కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐన్ సోఖ్నా హైవేపై ఈ ఘటన జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
బస్సులో సూయజ్‌లోని గలాలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు ఐన్ సోఖ్నా హైవే మీదుగా వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 28 అంబులెన్స్‌లు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు సూయజ్ మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఈజిప్టులో ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. దేశంలో రవాణా భద్రత రికార్డు అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా దేశంలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు
Comments
Please login to add a commentAdd a comment