
‘‘పదో తరగతి పరీక్ష ప్రశ్నా ప్రతాల లీకేజీ, గ్రూపు 1, 2 వంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీ... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? అనే కథాంశంతో ‘యూనివర్సిటీ’ చిత్రం తీశాను’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. ఆయన లీడ్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది.
(చదవండి: ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!)
ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, నిరుద్యోగులు రెక్కలు తెగిన పావురాల్లా నిస్సహాయ స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వల్ల విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి, త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–్రస్కీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి, కెమెరా: బాబూరావు.
Comments
Please login to add a commentAdd a comment