ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్‌మెంట్‌లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్‌లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్‌మెంట్‌లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్‌లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment