నగర సంచారం చేస్తూ, నోరూరించే రుచులను ఆస్వాదించే అనుభవాన్ని ప్రయాణికులకు అందిచాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సును రెస్టారెంట్‌గా మార్చేశారు. ‘బస్ట్రోనోమ్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారంట్ బస్సులు లండన్, పారిస్ నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన జీన్ క్రిస్టోఫ్ ఫార్నీర్, బెర్ట్రాండ్ మాథ్యూ అనే మిత్రులు 2013లో బస్సులో రెస్టారంట్‌ను ప్రారంభించాలని తలపెట్టారు. సరికొత్త డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసి, దానిని పూర్తి స్థాయి రెస్టారెంట్‌లా మార్చారు. బస్సు కింది భాగంలో వంట గది, వంట సామగ్రి, సిబ్బంది ఉండటానికి వీలుగా తయారు చేసి, పైభాగాన్ని రెస్టారంట్‌గా తీర్చిదిద్దారు.
ఇందులో 38 మంది కూర్చుని, విందు భోజనాలు ఆరగిస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ నగర సంచారం చేయవచ్చు. తొలుత ‘బస్ట్రోనోమ్’ సేవలను పారిస్‌లో ప్రారంభించారు. పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇటీవల లండన్‌లో కూడా మరో బస్సును రెస్టారంట్‌గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment