food business
-
టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్..
నగరంలో ఫుడ్ బ్లాగింగ్ హాబీ మారుతోంది.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు పూర్తిస్థాయి ప్రొఫెషన్స్గా స్థిరపడుతున్నారు. చారిత్రక నేపథ్యం, ఆధునిక వైవిధ్యం.. కలగలిసిన మన నగరం వైవిధ్యమైన అభిరుచులను కలిసి ఆస్వాదించడానికి బ్లాగర్లకు అనేక అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని నగరవ్యాప్తంగా విభిన్న రుచుల విశిష్టతలను వెలుగులోకి తెస్తున్న బ్లాగర్స్..పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్‌ను దక్కించుకుంటూ అటు భోజన ప్రియులకు, ఇటు ఆహార ఉత్పత్తుల విక్రయదారులకు ఆప్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ బ్లాగర్స్‌కు సంబంధించి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరోనిన్న మొన్నటి వరకూ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. కానీ కొంతకాలంగా నగరంలో ఫుడ్ బ్లాగింగ్ సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం ఫుల్–టైమ్ ఫుడ్ బ్లాగర్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ నగరాల స్థాయిలోనే మన నగరం నుంచీ బ్లాగర్లు పెరుగుతున్నారు. నిజామ్ల నగరంలో ఫుడ్ బ్లాగింగ్ కల్చర్‌తో మమేకమౌతున్నారు.బ్లాగర్స్ మీట్స్..నగరంలోని ఫుడ్ బ్లాగర్స్ సోషల్ మీడియా వేదికల వారీగా వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడుతున్నారు. ఇటీవల వార్షిక ఇన్‌స్టాగ్రావ్‌ు ఫుడ్ బ్లాగర్ల సమావేశం జూబ్లీహిల్స్‌లోని ఫ్రోత్ ఆన్ టాప్‌లో జరిగింది. దీంట్లో 70 మందికి పైగా ఫుడ్ బ్లాగర్లు ఒకే చోట సమావేశమయ్యారు. సరదా సంగీతం, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ‘ఈ ఈవెంట్ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఒకరినొకరు కలుసుకోవడానికీ, పలకరించుకోవడానికీ, కొత్త స్నేహితులను ఏర్పర్చుకోవడానికి వేదిక నిలుస్తుందని’ నిర్వాహకులు గత ఏడేళ్లుగా ఫుడ్ బ్లాగర్‌గా పేరొందిన కిరణ్ సాహూ తెలిపారు.బ్లాగర్లు వ్లాగర్లుగా, ఆ తర్వాత ఇన్‌స్టా రీల్స్ ద్వారా కంటెంట్ డెవలపర్స్‌గా.. ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం, ప్రమోషన్లను అందించడానికి వీరు ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.ఫుడీ నుంచి ఇన్ఫ్లుయన్సర్గా... వ్యక్తిగతంగా ఫుడ్ లవర్ అయిన కిరణ్ సాహూ.. సిటీలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేరాఫ్‌లా మారారు. గత ఏడేళ్లుగా నగరంలో రుచుల జర్నీ సాగించిన ఆమె.. ఇప్పుడు రోజూ కనీసం ఒకటి నుంచి మూడు వరకూ బ్రాండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.‘మేం బ్లాగింగ్లోకి ప్రవేశించినప్పుడు మొత్తం లెక్కేస్తే 10మంది బ్లాగర్లు కూడా లేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి 1000 నుంచి 2000 మంది ఉంటారు’ అని సాక్షితో అన్నారు. ఓ వైపు కార్పొరేట్ ఉద్యోగం.. మరోవైపు చిన్న బిజినెస్ నిర్వహిస్తూనే ఫుడ్ బ్లాగర్‌గా రాణిస్తున్న ఈ మాదాపూర్ నివాసి... ఇష్టమైన వ్యాపకాలు ఎన్ని చేసినా కష్టం అనిపించవు అంటూ స్పష్టం చేస్తున్నారు.పురస్కారాల వంట...సిటీ ఫుడ్ బ్లాగర్స్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్‌కు, మిలియన్ల సంఖ్యలో వీక్షకులకు చేరువవుతున్నారు. అంతే కాదు చెప్పుకోదగ్గ సంఖ్యలో పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని ఫుడ్ బ్లాగర్స్‌కు థీటుగా బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తూ తగినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఓ చేత్తో సంపాదిస్తూనే.. మరో చేత్తో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు.బిర్యానీ ఒక్కటే కాదు...వంటగది నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నగరంలో అత్యంత ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్స్లో ఒకరిగా మారారు హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్, మార్కెటర్ మొహమ్మద్ జుబైర్ అలీ. సమగ్ర రుచుల సమీక్షల నుంచి ఆకట్టుకునే ఫొటోగ్రఫీ వరకూ ఆయన నిర్వహించే ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేజీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.రెస్టారెంట్లు లాంజ్‌ల నుంచి ఆకట్టుకునే వీధి తినుబండారాల వరకూ పసిగట్టి.. వాటికి బ్లాగ్‌లో పట్టం గట్టడమే జుబైర్ పని. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీలకు మాత్రమే కాదని, అరుదైన రుచులను అందించే వంటకాలను కలిగిన గొప్ప నగరం అంటారాయన. గత దశాబ్ద కాలంగా జుబైర్, అర డజను అవార్డులను తన బ్యాగ్‌లో ఉంచుకుని, జుబైర్ అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు.ఇవి చదవండి: 'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా.. -
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్‌లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్‌లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
నగర సంచారం చేస్తూ, నోరూరించే రుచులను ఆస్వాదించే అనుభవాన్ని ప్రయాణికులకు అందిచాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సును రెస్టారెంట్‌గా మార్చేశారు. ‘బస్ట్రోనోమ్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారంట్ బస్సులు లండన్, పారిస్ నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫ్రాన్స్‌కు చెందిన జీన్ క్రిస్టోఫ్ ఫార్నీర్, బెర్ట్రాండ్ మాథ్యూ అనే మిత్రులు 2013లో బస్సులో రెస్టారంట్‌ను ప్రారంభించాలని తలపెట్టారు. సరికొత్త డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసి, దానిని పూర్తి స్థాయి రెస్టారెంట్లా మార్చారు. బస్సు కింది భాగంలో వంట గది, వంట సామగ్రి, సిబ్బంది ఉండటానికి వీలుగా తయారు చేసి, పైభాగాన్ని రెస్టారంట్గా తీర్చిదిద్దారు.ఇందులో 38 మంది కూర్చుని, విందు భోజనాలు ఆరగిస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ నగర సంచారం చేయవచ్చు. తొలుత ‘బస్ట్రోనోమ్’ సేవలను పారిస్‌లో ప్రారంభించారు. పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇటీవల లండన్‌లో కూడా మరో బస్సును రెస్టారంట్గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. -
తగ్గిన పరిశ్రమల జోరు.. ఆహార ధరల తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 25 శాతంపైగా వెయిటేజ్ ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2023 డిసెంబర్లో మందగించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెలలో ఈ రంగం వృద్ధి స్పీడ్ 5.1 శాతం. సమీక్షా కాలంలో మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి విభాగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. అయితే 2023 నవంబర్‌తో (2.4 శాతం) డిసెంబర్లో సూచీ పెరగడం (3.8 శాతానికి) కొంత ఊరటనిచ్చే అంశం. ఇక జనవరి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. కీలక రంగాలు ఇలా... జాతీయ గణాంకాల కార్యాలయం గణాంకాల ప్రకారం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు 3.6 శాతం (2022 డిసెంబర్) నుంచి 3.9 శాతానికి (2023 డిసెంబర్) పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 10.4 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. మైనింగ్ క్షీణతలోనే ఉంది. అయితే క్షీణ రేటు 10.1 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. తొమ్మిది నెలల కాలంలో అప్ ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల (ఏప్రిల్–డిసెంబర్) కాలాన్ని చూస్తే.. మాత్రం ఐఐపీ వృద్ధి రేటు 5.5% నుంచి 6.1%కి పెరిగింది. ఆహార ధరల తగ్గుముఖం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ను చూస్తే, డిసెంబర్లో ధరల భారం 9.53 శాతం పెరగ్గా, ఈ భారం జనవరిలో 8.3 శాతానికి తగ్గింది. ఆహారం, పానీయాల విభాగంలో 7.58%, హౌసింగ్ రంగంలో 3.20% ద్రవ్యోల్బణం నమోదైంది. -
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్‌తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్‌కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్‌కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించిన తరువాత భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో కొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కునే క్రమంలో కొత్త ఆలోచనలకు రూపం పోశారు. గతంలో కొందరు ఖరీదైన కార్లలో కూరగాయలు విక్రయించడం, టీ విక్రయించడానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి తన కొత్త కియా కారెన్స్ కారులో ఫుడ్ విక్రయించాడు. దీనికి సంబంధించిన వీడియో హర్సిమ్రాన్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లతే ఒక వ్యక్తి తన కియా కారెన్స్ (Kia Carens) కారులో ఆహారం విక్రయిస్తుండం చూడవచ్చు. కియా కారు బూట్ స్పేస్‌లో హోమ్ మేడ్ ఫుడ్ విక్రయిస్తున్నాడు. ఆ ఫుడ్ మొత్తం తన భార్య తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన ఢిల్లీలో ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఖరీదైన కారులో ఆహారం విక్రయించడం వెనుక ఉన్న అసలు కథ కూడా స్పష్టంగా తెలియదు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఏకంగా 23 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కారెన్స్ MPV పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsimran Singh (@therealharryuppal) -
అత్త ఆలోచనలతో కోడలి వ్యాపారం.. దెబ్బకు దశ తిరిగింది, విదేశాల్లో కూడా డిమాండ్!
