Modeling
-
‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళ తన తీరిక సమయంలో ఫేస్‌బుక్‌ను స్క్రోలింగ్ చేసింది. ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ యాడ్‌లో లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఈ సంస్థను ఇదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు సంప్రదించారు. తమపిల్లలను మోడల్స్‌గా మార్చాలనే తాపత్రయంలో ఆ సంస్థ అడిగినంత ఫీజు చెల్లించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన చిన్నారులకు మోడలింగ్ అసైన్మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్లు చేపట్టి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ ముఠా సభ్యులు 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను మోడల్స్‌గా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుని, వీరు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు.ఈ స్కామర్లు మోడలింగ్ చేస్తున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. తరువాత వారిని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, పిల్లలకు మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఇందుకు ఆన్లైన్ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తల్లిదండ్రులు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట -
Saloni Patel: అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు.. కానీ అనుకోకుండా?
‘అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు. అనుకోకుండా ఎంటర్ అయ్యాను. ఈ జాబ్ రొటీన్‌గా ఉండదు. నేర్చుకోవడానికి రోజూ ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. కెరీర్లో నేను ఏ ఎక్సయిట్మెంట్నైతే కోరుకున్నానో అది ఈ ఫీల్డ్‌లో దొరికింది. అందుకే ఇందులో సెటిల్ అయిపోయాను!’ – సలోనీ పటేల్.ఆమె పుట్టింది, పెరిగింది.. న్యూ ఢిల్లీలో. పంజాబీ కుటుంబం. చిన్నప్పుడే కథక్ డాన్స్‌లో శిక్షణ పొందింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ చేసింది. చదువైపోగానే టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో జావా డెవలపర్‌గా పనిచేసింది. కానీ ఎలాంటి ఉత్సాహాన్నివ్వని ఆ ఉద్యోగం ఆమెకు ఆసక్తినివ్వలేదు. అందుకే ఇతర కెరీర్ ఆప్షన్స్‌ని ఎక్స్ప్లోర్ చేద్దామనుకుని టీసీఎస్ జాబ్‌కి రిజైన్ చేసింది.ఉద్యోగం కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఎంబీఏ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది. బిజినెస్ స్కూల్లో జాయిన్ కావడానికి 6 నెలల టైమ్ ఉండటంతో మళ్లీ ఉద్యోగ అన్వేషణలో పడిపోయింది. ఈలోపే ‘పర్పుల్ థాట్స్’ అనే మోడలింగ్ ఏజెన్సీ నుంచి మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఏంబీఏలో జాయిన్ అయ్యేవరకు సరదాగా మోడలింగ్ చేద్దామని ఆ చాన్స్‌కి ఓకే చెప్పింది.ర్యాంప్ వాక్‌లు, కొత్తకొత్త వాళ్ల పరిచయం, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం.. ఇవన్నీ మోడలింగ్ మీద సలోనీకి ఇంట్రెస్ట్‌ను పెంచాయి. మోడలింగ్‌లోనే కెరీర్ వెదుక్కోవాలని నిశ్చయించుకుంది.మోడలింగ్ షూట్ కోసం ఒకసారి ముంబై వెళ్లినప్పుడు.. అక్కడ యాక్టింగ్, థియేటర్ వర్క్‌షాప్‌కి హాజరైంది. నచ్చడంతో థియేటర్లో ట్రైనింగ్ తీసుకుంది. పలు నాటకాల్లో నటించింది. ఆ టైమ్‌లోనే ప్యార్ విచ్, పీవైటీ (ప్రెటీ యంగ్ థింగ్) మ్యూజిక్ వీడియోల్లో కనిపించింది.సలోనీ థియేటర్ పర్ఫార్మెన్స్ జీటీవీ ‘కోల్డ్ లస్సీ ఔర్ చికెన్ మసాలా’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది. ఆ తర్వాత ‘ద హార్ట్‌బ్రేక్ హోటల్’ అనే వెబ్ సిరీస్, ‘ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది. సలోనీకి బ్రేక్‌నిచ్చిన సిరీస్ మాత్రం ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోని ‘క్యాంపస్ డైరీస్’.ఆమె నటించిన మరో షార్ట్ ఫిల్మ్ ‘ద గుడ్ న్యూస్’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయ్యి, అవార్డులనూ అందించింది.సలోనీ సామాజిక సేవా కార్యకర్త కూడా! ఏమాత్రం సమయం చిక్కినా ముంబైలో జరిగే సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. కోవిడ్ సమయంలో తన సేవింగ్స్ అన్నిటినీ కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కి డొనేట్ చేసింది.సలోనీ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లు ‘సన్‌ఫ్లవర్’ జీ5లో, ‘పాట్లక్’ సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్‌ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్‌కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్‌ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్‌ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్‌కు మోడలింగ్ చేసింది. మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఈ మోడల్ ధరించిన కాస్ట్యూమ్ చూస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!
మోడలింగ్ చేసే అమ్మాయిలు కాస్ట్యూమ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. కానీ ఇక్కడ ఓ మోడలింగ్ వేసుకున్న కాస్ట్యూమ్ చూస్తే మాటలు రావు. ఆమె ఎలా ధరించిందా అనే సందేహం వస్తుంది. వాట్ ఏ కాస్ట్యూమ్ అని అనుకుండా ఉండలేరు. అంత వెరైటీగా, షాకింగ్‌గా ఉంటుంది ఆ కాస్ట్యూమ్. చెన్నైలోని ఓ ఫ్యాషన్ షోలో ఓ మోడల్ చాలా వెరైటీ కాస్ట్యూమ్ వేసుకొచ్చింది. ఓ సాగరకన్య మాదిరిగా డ్రస్ వేసుకొచ్చింది. అక్కడితో ఆగలేదు. చక్కగా హోయలోలికిస్తూ నడస్తు ర్యాప్‌పై రాగా ఓ వ్యక్తి ఓ సంచిలో చేపలను తీసుకొచ్చి..ఆమె కాస్ట్యూమ్‌కి అమర్చిని బౌల్లో వేశాడు. ఏకంగా లైవ్ ఫిష్‌తో కూడాని కాస్ట్యూమ్‌తో ధగ ధగ మెరిసిపోయింది. అక్కడ ఉన్నవాళ్లంతా ఆ కాస్ట్యుమ్ని చూసి నిర్ఘాంతపోయారు. అందుకు సంబంధించని వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఐతే నెటిజన్ల మాత్ర ఓ రేంజ్‌లోనే ఫైర్ అయ్యారు. ఇలా జంతువులతో ఫ్యాషన్ షోల కోసం కామెడీ వేషాలు వేయొద్దని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Make over by Preethi (@ohsopretty_makeover) (చదవండి: బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..) -
మరియం కురియన్ మరియు నయనతార
గ్లామర్ పాత్రలతో మెరిసిన నయనతార ‘గ్లామర్’కు మాత్రమే పరిమితం కాలేదు. ‘శ్రీరామరాజ్యం’ ‘అనామిక’ ‘గాడ్‌ఫాదర్’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్ – సెంట్రిక్ ఫిల్మ్ అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకుంది. సినిమా ఫీల్డ్కి రాక ముందు నయనతార మోడలింగ్, టీవీ షోలు చేసేది. ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షో ‘చమయం’ చేసేది. నయనతార అసలు పేరు డయాన మరియం కురియన్. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయాన(నయన) కాలేజీ రోజుల్లోనే పార్ట్–టైమ్‌గా మోడలింగ్, టీవి యాంకరింగ్ చేసేది. ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ ‘మనసినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో ‘గౌరి’ పాత్రలో నటించిన నయనతార నిన్నా మొన్నటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’లోని ‘నర్మదా రాయ్’ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూనే ఉంది. -
ఓ పక్క అద్భుతమైన మోడల్‌గా..మరోవైపు క్యాట్‌లోనూ సత్తా చాటింది
అందం, అద్బుతమైన తెలివితేటలు ఆమె సొంతం. ఒక పక్క తనకు ఇష్టమైన అభిరుచిలో రాణిస్తూనే మరోవైపు చదువులోనూ సత్తా చాటి ..తనకు తానే సాటి అని నిరూపించుకుంచి. 'బ్యూటీ విత్ బ్రెయిన్'కి ఉదాహరణగా నిలిచింది. ఓ మనిషి రెండింటింలోనూ రాణించగలడని నిరూపించించి మోడల్ ఆకాంక్ష చౌదరి. ఆకాంక్ష చౌదరి పేరుకు తగ్గట్టుగానే తన ఆకాంక్షలని నెరవేర్చుకుని అందర్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆమె 2016లో మిస్ ఇండియా ఎలైట్ విజేత. ఆమెకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు అదోక ప్యాషన్ కూడా. ఒకపక్క మోడలింగ్‌పై దృష్టి పెడుతూనే తన కెరియర్ని మంచి గాడిలో పెట్టుకుంది. ఆమె క్యాట్‌లో 98.12 పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించి ఆశ్చర్యపరిచింది. ఆమె మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి దరఖాస్తు చేస్తున్నప్పుడే మిస్ ఇండియా ఎలైట్ పోటీకి ఎంపికైంది. అతన అభిరుచిని అనుసరించి అందాల పోటీలో విజేతగా నిలిచింది. అదే సమయంలో క్యాట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యింది. ఆమె ఐఐఎం అహ్మాదాబాద్‌లో 2017-2019 బ్యాచ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ . ప్రస్తుతం ఆమె మెకిన్సేలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆకాంక్ష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను మోడల్‌గా ఈ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానని అనుకోలేదు. మోడలింగ్ మారబోతున్నాను. మోడలింగ్ నన్ను ఫిట్‌గా ఉండేలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేసింది. చదువు తోపాటు మోడలింగ్‌లోనూ రాణించేందుకు తాను టైం షెడ్యూలను చాలచక్యంగా నిర్వహించాల్సి వచ్చేదని చెబుతోంది ఆకాంక్ష. నిజానికి ఆకాంక్ష మోడలింగ్, కాంపిటీటవ్ ఎగ్జామ్ రెండింటికి ఏకాకాలంలో సన్నద్ధమైంది. చక్కగా బ్యాలెన్స్ చేసి అనుకున్నది సాధించింది. ఒక వ్యక్తి తన అభిరుచిని అనుసరిస్తూనే బిజినెస్ రంగంలో కూడా రాణించగలడిని నిరూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. (చదవండి: రష్యాలో వాగ్నర్ గ్రూప్ మాదిరిగా..చరిత్రలో వెన్నుపోటు పొడిచిన నాయకులు వీరే!) -
Sanket Jadia: సంకేత చిత్రం
‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు. సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ.... సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్‌కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు. పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా! ‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్. పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్‌ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు. సూరత్‌లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్‌పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది. ‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆర్టిస్ట్‌లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు. ‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు. హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్‌లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు. నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు. ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి. ‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ. ఏ ఫ్యూచర్ అండర్ కన్స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన సంకేత్‌కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం. -
ప్రేమించే జీవితం..: వాయిదా వేసిన కలలు... నిజం చేసుకుంటున్న వేళ..
పురుషులతో పోల్చితే స్త్రీల కలలు ఎప్పుడూ వెనకబాటులోనే ఉంటాయి. కుటుంబ బాధ్యతల కారణంగా తమ కలలను చంపుకునో లేక వాయిదా వేసుకునో రోజులను వెళ్లదీసే మహిళల సంఖ్యే ఎక్కువ. అలాంటి ప్రపంచం నుంచి వచ్చినవారిలో ముక్తాసింగ్ ఒకరు. కలలను వాయిదా వేసుకుంటూ, మధ్య మధ్య వాటిని వదలకుండా బతికించుకునే ప్రయత్నం జీవితమంతా చేస్తూనే ఉన్న ముక్తాసింగ్ ఒక కళాకారిణి, రచయిత్రి. ఆరుపదుల వయసులో మోడలింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ‘రిటైర్ అయ్యే వయసులో పని చేయడం గర్వంగా ఉంది’ అంటూ తన గురించి చెప్పే ముక్తాసింగ్ గురించి తెలుసుకుంటే తమ జీవితంలోనూ ఇవి ప్రేరణ నింపే విషయాలు అనుకోకుండా ఉండరు. గురుగ్రామ్‌లో ఉంటున్న ముక్తా ఈ 60 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తూ, పెయింటింగ్స్ వేస్తూ తన కలలు ఇప్పుడెలా నిజం చేసుకుంటున్నారో గమనిస్తే... ‘మనలో చాలామంది వయసు పెరిగేకొద్దీ హుందాగా కనిపించాలని లేని భారమేదో మోస్తున్నట్టుగా ఉండాలనుకుంటాం. కానీ, ఉత్తమంగా ఉండాలని కోరుకుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తాం. ఫలితంగా జీవన ప్రమాణాలను పెంచుకుంటాం’ అంటారు ముక్తా. బాధ్యతల బరువు నుంచి.. ఫైటర్ పైలట్‌ని వివాహం చేసుకుంది ముక్తాసింగ్. అతని కెరియర్, ఆశయాలు, తరచూ బదిలీలు జరగడంతో ఆమె తన కలలను అణిచివేసుకుంది. పిల్లలు పుట్టడం, వారిని చూసుకోవడం, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడంలో ఏళ్లకేళ్లు గడిపేసింది. అన్ని దశల్లోనూ ఊపిరి సలపని బాధ్యతలు. నలుగురిని ఆలోచింపజేసే వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. కానీ, చేయలేకపోయేది. అయినప్పటికీ ఎంతో కొంత తీరిక చేసుకుని వార్తాపత్రికలకు, మ్యాగజైన్ల కు వ్యాసాలు పంపేది. కానీ, పూర్తి సమయం తన కెరీర్‌కు కేటాయించలేకపోతున్నాను అని మధనపడేది. సంగీతం ఆంటే ఎనలేని ప్రేమ. పెయింటింగ్ చేయాలనే ఆలోచనతో సంగీత చిహ్నాలను కాన్వాస్‌పై చిత్రించేది. అప్పుడు చేయలేని పనులు ఈ వయసులో చేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీగాయకుల ముఖచిత్రాలను చిత్రిస్తోంది. ఫ్రీలాన్సర్‌గా వార్తాపత్రిక లకు కథనాలు రాస్తుంది. ఆలోచింప జేసిన జీవనం వీటిన్నింటి ద్వారా ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. కానీ, నాడు బాధ్యతల నడుమ సరైన వేదికేదీ దొరకలేదు. దీంతోపాటు తన కలలను కనుల వెనుకే దాచేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించింది. తనలో దాగున్న కళను నలుగురితో పంచుకోవడానికి ఓదార్పుగా ఇన్స్టాగ్రామ్ పేజీ దొరికింది. ఉన్న కొద్దిసమయంలో చేసే కళను పోస్ట్ చేయడం, నలుగురికి పరిచయం చేయాలని తపిస్తోంది. చాలాసార్లు తన తల్లి అనారోగ్యం ఆమెను ఆలోచింపజేసింది. దినచర్యపై శ్రద్ధ పెట్టడం చేసేది. ఫిట్నెస్ గురించి పట్టించుకునేది. పిల్లలు స్థిరపడ్డారు. అదేపనిగా కురుస్తున్న వాన కాస్త తెరిపి ఇచ్చినట్టు అనిపించింది. మార్చిన అవకాశం తెలిసినవారి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అవడంతో ముక్తాసింగ్ జీవిత గమనమే మారిపోయింది. ఆ డిజైనర్ ముక్తాని తన డ్రెస్‌లకు మోడలింగ్ చేయమని కోరింది. ‘ఈ వయసులో మోడలింగ్ ఏంటి?’ అని చాలా మంది నిరుత్సాపూరితమైన మాటలు అన్నప్పటికీ పట్టుదలతో మోడలింగ్ అవకాశాన్ని ఎంచుకుంది. ఈ కొత్త ఇన్నింగ్స్‌తో ఆమె కుటుంబం కూడా సంతోషించింది. ఇదే రంగంలో ఇంకా మంచి అవకాశాలు ఆమెకోసం వస్తున్నాయి. ‘పదవీ విరమణ అంచున ఉన్నప్పుడు పని చేయడం గర్వంగా ఉంది’ అంటారు ముక్తా. వృద్ధాప్యాన్ని చాలా ఆకర్షణీయంగా అవకాశంగా మార్చుకున్న వ్యక్తుల చిత్రాలు కూడా తన సోషల్‌మీడియా పేజీ ద్వారా పోస్ట్ చేస్తుంది. వారిలో స్టీవ్ టైలర్, అగాథాక్రిస్టి, మహారాణి గాయత్రీదేవి, రవీంద్రనాథ్ ఠాగూర్..ల చిత్రాలు ఉన్నాయి. ‘ఎన్ని పనులున్నా ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడం వల్ల నాకు మరో అవకాశం వచ్చింది. పెరిగే వయసును స్వీకరించాలి. అలాగే, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మనదైన శైలిని చూపడమూ నేర్చుకోవాలి. మనమంటే ఏంటో కూడా నలుగురికి తెలియజేయాలి’ అని చెప్పే ముక్తా సింగ్ మాటలు రిటైర్మెంట్ దశలో ఉన్న అందరిలోనూ తప్పక ఆలోచనను కలిగిస్తాయి. -
డా‘‘ రోల్ మోడల్: వయసు మరచి కలలు కనండి
యవ్వనంలో ఉన్న అమ్మాయికి గానీ అబ్బాయిలకు గానీ కాస్త ఈ పనిచేయండి? అని దేనిగురించి అయినా చెప్పామంటే..‘‘నా వల్ల కాదని కొందరు చెబితే, మరికొందరు నాకే చాలా పని ఉంది మళ్లీ ఇది చేయాలా? అని సణుగుతారు. ఇటువంటి యంగ్ జనరేషన్ ఉన్న ఈ రోజుల్లో ఆరుపదులు దాటిన అమ్మమ్మలు, నాయనమ్మలు కొందరు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే, మరికొందరు డెభైఏళ్ల వయసులోనూ కొత్త బిజినెస్‌లు ప్రారంభించి ఔరా అనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డాక్టర్ గీతా ప్రకాష్ ఈ కోవకు చెందిన వారే అయినప్పటికీ... వీరందరి కంటే ఒక అడుగు ముందుకేసి ఏకంగా రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. పేరులోనే తెలుస్తోంది ఆమె ఒక డాక్టర్ అని. ముఫ్పైఏళ్లపాటు డాక్టర్‌గా పనిచేసిన తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి మంచి మోడల్‌గా మారింది గీత. ఒకపక్క డాక్టర్‌గా సేవలందిస్తూనే, 67 ఏళ్ల వయసులో లేటెస్ట్ మోడల్‌గా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన గీతా ప్రకాష్ వైద్యవిద్యపూర్తయ్యాక జనరల్ ఫిజీషియన్‌గా బాధ్యతలు చేపట్టింది. ఒక డాక్టర్‌గా జీవితం ఎంతో సంతృప్తిగా సాగుతోంది. రోజూ తన క్లినిక్‌కు వచ్చే రోగులను చూడడం, వారి బాధలకు మందులు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడడం ఆమె దైనందిన చర్యగా మారింది. ఓ రోజు ఇటలీకి చెందిన ఓ ఫొటో గ్రాఫర్ ట్రీట్మెంట్ కోసం గీత దగ్గరకు వచ్చాడు. తన ట్రీట్మెంట్ పూర్తయ్యాక..ఫొటోగ్రాఫర్ కాస్త చనువు తీసుకుని ..‘‘మేడమ్! మీ ముఖం చాలా కళగా అందంగా ఉంది. మీరెందుకు మోడలింగ్ చేయకూడదు’’అని సూచించాడు. ఓ పేషెంట్ తనకు అస్సలు సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించడాన్ని గీత చిన్నగా నవ్వి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయింది. యాభైఏడేళ్ల వయసులో... కొన్ని నెలల తరువాత ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ నుంచి గీతకు ఉత్తరం వచ్చింది. ‘‘మేడమ్! మీ ఫొటోలు పంపించండి’’ అని ఆ ఉత్తర సారాంశం. ఆ ఫొటోగ్రాఫర్ మాటలు ప్రోత్సాహకరంగా ఉండడంతో గీతకు నచ్చాయి. దీంతో ‘‘చూద్దాం అతను చెబుతున్నాడు, కాబట్టి మోడలింగ్ చేద్దాం’’ అనుకుంది. అప్పటిదాకా ఫొటోల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో..ఎప్పుడూ మంచిగా రెడీ అయ్యి ఫొటోలు దిగలేదు. అప్పుడప్పుడూ దిగిన అత్యంత సాధారణ ఫొటోలను తన పిల్లలతో చెప్పి ఫొటోగ్రాఫర్‌కు పంపించింది. ఈ ఫొటోలు ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీకి నచ్చడంతో...అతను రూపొందించిన ‘కనీ’ శాలువాకు మోడలింగ్ చేసేందుకు గీత ఎంపికైంది. ఆ శాలువా ధరించి 57 ఏళ్ల వయసులో తొలిసారి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ శాలువాలు గీత వయసువారు ధరించేవి కావడం, పైగా ‘కనీ’ శాలువాలు గీతకు బాగా నప్పడంతో ఆ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ అయింది. దాంతో ఆమె మోడల్‌గా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత జైపూర్ బ్రాండ్ వాళ్లు కూడా మోడల్‌గా పనిచేయమని ఆఫర్ ఇవ్వడంతో అప్పటి నుంచి గీత మోడలింగ్‌లో దూసుకుపోతోంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆరు పదుల వయసులో గీత మోడలింగ్‌లో రాణించడానికి కుటుంబం మొత్తం మద్దతుగా నిలవడం విశేషం. ప్రతి మోడలింగ్ అసైన్‌మెంట్‌కు వెళ్లేటప్పుడు ఆమెను మరింత ఉత్సాహపరిచి పంపడం, గ్లాసీ పేపర్ల మీద వచ్చిన గీత ఫొటోలను చూపించి అభినందించేవారు. నా వృత్తిని ఆరాధిస్తాను... ‘‘వృత్తిని దేవుడుగా భావించి ఆరాధిస్తాను. మనపని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు తప్పకుండా వస్తుందని నమ్ముతాను’’ అని చెబుతూ.. ‘‘కలలు కనడం ఎప్పుడూ మానకండి, వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం, ఇప్పుడు మనవల్ల ఏం అవుతుంది అని అస్సలు అనుకోవద్దు. వయసు ఏదైనా సరే... ఏదోఒకటి సాధించాలన్న కలను కనాలి. ఈ ప్రపంచంలో దేనికీ ఇంతవరకే అన్న పరిమితి లేదు. మన అలవాట్ల ద్వారా కూడా ఏదైనా సాధించవచ్చు’’. అని మహిళలకు పిలుపునిస్తోంది. డాక్టర్‌గానూ.. మోడల్‌గానూ... ఒకపక్క డాక్టర్‌గా బిజీగా ఉంటూనే గత పదేళ్లుగా మోడలింగ్‌లో రాణిస్తోంది గీతాప్రకాష్. మోడల్‌గా మారినప్పటికీ గీత తన డాక్టర్ వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు. వారాంతాల్లో మోడలింగ్‌కు సమయం కేటాయిస్తూ...మిగతా సమయంలో పేషంట్లను చూసేది. మోడలింగ్‌లో తనకంటూ ఒక గుర్తింపు రావడంతో మరింత బాగా చేయడానికి ప్రయత్నించేది. మోడలింగ్‌ను ప్రేమిస్తూనే..తన ఇంట్లో చారిటబుల్ క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అన్జు మోడీ, తరుణ్ తహిలియానీ, గౌరవ్ గుప్తా, టొరాణి, నికోబార్, జేపోర్, అష్దీన్ల వద్ద అందాల మోడల్‌గా రాణిస్తూ ఎంతో మంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది. -
యువతులను వంచించి.. నగ్న ఫొటోలు, వీడియోలతో వికృతానందం
సాక్షి, బెంగళూరు: మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తామంటూ యువతుల నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకుని వికృతానందం పొందుతున్న యువకుడిని మంగళవారం కర్ణాటకలోని హలసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రపంచన్ ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి మాయమాటలు చెప్పి వారి నగ్నఫొటోలు, వీడియోలు తీసుకొని వికృతానందం పొందేవాడు. అతని మొబైల్‌ను పరిశీలించగా వెయ్యికిపైగా యువతుల ప్రైవేటు ఫొటోలు, దాదాపు 400 వీడియోలు వెలుగు చూశాయని డీసీపీ శరణప్ప తెలిపారు. చదవండి: ప్రియుని మోజులో భర్త హత్య.. నిజం చెప్పిన కొడుకు -
Anisha Dixit: ఎంబీయే అని చెప్పి సీక్రెట్‌గా యాక్టింగ్.. అనుమానం రాకుండా
ఏదైనా కావాలంటే అది ఇచ్చేవరకు మారాం చేస్తూనే ఉంటారు చిన్నారులు. కొందరు మాత్రం... తల్లిదండ్రుల కోపానికి భయపడి, కోరికను మనసులోనే దాచుకుని తమలో తామే బాధపడుతుంటారు. అనిశా దీక్షిత్ది ఇటువంటి మనస్తత్వమే. ఆమెకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. కానీ తన తండ్రి ‘‘నటనా గిటనా ఏం వద్దు’’ అని గట్టిగా చెప్పడంతో భయపడి మరోసారి నటన ఊసెత్తలేదు. కానీ అనిశాతోపాటు పెరిగి పెద్దదైన నటనాసక్తి.. డిగ్రీ చదువుతున్నానని చెప్పి యాక్టింగ్ కోర్సు చేసేలా చేసింది. తొలిప్రయత్నంలోనే సినిమా అవకాశం వచ్చినప్పటికీ, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా నిరుత్సాహ పడకుండా యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను సానుకూల దృక్పథంతో తీసుకుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనడానికి అనిశా దీక్షిత్ ఉదాహరణగా నిలుస్తోంది. భారత సంతతికి చెందిన అనిశ్, దివ్యాదీక్షిత్ దంపతులకు జర్మనీలో పుట్టింది అనిశా దీక్షిత్. విదేశంలో ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబం కావడంతో అనిశా అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ పెరిగింది. తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం వీధిన పడినంత పని అయ్యింది. దీంతో బంధువుల ఇంటిలో తల దాచుకున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం, వీధుల్లో చిన్నపాటి వస్తువులను విక్రయించి పొట్ట పోసుకునేవారు. ఇంతటి పేదరికంలోనూ అనిశా మంచి నటిగా ఎదగాలనుకునేది. తన ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి ‘‘నువ్వు నటివి కావాల్సిన అవసరం లేదు’’ అంటూ యాక్టింగ్ కోర్సు చేస్తానంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఎంబీఏ అనిచెప్పి.. డిగ్రీ పూర్తయిన తరువాత స్విట్జర్లాండ్‌లో ఎమ్బీఏ చేస్తానని ఇంట్లో చెప్పి.. అక్కడ ఎంబీఏలో చేరకుండా సీక్రెట్‌గా యాక్టింగ్, మోడలింగ్ కోర్సు చేసింది. వీకెండ్స్‌లో ఇంటికి వచ్చిన ప్రతిసారి అనిశా తండ్రి బిజినెస్‌కు సంబంధించిన విషయాలను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు తన స్నేహితురాలితో మాట్లాడి సరైన సమాధానాలు చెబుతూ తండ్రికి అనుమానం రాకుండా చూసుకునేది. స్విట్జర్లాండ్‌లో కోర్సు పూర్తయ్యాక, వెంటనే ఇండియా వచ్చిన అనిశా ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో చేరింది. ఈ స్కూలు ద్వారానే 2013లో బాలీవుడ్ సినిమా ‘పంజాబ్ బోల్దా’లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ సినిమా విడుదల అవకముందే తన తండ్రి మరణించారు. ఈ సినిమాను ప్రేక్షకులను ఆదరించకపోవడంతో అనిశా సినిమా కెరియర్ ఆదిలోనే ముగిసింది. ఫేస్బుక్ వ్లాగింగ్.. సినిమా అవకాశాలు రాకపోయినా అనిశా ఏమాత్రం నిరుత్సాహపడలేదు. స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పటి నుంచే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నచిన్న వ్లాగ్ వీడియోలను పోస్ట్ చేస్తుండేది. ఇండియా వచ్చిన తరువాత తన రోజూవారి పనులను వీడియోలు తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది. ఇలా క్రమంగా వీడియోలను అప్లోడ్ చేస్తూ మంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌గా ఎదిగింది. సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉన్న సమయంలో..ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని యూ ట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. రిక్షావాలా... ఇండియాలో రవాణాకు వాడే ఆటో రిక్షా(ఆటో)ను తన వీడియోలలో ప్రధాన థీమ్‌గా తీసుకుంది. యూట్యూబ్ చానల్‌కు ‘రిక్షావాలా’ అని పేరు పెట్టుకుంది. ఆటోలో కూర్చోని.. ప్రారంభం లో సినిమా రివ్యూల వీడియోలను పోస్ట్ చేసేది. ‘రామ్‌లీలా’ సినిమా తొలి రివ్యూ వీడియో చేసింది. క్రమంగా లింగ ఆధారిత (జండర్ బేస్డ్) కామెడీ వీడియోలను అప్లోడ్ చేసేది. ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యేవి. భారత మహిళలు ఎదుర్కొంటున్న అనేక అభద్రతతో కూడిన అంశాలపై వీడియోలు చేయడంతో అనిశా బాగా పాపులర్ అయ్యింది. ఆ వీడియోల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకోవడంతో అనిశా సెలబ్రిటిగా మారడమేగాక, సోషల్ మీడియా స్టార్‌గా మారింది. రిక్షావాలి డాట్ కమ్ వెబ్సైట్ ప్రారంభించి, దీనిలో ఇండియా గురించిన ఆర్టికల్స్‌ను కూడా రాసేది. ప్రస్తుతం తన చానల్లో వివిధ కోణాల్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంది. వీటిలో స్టోరీటైమ్స్, వ్లాగ్స్ నుంచి లఘు చిత్రాల రివ్యూలు చేస్తోంది. సెలబ్రెటీ గుర్తింపు వచ్చాక తన యూట్యూబ్ చానల్ రిక్షావాలా పేరుని మార్చి తన పేరునే చానల్ పేరుగా మార్చింది. ప్రముఖులతో వీడియోలు అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం అనిశా చానల్‌కు ముఫ్పై లక్షల మంది సబ్స్క్రెబర్స్, ఇన్‌స్టాలో ఐదులక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
మిస్టర్ తెలంగాణగా ఎంపికైన సింగరేణి బిడ్డ
సాక్షి, గోదావరిఖని(ఆదిలాబాద్): జాతీయస్థాయిలో జరిగిన మిస్టర్ అండ్ మిస్ ఇండియా అందాల పోటీల్లో మిస్టర్ తెలంగాణ టైటిల్ సాధించి సింగరేణి కార్మికుడి బిడ్డ సత్తా చాటాడు. జాతీయస్థాయి అందాల పోటీలు ఈనెల 1 నుంచి 5 వరకు ఢిల్లీలోని ఆగ్రాలో జరిగాయి. ఈ పోటీల్లో సింగరేణి కార్మికుడి కుమారుడు రేణికుంట చరణ్ మిస్టర్ తెలంగాణా టైటిల్ సాధించాడు. ఆగ్రాలో జరిగిన ఈ పోటీల్లో ఫైనల్‌కు చేరుకుని బెస్ట్ఫైవ్లో నిలిచి మిస్టర్ తెలంగాణా టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తూ యైటింక్లయిన్‌కాలనీలో ఉంటున్న రేణికుంట శ్రీనివాస్ కుమారుడు రేణికుంట మారుతిచరణ్ సికింద్రాబాద్ సర్ధార్‌పటేల్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో అండర్–19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. అనంతరం మోడలింగ్‌వైపు దృష్టి సారించాడు. ఈ క్రమంలో మిస్టర్ ఇండియా అందాల పోటీలో పాల్గొని మిస్టర్ తెలంగాణా టైటిల్‌కు ఎంపికయ్యాడు. స్టార్లైఫ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 5 వరకు ఢిల్లీలో మిస్టర్‌అండ్‌మిస్ ఇండియా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 60 మంది పాల్గొనగా, మిస్టర్ ఇండియా టాప్‌ఫైవ్ ఫైనల్ లిస్ట్‌కు చేరుకున్నాడు. దీంతోపాటు మిస్టర్ తెలంగాణా టైటిల్ సాధించాడు. ఈ పోటీల తర్వాత ఇండియా కల్ట్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ వీక్ పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాల్లో నటించాలని ఉంది భవిష్యత్‌లో సినిమాల్లో నటించాలని ఉంది. యాడ్‌షూట్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని ఉంది. గతంలో రాష్ట్రస్థాయి మిస్టర్‌అండ్‌మిస్ హైదరాబాద్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఫోటోజెనిక్ హైదరాబాద్ టైటిట్ సాధించా. మిస్టర్ అండ్మిస్ ఏషియా సెమిఫైనల్స్ జూన్నెలలో జరగ్గా అందులో పాల్గొని ఫైనల్స్ చేరుకున్నా. మిస్టర్‌అండ్‌మిస్ బాలీవుడ్ హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో సెమిఫైనల్స్ అర్హత సాధించా. సెమిఫైనల్ పోటీలు జరగాల్సి ఉన్నాయి. – రేణికుంట చరణ్, టైటిల్ విజేత చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం -
Prarthana Jagan: ప్రార్థన బ్యూటిఫుల్ జర్నీ
ఆమె చర్మం అక్కడక్కడ తెల్లగా మారింది.. అందరూ ఆమెను ఎగతాళి చేశారు.. ఆరెంజ్ ఫేస్ అంటూ వెక్కిరించారు.. ఎన్నో నిద్రలేని సంవత్సరాలు గడిపిందామె అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్టు స్థాయికి ఎదిగిన ఆమె కథనం. ‘ఒక యుక్తవయస్కురాలిగా నేను నా ముఖాన్ని ద్వేషించాను’ అంటున్నారు బెంగళూరుకి చెందిన ప్రముఖ మోడల్ ప్రార్థన ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ. 22 సంవత్సరాల ప్రార్థన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ‘ఆరెంజ్ ఫేస్’ అంటూ తన ముఖం మీద నీళ్లు పోసి, రంగు పోయిందా లేదా అంటూ, తనను ఎగతాళి చేయటం ఇప్పటికీ మర్చిపోలేదు. చిన్నప్పుడు ముఖం మీద ఒక తెల్లమచ్చ కనిపించింది. ఆ తర్వాత ముక్కు వరకు మచ్చలు పెరిగాయి. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్, ‘ఎండలో నిలబడితే అవే తగ్గిపోతాయి’ అన్నారు. ‘‘అయితే ఎండలో నిలబడిన దగ్గర నుంచి మచ్చలు ముఖమంతా వ్యాపించాయి. ‘బాగా దట్టంగా మేకప్ వేసుకుంటే మచ్చలు కనిపించవు’ అని కొందరు సలహా ఇచ్చారు. దాంతో తనను అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో ముఖానికి పౌడర్, కాంపాక్ట్ వంటివి పూసుకునేది. రోజూ ఇందుకోసం సుమారు అరగంట సమయం కేటాయించ వలసి వచ్చేది. రానురాను వాస్తవంలోకి వచ్చి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలనుకుంది. ‘‘నా చర్మాన్ని కప్పుకోవటానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాలన్నా కూడా ముఖానికి మేకప్ వేసుకునేదాన్ని. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖం కప్పుకుని, తెల్లవారకుండానే లేచి, ముఖం కనపడకుండా ఉందో లేదో చూసుకునేదాన్ని’’ అంటుంది ప్రార్థన. స్నేహితులంతా జాంబీ ఫేస్ అనేవారు. బాగా దగ్గరగా ఉన్నవారు కూడా ‘ముసలి’ అని గేలి చేసేవారు. అన్నిటినీ భరిస్తూ, లేజర్ థెరపీ చేయించుకుంది. ఈ చికిత్స వల్ల చర్మం కాలి, ఎర్రటి మచ్చలు పడతాయి. ఒకసారి చేసిన చికిత్స వల్ల ముఖమంతా కాలినట్లయిపోయింది. సుమారు ఎనిమిది సంవత్సరాల తరవాత సర్జరీ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా హాస్పిటల్లో మరిన్ని ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు మేకప్ లేకుండా ఉంది ప్రార్థన. ‘‘నన్ను ఎవ్వరూ వింతగా చూడలేదు, ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. చాలాకాలం తరవాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఆలోచించటం మానేశాను. నా ఆరోగ్యం మీద, నా చర్మం మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాను’’ చెప్పుకొచ్చింది ప్రార్థన. 2016లో ప్రార్థన తన చర్మాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖాన్ని బాధించే, ఖర్చుతో కూడిన సర్జరీలకు నో చెప్పేసింది. మోడలింగ్ చేయటం ప్రారంభించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, తనను సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు ప్రార్థన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్ట్ కావడమే కాదు, ఇంజినీరింగ్‌లో డిగ్రీ కూడా సాధించింది. తరవాత ప్రార్థనలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. తన మొట్టమొదటి వీడియోను యూ ట్యూట్లో అప్లోడ్ చేసింది. బొల్లి గురించి తన చానెల్లో మాట్లాడింది. ఆ తరవాత ఇన్స్టాగ్రామ్ ద్వారా తన మనసులోని భావాలను నేరుగా పంచుకుంది. తన ఫొటోలను చూపిస్తూ, బొల్లి గురించి అందరికీ అవగాహన కల్పించటం ప్రారంభించింది. ఆమె లాగే అటువంటి బాధలు పడిన చాలామంది తమ భావాలను కూడా పంచుకోవటం ప్రారంభించారు. ‘‘మాలో ఆత్మవిశ్వాసం కలిగించారు’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తనను నిత్యం ప్రోత్సహిస్తూ, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రార్థన కృజ్ఞతలు చెబుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాధితో ఉన్నవారిలో ఉత్సాహం పెరిగేలా పోస్టులు పెడుతోంది. ‘ప్రార్థనలోని ధైర్యాన్ని అభినందించాలి..’ అంటోంది సోషల్ మీడియా. -
అప్పటి న్యూస్‌రీడర్ ఇప్పటి బాలీవుడ్ నటి!
అందమే ఆమెకు ఆయుధం అనుకునే వారందరినీ తన అభినయంతో ఆశ్చర్యానికి గురిచేసింది ‘తాండవ్’ బ్యూటీ సోనాలీ నగ్రానీ. నటిగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకోవడమే కాక అతి కొద్దికాలంలోనే సైఫ్ అలీఖాన్ వంటి స్టార్స్‌తో నటించే అవకాశాన్నీ దక్కించుకుంది. ఢిల్లీలో స్థిరపడిన సింధీ ఫ్యామిలీకి చెందిన సోనాలీ 1983, డిసెంబర్ 20న జన్మించింది. 2003లో లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చేసింది. చిన్నతనం నుంచే ఆమెకు నటన, నృత్యంపై మక్కువ ఎక్కువ. వీటితోపాటు ట్రావెలింగ్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ ఆమె హాబీస్. స్కూల్ నుంచి కాలేజీ వరకు విరివిగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. అలా కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లింది. ముందు సోనాలీ లెక్చరర్ కావాలనుకుంది. ఆర్థిక కారణాలతో ప్రారంభంలో న్యూస్‌రీడర్‌గా పనిచేసేది. అంతేకాదు, ‘తేరీ యాద్ జబ్ ఆతీ హై’ మ్యూజిక్ ఆల్బమ్‌కు గీత రచన కూడా చేసింది. మోడల్‌గా మంచి పేరు రావడంతో ఫ్యాషన్ ప్రపంచమే తన జీవితమని నిర్ణయించుకుంది. అందుకే ‘2002 మిస్ ఢిల్లీ క్వీన్’, ‘2003 ఫెమినా మిస్ ఇండియా’ కిరీటాలతో పాటు, ‘2003 ఫెమినా మిస్ ఇంటర్నేషనల్’ మొదటి రన్నరప్ టైటిల్ సాధించింది. చాంపియన్స్‌ట్రోఫీ, ఐపీఎల్ తదితర టోర్నీలకు హోస్ట్‌గా చేయడంతో క్రికెట్ అభిమానులు ఆమెను ఎక్కువగా గుర్తుపడతారు. ఐఫా అవార్డ్ ఇన్ దుబాయ్, గిమా ఇన్ మలేషియా వంటి అవార్డ్ ఫంక్షన్స్‌కు కూడా హోస్ట్‌గా చేసి మంచి గుర్తింపు పొందింది. ‘ఖత్రోం కే ఖిలాడీ’ షో ద్వారా బుల్లితెర నటిగా పరిచయమైంది. ఆ తర్వాత చేసిన బిగ్‌బాస్ సీజన్–5 రియాల్టీ షో ఆమె పాపులారిటీని అమాంతం పెంచింది. ఈ కారణంగానే ఆమెకు టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ విమెన్’ లిస్ట్‌లో వరుసగా రెండేళ్లు చోటు దక్కింది. కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా ‘రబ్నే బనాదీ జోడీ’, ‘దిల్ బోలే హడిప్పా’ వంటి బాలీవుడ్ సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గానూ నటించింది. 2013లో తన స్నేహితుడు, ఫొటోగ్రాఫర్ శిరాజ్ భట్టాచార్యను ప్రేమ వివాహం చేసుకుంది. నా వయసు అమ్మాయిలందరూ లైఫ్‌లో తొందరగా సెటిల్ అవ్వాలనే ఆశపడతారు. నేను కూడా అంతే. అయితే జీవితమంతా ఆనందంగా ఉండలేము. కొన్నిసార్లు కష్టాలు తప్పవు. అందుకే వీలైనంత వరకు ఆనందంగా ఉండేందుకే నేను ప్రయత్నిస్తుంటా. చదవండి: సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్ధం! -
50 ప్లస్‌లో అదరగొడుతోంది..
ర్యాంప్ వాక్ అనగానే జిగేల్మనే లైట్ల వెలుగులు... ఆ వేదిక మీద అంతకన్నా జిగేల్మనే భామలు కళ్ల ముందు మెదులుతారు. కానీ, 50 ఏళ్ల వయసులో ముంబైకి చెందిన శ్రీమతి గీతా జెనా మోడలింగ్ చేస్తూ.. అందాల పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది. ‘‘ఒక వయస్సు తర్వాత మహిళలు ప్రకటనలలో తల్లులుగా మాత్రమే ఎందుకు కనిపించాలి? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే, మోడలింగ్‌ను వృత్తిగా ప్రారంభించాను. అందుకు నన్ను నేను మెరుగులు దిద్దుకున్నాను. నిజానికి టీనేజ్ నుంచి మోడల్ని అవాలని కల. దానికి తగ్గట్టే సరిగ్గా అప్పుడే గుజరాతీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది, కానీ, మా ఇంట్లో అందుకు ఒప్పుకోలేదు. కుటుంబ బంధం చదువుకునే వయసులోనే పెళ్లి చేసేశారు. చాలా ఏళ్లు కుటుంబ జీవనంలో బిజీగా ఉండిపోయాను. కానీ.. ఏదో వెలితి. నా సొంత గుర్తింపు కావాలనుకున్నాను. పిల్లలు పెరిగే వయసులో ప్రీ స్కూల్లో టీచర్‌గా చేరాను. కానీ, అక్కడ డ్రెస్ కోడ్ తప్పనిసరి. షిఫాన్ చీరలు అస్సలు కట్టకూడదని చెప్పారు. దాంతో ఆ నిబంధనలన్నీ పాటించాను. మూడేళ్ల క్రిందట.. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మోడలింగ్, బ్యూటీ కాంటెస్ట్‌లపై దృష్టి పెట్టేదాన్ని. 2019లో, నా కల నెరవేర్చుకునే సమయం పలకరించింది. ‘ఇండియా బ్రైనీ బ్యూటీ కాంటెస్ట్’లో పాల్గొనే అవకాశం రావడం, అందులో ఫస్ట్ రన్నరప్‌గా పోటీలో నిలవడం ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చింది. ఇప్పుడు 2021 సెకండ్ సీజన్లో, జ్యూరీ సభ్యులలో ఒకరిగా అవకాశం లభించింది. 50 ఏళ్ల వయసులో ర్యాంప్‌పై ఎలా నడవాలో నేర్చుకున్నాను. రన్నరప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత నా ప్రొఫైల్ బయటకు వచ్చింది. స్టార్టప్స్ నుంచి చిన్న బ్రాండ్ల వరకు మోడలింగ్‌కి అవకాశాలు వచ్చాయి. అయితే, నా వయస్సు తెలుసుకొని, వారు వెనక్కి తగ్గారు. ప్లస్ సైజ్ మోడలింగ్.. ప్లస్ సైజ్ మోడల్స్ విషయానికి వస్తే బాడీ ఫిట్‌నెస్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. దీంతో ఈ విభాగంలో పనిచేయాలనుకున్నాను. కానీ, ఇందులోనూ నా ఫిట్నెస్ నాకు అవకాశాలు రానీయకుండా చేస్తుందని గుర్తించాను. ఒక జత ఫాన్సీ లోదుస్తులు, యాక్టివ్ వేర్ కోసం ఆన్లైన్లో విపరీతంగా శోధించాను. ఈ ప్రకటనలలో ఏ భారతీయ బ్రాండ్‌కు వయసు ప్రాతిపదికన సరైన మోడల్స్ లేరని తెలుసుకున్నాను. పాశ్చాత్య దేశాల్లో కూడా వయసు పైబడిన స్త్రీ లో దుస్తులకు మోడల్‌గా కనిపించదు. దీనివల్ల ‘ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఇక మీరు కొన్ని రకాల బట్టలు ధరించడానికి తగినవారు కాదని ఒక సందేశం పంపడంగా భావించాను. దీంతో లో దుస్తులతోపాటు అన్ని రకాల ఉత్పత్తులకు అన్ని వయసుల వారిని మోడలింగ్‌లోకి తీసుకోవాలని ఆన్లైన్ పిటిషన్ ప్రారంభించాను. కాబట్టి ఇప్పుడు మోడలింVŠ మొదలు పెట్టాను. లోదుస్తుల వెబ్‌సైట్‌నూ ప్రారంభించాను. నలభై ఏళ్లు పైబడిన మహిళలు తమ ఏకైక ఎంపిక చీరలు, సల్వార్ కమీజ్ మాత్రమే అని భావించకూడదు. లో దుస్తుల బ్రాండ్ ఈ మూసను విచ్ఛిన్నం చేస్తే అది అన్నిరకాల జీవనశైలి బ్రాండ్లకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది’’ అని వివరిస్తోంది ఈ యాభై ఏళ్ల మోడల్ గీతా జెనా. -
సౌత్ ఇండియా మోడలింగ్ మిస్టర్ & మిస్ హైదరాబాద్ 2021
-
ఏం తిప్పావు అంకుల్?!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలవుతున్నాయి. అందులో కొన్ని అద్బుతంగా ఉంటే మరి కొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి కూడా ఉంటాయి. తాజాగా ఈ కోవకు చేందిన వీడియో ఒకటి ట్విట్టర్లో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. క్రిస్టియన్ డీ హారిస్ అనే వ్యక్తి.. ‘నా భార్యతో డేట్‌కి వెళ్లడానికి ముందు నా మోడలింగ్ వీడియో’ అంటూ దీన్ని షేర్ చేశాడు. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో హారిస్ పింక్ కలర్ సూట్ ధరించి రూమ్‌లోకి నడుచుకుంటూ వస్తాడు. సూట్ లోపల డార్క్ పర్పుల్ కలర్ టై... బ్రౌన్ కలర్ ఫార్మల్ షూ ధరించాడు. ఆ తర్వాత మైక్రోవేవ్ స్పిన్ డ్యాన్స్ స్టెప్‌తో తన సూట్‌ని ప్రదర్శించాడు. (చదవండి: ఈ ‘బనాన గర్ల్’ డైటేమిటంటే....) Me modeling for my wife before we leave to go on our date: pic.twitter.com/bPNOUk5Po0 — Christian D. Harris (@chrxstianh__) October 6, 2020 ఈ సింపుల్ యాక్షన్ ట్విట్టర్ జనాలకు తెగ నచ్చింది. ఇప్పటికే దీన్ని 38.6కే మంది వీక్షించారు. అంకుల్ ఏం తిప్పారు.. నా తల ఇంకా తిరుగుతూనే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. మీరు ఓ సారి ఈ అంకుల్ స్లో మోషన్ మోడలింగ్ వీడియో చూడండి. -
'గోల్డ్' తరం మోడలింగ్
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను అక్షరాలా నిజం చేసుకుంటున్నారు ఈ తాతమ్మ, తాతయ్యలు. పాత దుస్తులను ధరించి మోడలింగ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పేరు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చిస్తున్న ఈ జంట యువతరం కాదు. మోడల్స్ కానే కాదు. సినిమా తారలు అసలే కాదు. కానీ, పాత దుస్తులతో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ దంపతుల దేశం తైవాన్. వీరికి తైచుంగ్‌లోని సెంట్రల్ సిటీ సమీపంలో ఓ చిన్న లాండ్రీ ఉంది. 83 ఏళ్ల చెంగ్ వాంజీ, 84 ఏళ్ల సువో షోర్ దంపతులకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఇప్పుడు 6 లక్షలకు మందికి పైగా ఫాలోవర్స్ అయ్యారు.. మోడలింగ్ చేస్తున్న ఈ జంట ఫోటోలు ఈ తరానికి తెగ నచ్చుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న వీరి లాండ్రీకి రోజూ కస్టమర్లు వచ్చేవారు. కరోనా మహమ్మారి కారణంగా లాండ్రీ మూతపడింది. లాండ్రీ తెరిచే సమయానికి ఇక్కడ బట్టలు ఇచ్చిన కస్టమర్లు వాటిని తిరిగి తీసుకోవడం మర్చిపోయారు. కొంతమంది పట్టణమే వదిలేసి వెళ్లిపోయారు. అలా దాదాపు 400 డ్రెస్సులు వీరి లాండ్రీలోనే ఉండిపోయాయి. ఈ వృద్ధ దంపతులకు 31 ఏళ్ల మనవడు రీఫ్ ఉన్నాడు. లాక్డౌన్ కారణంగా లాండ్రీ మూసేయడంతో తాత, బామ్మలు తరచూ బాధపడటం చూశాడు. రీఫ్ తమ బామ్మ, తాతయ్యల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆనందంగా మోడలింగ్ ఇంట్లో లాండ్రీకి వచ్చిన పాత బట్టలను ధరించి మోడలింగ్ చేయమని అవ్వాతాతకు సలహా ఇచ్చాడు. ముందు వారు ఒప్పుకోలేదు. కానీ, మనవడి కోసం ఆ డ్రెస్సులను వేసుకున్నారు. ‘వాటిని ధరించినప్పుడు మా వయస్సు ముప్పై సంవత్సరాలకు తగ్గినట్టుగా భావించాన’ని చెంగ్ వాంజీ సంబరంగా చెబుతున్నాడు. రీఫ్ అమ్మమ్మకు బట్టలు అంటే ఇష్టం. దీంతో ఈ అవ్వాతాతలు ఇద్దరూ రకరకాల దుస్తులు ధరించి మోడలింగ్ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. ‘నా వార్డోబ్ర్లో 35 ఏళ్ల క్రితం కొన్న నా డ్రెస్సులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ధరించడం, ఆ డ్రెస్సుల్లో నన్ను నేను చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను మోడలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను’ అని చెబుతుంది 84 ఏళ్ల సువో షోర్. మనవడు రీఫ్ ఈ జంట ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్నాడు. కరోనా కాలంలో ఈ వృద్ధ దంపతులు ప్రజలలో ఆశా కిరణాన్ని సృష్టిస్తున్నారని సోషల్ మీడియా అభిమానులు వీరికి అభినందనలు తెలుపుతున్నారు. ఆరు దశాబ్దాల క్రితం ఈ జంట ఆరు దశాబ్దాల క్రితం తైవాన్‌లో వివాహం చేసుకుంది. ‘వయసు మీద పడింది, లాండ్రీని మూసేసి విశ్రాంతి తీసుకోవాలని చాలాసార్లు ఆలోచించాను, కానీ మిషనరీ మీద ఈ పని సులభంగా చేయవచ్చులే అని ఆలోచనను మానుకున్నాం. పని మొదలెడితే తక్కువ కష్టమే అనిపిస్తుంది. అందువల్ల లాండ్రీని మూసివేయకూడదనుకున్నాం. వృద్ధాప్యంలో అలసటతో కూర్చోవడానికి బదులు చేతనైన పనులు చేసుకుంటేనే మంచిది. పని చేస్తూ ఉంటే వృద్ధాప్యంలో పుట్టుకొచ్చే అనేక శారీరక మానసిక సమస్యలను నివారించవచ్చ’ని చెంగ్ చెబుతున్నాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు ధరించడం ద్వారా కూడా ఫ్యాషన్‌ని చూపించవచ్చని నిరూపిస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ప్రస్తుతం వీళ్లు ‘ఎన్విరాన్మెంటల్ ఫ్యాషన్‘ ను ప్రోత్సహించడంలో బిజీగా ఉన్నారు. -
అప్పట్లో చచ్చేంత సిగ్గు: నటుడు
బాలీవుడ్ నటుడు, ప్రముఖ మోడల్ మిలింద్ సోమన్ మోడలింగ్‌లోకి అడుగు పెట్టకముందు ఎలా ఉండేవారు? ఈ ప్రశ్నే చాలామందికి రావడంతో నేరుగా మిలింద్‌నే అడిగేసరికి ఆయన మోడలింగ్‌లోకి రాకముందు దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లో తనకు చచ్చేంత సిగ్గన్న విషయాన్ని వెల్లడించారు. అసలు ఫొటో దిగాలంటేనే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదన్నారు. ఆనాటి ఫొటో చూసి అవాక్కయిన అభిమానులు మిలింద్‌లో మార్పులను విశ్లేషిస్తూ ఆయనను పొగడకుండా ఉండలేకపోతున్నారు. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి) "కెమెరా ముందుకు రావాలంటే సిగ్గుపడే వ్యక్తి ఇప్పుడు కెమెరానే ప్రేమిస్తున్నాడు" అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. "మీరు అప్పటికీ ఇప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నారు", "మీరొకసారి పెరిగిన గడ్డాన్ని తీసేసి, క్లీన్ షేవ్ చేసుకుని, నెరిసిన జుట్టుకు నల్ల రంగేసారనుకోండి.. మళ్లీ మీ పాత లుక్ మీకు తిరిగొస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆరుబయట కుర్చీల్లో వాలిపోయిన మిలింద్ దంపతులు కునుకు తీస్తూ ప్రకృతిలో సేదతీరుతున్న ఫొటోను సైతం ఈ మోడల్ షేర్ చేశారు. కాగా మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. "మేడ్ ఇన్ ఇండియా" మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. (‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’) View this post on Instagram Some people wanted to see a throwback pic from pre modeling days, so here it is ! It's a rare one, taken sometime in the late eighties, and like I said, being very shy, I was not a fan of being photographed 😀 I might have been just out of college! . . . #throwbackthursday A post shared by Milind Usha Soman (@milindrunning) on Aug 6, 2020 at 4:53am PDT -
‘క్లబ్ రౌడీ..మేం రెడీ... ’
వ్యక్తిగత ఫ్యాషన్ లేబుల్ లాంచ్ చేసిన టాలీవుడ్ హీరోగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు విజయ్ దేవర కొండ. అలాగే తన రౌడీ లేబుల్‌ని ప్రమోట్ చేయడానికి కూడా వెరైటీ రూట్నిఎంచుకుంటున్నాడు. ఓ క్లబ్‌ని ఏర్పాటు చేసి దానిలో పూర్తిగా యువతకు అవకాశాలిస్తున్నాడు. నిఫ్ట్ వంటి కాలేజీల నుంచి క్రియేటివ్ థాట్స్ ఉన్న యువతని ఎంచుకుంటున్నాడు. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహణ కోసం రౌడీస్ క్లబ్‌కు ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సిటీలో రౌడీ స్టైల్స్ ఎంత క్రేజీయో.. ఈ క్లబ్లో మోడల్, ఫొటోగ్రాఫర్ లేదా మరేదైనా పోస్టుకు ఎంపికవడం అంతే క్రేజీగా మారింది. ఈ క్లబ్ నిర్వహిస్తున్న ఆన్లైన్,ఆఫ్‌లైన్ ఈవెంట్స్‌కు విజయ్ దేవర కొండ అటెండ్ అవుతుండడంతో యూత్‌కి క్లబ్ ఆసక్తిని పెంచుతోంది. దక్షిణాదిలో మంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్‌కి కూడా మంచి ఇమేజ్ వచ్చింది. యాప్ ద్వారా విక్రయాలతో గత 2018 జులైలో ప్రారంభమైన రౌడీ వేర్ యాప్‌కు డౌన్లోడ్స్ మోత మోగించాయి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన పలువురు యువతీ యువకులతో ఏర్పాటు చేసిన రౌడీక్లబ్ యూత్‌కి క్రేజీగా మారింది. ఈ క్లబ్ నిర్వహించే ప్రమోషనల్ ఈవెంట్స్ సిటీలో ఓ రేంజ్లో కాలేజీ యువతను ఆకట్టుకుంటున్నాయి. యూత్ బ్రాండ్... ‘‘మేం మా రౌడీ వేర్ని యువతకు చేరువ చేయాలనుకున్నాం కాబట్టి ఈ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ప్రధానంగా కళాశాల విద్యార్థుల మీద దృష్టి పెట్టాం. వారి నుంచే మోడల్స్ కావాలని కోరుకున్నాం. వాళ్లయితే మా బ్రాండ్‌ని అత్యుత్తమంగా రిప్రజెంట్ చేస్తారనేది మా ఉద్దేశ్యం’’ అని చెప్పారు ఈ క్లబ్ ప్రతినిధి పూజ. మోడల్స్‌తో పాటు తమకు అవసరమైన ఇతరత్రా టాలెంటెడ్ యూత్‌ని ఎంచుకోవడం కోసం ఈ బ్రాండ్ ఆధ్వర్యంలో ఒక టీమ్ కూడా ఏర్పాటైంది. యాటిట్యూడ్, ఆత్మవిశ్వాసంతో పాటు స్ట్రీట్వేర్ని ధరించి ప్రజెంట్ చేసే విధానాన్ని విశ్లేషించి మోడల్స్‌ని ఎంచుకుంటున్నామని పూజ చెప్పారు. ‘‘ఇప్పటిదాకా మా క్లబ్లో 20 మంది మోడల్స్ ఉన్నారు. వీరిలో హైదరాబాద్ వాసులే కాకుండా వేరే రాష్ట్రాల వారు కూడా ఉన్నారు’’ అని పూజ చెప్పారు. రౌడీ టీమ్ కార్యకలపాలలో నిఫ్ట్ నుంచి వచ్చిన యువత ఎక్కువగా పాలుపంచుకుంటున్నారు. నగరానికి చెందిన ఫ్యాషన్ బ్లాగర్స్ రక్ష , దివ్య బొప్పన, ఈషారావు, ధీరజ్, పాస్వెట్ తదితరులు ప్రస్తుతం వీరికి ప్రమోషన్ చేస్తున్నారు.. యూ ఆర్ ద ఫ్యూచర్... మా టీమ్‌లో జేర్చుకునేందుకు మోడల్స్ తో పాటుు గ్రాఫిటి డిజైనర్స్, ఫొటో/వీడియో గ్రాఫర్స్, స్టైలిస్ట్స్ల కోసం రెగ్యులర్ టాలెంట్ హంట్ చేస్తున్నాం. ఇదొక స్ట్రీట్ వేర్ బ్రాండ్. మా ట్యాగ్‌లైన్ యూ ఆర్ ద ఫ్యూచర్. దానికి తగ్గట్టే 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే మాకు మెయిన్ ఫోకస్. వీరికి ఇచ్చే రెమ్యునరేషన్ అసైన్మెంట్ లను బట్టి ఉంటుంది. – పూజ, రౌడీ క్లబ్ ప్రతినిధి జాబ్‌తో బ్యాలెన్స్ చేసుకుంటూ... నా ఫ్రెండ్ విష్ణు అనే ఫొటోగ్రాఫర్ ద్వారా ఈ ‘రౌడీ’ క్లబ్ పరిచయమైంది. మోడల్‌గా ఛాన్స్ వచ్చింది. అరడజను ప్రొడక్టŠస్కి మోడలింగ్ చేశా. సన్డోనర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి పెర్ఫార్మ్ చేయడం మరచిపోలేని జ్ఞాపకం. టీమ్ అందిస్తున్న సహకారం వల్ల జాబ్‌ని మోడలింగ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఏమీ లేదు. – సంజయ్ ఠాకూర్, అమెజాన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ‘రౌడీ’తో హ్యాపీ... ఇన్‌స్ట్రాగామ్ ద్వారా రౌడీ వేర్ ప్రతినిధులు నన్ను సంప్రదించి మోడల్‌గా ఎన్నుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న బ్రాండ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్‌లో ఉన్న వారంతా టాలెంటెడ్ యువత. వీరి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నా.– తన్మయి, మోడల్ -
ఇన్స్టాంట్ మోడల్స్
‘కనీసం 5.6 అడుగుల ఎత్తుండాలి. తీరైన శరీరాకృతి కావాలి. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ఇవన్నీ ఉన్నా ర్యాంప్‌వాక్, హావభావాలు పలికించడం వగైరాల్లో ముందస్తు శిక్షణ తప్పనిసరి...’మోడలింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే అమ్మాయిలకు కావాల్సిన అర్హతలివి అని ఇన్స్టిట్యూట్స్ చెబుతాయి. అయితే ఇది గతం. ఇప్పుడు క్షణాల మీద మోడల్ అయిపోవచ్చు. టాప్ మోడల్స్‌కు సవాల్ విసరవచ్చు. అవును... సోషల్ మీడియా సృష్టిస్తోంది‘ఇన్‌స్టా’ంట్ మోడల్స్. సిటీకి చెందిన పలువురు యువతులు ఇన్‌స్టా మోడల్స్‌గా ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో :డిజిటల్ విప్లవం, సమాచార వ్యవస్థను దాదాపు పూర్తిగా చేతుల్లోకి తీసుకున్న నేపథ్యంలో..విభిన్న రంగాలకు సంబంధించి అప్పటిదాకా ఉన్న ప్రతి సూత్రాన్నీ తిరగరాయాల్సి వస్తోంది. దీనికి తాను కూడా అతీతం కాదని మోడలింగ్ రంగం స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియా విజృంభణతో ఇంట్లో కూర్చుండగానే సిటీ అమ్మాయిల్ని ఓవర్‌నైట్ మోడల్స్‌గా మార్చేస్తున్న వాటిలో ప్రధాన పాత్ర ఇన్‌స్టాగ్రామ్‌దే. ఈ–మోడల్స్ ఏం చేస్తారంటే... సోషల్ వేదికగా హల్ చల్ చేస్తున్న ఈ అందమైన అమ్మాయిలను పలు సంస్థలు సంప్రదిస్తుంటాయి. వీరికి తగినంత రెమ్యునరేషన్ ముట్టజెప్పి, తమ సంస్థల తరపున బ్రాండింగ్, ప్రమోషన్ వంటి ప్రచారాల్లో భాగం చేస్తాయి. అయితే చాలా వరకూ ఇదంతాడిజిటల్ అడ్వర్టయిజ్మెంట్కే పరిమితం అనేది గమనార్హం.ఈ మోడల్స్ ర్యాంప్వాక్లూ గట్రా చేయరు. తమ క్లయింట్స్ కోరిన విధంగా డ్రెస్ చేసుకోవడం లేదా ఫలానా బ్రాండ్‌కి చెందిన ఉత్పత్తి తాను వినియోగిస్తున్నానని చెప్పడం వంటివి చేస్తారు. అంతేకాకుండా అవసరమైతే ఆఫ్‌లైన్ ఈవెంట్ కోసం సంస్థ నిర్వహించే ప్రచారకార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తమ అకౌంట్లో అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి వారికి ఉన్న ఫాలోయర్స్ దృష్టిని అవి ఆకర్షిస్తాయి. తద్వారా తమ ఉత్పత్తి/సంస్థకు యువతరంలో తగిన ప్రచారం లభిస్తుందని వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. మోడరన్.. మోడలింగ్... కాఫీషాప్స్, రెస్టారెంట్స్, పబ్స్, క్లబ్స్, జిమ్స్...వంటి ఆధునిక వ్యాపారాలు ఈ మోడల్స్ వెంట క్యూ కడుతున్నాయి. తక్కువ వ్యయంతో తమ టార్గెటెడ్ కస్టమర్స్‌ని చేరుకోవడానికి దీన్ని సరైన మాధ్యమమని భావిస్తున్నాయి. మరోవైపు కాలేజీల్లో చదువుకుంటూ సరదాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టి సడెన్‌గా సెలబ్రిటీలు అయిపోతున్న అమ్మాయిలకు ఈ మోడలింగ్ అవకాశాలు చక్కటి పార్ట్ టైమ్ ఆదాయ మార్గాలుగా మారాయి. ఫాలోయర్స్ ఉంటే...అవకాశాల పంటే... నగరానికి చెందిన యువతి రక్ష (21) ప్రస్తుతం నిఫ్ట్‌లో డిజైనింగ్ కోర్సు చేస్తోంది. తరచుగా విభిన్న రకాల డిజైనర్ దుస్తులు ధరించిన ఫొటోలతో తన ఇన్‌స్టాను నింపేసే ఈ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 5వేలకు పైగా ఫాలోయర్స్ ఏర్పడ్డారు. దీంతో సిటీకి చెందిన పలు సంస్థలు ఆమెకు మోడల్‌గా రెడ్ కార్పెట్ పరిచాయి. సిటీకే చెందిన మరో అమ్మాయి కృతికా సింగ్ రాథోర్ (24)కి ఏకంగా 50 వేల మంది ఫాలోయర్స్ ఉండడంతో ఆమె టాప్ ప్లేస్‌లో ఉంది. ఈమెకు పెద్ద పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘మోడలింగ్‌లో ముందు నుంచీ ఉన్నాను. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశాక నాకున్న ఫాలోయర్స్ పెరిగారు. ఇది మరిన్ని సంస్థలకు నన్ను పరిచయం చేసింది’ అంటూ ‘సాక్షి’కి చెప్పింది కృతిక. అలాగే 21 వేల మంది ఫాలోయర్స్ ఉన్న తనుషా బజాజ్ (24), 38 వేల మంది ఫాలోయర్స్ ఉన్న కీర్తనారెడ్డి (23), 13 వేల మంది ఫాలోయర్స్ ఉన్న రచనారెడ్డి (20)... తదితర సిటీ అమ్మాయిలంతా తమకున్న ఫాలోయర్స్ సంఖ్యతో టాప్ బ్రాండ్స్, కంపెనీల నుంచి మంచి మంచి మోడలింగ్ అవకాశాలు పొందుతున్నారు. సిటీ నుంచి డిజిటల్ యుగపు మోడల్స్‌గా రాణిస్తున్నారు. -
అలంకరణ
ఈ సమ్మర్లో అమ్మాయిల మేకప్ ట్రెండ్ మారిపోయింది. ఎప్పుడూ కనిపించే బ్లాక్ క్యాట్ ‘ఐ’ లా కాకుండా, నియాన్ ఐ లైనర్ల ఎలక్ట్రిక్ షేడ్‌తో టీనేజ్ అమ్మాయిలు పార్టీలలో, ఫ్యాషన్ వీక్‌లలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ పత్రిక ‘ఎల్’ (ఇ.ఎల్.ఎల్.ఇ.) ఇలాంటి ఫ్యాషన్లకు మళ్లీ మళ్లీ ఆదరణ కల్పిస్తూ మోడలింగ్ చేయిస్తుంటుంది. నెట్లోకి వెళ్లి చూస్తే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న నియాన్ ఐ లైనర్ మీ నగరానికి దగ్గర్లో ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది. లేదంటే ఆన్లైన్ షాపింగ్ ఉండనే ఉంది. -
బ్యాక్ టు బి.సి
సంగీత.. ఫ్యాషన్ డిజైనర్. ఎంతమంది లేరూ! సంగీత.. మోడల్ కూడా. వెరీ కామన్ థింగ్. అయితే డిజైనింగ్, మోడలింగ్ కాదు ఆమె ప్రత్యేకత. అవి రెండూ టైమ్ ఉన్నప్పుడు చేస్తుంటారు సంగీత. టైమ్ అంతా పెట్టి చేస్తున్నది వేరే ఉంది. అదీ డిజైనింగే, అదీ మోడలింగే! అవును. సంగీత ఓ కొత్త తరం పిల్లల్ని డిజైన్ చేస్తున్నారు. ఆ పిల్లల్ని ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి రోల్ మోడల్స్‌గా అందిస్తున్నారు. అందుకు ఆమె ఎంచుకున్న దారి.. ఆటలు! పబ్జీలు, పొకెమాన్ల ఆన్లైన్ ఆటలు కాదు. పచ్చీస్, బారాగట్టా వంటి బీసీ (బిఫోర్ సెల్‌ఫోన్) ఆటలు! అది ప్రైమరీ స్కూలు. పిల్లలకు అక్షరాలు దిద్దిస్తోంది టీచర్. ఓ తొమ్మిదేళ్ల బాలుడికి అక్షరాలు చక్కగా కుదరడం లేదు. తన ప్రి–స్కూల్ కోర్సులో భాగంగా అన్ని క్లాసులనూ పర్యవేక్షించడానికి అప్పుడే ఆ క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన సంగీతా రాజేశ్ కంట పడిందా పిల్లవాడి చేతిరాత. పలక మీద ఇంగ్లిష్‌లో ‘ఏ’ అక్షరాన్ని రాయమన్నారామె. ఆ పిల్లవాడు రాశాడు. అయితే దానిని అక్షరం అనడానికి ఆమె మనసొప్పుకోలేదు. కుదురుగా కూర్చుని అక్షరాలన్నింటినీ చక్కగా రాసి చూపించమన్నారు సంగీతారాజేశ్. ‘‘అప్పుడా పిల్లవాడు ఇచ్చిన సమాధానంతో నా బుర్ర తిరిగిపోయింది’’ అన్నారామె. ‘‘అక్షరాలను గుర్తు పట్టడం వస్తే చాలు కదా మేడమ్, అందంగా, గుండ్రంగా రాయకపోతే ఏమవుతుంది? ఏది రాయాలన్నా కీ బోర్డు మీదనే టైప్ చేస్తాను కదా’’ అన్నాడా కుర్రాడు! మెదడు పరుగులే.. కాళ్ల పరుగుల్లేవు! వీడియో గేమ్‌ల తరాన్ని దాటేశాం. ఈ తరం చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆటవస్తువైపోయింది. ఆటలన్నీ అందులోనే. ఆ ఆటలు ఆడేటప్పుడు వాళ్ల మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంటుంది. పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికీ అసహనమే. లిఫ్ట్ పై అంతçస్తు నుంచి కిందికి వచ్చే వరకు కూడా నిరీక్షించలేకపోతున్నారు. కంప్యూటర్ సెకన్లలో రెస్పాండ్ కాకపోతే మౌస్‌ను టపటపా కొడుతున్నారు. క్యూలో తమ వంతు వచ్చే వరకు డిసిప్లిన్‌తో నిలబడటానికీ విసుగే. ఇలాగే పిల్లలు పెరిగి పెద్దయితే సమాజంలో ఇమడలేరు. ఇలాంటి పిల్లలతో తయారయ్యే సమాజంలో మనుషుల మధ్య పరస్పర సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు. వీటన్నింటికీ విరుగుడు వాళ్లను కూర్చోబెట్టి ఆటలాడించడమేనంటారు సంగీత. పులీమేక ఆటల్లో జీవితం ఉంటుంది ‘‘అవుట్డోర్ గేమ్స్ శారీరక చురుకుదనాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ఇన్డోర్ గేమ్స్ పిల్లల్లో పరిణతిని తెస్తాయి. లైఫ్‌స్కిల్స్ నేర్పిస్తాయి. ఒక టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు దాని మీద నుంచి దృష్టిని పక్కకు పోనివ్వని విధంగా ఏకాగ్రతను అలవరుస్తాయి. వ్యక్తిత్వ వికాసం, నిగ్రహశక్తి, సిచ్యుయేషన్ మేనేజ్మెంట్ వంటివి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉండదు. అవన్నీ మన ఆటల్లో నిబిడీకృతమై ఉన్నాయి. అందుకే పచ్చీస్, వామనగుంటలు, విమానం (యుద్ధంలో మెళకువలు), పరమపదసోపాన పటం (వైకుంఠపాళీ), పులి– మేక, చదరంగం, బారాగట్టా వంటి ఆటలను అలవాటు చేస్తే పిల్లల్లో మెదడు స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడుతుందనిపించింది. ఇప్పుడు పిల్లలు ఎదుర్కొంటున్న అటెన్షన్ డెఫిషియెన్సీకి కూడా అసలైన మందు మన ఇన్డోర్ గేమ్స్‌లో ఉంది’’ అన్నారామె. సంగీత ప్రి స్కూల్ ఎడ్యుకేషన్‌లో కోర్సు చేశారు. ప్రి స్కూల్స్‌కి కరికులమ్ డిజైన్ చేసిన అనుభవం కూడా ఉందామెకి. ఆమె స్వయంగా ‘స్మైల్’ పేరుతో స్పెషల్ చిల్డ్రన్‌కి స్కూల్ నడుపుతున్నారు. పిల్లలు స్కూల్‌కి.. తను ‘ప్రి–స్కూల్’కి తమిళనాడు, మదురై దగ్గర దిండిగల్‌లో పుట్టి పెరిగిన సంగీత డిగ్రీ వరకు అక్కడే చదివారు. పెళ్లి అనంతరం హైదరాబాద్ వచ్చారు. ‘‘పెళ్లయిన తర్వాత పీజీ చేశాను. తొమ్మిదేళ్లపాటు ఇద్దరు పిల్లలతో గృహిణిగా ఉన్నాను. నా పిల్లలను స్కూలుకి పంపించాల్సి వచ్చినప్పుడు ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ మీద నా దృష్టి పడింది. నా కెరీర్‌ని స్కూల్లో డెవలప్ చేసుకుంటే పిల్లలతోపాటు వెళ్లి రావచ్చు అనుకున్నాను. ప్రి స్కూల్ కోర్సు చేశాను, కొన్ని కార్పొరేట్ స్కూళ్లతో కలిసి పని చేశాను. ఆ అనుభవంతో సొంతంగా స్కూలు పెట్టాను. స్పెషల్ కిడ్స్‌కి అవసరమైనట్లు డిజైన్ చేశానా స్కూల్‌ని. నార్మల్ కిడ్స్ కోసం ఒక సెక్షన్ ఉండేది. అప్పట్లో దుబాయ్ నుంచి ఒక తల్లి తన పిల్లవాడి కోసం అక్కడ మంచి స్కూల్ లేదని మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడా అబ్బాయి మా దగ్గరే ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయితో మొదలైన స్కూల్ ఇప్పుడు 45 మంది పిల్లలతో నడుస్తోంది. స్కూల్‌ని విస్తరించాలనే ఉద్దేశంతో ఐఎస్బీ కోర్సు చేశాను. కోర్సు చేసిన తర్వాత స్పెషల్ కిడ్స్ కోసం డిజైన్ చేసిన స్కూల్‌ని వ్యాపారపరంగా ఫ్రాంచైజీలు ఇవ్వడానికి నాకు మనసు రాలేదు. ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్లు నేను నడిపినట్లు నడపకపోతే ఆ పిల్లల భవిష్యత్తు మరింత గందరగోళమవుతుంది. అందుకే స్కూలును నా ఆత్మసంతృప్తి కోసమే నడపాలి, వ్యాపారం చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశాను’’ అన్నారు. ఆడించడానికి బొమ్మలు చేయించారు ‘‘ఒక సమస్య నా దృష్టిలో పడితే దానికి పరిష్కారం కోసం ఆలోచించడం నాకలవాటు. అది నాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనేది తర్వాతి మాట. ముందా పని చేసేస్తాను. అలా మొదలైందే ఈ ఆటబొమ్మల పునః పరిచయం. మన సంప్రదాయ ఆటవస్తువులను పిల్లలకు పరిచయం చేయాలంటే ఆటవస్తువులను తయారు చేయించాలి. వాటికోసం హైదరాబాద్‌లో వడ్రంగులు సరిగ్గా దొరకలేదు. దాంతో తమిళనాడు, కర్ణాటకలోని పల్లెలకు వెళ్లి అక్కడి వడ్రంగుల చేత ఆటవస్తువులను తయారు చేయిస్తున్నాను. పిల్లలకు ఆడటం నేర్పించడానికి స్కూళ్లలో చిన్న చిన్న పోటీలు పెడుతున్నాం. నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే.. ఈ ఆటలు కొన ఊపిరితో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో పిల్లలకు అలవాటు చేస్తున్నారు. అయితే అది నూటికి పది మందిలోపే. తొంభై శాతం పిల్లలకు మేము పెడుతున్న వర్క్షాపులతోనే పరిచయమవుతున్నాయి ఈ ఆటలు. మా ఆటవస్తువుల అమ్మకం కోసమే అయితే ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టవచ్చు. నా ఉద్దేశం పిల్లలకు ఆడటం నేర్పించడం. అందుకే స్కూళ్లకు వెళ్లి పిల్లలకు ఆట నేర్పించే పని కూడా మేమే చేస్తున్నాం. పరీక్షలకూ ఆటల ప్రిపరేషన్! ఆటలు నిజాయితీగా ఆడితే తోటి పిల్లలందరూ స్నేహితులవుతారు, మోసపూరితంగా ఆడే వాళ్లను దూరం పెడతారు. మోసం చేసే వాళ్లు తమను తాము తెలివైన వాళ్లమనే భ్రమలో ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం నిలవదనే వాస్తవాన్ని ఆటల్లోనే తెలుసుకుంటారు. ఒక పిల్లాడు తాను గెలవడం కోసం ఒక అబద్ధం చెబితే, అది అబద్ధం అని తెలిసినప్పుడు మిగిలిన పిల్లలందరూ ఆ పిల్లవాడిని దొంగను చూసినట్లు చూస్తారు. అది ఆ ఒక్కడికే కాకుండా అప్పుడు ఆటలో ఉన్న వాళ్లందరూ తెలుసుకుంటారు. అలాగే ఈ ఆటలు చదివిస్తాయి కూడా. కొన్ని ఆటలు పూర్తవడానికి రెండు–మూడు గంటల టైమ్ పడుతుంది. అంతసేపూ ఏకాగ్రతతో కూర్చోవడం అలవాటవుతుంది పిల్లలకు. పెద్ద తరగతులకు వెళ్లిన తర్వాత పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే ఒక టాపిక్ మీద అంత టైమ్ ఉండగలగడం వస్తుంది ఈ ఆటలతో. ‘మా వాడికి తెలివి ఉందండీ. చాలా చురుగ్గా ఉంటాడు. కానీ కుదురుగా కూర్చోవడమే కష్టం. ఒక గంట కూర్చోపెట్టలేకపోతున్నాం’ అని బాధపడే తల్లిదండ్రులందరికీ ఈ ఆటలు చక్కటి పరిష్కారం’’ అన్నారు సంగీత. – వాకా మంజులారెడ్డి ఫొటో : శివ మల్లాల మా అమ్మ కోప్పడుతుంటుంది ‘‘స్కూలు, ఆటవస్తువుల పునః పరిచయం వంటివన్నీ నా ఆత్మసంతృప్తి కోసం చేస్తున్నాను. నేను ఉపాధి పొందడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లింది నా ఆలోచన. అందులో దిగిన తర్వాత అదొక బిజినెస్ సైన్స్, చాలా సెన్సిబుల్‌గా మార్కెట్ చేయాలని తెలిసింది. డిజైనింగ్‌లో క్రియేటివిటీతోపాటు చాలా శాస్త్రబద్ధంగా చేయగలుగుతున్నాను. కానీ మార్కెట్ దగ్గర విఫలమయ్యాను. నా ఇంట్రెస్ట్లన్నీ కలగలుపుతూ ఒక పీస్ చేయగలుగుతున్నాను. దానిని అంత ధరకు అమ్మడం ఎలాగో నేర్చుకోవాలిప్పుడు. నేను డిజైన్ చేసిన చీరను ప్రదర్శించడానికి మోడల్స్‌కి డబ్బిచ్చే బడ్జెట్ లేదు నాకు. అందుకే నేనే స్వయంగా ప్రదర్శిస్తూ ఫేస్బుక్ పోస్ట్ చేస్తున్నాను. కాళహస్తిలో కలంకారీ కళాకారుల కష్టాన్ని నా ఫోన్లో షూట్ చేసి వీడియోలు పోస్ట్ చేశాను. ఒక చీర అందంగా తయారు కావాలంటే కోట నుంచి సాదా చీర, కాళహస్తిలో పెన్‌కలంకారీ డిజైన్ వేయడం, రంగులు అద్దడం, మగ్గం మీద పని, టైలర్ అప్లిక్ వర్క్ చేయడం వంటి దశలన్నీ చూపించాను. పదివేల రూపాయల చీర వెనుక ఎంతమంది శ్రమ ఉందో తెలియచేయడంలో, ఆ చీర కొంటే పరోక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతారో తెలియచేయడంలో సక్సెస్ అయ్యాను. చీరల గురించి పాఠాలు చెప్పడం మాని వ్యాపారం చేయడం నేర్చుకోమని మా అమ్మ కోప్పడుతుంటుంది’’ అన్నారు సంగీత తన ‘సంగీత ఫ్యాషన్ స్టూడియో’ గురించి చెబుతూ. – సంగీతా రాజేశ్ -
మల్టీటాలెంటెడ్ కిడ్
నాలుగో తరగతి చదువుతోన్న చిన్నారి విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు. ఓవైపు మోడలింగ్, మరోవైపు యాడ్స్లోనటిస్తూ, ఇంకోవైపు చిత్రలేఖనంలోనూ ప్రతిభ చాటుతున్నాడీ మల్టీటాలెంటెడ్ కిడ్ షణ్ముఖ్. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడాఎంపికయ్యాడు. మియాపూర్: ఆదిలాబాద్ నుంచి పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో నివసిస్తున్న సురేష్, ఆశలత దంపతుల కుమారుడు షణ్ముఖ్. స్థానిక శ్రీనిధి గ్లోబల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఫ్యాషన్‌పై షణ్ముఖ్ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని ప్రోత్సహించారు. ఫేస్బుక్లో ఓ యాడ్ చూసిన సురేష్ ‘గ్లామర్ ఎరా’ కాంపిటీషన్‌కు షణ్ముఖ్ ఫొటోలు పంపించాడు. అప్పటికే సమయం దాటిపోవడంతో వైల్డ్ కార్డు ద్వారా షోకు సెలెక్ట్ అయ్యాడు. ఏప్రిల్ 29న షోలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అతడి టాలెంట్ చూసి మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో రాణిస్తాడని న్యాయనిర్ణేతలు అభినందించారు. అప్పటి నుంచి ఇంట్లోనే మోడలింగ్, ఫ్యాషన్ మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఆపిల్, అమెజాన్, ఇంటీరియర్ డెకరేషన్ తదితర యాడ్స్‌లో చేసి మెప్పించాడు. నగరంలో జరిగిన ఫ్యాషన్ షోలలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్‌లో జరిగిన ‘అల్మోరా ఫ్యాషన్ మోడల్ అండ్ ఫర్ ఆలేజ్ ఫ్యాషన్ షో’లో అవార్డు అందుకున్నాడు. ముంబైలో క్యాలెండర్ యాడ్స్ చేసేందుకు అవకాశం పొందాడు. షణ్ముఖ్ టాలెంట్‌కు అనేక అవకాశాలు వస్తున్నాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తా... మోడలింగ్, యాక్టింగ్‌లో రాణించి భవిష్యత్తులో ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఉంది. ఈ రంగంలోకి వచ్చేందుకు నా తల్లిదండ్రులు, గురువులు కష్కష్ ఫాతిమా, అంబర్ పాతర్, సలీమ్ ఇలాయి, అమీద్ అరోరా, ఖాసిం ఖాన్లు ఎల్లప్పుడూ మెళకువలు అందిస్తున్నారు. మెడలింగ్‌లో ఎంపికైనందుకు స్కూల్ ప్రిన్సిపాల్ సర్టిఫికెట్, గోల్డ్‌మెడల్ అందించారు. రానున్న కాలంలో సినిమాల్లో నటించాలని ఉంది. – షణ్ముఖ్ -
షీఈజ్... స్పెషల్
ఆమె దృష్టిలో అపజయానికి, లక్ష్యానికి, ఆలోచనా దృక్పథానికి అర్థాలు వేరు..అందుకే అందరిలా ఆమె ఆలోచించదు. అలాంటి దృక్పథమే ఆమెను విభిన్న రంగాల్లో రాణించేలా చేసింది. ఎంచుకున్న రంగంలో తనకున్న లక్ష్యాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంది..తాను నమ్మే సిద్ధాంతంతో సక్సెస్ మంత్ర సాధిస్తున్నది. క్రీడలు, మోడలింగ్, సినీ, రాజకీయ రంగం, వ్యాపారం ఇలా వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న గుల్ పనాగ్ సోమవారం ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ‘డీకోడింగ్ ది సక్సెస్ మంత్ర’ పేరిట నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. తన మనసులోని మాటలను ఇలా పంచుకున్నారు... ఆమె అందరిలా ఆలోచించదు. జయమా.. అపజయమా? అస్సలుపట్టించుకోదు. లక్ష్యమే శ్వాసగా ముందుకెళ్తుంది. ఫలితమేదైనాస్వీకరిస్తుంది. అదే ఆమె సక్సెస్ సీక్రెట్.. ఆమే గుల్ పనాగ్. ఈమె మాజీ మిస్ ఇండియా, మోడల్, నటి, రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త, క్రీడాకారిణి, పైలట్. ఇలా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన పనాగ్... ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో సోమవారం నిర్వహించిన ‘డీకోడింగ్ ది సక్సెస్ మంత్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగాముచ్చటించారు. ఆ విశేషాలుఆమె మాటల్లోనే... బంజారాహిల్స్: మా స్వస్థలం చండీగఢ్. నాన్న లెఫ్టినెంట్ జనరల్ కావడంతో వివిధ ప్రాంతాల్లో నా చదువు కొనసాగింది. పంజాబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఇన్ మ్యాథమేటిక్స్, తర్వాత పొలిటికల్ సైన్స్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి. స్విమ్మింగ్, బంగీ జంప్, స్క్వాష్‌లో ప్రమేయం ఉంది. గ్రూప్ డిస్కషన్లో జాతీయ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. అంతే కాకుండా ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా పొందాను. దీన్ని చాలామంది ఏదో పెద్దగా చూస్తున్నారు. నిజానికి ఇది చాలా చిన్న విషయం. అమెరికాలో పదో తరగతి పూర్తి చేసినవారు సైతం ఇలాంటి లైసెన్స్‌లు పొందుతున్నారు. ప్రతి మహిళకు అవకాశాలు ఉంటాయి. వాటిని మనమే ఎంచుకోవాలి. దేనికీ ప్రత్యేకంగా పరిమితులనేవి ఏమీ ఉండవని అందరూ గుర్తించుకోవాలి. మోడలింగ్ టు సినిమా... ఓ రోజు టీవీలో నఫీసా జోసెఫ్ షో చూశాను. అప్పు డే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను. 1999లో మిస్ ఇండియా టైటిల్ సాధించాను. అందులో ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’ సొంతం చేసుకున్నాను. అయితే ఈ రంగంలో జయాపజయాలను సమానంగా స్వీకరించాను. అదే నన్ను విభిన్న వేదికల్లో పాల్గొనేలా చేసింది. మోడలింగ్‌లోకి ప్రవేశంతో సినిమా అవకాశా లు తలుపు తట్టాయి. 2003లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇప్పటి వరకు 15 సినిమాల్లో నటించాను. నేను నటించే సినిమాలు ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. రాజకీయ పరంగాఎంతో నేర్చుకున్నా... మోడలింగ్, సినీ రంగంలో కొనసాగుతున్న నా జీవితం అనుకోకుండా రాజకీయంగా మలుపు తిరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చండీగఢ్‌లో పోటీ చేశాను. అయితే విజయం పక్కనపెడితే రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాను. నామినేషన్ మొదలు పోల్ మేనేజ్మెంట్, బూత్ కమిటీ, ఓట్ మేనేజ్మెంట్... ఇలా అన్నీ తెలుసుకునే అవకాశం దక్కింది. ఎన్నికల సమయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రచారం చేసేదాన్ని. దాదాపు మూడుసార్లు ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగాను. నేను ఫిట్‌గా ఉండడంతోనే ఇది సాధ్యమైంది. మరో విషయం ఏమిటంటే.. ప్రచారం సందర్భంగా గేర్లున్న బైక్‌నే వాడాను. అప్పటి వరకు చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలకు గేర్ల బైక్ నడపడంలో ఇబ్బందులు ఉంటాయని వారించేవారు. అయితే నా ప్రచార శైలి చూసి తల్లిదండ్రుల్లో మార్పొచ్చింది. అదేముసుగొద్దు.. రాజకీయంగా గానీ మరేదైనా రంగంలో గానీ.. ఓటమి పాలైతే అదే ముసుగులో ఉండడం మంచిది కాదు. నేను ఎన్నికల్లో ఓడిన తర్వాత అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ప్రతిరోజు ఉదయాన్నే పరుగు పెట్టాను తప్ప.. అపజయం వెనక పరుగు పెట్టలేదు. మనకు లభించే అవకాశాల్లో లక్ష్యాలను నిర్దేశించుకొని దానికి అనుగుణంగా వాటిని మలచుకోవాలి. అందుకే జయాపజయాలు ఏవైనా స్వీకరించి, మన జీవితంలో భాగంగా వాటిని గుర్తించాలి. మన జీవితం మనం ఆలోచించే తీరులో ఉంటుందని గుర్తించాలి. అందుకే.. నా జీవితం నాకు ఇష్టమైన, అందమైన రూపంలో నడుస్తోంది. -
మహేష్ భార్యపై నటి షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నేహ ధూపియా నిర్వహిస్తున్న 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్రమానికి మలైకా హాజరైంది. ఆ సందర్భంగా నేహా అడిగిన పలు ప్రశ్నలకు మలైకా షాకింగ్ సమాధానాలు చెప్పింది. మోడలింగ్‌లో ఎదురైన అనుభవాల గురించి మలైకా ప్రస్తావిస్తూ 'నమ్రతా శిరోద్కర్, మోహర్ జెస్సియా మోడలింగ్‌లో నాకు సీనియర్లు. అప్పటికే వారు టాప్ మోడల్స్‌గా కొనసాగుతున్నారు. దాంతో కొత్తగా వచ్చిన వారితో వారు పొగరుగా ప్రవర్తిస్తూ సీనియారిటీ చూపించేవారు. అయితే ఇప్పుడు వారిద్దరితో స్నేహం కొనసాగిస్తున్నాను' అని తెలిపింది. కాగా, బాలీవుడ్‌లోకి రాకముందు మలైకా మోడలింగ్ రంగంలో రాణించింది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మలైకా టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాల్లో మెరుస్తున్నారు. -
పురుషులు వేలం వెర్రిగా కొంటున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : గతంలో ఆడపిల్లల్ని ఆకర్షించడం కోసం పురుష పుంగవులు నెత్తికింత నూనె పెట్టుకొని ముఖానికి ఇంత పౌడరేసుకొని వీధుల్లోకి వెళ్లేవారు. ఆ తర్వాత నీటుగా గడ్డం గీసుకొని లేదా ట్రిమ్ముగా గడ్డం చేసుకొని, తెల్లగా పౌడరేసుకొని ‘షి’కారుకెళ్లేవారు. అప్పట్లో అందంగా కనిపించడం కోసం ఆడవాళ్లు వాడే సౌందర్య ఉత్పత్తులనే వాడేవారు. ఆ తర్వాత పరిస్థితులతోపాటు సౌందర్య ఉత్పత్తులు మారిపోయాయి. ఆడవారి సౌందర్య ఉత్పత్తులతోపాటు మగవారి కోసం ప్రత్యేక సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఉత్పత్తులు మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయని, వాటి మార్కెట్ ఇప్పుడు ఏటా ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకుందని ‘నీల్సన్’ డిసెంబర్17 పేరిట విడుదల చేసిన ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. పురుషులు ఇంత వేలం వెర్రిగా సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తున్నది ఆడపిల్లలను ఆకర్షించడానికి కాదట. ఉద్యోగం చేస్తున్న చోట నీట్‌గా కనిపించి మంచి మార్కులు కొట్టేయటానికట. ఆడపిల్లలకు అందంగా కనిపించాలని వెంటబడేది పెళ్లయ్యేంత వరకేగదా! గతంలో మగవాళ్ల అందం కోసం షేవింగ్ జెల్, షేవింగ్ క్రీమ్లతోపాటు ఆఫ్టర్ షేవ్ లోషన్లు, డియోడోరాంట్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ప్రత్యేక షాంపూలు, నూనెలు, ఫెయిర్‌నెస్ క్రీమ్స్, బియర్డ్ బామ్స్, మత్తునిచ్చే సెంట్స్ ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. ఆరేడేళ్ల క్రితంతోని ఇప్పుడు పోలిస్తే వీటి వినియోగం ఊహించలేనంత పెరిగింది. 2009 నుంచి 2016 మధ్య పురుష సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ను 60 రెట్లు పెరిగిందని నీల్సన్ సర్వే తెలియజేసింది. ఈ ఉత్పత్తుల్లో హిందుస్థాన్ లీవర్, ఎల్ వోరియల్, నీవియా, మారికో కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఉత్పత్తులకు 2017 సంవత్సరం బాగా కలసివచ్చిందని చెప్పవచ్చు. సెట్‌వెట్ హేర్ జెల్‌ను విక్రయిస్తున్న ముంబై కంపెనీ మారికో గత మార్చి నెలలో బియర్డో కంపెనీలో 45 శాతం వాటాను కొనుగోలు చేసింది. కోల్‌కతాలోని ఎమామి కంపెనీ గత డిసెంబర్ నెలలో ‘ది మేన్ కంపెనీ’లో 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
ఆ ఆదాయమే బాగుంది
నటి ప్రణీత బహుభాషా నటే. అయినా కథానాయకిగా ఏ రంగంలోనూ ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయింది. తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటిస్తున్నా అవకాశాలూ అంతంత మాత్ర మే. అయితే ఈ మూడు భాషల్లోనూ కథానా యకిగానే పరిచయమైంది. కోలీవుడ్‌లో ఉదయం చిత్రం ద్వారా అరుళ్‌నిధికి జంటగా పరిచయమైనా ఆ చిత్రం పెద్దగా గుర్తింపునివ్వలేదు. ఆ తరువాత కార్తీతో జతకట్టే లక్కీచాన్స్ అందుకుంది. అదీ అమ్మడికి నిరాశే మిగిల్చింది. ఇక ఈ తరువాత ఇక్కడ హీరోయిన్గా అవకాశాలే అందుకోలేకపోయింది. ఆ మధ్య సూర్యకు జంటగా మాస్ అనే చిత్రంలో రెండో హీరోయిన్గా నటించినా ఉపయోగం లేకపోయింది. ఇటీవల జై హీరోగా నటించిన ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో ప్రతినాయకిగా నటించింది. అదీ వర్కౌట్ కాలేదు. ఇక్కడే కాదు ఇతర భాషల్లోనూ ప్రణిత పరిస్థితి సేమ్ టు సేమ్. అయితే ఇప్పటికే వ్యాపారం రంగంలోకి దిగిన ఈ బ్యూటీ బెంగళూర్‌లో ఒక రెస్టారెంట్లో భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక అవకాశాల కోసం నిరీక్షించడం అనవసరం అనుకుందేమో తాజాగా మోడలింగ్ రంగంలోకి రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకుందట. ఇందుకు కారణాన్ని వెతుకున్న ప్రణీత ఆ రంగంలోనే ఆదాయం బాగుందని అంటోందట. సాధారణంగా హీరోయిన్లు మోడలింగ్ రంగం నుంచే సినీరంగానికి పరిచయం అవుతుంటారు. అలా మోడలింగ్ రంగం నుంచి మరోసారి సినీ ప్రముఖులను ఆకర్షించే ప్రయత్నం చేయాలనుకుంటుందనుకుంటా. ఈ అమ్మడు ఇప్పటికే పలు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తోందన్నది గమనార్హం. -
అమ్మాయిలూ జాగ్రత్త
పారిస్‌లో ఫ్యాషన్ వీక్ జరుగుతోంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆ ఫ్యాషన్ షోకి కొత్త కొత్త డిజైన్లను మోసుకొచ్చాయి. వాటిని వేసుకుని ర్యాంప్ మీద నడవడానికి మోడల్ గాళ్స్ కూడా వచ్చేశారు. వీళ్లంతా పేరున్న ఏజెన్సీల నుంచి సెలక్ట్ అయి వస్తారు. అలా ఓ ఫ్రెంచ్ ఏజెన్సీ 150 మంది మోడల్స్‌ని ఫ్యాషన్ వీక్ కోసం వెంటబెట్టుకొచ్చింది. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ఎవరికైనా ఓ గౌరవం ఉంటుంది. అయితే ఆ ఫ్రెంచ్ ఏజెన్సీ... పద్ధతుల్ని, గౌరవాలను పక్కన పెట్టి ఈ మోడలింగ్ అమ్మాయిల్ని వాళ్ల కర్మకు వదిలేసింది. సరైన వసతి ఏర్పాటు చేయలేదు. కనీసం కూర్చోడానికి ఒక గౌరవప్రదమైన స్థలాన్ని చూపించలేదు. అందర్నీ ఓ స్టెయిర్వెల్లో కుక్కేసింది. స్టెయిర్‌వెల్ అంటే నిలువుగా ఉండే మెట్ల వరస. ‘ర్యాంప్ మీదకు మీ వంతు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చెయ్యండి’ అని చెప్పి ఏజెంట్లు వెళ్లిపోయారు. కొందర్నైతే చీకటి గదుల్లో ఉంచి, బయట తలుపేసి వెళ్లిపోయారు. వాళ్లు మాత్రం లంచ్ చేసి, నింపాదిగా మూడు గంటల తర్వాత తిరిగొచ్చారు. పాపం ఈ అమ్మాయిలు అంతసేపూ దాహానికి, ఆకలికి అల్లాడిపోయారు. తరలించడానికి లారీలకు ఎక్కించిన మూగప్రాణుల్లా... ఒకళ్ల మీద ఒకళ్లు పడిపోతూ నానా అవస్థలూ పడ్డారు. ఆకలి, దాహం తర్వాతి మాట. బాత్రూమ్కి వెళ్లడానిక్కూడా వీల్లేక గుట్టుగా బాధను అనుభవించారు. ఈ సంగతి తెలిసి... పారిస్ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ‘బెలెన్షియాగా’ అనే పెద్ద పేరున్న ఫ్యాషన్ బ్రాండ్... ఆ అమ్మాయిలందరికీ క్షమాపణ చెప్పుకుంది. వీళ్లను కుదుర్చుకొచ్చిన ఏజెన్సీని రద్దు చేసింది. పైకి రావడానికి ఎన్ని కష్టాలకైనా ఓర్చుకునేవారున్నట్టే... పైకి రావడానికి ఎన్ని కష్టాలైనా పెట్టేవారూ ఉంటారు. అమ్మాయిలూ జాగ్రత్త. అందమైన మోడలింగ్ ప్రపంచంలో వికృతమైన మనస్తత్వాలూ ఉంటాయి. -
నాయక్ నహీ...ఛోటా నాయక్ హూ మై!
‘ఎందుకింత సెక్యూరిటీ?’ ఈ సంభాషణ వినండి మీకే అర్థమవుతుంది... ‘మాఫియా డాన్ ఛోటా నాయక్ పేరు విన్నావా?’‘ఛోటా నాయక్ గురించి వినని వారు ఎవరుంటారు సార్? వాడి గురించి మా పోలీసు ట్రైనింగ్‌లో క్లాసులు కూడా తీసుకున్నారు’‘మీరు పోలీసు ట్రైనింగ్‌లో చదువుకున్న ఆ నాయక్‌ను ఈరోజు కోర్టుకు తీసుకు వస్తున్నారు. అందుకే ఈ సెక్యూరిటీ. వాడిని పట్టుకోవాలనుకోవడం పాతికేళ్ల మన పోలీసుల కల. మన నుంచి తప్పించుకోవాలనుకోవడం ఇప్పుడు వాడి కల’ పోలీసుల కల ఫలించనే లేదు. కల కనాల్సిన అవసరం నాయక్‌కు రానే లేదు. కోర్టులో హాజరు పరచడానికి ముందే తప్పించుకున్న ఛోటా నాయక్, ‘నన్ను పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందని తెలిసినవాడివి... నాతో పెట్టుకుంటే ప్రాణం పోతుందని తెలియదా?’ అంటూ అక్కడి పోలీస్ అధికారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తాడు. గోపీచంద్ ‘జిల్’ సినిమాతో ఛోటా నాయక్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కబీర్ దుహన్ సింగ్. ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో జన్మించాడు కబీర్. ఢిల్లీ యూనివర్సిటీలో చేరిన తరువాత ‘మోడలింగ్’ మీద దృష్టి పెట్టాడు. గుడ్‌లుక్స్, ఫిజిక్...ఈ రెండూ మోడలింగ్‌లో మంచి అవకాశాలు రావడానికి ‘టాప్ త్రీ’లో ఒకరిగా నిలవడానికి తోడ్పడ్డాయి. ఎన్నో ర్యాంప్‌వాక్‌లు చేయడంతో పాటు సామ్సంగ్, హీరోహోండాలాంటి ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేశాడు. ఆ సమయంలోనే నటించాలనే కోరిక పుట్టింది. అదే పనిగా సినిమాలు చూడడంతో పాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు. ‘‘వీడు ఏ నేపథ్యం నుంచి వచ్చాడు? అనేది దక్షిణాది ప్రజలు పట్టించుకోరు. ఏమాత్రం ప్రతిభ ఉన్నా పట్టం కడతారు. ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. ఇది నాకు బాగా నచ్చడంతో సౌత్ ఫిల్మ్స్‌లో నటించాలనే కోరిక బలంగా కలిగింది. బాలీవుడ్ స్టార్ డ్రైవెన్ ఇండస్ట్రీ, తమిళ్ కంటెంట్ డ్రైవెన్ ఇండస్ట్రీ, తెలుగు కమర్షియల్ డ్రైవన్ ఇండస్ట్రీ’’ అంటున్న కబీర్ బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల్లో నటించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. రా«ధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాలో ఛోటా నాయక్‌గా వెండితెరకు పరిచయమయ్యాడు కబీర్. సినిమాలో నటించడానికి ముందు కొన్ని గ్యాంగ్‌స్టర్ సినిమాలు చూసి తన పాత్ర గురించి ఎక్సర్సైజ్ చేశాడు. ప్రతిభావంతులతో కలసి పనిచేస్తున్నప్పుడు మనల్ని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతాడు కబీర్. ప్రతిభావంతులతో కలసి పనిచేయడం ‘లెర్నింగ్ ఎక్స్పీరియన్స్’ అంటాడు.‘జిల్’ విలన్–ఓరియెంటెడ్ సినిమా కావడంతో ‘ఛోటా నాయక్’గా కబీర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘జిల్’ తరువాత అవకాశాలు ఊపందుకున్నాయి. తమిళంలో అజిత్‌తో కలసి పనిచేసే అవకాశం వచ్చింది. బాలకృష్ణ, పవన్కళ్యాణ్లాంటి స్టార్ హీరోలతో పని చేసే అవకాశం వచ్చింది. తన పాత్ర పండించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాడు కబీర్. కొన్ని సందర్భాల్లో గొప్ప నటుల నుంచి మంచి నోట్స్ దొరకవచ్చు. కొన్నిసార్లు ఆలోచనలోని గాఢత నటనకు ఉపకరణం కావచ్చు. మరికొన్నిసార్లు...దృశ్యాలే కొత్త ఐడియాలను ఇవ్వవచ్చు. తన నటనను మెరుగుపెట్టుకోవడానికి ఏ మాధ్యమం అయిన సరే అనుసరిస్తాడు కబీర్. మైక్ టైసన్‌కు పెద్ద అభిమాని అయిన కబీర్‌కు బాక్సర్ పాత్రలో నటించాలనే కోరిక బలంగా ఉండేది. ఆ కోరిక త్వరగానే తీరిపోయింది. నారారోహిత్ ‘తుంటరి’ సినిమాలో బాక్సర్‌గా నటించే అవకాశం వచ్చింది. వెంటనే బాక్సింగ్‌లో క్రాష్ కోర్సు చేశాడు. ప్రొఫెషనల్ బాక్సర్లతో సంభాషించాడు. ఆ ఫలితం వృథా పోలేదు... సినిమాలో నిజమైన బాక్సర్‌ని చూసినట్లుగానే అనిపించింది. ‘‘ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాల్లో విలన్‌కు బుర్రమీసాలు, మెడలో పెద్ద గొలుసు...ఇలా ప్రత్యేకమైన ఆహార్యం కనిపించేది. అయితే ఇప్పుడు అనూహ్యంగా మార్పు వచ్చింది. విలన్ కూడా హీరోతో సమానంగా సై్టలిష్‌గా కనిపిస్తున్నాడు. విలన్‌కు సై్టలింగ్ కూడా ముఖ్యమే. దుస్తులతో మాత్రమే సై్టలింగ్ రాదు. హ్యాండ్సమ్గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. దీని కోసం వ్యాయామానికి ఎప్పుడూ ప్రాధాన్యమిస్తాను’’ అంటాడు కబీర్. ‘కిక్–2’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకవ్యక్తి కబీర్ దగ్గరకు వచ్చి... ‘‘హీరోగా నటించవచ్చు కదా’’ అన్నాడు. సమాధానంగా చిరునవ్వు నవ్వాడు కబీర్. ఈ నవ్వు సంగతేమిటోగానీ ‘విలన్’ పాత్రల్లోనూ హీరోయిజాన్ని చూపించవచ్చునని ఎందరో ఉత్తమ విలన్లు నిరూపించారు. కబీర్ వారి బాటలోనే ప్రయాణిస్తున్నాడు! -
ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది
టాప్ షెఫ్ పద్మాలక్ష్మి పుస్తకాలు చదివి జీవితాన్ని నేర్చుకున్న వాళ్లున్నారు. జీవితాన్ని చూసి పుస్తకాలు రాసిన వాళ్లున్నారు. కానీ.. పద్మ రాసిన పుస్తకాలు చూసి పొయ్యి వెలిగించినవాళ్లు చాలామందే ఉన్నారు. వెలుగులో వేడి ఉన్నట్లే... పద్మాలక్ష్మి జీవిత పుస్తకంలో గొప్ప వేడి ఉంది. ప్యాషన్ ఉంది. ఫ్యాషన్ ఉంది. అందుకే పద్మాలక్ష్మి... భోజ్యేషు పద్మ– లవ్వేషు లక్ష్మి! ది వే టు ఎ మాన్స్ హార్ట్ ఈజ్ హిజ్ స్టొమక్. రుచికరంగా వండిపెడితే మగాడు ఢమాల్‌మని ప్రేమలో పడిపోతాడట! ఫుడ్డుతోనా, ఫుడ్డును వండిపెట్టిన వాళ్లతోనా? ఎవరితో పడిపోతాడు ప్రేమలో?! ప్రేమను ఫుడ్డుతో కలిపి పెట్టినవాళ్లతో! సరేనా? రేపు వాలెంటైన్స్ డే. ‘టాప్ చెఫ్’ పద్మాలక్ష్మి రేపు ఇండియా వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు చెన్నై నుంగంబాక్కంలోని తాజ్ కోరమండల్ హోటల్లో.. తను వండి వార్చిన పుస్తకాన్ని వడ్డించబోతున్నారు. ‘లవ్, లాస్ అండ్ వాట్ వియ్ ఏట్ : ఎ మెమైర్’ ఆ వంటకం పేరు. అదొక గైడ్. హెల్త్ గైడ్, ఫుడ్ గైడ్, లవ్ గైడ్. ఎలా అన్నిటినీ మిక్స్ చేయగలిగారు పద్మాలక్ష్మి! ఆమె జీవితంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి, అవన్నీ లేవు కూడా కాబట్టి! బ్యాచిలర్స్కి పద్మపూర్ణమ్మ! అమెరికన్ టీవీ చానల్ ‘బ్రేవో’ లో ‘టాప్ చెఫ్’ అనేది పాపులర్ రియాలిటీ షో. దాని హోస్ట్ పద్మాలక్ష్మి. తమిళ్ అమ్మాయి. చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోయింది. అప్పుడప్పుడూ ఇండియా వచ్చి వెళుతుంటుంది. గత సోమవారం మన హైదరాబాద్‌కి కూడా వచ్చింది. ఏడేళ్ల చిన్న పాప, తను! ఇదే ఆమె ఫ్యామిలీ. అయితే పద్మాలక్ష్మి సృష్టించిన రెసిపీలను ఇష్టంగా ఆరగించేవారందరినీ కలుపుకుంటే ఆమెదొక ఖండాంతర ఫ్యామిలీ అనుకోవాలి. ఖండఖండాలలోని కిచెన్ రూమ్‌లలో ఆమె వంటల పుస్తకాలు కనిపిస్తాయి. ఆమె రాసిన త్రీ మినిట్, ఫోర్ మినిట్ ‘తయారీ’లతో బతుకు లాగించేస్తున్న బ్యాచిలర్లు, నిర్బంధ బ్యాచిలర్లు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఇల్లాళ్లకైతే పండగే. పద్మాలక్ష్మి పుణ్యమాని ఇంటాయన్ల కడుపులోంచి హృదయంలోకి వారు అవలీలగా ప్రవేశించ గలుగుతున్నారు. కొంచెం ఎక్కువనిపించినా ఇది నిజం. అయితే.. కిచెన్, ఫ్యాషన్, ఫెమినిజం, యాంటీ రేసిజం.. వీటితోపాటు పద్మాలక్ష్మి జీవితంలో దారుణమైన అనుభవాలు ఉన్నాయి! బాల్యంలో లైంగిక వేధింపులు ఉన్నాయి. నెలనెలా వదలక వెంటాడిన ‘దెయ్యమూ’ ఉంది! పద్మాలక్ష్మీ జీవితంలోంచి సంతోషాన్ని దూరం చేసిన మొదటి వ్యక్తి ఆమె తండ్రి! రెండో టార్చర్.. ‘ఎండోమెట్రియోసిన్’! పొత్తికడుపు నొప్పి. నాన్న వడ్డించని.. ప్రేమ విస్తరి! పద్మ తండ్రి వైద్యనాథన్ ఫైజర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్. తల్లి విజయ నర్సు. ఆంకాలజీ నర్సింగ్‌లో స్పెషలిస్టు. పద్మకు రెండేళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. విజయకు పద్మ ఒక్కటే కూతురు. పద్మకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. వీళ్లిద్దరూ తండ్రి రెండో భార్య సంతానం. మామూలుగా తన చెల్లి గురించి మాట్లాడరు పద్మాలక్ష్మి. కానీ ‘గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె హార్ట్ దాదాపుగా బ్రేక్ అయింది. ‘‘నా చెల్లి కెరీర్ కోసం నాన్న ఫైజర్‌లో ఉద్యోగం మాని, తన కెరీర్‌ని త్యాగం చేశాడు. ఆ ప్రేమ నా మీద ఏమైందో అర్థం కాదు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు పద్మాలక్ష్మి. ఆ వెంటనే సర్దుకున్నారు. ఇది ఆమెకు జీవితం నేర్పిన పాఠం. ‘నీకు జరుగుతున్న దాన్ని నువ్వు ఆపలేవు. కానీ, నీకు జరుగుతున్న దానికి నువ్వెలా ఉండాలన్నది మాత్రం నీ చేతుల్లోనే ఉంది’. పద్మాలక్ష్మి ఫిలాసఫీ ఇది. అందుకే ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. యు.ఎస్.లో అమ్మ.. చెన్నైలో పద్మ భర్త నుంచి విడిపోగానే, ఇండియా నుంచీ మానసికంగా విడిపోయారు పద్మ తల్లి. చెన్నై నుంచి న్యూయార్క్ వెళ్లిపోయారు. కూతుర్ని ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంచేశారు. అలా న్యూయార్క్–చెన్నైల మధ్య పద్మ బాల్యం మొదలైంది. పద్మ అయ్యంగార్ల అమ్మాయి. ఆమె తల్లిదండ్రుల పూర్వీకులది కేరళ. న్యూ యార్క్‌లో తల్లి దగ్గరికి, చెన్నైలో అమ్మమ్మ దగ్గరికి తిరుగుతూ సంప్రదాయం, ఆధునికం కలగలిసిన విలక్షణమైన స్త్రీగా ఎదిగారు పద్మ. ఆమె పూర్తి పేరు పద్మాపార్వతీలక్ష్మీ వైద్యనాథన్. పద్మ టీనేజ్ హాయిగా సాగలేదు. పద్నాలుగవ యేట పద్మ మూడు వారాలు న్యూయార్క్ ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. వైద్యులు ఆమెకు ‘స్టీవెన్స్–జాన్సన్ సిండ్రోమ్’ అని తేల్చారు. ప్రాణాంతకమైన చర్మ వ్యాధి. ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు కనిపెట్టారు. మంచి మెడిసిన్‌తో బయట పడేశారు. ఈ లోపు పద్మాలక్ష్మి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. హాస్పిటల్ ఉంచి డిశ్చార్జి అయిన రెండు రోజుల తర్వాత.. కాలిఫోర్నియాలో కారు ఆక్సిడెంట్ జరిగి పద్మ కుడి తుంటి విరిగింది. కుడి చెయ్యి పైభాగంలో ఎముక చిట్లింది. సర్జరీ తర్వాత నయం అయ్యింది కానీ, ఆమె కుడి చేతి భుజం కింద ఇప్పటికీ ఏడంగుళాల పొడవున సర్జరీ జరిగిన మచ్చ కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది పద్మాలక్ష్మి మరీ నలుపు కాదు, చామన ఛాయా కాదు. కానీ అమెరికన్ స్కూళ్లలో అది కారునలుపే. పద్మ క్లాస్మేట్స్ ఆమెను వేధించేవాళ్లు. ఏడిపించేవాళ్లు. రంగు కారణంగా ఆమె తెలివితేటలు వెలవెలపోయాయి. అత్యాచారానికి ఏ మాత్రం తక్కువకాని విధంగా అమెపై ‘బుల్లీయింగ్’ జరిగింది. అప్పుడే అనుకుంది పద్మ. లోపల్నుంచి తను స్ట్రాంగ్‌గా ఎదగాలని. రేసిజాన్ని ఆమె తన మోడలింగ్‌తో డీ కొట్టాలనీ. కొట్టారు! స్కూలింగ్ అయింది. థియేటర్ ఆర్ట్స్‌లో డిగ్రీ అయింది. మోడలింగ్ కోసం మ్యాడ్రిడ్ వెళ్లిపోయారు. కనీసం నాలుగు భాషలైనా తెలిసిన అమ్మాయికి ప్రపంచం చిన్నదైపోతుంది. కానీ మోడలింగ్ ప్రపంచానికి ఆమె చేతి మీద మచ్చ పెద్దదిగా కనిపించింది. పద్మకు ఇంగ్లిష్, తమిళ్, హిందీ, ఇటాలియన్, స్పానిష్ భాషలు వచ్చు. అవేమీ పని చేయలేదు. మోడలింగ్ మహానీయులు ఆమె దేహం.. తెలుపు రంగును మాట్లాడ్డంలేదని తిరస్కరించారు! మోడలింగ్.. ఫ్యాషన్.. కిచెన్ బుక్స్ అప్పటికి పద్మ వయసు 21. మ్యాడ్రిడ్లోని ఒక కెఫెలో ఒంటరిగా కూర్చొని ఉంది. ఆ మధ్యాహ్నం ఒక ఫ్యాషన్ ఏజెంటు వచ్చి ఆమెను కలిశాడు. పద్మకు అదే ఫస్ట్ మోడలింగ్ డీల్. ఆ తర్వాత కొద్ది కాలానికే పారిస్‌లో, మిలాన్‌లో, న్యూయార్క్‌లో ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా పద్మాలక్ష్మికి గుర్తింపు వచ్చింది. ఆమెను స్వీకరించినట్లే, ఆమె మచ్చనూ స్వీకరించడం మొదలుపెట్టింది ఫ్యాషన్ ప్రపంచం! పెద్ద పెద్ద అంతర్జాతీయ పత్రికల ముఖచిత్రంగా పద్మాలక్ష్మి దర్శనమిచ్చారు. మోడలింగ్ నుంచి టీవీలకు, టీవీల నుంచి సినిమాలకు వెళ్లారు! వాటిని మించి రిసిపీ బుక్స్ ఆమెకో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పద్మ రాసిన మొదటి పుస్తకం ‘ఈజీ ఎక్సాటిక్’. రెండో పుస్తకం ‘ట్యాంగీ, టార్ట్, హాట్ అండ్ స్వీట్’. ఇటీవలి పుస్తకమే.. ‘లవ్ , లాస్, వాట్ వియ్ ఏట్’. ప్రేమానుబంధాలు! ముప్పై నాలుగేళ్ల వయసులో వివాదాస్పద రచయిత సాల్మన్ రష్దీని పెళ్లి చేసుకున్నారు పద్మాలక్ష్మి. అయితే మూడేళ్లు మాత్రమే కలిసున్నారు. ఈ మధ్యలో రష్దీ.. ‘ఫ్యూరి’ అనే నవలను రాసి పద్మకు అంకితం ఇచ్చారు. రష్దీతో విడాకులు తీసుకున్నాక వెంచర్ క్యాపిటలిస్టు ఆడమ్ డెల్‌కు దగ్గరయ్యారు పద్మ. వాళ్లకు పుట్టిన పాపే.. ఎప్పుడూ పద్మ వెంట కనిపించే కృష్ణ (6). డెల్‌తో విడిపోయాక ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూపు (ఐ.ఎం.జి) సిఇవో టెడ్డీ ఫార్స్›్టమన్తో ప్రేమలో పడ్డారు పద్మ. 71 ఏళ్ల టెడ్డీ 2011లో చనిపోయారు. టీనేజ్‌లో మొదలైన నరకం! ఇరవై ఏళ్ల పాటు పద్మ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడ్డారు. దీనిని 16 వ యేట, 26 వ యేట, కనీసం 32 వ యేట గుర్తించినా నేను నా కుటుంబంతో, నా స్నేహితులతో హాయిగా ఎక్కువ సమయం గడపడానికి వీలయ్యేది అని పద్మ ఇప్పటికీ బాధపడుతుంటారు. తనలా బాధపడే వారికోసం పద్మాలక్ష్మి ‘ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ను నెలకొల్పారు. పచ్చళ్లలో కారం.. ప్రేమలో మమకారం పద్మాలక్ష్మికి నిల్వ పచ్చళ్లంటే ఇష్టం. చిల్లీస్ అంటే చచ్చేంత ఇష్టం. అమ్మమ్మ తనకు అందకుండా పై షెల్ఫులో పచ్చడి సీసాను పెడితే, స్టూల్ ఎక్కి సీసాను తియ్యబోతూ దాన్ని పడేసి తిట్లు తిన్న పిల్ల. ఘాటు కోసం తనేమైనా చేస్తుంది. అదే ఘాటును ఆమె ఫుడ్డులోను, ప్రేమలోనూ కోరుకున్నారు. ఆ ఘాటునే కొసరి కొసరి వడ్డించారు. ఇక ఆమె కొత్తగా ఏం సర్వ్ చేయబోతున్నారన్నది రేపు చెన్నై తాజ్ కోరమండల్లో తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే నేర్చుకోలేం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ అంతర్జాతీయ మోడల్, టీవీ హోస్ట్, నటి, రచయిత్రి పద్మాలక్ష్మితో ఇటీవల జరిగిన ప్రియభాషణలో ‘సాక్షి’ సిటీ బ్యూరో రిపోర్టర్ ఓ మధు పాల్పంచుకున్నారు. పచ్చళ్లంటే మీకు ఎందుకంత ఇష్టం?! ఘాటుగా ఉంటాయి. రిలేషన్షిప్స్లో కూడా మీరు అంతే గాఢతను ఆశించినట్లున్నారు! వెల్, పైపైన ఇష్టపడడం ప్రేమ అవుతుందా! మోడలింగ్ మిమ్మల్ని పైకి తెచ్చింది. మీరేమో రెసిపీలను పైకి తెస్తున్నారు. మోడలింగ్ మానేసినట్లేనా? దుస్తులకు మోడలింగ్ తగ్గించేశాను. నా ఇష్టాలకు మోడలింగ్ చేస్తున్నాను. రుచికరమైన భోజనం జీవితంపై ప్రేమను కలిగిస్తుంది. ఆ విధంగా నేను ప్రేమకు మోడలింగ్ చేస్తున్నాను. మీ పాకశాస్త్ర గురువు మీ అమ్మమ్మ అని చెప్పారు. ప్రేమశాస్త్రంలో? ప్రేమ.. శాస్త్రం కాదు. ఇట్సెల్ఫ్.. ఎ గురు. ప్రేమ చాలా నేర్పుతుంది. మీకేం నేర్పింది? (నవ్వుతూ) ప్రేమించడం నేర్పింది. ప్రేమించడం అంటే.. మనం ప్రేమించినవాళ్ల ఫీలింగ్స్‌ని గౌర వించడం. మంచి షెఫ్ అవడం కన్నా... ప్రేమించడం ఈజీ అనిపిస్తుంది! హహ్హహా.. నాట్ లైక్ దట్! మంచి షెఫ్ అవడం కూడా కష్టం ఏమీ కాదు. బాగా ట్రావెల్ చెయ్యాలి. ఇంట్లో కూర్చుంటే కొత్తగా ఏం నేర్చుకోలేం. మాధవ్ శింగరాజు సాల్మన్ రష్దీతో... ఆడమ్ డెల్‌తో... టెడ్డీ ఫార్స్మన్తో... -
నచ్చకపోతే వదిలేస్తా!
