
ముంబయి: సూపర్ మోడల్ మిలింద్ సోమన్ తన ప్రేయసి అంకిత కొన్వర్‌తో కలిసి అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్ సమ్మర్ - 2018 ఎడిషన్‌లో బుధవారం పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో తన ప్రేయసి అంకితతో దిగిన ఫోటోలను మిలింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జంటగా చేతిలో చేయి వేసుకొని ర్యాంప్‌లో నడిచి వస్తున్న వీరి జంటను చూసి.. అభిమానులు వీరిద్దరిది చూడముచ్చటైన జంట అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అంకితతో ఆయన డేటింగ్ చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో మిలింద్, అంకిత ఫొటోలను నెటిజన్లు చూసి.. ‘అంకిత నీ ప్రేయసినా.. లేక కూతురా..? నీ కన్నా 33 సంవత్సరాల తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమాయణమేంటీ’ అని కామెంట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం. గతంలో మైలీన్ అనే యువతితో మిలింద్‌కి పెళ్లైంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడిపోయారు.





Comments
Please login to add a commentAdd a comment