ads
-
‘సాక్షి’పై చంద్రబాబు అక్కసు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అరాచకాలు, వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్నందుకే ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు మంత్రి మండలి సమావేశం మాటున అక్కసు వెళ్లగక్కారు. వైఎస్సార్సీపీ హయాంలో ‘సాక్షి’కి ప్రభుత్వ ప్రకటనల జారీని వక్రీకరిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. గతంలో శాసనసభ వేదికగా వక్రీకరణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన చంద్రబాబు.. ఈసారి కూడా అవే అవాస్తవాలను వినిపించారు. నాడు నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి శాసనసభలో లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. అయినాసరే చంద్రబాబు పదే పదే సాక్షి పత్రికపై బురదజల్లేందుకు యత్నిస్తుండటం ఆయన దిగజారుడుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారతి చైర్పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదువైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా ఉన్న సాక్షి పత్రికకు అక్రమంగా అధికంగా ప్రకటనలు ఇచ్చారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ భారతి సాక్షి పత్రికకు చైర్పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదు. ఏబీసీ మార్గదర్శకాల మేరకే ప్రకటనలు వైఎస్సార్సీపీ హయాంలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా రూ.443 కోట్ల ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇతర పత్రికలన్నింటికీ కలిపి కూడా అంత విలువైన ప్రకటనలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటంటే నాడు సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాంకాలను పరిగణలోకి తీసుకునే సాక్షి, ఈనాడుతోపాటు ఇతర పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో సాక్షి పత్రికకు ఐదేళ్లలో రూ.443 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు చెప్పింది అవాస్తవం. సాక్షి పత్రికకు ఆ ఐదేళ్లలో మొత్తం రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ అయ్యాయి. ఈనాడు పత్రికకు కూడా మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చారు. అయితే మూడున్నరేళ్ల తరువాత తమకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని ఈనాడు యాజమాన్యం సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటలు ఇవ్వలేదు. ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటే ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్టు అయ్యేది. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈనాడు పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. వాస్తవమేమిటంటే.. ఈనాడుకే కాదు.. సాక్షి పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటనల బకాయిలు రూ. 51 కోట్లు ఉండగా నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులోనే ఉన్నాయి. -
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్‌లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్‌లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఢిల్లీలో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ తొలగించిన ఎంసీడీ
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో ఎలక్షన్ కోడ్ అమలులో వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) తన 12 జోన్ల నుంచి 5,20,042 పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ (హోర్డింగ్‌లు, పోస్టర్లు, వాల్ పెయింటింగ్‌లు, జెండాలు) తొలగించింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మార్చి 16న ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో మే 25న ఢిల్లీలో ఓటింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ తొలగించిన మొత్తం పొలిటికల్ అడ్వర్టైస్మెంట్లలో.. 257280 హోర్డింగ్‌లు, 192601 వాల్ పెయింటింగ్‌లు & పోస్టర్లు, 40022 సంకేతాలు, 30139 జెండాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు ఈ నియమం అమలులో ఉంటుందని ఎంసీసీ పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటల్లోపు బహిరంగ ప్రదేశంలో ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడిని ప్రోత్సహించే పోస్టర్లు, హోర్డింగ్‌లు లేదా బ్యానర్లను తొలగించాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఎంసీడీ బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది. -
సోషల్ మీడియా క్యాష్ పార్టీ..
సాక్షి, అమరావతి: యువత బలహీనతలు సోషల్ మీడియా సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీ విషయాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తూ యూజర్ల రక్షణ, హానికర కంటెంట్‌ను అరికట్టడంలో అవి అలక్ష్యం వహిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థలు తమకు వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికే పనిచేస్తున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ అధ్యయనం వెల్లడిస్తోంది. తాజా నివేదిక ప్రకారం..2022లో అమెరికాలోని 18 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ఏకంగా రూ.91,541 కోట్లను సోషల్ మీడియా సంస్థలు ఆర్జించాయి. ఇందులో 12 ఏళ్లలోపు కేటగిరీలో ఏకంగా రూ.17,476 కోట్లు ప్రకటనల రాబడి ఉండటం విశేషం. స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం 30–40% యువ యూజర్ల వీక్షణల ద్వారా సోషల్ మీడియా సంస్థలకు సమకూరుతోంది. ఈ ట్రెండ్ ఏటా పెరుగుతూనే ఉంది. ఈ లెక్కన కొత్త సంవత్సరంలో వీటి ఆదాయంలో మరింత వృద్ధి కనిపించనుంది. స్నాప్‌చాట్‌కు అధిక రాబడి: హార్వర్డ్ వర్సిటీ బృందం అమెరికాలోని ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్ వినియోగదారులపై పరిశోధన చేసింది. 12 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ప్రకటనల ద్వారా యూట్యూబ్ రూ.7,983 కోట్లు, ఇన్‌స్ట్రాగామ్ రూ.6,676 కోట్లు, ఫేస్బుక్ రూ.1,140 కోట్లను రాబట్టినట్లు నివేదిక పేర్కొంది. 13–17 ఏళ్ల లోపు యూజర్ల వినియోగంలో టిక్‌టాక్ రూ.16,644 కోట్లు, యూట్యూబ్ రూ.9,986 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. మొత్తం ప్రకటనల ఆర్జనలో స్నాప్‌చాట్ 41%, టిక్‌టాక్ 35%, యూట్యూబ్ 27%, ఇన్‌స్ట్రాగామ్ 16% వాటా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనూ గణనీయంగా వృద్ధి: భారత్‌లో సగటు వ్యక్తి సోషల్ మీడియా వినియోగం రోజుకు 192 నిమిషాలుగా ఉన్నట్లు పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా (ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్) స్థూల ప్రకటనల ఆదాయం రూ.18,308 కోట్లుగా నమోదైంది. ఇది 2022 ఆర్థిక సంవ్సతరంతో పోలిస్తే 13% వృద్ధి చెందింది. త్వరలోనే మెటా యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించే అవకాశాన్ని అన్వేషిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెడిసీర్ నివేదిక ప్రకారం దేశంలో డిజిటల్ ప్రకటనల విలువ 2020లో రూ.24,966 కోట్ల నుంచి 2030కి రూ.2.91 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయంగా ఇన్‌స్ట్రాగామ్ ప్రకటనల కోసం ప్రతి క్లిక్కి సగటున రూ.66.06 వసూలు చేస్తోంది. టెక్ కంపెనీల నుంచి ఎక్కువ పారదర్శకత ఉండాలన్నా..యువత మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలను అరికట్టాలన్నా ప్రభుత్వ జోక్యం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉంటే చిన్నా రులు, యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుని వచ్చే హాని కరమైన ప్రకటన పద్ధతులను తగ్గించవచ్చని వీరు అభిప్రా యపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా డిజిటల్, సోషల్ మీడియా నియంత్రణలపై డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేస్తోంది. -
టయోటా హైలక్స్ యాడ్ బ్యాన్ చేసిన యూకే - కారణం ఇదే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న జపనీస్ వాహన తయారీ దిగ్గజం 'టయోటా' (Toyota)కు యూకేలో గట్టి షాక్ తగిలింది. సామాజిక బాధ్యత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు కంపెనీ ప్రకటనను నిషేధిస్తూ ఏఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. టయోటా హైలక్స్ యాడ్ నిలిపేయడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గతంలో ఇలాంటి నిషేధాలు విధించారా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. యూకే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA) పర్యావరణ బాధ్యతారహిత డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తున్న రెండు టయోటా ప్రకటనలను నిషేధించింది. ఇందులో ఒకటి పోస్టర్, మరొకటి వీడియో. వీడియోలో టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కులు కఠినమైన భూభాగాల్లో న్యావిగేట్ చేస్తున్నాయి. ఇందులో రివర్స్ క్రాసింగ్ కూడా ఉంది. ఆ తరువాత పట్టణ ప్రాంతం గుండా వెళ్లడం చూడవచ్చు. రోడ్డులో వాటికవి విడిపోవడం చూడవచ్చు. ఇవన్నీ వినియోగదారులను కొంత తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్ట్ విషయానికి వస్తే.. ఇందులో తిరగటానికే పుట్టాను అన్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా కొండల్లో దిగటం, ఎత్తైన ప్రదేశాల్లో దుమ్ములేపుకుంటూ ప్రయాణించడం వంటివి ఇందులో చూడవచ్చు. ఈ ప్రకటనలు పర్యావరణ హానికరమైన ప్రవర్తనను ఆమోదించాయని, అధిక కార్బన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.. ఈ ప్రకటనలను నిషేదించింది. ఈ ప్రకటనలపై అడ్‌ఫ్రీ సిటీస్ కో-డైరెక్టర్ వెరోనికా విగ్నాల్ మాట్లాడుతూ.. వాహనాలు నదులు, అడవి గడ్డి మైదానాల గుండా వేగంగా డ్రైవింగ్ చేస్తే.. ప్రకృతి దెబ్బతింటుందని చెబుతూ, యూకేలో చాలా వాహనాలు పట్టాన ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అలాంటిది ఇలాంటి ప్రకటలను ఎలా చిత్రీకరిస్తారని వాదించింది. ఇదీ చదవండి: లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్ ఈ ప్రకటనను కంపెనీ సమర్థిస్తూ.. వ్యవసాయ, అటవీ ప్రాంత వాసులకు ఇలాంటి కార్లు చాలా ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ, ప్రకటనలో అలాంటి కార్మికులు కనిపించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఫుటేజీని యూకే వెలుపల ఉన్న ప్రైవేట్ భూమిలో చిత్రీకరించినట్లు, పోస్టర్ మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినట్లు ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులో మళ్ళీ మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
యాడ్.. మార్చేనా పబ్లిక్ మూడ్!
సూటిగా సుత్తిలేకుండా..గురిపెడితే టార్గెట్ రీచ్ అయ్యేలా..విమర్శనాస్త్రం సంధిస్తే.. వైరిపక్షం విలవిల్లాడేలా ఉంటున్నాయి రాజకీయ పార్టీల లఘు చిత్రాల ప్రకటనలు. పబ్లిక్ మీటింగ్‌లో అగ్రనేతలు దంచికొట్టే ఉపన్యాసాలు ఓటరును ఎంత మేర ప్రభావితం చేస్తాయో లేదో కానీ, టీవీల్లో ప్రకటనల రూపంలో వస్తున్న పొలిటికల్ యాడ్స్ మాత్రం ప్రజల మూడ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికార పార్టీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల్లో నెరవేర్చని అంశాలను టార్గెట్ చేస్తూ బీజేపీ వీడియోలు ఉంటున్నాయి. ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏం మార్పు తెచ్చామన్నది అధికార బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. మొత్తంగా ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆలోచింపజేసేలా.. ఆకర్షించేలా పొలిటికల్ యాడ్స్‌తో అదరగొడుతున్నాయి. ఓటర్‌కు వీలైనంత రీచ్ అయ్యేలా... పొలిటికల్ యాడ్స్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటోందని చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనా వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ సైతం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన మేలు ఏంటి..? మళ్లీ కేసీఆర్‌నే ఎందుకు సీఎం చేయాలన్నది సూటిగా అర్థమయ్యేలా లఘు చిత్రాలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం గుప్పిస్తోంది. ఇందుకోసం రాజకీయ ప్రత్యర్థులను ఠక్కున గుర్తించేలా క్యారెక్టర్లు, వారి హావభావాలను సైతం పలికించేలా ఈ వీడియోల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమర్శల ఘాటుతో ఫిర్యాదులు ఈ పొలిటికల్ యాడ్స్‌లో విమర్శల ఘాటు పెరగడంతో ఆయా పొలిటికల్ పార్టీల నాయకులు ఆ ప్రకటనలు నిలిపివేయించాలని ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదులు చేశారు. అంతలా పొలిటికల్ యాడ్లు వేడి పెంచుతున్నాయి. ‘గులాబీ జెండా..తెలంగాణకు అండ’ ట్యాగ్‌తో బీఆర్ఎస్ షార్ట్ వీడియోలను చేస్తే..‘‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..’’అన్న ట్యాగ్‌లైన్‌ను కాంగ్రెస్ పార్టీ వాడుతోంది. ఇక బీజేపీ ‘‘సాలు దొర..ఇక నీకు సెలవు దొర..’’ట్యాగ్‌లైన్‌తో పిట్టల దొర క్యారెక్టర్‌ను పెట్టి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ లఘు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కంటెంట్ ఒకరిది.. మార్ఫింగ్ మరొకరిది.. ‘‘అప్పుడెట్లా ఉండే తెలంగాణ..ఇప్పుడెట్లుంది తెలంగాణ’’ అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది ఈ రీల్ ఫార్ములా ఫాలో అయ్యారు. తీన్మార్ స్టెప్పులతో సదరు నాయకుడి కామెంట్లతో ఉన్న ఈ షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యాయి. అయితే ఎంతో ప్లానింగ్, కంటెంట్‌తో తయారు చేసిన ఈ షార్ట్ వీడియోలను ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడి ప్రత్యర్థి పార్టీలు తిప్పికొడుతున్నాయి. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ‘అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లయింది తెలంగాణ’ వీడియోలను ప్రత్యర్థి పార్టీల సోషల్‌మీడియా గ్రూపుల సభ్యులు మార్ఫిగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్టా్రగామ్ ఇలా అన్ని వేదికల్లోనూ వీడియోలు, రీల్స్.. వాటిపై ప్రత్యర్థుల మార్ఫింగ్‌లు హోరెత్తుతున్నాయి. -నాగోజు సత్యనారాయణ -
ఘనంగా ఏఐఐ వార్షికోత్సవ వేడుకలు.. ఇద్దరు భారతీయల అరుదైన ఘనత
అమెరికా న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషన్ అడ్వటైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన శ్రీనివాసన్ స్వామీ, రమేష్ నారాయణ్‌లకు ఐఏఏ అసోసియేషన్ ‘నార్త్ స్టార్’ అవార్డులతో ఘనంగా సత్కరించింది. 2014లో ఐఐఏ గ్లోబుల్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాసన్ స్వామి ప్రశంసలందుకున్నారు. 2014 లండన్‌లో జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్‌లో స్వామి, నారాయణ్‌లు గ్లోబుల్ చాంపియన్లుగా గుర్తింపు పొందారు. కాగా, నారాయణ్ ఐఏఏ గ్లోబల్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా, దాని ఏపీఏసీ రీజీయన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వారిద్దరూ ఐఏఏ భారత బోర్డ్ మాజీ అధ్యక్షులు సేవలందించారు. అడ్వటైజింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై శ్రీనివాసన్ స్వామి,రమేష్ నారాయణ్‌లను పరిశ్రమ వర్గాల ప్రతినిధుల అభినందనలు తెలుపుతున్నారు. -
భారీ షాక్.. ఇకపై మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లు డబ్బులు కట్టాల్సిందే!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ (ట్విటర్) తరహాలో మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించుకోవాలంటే నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనుందని సమాచారం. అయితే, ఈ సబ్ స్క్రిప్షన్ విధానం యాడ్స్ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారీ చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలకు చెందిన మెటా, ఇన్స్టాగ్రామ్ యూజర్ల నుంచి యాడ్- ఫ్రీ ఎక్స్పీరియన్స్ పేరుతో మెటా నెలకు రూ.1,165 వసూలు చేస్తుంది. మరి ఆసియా దేశాల్లో అతిపెద్ద సోషల్ మీడియా మార్కెట్‌గా కొనసాగుతున్న భారత్‌లోని యూజర్లకు ఈ సబ్స్క్రిప్షన్ విధానం ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా భారత్ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌కు అనుమతి ఇవ్వనుందనే అంచనాలు నెలకొన్నాయి. యూరప్‌లో మెటా నోయాడ్స్ సబ్స్క్రిప్షన్ ధరలు పలు నివేదికల ప్రకారం.. డెస్క్‌టాప్ పరికరాలలో ప్రకటనలు లేకుండా మెటా లేదా ఇన్స్ట్రాగ్రామ్ని యాక్సెస్ చేయాలనుకునే వినియోగదారుల నెలకు 10.46 డాలర్లకు సమానమైన సుమారు 10 యూరోల సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేయాలని మెటా ఆలోచిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే వారి వద్ద నుంచి ఒక్కో ఖాతాకు దాదాపు 6 యూరోల అదనపు ఛార్జీని విధించవచ్చు. మొబైల్ యూజర్ల సబ్స్క్రిప్షన్ ధర నెలకు దాదాపు 13 యూరోలకు పెరగవచ్చని అంచనా. కమిషన్ల భారం తగ్గించుకునేందుకే యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌లో ఉదాహరణకు మెటా,ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్ యాప్స్‌ను యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్‌ను తమ ప్లేస్టోర్లలో ఉంచేందుకు గూగుల్, యాపిల్ సంస్థలు మెటా నుంచి కమిషన్ తీసుకుంటుంది. ఇప్పుడా కమిషన్ ఛార్జీలు పెంచడంతో .. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు మెటా నోయాడ్స్ అంటూ కొత్త పేమెంట్ మెథడ్ అస్త్రాన్ని వదిలింది. చదవండి👉 కోర్టు హాలులో గూగుల్‌పై విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల! -
50 సెకన్లకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ వంటి అగ్ర నటులందరితోనూ నటించిన నయన్ తాజాగా షారుక్ ఖాన్ జవాన్‌లో మెప్పించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే నయన్ చాలారోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన్ కొద్దిరోజుల క్రితం తన పిల్లల ఫోటోలు చూపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టింది. నిమిషాల్లోనే ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చేశారు. ప్రస్తుతం ఆమెకు 32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నయనతార గత కొన్నేళ్లుగా కొత్త స్కిన్ కేర్ కంపెనీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆమె తరచుగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను కూడా ఆన్లైన్లో విక్రయించేందుకు ప్లాన్‌లో ఉంది. ఇలా ఆమె వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టడం విశేషం. తన వ్యాపార ఉత్పత్తులు షేర్ చేసేందుకే ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయన్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రకటనకు కోట్లలో రెమ్యునరేషన్: ఈ సందర్భంలో నటి నయనతార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. కేవలం 50 సెకన్ల ప్రకటనలకే నయనతార దాదాపు రూ. 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రకటనల సమయం అంతకు మించి పెరిగితే తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు. సినిమా ద్వారా కోట్లకు పడగలెత్తినా.. కొత్త మార్గాల్లో సంపాదిస్తూ.. ఏడాదికేడాది ఆస్తుల విలువను పెంచుకుంటుంది నయన్. (ఇదీ చదవండి: గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ) -
పాపులారిటీలో మహేష్ ని మించిపోయిన సితార
-
టాటా మోటార్స్ ఏడీఎస్కు టాటా
