
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలైపోయింది. సుమారు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్‌కు సంబంధించిన డిజిటల్, ఓటీటీ రైట్స్ అన్నింటినీ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈసారి జియోహాట్‌స్టార్ ప్రకటనల ద్వారానే ఏకంగా రూ. 4,500 కోట్లు సంపాదించనుంది. దీనికోసం సంస్థ.. 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 ప్రకటన ధరలు
➤టీవీ ప్రకటనలు: రూ.40 కోట్ల నుంచి రూ.240 కోట్లు
➤ప్రాంతీయ టీవీ ప్రకటనలు: రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి
➤కనెక్టెడ్ టీవీ (CTV): 10 సెకన్లకు రూ.8.5 లక్షలు
➤మొబైల్ ప్రకటనలు: రూ.250 వరకు
స్పాన్సర్లు
జియోహాట్‌స్టార్ స్పాన్సర్ల జాబితాలో.. మై11సర్కిల్, ఫోన్‌పే, ఎస్బీఐ, బ్రిటానియా 50-50, అమెజాన్ ప్రైమ్, డ్రీమ్11, టీవీఎస్, మారుతి, అమెజాన్ ప్రైమ్, వోల్టాస్, ఎంఆర్ఎఫ్, జాగ్వార్, ఏషియన్ పెయింట్స్, అమూల్ మొదలైన 32 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్‌లో యాడ్స్ కోసం ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నాయి.
ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా?
జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్స్
ఐపీఎల్ 2025 సమయంలో.. జియోహాట్‌స్టార్ 40 మిలియన్ల అదనపు చెల్లింపు సబ్‌స్క్రైబర్‌ల ప్రత్యేక ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ఏర్పడిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. ప్రస్తుతం 62 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. 2025 ఫిబ్రవరి 14న ఈ సంఖ్య 50 మిలియన్లు. ఈ ఐపీఎల్ 2025 సీజన్‌కు 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను చేరుకోవడానికి సంస్థ కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment