ఫేస్బుక్ పబ్లిషర్లకు గుడ్ న్యూస్
ఫేస్బుక్ పబ్లిషర్లకు గుడ్ న్యూస్
Published Fri, Feb 24 2017 11:36 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
న్యూయార్క్ : ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్న వీడియోల ద్వారా తగినంత మనీని సంపాదించలేని పబ్లిషర్లకు గుడ్ న్యూస్. టీవీ చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మాదిరి ఇక ఈ వ్యాపార ప్రకటనలు ఫేస్బుక్ లైవ్ వీడియోలోకి కూడా రాబోతున్నాయి. లైవ్ వీడియోస్ మధ్యలో 20 సెకన్ల యాడ్స్ను వేయాలని ఫేస్ బుక్ నిర్ణయించిందట. తన నెట్వర్క్పై షేర్ చేసే వీడియోస్ ద్వారా మనీ ఆర్జించాలని సోషల్ మీడియా దిగ్గజం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లకు పంచబోతున్నట్టు ఫేస్ బుక్ పేర్కొంది. రీకోడ్ రిపోర్టు ప్రకారం పబ్లిషర్స్ వీడియోల మధ్యలో యాడ్స్ను వేయడం కంపెనీ త్వరలోనే ప్రారంభించబోతుందని తెలుస్తోంది.
అచ్చం టీవీ కమర్షియల్ యాడ్స్ మాదిరే ఈ యాడ్స్ కూడా ఉండబోతున్నాయని తెలిపింది. యాడ్స్ ద్వారా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లు, తను పంచుకోవాలనుకుంటోందని పేర్కొంది. ఫేస్బుక్లో వీడియోలు షేర్ చేస్తూ మనీని ఆర్జించలేని వారికి ఇది ఓ గుడ్ న్యూస్ లాంటిదని రీకోడ్ రిపోర్టు చేసింది. మధ్యలో వచ్చే 20 సెకండ్ల యాడ్ పూర్తిగా అయిపోయేంత వరకు లైవ్ స్ట్రీమ్ చేయడం కుదరదని రీకోడ్ రిపోర్టు పేర్కొంది. యాడ్ బ్రేక్కు ముందు పబ్లిషర్లు కనీసం నాలుగు నిమిషాలు లైవ్ స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రేక్, మళ్లీ లైవ్ ప్రొగ్రామ్ రన్ అయ్యేలా టెస్టింగ్ ప్రారంభించామని కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు.
Advertisement
Advertisement