Sonam Success Story: అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా.. అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. కానీ ఒక కోడలు లక్షాధికారి కావడానికి అత్త కారకురాలయింది. చాలా మంది అత్తా కోడళ్ళకు అసలు పడదు, ఇది నిజ జీవితంలో చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. కానీ మనం ఈ కథనంలో చెప్పుకోబోయే అత్తా కోడళ్ళు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అత్త చనిపోయినా ఆమె జ్ఞాపకాలతో అందరికి పంచుతున్న ఈ కోడలు ఎవరు? ఆమె ఎలా ధనవంతురాలయింది? ఆమె చేసే వ్యాపారం ఏది అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. చెన్నైకి చెందిన సోనమ్ (Sonam) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన అజయ్ అనే యువకున్ని పెళ్లి చేసుకుంది. చాలా మంది అత్తలు మాదిరిగా కాకుండా సోనమ్ అత్త 'ప్రేమలత' తనను సొంత కూతురిలాగా చూసుకునేది. అయితే కొన్ని రోజులకే అత్త మరణించడంతో చాలా బాధపడి కృంగిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకు కోలుకున్న సోనమ్ ఒక రోజు తన అత్తా గదిని శుభ్రపరిచే సమయంలో ఆమెకు ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఆమెను గొప్ప పారిశ్రామికవేత్తగా మార్చేసింది. అత్త డైరీ.. సోనమ్ చేతికి దొరికిన దొరికిన ఆ డైరీలో ఎన్నెన్నో వంటలకు సంబంధించిన రెసిపీలు ఉండటం గమనించింది. వీటన్నినీ అలాగే ఎందుకు నిరుపయోగంగా వదిలేయాలి, పది మందికి పంచితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఫుడ్ బిజినెస్ చేస్తే బాగుంటుందని భర్తతో కలిసి నిర్ణయించుకుంది. డైరీలో తనకిష్టమైన గోంగూర చట్నీ దగ్గర్నుంచి మాల్గోపొడి వరకు అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. ఆ తరువాత వీటిని ప్రయత్నించాలనుకుని అలాంటి వంటకాలు తయారు చేసి భర్త అజయ్‌తో దగ్గరి బంధువులకు అందించడం మొదలుపెట్టింది. ఆ వంటకాలు తిన్న చాలా మంది ఫోన్ చేసి చాలా రుచిగా ఉయన్నాయని మెచ్చుకున్నారు. ఇది ఆమెను మరింత ప్రోత్సహించేలా చేసింది. వ్యాపారం ప్రారంభం.. ఒకప్పుడు వంట మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అయితే అత్తయ్య డైరీ చూడగానే నాలో మార్పు వచ్చిందని చెబుతూనే 'ప్రేమ్ ఇటాసి' (Prem Eatacy) పేరుతో వ్యాపారం ప్రారభించించినట్లు చెప్పింది. ప్రారంభంలో సుమారు రూ. 10 లక్షల పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించి రకరకాల వంటలు చేయడం మొదలు పెట్టింది. వీరి వ్యాపారం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే న్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా ఆర్డర్లను పొందగలిగే స్థాయికి ఎదిగింది. (ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్ మీడియాలో వీడియో వైరల్) కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా సింగపూర్, అమెరికా నుంచి కూడా కస్టమర్లు సంప్రదించి తమ ఉత్పత్తులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సోనమ్ భర్త అజయ్ తెలిపాడు. ఇప్పటి వరకు వీరు 21 రకాల ఊరగాయ, పొడి, చట్నీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది చట్నీ, మొలగపొడి, పుదీనా కొత్తిమీర చట్నీ వంటివి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న సోనమ్ ఈ క్రెడిట్ మొత్తం మా అత్తగారికి చెందుతుందని.. ఆమె డైరీ లేకుండా ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండే దానిని కాదని వినయంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా లభిస్తున్నాయి. వారి ఉత్పత్తులు మొత్తం ఆర్గానిక్ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకోకుండా తయారు చేస్తున్నట్లు సమాచారం. వీరు ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. -
యూరప్‌లో చెఫ్ అవతారమెత్తిన రైనా.. నోరూరించే రుచులతో..
Suresh Raina Restaurant: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్ ఆరంభించాడు. యూరప్ నడిబొడ్డున భారత రుచులను కస్టమర్లకు వడ్డించేందుకు సిద్ధమైపోయాడు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా చెఫ్ అవతారమెత్తాడు ఈ మిస్టర్ ఐపీఎల్. ‘రైనా’ పేరిట మొదలెట్టిన రెస్టారెంట్ ముందు నిలబడి తమ ఉద్యోగులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సరికొత్త రుచులు ‘‘ఇంతకు ముందెన్నడూ రుచి చూడని వంటకాలతో మేము సిద్ధం. రుచి చూసేందుకు మీరూ సిద్ధంకండి. ఆమ్‌స్టర్‌డామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్ మొదలెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుడ్ పట్ల నాకున్న ప్యాషన్ ఇక్కడ మీరు చూడబోతున్నారు’’ అని సురేశ్ రైనా తన పోస్టులో చెప్పుకొచ్చాడు. నోరూరించే వెరైటీలు తమ రెస్టారెంట్లో ఉత్తర భారత వంటల సువాసనలతో పాటు.. దక్షిణ భారత అదిరిపోయే రుచులను కూడా అందిస్తామని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా రైనా రెస్టారెంట్లో చికెన్ చాట్, మిక్స్ పకోడా, జైతుని పనీర్ టిక్కా, తందూర్ చికెన్ టిక్కా, ఆనియన్ భాజీతో పాటు పలురకాల కెబాబ్స్ స్టార్టర్లుగా వడ్డించనున్నారు. అదే విధంగా ఢిల్లీలోని చాందినీచౌక్‌లో ప్రసిద్ధి పొందిన దహీ భల్లా, పానీ పూరీ, చాట్ పాప్రీ, ఆలూ చాట్, సమోసా కూడా వీరి మెనూలో ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్ సహా వెజ్‌టేరియన్ వెరైటీలతో కస్టమర్లను ఆకర్షించేందుకు రైనా రెస్టారెంట్ సిద్ధమైపోయింది. భార్య బ్యాంకర్‌గా కాగా సురేశ్ రైనా భార్య ప్రియాంక గతంలో నెదర్లాండ్స్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా తరచుగా ఆమ్స్టర్డామ్ వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడే రెస్టారెంట్ ఆరంభించి తన కలను నిజం చేసుకున్నాడు. ఇక తాను ఫుడీనంటూ గతంలో రైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చిన్న తలా కెరీర్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1604 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. చిన్న తలాగా పేరొందాడు. మహేంద్ర సింగ్ ధోనికి అత్యంత సన్నిహితుడైన రైనా.. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే తానూ గుడ్ చెప్పాడు. 2020 ఆగష్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) -
చూడటానికి కిరాణా కొట్టు లాగే ఉంది.. నెలవారీ బిజినెస్ రూ.4 కోట్లకు పై మాటే
ఏ బిజినెస్ చేస్తే డబ్బులు బాగా సంపాదించొచ్చు. తక్కువ పెట్టుబడి. తక్కువ రిస్క్. మంచి ఇన్కమ్ కావాలి. ఏంటా బిజినెస్? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే నా లైఫ్ సెట్ అవుతుంది. నన్నెవ్వరూ ఆపలేరు. 24 గంటలూ పనిచేస్తా. తిండీ నిద్రా మానేస్తా. నాకీ ఒక్క ఆన్సర్ కావాలి. మీరూ ఇలా ఆలోచిస్తుంటే ఇది మీకోసమే. మీరెప్పుడైనా బెంగళూరు వెళ్లారా? వెళితే బెంగళూరులోని ఇందిరా నగర్ ‘రామేశ్వరం కేఫ్’ ను సందర్శించాల్సిందే. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోని ఫుడ్ లవర్స్ ఈ కేఫ్‌లోని ఫుడ్ ఐటమ్స్‌ను అమితంగా ఇష్టపడతారు. చూడటానికి కిరాణా కొట్టులా? చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) పేరుతో ఈ కేఫ్‌లో నెలకు రూ.4.5 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇంతకీ ఈ కేఫ్ ఎవరిదో తెలుసా? రాఘవేంద్రరావు 20 ఏళ్లకు పైగా ఫుడ్ బిజినెస్‌లో అనుభవం ఉంది. ఆయన భార్య, సీఏగా విధులు నిర్వహిస్తున్న దివ్యా రాఘవేంద్ర రావులే ఈ కేఫ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ కేఫ్ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకు కారణం కేఫ్‌లో జరిగే బిజినెస్సే. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ‘కల, కల.. కలలు ఆలోచనలుగా మారితే.. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అనుకున్న విజయం మీ సొంతం అవుతుంది.’ అని చెప్పిన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే రాఘవేంద్రరావుకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే కలాం జన్మించిన రామేశ్వరం ప్రాంతం పేరుతో ‘రామేశ్వరం కేఫ్’ పేరుతో బెంగళూరులో రెండు కేఫ్‌లను 2021లో ప్రారంభించారు. చదవండి👉 బ్యాంకుల్లో 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా! మా లక్ష్యం అదే రామేశ్వరం కేఫ్‌లో దక్షిణ భారత రుచులను దేశం అంతా విస్తరించాలనేది మాలక్ష్యం. బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, పూణె, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాలతో పాటు రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉనికి చాటాలాని భావిస్తున్నట్లు రాఘవేంద్ర తెలిపారు. రామేశ్వరం కేఫ్‌లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఇవే వడ, మిని వడ,ఇడ్లీ, నెయ్యి..బటర్ ఇడ్లీ, నెయ్యి పుడి ఇడ్లీ,లెమన్ ఇండ్లీ, నెయ్యి సాంబార్ ఇడ్లీ, వెన్ పొంగల్,సక్కరై పొంగల్ తో పాటు ఇతర ఆహార పదార్ధాలను టేస్ట్ చేయొచ్చు. సుజిత్ కుమార్ నోటా రామేశ్వరం కేఫ్ మాట మార్కెట్‌ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజిత్ కుమార్ ఇటీవల పాడ్‌కాస్ట్‌లో ఇదే కేఫ్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆ పాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడుతూ ‘రామేశ్వరం కేఫ్ యాజమాన్యం రోజుకు 7,500 మందికి సర్వ్ చేస్తుంటారు. కేఫ్ విస్తీర్ణం 10 బై 10 లేదా 10 బై 15 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. నెలకు రూ.4.5 కోట్లతో ఏడాదికి రూ. 50 కోట్ల వ్యాపారం చేస్తుంది. దాదాపు 70 శాతం గ్రాస్ మార్జిన్ పొందుతున్నారని అన్నారు. అంతే ఆ కేఫ్ గురించి తెలుసుకునేందుకు భోజన ప్రియులు ఉత్సాహాం చూపిస్తున్నారు. నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్లో ఇండియన్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు కుమార్ నిఖిల్ కామత్ ‘డబ్ల్యూటీఎఫ్ ఈ-కామర్స్’ పేరుతో పాడ్ కాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం 3వ ఎపిసోడ్లో కిషోర్ బియాని (ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు), విదిత్ ఆత్రే (మీషో సహ వ్యవస్థాపకుడు), ఉడాన్ మార్కెట్‌ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రిటైల్, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వ్యాపారం, దేశ విదేశాల్లో పెట్టుబడులు గురించి చర్చించారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఆగ‘మేఘాల’ ఘుమ ఘుమల.. ఓ వంటిల్లు.. వందలాది కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆకర్షణీయమైన పరిసరాలు.. అద్భుతమైన ఆహా్వనం.. అభిరుచికి తగిన ఆహారం.. అతిథి దేవోభవ అనిపించే సేవలు.. భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. గతంలో హోటల్‌కు వెళ్లి తినడాన్ని జనం అంతగా ఇష్టపడేవారు కాదు. కొందరు అదేదో లగ్జరీగా భావించేవారు. ఇప్పుడు వీకెండ్లో కుటుంబంతో సహా రెస్టారెంట్‌కు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. ఆన్లైన్ డెలివరీలు పెరిగిన నేపథ్యంలో.. వారంలో రెండు మూడుసార్లన్నా బయట ఆర్డర్ చేసి తెప్పించుకోవడమూ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ బిజినెస్ లాభదాయకమనే భావన ఉన్నప్పటికీ..ఆశించిన ఆదరణ లభించకపోతే భారీ నష్టాన్ని మూటగట్టుకోవడం మాత్రం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బిజినెస్‌కు సంబంధించి ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్లౌడ్ కిచెన్. దేశ, విదేశాల్లో ఎప్పట్నుంచో ఉన్న ఈ క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ప్రారంభమవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఒక వంటిల్లు.. వందలాది కస్టమర్లు అన్నట్టుగా క్లౌడ్ కిచెన్ల హవా సాగుతోంది. కరోనా సమయంలో ఇవి ఎక్కువగా పుంజుకున్నాయి.మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో పాతిక మించి లేని క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు..లేదు లేదు అసలు రెస్టారెంట్ అన్న భావనకు ఇది పూర్తిగా భిన్నం. హంగూ ఆర్భాటాలు ఏమీ ఉండవు. రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిలో 1/3 వంతు సరిపోతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సిబ్బంది, తక్కువ వ్యయ ప్రయాసలు..స్పష్టంగా చెప్పాలంటే ఒక్క వంటిల్లు మాత్రమే ఉంటుంది. నో డైన్ ఇన్..ఓన్లీ డెలివరీ. కూర్చుని తినడానికి వీలుండదు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సప్లై చేస్తారు..అంతే. క్లిక్ అయితే ఎక్కువ లాభాలు. ఆదరణ లభించకపోయినా అంతంత మాత్రంగానే నష్టం..ఇదే క్లౌడ్ కిచెన్ మూల సూత్రం. షార్ట్ టైమ్.. ఫుల్ పికప్.. జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ సృష్టించిన ఈ ట్రెండ్ కరోనా విజృంభణ సమయంలో పట్టును దక్కించుకుంది. ఇంటర్నెట్ విస్తృత వ్యాప్తి, వ్యాపారంలో సాంకేతికత, ప్రత్యేక యాప్‌ల పెరుగుదల ఇందుకు దోహదపడింది. పెరుగుతున్న యువ జనాభా ఆదాయం, మారుతున్న జీవనశైలి, సులభమైన.. సురక్షితమైన చెల్లింపు మార్గాలు, వంటింట్లో బిజీబిజీ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం ఇత్యాదివన్నీ కూడా వీటికి ఆదరణ పెరగడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. ఇంట్లో వండినట్టుండే ఆహారం నుంచి స్పెషాలిటీ లగ్జరీ డిన్నర్ల వరకు ప్రతిదానిని అందించడం ద్వారా క్లౌడ్ కిచెన్లు ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తక్కువ రేటుతో, నాణ్యమైన భోజనం, నిమిషాల్లో ఇంటి ముందు ప్రత్యక్షమవుతుండటంతో నానాటికీ వీటికి ఆదరణ పెరుగుతోంది. 2019లో దేశంలో 400 మిలియన్ల డాలర్లుగా ఉన్న క్లౌడ్ కిచెన్ల వ్యాపారం 2024 నాటికి 2 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎఫ్ అండ్ బీ (ఫుడ్ అండ్ బివరేజెస్) పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఒకేచోట 100కు పైగా.. శాకాహార, ఆరోగ్యకరమైన వంటకాలు, ప్రాంతీయ రుచికరమైన వంటకాలు వంటివి అందించే ఆఫ్‌లైన్ రెస్టారెంట్ల సంఖ్య పెరగడాన్ని.. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లౌడ్ కిచెన్ల ఏర్పాటును ఈ ఏడాది చూడవచ్చునని నిపుణులు అంటున్నారు. స్విగ్గీ, జొమాటో వంటివి..క్లౌడ్ కిచెన్లకు ఆధారంగా ఉన్నప్పటికీ, భారీ కమీషన్ల ఫలితంగా, కొన్ని క్లౌడ్ కిచెన్లు తమ సొంత యాప్‌లు, సెల్ఫ్ డెలివరీ ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. నాగచైతన్య వంటి సినిమా తారలను సైతం ఈ క్లౌడ్ కిచెన్స్ ఆకర్షిస్తున్నాయి. నగరంలోని డీఎల్ఎఫ్ ఏరియా లాంటి ఒకేచోట 100కు పైగా క్లౌడ్ కిచెన్లు ఉన్నాయంటే వీటికి లభిస్తున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. సినీహీరో నాగచైతన్య ఏర్పాటు చేసిన ‘షోయు’ ఇప్పటికే బాగా ట్రెండింగ్‌లో ఉంది. ట్రెండ్‌ను మేం ముందే ఊహించాం.. పాతికేళ్లుగా మేం మిఠాయిల తయారీలో ఉన్నాం. ఈ ట్రెండ్‌ని ముందే ఊహించి సహదేవ్‌రెడ్డి టిఫిన్స్ పేరుతో క్లౌడ్ కిచెన్ అందరికీ తెలిసే సమయానికే మేం ప్రారంభించాం. సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్, చాట్ వంటివన్నీ డెలివరీ చేస్తాం. మా కిచెన్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంది. తెల్లవారుజాము 4 గంటలకే స్టార్ట్ చేసి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ నిర్వహిస్తాం. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆర్డర్స్ వస్తున్నాయి. వ్యయ ప్రయాసల పరంగా చూస్తే ఇది చాలా మంచి వ్యాపారం. గృహిణులు, యువత దీన్ని బాగా అందిపుచ్చుకుంటున్నారు. –పి.అభి షేక్‌రెడ్డి, సహదేవ్‌రెడ్డి టిఫిన్స్ దూకుడు పెరగడం ఖాయం మొదట్లో కొన్ని ఐటమ్స్‌కే పరిమితమైనా ఇప్పుడు రెస్టారెంట్లో దొరికే వెరైటీలన్నీ అందిస్తున్నాయి. బిర్యానీల కోసం ఒకటి, పరోటాల కోసం ఒకటి, బర్గర్స్, పిజ్జాల కోసం, స్వీట్స్, పేస్ట్రీల కోసం.. ఇలా దేనికదే ప్రత్యేక కిచెన్స్ వచ్చేశాయి. అపరిమితమైన కస్టమర్స్ బేస్ అవకాశాల వల్ల వీటి దూకుడు ఇంకా పెరగడం తథ్యం. –సంకల్ప్, హైదరాబాద్ ఫుడీస్ క్లబ్ హైదరాబాద్ టాప్... గత కొంత కాలంగా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న మేం లగ్జరీ డైనింగ్‌ను కెఫెల ద్వారా అందిస్తున్నాం. మా బ్రాండ్‌కు ముంబయి, బెంగళూరు, చెన్నై సహా ప్రతిచోటా క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాకు ఆదరణ చాలా స్పీడ్‌గా పెరిగింది. బంజారాహిల్స్, గచ్చిబౌలి , ఎల్బీనగర్... ఇలా 4 చోట్ల మా కిచెన్స్ నిర్వహిస్తున్నాం. –భాను, లూయిస్ బర్గర్స్ -
గెలుపు ఘుమఘుమలు@ 78
గట్టిగా అనుకుని ఆచరణలో పెడితే చాలు తలుచుకున్న పని తప్పక సఫలం అవుతుంది అనే మాటలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు బామ్మ ఊర్మిళా అషేర్. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉండి తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో లక్షలాది అభిమానులను ఘుమఘుమలతో కట్టిపడేసింది.ఆటుపోట్ల జీవనాన్ని అధిగమించి తన సత్తా చూపుతోంది. కష్టాలు తాత్కాలికమే, జీవితంపై నమ్మకం కోల్పోకూడదు. విపరిణామాలు మనపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలి. – ఊర్మిళా అషేర్ ‘‘మొన్న అప్లోడ్ చేసిన నా 200 వ వీడియోతో యూ ట్యూబ్ చానెల్ లక్ష మంది అభిమానులను సంపాదించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా టీవీలో ప్రసారమవుతున్న ‘రసోయి షో’లో పాల్గొన్నాను. మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 7లో పోటీదారుగా చేరడంతో మీ అందరికీ పరిచయం అయ్యాను. ఇదంతా మీ అభిమానం వల్లే కలిగింది’ అంటూ ఆనందంగా చెబుతోంది ఊర్మిళ అషేర్. ముంబైలో ఉంటున్న ఊర్మిళ అషేర్ గుజరాతీ కుటుంబీకురాలు. తన కుటుంబం ఆర్థిక కష్టాలు తీరాలంటే ఏదో ఒక సాయం చేయాలనుకుంది. అందుకు తనకు వచ్చిన పాకశాస్త్ర ప్రా వీణ్యాన్ని పెట్టుబడిగా పెట్టింది. తన మనవడు హర్ష్‌తో కలిసి మూడేళ్ల క్రితం ‘గుజ్జు బెన్ న నాస్తా’ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్ సాధిస్తూ 78 ఏళ్ల వయసులోనూ ‘గ్రేట్ బామ్మా’ అనిపించుకుంటోంది. కోల్పోనిది ధైర్యమొక్కటే.. ఊర్మిళా అషేర్కు పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. భర్త చిరుద్యోగి. ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. రెండున్నరేళ్ల వయసులో కూతురు మూడవ అంతస్తు మీద నుంచి కింద పడి మరణించింది. భర్త తెచ్చే జీతం డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ వచ్చింది. పెద్ద కొడుకుకి పెళ్లి చేసింది. కరోనాకు ముందు ఇద్దరు కొడుకుల్లో ఒకరు గుండెపోటుతో, మరొకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించారు. ఆ తర్వాత భర్త మరణించాడు. ఈ ఎదురు దెబ్బలు ఆమెను నిత్యం గట్టిపరుస్తూనే ఉన్నాయి. ‘మరణం అనేది పరమసత్యం. దాని గురించి ఎన్ని రోజులని ఏడుస్తూ కూర్చుంటాం. నేనెప్పుడూ నా వద్ద ఉన్న శక్తితోనే ఏం చేయగలను అనేదానిపై దృష్టిపెడతాను. ఉన్న సమస్యలు చాలవన్నట్టు నాలుగేళ్ల క్రితం నా మనవడు హర్ష్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పై పెదవి పూర్తిగా దెబ్బతిని, ఇంటికే పరిమితం అయ్యాడు. అతను నడుపుతున్న దుకాణాన్ని కరోనా మహమ్మారి కారణంగా మూసేశాం. దీంతో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కష్టాలు తాత్కాలికమేనని, జీవితంపై నమ్మకం కోల్పోకూడదని తెలుసు’ అని చెప్పే ఊర్మిళ ఈ విపరిణామాలు మనవడిపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని, ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలని చెబుతూ ఉంటుంది. ఆమె మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసాలే నేడు ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్‌కు చేరుకునేంతగా ఫుడ్ బిజినెస్‌లో ఎదిగేలా చేశాయి. కష్టం వచ్చినప్పుడు ఇంకాస్త గట్టిగా ఉండాలని తన కథనే ఉదాహరణగా ఇతరులతో పంచుకుంటోంది ఈ దాదీ. వ్యాపార విస్తరణ కోడలు, మనవడితో ఉండే ఊర్మిళ తన చేతి రుచి గురించి చెబుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి వంటలు బాగా చేస్తాననే పేరుంది. మమ్మల్ని మేం బతికించుకోవడానికి ముందుగా గుజరాతీ చిరుతిళ్ల వ్యాపారాన్ని ప్రా రంభించాం. ఆర్డర్లు వచ్చినదాన్ని బట్టి 20–25 రోజుల్లో 500 కిలోల పచ్చళ్లను రెడీ చేశాం. దీంతోపాటు తేప్లా , ఢోక్లా, పూరన్ పోలీ.. వంటి ఇతర స్నాక్స్ కూడా అమ్మడం మొదలుపెట్టాం. డిమాండ్‌ను బట్టి పనివాళ్లను ఎక్కువ మందిని నియమించుకున్నాం. ఒక సంవత్సరం తిరిగేసరికల్లా మా జీవితాలే మారిపోయాయి. నేనిప్పుడు టెడెక్స్ స్పీకర్‌ని కూడా. నా కథలను ఇతరులతో పంచుకుంటూ, ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటూ వివిధ నగరాలకూ ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు మా ఆలోచన ఒక్కటే! నేను, మా మనవడు కలిసి అంతర్జాతీయ విమానాశ్రయాలలో ‘గుజ్జుబెన్ నాస్తా’ను ఏర్పాటు చేయాలని. అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుండి కూడా ఆర్దర్లు తీసుకుంటున్నాం. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తేనే కదా మరింత మందికి చేరువ అయ్యేది... మా ఊరగాయలను ఆన్లైన్ ΄్లాట్ఫారమ్లలో పెట్టడానికి కావలసిన లాంఛనాలు కూడా పూర్తయ్యాయి’ అని ఉత్సాహంగా వివరించే ఊర్మిళ మాటలు నేటి యువతకూ స్ఫూర్తినిస్తాయి. -
జొమాటోకు వ్యయాల సెగ
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కన్సాలిడెటెడ్ నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.346 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాడి ఇదే కాలానికి సంస్థ నష్టం కేవలం రూ.67 కోట్లుగానే ఉంది. అధిక వ్యయాలు, ఆన్లైన్ ఫుడ్ వ్యాపారం నిదానించడం, బ్లింకిట్ నుంచి పెరిగిపోయిన నష్టాలు ఈ పరిస్థితికి దారితీశాయి. కార్యకలాపాల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,112 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ.1,642 కోట్ల నుంచి రూ.2,485 కోట్లకు చేరాయి. ‘‘పరిశ్రమ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ వ్యాపారం గతేడాది అక్టోబర్ (దీపావళి తర్వాత) నుంచి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా టాప్ 8 పట్టణాల్లో మరింత అధికంగా ఉంది’’అని జొమాటో సీఎఫ్‌వో అక్షత్ గోయల్ తెలిపారు. ఫుడ్ డెలివరీ వ్యాపారం డిమాండ్ వాతావరణం సవాలుగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవలి వారాల్లో డిమాండ్ పరంగా తిరిగి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక గడ్డు పరిస్థితి ముగిసినట్టేనని భావిస్తున్నాం’’అని గోయల్ పేర్కొన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 225 చిన్న పట్టణాల్లో తాము కార్యకలాపాలు నిలిపివేసినట్టు చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ పట్టణాల నుంచి వచ్చిన ఆదాయం మొత్తం ఆదాయంలో 0.3 శాతమే ఉన్నట్టు తెలిపారు. దీర్ఘకాలంలో ఫుడ్ డెలివరీ వృద్ధి అవకాశాల పరంగా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో వృద్ధి తగ్గడం అన్నది మధ్యస్థాయి మార్కెట్ విభాగంలో మందగమనం, ప్రీమియం విభాగంలో బయటకు వెళ్లి ఆహారం తీసుకోవడం, ప్రీమియం పర్యాటక యాత్రలు తదితర పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఎబిట్డా స్థాయిలో లాభ, నష్టాలు లేని స్థాయికి 2023–24 రెండో త్రైమాసికంలో చేరుకునే విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సంస్థ రూ.265 కోట్ల నిర్వహణ నష్టాలు ప్రకటించగా, ఇందులో బ్లింకిట్‌ను మినహాయిస్తే నిర్వహణ నష్టం కేవలం రూ.38 కోట్లుగానే ఉంది. -
Zomato: ‘జొమాటో ఉద్యోగులకు భారీ షాక్!’
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారాల వ్యవధిలో ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేశారు. ఈ తరుణంలో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 4 శాతం మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నష్టాల్లో ఉన్న సంస్థలో ఖర్చును తగ్గించి లాభసాటిగా మార్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రొడక్ట్, టెక్నాలజీ, కేటలాగ్, మార్కెటింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని జొమాటో ఫైర్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆ ఉద్యోగులు విధులకు హాజరుకావడం లేదని సమాచారం. ఉత్పత్తిని పునరుద్ధరించే సమయంలో మిడ్‌లెవల్ ఉద్యోగల నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయిలో విధుల నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి తొలగింపులు అనివార్యమైనట్లు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చే అంశంపై ఇప్పటికే జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగల్ని తొలగిస్తామని చెప్పారు. ఇప్పుడు సీఈవో చెప్పినట్లుగానే తొలగింపులు ఉంటున్నాయని నివేదిక హైలెట్ చేసింది. నష్టాల్లో జొమాటో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్ధిక మాంద్యంతో పాటు ఇతర కారణాల వల్ల 2022-2023 క్యూ2 లో నిరాశాజనకమైన ఫలితాల్ని రాబట్టింది. సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి జొమాటో రూ.251కోట్లు నష్టపోయింది. చదవండి👉 నాన్నకు రోడ్డు ప్రమాదం..డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు -
ఆహార కల్తీకి చెక్! అధికారుల కొత్త రూల్స్.. లైసెన్స్ తీసుకుంటేనే సరి.. లేదంటే?
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయా రీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వందల సంఖ్యలో చిన్నచిన్న బండ్లపై, రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అధికంగా ఏర్పాటవుతున్నాయి. పెద్దపెద్ద హోటళ్ల నుంచి చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస నాణ్యత పాటించడం లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఆహార కల్తీని కట్టడి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, భోజనం అందించేలా వ్యాపారులు నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, హోటళ్లపై అధికారులు దృష్టి సారించారు. వాటిని నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి శనివారం లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్లు లేనివే ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాల్ మిల్లులు తదితర ఆహార ఉత్పత్తుల కేంద్రాలు 5 వేలకు పైగానే ఉన్నాయి. వాటిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు 886 వరకు ఉండగా, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఇతర ఫుడ్ కోర్టులు ఖమ్మం జిల్లాలో 1400, కొత్తగూడెంలో 700 ఉన్నాయి. మిగిలిన వాటికి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వ్యాపారం చేసే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఇతర ఫుడ్ కోర్టులు తప్పనిసరిగా తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆపైన వ్యాపారం చేసే వారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉండి నిబంధనలు పాటించకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలుంటుంది. సిబ్బంది కొరత.. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో ఒక గెజిటెడ్ అధికారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో మరో అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఆహార పదార్థాలు కల్తీ జరిగినా గుర్తించేందుకు సిబ్బంది లేక తనిఖీలు చేయలేకపోతున్నారు. రోజుకు ఒకటి రెండు హోటళ్లను కూడా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రతి శనివారం మేళా.. లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేకుండా భోజన వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి శనివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మేళా ద్వారా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఖరఖానాలు, దాల్ మిల్లులు, పిండి మిల్లులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులకు లైసెన్స్‌లు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యత పాటించకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలను ఈ మేళా ద్వారా వివరిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన తొలి మేళాలో 11 లైసెన్స్‌లు జారీ చేయగా, 20 మంది వ్యాపారులు తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లైసెన్స్‌లు తప్పనిసరి.. ఉమ్మడి జిల్లాలో ఉన్న హోటళ్లు, దాల్ మిల్లులు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయవద్దు. చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తమ వ్యాపారాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నాణ్యత లేకుండా, కల్తీ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి శనివారం రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా కేఎంసీలో ఉంటుంది. – కిరణ్‌కుమార్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఖమ్మం -
బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లో మరింత దూసుకుపోనుంది. ముఖ్యంగాఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించిన తర్వాత ఆసియాలోని అత్యంత ధనవంతుడు తన సామ్రాజ్య ఆహార కార్యకలాపాలను రెట్టింపు చేసేలా, స్థానిక, విదేశీ కొనుగోళ్లపై దృష్టిపెట్టడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బిలియనీర్ గౌతమ్ అదానీ 400 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లతో ఆహారవ్యాపారంలోకి మరింత దూకుడుగా వస్తున్నారని యూఎస్ ఫుడ్ అండ్ అగ్రి ఆర్గనైజేషన్ తెలిపింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అదానీ తన రెట్టింపు ఆదాయాలను దేశీయ ఆహార ఉత్పత్తి పరిశ్రమలో వాటాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అదానీకి చెందిన కిచెన్ ఎసెన్షియల్స్ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ తమ మార్కెట్ రీచ్‌ను పెంచడానికి ప్రధాన ఆహారాలు, పంపిణీ కంపెనీలలో బ్రాండ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నామని అదానీ విల్మార్ సీఎండీ అంగ్షు మల్లిక్ బుధవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు రానున్న మార్చి నాటికి రెండు డీల్స్ పూర్తి చేయనున్నామని కూడా మల్లిక్ వెల్లడించారు. ఇందుకు 5 బిలియన్ రూపాయలను కంపెనీ కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాదికి 30 బిలియన్ రూపాయల ప్రణాళికా బద్ధమైన మూలధన వ్యయంతో పాటు అంతర్గత నిల్వల నుంచి అదనపు నిధులు వస్తాయని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇ-కామర్స్ పంపిణీలో 50 శాతం వృద్ధిని సాధిస్తోందని మల్లిక్ చెప్పారు. ఫిబ్రవరినుంచి తమ ఫుడ్ కంపెనీ షేర్లు మూడు రెట్లు పెరిగియన్నారు. మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ నుండి కోహినూర్ కుకింగ్ బ్రాండ్‌తో సహా పలు బ్రాండ్లను అదానీ విల్మార్ ఇటీవల కొనుగోలుచేసింది.తద్వారా కోహినూర్ బాస్మతి బియ్యం, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ కూరలు, ఫుడ్‌పై ప్రత్యేక హక్కులు పొందించింది. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 17 బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 32 కంపెనీలను కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ రీటైల్ వింగ్ రిలయన్స్ రిటైల్ సరసమైన ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను అభివృద్ధి చేసి, డెలివరీ చేసే లక్ష్యంతో ఎఫ్ఎంసిజి వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఏజీఎంలో ప్రకటించింది. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు షాక్.. లైసెన్స్ లేకపోతే జైలుకే!
సాక్షి,విజయనగరం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా లైసెన్స్‌లు లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమిస్తూ వ్యాపారాలు కొనసాగించే వ్యాపారులపై జిల్లా ఆహార కల్తీ, నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటివరకు ఆహర పదార్థాల కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇకపై నుంచి లెసెన్స్‌లు కూడా ఉండాలని, అవి ఉన్న వారే ఆహార విక్రయాలకు అర్హులని చెబుతోంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా అమ్మకాలకు పాల్పడిన వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా విక్రయ కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఆహర పదార్థాల విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. చిన్నపాటి జంక్షన్లో కూడా నాలుగైదు తోపుడు బళ్లపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒకింత పెద్ద జంక్షన్ అయితే ఏకంగా పదుల సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహణ కనిపిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని మరీ పకోడీ, టిఫిన్ షాపులు, నూడిల్స్, పానీపూరి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే వేల సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఏటా లైసెన్స్ రెన్యువల్.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడాదిలో రూ.12 లక్షల ఆదాయం వచ్చే హోటళ్లు, రెస్టారెంట్లు రూ.2 వేలు చెల్లించి తమ లైసెన్స్‌లను ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలో 270 మంది మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, లెసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఏడాదిలో రూ.12 లక్షల లోపు ఆదాయం సంపాదించే చిన్నపాటి దుకాణాలు నిర్వహించే వారు ఏడాదికి రూ.500 మాత్రమే చెల్లించి, లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 1,477 మంది మాత్రమే ఆ తరహా లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఈ లెక్కన అధికారికంగా నిర్వహించే దుకాణాల కన్నా అనధికారికంగా నిర్వహించే దుకాణాలే ఎక్కువన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వాటిపై సర్కారు ఆదేశాల మేరకు చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 100 కేసుల నమోదు.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండగా, కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కేసులు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని జేసీ కోర్టుకు, మరికొన్నింటిని జిల్లా కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వీటితో ఇప్పటివరకు రూ.2.50 లక్షల ఆదాయం అపరాద రుసుం కింద వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసె న్స్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం జిల్లా చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
11 మంది మహిళలు.. లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టి.. ఏకంగా కార్పొరేట్ హోటళ్లలో..
‘ఐదువేళ్లు ఒక్కటైతే ఐకమత్యం, బలం’ అని చిన్నప్పటి పాఠాల్లో చదువుకున్నాం. బతుకు పాఠాల్లో అది ముఖ్యమైన పాఠం. పదకొండు మంది మహిళలు ఒకేమాట మీద నిలబడి ఐక్యత సాధించడమే కాదు... జీవితం హాయిగా సాగిపోవడానికి అవసరమైన బాటను నిర్మించుకున్నారు... దేశరాజధాని దిల్లీలో నిజాముద్దీన్ బస్తీ అని ఉంది. ఈ బస్తీని బస్తీ అనడం కంటే ‘రుచుల ఖజానా’ అనడం సబబు. ఏడువందల ఏళ్ల నాటి పాకశాస్త్ర ప్రావీణ్య పాఠాలకు ఈ గల్లీ ప్రసిద్ధి పొందింది. ఖమిరీ రోటీ నుంచి కబాబుల వరకు నోరూరించే బస్తీ ఇది.దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు ఇక్కడ నివసించడం వల్ల భిన్నమైన వంటల రుచుల సమ్మేళనానికి వేదికగా మారింది. దిల్లీలోని భోజనప్రియులు ఒక్కసారైనా సరే ఈ గల్లీకి రావాల్సిందే. ‘జైకా’ రాకతో గల్లీకి కొత్త రుచుల కళ వచ్చింది.దిల్లీలో చిన్నాచితకా పనులు చేసుకునే పదకొండుమంది మహిళలు ఒక గ్రూప్‌గా ఏర్పడి ‘జైకా–ఏ–నిజాముద్దీన్’ పేరుతో వంటల వ్యాపారంలోకి దిగారు. ‘ఆరోగ్యాన్ని పాడు చేసే చిరుతిండ్లకు ప్రత్యామ్నాయంగా పోషక విలువలతో కూడిన తిండి’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టారు. తియ్యటి విజయం సొంతం అయింది. ‘లడ్డూ కావాలా నాయనా’ అని ఒకరినొకరు ఊరించుకోవడం మొదలైంది. లడ్డు విజయం ఇచ్చిన ఉత్సాహం లో నిహరి, షమి కబాబ్, ఖీమా ఖరేలా, షిల్లమ్ గోష్... మొదలైన 50 ఐటమ్స్ తయారీలోకి దిగారు. అవి హాటెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్‌గా మారడానికి ఎంతో కాలం పట్టలేదు.ఈ ఉత్సాహంతో క్యాటరింగ్ వింగ్ మొదలు పెట్టారు. హోమ్ డెలివరీ, లైవ్కౌంటర్, కార్పోరేట్ ఆఫీసుల ఆర్డర్లతో వ్యాపారం నాన్–స్టాప్ స్పీడ్ అందుకుంది.‘జైకా’లో పనిచేసే పదకొండుమంది మహిళలు స్టార్‌హోటళ్లలో చెఫ్‌ల మాదిరిగానే యూనిఫాం ధరిస్తారు.తమ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలలో ఫండ్ ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం సభ్యులు ఇందులో నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకోవచ్చు. విశేషం ఏమిటంటే, దేశంలోని కార్పోరేట్ హోటళ్లలో ‘గెస్ట్ చెఫ్’గా వీరు గౌరవాన్ని అందుకుంటున్నారు. ‘మాకు ఇంకా ఎన్నో కలలు ఉన్నాయి’ అంటుంది బృందంలో సభ్యురాలైన నూర్జహాన్. చదవండి: Blood Washing: ‘బ్లడ్‌వాషింగ్’ అంటే?: విదేశాల్లో బ్లడ్వాషింగ్కు పాల్పడుతున్న కోవిడ్ బాధితులు! -
ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి విప్రో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజం విప్రో కంజ్యూమర్ కేర్, లైటింగ్ తాజాగా ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. చిరుతిళ్లు, మసాలా దినుసులు, రెడీ టు ఈట్ విభాగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యం. కాగా, సంతూర్, యార్డ్లీ, చంద్రిక, గ్లూకోవిట, సేఫ్‌వాష్ వంటి బ్రాండ్లను సంస్థ ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తన ఉత్పత్తులను ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో విక్రయిస్తోంది. 2021–22లో విప్రో కంజ్యూమర్ కేర్ రూ.8,634 కోట్ల టర్నోవర్ సాధిచింది. -
100 శాతం ఆర్గానిక్ కాఫీ: ఫుడ్ బిజినెస్‌లోకి రిలయన్స్
సాక్షి,ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్) ఆహార పదార్థాలు, పానీయాల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం యూకేకు చెందిన ఫుడ్ అండ్ ఆర్గానిక్ కాఫీ చెయిన్ ప్రెటా మౌన్రేతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రెటా మౌన్రేకు దీర్ఘకాలిక మాస్టర్ ఫ్రాంచైజీగా కంపెనీ వ్యవహరించనుంది. ముందుగా ప్రధాన నగరాలు, ట్రావెల్ హబ్‌లతో ప్రారంభించి, ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని ఆర్బీఎల్ ప్రకటించింది. దేశీయ వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా తాజా, సేంద్రీయ ఆహార పదార్థాల్ని అందించాలనేదే లక్ష్యమని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఎండీ దర్శన్ మెహతా వెల్లడించారు. ఆసియాలో రెండు దశాబ్దాల క్రితం తొలి ప్రెట్ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన ప్రెటా మౌన్రేకు ఆర్బీఎల్తో భాగస్వామ్యం సంతోషాన్నిస్తోందని సీఈఓ పనో క్రిస్టౌ తెలిపారు. కస్టమర్లకు ఫ్రెష్ ఫుడ్‌తోపాటు, 100% ఆర్గానిక్ కాఫీని అందిస్తామన్నారు. కాగా అతిపెద్ద రిటైల్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ఆబీఎల్ గత 14 ఏళ్లుగా దేశంలో గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోంది. అలాగే ‘రెడీ టు ఈట్' అంటూ తొలిసారిగా 1986లో లండన్‌లో ప్రారంభమైంది ప్రెటా మౌన్రే. యూకే, యూఎస్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్, దుబాయి తదితర దేశాల్లో మొత్తం 550 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఆర్గానిక్ కాఫీ, శాండ్విచ్లు, సలాడ్లు, ర్యాప్‌లను అందిస్తోంది ప్రెటా మౌన్రే -
ఫిర్యాదుల పరిష్కారానికి ఏం చేస్తున్నారు..
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆపరేటర్లపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి 15 రోజుల్లోగా ప్రతిపాదనలను సమర్పించాలని స్విగ్గీ, జొమాటో తదితర ఆపరేటర్లను ఆదేశించింది. ప్రస్తుతం పాటిస్తున్న విధానం, అలాగే మెరుగుపర్చే ప్రతిపాదనలను ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగం బడా ఈ–కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్‌బీవో) ఆదేశించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సారథ్యంలో సోమవారం ఎఫ్‌బీవోలతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గడిచిన 12 నెలల వ్యవధిలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నంబరుకు (1915) స్విగ్గీపై 3,631, జొమాటోపై 2,828 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు వివరించింది. డెలివరీ చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులులాంటి ప్రతి చార్జీ గురించి వినియోగదారులకు పారదర్శకంగా చూపాలని సూచించినట్లు తెలిపింది. స్విగ్గీ, జొమాటో సహా ఎఫ్‌బీవోలు, రెస్టారెంట్ల సమాఖ్య ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్ప్‌లైన్‌కి వచ్చిన ఫిర్యాదులపై ఇందులో చర్చించారు. తాము మెరుగైన సర్వీసులు అందించడానికి లేకుండా ఎఫ్‌బీవోలు కస్టమర్ల వివరాలను ఇవ్వడం లేదంటూ ఎన్ఆర్ఏఐ ఆరోపించింది. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ తీసుకోవడంతో పాటు డెలివరీ చార్జీలను కూడా ఎఫ్‌బీవోలే ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు, తాము ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేస్తున్నామని, దీన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉందని ఎఫ్‌బీవోలు తెలిపాయి. -
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్‌ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్‌లు వేరు. ల్యాప్‌టాప్‌లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్‌ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్‌రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్‌లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్‌రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్‌కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్‌క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్‌లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్‌కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
బంగారు బామ్మలు..
వయసు అనేది భారం అనుకోవడం లేదు ఈ బామ్మలు. సిక్స్టీ ప్లస్‌లో ఫుడ్ బిజినెస్‌లు స్టార్ట్ చేసి ‘స్టార్’లుగా వెలిగిపోతున్నారు. ఐడియాలు యాపిల్ చెట్టుకింద మాత్రమే రావాలని లేదు. వంటగదిలో కూడా వస్తాయి. ముంబైకి చెందిన హర్షకు అలాగే వచ్చింది. లాక్డౌన్ సమయం అది. బామ్మ ఊర్మిళ అషేర్ రకరకాల ఊరగాయలు, టిఫిన్ల రుచి చూపించింది. జన్మకు మరిచిపోలేని రుచులవి. ఈ రుచులనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించాడు హర్ష. బామ్మతో చెప్పాడు. ‘నీదే ఆలస్యం. నేను రెడీ’ అని ఉత్సాహం చూపించింది బామ్మ. దోక్లా, ఖాండ్లీ, గాతిచ, తెస్లా...మొదలైన గుజరాతి వంటకాల రుచులతో ‘గుజ్జు బెన్ నాష్తా’ పేరుతో ‘క్లౌడ్ కిచెన్’ మొదలుపెట్టింది ఊర్మిళమ్మ. బ్రహ్మాండమైన హిట్టు. ఆ తరువాత యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ఎంత మంది సబ్‌స్క్రయిబర్స్! ఊర్మిలమ్మ వయసు 77 సంవత్సరాలు. ఇప్పుడు మనం పంజాబ్‌లోని చండీగఢ్‌కు వెళదాం. ఈ బామ్మ పేరు హర్బజన్ కౌర్. వయసు 95 సంవత్సరాలు. ‘ఒక మూలకు అదేపనిగా కూర్చోవడం అంటే రోగాలను సాదరంగా ఆహ్వానించడమే’ అని తరచుగా చెప్పే కౌర్ కొన్ని సంవత్సరాల క్రితం తీపివంటకాల వ్యాపారం మొదలుపెట్టి విజయం సాధించింది. రకరకాల వంటకాల రుచులను ఇంట్లోవాళ్లకు, చుట్టాలు పక్కాలకు చూపించే కౌర్ తన కూతురు కోరిక మేరకు ‘హర్భజన్స్’ పేరుతో మొదలు పెట్టిన తీపివంటల వ్యాపారం సూపర్‌హిట్ అయింది. ‘బెసన్ కీ బర్ఫీ’ అనేది తన తయారీలలో బెస్ట్ సెల్లర్‌గా పేరు తెచ్చుకుంది. తండ్రి దగ్గర నేర్చుకున్న వంద సంత్సరాల చరిత్ర ఉన్న ఒక వంటకం స్ఫూర్తితో ‘బెసన్ కీ బర్ఫీ’కి రూపకల్పన చేసింది కౌర్. కోల్‌కతాకు చెందిన ఇతి మిశ్రా వయసు 81 సంవత్సరాలు. ఆమె దృష్టిలో ‘వంట’ అనేది ‘ఈరోజు చేయాల్సిన తప్పనిసరి పని’ కాదు. ఉత్సాహంతో చేసే ఒక సృజనాత్మక ప్రయాణం. మిశ్రాకు బోలెడు బంధుగణం ఉంది. వారి నుంచి అపురూపమైన వంటకాలను నేర్చుకుంది. ఆమె వంటకాల రుచికి మైమరిచిన అతిథులు ‘నువ్వు తప్పనిసరిగా వ్యాపారం మొదలుపెట్టాల్సిందే’ అని బతిమిలాడేవాళ్లు. మిశ్రా వంటకాల రుచి విశేషాలు సోషల్ మీడియా ద్వారా అక్కడెక్కడో అమెరికా వరకు వెళ్లాయి. అలా కాలిఫోర్నియాకు చెందిన ‘ట్రావెలింగ్ స్పూన్’ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తన ఇల్లే కేంద్రంగా స్వదేశీ, విదేశీ టూరిస్ట్‌లకు బెంగాలీ సంప్రదాయ వంటకాల రుచి చూపిస్తూ ‘భేష్’ అనిపించుకుంటుంది మిశ్రా. అరవై ప్లస్ వయసులో తమిళనాడులోని చెట్టినాడ్‌లో ‘ది బంగ్లా’ పేరుతో హెరిటేజ్ హోటల్ ప్రారంభించి విజయం సాధించింది మీనాక్షి మెయప్పన్. చిల్లి గార్లిక్ ఫిష్ నుంచి చికెన్ విత్ బ్లాక్ పెప్పర్ వరకు ఎన్నో వంటకాలు ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మీనాక్షి వయసు 88 సంత్సరాలు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ‘నా వయసును వెనక్కి తీసుకెళుతుంది ఆ ఉత్సాహమే’ అని చమత్కరిస్తుంది మీనాక్షమ్మ. వీరు మాత్రమే కాకుండా ముంబైకి చెందిన కోకిలా పరేఖ్ (80 సంవత్సరాలు) ‘కేటీ–మసాల’, 80 సంవత్సరాల రాధా దాగా ‘త్రిగుణి ఈజీ ఈట్స్’... మొదలైనవి విజయపథంలో దూసుకువెళుతున్నాయి. వంటరుచులలోనే కాదు వ్యాపారనైపుణ్యాలలోనూ తమ సత్తా చాటుతున్నారు బంగారు బామ్మలు. -
బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫుడ్ బిజినెస్‌ను సంస్థలో విలీనం చేసే అంశంలో అత్యంత సమర్థవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఇటీవలే రుచి సోయా రూ.4,300 కోట్లు సమీకరించింది. పతంజలి ఆయురేŠవ్ద ఫుడ్ వ్యాపారాన్ని రుచి సోయాకు కొన్ని నెలల్లో బదిలీ చేయనున్నట్టు గత నెలలో రామ్‌దేవ్ ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద ఆహారేతర, సంప్రదాయక ఔషధాలు, వెల్నెస్ విభాగాల్లో పనిచేస్తుందని వెల్లడించారు. రుచి సోయా కేవలం వంట నూనెలు, ఆహారం, ఎఫ్ఎంసీజీ, న్యూట్రాస్యూటికల్స్, ఆయిల్ పామ్ సాగు విభాగాలపై దృష్టిసారిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రుచి సోయా 57,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున పెంచాలన్నది ప్రణాళిక. బిస్కెట్స్ వ్యాపారాన్ని పతంజలి ఆయుర్వేద గతేడాదే రూ.60 కోట్లకు రుచి సోయాకు బదిలీ చేసింది. పతంజలి ఆయుర్వేద, రుచి సోయాను వచ్చే అయిదేళ్లలో భారత్‌లో అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని రామ్‌దేవ్ స్పష్టం చేశారు. హిందుస్తాన్ యూనిలీవర్ తర్వాత రెండవ అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద నిలిచిందన్నారు. చదవండి: గోద్రెజ్ ఇండస్ట్రీస్ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..! -
వ్యాపారంలోకి నాగ చైతన్య.. వెంకటేశ్ కూతురి రిప్లై చూశారా?
అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్‌గానే బంగార్రాజు చిత్రంతో హిట్ కొట్టిన చై ప్రస్తుతం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. సమంతతో విడాకుల అనంతరం అటు ప్రొఫెషనల్‌గానే కాకుండా పర్సనల్ లైఫ్‌లోనూ చైలో చాలానే మార్పు కనిపిస్తుంది. ఇదివరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని చైతూ ఈ మధ్యకాలంలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నాడు. సినిమా ప్రమోషన్స్‌తో పాటు తనకి సంబంధించిన అప్డేట్స్ని సైతం అప్పుడప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా చై ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. షోయూ పేరుతో హైదరాబాద్‌లో ఓ సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి వెంకటేశ్ కూతురు ఆశ్రిత.. 'ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా' అంటూ బెస్ట్ విషెస్ అందించింది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!
సాక్షి,సిరిసిల్లఅర్బన్: టిఫిన్ కావాలంటే ఇప్పుడు హోటళ్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు స్వచ్ఛమైన, రుచికరమైన వేడి, వేడి టిఫిన్ ప్రస్తుతం మోబైల్ వాహనం రూపంలో అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా జనసంచారం ఉన్న ప్రధాన కూడళ్లలో మొబైల్ టిఫిన్ సెంటర్ల ద్వారా అందిస్తున్నారు. కేవలం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ సెంటర్లో దోసా, ఇడ్లీ, వడ, బోండా, పూరి నిమిషాల్లో తయారు చేసి వేడి, వేడిగా అల్లం చట్నీతో అందిస్తున్నారు. రుచి, శుచికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వినియోగదారులు వీటి వద్ద క్యూ కడుతున్నారు. ప్రజాదరణ పెరగడంతో వీటి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రహదారులే అడ్డాలుగా.. జిల్లా కేంద్రంలో విద్యానగర్, రగుడు, కొత్త చెరువు, బస్టాండ్, పెద్దూరు తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులను అడ్డాలుగా చేసుకొని చిరువ్యాపారులు మొబైల్ టిఫిన్ సెంటర్లను నడిపిస్తున్నారు. వీటికి అద్దె చెల్లించడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో హోటళ్లలో ఉండే ధరల కంటే తక్కువ ధరలకే టిఫిన్స్ అందిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి మోబైల్ టిఫిన్ సెంటర్ల వ్యాపారం నిరుద్యోగులకు వరంలా మారింది. నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగానే ఉండడంతో వీటి ఆధారంగా రోజుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తున్నారు. వీరు జీవనోపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఐదేళ్లుగా నడుపుతున్నా మాది తంగళ్లపల్లి గ్రామం. దాదాపు ఐదేళ్లుగా మొబైల్ టిఫిన్ సెంటర్‌ని నడిపిస్తున్నా. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో విద్యానగర్ చౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపి ఉంచుతా. నాతో పాటు మరో ఇద్దరం దీని వల్ల ఉపాధి పొందుతున్నాం. – తలగోప్పుల రాజు, మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు నాణ్యతకే ప్రాధాన్యత స్వచ్ఛమైన, రుచికరమైన టిఫిన్స్ అందించడంతో ఆదరణ పెరుగుతోంది. అలాగే హోటళ్లలో కంటే తక్కువ ధరకు అందిస్తున్నాం. వాహనదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆగి మరి తిని వెళ్తుంటారు. – మనోహార్, సిరిసిల్ల, మొబైల్ సెంటర్ నిర్వాహకుడు రుచికరంగా ఉంటుంది కొత్త చెరువు వద్ద ఒక మోబైల్ టిఫిన్ సెంటర్ ఉదయం అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు రుచికరంగా అందిస్తుండడంతో వాహనదారులు, వ్యాపారులు ఇక్కడే టిఫిన్ చేసి వెళ్లారు. నిర్వాహకులు అల్పాహరాన్ని రుచితో పాటు శుచి, శుభ్రత పాటిస్తున్నారు. – సందవేణి శ్రీనివాస్, సిరిసిల్ల