావడం దుమారాన్ని రేపుతోంది. ఈ ప్రభావం మిగతా పరీక్షలపైనా పడొచ్చనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది ఇప్పుడు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే కీలక బోర్డు నుంచి పేపర్లు బయటకు రావడంపై రాజకీయపరమైనా విమర్శలు మొదలయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన. TSPSC నిర్వహించిన పరీక్షల క్వశ్చన్ పేపర్లన్నీ లీక్ అయ్యాయని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. ఈ మేరకు గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ అయ్యిందని చెబుతూ.. ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను సాక్ష్యంగా విడుదల చేశారాయన. ‘‘పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌కు అన్ని మార్కులా?. ఇప్పుడు ప్రవీణ్ వల్ల ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ బండి విమర్శలు గుప్పించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరితో కూడిన కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన బండి సంజయ్.. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కూడా లీక్ అయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో సింగరేణి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసిందని, కేసీఆర్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షల పేపర్లు కూడా లీక్ అయ్యాయని ఆరోపిస్తూ.. ఈ లీకేజీలన్నింటిపై న్యాయ విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారాయన. రాష్ట్రంలో ఉద్యోగాలివ్వలేక.. ఇంత దారుణాలకు ఒడిగడతారా? అంటూ టీ సర్కార్‌ను నిలదీసిన బండి సంజయ్.. నిరుద్యోగులతో ప్రగతి భవన్, టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కోసం గ్రూప్ 1 పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే... ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని ఆరోపించారు బండి సంజయ్. దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు కూడా టీఎస్పీఎస్సీ స్పందించలేదని విమర్శించారాయన. లీకేజీ వ్యవహారం వెనుక మతలబు ఉందని, సీఎం కేసీఆర్‌తోపాటు టీఎస్పీఎస్సీ పెద్దల పాత్ర లేనిదే ఇలాంటివి జరగడం వీలుకాదని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని గవర్నర్ తమిళిసై సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారాయన. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు బండి సంజయ్. బండి సంజయ్ ప్రకటన.. ► ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంతులేని రీతిలో కొనసాగుతోంది. ఉద్యోగాలకున్న డిమాండ్ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలురైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరం. ► మున్సిపాలిటీల పరిధిలో పని చేసే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. కానీ పరీక్షపత్రం లీకేజి వ్యవహారం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు సమాచారం అందుతోంది. ► ఇవి మాత్రమే కాకుండా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ముందుగానే గ్రూప్-1 ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను సేకరించి పరీక్ష రాశారు. ► ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే... ప్రవీణ్ కోసం పరీక్ష రాసే సమయ వేళలను కూడా మార్చేసినట్లు తమ ద్రుష్టికి వచ్చింది. ఈ అంశంపై ఓ పత్రికలో వార్త వచ్చేదాకా టీఎస్పీఎస్సీ స్సందించనేలేదు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలొస్తున్నాయి ► తమకు వస్తున్న ఫిర్యాదులు, సమాచారాన్ని పరిశీలిస్తే... టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ కుటుంబానికి ముందుగానే చేరుతున్నాయని అర్ధమవుతోంది. రాబోయే 2 నెలల్లో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం సైతం కేసీఆర్ కుటుంబీకుల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ► గతంలో కూడా ఇటువంటి లీకేజీలు పెద్ద ఎత్తున జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో లీకేజీ వీరులు చెలరేగిపోతున్నారు. 2018లో పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్ష పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా లీక్ కావటం, ఎంసెట్ పశ్నాపత్రాల లీకేజీ వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావటం విద్యార్ధుల్లోనూ తల్లితండ్రుల్లోనూ ఆందోళనకు దారితీసింది. లేనిపోని నిబంధనల పేరుతో కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల్లోనూ అనేక అవకతవకలు జరిగిన విషయం సైతం అనేక ఆందోళనలకు తావిస్తోంది. ► అయినప్పటికీ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చెదురుమదురు ఘటనగా పరిగణించింది. అప్పుడే ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపించి ఉంటే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి. అయినా పట్టించుకోలేదంటే దీనివెనుక కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ► నిబంధనల ప్రకారం.... టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ ఛైర్మన్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఛైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యం. క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క ఉద్యోగి కంప్యూటర్లో ఉండటానికి వీల్లేదు. అట్లాంటిది ఒక సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు ఎట్లా ప్రత్యక్షమవుతాయి? వాటిని ప్రవీణ్, రాజశేఖర్ ఎట్లా పెన్ డ్రైవ్ లోకి తీసుకుంటారు? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి ప్రమేయం లేకుండా ఇది అసాధ్యం? ► దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం తేలికగా కొట్టిపడేసేందుకు యత్నిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్, మరికొందరు కిందిస్థాయి ఉద్యోగులను మాత్రమే ఈ మొత్తం కుట్రకు బాధ్యులను చేసి తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పెద్ద స్కెచ్ వేసినట్లు అర్ధమవుతోంది. ► వాస్తవానికి తెలంగాణలో ఉద్యోగాలను భర్తీ చేయడం సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. తెలంగాణను ఆర్దికంగా పూర్తిగా దివాళా తీయించిన కేసీఆర్ కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేని స్థితిలో ఉన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయడం అసాధ్యమని తెలిసి.. నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు. అందులో భాగంగానే గ్రూప్-1సహా ఇతర పరీక్షా పత్రాలన్నీ లీకేజీ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ► తెలంగాణలో బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం... సుమారు 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... అందులో 80 వేలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాలన్నీ లీకేజీ కావడం పరిశీలిస్తే... ఇందులో కచ్చితంగా కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ► సీఎం కుటుంబంపై గతంలోనూ అనేక ఆరోపణలొచ్చాయి. కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అనేక వార్తలొచ్చాయి. ఫిర్యాదులు అందాయి. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సీఎం కూతురు కల్వకుంట్ల కవిత ఆయా ఉద్యోగాలన్నింటినీ అమ్ముకుందనే ఆరోపణలు వచ్చినయ్.. అయినా వాటిపై సమగ్ర విచారణ జరపకపోవడం బాధాకరం. ► గతంలో జోన్ల పేరుతో, గుణాత్మక మార్పు పేరుతో కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మభ్యపెట్టింది. ఆ తరువాత ప్రతిపక్షాలను, కోర్టు కేసులను బూచీగా చూపి ఉద్యోగులను మోసం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమీపించడంతోపాటు లీకేజీ, ఉద్యోగుల ప్యాకేజీ పేరుతో డ్యామేజీ చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేయడం క్షమించరాని నేరం. ► తాజాగా టీఎస్పీఎస్పీ నియమకాల్లోనూ ఛైర్మన్, కార్యదర్శులతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ► ఈ మొత్తం వ్యవహారంపై రాష్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ జోక్యం చేసుకుని తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వారికి అభయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
సాక్షి, చిత్తూరు: పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురయ్యింది. చిత్తూరు కోర్టు బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు, మిగిలిన వారు నారాయణకు చెందిన స్కూల్ సిబ్బంది ఉన్నారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. -
ఇక్కడా కింగ్‌పిన్ సంజూ భండారీనే !
బనశంకరి: కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తాజాగా 12 మంది అరెస్టయ్యారు. గదగ్ మున్సిపల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మారుతితో డీల్ కుదుర్చుకున్నారు. మారుతి కుమారుడు సమీతకుమార్ సోనవణి ప్రశ్నాపత్రం లీకేజీ చేసి ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కింగ్‌పిన్ సంజుభండారీతో అభ్యర్థులు నగదు వ్యవహారాలు నిర్వహించారు. కీ ఆన్సర్ వచ్చిన తక్షణం మూడు లక్షలు, ఫలితాలు అనంతరం ఐదు లక్షలు ఇవ్వాలని ఒప్పందం. సునీల్భంగి అభ్యర్థులను సంజుభండారీకి పరిచయం చేశారు. పరీక్ష పాస్ చేసే డీల్ కుదుర్చుకుని కింగ్‌పిన్ సంజు కోట్లాది రూపాయలు నగదు సంపాదించాడు. గత ఏడాది సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీలో సంజుభండారీ అరెస్టయ్యాడు. గదగ్ పీయూ కళాశాల నుంచే ప్రశ్నాపత్రం బయటకు బెయిల్‌పై విడుదలైన కేపీటీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడి పరారీలో ఉన్న సంజుభండారీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గదగ్ మున్సిపల్ పీయూ కాలేజీ నుంచి ప్రశ్నాపత్రం లీక్ కాగా మున్సిపల్ కాలేజీ వైస్‌ప్రిన్సిపాల్ అతడి కుమారుడు రూమ్ సూపర్వైజర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ చేశారు. గైర్హాజరైన అభ్యర్థి ప్రశ్నాపత్రం ఫొటో తీసి క్యామ్ స్క్యానర్తో కింగ్‌పిన్ సంజుభండారీ మొబైల్‌కు పేపర్ పంపించారు. 12 మంది అరెస్ట్ గోకాక్ డీవైఎస్పీ మనోజ్‌కుమార్ నాయక్ నేతృత్వంలోని పోలీస్ బృందం తీవ్రంగా గాలించి పరీక్షలో అక్రమాలకు పాల్పడిన 12 మందిని శుక్రవారం అరెస్ట్ చేశారు. బెళగావి, గదగ్, ఉత్తర కన్నడ జిల్లాల్లో ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడ్డారు. స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ డీవైస్ వినియోగించి పరీక్షలో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారు. గోకాక్‌లో ప్రశ్నాపత్రం లీక్‌చేసిన అభ్యర్థి సిద్దప్పమదిహళ్లి పోలీసులకు పట్టుబడ్డాడు. సిద్దప్పమదిహళ్లిని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టగా పరీక్షలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇతను అందించిన సమాచారం ఆధారంగా 12 మందితో పాటు సిమ్‌కార్డులు, కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు కింగ్పిన్లు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బెళగావి గ్రామీణ ఎస్పీ సంజీవ్ పాటిల్ ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేశారు. (చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ) -
మితిమీరి.. దిగజారి
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు, సర్కారును ఇరకాటంలో నెట్టేందుకు ‘కొందరు’ టెన్త్ పరీక్షలను కూడా వాడుకుంటున్నారు. మితిమీరిన ‘స్వామి భక్తి’ చూపడానికి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు వేల మంది విద్యార్థుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. జిల్లాలో ప్రశ్న పత్రం లీకేజీ అంటూ తప్పుడు బ్రేకింగ్ వార్తలు, కథనాలను వండి వార్చేశారు. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాక అలాంటిదేమీ లేదని తేలింది. దీంతో ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తుల ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కొందరు మీడియా ప్రతినిధులను కూడా విచారిస్తున్నారు. జిల్లాలోని సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షళంత్రి కేంద్రాల నుంచి గురువారం హిందీ ప్రశ్న పత్రం లీకైందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారం చేసింది. స్క్రోలింగ్‌లను ఇచ్చింది. ఈ వా ర్తలు చూసి విద్యాశాఖాధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే విద్యాశాఖ, సమగ్ర శిక్ష, రెవెన్యూ అధికారులు, పోలీసులు పరీక్ష కేంద్రానికి చేరుకుని దీనిపై ఆరా తీశారు. కలెక్టర్‌కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. స్థానిక పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎవరూ లేరు. పేపర్ లీకేజీ అంటూ వస్తున్న కథనాన్ని చూపించి పరీక్ష కేంద్రంలోని పర్యవేక్షణాధికారులను ప్రశ్నించగా, అలాంటి అవకాశమే లేదని బదులిచ్చారు. పోలీసు స్టేషన్ల నుంచి నేరుగా ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసు కొచ్చామని, పరీక్షలు మొదలుపెట్టామని, ఇన్విజిలేటర్ల నుంచి సెల్ఫోన్లను డిపాజిట్ చేసుకున్నామని వివరించారు. కావాలనే చేశారు.. పరిశీలన పూర్తయ్యాక లీకేజీ కట్టుకథేనని అధికారులు తేల్చారు. ఈ వదంతులు పుట్టించిన వారిపై మండిపడ్డారు. అటు విద్యాశాఖను, ఇటు ప్రభుత్వా న్ని అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది వ్యక్తు లు పనిగట్టుకుని చేసిన దుశ్చర్యగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయమై ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈఓ పగడాలమ్మ, సమగ్రశిక్ష ఏపీసీ డా క్టర్ జయప్రకాష్లు మీడియాకు వివరించారు. ప్రశ్న పత్రం లీకేజీ అంటూ తప్పుడు కథనాలు, వార్తను ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై, అందుకు సహకరించిన వ్యక్తులపై కలెక్టర్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా రు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు లుకూడా నమోదుచేయాలని కలెక్టర్ నిర్ణయించారు. రెండో రోజు 179 మంది గైర్హాజరు.. జిల్లాలో గురువారం 248 కేంద్రాల్లో జరిగిన హిందీ పరీక్షకు 36,124 మంది (ఒక విద్యార్థి పెరిగారు) హాజరుకావాల్సి 179 మంది గైర్హాజరయ్యారు. ఆర్జే డీ, జిల్లా పరిశీలకులు ఎం.జ్యోతికుమారి జీహెచ్‌స్కూల్ పోలాకి, విశ్వశాంతి స్కూల్ పోలాకి, జెడ్పీ జీహెచ్ స్కూల్ పోలాకి, జెడ్పీహెచ్‌స్కూల్ సారవకోట కేంద్రాలను పరిశీలించారు. డీఈఓ జి.పగడాలమ్మ శ్రీకాకుళం, నరసన్నపేట, సరుబుజ్జిలి ప్రాంతాల్లో 5 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రోణంకి జయప్రకాష్, స్క్వాడ్ బృందాలు కలిపి 58 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాయి. టెన్త్ పరీక్షలో విద్యార్థి డిబార్ రణస్థలం: రణస్థలం మండలంలోని పైడిభీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం హిందీ పరీక్ష రాసిన ఓ విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూ పరింటెండెంట్ శంకర శాస్త్రి తెలిపారు. క్వశ్చన్ పేపర్‌ను కిటికీలో నుంచి బయట వ్యక్తులకు అందిస్తున్న సమయంలో పహారా కాస్తున్న పోలీసు విద్యార్థిని పట్టుకున్నారు. గోడ దూకి వచ్చిన బయట వ్యక్తి పరారైనట్లు ఆయన తెలి పారు. విద్యార్థి నుంచి పూర్తి వాంగ్మూలం తీసుకుని డిబార్ చేసినట్లు తెలిపారు. చదవండి: ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం -
వాట్సాప్ గ్రూపులపై పోలీసుల నజర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన విశ్వవిద్యాలయం: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులపై పోలీసులు దృష్టిసారించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులను గుర్తించేందుకు సీజ్ చేసిన తొమ్మిది మొబైల్ ఫోన్లను సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో ఆయా కళాశాలలకు, వాట్సాప్ గ్రూపులకు చెందిన వారిలో కలవరం మొదలైంది.విచారణలో కొన్ని కొత్త వాట్సాప్ గ్రూపులు, మరింత అదనపు సమాచారం రావడంతో వారందరికీ నోటీసులు పంపిస్తూ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
