Milind Soman
-
Milind Soman: మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన 'ఆవారా' నటుడు (ఫోటోలు)
-
26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!
సాధారణంగా పెళ్లి చేసుకునేటప్పుడు వయసు తేడాను కొందరు పరిగణనలోకి తీసుకుంటారు. సెలబ్రీటీల విషయంలో వీటిపై మరింత ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎవరైనా పెళ్లి విషయంలో కాస్తా అటు ఇటుగా 5 నుంచి పదేళ్ల వయస్సు తేడాలను చూసి ఉంటాం. కానీ ఏకంగా తన వయసులో సగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అరుదుగా కనిపించే దృశ్యం. కానీ పెళ్లికి వయసుతో పనిలేదంటూ.. నిజ జీవితంలోనూ ఇలాంటి పెళ్లి చేసుకోవచ్చని నిరూపించాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. (ఇది చదవండి: ‘బ్లడ్ అండ్ చాక్లెట్’లో ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయి) ప్రముఖ మోడల్, నటుడైన మిలింద్ సోమన్ జీవితం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను ఇప్పటికే చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు జరిగిన వివాహాం అన్నింటికంటే ప్రత్యేకతను సంతరించుకుంది. 2018లో అంకితా కున్వర్‌తో జరిగిన వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అంకితను పెళ్లి చేసుకునే సమయానికి మిలింద్ వయసు 52 ఏళ్లు కాగా.. ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలే. తన వయసులో సగం మాత్రమే అంకితను పెళ్లాడిన నటుడిగా సోమన్ నిలిచాడు. అంతకుముందే చాలామందితో డేటింగ్.. అంకితతో పెళ్లికి ముందు మిలింద్ మొదట ఫ్రెంచ్ నటి మైలీన్ జంపానోయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అతని కంటే మైలీన్ 15 సంవత్సరాలు చిన్నది. కాగా.. మిలింద్, మైలీన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చిత్రం సెట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే మనస్పర్థలు రావడంతో 2009లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మిలింద్ సోమన్ చాలామంది నటీమణులతో డేటింగ్ కొనసాగించారు. మోడల్ మధు సప్రే, నటి షహానా గోస్వామి, దీపానిత శర్మ, గుల్ పనాగ్ వంటి నటీమణులతో అతనితో రిలేషన్లో ఉన్నారు. కానీ చివరికీ వయసులో తనకంటే సగం చిన్నదైన అంకిత కున్వర్‌ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా.. దాదాపుగా పెళ్లయిన ఐదేళ్ల తర్వాత కూడా వీరి బంధం బలపడుతోంది. ఇటీవల ఇద్దరు తరచుగా ట్రావెలింగ్, ఫిట్నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. (ఇది చదవండి: సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!) క్యాబిన్ క్రూగా పనిచేసిన అంకిత మిలింద్‌ని పెళ్లి చేసుకునే ముందు అంకిత క్యాబిన్ క్రూ మెంబర్‌గా పనిచేసింది. పెళ్లికి కొద్ది రోజుల ముందే ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. అంకిత తరచుగా నన్ను పాపాజీ అని పిలుస్తుందని మిలింద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంకితను పెళ్లి చేసుకోవాలనే కోరికను బయటపెట్టినప్పుడు.. అతని తల్లి షాక్ అయ్యిందని తెలిపారు. ఇది విని అంకిత కుటుంబ సభ్యులు సైతం షాక్ తిన్నారని నటుడు వివరించాడు. కాగా.. మిలింద్ హిందీ కామెడీ షో ఖత్రోన్ కే కిలాడీ సీజన్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!
న్యూఢిల్లీ: మనం చిన్నప్పటి ఫోటోలను మన స్నేహితులకు చూపించి ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పు అని అడుగుతాం. కానీ వాళ్లు మనమే అని కూడా సరిగా గుర్తు పట్టలేరు కదా. ఎందుకంటే వయసు పెరుగుతుంటే కొంచెం కొంచెంగా శరీరంలో మార్పులు సంతరించుకోవడంతే కొంచెం పోల్చుకోవడం కష్టం అనిపిస్తోంది. మరికొంత మందిని ఈజీగా గుర్తుపట్టేయగలం. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) ఏంటి సోదీ అనుకోకండి ఇక్కడ ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడయోలో పోస్టు చేసి ఇతనెవరో గెస్ చేయండి ప్లీజ్ అంటు కామెంట్ జోడించి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచే మిలిందా ఈసారి తన చిన్ననాటి స్మృతులను తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది తాను ఆరేళ్ల వయసులో ఉండగా తీసిన పోటో అంటూ చెప్పుకొచ్చాడు. పైగా తాను ఆ వయసులో మంచి రైతు అవ్వాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు ఈ 50 ఏళ్ల వయసులో కృత్రిమంగా కూరగాయాలు ఎలా పండించాలో తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ప్రస్తుతం మిలింద్ సోమన్ మలైకా అరోరా అనూష దండేకర్‌తో కలిసి టీవీ రియాలిటీ షో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రెండవ సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు) -
Ankita Konwar: వృక్షాసనం నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే?
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్ భార్య అంకిత కోన్వర్ కు యోగా చేయడమంటే మహా ఇష్టమట. అంతేకాకుండా ఆమె తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్స్‌తో తరచూ పంచుకుంటుంది కూడా. ఐతే తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో యోగాసనాల్లో వృక్షాసనం తనకు ఇష్టమైన యోగా అని చెప్పుకొచ్చింది. ఈ పోస్టును చూసిన అభిమానుల నుంచి వేలసంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ పోస్ట్‌లో వైట్ స్లీవ్ లెస్ టీషర్ట్, రెడ్ కలర్ ఫ్యాంట్ ధరించి, వెనుక పచ్చని చెట్లు ఉన్న లొకేషన్లో వృక్షాసనంలో అంకిత కనిపిస్తుంది. తన పోస్ట్‌లో వృక్షాసనం వల్ల చేకూరే ప్రయోజనాలు, వేసే విధానం కూడా తెల్పింది. ‘యోగాసనాల్లో వృక్షాసనం నాకు ఇష్టమైనది. ఇది కాళ్లు, తొడలకు దృఢత్వాన్ని ఇస్తుంది. నాడి వ్యవస్థ కండరాలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రతను, చురుకుదనాన్ని వృద్ధి చేస్తుంది. ఈ ఆసనాన్ని వేసేటప్పుడు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ వెనుక భాగాన్ని నిటారుగా ఉంచండి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే పాదంతో మోకాలును నొక్కడం కూడా చేయకూడదు. మీ తొడభాగాన్ని నిటారుగా ఉంచండి’ అని.. ఆసనం వేసేటప్పుడు పాటించవల్సిన జాగ్రత్తలు కూడా వెల్లడించారు. ఐతే వ్యాయామం కోసం ప్రేరణ పొందాలనుకునే వారు అంకిత కోన్వార్ పోస్ట్‌లను ఫాలో ఐతేచాలు.. ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారని ఆమె చేసిన పలు పోస్టులను చూస్తే అనిపిస్తుంది. చదవండి: Brief Emotion: ఆపరేషన్ టైంలో ఏడ్చినందుకు ఏకంగా రూ.800ల బిల్లు ..! View this post on Instagram A post shared by Ankita Konwar (@ankita_earthy) -
బీఎంసీ పీఠమే లక్ష్యం.. సినీ నటులపై దృష్టిపెట్టిన కాంగ్రెస్
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటోంది. ఈసారి బీఎంసీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న శివసేనను ఎలాగైనా గద్దె దింపి తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. దీనికోసం సినీనటుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే రితేశ్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేరకు ముంబై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బీఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు పడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఎంసీ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పారీ్టలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఈ మిత్ర పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని శివసేన అంటుంటే, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలపడుతుందని ముంబై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చారు. అంతేగాక, దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. అది ఈ ఎన్నికల్లోనే జరగవచ్చని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఊహాగానాలను ఇప్పటికే సోనూ సూద్ తోసిపుచ్చారు. చదవండి : స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఉత్తర భారతీయులు, మైనారిటీ ఓట్లు ముఖ్యం కానున్నాయి. ప్రజల్లో నటీనటులపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రితేష్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని ముంబై కాంగ్రెస్ భావిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా శివసేనదే ఆధిపత్యం. దీంతో ఈసారి ఎలాగైనా శివసేన ఆధిపత్యానికి చెక్ పెట్టి, తమ పట్టు నిలుపుకోవాలని ముంబై కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. -
రాత్రిపూట రోడ్డు మీద స్నానం చేసిన బాలీవుడ్ నటుడు
Milind Soman: ప్రముఖ ఫిట్నెస్ ఫ్రీక్, నటుడు, మోడల్ మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. వర్కవుట్స్‌తో పాటు ఫన్నీ వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. తాజాగా అతడు ఓ ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. ఇందులో మిలింద్ సోమన్ నడిరోడ్డు మీద స్నానం చేశాడు. అది కూడా రాత్రిపూట. దేనిగురించైనా నిరసన చేస్తున్నాడేమో అనుకోకండి, అదేం కాదు! షూటింగ్లో భాగంగా ఇలా రోడ్డు మీద స్నానం ఆచరించాడు. ఓ వైపు వర్షం పడుతుండగా వేన్నీళ్లతో స్నానం చేశానని క్యాప్షన్ ద్వారా అసలు విషయం చెప్పేశాడు. పుషప్స్, రన్నింగ్స్తో పాటు ఇంకేదైనా చేయగలనా అని డౌట్ పడేవారికి ఈ వీడియోనే సమాధానమని పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మిలింద్ టర్కీబ్, 16 డిసెంబర్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ సినిమాలతో పాటు పచ్చైకిలి, సత్యమేవ జయతే, అలెక్స్ పాండియన్ వంటి దక్షిణాది చిత్రాల్లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
వృద్ధ నటుడితో పెళ్లి? అప్పుడేం చేశావ్?
ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. అంతేకాదు, తనకన్నా 26 ఏళ్లు చిన్నదైన అంకిత కొన్వర్ను వివాహం చేసుకుని గతంలో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఇదే విషయం గురించి ఓ నెటిజన్ అంకితను సూటిగా ప్రశ్నించాడు. వృద్ధుడిని పెళ్లి చేసుకోకూడదు అన్న భారతీయుల మూస ఆలోచనా ధోరణిని ఎలా ఎదుర్కొన్నారు? అని అడిగాడు. దీనికి అంకిత బదులిస్తూ.. "సమాజంలో జరిగే అసాధారణ విషయాల గురించి మాట్లాడేందుకు ప్రజలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అది ఒక్క భారత్‌లోనే కాదు అంతటా ఉంది. అయితే మనందరిలో నైపుణ్యాలు ఉంటాయి. కానీ దానివల్ల మంచి, చెడుకు మధ్య వ్యత్యాసం తెలుసుకోగలిగేంత స్పృహ లేదు. నేను మాత్రం నాకెప్పుడూ సంతోషాన్నిచ్చే పనులే చేశాను" అని చెప్పుకొచ్చింది. కాగా మిలింద్ పరిచయమవడానికి ముందు అంకితకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. అతడు సడన్‌గా మరణించడంతో ఆమె ఎంతో కుంగిపోయింది. అదే సమయంలో ఆమె ఉద్యోగరీత్యా చెన్నైకి రావాల్సి వచ్చింది. అక్కడ ఓ హోటల్లో బస చేస్తున్న సమయంలో అంకిత మిలింద్‌ను చూసింది. అప్పటికే మిలింద్కు అంకిత పెద్ద ఫ్యాన్. కానీ హాయ్ చెప్పడానికి వెళ్లిన ఆమెను బిజీగా ఉన్న మిలింద్ సరిగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత అతడు మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. అప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి. ఫ్రెండ్స్ ఎంకరేజ్‌మెంట్‌తో అతడితో కలిసి డ్యాన్స్ చేసింది అంకిత. అలా వారి ప్రేమ మొదలైంది. ఒకరోజు అంకిత తన గతాన్నంతా మిలింద్కు చెప్పింది. 'ఏ క్షణమైతే నీతో ప్రేమలో పడ్డానో, అప్పుడే నీకు సంబంధించిన ఏ విషయాన్నైనా స్వాగతిస్తాను అని ఫిక్సయ్యా. నీ గత జ్ఞాపకాల భారాన్ని నేనూ మోస్తాను. మనం కలిసే ఉందాం' అని ఆమె చేయి పెట్టుకున్నాడు. అలా 2018లో వీరి వివాహం జరిగింది. అప్పుడు మిలింద్ వయసు 52 కాగా అంకిత వయసు 26 ఏళ్లు మాత్రమే. ప్రేమకు వయసు అక్కర్లేదని మనసులు కలిస్తే చాలని పెళ్లి చేసుకుని నిరూపించారు మిలింద్, అంకిత. చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్ -
రోజుకు 20 నుంచి 30 సిగరెట్లు తాగేవాడిని: నటుడు
50 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ యంగ్ హీరోలకే సవాళ్లు విసిరే నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా అతడు తనకు గతంలో ఉన్న చెడు అలవాటు గురించి వెల్లడించాడు. "పొగాకు ప్రతి యేటా ప్రపంచంలోని ఎనభై లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. మే 31న జరుపుకునే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నాకు ఎప్పుడూ ఒకటి గుర్తు చేస్తూ ఉంటుంది" "32 ఏళ్ల వయసులో కెప్టెన్ వ్యోమ్ సిరీస్ చేస్తున్నప్పుడు సిగరెట్లు తాగడం బాగా అలవాటైంది. రోజుకు 20 నుంచి 30 సిగరెట్లు కాల్చేవాడిని. చాలా తక్కువ కాలంలోనే పొగాకుకు బానిసనయ్యాను. కానీ అదృష్టవవాత్తూ దానివల్ల నాకు ఎటువంటి మేలు జరగదని తెలుసుకుని పొగ తాగడం మానేసాను" అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన అతడు సిగరెట్‌ను ముక్కలు చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. ఇది చూసిన అభిమానులు ఒకప్పుడు పొగాకుకు బానిసగా మారి దాన్ని త్యజించడం అంటే అంత మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్ -
సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్
సెలబ్రిటీలు అన్నాక సెల్ఫీలు అడగడం కామన్. ముఖ్యంగా సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు జనాలు. వాళ్లు కూడా సాధ్యమైనంత వరకు అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలు ఇచ్చి వెళ్లిపోతారు. కానీ ఓ నటుడు మాత్రం తనను సెల్ఫీ అడిగిన ఓ మహిళతో పుషప్లో చేయించాడు. ఆయన చేసింది మంచి పనే అయినా.. ఇప్పుడు ట్రోలింగ్కి గురయ్యాడు. ఆ వివరాలేంటో చూద్దాం. ఇండియన్ టాప్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ గురించి అందరికి తెలిసిందే. 80, 90 దశకాల్లో టాప్ మోడల్ ఆయన. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. 53 ఏళ్ల మిలింద్.. మూడేళ్ల క్రితం తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తరచుగా తన సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యం సూత్రాలు పంచుతూ ఫిట్నెస్ను ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ఫిట్నెస్ చిట్కాలు పంచుకుంటూ ఉంటాడు కూడా. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ వీడియోలో సెల్ఫీ అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని అడగడంతో ఆమె వెంటనే పుషప్‌లు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఓ ప్లేస్ లో సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని చెప్పుకొచ్చాడు. తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు. అయితే ఆ మహిళ చీర ధరించి, అది కూడా రోడ్డు మీద పుషప్ లు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘ఫిట్నెస్ కోసం పుష్-అప్లు చేయడం ఖచ్చితంగా మంచిదే, కానీ మీరు మీతో సెల్ఫీ తీసుకోవటానికి ఇలా ఒక స్త్రీని రోడ్డు మీద పుష్-అప్లు చేయించడం బాలేదు’అని ఒక నెటిజన్, ఢ‘శారీరక వ్యాయామం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది అయితే, ముందస్తు అనుభవం లేకుండా ఈ వయసులో పుష్-అప్స్ చేయమని అకస్మాత్తుగా చెప్పడం సరికాదు’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
ఘనంగా పరూల్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం
-
రొమాంటిక్ ఫొటో: నాకిష్టమైన ప్రదేశం ఇదే..!
ముంబై: ‘‘ఏడేళ్ల ప్రయాణంలో ప్రపంచమంతా చుట్టివచ్చాం. సముద్ర గర్భంలోకి వెళ్లాం. శిఖరాల అంచుల వరకు వెళ్లగలిగాం. దేశ విదేశాలను సందర్శించాం. అడవుల్లో విహరించాం. పడవల్లో తిరిగాం. ఎడారులు, అగ్నిపర్వతాలు.. ఇలా అన్నీ చూశాం కదా. మరి నాకిష్టమైన ప్రదేశం ఏమింటే.. ఇదిగో ఇక్కడే.. నీ బాహువుల్లో(చేతుల్లో) ఇలా ప్రశాంతంగా నిద్రపోవడం అంటే ఇష్టం... ఎప్పటికీ అంతంకాని మన ప్రేమకు.. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నెన్నో’’ అంటూ నటుడు మిలింద్ సోమన్ తన భార్య అంకిత కొన్వార్‌పై ప్రేమను చాటుకున్నాడు. తమ ప్రేమ బంధానికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాలో సతీమణి ఆలింగనంలో సేదతీరుతున్న ఫొటో షేర్ చేసి ఈ మేరకు క్యాప్షన్ జతచేశాడు. ఇక ఇందుకు స్పందనగా అంకిత సైతం భర్త మిలింద్ రాసిన వాక్యాల్లోని ప్రదేశాలను ప్రతిబింబించేలా ఆయా చోట్ల తాము దిగిన ఫొటోలు పోస్ట్ చేశారు. ఏడేళ్లు ఒక్క క్షణంలా గడిచిపోయాయి. ఈ జ్ఞాపకాలు కలకాలం ఇలాగే నిలిచిపోతాయి. నా ప్రేమమూర్తిగా ఉన్నందుకు థాంక్యూ’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో.. ‘‘మీ ఇద్దరి బంధం చిరకాలం ఇలాగే వర్ధిల్లాలలి’’అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఈ జంట ఒకరినొకరు తొలిసారిగా కలుసుకున్నారు. ఈ క్రమంలో 2018 ఏప్రిల్‌లో పెద్దల అంగీకారంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా వీరిద్దరి మధ్య 26 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో ట్రోలింగ్ బారినపడ్డారు. కూతురు వయస్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని మిలింద్(55)పై, యువకుడు దొరకలేదా అంటూ అంకితపై కొంతమంది నెటిజన్లు విద్వేష విషం చిమ్మారు. కానీ ఇవేమీ పట్టించుకోమని, వయసు ఒక నంబర్ మాత్రమేనంటూ తేలికగ్గా కొట్టిపారేశారు ఈ లవబుల్ కపుల్. నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. నిజానికి మిలింద్‌ను కలవడానికి ముందు అంకిత ఓ వ్యక్తిని ప్రేమించారు. అయితే హఠాత్తుగా అతడు మరణించడంతో తీవ్రంగా కుంగిపోయారు. ఈ క్రమంలో చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తున్న సమయంలో మిలింద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ, ఆపై పరిణయం వరకు దారితీసింది. ఇక మిలింద్కు గతంలో ఫ్రెంచ్ మహిళ్లతో పెళ్లి కాగా ఇద్దరూ విడిపోయారు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
అక్షయ్ బాటలో మిలింద్.. తొలిసారి ఆ పాత్రలో!
ప్రముఖ ఫిట్నెస్ ఫ్రీక్, నటుడు, మోడల్ మిలింద్ సోమన్ మరో వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘పౌరాష్పూర్’ అనే పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లో మిలింద్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన జీ న్యూస్, ఏఎల్టీ బాలాజీలో ప్రసారం కానుంది. ఇక ఈ సీరిస్ చారిత్రక రాజ్యం, కుట్రలు, రాజకీయాలు, లింగ యుద్ధం నేపథ్యం ఆధారంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ను వెల్లడిస్తూ ఫస్ట్ లుక్‌ను మిలింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పౌరాష్పూర్ సినిమాలో మిలింద్ .. థర్డ్‌జెండర్ అయిన బోరిస్ పాత్ర పోషిస్తున్నారు. చదవండి: విభిన్న లుక్‌లో మిలింద్ సోమన్! ఈ పోస్టర్లో మిలింద్ ముఖానికి పెద్దగా కుంకుమ బొట్టు, మెడలో బంగారు అభరణం ధరించి, చేతిలో కత్తి పట్టుకొని పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. "పౌరాష్‌పూర్‌లోని ట్రాన్స్ జెండర్‌ను ప్రపంచంలో ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. శక్తి పోరాటం. గొప్ప తెలివి, మనస్సు, వ్యక్తిత్వం, ఇవ్వన్నీ పౌరాష్‌పూర్‌లోని బోరిస్‌కు సొంతం’. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు తెలిపాడు. కాగా పౌరాష్‌పూర్‌లో శిల్పా షిండే, షాహీర్ షేక్, సాహిల్ సలాథియా, అన్నూ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. చదవండి: బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా.. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?!
ముంబై : నటుడు, మోడల్ మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తాడు. ఈ క్రమంలో మంగళవారం ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేశాడు. ముఖానికి సగం వరకు ఎరుపు రంగు పులుముకొని, పెద్ద ముక్కు పుడక, కళ్లకు కాటుకతో విభిన్న లుక్‌లో కనిపించాడు. ‘‘-మంగళవారం ప్రయాణం! ఇది హోళీ పండుగ సమయం కాదని నాకు తెలుసు. అయితే నేను గత కొన్ని రోజులుగా ముంబై సమీపంలోని కర్జాత్‌లో కొన్ని సరదా పనులు చేస్తూ ఉన్నా. వాటినే ఇలా మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు నేను చెన్నై వెళ్తున్నా’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇక మిలింద్ సరికొత్త లుక్‌పై స్పందించిన నెటిజన్లు.. అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మి’(కాంచన రీమేక్) సినిమాలోని ఫోటోలా ఉందని, ఇందులో మీరు నటించారా లేదా ఆ క్యార్టెర్పై ఉన్న ఇష్టంతో ఇలాంటి ఫొటో తీసుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా కొత్త లుక్ బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఆయన సతీమణి అంకితా కొన్వర్ సైతం ఈ ఫొటో అద్భుతంగా ఉంది అని భర్తపై ప్రేమను చాటుకున్నారు.(చదవండి: బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా..) కాగా ఇటీవల గోవా బీచ్‌లో మిలింద్ నగ్నంగా పరుగెడుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అంకితా కొన్వర్ తీసిన ఫోటోను ‘హ్యాపీ బర్త్‌డే టు మీ 55’ అనే కాప్షన్‌తో షేర్ చేయగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు గోవా సురక్షా మంచ్ అనే సంస్థ పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యంగా ప్రవర్తించారంటూ మిలింద్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమాచార సాంకేతిక చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్లతో పాటు, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 కింద కేసు నమోదు చేసినట్లు గోవా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇక, సినీ నటి పూనం పాండే గోవాలో అశ్లీల వీడియో చిత్రీకరించిందనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. View this post on Instagram Travel Tuesday! I know its not holi but spent the last few days in Karjat near Mumbai doing some fun things - will share more soon 😋 now off to Chennai! A post shared by Milind Usha Soman (@milindrunning) on Nov 9, 2020 at 7:23pm PST -
బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా..
ముంబై : మోడల్, నటుడు మిలింద్ సోమన్ బీచ్‌లో నగ్నంగా పరిగెడుతున్న వివాదాస్పద చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సినీ నటి పూజా బేడీ సమర్థించారు. నిజానికి ఆ ఫోటో చూడటానికి అంత అశ్లీలంగా ఏమీ లేదని, అది అతని సౌందర్యమని ఆమె అభివర్ణించింది. మిలింద్ చిత్రాన్ని ట్విట్టర్లో నాగ సాధువులతో పోల్చి, వీరు బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేనప్పుడు, మిలింద్ ఫోటోలో కూడా కచ్ఛితంగా ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు. ‘‘అశ్లీలత అనేది చూసే వారి దృష్టిలో ఉంటుంది. అందంగా కనిపించడం, ఫేమస్ అవడం, తనకు ఒక బెంచ్ మార్క్‌ను ఏర్పాటు చేసుకోవడం అతను చేసిన నేరమా.? ఒకవేళ నగ్న చిత్రమే నేరమైతే నాగ బాలందరినీ అరెస్ట్ చేయాలి. బూడిద పూసుకొని తిరగడం ఆమోదయోగ్యం కాదని’’ ఆమె ట్వీట్ చేశారు. కాగా, మిలింద్ తన 55 వ పుట్టిన రోజున గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెత్తుతున్నప్పుడు అతని భార్య అంకితా కొన్వర్ తీసిన ఫోటోను, ‘‘హ్యాప్పీ బర్త్‌డే టు మీ 55’’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోను అప్లోడ్ చేసినందుకు మిలింద్‌పై అశ్లీలతకు కేసు నమోదయ్యింది. సమాచార సాంకేతిక చట్టంలోని ఇతర సంబంధిత విభాగాలతో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (అశ్లీలత) కింద కేసు నమోదు చేసినట్లు దక్షిణ గోవా పోలీస్ సూపరిండెంట్ పంకజ్ కుమార్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌తో చెప్పారు. ఇటీవల ఇదే తరహాలో మోడల్, నటి పూనం పాండే కూడా అభ్యంతరకరమైన వీడియో చిత్రీకరించినందుకు, ఆమెను, ఆమె భర్త సామ్‌ను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరవై వేల రూపాయల బెయిల్ బాండ్ విధించారు. కెనకోనా న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, అన్ని నగ్న చిత్రాలను అశ్లీలంగా పరిగణించలేమని అన్నారు. ‘‘ఇలాంటి ప్రాతినిథ్యం కలిగిన కళను ప్రదర్శించేటప్పుడు దీన్నొక మినహాయింపుగా గమనించడం ముఖ్యం. చలన చిత్రాలను రూపొందించటమనేది ఒక కళాత్మక ప్రయోగం. వాస్తవాలు, పరిస్థితులను బట్టి నగ్నత్వం అంతా అశ్లీలమని ఒక నిర్ణయానికి రాకూడదని’’ ఆయన అన్నారు. -
మిలింద్ సోమన్ అరెస్ట్, వారు శాంతించారు!
పనాజీ: మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్ మీద అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలతో గోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. బుధవారం నాడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఫిట్నెస్ను ప్రపంచానికి చూపించడం కోసం బీచ్‌లో బట్టులు లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా మిలింద్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలో మిలింద్ ఫిట్నెస్ను చూసి నెటిజన్లందరూ వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మిలింద్ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని గోవా సురక్షా మంచ్ ఆయన మీద ఫిర్యాదు చేసింది. దీంతో గోవా పోలీస్ స్టేషన్లో ఆయన మీద సెక్షన్ 294( పబ్లిక్ ప్లేస్‌లో అశ్లీలంగా ప్రవర్తించడం), ఐటీ యాక్ట్ 67 కింద ఆయన మీద కేసు నమోదయ్యింది. ఇదిలా వుండగా మిలింగ్ తన న్యూడ్ ఫోటోలను షేర్ చేసినప్పుడు పూనమ్ పాండే గవర్నమెంట్ ఆస్తులలో ఆశ్లీలమైన ఫోటో షూట్లో పాల్గొందని ఆమెపై కేసు నమోదయ్యింది. అనంతరం చాలా మంది ఆమె అభిమానులు పాండేకు ఒక న్యాయం, మిలింద్కు ఒక న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు మిలింద్ మీద కూడా కేసు నమోదు కావడంతో దీనికి సంబంధించి మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మిలింద్ ఫోటో పెట్టి సమానమంటే సమానమే అని కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు పూనమ్‌కు మద్దతుగా నిలిచిన వారి మనసు ఇప్పుడు చల్లబడి ఉంటుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: బర్త్‌డే స్పెషల్.. బీచ్‌లో బట్టలు లేకుండా.. -
మరోసారి బుక్కైన మిలింద్ సోమన్
పనాజీ: మొన్న వివాదాస్పద ఫోటోషూట్ వివాదంలో మోడల్ నటి పూనం పాండే, ఆమె భర్తపై కేసు నమోదు కాగా ఇలాంటి మరో వివాదంతో తాజాగా మరో మోడల్ నటుడు మిలింద్ సోమన్(55) బుక్కయ్యారు. ఈ నెల 4వ తేదీన పుట్టిన రోజు సందర్బంగా గోవాలోని ఒక బీచ్‌లో నగ్నంగా పరిగెట్టిన ఫోటో వైరల్ కావడంతో మిలింద్ఫై శుక్రవారం కేసు నమోదైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద కొల్వా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోవా సూరక్ష మంచ్ అనే సంస్థ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ తెలిపారు. (బర్త్‌డే స్పెషల్.. బీచ్‌లో బట్టలు లేకుండా..) అనంతరం మిలింద్ సోమన్‌కు బెయిల్ లభించింది. వీడియోలు లేదా చిత్రాలు, ప్రొఫెషనల్ షూట్ వారి వారి వ్యక్తిగత విషయాలు. అయినప్పటికీ, ఏదైనా అభ్యంతరం, ప్రజా ఆగ్రహం వ్యక్తమైతే తప్ప అశ్లీలం లేదా అనైతికమైనవిగా చెప్పలేమని, భావ వ్యక్తీకరణ రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని బెయిల్ ఉత్తర్వులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కెనకోనా అభిప్రాయపడ్డారు. మరోవైపు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంపై మిలింద్ ఇంకా స్పందించలేదు. కాగా మోడలింగ్ రంగ సంచలనం మిలింద్ సోమన్‌కు వివాదాలు కొత్తేమీకాదు. ఈ తరహా ఆరోపణలను ఎదుర్కోవడం ఇది రెండవసారి. తొలిసారి బాలీవుడ్ నటి మధు సాప్రేతో కలిసి చేసిన కండోమ్ యాడ్అప్పట్లో పెద్ద సంచలనమే. 1995లో మధుసాప్రేతో కలిసి నగ్నంగా కొండ చిలువను మెడలో వేసుకొని నటించడం సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ కేసులో14 సంవత్సరాల న్యాయ విచారణ తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించడం గమనార్హం. -
బర్త్‌డే స్పెషల్.. బీచ్‌లో బట్టలు లేకుండా..
ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ తన 55వ ఏట అడుగుపెట్టారు. అయితే ఈ సందర్భంగా ఈ వయసులో కూడా తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో తెలిపేలా ఉండే ఒక పిక్‌ను మిలింగ్ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఉదయం పూట బీచ్‌లో రన్‌చేస్తూ తన పుట్టిన రోజును ఆహ్వానించాడు మిలింగ్. అయితే దీంట్లో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఒంటి మీద నూలిపోగు లేకుండా రన్ చేశారు. 55వ యేట అడుగుపెట్టినప్పటికి తాను చాలా ఫిట్‌గా ఉన్నాను అని ప్రపంచానికి తెలియజేయడానికే మిలింగ్ తన పూర్తి శరీరాన్ని చూపిస్తూ ఫోటోకు ఫోజిలిచ్చారు. అయితే ఈ ఫోటోలు తీసింది తన భార్యే అని ఆయన తన సోషల్ మీడియాలో తెలిపారు. Happy birthday to me 😀 . . . 55 and running ! 📷 @5Earthy pic.twitter.com/TGoLFQxmui — Milind Usha Soman (@milindrunning) November 4, 2020 ఈ ఫోటోలో తమ అభిమాన నటుడి ఫిట్నెస్ చూసి ఆయన ఫ్యాన్స్ చాలా మంది సంతోషపడుతుంటే మరికొంత మంది మాత్రం ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. లోదుస్తుల బొమ్మలు పెడుతూ ఇదిగోండి ఇవి వేసుకోండి అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో మీమ్‌లో లాలుప్రసాద్ యాదవ్ మిలింద్కు లోదుస్తులు ఇస్తున్నట్లు ఉంది. ఈ మీమ్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతూ నవ్వులు పూయిస్తున్నాయి. ఇవే ఫోటోలను సోమన్ భార్య అంకిత కోన్వర్ కూడా షేర్ చేస్తూ తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్.. -
అప్పట్లో చచ్చేంత సిగ్గు: నటుడు
బాలీవుడ్ నటుడు, ప్రముఖ మోడల్ మిలింద్ సోమన్ మోడలింగ్‌లోకి అడుగు పెట్టకముందు ఎలా ఉండేవారు? ఈ ప్రశ్నే చాలామందికి రావడంతో నేరుగా మిలింద్‌నే అడిగేసరికి ఆయన మోడలింగ్‌లోకి రాకముందు దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లో తనకు చచ్చేంత సిగ్గన్న విషయాన్ని వెల్లడించారు. అసలు ఫొటో దిగాలంటేనే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదన్నారు. ఆనాటి ఫొటో చూసి అవాక్కయిన అభిమానులు మిలింద్‌లో మార్పులను విశ్లేషిస్తూ ఆయనను పొగడకుండా ఉండలేకపోతున్నారు. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి) "కెమెరా ముందుకు రావాలంటే సిగ్గుపడే వ్యక్తి ఇప్పుడు కెమెరానే ప్రేమిస్తున్నాడు" అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. "మీరు అప్పటికీ ఇప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నారు", "మీరొకసారి పెరిగిన గడ్డాన్ని తీసేసి, క్లీన్ షేవ్ చేసుకుని, నెరిసిన జుట్టుకు నల్ల రంగేసారనుకోండి.. మళ్లీ మీ పాత లుక్ మీకు తిరిగొస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆరుబయట కుర్చీల్లో వాలిపోయిన మిలింద్ దంపతులు కునుకు తీస్తూ ప్రకృతిలో సేదతీరుతున్న ఫొటోను సైతం ఈ మోడల్ షేర్ చేశారు. కాగా మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. "మేడ్ ఇన్ ఇండియా" మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. (‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’) View this post on Instagram Some people wanted to see a throwback pic from pre modeling days, so here it is ! It's a rare one, taken sometime in the late eighties, and like I said, being very shy, I was not a fan of being photographed 😀 I might have been just out of college! . . . #throwbackthursday A post shared by Milind Usha Soman (@milindrunning) on Aug 6, 2020 at 4:53am PDT -
82వ వసంతంలోకి ఉషా సోమన్
న్యూఢిల్లీ : పుష్-అప్స్, లాంగ్రన్స్తో ఫిట్‌నెస్‌లో తనకు తానే సాటిగా నిరూపించుకున్న ఉషా సోమన్ 82వ వసంతంలోకి అడుగుపెట్టారు. బర్త్‌డే సందర్భంగా ఒకేసారి ఏకధాటిగా 15 పుష్అప్స్ చేసి మరోసారి తన మార్క్ చూపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బామ్మగారి ఫిట్నెస్కి ఎంతోమంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఫిట్నేస్ ప్రియులకు గట్టి పోటినిస్తూ సవాలు విసురుతున్న ఉషా సోమన్.. మన టాప్ ఇండియన్ మోడల్ మిలింద్ సోమన్ తల్లి. . గతంలోనూ మిలింద్ భార్య అంకితా కొన్వర్తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్ జంప్స్ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్-అప్స్, వర్కఅవుట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉష సోమన్ తన కొడుకు మిలింద్‌తో కలిసి చీరలో పుష్-అప్లు చేస్తున్న వీడియో కూడా ఫిట్నెస్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల ఉష, తన కొడుకు మలింద్కు పోటీగా ఒకేసారి 16 పుష్-అప్లు చేసిన వీడియోను ఉమెన్స్ డే సందర్భంగా షేర్ చేశాడు. అలాగే 2016లో మహరాష్ట్రలోని నిర్వహించిన ఓ మరథాన్‌లో మలింద్తో పాటు ఆయన తల్లి ఉష కూడా పాల్గొన్న వీడియో మదర్స్ డే సందర్భంగా పంచుకున్నాడు. ఇలా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన ఫిట్నెస్తో యువతతో పాటు వృద్ధులకు కూడా సవాలుగా నిలిచిన తన తల్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను తరచూ మలింద్ సోషల్ మీడియాలో పంచుకంటుంటాడు. (వైరల్: సినిమాను తలపించే పోలిస్ ఛేజింగ్! ) View this post on Instagram 3rd July 2020. 81 amazing years celebrated with birthday in lockdown. Party with 15pushups and a jaggery vanilla almond cake baked by @ankita_earthy 😀 happy birthday Aai 🤗🤗🤗 keep smiling !! . . . #livetoinspire #keepmoving #neverstop #FitnessAddict #love #health #happybirthday A post shared by Milind Usha Soman (@milindrunning) on Jul 4, 2020 at 11:48pm PDT -
భార్యతో ఫైట్ చేస్తున్న నటుడు
అస్సామీ ప్రజలు నేడు నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తున్నారు. ఈ సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన "రొంగాలీ బిహు" వేడుకను ఎవరింట్లో వాళ్లు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. ఇతర ప్రదేశాల్లో చిక్కుక్కున్న అస్సామీ వాసులు స్వస్థలాలకు వెళ్లలేకపోతున్నారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ విచారం వ్యక్తం చేశాడు. అతని భార్య అంకితా తివారీ అస్సామీవాసి. ఆమెకు కుటుంబంతో కలిసి పండగను ఆస్వాదించాలని ఉన్నప్పటికీ లాక్డౌన్ వల్ల వెళ్లలేని పరిస్థితి. దీంతో ఈ జంట ముంబైలోని తమ నివాసంలో "బిహు" వేడుకలు జరుపుకుంది. సాంప్రదాయ దుస్తువులు ధరించిన వీళ్లిద్దరూ గుడ్లతో ఫైట్ చేస్తుండగా అతని తల్లి ఉషా సోమన్ వీళ్లిద్దరినీ కెమెరాలో బంధించింది. (మధురమైన జ్ఞాపకం: రంభ) ఈ ఫొటోను మిలంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "అంకిత గువహటిలో ఉన్న తన పుట్టింటి వారిని మిస్ అవుతోంది. మనసులో ఆ ఖాళీని పూరించేందుకు ఇలా గుడ్లతో ఫైట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలాగే.. ఇంటిని, స్నేహితులను, ఇష్టమైనవారిని మిస్ అవుతున్నామనుకునేవాళ్లు ఈ క్షణాన్ని ఆస్వాదించండి. త్వరలోనే మీరు మళ్లీ కలుసుకుంటారు" అని ఆయన రాసుకొచ్చాడు. కాగా మిలింద్ 80, 90 దశకాల్లో ఎన్నో యాడ్స్‌లో నటించాడు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీ పాపులారిటీని సంపాదించాడు. ఆయన తనకన్నా 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. (వ్యవసాయం చేస్తున్నా: హీరోయిన్ భూమి ఫడ్నేకర్) -
ఎనిమిది పదుల వయసులో కూడా..
-
ఆశ్చర్య పరుస్తున్న బామ్మ ఫిట్నెస్!
న్యూఢిల్లీ: ఓ వృద్ధురాలు తన ఒంటి కాలిపై గెంతడమే కాకుండా చీరలోనూ పుష్-అప్స్, లాంగ్‌రన్‌లు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 81 ఏళ్ల వయసులో కూడా ఫిట్నేస్ ప్రియులకు గట్టి పోటినిస్తూ సవాలు విసురుతున్న ఈ వృద్దురాలు ఎవరో కాదు.. మన టాప్ ఇండియన్ మోడల్ మిలింద్ సోమన్ తల్లి ఉష సోమన్. మిలింద్ భార్య అంకితా కొన్వర్తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్ జంప్స్ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్-అప్స్, వర్కఅవుట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంకిత తన అత్తతో కలిసి బాక్స్ జంప్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్ చేస్తూ.. ‘మీరు చాలా మందికి ఆదర్శం. ఒకవేళ నేను 80 ఏళ్ల వరకూ జీవించి ఉంటే మీలా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్న’అంటూ రాసుకొచ్చారు. (‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’) అంతేకాదు ఉష సోమన్ తన కొడుకు మిలింద్‌తో కలిసి చీరలో పుష్-అప్లు చేస్తున్న వీడియో కూడా గతంలో వైరల్ అయ్యింది. ఇటీవల ఉష, తన కొడుకు మలింద్కు పోటీగా ఒకేసారి 16 పుష్-అప్లు చేసిన వీడియోను ఉమెన్స్ డే సందర్భంగా షేర్ చేశాడు. అలాగే 2016లో మహరాష్ట్రలోని నిర్వహించిన ఓ మరథాన్‌లో మలింద్తో పాటు ఆయన తల్లి ఉష కూడా పాల్గొన్న వీడియో మదర్స్ డే సందర్భంగా పంచుకున్నాడు. ఇలా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన ఫిట్నెస్తో యువతతో పాటు వృద్ధులకు కూడా సవాలుగా నిలిచిన తన తల్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను తరచూ మలింద్ సోషల్ మీడియాలో పంచుకంటుంటాడు. కాగా యంగ్ మోడలైనా అంకితా కొన్వర్, తన తల్లి వయస్సున్న మిలింద్‌ను 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫిట్నెస్ ప్రియుడైన మిలింద్ వివిధ మారథాన్‌లో చురుగ్గా పాల్గొంటు ఉంటాడు. -
ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?
ఎలాంటి మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపించేందుకు అవసరమయ్యే ఎన్నో యాప్‌లు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏ ఫొటో పోస్ట్ చేయాలన్నా దాన్ని కాసింతైనా ఎడిట్ చేయందే సోషల్ మీడియాలో పెట్టే సాహసం చేయట్లేదు చాలా మంది. అయితే ఈ పని సెలబ్రిటీలు కూడా చేస్తారా అంటే ఓ నటుడి భార్య షేర్ చేసిన ఫొటో చూస్తుంటే అవుననే తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రబళుతున్న వేళ ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ పుణ్యమాని నటుడు మిలింద్ సోమన్ తన భార్య అకింతా కోన్వార్తో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమె గతేడాది బికినీ ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. (అశ్లీల వీడియోల పేరుతో నమితకు బెదిరింపు) అయితే గతేడాది వేసవి కాలానికి ఇప్పటి సమ్మర్‌కు పరిస్థితులు ఎంతగానో మారిపోయాయని అభిప్రాయపడింది. "గతేడాది వేసవిలోనూ చల్లదనాన్ని ఆస్వాదించాను. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. ఎటువైపు వెళుతున్నామో.." అంటూ ఆశ్చర్యాన్ని కన బర్చుతూ తాను బికినీ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోపై ఆమె అభిమాని ఓ సందేహాన్ని లేవనెత్తాడు. "చర్మ రంగు కాంతివంతంగా కనిపించేలా ఫొటోను అంతలా ఎందుకు ఎడిట్ చేశారు? మీ చామనఛాయ రంగే మాకు నచ్చుతుంద"ని చెప్పుకొచ్చాడు. దీనికి అంకితా స్పందిస్తూ.. ఇది కేవలం ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ అని తేలికగా సమాధానమిచ్చింది. క్వారంటైన్ వేళ ఆమె తన భర్తతో కలిసున్న ఫొటోలను సైతం పంచుకుంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. (కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!) -
‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’
తన నాన్న చనిపోయినప్పుడు పెద్ద బాధ పడలేదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్. తన తండ్రిపై పెద్దగా అభిమానం కూడా లేదన్నారు. ఇటీవల ఆయన రాసిన ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ మెమోయిర్’ బుక్‌లో ఈ విషయాలు వెల్లడించారు. ఇక తన నాన్నతో ఆయనకు ఉన్న రిలేషన్షిప్ గురించి సోమవారం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. తన తండ్రిని ఎప్పుడూ అభిమానించలేదని చెప్పుకొచ్చారు. (చదవండి : వారి పెళ్లి అయిపోయింది!!) ‘1995 సంవత్సరం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆ ఏడాది నాకు తీపి, చేదు రెండు జ్ఞాపకాలను అందించింది. 1995 జనవరిలో మా నాన్న మృతి చెందారు. ఆయన మృతి నాకు పెద్దగా బాధ కలిగించలేదు. మిశ్రమ భావాలు నాలో కలిగాయి. మా నాన్నపై నాకు ఎప్పుడూ అభిమానం లేదు. ఆయన మాత్రం నాపై ప్రేమను చూపించాడు. అతను చనిపోయే ఐదు సంవత్సరాల ముందే మా ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలో నాకు పెద్ద ఉపశమనం కలిగినట్లు భావించాను. కానీ ఆయన చనిపోయే రోజు అంబులెన్స్‌లో నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే నాకు చాలా బాధ కలిగింది. నాన్నతో నా భావోద్వేగాలను పంచుకోవాలనుకున్నాను కానీ కుదర్లేదు’ అని మిలింద్ చెప్పుకొచ్చారు. ఇక తండ్రి మృతి చెందిన కొద్ది రోజులకు ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మ్యూజిల్ వీడియో‘ మేడ్ ఇన్ ఇండియా’ విడుదలైంది. దీనితో మిలింద్కు పాపులారిటీ పెరిగిపోయింది. దీని గురించి కూడా మిలింద్ వివరించారు. ‘ నాన్న మృతి చెందిన కొద్ది రోజులపై ‘ మేడ్ ఇన్న ఇండియా’ విడుదలైంది. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ మ్యూజిక్ వీడియోతో నా జీవితంలో శాంతి నెలకొంది. నన్ను సూపర్ మోడల్‌గా, హీరోగా నిలబెట్టింది. అందుకే నా జీవితంలో 1995 ముఖ్యమైన సంవత్సరం’ అని మిలింద్ వివరించారు. మిలిందర్ భాగోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ మీ తండ్రి పట్ల మీకు ఉన్న అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పారు. ఇలాంటి పోస్ట్ పెట్టాలందే ధైర్యం ఉండాలి’, మీ మనసు చెప్పింది మీరు రాశారు’ అని కామెంట్లు చేస్తున్నారు. మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. 53 ఏళ్ల మిలింద్.. తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
జాలీగా శారీ రన్..
ఖైరతాబాద్: తెలుగుదనం ఉట్టిపడింది. మహిళలు, పిల్లల సంప్రదాయ చీరకట్టు ఆకట్టుకుంది. వందలాది మందితో నెక్లెస్ రోడ్డు కళకళలాడింది. పింకథాన్ మూడో ఎడిషన్ శారీ రన్ ఆద్యంతం అలరించింది. ఆదివారం తనైరా, పింకథాన్ మూడో ఎడిషన్‌లో భాగంగా జలవిహార్ నుంచి సంజీవయ్య పార్క్ మీదుగా తిరిగి జలవిహార్ వరకు నగరంలో తొలిసారిగా శారీ రన్ నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి సుమారు 3 వందల మంది మహిళలు చీరలు ధరించి రన్లో పాల్గొన్నారు. మహిళల ఫిట్‌నెస్‌కు మద్దతు తెలుపుతూ నిర్వహించిన రన్‌ను నటుడు, మోడల్ అల్ట్రామ్యాన్ మిలింద్ సోమన్ జెండా ఊపి ప్రారంభించారు. డోంట్ హోల్డ్ బ్యాక్ అనే నినాదంతో నిర్వహించిన శారీ రన్లో భాగంగా జుంబా సెషన్, కర్రసాము, వ్యాయామంతో మహిళలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మిలింద్ సోమన్ మాట్లాడుతూ.. మహిళల్లో ఫిట్నెస్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా శారీ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి భారతీయ మహిళకూ చీరతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పింకథాన్ వంటి కార్యక్రమాలతో దేశంలో మహిళా సమాజాన్ని శక్తిమంతంగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారతతోనే ఆరోగ్యకర కుటుంబం, సమాజం, దేశంగా మారుతాయన్నారు. చీరకట్టుతో ఎంతో ఉత్సాహంగా శారీ రన్లో పాల్గొనడం ఆనందం కలిగించిందని మహిళలు తెలిపారు. -
తను చనిపోయాడు; మీరు అదృష్టవంతురాలు!
తన కంటే దాదాపు 26 ఏళ్లు పెద్దవాడైన నటుడు మిలింద్ సోమన్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అంకితా కొన్వార్. గతేడాది ఏప్రిల్‌లో తన చిరకాల ప్రేమికుడితో ఏడడుగులు వేసిన అంకిత తీరుపై పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. యువకులు ఎవరూ దొరకలేదా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. అయితే ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, తన పట్ల మిలింద్కు ఉన్న ప్రేమ కారణంగానే వివాహ బంధంలో అడుగుపెట్టానని అంకితా పేర్కొంది. మిలింద్‌తో ప్రేమ, పెళ్లి, ఈ క్రమంలో ఎదురైన అవాంతరాల గురించి హ్యూమన్స్ బాంబే ఫేస్బుక్ పేజ్‌లో ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తను చనిపోయాక మలేషియా వెళ్లాను.. ‘ నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి మరణించిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. మలేషియాలోని ఎయిర్ ఏషియా కాబిన్ క్రూ మెంబర్‌గా పని చేయడం ప్రారంభించాను. తను చనిపోయిన తర్వాత నా గుండె పగిలిపోయింది. ఇక గాయం ఎప్పటికీ మానదేమో అనుకున్నాను. అయితే కొన్ని నెలల తర్వాత చెన్నైకి వచ్చిన నాకు మిలింద్‌తో పరిచయం ఏర్పడింది. చెన్నైలో కొలీగ్స్‌తో కలిసి హోటల్లో ఉండేదాన్ని. ఓ రోజు లాబీలో తనను చూశాను. తనకి నేను పెద్ద అభిమానిని. అందుకే వెళ్లి పలకరించాను. కానీ తను బిజీగా ఉన్నాడు. తనతో కలిసి డ్యాన్స్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. కొన్ని రోజులకు తను నన్ను మరచిపోయాడనిపించింది. అయితే అది తప్పని నిరూపించాడు. నా ఫోన్ నెంబర్ మరచిపోయానని చెప్పడంతో ఫ్రెండ్ నంబర్ తీసుకుని మెసేజ్ చేయమని చెప్పాడు. అలా పరిచయం పెరిగింది. తనకు నా గతం గురించి చెప్పాను. ‘నీతో ప్రేమలో పడినపుడే నీకు సంబంధించిన అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి భయపడాల్సిన పనిలేదు అని చెప్పాడు. ఆ క్షణం నుంచి తనని నా వాడిగా భావించడం మొదలుపెట్టాను. ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత తనని పెళ్లి చేసుకున్నాను. అయితే మా ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం కారణంగా నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మా పెళ్లిని వ్యతిరేకించారు. కానీ తన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్లే దగ్గరుండి పెళ్లి చేశారు. మీరు నమ్ముతారో లేదో. మేము మూడుసార్లు పెళ్లి చేసుకున్నాం. నా జీవితంలో జరిగిన అత్యంత మంచి విషయం తనతో పెళ్లి జరగడమే. తనతో జీవితకాలపు ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ అంకితా రాసుకొచ్చింది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు..‘నిజమైన ప్రేమ పొందిన నువ్వు అదృష్టవంతురాలివి. మీ ప్రేమ చిరకాలం ఇలాగే ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram @withrepost •@officialhumansofbombay “I decided to move out of the country & started working with Air Asia, as a cabin crew in Malaysia. It was at that time that my then boyfriend, suddenly passed away. It was heartbreaking–it felt like there was no coming back. A couple of months later, I got posted in Chennai. I was staying in a hotel with my colleagues. Once, in the lobby, I saw a tall, rugged man. It was Milind Soman! I was a big fan! So I went to say hello, but he was busy. A few days later, I saw him again at the hotel’s nightclub. I kept looking at him & he was staring at me too! My friends urged me to go talk to him. So I asked if he’d like to dance & he obliged! There was a vibe–I could feel it! But I didn’t want to get too involved. So I excused myself & I thought he’d forget about me. But soon he came looking for me–he had to go so he asked for my number. It was a new number, so I didn’t remember it & didn’t have my phone on me either. So he made my friend take his number & asked me to message him. A few days passed by & I couldn’t get him out of my mind. So I texted him & we met again after a week, for dinner. After that, we’d constantly text & meet. But I still couldn’t bring myself to get fully involved. Until one day, I told him that because of my past, with my boyfriend, there was a part of me that couldn’t let go. To which he said, ‘When I fell in love with you, I fell in love with all of you. Even the part that carries the burden of your past. So don’t be afraid, we’re in this together.’ That’s when I knew–this was the man for me! We dated for 5 years after that–until we decided to get married! My family & a few others were worried because of the age gap between us. But it wasn’t an issue for us! So when they saw us together & they saw how happy I was around him, they agreed too! Believe it or not, we got married thrice! We had a traditional wedding in Alibaug, a white wedding in Spain under a waterfall & the third, at a place called ‘the end of the world’ there. He’s the best thing that’s happened to me; he taught me to let go, to fall in love, to be happy. And our adventures have only just begun–I can’t wait to live the rest of my life. A post shared by Ankita Konwar (@ankita_earthy) on Jun 2, 2019 at 5:49am PDT -
మిలింద్ సోమన్, అకింత కోన్వర్ పెళ్లి అయిపోయింది!!
-
వారి పెళ్లి అయిపోయింది!!
ప్రేమకు వయసుతో నిమిత్తం లేదని మిలింద్ సోమన్, అకింత కోన్వర్ జంట నిరూపించింది. మోడల్, నటుడు అయిన మిలింద్ ఆదివారం ప్రేమికురాలు అంకితను పెళ్లాడారు. 52 ఏళ్ల మిలింద్ గత కొన్నాళ్లుగా 23 ఏళ్ల అంకితతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య దాదాపు 30 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ప్రేమేంటి? అంటూ పలువురు మిలింద్‌ను తప్పుబట్టారు. వీరి అనుబంధంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను ఏమాత్రం లెక్కచేయని మిలింద్-అంకిత జంట ఆదివారం వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ముంబైలోని అలిబౌగ్లో బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన చిత్రాలను బంధుమిత్రులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరి పెళ్లి సన్నిహితుల నడుమ ఒకింత రహాస్యంగా జరిగినా.. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. -
23 ఏళ్ల యువతితో 52 ఏళ్ల నటుడి వివాహం!
-
23 ఏళ్ల యువతితో 52 ఏళ్ల నటుడి వివాహం!
ముంబయి: 52 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ సోమన్ మిలింద్ 23 ఏళ్ల అంకిత కోన్వర్‌లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను మిలింద్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు . అయితే ఆ మద్య సోషల్ మీడియాలో మిలింద్, అంకిత ఫొటోలను నెటిజన్లు చూసి.. ‘అంకిత నీ ప్రేయసినా.. లేక కూతురా..? నీ కన్నా 33 సంవత్సరాల తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమాయణమేంటీ’ అని కామెంట్లు కూడా చేశారు. వీటన్నింటికి ఇక ఫులిస్టాప్ పెట్టనున్నారు. మిలింద్ సోమన్ తన ప్రేయసి అంకితలు మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ రోజు(శనివారం) ఉదయం వీరు మెహందీ వేడుక ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాబోయే దంపతులు దిగిన ఫొటోలను తమ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
మేము బ్రేకప్ అవ్వలేదు : నటుడు
ప్రముఖ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ మిలింద్ సోమన్, అంకిత కోన్వర్ల ప్రేమ జంట బ్రేకప్ అయిందని పుకార్లు హల్చల్ చేశాయి. ఈ వార్తలపై ఆ ప్రేమజంట స్పందించింది. మేము కలిసే ఉన్నాం విడిపోలేదని తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వారు ఫొటోలను పోస్ట్ చేశారు. 52 ఏళ్ల మిలింద్ 23 ఏళ్ల అంకితలు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమను ఈ జంట పెళ్లి వరకూ తీసుకు వచ్చింది. కాగా, వీరు పెళ్లికి రెండు రోజుల ముందు డబ్బు విషయంలో విడిపోయారనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొట్టాయి. దీంతో తాము విడిపోలేదని, ఇదంతా పుకార్లేనని తెలుపుతూ మిలింద్ ఇన్‌స్ట్రామ్‌లో అంకితతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. అంకిత కూడా ఆ ఫోటోలను షేర్ చేసింది. ‘మంచిపై దృష్టి పెట్టండి. మంచి అలవాట్లతో మంచి జీవితాన్ని గడుపుతారు’ , చుట్టుపక్కల వారిని ప్రేమించండి’ అంటూ మిలిందర్ తమ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ సంతోషాన్ని తెలుపుతూ.. కామెట్స్ కూడా రాశారు. ‘ నాకు తెలిసి మీరు విడిపోరు. ఈ వార్తలు అన్ని పుకార్లే అనుకున్నా’ , మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది, జీవితాంతం ఇలానే కలిసి ఉండండి’ అంటూ అభిమానులు పోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. మిలిందర్ అంకితను పెళ్లి చేసుకుంటే ఆయనకు ఇది రెండో పెళ్లి అవుతుంది. గతంలో ఫ్రెంచ్ నటి మైలీన్ జంపనోయినను మిలింద్ వివాహం చేసుకున్నారు. 2006 నుంచి 2009 వరకు వీరి దాంపత్య జీవితం కొనసాగింది. గతంలో కూడా మిలింద్, సూపర్ మోడల్ మధు సప్రేతో ప్రేమాయణం నడిపాడు. -
ఎవరేమనుకుంటే.. నాకేంటి?
బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్, ప్రియురాలు అంకిత కోన్వర్‌తో కలిసి తాజాగా నార్వేలో విహరిస్తున్నాడు. కొద్దిరోజుల కిందటే (నవంబర్ 4న) 52వ వసంతంలోకి అడుగుపెట్టిన మిలింద్ తన పుట్టినరోజును ప్రియురాలితో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 52 ఏళ్ల మిలింద్ 18 ఏళ్ల అంకితతో ప్రేమాయణం నడపటంపై ఆ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు నోరుపారేసుకున్నారు. ఇద్దరి మధ్య 30 ఏళ్లకుపైగా వయోభేదం ఉన్నా.. ఇలా ప్రేమలు ఏంటి? కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ప్రేమాయణమా? ఇదేం పద్ధతి అంటూ కొందరు నెటిజన్లు నీతిసూత్రాలు వల్లిస్తూ.. విమర్శల దాడి చేశారు. తాజాగా కూడా ట్విట్టర్లో మిలింద్ ప్రేమాయణంపై ఘాటు విమర్శలు, జోకులు వెల్లువెత్తూతునే ఉన్నాయి. '18 ఏళ్ల అమ్మాయి 51 ఏళ్ల మిలింద్‌తో డేటింగ్ చేస్తోంది. 'బేటీ పఢావో, బేటీకో మిలింద్ సోమన్సే బచావో పథకాన్ని మోదీ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మిలింద్ ఇప్పుడే కాదు ఇంతకుముందు 20 ఏళ్ల అమ్మాయితో డేటింగ్ చేశాడు.. అతనికి తన వయస్సు మహిళలు ఎందుకు నచ్చరో' అంటూ కామెంట్ చేశారు. ఈ విమర్శలు, ఆన్లైన్ ట్రోలింగ్ ఎలా ఉన్నా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎయిర్ హోస్టెస్ అయిన ప్రియురాలు అంకితతో కలిసి మిలింద్ విహరిస్తున్నాడు. ఓస్లోలో ఆమెతో కలిసి దిగిన సెల్ఫీలను అతను తాజాగా షేర్ చేశాడు. కాగా, మిలింద్కు మద్దతుగా రచయిత భావన అరోరా ట్వీట్ చేశారు. 50 ఏళ్లు వచ్చినా మిలింద్ సోమన్ ఇంకా హాట్‌గానే ఉన్నాడని, కాబట్టి ఇప్పటికైనా ఆన్లైన్ ట్రోలింగ్ ఆపాలని ఆమె పేర్కొన్నారు. -
ఆయనకు 51.. ఆమెకు 18.. ప్రేమాయణం!
ముంబయి: సూపర్ మోడల్ మిలింద్ సోమన్ తన ప్రేయసి అంకిత కొన్వర్తో కలిసి అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్ సమ్మర్ - 2018 ఎడిషన్‌లో బుధవారం పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో తన ప్రేయసి అంకితతో దిగిన ఫోటోలను మిలింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జంటగా చేతిలో చేయి వేసుకొని ర్యాంప్‌లో నడిచి వస్తున్న వీరి జంటను చూసి.. అభిమానులు వీరిద్దరిది చూడముచ్చటైన జంట అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అంకితతో ఆయన డేటింగ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మిలింద్, అంకిత ఫొటోలను నెటిజన్లు చూసి.. ‘అంకిత నీ ప్రేయసినా.. లేక కూతురా..? నీ కన్నా 33 సంవత్సరాల తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమాయణమేంటీ’ అని కామెంట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం. గతంలో మైలీన్ అనే యువతితో మిలింద్‌కి పెళ్లైంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడిపోయారు. #Deivee yaaaaaaaaaay !!!!!! #nidamahmood #indiacool #athleisure #milindsoman #sportychic #pinkathon #trending #quirky #prints #newdelhi #photooftheday #amazonindiafashionweek A post shared by Milind Usha Soman (@milindrunning) on Oct 11, 2017 at 3:56am PDT -
ఉద్యమ స్ఫూర్తి!
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు ‘పింకథాన్’ పేరుతో ప్రముఖ మోడల్, బాలివుడ్ నటుడు మిళింద్ సోమన్ దేశమంతా లాంగ్‌మార్చ్ చేశారు.. చేస్తున్నారు. ఈ మధ్యే మిళింద్ సోమన్ వాళ్ల అమ్మ ఉషా కూడా ఈ పింకథాన్‌లో పాల్గొన్నారు. 76 ఏళ్ల ఉషా.. తన కొడుకు మిళింద్ సోమన్‌తో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ఈ పింకథాన్‌లో పరిగెత్తారు. తొట్టతొలి చైతన్యదీక్ష! రొమ్ము క్యాన్సర్ గురించి జనంలో చైతన్యం కలిగించడం కోసం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున క్యాంపెయిన్లు జరగడం చూస్తున్నాం. అయితే, అందరి కన్నా ముందు ఇలాంటి చైతన్య కార్యక్రమం జరిగింది. 1992లో. ఎవెలిన్ లాడర్ తొలిసారిగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవేర్నెస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత నుంచి ప్రపంచవ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు ఇలాంటి చైతన్య కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. రొమ్ము క్యాన్సర్‌పై పోరాటానికి నిధులు సేకరించడం కోసం రకరకాల కార్యక్రమాలు, పరుగులు జరుగుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎవేర్నెస్ మన్త్ అయిన ప్రతి అక్టోబర్‌లో ఇవి మరింత ఎక్కువ. ఈ చైతన్యానికి ప్రతీకాత్మకంగా మద్దతు తెలపడం కోసం ‘పింక్ రిబ్బన్లు’ వాడుతున్నారు. డిజిటల్ మీడియాలో... మన సందడి! వివిధ రకాల భారతీయ బ్రాండ్లు సైతం సోషల్ మీడియా ద్వారా డిజిటల్ క్యాంపెయిన్లు, ఫేస్బుక్ - ట్వీటర్లలో హ్యాగ్ ట్యాగ్లు పెట్టడం, పోటీలు నిర్వహించడం లాంటి వాటి ద్వారా పదిమందికీ రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యం కలిగిస్తున్నాయి. వాటి ద్వారా క్యాన్సర్ పరిశోధనకు నిధులు సేకరిస్తున్నాయి. అలా చేసిన క్యాంపెయిన్లలో కొన్నిటి గురించి... ‘ఫిలిప్స్ ఇండియా’ సంస్థ ‘హజ్బెండ్ ఇనీషియేటెడ్ మూవ్మెంట్’ (హిమ్) పేరిట డిజిటల్ క్యాంపెయిన్ చేసింది. పురుషులు ప్రతి నెలా కనీసం పది నిమిషాల పాటు రొమ్ముల స్వీయ పరీక్ష చేసుకొనేలా తమ భార్యలకు వీలు కల్పించాలి. భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆ కాసేపటిలో వంట చేయడం, పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం లాంటి ఏదో ఒక పని చేసి పెట్టాలి. ఆ పనులు చేస్తూ, పురుషులు సెల్ఫీలు తీసుకొని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్వీటర్లలో అప్లోడ్ చేయాలి. ‘ఎల్లే’ సంస్థ ఫేస్బుక్ పేజ్ ద్వారా ఆ మధ్య పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ చేసింది. తద్వారా మహిళలకు మద్దతుగా నిలిచింది. పింక్ దుస్తులు వేసుకొని, సెల్ఫీలు తీసుకొని, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలని ప్రోత్సహించింది. ఆ రకంగా జనంలో రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యానికి కృషి చేసింది. హిందీ సినీ నటులు సోనమ్ కపూర్, నర్గీస్ ఫక్రీ తదితరులు తమ ‘పింక్ సెల్ఫీ’లను తీసి, నలుగురితో పంచుకోవడం ద్వారా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ‘ఎస్టీ లాడర్ ఇండియా’ సంస్థ తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో క్యాంపెయిన్ చేసింది. రొమ్ము క్యాన్సర్ బాధితులు ఇతరులకు స్ఫూర్తి నిచ్చేలా తమ ఫొటో, లేదంటే సందేశాన్ని షేర్ చేసుకోవాలి. షేర్ చేసిన ప్రతి మెసేజ్‌కీ వంద రూపాయల చొప్పున పది లక్షల దాకా మొత్తాన్ని రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన, వైద్య చికిత్సల నిమిత్తం ఇచ్చేందుకు సిద్ధమైంది. జనంలో ఉత్సాహం కోసం ముంబయ్‌లోని ప్రసిద్ధ బాంద్రా - వర్లీ సముద్రపు లింక్‌ను వారం రోజుల పాటు పింక్ లైట్లతో అలంకరించారు. వినోదం పంచే వీడియోలు పోస్ట్ చేసే ‘ప్రాన్క్ బాజ్’ తన యూ ట్యూబ్ చానల్లో, ఫేస్బుక్లో రొమ్ము క్యాన్సర్ గురించి షాకింగ్‌కి గురి చేసే వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఒక అమ్మాయి తాను వేసుకొన్న పై దుస్తుల్ని తీసి, లోపలి టీ షర్ట్‌ని చటుక్కున చూపించే ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. కొన్ని లక్షల మంది చూశారు. జనం ఈ వీడియో చూసి, దాని గురించి మాట్లాడుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై జనంలో చైతన్యం తీసుకురావాలన్నది ప్రయత్నం. -
అహ్మదాబాద్ టు ముంబై: మిలింద్ సోమన్ పరుగు
భారత మాజీ సూపర్ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ మళ్లీ పరుగందుకున్నారు. గతేడాది జూరిచ్‌లో జరిగిన ‘ఐరన్‌మేన్ రేస్’లో ఏకబిగిన 3.8 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి, రోడ్డులేని ప్రాంతంలో 180 కిలోమీటర్లు బైక్ నడిపి, 42.2 కిలోమీటర్లు పరుగెత్తి నిజమైన ఐరన్‌మేన్‌గా ప్రపంచ గుర్తింపు పొందారు. ఆ విజయం ద్వారా ఆయన భారత కీర్తి పతాకాన్ని విశ్వవీధుల్లో ఎగరేయడమే కాకుండా తన 50వ పుట్టినరోజును విజయంతో జరుపుకొన్నారు. ఇప్పుడు ఆయన మరో రికార్డును నెలకొల్పేందుకు, తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు అహ్మదాబాద్ నుంచి ముంబైకి పరుగు ప్రారంభించారు. అది కూడా.. కాళ్లకు జాగింగ్ బూట్లు గానీ, పాదరక్షలు గానీ లేకుండా. అహ్మదాబాద్‌లో జూలై 26వ తేదీన ప్రారంభమైన ఆయన పరుగు సిల్వస్సా మీదుగా 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి చేరనుంది. పరుగు ప్రారంభించిన ఆయన తొలిరోజున 67 కిలోమీటర్లు బేర్‌ఫుట్‌తో పరుగెత్తారు. రెండోరోజు 62 కిలోమీటర్లు పరుగెత్తారు. ఆగస్టు ఏడో తేదీలోగా ముంబైకి చేరుకోవాలన్నది ఆయన లక్ష్యం. ఆయన తన రెండురోజుల పరుగును వీడియోలో రికార్డుచేసి ఫేస్బుక్లో పెట్టారు. మిలింద్ ఎండలో పరుగెడుతున్నా.. ఉదయం పూట జాగింగ్ చేస్తున్నంత సునాయాసంగా పరుగు తీయడం కనిపించింది. ఆయన పరుగు ఉల్లాసంగా కొనసాగాలని, లక్ష్యాన్ని సాధించాలని ఫేస్బుక్లో ఆయన ఫాలోవర్లు ఆకాంక్ష వ్యక్తం చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. -
ఆమె ఆరోగ్యమే మహాభాగ్యం
‘మహిళలు ఆర్యోగ్యమే మహాభాగ్యం. వాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని’ వక్తలు అన్నారు. మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా ఆదివారం నగరంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్లకు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. పింకథాన్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆదివారం పింకథాన్ నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ రన్‌ను సుప్రసిద్ధ బేర్‌ఫుట్ రన్నర్, పింకథాన్ ఫౌండర్ మిలింద్ సోమన్ ప్రారంభించారు. ఈ రన్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం నాలుగు విభాగాల్లో రన్ నిర్వహించారు. 3కె రన్లో ఆకాంక్ష, సాహిత్య, తేజస్వి... 5కె రన్లో అనన్య, విద్యా గోల, తేజశ్విణి.. 10కె రన్లో మహాదేవి, సోని.. 21కె రన్లో వందనా ప్రమోద్, ప్రియాంక, సుప్రియా పటేల్‌లు విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. - ఖైరతాబాద్ వాకథాన్ మహిళల ఆరోగ్యం- ఫిట్నెస్ కోసం కాన్ఫడరేషన్ ఆఫ్ ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా(కోవే) ఆధ్వర్యంలో ఆదివారం వాకథాన్ నిర్వహించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ అవగాహన వాక్‌ను ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాయని సునీత, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, రిథమిక్ జిమ్నాస్టిక్ మేఘన, కోవే చైర్పర్సన్ గిరిజ పాల్గొన్నారు. - బంజారాహిల్స్ -
నవంబర్ 4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: టబు (నటి), మిలింద్ సోమన్ (నటుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పనులను చకచకా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక భద్రత, స్నేహసంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయవలసి వచ్చినప్పుడు విజ్ఞతతో వ్యవహరించక తప్పదు. వీరు పుట్టిన తేదీ 4. ఇది రాహు సంఖ్య కావడం వల్ల కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు. పోటీపరీక్షల్లో విజయం. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ తమ రంగాలలో బాగా పుంజుకుంటారు. లక్కీ నంబర్లు: 2,3, 4,5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, గోల్డెన్, ఎల్లో, పర్పుల్, బ్లూ, వయోలెట్. సూచనలు: పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, ఆవులకు, కోతులకు ఆహారం పెట్టడం, కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
మీ మద్దతుతో ఎనలే ని ఉత్సాహం: మిలింద్
ముంబై: రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పింకథాన్ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని మద్దతు పలకడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ పేర్కొన్నాడు. నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన పింకథాన్ ర్యాలీకి హాజరైన సందర్భం గా మాట్లాడుతూ ఇకపైకూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నాడు. కాగా ఈ పింకథాన్‌లో దాదాపు మూడువేల మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారిలో వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఉద్యోగినులు, కళాశాలల విద్యార్థినులు, నర్సులు, మహిళా వైద్యులు ఉన్నారు. ఈ కార్యక్రమం హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మేక్సిమస్ ఎంఐసీఈ అండ్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. బాలీవుడ్ తారలు గుల్‌పనగ్, మిలింద్ సోమన్, అల్ట్రా మారథానర్ దినేష్ మాధవన్‌లు పచ్చజెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. పది కిలోమీటర్ల పరుగులో జయశ్రీబోర్గి విజయకేతనం ఎగురవేయగా, ద్వితీయ, తృతీయ రన్నరప్‌లుగా సునీతా వాగ్మోడే, శ్వేతాదేవరాజ్లు నిలిచారు. ఇది ఐదుకిలో మీటర్ల పరుగులో జ్యోతి పంజాబీ తొలిస్థానంలో నిలిచారు. ఈ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.