bus
-
టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్‌ఆర్‌టీసీకి 1,297 బస్ ఛాసిస్‌లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్‌కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్‌లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్‌పీవో 1618 బస్టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
Mumbai: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది
-
UP : ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు చనిపోయారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. #UPDATE कन्नौज: SP अमित कुमार ने बताया, "लखनऊ-आगरा एक्सप्रेसवे पर बस-पानी के टैंकर की टक्कर में 8 लोगों की मौत हो गई है और 19 लोग घायल हुए हैं। सभी घायलों का सैफई मेडिकल कॉलेज में इलाज चल रहा है..." pic.twitter.com/yqTBgCNHQQ— ANI_HindiNews (@AHindinews) December 6, 2024కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని సైఫై ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్,పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగే సమయంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే ఉన్నత వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాల్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని కన్నౌజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. -
స్వర్గాన్ని తలపించే వెహికల్.. జర్నీ కోసం మాత్రమే కాదు: అంతకు మించి (ఫోటోలు)
-
ఆర్టీసీకి బీఎస్–6 బస్సులు
సాక్షి, హైదరాబాద్: భారత్ స్టేజ్–6 బస్సుల వాడకంపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాయు కాలుష్య కారకాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఉద్గారాల ప్రమాణాల జాబితాలోని బీఎస్–6 బస్సుల వాడకానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఇంతకాలం బీఎస్–4 ప్రమాణాల బస్సుల వాడకానికి పరిమితమైన ఆర్టీసీకి ఇప్పుడు బీఎస్–6కు చెందిన 1,500 బస్సులు కొత్తగా సమకూరాయి. 2020 నుంచి మన దేశంలో ఈ ప్రమాణ బస్సులను అందుబాటులోకి తెచ్చినా..ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోవటంతో ఆ శ్రేణి బస్సులు ఇప్పటివరకు సమకూరలేదు.గతేడాది ఆర్టీసీ కొత్త బస్సులకు ఆర్డర్ ఇవ్వగా, దశలవారీగా అవి సమకూరుతున్నాయి. కొత్త బస్సులన్నీ బీఎస్–6 శ్రేణి బస్సులే. తాజా యూరో ప్రమాణాల మేరకు ఇవి రూపొందాయి. కర్బన ఉద్గారాలు తక్కువ పరిమితిలో విడుదల చేయటంతోపాటు ఎక్కువ ఎల్రక్టానిక్ డిజైన్‌తో ఇవి రూపొందాయి. దీంతో వీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు బీఎస్–6 బస్సులున్న డిపోలను పర్యవేక్షిస్తున్న అధికారులకు చెన్నైలోని అశోక్ లేలాండ్ కంపెనీలో వాటి తయారీ ఇంజినీర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ బస్సుల ప్రత్యేకత ఏంటంటే... మన దేశంలో 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అమలులోకి వచ్చింది. తొలుత భారత్ స్టేజ్–1 ప్రారంభమైంది. అలా 2020 నుంచి బీఎస్–6 ప్రమాణాలు మొదలయ్యాయి. అంతకుముందు శ్రేణి వాహనాలతో పోలిస్తే వీటిల్లో కాలుష్య కారకాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేలా ఇంజిన్లను ఆధునికీకరించారు. అంతకు ముందున్న బీఎస్–4 (బీఎస్–5 స్కిప్) డీజిల్ బస్సుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి 250 మి.గ్రా.గా ఉండేది. దానిని బీఎస్–6 బస్సుల్లో 80 మి.గ్రా.కు కట్టడి చేశారు. పరి్టక్యులేట్ మ్యాటర్ పరిమితిని 25 మి.గ్రా.ల నుంచి 4.5 మి.గ్రా/కి.మీ.కు తగ్గించారు. దీనివల్ల కొత్తతరం బస్సుల్లో కాలుష్య కారకాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది. డాష్ బోర్డులో పలు రకాల సూచనలు ఈ బస్సుల్లో డాష్‌బోర్డుపై పలు రకాల సూచనలు బ్లింక్ అవుతుంటాయి. ఆ మేరకు డ్రైవర్లు బస్సులను నడపాలి. ఈ బస్సుల్లోని చాలా భాగాలు సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 31 సెన్సార్లు ఏర్పాటు చేశారు. పాత బస్సుల్లో డాష్ బోర్డుకు ప్రాధాన్యమే ఉండేదికాదు. డిస్ప్లే బోర్డులో రీడింగ్ మీటర్లు పగిలిపోయి రంధ్రాలే కనిపిస్తుండేవి. కానీ, కొత్తతరం బస్సుల్లో 31 సెన్సార్లు అలర్ట్‌లను చూపుతుంటాయి.ఏదైనా బ్లింక్ కనిపిస్తే, సంబంధిత ఇంజిన్ భాగంపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించి ఆయా బస్సులను నిర్వహిస్తున్న డిపోల అధికారులకు ముందు అవగాహన కలిగితే, వారు డ్రైవర్లను ప్రశ్నిస్తూ బస్సులు మెరుగ్గా నడిచేలా చూస్తారని సంస్థ భావిస్తోంది. ఈమేకు ఆయా డిపోల అధికారులను చెన్నైలోని అశోక్‌లేలాండ్ ప్లాంట్‌కు పంపింది. మొదటి బ్యాచ్ అధికారుల బృందం ప్రస్తుతం చెన్నై ప్లాంట్‌లో ఉంది. త్వరలో రెండో బృందం వెళ్లనుంది. కాలుష్య కణాలు వెలువడవుబస్సు వదిలే పొగలో లక్షల సంఖ్యలో కాలుష్య కణాలుంటాయి. అవి మన శరీరంలోకి చేరితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొగగొట్టం నుంచి వెలువడే పొగతో అవి వాతావరణంలోకి చేరతాయి. కానీ, బీఎస్–6 బస్సుల్లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. డీజిల్ మండిన తర్వాత వెలువడే ఈ సూక్ష కణాలు ఒకచోట జమవుతాయి. నిర్ధారిత సమయంలో అవి మరోసారి మండి బూడిదగా మారి నేల మీద పడిపోతాయి. పొగ రూపంలో అవి వాతావరణంలో కలిసే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ బస్సుల్లో, పాతతరం బస్సుల తరహాలో పొగగొట్టం ఉండదు. డ్రైవర్ పక్కనున్న ఇంజిన్ కిందే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఈ బస్సుల్లో ఎన్నో ఉన్నాయి. -
లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్మోరాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహించడాన్ని వీడియోలో గమనించవచ్చు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. जनपद अल्मोड़ा के मार्चुला में हुई दुर्भाग्यपूर्ण बस दुर्घटना में यात्रियों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ। जिला प्रशासन को तेजी के साथ राहत एवं बचाव अभियान चलाने के निर्देश दिए हैं।घटनास्थल पर स्थानीय प्रशासन एवं SDRF की टीमें घायलों को निकालकर उपचार के लिए…— Pushkar Singh Dhami (@pushkardhami) November 4, 2024ఇది కూడా చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు
సాక్షి,సూర్యాపేటజిల్లా: కోదాడ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్ 2) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారందరినీ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ బస్సును గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: బాలికపై సామూహిక లైంగికదాడి -
పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు మంగళవారం కిటకిటలాడాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో సందడి నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలకు దీపావళి, ఛట్ పండుగలు ఎంతో ముఖ్యం. ఈ మేరకు నగరంలో ఉంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తప్పనిసరిగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. దీపావళి పర్వదినానికి మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో మంగళవారం పెద్ద ఎత్తున బయలుదేరారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిశాయి. నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు.. 👉హైదరాబాద్ నుంచి పాటా్న, కోల్‌కతా, వారణాసి, దానాపూర్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో సాధారణ రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, దర్బంగా తదితర రైళ్లలో నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ సైతం వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు అనివార్యంగా జనరల్ బోగీలపై ఆధారపడాల్సి వస్తోంది. 👉 ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. జనరల్ బోగీల్లో కాలు మోపేందుకు కూడా చోటు లేకుండాపోయిందని దానాపూర్ ప్రయాణికులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే ఏదోఒక విధంగా సొంత ఊళ్లకు వెళ్లాలనే పట్టుదలతో జనరల్ బోగీల్లోనే అతికష్టంగా బయలుదేరి వెళ్తున్నారు. మరో రెండు రోజుల పాటు కూడా ఇదే రద్దీ ఉండవచ్చని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. జనరల్ టికెట్ల కోసం అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదనంగా 30 వేల మంది ప్రయాణికులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది వలస కూలీలు నగరంలో నిర్మాణరంగంలో పని చేస్తున్నారు. కుటుంబాలతో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కూలీలంతా దీపావళి వేడుకల కోసం సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దూరభారం దృష్ట్యా రోడ్డు మార్గంలో కంటే రైళ్లలో బయలుదేరి వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపడంతో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఈ రద్దీని ముందే ఊహించి అదనపు రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అవి ఏ మాత్రం చాలడం లేదు. ముఖ్యంగా జనరల్ బోగీల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వరకు 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 మాత్రమే జనరల్ బోగీలు ఉన్నాయి. కొన్నింటిలో మాత్రం 3 నుంచి 4 సాధారణ బోగీలు ఉన్నాయి. అయినప్పటికీ అందుకు 5 రెట్ల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు తరలి వస్తున్నారు. భార్యాపిల్లలతో సహా సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలి వచి్చన ప్రయాణికులు చివరకు జనరల్ బోగీల్లో కూడా వెళ్లేందుకు అవకాశం లేక స్టేషన్ బయటపడిగాపులు కాస్తున్నారు. ‘తిరిగి ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే ఉండి ఏదో ఒక ట్రైన్ పట్టుకొని వెళ్లిపోవడం మంచిది కదా’ అని సంజన్ అనే ప్రయాణికుడు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. మంగళవారం అదనంగా మరో 30 వేల మందికి పైగా సొంత ఊళ్లకు బయలుదేరినట్లు అంచనా. షాపింగ్ సందడి దీపావళి, ధన్తేరస్ సందర్భంగా నగరంలోని టపాసులు, బంగారం, వస్త్ర దుకాణాలు మంగళవారం కిటకిటలాడాయి. ఎటు చూసినా దీపావళి సందడే కనిపించింది. కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బంగారం రేట్లు కాస్త పెరిగినప్పటికీ... దీపావళితో పాటు ధన్ తేరస్, ముఖ్యంగా వివాహాల సీజన్ కావడంతో నగరంలో బంగారం కొనుగోళ్లు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలకున్న సెంటిమెంట్లు, అపోహలు ఇతర ఏ అంశాలు బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపలేదు. అంతేకాకుండా పండుగ నేపథ్యం, వివాహాల శుభకార్యాల కారణంగా వజ్రాభరణాల దుకాణాల యాజమాన్యాలు వినియోగదారులను సంతృప్తి పరచడానికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే.. షాపింగ్ మాల్స్ సైతం కొనుగోనుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి. -
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జకాటెకాస్లోని హైవేపై ఒక బస్సు ప్రమాదానికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్నఈ బస్సు మక్కా వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. వెంటనే బస్సు, ట్రాక్టర్ రెండూ కాలువలో పడిపోయాయి.జకాటెకాస్ గవర్నర్ డేవిడ్ మాన్రియల్ తొలుత ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారని తెలిపారు. అయితే రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం తరువాత ఒక ప్రకటనలో మృతుల సంఖ్యను సవరించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని స్పష్టం చేసింది.స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రమాదం దరిమిలా కాలువలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు యూఎస్-మెక్సికో సరిహద్దులోని చివావా రాష్ట్రంలోని క్యూడాడ్ జువార్జ్ అనే నగరానికి వెళుతోంది. ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐన్ సోఖ్నా హైవేపై ఈ ఘటన జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.బస్సులో సూయజ్‌లోని గలాలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు ఐన్ సోఖ్నా హైవే మీదుగా వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 28 అంబులెన్స్‌లు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు సూయజ్ మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స అందిస్తున్నారు.ఈజిప్టులో ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. దేశంలో రవాణా భద్రత రికార్డు అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా దేశంలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు -
బస్సు చార్జీల పెంపు అవాస్తవం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ బస్సుల చార్జీలను మాత్రమే సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఒక ప్రకటనలో తెలిపారు.పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేప్పుడు బస్సుల్లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, వారిని దింపి బస్సులు ఖాళీగా నగరానికి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో డీజిల్ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా ఉండదని తెలిపారు. అందుకోసం స్పెషల్ బస్సుల్లో చార్జీలను స్వల్పంగా సవరించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. -
బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం
బెంగళూరు: బన్నెర్ఘట్టలోని నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్ విండోస్ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. Come, let's meet face-to-face. 🐆 A leopard at Bannerghatta National Park recently jumped onto the window of a jungle safari bus, creating a moment of both awe and fear for the passengers inside. The wild cat’s sudden appearance startled everyone, as it leaped onto the bus… pic.twitter.com/YqDI265CS2— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024 -
‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’
మంగళూరు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.కర్నాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్ బస్సును లెస్టర్ కటీల్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లో ఉన్నాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్‌బిద్రి మార్గంలో నడుపుతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టాడు. కటీల్‌లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోంది. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్ పేరు ఎందుకు పెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సు పేరు మార్చాలని యజమానికి సూచించారు. దీంతో బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు. ఇది కూడా చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
లోయలో పడిన బస్సు.. 30 మంది దుర్మరణం
పౌరీ: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది వరకు మృతిచెందివుంటారని ప్రాథమిక సమాచారం.ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం అతిథులతో వచ్చిన ఒక బస్సు హరిద్వార్ సమీపంలోని లాల్ ధంగ్ ప్రాంతం నుంచి పౌరీ జిల్లాలోని బిరోంఖల్ గ్రామానికి వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గమ్యస్థానానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్డులో కొండ పైకి వెళుతుండగా, బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 30 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
అమెరికాలో బస్సు హైజాక్ కలకలం
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్ హైజాక్ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.పలు అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో నిందితులు బస్సును హైజాక్ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.హైజాక్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్ నుంచి డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్ గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో సైతంఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్టౌన్లో బస్సును నిందితుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held insideOnline images show that a SWAT team is at the sceneFollow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6— RT (@RT_com) September 25, 2024 -
బ్యాటరీ బస్సులే తిప్పండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులకు బదులు అన్నీ బ్యాటరీ బస్సులే తిరగా లని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు చెప్పారు. నగరంలో 2,700 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్పగా.. వాటిల్లో డీజిల్ బస్సులను తొలగించి అన్నింటినీ క్రమంగా బ్యాటరీ సర్వీసుల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఒక సంవత్సరంలో ఎన్ని బస్సులు సమకూర్చుకునే అవకాశం ఉందో తేల్చాలని, దీని సాధ్యాసాధ్యా లను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ప్రస్తుతం 7,292 బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలవుతోందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని 83.42 కోట్ల మంది వినియోగించుకుని, రూ.2,840.71 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో, ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వస్తోందని చెప్పారు.బ్యాటరీల దిగుమతి ఇబ్బందిగా ఉందినగరంలో తిప్పేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇస్తే, ఇప్పటికీ అన్నీ సరఫరా కాలేదని, విదేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి రావటం బస్సు తయారీ సంస్థలకు ఇబ్బందిగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనాలంటే భారీ వ్యయం అవుతుందని, ఒక్కో బస్సు రూ.1.85 కోట్ల వరకు ధర పలుకుతోందని చెప్పారు. సంస్థ ప్రస్తుతం ఆద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకుని నిర్వహిస్తోందని వివరించారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులను పిలిపించి చర్చించాలని, కావల్సినన్ని బస్సుల సరఫరాకు ఉన్న సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పారు. ఆ సమావేశంలో ఈ బస్సుల అంశంతో పాటు, బ్యాంకు అప్పులపై వడ్డీని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చిద్దామని చెప్పారు.అప్పుల రీస్ట్రక్చర్‌కు మార్గాలు పరిశీలించండిఆర్టీసీకి లాభాలు వస్తున్నా, వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.వేల కోట్ల రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉండటం సంస్థకు ఇబ్బందిగా మారి నందున.. ఆ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునేం దుకు ఉన్న మార్గాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచించారు. వడ్డీ తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో పెరు గుతున్న ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కాగా వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వాడు కున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సి న బకాయిలు కలిపి రూ.6,322 కోట్లు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద సంస్థ అప్పులను ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుందన్నారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎం కార్యద ర్శులు షానవాజ్ ఖాసిం, చంద్రశేఖరరెడ్డి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలు పాల్గొన్నారు. -
బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే!
అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసు అందించే ఫ్లిక్స్‌బస్ సంస్థ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నై మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. కేవలం రూ.99కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ రూట్లలో బస్సులను ప్రారంభించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.99కే ఈ రూట్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 10-అక్టోబరు 6 మధ్య ఉండాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఆశించినమేర వృద్ధి చెందడం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎంచుకుంటున్నారు. వారాంతాలు, సెలవులు, పండగల సమయాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలు అందుకు అనువుగా సర్వీసులు నడుపుతూ లాభాలు గడిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఫ్లిక్స్‌బస్ అనే జర్మన్ కంపెనీ దక్షణాది రాష్ట్రాల్లో సేవలు ప్రారంభించడం విశేషం. 2011లో స్థాపించిన ఈ కంపెనీ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దాదాపు 40 దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. 4 లక్షల రూట్లలో 5000 ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. -
అద్దం కనిపిస్తలేదు.. స్టీరింగ్ తిరుగుతలేదు...
హుజూరాబాద్: ‘ఫుట్‌బోర్డుపై మీరు నిలబడితే నాకు సైడ్ మిర్రర్ కనిపిస్త లేదు. అద్దం చూడకుండా బస్సు నడపలేను. ఇంతమందితో బస్సు ముందుకు పోవాలంటే కష్టమే.. కనీసం స్టీరింగ్ తిరుగుతలేదు. కొందరు దిగాల్సిందే..’అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సును నడిరోడ్డుపై నిలిపివేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్‌కు వెళ్తోంది. దారిలో హుజూరాబాద్ బస్టాండ్‌లో ఆగింది. అప్పటికే బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. నిల్చునేందుకు కూడా స్థలం లేదు. అయినప్పటికీ బస్టాండులో వరంగల్ వెళ్లేవారు మరికొంతమంది ఎక్కారు. డ్రైవర్ ఓవర్ లోడ్ అవుతోందని, బస్సు నడిపే పరిస్థితి ఉండదని ప్రయాణికులను వారించినా వినిపించుకోలేదు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చిన తరువాత డ్రైవర్‌కు సైడ్ మిర్రర్ కనిపించడం లేదు. దీంతో అద్దం కనిపించడం లేదని, వెనకనుంచి వచ్చే వాహనాలను గమనించకుండా బస్సుని నడపలేనని డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశాడు. ఇంతమంది ఎక్కితే కనీసం బస్సు స్టీరింగ్ తిరగడం లేదని చెప్పాడు. ప్రయాణికులు సహకరించి కొందరు దిగిపోవాలని అభ్యరి్థంచాడు. దీంతో కొంతమంది దిగిపోవడంతో బస్సు వరంగల్ బయల్దేరింది. -
ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు
జగిత్యాల క్రైం: వందమందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయిన సంఘటనలో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా రాయికల్ ప్రధాన రహదారిపై శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో.. ఒకేసారి రెండు వెనుక టైర్లు ఊడిపోయాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తోంది.సుమారు 100 మంది ప్రయాణికులున్న బస్సు జగిత్యాల రూరల్ మండలం చల్గల్–మోరపల్లి శివారు చేరగానే.. బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. -
తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. ఇద్దరి మృతి
సాక్షి,హైదరాబాద్: తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం(ఆగస్టు 7) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డుపై చివరి మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు కిందపడ్డారు. కిందపడ్డవారి మీద నుంచి వెనుక నుంచి వస్తున్న బస్సు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘోర ప్రమాదం కారణంగా ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్‌జామ్ అయింది. -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక డబుల్ డెక్కర్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావా పోలీసు అధికారి సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ శనివారం రాత్రి 12:30 ప్రాంతంలో రాయ్‌బరేలీ నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు కారును ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే కారులో ఉన్న ముగ్గురు కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. #WATCH | Etawah, Uttar Pradesh: 7 killed in a collision between a double-decker bus and car on Agra Lucknow ExpresswaySSP Etawah Sanjay Kumar Verma says, "A double-decker bus going from Raebareli to Delhi collided with a car at around 12:30 am. There were 60 people on the bus,… pic.twitter.com/LcuMLYDLpN— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2024 -
పట్టాలపై నడుస్తుంది.. ట్రైన్ కాదు (ఫోటోలు)
-
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. ఐదుగురు మృతి
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చేటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 45 మంది గాయపడ్దారు. పండరీపూర్‌కు వెళ్తున్న బస్సు మార్గం మధ్యలో ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో బస్సు, ట్రాక్టర్ రెండూ అదుపు తప్పి కాలువలో పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు పరుగుపరుగున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నవీ ముంబై పోలీస్ డీసీపీ వివేక్ పన్సారే కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. #WATCH | DCP Navi Mumbai, Vivek Pansare says, "The people were going to Pandharpur through a private bus on the occasion of Asadhi Ekadashi. The bus collided with a tractor and fell into a ditch. 42 people, who were injured have been shifted to MGM Hospital, while 3 have been… https://t.co/nIaIt4kgrM pic.twitter.com/BOIAvHkSJE— ANI (@ANI) July 15, 2024 -
జడ్చర్ల వద్ద డీసీఎంను ఢీకొన్న APSRTC బస్సు దగ్ధం
-
హర్యానాలో బస్సు బోల్తా.. నలభై మంది పిల్లలకు గాయాలు
చండీగఢ్: హర్యానాలోని పంచకుల జిల్లా పింజోర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది స్కూలు పిల్లలు, ఇతరులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పంచకులలోని ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళను మాత్రం చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.