చాలా చోట్ల పేపర్ లీక్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలో ఒక్కొక్కటిగా బాగోతాలు బయటపడుతున్నాయి. పరీక్షకు దాదాపు పావు గంట ముందే పలు కాలేజీల సిబ్బంది పేపర్‌ను లీక్ చేయడంతో విద్యార్థులు సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. అలా పదుల సంఖ్యలో పేపర్‌ను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారంపై ‘సాక్షి’వరుస కథనాలతో కదిలిన వర్సిటీ అధికారులు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను శాతవాహన సిబ్బంది సోమవారం పోలీసులకు అప్పగించింది. తొమ్మిది సెల్ఫోన్ల నంబర్ల ఆధారంగా కాల్‌డేటా రికార్డులను తెప్పించే పనిలో పడ్డారు. లీకైన రోజు ముందు నిందితులు ఎవరెవరితో మాట్లాడారో గుర్తిస్తే కేసు సగం ఛేదించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమయ్యే ముందు, తర్వాత ఈ వ్యవహారంతో సంబంధమున్న వారు ఫోన్ మాట్లాడుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఫోన్లను స్వాధీనం చేసుకునే లోపే నంబర్లను డీయాక్టివ్ చేసుకుని, వాట్సాప్ సమాచారం డిలీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ డేటా డిలీట్ అయినా.. డేటాను రీట్రైవ్ చేసే సాంకేతికత తమ వద్ద ఉందని పోలీసులు ధీమాతో ఉన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపాలా లేక తమ వద్ద ఉన్న డేటా రీట్రైవ్ యంత్రం సరిపోతుందా అన్న విషయంపై పోలీసు అధికారులు ఇంకా నిర్ణయానికి రాలేదు. ప్రత్యేక బృందాల ఏర్పాటు అనివార్యం.. శాతవాహన వర్సిటీ లీకేజీ వ్యవహారం కరీంనగర్ కమిషరేట్ పరిధిలోనే వెలుగు చూసినా ఇతర జిల్లాల్లోని కాలేజీల నుంచి కూడా పేపర్లు బయటకు వచ్చాయని సమాచారం. వర్సిటీ పరిధి కరీంనగర్‌తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. గతంలో ఎంసెట్ (మెడికల్)–2 పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రాలు దాటిన వ్యవహారం కావడంతో సీఐడీ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనూ ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు అనివార్యమని పోలీసులు భావిస్తున్నారు. -
పరీక్షకు పావుగంట ముందే లీక్..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ శాతవాహన యూనిర్సిటీ: పరీక్షల నిర్వహణలో శాతవాహన యూనివర్సిటీ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా పరిగణించలేదు. దీనిపై ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కావడంతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. శనివారం మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. వాస్తవానికి ఈనెల 18న ఉదయం ఈ ఉదంతం వెలుగుచూడగానే.. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. కానీ నిబంధనల పేరు చెప్పి, కమిటీ వేసి దాని రిపోర్టు వచ్చేదాకా ఆగడంతో.. ఈ విషయాన్ని యూనివర్సిటీ చాలా తేలిగ్గా తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమానిత విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న తొమ్మిది మొబైల్స్‌ను శనివారం ఓపెన్ చేసిన కమిటీ సభ్యులు వాటిలో ఆధారాలు అప్పటికే డిలిట్ చేసి ఉండటంతో తెల్లమొహం వేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక.. తొలుత ఏసీపీ తుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాలేజీ సిబ్బంది పనే.. ఈ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత 18న నిర్వహించిన 6వ సెమిస్టర్ ఫిజిక్స్ పేపర్–2 లీకైందని అంతా అనుకున్నారు. ఈ వ్యవహారంలో ‘సాక్షి’పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా లీకైన పేపర్లను, వాటిని పోస్టు చేసిన విద్యార్థుల నంబర్లను మరిన్ని ‘సాక్షి’సంపాదించింది. అందులో 16న జరిగిన మ్యాథ్స్, 17న జరిగిన ఫిజిక్స్ పేపర్–1 కూడా లీకైనట్లు తేలింది. ఈ పేపర్లను కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేయకముందే.. నేరుగా ఫొటోలు తీసి పంపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా.. 9.38 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష పత్రాన్ని మ.1.47 నిమిషాలకు వాట్సాప్‌లో షేర్ చేశారు. అయితే ఇది యూనివర్సిటీలో జరిగిందా? లేదా ఇతర కాలేజీలో జరిగిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వర్సిటీ అధికారులు ప్రైవేటు కాలేజీ సిబ్బంది చేసిన పనిగా అనుమానిస్తున్నారు. మరోవైపు శాతవాహన పరిధిలోని ప్రభుత్వ కాలేజీలోని సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై జిల్లాకు చెందిన ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నత విద్యా మండలికి శనివారం మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. విద్యామండలి సూచనల మేరకు చర్యలు: వీసీ ప్రొ.మల్లేశ్ పేపర్ లీక్‌కు సంబంధించి వేసిన విచారణ కమిటీ సిఫార్సుల మేరకు పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యామండలికి ఫిర్యాదు చేస్తాం. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. -
‘సల్మాన్ ఎగ్జామ్స్ అలా పాస్ అయ్యేవాడు’
బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు దబాంగ్ హీరో. బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ చదువులో మాత్రం పూర్ స్టూడెంటేనట. ఎగ్జామ్ పేపర్ లీక్ చేయించుకుని పరీక్షలు పాస్ అయ్యేవారంట. ఈ విషయం గురించి స్వయంగా సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ చెప్పారు. కపిల్ శర్మ షోకు సలీం తన ముగ్గురు కొడుకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన కొడుకులు బాల్యంలో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు. ‘సల్మాన్ చిన్నతనంలో మా ఇంటికి గణేష్ అనే వ్యక్తి వచ్చేవాడు. అతను రాగానే నా కొడుకులు గణేష్ కోసం కూర్చి తీసుకురండి.. గణేష్ చాయ్ తాగండి అంటూ నాకంటే ఎక్కువ మర్యాద అతనికే ఇచ్చేవారు. దాంతో అసలు ఈ గణేష్ ఎవరూ.. ఎందుకు నా కొడుకులు అతనికి అంత ప్రధాన్యత ఇస్తున్నారని ఆలోచించగా అసలు విషయం అప్పుడు తెలిసిందే. ఈ గణేష్ అనే వ్యక్తి నా పిల్లల కోసం ఎగ్జామ్ పేపర్లు లీక్ చేయించి తీసుకొచ్చేవాడు. దాంతో నా పిల్లలు అతనికి అంత మర్యాద ఇచ్చేవారని అర్థమయ్యింద’న్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సల్మాన్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్, దిశా పాట్నీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘భారత్’ సినిమాతో బిజీగా ఉన్నారు. Jab Kapil ke ghar aayi Khan family, dekhiye kiss kiss ki pol khul gayi! #TheKapilSharmaShow, 29 Dec se, har Sat-Sun raat 9:30 baje. @BeingSalmanKhan @SohailKhan @arbaazSkhan @KapilSharmaK9 @kikusharda @haanjichandan @Krushna_KAS @bharti_lalli @sumona24 @RochelleMRao @trulyedward pic.twitter.com/Aux3E7bXXg — Sony TV (@SonyTV) December 26, 2018 -
ఒకవైపు విద్యార్థులు.. మరోవైపు ఆందోళనలు..
సాక్షి, కామారెడ్డి : అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన పాఠశాల నవోదయ పాఠశాల. ఈ విద్యాసంస్థలో ప్రవేశం కొరకు ప్రతి ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ ఏడాది నిజాంసాగర్ మండలంలోని నవోదయ పాఠశాలలో నిర్వహించాలనుకున్నారు. అయితే 9వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్నాహ్నం అయినా పరీక్ష ప్రారంభం కాకపోవడంతో పరీక్షపత్రం లీకేజ్ అయ్యిందంటూ వదంతులు వ్యాపించాయి. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నవోదయ పరీక్ష చీఫ్‌ఎక్సామినర్ మాట్లాడుతూ..కేవలం కొన్నిసాంకేతిక సమస్యల వల్ల మాత్రమే పరీక్ష ఆలస్యం అయిందని, కొందరు ఆకతాయిలు సృస్టిస్తున్న వదంతులను నమ్మవద్దని తల్లిదండ్రులను, విద్యార్థులను కోరారు. ఆందోళనల నడుమ ఎట్టకేలకు 1గంటకు పరీక్ష ప్రారంభమైంది. స్థానిక ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించడంతో వారికి అవగాహన లోపంతోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. -
సీబీఎస్ఈ ఫెయిల్!
లీకులకు ఆస్కారం లేకుండా, కాపీ రాయుళ్లకు అవకాశమీయకుండా పరీక్షలు నిర్వహించడం తమ వల్ల కాదని పరీక్షల నిర్వహణ బోర్డులు మన దేశంలో తరచు నిరూపించుకుంటున్నాయి. ఈ విషయంలో మిగిలిన బోర్డులకు ఏమాత్రం తీసి పోని కేంద్ర మాధ్యమిక విద్యామండలి(సీబీఎస్ఈ) ఈ పరీక్షల సీజన్లో లక్షలాది మంది విద్యార్థుల ముందు దోషిగా నిలబడింది. ఇతర బోర్డులతో పోలిస్తే సీబీ ఎస్ఈ నెత్తిన బృహత్తర బాధ్యతలున్నాయి. అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాదు... విదేశాల్లో ఉంటున్న విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారి పదో తరగతి పరీక్షలకు మొత్తం 16,38,428మంది విద్యార్థులు హాజరుకాగా, 12వ తరగతి పరీక్షలను 11,86,306మంది రాస్తున్నారు. మొత్తం అన్ని బోర్డులు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో సీబీఎస్ఈ వాటా 9 శాతం ఉంటుందని అంచనా. మూడేళ్లనుంచి సీబీఎస్ఈ అఖిల భారత వైద్య ప్రవేశ పరీక్ష(నీట్)ను కూడా నిర్వహిస్తున్నది. పదో తరగతి విద్యార్థులందరూ ఎంతో కష్ట మని భావించే పరీక్ష లెక్కలు. దాన్ని విజయవంతంగా ముగించుకుని పిల్లలందరూ హోటళ్లలో, రెస్టరెంట్లలో, చాయ్ దుకాణాల్లో అనుభవాలను కలబోసుకుంటుండగా బుధవారం మధ్యాహ్నం పరీక్ష రద్దయిన వార్త వెలువడి లక్షలమంది విద్యార్థులను దిగ్భ్రాంతిపరిచింది. మిగిలిన పాఠ్యాంశాల్లో ప్రతిభను ప్రదర్శించే చాలామంది పిల్లలకు సైతం లెక్కలు ఓపట్టాన కొరుకుడు పడదు. వారి దృష్టిలో అది దాటక తప్పని మహాసాగరం. అలాంటి సంక్లిష్టమైన పాఠ్యాంశంలో మరో మూడు నెలల తర్వాత రెండోసారి పరీక్ష రాయకతప్పని స్థితి ఏర్పడింది. ‘అవసరమనుకుంటే’ లెక్కల పరీక్షను వచ్చే జూలైలో నిర్వహిస్తామని సీబీఎస్ఈ చెబుతోంది. అయితే ఆ పరీక్షను ఢిల్లీ, హర్యానాలకే పరిమితం చేయాలా... లేక ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాల్సి ఉంటుందా అన్నది బోర్డు ఇంకా తేల్చుకోలేదు. పరీక్షల బాదర బందీ అంతా పూర్తయ్యాక ఫలితాలొచ్చేలోగా సెలవుల్లో ఎటైనా వెళ్లి హాయిగా గడుపుదామనుకునే విద్యార్థులకు ఇదెంత నరకమో వేరే చెప్పనవసరం లేదు. 12వ తరగతి ఎకనమిక్స్ పాఠ్యాంశంలో ఏప్రిల్ 25న పరీక్ష ఉంటుందని బోర్డు ప్రక టించింది. ఆ తేదీలోగా నిర్వహిస్తే తప్ప యూనివర్సిటీ ప్రవేశాలకు విద్యార్థులు అర్హత కోల్పోతారు. ప్రశ్నపత్రాలు ఎలా లీకయ్యాయో, ఎక్కడ లీకయ్యాయో 48 గంటలు గడు స్తున్నా బోర్డు పెద్దలకు బోధపడలేదు. అర్థరాత్రి లీకు సంగతి తెలిశాక తనకు నిద్రపట్టలేదని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవడేకర్ బాధపడ్డారు. ఆయన బాధపడటంలో అర్ధం ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో సీబీఎస్ఈ మాత్రమే కాదు... ఆయన శాఖ కూడా బోనెక్కాల్సి ఉంటుంది. తమ వైఫల్యాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. కానీ ఏ నేరమూ చేయని పిల్లలు, వారి తల్లిదండ్రులు పడే బాధ వర్ణానాతీతం. తమ తప్పేమీ లేకుండానే వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణ కోసం నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న విధానాలను నిరుడు బోర్డు పక్కనబెట్టింది. గతంలోనూ కొన్ని పర్యాయాలు పరీక్ష పత్రాలు లీకయ్యాయి. కానీ పాత విధానంలో ఏ ప్రశ్నపత్రం లీకయిందో చూసుకుని అది వెళ్లిన కేంద్రాల్లోని విద్యార్థులకు మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహిస్తే సరిపోయేది. ఇప్పుడు కూడా ఢిల్లీ, హర్యానాల్లో మరోసారి పరీక్ష పెడితే సరిపోతుందని బోర్డు చెబుతోందిగానీ అదెంతవరకూ సబబైన నిర్ణయమో చెప్పలేం. పాత విధానంలో మూడు రకాల ప్రశ్నపత్రాలు రూపొందేవి. అందులో ఒకటి ఢిల్లీ ప్రాంతానికి, మరొకటి దేశంలోని ఇతర ప్రాంతాలకూ, మూడో రకం ప్రశ్నపత్రం విదేశాల్లో పరీక్ష రాసే విద్యార్థుల కోసం తయారుచేసేవారు. వీటిలో కేవలం 30 శాతం ప్రశ్నలు మాత్రమే ఉమ్మడిగా ఉంటాయి. మిగిలిన 70శాతం ప్రశ్నలూ వేర్వేరుగా ఉంటాయి. మళ్లీ ప్రతి సెట్లోనూ మూడు సబ్–సెట్లు, అన్నిటిలోనూ వేర్వేరు ప్రశ్నలక్రమం ఈ విధానంలోని విశిష్టత. దీనికి సీబీఎస్ఈ నిరుడు స్వస్తి పలికింది. ఒకే రకమైన ప్రశ్నల సెట్ రూపొందించి ఆ ప్రశ్నల క్రమం మాత్రం వేర్వేరు ప్రాంతాలకు వేర్వే రుగా ఉండేలా తయారుచేసింది. కనుకనే ఇప్పుడు లీకైన ప్రాంతంలో మాత్రమే కాక... అన్నిచోట్లా పరీక్షలు నిర్వహించక తప్పకపోవచ్చునన్న వాదన వినిపిస్తోంది. అసలు ప్రశ్నపత్రాలు లీకైన తీరే వింతగా ఉంది. 28న అర్థరాత్రి ఒంటిగంటన్నర దాటాక సీబీఎస్ఈ చైర్పర్సన్ మెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తి మూడు మెయిల్స్ పంపాడు. అందులో చేతిరాతతో ఉన్న 12 అటాచ్మెంట్లు ఉన్నాయి. అవన్నీ లెక్కల ప్రశ్నపత్రానివే. వాట్సాప్ గ్రూపుల్లో ఇవి చక్కర్లు కొడుతున్నట్టు అతడు వెల్లడించాడు. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షలకెళ్లే పిల్లల కోసం తానే స్వయంగా రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని గత నెల్లో విడుదల చేశారు. పరీక్షలంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, వాటిని పండగలా భావించాలని అందులో ఉద్బో ధించారు. కానీ పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపకరించాల్సిన పరీక్షలు సారాంశంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే మదింపు వేస్తున్నాయి. బట్టీపట్టడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సృజనాత్మకత చోటీయడంలేదు. కనీసం ఏడెనిమిది నెలలు రాత్రింబగళ్లు కష్టపడితే తప్ప ఫలితమీయని పరీక్షల్ని పిల్లలు పండగలా ఎలా భావించగలుగుతారు? పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గితే గ్రేడ్ గల్లంతవుతుంది. ఇత రుల కంటే గ్రేడ్ బాగుంటేనే ‘మెరుగైనచోట’ చదవడం సాధ్యమవుతుంది. ఈ లీకుల పర్యవసానంగా కొందరు అయాచితంగా అందలాలెక్కుతుంటే ఏటికేడాదీ కష్టపడినా చాలామంది నాసిరకం గ్రేడ్లతో సరిపెట్టుకుంటున్నారు. ఇకపై సీబీ ఎస్ఈ, ఏఐసీటీఈ వగైరా బోర్డుల పరీక్షలన్నిటి నిర్వహణకూ జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) రంగంలోకి రాబోతోంది. మరి దాని తీరెలా ఉంటుందో చూడాలి. ఇప్పు డనుసరిస్తున్న విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల్లో నిపుణత, మేధో సంపత్తి, సంక్లి ష్టతలను అధిగమించే శక్తి వగైరాలెలా ఉన్నాయో మదింపు వేసే పరీక్షా విధానం అమల్లోకొస్తేనే ఎంతో కొంత ప్రయోజనకరం. -
3 రోజుల్లో రీ–ఎగ్జామ్ తేదీలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి గణితం, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షల కొత్త తేదీలను మూడు రోజుల్లో ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఈ రెండు ప్రశ్నపత్రాలు లీకయ్యాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో తిరిగి పరీక్ష నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న జవడేకర్.. దోషులెవరైనా వదిలిపెట్టమని గురువారం హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల భయాందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరగాలనే రెండు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ చైర్పర్సన్ అనితా కార్వాల్ చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు 25 మందిని విచారించారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. రెండు సబ్జెక్టులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం ఉదయం భారీగా గుమిగూడిన విద్యార్థులు ‘వుయ్ వాంట్ జస్టిస్’ అని నినదించారు. ‘ మా జీవితాలతో ఆటలు ఆపండి’, ‘ మళ్లీ పరీక్షలను విద్యార్థులకు కాకుండా వ్యవస్థకు నిర్వహించండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. పరీక్షల ముందు రోజు దాదాపు అన్ని ప్రశ్నాపత్రాలు బహిర్గతమయ్యాయని, పునఃపరీక్ష జరిగితే అన్ని సబ్జెక్టులకు జరగాలని చాలా మంది విద్యార్థులు డిమాండ్ చేశారు. కొందరు చేసిన తప్పుకు విద్యార్థులందరినీ శిక్షించడం సరికాదని పదో తరగతి విద్యార్థిని భవికా యాదవ్ ఆవేదన వ్యక్తం చేసింది. జవదేకర్‌ను తొలగించండి: కాంగ్రెస్ సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతానికి సంబంధించి జవదేకర్, సీబీఎస్ఈ చైర్పర్సన్ కార్వాల్లను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మోదీ ప్రభుత్వం ఎగ్జామ్ మాఫియాను ప్రోత్సహిస్తోందని, లీకేజీ లాంటి సంఘటనలు లక్షలాది విద్యార్థుల ఆశలు, భవిష్యత్తును చిదిమేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ హెచ్చరించారు. రోజుకో లీకు(డేటా లీకేజీని ప్రస్తావిస్తూ) బయటికి రావడం ‘చౌకీదార్’ బలహీనతకు నిదర్శనమని ప్రధాని మోదీకి పరోక్షంగా చురకలంటించారు. -
మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందే...
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సీబీఎస్ఈ పేపర్ లీక్ వ్యవహారం నానాటికి ముదురుతోంది. 12వ తరగతి ఎకానామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ పేపర్లు లీక్ కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో స్టూడెంట్ యూనియన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలకు దిగారు. అంతేకాకుండా సీబీఎస్ఈ కార్యాలయం వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇతర పేపర్లలో కూడా ప్రశ్నలు చాలా సులువుగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల అందరికీ లీకైన పేపర్ల పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేను అందులో ఒక్కడిని : మంత్రి పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నేరస్తుల్ని తప్పకుండా శిక్షిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలనని, తాను వారిలో ఒక్కడినేనని ఆయన పేర్కొన్నారు. -
పరీక్షలంటే కోపం అంటున్న నటుడు
సాక్షి, ముంబై : ఇటీవల నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తూ, త్వరలోనే పదో తరగతి, ప్లస్ టూ విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సీబీఎస్ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్లు లీకయిన నేపథ్యంలో మళ్లీ పరీక్షలు నిర్వహించబోవడంపై పలువురు బాలీవుడ్ నటులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. ఫర్హాన్ అక్తర్ : ‘వారి తప్పేం లేకున్నా విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరమైన విషయం. దీన్ని ఎదుర్కొవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. వివేక్ ఒబేరాయ్ : ‘పేపర్ లీక్ అవ్వడం అన్యాయం. ఇన్నాళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరిగింది. రెండోసారి పరీక్ష రాసేవారికి మరో అవకాశం లభించినట్లు. గతంలో కంటే ఈ సారి ఇంకా బాగా పరీక్ష రాయండి’ అని పేర్కొన్నారు. రాహుల్ ధోలకియా : ‘పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని తెలిసి నేను చాలా నిరాశచెందాను. పరీక్షలంటేనే నాకు చాలా కోపం. విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటే నాకు చాలా కోపం వస్తుంది. పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని’ అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం 16,38,428 విద్యార్థులు పదో తరగతి కోసం, 11,86,306 మంది విద్యార్థులు ప్లస్ టూ తరగతి బోర్డు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరికి తిరిగి పరీక్షలు ఏ తేదీలలో నిర్వహిస్తారనే అంశం, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక వారంలోపు సీబీఎస్ఈ వెబ్సైట్లో పెడతామని బోర్డు తెలిపింది. ప్లస్ టూ ఎకనామిక్స్ పేపర్, పదో తరగతి మ్యాథ్స్ పేపర్లు లీక్ అయ్యాయి. ఈ పేపర్స్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు అంటూ పరీక్షలకు కొద్ది రోజుల ముందు చేతితో ప్రశ్నలు రాసి ఉన్న పేపర్ సోషలో మీడియాలో వైరల్ అయింది. అందులో ఉన్న ప్రశ్నలే సీబీఎస్ఈ తయారు చేసిన ప్రశ్న పత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. -
పది ప్రశ్నపత్రం లీక్
నార్నూర్(ఆసిఫాబాద్): పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లిషు పేపర్–2 ప్రశ్నపత్రం లీక్ కావడం, వాట్సాప్‌లో వైరల్‌గా మారడం ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో సోమవారం కలకలం సృష్టించింది. విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ నెల 15న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తు న్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఇంగ్లిషు పేపర్–2 పరీక్ష ప్రారంభమైన గంటకు అంటే 10.30 గంటలకు వాట్సాప్‌లో ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం హల్చల్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పరీక్ష కేంద్రంలో తీసిన ప్రశ్నపత్రం ఫొటో, విద్యార్థులు గోడ దూకి నకలు చిట్టీలు అందిస్తున్న ఫొటోలనూ పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా.. ప్రశ్నపత్రం లీక్ కాలేదని, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నామని తొలుత బుకాయించారు. అంతా సవ్యంగానే జరుగుతున్నాయని సర్ది చెప్పా రు. లీకైన ప్రశ్నపత్రం కింద విద్యార్థి హాల్‌టికెట్ నంబ రు ఉండడం, ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తి స్తున్న ఉపాధ్యాయురాలు కృష్ణవేణి చీర ఫొటోలో కని పిస్తుండడంతో నిజమేనని నిర్ధారణ జరిగింది. ఈ విషయం కలెక్టర్ దివ్యదేవరాజన్ దృష్టికి వెళ్లింది. వెంటనే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలియజేయాలని ఆమె ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఈవో జనార్దన్‌రావులను ఆదేశించారు. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించడంతో అధికారులు హుటాహుటిన పరీక్ష కేంద్రానికి చేరుకుని విచారణ జరిపారు. రూం నంబర్ 1లో.. పరీక్ష కేంద్రంలోని రూంనంబర్ ఒకటిలో ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు ధ్రువీకరించారు. అనంతరం పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ భరత్‌చౌహాన్ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ హానోక్ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పాఠశాలలో విచారణ జరిపారు. వాట్సాప్‌లో పేపరు లీక్ వ్యవహారంపై దృష్టి సారించారు. సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్‌లో పంపినట్లు విచారణలో తేలిం ది. సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని, పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్ తీసుకెళ్లడంపై కఠినంగా వ్యవహరిస్తామని అధికా రులు తెలిపారు. ఇన్విజిలేటర్ కృష్ణవేణి, చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) భరత్ చౌహాన్, డిపార్టుమెంటల్ ఆఫీసర్(డీవో) జగన్మోహన్, సిట్టింగ్ స్క్వాడ్ జాడే నాగోరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఇన్విజిలేటర్ కృష్ణవేణి నార్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూం నంబర్–1లో బ్లాక్ బోర్డుపై రెండో వరుసలో ఉన్న విద్యార్థి హాల్‌టికెట్ నంబర్ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం తాడిహత్నూర్ పరీక్ష కేంద్రం నంబర్ 1040లో పదో తరగతి ఇంగ్లిష్ పేపర్–2 ప్రశ్నపత్రం సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపించి లీక్ చేసినట్లు విచారణలో తేలింది. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ కృష్ణవేణి, సీఎస్ భరత్ చౌహాన్, డీవో జగన్మోహన్, సిట్టింగ్ స్క్వాడ్ జాడే నాగోరావులపై శాఖా పరంగా చర్యలు తీసుకుంటాం. పేపర్ లీకైనా.. బయట నుంచి జవాబులు విద్యార్థులకు అందలేదు కాబట్టి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతోపాటు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రావు, ఆదిలాబాద్ కలెక్టర్‌కు నివేదిక అందిస్తా.. పదో తరగతి ఇంగ్లిషు పేపర్–2 లీకైన మాట వాస్తవమే. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్ అనుమతి లేదు. రూమ్ నంబర్ ఒకటిలో ఫొటో తీసినట్లు తేలింది. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తా. – ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఉట్నూర్ లీక్ కాలేదు.. మాల్‌ప్రాక్టీస్: కలెక్టర్ నార్నూర్ మండలం తడిహత్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ కాలేదని, మాల్‌ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని కలెక్టర్ దివ్య అన్నారు. సోమవారం సా యంత్రం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్–2 లీక్ అయ్యిందన్న ప్రచారం అవాస్తమని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికి మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించామని అన్నారు. ఉట్నూర్ ఆర్డీవోతో విచారణ జరి పించి చీఫ్ సూపరింటెం డెంట్ భరత్ చౌహన్, డిపార్ట్మెంటల్ అధికారి జగన్మోహన్, కస్టోడియన్ అధికారి నాగోరావ్, ఇన్వి జిలెటర్ కృష్ణవేణిలను పరీక్షల నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్ చేశామని చెప్పారు. పోలీసు కేసు నమోదు చేశామని, పరీక్ష కేం ద్రాల్లో మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ తదితర చర్యలను సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 15న జరిగిన పరీక్షలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్‌గా నిర్వహించిన ఉట్నూర్ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాదవ్ సుమన్, డిపార్ట్మెంటల్ అధికారి ఇంద్రవెల్లి ఆశ్రమ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ యాసిన్ షరీఫ్, ఇన్విజిలేటర్లు ఉట్నూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలు రాథోడ్ చంద్రకళ, ఉట్నూర్ ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ జె.రమేశ్ కుమార్‌లను పరీక్ష నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్ చేశామని వివరించారు. వీరిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఈవో జనార్దన్‌రావు, అడిషినల్ ఎస్పీ మెహన్, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నెల్లూరులో పేపర్ లీకేజి నిజమే: మంత్రి
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంలో ఏపీ మంత్రులు, వియ్యంకులు అయిన నారాయణ, గంటా శ్రీనివాసరావు భిన్న ప్రకటనలు చేశారు. అసలు పేపర్ లీకేజి అన్నదే లేదని మంత్రి నారాయణ చెబుతుండగా.. నెల్లూరులో పేపర్ లీకేజి వాస్తవమేనని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నెల్లూరులో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని, అలా రావడం తప్పేనని ఆయన అంగీకరించారు. ఆ విషయం తెలియగానే తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా పేపర్ లీక్ కాలేదని మంత్రి నారాయణ అన్నారు. పేపర్ లీక్ కాలేదని అధికారులు తేల్చారని చెప్పారు. జంబ్లింగ్ విధానంతో ఒక పాఠశాల విద్యార్థులు అనేక చోట్లకు వెళ్తారని ఆయన అన్నారు. అందువల్ల ఎవరో ఒకరు లబ్ధి పొందడం అనే ప్రసక్తి ఉండదన్నారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మాత్రం నెల్లూరు నారాయణ హైస్కూలులోనే పేపర్ లీకేజి జరిగినట్లు వెల్లడి కావడం గమనార్హం. నెం. 4238 సెంటర్ అంటూ పక్కాగా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బయటపెట్టడంతో సర్కారుకు పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లు అయ్యింది. దానికి తగ్గట్లుగానే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా లీకేజిని నిర్ధారించడంతో ఇక ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. -
'టెన్త్'కు లీక్ తెగులు
‘నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ - పరీక్షా కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాల సేకరణ - తమ విద్యార్థులకు వాట్సాప్‌లో సమాధానాల చేరవేత - నెల్లూరులో సైన్స్ పేపర్ –1, మడకశిరలో తెలుగుపేపర్ –1 లీక్ - కదిరిలో ముందుగానే బయటకొచ్చిన హిందీ పేపర్ - జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు చిక్కిన ‘నారాయణ’ సిబ్బంది - రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయిన లీకేజీలు - పరీక్షల ప్రారంభానికి ముందే వాట్సప్‌లలో ప్రత్యక్షం - టెన్త్ పత్రాలు రోజూ బయటకు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం - కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం సాక్షి, అమరావతి లీక్... లీక్... లీక్... ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకొచ్చేస్తున్నాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ ‘నారాయణ’ హస్తం ఉండడం నిర్ఘాంతపరుస్తోంది. ఇప్పటివరకు పరీక్ష పత్రాల లీకేజీలు జరిగిన కేంద్రాలన్నీ నారాయణ స్కూళ్లే కావడం గమనార్హం. అయితే పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతరులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం వరకే విద్యాశాఖ పరిమితమవుతోంది. ఈ సంస్థ మంత్రి నారాయణకు సంబంధించినది కావడం, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనా స్వయానా వియ్యంకులు కావడం వల్లే అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీలపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో ప్రశ్నపత్రం లీకవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకపోవడం పట్ల విద్యారంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్లా ‘నారాయణ’ నుంచే... – నెల్లూరులోని నారాయణ హైస్కూల్నుంచి టెన్త్ సైన్స్ పేపర్–1ను శనివారం వాట్సప్ ద్వారా బయటకు పంపించారు. అధికారులు చీఫ్‌సూపరింటెండెంటు, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. నారాయణ సంస్థకు చెందిన వ్యక్తులతో పాటు కొంతమంది ప్రభుత్వ టీచర్లుకూడా ఈ లీకేజీ వెనుక ఉన్నారని చెబుతున్నారు. – పదో తరగతి పరీక్షలు ఈనెల 17నుంచి ప్రారంభం కాగా, తొలిరోజే తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి లీకైంది. అరగంటకే నలుగురు యువకులు కిటికీలోనుంచి ప్రశ్నపత్రం సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటనకు కారకుడైన హిందూపురం పట్టణంలో నారాయణ పాఠశాలకు సంబంధించిన ఏఓ ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన మొబైల్ ఫోన్ నుంచి పలువురికి ప్రశ్నపత్రం పంపాడని తేలింది. – ఆ తర్వాత రెండు రోజులకే కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీక్ అయింది. నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబులు సిద్ధం చేస్తూ మీడియా కంట పడ్డారు. పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాస్తున్న అన్ని కేంద్రాలకు జవాబులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు కదిరి పట్టణంలోని అన్ని కేంద్రాల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు సీజ్ చేసి విచారణ చేశారు. ప్రశ్నపత్రం ఈ ప్రాంతం నుంచి లీక్ కాలేదని తేల్చారు. అయితే ఈ ప్రశ్నపత్రం, సమాధానాల పత్రాలు నారాయణ పాఠశాలకు అనంతపురం జిల్లా నుంచి కాకుండా బయట జిల్లాల నుంచి వచ్చినట్లు విద్యాశాఖాధికారులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నారాయణ పాఠశాలలకు ఇదే తరహాలో ప్రశ్నపత్రం వెళ్లిందని, అందులో భాగంగానే కదిరి బ్రాంచ్‌కు వచ్చిందని వారు అంతర్గతంగా చెబుతున్నారు. ఆ సంస్థల్లో ఏటా ఇదేతంతు సాగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై డీఈఓ లక్ష్మినారాయణ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. వేరే ప్రాంతం నుంచి ఈ ప్రశ్నపత్రం వచ్చిందని వారు పేర్కొనగా తమ పరిధిలో ఈ ఘటన జరిగితేనే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కేసు నమోదుకు అంగీకరించకపోవడం విశేషం. –చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, పీలేరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల్లో రోజు ప్రశ్నాపత్రాలు బయటకు వస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి సెల్ఫోన్లో ఫోటోలు తీసి సంబంధిత సబ్జెక్టు నిపుణులకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. వారి నుంచి సమాధానాలు సేకరించి పిల్లలతో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారు. – కడప జిల్లాలోనూ ఇదే తరహా లీకేజీలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాట్సప్‌లలో ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే దర్శనమిస్తున్నా మౌనం దాలుస్తున్నారు. గ్రేడ్ల పోటీ వల్లే లీకేజీలు.. నారాయణ సంస్థలో ఆయా స్కూళ్ల డీన్లు, ప్రిన్సిపాళ్లకు ఎవరు ఎక్కువ ఏ గ్రేడ్లు సాధిస్తే వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతుండడంతో ఆ స్కూళ్లన్నీ ఈ అక్రమాలకు తెగబడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ముందుగానే ఆయా స్కూళ్ల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను బయటకు తెస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ షరామామూలుగా మారినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. ఈ లీకేజీల వ్యవహారంపై మంత్రి గంటాతోపాటు ఉన్నతాధికారులు కూడా పట్టీపట్టనట్లుంటున్నారు. కఠిన చర్యలు శూన్యం పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రాలు వాట్సప్‌లలో ప్రత్యక్షమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, ఫోన్లలో వాట్సాప్‌ల ద్వారా తమ విద్యార్థులకు పంపించి, పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నా విద్యాశాఖ కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అప్పుడప్పుడు మొక్కుబడిగా ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు చేపట్టకపోవడంతో లీకేజీ ఆగడాలకు బ్రేకులు పడడం లేదు. పరీక్షా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించామని అధికారులు చెబుతున్నారు. అయితే, నిత్యం పరీక్షకు ముందుగానే ఈ ఫోన్లలోనే ప్రశ్నపత్రాలు çబయటకు వస్తున్నాయి. సమాధానాలు వాట్సాప్‌ల ద్వారా పరీక్ష కేంద్రాల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులకు చేరుతున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు ఈ లీకేజీలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు. ప్రశ్నపత్రాల లీక్ నిజమే: పరీక్షల విభాగం డైరెక్టర్ పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్న మాట నిజమేనని, వీటిపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ భార్గవ చెప్పారు. నెల్లూరు నారాయణ హైస్కూల్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై ఇంకా తమకు పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు. ‘నారాయణ’లో లీక్‌లపై ఫిర్యాదులు.. సస్పెన్షన్లు.. నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్లో ఫిజిక్స్ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నారాయణ స్కూల్లో జరుగుతున్న పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. మహేష్ ఈదూరు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కడి చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిపార్ట్మెంటల్ అధికారి ముంతాజ్ తెహజాలను పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఫిజిక్స్ పేపర్ లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం సైబర్ క్రైం కింద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రం లీకైన పాఠశాల మంత్రి నారాయణకు చెందినది కావడంతో ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా? లేక తూతూమంత్రంగా ముగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రశ్నాపత్రం లీకేజీపై స్పందించిన మంత్రి
హైదరాబాద్: ఖమ్మంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కలకలం రేపింది. ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభం అయిన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం జిరాక్స్‌సెంటర్ల నుంచి బయటకు వచ్చిందని వార్తలు పొక్కాయి. దీనిపై మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఖమ్మం కలెక్టర్‌కు ఫోన్ చేసి పేపర్ లీక్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించారు. పేపర్ ఎక్కడ లీకయిందో తెలుసుకోవాలని, లీకేజీ అవాస్తమైతే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘ఆ విద్యార్థులూ’ ఎంసెట్-3 రాయొచ్చు
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై కడియం విద్యార్థులకు, టీచర్లకు బయోమెట్రిక్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ ఎంసెట్-3 రాసేందుకు అర్హులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ‘‘నిందితులైన విద్యార్థులపై అభియోగాలు 100% నిర్ధారణయితే తప్ప వారిపై చర్యలకు అవకాశం లేదు. వారు కూడా పరీక్ష రాసే వీలుంటుంది. దోషులని విచారణలో తేలితే, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది నిర్ణయిస్తాం. ఎంసెట్-2 పేపర్ లీకేజీ బాధ్యులపై సీఎం కేసీఆర్ చర్యలు చేపడతారు’’ అని వివరించారు. మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), గురుకులాల్లో నాణ్యత ప్రమాణాలపై బుధవారం సమీక్ష అనంతరం విలేకరులకు ఆయన ఈ మేరకు వివరించారు. ఇక వైస్ చాన్స్లర్ల నియామకాల జీవోల కొట్టివేతపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. పదో తరగతిలో జిల్లా సగటు కంటే తక్కువగా ఫలితాలు వచ్చిన కేజీబీవీల స్పెషలాఫీసర్లను తొలగించడం లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఫలితాల పెంపునకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని లేఖలు రాస్తున్నామన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువుందని, విద్యార్థుల్లేని పాఠశాలలు, హేతుబద్ధీకరణలపై ఆ తరవాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుపై ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని 192 మోడల్ స్కూళ్లు, 47 గురుకులాలు, 396 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) నాణ్యత ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కడియం ఆదేశించారు. వాటిలొ విద్య, బోధన, పరీక్షలపరంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షకు రాష్ట్ర స్థాయిలో విద్యా సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ‘‘విద్యారంగంలో నిపుణులైన 10 నుంచి 15 మంది రిటైర్డ్ అధికారులతో వెంటనే ఈ కమిటీని వేయండి. పాఠశాలల స్థాయిలో తల్లిదండ్రులతో అడ్వైజరీ, మెస్ కమిటీలూ ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఈ నెల 31లోగా ఏర్పాటవ్వాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోండి. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను ఫిబ్రవరి, మార్చి నెలల్లో కాకుండా ఆగస్టు నుంచే ప్రారంభించండి. మోడల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో టాయిలెట్లు, తాగునీరు, ఫర్నిచర్ వంటి సదుపాయాలన్నీ కల్పించండి. వీటన్నింట్లో ఒకే రకమైన మెనూ అమలు చేయండి. మెనూ వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టండి. మెనూ అమలును రాష్ట్ర స్థాయి బృందాలతో తనిఖీ చేయిస్తాం. నిధుల సమస్య ఉంటే చెప్పండి, నిధులిస్తాం. టీచర్లు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు అమలు చేయండి. సీసీ కెమెరాలు పెట్టండి’’ అని ఆదేశించారు. టీచర్లకు సబ్జెక్టుల ఫౌండేషన్ కోర్సులు, హెడ్మాస్టర్లకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. -
మెడికల్ సీటు కోసం ఆరు పరీక్షలా?
ఎంసెట్-3 యోచనతో విద్యార్థుల ఆందోళన హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనలో పడేసింది. లీకేజీ నిర్ధారణ కావడంతో మరో పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. ఎవరో చేసిన తప్పిదాలతో తాము ఆరు ప్రవేశపరీక్షలు రాయాల్సి దుస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టాప్ ర్యాంకులు సాధిస్తే తప్ప కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు రాని పరిస్థితిలో విద్యార్థులు పగలూ రాత్రీ కష్టపడి చదువుకున్నారు. ఎక్కడ అడ్మిషన్లకు అవకాశముంటే ఆ పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరుసగా ఒకదాని తరువాత ఒకటి ఐదు పరీక్షలు రాశారు. తాజాగా ఎంసెట్-2 పేపర్ లీకవడం, ఎంసెట్-3 నిర్వహించాలని సర్కారు యోచిస్తుండంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఎంసెట్-3కి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. -
పరీక్ష రద్దు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం
-
ర్యాంకర్ల మార్కులు దాదాపు సమానం
హైదరాబాద్: ఎంసెట్-2లో ప్రశ్నపత్రం లీకు ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులందరూ దాదాపు సమాన మార్కులు సాధించారు. దళారులు మొత్తం 160 ప్రశ్నలకుగాను విద్యార్థులకు 130 నుంచి 140 మధ్య ప్రశ్నలను లీక్ చేశారు. అందుకు అనుగుణంగానే సాధన చేసిన విద్యార్థులు అనుకున్న మాదిరిగా మార్కులు సాధించారు. ఎంసెట్‌లో బయాలజీ గ్రూపు కింద 80 మార్కులుంటాయి. వీటిలో లీకేజీ పొందిన విద్యార్థులందరూ 60 నుంచి 70 మార్కులు పొందారు. అలాగే ఫిజిక్స్‌లో 40 మార్కులకు గాను 32 నుంచి 38 మధ్య సాధించారు. కెమిస్ట్రీలో 40 మార్కులకుగాను ఇందులోనూ ప్రతీ విద్యార్థి 32 నుంచి 38 వరకు సాధించారు. సీఐడీ దృష్టికి వచ్చిన వాటిలో మచ్చుకు కొన్ని వివరాలు.. ఎస్.ప్రత్యూష 136 మార్కులతో 423 ర్యాంకు సాధించింది. ఇందులో ఈమె బయాలజీలో 65 మార్కులు, ఫిజిక్స్‌లో 36, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించింది. అలాగే పి.రష్మిక 133 మార్కులతో 842 ర్యాంకు సాధించింది. ఈమెకు బయాలజీలో 68 మార్కులు, ఫిజిక్స్‌లో 34, కెమిస్ట్రీలో 31 మార్కులు వచ్చాయి. అలాగే వి.జాహ్నవి 134 మార్కులతో 704 ర్యాంకు సాధించింది. సోనాలి అనే విద్యార్థి 141 మార్కులతో 295 ర్యాంకు సాధించింది. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన ఎం.భవాని 133 మార్కులతో 952వ ర్యాంకు సాధించింది. -
ఎంసెట్-2 రద్దు!