న్యూఢిల్లీ: అమెరికన్ డిపాజిటరీ షేర్ల(ఏడీఎస్‌లు)ను స్వచ్చందంగా డీలిస్ట్ చేస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. సాధారణ షేర్లను ప్రతిబింబించే వీటిని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. సోమవారం(23న) ట్రేడింగ్ ముగిశాక ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో వీటి ట్రేడింగ్ నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఏడీఎస్‌లు కలిగిన వాటాదారులు వీటిని సాధారణ షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు 2023 జులై24లోగా ఎక్స్ఛేంజీ లోని డిపాజిటరీవద్ద దాఖలు చేయవలసి ఉంటుందని టాటా మోటార్స్ తెలియజేసింది. కాగా.. దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన టాటా మోటార్స్ ఈక్విటీ షేర్లపై ఈ ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. -
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్‌కు, వారి కుటుంబ సభ్యులకు.. -
అవి చూసే ఫెయిలయ్యా: 75 లక్షలకు ప్లాన్, సుప్రీం రియాక్షన్
న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో అసభ్యకరమైన కంటెంట్ ప్రకటనల కారణంగా తన దృష్టి మళ్లిందని తదర్వారా పరీక్షలో ఫెయిల్ అయ్యానని దాఖలైన పిటీషన్‌పై సీరియస్‌గా స్పందించింది. "ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇదొకటి" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రకమైన పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాతు పిటీషనర్‌కు భారీ జరిమానా కూడా విధించింది. దీంతో పిటీషనర్ లబోదిబోమన్నాడు. వివరాలను పరిశీలిస్తే..గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లో వచ్చిన అశ్లీల ప్రకటనల కారణంగా తాను పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్కాలేక, ఎగ్జామ్ ఫెయిలయ్యానని ఇందుకు రూ. 75 లక్షల పరిహారం ఇప్పించాలంటూ ఆనంద్ కిషోర్ చౌదరి అనే ఒక నిరుద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్ పోలీసు పరీక్షకు సన్నద్ధమవుతున్న సమయంలో తమ దృష్టిని మరల్చేలా లైంగిక, అసభ్యకరమైన యాడ్స్ చూపించారంటూ ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. నచ్చకపోతే యాడ్స్ చూడకండి, వాటిని చూడాలా వద్దా అనేమీ మీ హక్కు అని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్షరూపాయల జరిమానా విధించింది. అయితే తాను నిరుద్యోగినని, క్షమించి జరిమానా తగ్గించాలని వాపోవడంతో కోర్టు కనికరించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయొద్దని ధర్మాసనం మందలించింది.జరిమానా తగ్గిస్తాం కానీ క్షమించ లేమంటూ జరిమానాను రూ. 25 వేలకు తగ్గించింది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని అతగాడిని ఆదేశించింది. -
మస్క్ సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?
న్యూఢిల్లీ:టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ తరవాత తమ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగిందంటూ ప్రకటనదారులకు భరోసా ఇస్తోంది ట్విటర్. ఈ విషయాన్ని ప్రపంచ బిలియనీర్ ట్విటర్ బాస్ మస్క్ ట్విటర్లో షేర్ చేశారు. బ్లూటిక్ ఫీజు, భావ ప్రకటనా స్వేచ్ఛ, విద్వేషపూరిత కంటెంట్, ఇతర గందరగోళాల మధ్య యూజర్లు ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్‌లకు తరలిపోతున్నారన్న అంచనాల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. Twitter usage is at an all-time high lol — Elon Musk (@elonmusk) November 8, 2022 తమ రోజువారీ వినియోగదారుల వృద్ధి "ఆల్-టైమ్ హై"కి చేరుకుందని ట్విటర్ తన ప్రకటనదారులకు తెలిపింది. గత వారం ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత మానిటైజబుల్ డైలీ యూజర్ (mDAU) వృద్ధి 20 శాతానికి పైగా వేగం పుంజుకుందని,1.5 కోట్ల అదనపు యూజర్లు చేరారని ట్విటర్ పత్రాల ఆధారంగా ది వెర్జ్ నివేదించింది. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్లో అమెరికాలో మరింత వేగంగా పెరుగుతోంది. ట్విటర్ తాజా 15 మిలియన్ల కంటే ఎక్కువ mDAUలను జోడించుకొని, క్వార్టర్ బిలియన్ మార్క్‌ను దాటింది. అంతకుముందు 16.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. I just hope the servers don’t melt! — Elon Musk (@elonmusk) November 8, 2022 కాగా ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ ఆదాయం ఒక శాతం పడిపోయి 1.18 బిలియన్ డాలర్లకు, ఆ తరువాత క్వార్టర్లో 270 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇది ప్రకటనదారులను ప్రభావితం చేసింది. ఇక తాజా పరిణామల నేపథ్యంలో సమస్యాత్మక కంటెంట్‌తో పాటు తమ ప్రకటనలు కనిపించవచ్చనే ఆందోళనతో ఇప్పటికే వోక్స్వ్యాగన్ గ్రూప్ అనేక ఇతర కంపెనీలతో కలిసి ట్విటర్లో యాడ్స్‌ను నిలిపివేసింది. అలాగే డానిష్ బ్రూయింగ్ కంపెనీ కార్ల్స్‌బర్గ్ గ్రూప్ కూడా తన మార్కెటింగ్ బృందాలకు దాదాపు ఇలాంటి సలహానే ఇచ్చింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా ప్రకటనలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్‌కు భారీ షాక్.. 30రోజుల గడువిచ్చిన కోర్టు.. మాట వినకపోతే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. స్మార్ట్ ఫోన్లుకు సంబంధించి తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టు శామ్సంగ్కు 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.78 కోట్లు) ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపినందుకుగాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్‌కి కూడా అదనంగా మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.1.10 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు. 2016 నుంచి 2018 మధ్య S7, S7 ఎడ్జ్.A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్, నోట్ 8 గెలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియాలో విక్రయించింది. ప్రత్యేకంగా వీటిని తయారు చేశామని నీళ్లలో తడిచినా పాడవవంటూ భారీగా ప్రకటనలు కూడా ఇచ్చింది. నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి. దీంతో తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై శాంసంగ్ స్పందిస్తూ.. 2016 నుంచి 2017 మధ్యలో అమ్మకాలు జరిపిన ఏడు మోడళ్లపై మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. ప్రస్తుత శాంసంగ్ ఫోన్లలో ఈ తరహా సమస్యలు లేవని తెలిపింది. చదవండి: Gmail Storage: మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్‌తో ఇలా చేయండి! -
మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే, చూస్తూ ఊరుకోం ఇక్కడ!
భారత్‌కు చెందిన పర్ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్‌కి షాక్ తగిలింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన మహిళలను అగౌరవపరిచేలా ఉన్న సెమీ బూతు అడ్వెర్టైజ్మెంట్పై కేంద్రం కన్నెర్ర చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ యాడ్ కనిపించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. లేయర్స్ సంస్థ షాట్ పేరుతో ఇటీవల ఓ యాడ్ ప్రోమోను రెడీ చేసింది. ఈ యాడ్ రిలీజ్ కావడం ఆలస్యం దుమారం చెలరేగింది. ఈ యాడ్ ద్వందార్థాలతో మహిళలను కించపరిచేలా మహిళలపై లైంగిక దాడులకు ప్రోత్సాహం అందించేలా ఉందంటూ స్త్రీ వాదులతో పాటు ప్రజా సంఘాలు విమర్షలు ఎక్కుపెట్టాయి. సోషల్ మీడియాలోనూ ఈ యాడ్‌కి పెద్దగా మద్దతు లభించలేదు. అన్ని వైపుల నుంచి ఘాటైన విమర్శలు ఎదుర్కొంది లేయాన్స్. లేయాన్స్ తాజా యాడ్ వివాదంపై కేంద్రం కూడా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాడ్ యూట్యూబ్, ట్విటర్లో కనిపంచడానికి వీలులేదంటూ ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ ఐటీ రూల్స్ - 2021కి విరుద్ధంగా ఉన్నందున ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూట్యూబ్, ట్విటర్లకు ఈమెయిల్ ద్వారా ఆదేశాలు పంపింది కేంద్రం. Fuming at cringe worthy ads of the perfume ‘Shot’. They show toxic masculinity in its worst form and clearly promote gang rape culture!The company owners must be held accountable. Have issued notice to Delhi Police and written letter to I&B Minister seeking FIR and strong action. pic.twitter.com/k8n06TB1mQ — Swati Maliwal (@SwatiJaiHind) June 4, 2022 చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్‌పై దుమారం -
టీవీ ప్రకటనలు గతేడాది 22% అప్
ముంబై: కోవిడ్–19 మహమ్మారితో 2020లో టీవీ ప్రకటనలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినప్పటికీ 2021లో మాత్రం యాడ్ల పరిమాణం గణనీయంగా పుంజుకుంది. 22 శాతం పెరిగి 1,824 మిలియన్ సెకన్లుగా నమోదైంది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. టీవీ ప్రకటనల పరిమాణం 2019లో 1,542 మిలియన్ సెకన్లుగా ఉండగా 2020లో 1,497 మిలియన్ సెకన్లకు తగ్గింది. టీవీలో మొత్తం 9,239 ప్రకటనకర్తలు.. 14,616 బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ ఇచ్చారు. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగం ప్రకటనలు (1,117 మిలియన్ సెకన్లు) అత్యధికంగా ఉండగా, 185 మిలియన్ సెకన్లతో ఈ–కామర్స్, నిర్మాణ రంగ ప్రకటనలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
టార్గెట్ ట్విటర్..! కాకపుట్టిస్తోన్న ఇండియన్ ‘కూ’
ట్విటర్‌కు పోటీగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయులకు ‘కూ’ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కూ యాప్‌ను భారతీయులు భారీగానే ఆదరిస్తున్నారు. కూ యాప్‌ను ప్రారంభించిన 16 నెలల కాలంలో 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. విదేశీ సోషల్ మీడియా యాప్స్‌తో పోటీపడుతూ ‘కూ’ యాప్ దూసుకెళ్తోంది. ఫేస్బుక్, ట్విటర్లకు పోటీగా...! స్వదేవీ సోషల్ మీడియా యాప్ కూ ఒక బిగ్ బ్యాంగ్‌తో ప్రారంభమైంది. యూజర్లు, కొన్ని ప్రభుత్వ అధికారుల నుంచి కూ యాప్ భారీగా ఆసక్తిని సంపాందించింది. ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో కూ యాప్ గణనీయంగా పుంజుకుంది. ప్రముఖ సోషల్‌మీడియా ట్విటర్‌ను ఎదుర్కొనేందుకు కూ యాప్ యాడ్స్ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అదిరిందయ్యా ముఖేశ్ అంబానీ.. ! జెప్‌బెజోస్, ఎలన్ మస్క్‌తో పాటు.. ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ ప్రకారం....గత 90 రోజుల్లో ఫేస్బుక్ యాడ్స్ కోసం కూ కంపెనీ సుమారు రూ. 2.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 2.6 లక్షల మేర కూ యాప్ ఖర్చు చేసింది. గత మూడు నెలల్లో ఫేస్బుక్లో అత్యధికంగా ఖర్చు చేసిన కంపెనీగా కూ యాప్ నిలిచింది. కూ యాప్ వ్యూహంలో భాగంగా - హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, గుజరాతీ, కన్నడ, తమిళం , తెలుగు వంటి భాషలతో యాప్‌ను రూపొందించింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం అమెరికాకు చెందిన ట్విట్టర్‌ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు. చదవండి: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..! -
దాయాది దేశాల మ్యాచా? మజాకా? 10 సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షలు!
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఇంకా ప్రారంభమే కాలేదు అప్పుడే రికార్డుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాది దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఉండే క్రేజే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు కాసుల వర్షం కురిపించనుంది.(చదవండి: ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. యూట్యూబ్ మ్యూజిక్ సరికొత్త ఆఫర్!) ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే ఈ దాయాదీ దేశాల మ్యాచ్ సమయంలో యాడ్స్ కోసం 14 మంది స్పాన్సర్లతో ఒప్పంద సంతకాలు చేసింది. అందరూ ఊహించినట్టే భారత్-పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో 10 సెకన్ల యాడ్ కోసం మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు అయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్‌స్పోర్ట్స్‌కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లైవ్ బ్రాడ్ కాస్ట్ భాగస్వామి అయిన స్టార్ స్పోర్ట్స్ 10 సెకన్ల యాడ్ కోసం 25-30 లక్షల రూపాయలు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ యాడ్స్ విషయంపై స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధిని స్పష్టత ఇవ్వలేదు.(చదవండి: Windows 11: వచ్చిందోచ్.. మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుందా?) ఇందులో డ్రీమ్ 11, బైజుస్, ఫోనెప్, థంప్స్, విమల్, హావెల్స్, జియోమార్ట్, netmeds.com సహ-ప్రజంటింగ్ స్పాన్సర్లు, ఆకాశ్, స్కోడా, వైట్ హాట్జ్ర్, గ్రేట్ లెర్నింగ్, కాయిన్ డిఎక్స్, మరియు ట్రెండ్స్ అసోసియేట్ స్పాన్సర్లు ఉన్నారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ యాడ్స్ రేట్లు 10 సెకండ్ల కోసం 25-30 లక్షల చెల్లించినట్లు తెలుస్తుంది. అలాగే, సహ-ప్రజంటింగ్ స్పాన్సర్ షిప్ 60-70 కోట్లకు విక్రయించబడింది. బ్రాడ్ కాస్టర్ అసోసియేట్ స్పాన్సర్ షిప్ 30-35 కోట్ల కొరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. 2016లో మన దేశంలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ టీ20 సందర్భంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, దూరదర్శన్లలో 17.3 రేటింగ్ తో 83 మిలియన్ల మందికి చేరుకుంది. ఇప్పటికే వరకు ఇదే అత్యుత్తమ రేటింగ్ గల టీ-20 మ్యాచ్. -
పది సెకండ్ల యాడ్‌కు 18 లక్షలా....!
కోవిడ్-19 దెబ్బకు ఐపీఎల్-14 వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండో దఫా ఐపీఎల్-14 యూఎఈలో కొనసాగుతుంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్‌స్పోర్ట్స్‌కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐపీఎల్-14 రెండో దఫా నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ యాడ్ రేట్లను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.దసరా, దీపావళి పండుగ సీజన్ల నేపథ్యంలో పలు కంపెనీ బ్రాండ్స్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో సుమారు 25 శాతం నుంచి 30 శాతం మేర యాడ్స్ రేట్లను పెంచింది. చదవండి: Forgotten Password: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! విశ్వసనీయ వర్గాల ప్రకారం.. తొలి దఫా ఐపీఎల్లో ఒక యాడ్ పది సెకన్ల పాటు టీవీలో కన్పించేందుగాను సుమారు రూ. 13 నుంచి 14 లక్షలు ఉండగా...ప్రస్తుతం రూ. 18 లక్షలను ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్స్ పెంపుపై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పందించలేదు. స్టార్‌స్పోర్ట్స్‌ను ఇప్పటివరకు 12 బ్రాండ్ కంపెనీలు సంప్రదించారు. సహ-సమర్పణ స్పాన్సర్లుగా... డ్రీమ్ 11, ఫోన్‌పే, బైజుస్ ఉన్నాయి. అసోసియేట్ స్పాన్సర్లుగా..బింగో, కమలా పసంద్, ఏఎమ్ఏఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, క్యాడ్బరీ డైరీ మిల్క్, అమెజాన్ ప్రైమ్, థమ్స్ అప్, గార్నియర్ మెన్, క్రెడ్ కంపెనీలు ఉన్నాయి ఎక్స్చేంజ్4మీడియా నివేదిక ప్రకారం...ఐపీఎల్-14 మొదటి దశలో 10 సెకన్ల యాడ్స్‌కు సుమారు రూ. 14.1 నుంచి 14.3 లక్షలను స్టార్‌స్పోర్ట్స్ ఛార్జ్ చేసింది. సహ-ప్రాయోజిత వ్యయం రూ.110-125 కోట్ల పరిధిలో ఉండగా, అసోసియేట్ స్పాన్సర్షిప్ ధర రూ.65-70 కోట్లుగా ఉంది. బ్రాడ్‌కాస్టర్ సహ-సమర్పించే స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.2 లక్షలు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.6 లక్షలను వసూలు చేసింది. చదవండి: iPhone13: ఐఫోన్-13పై చిప్ దెబ్బ..కొన్ని వారాలు ఎదురు చూడాల్సిందేనా? -
కాసుల వర్షం కురిపిస్తున్న బిగ్‌బాస్ షో...!
ముంబై: బిగ్‌బాస్ ఒక రియల్టీ గేమ్ షో. దేశ వ్యాప్తంగా బిగ్‌బాస్ టెలివిజన్ రంగంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. బిగ్ బాస్ షోను తొలిసారిగా హిందీ భాషలో స్ట్రీమ్ అవ్వగా...హిందీలో బిగ్‌బాస్ విజయవంతంకావడంతో నిర్వాహకులు ఇతర భాషలో కూడా వచ్చేవిధంగా పలు చర్యలను తీసుకున్నారు. బిగ్‌బాస్ దేశవ్యాప్తంగా హిందీతో పాటుగా మిగతా ఆరు భాషలో ఈ షో విజయవంతంగా నడుస్తోంది. బిగ్‌బాస్‌ను హిందీ, కన్నడ, బంగ్లా, తెలుగు, మరాఠీ, మలయాళం, తమిళ భాషల్లో ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తుంది. చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే తాజాగా బిగ్‌బాస్ ఓటీటీ షోను ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 వూట్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ చేస్తుంది. గత ఏడాది కలర్స్ ఛానల్లో బిగ్‌బాస్ -14 స్ట్రీమ్ అయినప్పుడు సుమారు 3.9 బిలియన్ల నిమిషాలపాటు ఆడియన్స్ చూశారు. ప్రస్తుతం వూట్‌లో వస్తున్న ఈ షోకు ఆడియన్స్ మంచి ఆదరణ వస్తోంది. ప్రతి వారం 1.5-2 మిలియన్ల యూజర్లు బిగ్‌బాస్ ఓటీటీ షోను చూడడానికి వస్తోన్నట్లు తెలుస్తోంది. యూజర్లలో ఎక్కువగా 15-30 వయసు ఉన్న వారు ఉన్నారు. వయాకామ్ 18 మీడియా చేసిన ఓటీటీ ప్రయోగం విజయవంతమైనట్లు కంపెనీ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ రక్షిత్ పేర్కొన్నారు. వూట్ ను వాడే యూజర్లు ఏకంగా రెట్టింపుఐన్నట్లు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీలకు పోటీగా... బిగ్‌బాస్ ఓటీటీ రాకతో వూట్ దశ మారింది. భారత్‌లో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. బిగ్‌బాస్ ఓటీటీ ను వూట్‌లో ప్రసారం చేయడంతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు వ్యూయర్షిప్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఓటీటీ షోను వూట్ యాడ్స్‌ను అందిస్తూ ఉచితంగా చూసే వీలు కల్పించింది. బిగ్‌బాస్ ఓటీటీ షో లో స్విగ్గి, కాయిన్‌డీసీఎక్స్ వంటి కంపెనీలు యాడ్స్‌ను షోలో ప్రదర్శించడానికి ముందుకువచ్చాయి. బిగ్‌బాస్ ఓటీటీ షో వూట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. అడ్వటైజింగ్ నిపుణుల ప్రకారం బిగ్‌బాస్ ఓటీటీ ప్రకటనల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఓటీటీ గత నెల ఆగస్టు 8న ప్రారంభమవ్వగా...షోకు వ్యాఖ్యాతగా నిర్మాత కరణ్ జోహర్ వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్-15 షోకు కర్టన్‌రైజర్‌గా బిగ్‌బాస్ ఓటీటీ షో ఆరు వారాలపాటు వూట్‌లో స్ట్రీమ్ కానుంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
క్రియేటివిటీ అంటే ఇది..
Old TV Advertisements: అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్.. బిజినెస్‌కి అవసరమైన ప్రధాన సూత్రం. ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు, జనాలకు దగ్గరిదాకా తీసుకెళ్లేందుకు వీటికి మించిన పవర్ఫుల్ మార్గం మరొకటి ఉండదు. అందుకే వెరైటీ కాన్సెప్ట్‌లు, రకరకాల స్క్రిప్లతో తమలోని క్రియేటివిటీ మొత్తాన్ని చూపిస్తుంటారు యాడ్ మేకర్స్, డైరెక్టర్స్. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న యాడ్స్ ట్రెండ్.. పోను పోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఒకానొక టైంలో వచ్చిన యూనివర్సల్ యాడ్స్ మాత్రం జనాలకు బాగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా నైంటీస్, మిలీనియంలో బుల్లితెర ద్వారా ఇంటింటికీ చేరిన ఈ యాడ్స్.. ఇప్పటికీ తలుచుకున్నా ఆహ్లాదకరమైన ఓ అనుభూతి కలుగుతుంది. పిల్లలతో పాటు పెద్దల పెదవులపై చిరునవ్వు పూయిస్తుంది. విశేషం ఏంటంటే.. వీటిలో చాలావరకు క్రికెట్ మ్యాచ్‌ల మధ్యల్లో రిపీట్‌గా టెలికాస్ట్ కావడం వల్ల చాలామందికి బహుశా ఇవి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అతుక్కుపోయే గుణం ఉన్న ఫెవికిక్ను చేపల వేటను ఉపయోగించే ఈ ఫన్నీ యాడ్.. చివర్లో ఆ వ్యక్తి నవ్వే నవ్వు. ప్రాణం కన్నా డబ్బు మిన్న అనుకునే ఓ వ్యక్తికి నీటి బొట్టు ఇచ్చే భారీ షాక్.. ఎమ్‌సీల్ యాడ్ కోసం రూపొందించింది. జంతువుల్లో ఉన్న సెన్సిబుల్ ప్రేమను.. ఆడ పక్షి- దత్తత తాబేలు పిల్ల, ఆ పిల్లను యాక్సెప్ట్ చేసే మిగతా పక్షి పిల్లల ద్వారా చూపించిన సరదా యాడ్. చిన్నప్పుడు చదివిన కాకి-దాహం కథ.. రాళ్లకు బదులు ముక్కుతో పొడిచే కాకి.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే సాంగ్(తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది) కరెంట్ లేని ప్యాలెస్‌లో దీపం పెట్టే కూలీల కథ.. చివరిదాకా అర్థం కానీ ట్విస్ట్.. హ్యాపీడెంట్ చూయింగ్‌గమ్ యాడ్ మూకీ యాడ్లలో కొత్త ఒరవడి.. మిరిండా యాడ్ దురదృష్టంలోనూ సరదాను ఆస్వాదించొచ్చని చూపించిన సరదా పెప్సీ యాడ్.. మేరా నెంబర్ కబ్ ఆయేగా(నా నెంబర్ ఎప్పుడు వస్తుంది) పగిలిపోని గుడ్డు.. జుట్టు పీక్కునే వంటగాడు. ఫెవికల్ డబ్బాలో దాణా తినే కోడి.. ఉల్లాసంగా సాగే లిరిల్ సోప్ యాడ్.. జలపాతం, అందమైన లొకేషన్లో వయ్యారి చిందులు కుటుంబ ఆప్యాయతలకు అడ్డొచ్చే గోడను బద్ధలు కొట్టాలని ప్రయత్నించే కవల అన్నదమ్ములు. బాంబులతో పేల్చిన బద్ధలు కానీ అంబూజా సిమెంట్‌తో కట్టిన గోడ.. ఇలా చెప్తూ పోతే బోలెడన్ని యాడ్లు. వాటిలో కొన్ని మాత్రం ఇవి. -
