
గాంధీ నగర్ : గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment