double decker
-
మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే టూరిస్టులకు మున్నార్ అందాలను మరింత అందంగా చూపించాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) కొత్త బస్సు సర్వీసులను తీసుకొచ్చింది. హిల్ స్టేషన్లో డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేసింది. 'రాయల్ వ్యూ ప్రాజెక్ట్'లో భాగమైన ఈ బస్సులో పర్యాటకులు మున్నార్ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను గో కేరళ ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో పర్యాటక ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది.ఇటీవల మున్నార్‌లో సందర్శన కోసం కొత్త డబుల్ డెక్కర్ బస్సును జెండా ఊపి రవాణా మంత్రి శ్రీ గణేష్ కుమార్ ప్రారంబించారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందన్నారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు వల్ల ప్రస్తుతం ఉన్న పర్యాటక సంబంధిత సౌకర్యాలకు ఎలాంటి ముప్పు ఉండదని కూడా ఆయన హామీ ఇచ్చారు. దీని ప్రకారం, మున్నార్ రాయల్ వ్యూ డబుల్ డెక్కర్ బస్సు తేయాకు తోటలు ,ఎత్తైన ప్రాంతాలను 360 డిగ్రీల వీక్షణ అందించేలా రూపొందించారు. గాజు అద్దాలతో, వినసొంపైన సంగీతం పారదర్శకంగా బయటి దృశ్యాలను చక్కగా చూపిస్తుంది. బస్సు ఎగువ డెక్‌లో 38 మంది, దిగువ డెక్‌లో 12 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ బస్సు మున్నార్-దేవికులం మార్గంలో రోజువారీ నాలుగు సర్వీసులను నడుపుతుందని సమాచారం.కామెంట్లు చూస్తే గుండె గుభిల్లు అయితే ఈ వీడియో చాలామంది అనుమానాలు, భయాలు వ్యక్తం చేశారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులో నిస్సందేహంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కానీ ఈ రోడ్డుపై నా అనుభవం చాలా తీవ్రంగా ఉంది అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.. KSRTC డ్రైవర్లు సరిగ్గా నావిగేట్ చేయకపోయినా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా... పెద్ద ముప్పు తప్పదు అని ఒకరు, మోషన్ సిక్నెస్ రావచ్చు, ముఖ్యంగా పొగమంచు ఉన్న రోజుల్లో ఇది చాలా ప్రమాద కరమైనది కావచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పై చట్టపరమైన సవాళ్లు కొత్త బస్సు సర్వీస్‌ను పర్యాటకులు స్వాగతిస్తున్నప్పటికీ, ఇది చట్టపరమైన సమస్యలను రేకెత్తిస్తోంది. కేరళ హైకోర్టు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని వాహనాలతో సహా అక్రమ వాహన మార్పులకు సంబంధించిన పిటిషన్లను సమీక్షిస్తోంది. ఎటువంటి మినహాయింపులు లేకుండా మోటారు వాహనాల చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని జస్టిస్ అనిల్ కె. నరేంద్రన్ , జస్టిస్ మురళీకృష్ణతో కూడిన డివిజన్ బెంచ్ నొక్కి చెప్పింది.మరోవైపు మున్నార్ టూరిస్ట్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ కొత్త బస్సు సర్వీస్ వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వాదిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ సమస్య ప్రస్తుత పిటిషన్ పరిధిలోకి రాదని పేర్కొంటూ కోర్టు వారి దరఖాస్తును తోసిపుచ్చింది. తగిన మార్గాల ద్వారా చట్టపరమైన సహాయం తీసుకోవాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. KSRTC launches double-decker bus for tourists in Munnar 💚 pic.twitter.com/pJbn6mxik7— Go Kerala (@Gokerala_) February 11, 2025 -
ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
నగర సంచారం చేస్తూ, నోరూరించే రుచులను ఆస్వాదించే అనుభవాన్ని ప్రయాణికులకు అందిచాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సును రెస్టారెంట్‌గా మార్చేశారు. ‘బస్ట్రోనోమ్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారంట్ బస్సులు లండన్, పారిస్ నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫ్రాన్స్‌కు చెందిన జీన్ క్రిస్టోఫ్ ఫార్నీర్, బెర్ట్రాండ్ మాథ్యూ అనే మిత్రులు 2013లో బస్సులో రెస్టారంట్‌ను ప్రారంభించాలని తలపెట్టారు. సరికొత్త డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసి, దానిని పూర్తి స్థాయి రెస్టారెంట్లా మార్చారు. బస్సు కింది భాగంలో వంట గది, వంట సామగ్రి, సిబ్బంది ఉండటానికి వీలుగా తయారు చేసి, పైభాగాన్ని రెస్టారంట్గా తీర్చిదిద్దారు.ఇందులో 38 మంది కూర్చుని, విందు భోజనాలు ఆరగిస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ నగర సంచారం చేయవచ్చు. తొలుత ‘బస్ట్రోనోమ్’ సేవలను పారిస్‌లో ప్రారంభించారు. పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇటీవల లండన్‌లో కూడా మరో బస్సును రెస్టారంట్గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. -
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్‌లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్‌పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
డబుల్ డెక్కర్ కారిడార్‌కు నేడే శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనకరమైన ‘డబుల్ డెక్కర్ కారిడార్’ కు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. 44వ నంబర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)పై దశాబ్దాలుగా వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలకు దీనితో ఉపశమనం లభించనుంది. రూ.1,580 కోట్లతో 5.32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. తర్వాత దీనిపైనే మెట్రోరైల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇలా.. ప్రతిపాది కారిడార్ సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. మొత్తం కారిడార్ పొడవు 5.32 కిలోమీటర్లుకాగా.. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్‌గ్రౌండ్ టన్నెల్ సుమారు 600 మీటర్ల వరకు ఉంటాయి. మొత్తం 131 పియర్స్ (స్తంభాలు)తో.. ఆరు వరుసల రహదారిని నిర్మిస్తారు. ఈ కారిడార్లోకి ప్రవేశించేందుకు, దిగేందుకు బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా రెండు చోట్ల (0.248 కిలోమీటర్ వద్ద), (0.475 కిలోమీటర్ వద్ద) ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యాక దానిపై మెట్రోరైల్ మార్గం నిర్మిస్తారు. దానితో ఇది డబుల్ డెక్కర్ కారిడార్‌గా మారుతుంది. రోజూ వేలాది వాహనాలు.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ వద్ద రోజూ సగటున 1,57,105 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ డే– పీసీయూ) ప్రయాణిస్తుంటే.. ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ దారి ఇరుగ్గా ఉండటంతో ట్రాఫిక్ స్తంభించిపోతూ.. వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఈ కష్టాలు తీరుతాయి. ఎలివేటెడ్ కారిడార్ విశేషాలివీ ► మొత్తం పొడవు: 5.320 కిలోమీటర్లు ► ఎలివేటెడ్ కారిడార్: 4.650 కిలోమీటర్లు ► అండర్‌గ్రౌండ్ టన్నెల్: సుమారు 600 మీటర్లు ► సేకరించాల్సిన భూమి: 73.16 ఎకరాలు ► ఇందులో రక్షణశాఖ భూమి: 55.85 ఎకరాలు ► ప్రైవేట్ స్థలాలు: 8.41 ఎకరాలు ► అండర్‌గ్రౌండ్ టన్నెల్ కోసం: 8.90 ఎకరాలు ► మొత్తం ప్రాజెక్టు వ్యయం: రూ.1,580 కోట్లు ప్రాజెక్టుతో ప్రయోజనాలివీ ► జాతీయ రహదారి–44లో సికింద్రాబాద్‌తోపాటు ఆదిలాబాద్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ►హైదరాబాద్ నగరం మధ్య నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం. ►మేడ్చల్–మల్కాజిగిరి–మెదక్–కామారెడ్డి–నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్‌కు ప్రయాణికులు, సరకుల రవాణా వేగంగా సాగనుంది. -
డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చి రద్దీ పెరగడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ట్రామ్ తరహాలో రెండు కోచ్‌లుగా ఉండే వెస్టిబ్యూల్, డబుల్ డెక్కర్ బస్సు లు నగరం వెలుపల నడపడం, ప్రస్తుతం నడు స్తున్న బస్సులు కాకుండా 12 మీటర్ల పొడవుండే భారీ వెడల్పాటి బస్సులు కొనుగోలు చేయడం తదితర అంశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే దాదాపు 10 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగి మొత్తం ప్రయాణికుల సంఖ్య 40 లక్షలు దాటింది. సోమ వారాల్లో అయితే ఇది 50 లక్షలను మించుతోంది. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం నమోదవుతోంది. మరోవైపు పురుషులకు చోటుండటం లేదు. ఈ నేపథ్యంలో పెరిగిన రద్దీని సులభంగా తట్టుకుని ఈ పథకాన్ని సజావుగా అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలని పేర్కొంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ ప్రతినిధులు మరో రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారు. అందులోని సిఫారసులకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది. నగరంలోనా? వెలుపలా? ప్రస్తుతం ఆర్టీసీలో 9,300 బస్సులున్నాయి. వీటిల్లో 3 వేలకు పైగా పాతబడి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 4 వేల వరకు బస్సులు కొనాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ బస్సులకు బదులు పెద్ద బస్సులు కొంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆర్టీసీ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వాడుతున్న 11 మీటర్ల పొడవు బస్సులకు బదులు 12 మీటర్ల బస్సులు కొంటే అదనంగా నాలుగు సీట్లు కలిసి వస్తాయి. వెడల్పు ఎక్కువగా ఉండటంతో నిలబడే స్థలం పెరుగుతుంది. ఇక ఒకదాని వెనక మరొకటిగా రెండు కోచ్‌లతో ఉండే వెస్టిబ్యూల్ బస్సులు కొంటే ఒకేసారి ఎక్కువమందిని తరలించే వీలుంటుంది. డబుల్ డెక్కర్‌లో కూడా ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటిని నగరం వెలుపల విశాలమైన రోడ్లు ఉండే ప్రాంతాల్లో తిప్పే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ నగరంలో అయితే ఏయే రూట్లు ఇందుకు యోగ్యంగా ఉంటాయో కూడా గుర్తిస్తున్నారు. 4 వేల బస్సులకు 10 వేల మంది సిబ్బంది కావాలి ఒక బస్సుకు సగటున 2.6 చొప్పున సిబ్బంది. అవసరమన్నది ఆర్టీసీ లెక్క. కొత్తగా 4 వేల బస్సులు కొంటే 10 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఒకవేళ అద్దె ప్రాతిపదికన బస్సులు తీసు కుంటే సిబ్బంది సంఖ్య అంత అవసరం ఉండదు. కాగా సిబ్బంది పెంపు ఎలా ఉండాలన్న అంశంపై ఓ కమిటీ నివేదిక సిద్ధం చేస్తోంది. అదే సమయంలో బస్సుల నిర్వహణపైనా సంస్థ దృష్టి సారించింది. షాక్ అబ్జార్బర్స్‌గా పనిచేసే కమాన్ పట్టీలు, టైర్లు, బ్రేక్ లైనర్స్ మన్నిక పెంచేందుకు ఏం చేయాలి? నిర్వహణ వ్యయం, అవసరమైన మెకానిక్‌లు తదితర అంశాలను మరో కమిటీ పరిశీలిస్తోంది. బస్స్టేషన్లు, ప్లాట్ ఫామ్స్‌పై దృష్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అన్నింటిలో టికెట్ జారీ యంత్రాలు వాడుతు న్నారు. వీటి చార్జింగ్కు ఇబ్బంది పడకుండా టిమ్స్‌ను బస్సుల్లోనే చార్జ్ చేసే సాంకేతికత సమకూర్చుకోవచ్చా? స్మార్ట్ కార్డుల జారీ, విచారణ కేంద్రాలలో ట్యాబ్స్ వినియోగం లాంటి అంశాలపై ఇంకో కమిటీ దృష్టి పెట్టింది. అదే సమయంలో పెరుగుతున్న బస్సులకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెంచటం, తదనుగుణంగా బస్టాండ్లు, బస్స్టేషన్లను విస్తరించటం, బస్టాండ్లలో వసతుల కల్పన, పెరిగిన దొంగల బెడదను అరికట్టేందుకు భద్రత పెంపు, మహిళా ప్రయాణికులకు టాయిలెట్లు, మంచినీటి వసతిని మెరుగుపరచటం లాంటి వాటిపై ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది. -
డబుల్ డెక్కర్.. ఉచిత ప్రయాణం
హైదరాబాద్: ఎన్నికల వేళ.. డబుల్‌డెక్కర్ రోడ్డెక్కింది. కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్ చుట్టూ మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు రూ.2.5 కోట్ల చొప్పున 3 బస్సులను ప్రవేశపెట్టారు. కానీ చాలాకాలం వరకు ఈ బస్సులు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. నగరంలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు పలు దఫాలుగా సర్వేలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు రూట్లను ఖరారు చేయలేదు. దీంతో పార్కింగ్‌కే పరిమితమైన ఈ బస్సులను ప్రస్తుతం సాగర్ చుట్టూ తిప్పుతున్నారు. సెక్రటేరియల్, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం ఏర్పాటు తర్వాత నెక్లెస్ రోడ్డుకు వచ్చే సందర్శకుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. నగరవాసులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, విదేశీ పర్యాటకులు సైతం నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, పరిసరాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఇదీ రూట్... ప్రస్తుతం సాగర్ చుట్టూ మూడు బస్సులు కూడా తిరుగుతున్నాయి. సంజీవయ్యపార్కు, థ్రిల్‌సిటీ, లేక్‌ఫ్రంట్ పార్కు, జలవిహార్, నీరాకేఫ్, పీపుల్స్‌ప్లాజా, ఇందిరాగాంధీ, పీవీల విగ్రహాలు, అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెక్రటేరియట్‌కు వెళ్లవచ్చు. అక్కడి బస్సు దిగి కొద్ది సేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి బస్సుల్లోనే ట్యాంక్‌బండ్ వైపు వెళ్లవచ్చు. అనంతరం ఈ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్‌బండ్ మీదుగా తిరిగి సంజీవయ్య పార్కు వరకు చేరుకొంటాయి. బస్సు మొదటి అంతస్తులో కూర్చొని ఈ రూట్లో ప్రయాణం చేయడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇవీ వేళలు.. ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు డబుల్ డెక్కర్ బస్సుల్లో సాగర్ చుట్టూ విహరించవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ సేవలను వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లోనూ డబుల్ డెక్కర్లకు డిమాండ్ కనిపిస్తోంది. -
తిరుపతి నగరపాలక పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులు
-
ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!