నచ్చకపోతే వదిలేస్తానంటోంది నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో నాయకిగా ఒక రౌండ్ కొట్టేసిన ఈ ఉత్తరాది భామ తాజాగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఆ మధ్య బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు తాప్సీ నటనకు ప్రశంసలు అందాయి. దీంతో ఈ అమ్మడికక్కడ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్న తాప్సీ ఒక భేటీలో మాట్లాడుతూ తాను ఇష్టపడి సినిమాల్లోకి రాలేదన్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి వచ్చానని, ఆ తరువాత ఆ రంగం ద్వారా సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అప్పుడు కూడా చేతి ఖర్చుల కోసమే చిత్రాల్లో నటించానని అంది. అలాంటిది ఒక దశలో సినిమా బాగా నచ్చిందని, దాంతో నటనపై ప్రత్యేక దృష్టి సారించానని తెలిపింది. తనకు ఆత్మవిశ్వాసం అధికం అని పేర్కొంది. దేనికీ భయపడను. తాను మోడలింగ్ చేసేటప్పుడు తన తండ్రి కంటికి నిద్రలేకుండా బతికారని అంది. అందుకు కారణం తన గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమోనన్న భయమేనని చెప్పింది.ఆ తరువాత తన ప్రకటనలు ప్రసారం అవుతుండగా ఆయన స్నేహితులు ప్రశంసిస్తుంటే నమ్మకం కుదిరిందని తెలిపింది. చుట్టు పక్కల వారికి భయపడే తల్లిదండ్రులు ఆడపిల్లకు స్వేచ్ఛ లేకుండా పెంచుతున్నారని అంది. తాను అలాంటి కుటుంబం నుంచి వచ్చినదానినేనని పేర్కొంది. కట్టుబాట్లలో పెరిగినంత వరకూ తనకు బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియదని అంది. సినీరంగ ప్రవేశం తరువాత స్నేహితులు, ఇతరుల సహచర్యంతో ప్రపంచాన్ని చూశానని చెప్పింది. ఇప్పుడు తన తల్లిదండ్రులు తాను చెప్పింది వినడంతో పాటు మహిళలకు కట్టుబాట్లు అవసరం లేదని నమ్మతున్నారని చెప్పింది. కట్టుబాట్లు అనేవి స్త్రీలను అణచి వేయకూడదని అంది. ఇతరుల గురించి ఆలోచించడం పట్టించుకోవడం వదిలి మనగురించి ఆలోచిస్తే సంతోషం కలుగుతుంది, మన గురించి కాకుండా వారి గురించి ఆలోచిస్తే ఆనందానికి దూరం అవుతామని అంది. తనకు నటిగా సంతోషం లభిస్తోందిని, ఇష్టం లేకపోతే నటనను వదిలేస్తానని చెప్పింది. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు తగ్గాయని, మంచి అవకాశాలు వస్తే ఆ భాషల్లో నటిస్తానని అంది. ఇకపోతే తాను పెళ్లికి తొందర పడడం లేదని, నచ్చిన వ్యక్తి తారస పడ్డప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని తాప్సీ చెప్పుకొచ్చింది. -
ఈ అభిమానం మరువలేను...
వరంగల్ అంటే ఎంతో ఇష్టం నగరానికి రావడం రెండో సారి మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చా... హీరోయిన్ తాప్సీ ‘వరంగల్ అంటే నాకు ఎంతో ఇష్టం.. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం ఎప్పటికీ మరువలేను. నేను రెండు సార్లు ఇక్కడకు వచ్చినా ప్రతీసారి వేల సంఖ్యలో అభిమానులు నన్ను చూసేందుకు వచ్చారు.. అయితే, వరంగల్‌లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని తెలిసినా చూడడానికి సమయం చిక్కడం లేదు. మరోసారి వీలు చూసుకుని వచ్చి అన్ని ప్రదేశాలను చూస్తాను’ అని చెప్పుకొచ్చారు సినీ హీరోయిన్ తాప్సీ. 9669 ప్రొడక్షన్ ప్రతినిధి వినోద్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్లో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఆమె ఎక్స్‌క్లూజివ్‌గా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ మేరకు తాప్సీ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే... - పోచమ్మమైదాన్ ఆదరణ అపూర్వం.. వరంగల్‌కు రావడం ఇది రెండో సారి. గతంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చాను. అప్పుడు ఎంతోమంది అభిమానులు నన్ను చూసేందుకు వచ్చారు. నా కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అలా వారు చూపించిన ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేను. అందుకే వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడున్న పర్యాటక ప్రాంతాల గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ బిజీ షెడ్యూల్‌తో చూడలేకపోతున్నా. మరోసారి తీరికగా వచ్చి వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం తప్పక సందర్శిస్తాను. మోడలింగ్ అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. 2008లో మిస్ ఇండియా కాంటెస్ట్‌లో 28 మంది ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచా. మిస్ బెస్ట్ స్క్రీన్, ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నా. డిగ్రీ పూర్తయ్యూక నీకిష్టమైన రంగంలోకి వెళ్లమని నాన్న చెప్పారు. దీంతో బీటెక్ పూర్తి చేశాక మోడలింగ్ రంగంలోకి వచ్చాను. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చినా వెళ్లలేదు. ఆ సమయంలోనే కె.రాఘవేంద్రరావు తన సినిమా కోసం హీరోయిన్ కోసం వెదుకుతున్నారని తెలిసి అడిషన్‌కు వెళ్లాను. నన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సార్ సినిమాలో హీరోయిన్ పాత్ర దక్కడం నా లక్కీ. ఇక ఓసారి నా జీవితంలో మరిచిపోలేని సంఘటన గురించి చెప్పాలి వస్తే.. ‘గుండెల్లో గోదారి’ సినిమా షూటింగ్ కోసం పాలకొల్లు వెళ్లే సరికి అక్కడ ఎవరూ లేరు. నేను కారు దిగే సమయానికి వేల సంఖ్యలో గుమిగూడారు. నాకు అంత మంది అభిమానులు ఉన్నారని అప్పుడే తెలిసింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు రాత్రయినా సరే గంటల తరబడి నిల్చుని చూసేవారు. ఆత్మవిశ్వాసంతోనే విజయం ప్రతీ ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తాననేపట్టుదల ఉండాలి. వీటికి తోడు మనం ఎంచుకున్నది మంచి మార్గమై ఉండి.. కష్టపడి తత్వం కలిగే ఉంటే విజయం తప్పక వరిస్తుంది. నేను ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 24 సినిమాల్లో నటించాను. మరో రెండు సినిమాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
ఓ మోడల్ కథ!
ఎన్నో ఆశలతో మోడలింగ్ రంగంలో విజయాలను అందుకోవాలని అడుగు పెట్టిన ఓ అమ్మాయి జీవితం ఎన్ని మలు పులు తిరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఆమె కోరిక’. తెలుగు, తమిళ, మలయా ళాల్లో స్వాతి నాయుడు ప్రధాన పాత్ర ధారిణిగా వల్లభనేని సురేశ్‌చౌదరి దర్శకత్వంలో చిక్కాల సత్య నారాయణ, మత్తి రత్నాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ క్షన్లో ఉంది. మార్చి ఫస్ట్‌వీక్‌లో సినిమా రిలీజ్ కానుంది -
ఉరిమే ఉత్సాహం...
‘సాక్షి’ ఎరెనా వన్ ప్రారంభం జోష్ నింపిన యూత్ ఫెస్ట్ క్రీడలు, కళారంగాల్లో దాగిన ప్రతిభను బయటకు తీసేందుకు చేపట్టిన ‘సాక్షి ఎరీనా వన్’ యూత్‌ఫెస్ట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వచ్చేనెల 21వ తేదీ వరకు కొనసాగే ఈఫెస్ట్‌లో గురువారం పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. మూడు వేర్వేరు వేదికలపై సాగిన ఈ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ర్యాంప్‌వాక్, మోడలింగ్‌లో భాగంగా విద్యార్థినులు, ఔత్సాహిక మోడల్స్ విభిన్న దుస్తులు ధరించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ ఫెస్ట్‌కు ‘బజాజ్ పల్సర్ ఇండియా నంబన్ వన్ బైక్’ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్: ‘సాక్షి’ ఎరెనా వన్ యూత్ ఫెస్ట్‌లో యువత ఉరిమే ఉత్సాహంతో పాల్గొంది. చదువుతో కుస్తీ పడే విద్యార్థులు తమకు నైపుణ్యమున్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూకట్‌పల్లిలోని కెనె డీ స్కూల్ గ్రౌండ్లో త్రోబాల్ పోటీల ను, మైసమ్మగూడలోని ఎంఆర్సీఈటీలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు. త్రోబాల్ ఈవెం ట్లో 20 మహిళా జట్లు, 16 పురుషు ల జట్లు పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి త్రోబాల్ పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయ న మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ఆదరిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆటల పోటీల్లో విద్యార్థులను ప్రోత్సహిం చేందు కు సాక్షి మీడియా గ్రూపు గురుతర బాధ్యత తీసుకుందని కొనియాడారు. అనంతరం తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.జగన్మోహన్గౌడ్ మాట్లాడుతూ.. సాక్షి యూత్‌ఫెస్ట్‌ను సద్వినియో గం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చా రు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు వినోద్‌రెడ్డి, కోశాధికారి వెంకట్, కెనెడీ స్కూల్ యాజమాన్యం సరళ, రమేశ్ పాల్గొన్నారు. త్రోబాల్ విజేత సెయింట్ మార్టిన్స్ త్రోబాల్ ఓపెన్ టోర్నమెంట్లో సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి (దూలపల్లి) పురుషుల జట్టు విజేతగా నిలిచింది. కూకట్‌పల్లిలోని కెన్నెడీ స్కూల్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో సెయింట్ మార్టిన్స్ జట్టు 15-7, 15-4 స్కోరుతో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజిపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రౌండ్‌రాబిన్ లీగ్ మ్యాచ్‌ల్లో సెయింట్ మార్టిన్స్ 15-2, 15-6 స్కోరుతో ఐఐఎంసీ (లక్డికాపూల్) జట్టుపై, భవాన్స్ వివేకానంద 15-11, 15-9తో ఐఐఎంసీ (లక్డికాపూల్)పై గెలుపాందాయి. సెయింట్ మార్టిన్స్ ముందంజ మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఆర్సీఈటీ) కళాశాలలో జరిగిన క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు... ఎంఆర్సీఈటీపై గెలిచింది. మొదట ఎంఆర్సీఈటీ 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. నితిన్ (43), శివ (38) మెరుగ్గా ఆడారు. తర్వాత 99 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ మార్టిన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసి గెలిచింది. ఆదర్శ్ (41) రాణించాడు. రెండో మ్యాచ్‌లో నిజామ్ కాలేజి... ఎంఆర్ఐటీ జట్టుపై నెగ్గింది. తొలుత నిజామ్ జట్టు 3 వికెట్లకు 53 పరుగులు చేయగా, తర్వాత ఎంఆర్ఐటీ 50 పరుగులకే కుప్పకూలింది. నిజామ్ బౌలర్ క్రిస్ కల్యాణ్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈవెంట్‌ను లాంఛనంగా ఆరంభించారు. ఇందులో హరీష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జాన్‌పాల్, రవీందర్, కళాశాల డెరైక్టర్ సంజీవ రెడ్డి, ఈవో రాజేశ్వర్‌రెడ్డి, హెచ్ఓడీ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూత్‌ఫెస్ట్‌లో నేడు డిజైన్ అండ్ ఫ్యాషన్ వేదిక: లకోటియా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్, ఎంపీఎం మాల్, అబిడ్స్ సర్కిల్ సమయం: ఉదయం 11.30 వివరాలకు: 9885527474 క్రికెట్ టోర్నమెంట్ వేదిక 1: అరోరా సైంటిఫిక్ టెక్నోలాజికల్ అండ్ రిసర్చ్ అకాడమీ (ఆస్ట్రా), చాంద్రాయణగుట్ట, పల్లెచెరువు దగ్గర సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు) వేదిక 2: మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మైసమ్మగూడ, ధూలపల్లి, కొంపల్లి సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు) వేదిక 3: నల్లా నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, కొర్రెముల ఎక్స్ రోడ్, నారపల్లి, ఘట్కేసర్ మండలం సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు) వివరాలకు: 9505834448 డ్యాన్స్ పోటీలు వేదిక: ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దుండిగల్ సమయం: ఉదయం 9.30 వివరాలకు: 9666470203 బాల్ వేదిక: కెనడీ మాగ్నెట్ స్కూల్, మెట్రో పక్కన, కూకట్పల్లి సమయం: ఉదయం 9.30 వివరాలకు: 9705199924 -
ఇలా ఉంటే పైకి రావడం కష్టం అన్నారు!
‘‘ఇంత సన్నగానా? కథానాయికగా ఏం పనికొస్తుంది? పైగా.. మోడల్‌గా చేసినవాళ్లు కథానాయికలుగా అస్సలు పనికి రారు’’... 13 ఏళ్ల క్రితం త్రిష కథానాయికగా రంగప్రవేశం చేసినప్పుడు ఆమె గురించి కొంతమంది చేసిన కామెంట్స్ ఇవి. ఇటీవల ఓ సందర్భంలో తన కెరీర్‌ని విశ్లేషించుకున్నప్పుడు త్రిష ఆనాటి కామెంట్లను గుర్తు చేసుకున్నారు. మరికొన్ని విశేషాలను ఆమె చెబుతూ - ‘‘నేను కథానాయిక అయిన కొత్తలో ఇక్కడ తమిళ అమ్మాయిలు పెద్దగా లేరు. బాలీవుడ్ కథానాయికల హవా సాగుతుండేది. అందుకేనేమో ‘మన అమ్మాయి’ అంటూ తమిళ మీడియా నన్ను బాగానే ఎంకరేజ్ చేసింది. తెలుగువాళ్లు కూడా తమ అమ్మాయిలానే భావించారు. మీడియాపరంగా నాకు చాలా సపోర్ట్ లభించింది. కానీ, మీడియాకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది, ‘మోడలింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లు హీరోయిన్లుగా పైకి రావడం కష్టం. పైగా, మీరు మరీ సన్నగా ఉన్నారు. ఇంకాస్త లావైతే బాగుంటుంది’ అన్నారు. ఆ మాటలను నేను పట్టించుకోలేదు. నన్ను నేను మార్చుకోను అని కరాఖండీగా అన్నాను. చివరకు వాళ్ల మాటలను అబద్ధం చేయగలిగాను. నేను ఆ మాటలను పట్టించుకుని ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండేదాన్నేమో. అందుకే అంటున్నా... విమర్శలను పట్టించుకోకూడదు. మనం చేయాలనుకున్న పనిని నిజాయతీగా చేసుకుని వెళ్లిపోవడమే. అప్పుడే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుంది’’ అన్నారు. -
కిరీటంపైనే సొగసరుల గురి
* ‘మిస్ రాజమండ్రి’ టైటిల్ కోసం పోటీ పడుతున్న 15 మంది * అందానికి ఆత్మవిశ్వాసం తోడు కాగా శిక్షణ పొందుతున్న యువతులు కంబాలచెరువు (రాజమండ్రి) : మేనిలో మిసమిసలాడే లావణ్యం తొణికిసలాడుతున్న ఆ లలనల మనసుల్లో ఆత్మ విశ్వాసమూ పరవళ్లు తొక్కుతోంది. ‘మిస్ రాజ మండ్రి’ మకుటాన్ని ధరించాలన్న ఆరాటమే కాదు.. ధరించగలమన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతోంది. ఈనెల 25న రాజమండ్రి షెల్టాన్ హోటల్లో జరిగే ‘మిస్ రాజమండ్రి’ పోటీల్లో జిల్లాకు చెందిన 15మంది యువతులు పోటీ పడుతున్నారు. ప్రాథమిక పోటీలకు 70మంది యువతులు హాజరుకాగా వారిలో 15 మందిని ఫైనల్‌కు ఎన్నుకున్నారు. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేయనున్నారు. ‘మిస్ రాజమండ్రి’ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు వీరంతా ప్రస్తుతం సాధన చేస్తున్నారు. వారికి గత కొద్దిరోజులుగా హోటల్ షెల్టాన్‌లో నిర్వాహకులు గొట్టిముక్కల సాయి, మోడల్ సాధనాసింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం తమకు ఇదే మొదటిసారని, అరుునా సత్తా నిరూపిస్తామని అంటున్న ఆ అందాలభామల మనోగతాలివి.. ఏ లలన తలను వరించనుందో.. మెరిసే ఈ మకుటం! (మిస్ రాజమండ్రి కిరీటం) సినిమాల్లోకి వెళ్లాలనుంది.. నేనెప్పుడూ ఫ్యాషన్‌షోలో పాల్గొనలేదు. నాకు ఇదే తొలిసారి. గీతం కళాశాలలో బీకాం చదువుతున్నాను. తొలుత ర్యాంప్‌పై నడవడం అంటే చాలా భయమేసింది. ఇప్పుడది పోయింది. మోడల్‌గా రాణించి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనుంది - గీతిక, బీకాం, గీతం కళాశాల మోడలింగ్ అంటే ఇష్టం.. నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మిస్ రాజమండ్రి పోటీలు నాకు ఆ అవకాశం కల్పించాయి. ఖచ్చితంగా టైటిల్ సాధిస్తాననే నమ్మకం ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. నేను బీబీఎం మూడో సంవత్సరం చదువుతున్నాను. - భావ్యసురేఖ, బీబీఎం, ఆదిత్య డిగ్రీ కళాశాల టైటిల్ నాదేనన్న నమ్మకముంది మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. ఈ రంగంలో రాణించాలనుకుంటున్నాను. నా కుటుంబసభ్యులు నాకు ఎంతగానోప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మిస్ రాజమండ్రి పోటీలో గెలుస్తాననే నమ్మకం ఉంది. - గాయత్రీ దివ్య, డిగ్రీ విద్యార్థిని, రావులపాలెం నటిగా స్థిరపడాలనుంది నటిగా స్థిరపడాలని ఉంది. నాకు ఎటువంటి అనుభవం లేదు. ఈ పోటీల్లో తొలిసారి పాల్గొంటున్నాను. ముందుగా భయం వేసినా ప్రస్తుతం పోయింది. దేనికైనా ఆత్మవిశ్వాసం కావాలి. అది ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించొచ్చు. - శ్రీవల్లి, డిగ్రీ విద్యార్థిని, రాజమండ్రి -
తెలంగాణ తొలి మిస్ ఇండియాగా గర్వంగా ఉంది
వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలో తొలి మిస్ ఇండి యా టైటిల్‌ను సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. సోమవా రం వరంగల్ స్టేషన్ రోడ్డులోని గ్రాండ్ గాయిత్రి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముంబై, ఢిల్లీ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు అమ్మాయిలు అందం గా, కావాల్సిన అన్ని అర్హతలతో సిద్ధంగా ఉన్నారని తెలిపా రు. మోడలింగ్‌పై అనేక రకాలైన అపోహలున్నాయన్నారు. అన్ని రంగాల్లో ఉన్నట్లుగా మోడలింగ్‌లో ఉన్నాయని, గ్లామ ర్ ఫీల్డ్ కావడంతో ఎక్కువ చర్చజరుగుతుందన్నారు. అభిరుచులకు తల్లిదండ్రులు పాధాన్యం కల్పిస్తూ, ప్రోత్సహించాల ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా సాయంచేస్తే మోడలింగ్‌పై శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మోడలింగ్ సంస్థలు ఉన్నందున కరీంనగర్ లేదా వరంగల్‌లో నెల కొల్పుతానన్నారు. సినిమాల్లో హీరోయిన్గా అవకాశలు వస్తున్నాయన్నారు. త్వరలో వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గృహిణిగా తన ప్రస్తానం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళలకు అదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో కూనూరు శేఖర్ గౌడ్, సదానందం పాల్గొన్నారు. -
వరంగల్ అంటే ఇష్టం
త్వరలో మోడలింగ్ శిక్షణ సంస్థ మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ పోచమ్మమైదాన్ : వరంగల్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని, ముంబై-ఢిల్లీ తరహాలో తెలంగాణలో త్వరలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తానని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం అని మిస్ ఇండియా రష్మి ఠాకూర్ అన్నారు. రిష్మీ ఠాకూర్ వరంగల్‌కు ఆదివారం రాత్రి ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటలల్లోనే.. వరంగల్ నాకు నచ్చిన ప్లేస్.. వరంగల్ నాకు చాలా న చ్చిన ప్లేస్. మా సొంత ఊరు కరీంనగర్. ఇప్పుడు హైదారాబాద్‌లో ఉంటున్నాను. వరంగల్ హిస్టరీని అంతా విక్లిపీడియూలో చదివాను. వరంగల్‌ను నా సొంత ఊరులా భావిస్తాను. ఖిలావరంగల్, భద్రకాళి అమ్మవారు, వేయిస్థంబాల ఆలయూలను చూశాను. త్వరలో రామప్ప, లక్నవరంను చుస్తాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్ పూర్తి కాగానే ఫ్యాషన్ డిజైనింగ్‌ను నేర్చుకున్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లు వద్దని చెప్పారు. అయినప్పటి కీ వారిని ఒప్పించి అందాల పోటీల్లో పాల్గొన్నాను. హైదారాబాద్‌లో జరిగిన మిస సౌత్ ఇండియా పోటీల్లో గెలుపొందాను. తరువాత కొచ్చిన్ జరిగిన పోటీలలో పాల్గొన్నాను. అక్కడ మిస్ ఏపీ గా గెలిచాను. అలా ముందుకు సాగుతూ మిస్ ఇండియా టైటిల్‌ను సైతం గెలుచుకున్నాను. తెలంగాణలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థ మోడలింగ్‌ను నేర్చుకోవాలని కోరిక ఉన్న వారు అందరూ ముంబై, డిల్లీ తదితర ప్రాంతాలకు వె ళ్తున్నారు. మన తెలంగాణలో సైతం త్వరలో మోడలింగ్ పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తాను. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు వెళ్తాను. అందరు బీటెక్, మెడిసిన్ లాంటి వాటిని నేర్చుకుంటూ మోడలింగ్‌పై శ్రద్ధ పెట్టాలి. బికినీల సంప్రదాయం మనది కాదు అందాల పోటీల్లో చివరకు బికినీలు ధరించాలని ఉంటుంది. దీంతో మన మహిళ సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు. బికినీలు ధరించడం సౌత్ ఇండియా సాంప్రదాయం కాదు కాబట్టి పోటీల్లో పాల్గొనే వారు 80శాతం వరకు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే మన దేశంలో జరిగిన అందాల పోటీలలో పాల్గొని ముందుకు సాగుతున్నా. ప్రతి పేరెంట్ అందాల పోటీల్లో వద్దని చెబుతారు. సినిమా ఆఫర్లు వస్తున్నాయి మిస్ ఇండియా పర్ఫెక్ట్ 2014, మిస్ ఇండియా బ్యూటిఫుల్ ఐస్ 2014 అయ్యాక సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మంచి బ్యానర్, ఒక మేసేజ్ ఓరింయటెడ్ సినిమాలో నటిస్తాను. హీరోలల్లో కమల్‌హాసన్, హిరోహియిన్లలో కత్రిన కైఫ్ అంటే చాలా ఇష్టం. వరంగల్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిన చిత్రం రుద్రమాదేవి చిత్రం చూడాలని బాగా ఆతృతతో ఉన్నాను. మన ప్రాంత సినిమాను మనం అందరం ఆదరించి తెలంగాణ సంస్కృతిని కాపాడుదాం. సినిమా మంచి హిట్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. గుణశేఖర్‌కు బెస్ట్ ఆఫ్ లక్. -
ప్రస్తుతానికి ఎవరూ లేరు..!
ఇంటర్వ్యూ మోడలింగ్లోంచి నటనలోకి దూసుకొచ్చింది కృతి సనన్. రావడంతోనే ‘నేనొక్కడినే’లో మహేశ్‌బాబు సరసన మెరిసింది. ‘దోచెయ్’లో నాగచైతన్యతో జతకట్టింది. అందంమైన రూపంతో పాటు చక్కని ప్రతిభ కూడా ఉంది అంటూ ప్రశంసలు కొట్టేసిన కృతి మనసులోని మాటలివి... ♦ మోడలింగ్ నుంచి నటనలోకి ఎలా? ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు మోడలింగ్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అప్పుడు నేను ఓ పక్క చదువుకుంటూ, మరోపక్క కథక్ నేర్చుకుంటూ బిజీగా ఉన్నాను. దాంతో మోడలింగ్‌ను ఓ హాబీలాగా మొదలుపెట్టాను. కానీ నా యాడ్స్ డెరైక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ అనేవారు... నేను స్క్రీన్‌కి సరిగ్గా సూటవు తానని, చాలా సహజమైన ఎక్స్‌ప్రెషన్స ఇస్తానని. అప్పుడే నటన మీద ఆసక్తి పెరిగింది. అదృష్టం కొద్దీ అవకాశాలు కూడా త్వరగానే వచ్చాయి. దాంతో ‘హీరో పంతీ’తో బాలీవుడ్లో, ‘నేనొక్కడినే’తో టాలీవుడ్లో అడుగుపెట్టాను. ♦ అంటే చదువు అక్కడితో ఆపేశారా? లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేశాను. విదేశాల్లో ఎంబీయే చేయాలని ఎంట్రన్స్ పరీక్ష కూడా రాశాను. తర్వాత సినిమాల్లో బిజీ అయిపోవడంతో దాన్ని పక్కన పెట్టాను. కానీ అది తాత్కాలికంగానే. ఎప్పుడో అప్పుడు ఎంబీయే కూడా పూర్తి చేసి తీరతాను. ఎందుకంటే నాకు చదువంటే చాలా ఇష్టం. ♦ మీ దృష్టిలో యాక్టర్‌కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ? మామూలుగా అయితే మనిషికి తృప్తి అనేది అవసరం అంటారు. కానీ నటికి గానీ నటుడికి గానీ తృప్తి అన్నది ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఎంత చేసినా ఇంకా బాగా చేయాలి అని తపించాలి. ఆ లక్షణమే మనల్ని గొప్ప యాక్టర్‌గా నిలబెడుతుంది. ♦ మరి గ్లామర్ సంగతి? అందం అనేది నటికి ఓ ప్లస్ పాయింట్. అంతే తప్ప అందమే కొలమానం కాదు. అందంగా ఉన్నా టాలెంట్ లేకపోతే ఎవరూ అవకాశాలు ఇవ్వరు. ♦ ఇండస్ట్రీలో రాణించాలంటే గాడ్‌ఫాదర్ ఉండాలా? రాణించాలంటే అవసరం లేదు కానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే మాత్రం ఎవరైనా మన వెనుక ఉండటం అవసరమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత లేదన్నా అవకాశాలు కాస్త త్వరగా వస్తాయి. అయితే రాణించాలంటే మాత్రం మన టాలెంటే ముఖ్యం. లక్కీగా నాకు మొదట్లోనే మహేశ్‌బాబు, నాగచైతన్య లాంటి స్టార్స్‌తో నటించే చాన్స్ వచ్చింది. ♦ అంటే మీరూ స్టార్ అయిపోయినట్టే? లేదు లేదు. స్టార్ అవడం అంత తేలిక కాదు. హృతిక్ రోషన్లాగ అందరూ ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోవాలంటే సాధ్యం కూడా కాదు. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నేను చేయాల్సింది చాలా ఉంది. ♦ నటి అయ్యాక మీలో ఏదైనా మార్పు వచ్చిందా? రాలేదు, రాదు. ఒకవేళ తర్వాత మెల్లమెల్లగా వచ్చినా, ఆ మార్పు కచ్చితంగా మంచిదే అయి ఉంటుంది. ఎందుకంటే ఆ మార్పు నాలో కాదు... నా పర్ఫార్మెన్స్లో వస్తుంది కాబట్టి! ♦ ప్రస్తుతం మీ ముందున్న చాలెంజ్? పాత్రల ఎంపికే. అవకాశాలు బాగానే ఉన్నాయి. అయితే తొందరపడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుని, నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం ఇష్టం లేదు నాకు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి, మంచి పేరు తెచ్చే పాత్రల్ని మాత్రమే ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ♦ షారుఖ్ సినిమాలో చేస్తున్నట్టున్నారు? అవును... ‘దిల్వాలే’. రోహిత్‌శెట్టి దర్శకుడు. నేను షారుఖ్‌కి కాదు, వరుణ్ ధావన్‌కి జోడీని. కానీ షారుఖ్‌తో కాంబి నేషన్ సీన్లు ఉన్నాయి. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. చిన్నతనం నుంచీ నేనాయన ఫ్యాన్‌ని. అలాంటిది ఇంత త్వరగా ఆయన సినిమాలో నటించే చాన్స్ వచ్చిందంటే నా ఆనందం ఎలా ఉంటుంది! పైగా ఆయన చాలా మంచి వారు. ఎంతో బాగా మాట్లాడతారు. మనలో ఏ కాస్త బెరుకైనా ఉంటే తన మాటలతో పోగొట్టేస్తారు. గొప్ప హీరో! ♦ ఇంతకీ మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? ప్రస్తుతానికి ఎవరూ లేరు. ఓ బంధం ఏర్పడాలంటే టైమ్ రావాలి. ఆ బంధాన్ని బలపర్చుకోవాలంటే టైమ్ కావాలి. నా దగ్గర ఇప్పుడు అంత టైమ్ లేదు. ముందు నేను నటిగా నిలదొక్కు కోవాలి. తర్వాతే అలాంటివన్నీ ఆలోచిస్తాను. -
మాటరాని అందమిది
కళ్లు మాట్లాడతాయి.. నవ్వు మాట్లాడుతుంది.. ఆమె రూపం మాట్లాడుతుంది. కాని ఆమె మాట్లాడలేదు. అందమైన రూపాన్నిచ్చిన బ్రహ్మ.. అంతకు మించి ఎందుకనుకున్నాడో ఏమో.. నోటి మాటను ఆమె నొసటన రాయలేదు. అయితేనేం.. ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోస్తుంది. ప్రకటనల్లో భావాలు వర్షిస్తుంది. సిటీలో మోడల్‌గా రాణిస్తోన్న ఈమె ర్యాంప్‌పై ఎక్కడైనా కనపడితే.. శభాష్ అని పొగడాలనుకుంటున్నారా.. ఉపయోగం లేదు. ఎందుకంటే ఆమెకు వినపడదు కూడా.. అయితేనేం డెఫ్ అండ్ డంబ్ మోడల్‌గా సిటీలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సరిత (22) ఎన్ని అభినందనలకైనా అర్హురాలే. ..:: ఎస్.సత్యబాబు ర్యాంప్‌పై మోడల్‌గా రాణించడమంటే ఆషామాషీ కాదు. రూపం ఒక్కటే సరిపోదు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. చదువుంటే చాలదు. కొరియోగ్రాఫర్స్, డిజైనర్స్ చెప్పింది అలా విని ఇలా అల్లుకుపోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మోడలింగ్ అంటే ప్రతిభావంతులైన సుందరాంగుల ప్రపంచం. అలాంటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది మాటరాని, వినలేని సరిత. చిన్ననాటి కలను నిజం చేసుకోవడానికి పెద్ద లోపాన్ని కూడా లెక్కచేయకుండా కృషి చేస్తోంది. ‘మాది వరంగల్. నాన్నది వ్యవసాయం. అమ్మ గృహిణి. మేం మొత్తం ఆరుగురు పిల్లలం’ అంటూ రాయడం మొదలు పెట్టింది సరిత (మా ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ ఇంటర్వ్యూ ఇచ్చింది) ఆమె చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... సారీ ఆమె రాతలోనే.. ఇంట్లో సగానికి పైగా డెఫ్ అండ్ డంబ్.. కారణం తెలియదు కానీ, మా ఆరుగురిలో ఇద్దరు సోదరులు, ఒక సోదరి కూడా నాలాగే మూగ, చెవిటి. మిగిలిన వారు బాగానే ఉన్నారు. అన్నయ్య తనలాగే డెఫ్ అండ్ డంబ్ అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా టీవీ చూసేదాన్ని. అందులో వచ్చే ఫ్యాషన్ చానెల్ నాకు బాగా నచ్చేది. అంతేకాకుండా టీనేజ్‌లో ఉండగా బాగుంటాననే ప్రశంసలు... అప్పుడే నాకు మోడలింగ్ చేయాలనిపించేది. అయితే నాకున్న లోపం వల్ల ఆ ఆశ తీరదు కదా అని బాధపడేదాన్ని. ఈ లోపాన్ని అధిగమించడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఇంటర్ పూర్తి చేశాను. డెఫ్ మోడల్ కాంటెస్ట్.. అదే సమయంలో మూగ చెవుడు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా బ్యూటీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిసింది. ఎలాగైనా అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అందుకే అతి కష్టం మీద ఇంట్లోవాళ్లని ఒప్పించి హైదరాబాద్ వచ్చేశాను. నెట్లో కాంటెస్ట్‌కు అప్లయ్ చేసి, ప్రిలిమినరీస్‌లో సెలక్టయ్యాను. అన్ని దశలూ దాటాను. చివరికి మిస్ డెఫ్ ఆంధ్రప్రదేశ్‌గా సెలక్టయి, 2012లో ముంబైలో జరిగిన మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సైతం పాల్గొన్నాను. 22 మంది పార్టిసిపేట్ చేశారు. నాకు కిరీటం రాకపోయినా మంచి ఐడెంటిటీ వచ్చింది. ఆ తర్వాత అడపాదడపా ర్యాంప్‌వాక్ అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా టాలీవుడ్ మ్యాగజైన్ లాంచ్ సందర్భంగా ర్యాంప్‌వాక్ చేశాను. అలాగే ప్రింట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. అయితే రాష్ట్రస్థాయి బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన మిగిలిన పేజెంట్స్ విజేతలతో పోలిస్తే తక్కువ. నాకున్న సమస్యపై చాలా మంది సానుభూతి చూపిస్తున్నారే కాని.. అవకాశాలు ఇవ్వడం లేదు. ఏదేమైనా మోడలింగ్ కెరీర్లో ముందుకే వెళ్లాలనుకుంటున్నాను. ఎప్పటికైనా మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సత్తా చాటాలనుకుంటున్నాను. ఇదీ మిస్ డెఫ్ ఇండియా కాంటెస్ట్ నేపథ్యం.. దేశంలో ఉన్న మాటరాని, వినలేని యువతుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి నిర్వహిస్తున్నవే మిస్ డెఫ్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లు. ఆరేళ్ల క్రితమే ప్రారంభమైనా.. ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో నడిచే డెఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మిగిలిన బ్యూటీ పేజెంట్స్కు భిన్నంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు ఎత్తు, అర్హతల విషయంలో పలు మినహాయింపులున్నాయి. వీరి కోసం ఇంటర్‌ప్రిటర్స్ (సైన్ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకుని సాధారణ భాషలోకి తర్జుమా చేసే అనువాదకులు)ను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. రెండేళ్ల క్రితం ముంబైలోని బిర్లా మాతృశ్రీ సభాగృహలో డెఫ్ ఎక్స్‌పోలో భాగంగా నిర్వహించిన పోటీలో అప్పటి ఆంధ్రప్రదేశ్ తరఫున సరిత పాల్గొంది. ‘మూగవాళ్లకు మాతృభాష సైన్ లాంగ్వేజ్. దీనిపై చాలామందిలో అవగాహన లేదు. సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడడంలో పరిణితి సాధిస్తే డెఫ్ అనే ఆలోచన కూడా రాదు’ అంటారు ఎక్స్పో నిర్వాహకులు, పుట్టుకతో మూగవారైన అలోక్ కేజ్రీవాల్. పాఠశాలల్లో ఖరీదైన డిజిటల్ హియరింగ్ ఉత్పత్తులు అందుబాటులో లేవు. అమెరికాలో అడ్వాన్స్డ్ వీడియో కాలింగ్ డివెజైస్ ఉన్నాయి అంటున్న అలోక్.. మాటలతో ఏకీభవిస్తారు ఈ పోటీలకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న మరో డెఫ్ అండ్ డంబ్ యువతి కాజల్ థావన్.. 2009లో మమతాసింగ్ అనే మూగ యువతి మిస్ డెఫ్ ఇండియాగా ఎన్నికై మిస్ డెఫ్ వరల్డ్ పోటీలకు సైతం ప్రాతినిథ్యం విహంచింది. అలాగే కనికా బాలి, అంకితాకుమారి.. వీరంతా మాట లేకున్నా మంత్రముగ్ధులను చేసే అందంతో కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు ఇప్పటిదాకా సరైన ప్రాతినిథ్యం లేదనే లోటును సరిత భర్తీ చేస్తోంది. -
హీరోయిన్ని మాత్రమే కాదు
నేను హీరోయిన్ని మాత్రమే కాదు ఇతర రంగాల్లోనూ స త్తా చాటుకుంటానంటోంది నటి లక్ష్మీదేవి. మోడలింగ్ నుంచి చిత్రరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు పొందింది. తమిళం, తెలుగు భాషల్లో నటించిన శివని చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో మకాం వేసింది. మసాలా పడం అనే చిత్రతంలో హీరోయిన్గా నటిస్తోంది. యువ నటుడు శివ, బాబి సింహేలు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అని నటి లక్ష్మీదేవి అంటోం ది. దీని గురించి ఈ ముద్దుగుమ్మ తెలుపుతూ మసాలా పడంలో తాను స్వతంత్ర భావాలు గల మంచి బలమైన పాత్రలో నటిస్తున్నానని తెలి పింది. తన పాత్ర తమిళ ప్రేక్షకులకు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని పేర్కొంది. ఇలాంటి చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది. మరో విషయం ఏమిటంటే ఈ మసాలా పడం చిత్రంలో కథానాయకిగా మాత్ర మే కాకుండా ఈ చిత్రానికి స్క్రిప్ట్ తానే రాసినట్లు తెలిపింది. అంతేకాదు వెన్నెల కబడ్డీ కుళు చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన లక్ష్మణ్‌తో కలసి సహ దర్శకురాలిగా పని చేస్తున్నట్లు తెలిపింది. దీంతో మసాలాపడం చిత్రంపై తన బాధ్యత చాలా పెరి గిందని చెప్పుకొచ్చింది. మొత్తం మీద తన కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం ఇదని లక్ష్మీదేవి అంటోంది. -
మోడలింగ్ టూ సీరియల్స్..
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ప్రతినాయకి పాత్ర పోషించి మెప్పించిన నటి సింగంపల్లి శృతి. బుల్లితెరపై రుతురాగాలు, శ్రావణ సమీరాలు, మొగలిరేకుల్లో మహిళా ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్పనటి ఆమె. ఓ లఘుచిత్రంలో నటించేందుకు కౌతవరం వచ్చారు. మోడలింగ్ నుంచి సీరియల్స్ వరకు తన జీవన ప్రస్థానాన్ని ‘సాక్షి’కి వివరించారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) సాక్షి : మీ స్వస్థలం? శృతి : వైజాగ్ అయినా.. పాతికేళ్లుగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. సాక్షి : నటనలోకి ఎలా వచ్చారు.? శృతి : ఫస్ట్ మోడలింగ్ చేసేదాన్ని. స్నేహితుల పరిచయాలతో నటనలోకి అడుగుపెట్టాను. సాక్షి : మీ మొదటి సీరియల్? శృతి : 1991లో ‘సీతారాముల సినిమా గోల’ అనే సీరియల్‌తో మొదలుపెట్టా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16ఏళ్ల వయసులోనే సీరియల్స్‌లోకి వచ్చేశా. సాక్షి : మీకు పేరు తెచ్చిన సీరియల్స్.. శృతి : వందకుపైగా సీరియల్స్‌లో నటించా. రుతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, చంద్రముఖి, కన్యాశుల్కం, శ్రావణ సమీరాలు, మమతల కోవెలలోని పాత్రలు మంచి పేరు తెచ్చారుు. సాక్షి : సినిమాల సంగతేంటి? శృతి : తొలి సినిమా అమ్మోరు. కెమెరామెన్ గంగతో రాంబాబు, కొత్తజంట, మీ శ్రేయోభాలాషి వంటి 30 సినిమాల్లో నటించా. సాక్షి : మీ భర్త మధుసూదన్ కూడా నటుడే కదా.. శృతి : అవును. ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంలో విలన్‌గా చేశారు. ‘ఒక లైలా కోసం..’ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. తమిళంలో ఆయన నటించిన ‘గోలీసోడ’ పెద్ద హిట్. ప్రస్తుతం వంశం, కిక్-2లో నటిస్తున్నారు. -
ఉందిలే మంచి కాలం
‘ఉందిలే మంచికాలం ముందు ముందునా... నాకు మంచి రోజులొస్తాయి నంద నందనా..!’ అంటూ ఆశల పల్లకిలో పాటలు పాడుకుంటోంది నటి పార్వతి ఓమన కుట్టాన్. ఈ మాజీ మిస్ ఇండియాకు మోడలింగ్ రంగంలో కలిసొచ్చినట్లు ఇంకా సినిమా రంగం అచ్చి రాలేదు. తమిళంలో అజిత్ సరసన భిల్లా -2తో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత చిత్రం నంబియార్ కూడా ఈ సుందరికి హిట్ నివ్వలేదు. ఇక్కడ కాకపోయినా బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని పిజ్జా - 3డి చిత్రంలో ఒక రాయి వేసింది. అది గురి తప్పింది. దీంతో నిరుత్సాహపడినా ఇంకా బింకపు మాటలు పలుకుతోంది. ఈ మాజీ సుందరి మాట్లాడుతూ తనకు మంచి రోజులొస్తాయంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నటిగా తన కింతవరకు విజయవంతమైన చిత్రాలు అమరలేదంది. ఇటీవల హిందీలో నటించిన పిజ్జా -3డి చిత్రానికి మిశ్రమ విమర్శలు వచ్చాయని చెప్పింది. తాను చాలా ఎత్తుపల్లాలు చూశానని తప్పుడు విమర్శలతో వేదనకు గురయ్యానని చెప్పింది. అయినా తనను ప్రత్యక్షంగా కలిసినవాళ్లు తన నటన గురించి మంచిగానే చెబుతున్నారని అంది. ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. తానీ స్థాయికి ఎదగడానికి కారణమైన మోడలింగ్ రంగాన్ని వదులుకునే సమస్యే లేదని చెప్పింది. మోడలింగ్‌లో తాను చాలా ప్రదేశాలు చుట్టొచ్చానని తెలిపింది. అదే విధంగా నటనా వృత్తిపైనా తనకు చాలా నమ్మకం ఉందనే అభిప్రాయపడింది. ఈ రంగంలో రాణించడానికి ఇంకొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుందని అంది. ఖచ్చితంగా తనకంటూ ఒక టైమ్ వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. తన ప్రతిభకు సవాలుగా నిలిచే పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పార్వతి ఓమన కుట్టాన్ తెలిపింది. -
కిస్.. టేస్ట్‌లెస్
...ఎక్కడో అక్కడ ఆ అవకాశం వస్తే చాలు... అదే పదివేలని ఎదురుచూసే రసికులెందర్నో చూశాం కానీ... ఇదేంటి... ఈ కుర్రోడు.. సిద్ధార్థ్ మల్హోత్రా..! ‘ఆన్‌స్క్రీన్ కిస్‌లో కిక్కే లేదు... ఆల్జీబ్రా లెక్కలు తప్ప’ అంటున్నాడు..! మోడలింగ్ నుంచి చిన్న వయసులోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్‌కు మరో పేరు కూడా ఉంది... ‘చాక్లెట్ బాయ్’, ఇంకా ఆ స్థాయి నుంచి ఈ ‘బొద్దు’బాయ్ ఎదిగినట్టు లేడంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. -
నటనకు సరిహద్దులు లేవు...
లైఫ్‌బుక్ పద్నాలుగు సంవత్సారాల వయసులోనే మోడలింగ్‌లోకి ప్రవేశించాను. ‘బారిష్ కే ఆన్సు’ ‘తన్నీర్ ఫాతిమా బి.ఏ’ మొదలైన టీవి సీరియల్స్ నాకు గుర్తింపు తెచ్చాయి. ‘బోల్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాను. రాబోయే ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో ఇమ్రాన్ హష్మీ సరసన నటిస్తున్నాను. చిన్న వయసులోనే కెమెరా ముందుకు రావడం వల్ల కావచ్చు... కెమెరా నాకు చాలా పాత స్నేహితురాలు అనిపిస్తుంది. మనుషులతో మాట్లాడడం కంటే కెమెరా ముందు నిల్చొని నటించడంలోనే నాకు సౌకర్యంగా ఉంటుంది. మోడలింగ్, నటన... రెండు రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, నటన అంటే చాలా ఇష్టం. మోడలింగ్ కంటే నటనతోనే ఎక్కువమందికి చేరువకాగలం. పేరు తెచ్చుకోగలం. చెప్పొచ్చేదేమంటే, ఫ్యాషన్ మోడల్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వారికి మాత్రమే తెలుస్తారు. నటులు మాత్రం మారుమూల గ్రామాలకు సైతం తెలుస్తారు. సరిహద్దులు నటుల ప్రతిభను ప్రభావితం చేయలేవు. నటులకు సరిహద్దులతో పనిలేదు. దేశాలకు అతీతంగా మనం నటులను ప్రేమించేది ఈ కారణంతోనే. నేను పాకిస్థాన్ నటిని అయినప్పటికీ ఇండియాలో నటించినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఎలాంటి వివక్ష కనిపించలేదు. స్క్రిప్ట్‌లో శక్తి ఉంటే చిన్న బడ్జెట్ సినిమా అయినా నా దృష్టిలో పెద్ద బడ్జెట్ కింద లెక్క. ‘‘ఫలానా సినిమాలో నాకు ఒక పాత్ర వచ్చింది. అది నాకు నచ్చింది. ఆ పాత్రకు వందశాతం ఎలా న్యాయం చేయాలి?’’ అనే దాని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తాను. అందానికి, వ్యక్తిత్వానికి దగ్గర సంబంధం ఉంటుంది. చూడడానికి బాగున్నా, ప్రవర్తన చెడుగా ఉంటే వాళ్లు అందంగా లేనట్లే. అందమైన వ్యక్తిత్వమే అసలు అందం అనేదాన్ని నమ్ముతాను. - హుమైమా మాలిక్, హీరోయిన్ -
మీరే కావచ్చు సూపర్ మోడల్
మోడలింగ్‌లో ప్రతిభ చాటాలనుకున్న యువతీ యువకులకు చక్కని అవకాశం. ‘సూపర్‌మోడల్ హైదరాబాద్ 2014’ పేరిట నగరంలో మోడలింగ్ పోటీలు జరగనున్నాయి. లైమ్లైట్ ఎంటర్టైన్మెంట్, సెలబ్ ఓ ఫియెస్టా సంయుక్తంగా నిర్వహించనున్న కాంటెస్ట్ ఆడిషన్స్ ఈనెల 26న ప్రారంభమవుతాయి. యువతులైతే 5.5, యువకులైతే 5.9 కనీస ఎత్తు ఉండాలి. 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు వారు అర్హులు. ఫైనల్స్ ఆగస్ట్ 23న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయని నిర్వాహకులు బుధవారం తెలిపారు. మరిన్ని వివరాలకు ‘సూపర్మోడల్హైదరాబాద్డాట్కామ్’ చూడవచ్చన్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ప్రెస్మీట్లో నటి సోనియా, సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ వెరోనికా, ఫిట్నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లా పాల్గొన్నారు. సాక్షి, సిటీప్లస్ -
అమ్మ మాట జవదాటను
అమ్మ మాట జవదాటను చాలా మంది హీరోయిన్లు అమ్మ గారాల బిడ్డలే. వారి మాటలే వేదం. క్రేజీ నటి హన్సిక తల్లి చాటు కూతురే. అమ్మే ఆమెకు మార్గ దర్శకురాలు. బాలతారగా ప్రవేశించిన ఈ బబ్లీ గర్ల్ స్టేజీ కార్యక్రమాలు, మోడలింగ్, యాడ్స్ అంటూ తన నటనకు పదునుపెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న హీరోయిన్ హన్సికే. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో కాస్త వేడి పుట్టించినా ప్రస్తుతం బుద్దిగా నటనపైనే దృష్టి సారించింది. ఈ భామ త్వరలో నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. అమ్మ మాట జవదాటని హన్సిక ఈ మధ్య నటుడు శింబుతో ప్రేమ వ్యహారంలో పడి తల్లి హితబోధను పెడచెవిన పెట్టి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా కాస్త సంచలనం కలిగించినా శింబు ప్రేమకు రాంరాం పలికి మళ్లీ అమ్మ గూటికే చేరింది. ఏ విషయమైనా అమ్మతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటోందట. కథల ఎంపికలోనే కాకుండా ఏ హీరోతో జత కట్టాలి వంటి విషయాలను హన్సిక అమ్మే చూసుకుంటున్నారట. దీని గురించి ఈ క్రేజీ హీరోయిన్ తెలుపుతూ బాల తారగా నటిస్తున్నప్పటి నుంచే అమ్మ చెప్పినట్టే నడుచుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికీ అదే అలవాటుగా మారిందని పేర్కొంది. ఇటీవల ఈ అమ్మడు ఒక సాహస కార్యం చేసింది. చెన్నైలోని ఒక సినీ కాంప్లెక్స్‌కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లి సినిమా చూసొచ్చింది. హన్సిక లాంటి స్టార్ సినిమా కొస్తే ప్రేక్షకుల కంట పడకుండా ఉండడం సాధ్యమా చాలా మంది ఆమెను గుమికూడి ఆటోగ్రాఫ్‌లు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడం కార్యక్రమాలతో ఆ ప్రాంతం కలకలంగా మారిపోయింది. అయినా అదంతా అధిగమించి హన్సిక సురక్షితంగా ఎవరి సాయం లేకుండా ఇల్లు చేరింది. -
తెరపై మళ్లీ ఈ జోడీ..?
పెళ్లయిన ఆడవాళ్లు కెరీర్‌ని త్యాగం చేయాల్సిందేనా? అంటే.. ‘అవసరం లేదు’ అని చాలామంది అంటారు. కాకపోతే, కుటుంబం కోసం ఇష్టపూర్వకంగానే ఇంటికి పరిమితమయ్యే ఆడవాళ్లు ఉంటారు. నమ్రత ఆ జాబితాలోకే వస్తారు. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడలింగ్ కూడా చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి రావడంతో మోడలింగ్‌కి దూరమయ్యారు. ఇక, మహేశ్‌బాబుని ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పుడీ దంపతులకు ఒక బాబు (గౌతమ్), పాప (సితార) ఉన్న విషయం తెలిసిందే. గౌతమ్‌కి ఎనిమిదేళ్లు. త్వరలో సితారకు రెండేళ్లు నిండుతాయి. దాంతో నమ్రత మళ్లీ మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారట. బహుశా అందుకేనేమో మునుపటిలా చక్కగా నాజూగ్గా తయారయ్యారు. ఓ ప్రముఖ పత్రికకు సంబంధించిన ఫొటోషూట్‌లో కూడా పాల్గొన్నారు నమ్రత. ఆ పత్రిక ముఖచిత్రంపై ఆమెను చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. అంత బాగున్నారామె. త్వరలో ఓ ప్రముఖ నగల దుకాణానికి ప్రచారకర్తగా చేయనున్నారట నమ్రత. అది మాత్రమే కాదు.. మరికొన్ని ఉత్పత్తులకు అవకాశం వస్తే, చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే వ్యాపార ప్రకటనల పరంగా మహేష్ దూసుకెళుతున్నారు. ఇప్పుడు నమ్రత కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. అంటే, భవిష్యత్తులో ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదైనా ఉత్పత్తికి ప్రచారకర్తలుగా చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకవేళ ఈ ఇద్దరూ జంటగా చేస్తానంటే ఏ ఉత్పత్తిదారు మాత్రం వదులుకుంటాడు. ఎంచక్కా క్యాష్ చేసుకోడూ! -
మళ్లీ హన్సిక హవా
జరిగేది జరగక మానదు. అయితే జరిగిన దాన్ని మనకనుకూలంగా మార్చుకోవడం ఉత్తమ లక్షణం అన్నది జీవిత సత్యం. నటి హన్సిక ఈ నగ్న సత్యాన్ని గ్రహించినట్లున్నారు. ఈ బ్యూటీ దశాబ్దం క్రితమే నటనకు శ్రీకారం చుట్టారు. యాడ్స్, మోడలింగ్, సినిమాలు అంటూ నటిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్గా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ వద్దంటే అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే 25 ఏళ్లు పైబడుతున్న హన్సిక వయసు ప్రభావం కావచ్చు, మరేదైనా కావచ్చు నటుడు శింబుతో ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ పెళ్లికి దారి తీస్తుందని ప్రకటించడంతో హన్సిక కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. శింబుతో ప్రేమ విషయంలో పునరాలోచన చేసుకోవటాన్ని కొందరు సీనియర్ నటీనటులు బహిరంగంగానే హితవు పలికారు. అది అటుంచితే ఆమెతో సినిమాలు చేద్దామనుకున్న కొందరు నిర్మాతలు వెనకడుగేశారు. ఇంటిలో తల్లి ఒత్తిడికి గురయ్యారు. ఎట్టకేలకు హన్సిక శింబుతో సుదీర్ఘంగా చర్చించి ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టినట్లు ఆయనతోనే చెప్పించి పలు సమస్యల నుంచి బయటపడ్డారు. చక్కని పరిణితితో ప్రవర్తించిన హన్సికకు తెలివైన అమ్మాయని పరిశ్రమ వర్గాలంటున్నారు. అంతేకాదు ఈ మిల్కీ బ్యూటీకి మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తున్న దక్షిణాది నటి ఎవరన్నా ఉన్నారంటే అది హన్సికనే. తమిళం, తెలుగు భాషలతో కలిసి మొత్తం ఎనిమిది చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అంటే హన్సిక హవా మళ్లీ మొదలైనట్లే. -
తారాస్వరం: నేనెప్పుడూ అలానే ఆలోచిస్తా!
కాజల్ అగర్వాల్ పుట్టినరోజు: జూన్ 19 నచ్చే రంగులు: నీలం, తెలుపు, ఎరుపు నచ్చే ఆహారం: హైదరాబాద్ బిర్యానీ నచ్చే ప్రదేశాలు: కేరళ, గోవా, మారిషస్ నచ్చే కారు: బీఎండబ్ల్యూ నచ్చిన పుస్తకం: బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ నచ్చే హీరో: ఆమిర్‌ఖాన్ నచ్చే హీరోయిన్: శ్రీదేవి, కాజోల్, సుస్మితాసేన్ మీ నిక్‌నేమ్: గుడ్డా. అంటే గుడియా అన్నమాట. దానికి అర్థం బొమ్మ అని. చూడ్డానికి బొమ్మలా ఉండేదాన్నని అందరూ నన్ను అలానే పిలిచేవారు. ఫస్ట్ క్రష్: తొమ్మితో తరగతిలో ఉన్నప్పుడే ఏర్పడింది. (నవ్వుతూ) డిటెయిల్స్ అడక్కండి. ప్రభావితం చేసిన వ్యక్తి: మా అమ్మ. తను చాలా తెలివైనది. సమర్థవంతురాలు. తను నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఎలాంటి దుస్తులు నచ్చుతాయి: నా శరీరం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందుకే ఏ డ్రెస్ వేసుకున్నా నాకు బాగానే నప్పుతుంది. నాకయితే జీన్స్, టీషర్ట్స్, చీరలు ఎక్కువ ఇష్టం. అందమంటే: మనసు. అది అందంగా ఉంటే... మనకు అన్నీ అందంగా కనిపిస్తాయి. మనమూ అందరికీ అందంగా కనిపిస్తాం. అందంగా ఉండటానికి ఏం చేస్తారు: క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యాన్ని మించిన అందమేముంది! ఎందుకలా చేశానా అని ఫీలయ్యేది: మోడలింగ్ అవకాశాలు రావడంతో అటు వెళ్లిపోయాను. తర్వాత సినిమాల్లోకి రావడంతో చదువుకు దూరమయ్యాను. అనుకున్నట్టుగా ఎంబీఏ చేయలేకపోయానని ఇప్పటికీ ఫీలవుతుంటా. మర్చిపోలేని ఫోన్‌కాల్: చందమామ రిలీజ్ అయ్యాక కృష్ణవంశీ ఫోన్ చేశారు. సినిమా పెద్ద హిట్, నిన్ను అందరూ మెచ్చుకుంటున్నారు అంటూ ఆయన చెప్పిన మాటల్ని నేను మర్చిపోలేదు. బెస్ట్ ఫ్రెండ్స ఉన్నారా: ఎందుకు లేరూ! అయితే ఇండస్ట్రీలో కాదు. ముంబైలో ఉన్నారు. ఒకమ్మాయి ఇండియాలోనే ఫేమస్ డాక్టర్. ఇంకొకమ్మాయి లాయర్. నా ఫ్రెండ్సంతా మంచి పొజిషన్సలో ఉన్నారు. అందుకు చాలా సంతోషపడుతుంటా! ఎదుటివారిలో నచ్చేది, నచ్చనిది: నచ్చేది నిజాయతీ, సచ్చీలత; నచ్చనిది హిపోక్రసీ. మీలో మీకు నచ్చేది: ఎప్పుడూ అవతలివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తాను. వారి పరిస్థితిని అర్థం చేసుకుని నడచుకుంటాను. మీలో మీకు నచ్చనిది: అందరికీ త్వరగా దగ్గరైపోతాను. వాళ్లు దూరమైతే బాధపడిపోతాను. ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది: నేను కాస్త గట్టిగా మాట్లాడతాను. దాంతో అరిచినట్టు అనిపిస్తుంది. యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ వల్ల అలా డామినేటింగ్‌గా మాట్లాడతానని, నాకు పొగరని అనుకుంటారు కొందరు. కానీ అది నిజం కాదు. మీ గురించి ఎవరికీ తెలియనిది: నేను చాలా చిన్న వయసులోనే నటినయ్యానన్న విషయం చాలామందికి తెలియదు. నా తొలిచిత్రం ‘క్యూం... హోగయానా’ చేసేటప్పటికి నా వయసు పదమూడు. ఊరికే సరదాగా చేసిన సినిమా అది. అత్యంత బాధపెట్టే విషయం: సిగ్నల్స్ దగ్గర కారు ఆగినప్పుడు చాలామంది పిల్లలు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. కొంత మంది అయితే గబగబా కారు తుడిచేసి, డబ్బులిమ్మని చేతులు చాపుతారు. వాళ్లని చూస్తే మనసు అదోలా అయిపోతుంది. దేవుడిపై నమ్మకం: చాలా ఉంది. మా ఇంట్లో రోజూ పూజ చేస్తాం. పండుగలప్పుడు ప్రత్యేక పూజలు ఉంటాయి. మాకు దసరా చాలా స్పెషల్. అందరం కలిసి ఘనంగా జరుపుకుంటాం. ఒకవేళ అప్పటికి నేను షూటింగ్లో ఉంటే యూనిట్ సభ్యులతో కలసి చేసుకుంటాను. అంతేకానీ, ఆ పండుగను మాత్రం మిస్సవను. నమ్మే సిద్ధాంతం: సక్సెస్ అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నీ చేయి జారిపోకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. మళ్లీ జన్మంటూ ఉంటే: నేను పునర్జన్మను నమ్మను. కర్మఫలాన్ని నమ్ముతాను. మనకున్నది ఈ ఒక్క జన్మే అని భావించి, అందరూ మంచిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవని నా అభిప్రాయం! -
ర్యాంప్అందాల పూలదారి
సరిగ్గా రెండ్రోజుల క్రితం గ్లామర్ పపంచంలో భారతీయ అందం మరోసారి త‘లుక్’మంది. ఏకంగా అమెరికా దేశపు అందాల కిరీటాన్ని స్వంతం చేసుకున్న విజయవాడ అమ్మాయి నీనా దావులూరి మరోసారి మన గ్లామర్ సత్తాను ప్రపంచానికి చాటింది. రకరకాల భయాలను, బిడియాలను త్వరత్వరగా వదుల్చుకుంటున్న తెలుగమ్మాయిలు మోడలింగ్‌లో రాణిస్తున్నారు. మరెందరో అమ్మాయిలు ‘మోడల్స్’గా మెరిసేందుకు రాచబాట పరుస్తున్నారు. మోడలింగ్ అంటే అదేదో కేవలం అందాల ప్రదర్శన మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. అయితే మిగిలిన అన్ని రంగాల తరహాలోనే అటు అందం ఇటు ఆత్మ విశ్వాసం, తెలివితేటలు అన్నీ ఉంటేనే మోడల్‌గా వెలుగొందడం సాధ్యమని గ్రహిస్తున్నారు. మోడల్‌గా మంచి అవకాశాలు దక్కించుకోవడం అనేది సినిమాలకు రెడ్‌కార్పెట్ అని కూడా అర్థం అవడంతో ఇటువైపు రావడానికి మరింతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న కొందరు హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక మోడల్స్‌ను పలకరించినప్పుడు ఇలా స్పందించారు. - ఎస్. సత్యబాబు ఎన్నో రిహార్సల్స్... కంప్యూటర్సైన్స్లో ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఒక మంచి జాబ్ ఎంత అవసరమో మనల్ని మనం ఇతరత్రా నిరూపించుకునే యాక్టివిటీ కూడా అంతే అవసరం కదా! అలాంటిదే మోడలింగ్. చదువుతో పాటు, జాబ్ చేస్తూనే మానసిక సంతృప్తి కోసం మోడల్‌గానూ కొనసాగాలనేది నా ఆశయం. పెద్ద సంఖ్యలో జనం మనల్ని చూస్తూ హర్షధ్వానాలు చేస్తుంటే వచ్చే ఆనందం వేరు కదా! ఆ ఆనందాన్ని పొందేందుకే మోడల్‌గా మారాను. అయితే జనం ముందు కనపడే ఆ మెరుపుల వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ర్యాంప్ మీద మెరిసేందుకు ఎన్నోసార్లు రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిచేసినా ఒక్కసారి టాప్ మోడల్ అనిపించుకుంటే ఇక అన్నీ మర్చిపోతాం. తప్పనిసరిగా వారంలో ఐదు రోజుల పాటు రోజుకు గంటన్నర చొప్పున వ్యాయామం చేయడం దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్లామర్ రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం దాకా మా గెలుపు వెనుక ఎంతో కృషి ఉంటుంది. ఈ రంగంలో నన్ను ఎంతమంది నిరుత్సాహపరచాలని చూసినా మా అమ్మ మాత్రం ప్రోత్సహించింది. టీవీలో, మేగ్జైన్లో, షోస్‌లో నన్ను చూసినప్పుడల్లా చుట్టుపక్కలవారికి చూపించి మురిసిపోతుంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ తరహాలో ఈ రంగంలో నా ప్రస్థానాన్ని సాగించాలనుకుంటున్నాను. - మోనిక.టి ఏ రంగంలో పనిచేసినా... మోడలింగ్‌ను దేనితోనూ పోల్చలేం. ఎందుకంటే అందులో ఉండే గ్లామర్, ఆ రంగానికి ఉన్న ఆకర్షణ అలాంటివి. ప్రస్తుతం ప్రముఖ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తున్నాను. టీనేజ్ నుంచి ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లో ప్రయత్నాలు ప్రారంభించాను. ఈ ప్రొఫెషన్లో రాణించడానికి చక్కని ఫిజిక్ తప్పనిసరి. దీనికోసం ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లడం, డైట్ ఫాలో అవడం చేస్తున్నాను. ఫిజికల్ ట్రైనర్ కూడా ఉన్నారు. ఈ రంగం మీద ఉన్న రకరకాల వ్యాఖ్యానాలను పట్టించుకోకుండా మా తల్లిదండ్రులు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుండడం నా అదృష్టం. వారే నాకు ప్రథమ విమర్శకులు కూడా. ఏ రంగంలో ఉన్నా మన విద్యార్హతలను ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిందే! ఆ క్రమంలోనే నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లీష్) చేస్తున్నాను. - వింధ్య అందచందాలు మాత్రమే సరిపోవు... ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తున్నాను. గ్లామర్ రంగంలో అందం అనేది ఒక ప్రాథమిక అర్హత మాత్రమే. చూడచక్కని రూపంతో బాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం వంటివి సైతం ఉంటేనే గ్లామర్ రంగంలో ఎదగగలం. నేను ఈ రంగానికి వచ్చి రెండేళ్లవుతోంది. చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌లోకి రావాలనుకుని దానికి అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని లఖోటియా మోడలింగ్ ఇన్స్టిట్యూట్లో జేరాను. శిక్షణానంతరం ప్రసాద్ బిడప్ప మోడలింగ్ హంట్‌లో పాల్గొన్నాను. గత జూలైలో జరిగిన లఖోటియా ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాను. ప్రస్తుతం పలు సంస్థల ఫొటో షూట్స్‌లో పాల్గొంటున్నాను. పలు బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. ర్యాంప్ షోలలో పాల్గొంటున్నాను. టాప్ మోడల్‌గా ఎదగాలని, బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను. - ప్రియాంక