లేడీ మోడల్స్‌ని అలా చూపించొద్దు: గవర్నర్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ శుక్రవారం సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆభరణాల కంపెనీలు తమ ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించవద్దని సూచించారు. కేరళలో కొన్ని రోజుల క్రితం వెలుగు చూసిన వరకట్న బాధితురాలి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు వెలుగు చూడటం పట్ల ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ ఘటన అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ ఏడవ కాన్వొకేషన్ వేడుకకు గవర్నర్ ఆరిఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆభరణాల ప్రకటనల్లో.. మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలా చూపించకూడదు. దీని వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా కాకుండా వేరే విధంగా చూపించాలి. ఇలాంటి యాడ్స్‌లో పెళ్లి కుమార్తె ఒంటి నిండ బంగారు ఆభరాణాలు వేసి.. చూపిస్తారు. దాంతో జనాలు పెళ్లి కుమార్తె అంటే ఇంతే అట్టహసంగా.. భారీగా నగలు ధరించాలని భావించే ప్రమాదం ఉంది. కనుక బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించకండి’’ అని కోరారు. ఇక కాన్వొకేషన్ కార్యక్రమంలో విద్యార్థుల చేత కట్నం తీసుకోము.. ఇవ్వము అని అండర్‌టేకింగ్ తీసుకున్నారు ఆరిఫ్. అంతేకాక విద్యార్థులు కాలేజీలో చేరిన సమయంలోనే వారి వద్ద నుంచి కట్నం ఇవ్వం, తీసుకోం అని బాండ్ తీసుకోవాలన్నారు. మన సమాజంలో వరకట్న దురాచారం బలంగా పెనవేసుకుపోయిందని.. దాన్ని తొలగించడానికి కఠిన చట్టాలతో పాటు జనాల్లో అవగాహన కూడా రావాలన్నారు ఆరిఫ్. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే...
భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్‌ను అదనుగా తీసుకున్న ఫేస్బుక్ తన వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. చాలా మంది నెటిజన్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోల్లో మునిగితేలుతున్నారు. కాగా ప్రస్తుతం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ మధ్యలో 30 సెకన్ల పాటు యాడ్స్ రానున్నాయి. జూన్ 18 నుంచి ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో రీల్స్ చూస్తోన్న యూజర్లకు కాస్త చికాకును కల్పించనుంది కాగా ఇన్స్టాగ్రామ్ ఏప్రిల్‌లోనే భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీల్లో తొలిసారిగా యాడ్ రీల్స్‌ను పరీక్షించింది. ఇది విజయవంతం కావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సదుపాయాన్ని లాంచ్ చేసింది. యూజర్లకు కొత్త కంటెంట్‌ను కనుగొనడానికి, క్రియేట్ చేయడానికి రీల్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జస్టీన్ ఓసోఫ్స్కీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నిర్ణయంతో కంటెంట్ క్రియేటర్లకు మాత్రం పండగే..! ఇన్స్టాగ్రామ్ రీల్స్ మధ్యలో వచ్చే యాడ్స్‌తో కంటెంట్ క్రియేటర్లు డబ్బును సంపాందించనున్నారు. చదవండి: ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..! -
యూట్యూబ్ టాప్‌లో ఇక అవి కనిపించవు
న్యూఢిల్లీ: ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 14న యూట్యూబ్ మస్ట్‌హెడ్ (యూట్యూబ్ టాప్ పేజీ) కంటెంట్‌కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్ చేసింది. గ్యాంబ్లింగ్, ఆల్కాహాల్, పాలిటిక్స్, డ్రగ్స్‌కు లింకు ఉన్న యాడ్‌లేవీ ఇకపై యూట్యూబ్ టాప్, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్ చేయగానే టాప్‌లో కనిపించే ఈ యాడ్స్ ద్వారా గూగుల్‌కు భారీ ఆదాయం వస్తుంటుంది. అయితే ఇకపై ఆ ప్లేస్‌లో మాగ్జిమమ్ యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్లే ఉండాలని యూట్యూబ్ నిర్ణయించింది. ‘‘యూజర్ల పట్ల ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాల’’ని అనుకుంటున్నాం యూట్యూబ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వీటితో పాటు యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలను, అసత్య ప్రచారాలకు సైతం యూట్యూబ్‌లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అంతేకాదు యాడ్లకు సంబంధించిన వీడియోల(థంబ్‌నెయిల్స్) విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ‘‘అవి మానసికంగా యూజర్‌పై ప్రభావం చూపెడతాయి. కాబట్టి, అలాంటి యాడ్లను ప్రొత్సహించం’’ అని యూట్యూబ్ ప్రతినిథి ఒకరు వెల్లడించారు. చదవండి: యూట్యూబ్ గురించి ఇవి తెలుసుకోవాల్సిందే