ముంబై మహానగరంలో ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్‌లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్) చివరి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్‌గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్(ట్విటర్) ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. (మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు) We’ve received a 'nostalgic heist' report from @anandmahindra Sir! We can clearly see the theft, but we cannot take possession of it. Those B.E.S.T cherished memories are safely kept in your heart, and among all Mumbaikars.#DoubleDecker #MumbaiMemories #BestMemories https://t.co/32L2nmzXiQ — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) September 15, 2023 “హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు కూడా స్పందించారు. డిపార్ట్మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మీతోపాటు ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) కాగా 1997లో86 ఏళ్ల క్రితం నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్‌లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్
కంటోన్మెంట్ (హైదరాబాద్): ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కైవేల ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. కీలకమైన స్థల సేకరణకు వీలుగా ఆర్మీ అంగీకారం తెలుపడంతో రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవే మార్గాల్లో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. స్కైవేలకు ఆర్మీ స్థలాలు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక మిలటరీ అధికారులు (ఎల్ఎంఏ), కంటోన్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. 2017లోనే చేపట్టిన జాయింట్ సర్వేలో కొన్ని మార్పులు, చేర్పులతో తుది నివేదికను రూపొందించారు. రక్షణ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ప్రతిపాదిత రోడ్ల విస్తరణకు ఆర్మీ, కంటోన్మెంట్ 158 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. ప్రైవేటు స్థలాలు దీనికి అదనం. ఇక ప్రతిపాదిత మార్గాల్లో ప్రస్తుత రోడ్లను 60 మీటర్ల (196 అడుగులు)కు విస్తరించనున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికే ఏఓసీ మార్గంలో రోడ్ల మూసివేత అంశం కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరాక ఈ ప్రాజెక్టును చేపట్టడంతో పాటు, సెక్రెటేరియట్‌ను కంటోన్మెంట్లో ఏర్పాటు చేయాలని భావించింది. ప్రతిపాదిత సెక్రెటేరియట్ తూర్పు ద్వారం గుండా నేరుగా హకీంపేట వరకు రాజీవ్ రహాదారి మీదుగా, పడమర ద్వారం గుండా సుచిత్ర వరకు మేడ్చల్ హైవే మీదుగా రెండు స్కైవేలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా సూత్రప్రాయ అంగీకారం తెలుపడంతో పాటు ఆర్మీ, కంటోన్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జాయింట్ సర్వే కూడా పూర్తి చేశారు. ఈ మేరకు సెక్రెటేరియట్ కోసం 60 ఎకరాలు, స్కైవేలకు 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలాలు ఇవ్వాల్సి ఉంటుందని లెక్కతే ల్చారు. అయితే విలువైన స్థలాలను కోల్పోతున్న నేపథ్యంలో కంటోన్మెంట్‌కు ఏటా రూ.31 కోట్ల చొప్పున సర్వీసు చార్జీ చెల్లించాలని ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. సెక్రెటేరియట్ నిర్మాణ ప్రతిపాదనను కూడా విరమించుకుని, పాతభవనం తొలగించి నిర్మించారు. 90 కాదు..158 ఎకరాలు వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) కింద రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్–44) మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఈ మార్గాల్లో రోడ్డును 150 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. తాజాగా ఈ స్కైవేలను మెట్రో కోసం కూడా వినియోగించుకోవాల ని నిర్ణయించారు. దీంతో రెండు మార్గాలను సుమారు 200 అడుగుల మేర విస్తరించనున్నారు. దీంతో గతంలో 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలం మాత్రమే అవసరం కాగా, ప్రస్తుతం 158 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఈ ప్రతిపాదనకు ఆర్మీకూడా అంగీకరించడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయ్యింది. 70 శాతం దుకాణాలు బంద్ ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి స్థల సేకరణ చేపడితే కంటోన్మెంట్లో 70 శాతం కమర్షియల్ నిర్మాణాలు కనుమరు గు కానున్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహ దారి మార్గంలో సికింద్రాబాద్ క్లబ్ నుంచి అల్వాల్ వరకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు కొన్నిచోట్ల 10 మీటర్ల నుంచి, గరిష్టంగా 30 మీటర్ల వరకు మాత్రమే ఉంది. తాజాగా ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు దాదాపుగా తొలగించాల్సి వస్తుంది. ప్యారడైజ్– బోయిన్పల్లి మార్గంలోనూ కొన్ని వ్యాపార కేంద్రాలు రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సి వస్తుంది. -
Double-Decker Skyways: జేబీఎస్ టు శామీర్‌పేట డబుల్ డెక్కర్ స్కైవే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) నుంచి శామీర్‌పేట మధ్యలో డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో కరీంనగర్–హైదరాబాద్ రూట్లో ప్రయాణానికి మహర్దశ పట్టినట్టే. ఇటీవల ఈ ప్రతిపాదనను కేంద్రం వద్ద ఉంచగా, సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. డబుల్ డెక్కర్ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని, పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో ఫ్లైఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని వివరించారు. పనులు పూర్తయ్యే నాటికి రూ.ఐదువేల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలతో కలిసి తాను కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చల ఫలితంగానే ఈ ప్రతిపాదన ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిపారు. -
ఇంటి కోసం పెద్దగా కష్టపడలేదు.. సింపుల్‌గా బస్సులోనే బస!
ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. చేతిలో లక్షలు ఉంటే గాని, ఇల్లు కట్టడం సాధ్యం కాదు. ఇక పట్టణాల్లో ఇల్లు కొనాలనే ఆలోచన కూడా సామాన్యులు చేయలేరు. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన కాన్రాడ్ క్రిక్, ఇంటి కోసం పెద్దగా కష్టపడలేదు. ఒక పాత బస్సునే తన ఇల్లుగా మార్చి అందరినీ ఆశ్చర్యపరచాడు. లగ్జరీ ఫ్లాట్‌కు ఏమాత్రం తీసిపోని ఈ డబుల్ డెక్కర్ బస్సులో ఒక కిచెన్, హాలుతోపాటు మూడు బెడ్రూమ్లు, రెండు బాత్రూములు ఉన్నాయి. అతని భార్య నికోల్ మిక్కార్తీతో పాటు వారి నలుగురు పిల్లలు, రెండు పెంపుడు పిల్లులు, రెండు కుక్కలు కలసి ఈ బస్సులో నివాసం ఉంటున్నారు. వీరంతా వారి సొంతింటి కల కోసం రీసైకిలింగ్ వస్తువులనే వాడుతూ చాలా పొదుపుగా జీవిస్తున్నారు. ఇక పిల్లల స్కూల్ ఫీజు, బిల్లులు, ఇతర ఖర్చులు అన్నీ కలసి వీరి నెల ఖర్చు వెయ్యి పౌండ్లు (సుమారు రూ.98 వేలు). ఇంగ్లండ్‌లో ఇది చాలా తక్కువ. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ బస్సు ఇంటిని.. క్రిక్, యూట్యూబ్ వీడియోలు చూసి చేశాడట. త్వరలోనే ఓ అందమైన నిజమైన ఇంటిని నిర్మించుకుంటామని ఈ కుటుంబం అంటున్నారు. -
అలనాటి వైభవానికి ఆటంకాలెన్నో.. డబుల్ డెక్కర్లేవి?
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలం నాటి డబుల్ డెక్కర్ బస్సుల వైభవాన్ని తలపించేలా హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు నగరవాసులకు, పర్యాటకులకు ఇంకా దూరంగానే ఉన్నాయి. నగరంలోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ బస్సులను నడపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 6 బస్సులతో డబుల్ డెక్కర్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫార్ములా– ఈ సందర్భంగా 3 బస్సులను మాత్రం పరిచయం చేశారు. ఇంకా మరో 3 బస్సులు అందుబాటులోకి రావాల్సి ఉంది. మరోవైపు ఈ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా దశలవారీగా 30 డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మూడు బస్సులు మాత్రం పీపుల్స్ ప్లాజాకే పరిమితమయ్యాయి. అప్పుడప్పుడు ట్యాంక్‌బండ్‌పై మాత్రం వీటిని ప్రదర్శిస్తున్నారు. కొరవడిన స్పష్టత.. నాలుగు వందల ఏళ్ల నాటి హైదరాబాద్ చారిత్రక కట్టడాలను సందర్శించే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా చార్మినార్, గోల్కొండ కోట, గోల్కొండ టూంబ్స్, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా వంటి ప్రాంతాలతో పాటు ట్యాంక్‌బండ్, బొటానికల్ గార్డెన్, కేబుల్‌బ్రిడ్జి, నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు, పీపుల్స్‌ప్లాజా, గండిపేట్, జూపార్కు తదితర ప్రదేశాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ బస్సులను నడపాలని హెచ్ఎండీఏ భావించింది. కానీ.. వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి రూట్ సర్వేలు నిర్వహించకపోవడం గమనార్హం. బస్సులను ఏ రూట్ నుంచి ఏ రూట్లో, ఏయే ప్రదేశాలకు నడపవచ్చనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు పలు మార్గాల్లో బస్సులను నడిపేందుకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని మున్సిపల్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. మార్చి మొదటి వారం నుంచే ఈ బస్సులను ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని భావించారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వేసవి సెలవుల దృష్ట్యా ఈ బస్సులు పిల్లలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. బస్సులు నడిపేదెవరు... మరోవైపు ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ సొంతంగా నిర్వహిస్తుందా లేక ఆర్టీసీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తుందా అనే అంశంలోనూ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తయారు చేసిన ఈ బస్సులను ఒకొక్కటి రూ.2.16 కోట్ల చొప్పున హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది. మొదటి దశలో వచ్చిన మూడింటితో పాటు మరో మూడు బస్సులు ఈ నెలలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు. రూ.కోట్లు వచ్చించి బస్సులను కొనుగోలు చేసినప్పటికీ వినియోగంలోకి రాకపోవడం గమనార్హం. వీకెండ్స్‌లో మాత్రం అప్పుడప్పుడు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఈ బస్సులు కనువిందు చేస్తున్నాయంతే. -
త్వరలో ఎలెక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర వాసులకు అతి త్వరలో డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే అనుభవం రానుంది. ఇవన్నీ ఎలెక్ట్రిక్ బస్సులే కానున్నాయి. ఓ ప్రముఖ సంస్థతో బస్సుల కొనుగోలుకు బీఎంటీసీ ఒప్పందం చేసుకుంది. తొలుత ఐదు డబుల్ డెక్కర్ బస్సులకు రూ. 10 కోట్లు బీఎంటీసీ చెల్లించనుంది. తొలి బస్సు మార్చిలో, మరో నాలుగు బస్సులు ఏప్రిల్‌లో వస్తాయి. ఇందులో ఏసీ సహా పలు ఆధునిక వసతులు ఉంటాయని బీఎంటీసీ వర్గాలు తెలిపాయి. మొదటి ఏసీ డబుల్ డెక్కర్ బస్సు హెబ్బాల నుంచి సిల్క్ బోర్డు మార్గంలో ప్రయాణించనుంది. వోల్వో వజ్ర బస్సులో చెల్లించే టికెట్ చార్జీలే ఈ బస్సులోనూ ఉండనున్నాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ బస్సుకు ముందు భాగం, వెనుక భాగంలో తలుపులు ఉంటాయి. 65 మంది ప్రయాణించవచ్చు. -
హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు (ఫోటోలు)
-
డబుల్ డెక్కర్ ఆగయా.. నిజాం నాటి బస్సులకు పూర్వ వైభవం..
సాక్షి, హైదరాబాద్: ‘అలనాటి చారిత్రక డబుల్ డెక్కర్ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. హైదరాబాద్ అందాలను ఆస్వాదిస్తూ రెండంతస్తుల బస్సుల్లో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి’ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ అందమైన అనుభవాన్ని నగరవాసులకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను రోడ్డెక్కించనున్నట్లు ఆయన అప్పుడే చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించినట్లుగానే పర్యావరణ ప్రియమైన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంగళవారం ప్రారంభించారు. నగరవాసులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను, సందర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న మూడు డబుల్ డెక్కర్ బస్సులను నానక్‌రాంగూడలోని హెచ్ఎండీఏ అనుబంధ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయం వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫార్ములా– ఈ ప్రిక్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్లాదభరింతంగా పర్యాటక విహారం.. ఫార్ములా– ఈ ప్రిక్స్ సందర్భంగా ప్రారంభించిన డబుల్ డెక్కర్ బస్సులు ప్రస్తుతం రేసింగ్ ట్రాక్ పరిధిలోని ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పారడైజ్ ,నిజాం కాలేజీ రూట్లలో తిరుగుతాయి. మొదటి విడతగా హెచ్ఎండీఏ 6 బస్సులను కొనుగోలు చేయగా ప్రస్తుతం మూడింటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరో మూడు బస్సులు రానున్నాయి. దశలవారీగా మొత్తం 20 బస్సులను ప్రవేశపెట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫార్ములా– ఈ ప్రిక్స్ అనంతరం డబుల్ డెక్కర్ బస్సులను చారిత్రక, వారసత్వ కట్టడాల సర్క్యూట్లలో నడుపుతారు. హైదరాబాద్ పర్యాటక స్థలాలను ఈ బస్సుల్లో సందర్శించవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ నెల 11న ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇదీ నేపథ్యం... నిజాం కాలంలోనే ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 2003 వరకు నడిపింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూపార్కు వరకు, అఫ్జల్‌గంజ్ వరకు ఇవి నడిచేవి. సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం వరకు డబుల్ డెక్కర్లు ఉండేవి. నగరవాసులతో పాటు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ బస్సులో పయనించేందుకు ఎంతో మక్కువ చూపేవారు. ట్యాంక్‌బండ్ మీదుగా ఇందులో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి. కాలక్రమంలో బస్సుల నిర్వహణ భారంగా మారడంతో వీటికి కాలం చెల్లింది. ఫ్లైఓవర్ల కారణంగా కూడా బస్సులు నడపడం కష్టంగా మారింది. మంత్రి కేటీఆర్ చొరవ మేరకు ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. -
ఏటా 40 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల విభాగం వచ్చే పదేళ్లలో ఏటా సుమారు 40% మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈవో మహేశ్ బాబు తెలిపారు. గతేడాది 1,200 ఎలక్ట్రిక్ బస్సులు రిజిస్టర్ కాగా, ఈసారి 2,000 దాటేయొచ్చని చెప్పారు. వచ్చే ఏడాది ఇది 6,000కు చేరవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సు తయారీ వ్యయం సగటున రూ. 1.5 కోట్ల స్థాయిలో ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సానుకూల పాలసీలు ఇందుకు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకోవడంపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని మహేష్ బాబు చెప్పారు. తమ సంస్థ విషయానికొస్తే.. ఇప్పటికే 500 పైచిలుకు బస్సులు సరఫరా చేశామని, వచ్చే 12–18 నెలల్లో సుమారు 2,600 బస్సులు అందించనున్నామన్నారు. తెలంగాణకు దాదాపు 1,000 బస్సులు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేస్తున్నది తమ కంపెనీ మాత్రమేనని, హెచ్ఎండీఏకి 6 అందిస్తున్నామని తెలిపారు. -
Viral Video: డబుల్ డెక్కర్ సైకిల్ వచ్చేసింది..
-
ఆ మెట్రోకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. గడ్కరీ ప్రశంసలు
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో రైలు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రోగా గిన్నిస్ రికార్డు సాధించింది. వార్ధా రోడ్లో నిర్మించిన ఈ డబుల్ డక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. నాగ్‌పూర్‌లోని మెట్రో భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమం వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేశ్ దీక్షిత్. గిన్నిస్ రికార్డ్స్ జడ్జి రిషి నాత్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దీక్షిత.. వార్దా రోడ్లో ఈ నిర్మాణాన్ని చేపట్టటం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. ఇది థ్రీటైర్ నిర్మాణం. గడ్కరీ ప్రశంసలు.. నాగ్‌పూర్ మెట్రో రైలు గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన క్రమంలో మహారాష్ట్ర మెట్రో విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అత్యంత పొడవైన డబుల్ డక్కర్ వయడక్ట్గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పైన మెట్రో వెళ్తుండగా.. మధ్యలో హైవే, కింద సాధారణ రవాణా మార్గం ఉంటుంది. Another feather in the cap ! Heartiest Congratulations to Team NHAI and Maha Metro on achieving the Guinness Book of World Record in Nagpur by constructing longest Double Decker Viaduct (3.14 KM) with Highway Flyover & Metro Rail Supported on single column. #GatiShakti @GWR pic.twitter.com/G2D26c7EKn — Nitin Gadkari (@nitin_gadkari) December 4, 2022 ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవు మేర రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించలేదు. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో డబుల్ డక్కర్ వయడక్ట్ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు నిర్మించిన విభాగంలోనూ ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది మహారాష్ట్ర మెట్రో. ఇదీ చదవండి: ‘ఎయిమ్స్’ తరహాలో ‘ఐసీఎంఆర్’పై సైబర్ దాడి.. 6వేల సార్లు విఫలయత్నం -
Hyderabad: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కోరారు. దీంతో నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దె ప్రాతిపదికన తీసుకుని.. ► ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్‌ను మరో వారంలో ఆహ్వానించనుంది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్లను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆహ్వానించనుంది. బిడ్ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్ఆర్టీసీ అద్దెను ఫిక్స్‌డ్‌గా చెల్లిస్తుంది. ► చార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాలవైపు పరుగులు తీసుకేందుకు టీఎస్ఆర్టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏ రూట్లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్లోనే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్లు ఫైనలైజ్ చేశారని వార్తలొస్తున్నాయి. ► పటాన్చెరు– కోఠి, జీడిమెట్ల–సీబీఎస్, అఫ్జల్‌గంజ్– మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ 22 మోడల్ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి. (క్లిక్ చేయండి: బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..) -
భాగ్యనగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్లు
సాక్షి, హైదరాబాద్: ముంబై తరహాలో హైదరాబాద్ రోడ్లపైనా త్వరలోనే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఖరీదు రూ. 2.25 కోట్ల వరకు ఉండటం.. అంత ఖర్చును భరించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం 4–5 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. క్రాస్ కాస్ట్ విధానంలో ఈ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని టెండర్ నోటిఫికేషన్లో కోరనుంది. అద్దె పద్ధతిలో బస్సులు నిర్వహించే సంస్థతో టెండర్ దక్కించుకున్న సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఆర్టీసీకి బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్ చొప్పున నిర్ధారిత అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించనుంది. ప్రభుత్వ ఆర్థిక సాయం లేనందున.. ముంబైలోని బృహన్ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్) సంస్థ దేశంలోనే తొలిసారి విద్యుత్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనుంది. అశోక్ లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ ద్వారా దశలవారీగా సుమారు 400 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయనుంది. ఇప్పటికే తయారీ సంస్థ నుంచి ఓ బస్సును అందుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బస్సుల కొనుగోలుకు ‘బెస్ట్’కు భారీగా ఆర్థిక చేయూత అందించడంతో సొంతంగా ఆ బస్సులను కొనుగోలు చేస్తోంది. కానీ రాష్ట్రంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక సాయం ఏదీ ప్రకటించనందున అద్దె ప్రాతిపదికపై వాటిని కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రస్తావించడంతో ఆర్టీసీ సిద్ధపడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కాంట్రాక్టు దక్కించుకుంది. కానీ నిధుల సమస్యతో దాన్ని రద్దు చేశారు. అప్పట్లో పురపాలక శాఖ నుంచి ఆర్టీసీకి రూ. 9 కోట్లు విడుదల చేయబోతున్నారన్న అంశం కూడా తెరపైకి వచ్చినా ఆ నిధులు అందలేదని తెలిసింది. దీంతో దేశంలోనే తొలిసారి అద్దెకు డబుల్ డెక్కర్ బస్సులు తీసుకునే సంస్థగా నిలిచిపోనుంది. 3 రూట్లలో బస్సులు! పటాన్చెరు–కోఠి (218), జీడిమెట్ల–సీబీఎస్ (9ఎక్స్), అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం (118) రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిప్పొచ్చని ఆర్టీసీ అధికారులు అధ్యయనంలో తేల్చారు. ఇప్పుడు తీసుకొనే 10 బస్సులను ఈ రూట్లలోనే తిప్పుతారని చెబుతున్నారు. ఫ్లైఓవర్ల సమస్య లేని రూట్లు అయినందున వాటిని ఎంపిక చేసినట్లు పేర్కొంటున్నారు. కానీ మెహిదీపట్నం మార్గంలో ఎన్ఎండీసీ వద్ద భారీ ఫుట్ఓవర్ బ్రిడ్జి ఉండటంతో ఆ సమస్యను అధికారులు ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. -
మనకూ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే తొలిసారి ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు గురువారం రోడ్డెక్కిన నేప థ్యంలో వాటిని రూపొందించిన అశోక్ లేలాండ్ అను బంధ సంస్థ స్విచ్ మొబిలిటీతోపాటు మరో 2 కంపె నీలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇందులో ఓ కంపెనీతో చర్చలు దాదాపు కొలిక్కి వస్తు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లో 20–25 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పాలని నిర్ణయించిన ఆర్టీసీ... ధర విషయంలో స్పష్టత రాగానే ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలోనే టెండర్లు: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను పునఃప్రారంభించే విషయమై మంత్రి కేటీఆర్ చేసిన సూచనకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సానుకూలంగా స్పందించడంతో కొత్త డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని గతేడాది నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. కానీ కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతో ఆర్టీసీ చేతులెత్తేసింది.అయితే ఇది కేటీఆర్ ప్రతిపాదన కావడంతో పురపాలక శాఖ ఆర్థిక సాయం చేస్తుందన్న అంశం తెరపైకి వచ్చినా అది సాకారం కాలేదు. ఆర్టీసీకి భారమే..:ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ధర రూ.2 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ సాయం లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ఆర్టీసీకి తలకుమించిన భారమే. మరోవైపు డబుల్ డెక్కర్ బస్సుపై రెండు షిఫ్టుల్లో కలిపి ఆరుగురు సిబ్బంది పని చేయాలి. గతంలో డబుల్ డెక్కర్ బస్సులతో తీవ్ర నష్టాలు రావడం వల్లే వాటిని తప్పించారు. ఇప్పుడు కూడా వాటితో నష్టాలు తప్పవన్నదే ఆర్టీసీ నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయంకోసం ఆర్టీసీ యత్నిస్తోంది. మరోవైపు నగరంలోని చాలా మార్గాల్లో ఫ్లైఓవర్లు ఉన్నందున డబుల్ డెక్కర్ బస్సులను తిప్పడం కూడా ఇబ్బంది కానుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఓ అధికారుల బృందం ముంబై వెళ్లి అక్కడ ఫ్లైఓవర్ల సమస్యను అధిగమించి డబుల్ డెక్కర్ బస్సులను ఎలా తిప్పుతున్నారో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. -
కాలుష్యం పెరిగిపోతుంది..ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగించండి!
ముంబై: ‘భారత వాహన పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.7.5 లక్షల కోట్లు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక పన్నులు ఇవ్వడంతోపాటు గరిష్టంగా ఉపాధి అవకాశాలను ఈ రంగం కలిగి ఉంది. 2024 చివరి నాటికి పరిశ్రమను రూ.15 లక్షల కోట్లకు చేర్చడం నా కల. ఇది సాధ్యం కూడా’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ముడి చమురు దిగుమతులు, కాలుష్యాన్ని తగ్గించడం కోసం వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని గురువారం పిలుపునిచ్చారు. దేశంలో తొలిసారిగా ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండీషన్డ్ బస్‌లను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘దేశంలో డీజిల్, పెట్రోల్ కారణంగా 35% కాలుష్యం ఉంది. ఈ నేపథ్యంలో దిగుమతులకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ వాహనాలు అవసరం’ అని తెలిపారు. బస్‌లో 66 మంది..: హిందూజా గ్రూప్‌లో భాగమైన అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ వాహన విభాగమైన స్విచ్ మొబిలిటీ ఈఐవీ 22 పేరుతో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్‌లను తయారు చేసింది. ప్రస్తుత డబుల్ డెక్కర్ స్థానంలో 66 సీట్లు గల ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ముంబైలో బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై, ట్రాన్స్పోర్ట్ (బీఈఎస్‌టీ) నడపనుంది. బీఈఎస్‌టీ నుంచి 200 బస్‌లకు ఇప్పటికే స్విచ్ మొబిలిటీ ఆర్డర్ దక్కించుకుంది. ఇతర నగరాల్లోనూ వీటిని పరిచయం చేసేందుకు తమ కంపెనీతో ప్రభుత్వ సంస్థలు చర్చలు జరుపుతున్నాయని స్విచ్ మొబిలిటీ ఇండియా సీఈవో మహేశ్ బాబు తెలిపారు. యూకేలోనూ స్విచ్ మొబిలిటీ డబుల్ డెక్కర్ ఈ–బస్‌లు పరుగెడుతున్నాయి. -
దేశంలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రయ్!
డబుల్ డెక్కర్ బస్సులు గుర్తున్నాయా. అవి మనం నేరుగా చూడకపోవచ్చు గానీ 90 దశకంలో కొన్ని సినిమాల్లో చూసుంటాం. ప్రస్తుత అవే కాలానికి అనుగుణంగా ఏసీ హంగులతో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చెంది మళ్లీ రోడ్లపైకి వస్తున్నాయి. వీటిని హిందూజా గ్రూప్‌నకు చెందిని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లే ల్యాండ్ ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన స్విచ్ మొబిలిటీ తయారు చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ఈ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా బస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఈ బస్సులు వాడకంలో ఉండగా, త్వరలో భారత్ రోడ్లపైకి రానున్నాయి. తేలికపాటి అల్యూమినియం బాడీతో వీటిని నిర్మించారు. ముంబైలోని బృహన్ ముంబాయ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్(BEST) 200 డబుల్ డెక్కర్ బస్సులను ఆర్డర్ చేసినట్లు స్విచ్ మొబిలిటీ భారత సీఓఓ అధికారి తెలిపారు. 231 kwh కెపాసిటీ కలిగిన ఈ బస్సు డ్యూయల్ గన్ చార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చ. First AC double decker bus by @switchEVglobal entering Mumbai this morning. The launch is tomorrow. (Credits to respective owner) pic.twitter.com/QrQKjUy3X4 — Rajendra B. Aklekar (@rajtoday) August 17, 2022 చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ -
రావోయి విహారి.. బోటింగ్‌కు సిద్ధమోయి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బోధిసిరి బోటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరమ్మతుల పేరుతో మూడేళ్లపాటు పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ డబుల్ డెక్కర్ క్రూయిజ్ వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. రూ.23 లక్షలతో మరమ్మతులు చేసిన బోధిసిరి ఇటీవల బెరంపార్క్‌లో బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సర్వహంగులు ఏర్పాటు చేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే దర్శనీయ స్థలాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో బోధిసిరి బోటు నదీ విహారానికి సిద్ధమవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బోధిసిరి బోటు వినియోగంలోకి వస్తే కృష్ణానదిలో విహరించేందుకు ఉత్సాహపడే పర్యాటకులకు ఆహ్లాదం కలిగించడమేగాక ఏపీటీడీసీకి మంచి ఆదాయం సమకూరుతుంది. పోర్ట్ అధికారుల నిబంధనల మేరకు రూపుదిద్దిన బోధిసిరి బోటుకు పోర్ట్, ఇరిగేషన్ శాఖల అనుమతులు కూడా సులువుగానే లభించాయి. బోటులో నైట్ పార్టీ.. రెండు దశాబ్దాలుగా పర్యాటకులకు సేవలందిస్తున్న బోధిసిరి బోటు 120 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. గరిష్టంగా 200 మంది వరకు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ఈ బోటును ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కూడా అద్దెకు ఇస్తారు. ఈ భారీ బోటు పైభాగంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకోవచ్చు. దీనిమీద చిన్నపాటి వేదిక కూడా ఉంది. బోటు నదిలో విహరిస్తుండగా పార్టీలు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బోటులో ఏర్పాటు చేసుకునే విద్యుత్ లైట్లతో అహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకొంటే ఆ మజానే వేరని అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇటువంటి ఫంక్షన్లతోపాటు అసోసియేషన్లు, మార్కెటింగ్ సంస్థలు వంటివాటి సమావేశాలకు కూడా అనువుగా ఉంటుంది. ఫంక్షన్‌కు లేదా సమావేశానికి వచ్చే అతిథులు భోజనాలు చేసేందుకు కింద ఏసీ సౌకర్యంతో సీటింగ్, టేబుల్స్‌తో పెద్ద హాల్ ఉంది. పైన ఆటపాటలతో కనువిందు చేస్తే కింద హాల్లో రుచికరమైన వంటకాలతో విందు భోజనం సిద్ధంగా ఉంటుంది. బోధిసిరి బోటులో నదిలో విహరించేందుకు గతంలో రెండు గంటలకు రూ.10 వేలు వసూలు చేసింది ఏపీటీడీసీ. కార్తికమాసం, పండుగలు, వారాంతపు సెలవుదినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బోధిసిరి బోటును వినియోగిస్తుంటారు. వారంలో బోటు విహారం బోధిసిరి బోటుకు సంబంధించిన పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు, స్టిక్కరింగ్, ప్లంబింగ్ పనులు మూడు, నాలుగు రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పటికే బోటు ట్రయల్ రన్ పూర్తయింది. బోటుకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బోటు షికారు వారం రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కృష్ణానదిలో బోధిసిరి కనువిందు చేయనుంది. – సీహెచ్.శ్రీనివాసరావు, డివిజనల్ మేనేజరు, ఏపీటీడీసీ -
కేటీఆర్ భరోసా.. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు!
సాక్షిహైదరాబాద్: డబుల్ డెక్కర్ బస్సులపై మరోసారి కదలిక వచ్చింది. నిధుల కొరత కారణంగా ఈ బస్సుల కొనుగోళ్లపై వెనకడుగు వేసిన ఆర్టీసీకి మంత్రి కేటీఆర్ భరోసా ఇవ్వడంతో ఆశలు చిగురించాయి. నగరంలోని వివిధ రూట్లలో ఈ బస్సులను నడిపేందుకు బస్సుల కొనుగోళ్ల కోసం రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. హెచ్ఎండీఏ నుంచి ఈ నిధులను అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో డబుల్ డెక్కర్ బస్సులపై మరో అడుగు పడినట్లయింది. 10 బస్సుల కొనుగోలుకు నిధులు.. హైదరాబాద్ నగరానికి వన్నెలద్దిన డబుల్ డెక్కర్ బస్సులపై మంత్రి గతంలో తన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. ప్రజారవాణాకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు ఆ బస్సులను తిరిగి ప్రవేశపెట్టడంపై ఆయన ఆసక్తి చూపారు. దీంతో డబుల్ డెక్కర్ బస్సులపై అప్పట్లో ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. రూట్ సర్వే నిర్వహించింది. బస్సుల కొనుగోళ్లకు టెండర్లను సైతం ఆహ్వానించింది. పలు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ నిధుల కొరత కారణంగా ఈ ప్రతిపాదన వాయిదా పడింది. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోళ్లు తెరమరుగైంది. భారీగా పెరిగిన అప్పుల కారణంగా కూడా ఆర్టీసీ సాహసం చేయలేకపోయింది. తాజాగా 10 డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోళ్లకు తన శాఖ నుంచి నిధులు కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో ఆర్టీసీ అధికారవర్గాలు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఆర్టీసీకి పూర్వవైభవం.. వైవిధ్యభరితమైన హైదరాబాద్ నగరంలో 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా జూపార్కు వరకు, సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు, సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం తదితర రూట్లలో ఆకుపచ్చ రంగులో ఉండే రెండంతస్తుల డబుల్ డెక్కర్లు పరుగులు తీసేవి. ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్లు విధులు నిర్వహించేవారు. బస్సు రెండో అంతస్తులో కూర్చొని ప్రయాణం చేయడం గొప్ప అనుభూతి. హైదరాబాద్ అందాలను విహంగ వీక్షణం చేస్తున్న భావన కలిగేది. కానీ నగరం విస్తరణ, అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ బస్సుల నిర్వహణ కష్టంగా మారింది. పలు చోట్ల బస్సులు మలుపు తీసుకోవడం అసాధ్యమైంది. దీంతో డబుల్ డెక్కర్ బస్సులను నిలిపివేశారు. మంత్రి కేటీఆర్ ఈ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని రెండేళ్ల క్రితం ప్రతిపాదించడంతో అప్పటి నుంచి ఇవి చర్చనీయాంశంగా మారాయి. మూడు రూట్ల ఎంపిక... డబుల్ డెక్కర్ బస్సుల కోసం మూడు రూట్లను ఎంపిక చేశారు. పటాన్చెరు–కోఠి (218), జీడిమెట్ల– సీబీఎస్, (9 ఎక్స్), అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం (118) రూట్లలో డబుల్ డెక్కర్లను ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు 10 బస్సుల కోసం ప్రతిపాదనలు రూపొందించారు. టెండర్లను ఆహ్వానించారు. నిధుల కొరత కారణంగా కొనుగోళ్లను నిలిపివేశారు. (చదవండి: అక్కడ చంద్రుడు.. ఇక్కడ రాముడు) -
ఇ డబుల్ డెక్కర్ బస్సులు.. త్వరలో హైదరాబాద్‌లో
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీ సెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) 5,580 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించి 5,500 కోట్ల విలువైన భారీ టెండర్‌ను ప్రకటించింది. ఇందులో 130 డబుల్ డెక్కర్ బస్సులు కూడా భాగంగా ఉన్నాయి. ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) అనుబంధ సంస్థే సీఈఎస్ఎల్. ఆసక్తి కలిగిన పార్టీల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. ఫస్ట్ ఫేజ్‌లో ‘గ్రాండ్ చాలెంజ్’ కింద తొలి దశలో హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కోల్‌కతా పట్టణాలకు ఈ ఏడాది జూలై నాటికే ఈ–బస్సులు అందుబాటులోకి వస్తాయని సీఈఎస్ఎల్ పేర్కొంది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద పథకమని సీఈఎస్ఎల్ ఎండీ, సీఈవో మహువా ఆచార్య పేర్కొన్నారు. అస్సెట్ లైట్ నమూనా కావడంతో రాష్ట్ర రవాణా సంస్థలు ఈ బస్సులను అందుబాటు ధరలకే, అధిక సంఖ్యలో నడిపించడం సాధ్యపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల ఈ–బస్సుల లక్ష్యాల సాధనకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కర్బన ఉద్గారాల్లో భారత్‌ను తటస్థంగా సున్నా స్థాయికి చేర్చే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని సీఈఎస్ఎల్ పేర్కొంది. డబుల్ డెక్కర్ హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపించాలంటూ మంత్రి కేటీఆర్‌ను ఓ నెటిజన్ కోరగా.. వెంటనే ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ని దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. ఈ మేరకు డబుల్ డెక్కర్ బస్సులు కొనేందుకు ఆర్టీసీ టెండర్లను సైతం ఆహ్వానించింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కే విషయంలో జాప్యం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు సీఈఎస్ఎల్ సంస్థ దాదాపు 130 డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయడంతో మరోసారి ఆశలు చిగురించాయి. చదవండి: డబుల్ డెక్కర్ బస్సులు కొనాలంటే కష్టం.. అద్దెకే ఇష్టం! -
వాటిని కొనాలంటే కష్టం.. అద్దెకే ఇష్టం!
సాక్షి, హైదరాబాద్:భాగ్యనగర మనసు దోచిన డబుల్ డెక్కర్ బస్సుపై ఆర్టీసీ దోబూచులాడుతోంది. ఈ బస్సులను ఎలా తీసుకురావాలో అంతుచిక్కక తటపటాయిస్తోంది. ఒక్కో బస్సు ఖరీదు ఏకంగా రూ.70 లక్షలుగా కంపెనీ నిర్ధారించటంతో అంత ధర పెట్టి కొనడం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అలవాటైన అద్దె విధానాన్ని దీనికీ వర్తింపచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సొంతంగా బస్సులను కొనడం కంటే అద్దెప్రాతిపదికన తీసుకోవడం మేలని భావిస్తూ భారీగా అద్దె బస్సులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు వేల అద్దె బస్సులు వినియోగిస్తున్న ఆర్టీసీ ఇటీవలే మరో 70 బస్సులకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇదే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సులనూ అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తోంది. అశోక్ లేలాండ్ ద్వారానే.. నగరంలో 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. ఈ బస్సులతో నష్టాలు భారీగా వస్తుండటంతో ఆ తర్వాత వాటిని ఉపసంహరించు కుంది. కానీ ఇటీవల ఓ నగరవాసి ఆ బస్సులను గుర్తు చేస్తూ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ స్పందించి.. మళ్లీ ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపితే బాగుంటుందని రీట్వీట్ చేస్తూ దాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ట్యాగ్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన పువ్వాడ.. కొత్త బస్సుల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ప్రయోగా త్మకంగా 20 బస్సులు తీసుకోవాలని నిర్ణయించిన ఆర్టీసీ అప్పట్లో టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కంపెనీని ఎల్–1గా ఎంపిక చేసింది. అది ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు కోట్ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవటం, మామూలు బస్సుల అవసరం బాగా ఉన్నందున డబుల్ డెక్కర్ బస్సులు కొనేబదులు సాధారణ బస్సులకు ఆ నిధులు వినియోగించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో అద్దెప్రాతిపదికన డబుల్ డెక్కర్ బస్సులు తీసుకోవాలని భావిస్తూ, ఆ బాధ్యతను అశోక్ లేలాండ్ కంపెనీకి అప్పగించాలని చూస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలను అద్దె పద్ధతిలో డబుల్ డెక్కర్ బస్సులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరనున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. మధ్యేమార్గంగా.. ప్రస్తుత పరిస్థితిలో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ సరికాదన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇటీవలే టీఎస్ఆర్టీసీతో పాటు ముంబైలో కూడా డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు పిలిచారు. వంద బస్సులు తీసుకోవాలనుకోగా, అశోక్ లేలాండ్ టెండరే ఖరారైంది. కానీ అక్కడ కూడా బస్సులు తీసుకునేందుకు తటపటాయిస్తూ తాజాగా టెండర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. ముంబైలోనే వద్దనుకున్నాక, తీవ్ర నష్టాల్లో ఉన్న తాము వీటిని ఎలా నిర్వహించగలమన్న యోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. మధ్యేమార్గంగా అద్దె విధానాన్ని తెరపైకి తెస్తోంది. -
అన్నీ కుదిరితే.. త్వరలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్లు!
సాక్షి, హైదరాబాద్: అదిగో డబుల్ డెక్కర్.. ఇదిగో డబుల్ డెక్కర్ అంటూ ఊరించిన ఆర్టీసీ చివరకు వాటి ధరతో హడలిపోతోంది. అవసరమైన నిధులపై మల్లగుల్లాలు పడుతోంది. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం నగరంలో కొత్తగా 25 డబుల్ డెక్కర్లను ప్రవేశపెట్టాలంటే ఇప్పటికిప్పుడు రూ.17 కోట్లు కావాలి. అన్ని డబ్బులు లేకపోవడంతో కొత్త డబుల్ డెక్కర్ బస్సులకు ఆర్డర్ ఇవ్వలేకపోతోంది. అయితే హైదరాబాద్ సిటీ షాన్‌ను తిరిగి తెప్పించేందుకే ఈ బస్సులు కొనాలనుకున్నందున.. ఆ ఖర్చును పురపాలక పట్టణాభివృద్ధి శాఖ భరిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదే విషయాన్ని ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా కేటీఆర్‌దే కావటంతో సానుకూల నిర్ణయం వెలువడవచ్చనే ఆశాభావంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఒక్కో బస్సు రూ.68 లక్షలు.. మొదట్లో 40 బస్సులు ప్రారంభించాలని భావించినా వాటికయ్యే వ్యయం దృష్ట్యా 25 బస్సులకు పరిమితమయ్యారు. ఈ మేరకు టెండర్లు పిలవగా, ఐషర్, అశోక్ లేలాండ్, వీరవాహన, ఎంజీ కంపెనీలు స్పందించాయి. చివరకు అశోక్ లేలాండ్ టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు చొప్పున ధర కోట్ చేసింది. అయితే టీఎస్ఆర్టీసీ చర్చల నేపథ్యంలో చివరకు రూ.68 లక్షలకు ఖరారు చేసింది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అంత ధర పెట్టి 25 బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద డబ్బులు లేకపోవటంతో కొనుగోలు దిశగా ముందుకు వెళ్లలేకపోతోంది. ఆ అప్పులోంచి డబ్బులిచ్చినా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ఆర్టీసీ ఓ బ్యాంకు నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకుంది. వివిధ రూపాల్లో చెల్లించాల్సినవి రూ.2 వేల కోట్లు, దగ్గరున్నవి రూ.500 కోట్లే కావటంతో సీఎంతో చర్చించిన ఎలా ఖర్చు చేయాలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లకు పూచీకత్తు ఇవ్వగా, ఆ బ్యాంకు రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో మిగతా రూ.500 కోట్లను మరోచోట నుంచి తెచ్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అదే అప్పు నుంచి డబుల్ డెక్కర్ బస్సులకు నిధులు కోరే ఆలోచనలో ఉంది. ఆశించిన విధంగా మంత్రి కేటీఆర్ స్పందించినా, రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు అప్పు నుంచి వాడుకునేందుకు అనుమతించినా.. కొత్త డబుల్ డెక్కర్ బస్సుల్ని మరోసారి భాగ్యనగరంలో పరుగులు తీయించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఒక ట్వీటు .. వెంటనే స్పందన డబుల్ డెక్కర్లు ఒకప్పుడు హైదరాబాద్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇతర ప్రాంతాల నుంచి నగర పర్యటనకు వచ్చినవారు ఈ బస్సులో ఒకసారైనా పైన కూర్చొని ప్రయాణించకుండా వెళ్లేవారు కాదు. సికింద్రాబాద్–మెహిదీపట్నం వంటి కొన్ని పరిమిత రూట్లలో ఈ బస్సులు నడిచేవి. వీటిల్లో సికింద్రాబాద్–అఫ్జల్‌గంజ్–జూ పార్క్ రూటు బాగా ప్రజాదరణ పొందింది. గత ఏడాది నవంబర్ 7న నగరవాసి ఒకరు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్–జూపార్క్ 7 జడ్ నంబర్ పాత డబుల్ డెక్కర్ ఫొటోను పంచుకుంటూ.. నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వస్తే బాగుంటుందని ట్వీట్ చేశాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అప్పట్లో హైదరాబాద్‌కు అలంకారంగా ఉన్న ఆ బస్సులను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియదని పేర్కొన్నారు. అవకాశం ఉంటే మళ్లీ నడిపే అంశాన్ని పరిశీలించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచిస్తూ ట్వీట్ చేశారు. దీనికి పువ్వాడ వెంటనే ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడటంతో డబుల్ డెక్కర్ల కొనుగోలు తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత రూట్లు ఇవే.. నం.219: సికింద్రాబాద్–పటాన్చెరు వయా బాలానగర్ 229: సికింద్రాబాద్–మేడ్చల్ వయా సుచిత్ర 218: కోఠి–పటాన్చెరు 9 ఎక్స్: సెంట్రల్ బస్‌స్టేషన్–జీడిమెట్ల 118: అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం -
రెండు నెలల్లో డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా డబుల్ డెక్కర్ అనగానే వెనకవైపు వెడల్పాటి ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ఇక కింది డెక్‌లో ఒక కండక్టర్, అప్పర్ డెక్‌లో మరో కండక్టర్ ఉంటారు. కానీ మరో రెండు నెలల్లో హైదరాబాద్‌లో కొత్తగా పరుగుపెట్టబోతున్న డబుల్ డెక్కర్ బస్సుకు రెండు డోర్లు ఉండనున్నాయి. అలాగే రెండు డెక్లకూ కలిపి ఒకే కండక్టర్ ఉంటారు. ప్రస్తుతం భారత్ స్టేజ్–6 వాహనాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. దీంతో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి రూపొందించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా కొనబోయే బస్సులు ఆ ప్రమాణాలతో తయారయ్యే తొలి డబుల్ డెక్కర్లు కానున్నాయి. తక్కువ కాలుష్యం అవసరమైన డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు ఈనెల 18న తయారీ సంస్థలతో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అందులో కొత్త బస్సులు ఎలా ఉండాలనే విషయంలో వారికి సూచనలు చేయనున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులతో తిరిగే బస్సు కావటంతో దీనికి శక్తివంతమైన ఇంజిన్ ఉంటుంది. ఎక్కువ శక్తిని వాడాల్సి ఉండటంతో పాత బస్సుల్లో పొగ కూడా ఎక్కువగా విడుదలయ్యేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల్లో తక్కువ కాలుష్యం విడుదల చేసే యంత్రాలు ఉండనున్నాయి. భారత్ స్టేజ్–6 ప్రమాణాల ప్రకారం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా ఇంజిన్‌ను రూపొందిస్తున్నారు. రంగు కూడా ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం సిటీ బస్సుల్లో రెండు ప్రవేశ మార్గాలు ఉండగా.. మహిళలు ముందు నుంచి, పురుషులు వెనక నుంచి ఎక్కే పద్ధతి అమలులో ఉంది. గతంలో నగరంలో ఉన్న డబుల్ డెక్కర్లకు ఒకే ప్రవేశ ద్వారం కారణంగా ఈ నిబంధన ఉండేది కాదు. అందరూ వెనకవైపు వెడల్పుగా ఉండే ప్రవేశ మార్గం నుంచే ఎక్కేవారు. కొత్తగా వచ్చే బస్సుల్లో మాత్రం ముందు డ్రైవర్ క్యాబిన్‌ను ఆనుకుని మరో ప్రవేశ ద్వారం ఉండనుంది. వెనుక కూడా డోర్! గతంలో వెనకవైపు ఉండే ప్రవేశద్వారానికి తలుపు ఉండేది కాదు. దాని వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. అందువల్ల ఈసారి డోర్ పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వెనకవైపున పెద్ద ప్రవేశ మార్గం వల్ల గతంలో సీట్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు వాటి సంఖ్య పెంచేలా డిజైన్ రూపొందించాల్సిందిగా తయారీ సంస్థను కోరే యోచనలో అధికారులున్నారు. డబుల్ డెక్కర్‌కు రెండు తలుపులున్నా అప్పర్ డెక్కు వెళ్లే మార్గం (మెట్లు) ఒకటే ఉంటుంది. అప్పర్ డెక్కు వెళ్లే చోటనే కండక్టర్ టికెట్ జారీ చేస్తారు. గతంలో నష్టాలు భరించలేకే.. మెహదీపట్నం – సికింద్రాబాద్ స్టేషన్, సికింద్రాబాద్–జూపార్కు, సికింద్రాబాద్–సనత్‌నగర్, మెహిదీపట్నం–చార్మినార్ మార్గాల్లో 16 ఏళ్ల క్రితం వరకు డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టాయి. ఆ బస్సు అప్పర్ డెక్‌లో కూర్చుని ట్యాంక్‌బండ్ మీదుగా ప్రయాణిస్తుంటే ఆ సరదానే వేరుగా ఉండేది. కానీ సాధారణ బస్సులతో పోల్చుకుంటే ఈ బస్సుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో డిమాండ్ ఉన్నప్పటికీ నష్టాలు భరించలేక ఆర్టీసీ వాటిని వదిలించుకుంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఈ బస్సులు తీసుకుంటోంది. ఎంత కొత్తతరం నమూనా బస్సు అయినా, నిర్వహణ వ్యయం మాత్రం తడిసి మోపెడవుతుందని అధికారులు భయపడుతున్నారు. తొలుత 40 బస్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనే ఆదేశాలు వచ్చినా.. ఖర్చుకు భయపడి 25 మాత్రమే కొంటున్నారు. ఒకవేళ నష్టాలు వస్తే వాటికి తగ్గట్టుగా ప్రభుత్వం రాయితీలు ఇస్తే అవసరమైనన్ని కొనాలని అధికారులు భావిస్తున్నారు. నష్టాల మాటెలా ఉన్నా.. కోటి జనాభాతోపాటు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న భాగ్యనగరానికి డబుల్ డెక్కర్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందనడంలో మాత్రం సందేహం లేదు. -
హైదరాబాద్ మహానగరంలో 25 డబుల్ డెక్కర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో నగరానికి ప్రత్యేకాకర్షణగా ఉండి నష్టాల కారణంగా కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో నగరవాసులకు కనువిందు చేయబోతున్నాయి. మరో రెండు నెలల్లో బస్సులు సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయంలో ఆ సమావేశంలో తయారీదారులకు స్పష్టం చేయనుంది. రెండు నెలల క్రితం నగరవాసి ఒకరు డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేసుకుంటూ నాటి బస్సు ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన కేటీఆర్, తనకు డబుల్ డెక్కర్ బస్సులతో ఉన్న అనుభూతులను నెమరేసుకుంటూ ‘అప్పట్లో డబుల్ డెక్కర్లను ఎందుకు ఉపసంహరించుకున్నారో నాకు తెలియదు, వాటిని మళ్లీ నడిపే అవకాశం ఉందా’ అని ప్రశ్నిస్తూ దాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన ఆయన, వెంటనే ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడి, ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు. రూట్ నెం.229 (సికింద్రాబాద్ – మేడ్చల్ వయా సుచిత్ర), రూట్ నెం.219 (సికింద్రాబాద్–పటాన్చెరు వయా బాలానగర్ క్రాస్ రోడ్డు), రూట్ నెం. 218 (కోఠి–పటాన్చెరు వయా అమీర్‌పేట), రూట్ నెం.9ఎక్స్ (సీబీఎస్–జీడిమెట్ల వయా అమీర్‌పేట), రూట్ నెం.118 (అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం)లను ఎంపిక చేశారు. దుర్గం చెరువుపై కొత్తగా కేబుల్ బ్రిడ్జి మీదుగా ఓ బస్సు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. -
త్వరలో సిటీలో డబుల్ డెక్కర్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్ : త్వరలో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగుపెట్టే అవకాశం ఉంది. గత నెల ఓ వ్యక్తి ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ సూచనతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు డబుల్ డెక్కర్ బస్సులను నడిపించగలిగే 5 మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ మార్గాల్లో తొలుత పది డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దూరప్రాంతాలకు నడిపేలా.. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలను నిర్మించడంతో డబుల్ డెక్కర్ బస్సులు ఆయా మార్గాల్లో తిరగటం సాధ్యం కాదు. ఇవి అడ్డురాని మార్గాల్లో మాత్రమే తిప్పాల్సి ఉంటుంది. ఇందుకు వాటితో ఇబ్బంది లేని మార్గాలను గుర్తించారు. నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహిదీపట్నం–సికింద్రాబాద్, మెహిదీపట్నం–చార్మినార్, సికింద్రాబాద్–చార్మినార్, సికింద్రాబాద్–జూపార్కు మార్గాల్లో నడిపారు. మళ్లీ పటాన్‌చెరుకు సర్వీసులు.. నగరం నుంచి పటాన్చెరు వరకు మళ్లీ నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్‌చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆయా మార్గాల్లో వీటిని తిప్పితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మేడ్చల్ రూట్లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్‌శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే కొత్త బస్సుల తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు నడిచిన డిజైన్లోనే కొత్త బస్సులు కూడా రూపొందించాలని నిర్ణయించారు. -
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు..?
సాక్షి, హైదరాబాద్ : నిజాం కాలంలో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి. తాజాగా షాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ వరకు బస్సులు తిరిగేవని, ఇప్పుడు మళ్లీ అలాంటి డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. తాను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని, వాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అయితే ఆ బస్సులను ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని, మళ్లీ హైదారాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని రవాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ అడిగారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్ సూచించారు. I have many fond memories of riding the double decker bus on my way to St. George’s Grammar School at Abids 😊 Not sure why they were taken off the roads. Any chance we can bring them back Transport Minister @puvvada_ajay Garu? https://t.co/ceEGclQLFz — KTR (@KTRTRS) November 7, 2020 విజయవంతంగా ఎలక్ర్టిక్ బస్ ట్రయల్స్ తిరుమలలో రెండవరోజు నిర్వహించిన ఎలక్ర్టిక్ బస్ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. తిరుమల పవిత్రత, కాలుష్య నివారణలో భాగంగా తిరుపతి నుంచి తిరుమల వరకు ఈ బస్సులను నడపాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ అధికారులు ఎలక్ర్టిక్ బస్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. మూడవ రోజు కూడా ట్రయల్స్ నిర్వహించి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలక్ట్రికల్ బస్ ట్రయల్స్‌లో డ్రైవర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నట్టు ఏపియస్ ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. -
భవిష్యత్‌లో ఫ్లై ఓవర్లు ఇవే!
సాక్షి, హైదరాబాద్ : మహానగరం రూపురేకలు సమూలంగా మార్చేందుకు.. తక్కువ స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇకపై ఏ ప్రభుత్వ విభాగం ఫ్లై ఓవర్ నిర్మించాల్సి వచ్చినా.. మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాల్సి వచ్చినా.. ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) వరకు డబుల్ డెక్కర్‌గా ఒకే పిల్లర్‌పై రెండు వరుసలకు వీలుగా నిర్మాణం చేపట్టాలంటున్నాయి జీహెచ్ఎంసీ వర్గాలు. తద్వారా భూసేకరణ, నిర్మాణ వ్యయంతో సహా ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతాయని ఈ ఆలోచన చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ అధికారుల బృందం ఇటీవల నాగ్‌పూర్, పుణే తదితర నగరాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించి రావడం తెలిసిందే. నాగ్‌పూర్‌లో ఒకే పిల్లర్‌పై రెండు వరుసలతో వంతెనను నిర్మించారు. కింది వరుసలో వాహనాలు, పైవరుసలో మెట్రోరైలు ప్రాణానికి అనువుగా మార్చారు. అక్కడి నిర్మాణాన్ని చూసి నగరంలోనూ అలాంటి విధానాన్నే అమలు చేయాలని భావించారు. గ్రేటర్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు నేషనల్ హైవే, తదితర విభాగాలు ఆయా మార్గాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించనున్నాయి.మెట్రో రైలు రెండో దశలో భాగంగా వివిధ మార్గాల్లో పనులు చేపట్టనున్నారు. దీంతో అన్ని విభాగాలు ఫ్లైఓవర్లు నిర్మించేటప్పుడు ఒకే పిల్లర్‌పై రెండు వరుసల్లో ప్రయాణాలు సాగేలా నిర్మిస్తే భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. మెట్రో రైలు మార్గాల్లో పైవరుసను మెట్రో కకోసం వినియోగిస్తారు. మెట్రో లేని మార్గాల్లో తొలుత ఒక వరుసలో నిర్మించాక, మరో వరుసలో కూడా నిర్మించేందుకు వీలుగా తగిన ఆధునిక సాంకేతికతతో పిల్లర్లను నిర్మిస్తారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సదరు మార్గంలో రెండో వరుసలో కూడా వాహనాల కోసం మరో ఫ్లై ఓవర్ నిర్మించవచ్చునని మేయర్ పేర్కొన్నారు. ఒకవేళ మెట్రోరైలు మార్గమే తొలుత నిర్మిస్తే, దిగువ వరుసలోని మార్గాన్ని వాహనాల కోసం వదిలి పైవరుసలో మెట్రో కోసం నిర్మాణం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సైతం ఈ విధానం బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని, త్వరలో జీఓ వెలువడే అవకాశం ఉందని రామ్మోహన్ తెలిపారు. బెస్ట్ సిటీ కోసం.. నగరాన్ని వివిధ అంశాల్లో బెస్ట్ సిటీగా నిలిపేందుకు ఆయా నగరాల్లో అమల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిశీలిస్తున్నామని మేయర్ తెలిపారు. ఢిల్లీలో చెత్త సేకరణ, నిర్వహణ మాదిరిగా హైదరాబాద్‌లోనూ చెత్త తరలింపు కోసం వినియోగించే వాహనాలు చెత్త బయటకు కనపడకుండా పూర్తిగా ఉండేవాటిని తీసుకోనున్నట్లు తెలిపారు. -
నాగ్‌పూర్ ‘దారి’లో..
సాక్షి, హైదరాబాద్: ఒకే పిల్లర్‌పై ఒక వరుసలో ఫ్లైఓవర్, మరో వరుసలో మెట్రోరైలు, దిగువన రహదారిపై వాహనాలు.. ఇలాంటి దృశ్యం భవిష్యత్తులో నగరంలోనూ ఆవిష్కృతం కానుంది. మలిదశలో మెట్రోరైలు మార్గాలొచ్చే ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం నాగ్‌పూర్‌లోని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల పనులను మంగళవారం పరిశీలించింది. సిటీలో ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మెట్రోరైలు మార్గం వల్ల ఫ్లైఓవర్ల నిర్మాణం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో అవకాశామున్న ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ మార్గాలు నిర్మిస్తే ఒకే పిల్లర్‌పై రెండు వరుసల్లో మార్గాలు ఏర్పడనున్నాయి. ఒక వరుసలో మెట్రోరైలు, మరో వరుసలో ఇతర వాహనాలు ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. ఈ విధానంతో భూసేకరణ, నిర్మాణ వ్యయం తగ్గుతుంది. సమయం కూడా కలిసొస్తుంది. ట్రాఫిక్ సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. ఇలా విస్తృత ప్రయోజనాలు ఉండడంతో నాగ్‌పూర్‌లోని డబుల్ డెక్కర్ మార్గాల పనులను సిటీ బృందం పరిశీలించింది. వివిధ నగరాల్లోని ఉత్తమ విధానాలను, మనకు పనికొచ్చే పద్ధతులను పరిశీలించాలన్న మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు అధికారులు తాజాగా నాగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ బృందంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు శ్రీధర్, జియావుద్దీన్, ఎస్ఈలు వెంకటరమణ, దత్తుపంత్, కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ తదితరులున్నారు. నాగ్‌పూర్ మెట్రోస్టేషన్లో మేయర్ రామ్మోహన్, అర్వింద్‌కుమార్ తదితరులు నాగ్‌పూర్‌లో ఇలా... నాగ్‌పూర్‌లో రూ.8,680 కోట్ల వ్యయంతో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్, అధికారుల బృందం ప్రాజెక్ట్ అమలుపై అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమైంది. దాదాపు 38.215 కిలోమీటర్ల పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వినూత్నంగా ఉండడాన్ని గుర్తించారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు భూ, ఆస్తుల సేకరణ తక్కువగా ఉండడంతో పాటు ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 40శాతం తగ్గినట్లు నాగ్‌పూర్ మెట్రో అధికారులు వివరించారు. మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, ప్రత్యేకతలపై జీహెచ్ఎంసీ అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా షటిల్ బస్ సర్వీసులు, బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలు, ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ట్రాక్‌లు తదితర సౌకర్యాలు కూడా ఉన్నాయి. నాగ్‌పూర్ మాదిరిగా పీపీపీ విధానంలో ఎస్టీపీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలో నానల్‌నగర్–మాసబ్‌ట్యాంక్, బీహెచ్ఈఎల్–ఆల్విన్ మార్గాల్లో డబుల్ డెక్కర్లకు అవకాశం ఉంటుందని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో వర్షపునీరు రోడ్లపై నిల్వకుండా చేసిన ఏర్పాట్లు, వర్టికల్ గార్డెన్లు, అండర్‌పాస్‌లు తదితరమైనవి కూడా బృందం పరిశీలించింది. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా మేయర్ నాగ్‌పూర్ మెట్రో అధికారులను ఆహ్వానించారు. అధికారుల బృందం బుధవారం పుణెను సందర్శించనుంది. -
మెట్రో కంటే డబుల్-డెక్కర్ ఎయిర్ బస్సులే చవక
ఫైజాబాద్/లక్నో : వారణాసి- బంగ్లాదేశ్‌ల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సరయూ నది గుండా జలమార్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రవాణా, జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ఆయన రూ. 7,195 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా నుంచి ఎయిర్‌బోట్లను తెప్పిస్తున్నాను. మళ్లీ ఇక్కడికి నేను వచ్చేనాటికి తప్పకుండా ఎయిర్‌బోట్‌లోనే ప్రయాణిస్తాను. వారణాసి- అలహాబాద్ మధ్య ప్రయాణం సులభతరం చేస్తాం. ఎగిరే డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నా’ అని పేర్కొన్నారు. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్‌తో సంభాషిస్తూ.. మెట్రో కంటే కూడా డబుల్ డెక్కర్ ఎయిర్‌బస్సులే చవకగా వస్తాయని గడ్కరీ వ్యాఖ్యానించారు. వచ్చే మార్చినాటికి గంగానది నీరు తాగొచ్చు గంగానది ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే 30 శాతం నదిని శుభ్రం చేశామని.. వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయిలో నదీ ప్రక్షాళన జరుగుతుందన్నారు. ఇక అప్పుడు గంగానది నీరు సేవించవచ్చని పేర్కొన్నారు. -
డబుల్ డెక్కర్ విమానం వచ్చేస్తోంది!
ముంబై : ఇన్ని రోజులు డబుల్ డెక్కర్ బస్సు.. డబుల్ డెక్కర్ రైలు మాత్రమే చూసుంటాం. ఇక నుంచి డబుల్ డెక్కర్ విమానం కూడా అందుబాటులోకి వస్తోంది. పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా డబుల్ డెక్కర్ విమానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ డబుల్ డెక్కర్ విమానం రెండు కీలకమైన మార్గాల్లో ప్రయాణించనుంది. అవి ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు. ఈ రెండు ప్రాంతాలకు 423 సీట్ల సామర్థ్యం కలిగిన డబుల్ డెక్కర్ బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 16 నుంచి డబుల్ డెక్కర్ విమానం ‘జంబో’ తన సేవలను అందించనుంది. ఇందులో 12 సీట్లు ఫస్ట్ క్లాస్‌వి, 26 బిజినెస్ క్లాస్‌వి, 385 ఎకానమీ క్లాస్‌వి ఉండనున్నాయి. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 మధ్యలో న్యూఢిల్లీ నుంచి కోల్‌కతా, ముంబైలకు రోజుకు ఒక విమానం చొప్పున ‘జంబో’ విమానాన్ని నడుపనున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. మొదటి దశలో భాగంగా కోల్‌కతాకు ఈ డబుల్ డెక్కర్ విమానాన్ని నడపనుండగా, రెండో దశ(నవంబరు)లో ముంబైకి ఈ విమానం సేవలు అందించనున్నారు. సాధారణంగా నాలుగు ఇంజిన్ విమానాలను అంతర్జాతీయ మార్గాలలో, అదేవిధంగా వీవీఐపీల కోసం వినియోగిస్తుంటారు. న్యూఢిల్లీ-ముంబై-న్యూఢిల్లీ సెక్టార్లో నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు రోజుకు రెండు జంబో ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరులో దసరా, నవంబరులో దీపావళి పండగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎయిరిండియా. కాకతాళీయంగా ఈ ఏడాదే బోయింగ్ 747 ఆపరేషన్స్ ప్రారంభించి 50 ఏళ్లను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌కు మరింత ఖ్యాతి అందించేందుకు డబుల్ డెక్కర్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది ఎయిరిండియా. -
ఘోర ప్రమాదం..పెరూలో లోయలో పడ్డ బస్సు
లిమా : పెరూలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్ డక్కర్ బస్సు ఒకటి లోయలో పడిన ఘటనలో 44 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ఇది చోటు చేసుకుంది. సుమారు 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు అర్ధరాత్రి ప్యాన్ అమెరికా హైవే సమీపంలో ప్రమాదానికి గురైంది. సుమారు 260 ఫీట్ల లోయలోకి పడిపోవటంతో బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. తొలుత 35 మంది చనిపోయారని ప్రకటించిన అధికారులు.. తర్వాత 44 మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. అయితే మార్గమధ్యంలో చాలా మంది బస్సు ఎక్కినట్లు క్షతగాత్రులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రమాదం దాటికి చాలా వరకు మృతదేహాలు పక్కనే ఉన్న నదిలోకి ఎగిరిపడ్డాయి. వీటిని తీసేందుకు రక్షక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ప్రమాదకరమైన మలుపు.. పైగా చీకట్లో డ్రైవర్ మార్గాన్ని సరిగ్గా అంచనా వేయకపోవటం’తోనే ఈ ఘోరం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక విచారణకు వచ్చారు. సాయంత్రం కల్లా మృతుల సంఖ్యపై ఓ నిర్దారణకు వస్తామని చెబుతున్నారు. -
రూట్ మార్చిన బస్సు పరిశ్రమ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అదీ ఇదీ అని కాదు... దాదాపుగా బస్సులు తయారు చేసే కంపెనీలన్నీ ఇపుడు రూటు మార్చుకుంటున్నాయి. మెరుగైన ఆదాయాలు, భవిష్యత్తు దృష్ట్యా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎలక్ట్రిక్, డబుల్ డెక్కర్ బస్సుల తయారీపై దృష్టి సారించాయి. ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం తెస్తున్న కొత్త ప్రమాణాలు, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం, ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో మున్ముందు మన రోడ్లపై ఆధునిక బస్‌ల హవా ఉంటుందనేది పరిశ్రమ అంచనా. దేశంలో ఏటా 70–80 వేల బస్సులు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 90 వేలు దాటుతుందని అంచనా. ఒకదాని వెంట ఒకటి.. వోల్వో, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, జేబీఎం, స్కానియా, బీవైడీ, గోల్డ్‌స్టోన్, కేపీఐటీ వంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చాయి. వోల్వో ఐషర్, వీర వాహన్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ బస్సులను పరీక్షిస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్, డెక్కన్ ఆటో నుంచి 2020 నాటికి ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. మహీంద్రా సైతం వీటి తయారీపై దృష్టి సారించగా... ప్రతి కంపెనీ కొత్త టెక్నాలజీపై పని చేస్తున్నట్లు సమాచారం. ‘‘దాదాపుగా బస్సుల తయారీలో ఉన్న కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ విభాగంపై ఫోకస్ చేశాయి. మేం కూడా ఈ విభాగంలో అడుగు పెడుతున్నాం’’ అని కరోన డైరెక్టర్ ఎం.బాలాజీ రావు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఉత్సాహం నింపిన టెండర్లు.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) 150 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించడం పరిశ్రమలో ఉత్సాహం నింపింది. ప్రీ–బిడ్ సమావేశానికి దేశ, విదేశాలకు చెందిన 12 తయారీ కంపెనీలతో పాటు పదుల సంఖ్యలో ఆపరేటర్లు హాజరయ్యారు. అద్దెకు ఈ బస్సులను తీసుకోవాలనేది బీఎంటీసీ యోచన. ఎంపికైన కంపెనీలకు ఇది కిలోమీటరుకు నిర్దేశిత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుంది. అలాగే కేంద్రం 10 స్మార్ట్ సిటీల్లో వెయ్యి బస్సుల్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. 2018 మార్చి 31లోగా టెండర్లు పూర్తి చేయనుంది. ఒక్కో బస్‌కు కేంద్రం రూ.65–85 లక్షలను భరిస్తుంది. ఇదీ బస్సు పరిశ్రమ... దేశవ్యాప్తంగా ఏటా రోడ్డెక్కుతున్న బస్సుల్లో ప్రైవేటు ఆపరేటర్లు 65 శాతం, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు 35 శాతం మేర కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో రూ.75 లక్షలు, ఆపైన ఖరీదు చేసే ప్రీమియం బస్సులు 1,000 వరకూ ఉంటాయి. కస్టమర్ల డిమాండ్ నేపథ్యంలో 2018–19లో ప్రీమియం బస్సుల విక్రయాలు 3,000 యూనిట్ల దాకా ఉండొచ్చని పరిశ్రమ భావిస్తోంది. మొత్తం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 55–60 శాతం ఉంది. ఇందులో అత్యధిక బస్సులు తెలుగు రాష్ట్రాల్లో పరుగెడుతున్నవే. నగరాల మధ్య డబుల్ డెక్కర్లు.. ఇప్పటి వరకూ సిటీకే పరిమితమైన డబుల్ డెక్కర్ బస్సులు ఇక నగరాల మధ్య పరిగెత్తనున్నాయి. మెర్సిడెస్ బెంజ్, వీర, వోల్వో, స్కానియా బ్రాండ్ల డబుల్ డెక్కర్లు 2019 కల్లా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇతర కంపెనీలూ వీటి సరసన చేరనున్నాయి. ఇటీవలే ప్రభుత్వం డబుల్ డెక్కర్ బస్సుల నాణ్యత ప్రమాణాల కోసం ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్–138ను తీసుకొచ్చింది. 80 మంది ప్రయాణించేలా సీట్ల సామర్థ్యం ఉంటుందని వీర బ్రాండ్ బస్సులను తయారు చేస్తున్న వీర వాహన ఉద్యోగ్ ఎండీ కె.శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బస్సు ధర రూ.1.8 కోట్ల వరకు ఉంటుందని, కాకపోతే ఆపరేటర్లకు వ్యయం కలిసి వస్తుందని చెప్పారు. ఇవి వస్తే పరిశ్రమకు కొత్త ఊపు వస్తుందన్నా్నరు. -
విశాఖ-తిరుపతి డబుల్ డెక్కెర్ రైలు ఇక్కట్లు
-
డబుల్ డెక్కర్ రైలుకు గూడెంలో హాల్ట్
తాడేపల్లిగూడెం : తిరుపతి–విశాఖపట్టణం మధ్య త్వరలో ప్రారంభమయ్యే డబుల్ డెక్కర్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కల్పించారు. ఈనెల 30న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు విజయవాడలో రైలును ప్రారంభించనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. స్థానిక వాసవీ ఆడిటోరియంలో ఆదివారం బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, గమిని సుబ్బారావు తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాణిక్యాలరావు చొరవతో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించినట్టు వారు తెలిపారు. రైలు సమయాలను అధికారికంగా త్వరగా ప్రకటిస్తారన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు చలంచర్ల మురళి, వబిలిశెట్టి నటరాజ్, మంత్రి కార్యాలయ పీఆర్వో చిట్యాల రాంబాబు పాల్గొన్నారు. -
'డబుల్ డెక్కర్'కు బ్రేక్
- రైలును నిలిపేసిన దక్షిణ మధ్య రైల్వే - రెండున్నరేళ్లు కాచిగూడ- తిరుపతి మధ్య కొనసాగిన సూపర్ ఫాస్టు సర్వీస్ - అసౌకర్యాల కారణంగా ప్రయాణికుల ఆదరణకు దూరం - కొంత కాలంగా ఖాళీగా నడిచిన ట్రైన్ - రద్దు చేసి కోస్తావైపు నడుపుతున్న వైనం కర్నూలు(రాజ్‌విహార్): రెండున్నరేళ్లుగా కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా తిరుపతికి చక్కర్లు కొట్టిన సూపర్ ఫాస్ట్ సర్వీసు డబుల్ డెక్కర్ రైలుకు బ్రేక్ పడింది. ఈ రైలును నిలిపివేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కల్గిన ఈ రైలులో బోగీలన్నీ ఏసీవే. అందమైన రంగులు, చూడగానే ఆకర్షించే అందం, స్పాంజీ కుషన్ సీట్లు, చక్కటి రూపం, కుదుపు, అలుపు లేని ప్రయాణ సౌలభ్యం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ పొందలేకపోయింది. కొన్ని అసౌకర్యాలు, అధిక చార్జీ కారణంగా కనీసం 20 మంది ప్రయాణికులు కూడా లేకుండా కొంత కాలంగా ఖాళీగా నడిచింది. దీంతో ఈరైలును నిలిపివేసి కోస్తా వైపు నడుతున్నారు. - కర్నూలు చరిత్రలో తొలి ఏసీ రైలు.. కర్నూలు రైల్వే స్టేషన్ చరిత్రలో తొలి ఏసీ (పూర్తిగా) డబుల్ డెక్కర్ రైలు ఇదే. శతాబ్ధి, శాతవాహన, దురంతో లాంటి సూపర్ ఫాస్టు ఏసీ రైళ్లు మనకు లేవు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలున్నా కర్నూలులో హాల్టింగ్ (స్టాపింగ్) లేదు. కాచిగూడ స్టేషన్ (హైదరాబాదు) నుంచి తిరుపతి మధ్య నడిచిన ఈతొలి డబుల్ డెక్కర్ సూపర్ ఫాస్టు రైలు 2014 మే 14న ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ఐదు మార్గాల్లో మాత్రమే డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తుండగా ఈ రెండు రైళ్ల రాకతో సంఖ్య 7కు చేరింది. ఇది కాచిగూడ- గుంటూరు, కాచిగూడ - తిరుపతి మధ్య వారానికి రెండు రోజుల చొప్పున నడిచింది. కాచిగూడ నుంచి (నంబర్ 22120) ప్రతి బుధ, శనివారాల్లో బయలుదేరి 11:00గంటలకు కర్నూలు వచ్చి 11:02కు బయలుదేరి వెళ్లేది. తిరుపతి నుంచి (నంబర్ 22119) గురు , ఆదివారాల్లో బయలుదేరి కర్నూలుకు మధ్యాహ్నం 13:02 గంటలకు వచ్చి 13:04 గంటలకు వెళ్లేది. ఇవీ ప్రత్యేకతలు.. ఈ డబుల్ డెక్కర్ రైలంతా ఏసీతో కూడుకుంది. 10 బోగీల్లో 1200 సీట్లున్నాయి. ఒక్కోక్క బోగీలో పై అంతస్తులో 50, కింది అంతస్తులో 70 సీట్లు, ఏసీ చైర్ కారు ధరల చార్జీ, రెండు ప్రత్యేక బోగీల్లో ఏసీ పవర్ సిస్టమ్, గరిష్టంగా గంటకు 160 కిలో మీటర్ల వేగం కలిగి ఉన్నా జిల్లాలో ఉన్న పట్టాల వేగ సామర్థ్యం మేరకు గరిష్టంగా గంటలకు 100కిలో మీటర్ల వేగంతో నడిచేది. సాంకేతికతతో తయారు చేయడంతో ఇందులో పొగ వాసన రాగానే అలారం ఇందులో మోగుతుంది. అసౌకర్యాలు.. - సీట్లన్నింటికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో జనరల్ కంపార్ట్మెంట్ టికెట్లుండవు. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న టికెట్ ఉంటేనే అనుమతి లభిస్తుంది. అప్పటికప్పుడు స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికుడు మరి కొద్దిసేపట్లో డబుల్ డెక్కర్ వస్తుంది.. డబ్బు ఎక్కువైనా అందులో వెళ్దామని ఆశించినా బుకింగ్ కౌంటర్లో టికెట్లు ఇవ్వరు. - ఇందులో అమలవుతున్న చార్జీలు చూస్తే చుక్కలు కనపడతాయి. కర్నూలు నుంచి తిరుపతికి 350 కిలో మీటర్ల ప్రయాణానికి పెద్దలకు రూ.505, పిల్లలకు రూ.300, హైదరాబాదకు 213 కిలో మీటర్లుండగా పెద్దలకు రూ.375, పిల్లలకు రూ.295 చార్జీ ఉంటుంది. - ముఖ్యంగా స్లీపర్ బెర్త్ (పడుకునే వీలు) సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్య. కర్నూలు నుంచి హైదరాబాదుకు 4గంటలు, తిరుపతికి 7:15 నిమిషాలు, హైదరాబాదు- తిరుపతి మధ్య 12గంటల సమయం పడుతుంది. ఇందులో అంతసేపు కేవలం కూర్చునే వెళ్లాలంటే వృద్ధులు, చిన్నపిల్లలు, స్త్రీలకు తీవ్ర అసౌకర్యం. ఇలాంటి కారణాలతో డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికుల ఆదరణ పొందలేక రద్దు దిశగా ప్రయాణం కొనసాగించింది. -
రింఝిం రింఝిం హైదరబాద్...!
ఇస్కీ ఆబాదీకీ.. జిందాబాద్!! హైదరాబాద్‌ను అందరూ కాంక్రిట్ జంగిల్ అంటూ ఆడిపోసుకుంటారు. కానీ... అదేమీ ప్రతికూల కామెంట్ కానే కాదు. అవును... జంగిల్ అంటే అడవి. అడవులను సంరక్షించుకోవాలి, పెంచుకోవాలి అనే మాటే నిజమైతే మన కాంక్రీట్ జంగిల్ కూడా చాలా విశిష్టమైనదే. దాన్లోనూ ఒక సౌందర్యముందీ, సంస్కృతి ఉంది. అందుకే అడవిని రక్షించుకున్నంత పదిలంగా హైదరాబాద్‌నూ కనిపెట్టుకోవాలీ, కాపాడుకోవాలి. జంగిల్లో కొన్ని పెద్ద పెద్ద వృక్షాలుంటాయి. అలాంటివే ఇక్కడి భవనాలు. దేవదారు వృక్షాల్లా ఆకాశ హర్మ్యాలు. ఆ వృక్షరాజాలను అల్లుకునే మరికొన్ని తీగల్లాంటివే కాస్త చిన్న భవనాలు. ఆ భవనాల పక్కనే వెలిసే చాయ్ దుకాణాలూ, చిల్లర కొట్లు, సిగరెట్లూ, గిగరెట్లూ అమ్మే పాన్‌డబ్బాలు. నిజం... హైదరాబాద్ కాంక్రీటు అడవే. జనవనమే. వనజీవనమే. ‘క్యామియా’... కైసేహో... హాయ్బాస్... హౌఆర్యూ...’ పలకరింపులన్నీ పిట్టల కిచకిచలూ, జంతుజాలాల అరుపులూ... ‘క్యాబే... క్యూ’ రే... జారే... హౌలే’ లాంటివి రఫ్గాళ్ల రోరింగ్లూ, హౌలాల హౌలింగ్లూ!! మరి అడవి అన్నప్పుడు ఒక ఎర జంతువూ, దాన్ని వేటాడే వేట జంతువూ ఉండాలా వద్దా...? ఆ దృశ్యం చూస్తున్నప్పుడు ఏ డిస్కవరీ చానెల్‌లోనో, ఏ యానిమల్ ప్లానెట్లోనో ఎరజంతువును ఓ క్రూరమృగం వెంటాడుతూ, వేటాడుతూ చూసేవారందరిలో ఉత్కంఠత ఉండేలా, ఉద్విగ్నత నిండేలా, ఊపిరిబిగబట్టి చూసేలా చిత్తరువులా చేసేలా కళ్లప్పగించేస్తాం. హైదరాబాద్‌లో ఇలాంటి దృశ్యం ఎలా సాధ్యమంటారా...? జాగ్రత్తగా చూడండి. రన్నింగ్బస్ను వెంటాడుతున్న యూత్ అచ్చం జీన్స్ తొడిగిన చిరుతల్లా లేరూ! వాళ్లబారిన పడే ఆ బస్సు జీబ్రాలగానో, వెర్రిముఖం వైల్డర్బీస్ట్ లాగానో కనిపించడం లేదూ!! ఎట్టకేలకు వాళ్లకు బస్సు ఫుట్‌బోర్డు చిక్కేలా, బస్సుచక్రం మడ్గార్డును తొక్కేలా ఒకవైపునకు పూర్తిగా వాలిపోయి, సోలిపోయి కనిపిస్తుంటే... అచ్చం చురుకైన చిరుతలకు చిక్కిపోయి, సొక్కిపోయి, పక్కకొరుగుతున్న పెద్ద వేటజంతువులా అనిపించకమానదు. ఇక బస్సు ఆగినప్పుడు చుట్టూ ముట్టేసే జనాన్ని చూడండి. కీటక కళేబరాన్ని చుట్టుముట్టిన చీమల్లా అనిపిస్తుందా దృశ్యం. ఏం చూసినా అడవి కళే. ఎలా వీక్షించినా వనోత్సాహమే. డబుల్‌డెక్కర్ అనే బస్సు ఈ కాంక్రీట్ జంగిల్లో అంతరించిపోయింది గానీ... ఒకవేళ ఉంటేనా... ఆ రోజుల్లో అది మోడ్రన్ డ్రెస్సుల సీటీ ప్రిడేటర్స్- సింహాల ప్రైడ్కు చిక్కిన ఏనుగులా కనిపించేదది! ఇలా అడవిలో ఆవిష్కృతమయ్యే అంతరించిపోయే జంతువుల జాబితాలోకి వచ్చేసింది ఒకనాడు గర్వంగా చక్కర్లు కొట్టిన డబుల్‌డెక్కర్. కాబట్టి.. అవును ఇది కాంక్రీట్ జంగిలే. కాకపోతే అందమైన చెట్లలాంటి భవనాల అడవి. పూలపూల మొక్కల్లాంటి రెండూమూడంతస్తుల డాబాల వనం. దాన్నిండా జంతుజాలంలా కిటకిటలాడే జనం. ఎస్... వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్! రింఝిం రింఝిం హైదరబాద్...! ఇస్కీ ఆబాదీకీ జిందాబాద్!! - యాసీన్ -
డబుల్ డెక్కర్..
కడప అర్బన్, న్యూస్‌లైన్: రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. ఏసీ డబుల్ డెక్కర్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది. క డప రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంది. ఈ రైలును ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఈ డబుల్ డెక్కర్ రైలు వారానికి రెండుసార్లు (ప్రతి బుధ,శనివారం) జిల్లా మీదుగా తిరుపతికి వెళుతుంది. అలాగే ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడకు వెళుతుంది. తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధ, శనివారాల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు కడప చేరుకుని 3.22కు బయలుదేరుతుంది. తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే రైలు గురు, ఆదివారాల్లో ఉదయం 8.05 గంటలకు కడప చేరుకుని 8.07కు బయలుదేరుతుంది. ఈ రైలు జిల్లాలో ఎర్రగుంట్ల, కడప, రాజంపేట స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. బోగీలన్నీ ఏసీ కావడంతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ఇందులో ప్రయాణిస్తున్న వారు పేర్కొన్నారు. చార్జీలు ఇలా.. కడప నుంచి రాజంపేట, రేణిగుంట, తిరుపతి వరకు రూ. 250 ఛార్జిగా వసూలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. కనీస ఛార్జి ఈ రైలులో రూ. 250గా నిర్ణయించారన్నారు. కడప నుంచి కాచిగూడకు రూ. 570 ఛార్జి ఉంటుందన్నారు. కడప నుంచి ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు రూ. 250 వసూలు చేస్తారన్నారు. కడప నుంచి గుత్తికి రూ. 260, డోన్‌కు రూ.310, కర్నూలుకు రూ. 355, గద్వాల్‌కు రూ. 410, మహబూబ్‌నగర్‌కు రూ.460, కాచిగూడకు రూ. 570 వసూలు చేస్తారన్నారు. కాచిగూడ నుంచి తిరుపతికి రూ. 655 ఛార్జీ వసూలు చేస్తారు. రిజర్వేషన్ ఛార్జితో కలిపి రూ.700గా నిర్ణయించారు. తత్కాల్ టికెట్ తీసుకోవాలంటే రూ. 885 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ తప్పక చేయించుకోవాలి. జిల్లాలోని స్టేషన్లలో ప్రయాణించేటప్పుడు కరెంటు బుకింగ్‌లో రూ. 250 కనీస ఛార్జి ఉంటుంది. ఉదాహరణకు కడప నుంచి రాజంపేటకు, రేణిగుంట, తిరుపతికి రూ. 250 ఉంటుంది. ఎర్రగుంట్ల నుంచి కడపకు కూడా రూ. 250 చెల్లించాల్సిందే. చాలా సౌకర్యవంతంగా ఉంది డబుల్ డెక్కర్ రైలులో ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా ఉంది. పగటిపూట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా గమ్య స్థానానికి చేరుకోవచ్చు. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. - శ్రీదేవి, ప్రయాణికురాలు సంతోషంగా ఉంది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా వేసవి కాలంలో ఏసీ బోగీల రైలు డబుల్ డెక్కర్‌లో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. మిగతా రైళ్లలోని ఎక్స్‌ప్రెస్‌లలో ఏర్పాటు చేసిన ఏసీ బోగీలతో సమానంగా అధునాతన సౌకర్యాలతో రూపొందించారు. - తుకారం, ప్రయాణికుడు