► లీకేజీ నేపథ్యంలో పరీక్ష రద్దుపై నేడు ప్రకటన ► సెప్టెంబర్ 20 నాటికి ఎంసెట్-3 ► ప్రత్యేక నోటిఫికేషన్ ఉండదు.. ► ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న ► వారందరికీ మళ్లీ హాల్‌టికెట్ల జారీ ► ప్రశ్నలు కొందరికే లీక్ అయినా రద్దు తప్పదంటున్న న్యాయ నిపుణులు ► 72 మంది విద్యార్థులకే ఆ ప్రశ్నలు చేరాయా? ► ఇంకా ఎక్కువ మంది ఉన్నారా?... ► ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంసెట్-2 రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తోంది. సీఐడీ విచారణలో 72 మంది విద్యార్థులకు ఎంసెట్-2 ప్రశ్నలు లీక్ అయినట్లు తేలింది. వీరేగాక ఇంకెంత మందికి ఆ ప్రశ్నలు చేరాయన్న సంగతి ఇంకా తేలాల్సి ఉంది. లీకేజీ ఐదారుగురు విద్యార్థులకే పరిమితమైతే వారి ర్యాంకులను తొలగించి, మిగతా విద్యార్థులకు కౌన్సెలింగ్ చేపట్టే వీలుండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే 72 మందికి ప్రశ్నలు లీక్ అయిన నేపథ్యంలో వారందరినీ తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ కొనసాగించడం అసాధ్యమని అంటున్నారు. విచారణ పూర్తయితే తప్ప ప్రశ్నలు ఇంకా ఎందరికి లీక్ అయ్యాయన్న అంశంపై కచ్చితమైన నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఈ వ్యవహారంలో నిందితులపై కేసులు నమోదు చే సి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. అలాంటపుడు లీక్ అయిన ప్రశ్నలతో ర్యాంకులు పొందిన విద్యార్థుల పేర్లను తొలగించి, కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని, ఎంసెట్-3 పరీక్షను నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. సీఐడీ పేర్కొన్న అంశాలపై చర్చించారు. ఎంసెట్-2ను రద్దు చేయడమే సరైందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై గురువారం అధికారికంగా నిర్ణయం తీసుకొని ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. 45 రోజుల్లో ఎంసెట్-3 ఎంసెట్-2 పరీక్షను రద్దు చేస్తే ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు కనీసం 45 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంసెట్-2 రద్దు, ఎంసెట్-3 నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం సెప్టెంబర్ 20 నాటికి నిర్వహించే వీలుంటుందని, ఈలోగా మళ్లీ కన్వీనర్ నియామకం, ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి ముద్రణ, విద్యార్థులకు హాల్‌టికెట్ల జారీ తదితర పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. ఎంసెట్-3 కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల ప్రక్రియ వంటివేవీ లేకుండానే.. ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికి హాల్‌టికెట్లు జారీచేసి, పరీక్షను నిర్వహించనున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాకే నిర్ణయం: లక్ష్మారెడ్డి ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ నివేదిక పూర్తిస్థాయిలో వచ్చాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడీ నివేదిక గురువారం వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 30 లోగా పూర్తి కావాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జేఎన్టీయూ వీసీకి బాధ్యతలు ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎంసెట్‌కు కన్వీనర్‌గా వ్యవహ రించిన రమణరావుకు కాకుండా జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డికి ఎంసెట్-3 బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్ర కారం సెప్టెంబర్ 30 నాటికి మెడికల్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. లీకేజీ నేపథ్యంతో మరికొంత సమయం ఇవ్వాలని ఎంసీఐకి విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విచారణలో జేఎన్టీయూహెచ్కు చెందిన ఓ ప్రొఫెసర్, సిబ్బంది పాత్రపై అనుమానాలున్నట్లు వెల్లడైంది. దీంతో వీసీ వేణుగోపాల్‌రెడ్డి అధికారులతో సమావేశమై విచారణ జరి పినట్లు తెలిసింది. తల్లిదండ్రులు మాత్రం ఎంసెట్-2ను రద్దు చేయకుండా నింది తుల పేర్లను, ర్యాంకులను తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!
-
లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!
అది 2014 సంవత్సరం. మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష పేపర్ లీకైన విషయం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అందులో కీలక నిందితుడు రాజగోపాల రెడ్డి. అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు. కట్ చేస్తే.. 2016 సంవత్సరం.. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీకైందని సీఐడీ నిర్ధారించింది. ఇందులోనూ కీలక నిందితుడు రాజగోపాలరెడ్డే!! అప్పుడూ ఇప్పుడూ కూడా అదే వ్యక్తి మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్లను లీక్ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం తాజాగా తెలంగాణ సీఐడీ విచారణలో తేలింది. ఎంసెట్ పేపర్ లీకేజి విషయంలో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గతంలో నిందితుడైన రాజగోపాలరెడ్డితో పాటు కన్సల్టెన్సీ యజమాని విష్ణు, దళారీ రమేష్‌లతో పాటు.. తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిలో విష్ణుకు ఒక కన్సల్టెన్సీ ఉంది. దాని ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజిమెంటు కోటా సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకునేవాడని అంటున్నారు. ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారని, వాళ్లు పరారీలో ఉన్నారని సమాచారం. కేసు ఛేదించిందిలా... సీఐడీ అధికారులు ముందుగా బ్రోకర్ల కాల్ డేటా సేకరించారు. ర్యాంకులు వచ్చిన పిల్లల తల్లిదండ్రుల కాల్ డేటా కూడా చూస్తే రెండూ కలిశాయి. వాళ్లిద్దరు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నట్లు తేలింది. జేఎన్టీయూ సిబ్బంది ఇద్దరి పేర్లు కూడా ఈ కాల్ డేటాలో వచ్చాయి. ఒకరు ప్రొఫెసర్, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ అని తెలిసింది. లీకేజి స్కాం విలువ 50 కోట్లు, కాగా.. మొత్తం 74 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీజీపీ అందజేశారు. లీకు ఎలా చేశారంటే... బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచింది. రాజగోపాలరెడ్డి (63) ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. మేనేజిమెంట్ కోటాలో వైద్యసీట్ల విక్రయానికి దళారీగా వ్యవహరించేవాడు. అక్రమ మార్గంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడంటూ బెంగళూరులో కూడా ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పేపర్ల ముద్రణ జరుగుతుందని ముందే తెలిసిన రాజగోపాలరెడ్డి.. హైదరాబాద్‌లో ఉన్న కన్సల్టెన్సీ ద్వారా ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లలో బాగా స్థితిమంతులైన పిల్లల వివరాలు సేకరించి, వాళ్ల తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రధానమైన పరీక్షలకు మూడు సెట్ల పేపర్లను సిద్ధం చేస్తారు. ఏ సెట్‌ను ఉపయోగించేదీ ఆరోజు ఉదయమే ప్రకటిస్తారు. అందుకే మొత్తం మూడు సెట్ల పేపర్లనూ లీక్ చేయించాడు. ఏ సెట్ వచ్చినా వాటిలోని ప్రశ్నలన్నీ తెలుసు కాబట్టి.. సులభంగా ర్యాంకులు సాధించేలా ఆ విద్యార్థులను రెండురోజుల పాటు బెంగళూరులో సిద్ధం చేశారు. సరిగ్గా పరీక్షరోజు ఉదయమే వాళ్లను విమానాల్లో హైదరాబాద్ రప్పించారు. దాంతో ముందు అనుకున్నట్లుగానే మంచి ర్యాంకులు వచ్చాయి. -
నేడు రాష్ట్ర బంద్‌కు ఏబీవీపీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని.. ఎంసెట్-2 పేపర్ లీకేజీకి బాధ్యులైన మంత్రులు, ఎంసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.