‘‘పేపర్ లీకేజ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా జరిగాయి. ఇలాగైతే నిరుద్యోగులు ఏమైపోవాలి? అందుకే విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్‌పై ఆర్. నారాయణ మూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
(చదవండి: ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్)
ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘భారత దేశంలో చాలా చోట్ల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.. దీన్ని జాతీయ సమస్యగా పరిగణించాలని రాష్ట్రపతి, ప్రధానిగార్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిత్రంలోని ఐదు పాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి’’ అన్నారు. ‘యూనివర్సిటీ’ ప్రదర్శనకు హాజరైన పలువురు జర్నలిస్టులు ఇది అందరూ చూడాల్సిన సినిమా అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖుల్లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్స్ లక్ష్మీ నారాయణ, కోయి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment