
ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. చేతిలో లక్షలు ఉంటే గాని, ఇల్లు కట్టడం సాధ్యం కాదు. ఇక పట్టణాల్లో ఇల్లు కొనాలనే ఆలోచన కూడా సామాన్యులు చేయలేరు. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన కాన్రాడ్ క్రిక్, ఇంటి కోసం పెద్దగా కష్టపడలేదు. ఒక పాత బస్సునే తన ఇల్లుగా మార్చి అందరినీ ఆశ్చర్యపరచాడు. లగ్జరీ ఫ్లాట్‌కు ఏమాత్రం తీసిపోని ఈ డబుల్ డెక్కర్ బస్సులో ఒక కిచెన్, హాలుతోపాటు మూడు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూములు ఉన్నాయి.
అతని భార్య నికోల్ మిక్‌కార్తీతో పాటు వారి నలుగురు పిల్లలు, రెండు పెంపుడు పిల్లులు, రెండు కుక్కలు కలసి ఈ బస్సులో నివాసం ఉంటున్నారు. వీరంతా వారి సొంతింటి కల కోసం రీసైకిలింగ్ వస్తువులనే వాడుతూ చాలా పొదుపుగా జీవిస్తున్నారు. ఇక పిల్లల స్కూల్ ఫీజు, బిల్లులు, ఇతర ఖర్చులు అన్నీ కలసి వీరి నెల ఖర్చు వెయ్యి పౌండ్లు (సుమారు రూ.98 వేలు). ఇంగ్లండ్‌లో ఇది చాలా తక్కువ. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ బస్సు ఇంటిని.. క్రిక్, యూట్యూబ్ వీడియోలు చూసి చేశాడట. త్వరలోనే ఓ అందమైన నిజమైన ఇంటిని నిర్మించుకుంటామని ఈ కుటుంబం అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment