మళ్లీ హన్సిక హవా
మళ్లీ హన్సిక హవా
Published Wed, Mar 12 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
జరిగేది జరగక మానదు. అయితే జరిగిన దాన్ని మనకనుకూలంగా మార్చుకోవడం ఉత్తమ లక్షణం అన్నది జీవిత సత్యం. నటి హన్సిక ఈ నగ్న సత్యాన్ని గ్రహించినట్లున్నారు. ఈ బ్యూటీ దశాబ్దం క్రితమే నటనకు శ్రీకారం చుట్టారు. యాడ్స్, మోడలింగ్, సినిమాలు అంటూ నటిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ వద్దంటే అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే 25 ఏళ్లు పైబడుతున్న హన్సిక వయసు ప్రభావం కావచ్చు, మరేదైనా కావచ్చు నటుడు శింబుతో ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ పెళ్లికి దారి తీస్తుందని ప్రకటించడంతో హన్సిక కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపింది.
శింబుతో ప్రేమ విషయంలో పునరాలోచన చేసుకోవటాన్ని కొందరు సీనియర్ నటీనటులు బహిరంగంగానే హితవు పలికారు. అది అటుంచితే ఆమెతో సినిమాలు చేద్దామనుకున్న కొందరు నిర్మాతలు వెనకడుగేశారు. ఇంటిలో తల్లి ఒత్తిడికి గురయ్యారు. ఎట్టకేలకు హన్సిక శింబుతో సుదీర్ఘంగా చర్చించి ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లు ఆయనతోనే చెప్పించి పలు సమస్యల నుంచి బయటపడ్డారు. చక్కని పరిణితితో ప్రవర్తించిన హన్సికకు తెలివైన అమ్మాయని పరిశ్రమ వర్గాలంటున్నారు. అంతేకాదు ఈ మిల్కీ బ్యూటీకి మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తున్న దక్షిణాది నటి ఎవరన్నా ఉన్నారంటే అది హన్సికనే. తమిళం, తెలుగు భాషలతో కలిసి మొత్తం ఎనిమిది చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అంటే హన్సిక హవా మళ్లీ మొదలైనట్లే.
Advertisement
Advertisement