university
-
ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులు
-
మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించిన రజినీకాంత్, ఐశ్వర్య (ఫోటోలు)
-
పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం (ఫోటోలు)
-
పరీక్షలకు ఫాతిమాను అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన వైద్య విద్యారి్థని అర్షియా ఫాతిమా (పిటిషనర్)ను.. 2025, జనవరిలో జరిగే బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. మాజీ సైనికుడి కూతురైన ఫాతిమా 2016లో నిజామాబాద్‌లోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో బీడీఎస్‌లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తి చేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది ఫీజు కట్టలేక పరీక్షలకు హాజరుకాలేదు. 2024లో బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్టోబర్ 28న వర్సిటీ దీన్ని తిరస్కరించింది. తనను బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడాన్ని, ఇంటర్న్íÙప్ పూర్తి చేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. 2025, జనవరిలో జరిగే పరీక్షలకు అనుమతి ఇచ్చేలా వర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది. -
వ్యవ‘సాయ’ వర్సిటీ.. వజ్రోత్సవ శోభ
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయంలో నిత్య పరిశోధనలు..వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, శాస్త్రవేత్తలను అందించడం.. ఇలా అనేక రకాలుగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 20, 21 తేదీల్లో వజ్రోత్సవాలు జరగనున్నాయి. వ్యవసాయ కళాశాల నుంచి జయశంకర్ వర్సిటీ దాకా.. దేశ తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మార్గదర్శకంలో వ్యవసాయ విద్య ఆలోచనలకు తొలిబీజం పడింది. 1955 జనవరి 6న అప్పటి భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజేంద్రనగర్‌లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 1964 జూన్ 12న వ్యవసాయ కళాశాల ప్రారంభం కాగా, 1965 మార్చి 20న అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీదుగా వర్సిటీని రైతులకు అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రారంభమై..1996లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు మార్చుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెపె్టంబర్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. » ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 11 కళాశాలలు, 12 వ్యవసాయ పాలిటెక్నిక్, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, 12 వ్యవసాయ పరిశోధన స్థానాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు , 9 ఏరువాక కేంద్రాలు కొనసాగుతున్నాయి. » అరవై ఏళ్ల వర్సిటీ ప్రస్థానంలో వ్యవసాయవిద్యలో సుమారు 32,300 మంది విద్యార్థులు డిగ్రీలు, 12,300 మంది పాలిటెక్నిక్ పట్టాలు సాధించారు. ఇంకా 9,500 మంది విద్యార్థులు వ్యవసాయశాస్త్రంలో పీజీ, 1500 మంది విద్యార్థులు పీహెచ్డీ పూర్తి చేశారు. నూతన వంగడాల సృష్టి.. పరిశోధనలు వరి, మొక్కజొన్నతోపాటు 50కిపైగా పంటల్లో దాదాపు 500 నూతన రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. 1968లో వర్సిటీ భాగస్వామ్యంతో అఖిల భారత వరి సమన్వయ పరిశోధన సంస్థ ద్వారా తొలిసారిగా వరిలో అధిక దిగుబడి ఇచ్చే ‘జయ’అనే సంకర జాతి తొలి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు. నాటి నుంచి స్వర్ణ, బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, తెలంగాణ సోనా ఇలా వరి ఎన్నో రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ ఏడాది అధిక దిగుబడి ఇచ్చే ఎక్స్ట్రా ఎర్లీ రకం కంపసాగర్ వరి 6251 (కేపీఎస్ 6251)ని విడుదల చేసింది. » దేశవ్యాప్తంగా వరిసాగులో ఈ వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు 25 శాతం దాకా ఉన్నాయి. 12 రాష్ట్రాలలో 12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడి వరి వంగడాలే సాగవుతున్నాయి. » దేశవ్యాప్తంగా మొక్కజొన్న విస్తీర్ణంలో 10–12శాతం వరకూ ఇక్కడి సంకర రకాలే సాగవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధి చేసిన దాంట్లో హైబ్రిడ్ రకాలైన డీహెచ్ఎం–115, 117, 121 ఉన్నాయి. » వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో చేసిన 23 ఆవిష్కరణలకు పేటెంట్లు సైతం సొంతం చేసుకుంది. వజ్రోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వజ్రోత్సవాల ఏర్పాట్లలోగురువారం రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ రైతుమేళా ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తోపాటు ఆడిటోరియంను తుమ్మల పరిశీలించారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు. -
ఉపాధి కల్పనలో గేమ్ ఛేంజర్!
మన సంప్రదాయ విద్యావ్యవస్థ తయారు చేస్తున్న విద్యావంతులు నైపుణ్యాల లేమితో కునారిల్లుతున్నారు. ఒకవైపు ఏటికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే... మరోవైపు పరిశ్రమలు నైపుణ్యం గలవారు దొరక్క సమస్యల నెదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని స్థాపించింది. విద్యా సంస్థలు– పరిశ్రమల సమన్వయం ఆధారంగా ఇది పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కాని లాంటి దార్శనిక సంస్థ ఇది. భారతదేశం ఇప్పుడు ఓ పరివర్తన దశలో ఉంది. నవ నవోన్మేషంతో ఉరకలెత్తే యువత అభివృద్ధిలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఒకపక్క ఉంటే... నిరు ద్యోగం మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉండటం, నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కోసం కర్మాగారాలు సమస్యలను ఎదుర్కో వడం ఇంకో పక్కన ఉన్నాయి. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ’ని స్థాపించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సవాలును ఎదు ర్కొనేందుకు సిద్ధమైంది. దేశంలో మునుపెన్నడూ లేని చందంగా విద్య, ఉపాధుల మధ్య వారధిగా నిలవడంతోపాటు... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కానిలాంటి దార్శనిక సంస్థ ఇది. నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను అందించి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ వర్సిటీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎందుకంటే... ఇక్కడ పరిశ్రమలే తమకు అవసరమైన నైపు ణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి కార్మికులుగా, ఉద్యోగులుగా, ఇంజ నీర్లుగా ఉద్యోగాలిస్తాయి.దేశంలో ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులు అవు తున్నారు. పట్టభద్రుల్లో 47 శాతం మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేని కారణంగా ఉద్యోగార్హత లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఏటా రెండు లక్షల మంది ఇంజినీర్లు, మరో రెండు లక్షల మంది సాధారణ డిగ్రీలు, ఐటీఐ, డిప్లోమా కోర్సులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు సంప్రదాయ విద్యా వ్యవస్థలో సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా ఈ వ్యవస్థ నుంచి బయ టకు వచ్చేవారికి నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడం కష్టసాధ్య మవుతోంది. పాతబడిపోయిన పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ ట్రెయినింగ్ తక్కువగా ఉండటం, సాఫ్ట్ స్కిల్స్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి... నైపుణ్యాల కొరతను ఎక్కువ చేశాయి. ఐటీ, ఉత్పాదన, ఆరోగ్య రంగం, సంప్రదాయేతర విద్యుత్తు... ఇలా ఏ రంగం తీసు కున్నా చాలామంది తాజా పట్టభద్రుల్లో నైపుణ్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఓ విచిత్రమైన ద్వైదీభావం ఏర్పడుతోంది. విద్యార్థులేమో ఉద్యోగాల కోసం... పరిశ్రమల వారేమో శిక్షణ, తగిన నైపుణ్యాలున్న వారి కోసం నిత్యం వెతుకుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే నైపుణ్యాలే కేంద్ర బిందువుగా ఉండే విద్యా వ్యవస్థలోభాగంగా పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను ప్రోదిచేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటిది మాత్రమే కాదు, విప్లవాత్మకమైంది కూడా. నిరుద్యోగ యువత సాధికారత కోసం ఉద్దే శించింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఆధునిక టెక్నాలజీలను నిజ జీవిత పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా ట్రెయినింగ్ ఇస్తారు. తద్వారా విద్యార్థులు కేవలం పట్టభద్రుల్లా కాకుండా... అసలైన వృత్తి నిపుణుల్లా తయారవుతారు. విద్యా సంస్థలు, పరిశ్రమల సమన్వయం ఆధారంగానే ఈ వర్సిటీ పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. అది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల వంటి అత్యాధునిక టెక్నాలజీరంగాల్లో! పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలను రూపొందించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు డిమాండ్ పెరుగుతుంది. మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. వీరంతా ఉద్యోగాల్లో స్థిరపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించిన వారవుతారు. ఈ ఏడాది నవంబరు 4న ఏడు కోర్సులతో అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే తయారీ, సేవా రంగాలకు చెందిన 18 అంశాల్లో కోర్సులు ఉంటాయి. వర్సిటీ నిర్మాణం కోసం ముచ్చెర్ల వద్ద ‘నెట్‌జీరో సిటీ’లో 150 ఎకరాల స్థలం కేటాయించాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 200 కోట్లతో వర్సిటీ నిర్మాణాన్ని చేపట్టింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు కూడా. ఆనంద్ మహింద్రా నాయకత్వం, దార్శనికతలు ఈ విశ్వవిద్యాలయాన్ని నైపుణ్యాభివృద్ధి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాయనడంలో సందేహం లేదు. మరో పక్క రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణ కూడా చేపట్టాం. అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్లుగా వీటిని ఇప్పటికే అప్ గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇకపై ఈ సెంటర్లు స్కిల్స్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్నిఅందిస్తూ... ప్రస్తుతం పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణఅందిస్తాయి. ఈ ఆధునికీకరణ కారణంగా నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణలో ఒక సమగ్రమైన ప్రతిభావంతుల వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పరిశ్రమలు కూడా పాలుపంచు కునేలా చేస్తున్నాం. తద్వారా వారు తమకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చుకునే వీలేర్పడుతుంది. అంటే పరిశ్రమలే తమకు అవసర మైన మానవ వనరులను తయారు చేసుకుంటాయన్నమాట. ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సుల ద్వారా పరిశ్రమల అవసరాల న్నింటినీ వర్సిటీ తీరుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వం వంటి సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తుండటం వల్ల పరిశ్రమలకు అన్ని నైపుణ్యాలున్న మానవ వనరులు లభిస్తాయి. యువత సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించేందుకు కూడా ఈ వర్సిటీ చర్యలు తీసుకుంటుంది. ఉపాధి అవకాశాల్లో గేమ్ ఛేంజర్స్కిల్స్ యూనివర్సిటీ ఉద్యోగ ప్రపంచంపై చూపే ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. ఆధునిక నైపుణ్య శిక్షణకు వాస్తవిక విద్య కూడా తోడవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ఇదో మేలిమి సాధనంగా మారనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు లక్షల్లో ఉంటే ఖాళీలు వేలల్లో మాత్రమే ఉంటా యన్నది తెలిసిన విషయమే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు ఉన్న అవకాశం 0.1 నుంచి ఒక శాతం మాత్రమే అన్నమాట. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాల అవసరాన్ని ఈ అంకెలే చెబు తున్నాయి. ప్రైవేట్ రంగంలో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ అవ కాశాలు మెండు. అందుకే తెలంగాణ ప్రభుత్వపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికి ఒక మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పడం! స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సులు రెండు వేల మందితో మొద లవుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య పదివేలకు చేరుతుంది. క్రమంగా ఇది 30 వేలకు చేరుతుంది. యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్త య్యేంత వరకు గచ్చిబౌలిలోని ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ఇండియా’ (ఈఎస్సీఐ), హైటెక్ సిటీలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ప్రాంగణాల్లో ప్రస్తుతం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వర్సిటీ ఫీజుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారందరికీ ఫీజుల్లో రాయితీ ఉంటుంది. వర్సిటీ కార్యకలాపాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇది ప్రారంభమే కాదు... ఉపాధి విప్లవానికి రాచబాట!- వ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి- దుద్దిళ్ల శ్రీధర్ బాబు -
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్‌లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్‌సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
కేజ్రివాల్ కంటే ఆతిశి నయం
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన ఆతిశితో కలిసి పాల్గొన్నారు. వేదికపై నున్న ఆతిశిని ఉద్దేశిస్తూ.. ‘ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. పూర్వ సీఎం కంటే ఆమె వెయ్యిరెట్లు నయమని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను’ అని సక్సేనా వ్యాఖ్యానించారు. సాధారణంగా ఢిల్లీ ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి పొసగదు. ఎప్పుడూ ఉప్పునిప్పుగా ఉండే సక్సేనా.. ఆతిశిపై ప్రశంసలు కురిపించడం విశేషం. జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చాక అరవింద్ కేజ్రివాల్ ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిజాయితీకి ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చాకే (ఎన్నికల్లో నెగ్గి) మళ్లీ సీఎం పదవిని చేపడతానని కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్ బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆతిశి జెండా ఎగురవేస్తారని ఆప్ సర్కారు ప్రతిపాదించగా.. సక్సేనా నిరాకరించిన విషయం తెలిసిందే. -
పది రోజుల్లో పనులు షురూ‘
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలకు మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐల్) అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఈ క్యాంపస్‌ను నిర్మించేందుకు అంగీకరించింది. అంతేకాదు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇందుకు రూ.200 కోట్ల భూరి విరాళాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 8న అకాడమిక్, పరిపాలన, ల్యాబొరేటరీ, గ్రంథాలయం, పార్కింగ్, ఫుడ్‌కోర్టు, 700 మంది కూర్చొనే సామర్థ్యం గల ఆడిటోరియం, భద్రతా సిబ్బంది వసతి గృహాలు, క్రీడా మైదానాల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీఎస్ఐఐసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలు ఆయా భూములను సేకరించి, చదును చేసి వర్సిటీకి అప్పగించాయి. 17 కోర్సులు.. ఏటా 20 వేల మందికి శిక్షణకందుకూరు మండలం మీర్ఖాన్పేట సర్వే నంబర్ 112లోని 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వర్సిటీలో ఫార్మా, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్, ప్యాకింగ్, హార్డ్‌వేర్, ఎలక్ట్రీషిన్ వంటి 17 రంగాల్లోæ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్, మూడేళ్ల డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఆన్లైన్/ ఆఫ్‌లైన్ కోర్సులను అందించనున్నారు.ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ బిల్లు–2024’ను కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే .గవర్నర్/ సీఎం ఈ వర్సిటీకి చాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. వీసీ సహా 15 మందితో పాలకమండలి ఉంటుంది. ఇందులో ఏడుగురు సభ్యులు పరిశ్రమలకు చెందిన వారే ఉంటారు. వర్సిటీ మూడేళ్ల నిర్వహణకు రూ.312 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. రూ.170 కోట్లు కేవలం కోర్సుల ఫీజుల రూపంలో సమకూరనున్నాయి. -
‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Clash breaks out at Jamia Millia Islamia University during Diwali celebrations of Hindus.Conflict began when some individuals allegedly tried to erase off Rangoli with their feet & extinguish Diyas.Viral Video claims some students were raising… pic.twitter.com/Kg4tf9eA2k— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2024ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
ప్రపంచ ధనవంతులలో ఒకరు, దిగ్గజ పారిశ్రామికవేత్త 'గౌతమ్ అదానీ' తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు 2024 నవంబర్ 4నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో లాజిస్టిక్, హెల్త్, ఫార్మా వంటి సుమారు 17 రంగాల్లో యువతకు శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను నియమించారు.A delegation from Adani Foundation, led by Chairperson of Adani Group, Mr @gautam_adani, met with Hon’ble Chief Minister @revanth_anumula garu to handover a donation cheque of Rs 100 crore towards the establishment of Young India Skills University.Mr Adani also promised… pic.twitter.com/knd4bezz7e— Telangana CMO (@TelanganaCMO) October 18, 2024 -
తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. వీసీల నియామకం ఫైల్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్.కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాపరెడ్డిఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం కుమార్ శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్ తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావుమహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా ఆల్ దస్ జానయ్యకొండ లక్ష్మణ్ తెలంగాణ ఆర్టికల్చర్ యూనివర్సిటీ - రాజిరెడ్డిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది -
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐన్ సోఖ్నా హైవేపై ఈ ఘటన జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.బస్సులో సూయజ్‌లోని గలాలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు ఐన్ సోఖ్నా హైవే మీదుగా వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 28 అంబులెన్స్‌లు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు సూయజ్ మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స అందిస్తున్నారు.ఈజిప్టులో ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. దేశంలో రవాణా భద్రత రికార్డు అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా దేశంలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు -
దేశంలో ‘ఐఐఎస్సీ’ టాప్
సాక్షి, అమరావతి : దేశంలో అగ్రశ్రేణి వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల ఓవరాలవిభాగంలో 251–300 మధ్య కొనసాగుతోంది. అయితే, గతేడాదితో 201–250 బాండ్ నుంచి స్వల్పంగా పడిపోయింది. ఫలితంగా వరల్డ్ టాప్–250లోకి ప్రవేశించలేకపోయింది. ఈ క్రమంలో 53.7–55.7 స్కోరు సాధించింది. పరిశోధన, ఇంటెన్సివ్ వర్సిటీలను ఐదు ప్రధాన అంశాల ఆధారంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ ర్యాంకులు కేటాయిస్తోంది. వీటిల్లో బోధన, పరిశోధన వాతావరణం, పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ అవుట్‌లుక్, ఇండస్ట్రీ ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ ఏడాది 115 దేశాలకు చెందిన 2,092 ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే 185 కొత్త ఎంట్రీలు వచి్చనట్లు పేర్కొంది. ఈ ఏడాది ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు కేవలం మిశ్రమ ఫలితాలు మాత్రమే చూశాయి. బెనారస్ హిందూ వర్సిటీ, భారతియార్ వర్సిటీ, ఐఐటీ గౌహతి వంటివి 2025లో భారతీయ టాప్–10 జాబితా నుంచి చోటుకోల్పోయాయి. ప్రపంచ వేదికపై బలమైన పోటీదారులు ఉండటంతోనే భారతీయ వర్సిటీలు కొంత వెనుకబడినట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీల్లో కేవలం ఇండోర్ ఐఐటీ మాత్రమే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. భారతీయ వర్సిటీల పురోగతి.. అన్నా వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, శూలినీ వర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ర్యాంకులను మెరుగుపర్చుకుని 401–500 బాండ్లోకి చేరుకున్నాయి. ఈ సంస్థల్లో ప్రతి ఒక్కటి 46–49.2 మధ్య స్కోర్‌ను సాధించాయి. అయినప్పటికీ కొన్ని వర్సిటీలు వెనుకబడ్డాయి. ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ర్యాంకు గతేడాదితో పోలిస్తే తగ్గింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఇండోర్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)తో కలిసి 501–600 ర్యాంకును పంచుకుంది. ఈ రెండు సంస్థలు గణనీయమైన పురోగతి ప్రదర్శించడం విశేషం. 601–800 బెల్ట్‌లో 14 భారతీయ విద్యా సంస్థలు నిలిచాయి. వీటిల్లో అలీఘర్ ముస్లిం వర్సిటీ, అమిటీ వర్సిటీ, బెనారస్ హిందూ వర్సిటీ, బిట్స్ పిలానీ, చిత్కారా వర్సిటీ, ఐఐటీ పాటా్న, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ (కేఐఐటీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ, సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్సిటీ, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విట్ వర్సిటీ (తమిళనాడు) స్థానం దక్కించుకున్నాయి.జేఎన్టీయూ అనంతపురం.. ఎస్వీయూలకు చోటు.. ఇక 801–1000 మధ్య 22 భారతీయ విద్యా సంస్థలు ఉండగా.. మన రాష్ట్రం నుంచి జేఎన్టీయూ అనంతపురం, కేఎల్‌యూ (34.5–38.1)లకు మాత్రమే చోటుదక్కింది. అలాగే, 1,201–1,500 మధ్య 23 సంస్థలు ఉండగా.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీ–ఎస్వీయూ (25.2–30.6)తో పాటు తెలంగాణకు చెందిన ఉస్మానియా, ఎన్ఐటీ–నిట్ (25.2–30.6) ఉంది. 1,501 ప్లస్ విభాగంలో.. ఆచార్య నాగార్జున వర్సిటీ, గీతం, జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన్ (10.5–25.1) నిలిచాయి. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో సంచలనం సృష్టించిన ఐఐటీ గౌహతి 801–1000 బెల్డ్కు దిగజారింది.అగ్రస్థానంలో ఆక్స్ఫర్డ్.. మరోవైపు.. ప్రపంచ అత్యుత్తమ వర్సిటీగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ని ఆరో స్థానానికి నెడుతూ స్టాన్ఫోర్డ్ వర్సిటీ రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది బ్రెజిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యా సంస్థలు టాప్–200లో చోటు దక్కించుకోవడం విశేషం. కానీ, ఆ్రస్టేలియాలోని టాప్–5 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో పడిపోయాయి. చైనా విశ్వవిద్యాలయాలు అద్భుత ప్రదర్శనతో టాప్–10కి చేరువలోకి రావడం విశేషం. యూఎస్, యూకే ఉన్నత విద్యా రంగాల ప్రతిష్ట క్షీణిస్తున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. -
తెలంగాణ వడ్డించిన విస్తరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి వంటిదని.. చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్‌రెడ్డి చెప్పారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం బలోపేతంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో ‘తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ–2024’ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. పెట్టుబడులతో సంపద పెంచుతాం ‘‘ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు. ఎంఎస్ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించే వాతా వరణం సృష్టిస్తాం. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూ.. నష్టం చేసే విధానాలను తొలగిస్తాం. పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుంది..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడటంతో రైతులకు ప్రభుత్వపరంగా ఎన్ని విధాలుగా సాయం అందించినా వారి పరిస్థితి మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపార రంగాల్లోనూ ఎదగాలన్నారు. గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని.. తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, ఇక్కడ ఎకరా అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని వ్యాఖ్యానించారు. స్కిల్ యూనివర్సిటీకి విరాళాలు సేకరిస్తాం నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో రూ.300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. భూములు కోల్పోయే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. అమెరికాలో హడ్సన్, లండన్‌లోని థేమ్స్ తరహాలో మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష కోట్లను సున్నా వడ్డీపై రుణాలుగా ఇస్తామని ప్రకటించారు. శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి పునాది: భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం వేళ్లూనుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు మూతపడుతున్నా తెలంగాణలో ఆ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల టేకోవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటోందని తెలిపారు. తాము ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశామని... గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.2వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్ఎంఈలకు విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ: మంత్రి శ్రీధర్‌బాబు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త విధానం తెస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక పార్కులు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి... మహిళలకు 5శాతం, ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు 15శాతం రిజర్వు చేస్తామని ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ‘ఫ్లాట్ ఫ్యాక్టరీలు’, ఎస్ఎంఎస్ఈ క్లస్టర్లలో పది చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సులభంగా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.100 కోట్లతో యంత్రాల ఆధునీకరణకు నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలు కోసం ‘ప్రొక్యూర్మెంట్ పాలసీ’, బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాలు, పాలసీ అమలు కోసం టాస్‌్కఫోర్స్, లీజు పాలసీ వంటివాటిని కొత్త విధానంలో పొందుపర్చామని వెల్లడించారు. కేంద్ర పథకంపై ఒప్పందం..కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలో ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపర్చడం, వేగవంతం చేయడం కోసం పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా.. రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు.కాగా.. పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, రాయల నాగేశ్వర్రావు, ఐత ప్రకాశ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులు.. వర్సిటీలు.. ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ కల్పన, మెరుగైన విద్య కోసం విశ్వవిద్యాలయాల అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం కేవలం పదవులు, ఫామ్‌హౌస్‌లు, బంగళాలు, ఆస్తుల జమ లాంటి ప్రాధాన్యతలతో పదేళ్లు అధికారం చలాయించిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటోందని.. తనతోపాటు మంత్రులు, అధికారులను ఎవరైనా కలిసి ప్రశ్నించే వెసులుబాటు ఉందన్నారు. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలతో.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో పరీక్షలు నిర్వహించకుండా తీవ్ర జాప్యం చేస్తే మేం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేశాం. రాష్ట్రంలో సర్టిఫికెట్ కోర్సులకే విద్య పరిమితమైంది. చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో వర్సిటీ పాలకమండలిని ఏర్పాటు చేశాం. వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను ఎంపిక చేశాం. ఈ ఏడాది 2 వేల మందికి, వచ్చే ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించాం. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌కు పెద్ద సంఖ్యలో పథకాలు వచ్చేలా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’అని రేవంత్ వివరించారు. 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు రానున్న పది రోజుల్లో వైస్ చాన్స్లర్లను నియమించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘వీసీల నియామకం పూర్తి కాగానే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంది. కానీ కనీస వసతుల్లేక పౌల్ట్రీ షెడ్లో కోళ్ల మాదిరిగా వాటిని తయారు చేసింది. కానీ మేము మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నాం. ఒక్కో క్యాంపస్‌ను 20 నుంచి 25 ఎకరాలతో ఏర్పాటు చేస్తాం’అని రేవంత్ తెలిపారు. లక్ష్యంపైనే దృష్టిపెట్టండి.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించి మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. కొంతకాలం ఇంటి సమస్యలను, ఇతర అంశాలను పక్కనపెట్టి కేవలం సివిల్ సరీ్వసుకు ఎంపిక కావాలనే లక్ష్యాన్నే గుర్తుంచుకోవాలని సూచించారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు అందించిన రూ. లక్ష ఆర్థిక సాయం పెద్ద మొత్తం కానప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల వెంట ఉందనే భావన కలిగించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో రూ. లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధించి రాష్ట్ర పరపతిని పెంచాలని కోరారు. మానవవనరుల వృద్ధి కోసమే స్కిల్స్ వర్సిటీ: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో మానవవనరులను మెరుగపర్చేందుకే స్కిల్స్యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మేధోసంపత్తిని ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. గురుకులాలల్లో మౌలికవసతుల కల్పనకు గతేడాది రూ. 4 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం రూ. 5 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిందని గుర్తుచేశారు. మూసివేతకు చేరువైన 63 ఐటీఐలను తమ ప్రభుత్వం ఏటీసీలుగా అభివృద్ధి చేసిందని భట్టి వివరించారు. అనంతరం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లపై చంద్రబాబు ప్రభుత్వం ప్రతీకారం
-
దసరా నుంచి స్కిల్స్ వర్సిటీ షురూ
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో 20 కోర్సులను నిర్వహించనున్నామని.. అందులో దసరా నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సు లను ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితరాలపై శనివారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో స్కిల్స్ వర్సిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యేదాకా.. తాత్కాలిక భవనంలో వర్సిటీని నిర్వ హించనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా/ న్యాక్/ నిథమ్ భవనాల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా, కో–చైర్మన్‌గా శ్రీనివాస సి రాజును నియమించినట్టు వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.తొలుత స్కూల్ ఆఫ్ ఈ–కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సరి్టఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభిస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డీస్, టీవీఏజీఏ, అదానీ కంపెనీలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించాయన్నారు. సీఐఐ కూడా ముందుకు వచి్చందని చెప్పారు. యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
NIRF rankings 2024: ఐఐటీ మద్రాస్ టాప్
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్‌తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్‌కు మూడో ర్యాంకు దక్కింది. -
ఉద్యమ స్ఫూర్తితో ఉపాధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నీళ్లు, నిధులు, నియామ కాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలి్పంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఒక్కరికీ గ్యారంటీగా ఉపాధి లభిస్తుందని హామీ ఇచ్చారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. తర్వాత నెట్ జీరో సిటీలో భాగంగా బేగరికంచె గ్రామ పరిధిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నాలుగో నగరంగా బేగరికంచె అభివృద్ధి ‘హైదరాబాద్‌ను నవాబులు, సికింద్రాబాద్‌ను బ్రిటిషర్లు, సైబరాబాద్‌ను చంద్రబాబు, వైఎస్సార్‌లు నిర్మిస్తే.. నాలుగో నగరంగా బేగరికంచెను మేము అభివృద్ధి చేయబోతున్నాం. నాలుగేళ్లలోనే న్యూయార్క్‌ను మించిన నగరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తాం. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కలి్పస్తాం. తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్యపై కొనసాగింది. అందులో యువత కీలక పాత్ర పోషించింది.ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటికి వస్తున్నా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెడుతూ అశోక్‌నగర్ చౌరస్తాలోని కోచింగ్ సెంటర్లలో చేరినా, సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలు దొరకడం లేదు. పీజీ, పీహెచ్డీ పట్టాలు పొంది కూడా నిరుద్యోగులుగా మిగులుతున్న యువతకు ఈ స్కిల్స్ యూనివర్సిటీలో డిప్లొమా, డిగ్రీ సరి్టఫికెట్ కోర్సులు అందించడంతో పాటు ఆయా సంస్థల్లో ఉపాధి కలి్పస్తాం. ఇక్కడ అడ్మిషన్ పొందితే చాలు.. జాబ్ గ్యారంటీ. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించి ఉపాధి కలి్పస్తాం..’అని సీఎం చెప్పారు. 3 నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు షురూ ‘రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకప్పుడు వేలల్లో ఉన్న భూముల ధరలు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రాకతో ప్రస్తుతం కోట్లకు చేరాయి. మరో మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులను ప్రారంభిస్తాం. నెట్ జీరో సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు 200 అడుగుల ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు సహా మెట్రో రైలు నిర్మాణానికి భూసేకరణ పనులు చేపడతాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా బేగరికంచె వరకు మెట్రో రైలును విస్తరింపజేస్తాం. కడ్తాల్ అడవుల్లో నైట్ సఫారీ కడ్తాల్, ఆమనగల్లు అడవుల్లో నైట్ సఫారీ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం. ఫార్మాసిటీ కోసం భూములు త్యాగం చేసిన రైతులు అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలను చదివించి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. విమానం కొనాలన్నా, ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అవకాశాలు ఉంటాయి.ఈ ప్రాంతానికి తాగునీరు సహా రోడ్లు, పార్కులు ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం..’అని రేవంత్ చెప్పారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, నీటి పారుదలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చొరవతోనే అనేక యూనివర్సిటీలు, ప్రాజెక్టులు వచ్చాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, భాక్రానంగల్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో రైతాంగానికి సాగు నీరు అందుతోంది..’అని అన్నారు. ప్రపంచానికే తలమానికం: డిప్యూటీ సీఎం భట్టి ‘స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా శంకుస్థాపన కూడా చేసుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ప్రపంచానికే తలమానికం కాబోతోంది. భూములు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో 600 ఎకరాల్లో అద్భుతమైన కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నాం. ప్లాట్లు పొందిన ప్రతి రైతు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటిì నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మాది చేతల ప్రభుత్వం: మంత్రి కోమటిరెడ్డి తమది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వందలకొద్దీ కాలుష్య కారక ఫార్మా కంపెనీలు ఒకే చోట వస్తున్నాయని తెలిసి అప్పట్లో ఎంపీగా ఆందోళన చెందానని అన్నారు. ఫార్మాను రైతులతో పాటు తాను కూడా వ్యతిరేకించానని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేసి దాని స్థానంలో ఫార్మా విలేజ్‌లు చేపట్టామని తెలిపారు. కొత్త ఆలోచన, కొత్త గమ్యం: మంత్రి శ్రీధర్‌బాబు కొత్త ఆలోచన, కొత్త గమ్యం, కొత్త నగరం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు చేసిన యువత కల నెరవేరబోతోందన్నారు. ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రంలో మిగిలిన మరో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచాలనే ఆలోచనతో స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. -
స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు సెంటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర నరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. 57 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులకు పట్టించుకోలేదన్నారు. పరిశ్రమల్లో యువతకు అవకాశాలు కల్పించడం కోసమే ఈ స్కిల్ యూనివర్శిటీ అన్నారు. ఈ ఏడాదిలో ఈ నగరం రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
అలీఘర్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం
యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయూ)లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు(బుధవారం) యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. కాల్పులలో గాయపడిన ఇద్దరు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఎఎంయు తరచూ ఏదోఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా ఇక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. హోలీ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులపై మరో వర్గం దాడి చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు సివిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.గత మే నెలలోనూ ఎఎంయూలోని ఎస్ఎస్ హాల్ క్యాంపస్‌లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక వర్గంవారు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఉదంతం జరిగినప్పుడు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. గాయపడిన బీటెక్ విద్యార్థిని వెంటనే వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు. -
అప్ టు డేట్‌గా ఉండటమే ఏఐ రంగంలో సవాలు!
కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగం కావాలని చూస్తున్నారా? అయితే మీరు ఎప్పటికప్పుడు ఆ రంగంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఉండాల్సిందే అంటున్నారు జయతి మూర్తి. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఈ తెలుగింటి ఆడపడుచు యూనివర్శిటీ వ్యవహారాలు, పరిశోధనల వివరాలను ‘సాక్షి.కామ్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. అప్-టు-డేట్‌గా ఉండటమే కృత్రిమ మేధ రంగంలో ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న వారు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య అని అంటున్నారు జయతి మూర్తి. కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు మొదలుకొని పలు ఇతర అంశాలపై జయతి మూర్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే..సాక్షి: కృత్రిమ మేధతో ఉద్యోగాల అవకాశాలు దెబ్బతినవు అని చాలా మంది చెబుతున్నారు. మీరేమంటారు? జయతి: కొన్ని రకాల ఉద్యోగాల్లో కోత పడుతుంది.. అదే సమయంలో కొన్ని కొత్త రకాలు ఉద్యోగాలు పట్టుకొస్తాయి కూడా. ఏఐ విస్తృత వాడకం తరువాత కూడా అన్ని రకాల ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని చెప్పలేము. కొంత మార్పు అనివార్యం. కొందరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కూడా. కొందరికి ఏఐ వల్ల లాభం చేకూరితే మరికొందరికి నష్టమూ, బాధ జరగొచ్చు. నష్టపోయే వారికి కొత్త నైపుణ్యాలను అందించేందుకు ప్రయత్నాలు జరగాలి. మార్పు తాలూకూ దుష్ప్రభావం తక్కువగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినప్పుడు గతంలోనూ కొందరు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. సాక్షి: రీస్కిల్లింగ్ అనేది అందరికీ సాధ్యమవుతుందా? కృత్రిమ మేధతో ఉద్యోగాలు కోల్పోయే వారికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి? జయతి: స్పష్టమైన ఆర్థిక విధానాల అవసరం ఏర్పడవచ్చు. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తాలూకూ ఫలితాలు అందాలి. లేదంటే అంతరాలు పెరిగిపోతాయి. ఇంకోలా చెప్పాలంటే ఇప్పటికే ఆ అంతరం ఉంది. మనలో చాలామంది కంప్యూటర్లతో పని చేస్తూ సంపాదించుకుంటున్నాం. పేదలకు ఆ అవకాశం లేదు. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ స్క్రీన్లు, ల్యాప్‌టాప్‌లూ ఉంటే కొన్నింటిలో కనీస వసతులు కూడా లేకపోవడం వాస్తవం. ఈ అంతరాన్ని తగ్గించేలా కొత్త ఆర్థిక విధానాలు రూపొందితే ప్రయోజనం ఉంటుంది. సాక్షి: డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ఏం చేస్తోంది? జయతి: మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ మా యూనివర్శిటీలో మూడొంతుల మంది విద్యార్థులు మొట్ట మొదటిసారి కాలేజీలోకి అడుగుపెడుతున్న వారు. వీరందరికీ కూడా కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై బోధన జరుగుతోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులు రెండింటిలోనూ కోర్సులు అందిస్తున్నాం. సాక్షి: కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? జయతి: ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం చెప్పడం కూడా తొందరపాటు అవుతుందని అనుకుంటున్నాను. ఎల్ఎల్ఎంలు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ టెక్నాలజీల్లో ఉద్యోగాలకు ఉపయోగపడవచ్చు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సమీప భవిష్యత్తులో కృత్రిమ మేధ అనేది కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. మెకానికల్ వంటి ఇతర బ్రాంచ్‌లకూ విస్తరిస్తుంది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఏం జరగబోతుంది అని ఇప్పుడే చెప్పడం కష్టం. అవకాశాలు బోలెడు వస్తాయని మాత్రం చెప్పవచ్చు. సాక్షి: మరి... కృత్రిమ మేధ రంగంలో ఉపాధి పొందాలని అనుకునే వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది? జయతి: మొట్టమొదటి సవాలు. అప్-టు-డేట్‌గా ఉండటం. ఎందుకంటే ఈ టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది. ఈ రోజు ఉన్న ఛాట్‌జీపీటీ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. బహుశా సమీప భవిష్యత్తులో ఏఐ కోర్సులు ఏడాదికోసారి మార్చాల్సి వస్తుందేమో. అటువంటి పరిస్థితుల్లో ఏఐలో ఉపాధి వెతుక్కునే వాళ్లు.. అప్-టు-డేట్‌గా ఉండటం చాలా కీలకం అవుతుంది. సాక్షి: మీరు స్వతహాగా మెకానికల్ ఇంజినీర్. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మెకానికల్ ఇంజినీరంగ్ పరిష్కారాలు సాధ్యమని భావిస్తున్నారా? జయతి: ఇంజినీరింగ్ రంగం ఒక్కదానితోనే వాతావరణ మార్పుల సమస్యను అధిగమించలేము. ఇంజినీరింగ్ కొన్ని రకాల సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను అందివ్వవచ్చు. కానీ.. అసలు సమస్యలు సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నవి. వాతావరణం నుంచి కర్బన ఉద్గారాలను నేరుగా పీల్చేసే టెక్నాలజీలపై కొంతవరకూ ఏకాభిప్రాయం కుదిరినా.. ఆయా దేశాల స్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి. దేశాలన్నీ కలిసికట్టుగా ముందకు కదిలినప్పుడే వాతావరణ మార్పుల వంటి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని నేను భావిస్తున్నాను. సాక్షి: రోబోలు మనకు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్న కృత్రిమ మేధ ఈ రోబోటిక్స్‌తో ఎప్పుడు కలసిపోతాయి? జయతి: ఇప్పటికే కలిసిపోయాయని చెప్పాలి. ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ప్రతిపాదించిన న్యూరల్ లింక్ వంటివి ఇప్పటికే మొదలయ్యాయి. నిజానికి రొబోటిక్స్, కృత్రిమ మేధ రెండూ వేర్వేరు కాదు. ఒక్కటే అని చెప్పాలి. చూపు మొదలుకొని, ఇతర అన్ని మానవ సంబంధిత ఇంద్రియ జ్ఞానాలను రోబోట్లకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంప్యూటర్ విజన్ వంటివాటిని రొబోటిక్స్, డ్రైవర్ల అవసరం లేని కార్లలో ఇప్పటికే ఏఐతో కలిపి వాడుతున్నారు. ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్లూ అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ రొబోటిక్స్, ఏఐ రెండూ కీలకం. ఇందుకు తగ్గట్టుగా ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ వాతావరణం, సుస్థిరాభివృద్ధి, కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి, రొబోటిక్స్, బయాలజీ, ఆరోగ్యం వంటి రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సాక్షి: ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థులు ఎంతమంది? ఏయే దేశాల వారు ఉన్నారు? జయతి: విదేశీ విద్యార్థులు రెండు వేల మంది వరకూ ఉన్నారు. భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 400. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ అబ్రహాం లింకన్ కాలంలో ఏర్పాటైన లాండ్ గ్రాంట్ యూనివర్శిటీ. రైతులు, పశు పోషకుల వంటివారికి సాయం చేసే లక్ష్యంతో ఏర్పాటైన వర్శిటీలు లాండ్ గ్రాంట్ యూనివర్శిటీలంటారు. అందుకే మా యూనివర్శిటీ అటవీ, వ్యవసాయ, ఇంజినీరింగ్ రంగాల్లో బలంగా ఉంది. ర్యాంకింగ్‌ల విషయానికి వస్తే సముద్ర శాస్త్రం, వాతావరణ శాస్త్రాల్లో వర్శిటీకి మంచి పేరుంది. అంతేకాకుండా... కంప్యూటర్స్ సైన్స్ రంగలో దేశంలోనే అతిపెద్ద అండర్గ్రాడ్యుయేట్ సంస్థ మాది. సాక్షి: ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో కృత్రిమ మేధ సాయంతో వ్యవసాయ రంగంపై ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? జయతి: రెండేళ్ల క్రితం ఓఎస్‌యూ పూర్వ విద్యార్థి, ఎన్విడియా అధిపతి జెన్సెంగ్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి భారీ విరాళం అందించారు. ఇందులో అత్యాధునిక ఎన్విడియా జీపీయూ సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. దీని సాయంతో ప్రస్తుతం మేము కృత్రిమ మేధను వాడుకుని వ్యవసాయంపై పలు పరిశోధనలు చేస్తున్నాం. యూనివర్శిటీ పరిధిలోని అటవీ ప్రాంతం, వ్యవసాయ క్షేత్రాల ద్వారా సమాచారం సేకరించి ఈ సూపర్ కంప్యూటర్ ద్వారా పెద్ద ఎత్తున కంప్యూటేషన్ చేస్తున్నాం. విసృ్తత సమాచారాన్ని కంప్యూటర్ మోడళ్లుగా మలచడంలో కృత్రిమ మేధ చాలా ఉపయోగకరమైంది. ఎన్విడియా వద్ద ఉన్న అతిపెద్ద గ్లోబల్ ఎర్త్ సిములేటర్‌ను కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రపంచస్థాయి మోడళ్ల ఆధారంగా.. స్థానిక వాతావరణంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకుంటున్నాము. రానున్న వందేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకుని మనగలిగే పంటలు ఏవి? పంటల నీటి అవసరాలు, నేల సారం, చీడపీడల బెడద వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాం. ఒరెగాన్ యూనివర్శిటీ సముద్రతీరంలో ఉన్న నేపథ్యంలో మత్స్య, ఇతర జలచరాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. వ్యవసాయ సమస్యలు తీర్చేందుకు ఇంజినీరింగ్ సెన్సర్ల రూపంలో కొంతవరకూ సాయపడవచ్చు కానీ.. జీవ, రసాయన శాస్త్రాల అవసరమూ ఉంటుంది.సాక్షి: యూనివర్శిటీలో సుమారు 130 ఏళ్లుగా వ్యవసాయ పరిశోధన ఒకటి కొనసాగుతోందని విన్నాము. దాని వివరాలు? జయతి: ఒరేగాన్ రాష్ట్రం తూర్పు ప్రాంతంలో సీబార్క్ అనే వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉంది. అక్కడ గోధుమ, బార్లీ, చిక్కుళ్లు, కాయధాన్యాలపై, నేల, చీడపీడలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఏఐ సాయంతో ఈ సమాచారాన్ని విశ్లేషించేందుకు తద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాము. అలాగే వర్శిటీలోని ఒక ప్రాంతంలో ఉన్న చెట్లు అన్నింటికీ సెన్సర్లు ఏర్పాటు చేశాము. అవి పంపే సమాచారాన్ని... వాతావరణ వివరాలతో సరిచూసుకుని భవిష్యత్తులో ఏ పరిస్థితిలో ఏమవుతుందనే విషయాలను అంచనా కట్టగలుగుతున్నాము. సాక్షి: ఛాట్‌జీపీటీ వంటి ప్రస్తుత జనరేటివ్ ఏఐ మోడళ్లు ట్యూరింగ్ టెస్ట్‌ను పాస్ అయ్యాయా? జయతి: నాకు తెలిసి ఏవీ పాస్ కాలేదు. వాస్తవం చెప్పాలంటే ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏదో ఒక్కటి మాత్రమే కాదు. చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుత జనరేటివ్ ఏఐ మోడళ్లు ఏదో ఒక టెస్ట్ పాస్ అయ్యే ఉంటాయి. అయితే వీటి పరిధి చాలా పరిమితమైంది. ఛాట్బోట్లను సేల్స్, మార్కెటింగ్ వంటి పరిమిత ప్రయోజనాలకు వాడుకునేలా టెస్ట్‌లు ఉంటాయి. సంక్లిష్టమైన, జనరల్ ఇంటెలిజెన్స్ దిశగా ఉండవు. అయితే మనం మాట్లాడుతున్నది కృత్రిమ మేధతో అన్న విషయాన్ని సమర్థంగా కప్పిపుచ్చగల ట్యూరింగ్ టెస్ట్‌తో పరీక్షలు చేశారా లేదా అన్నది అస్పష్టం. సాక్షి: కృత్రిమ మేధ మానవజాతిపై పెత్తనం చెలాయించే రోజు వస్తుందా? జయతి: లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల వంటి కృత్రిమ మేధ టెక్నాలజీలు చాలా బాగున్నాయి. కానీ ఇవేవీ ఆర్టిఫిషల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)కు చాలా చాలా దూరం. అయితే ఒక్క విషయం. ఐదేళ్ల క్రితం ఛాట్‌జీపీటీ వంటిది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ రంగంలో మార్పులు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదకరమా? కాదా? అన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేము. కాకపోతే మానవజాతిపై పెత్తనం చెలాయిస్తుందా? వంటి ప్రశ్నలు రావడం మంచిదే. ప్రజల్లో కృత్రిమ మేధపై అవగాహన మరింత పెరుగుతుంది. తద్వారా జాగ్రత్తగా ఉండేందుకు అవకాశమూ ఏర్పడుతుంది. -
ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్: శంకర్పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్‌ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్‌ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
నాడుప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. దీనికంతటికీ కారణం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ వర్సిటీ బిల్లు. నేడు మెరిట్ సాధించిన పేద విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను సొంతం చేసుకోవచ్చు. గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కన్వినర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా సీఎం జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిభ గల పేదింటి విద్యార్థులను టాప్ క్లాస్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో పైసా ఖర్చులేకుండా చదివిస్తూ, వారు ఉన్నత లక్ష్యాన్ని అధిగమించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు మాత్రమే అందుకునే ప్రైవేట్ యూనివర్సిటీ విద్యను తొలిసారిగా పేదింటి విద్యార్థులకు చేరువ చేశారు. ఏపీఈఏపీ సెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా మెరిట్ సాధించిన పేదింటి విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పించి, ఉత్తమ విద్య అందేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. రెండేళ్లలో 6,996 సీట్లు భర్తీ ఏపీలోని ప్రైవేట్ వర్సిటీల్లో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులన్నింటా ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు దక్కుతున్నాయి. ఈ వర్సిటీల్లో ఏడాదికి రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ నిర్ణయంతో పేద మెరిట్ విద్యార్థులకు గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం సీట్లు, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం సీట్లు లభిస్తున్నాయి. ఇందులో ఎస్ఆర్ఎం–అమరావతి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపీ వీఐటీ), సెంచూరియన్, అపోలో వర్సిటీ, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, మోహన్‌బాబు యూనివర్సిటీలలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో 6,996 సీట్లు పేద విద్యార్థులకు దక్కాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా ప్రభుత్వం ఐదేళ్లలో ఏకంగా రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్ వర్సిటీల్లో కన్వినర్ కేటగిరీలో చేరిన విద్యార్థులకు ఉచితంగానే చదువులు చెప్పిస్తోంది. అప్పట్లో ప్రైవేట్ వర్సిటీలకు చంద్రబాబు అండ ప్రైవేట్ వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం వర్సిటీ యాజమాన్యాలకు లబ్ధి చేకూరేలా నిబంధనలు పెట్టింది. ఆయా వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతో పాటు ఇతర రాయితీలూ కల్పించింది. ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్నింటా వర్సిటీల ఇష్టానికే వదిలేసింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే కేటాయించేవి. ఫలితంగా పేద మెరిట్ విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం జగన్ దార్శనికత సీఎం జగన్ అధికారం చేపట్టాక పరిస్థితి మారింది. ఉన్నత బోధన, వనరులు ఉన్న ప్రైవేట్ వర్సిటీ విద్య పేద విద్యార్థులకూ దక్కాలనుకున్నారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా గ్రీన్‌ఫీల్డ్ విధానంలో ఏర్పాటైన ప్రైవేట్ వర్సిటీల్లో చదువుకునే అవకాశాలపై తొలుత దృష్టి సారించారు. ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ ద్వారా ఆయా వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 35 శాతం సీట్లను కేటాయించారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల ఏర్పాటుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు.ఇప్పటికే కొనసాగుతున్న కాలేజీలు నిరీ్ణత నిబంధనలతో, వనరులను కలిగి ఉంటే ఆయా యాజమాన్యాలు తమ సంస్థలను బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీలుగా మార్చుకునే అవకాశమిచ్చారు. అయితే వర్సిటీగా మారక ముందు వరకు ఈ కాలేజీల్లోని సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో పేద మెరిట్ విద్యార్థులకు దక్కేవి. వర్సిటీగా మారాక 35 శాతం సీట్లే దక్కితే పేద మెరిట్ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని సీఎం జగన్ భావించారు. దీంతో బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లోని 70 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాలో కేటాయించేలా చట్టాన్ని సవరించారు.బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీగా ఏర్పాటయ్యాక కొత్త కోర్సులు ప్రారంభించినా, అదనపు సీట్లు తెచ్చుకున్నా వాటిలో మాత్రం గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల మాదిరి 35 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాకు దక్కుతాయి. ఇటీవల మరో మూడు విద్యా సంస్థలు బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీలుగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిల్లో మరిన్ని అదనపు సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్‌షిప్‌ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్‌లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
చదువు శక్తినిస్తుంది
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు. చదువు వేసిన మార్గం.. ‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్‌గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్‌పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్‌కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది. సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ.. జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్‌లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది. తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్‌లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్‌గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వర్క్ చేశాను. లెక్చరర్‌గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్‌గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన మలుపు 1979–80లో నాటి మద్రాస్‌లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్‌కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్‌గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి. విశ్రాంత జీవనంలో.. రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్‌లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి -
గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి.. ఇద్దరు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్‌లోని ఎ–బ్లాక్ హాస్టల్లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. -
Ahmedabad: గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన శనివారం రాత్రి జరిగింది. విదేశీ స్టూడెంట్స్‌పైకి రాళ్లు విసరడమే కాకుండా హాస్టల్ గదిని కూడా ధ్వంసం చేశారు. దాడిలో గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఎస్వీపీ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. దాడితో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ గేట్లన్నీ మూసివేశారు. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది ఎవరనేది తేల్చేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు ప్రపంచంలో భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్నారు. What a shame. When your devotion & religious slogans only come out when Muslims peacefully practice their religion. When you become unexplainably angry at the mere sight of Muslims. What is this, if not mass radicalisation? This is the home state of @AmitShah & @narendramodi,… https://t.co/OshZUIoWjl — Asaduddin Owaisi (@asadowaisi) March 16, 2024 ఇదీ చదవండి.. కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం -
త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు. -
దేశాభివృద్ధిలో మహిళల శకం: ముర్ము
బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు. -
న్యూయార్క్ వర్సిటీలో కలకలం.. స్టూడెంట్స్ వరుస మరణాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవంల రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన 19 ఏళ్ల జాక్వెలిన్ బీజిల్ అనే విద్యార్థిని లిప్టన్ హాల్లో అచేతన స్థితిలో పడి ఉంది. ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం వచ్చి పరిశీలించగా ఆ స్టూడెంట్ చనిపోయినట్లు తేలింది. ఇక డోరీ సాల్టి అనే మరో విద్యార్థి శనివారం ఆర్ట్ డిపార్ట్మెంట్కు చెందిన బర్నే బిల్డింగ్ బయట పడిపోయి ఉంది. ఈ విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి పడిపోయిందా లేక భవనం మీద నుంచి దూకిందా అన్న విషయంపై క్లారిటీ లేదు. సాల్టి కుటుంబానికి సన్నిహితులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలో మానసిక సంబంధమైన సమస్యలకు సరైన కౌన్సెలింగ్ లేకపోవడం వల్లే విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కనీసం చివరి చూపు చూసుకోనివ్వండి -
కొత్త బిజినెస్‌లోకి దిగిన ఎల్జీ.. విద్యార్థులే టార్గెట్!
టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారు చేసే ఎల్జీ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తయారు చేసే ఈ దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి దిగింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ( LG Electronics India ) విద్యారంగాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో స్వీయ-లాండ్రీ సేవా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక్కడ వాణిజ్య వాషింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాదికల్లా 200 సెల్ఫ్ లాండ్రీ సర్వీస్ సెంటర్లను ప్రారంభించే ప్రణాళికలతో కంపెనీ ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.33 కోట్లు ) పెట్టుబడి పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ విశ్వవిద్యాలయంతో ఎల్జీ జత కట్టంది. అక్కడున్న 1500 మంది విద్యార్థులకు మొదటి సారిగా లాండ్రీ సేవలు ప్రారంభించింది. మెషిన్ రిజర్వేషన్, ఆపరేషన్, ఆటోమేటెడ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఓ యాప్‌ను కూడా రూపొందించింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఎల్జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో సెల్ఫ్ లాండ్రీ సర్వీస్‌తో విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. "ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాం. 2024 చివరి నాటికి 200 సెల్ఫ్-లాండ్రీ సర్వీస్ సెంటర్లను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాం" అని జియోన్ పేర్కొన్నారు. -
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
ఎన్జీ రంగా వర్సిటీలో పరిశోధనలు భేష్
ల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలోని పరిశోధనలు చాలా బాగున్నాయని, అమెరికాలోని టెన్నెసీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ దిలీప్ నందు వాణి, ప్రొఫెసర్ జాన్ రికార్డ్స్ ప్రశంసించారు. నెల్లూరు నగరంలోని పరిశోధనా క్షేత్రాన్ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలను తాము పరిశీలించామని, అన్నిచోట్ల చాలా బాగున్నాయని కొనియాడారు. అదేవిధంగా నెల్లూరులో ఉన్న ఎన్జీ రంగా పరిశోధనా క్షేత్రంలో పరిశోధనలు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని వివరించారు. తమ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా నెల్లూరులోని పరిశోధనా క్షేత్రానికి పంపి ఇక్కడి స్థితిగతులను తెలుసుకునేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోదండరామిరెడ్డి, డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ సి.రమణ, ప్రధాన శాస్త్రవేత్త వినీత ఈ బృందానికి క్షేత్రంలో చేస్తున్న పరిశోధనలను వివరించారు. ప్రధానంగా కొత్త వంగడాలు, తెగుళ్ల నివారణపై కూలంకషంగా వివరించారు. -
మత్స్యరంగం కొత్త పుంతలు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మూడోదిగా ఏర్పాటైన ఈ వర్సిటీకి ఓ వైపు నూతన భవన సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే.. మరోవైపు దీనికి అనుబంధంగా కొత్త మత్స్య కళాశాల కొలువు దీరింది. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు..నిష్ణాతులైన అధ్యాపక బృందంతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 1200కు మించి పట్టభద్రుల్లేని పరిస్థితి రాష్ట్రంలో 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం..1.10 లక్షల హెక్టార్ల మంచినీటి సాగు..80 వేల హెక్టార్లలో ఉప్పునీటి సాగు విస్తీర్ణం ఉంది. 1.75 లక్షల మంది ఆక్వా రైతులు..8.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. ఈ రంగంపై ఆధారపడి 16.50 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 51.06 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే నం.1 స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో చేపల ఉత్పత్తిలో 25.60 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి 11,901 డిప్లమో హోల్డర్లు, 6118 బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ), 2541 మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ) చదివిన వారు అవసరం. 2030 నాటికి కనీసం 50 వేల మందికి పైగా అవసరమవుతారని అంచనా. కానీ ప్రస్తుతం కేవలం 450 మంది డిప్లమో, 700 మంది బీఎఫ్ఎస్సీ, 50–60 మంది ఎంఎఫ్ఎస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2005 వరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, ఆ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉన్న మత్స్య యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్టు–2020ను తీసుకురావడమే కాదు..2022 ఫిబ్రవరి 19 నుంచి వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా ముతుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్‌తో పాటు అవనిగడ్డ మండలం బావదేవర పల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడలో ఉప్పునీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రం, ఉండి వద్ద మంచి నీటి చేపలు, రొయ్యల పరిశోధన కేంద్రంతో పాటు 8 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలను మత్స్య వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తొలి ఏడాదిలోనే గుర్తింపు వర్సిటీకి అనుబంధంగా 60 బీఎఫ్ఎస్సీ సీట్లతో కొత్తగా నర్సాపురం మత్స్య కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సాపురం కళాశాలకు నిష్ణాతులైన అధ్యాపక బృందాన్ని నియమించి 2022–23 విద్యా సంవత్సరం నుంచే నర్సాపురంలోని తుఫాన్ భవనం (తాత్కాలికంగా)లో తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు యూజీసీ, ఐసీఏఆర్ గుర్తింపు కూడా లభించడం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఫిషరీస్ కళాశాలలతో పాటు కొత్తగా నాలుగు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ తాడిగడపలో వర్సిటీ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యకలాపాలకు శ్రీకారంచుట్టారు. శరవేగంగా నిర్మాణ పనులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో లఖితపూడి– సరిపల్లి గ్రామాల మధ్య 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో యూనివర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 ఎకరాలను గుర్తించగా, దాంట్లో రూ.100 కోట్లతో పరిపాలనా భవనంతో పాటు అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతుల శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. పిల్లర్ల దశకు చేరుకున్నాయి. మరొక పక్క వర్సిటీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మత్స్యకళాశాల కోసం 48 టీచింగ్, 52 నాన్ టీచింగ్, 40 అవుట్సోర్సింగ్ కలిపి 140 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనామోదం కూడా ఇచ్చింది. శాస్త్రవేత్తను కావాలని.. మాది నెల్లూరు. మా నాన్న ఆర్టీసీ కండక్టర్.గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఎంసెట్‌తో పాటు నీట్లో కూడా క్వాలిఫై అయ్యాను. చిన్నప్పటి నుంచి మత్స్యశాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతో బ్యాచురల్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో చేరాను. నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో సీటు వచ్చింది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. నర్సాపురం సమీపంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్స్, హేచరీలు, మత్స్య పరిశ్రమలుండడం మాకెంతో ఉపయోగంగా ఉంది. –పి.హరిబాబు, బీఎఫ్ఎస్సీ విద్యార్థి అపార అవకాశాలు మాది గుంటూరు. నాన్న బ్యాంక్ మేనేజర్. ఎంబీబీఎస్ చేయాలని నీట్ రాశాను. క్వాలీఫై కాలేకపోయాను. అపారమైన ఉపాధి అవకాశాలున్న మత్స్య రంగంలో అడుగు పెట్టాలన్న సంకల్పంతో నర్సాపురం కళాశాలలో బీఎఫ్ఎస్సీలో సీటు సాధించా. మత్స్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. –ఎస్డీ షరీఫాతేజ్, బీఎఫ్ఎస్సీ విద్యార్థిని త్వరలో నూతన ప్రాంగణంలోకి.. అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న మత్స్యరంగం బలోపేతం కావాలంటే ప్రత్యేకంగా మత్స్య యూనివర్సిటీ అవసరం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మూడో మత్స్య వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలిదశలో రూ.100 కోట్లతో వర్సిటీ భవనాలు నిర్మాణమవుతున్నాయి. వర్సిటీ భవనాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రాంగణంలో వర్సిటీ కార్యకలాపాలతో పాటు మరిన్ని కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. –డాక్టర్ ఓగిరాల సుధాకర్, రిజిస్ట్రార్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం -
భారతీదాసన్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని
-
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
వచ్చే ఏడాది 300 వర్సిటీల్లో ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) ప్రోగ్రామ్ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పరిశోధన స్పెషలైజేషన్ డిగ్రీని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టింది. ఆనర్స్ డిగ్రీ అందించేందుకు 150 విశ్వవిద్యాలయాలు ముందుకు రాగా, ఇప్పటికే 105 వర్సిటీలు కోర్సు ప్రారంభించాయి. 19 కేంద్రీయ, 24 రాష్ట్ర స్థాయి, 44 డీమ్డ్, 18 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. నాలుగేళ్ల కోర్సు ఐచ్ఛికమే నాలుగేళ్ల డిగ్రీ పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థుల ఐచ్ఛికమే. మూడేళ్ల సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆసక్తి ఉన్న వారు నాలుగో ఏడాది ఆనర్స్ డిగ్రీని అభ్యసించవచ్చు. విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల యూజీ డిగ్రీని, 160 క్రెడిట్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీని అందిస్తారు. పరిశోధన స్పెషలైజేషన్ అభ్యసించే వారు నాలుగేళ్ల యూజీ కోర్సులో పరిశోధన ప్రాజెక్టు చేపట్టాలి. దీంతో వారికి రీసెర్చ్ స్పెషలైజేషన్‌తో పాటు ఆనర్స్ డిగ్రీ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థుల్లో డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నవంబర్ వరకు 6 లక్షల మందికిపైగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువ మంది భారతీయలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్ అరెస్ట్
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. వీరితోపాటు చార్టెట్ అకౌంటెంట్ ఎస్కే బన్సాల్‌ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది. కాగా పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్ ఉన్నారని, వారిలో వినీత్, ప్రణవ్ గుప్తా ఒకరని తెలిపారు. చదవండి: అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా -
విద్యా వ్యవస్థపై సినీ విమర్శనాస్త్రం
ఆర్. నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’ అనే కొత్త సినిమా తీశారు. అది ఇటీవల విడుదలయింది. మూర్తి ఆహ్వానం మేరకు, ప్రైవేట్ థియేటర్లో ప్రీ–రిలీజ్ స్పెషల్ షో చూశాను. నారాయణ మూర్తి ప్రభుత్వ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా డబుల్ యాక్షన్‌లో ప్రధాన పాత్రలో నటించారు. నేటి విద్యా వ్యవస్థను ఎడ్యుకేషన్ మాఫియా ఎలా తన గుప్పిట పెట్టుకుంటున్నదో చూపించిన కమర్షియల్ సినిమా ఇది. మొట్టమొదటిసారిగా పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యా మాధ్యమం మీద, ప్రభుత్వ సదుద్దేశానికీ విద్యారంగంలో ప్రైవేట్ మాఫియా విధ్వంసక పాత్రకూ మధ్య వైరుద్ధ్యంపై ఒక సినిమా రూపొందించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలనే సాహసోపేతమైన నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయోగం లేకుండా, చంద్రబాబు నాయుడు మద్దతు ఉన్న ప్రైవేట్ మాఫియా ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలో కూడా ప్రతికూల పాత్ర పోషిస్తుండటం లేకుండా ఈ సినిమా తీయడం అసాధ్యం. ఒక తెలుగు పండితుడు తన ఎనిమిది వేళ్లకు వజ్రాల ఉంగరాలు ధరించి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ ఎందుకవుతుందో గర్జిస్తూ పాఠాలు చెప్పే సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. తెలుగువారంతా తెలుగు మాధ్యమంలోనే చదవాలనీ, తెలుగువారు కేవలం తెలుగు మాధ్యమంలో చదివితేనే తెలుగువారి ఆత్మగౌరవం, జ్ఞానం విశ్వగురువు అవుతాయని ఆయన చెప్తారు. కానీ అదే తెలుగు పండితుడు ఓ పెద్ద ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ కాలేజీని దాని అసలు యజమానిని మోసం చేసి సొంతం చేసుకుంటాడు. దానిని ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారుస్తాడు. ఆ తర్వాత విపరీతమైన ఫీజుల ద్వారా ప్రజలను దోచుకోవడం ప్రారంభిస్తాడు. ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న ఒక తెలివైన విద్యార్థి అన్నీ ఫస్ట్ ర్యాంకులు పొందుతున్న ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి పంపాలంటూ తల్లి తండ్రులపై ఒత్తిడి చేస్తాడు. అప్పటికే అతడి తల్లి ఈ పిల్లవాడి చదువుకోసం పుస్తెలతాడు అమ్మి ఉన్నందున, అతని తండ్రి తన కిడ్నీని అమ్మి, అతడిని తెలుగు పండిట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం యూనివర్సిటీలో చేర్పిస్తాడు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు లాగే, అన్ని నంబర్ వన్ ర్యాంకులూ తెలుగు పండిట్ సొంత విశ్వవిద్యాలయ విద్యార్థులకే వచ్చాయి. అతని విశ్వవిద్యాలయ ప్రకటనలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, గ్రామస్థులు కూడా పుస్తెలమ్ముకుని మరీ వారి అబ్బాయిలను, అమ్మా యిలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి పంపేంతగా. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రజానీకం పోరాడుతున్నప్పుడు వారిపై దాడి చేసేందుకు ఈ తెలుగు పండితుడు పోలీసులకు లంచం ఇస్తాడు. మంత్రులకు లంచం ఇవ్వ డానికి కూడా ప్రయత్నిస్తాడు కానీ ఇప్పుడిక్కడ నిజాయతీపరుడైన ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత ఈ యూనివర్సిటీ వ్యవహారాలపై ఆయన విచారణకు ఆదేశిస్తాడు. తెలుగు పండితుడు అన్ని దిగువ స్థాయి ప్రభుత్వ వ్యవస్థ లనూ కొనుగోలు చేస్తాడు. పైగా పేపర్ల లీకేజీకి పాల్పడతాడు. తన విశ్వవిద్యాలయంలోని ధనవంతులైన విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని వారి బదులు విద్యార్థులు కాని బయటి వారితో పరీక్షలు రాయిస్తాడు. పరీక్షా పత్రాలు దిద్దే మాస్టర్లకు డబ్బు చెల్లించడం ద్వారా ప్రభుత్వ విశ్వ విద్యాలయంలోని తెలివైన విద్యార్థులు ఫెయిలయ్యే వ్యవస్థ కోసం అతను ప్లాన్ చేస్తున్నాడు. అలా ఫెయిలైన కారణంగా ఒక తెలివైన విద్యార్థిని ప్రభుత్వ విద్యాలయం క్యాంపస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలు ఏమాత్రం సరిగా బోధించడం లేదని ప్రజలు భావించేలా చేయగలుగుతాడు. రాష్ట్ర స్థాయి సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్న పత్రాలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కూడా మేనేజ్ చేయగలుగుతుంది. పేద విద్యార్థులు డిగ్రీలు పొందినప్పటికీ వారికి ఉద్యోగాలు రాకుండా తెలుగు పండిట్ మేనేజ్ చేయగలుగుతాడు. తన సొంత విశ్వవిద్యాలయంలోని ఒక నిజాయతీగల విద్యార్థిని... విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తున్న విష యాన్ని తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేసిందనే కారణంతో దారుణానికి ఒడిగడతాడు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కి చెందిన తన తొత్తు అయిన సీఐ కుమారుడి గ్యాంగ్‌తో ఆమెను అత్యాచారం చేయించి హత్య చేయిస్తాడు. అలాగే ప్రొఫెసర్ పాత్రలో ఉన్న నారాయణ మూర్తిని సీఐ చంపే స్తాడు, కానీ అదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పాత్రధారి అయిన నారాయణమూర్తి ఎడ్యుకేషన్ మాఫియా లీడర్ అయిన సీఐని చంపేస్తాడు. నారాయణమూర్తి సినిమాలో సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుత ఆంధ్రా మోడల్ విద్యా విధానాన్ని ఆయన ఎత్తిపడుతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ విద్యా మాఫియాను ఎండగడు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులు అనుస రించిన ప్రైవేట్ అనుకూల విద్యను కేసీఆర్ హయాంలో తెలంగాణలో కొనసాగిస్తున్న విషయం ఆర్. నారాయణ మూర్తి దృష్టిలో ఉంది. ఈ రకమైన సినిమాలు డాక్యుమెంటరీ రూపంలో కూడా చాలా అరుదు, జనాదరణ పొందిన వాణిజ్య సినిమాలను వదిలివేయండి. ప్రైవేట్ మాఫియా విద్య వల్ల ప్రాణాలను, వనరులను కోల్పోతున్న తల్లితండ్రులు, విద్యార్థులు తప్పక చూడాల్సిన సినిమా ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రేపే నారాయణమూర్తి యూనివర్సిటీ
‘‘యూనివర్సిటీ’ విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆర్. నారాయణమూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ‘యూనివర్సిటీ’ ప్రివ్యూ వేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ– ‘‘దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఉండదు’ అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా గట్టిగా చెప్పారు నారాయణమూర్తి’’ అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య దేశాన్ని ఎంత పట్టి పీడిస్తోందో ఈ చిత్రంలో బాగా చెప్పారు’’ అన్నారు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ‘‘పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. -
యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
‘‘విద్యార్థులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వాలపై, మన అందరి పైనా ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూ΄÷ందిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. యూనివర్సిటీల్లో పేపరు లీకేజీలు, గ్రూపు 1, 2 ప్రశ్నా పత్రాల లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై΄ోవాలి? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీగారు దయచేసి ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ΄ోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వంటి విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. -
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌వే 91!
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌లో ఉన్నాయి. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800కి పెరిగింది. కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800 బ్యాండ్‌కి మారింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి (IIT గౌహతి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ ప్రపంచంలోని టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. ఈ ఇన్స్టిట్యూట్ తమ ర్యాంకింగ్‌లను 1001-1200 బ్యాండ్ నుండి 601-800కి మెరుగుపరుచుకుంది. జాబితాలో మొదటిసారిగా ప్రవేశించడం ద్వారా, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ 601-800 బ్యాండ్‌లోకి ర్యాంక్ చేయబడింది. అయితే అనేక అగ్రశ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు).. వరుసగా నాల్గవ సంవత్సరం ర్యాంకింగ్‌లను బహిష్కరించి ర్యాంకింగ్‌ల పారదర్శకత, ప్రమాణాలపై సందేహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీకి చెందిన ఏడు IITలు ఉన్నాయి. ఐఐటీ గౌహతి గతేడాది ర్యాంకింగ్స్‌లో చేరడం గమనార్హం. -
ప్రపంచ వారసత్వ జాబితాలోకి శాంతినికేతన్
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశి్చమ బెంగాల్‌లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. యునెస్కో ఆదివారం ‘ఎక్స్’లో ఈ మేరకు ప్రకటించింది. ‘వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కినందుకు శాంతినికేతన్‌కు అభినందనలు’అని పేర్కొంది. బీర్భమ్ జిల్లాలోని ఈ చారిత్రక నిర్మాణానికి వారసత్వ గుర్తింపు కోసం భారత్ ఎప్పటినుంచో కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయ నగరి పశి్చమ కోల్‌కతాకు 160 కి.మీ.ల దూరంలో ఉంది. గీతాంజలి కర్త, విశ్వ కవి రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మొదట్లో ఒక ఆశ్రమంగా ప్రారంభించారు. కులమతాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. శాంతినికేతన్ ప్రాంగణంలో చిన్న విద్యా సంస్థగా రవీంద్రుని ఆధ్వర్యంలో మొదలైన విశ్వభారతి నేడు దేశంలో అతి పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎదిగింది. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, సంగీతం, అగ్రికల్చరల్ సైన్స్, రూరల్ రీ కన్సŠట్రక్షన్ వంటి వాటిలో ఎన్నెన్నో కోర్సులు అందిస్తోంది. దివంగత ప్రధాని ఇందిరా గాం«దీ, మరో నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ వంటి మహామహులు ఎందరో ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే. -
అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!
అంతర్జాతీయ సంబంధాల కేంద్రం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,తిరుపతి వారు తానా పూర్వాధ్యక్షులు డా ప్రసాద్ తోటకూర గారితో విద్యార్థినుల ముఖాముఖి కార్యక్రమాన్ని సావేరి సెమినార్ హాల్ లో 2023 సెప్టెంబర్ 4న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య దేపూరు భారతిగారు విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ తానా సంస్థ ముఖ్య లక్ష్యాన్ని, వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీత, నృత్య విభాగం వాళ్ళు అధునాతన డిప్లొమా కోర్సులను నడుపుతున్నారని తెలియజేశారు. పదుల సంఖ్యల్లో నుంచి వందల సంఖ్యల్లోకి అడ్మిషన్లు పెరిగాయని తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణను డా ప్రసాద్ తోటకూర గారి ముందుంచారు. గౌరవ అతిథి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య నల్లనాగుల రజినీగారు మాట్లాడుతూ అమెరికా నుంచి డా ప్రసాద్ గారు మన విశ్వవిద్యాలయానికి రావడం సంతోషదాయకం అన్నారు. కార్యనిర్వాహకులు అంతర్జాతీయ సంబంధాల కేంద్రం డీన్ ఆచార్య పి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని, కోర్సులు ప్రారంభంకావడానికి నాంది పలికిన వారు పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా తోటకూర ప్రసాద్ గారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా ప్రసాద్ తోటకూర గారు మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే ఉద్యోగ అవకాశాల్ని, అక్కడి జీవన విధానాన్ని వివరించారు. అమెరికా గురించి చాలామంది విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలుగు భాషకు అక్కడున్న స్థాయిని, స్థానాన్ని తానా సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. సత్య నాదెండ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రనూయి కార్పోరేట్ దిగ్గజాలుగా ఎదిగిన ప్రస్తానాన్ని, పారిశ్రామిక దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటివారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో కలిసి తానా ప్రపంచ సాహిత్య వేదిక "సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారు సృష్టించిన సాహిత్యం మొత్తాన్ని ఆరు సంపుటాల్లో ముద్రించిన గ్రంథాలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రంథాలయనికి ప్రసాద్ గారు బహూకరించారు. ఈ కార్యక్రమానికి డా. హిమబిందు ఆహ్వానం పలుకగా, డా. యువశ్రీ వందన సమర్పణ చేశారు. డా శిరీష ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ సంబంధాల కేంద్రం ఆచార్యులు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థినులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం డా ప్రసాద్ తోటకూర గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 2016వ సంవత్సరంలో కానుకగా బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆచార్యదేపూరు భారతి గారు, ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా ప్రసాద్ తోటకూర గారు, ఆచార్య పి విజయలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
వాస్తవ సంఘటనలే యూనివర్సిటీలో చూపించాం: ఆర్.నారాయణమూర్తి
దేశంలో విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలనే అంశంపై తీసిన ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యహరించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. మనిషికి విద్య, వైద్యం ఎంతో అవసరమని, ఇవి ప్రైవేట్ రంగంలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. యూనివర్సిటీ చిత్రాన్ని విద్యార్థులందరూ ఆదరించాలని ఆయన కోరారు. అక్టోబర్ 4వ తేదీన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులతో మాట్లాడతూ.. 'సినిమాలో పదో తరగతి పేపర్ లీకేజీ దగ్గర నుంచి గ్రూప్స్ పరీక్షల పేపర్ లీకేజీలపై చూపించాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా రూ. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాం. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోటా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తల్లిదండ్రుల కలలన్నీ ప్రభుత్వాలు కల్లలు చేస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను సినిమాను తెరకెక్కించాం. ' అని అన్నారు. -
అభూతకల్పనతో ఈనాడు ఒప్పందం
సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో ఈనాడుకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. వర్సిటీల్లో బోధన పోస్టుల నియామకాల అంశం కోర్టులో ఉన్నంత కాలం ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయట్లేదని మొసలి కన్నీరు కార్చిన రామోజీ.. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో ఒప్పందం చేసుకుని విషపూరిత రాతలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇందులో భాగంగానే ‘ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు జగన్ ఎసరు’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. 3,295 పోస్టుల భర్తీ ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ బోధన సిబ్బంది నియామకాలు చేపడుతోంది. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని జీర్ణించుకోలేని రామోజీరావు ఒప్పంద ఉద్యోగులకు భద్రత కరువైందంటూ ఊహాజనిత వార్తను అచ్చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 20 వర్సిటీల్లో దాదాపు 3,046 మంది ఒప్పంద అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. వర్సిటీల్లో కొత్తగా చేపడుతున్న అధ్యాపక నియామకాలన్నీ రెగ్యులర్ పోస్టుల్లోనివే. అందువల్ల సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్‌లలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బందీ లేదు. వెయిటేజీతో భరోసా వర్సిటీల్లో పోస్టుల భర్తీలోనూ ఒప్పంద అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెయిటేజీ రూపంలో భరోసా కల్పించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ వెయిటేజితో చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌గా మారతారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది. అయితే వర్సిటీల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. చాలా వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించేటప్పుడు రిజిర్వేషన్ విధానాన్ని అవలంభించలేదు. రోస్టర్ పద్ధతిని పాటించలేదు.ఏ వర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించలేదు. కొన్ని వర్సిటీల్లో ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు పని చేస్తున్నారు, ఎవరు రెగ్యులర్ పోస్టులకు పని చేస్తున్నారో కూడా తెలియదు. ఆ వ్యత్యాసాన్ని పాటించలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందలేదు. వీటన్నింటీకి తోడు కోర్టు ఉత్తర్వులు వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రతిబంధకాలుగా మారాయి. అంతేగానీ ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్ అవుతారు. మిగతా వారు ఇప్పుడున్నట్లుగానే కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతారు. ఎవరి ఉద్యోగాలకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైగా కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెయిటేజీని ప్రస్తావిస్తుంటే వారి ఉద్యోగాలు పోతాయంటూ ఈనాడు దుర్మార్గపు రాతలు రాయడం సిగ్గుచేటు. -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
కరిగి, విరిగిన ‘బేబీ’ అగ్ని పర్వతం
అదో కొత్త అగ్ని పర్వతం.. రెండు వారాల కిందే పుట్టింది.. ఇంతలోనే అంతెత్తున పెరిగింది.. లోపలి నుంచి ఉబికివచ్చిన లావా వేడికి అంచులు కరిగి, విరిగి పడింది. లావాను బాంబుల్లా ఎగజల్లింది. ఐస్‌ల్యాండ్‌లోని రేక్జానెస్ ద్వీపకల్పం ప్రాంతంలోని ‘బేబీ’ అగ్నిపర్వతం విశేషమిది. అగ్నిపర్వతాలకు నిలయమైన రేక్జానెస్ ప్రాంతంలో గత నెల రోజుల్లో ఏకంగా ఏడు వేల భూప్రకంపనలు వచ్చాయి. రెండు వారాల కింద ఓ చోట అకస్మాత్తుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున భూమిలో పగుళ్లు వచ్చాయి. అందులో ఓ చోట లావా వెలువడటం మొదలై, మెల్లగా అగ్ని పర్వతంలా ఏర్పడింది. ప్రస్తుతం ‘బేబీ వల్కనో’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం.. రెండు రోజుల కింద తీవ్రస్థాయిలో లావా వెలువరించడం మొదలుపెట్టింది. అది తీవ్ర స్థాయికి చేరి ఓ పక్క విరిగి.. లావా నదిలా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐస్‌ల్యాండ్ యూనివర్సిటీ వల్కనాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్ పరిశోధకుల బృందం విడుదల చేసింది. -
అందుకే మళ్లీ ‘యూనివర్సిటీ’ని రిలీజ్ చేస్తున్నా: ఆర్. నారాయణమూర్తి
‘‘విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన, కష్టాలు, వారి తల్లిదండ్రుల కన్నీళ్లను ‘యూనివర్సిటీ’లో చూపించాను. వేసవి, వడగాల్పుల వల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సరిగ్గా చూడలేకపోయారు.. అందుకే మళ్లీ విడుదల చేస్తే జనాలకు బాగా చేరువ అవుతుందని రిలీజ్ చేస్తున్నాను’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ జూన్ 9న విడుదలైంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘పదో తరగతి పేపరు లీకేజీలు, గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీలు జరుగుతుంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ఏం కావాలి? అనే సందేశంతో ఈ సినిమా తీశాను. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు. -
వడివడిగా ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు
-
అరవై ఏళ్లు.. 239 రకాలు..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మందికి ఈ విశ్వవిద్యాలయం అన్నం పెడుతోంది. అంటే.. ఆ వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలనే దేశంలో మూడోవంతు ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అదే మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) ప్రత్యేకత. దేశంలోనే పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఈ వర్సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ వర్సిటీ సాధించిన విజయాలెన్నో.. ఎన్నెన్నో. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త వరి రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడమే కాదు.. సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ సృష్టించిన రకాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలో సాగయ్యే వరిలో మూడోవంతు.. దేశంలో వరి సాగవుతున్న 46 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ‘ఆంగ్రూ’ రకాలే సాగవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ వర్సిటీ రైతుల మన్ననలు చూరగొందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జాతీయ స్థాయి వరి ఉత్పత్తి (131 మిలియన్ టన్నులు)లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రకాలే కావడం గమనార్హం. సగటు దిగుబడి జాతీయ స్థాయిలో హెక్టార్‌కు 2,832 కిలోలు.. ఏపీలో హెక్టార్‌కు 5,048 కిలోలు ఉంటే, ఈ వర్సిటీ రూపొందించిన రకాలు ఏకంగా హెక్టార్‌కు 5,669 కిలోల దిగుబడినివ్వడమే కాదు జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. 60 ఏళ్లలో 239 రకాల సృష్టి.. 1964 జూన్ 12న ఏర్పాటైన ఈ వర్సిటీ.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడంలో నిరంతరం కృషిచేస్తోంది. 60 ఏళ్లలో 123 అధిక దిగుబడినిచ్చే వరి రకాలతో పాటు 47 రకాల పప్పు ధాన్యాలు, 29 రకాల నూనె గింజలు, 21 రకాల వాణిజ్య పంటలు, 19 రకాల చిరుధాన్యాలను ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసింది. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి. వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా, తెగుళ్లు, చీడపీడలు, కీటకాలను ఎదుర్కొనే రకాలను అభివృద్ధి చేయడంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబా మసూరి) వరి రకాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే మొట్టమొదటి బూజు తెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య)తో పాటు ప్రసిద్ధి చెందిన కే6, నారాయణి, లేపాక్షి వంటి వేరుశనగ రకాలు సైతం వర్సిటీ అభివృద్ధి చేసినవే. ఆంగ్రూ రకాలతో రూ.25వేల కోట్ల ఆదాయం.. ♦ ఆంధ్రలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో వర్సిటీ సృష్టించిన వరి రకాలే సాగవుతున్నాయి. ♦ సాగు విస్తీర్ణంలో 72.63 శాతం, ఉత్పత్తిలో 87.27 శాతం వర్సిటీ రకాలే. ♦ పప్పు ధాన్యాల సాగులో 35.63 శాతం, ఉత్పత్తిలో 32.16 శాతం వర్సిటీ రూపొందించినవే.. ♦ వేరుశనగ ఉత్పత్తిలో 94.03 శాతం వర్సిటీ రకాలే. ఒక్క కే6 రకమే 82 శాతం అందిస్తోంది. ♦ నువ్వుల సాగులో కూడా 87.50 శాతం ఆంగ్రూ రకాలదే కావడం విశేషం. ♦ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనెగింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి.. మొత్తం రూ.25వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాష్ట్ర రైతులు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.8వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం.. ఇక ఎగుమతుల్లో బాస్మతేతర బియ్యం రకాలదే సింహభాగం. వీటిలో మూడోవంతు ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసినవే. ఉదా.. దేశం నుంచి 2021–22లో బియ్యం ఎగుమతుల ద్వారా రూ.46,914.28 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చింది. ఈ బియ్యం ఎగుమతుల్లో 33 శాతం (రూ.15,481.71కోట్లు) ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలకు చెందిన బియ్యమే. అలాగే, మిగతా కాలంలో ఏటా ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా సగటున రూ.8,073 కోట్ల ఆదాయం సమకూరుతోందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతోంది. 12న మెగా సీడ్ మేళా.. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో ‘మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం’ అనే నినాదంతో విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగయ్యే, వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచుతూ రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెట్టుబడికి ఢోకాలేదు ఆంగ్రూ అభివృద్ధి చేసిన వివిధ రకాల సాగుతో పెట్టుబడికి ఢోకాలేదని నిరూపితమైంది. ఇటీవలే ఆంగ్రూ రకాల రాబడి–ఖర్చులను విశ్లేíÙంచాం. ఖరీఫ్ కంటే రబీలో నికర రాబడులు ఎక్కువగా ఉన్నాయి. సాగుకోసం రైతులు ఖర్చుచేసే ప్రతీ రూ.100కు, వరికి రూ.103, మినుముకి రూ.132, కందికి రూ.133, మిరపకి రూ.160, శనగకి రూ.102, వేరుశనగకి రూ. 124ల చొప్పున ఆదాయం వస్తోందని గుర్తించాం. – డాక్టర్ జి. రఘునాథరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ పరిశోధనా స్థానం, లాం సీజన్ ఏదైనా మన రకాలదే ఆధిపత్యం.. ప్రధాన పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేయడంలో ‘ఆంగ్రూ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ఆంగ్రూ’ వరి రకాలు హెక్టారుకు 5,669 కిలోల దిగుబడిని సాధిస్తుండగా, ఇది రాష్ట్ర సగటు దిగుబడి (హెక్టారుకు 5,048 కిలోలు) కంటే ఎక్కువ. వరిలోనే కాదు అపరాలు, నూనె గింజల సాగులో కూడా ఆంగ్రూ రకాలదే సింహభాగం. దాదాపు రెండు సీజన్లలోనూ వర్సిటీ రకాలకున్న డిమాండ్ ఇతర రకాలకు లేదనే చెప్పాలి. – డాక్టర్ ఎల్. ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు ఏటా రూ.2,967 కోట్ల లాభాలు.. జాతీయ స్థాయి వరి ఉత్పత్తిలో మూడో వంతు ఆంగ్రూ రకాలదే. అలాగే, జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఈ రకాలనే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ రైతు ఈ వర్సిటీ రకాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సంప్రదాయ వరి రకాల కంటే ఆంగ్రూ రకాల సాగువలన ఏటా రూ.2,967 కోట్ల లాభాలను రైతులు ఆర్జిస్తున్నారు. – డాక్టర్ ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వైస్ చాన్సలర్ -
ఆ మాటలే నాకు దీవెనలు
‘‘సమాజంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను చర్చించడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి. ఒక సినిమా కళాకారుడిగా వెండితెర వేదికగా ఆ సమస్యలు చూపిస్తున్నాను’’ అని అన్నారు దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించి, నటించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► సమాజంలో ఉన్న సమస్యలతోనే 40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు... రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీస్తే సేఫ్ కదా? సేఫ్టీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వంతుగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే సినిమా ఇవ్వాలన్నదే నా ఆశయం. అనాదిగా మంచి కోసం, సమసమాజం కోసం ఎందరో మహనీయులు వారివారి వేదికల్లో కృషి చేస్తూనే ఉన్నారు. అదే కోవలో నేను సినిమా వేదికగా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు జర్నలిస్టు తన కలంతో, వాగ్గేయకారుడు పాటతో, రచయిత తన రచనలతో పరిష్కారం కోసం పోరాడతారు. అలాగే ఒక సినిమా సాంస్కృతిక సైనికుడిగా 40 ఏళ్లుగా సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీస్తున్నాను. ఇందులోనే నాకు సంతృప్తి, ఆనందం దక్కుతున్నాయి. శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేలా సామాజిక అంశాలపైన సినిమాలు తీస్తున్నాను తప్ప నేనేదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం తీస్తున్నానని అనుకోవడంలేదు. గూడవల్లి రామబ్రహ్మంవంటి మహనీయులు సామాజిక అంశాలతో సినిమాలను రూపొందించి లెజెండ్స్‌గా నిలిచారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న చిన్నపిల్లవాడిని నేను. ► ‘యూనివర్సిటీ’ సినిమా గురించి? విద్య, నిరుద్యోగం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రైవేటు విద్య వద్దు, పబ్లిక్ విద్యే ముద్దు అనే అంశంతో తీశాను. ప్రస్తుతం ప్రైవేటు విద్యా వ్యవస్థ వల్ల చదువు వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యవస్థలో ఫస్ట్ ర్యాంకులు సాధించాలని పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్‌లు పెరిగిపోయాయి. దీనివల్ల బాగా చదివిన విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఇవి భరించలేక ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా క్యాంపస్ వేదికల్లోనిప్రొఫెసర్లు కూడా కులాలకు, మతాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి అసమానతలు పోవాలంటే కొఠారీ కమిషన్ పేర్కొన్నట్టు ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ప్రైవేటు సంస్థల్లోని వసతులు ఇక్కడ కూడా అందేలా చూడాలి. ఈ అంశాలు ప్రతిబింబించేలా ఈ సినిమా తీశాను. ► విద్య గురించి మాత్రమేనా? ఇతర విషయాలేమైనా ఈ సినిమాలో చె΄్పారా? ఉద్యోగాల గురించి కూడా చర్చించాను. అతి పెద్ద గ్లోబల్ విలేజ్ అయినటువంటి భారత్ నుంచి ఎందరో విద్యార్థులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. కానీ అక్కడ కూడా నిరుద్యోగం పెరిగిపోయి మనవారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అవన్నీ కోల్పోతున్నారు. అందుకే 1986లో మురళీధర్ రావు కమిషన్, 1990లో మండల్ కమిషన్ తెలిపిన రిపోర్టు ప్రకారం ప్రైవేటు సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరముంది. మనది నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రం ఇది. ► తెలుగు భాషకు ్రపాధాన్యం ఇచ్చే మీరు ఈ చిత్రంలో రెండు ఇంగ్లిష్ పాటలు పెట్టారు? ‘ఎవిరీ బడీ సే నో టు ప్రైవేట్ స్కూల్స్.. ఎవిరీ బడీ సే యస్ టు పబ్లిక్ స్కూల్స్.. ఎవిరీ బడీ వాంట్స్ కామన్ ఎడ్యుకేషన్’ అనే మహోన్నత ఆశయంతో వేల్పుల నారాయణగారు గొప్ప పాట రాశారు. ఈ పాటను సాయిచరణ్ అంతే గొప్పగా పాడారు. ఇంకో ఇంగ్లిష్ పాటను జలదంకి సుధాకర్ రాయగా, సాయిచరణ్ పాడారు. ఈ రెండు ఇంగ్లిష్ పాటలతో పాటు ‘తాత. తాత..’ అని గద్దరన్న రాసి, పాడిన పాట, ఇతర పాటలు కూడా సందర్భానుసారం సాగుతాయి. ► ప్రజా సమస్యలతో సినిమాలు తీస్తున్న మీ గురించి ప్రజలు నాలుగు మంచి మాటలు మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి.. నారాయణమూర్తి మన సమస్యలు తీస్తున్నాడు.. మన కథలను చూపిస్తున్నాడు.. ఒక కళాకారుడుగా మన గుండెల్లోని బాధను సినిమాలో చూపించాడు... పరిష్కారం మార్గం చూపిస్తున్నాడు. అతను మన మనిషి. ప్రజా కళాకారుడు అని ప్రజలు అంటున్న ఆ మాటలను పెద్ద దీవెనలుగా భావిస్తున్నాను. ఏ కథాంశం అయినా ఆకట్టుకుంటేనే అభిమానులు చూస్తారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు సామాజిక సమస్యలే ప్రధానాంశాలుగా సినిమాలు తీస్తున్నాను. ప్రజలు దీవిస్తే అదే నా సంపాదన. నా సినిమాలు వంద రోజులు, జూబ్లీ వేడుకలు చేసుకున్నాయి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సినిమాలు తీస్తూనే ఉంటాను. -
నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?
ఆర్.నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘10వ తరగతిలో పేపరు లీకేజీలు.. గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరుగుతున్నాయి. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?. కుంభ కోణాలు చేసే వారి వల్ల విద్యావ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా?. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్ ప్లే–మాటలు– సంగీతం– దర్శకత్వం– నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి. -
విద్య.. వైద్యాన్ని జాతీయం చేయాలి: ఆర్. నారాయణ మూర్తి
‘‘పేపర్ లీకేజ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా జరిగాయి. ఇలాగైతే నిరుద్యోగులు ఏమైపోవాలి? అందుకే విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్‌పై ఆర్. నారాయణ మూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్) ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘భారత దేశంలో చాలా చోట్ల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.. దీన్ని జాతీయ సమస్యగా పరిగణించాలని రాష్ట్రపతి, ప్రధానిగార్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిత్రంలోని ఐదు పాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి’’ అన్నారు. ‘యూనివర్సిటీ’ ప్రదర్శనకు హాజరైన పలువురు జర్నలిస్టులు ఇది అందరూ చూడాల్సిన సినిమా అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖుల్లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్స్ లక్ష్మీ నారాయణ, కోయి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
మేడం మీరు మోడ్రన్ డ్రెస్‌లో బాగుంటారు.. వర్సిటీ డీన్ వేధింపులు..
దేశంలో మహిళలు, యువతులపై ఏదో ఒక చోట.. వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పనిచేసేచోట, ప్రయాణ సమయాల్లో మహిళలు వేధింపులకు గురువుతూనే ఉన్నారు. తాజాగా ఓ డిపార్ట్మెంట్ డీన్.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వేధింపులకు గురిచేశాడు. విదేశీ దుస్తుల్లో నువ్వు అందంగా ఉంటావ్ అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గురుగ్రామ్ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్ ధీరేంద్ర కౌశిక్ పనిచేస్తున్నారు. అదే వర్సిటీలో ఓ మహిళ.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తన్నారు. ఈ క్రమంలో డీన్ ధీరేంద్ర.. ఆమెపై కన్నేసి అనుచితంగా ప్రవర్తించాడు. శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ధీరేంద్ర.. ఆమెతో మాట్లాడుతూ.. మీరు మోడ్రన్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తారు. మీ భర్త లేనప్పుడు నన్ను హోట్ల్లో కలవండి అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే, పలు సందర్భాల్లో ఆమె ప్రైవేటు భాగాలను తాకే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆమె.. తనతో ఇలా ప్రవర్తించవద్దని ధీరేంద్రను కోరింది. అనంతరం.. ఈ విషయాలపై వీసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన నిరాకరించడం గమనార్హం. ఇలా, ధీరేంద్ర.. ఆమెను వేధింపులకు గురిచేయడం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఏప్రిల్ 28వ తేదీన యూనివర్సిటీ ఆవరణలోని ఒక గదిలో తనను వేధించడంతో ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె.. గురుగ్రామ్‌లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఫిర్యాదు సమయంలో తనపై జరిగిన వేధింపులను వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న కొన్ని సంబంధాల కారణంగా వీసీ పట్టించుకోలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. -
పేపరు లీకేజీ.. విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి?: ఆర్. నారాయణ మూర్తి
‘‘పదో తరగతి పరీక్ష ప్రశ్నా ప్రతాల లీకేజీ, గ్రూపు 1, 2 వంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీ... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? అనే కథాంశంతో ‘యూనివర్సిటీ’ చిత్రం తీశాను’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. (చదవండి: ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!) ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, నిరుద్యోగులు రెక్కలు తెగిన పావురాల్లా నిస్సహాయ స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వల్ల విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి, త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–్రస్కీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి, కెమెరా: బాబూరావు. -
యూనివర్సిటీ: పేపర్ లీకేజీ.. నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది?
‘‘డిగ్రీ పట్టాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా కాలేజీలు ఉండకూడదు. విద్యార్థులకు జ్ఞానసందను పంచాలి.. విలువలను కాపాడాలి. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, పని హక్కు నిర్వీర్యం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు దర్శకనిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ’. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘యువత జాతి సంపద. వారిని మనం కాపాడుకోవాలి. వారి మేధస్సు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కానీ పేపర్ లీకేజీ వల్ల యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. పేపర్ లీకేజీ అనే అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా గమనిస్తూనే ఉన్నాం. పేపర్ లీకేజీల వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. విద్యార్థులు, ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది? అనే అంశాల ఇతివృత్తంగా ‘యూనివర్సిటీ’ సినిమా తీశాం. విద్య, వైద్య, విమానయానం, బ్యాంకింగ్, రైల్వేస్ వంటి రంగాల్లో ప్రైవేటీకరణ జరుగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటి వల్ల మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల వారు రిజర్వేషన్లు కోల్పోయి, ఉపాధి దక్కని పరిస్థితులు ఉండొచ్చు. ఆ అంశాలను కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అని పేర్కొన్నారు. -
కాల్పుల భయంలో అమెరికా..హడావిడి చేసిన యూనివర్సిటీ
అమెరికాలో గతేడాది నుంచి వరుస కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలు దుండగులు కాల్పుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యూనివర్సిటీ సైతం కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ హడావిడి చేసింది. అందుకోసం యూనివర్సిటీ ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించి ట్విట్టర్ వేదికగా విద్యార్థులను అప్రమత్తం చేసింది కూడా. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని నార్మన్లో ఉన్న ఓక్లహోమ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఓక్లహోమ్ యూనివర్సిటీలో ఓ సాయుధుడు కాల్పులు జరుపుతున్నాడని విద్యార్థులను అప్రమత్తంగా ఉండండి అంటూ యూనివర్సటీ అధికారులు ట్విట్టర్ వేదికగా సర్క్యూలర్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితని కూడా ప్రకటించింది. పైగా క్యాంపస్‌లో విద్యార్థులు ఉంటే పరిగెత్తండి, దాక్కోండి లేదా ఆత్మరక్షణ కోసం ఫైట్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ మొత్తం సోదా చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. వెంటనే యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌కి ఎలాంటి ముప్పు లేదంటూ ఆ హెచ్చరికను కూడా రద్దు చేసింది. ఇటీవలే నాషేవిల్లే పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఒక ఉపాద్యాయుడు మృతి చెందిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా కళాశాల, పాఠశాలల్లోనే కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ తుపాకీ హింసతో అమెరికా వాసులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. OU-NORMAN Critical 10:53pm: OUPD has issued an ALL CLEAR. After a thorough search, no threat was found. There is no threat to campus. Alert has been canceled. — Univ. of Oklahoma (@UofOklahoma) April 8, 2023 (చదవండి: పాక్ 2026 నాటికి చైనా, సౌదీ అరేబియాలకు రూ. 63 వేల కోట్లు చెల్లించాలి) -
కాకతీయ మెడికల్ కాలేజీలో రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు
ఎంజీఎం: వరంగల్ నగరంలోని కాకతీయ ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ) మరో మైలురాయిని అధిగమించింది. 15 రోజుల క్రితం రీజినల్ శిక్షణ కేంద్రం ప్రారంభానికి అనుమతులు రాగా, వారంరోజుల క్రితం సూపర్ స్పెషాలిటీ సీట్లు సాధించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా రీసెర్చ్ యూనిట్ ప్రారంభానికి కేంద్రంనుంచి అనుమతులు వచ్చా యి. పదిహేను రోజుల వ్యవధిలో మూడు ప్రత్యేకతలను సాధించుకోవడంతో కేఎంసీ అధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి 2007లో రీసెర్చ్ యూ నిట్ మంజూరు చేయాలని అప్పటి ప్రిన్సిపల్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆ తరువాత విషయం మరుగునపడింది. ఏడాదిన్నర కాలం నుంచి కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ రీసెర్చ్ యూనిట్ మంజూరు కోసం చేసిన విన్నపం ఎట్టకేలకు ఫలించింది. కేంద్రప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధులు మంజూరు చేసి రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడానికి అనుమతినిస్తూ గురువారం కాలేజీకి ఉత్తర్వులు అందజేసింది. ఢిల్లీలోని ఐసీఎంఆర్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఈ రీసెర్చ్ యూనిట్లను దేశవ్యాప్తంగా ఐదు మంజూరు చేయగా అందులో ఒకటి సిద్దిపేట మెడికల్ కళాశాలకు, మరోటి వరంగల్ కేఎంసీకి దక్కింది. 15 రోజుల వ్యవధిలో రెండు ప్రత్యేక అనుమతులు కాకతీయ మెడికల్ కళాశాలలో నెల్స్ (నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్టు) పథకంలో భాగంగా నెలరోజుల్లో రీజినల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి పూర్తిస్థాయి అనుమతులు లభించి 15 రోజులు గడవకముందే రీసెర్చ్ సెంటర్ మంజూరుపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్స్ శిక్షణ కేంద్రం ప్రస్తుతం ఒక్క ఉస్మానియా మెడికల్ కళాశాలలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి శిక్షణ కేంద్రాన్ని వరంగల్‌లోనే ప్రారంభించాలని సంకల్పించి రూ.1.50 కోట్ల పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి కేఎంసీకి చేర్చింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై వైద్యసిబ్బంది, వైద్యులకు అందించే ఈ శిక్షణ కార్యక్రమాలపై 16మంది ప్రొఫెసర్ స్థాయి వైద్యులకు తర్ఫీదు ఇచ్చారు. ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే అకస్మికంగా కుప్పకూలే వారిని కాపాడేందుకు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వైద్యులు జరిపే పరిశోధలకు పూర్తిస్థాయిలో సహకరించే విధంగా రీసెర్చ్ కేంద్రాన్ని సైతం కేఎంసీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి వైద్యవిద్యార్థుల విద్యబోధనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కాగా, వారం రోజులక్రితం ఐదు సూపర్‌స్పెషాలిటీ సీట్లు, ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు సాధించకోవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఏడాదిన్నర కృషి ఫలితం ఎట్టకేలకు కేఎంసీకి రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. ఇక్కడ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుకు 2007లో ఐసీఎంఆర్‌కు అప్పటి ప్రిన్సిపాల్ దరఖాస్తు చేశారు. కొన్ని కారణాల వల్ల దానిని తిరస్కరించారు. 2021 జూన్ నెలలో కేఎంసీ బోధన సిబ్బందితో సైంటిఫిక్ కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అడిగిన అన్ని రకాల నివేదికలను సమర్పించాం. వాటిని పరిశీలించిన కేంద్రం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.కోటితో రీసెర్చ్ యూనిట్ సంబంధించిన పరికరాలు, రూ.25 లక్షలతో సివి ల్ పనులు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుతో కేఎంసీ, ఎంజీఎంలోని వైద్యులు, వైద్యసిబ్బందికి వివిధ కోర్సుల్లో పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌దాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సైకిల్: సింగిల్ ఛార్జ్‌తో..
భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంగానే వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, CNG వాహనాలు దేశీయ విఫణిలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం బస్సులు, కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలవుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ ఉదయపూర్ నగరంలోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 45 కిమీ రేంజ్ అందిస్తుంది. సుమారు 160 కేజీల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ నిత్యజీవితంలో రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 30 నిముషాల్లో ఛార్జ్ చేసుకోగలదు. ఈ విషయాన్ని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ విక్రమాదిత్య దవే వెల్లడించారు. (ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!) ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గేర్, పెడల్ సిస్టమ్ రెండింటినీ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ప్యానెల్ ప్లేట్, లైట్, హార్న్ వంటివి కూడా అమర్చారు. పాత సైకిల్ని ఇలాంటి కొత్త సైకిల్ మాదిరిగా మార్చడానికి రూ. 18,000, కొత్త సైకిల్ కావాలంటే రూ. 30,000 నుంచి రూ. 35,000 ఖర్చవుతుందని డాక్టర్ విక్రమాదిత్య తెలిపారు. ఈ సైకిల్ కావాలనుకునే వారు కాలేజీని సంప్రదించి తీసుకోవచ్చని కూడా వెల్లడించారు. -
శ్రీ విద్యానికేతన్ 31వ వార్షికోత్సవ వేడుకలు.. హాజరైన మంచు ఫ్యామిలీ
-
నారాయణ మూర్తి ప్రజా దర్శకుడు
‘‘ఇండస్ట్రీలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజా దర్శకుడు అంటే ఆర్. నారాయణ మూర్తి ఒక్కరే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా టైటిల్ లోగోని బ్రహ్మానందం రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఎడ్యుకేషన్ మాఫియా, విద్యా వ్యవస్థ లోని లోపాలతో నారాయణ మూర్తిగారు తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను, నా ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వైజాగ్ సత్యానంద్ గారి శిష్యులు ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో ‘యూనివర్సిటీ’ తీశాను. విద్య, వైద్యం ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాను.. నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణగారికి, ఇతరులకు థ్యాంక్స్’’ అన్నారు. -
అదిరిపోయే ఫీచర్లతో.. వారి కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్!
అంధుల కోసం ఓ ప్రత్యేక స్మార్ట్ వాచ్(Smart Watch)ను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక టెక్నాలజీతో ఓ స్మార్ట్ వాచ్‌ను కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. వీటిని పెద్ద మొత్తంలో తయారీతో పాటు విక్రయించేందుకు యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఐఐటీ కాన్పూర్ జతకట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లలో లోపాలను సరిచేసి యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు హాప్టిక్ వాచ్‌ను రూపొందించినట్లు ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాక్టిల్, టాకింగ్, వైబ్రేషన్, బ్రెయిలీ ఆధారిత వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఈ స్మార్ట్ వాచ్ రాబోతోంది. యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి త్వరలో ఈ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరందికర్ తెలిపారు. ఇందులో ఏ ఫీచర్లు ఉన్నాయంటే! ఈ హాప్టిక్ స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో డయల్ఫ్రీ ఆప్షన్‌తోపాటు 12 టచ్-సెన్సిటివ్ హవర్ మార్కర్స్ ఉంటాయి. వాచ్‌ను ధరించిన వారు ఈ మార్కర్స్పై ఫింగర్‌ను స్కాన్ చేయడం ద్వారా టైమ్ తెలుసుకోవచ్చు. ఈ వాచ్.. టాక్టిల్, వైబ్రేషన్ వాచ్‌ల సమ్మిళతంగా ఉంటుంది. అయితే వైబ్రేషన్ వాచ్‌లలో 20పైగా ఉండే వైబ్రేషన్ పల్సెస్‌ను ఈ వాచ్‌లో 2 పల్సెస్‌కు తగ్గించారు. టాక్టిల్ వాచ్‌కు ఉండే సులువుగా విరిగిపోయే స్వభావం ఇందులో ఉండదు. వీటితోపాటు హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, హైడ్రేషన్ రిమైండర్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంధుల కోసం ప్రస్తుతం ఉన్న స్మార్ట్ వాచ్‌లు ఆడియో ఆధారిత అవుట్‌పుట్‌తో పనిచేసేవి కావడం వల్ల వాటిని ధరించిన వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఐఐటీ కాన్పూర్ ఈ హాప్టిక్ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
రోజుకు 24 గంటలు కదా! కానీ, అప్పట్లో 19 గంటలే! ఆసక్తికర అధ్యయనం
ఎంతకూ రోజు గడవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒంటరిగా ఉన్నప్పుడో.. చేసేందుకు పనేమీ లేకపోయినప్పుడో... 24 గంటలు గడిచేదెప్పుడబ్బా అని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది! మరి రోజులో కేవలం 19 గంటలే ఉంటే? అదెలా అంటారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే... భూమ్మీద రోజు నిడివి ఎన్నడూ స్థిరంగా లేదట. కోటానుకోట్ల ఏళ్ల కింద ఇప్పటి కంటే కనీసం ఆరు గంటలు తక్కువగా ఉండేదట! అంటే అప్పట్లో భూ భ్రమణానికి, అంటే తన చుట్టు తాను ఒకసారి తిరిగేందుకు 19 గంటలు మాత్రమే పట్టేదని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. మరిప్పుడు రోజుకు 24 గంటలు ఎందుకైనట్టు? భూమి నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుంటే దీనికి సమాధానమూ తెలుస్తుంది. భూమి ఉల్లిపాయ మాదిరిగా పొరలుగా ఉంటుందని, ఈ పొరల సంఖ్య నాలుగని చిన్నప్పుడే చదువుకున్నాం. మనముండేది క్రస్ట్ అని పిలిచే పై పొరలో. దీనికింద మాంటెల్, ఔటర్ కోర్, చివరగా భూమి మధ్య భాగంలో ఇన్నర్ కోర్ ఉంటాయి. ఇన్నర్ కోర్ సుమారు 1,220 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది దాదాపుగా ఘనస్థితిలో ఉన్న ఇనుప ముద్ద. ఇది తిరిగే వేగం, పద్ధతుల్లో వచ్చే తేడాలను బట్టి రోజు తాలూకు నిడివిలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్‌పైన ద్రవ స్థితిలో ఉండే ఔటర్ కోర్ ఉంటుంది. ఇది సృష్టించే అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇన్నర్ కోర్ వేగం, దిశ ఆధారపడి ఉంటాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కోట్ల ఏళ్లుగా ఇన్నర్ కోర్ దిశ, వేగం తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రోజు నిడివీ పెరుగుతూ వస్తోంది. ఆ లెక్కన 140 కోట్ల ఏళ్ల క్రితం భూ భ్రమణానికి 19 గంటలే పట్టేదని అంచనా. అధ్యయనం చేసిందిలా... భూమి లోపలి పొరలన్నీ వేటికవే వేర్వేరు దిశ, వేగాల్లో తిరుగుతూంటాయి. కొన్ని కదలికలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఇంకొన్ని పొరల గురుత్వాకర్షణ శక్తి ఆ క్షేత్ర ప్రభావాన్ని తగ్గిస్తూంటుంది. కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రవేత్తలు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపలి పొరల్లో ఏం జరుగుతోందో పరిశీలిస్తూంటారు. భూకంప తరంగాలు అన్ని పొరల ద్వారా ప్రయాణించగలవు. పొర మారినప్పుడల్లా వాటి వేగంలో మార్పులు వస్తూంటాయి. వాటి ఆధారంగానే ఆ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజాలున్నాయి, ఉష్ణోగ్రత, సాంద్రత ఎంత వంటి వివరాలు తెలుస్తూంటాయి. అలాగే భూమి ఇన్నర్ కోర్ వేగం, దిశల్లో వచ్చిన మార్పులు కూడా! పెకింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని వేల భూకంపాల వివరాలను సేకరించి పరిశీలించారు. 1960ల నుంచి ఇప్పటిదాకా భూమి ఇన్నర్ కోర్‌ను దాటుకుంటూ వెళ్లిన భూకంప తరంగాల తీరును విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2009కి ముందు ఈ తరంగాలు ఇన్నర్ కోర్ గుండా వెళ్లేందుకు పట్టిన సమయంతో పాటు ఆ తరంగాల రూపురేఖల్లోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. ఇక 2009లో భూకంప తరంగాల ప్రభావం ఇన్నర్ కోర్‌పై దాదాపు లేకుండా పోయింది. అంటే 2009లో ఇన్నర్ కోర్ కూడా భూమితో సమాన వేగంతో తిరుగుతున్నట్లు అంచనా కట్టారు. 2009 తర్వాత భూమి కంటే తక్కువ వేగంతో తిరుగుతున్నట్టు భూకంపాల తరంగాల పరిశీలనలో వెల్లడైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 70 ఏళ్లకోసారి రివర్స్ ఈ అధ్యయనం ప్రకారం ఇన్నర్ కోర్ తిరిగే దిశ 70 ఏళ్లకోసారి మారుతూంటుంది. అలా చివరిసారి 1970 ప్రాంతంలో మారిందట. రోజు నిడివి, భూ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది నిర్ధారౖణెంది కూడా. ఇలా ఇన్నర్ కోర్ తిరిగే దిశ, వేగంలో మార్పుల వల్ల భూ భ్రమణానికి పట్టే సమయంలోనూ తేడాలొచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్ వేగం తగ్గినప్పుడు మాంటెల్ తాలూకూ గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా భూ భ్రమణ వేగం తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల రోజు నిడివి పెరుగుతుందన్నమాట. ఎంతో తెలుసా? ఏడాదికి సెకనులో 74,000వ వంతు! అలా 140 కోట్ల ఏళ్ల క్రితం 19 గంటలుండే రోజు నిడివి ఇప్పుడు 24 గంటలకు పెరిగిందని వివరించారు. అన్నట్టూ, భూమి ఇన్నర్ కోర్ ఆరేళ్ల సమయంలో ఒక మైలు దూరం అటు ఇటూ లోలకం మాదిరిగా ఊగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
బిల్డింగ్‌పై నుంచి దూకి ఇఫ్లూ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన విద్యార్థిని శనివారం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి మృతిచెందింది. మృతురాలిని ఏంఏ ఇంగ్లీష్ చదువుతున్న అంజలిగా(22) గుర్తించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. -
JNTU విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
-
మా అమ్మ, సోదరికి చదువు లేనప్పుడూ..మాకు వద్దు అంటూ సర్టిఫికేట్లను..
అఫ్గాన్‌లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన తాలిబన్లు లెక్కచేయకుండా నిరంకుశత్వ ధోరణితో మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో కాబూల్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ అప్గాన్ మహిళలపై యూనివర్సిటీ నిషేధానికి వ్యతిరేకంగా తన డిప్లొమా సర్టిఫికేట్లను చించేస్తూ నిరసన తెలిపారు. నా సోదరి, మా అమ్మ చదుకుకోలేనప్పుడూ నాకు ఈ విద్య వద్దు అంటే ఆ సర్టిఫికేట్లను లైవ్ టీవీ ఇంటర్వ్యూలో చించేశారు. ఈ రోజు నుంచి నాకు ఈ చదుకు అవసరం లేదు. అయినా ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదు అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మహిళలు, మైనారిటీల హక్కులకు సంబంధించి మరి మితవాద పాలనను మొదట్లో వాగ్దానం చేసినప్పటికీ.. తాలిబాన్లు అఫ్గాన్ మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకోనివ్వకుండా నిర్వధిక నిషేధాన్ని విధించారు. బాలికలను మిడిల్ స్కూల్స్‌కే పరిమితం చేసి, హైస్కూల్‌కి హాజరు కాకుండా నిషేధించారు. అంతేగాదు మహిళలను చాలా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే బహిరంగంగా తల నుంచి కాలి వరకు దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి మహిళలు మగ బంధువులు లేకుండా ప్రయాణించేందుకు కూడా వీలు లేదు. (చదవండి: యూనివర్సిటీల్లో అమ్మాయిలపై నిషేధం.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి అబ్బాయిల నిరసన..) -
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అపాయింట్మెంట్ కోరాం.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్‌ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు -
Viral Video: బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్ అధికారుల దాడి
కాబూల్: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచక పాలన రోజురోజుకీ మితిమీరిపోతుంది. గతేడాది దేశాన్ని తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చదువులు, ఉద్యోగాలకు అనుమతి నిరాకరిస్తూ మహిళలను ఆంక్షల చట్రంలో బంధిస్తున్నారు. మహిళల స్వేచ్చ, భావవ్యక్తీకరణ, వస్త్రధారణ ఇలా ప్రతి దానిపై నిషేధం విధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి బాలికలు పాఠశాలకు రాకుండా నిషేధించారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యేలా వారిని అణిచివేతకు గురిచేస్తున్నారు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టిన మహిళలకు హిజాబ్(బుర్భా) ధరించడం తప్పనిసరి చేసింది తాలిబన్ ప్రభుత్వం. ఆఖరికి విద్యాసంస్థలకు కూడా ఇలాగే రావాలని ఆదేశించింది. అయితే అక్కడి మహిళలు తాలిబన్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బుర్భా పూర్తిగా ధరించకుండా వచ్చినందుకు అధికారులు యూనివర్సిటీ లోపలికి అనుమతివ్వలేదు. దీంతో చదవుకోవడం మా హక్కు అంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అయితే నిరసన చేస్తున్న మహిళా విద్యార్థులపై తాలిబన్ అధికారులు దాడి చేశారు. దీంతో విద్యార్థులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. Taliban beat female students Even though the girls are wearing hijabs, why are they not allowed to enter the university? The #Taliban want to close the universities for #Female students. Today the the Taliban didn’t allow female students to enter university. #Badakhshan pic.twitter.com/xXmZ8eDolH — Panjshir_Province (@PanjshirProvin1) October 30, 2022 యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులను కొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తి తాలిబాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినవారుగా తెలిసింది. ఈ సంఘటన ఆదివారం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని బదక్షన్ విశ్వవిద్యాలయం గేట్ బయట జరిగింది. అయితే వీరంతా ముఖం కనిపించకుండా బుర్భా కప్పుకోకపోవడంతో అధికారులు యూనివర్సిటీలోకి అనుమతించలేదని తెలుస్తోంది. -
ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం
తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు వివాదం ముదురుతోంది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వర్సిటీ విద్యార్థుల దగ్గర ప్రసంగాలు చేశారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్‌కు గవర్నర్ సూచించారు. ఆర్థిక మంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అర్థం వచ్చేలా బుధవారం లేఖ రాశారు. గవర్నర్ డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు. యూపీ నుంచి వచ్చే విద్యార్థులకు కేరళలో పరిస్థితులు అర్థం కావడం సంక్లిష్టంగా ఉంటుందని ఈ నెల 18న కేరళ వర్సిటీలో విద్యార్థుల సమావేశంలో బాలగోపాల్ అన్నారు. ‘‘మంత్రి తన ప్రమాణాన్ని మరిచారు. దేశ ఐక్యత, సమగ్రతలను తక్కువ చేసి చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఆయన నా విశ్వాసాన్ని కోల్పోయారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రిపై తనకు పరిపూర్ణ విశ్వాసముందంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఆయనను తప్పించడానికి ఏ కారణాలూ లేవన్నారు. కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అంశంలో ఇప్పటికే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. -
యూనివర్సిటీలో యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ స్ట్రాంగ్ వార్నింగ్
ఒక ప్రైవేట్ యునివర్సిటీ కార్యక్రమంలో యువతీ చేసిన నృత్యం వివాదాస్పదమైంది. దీంతో సదరు యూనివర్సిటీకి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాక్‌లో పెషావర్‌లోని ఎన్ఎస్ యూనివర్సిటీలో హునార్ మేళ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ వేడుకల్లో దాదాపు 13 కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఒక యువతి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటి కార్యక్రమాలకు దేశానికి అవసరమా అంటూ మండిపడతూ ట్వీట్ చేశారు. సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాక్ ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ(కేఎంయూ) ఈ విషయమై సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో సదరు యువతి బిగుతుగా ఉండే డ్రస్ వేసుకుని వేదికపై డ్యాన్స్‌లు చేయడం వల్లే వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు ఖైబర్ మెడికల్ యూనిర్సిటీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అనేతికం, అసాంఘీకం అంటూ మండిపడుతూ చివాట్లు పెట్టింది. అంతేగాదు ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు యూనివర్సిటి ఎన్ఎస్సీ డైరెక్టర్‌కి నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యక్రమాలను కేఎంయూ లోగో పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు నైతిక విలువలతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ పవిత్రతను కాపాడుకోవాలని మందలించింది. అవసరమనుకుంటే సదరు ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. pic.twitter.com/FhjROmiJbW — Sami (@Pediatric__OT) October 20, 2022 Pakistan: Khyber Medical University issues notice to NCS University System, Peshawar, warns of de-affiliation after this dance video from NCS goes viral 🤩 pic.twitter.com/MYd5P57gyN — Sonam Mahajan (@AsYouNotWish) October 21, 2022 (చదవండి: చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన...హఠాత్తుగా నిష్క్రమించిన జుంటావో) -
వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు
చండీగఢ్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసుకు సంబంధించి ఆర్మీ జవాన్ సంజీవ్ సింగ్‌ను శనివారం అరెస్టు చేశారు మొహాలీ పోలీసులు. అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతను వీడియో లీక్ చేసిన విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేశాడని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వతే సంజీవ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఇందుకు అరుణాచల్ పోలీసులు సహకరించినట్లు పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు కూడా సంజీవ్ సింగ్ అరెస్టును ధ్రువీకరించారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందని ఆధారాలు లభించిన తర్వాత పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు తాము సహకరించామని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సంజీవ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయింది. మరోవైపు చండీగఢ్ వీడియో లీక్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు ధర్మాసనం తేదీని నిర్ణయించాల్సి ఉంది. చండీగఢ్ యూనివర్సీటీలో 60 మంది అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని కొద్ది రోజుల క్రితం వార్తలు రావడం దుమారం రేపింది. అయితే విచారణలో ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీక్ అయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అది కూడా ఆ అమ్మాయే స్వయంగా తన వీడియోను రికార్డు చేసుకుని బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో సిట్ ఈ కేసును వేగంగా విచారించనుంది. ముగ్గురు అరెస్టు.. యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్‌ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. వార్డెన్ల సస్పెన్షన్ వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. 6 రోజులు క్లాసులు బంద్.. విద్యార్థినుల నిరసనలతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం(సెప్టెంబర్ 24) వరకు క్లాసులు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని, దీంతో వాళ్లు నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? -
యూనివర్సిటీ విద్యార్థిని వీడియో లీకు ఘటన.. పోలీసులు ఏం చెప్తున్నారంటే..
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఒక అమ్మాయి తన సొంత వీడియోను మాత్రమే బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు. అతను హిమచాల్ ప్రదేశ్‌కు చెందినవాడని వెల్లడించారు. వీడియో పంపిన అమ్మాయిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ పాత్ర ఏమైనా ఉందా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అతడ్ని అరెస్టు చేసి విచారిస్తేనే అసలు నిజం బయటపడుతుందన్నారు. సొంత వీడియో లీక్ చేసుకున్న అమ్మాయి ఇతర అమ్మాయిల వీడియోలను కూడా రికార్డు చేసిందా? అనే విషయంపైనా విచారణ చేస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి యూనివర్సిటీలో నిరసనలు చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే లీక్ అయింది ఒక్క అమ్మాయి వీడియోనే అని యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు స్పష్టతనిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా.. యూనివర్సిటీలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 19,20) క్లాసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 'చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దురదృష్టకరం. మన బిడ్డలే మనకు గర్వకారణం. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం. దోషులుగా తేలినవారిపై అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. అధికారయంత్రాంగంతో నేను టచ్‌లోనే ఉన్నా. దయచేసి వదంతులు నమ్మొద్దు' అని భగవంత్ మాన్ హిందీలో ట్వీట్ చేశారు. चंडीगढ़ यूनिवर्सिटी की घटना सुनकर दुख हुआ...हमारी बेटियां हमारी शान हैं...घटना की उच्च स्तरीय जांच के आदेश दे दिए हैं..जो भी दोषी होगा सख्त कार्रवाई करेंगे... मैं लगातार प्रशासन के संपर्क में हूं...मैं आप सब से अपील करता हूं कि अफवाहों से बचें... https://t.co/kgEGszUhAq — Bhagwant Mann (@BhagwantMann) September 18, 2022 చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు రావడం తీవ్రదుమారం రేపింది. దీనిపై యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీకైనట్లు వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పింది. అలాగే యూనివర్సిటోలో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని, ఆస్పత్రిలో కూడా చేరలేదని ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
దయచేసి ఆ వీడియోలు షేర్ చేయొద్దు.. సోనూసూద్ విజ్ఞప్తి
పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దయచేసి ఎవరూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం వారికి పూర్తి అండగా నిలవాలని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ కోరారు. 'చండీగఢ్ యూనివర్శిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ కష్ట సమయంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయంలో మన సిస్టర్స్‌కు అండగా నిలుద్దాం. దయచేసి ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు షేర్ చేయొద్దు. ఇది మనందరికీ పరీక్ష సమయం. బాధ్యత గల పౌరులుగా మన బాధితుల తరఫున నిలుద్దాం' అని ట్విట్టర్లో సోనూసూద్ కోరారు. Something that happened in Chandigarh University is very unfortunate. It’s time for us to stand with our sisters and set an example of a responsible society. These are testing times for us, not for the victims. Be responsible 🙏 — sonu sood (@SonuSood) September 18, 2022 అసలేం జరిగిందంటే: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సీటీలోని హాస్టల్లో దాదాపు 60 మంది యువతుల ప్రైవేటు వీడియోలను వారితో కలిసి ఉండే మరో యువతి తీయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ వీడియోలు ఆ యువతి స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ కావడంతో బాధిత యువతులు ఆందోళనకు దిగారు. కొంతమంది బాధితులు ఆత్మహత్యకు కూడా యత్నించారు. అయితే ఈ ఘటనను పోలీసులు, యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.