అప్ప‌ట్లో చచ్చేంత సిగ్గు: న‌టుడు | Milind Soman Says Very Shy In Pre Modelling Days | Sakshi
Sakshi News home page

కెమెరా అంటే సిగ్గు, కానీ మోడ‌ల్ అయ్యాడు

Aug 7 2020 5:54 PM | Updated on Aug 7 2020 6:18 PM

Milind Soman Says Very Shy In Pre Modelling Days - Sakshi

బాలీవుడ్ న‌టుడు, ప్ర‌ముఖ‌ మోడ‌ల్ మిలింద్ సోమ‌న్ మోడ‌లింగ్‌లోకి అడుగు పెట్ట‌కముందు ఎలా ఉండేవారు? ఈ ప్రశ్నే చాలామందికి రావ‌డంతో నేరుగా మిలింద్‌నే అడిగేస‌రికి ఆయ‌న మోడ‌లింగ్‌లోకి రాక‌ముందు దిగిన ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా అప్ప‌ట్లో త‌న‌కు చ‌చ్చేంత సిగ్గన్న విష‌యాన్ని వెల్ల‌డించారు. అస‌లు ఫొటో దిగాలంటేనే ఏమాత్రం ఇష్టం ఉండేది కాద‌న్నారు. ఆనాటి ఫొటో చూసి అవాక్క‌యిన అభిమానులు మిలింద్‌లో మార్పుల‌ను విశ్లేషిస్తూ ఆయ‌న‌ను పొగ‌డ‌కుండా ఉండ‌లే‌క‌పోతున్నారు. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి)

"కెమెరా ముందుకు రావాలంటే సిగ్గుప‌డే వ్య‌క్తి ఇప్పుడు కెమెరానే ప్రేమిస్తున్నాడు" అంటూ ఓ నెటిజ‌న్ రాసుకొచ్చాడు. "మీరు అప్ప‌టికీ ఇప్ప‌టికీ హ్యాండ్‌స‌మ్‌గానే ఉన్నారు", "మీరొక‌సారి పెరిగిన గ‌డ్డాన్ని తీసేసి, క్లీన్ షేవ్ చేసుకుని, నెరిసిన జుట్టుకు న‌ల్ల రంగేసారనుకోండి.. మ‌ళ్లీ మీ పాత లుక్ మీకు తిరిగొస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆరుబ‌య‌ట కుర్చీల్లో వాలిపోయిన మిలింద్ దంప‌తులు కునుకు తీస్తూ ప్ర‌కృతిలో సేద‌తీరుతున్న ఫొటోను సైతం ఈ మోడ‌ల్‌ షేర్ చేశారు. కాగా మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. "మేడ్ ఇన్ ఇండియా" మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. (‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement