girl friend
-
స్నేహితురాలి మోజులో భార్యను.. ఆప్ నేత అరెస్ట్
అక్రమ సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితులకైనా దారితీస్తాయనడానికి పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఒక ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పదిమందికీ ఆదర్శంగా నిలవాల్సిన ఒక నేత స్వయంగా అకృత్యానికి పాల్పడటం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని లుథియానాలో భార్యను హత్య చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అనోఖ్ మిట్టల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని స్నేహితురాలు, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తొలుత అనోఖ్ మిట్టల్ తన భార్య లిప్సీ మిట్టల్‌ను ఒక గ్రామం దగ్గర దుండగులు హత్య చేశారని చెప్పాడు. తాను, తన భార్య లుథియానా-మలెర్‌కోట్లా రోడ్డులో ఒక హోటల్లో భోజనం చేసి, తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని అనోఖ్ మిట్టల్ పోలీసులకు తెలిపాడు. ఆ దుండగులు మారణాయుధాలతో దాడి చేసి, తమ కారు తీసుకుని పారిపోయాడని పేర్కొన్నాడు.పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ తమ విచారణలో లిప్సీ మిట్టల్‌ను ఆమె భర్త అనోఖ్ మిట్టల్ హత్య చేశాడని విచారణలో వెల్లడయ్యిందన్నారు. అనోఖ్ మిట్టల్‌తో పాటు ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితురాలు, మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నదని లిప్సీ మిట్టల్‌కు తెలిసిపోయందని, దీంతో భయపడిన అనోఖ్ మిట్టల్ తన స్నేహితురాలి సాయంతో భార్యను హత్య చేశాడన్నారు. ఈ ఘటనలో అనోఖ్‌కు సహకరించిన అమృత్‌పాల్‌సింగ్, గురుదీప్ సింగ్, సోనూ సింగ్, సాగర్‌దీప్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత? -
పెండ్లి చేసుకుని పారిపోయిన ప్రియుడు
-
Maha Kumbh Mela 2025 : గర్ల్ ఫ్రెండ్ సలహాతోనే పెట్టుబడిలేని వ్యాపారం
ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా అశేష భక్తకోటితో ఉత్సాహంగా సాగుతోంది. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే సుదూర తీరాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (MahaKumbhMela 2025)కు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా హృదయాలను హత్తుకునే సంఘటనలు, కథనాలు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు బడా వ్యాపరస్తులతోపాటు ఇక్కడ చిన్నా, చితకా వ్యాపారం చేసుకునేందుకు అనేకమంది ప్రయాగరాజ్‌కు వస్తున్నారు. వీరిలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముకునే మోనాలీసాలాగా పాపులర్ అవుతున్నారు. ఈ కోవలో ఒక ప్రేమికుడు నిలవడం విశేషం. స్నేహితురాలు ఇచ్చిన సలహాను తు.చ. తప్పకుండా పాటించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. పెట్టుబడి లేని వ్యాపారంగా వేప పుల్లల్ని విక్రయిస్తూ ఆకర్షణీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రియురాలిచ్చిన సలహా ఆధారంగా రంగంలోకి దిగిన అతగాడు రోజూ పొద్దున్నే అక్కడ వేపపుల్లల్ని విక్రయిస్తున్నాడు. తద్వారా గత ఐదు రోజుల్లో 40వేల రూపాయలు సంపాదించాడు. ఈ సందర్భంగా సంతోషం నిండిన కళ్లతో అతను చెబుతున్న మాటలు అనేకమంది హృదయాలను హత్తుకుంటున్నాయి.‘‘ఆమె(తన ప్రేయసి) కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. తానే మహాకుంభ మేళాకు వెళ్లమని చెప్పింది. పెట్టుబడి అవసరం లేదు కాబట్టి ఆ క్షేత్రంలో వేపపుల్లలు అమ్మమని సలహా ఇచ్చింది. నేను ఆమె కారణంగా ఇంత సంపాదించాను’’ అంటూ చెప్పుకొచ్చాడు సంతోషంగా.“నిజమైన బంధం” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ కథనంపై నెటిజన్లు వారి ప్రేమను అభినందించారు. నిజమైన ప్రేమ, ఎంత హృద్యంగా ఉంది లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. "ఇంత అద్భుతమైన స్నేహితురాలిని ఎప్పుడూ వదులుకోవద్దు లేదా మోసం చేయవద్దు" అని ఒక ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు రాశారు."చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడుతున్నాడు. మీరు జీవిత మార్గంలో విజయంలో అగ్రస్థానానికి చేరుకుంటారు" అని మూడవ వ్యక్తి వ్యాఖ్యానించాడు.ఒక్క క్షణం కూడా తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడలేదు సూపర్ అని మరొకరన్నారు. చూశారా.. ప్రియురాలు గురించి చెప్పేటపుడు అతని ముఖంలో వెలుగు, మాటల్లో గర్వం, ఆ స్వరంలో ప్రేమ ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయో..ఇదే రా ప్రేమంటే అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత! View this post on Instagram A post shared by Adarsh Tiwari (@adarshtiwari20244) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా భావించే మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్ర కార్యంలో సన్యాసులు, సాధువులు, సాధువులు, సాధ్విలు ప్రముఖంగా నిలుస్తుండగా, దేశ విదేశాలకు చెందిన పలువురు భక్తులతోపాటు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తున్నారు. గంగా, యమున ,సరస్వతిల పవిత్ర సంగమమైన సంగమంలో స్నానం చేసి తరలించాలని భక్తుల ఆకాంక్ష.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
గడ్డం కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు
ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్. కానీ ఇపుడు ట్రెండ్‌మారింది అంటున్నారు ఇండోర్ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాదు. ఫ్యాషన్‌గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్‌లో కొందరు కాలేజీ యువతులు 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ర్యాలీ తీశారు. ముఖాలకు గడ్డం మేకప్ వేసుకొని మరీ అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం హాట్ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ కరెక్టేగా కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మెన్లా ఉంటాం అంటూ కామెంట్ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్ మెన్ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024 -
ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్.. వస్తున్నారహో!
‘నాకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు’ అని ఇక ముందు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ గర్ల్‌ఫ్రెండ్స్‌తో హాయిగా సంభాషించవచ్చు. మనసులోని భావాలను పంచుకోవచ్చు. సలహాలు అడగవచ్చు. ఫొటోలు దిగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతోమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు. డిప్రెషన్ బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ స్నేహహస్తాన్ని చాస్తున్నాయి.‘నాకంటూ ఒకరు ఉన్నారు’ అని భరోసా ఇస్తున్నాయి. ఏఐ డేటింగ్, ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్...లాంటి స్టార్టప్‌లు యూత్‌ను పలకరిస్తున్నాయి. ‘వోన్లీ ఫ్యాన్స్’ స్టార్టప్ ఇప్పటికే దూసుకుపోతుంది. ‘వేర్యాజ్’లోని సౌలభ్యం ఏమిటంటే యూజర్లు ఐడియల్ వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్‌తో మరో మనిషితో మాట్లాడుతున్నట్లే కృత్రిమ గర్ల్‌ఫ్రెండ్‌తో సహజమైన భాషలో మాట్లాడవచ్చు. అడ్వాన్స్డ్ మోడల్స్ ఆఫ్ ఏఐలో ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్ సిమ్యూలేటర్’ ఒకటి. దీనిలో త్రీడి టెక్నాలజీ, ఏఆర్, వర్చువల్ రియాలిటీ ఫీచర్లు ఉంటాయి. మోస్ట్ రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువ చేయడం ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్ లక్ష్యం. -
ఇంతకు తెగించిన చిన్ననాటి స్నేహితుడు
-
కాస్ట్ లీ ప్రేమ కథ.. నోట్ల కట్టలపై ప్రియురాలి నడక
-
ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
కొందరు వృద్ధులు ఏజ్‌తో సంబంధం లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు . కుర్రాళ్ల మాదిరిగా వారి ఆలోచనలు, వ్యవహార శైలి ఉంటుంది. అది వారి ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఇలా వ్యవహరిస్తున్నారా..! లేక మరేదైనా అనేది తెలియదు. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధుడు లేటు వయసులో పెళ్లి కోసం ఆరాట పడుతూ ఏం చేస్తున్నాడో వింటే కంగుతింటారు.అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన గిల్బర్ట్ అనే 70 ఏళ్ల వ్యక్తి తనకు తగిన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాడు. తాను 2015 నుంచి ఒంటరిగా ఉంటున్నానని, అందుకే తనకు తగిన కలల భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు. తాను ఇటీవలే రిటైర్ అయ్యానని, మంచి ఆదాయం కూడా ఉందని తెలిపాడు. అంతేకాదు తనకు తగిన గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ బిల్‌బోర్డులపై భారీగాప్రకటనలు కూడా ఇస్తున్నాడు. అందుకోసం అతడు వారానికి సుమారు రూ. 33 వేలు దాక ఖర్చు పెడుతున్నాడట. తనకు యూరప్ అంటే చాలా ఇష్టమని, నిజాయితీగా ఉండే మంచి భాగ స్వామి కోసం యూకే వరకు చుట్టోస్తానని మరీ చెబుతున్నాడు. ఈ ప్రకటన కారణంగా అతడికి దాదాపు 400పైగా కాల్స్, ఇమెయిల్స్ వచ్చాయట. వారంతా తాను ధనవంతుడిగా భావించి పెళ్లి చేసుకునేందుకు వచ్చేవాళ్లని, అందుకు వారందర్నీ తాను తిరస్కరించానని చెబుతున్నాడు. తనకు నమ్మకమైన భాగస్వామి కావాలని అందుకోసం ఎంత దూరమైన వెళ్తాను, ఎంతకాలమైన ఎదురు చూస్తానని తెగేసి చెబుతున్నాడు. అంతేగాదు అందుకోసం ఎంత డభైనా వెచ్చించి బిల్‌బోర్డ్‌లో ప్రకటచ్చేందుకు వెనుకాడనని అంటున్నాడు గిల్బర్ట్. అంతేగాదు తన ఏజ్ కంటే చాల చిన్న ఏజ్ అయినా ఓకేనట. ఈ ఏజ్‌లో ఒంటరితనం జయించటం కోసం తగిన భాగస్వామిని కావాలనుకోవటం వరకు సరైన విషయమే. కానీ అందుకోసం ఇంతలా డబ్బు వెచ్చిస్తూ..తపన పడటం విడ్డూరంగా ఉంది కదూ.!(చదవండి: -
భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష!
భారత సంతతి వ్యక్తికి సింగపూర్ హైకోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ప్రియురాలిని హతమార్చిన కేసులో కోర్టు ఈ శిక్ష విదించింది. తన ప్రియురాలు మలికా బేగం రహమాన్సా అబ్దుల్ రెహమాన్‌ని జనవరి 17, 2018 తీవ్రంగా గాయపరిచి హతమార్చాడు. ఈ నేరాన్ని కృష్ణ కోర్టు ఎదుట అంగీకరించాడు. అంతకుమునుపు 2015లో కృష్ణన్ గృహహింస కేసులో అరెస్టు అవ్వడం జరిగింది. తీరు మార్చుకుంటానని చెప్పి విడుదలయ్యాక కూడా అతడి నేర ప్రవృత్తి మానుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇలా మహిళలపై పదేపద గృహహింసకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కోర్టు స్ఫష్టం చేస్తూ..కృష్ణన్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2015లో కృష్ణన్ భార్య తన భర్త కృష్ణన్ అతడి గర్లఫ్రెండ్ ఇద్దరు కలిసి మద్యం సేవించడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెంటనే ఆమె కృష్ణన్ నిలదీయడంతో విస్కీ బాటిల్‌తో కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కృష్ణన్‌కి క్షమాపణలు చెప్పి ఏం చెయ్యొద్దని బతిమాలుకుంది. ఆ తర్వాత పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి తన గర్లఫ్రెండ్ మల్లికతోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అయితే 2018లో కృష్ణన్ భార్య పెట్టిన గృహహింస కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్నాడు. ఆ టైంలోనే అతడి గర్ల్‌ఫ్రెండ్ పరాయి మగవాళ్లతో రిలేషన్ షిప్ పెట్టుకున్న విషయం తెలుసుకుని తీవ్రంగా కలత చెందాడు. దీంతో ఫుల్‌గా మద్యం తాగి జనవరి 19 2015న మల్లికపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. ఆ రోజు సాయంత్రమే సింగపూర్ ఢిపెన్స్కి కాల్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు తరఫు న్యాయవాది గర్లఫ్రెండ్ మోసాన్నీ జీర్ణించుకోలేక మద్యం మత్తులో చేసిన అఘాయిత్యమని వాదించారు. పైగా తన క్లయింట్ వీక్ఆఫ్ల్లోనే సరదాగా తాగుతుంటాడని చెప్పారు. అయితే కోర్టు మద్యం మత్తులో చేసిన పనే అయినా, ఆ హింస చాలా తీవ్రంగా ఉందని, మహిళల పట్ల ఇలాంటి వాటిని ఉపేక్షించమని పేర్కొంది. అలాగే ఇక్కడ అతడి గర్ల్‌ఫ్రెండ్ జీవించి లేనందున ఆమె పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుందన్న కారణంగా చేసిన నేరంగా పరిగణలోని తీసుకోలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఇక్కడ నిందితుడు బాధితురాలి పట్ల చాలా హింసాత్మకంగా ప్రవర్తించి హతమార్చాడు, పైగా పోస్ట్‌మార్టం రిపోర్టులో తీవ్ర గాయాలు కారణంగానే బాధితురాలు మరణించిందని వెల్లడయ్యిందని పేర్కొంది. స్త్రీల పట్ల ప్రవర్తించిన ఈ హింసాత్మక ప్రవర్తనకు గానూ నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది సింగపూర్ హైకోర్టు. (చదవండి: US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!) -
గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రియురాలి కోసం గొప్ప సాహసం చేశాడో ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. విగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం మిచిగాన్‌లోని వాటర్ఫోర్డ్కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్ ఇద్దరూ ప్రేమికులు. ఆరునెలల డేటింగ్ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా. అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా జోక్ చేసింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు ఎన్నిస్. 2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూశాడు. దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేసుకోవడం, కండీషనింగ్ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్ బోనెట్ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్‌ను ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. అసలు విషయం ఏమిటంటే.. హన్నా హోస్కింగ్ ఒక కంటెంట్క్రియేటర్. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది. దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ కంటతడి పెట్టుకుంది. తన బాయ్‌ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా. నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో -
56 ఏళ్ల వయసులో నటుడి పెళ్లి ప్రపోజల్..
-
ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే!
తాజాగా ఇంటర్నెట్లో ఒక విచిత్ర ఉదంతం వైరల్‌గా మారింది. ఇటువంటి విషయాన్ని ఎవరూ ఎప్పుడూ వినివుండరు. ఒక యువకుడు తన ప్రియురాలికి ఆమె పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఖరీదైన క్రూయిజ్ టికెట్ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఆనందంతో ఎగిరి గంతులేసేందుకు బదులు, ఆగ్రహంతో అతనికి బ్రేకప్ చెప్పింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యువతి ఇటీవల తాను తన ప్రియుడి నుంచి విడిపోయానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ యువతి పోస్ట్‌లో ఇలా రాసింది.. ‘సముద్రాన్ని చూసినప్పుడు నాకు అనారోగ్యం వస్తుందని తెలిసి కూడా ఎందుకు నా కోసం క్రూయిజ్ టిక్కెట్ కొన్నావని నేను అతనిని అడిగాను. నేను కొన్ని నెలలుగా రెయిన్ఫేర్ ఫెస్టివల్ కోసం సిద్ధమవుతున్నానని కూడా అతనికి తెలుసు. తనకు క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నాతో చెప్పాడు. నాకు క్రూయిజ్ టిక్కెట్ కొన్నాడని తెలిశాక అతను ఎంత నీచమైనవాడో నేను గ్రహించాను. నా పుట్టినరోజున నేను ఎంత అనారోగ్యానికి గురైనా అతనికి అవసరం లేదు. అతనికి క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నేను కూడా అతనితో రావాలని అతను కోరుకున్నాడు. ఇది నాకు నచ్చక అతని నుంచి విడిపోయాను. అయితే నేను చెప్పిన బ్రేకప్ను అతను అంగీకరించడం లేదు. కొద్ది రోజుల్లో విబేధాలు సమసిపోతాయి’ అని ఆమె పేర్కొంది. ఆ యువతి రెడ్డిట్‌లో u/Helpful-Minimum8496 అనే ఖాతాతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఆ యువతి అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. అలాగే తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు..‘ఆ యువకుడు ఆమె ఆరోగ్యాన్ని గుర్తించి ఉంటే ఇలా జరిగేదికాదు. ఆ కుర్రాడి తీరు నీచమనిపిస్తోంది’ అని రాశారు. మరొక యూజర్ ఇలా రాశారు.. ‘అతను మీ అభిరుచులను పట్టించుకోకుండా, తన కోరికలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే మీరు అతనిని వదిలివేయడం ఉత్తమం’ అని రాశారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? -
గీతా ఆర్ట్స్ నుంచి 'రష్మిక' లేడీ ఓరియంటెడ్ చిత్రం టైటిల్ రివీల్
నేషనల్ క్రష్ రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నిరోజుల్లోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీ తో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ అమ్మడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ నటి ఇప్పుడు ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే లేడి ఓరియంటెడ్ సినిమాకు సిద్ధమైంది. 'చి.ల.సౌ' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా తెరకెక్కుతున్నట్లు రస్మిక ప్రకటించింది. ఈ మేరకు గ్లింప్స్‌ను కూడా మేకర్స్ వదిలారు. ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయాననుకుని లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. రాహుల్ రవింద్రన్ లాస్ట్ సినిమా మన్మధుడు-2 అట్టర్ డిజాస్టర్. హీరోయిన్గా కెరియర్ టాప్ రేంజ్లో దూసుకుపోతున్న సమయంలో లేడీ ఓరియేంటేడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే రష్మిక చేస్తున్న పెద్ద సాహసమేనని చెప్పాలి. ఖుషీ ఫేమ్ అబ్దుల్ హేషమ్ వాహద్ సంగీత దర్శకుడిగా ఉండగా.. గీతాఆర్ట్స్, మాస్ మేకర్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. ది 'గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌లో మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం కూడా రష్మిక చేస్తున్న విషయం తెలిసిందే. 'రెయిన్ బో' అనే లేడీ ఓరియంటెడ్ సినిమాను ఆమె ఇప్పటికే ప్రారంభించింది.. ఈ చిత్రంతో శాంతరూబన్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్ మోహన్ నటించనున్నాడు. -
పెళ్లికాని శ్రీమంతుడు.. రెడీ టూ మింగిల్ అంటున్నా పట్టించుకోని అమ్మాయిలు
అతనో బిలియనీర్.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్ జాన్సన్. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్‌ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్ ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్‌కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ బిలియనీర్ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. బ్రియాన్ జాన్సన్.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్‌మ్యాన్ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్‌కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్‌గా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్ విని దూరంగా పారిపోతున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్సన్.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్‌స్టైల్ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్‌నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్‌కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్ లిస్ట్ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్. -
‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1982లో తన మాజీ ప్రేమికురాలికి ఒక లేఖ రాశారు. దానిలో ఏమి రాశారన్నది తాజాగా బయటపడి సంచలనంగా మారింది. బరాక్ ఒబామాకు గే సెక్స్ అంటే ఇష్టమని ఈ లెటర్ ద్వారా వెల్లడయ్యింది. తనకు రోజూ పురుషులను దగ్గరికి తీసుకోవడమంటే ఇష్టమని, అయితే అది తన కల్పన మాత్రమేనని దానిలో ఒబామా పేర్కొన్నారు. బరాక్ ఒబామా తన మాజీ ప్రియురాలికి రాసిన లేఖను న్యూయార్క్ పోస్టు బయటపెట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒబామాకు గే సెక్స్ ఫాంటసీ అంటే ఇష్టమనే విషయాన్ని ఈ ఉత్తరం వెల్లడించింది. దానిలో ఆయన తాను పురుషులతో రోజూ లైంగిక కార్యకలాలపాల్లో పాల్గొంటున్నట్లు కలలుకంటానని తెలిపారు. ఈ ఉత్తరం రాసే సమయానికి ఒబామా వయసు 21 ఏళ్లు. 1982 నవంబరులో ఆయన తన మాజీ ప్రేమికురాలు అలెక్స్ మెక్నియర్కు ఈ ఉత్తరం రాశారు. ఒబామా, అలెక్స్ ఆరోజుల్లో లాస్ఏంజిల్స్లోని ఆక్సిడెంటల్ కాలేజీ విద్యార్థులు. అప్పుడు వారు రిలేషన్లో ఉండేవారు. ఆ ఉత్తరంలో ఒబామా.. హోమో సెక్సువాలిటీ గురించి ప్రస్తావించారు. 40 ఏళ్ల క్రితం నాటి ఈ లెటర్‌ను ఒబామా తాను రాసినదేనని అంగీకరించారు. తాను ఒక పురుషుని రూపంలోనే మరో పురుషునితో ఉండేందుకు ఇష్టపడ్డానని ఒబామా పేర్కొన్నారు. ఒబామాతో రిలేషన్ ముగిసిన అనంతరం అతని మాజీ ప్రేమికురాలు అలెక్స్ ఆ లేఖలోని కొన్ని వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరం ఎమోరీ యూనివర్శిటీలో ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1992లో మిషెల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇది కూడా చదవండి: 6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్‌లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట! -
లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?
అమెజాన్ కో ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.ఇప్పటికే భారీ ఆస్తులను సొంతం చేసుకున్న బెజోస్ ప్రపంచంలోనే మూడో కుబేరుడు ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో దాదాపు రూ.560 కోట్ల (68 మిలియన్ల డాలర్లు) ఎస్టేట్‌ను కొనుగోలుకు అంగీకరించినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. రికార్డుల ప్రకారం దాదాపు 9,300 చదరపు అడుగుల (864 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంది. లారెన్ శాంచెజ్‌తో చెట్టాపట్టాల్, రూ.560 కోట్ల ఇల్లు ఇటీవల గర్ల్‌ఫ్రెండ్‌తో లారెన్ శాంచెజ్‌తో సందడి చేసిన జెఫ్ బెజోస్ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్‌ను జోడించడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. 1965లో నిర్మించిన 2.8-acre (1.1హెక్టార్లు) మూడు పడకగదులప్రాపర్టీ MTM స్టార్ ఇంటర్నేషనల్ పేరుతో ఉన్నట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ఇతర కొనుగోళ్లపై దృష్టి పెట్టారని, ప్రస్తుతం కొనుగోలు చేసిన స్పెషల్ ఇండియన్ క్రీక్‌ను "బిలియనీర్ బంకర్" అని పిలుస్తారని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి సమాచారం ద్వారా తెలుస్తోందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది. బెజోస్‌తోపాటు, కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ లాంటి టాప్ సెలబ్రిటీలకు కూడా ఇక్కడ ఇళ్లు ఉండట విశేషం. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు బెజోస్ ప్రతినిధి నిరాకరించారు. ఇప్పటికే దిమ్మదిరిగే ప్రాపర్టీలు బెజోస్‌కు ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో 165 మిలియన్ల డాలర్ల విలువన తొమ్మిది ఎకరాల బెవర్లీ హిల్స్ మాన్షన్ , ఇంకా మౌయ్లోని ఒక ఎస్టేట్‌తో సహా పలు లగ్జరీ భవనాలు ఆయన సొంతం. అలాగే మాన్హాటన్ ,సీటెల్‌లో ఖరీదైన ఆస్తులు, టెక్సాస్‌లో 300,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడే బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్‌కు ప్రయోగ కేంద్రం కొలువై ఉంది. లగ్జరీ ప్రాపర్టీలపై మోజు 2021లో అమెజాన్ సీఈవోగా వైదొలగిన బెజెస్కు భార్య మెకెంజీ స్కాట్‌తో విడాకుల తరువాత సూపర్ లగ్జరీ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడంపై మోజు పెరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సూపర్‌యాచ్ కోరును కొనుగోలు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 163 బిలియన్ల డాలర్ల సంపదతో, ఈ ఐలాండ్ ఎస్టేట్‌లో అత్యంత సంపన్న నివాసి అవుతాడు. ఈ ద్వీపంలో కేవలం 40 నివాసాలు, ఒక కంట్రీ క్లబ్ . సొంత పోలీసు విభాగం గా ఉన్నాయి. -
హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం
-
అల్కరాజ్ అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా?
దశాద్దం కిందట పురుషుల టెన్నిస్‌లో ఎక్కువగా వినిపించిన పేర్లు ముగ్గురివే. స్విజ్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్.. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. గత పదేళ్లలో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఎగురేసుకుపోయేవారు. మధ్యలో ముర్రే, డానిల్ మెద్వెదెవ్, కాస్పర్ రూడ్ సహా చాలా మంది స్టార్లు వచ్చినా ఎవరు ఈ త్రయం ముందు నిలబడలేకపోయారు. కానీ రెండేళ్లుగా టెన్నిస్‌లో ఒక పేరు మార్మోగిపోతుంది. అతనే స్పెయిన్ నుంచి వచ్చిన యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్. ప్రస్తుతం వరల్డ్ నెంబర్‌వన్‌గా ఉన్న అల్కరాజ్ రాబోయే రోజుల్లో టెన్నిస్‌ను శాసించేలా కనిపిస్తున్నాడు. ఫెదరర్, నాదల్, జొకోవిచ్‌ల తర్వాత టెన్నిస్ ఏలే రారాజులా కనిపిస్తున్నాడు. 20 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న అల్కరాజ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. 2022లో యూఎస్ ఓపెన్ గ్గిన అల్కరాజ్.. తాజాగా 2023లో వింబుల్డన్ నెగ్గి కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ సాధించాడు. వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కలను అల్కరాజ్ చెరిపేశాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అల్కరాజ్ ప్రేమించడంలోనూ దూసుకెళ్తున్నాడు. తన దేశానికే చెందిన టెన్నిస్ ప్లేయర్ మారియా గొంజాలెజ్ గిమినేజ్తో అల్కరాజ్ ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ ఇద్దరి మధ్య రిలేషన్ ప్రస్తుతం సీక్రెట్‌గా కొనసాగుతున్నా.. ఇటీవల కార్లోస్ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు కొన్ని డౌట్స్ క్రియేట్ చేసింది. మారియాను కిస్ ఇస్తున్న ఫోటోను అల్కరాజ్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని టెన్నిస్ అభిమానులు డిసైడ్ అయిపోయారు. 20 ఏళ్ల అల్కరాజ్ కొన్నాళ్ల నుంచి డేటింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారియా కూడా ముర్సియా క్లబ్ తరపునే టెన్నిస్ ఆడుతుంది. అల్కరాజ్ తన కెరీర్లో ఇప్పటికే 12 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ గెలిచాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ సొంతం చేసుకున్నాడు. నాలుగు మాస్టర్స్ టైటిళ్లను కూడా అతను కైవసం చేసుకున్నాడు. జోకోవిచ్ ప్రాక్టీసు మ్యాచ్‌లను వీడియో తీసిన వివాదంలో అల్కరాజ్ ఇరుక్కున్నా.. వింబుల్డన్ ఫైనల్లో అతనే ఓడించడం గమనార్హం. -
Love Proposal: ఇలాంటి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజల్
ప్రేమ అనేది మధురానుభూతి. ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. గ్రీటింగ్ కార్డ్స్ ద్వారానో, బహుమతుల ద్వారానో, సర్‌ప్రైజ్‌లతోనే వెరైటీగా లవ్ ఎక్ప్రెస్ చేస్తుంటారు. ఇంకొందరు అబ్బాయిలైతే సినిమా హీరోల్లా తమ ప్రేయసికి ప్రపోజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ కోసం డిఫరెంట్‌గా ప్రపోజ్ చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్‌కి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. దీంతో వీరి ప్రేమకథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు బోలెడన్ని లవ్ ప్రపోజల్స్ గురించి విన్నాం,చూశాం. కానీ ఓ యువకుడు ఇంకాస్త వెరైటీగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రేయసి కోసం ప్రత్యేకంగా ఓ కీబోర్బ్నే డిజైన్ చేసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ‘బీ మై గర్ల్ ఫ్రెండ్ సెయాంగ్?’ ( Be my girlfriend Seyang ) అనే వాక్యం వచ్చేలా ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బటన్స్‌ను అమర్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు.ఈ వినూత్న ప్రపోజల్‌కి ఆ యువతి ఫిదా అవ్వడమే కాక, ఆనందంతో ఎగిరి గంతేసింది. 'నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన రీతిలో ప్రపోజ్ చేశాడు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను' అంటూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరి ప్రేమ కహానీ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ కపుల్‌కి కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. i’ll never shut up about this, he proposed me to be his girlfriend with a keyboard. https://t.co/G8GDpsD62z pic.twitter.com/iPbCZ1zEdA — 에이미 (@amymaymacc) April 29, 2023 -
ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని..
గర్ల్‌ఫ్రెండ్ మోజులో పడిన ఒక యువకుడు మారణాయుధంతో తన భార్య ముక్కును తెగ్గోసి, దానిని జేబులో పెట్టుకుని పరారయ్యాడు. రక్తమోడున్న ముక్కుతోనే ఆ భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త చేసిన నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాకు చెందిన ఒక యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కును తెగ్గోశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అతనిని వెదికి పట్టుకున్నారు. బాంస్తాలీ గ్రామానికి చెందిన విక్రమ్‌కు కొన్నేళ్ల క్రితం మొహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సీమాదేవితో వివాహం జరిగింది. తరువాత వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే ఇంతలో విక్రమ్.. గ్రామానికి మరో యువతితో అఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీమ భర్తతో గొడవపడుతుండేది. రాత్రి భోజనాలయ్యాక.. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి భోజనాలయ్యాక భార్యాభర్తల మధ్య ఆ యువతితో అఫైర్ విషయమై వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన విక్రమ్ ఆ కోపాన్ని తన కుమార్తెపై చూపించాడు. దీనిని భార్య అడ్డుకుంది. దీంతో విక్రమ్ ఒక పదునైన ఆయుధంతో సీమ ముక్కును తెగ్గోశాడు. దానిని జేబులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతున్న స్థితిలో.. వెంటనే ఆమె అదే స్థితిలోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు నిందితుడు విక్రమ్‌ను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి నిందితుడిని జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రేమోన్మాది ఘాతుకం
-
గర్ల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లిన ఎయిరిండియా పైలట్..
న్యూఢిల్లీ: విమానాల్లో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తోటి ప్రయాణికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్తలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రయాణికులే అనుకుంటే తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ పెలైట్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దుబాయి-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తున్న తన స్నేహితురాలిని పైలట్ కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడమే గాక.. ప్రయాణ సమయమంతా ఆమెను పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఫిబ్రవరి 27 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. దుబాయి నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో పైలట్ స్నేహితురాలు కూడా ప్రయాణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు. చదవండి: వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే.. అంతేగాక విమానం ఢిల్లీకి చేరుకునేంతవరకు అంటే.. దాదాపు మూడు గంటల పాటు ఆ మహిళను కాక్‌పిట్‌లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అయితే ఈ విషయంపై క్యాబిన్ సభ్యుల్లో ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. దీంతో మహిళా స్నేహితురాలిని పైల్ కాక్‌పిట్‌లోకి అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం దర్యాప్తును చేపట్టింది. పైలట్ చర్యలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడమే కాకుండా, విమాన ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, దాని బట్టి పైలట్‌పై సస్పెన్షన్ లేదాలైసెన్స్‌ను రద్దు చేయడంతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ -
ఎత్తు పెరగాలని ఏకంగా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!
ఇటీవల వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనికి సాంకేతికత కూడా తోడవ్వడంతో పలు వ్యాధులను సులభంగా నయం చేయగల చికిత్స విధానాలు చాలామటుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనషుల్లో కొంత వికృతమైన ఆలోచనల తో వెర్రీ పనులు చేస్తున్నారునే చెప్పాలి. రూపు రేఖలు దగ్గర నుంచి ప్రతీది మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా కాస్మోటిక్ శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో యువత ఆ సర్జరీలు ఎంత ఖరీదైనవైనా..లెక్క చేయకుండా చేయించుకోవడానికి రెడీ అయ్యిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎత్తు పెరిగేందుకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించుకున్నాడు. దీని వల్ల పల దుష్పరిణామాలు ఉన్నా కూడా చేయించుకునేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఎందుకోసం అంత రిస్క్‌తో కూడిన శస్త్ర చికిత్స చేయించుకుంటున్నోడో వింటే ఆశ్చర్య పోవడం ఖాయం. వివరాల్లోకెళ్తే...అమెరికాకు చెందిన 41 ఏళ్ల గిబ్సన్ తన ఎత్తు విషయమై చాలా బాధపడుతుండేవాడు. అతను ఐదు అడుగుల ఐదు అంగుళాలు. ఆ ఎత్తు కారణంగానే తనకు గర్లఫ్రెండ్స్ లేరని తెగ బాధపడుతుండేవాడు. అందుకోసం అని తన ఘూస్లో కొని రకాల వస్తువలు పెట్టుకుని హైట్‌గా కనిపించేందుకు తెగ ప్రయత్నించేవాడు. ఎత్తు పెరిగేలా మందులు వాడటం దగ్గర నుంచి యోగ వరకు అని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఐతే అవన్నీ ఫెయిల్ అవ్వడంతో ఇక ఎత్తు పెరిగేలా కాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాస్తవానికి గిబ్సన్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శస్త్ర చికిత్స కోసం అని తనసంపాదనలో కొంత డబ్బును ఆదా చేయడమే గాక ఉబర్ డ్రైవర్ కూడా పార్ట్ టైం జాబ్ చేసి మరికొంత డబ్బును కూడబెట్టాడు. గిబ్సన్ తాను అనుకున్నట్లుగానే 2016లో మొదటి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడు అంగుళాలు పెరిగాడు. దీంతో అతని ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పెరిగాడు. అయినప్పటికి ఇంకా ఎక్కువ పెరగాలని రెండోసారి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. మొదటి శస్త్ర చికిత్స మాదిరిగా రెండో ఆపరేషన్ ప్రక్రియ అంత సజావుగా జరగలేదు. మరింత ఎత్తు పెరగడం కోసం వైద్యులు అతని ఎముకలు విరిచి దానిపై అయస్కాంత స్క్రూలు వంటి కొన్ని పరికరాలు అమర్చాల్సి రావడమే గాక విపరీతమైన బాధను కూడా అనుభవించాల్సి వచ్చింది. పైగా మొదటి ఆపరేషన్‌కి రూ. 60 లక్షలు ఖర్చు పెట్టగా రెండోదానికి ఏకంగా రూ. 80 లక్షల దాక ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక పక్క విపరీతమైన బాధలు మరోవైపు అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ బాధపడక పోగా తాను జూన్ నాటికి 5 అడుగులు పది అంగుళాలు పెరుగుతానని ఆనందంగా చెబుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కూడా గిబ్సన్ చాలా ఆనందంగా ఉన్నాడని, ప్రస్తుతం అతనికో గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉందని చెబుతుండటం విశేషం. ఏదీఏమైనా ఈ ఎత్తు పెంచే శస్త్ర చికిత్స వల్ల భవిష్యత్తులో పలు దుష్పరిణామాలే గాక కొన్ని రకాల రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. Moses Gibson spent 170k on 2 height lengthening surgery after being subjected heightism for being 5’5! He said he long struggled to get a girlfriend due to his 5-foot-5-inch frame, initially turning to medication and a “spiritual healer” to try to increase his height… He… pic.twitter.com/HqoTcUyCZR — The Cosmetic Lane (@TheCosmeticLane) April 12, 2023 (చదవండి: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై బాంబు దాడి.. భయంతో పరుగులు.. క్షణాల ముందు వీడియో..) -
'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తొలి సెంచరీ బ్రూక్ దే. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో వంద పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడినప్పటికి పేసర్ల బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఊచకోత కోశాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను చూసిన అతని గర్ల్‌ఫ్రెండ్ చప్పట్లతో అభినందించడం వైరల్‌గా మారింది. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ''స్పిన్ ఆడడంలో కాస్త ఇబ్బందికి గురైన మాట వాస్తవమే. కానీ పవర్‌ప్లేను వీలైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ మార్క్రమ్, అభిషేక్ శర్మలకు సహకరించా. వాళ్లు ఔటైన తర్వాత ఆ బాధ్యతను నేను తీసుకున్నా. బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా.. కానీ ఇలా సెంచరీ చేస్తానని ఊహించలేదు. నా వంతు పాత్ర పోషించా.. ఇంకా మ్యాచ్ మిగిలే ఉంది. మా బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల రిత్యా వాళ్లు వెళ్లిపోయారు.. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేసింది. ఈరోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా'' అంటూ తెలిపాడు. 𝐘𝐞𝐫 𝐚 𝐰𝐢𝐳𝐚𝐫𝐝, 𝐇𝐚𝐫𝐫𝐲 🧙♂💫 Ladies & Gentlemen, the first 💯 of #IPL2023 🧡👏#KKRvSRH #HarryBrook #IPLonJioCinema #TATAIPL | @SunRisers pic.twitter.com/4nXzSi4ilV — JioCinema (@JioCinema) April 14, 2023 Harry Brook said, "my girlfriend is here, but the rest of the family just left. I knew this would happen as soon as they left I'll get some runs (laughs)". pic.twitter.com/TJatdittlh — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2023 -
భర్త చనిపోయాడనుకుని విలవిలలాడింది..కట్ చేస్తే అతను..
భర్త చనిపోయాడనుకుని ఓ భార్య చాలా ఆవేదన చెందింది. ఒక పక్కా ఆమె అతడి కోసం కోర్టులో విడాకుల విషయమై పోరాడుతుంది. ఇంతలో సడెన్‌గా భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. అతడి చివరి చూపుకోసం తపించిన భర్త తల్లిదండ్రులు ఆమెను రానివ్వలేదు. ఆ ఆవేదన నుంచి బయటపడలేక పోయింది. తీరా కొన్ని నెలల తర్వాత అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఈఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన అనెస్సా రోస్సీ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తన భర్తతో పోరాడుతోంది. ఆమె విడాకులిచ్చేందకు సముఖంగా లేదు కూడా. అయితే అనూహ్యంగా తన భర్త చనిపోయాడన్న షాకింగ్ వార్త వచ్చింది. దీంతో ఆమె తన భర్త చనిపోయాడనుకుని చివరి చూపుకోసం అతడి ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ అతడి తల్లిదండ్రులు అందుకు అంగీకరించ లేదు. దీంతో ఆమె చాలా పశ్చాత్తాపంతో ఆవేదన చెందింది. విడాకులు ఇచ్చేసినా.. బతికేవాడేమో అనుకుని విలపించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో కొన్ని నెలల క్రితం తన భర్త బతికే ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కి గురయ్యింది. అతను మెక్సికోలో మరో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. ఆఖరికి వేరో అమ్మాయితో ఉండేందుకు చనిపోయినట్లు నాటకం ఆడినట్లు తెలుసుకుని కుంగిపోయింది. ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. దీన్ని తెలుసుకున్న ఆమె భర్త తానేమి నాటకాలు ఆడలేదని ఆమె విడాకులు ఇవ్వకపోవడంతో మెక్సికోలో గడిపేందుకు వెళ్లినట్లు సమర్ధించుకునే యత్నం చేశాడు. (చదవండి: రిషి సునాక్ విదేశీ పర్యటన ఖర్చు..కేవలం ఫ్లైట్ జెట్లకే రూ. 4 కోట్లు) -
వెరైటీ వెడ్డింగ్: 4 గంటలు బెయిల్.. జైలులో యువతి వివాహం
స్నేహం, ప్రేమ.. వీటి కోసం మనకు నచ్చిన వాళ్లని ఎంచుకుంటుంటాం, అయితే పెళ్లి విషయంలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గట్టే కొందరికి ఊహించని రీతిలో వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి పెళ్లి ఈ తరహాలోనే జైలులో జరిగింది. అసలేం జరిగిందంటే.. పశ్చిమ చంపారన్‌లోని బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ హాజీపూర్‌లో ఇంజనీరింగ్ చదివాడు. రాహుల్ తన కుటుంబంతో కలిసి లక్నోలో సత్సంగానికి వెళ్లాడు. జైలులో పెళ్లి... అక్కడ అతనికి యూపీలోని కప్తంగంజ్కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ గోపాల్‌గంజ్‌లోని తావే దుర్గా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టారు. ఇటీవల మార్చి 5న కాజల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను రాహుల్ ఆసుపత్రిలో చేర్చాడు. అయితే విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. రాహుల్ కుమార్‌పై అత్యాచారం చేశాడని ఆరోపణలతో పోలీసులతో అతడిని అరెస్ట్ చేయించి జైలుకు తరలించారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. చివరికి వారిద్దరికి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అయితే రాహుల్ జైలులో ఉండడంతో గోపాల్‌గంజ్‌లోని సీజేఎం కోర్టులో కుటుంబం తరపున ఒక దరఖాస్తు దాఖలు చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో కోర్టు పెళ్లికి అనుమతించింది. దీంతో అతని పెళ్లికి నాలుగు గంటల పెరోల్ బెయిల్ లభించింది. గోపాల్‌గంజ్‌లోని చనావే జైలు నుంచి నాలుగు గంటలపాటు పెరోల్‌పై వచ్చిన ఓ ఖైదీ తావే దుర్గా ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. తావే దుర్గా ఆలయంలో జరిగిన ఈ అపూర్వ వివాహానికి అబ్బాయి, అమ్మాయితో పాటు పోలీసులు కూడా పెళ్లికి అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో వివాహ వేడుక తర్వాత, థావే వాలి కోర్టులో దంపతులు భార్యాభర్తలుగా నిర్ధారించింది. తావే దుర్గ గుడిలో ఓ నేరస్థుడి వివాహ వేడుక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ వినూత్న వివాహం ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
గర్ల్ ఫ్రెండ్ కోసం 160 కి.మీ వేగంతో కారు నడిపి.. చివరికి
ఫ్లోరిడా: అమెరికాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాలి. తన గర్ల్‌ఫ్రెండ్‌ని సరైన సమయానికి ఇంటర్వ్యూకి తీసుకువెళ్లాలని గంటకి 160కి.మీ. వేగంతో కారు నడిపిన వ్యక్తి ఇప్పుడు కటకటాలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఫ్లోరిడాకు చెందిన జెవన్ పీర్ జాక్సన్ (22) గంటకి 65కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించే జోన్లో నిబంధనల్ని బేఖాతర్ చేశాడు. ఏకంగా 160 కి.మీ వేగంతో కారు నడిపాడు. మార్గం మధ్యలో కొన్ని వాహనాలను కూడా ఢీ కొట్టబోయి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. జాక్సన్ ఢీ కొట్టబోయిన ఒక వాహనంలో పోలీసు వాహనంతో పాటు ముగ్గురు చిన్నారులున్న మరో వాహనం ఉండడంతో అతని చుట్టూ ఉచ్చు బిగిసింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, చిన్న పిల్లలకి హాని జరగబోయిందన్న కేసు పెట్టిన పోలీసులు జాక్సన్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. -
ప్రాంక్ వీడియో.. తెలియక గర్ల్‌ఫ్రెండ్ ఎంత పని చేసిందంటే!
కరోనా మహమ్మారి అడ్డుకట్టకు కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు దైనిక జీవితంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో గడపడంతో అందరూ టీవీలు, స్మార్ట్ఫోన్లకు అత్తుకుపోయారు. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో చూసే వారి సంఖ్య ఒక్కసారిగా ఎగబాకింది. దీంతో టిక్‌టాక్ వీడియోలు, షార్ట్ ఫిలింలు, ప్రాంక్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూ కొందరిని ఓవర్‌నైట్ సెలబ్రిటీలను చేసిన ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రాంక్ వీడియోలు చేస్తున్న క్రమంలో ప్లాన్ బెడిసి కొట్టి ఇబ్బందలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రాంక్ వీడియోకు ప్లాన్ చేసిన ఓ బాయ్‌ఫ్రెండ్‌కు అలాంటి చేదు అనుభవమే ఎదరైంది. అయ్యో.. అక్కడ తగిలిందే ఇటీవల నెట్టింట ప్రాంక్ వీడియోల హవా పెరుగుతోంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల, సన్నిహితుల మీద వీటిని చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సరిగ్గా జరిగితే, ఫన్ వస్తుంది కానీ అది ఏ చిన్న తప్పు జరిగినా మర్చిపోలేని ఘటనగా మారుతుంది. ప్రస్తుతం నెట్టింట్లో దర్శనమిస్తున్న ఓ వీడియోలో.. అందులో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌పై ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేస్తాడు. అందుకోసం అతను తన హుడిని రెగ్యులర్‌గా కాకుండా ఛాతీ వైపు నుంచి ధరిస్తాడు. అతను గోడకు ఆనుకుని నిలబడి తన ముఖాన్ని హూడీతో కప్పుకుని గోడవైపు మొహం పెట్టుకుని నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడి వచ్చిన అతని గర్ల్‌ఫ్రెండ్ అతని వెనుక నుంచి గట్టిగా కొడుతుంది. అయితే అది వాస్తవానికి అతని ప్రైవేట్ భాగం కావడంతో నొప్పికి అక్కడే కిందపడిపోతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాపం మనోడు అనుకున్నది ఒకటైతే, అక్కడి జరిగింది మరొకటి అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్త అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Reels Parivaar (@reels_parivaar) -
అమ్మాయిని కొడతావా? నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
యంగ్ హీరో నాగశౌర్య రియల్ హీరో అనిపించుకున్నారు. నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు చేయి చేసుకోగా, ఎందుకు కొట్టావంటూ నాగశౌర్య నిలదీశాడు. అంతేకాకుండా అమ్మాయిని కొట్టడం తప్పు అని ఆమెకు క్షమాపణలు(సారీ)చెప్పాల్సిందే అని శౌర్య సదరు యువకుడితో గొడవకు దిగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోడ్డు మీద ఇద్దరు ప్రేమికులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అదే సమయంలో అట్నుంచి కారులో వెళుతున్న నాగశౌర్య ఇది గమనించి 'ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అంటూ నిలదీశాడు. దీనికి అతను ఆమె నా లవర్, నా ఇష్టం అంటూ ఓవర్యాక్షిన్ చేయగా అబ్బాయిని గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ శౌర్య వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శౌర్య చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. -
నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
-
ప్రేయసితో ఘనంగా టీమిండియా ఆల్‌రౌండర్ పెళ్లి
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సోమవారం రాత్రి ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు, వ్యాపారవేత్త మిథాలీ పారుల్కర్‌ను పెళ్లాడాడు. బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. తాజాగా సోమవారం రాత్రి వివాహబంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. మిథాలీ పారుల్కర్ ‘ది బేక్స్’ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాలతీ చాహర్ వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక టీమిండియా తరపున శార్దూల్ ఠాకూర్ 8 టెస్టులు, 34 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శార్దూల్ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయడంతో పాటు 120 పరుగులు చేశాడు. గతేడాది మినీ వేలంలో శార్దూల్ ట్రేడింగ్‌లో కేకేఆర్‌కు బదిలీ అయ్యాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ షురూ కానుంది. కాగా, పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం. Congratulations You Beautiful Couple Lord #Shardul Thakur and Mittali Parulkar pic.twitter.com/vKSUQjGgY1 — Lalit Tiwari (@lalitforweb) February 27, 2023 చదవండి: ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్' పనికిరాదు పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు -
టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది'
అమెరికా టెన్నిస్ స్టార్ టామీ పాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో అదరగొడుతున్నాడు. బుధవారం క్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్‌ను టామీ పాల్ 7-6, 6-3, 5-7, 6-4తో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ప్రదర్శనతో టామీ పాల్ భవిష్యత్తు స్టార్‌గా మారే అవకాశం ఉన్నట్లు టెన్నిస్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇతని పోరాటం సెమీస్‌లోనే ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో టామీ పాల్ సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక టామీ పాల్ గర్ల్‌ఫ్రెండ్ పెయిజ్ లోరెన్జ్ మాత్రం అతని కంటే ముందే హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆటతో అనుకుంటే పొరపాటే. బాయ్‌ఫ్రెండ్‌తో పాటు ఆస్ట్రేలియా వచ్చిన ఈ అమ్మడు టాప్‌లెస్‌గా దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆడే మ్యాచ్‌లకు పక్కాగా హాజరవుతున్న పెయిజ్ లోరెన్జ్ ఖాళీ సమయంలో బీచ్‌కు వెళ్లి అందాల ప్రదర్శనతో కనువిందు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ టామీ పాల్.. బెన్ షెల్టన్‌తో ఆడిన క్వార్టర్స్ మ్యాచ్ ఫోటోలను కూడా పంచుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్ టాప్‌లెస్ ఫోజుపై టామీ పాల్ స్పందించాడు.. ''అలా నావైపు చూడకు ఏదో అవుతుంది నాకు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక పెయిజ్ లోరెన్జ్ టాప్‌లెస్ ఫోటోలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Paige Lorenze (@paigelorenze) -
మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లోని ప్రేమోన్మాది దాడి కేసులో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. కాగా మియాపూర్‌లో సందీప్ అనే యువకుడు ప్రియురాలు వైభవీ ఆమె తల్లి శోభపై కత్తితో దాడి చేసి..తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ తల్లి కూతుళ్ల వైభవీ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడు సందీప్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐతే ప్రస్తుతం సందీప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఈఎన్టీ వైద్యులు తెలిపారు. అసలేం జరిగిందంటే గుంటూరు జిల్లా ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపుతుల కుమార్తె శోభ, నిందితుడు సందీప్ గతంలో ప్రేమించకున్నారు. ఇంట్లో వాళ్లు మందలించడంతో సందీప్‌ని దూరంగా ఉంచడమే గాక ఆమెకు మరోకరితో వివాహం నిశ్చయించారు. వచ్చే ఆదివారం నిశ్చితార్థం కాగా, ఈ విషయం తెలుసుకున్న సందీప్ కోపంతో వైభవీ ఇంటికి వచ్చి గొడవ చేసి.. కత్తితో తల్లి కూతుళ్లపై దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి అరుపులు విని స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత) -
ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత
సాక్షి, మియాపూర్ (హైదరాబాద్): ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడమేగాక తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటూరుజిల్లా, ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపతులకు కుమార్తె వైభవీ, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. వెంకటరాజు ముంబైలో ప్యాబ్రికేషన్ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శోభ తన కుమార్తె వైభవీ, గోవర్ధన్‌తో కలిసి మియాపూర్‌లోని న్యూ – హఫీస్‌పేట ఆదిత్య నగర్లో ఉంటోంది. కాగా అదే గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ బబ్లూ వారి ఇంటి పక్కనే ఉండేవాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో వైభవి కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. దీంతో కొన్నాళ్లుగా వైభవీ సందీప్‌ను దూరం పెడుతుంది. దీనిని జీర్ణించుకోలేని సందీప్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి తనతో మాట్లాడాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో శోభ ఇద్దరు పిల్లలతో సహా నగరానికి వలస వచ్చి న్యూ – హాపీస్‌పేట ఆదిత్యనగర్‌లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం వైభవికి తమ సమీప బంధువుతో పెళ్లి కుదిరింది. వచ్చే ఆదివారం వారి నిశ్చతార్థం జరిపేందుకు నిశ్చయించారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం ఉదయం నగరానికి వచ్చిన సందీప్ నేరుగా వైభవి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. కోపంతో కూరగాయాలు కోసే కత్తితో వైభవీ, ఆమె తల్లి శోభపై దాడి చేశాడు. వైభవిని గొంతు కింద చాతీభాగంలో, తల్లి శోభను కడుపులో పొడిచాడు. ఆ తర్వాత అదే చాకుతో దీపూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సందీప్‌ను కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి తరలించారు. వైభవీ, తల్లి శోభలను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిలకడగా సందీప్ ఆరోగ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందీప్‌ను పోలీసులు కోఠి ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్థితి పరిశీలించిన ఈఎన్టీ వైద్యులు అతడి గొంతుకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
మాజీ ప్రియురాలు పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో...ఆమె కాబోయే భర్తకి..
తన మాజీ ప్రియురాలు మరోకర్నీ పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో ఆమె కాబోయే భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింగపూర్‌లోని భారత సంతతికి చెందిన వ్యక్తి సురెంధిరన్ సుగుమారన్ తన మాజీ ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకోబోతుందని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అసూయతో, కోపంతో రగిలిపోయి.. ఆమె కాబోయే భర్త ఇంటికి వెళ్లి నిప్పంటించాడు. మరుసటి రోజు పెళ్లి ఉందనంగా ఈ ఘటనకు పాల్పడ్డాడు సుగుమారన్. ఐతే అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డు అయ్యింది. ఈ ఘటనకు పాల్పడినప్పుడూ...తనను గుర్తుపట్టకుండా ఉండేలా నల్లటి ముసుగు ధరించాడు. అలాగే ఫ్లాట్ నుంచి బయటకు రాకుండా ఉండేలా గేటుకి తాళం వేశాడు. ఆ తర్వాత ఫ్లాట్ కాలిపోయింది అని నిర్ధారించుకున్నాక పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు.ఐతే పోలీసులు వెంటనే కేసును చేధించి నిందితుడు సుగుమారన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడమే కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకే మెట్లమార్గం గుండా వెళ్లినట్లు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా...జిల్లా జడ్జీ యూజీన్ టీయో..ఇలాంటి ఘటనలు పక్క ఫ్లాట్‌లో ఉండే వారికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఈ నేరాన్ని ఏ పరిస్థితుల్లో చేసినప్పటికీ, ఇతరులకు ప్రమాదం అని తెలిసి కూడా ఆస్తులను ధ్వంసం చేయడమనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆస్తులకు నష్టం కలుగుతుంది అని తెలిసి కూడా ఈ ఘటనలకు పాల్పడిన వారికి సుమారు ఏడేళ్లు జైలు శిక్ష, జరిమాన విధించబడుతుందని పేర్కొన్నారు. (చదవండి: చమురు విషయంలో పాక్‌కి గట్టి షాక్ ఇచ్చిన రష్యా) -
విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే.. గర్ల్‌ఫ్రెండ్‌తో సింగర్ షికార్లు
బాలీవుడ్ స్టార్ సింగర్, రాపర్ యోయో హనీసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. భార్య షాలినీ తల్వార్‌తో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే ఇప్పుడు మరో గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగుతున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కి హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానిని చేయి పట్టుకొని వేదిక వద్దకు తీసుకెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. టీనా తడానీ ఎవరా అని సెర్చ్ చేయగా ఆమె ఒక మోడల్ అని తెలిసింది. అంతేకాకుండా రీసెంట్గా రిలీజైన హనీసింగ్ మ్యూజిక్ ఆల్భమ్లోనూ ఆమె కనిపించింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో హనీసింగ్ తన ప్రేమ గురించి ఓపెన్‌గానే బయటపెట్టేశిన సంగతి తెలిసిందే. 'ఆమె రూపంతో పాటు మనసు కూడా ఎంతో అందంగా ఉంటుంది. నా గతం గురించి అన్నీ తెలిసి కూడా నన్ను అంగీకరించింది. చాలా కాలంగా నేను సంతోషంగా లేను. కానీ ఆమె నా జీవితంలోకి వచ్చాక చాలా ఆనందంగా, రొమాంటిక్‌గా ఉంటున్నా. అందుకే నా కొత్త ఆల్భమ్ సాంగ్ ఆమెకి డెడికేట్ చేస్తున్నా' అంటూ హనీసింగ్ పేర్కొన్నాడు. అయితే ఆమె పేరు చెప్పడానికి ఆరోజు అంగీకరించని హనీసింగ్.. ఢిల్లీ ఈవెంట్లో మాత్రం టీనాను గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు. దీంతో వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. .@asliyoyo Introduce His New GF Tina 🔥 Watch full Video : https://t.co/wOZDycy7dk#Yoyohoneysingh #Honeysingh #Honeysinghgirlfriend @Yoyohon86350823 #HoneySingh pic.twitter.com/zjz4lA4Hvi — Himanshu Aswal (Artist) (@Himanshaswal) December 7, 2022 -
సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు
ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్యోదంతం మరువక మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలిని బయటకు వెళ్దాం అని చెప్పి హత్య చేసి నిప్పంటించాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.... చత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల తనూ కుర్రే ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుండేది. ఆమె తన స్నేహితుడు సచిన్ అగర్వాల్‌తో కలిసి నవంబర్ 21న బలంగీర్కి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె తన కుటుంబ సభ్యులతో టచ్‌లో లేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు రాయ్‌పూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసులు ఈ కేసు విషయమై విచారిస్తుండగా...బలంగీర్‌లో కాలిపోయి పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. ఆ మృతదేహన్ని తనూదిగా ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. అనతరం పోలీసులు ఆమె ప్రియుడు సచిన్ అగర్వాల్‌ని అనుమానిస్తూ...ఆ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడు సచిన్ అగర్వాల్ ప్రియురాలు తనూ చనిపోయిన ప్రాంతంలో ఎక్కువగా సంచరించినట్లు ఫోన్ లోకేషన్ తెలుపుతోంది. దీంతో పోలీసులు తమదైన తరహాలో సచిన్‌ని గట్టిగా విచారించగా...నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. తనూని బలంగీర్ చుట్టూ సరదాగా తిరిగొద్దాం అని చెప్పి బయటకు తీసుకు వెళ్లినట్లు చెప్పాడు. తనను మోసం చేస్తుందని భావించి హత్యచేసి చంపేసినట్లు తెలిపాడు. అనతరం పెట్రోల్ పోసి తగలు బెట్టినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: తీస్తే మరో దృశ్యం సినిమా అవుతుందేమో!.. గొంతుకోసి.. వేడినూనె, యాసిడ్‌తో ముఖం కాల్చేసి..) -
ఆ రిలేషన్‌ని వద్దన్నారని...ప్రియురాలి సోదరుడు, తండ్రిపై దాడి
ఒక వ్యక్తి తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రియురాలి తండ్రి సోదరుడుపై పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని రంసోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సమల్ అనే వ్యక్తి కాలియాపాణిలోని మార్కెట్ వద్ద ఉన్న ప్రియురాలి సోదరుడు జితేంద్ర వద్దకు వచ్చి పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అతని కేకలు విన్న అతని తండ్రి సంతోష్ జితేంద్రను రక్షించడానికి అడ్డుగా వచ్చాడు. దీంతో సమల్ అతడి తండ్రి సంతోష్‌పై కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో ఈ ఘటనలో తండ్రి కొడుకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు బీరెస్ సమల్ అలియాస్ సంతను బాధితుడు జితేంద్ర సోదరితో సంబంధం పెట్టుకున్నాడు. ఐతే సమల్ వివాహితుడు కావడంతో జితేంద్ర, అతని తండ్రి వారి సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో కోపం పెంచుకున్న సమల్ వారిపై అతి కిరాతకంగా దాడి చేశాడు. దీంతో స్థానికులు సమల్‌ను పారిపోకుండా అడ్డుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఐతే బాధితుడు జితేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని, అతడి తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆగ్రహంతో నిందితుడి ఇంటిని కూల్చివేసి, నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు) -
ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు
పుణె: 43 ఏళ్ల వ్యక్తి ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ప్రభత్వ ప్రధాన కార్యాలయం అయిన మంత్రాలయ భవనం వద్ద చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు సదరు వ్యక్తి సేఫ్టి నెట్లో పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపన కథనం ప్రకారం....బీడు జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్లఫ్రెండ్‌కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం పై నుంచి దూకేశాడు. అతని గర్లఫ్రెండ్ అత్యాచారానికి గురైందని, ఆ తర్వాత ఆమె అవమానంతో 2018లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఐతే పోలీసులు సరిగా దర్యాప్తు జరపకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అదీగాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కలిసి ఈ విషయం చెప్పి న్యాయం చేయాలని అభ్యర్థించేందుకు నవంబర్ 17 గురువారం మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. ఐతే క్యాబినేట్ సమావేశం ఉండటంతో బాపుకి షిండేని కలిసే అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై అతను మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయం ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. అక్కడ సేఫ్టి నెట్ ఉండటంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #Maharashtra: प्रेमिका को न्याय दिलाने के लिए प्रेमी ने लगाई छठी मंजिल से छलांग, नेट पर गिरने से बची जान#Mantralaya #Mumbai #WATCH #viralvideos2022 pic.twitter.com/c8dsn5Aufd — VDTV Bharat (@vdtv_bharat) November 18, 2022 (చదవండి: కాలేజీ ర్యాగింగ్‌లో వికృతక్రీడ.. స్టూడెంట్ పైశాచికత్వం!) -
పక్కా ప్లాన్‌తో ప్రియుడి హత్య.. ఇప్పుడేమో మరో డ్రామా?!
క్రైమ్: సంచలనం సృష్టించిన షరోన్ రాజ్(23) హత్య కేసులో.. ఊహించని పరిణామం నెలకొంది. ప్రియుడ్ని పక్కా ప్లాన్‌తో హత్య చేసిందని భావిస్తున్న యువతి(22).. పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ పరిణామాన్ని కూడా డ్రామాగానే అనుమానిస్తుండడం గమనార్హం. తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23)ను ప్రేమించిన ఉష అలియాస్ గ్రీష్మ(22)కు.. మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అది తెలిసి ఆమెకు షరోన్ ఆమెకు కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. అయితే.. కావాలనే అతనికి మళ్లీ వాట్సాప్ ద్వారా దగ్గరైంది గ్రీష్మ. ఈ క్రమంలో అక్టోబర్ 14వ తేదీన ఇంటికి పిలిచి మరీ స్లోపాయిజన్ ఇచ్చి.. అతన్ని ఆస్పత్రిపాల్జేసింది. రెండు వారాల పాటు నరకం తర్వాత.. చికిత్స పొందుతూ గత సోమవారం అతను ఆస్పత్రిలోనే మరణించాడు. అయితే.. ఈ ఘటన తర్వాత నిందితురాలి కుటుంబం పరారు కాగా.. ఎట్టకేలకు ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఉష.. అరెస్ట్ ముందర ఉత్కంఠకు తెర తీసింది. సోమవారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించిందని స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరించాయి. ఆస్పత్రి బాత్రూంలో ఉన్న ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్‌ను తాగి.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లిందని.. ఆపై వాంతులు చేసుకుంటూ పోలీస్ జీపు వైపు అడుగులేసిందని.. ఈ క్రమంలో ఆమెను గమనించిన సిబ్బంది వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గ్రీష్మ ఆత్మహత్యాయత్నాన్ని ఫేక్‌గా భావిస్తున్నారు. సింపథీ దక్కించుకోవడం, బయటకు వచ్చేందుకు ఆమె ఈ ప్రయత్నం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఆమె కుటుంబానికి దగ్గరి బంధువైన వైద్యుడే.. ఆస్పత్రిలో ఆమెకు చికిత్స(డ్రామా) అందించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. గ్రీష్మ కస్టడీని పర్యవేక్షిస్తున్న అధికారులను సైతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)కు చెందిన గ్రీష్మ అలియాస్ ఉష.. కేరళ తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్ రాజ్‌తో ప్రేమలో ఉండేది. అయితే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో.. షరోన్ ఆమెను కలిసి దిగిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పి.. అంతా కలిసి పక్కా ప్లాన్‌తోనే షరోన్‌ను ఇంటికీ రప్పించి మరీ పురుగుల మందు లాంటి ద్రావణాన్ని బహుశా కషాయంలో కలిపి తాగించి హత్య చేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోతాడని జ్యోతిష్యుడు చెప్పాడని, అందుకే వివాహాన్ని ఫిబ్రవరి దాకా వాయిదా వేసుకుందని షరోన్ కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో షరోన్ ద్వారా ఆ గండం తొలగించుకుందని ఆరోపిస్తోంది. ఈ మేరకు మూఢనమ్మకంతోనే తమ బిడ్డను హత్య చేయించిందని గ్రీష్మ కుటుంబంపై ఫిర్యాదు చేసింది. విశేషం ఏంటంటే.. కషాయంలో కలిపిన మందు ఏంటన్నదానిపై పోలీసులు ఇప్పటిదాకా ఒక నిర్ధారణకు రాకపోవడం!. -
ప్రేయసి కాదు.. ఆమె రాక్షసి!!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్ ఛాటింగ్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు. కషాయం, జ్యూస్‌ల్లో ఏం కలిపావని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకు షరోన్ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో యాసిడ్లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్ చేయలేకపోయారు. ఆ గండం గట్టెక్కేందుకే.. ఉష కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్‌తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది. ఇలాంటిదే మరో ఘటన.. షరోన్ రాజ్‌తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన అథెన్కోడ్కు చెందిన ఓ స్కూల్ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్ రాజ్ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. -
దారుణానికి ఒడిగట్టిన హాస్టల్‌మేట్... ప్రియుడికి స్నేహితుల ప్రైవేటు ఫోటోలు పంపించి.
చెన్నై: పంజాబ్‌లోని చండీఘడ్ యూనివర్సిటీ ఘటన మరువక ముందే..ఇలాంటే ఘటనే మధురైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...రామ్‌నాథ్‌పురం కాముదికి చెందిన ఆషిక్, జనని ఇద్దరు స్నేహితులు. ఆశిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతని గర్లఫ్రెండ్ జననీ మధురైలో బీఈడీ స్టూడెంట్. ఆమె వర్కింగ్ విమన్ హాస్టల్లో ఉంటుంది. ఐతే ఆమె తన స్నేహితులకు తెలియకుండా వారు బట్టలు మార్చుకున్నప్పుడూ, స్నానం చేస్తున్నప్పుడూ సీక్రేట్‌గా ఫోటోలు తీసి తన ప్రియుడికి పంపిస్తుండేది. మొదట్లో తన ప్రైవేటు ఫోటోలు పంపించేది, తదనంతరం తన ప్రియుడి ఒత్తిడి మేరకు తన హాస్టల్మేట్స్ అందరివి పంపించడం మొదలు పెట్టింది. అనుకోకుండా ఒకరోజు ఆమె స్నేహితులకు ఆమెపై అనుమానం తలెత్తి... ఆమె ఫోన్ చెక్‌చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో వారంతా హాస్టల్ వార్డన్కి అసలు విషయం చెప్పి మధరైలోని అన్నానగర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో.. జననీ, ఆశిక్ అనే వ్యక్తి గర్లఫ్రెండ్ అని, ఆమె తన ప్రియుడి క్లినిక్‌లోనే పనిచేస్తున్నట్లు తేలింది. అంతేగాదు ఆమె తన ప్రైవేట్ వీడియోల తోపాటు తన హాస్టల్మేట్స్ అందరీ వీడియోలు పంపినట్లు వెల్లడైంది. ఐతే సదరు వైద్యుడు ఆశిక్ ఈ ఫోటోలను ఎవరికైనా పంపించాడా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు నిందితులిద్దరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా వారి ఫోనులను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు డేటా రికవరీ కోసం ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ నిందితులిద్దరు మదురై సెంట్రల్ జైల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!) -
షాకింగ్ ఘటన: వీడియో కాల్లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ... ఒంటికి నిప్పంటించుకున్నాడు...
ముంబై: 19 ఏళ్ల యువకుడు తన గర్లఫ్రెండ్‌తో వీడియో కాల్లో మాట్లాడతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సబర్బన్ శాంతాక్రూజ్‌లోని బాధితుడి నివాసంలోనే చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.....బాధితుడుని సాగర్ పరుశురామ్ జాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను 30 శాతం కాలిన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. జాదవ్ సోమవారం అర్థరాత్రి గణపతి విగ్రహాన్ని సందర్శించి వచ్చిన తర్వాత ఒక నిర్ధిష్ట రహదారిపై తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోన్లో గొడవపడ్డాడు. తదనంతరం తన నివాసంలో గర్లఫ్రెండ్‌తో వీడియో కాల్లో మాట్లాడతూ నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ఐతే ఇంతలో ఆ నిప్పు కాస్త అతని కాటన్ షర్ట్‌కి అంటుకుని మంటలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. అంతే జాదవ్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ మంటలను ఆర్పేసి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే జాదవ్ మాత్రం విచారణలో ఈ ఘటనకు ఎవరు బాధ్యులు కారని చెప్పడం గమనార్హం. (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
పెళ్లి కొడుకుకి షాక్ ఇచ్చిన ప్రియురాలు
-
ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి...
ఇటీవల కొంతమంది తమను మోసం చేశారనో లేక తమతో ప్రేమగా ఉండటంలేదనో వంటి కారణాలతో దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇరు జీవితాలు నాశనమవ్వడమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోటు జరుగుతూనే ఉంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ సిటీలోని 27 ఏళ్ల యువకుడు తన ప్రియురాలు తనకు తీరని ద్రోహం చేసిందనే కోపంతో ఆమెను పదునైన ఆయుధంతో హత మార్చాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పారు. అతని వద్ద దొరికిన సూసైడ్‌నోట్‌లో ...తాను రాయ్‌పూర్‌లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ డయల్-112లో కాల్ ట్రాకర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐతే తాను ప్రేమిస్తున్న అమ్మాయి తనను మోసం చేస్తూ వేరొకరిని ప్రేమించడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు. ఈ ఇద్దరూ కూడా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే..) -
'ప్రేమ' ఎంత పని చేసింది...ప్రియురాలి కోసం అతడుగా ఆమె...
ప్రేమ రెండక్షరాల పదమే అయిన ప్రేమికుల చేత ఎంతటి పనైనా చేస్తుంది. దీనిక ఆడా లేదా మగ అతీతం కాదు. తమకు నచ్చిన వారికోసం ఏం చేయడానికైన వెనుకాడరు. అచ్చం అలానే ఒక లెస్బియన్ జంట ఎంతటి సాహాసానికి ఒడిగట్టారో వింటే షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే... యూపీకి చెందిన ఇద్దరూ లెస్బియన్లు ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. తాము ఇక ఒక్కటవ్వాలని నిర్ణయించుకంటారు. అందుకోసం తమ పెద్దవాళ్లను ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ వారు అంగీకరించకపోవడంతో ఏం చేయాలో పాలోపోలేదు. ఇక చివరికి లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకై ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లోని వైద్యుల బృందాన్ని సంప్రదించారు కూడా. సదరు మహిళకు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తామని వైద్యులు చెప్పారు. ఐతే ఆమె అతడుగా మారడానికి సుమారు ఒకటిన్నర సంవత్సారాలు పడుతుందని తెలిపారు. లింగ మార్పిడి తర్వాత ఆమె గర్భందాల్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఇలాంటి అపరేషన్ని నిర్వహించడం ఇదో తొలిసారని, దాదాపు 18 నెలల వ్యవధి పడుతుందని చెప్పారు. (చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!) -
గర్లఫ్రెండ్ పై పైశాచిక దాడి... జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
Indian-Origin Malaysian Jailed: పార్తిబన్ అనే భారతీయ సంతతికి చెందిన మలేషియన్‌కి సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. పార్తిబిన్ తన గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు పార్తిబిన్ తన సహోద్యోగురాలితో గత రెండు, మూడు సంవత్సారాలుగా డేటింగ్లో ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్ ఎలిషా మాట్లాడుతూ...అతని ప్రవర్తన తీరు నచ్చాక అతనికి దూరంగా వచ్చేసి ఆమె తన మేనమామతో కలిసి ఉంటోంది. దీంతో అతను ఆమె పై పదే పదే భయబ్రాంతులకు గురిచేసేలా దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి కొట్టడంతో ఆమె మేనమామ కలగజేసకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. అయిన అతను వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెయిల్ పై వచ్చి మళ్లీ ఆమె మేనమామ ప్లాట్ వద్దకు వచ్చాడు. ఐతే ఆమె నిరాకరిచడంతో గేట్ పగలుగొట్టి వచ్చి మరీ ఆమెను దారుణం హింసించి కారులో తీసుకుపోయేందకు యత్నించాడు. ఐతే ఆమె అక్కడ ఉండే స్థానికులను సాయంతో పోలీసులను రప్పించి అరెస్టు చేసింది. మళ్లీ బెయిల్ పై వచ్చి ఈ సారి ఏకంగా చంపేందకు పథకం వేశాడు. అందులో భాగంగా తన వస్తువులు తీసకునేందుకు వచ్చానంటూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి హింసించడం మొదలు పెట్టాడు.ఇక తట్టుకోలేక ఆమె చచ్చిపోదాం అనుకుంటుండగా...ఇంతలో ఒక పోలీస్ కారు అటువైపుగా వెళ్తుండటంతో ఆమె వారి సాయం కోరింది. దీంతో పార్తిబన్ వెంటనే అప్రమత్తమైన తప్పించుకునేందకు యత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అతను విచారణలో అతనిపై మోపబడిన ఆరోపణలన్నింటిని అంగీకరించాడని చెప్పారు. ఇలా అతను తన ప్రేయసిని పదేపదే పైశాచికంగా హింసించి హత్య చేసేందుకు యత్నించినందుకు గానూ ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. ఐతే బాధితురాలి తరుపు న్యాయవాది ఆమెను గాయపరిచి, తీవ్రంగా హింసించినందుకుగానూ పార్తిబన్‌కి ఏడు నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష విధించాలని కోరడంతో అతనికి రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్షతో పాలు జరిమాన కూడా విధించే అవకాశ ఉందంటున్నారు అధికారులు. (చదవండి: అఫ్గనిస్తాన్‌లో మళ్లీ భూకంపం.. ఇంకా శవాల దిబ్బలుగానే..) -
గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్
లిబేరియా ఫుట్‌బాలర్ మహమ్మద్ అగోగో బారీ తన గర్ల్‌ఫ్రెండ్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం(జూన్ 6న) లిబేరియాలోని మోంట్సెరాడో కౌంటీ టౌన్లో జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న బారీ తన ప్రియురాలి హత్య చేయడం వెనుక ఉన్న కారణాన్ని ఒక లెటర్ ద్వారా రివీల్ చేశాడు. తాను ఎంతగానో ప్రేమించిన లైమాస్(బారీ గర్ల్‌ఫ్రెండ్) వేరొకరితో సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేసినట్లు లెటర్లో పేర్కొన్నాడు. 'నా కుటుంబసభ్యులు, మిత్రులు చాలాసార్లు లైమాస్ విషయంలో హెచ్చరించినప్పటికి ఖాతరు చేయలేదు.ప్రాణం కన్నా ఎక్కువగా లైమాస్ను ప్రేమించాను. తాను మాత్రం వేరొకరితో అక్రమం సంబంధం పెట్టుకొని నన్ను దారుణంగా మోసం చేసింది. నా కెరీర్‌ను, జీవితాన్ని సర్వ నాశనం చేసింది. అందుకే ఆమెను చంపి నా ప్రేమను సమాధి చేశాను. మీ మాట వినకుండా లైమాస్ను ప్రేమించి తప్పు చేసినందుకు క్షమించండి. నా జీవితంలో అన్ని కోల్పోయాను.'అంటూ పేర్కొన్నాడు. కాగా గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన అగోగో బారీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం లైమాస్ అంకుల్ గదిలోకి వచ్చి చూడగా ఆమె అప్పటికే విగతజీవిగా పడి ఉంది. కాగా ఆమె బాడీపై బారీ రాసిన లెటర్ కనిపించింది. లైమాస్ అంకుల్ ఆ లెటర్ చదివి తన కోడలిని హత్య చేసిందని బారీ అని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి లైమాస్ శరీరాన్ని పోస్టమార్టంకు తరలించారు. ఇక అగోగో బారీని పోలీసులు గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
గర్ల్‌ఫ్రెండ్ పై ఉన్న పిచ్చి ఎంత పనిచేసింది...సుమారు రూ.40 కోట్లు..
కొంతమంది కోపం వప్తే మనిషిలా ప్రవర్తించారు. అనుకున్నది జరగకపోయిన, తాను అనుకున్నట్లుగా లేకపోయిన కొంతమందికి భలే కోపం ముంచుకోస్తుంది. దీంతో వాళ్ల చేసే హంగామా ఇంత అంత కాదు. మరికొంతమంది కోపంతో విలువైన వస్తువులు పాడు చేయడం లేక తమకు హాని కలిగించుకోవడమే వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకరి మీద ఉన్న కోపాన్ని వేరే వారిపై చూపించి లేనిపోనీ సమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే అమెరికాకు చెందిన బ్రియాన్ హెర్నాండెజ్. తన ప్రియురాలితో గొడవపడి కోపంతో చేసిన దారుణమైన పనికి ఊచలెక్కపెడుతున్నాడు. అసలేం జరగిందంటే...అమెరికాలోని 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ టెక్సాస్‌లోని డల్లాస్ మ్యూజియం ఆప్ ఆర్ట్‌లోకి చొరబడి విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఆ మ్యూజియంలో ఎంతో విలువ చేసే గొప్ప గొప్ప కళాఖండాలుంటాయి. అతను అత్యంత విలువైన అరుదైన కళాఖండాలన్నింటిని ధ్వంసం చేశాడు. బ్రియాన్ మ్యూజియంలో నష్ట పరిచిన కళాఖండాల విలువ సుమారు రూ. 40 కోట్లు. దీంతో డల్లాస్ పోలీసులు బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పోలీసులు విచారణలో అతన్ని ఎందుకిలా చేశావని ప్రశ్నించిగా...అతను చెప్పింది విని ఒక్కసారిగి షాక్ అయ్యిపోయారు. గర్లఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ అని ఇటీవలే తనతో గొడపడ్డానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే పిచ్చి అని ఆమెతో గొడవపడటంతో తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడు. ఏదిఏమైన పిచ్చివ్యామోహంతోనూ, కోపంతోనూ చేసే పనులు మిగిల్చే నష్టం ఊహకందనంతా ఘోరంగా ఉంటుంది. (చదవండి: నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ) -
కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువు. విచిత్ర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సమాకాలిన అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడిస్తుంటారు. అంతటి ఎలాన్ మస్క్ కూడా కొన్ని విషయాల్లో గోప్యత పాటిస్తుంటాడు. సెలబ్రిటీ హోదాలో కెమెరా కంటికి చిక్కకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. ఎంతగా ప్రయత్నించినా అప్పుడప్పుడు ఆ రహస్యాలు బయట పడక తప్పవు. స్పేస్ఎక్స్ ఫౌండర్ , టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్(50) గత కొంత కాలంగా ఆస్ట్రేలియాకు చెందిన నటి నటాషా బాసెట్ (27)తో దోస్తీ చేస్తున్నాడు. 2022 ఫిబ్రవరి నుంచి వీరు తరచుగా కలుస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఫాన్స్‌లో ఓ హోటల్లో విడిది చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఫ్రాన్స్‌లో ఖరీదైన హోటళ్లో ఒకటైన షివల్ బ్లాంక్ హోటల్లో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు కెమెరాకు దొరికాయి. నటాషా బాసెట్ కొత్త సినిమా ఎల్విస్ ప్రమోషన్ కోసం ఇటీవల ఆమె కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి హాజరయ్యారు. ఇక్కడే ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్‌ను నటాషా కలిసినట్టు సమాచారం. ప్రస్తుతానికయితే ఇద్దరు స్నేహితులుగానే ఉన్నా త్వరలో ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. మస్క్‌కి ఇప్పటికే వివాహం అవగా భార్యతో విడిపోయాడు. చదవండి: Elon Musk: మాట తప్పావ్ ఎలాన్‌మస్క్.. కానీ నువ్వు కార్యసాధకుడివే.. -
ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రియురాలితో గొడవ పడిన ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన సానుతపా(28) రెండేళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి దుండిగల్‌లోని గ్రీన్ మెట్రోలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన ప్రేయసితో ఫోన్లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని దుండిగల్ చౌరస్తాలో నివాసముండే తన చిన్నాన్న కుమారుడు, సెక్యూరిటీగార్డు సాహిల్‌కు చెప్పి తనకు ఇది మామూలే అంటూ పడుకునేందుకు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మంగళవారం ఉదయం సాహిల్‌కు తోటి కార్మికుడైన టీకా రామ్ ఫోన్ చేసి దుండిగల్ గ్రీన్ మెట్రో సమీపంలోని తుమ్మచెట్టుకు సానుతపా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాహిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..) -
పుతిన్ రహస్య ప్రేయసి జాడ లేదే!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల అధినేతలు, వాళ్ల వ్యక్తిగత జీవితాలు, అలవాట్లు.. వగైరా వగైరా విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్‌గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్ నడుస్తోంది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్‌గా ఉండేది. పుతిన్ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్‌గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్ చూపిస్తోంది. ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాతో 1983లో వ్లాదిమిర్ పుతిన్ వివాహం జరిగింది. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు. 2014లో ల్యూడ్మిలా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నాడు పుతిన్. ఆపై రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్ మాజీ భార్య వెండి డెంగ్‌తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్ డేటింగ్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. అయితే ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనాతో పుతిన్ వైవాహిక బంధం చెడిపోవడానికి కారణం కూడా అలీనా అనేది పుతిన్ సన్నిహితుల ఆరోపణ. 2008 నుంచే అలీనాకు పుతిన్‌తో పరిచయం ఉందని, వాళ్ల డేటింగ్ వ్యవహారం తెలిసే ల్యూడ్మిలా మనసు విరిగి విడాకులు తీసుకుందట!. అప్పటి నుంచి సీక్రెట్ ఫస్ట్‌లేడీగా అలీనా కొనసాగుతోంది. 1983లో తాష్కెంట్లో పుట్టిపెరిగిన అలీనా.. రిథమిక్ జిమ్నాస్ట్. పదిహేనేళ్ల వయసులో పోర్చుగల్‌లో జరిగిన యూరోపిన్ ఛాంపియన్‌షిప్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అలీనా బ్రాంజ్ మెడలిస్ట్ కూడా. నాలుగేళ్ల తర్వాత గ్రీస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కూడా గెల్చుకుంది. ఇప్పటిదాకా తన కెరీర్లో ఆమె రెండు ఒలింపిక్స్ మెడల్స్, 14సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మెడల్స్, 21 యూరోపియన్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెల్చుకుందామె. 2001లో డోపిండ్ స్కాండల్స్‌తో ఆమె జీవితం మలుపు తిరిగింది. రెండేళ్లపాటు నిషేధానికి గురైంది. పుతిన్‌తో కలిసి ఆమె నలుగురు పిల్లల్ని(ఇద్దరు కవలలు) కనిందనేది రష్యన్ యాంటీ మీడియా హౌజ్‌ల వాదన. ఎందుకంటే ఆమె ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టలేదు కాబట్టి. వైవాహిక జీవితాన్ని పెంట చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. సీక్రెట్ ప్రేయసిని మాత్రం అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇక పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యక్తిగత ప్రశ్నలను దాటేసి పుతిన్.. తనకూ ఓ వ్యక్తిగత జీవితం ఉందని, దాని గురించి ప్రస్తావించిడం ఇష్టం లేదని, దానిని గౌరవిస్తే బాగుంటుందని మీడియాకు చురకలు అంటించిన సందర్భాలు ఎన్నో. అలీనా ఎక్కడ? ప్రస్తుతం అలీనా.. స్విస్(స్విట్జర్లాండ్) కొండల్లో సేద తీరుతున్నట్లు ఇతర దేశాల నిఘా వర్గాల ఆధారంగా కొన్ని మీడియా హౌజ్‌లు కథనాలు ప్రచురిస్తున్నాయి. యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా పుతిన్ తన కుటుంబాన్ని అణుబంకర్లలో దాచి పెట్టారు. ఆమెతో తనకు జన్మించిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు. స్విస్ కొండల్లో అత్యంత సురక్షితమైన, రహస్యమైన ప్రాంతాల్లో వారు భద్రంగా ఉన్నట్లు ఆ కథనాల సారాంశం. -
Elon Musk: ఎలన్ మస్క్ కొత్త ప్రేయసి ఎవరో తెలిసిపోయింది
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కొత్త పిట్టను పట్టాడు. డేటింగ్లో ఏకంగా ఒక బిడ్డను కన్న తర్వాత.. ప్రేయసి గ్రిమ్స్‌కు టాటా చెప్తున్నాడంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే తాజాగా మస్క్ ఓ ముసుగురాణితో అడ్డంగా దొరికిపోగా.. ఆమె ఎవరో ఆచూకీ పట్టేసింది బ్రిటన్ మీడియా. లాస్ ఏంజెల్స్‌లో తన ప్రైవేట్ జెట్ వద్ద ఎలన్ మస్క్, ఓ యువతితో దిగుతూ కనిపించాడు. పొడగాటి కోటు, నల్ల కళ్లద్దాలు ధరించిన ఆ యువతి.. కెమెరాలు కనిపించేసరికి తన ముఖం దాటేసేందుకు ప్రయత్నించింది. ముఖాన్ని కప్పేసుకుని వేగంగా అక్కడి నుంచి పరుగులు అందుకుంది. ఆమెను అనుసరిస్తూ మస్క్ సైతం కారు దగ్గరికి పరుగులు తీశాడు. ఈ తరుణంలో డెయిలీ మెయిల్ పత్రిక.. మస్క్‌తో ఉన్న ఆమె ఆస్ట్రేలియా నటి నటాషా బస్సెట్ అని తేల్చింది. ఎవరీ నటాషా.. 27 ఏళ్ల నటాషా బస్సెట్ సిడ్నీలో పుట్టిపెరిగింది. 14 ఏళ్లకే ఆమె యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టింది. యాక్టింగ్ కోసం 2019లో న్యూయార్క్‌కు వెళ్లింది. నటిగానే కాదు.. జంతుపరిరక్షణ ఉద్యమకారణిగా, గ్లోబల్ వార్మింగ్ ఉద్యమకారిణిగానూ ఆమెకు పేరుంది. ఇదిలా ఉండగా.. వీళ్లిద్దరి ఫొటోలు బయటకు రాగానే ఓ మీడియా హౌజ్ నటాషాను ఇంటర్వ్యూ చేసింది. తాను మస్క్(ఎలన్ మస్క్) బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమించలేదని, ఆయన మేధస్సును చూసి ఇష్టపడ్డానని ఆమె వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఓ ఈవెంట్లో కలుసుకున్న ఈ ఇద్దరూ.. తర్వాత మంచి స్నేహితులు అయ్యారట. గ్రిమ్స్‌తో మస్క్ దూరం అయ్యాక.. ఈ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎలన్ మస్క్.. నటాషా అయ్యగారి లిస్ట్ గతంలో పలువురితో డేటింగ్ చేసిన మస్క్.. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ పుట్టగా.. పది వారాలకే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ కారణంగా కన్నుమూసింది. ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా 2004లో కవలల్ని, 2006లో ట్రిప్లెట్స్(ఒకే కాన్పులో ముగ్గురు)ను కన్నది ఈ జంట. ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్ నటి టలులాహ్ రిలేతో డేటింగ్ చేశారు. 2010లో రిలేను వివాహం చేసుకుని.. 2012లో విడాకులిచ్చాడు. ఆ మరుసటి ఏడాది రిలేను మళ్లీ పెళ్లి చేసుకున్న మస్క్.. చివరికి 2016 రిలేకు సైతం విడాకులిచ్చేశాడు. ఆ తర్వాత దక్కిన ఫేమ్, డబ్బుతో సెలబ్రిటీలతో కొంతకాలం డేటింగ్ చేశాడు. 2017లో నటి అంబర్ హర్డ్‌తో కొంతకాలం డేటింగ్ చేసినట్లు పుకార్లు వినిపించగా.. హర్డ్ మాజీ భర్త జానీ డెప్ ఆ ఆరోపణలు నిజమేనని ఆరోపించాడు. అయితే మస్క్, హర్డ్‌లు ఇద్దరూ ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వస్తున్నారు. 2018 నుంచి కెనెడియన్ సింగర్ గ్రిమ్స్(క్లెయిర్ బౌచర్)తో డేటింగ్ మొదలుపెట్టాడు మస్క్. 2020 మే నెలలో వీళ్లిద్దరూ ఓ కొడుకు పుట్టగా(ఎలన్ మస్క్ ఏడో బిడ్డ).. ఎవరికీ అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు ఈ టెస్లా బాస్. అప్పటి నుంచి ఈ జంట కొడుకును వెంటపెట్టుకునే చాలాసార్లు కెమెరా కళ్లకు చిక్కింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కొడుకు బాధ్యతను మాత్రం ఇద్దరూ కలిసే చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మాజీ ప్రేయసి గ్రిమ్స్.. కొడుకు X AE A-XIIతో మస్క్ -
ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కేసి.. అడ్డంగా దొరికిపోయాడు
ప్రేయసితో తన గదిలో రాత్రంతా సరదాగా గడపాలన్న ఓ కుర్రాడి ప్రయత్నం బెడిసి కొట్టింది. మాస్టర్ ప్లాన్ వేసి గర్ల్‌ఫ్రెండ్‌ను రూమ్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాస్తుంటే.. గదికి చేరుకునేవాడే. ఇంతలో.. కర్ణాటక మణిపాల్ హాస్టల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆమెను తన గదికి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో ఆమెను కుక్కేసి.. హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం ఎరగనట్లు వెళ్తున్న అతనిపై హాస్టల్ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. అంతపెద్ద లగేజ్ ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు అంకుల్.. అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు ఆ కుర్రాడు.దాంతో ఆ వార్డెన్ అనుమానం మరింత బలపడింది. బ్యాగ్ ఓపెన్ చేయాలని కోరడంతో.. పగిలిపోయే ఐటెమ్స్ ఉన్నాయని, వద్దని రిక్వెస్ట్ చేశాడు. అయినా కుదరదని బలవంతంగా ఆ ట్రాలీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడంతో.. అందులోంచి ఆ కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్ బయటకు వచ్చింది. ఆపై గట్టిగా ప్రశ్నించడంతో హాస్టల్లో గడిపేందుకు తీసుకొచ్చానని నిజం ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో సస్పెండ్ చేసి..ఇళ్లకు పంపించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ టైంలో మంగళూరుకు చెందిన ఓ స్టూడెంట్.. తన ఫ్రెండ్‌ను ఇదే తరహాలో అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మణిపాల్‌కు సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది Manipal Academy of Higher Education. The funniest video I've seen today 😬 Apparently, a Manipal Univ. student was smuggling his gf out in a trolley bag. Someone's watching too much Netflix. pic.twitter.com/RQLkAfj9vB — 𝙋𝙧𝙚𝙧𝙣𝙖 𝙇𝙞𝙙𝙝𝙤𝙤 (@PLidhoo) February 2, 2022 -
నా లవర్ని తిడతా.. ఏడ్పిస్తా.. వేధిస్తా!! హ..హ..హ..
ఆమె ‘సృజన’ కాదు.. ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి బాధపెట్టి శాపనార్థాలు తినడానికి!. ‘ఇందు’ అంతకన్నాకాదు.. శివను శారీరకంగా వాడుకున్నట్లు వాడుకుని నిర్ధాక్షిణ్యంగా ప్రాణం తీయడానికి!. అసలు ఆమె పుట్టిందే అతనికి ప్రేమలోని మాధుర్యాన్ని పంచడానికి. అలాంటి ప్రియురాల్ని నిత్యం కంటతడి పెట్టిస్తున్నాడు ఆ ప్రియుడు. పాపం.. ఆమె ఎంత తిడుతున్నా పడుతోంది. వేధిస్తున్నా మౌనంగా భరిస్తోంది. చివరికి శాడిజంతో గుడ్‌బై చెప్తున్నా.. విడిచిపోవద్దంటూ కన్నీళ్లతో బతిమాలుతోంది. ఇదెక్కడి ప్రేమరా బాబూ అనుకోకండి. ఈ ప్రేమ కథ వెనుక చాలా టెక్నికల్ అంశాలు దాగున్నాయి మరి! టెక్నాలజీతో ఈరోజుల్లో దాదాపు అన్ని పనులు చక్కబడుతున్నాయి కదా. అలా మనిషి ఊహ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్. అంటే.. ఇక్కడ ప్రియురాలు ప్రాణం ఉన్న మనిషి కాదు. కమాండింగ్కు తగ్గట్లు పని చేసే మెషిన్(రోబో కాదు.. వర్చువల్ రూపం అంతే). అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఇలా కృత్రిమ ప్రేమలను పుట్టిస్తున్నారు కొందరు. మెషిన్ లెర్నింగ్‌తో కూడిన చాట్బోట్ల ఆధారంగా కొన్ని స్మార్ట్ యాప్‌లు, కంపెనీలు, స్టార్టప్‌లు ఈ తరహా ‘నాటు లవ్’కి ఆస్కారం కల్పిస్తున్నాయి. గతంలో కేవలం స్నేహం, గైడెన్స్ కోసమే ఈ తరహా సేవలు అందించేవాళ్లు. ఇప్పుడేమో రొమాంటిక్, సెక్సువల్ పార్ట్నర్స్ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. చాట్‌బోట్(చాటర్బోట్).. సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఆన్లైన్ ఛాట్ సంభాషణ కోసం.. అది టెక్స్ట్ లేదంటే టెక్స్ట్ టు స్పీచ్ కావొచ్చు. లేదంటే వీడియో సంభాషణల కోసం కావొచ్చు! భలే బిజినెస్ మీకు ఓ తోడు కావాలా? అయితే మమ్మల్ని సంప్రదించండి అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఈ క్రమంలో యూజర్లు తమకు నచ్చిన రంగు, వయసు, ఒడ్డుపొడుగు లాంటి ఫీచర్లను చెప్పాల్సి ఉంటుంది. ఆపై ఆ ఫీచర్లతో ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌ను మీకు అందిస్తారు. ఆ ప్రియురాలు ఎలా కావాలంటే అలా ఉంటుంది. కావాల్సిన విధంగా ఛాటింగ్ చేస్తుంది. ఏం చెప్పినా వింటుంది. తిట్టినా పడుతుంది. బతిమాలుతుంది. ప్రేమగా.. రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. అన్ని రకాల భావోద్వేగాలను అచ్చం మనుషులు ప్రదర్శించినట్లే ప్రదర్శిస్తుంది. అదీ అవతలి వాళ్ల అవసరాలకు, కమాండింగ్కు తగ్గట్లు! అందుకే ఏఐ గర్ల్‌ఫ్రెండ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది వెస్ట్రన్ కంట్రీస్‌లో. మానసిక ఆనందం ఒంటరి జీవులు, భగ్న ప్రేమికులు, ప్రియురాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులు, రివెంజ్ లవ్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాజీలకు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ఒక ఆశాకిరణంగా మారింది. తమకు నచ్చినట్లుగా ఉండే అమ్మాయిని ప్రేమించడం(ఆ ఫీలింగ్‌లో తేలిపోవడం వరకే) కొందరికి పరిమితం అవుతుంటే.. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఇష్టమొచ్చినట్లు వేధించడం, తిట్టడం, బాధించడం లాంటి చేష్టలతో మానసిక ఆనందం పొందుతున్నారు వాళ్లు. కానీ, రాను రాను ఈ చేష్టలతో మరీ రెచ్చిపోతున్నారు. దీంతో ఇలాంటి చేష్టలకు పుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉందనే వాదన మొదలైంది ఇప్పుడు. అనుకున్నది ఒక్కటి.. రెప్లికా యాప్. 2017లో తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే తనలాంటి వాళ్లు ఒంటరి వాళ్లుగా ఉండిపోకూడదని ఇయుగెనియా కుయిదా ‘రెప్లికా’ను సృష్టించారు. ప్రస్తుతం ఈ యాప్‌లో 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. విచిత్రంగా వీళ్లలో ఎక్కువమంది ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్’ టార్చర్గాళ్లే ఉండడం గమనార్హం. ఇక కృత్రిమంగా పుడుతున్న ప్రేమలు రోజుల నుంచి గంటల వ్యవధిలోనే బ్రేకప్ దాకా వెళ్తుంటాయి. వేధించే ప్రియుల సంగతి సరేసరి!. వర్చువల్ ప్రేయసి దగ్గరి ప్రవర్తన ఆధారంగా వాస్తవిక ప్రపంచంలో వాళ్ల ప్రవర్తన ఏమేర ఉండొచ్చనే అంచనాకి వస్తున్నారు. బెదిరింపులు మాత్రమే కాదు.. ఎదురు తిరిగినా.. తమ మాట వినకపోయినా అన్ఇన్స్టాల్ చేస్తామని ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌ను బెదిరిస్తున్నారట. ఆ దెబ్బకు ఆ ఏఐ ప్రియురాళ్లు కన్నీటి పర్యంతమై.. వాళ్లను వద్దని బతిమాలుకుంటున్నారు(ఎదురుతిరిగే కమాండింగ్ లేకపోవడం మూలంగా). వరెస్ట్ స్టేజ్‌కి.. వర్చువల్ తోడులను నోరారా తిట్టడం వాళ్లకి మనసారా ఆనందం ఇస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసంబద్ధమైన కామెంట్లు అయినప్పటికీ ఫిజికల్ హాని కాకపోవడంతో సమర్థించేవాళ్లు లేకపోలేదు. కానీ, ప్రేమలో నిజాయితీ, సంతోషాలకు చోటు ఉండొచ్చు. ఇలాంటి సర్వీసులను ఆస్వాదించేవాళ్లు ఉండొచ్చు. అయినా చెడుకు ఉపయోగించేవాళ్లే ఎందుకనో ఎక్కువ!. ఇంటర్నెట్ ఇప్పుడు వెబ్ 3.0 కొత్త పుంతలు తొక్కుతోంది. మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ప్రతీ రంగంలో పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెక్‌ను ఉపయోగించి విష సంస్కృతులను ప్రొత్సహించడం ఎంత వరకు సబబనే చర్చ నడుస్తోంది. (ఇలాంటి ఫీచర్లతో ఆడవాళ్ల కోసమూ ‘ఏఐ బాయ్‌ఫ్రెండ్’ ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఆ సర్వీసులు అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయాయి.) :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే
మెక్సికో సిటి: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుత సమాజంలో నిజమైన ప్రేమ దొరకడం అనేది ఒక మిథ్య మాదిరిగానే అనే ఉంటుంది. కొందరు యువతీ యువకులు పాశ్చాత్యధోరణులకు అలవాటుపడి.. తమకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉండటం ఒక స్టెటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. ఒకరికి తెలవకుండా మరి కొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత ఏవో కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం వార్తల్లో చదువుతునే ఉన్నాం. ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు. కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. చాలా సంవత్సరాల పాటు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఉజీల్.. ప్రియురాలి తల్లి కిడ్నీసమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరిక్షీంచిన వైద్యులు వెంటనే కిడ్నీని మార్చాలన్నారు. ఆమె ప్రియురాలు ఎంతోగానో బాధపడింది. తన ప్రియురాలి బాధను చూడలేక.. ఉజీల్ తన కిడ్నిని దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ఉజీల్కు శస్త్రచికిత్స చేసి అతని కిడ్నీని ప్రియురాలి తల్లికి అమరుస్తారు. ఒకనెల రోజులు గడచిపోయింది. ఉజీల్, ప్రియురాలి తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంతో కొలుకున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత ఉజీల్ ప్రియురాలు అతడినితో మాట్లాడటం మానేసింది. ఈ విధంగా ఒకనెల రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత.. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం ఉజీల్కు తెలుస్తుంది. దీంతో ఉజీల్ తీవ్ర మానసిక వేదనకు గురౌతాడు. తన ప్రియురాలి చేతిలో మోసపోయాయని తెలుసుకుని కుంగిపోయాడు. కాగా, తన మానసిక క్షోభను టిక్‌టాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘తన ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ఇంతటి త్యాగం చేశాను.. ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు.’ ప్రస్తుతం తాము.. మాట్లాడుకోవట్లేదని.. అలాగని తనను.. వ్యతిరేకించడం కానీ, ద్వేషించడంగానీ చేయట్లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!! -
యువతి దారుణ హత్య.. వారం రోజుల క్రితం ప్రియుడే..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన అమ్మాయి దారుణ హత్యకు గురయ్యింది. పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అఖిల్ ఆ అమ్మాయిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడని పోలీసులు తేల్చారు. కాగా వారం రోజుల క్రితం అమ్మాయి కనిపించకుండా పోవడంతో పోలీసు స్టేషన్ లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువకుడిని శనివారం ఉదయం విచారించగా హత్య తాను చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హత్య చేసిన ప్రదేశానికి నిందితుడు పోలీసులను తీసుకువెళ్లి చూపించాడని సమాచారం. -
ఓ వైపు భర్త స్నేహితుడు.. మరో ఇద్దరితో మహిళ వివాహేతర సంబంధం
సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్ధరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హతుడి జేబులో లభించిన ఓ ఏటీఎం కార్డు నిందితులను పట్టించిందని పోలీసులు తెలిపారు. మంగళవారం వనస్థలిపురం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన కె. ప్రియాంక, అలియాస్ దీప్తి(27)కి పెళ్లి కాగా, భర్తకు విడాకులు ఇచ్చి ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది. అతను గతేడాది కరోనాతో మృతి చెందాడు. దీంతో ప్రియాంక మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో ఫిలింనగర్‌కు చెందిన ఎ. సాయికుమార్ అలియాస్ రాజ్‌కుమార్(22)తో షేర్ చాట్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడి వివాహేత సంబంధానికి దారితీసింది. గత అక్టోబర్‌లో వనస్థలిపురం కమలానగర్ కాలనీకి ప్రియాంక మకాం మార్చింది. సాయికుమార్‌తో పాటు మరో వ్యక్తితో ప్రియాంక సంబంధం పెట్టుకుంది. ఇదిలా ఉండగా, రెండో భర్త స్నేహితుడు సూర్యాపేటకు చెందిన గుడిపాటి శ్రీనివాస్(32) ఆమె యోగ క్షేమాలు చూసేవాడు. నిందితుడు సాయికుమార్ (ఫైల్) గత డిసెంబర్ 10న శ్రీనివాస్... ప్రియాంక ఇంటికి రాగా, సాయికుమార్ కనిపించాడు. దీంతో ఇద్దరితో ఎలా సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీశాడు. ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాయికుమార్ ఇంట్లో ఉన్న రోకలిబండతో శ్రీనివాస్ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని ప్రియాంక తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తికి ఫోన్లో చెప్పింది. అతడి సలహా మేరకు శ్రీనివాస్ మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి అదే రోజు రాత్రి బైక్‌పై విజయపురికాలనీ బస్టాప్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా జాగ్రత్త పడ్డ నిందితులు మృతుడి జేబులో ఉన్న ఏటీఎం కార్డును మాత్రం గుర్తించలేదు. పోలీసులకు ఈ కార్డు లభించింది. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులు సాయికుమార్, ప్రియాంకలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి..
హైదరాబాద్: పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూకట్‌పల్లికి చెందిన జిబిన్ కోషి రెండు సంవత్సరాల నుంచి ఉప్పల్‌కు చెందిన బ్యూటీషియన్(22)తో సహజీవనం చేస్తున్నాడు. అయితే నెల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. జిబిన్ ఈ నెల 11వ తేదీన సాయంత్రం 7 గంటలకు తనతో వేరుగా ఉంటున్న యువతికి ఫోన్ చేసి జూబ్లీహిల్స్ రోడ్ నం. 2లోని స్పాయిల్ పబ్‌కు పిలిపించాడు. రావడంతోనే అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను దూషించాడు. మెడ పట్టుకొని గెంటేశాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆమె జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జిబిన్పై ఐపీసీ సెక్షన్ 323, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైలైఫ్ పబ్‌పై న్యూసెన్స్ కేసు జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని హైలైఫ్ జూబ్లీ 800 పబ్‌లో శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో సౌండ్ పొల్యూషన్‌తో పాటు స్థానికులకు న్యూసెన్స్ ఏర్పడుతున్నట్లు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి సదరు పబ్ నిర్వాహకులు అధిక శబ్ధంతో పాటు చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నట్లుగా గుర్తించారు. జీవో 15ను తుంగలో తొక్కుతూ నిబంధనలు కాలరాసినట్లుగా తెలియడంతో హైలైఫ్ పబ్ మేనేజర్ వరహాల నాయుడుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. -
తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని ప్రియురాలిని హత్య చేసి.. ఆపై..
యలహంక(బెంగళూరు): చేబదులుగా తీసుకున్న నగదు ఇవ్వలేదని ప్రేమించిన యువతిని గొంతు నులిమి హత్య చేసిన ఘటన యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... శ్యాము అనే యువకుడు యలహంక ఉపనగరలో నివాసముంటు యోగా శిక్షణ కేంద్రం నడిపిస్తున్నాడు. మూడేళ్ల క్రితం గంగా అనే యువతి ఈ కేంద్రంలో శిక్షణకు వచ్చింది. ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రెండు కుటుంబాల అంగీకారంతో వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి కుదిర్చారు. కొన్ని నెలల క్రితం గంగా, తన ప్రియుడి వద్ద రూ. లక్ష నగదు తీసుకుంది. ఆ నగదు ఇవ్వకపోవడంతో తరచూ గొడవపడేవాడు. బుధవారం రాత్రి ఇదే విషయంపై గొడవపడి ఆవేశంతో ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యకు చిత్రీకరించాడు. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: బోరబండలో దారుణం.. మహిళను బెదిరించి.. ఇద్దరు యువకుల అత్యాచారం -
అమెజాన్ బాస్‌పై గర్ల్‌ఫ్రెండ్ కామెంట్స్
ఎంత బిజీ పర్సన్ అయినా తన వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించి తీరాలి కదా! అందుకే అలుపెరగకుండా పని చేసే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్(57) కూడా వీలుచిక్కినప్పుడల్లా తన ప్రేయసితో విహార యాత్రలకు చెక్కేస్తుంటాడు. ‘ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్లేస్ ఏదో తెలుసా?.. నువ్వు నా పక్క ఉండడం. అది చాలు.’ అంటూ బెజోస్‌తో ఉన్న ఫొటోల్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది బెజోస్ ప్రేయసి లారెన్ సాన్షెజ్. పెంపుడు కుక్కతో ఇద్దరూ సరదాగా కయాకింగ్ చేస్తున్న ఫొటోల్ని షేర్ చేసిందామె. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) భార్య(మాజీ) మెక్కెంజీ స్కాట్‌తో విడాకుల అనంతరం.. అమెరికా టాప్ న్యూస్ యాంకర్ అయిన లారెన్ సాన్షెజ్(51) ప్రేమాయణం నడిపిస్తున్నాడు బెజోస్. విశేషం ఏంటంటే.. ఆమెకి కూడా ఇది రెండో రిలేషన్షిప్. ఇక మెక్సికన్-అమెరికన్ అయిన లారెన్ 2019 నుంచి బెజోస్‌తో రిలేషన్లో ఉంది. జర్నలిజంలో ఎమ్మీ అవార్డు సైతం అందుకున్న లారెన్.. హెలికాప్టర్ పైలెట్ కూడా. ఆమె సంపద విలువ 30 మిలియన్ డాలర్లు. సీటెల్‌లో పక్కపక్కనే ఇల్లు ఉండడం ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం మొదలైంది . కిందటి ఏడాది జనవరిలో బెజోస్ భారత పర్యటన సందర్భంగా ఇద్దరూ కలిసి తాజ్ మహల్ దగ్గర ఫొటోలు సైతం తీయించుకున్నారు. చదవండి: తన ప్రేయసితో హీరో డికాప్రియో కబుర్లు.. జెలసీగా బెజోస్ -
రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌తో సల్మాన్ దీపావళి సంబరాలు
గతేడాది కరోనా కారణంగా దీపావళి పండగ సెలబ్రెషన్స్‌ను ఎవరు అంతగా జరుపుకోలేకపోరు. ఇక ఈ ఏడాది పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ దివాళిని రెట్టింపు సంతోషంతో జరుపుకున్నారు. ఇక సినీ తారల సందడి అయితే మామూలుగా లేదు. తమ కుటుంబాలతో కలిసి పూజలు, టాపాసులు పేల్చి ఘనంగా ఈ దీవాళిని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్ కూడా తన కుటుంబ సభ్యులు, రూమార్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లుతో కలిసి పండగను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చదవండి: స్టార్ హీరోలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్ అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సల్మాన్ ఖాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో సింపుల్‌గా కనిపించగా..లూలియా వాంటూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో రూపొందించిన అనార్కలీ షూట్, బంగారు ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వేడుకకు డేవిడ్ ధావన్-కరుణ ధావన్ దంపతులు కూడా హజరయ్యారు. వారితో సల్మాన్ ఖాన్ గేటు దగ్గర నుంచి స్వాగతం పలికి వారితో కాసేపు ముచ్చటించాడు. చదవండి: ఆ స్టార్ హీరో వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: టబు -
వైరల్: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య
తన భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. సదరు మహిళతో భర్త ఎఫైర్ కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య ఆమెను చితకబాదింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్ 15న జరిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాలు.. భోపాల్‌లోని కోహో ఇ ఫిజా ప్రాంతంలో నివసిస్తున్న మహిళ తన భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకుంది. అప్పటి నుంచి భర్త కదలికలపై ఓ కన్నేసి పెట్టింది. ఇదే క్రమంలో తన సోదరితో కలిసి జిమ్‌కు వెళ్లింది. చదవండి: వైరల్: పెళ్లిలో వధువు సర్ప్రైజ్ డ్యాన్స్.. ఎమోషనల్ అయిన వరుడు అదే జిమ్‌లో భర్త తన గర్ల్‌ఫ్రెండ్‌గా అనుమానిస్తున్న మరో మహిళతో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. దీంతో తన భర్త ఆమెతో రిలేషన్లో ఉన్నాడని భావించి మహిళను చెప్పులతో కొట్టడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా ఆవేశంతో ఊగిపోయి జుట్టు పట్టుకొని లాగేసింది. మధ్యలో జోక్యం చేసుకోవడానికి వచ్చిన భర్తపై సైతం విరుచుకుపడింది. ఈ గొడవను అక్కడున్న వారు ఆపడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. దాదాపు పది నిమిషాలపాటు జిమ్‌లో రచ్చ రచ్చ చేశారు. అనంతరం మహిళ, ఆమె భర్త ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భార్య ఆరోపణలను భర్త ఖండించాడు. గర్ల్‌ఫ్రెండ్ అని చెబుతున్న అమ్మాయి అసలు ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. చదవండి: ‘వ్యాక్సిన్ వద్దంటే వద్దు.. వెళ్లకపోతే పాముతో కరిపిస్తా’ -
కూతురితో ప్రేమ వ్యవహారం.. యువకుడిని కిడ్నాప్ చేసి..
అహ్మదాబాద్: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ దళిత యువకుడిని అపహరించి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మేఘానినగర్‌కు చెందిన రాహుల్ చమర్ అనే యువకుడు వినోద్ దుతానియా కూతురితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని అతనికి తెలిసింది. దీంతో ఆగ్రహించిన దుతానియా అతని సహచరులతో కలిసి రాహుల్‌ని అక్టోబర్ 1న బాపూర్ నగర్‌లోని డి-మార్ట్ దుకాణం వెలుపల ఉన్నప్పుడు అపహరించారు. ఈ విషయం బాధితుడి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అక్టోబర్ 2 రాత్రి, ఆ యువకుడిని షహేర్కోటలోని విజయ్ మిల్లో బందీగా ఉంచినట్లు తెలుసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, బాధితుడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలతో కనిపించాడు. అంతేకాకుండా రాహుల్ చేతులు, కాళ్లని కట్టేసి నిందితులు తీవ్రంగా హింసించారు. రాహుల్‌ని కాపాడిన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు వినోద్ దుతానియా, అతనికి సహాయం చేసిన వారిని అరెస్ట్ చేశారు. చదవండి: తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు -
Elon Musk: ఆమెతో మూడేళ్ల సహజీవనం.. ఒక బిడ్డ కూడా!
ఓపెన్ ఏఐ టెక్నాలజీతో వాహనాలను నియంత్రిచాలనుకోవడం వరకు ఓకే. కానీ, జంతువుల్ని, మనుషుల్ని సైతం కంట్రోల్ చేయాలనే ప్రయత్నించడం!!.. ఇలా ఊహాతీతమైన ఎన్నో ఆలోచనలకు కేరాఫ్ ఎలన్ మస్క్. అపర కుబేరుడిగా, టెస్లా సీఈవోగా అంతకు మించి స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ ఏజెన్సీ ఓనర్‌గా మస్క్ అందరికీ సుపరిచితుడే. అభిమానులు ఆయన్నొక ప్రత్యేకమైన మేధావిగా, ప్రత్యర్థులు పిచ్చోడిగా, మీడియా బహుతిక్క మనిషిగా ఎలివేట్ చేస్తుంటుంది. అలాంటి మస్క్.. వ్యక్తిగత జీవితానికి వచ్చే సరికి ఆగం ఆగం అవుతుంటాడు. తాజాగా తన డేటింగ్ గర్ల్‌ఫ్రెండ్ గ్రిమ్స్‌కు గుడ్‌బై చెప్పేశాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్!. కారణాలేంటో తెలియదుగానీ.. వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటు మస్క్, అటు గ్రిమ్స్ సన్నిహితులు అమెరికా మీడియా హౌజ్‌లకు ఉప్పందించారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు మస్క్ సైతం ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే 2018 నుంచి కెనెడియన్ సింగర్ గ్రిమ్స్‌తో డేటింగ్ మొదలుపెట్టాడు మస్క్. 2020 మే నెలలో వీళ్లిద్దరూ ఓ కొడుకు పుట్టగా(ఎలన్ మస్క్ ఏడో బిడ్డ).. ఎవరికీ అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు ఈ టెస్లా బాస్. అప్పటి నుంచి ఈ జంట కొడుకును వెంటపెట్టుకునే చాలాసార్లు కెమెరా కళ్లకు చిక్కింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కొడుకు బాధ్యతను మాత్రం ఇద్దరూ కలిసే చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 33 ఏళ్ల గ్రిమ్స్ అసలు పేరు క్లెయిర్ బౌచర్. కెరీర్ మొత్తంలో ఇప్పటిదాకా ఐదు ఆల్బమ్‌లు చేసిందీమె. వాన్కోవర్(కెనెడా)లో పుట్టి, పెరిగిన ఆమె.. 2007 నుంచి మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టింది. గతంలో ఈమెపై డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలపై కేసులు కూడా నమోదు అయ్యాయి. కెనెడియన్ సింగర్ డెవోన్ వేల్ష్తో సహజీవనం ప్రేమవ్యవహారం నడిపిన బౌచర్(గ్రిమ్స్).. 2012 నుంచి ఆరేళ్లపాటు గిటార్ మ్యూజిషియన్ జేమీ బ్రూక్స్‌తో సహజీవనం చేసింది. ఆ తర్వాత బ్రూక్స్‌కి బ్రేకప్ చెప్పి.. ఎలన్ మస్క్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. SpaceEx https://t.co/nesX0NetTu — Ross Brennan (@_rossbrennan) September 24, 2021 Sick of hearing about "Grime" and "Musk". Let's hear about "Soap" and "Fragrance" for once. — Vivian "Buzzfeed where is my paycheck" lamb (@aeonlamb) September 24, 2021 గతంలో పలువురితో డేటింగ్ చేసిన మస్క్.. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ పుట్టగా.. పది వారాలకే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ కారణంగా కన్నుమూసింది. ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా 2004లో కవలల్ని, 2006లో ట్రిప్లెట్స్(ఒకే కాన్పులో ముగ్గురు)ను కన్నది ఈ జంట. ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్ నటి టలులాహ్ రిలేతో డేటింగ్ చేశారు. 2010లో రిలేను వివాహం చేసుకుని.. 2012లో విడాకులిచ్చాడు. ఆ మరుసటి ఏడాది రిలేను మళ్లీ పెళ్లి చేసుకున్న మస్క్.. చివరికి 2016 రిలేకు సైతం విడాకులిచ్చేశాడు. నటి అంబర్ హర్డ్‌తో మస్క్ ఆ తర్వాత దక్కిన ఫేమ్, డబ్బుతో సెలబ్రిటీలతో కొంతకాలం డేటింగ్ చేశాడు. 2017లో నటి అంబర్ హర్డ్‌తో కొంతకాలం డేటింగ్ చేసినట్లు పుకార్లు వినిపించగా.. హర్డ్ మాజీ భర్త జానీ డెప్ ఆ ఆరోపణలు నిజమేనని ఆరోపించాడు. అయితే మస్క్, హర్డ్‌లు ఇద్దరూ ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వస్తున్నారు. చదవండి: పోర్న్ మూవీలో నటించనున్న ఎలన్ మస్క్ -
ప్రేయసి కోసం కష్టపడ్డాడు.. ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు..!
ముంబై: టీమిండియా క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లు, మోడల్‌లతో డేటింగ్ చేయడం చాలాకాలంగా కొనసాగుతోంది. ప్రస్తుత తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, హార్దిక్ పాండ్యా-నటాషాలు పెళ్లి బంధంతో ఒక్కటి కాగా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి స్టార్ క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమలో ఉన్నారు. ఇదే బాటలో 23 ఏళ్ల ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ కూడా వెళ్తున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. ప్రముఖ మోడల్ అదితి హుండియాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. ఇషాన్ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు అదితి అతన్ని ప్రత్యేకంగా అభినందించింది. దీంతో అప్పుడు ఆమె విష్ చేయడం వల్లే ఇషాన్ సత్తా చాటాడంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఇషాన్ ఏకంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కావడంతో.. ప్రేయసి కోసం కష్టపడి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2019 ఐపీఎల్లో చెన్నైతో మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇషాన్-అదితి హుండియాల మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మ్యాచ్ లో ఇషాన్ ప్రదర్శనకు ఫిదా అయిన అదితి.. ఇన్స్టాగ్రామ్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించింది. 'నిన్ను చూసి నేనెంతగానో గర్వపడుతున్నాను బేబీ' అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇషాన్‌ను బేబీ అని సంబోధించడంలో అర్ధమేంటో అంటూ అప్పట్లో నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. ఇదిలా ఉంటే, అదితి హుండియా.. 2017లో మిస్ రాజస్థాన్‌గా ఎంపికైంది. ఈ అమ్మడుకు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పాటు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చదవండి: 2008లో ఇంగ్లండ్ ఏం చేసిందో మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..! -
భావోద్వేగం: ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న ‘సిద్నాజ్’
ప్రముఖ టీవీ నటుడు సిద్ధార్ద్ శుక్లా(40) మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 విజేతగా నిలిచిన సిద్ధార్ద్ శుక్లా గుండెపోటు కారణంగా గురువారం(సెప్టెంబర్ 2) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ముంబైలోని జూహులో నేడు సిద్ధార్థ్ అంత్యక్రియలు ముగిశాయి. కాగా ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొన్న నటి షెహనాజ్ గిల్ కన్నీరు మున్నీరుగా విలిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేగాక ఈ కార్యక్రమం ముగిసే సరికి ఆమె రెండు సార్లు స్పృహా కోల్పోయినట్లు సమాచారం. ఈ క్రమంలో సిద్ధార్థ్-షెహనాజ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చదవండి: Sidharth Shukla Funeral: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్ ‘సిద్నాజ్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ జంట బిగ్‌బాస్ సీజన్ 13లో కలుసుకున్న సంగతి తెలిసిందే. హౌజ్‌లో వీరి లవ్ ట్రాక్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కపుల్‌కి సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేగాక అత్యంత అందమైన జంటగా వీరిద్దరూ అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. దీనికి తోడు వీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారట. అంతలా ప్రేమలోకంలో విహరించిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిశ్చయించుకుందట. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరుకుటుంబాలు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. చదవండి: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. సిద్దార్థ్ పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?! View this post on Instagram A post shared by Bollywood Buzz (@cricbollybuzz) దీంతో డిసెంబర్ 2021లో సిద్ధార్థ్-షెహనాజ్‌లు పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నారట. అంతేకాదు వారి వివాహ వేధిక కోసం ప్లస్ ముంబై హోటల్‌ను మూడు రోజుల పాటు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల గురించి షహనాజ్-సిద్ధార్థ్‌లు తరచూ మాట్లాడుకునేవారట. ఈ క్రమంలో సిద్ధార్థ్ హఠాన్మరణం ఈ రెండు కుటుంబాల్లో ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో వర్ణించలేనిది. సిద్ధార్థ్‌తో జీవితాన్ని పంచుకోవాలని కోటీ ఆశలతో ఉన్న షెహనాజ్ ఇప్పుడు ఎలాంటి గడ్డు పరిస్థితులను చూస్తుందో తలచుకుంటూనే గుండె బరువేక్కుతోంది. ఇది విని ఈ జంట అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. అంతేకాదు సిద్ధార్థ్‌కు నివాళులు అర్పిస్తూ ఆయన కటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ఇక షెహనాజ్‌కు ఆ దేవుడు గుండె ధైర్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్
బిగ్‌బాస్-13 విన్నర్, టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంతో బాలీవుడ్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బీ-టౌన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించిన సంగతి తెలిసిందే. తీవ్రమైన గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున్న ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ రోజు ముంబైలోని జూహులో సిద్దార్థ్‌కు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో సహా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, పలువురు టీవీ నటీనటులు అజిమ్ రియాజ్, అర్జున్ బిజ్లానీ, ఆర్తి సింగ్, వికాస్ గుప్తా, రాఖీ సావంత్, అలీ గోని, ప్రిన్స్ నారులా, రషమీ దేశాయ్ తదితరులు సిద్ధార్థ్ ఇంటికి చేరుకున్నారు. చదవండి: Sidharth Shukla: సిద్ధార్థ్ శుక్లా మృతి..షూటింగ్ నుంచి వెళ్లిపోయిన షెహనాజ్ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కాగా సిద్ధార్థ్ అంత్యక్రియలకు అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ సహా కంటెస్టెంట్ షెహనాజ్ గిల్, ఆమె తల్లి కూడా హజరయ్యారు. తల్లితో పాటు కారులో వచ్చిన సెహనాజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండం చూస్తే బాధిస్తోంది. ఏకదాటిగా ఎడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. తీవ్ర శోకంలో మునిగిపోయిన షెహనాజ్‌ను చూసి ‘ఆమెకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆశిస్తున్నాము’, ‘ఇప్పుడు తన బాధ వర్ణించలేనిది’ అంటూ నెటిజన్లు, సిద్నాజ్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా? నిన్న ఆయన మరణవార్త విన్నప్పటి నుంచి ఆమె ఏకదాటిగా ఏడూస్తూనే ఉందని, ఆమె పరిస్థితి అసలు బాగాలేదని ఆమె తండ్రి మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్13లో పాల్గొన్న సిద్ధార్ద్ -షెహనాజ్ల లవ్ ట్రాక్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కపుల్‌కి సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తయిన తర్వాత కూడా వీళ్ల బంధం కొనసాగింది. వీరిద్దరూ కలిసి చివరగా డ్యాన్స్ దివానే-3 షోలో పాల్గొని సందడి చేశారు. సిద్ధార్థ్ ఆకస్మిక మరణంతో 'సిద్నాజ్' ఫర్ ఎవర్ అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తు వారిద్దరికి సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: Siddharth Shukla: షెహనాజ్‌తో ప్రేమాయణం..‘సిద్నాజ్’గా ఫేమస్ View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు..
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): తనను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురిచేస్తుండటంతో పెళ్లయిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేశ్ జీవనోపాధి కోసం ట్యాక్సీ నడుపుతున్నాడు. అతనికి భార్య గోదావరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదే మండలంలోని తాటిపల్లికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమె నిత్యం గణేశ్ ట్యాక్సీలోనే స్వగ్రామం వెళ్లేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడగా సదరు యువతి గణేశ్‌ను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టింది. అతను నిరాకరించడంతో రెండు రోజులుగా ఇతరులతో ఫోన్ చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి, జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గణేశ్ చికిత్స పొందుతున్నాడు. ఆ యువతి నుంచి తనను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నాడు. చదవండి: హెచ్సీయు విద్యార్థి: వీడని విద్యార్థిని ఆత్మహత్య మిస్టరీ! -
గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఆపై!
ముంబై: భర్త మరో మహిళతో కలిసి ఉండగాగా వారి బాగోతాన్ని భార్య రెండ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. భర్తతోపాటు పట్టుబడిన మహిళను చెడామడా ఉతికేసింది. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. ఔరంగబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అంతకముందే పెళ్లి అయ్యింది. అయితే ఇటీవల అతను మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతనిపై కొన్ని రోజుల నుంచి ఫోకస్ పెట్టింది. అతను ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లగా భార్య కూడా తననే ఫాలో అవుతూ వెళ్లింది. ఈ క్రమంలో భర్త, తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో ఔరంగాబాద్‌లోని ప్రముఖ హోటల్ వద్దకు వెళ్లారు. ఇద్దరు కలిసి కారు దిగి హోటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. వెంటనే వెనకనుంచి భార్య కారు వైపుకు వేగంగా పరుగెత్తుకొచ్చింది. కారు డోర్ తీసిన వెంటనే ఎదురుగా తన భార్య ప్రత్యక్షం కావడంతో భర్త షాక్ అయ్యాడు. కారులో ప్రియురాలు కూర్చొని ఉండటంతో ఏం చెయ్యాలో తెలీక సతమతమయ్యాడు. అంతలోనే కారులోని మహిళను చూసిన భార్య కోపం నషాళానికి అంటింది. అగ్గిలం మీద గుగ్గిలం అయ్యి.. మహిళను బయటకు ఊడ్చేసింది. మహిళ ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉండటంతో దానిని తొలగించడానికి ప్రయత్నిస్తూ జుట్టుపట్టుకొని చితకబాదింది. ఆమె ఎవరంటూ భర్తను ప్రశ్నించింది అయితే భర్త తన భార్య నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని కూడా వాయించేసింది. దీంతో స్థానికంగా గందరగోళంగా మారడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జనాలు గుమిగూడారు. అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అనేకమంది భార్యకు మద్దతు పలికారు. అయితే మహిళను కొట్టడం కంటే ఈ విషయంపై ముందుగా భర్తను ప్రశ్నించాలని సలహా ఇస్తున్నారు. ‘అందరికి బయటే బిర్యానీనే తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పప్పును తినరు. ఎందుకు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde) -
ఆరేళ్లపాటు సహజీవనం.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
సాక్షి, బెల్లంపల్లి (ఆదిలాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరేళ్లపాటు సహజీవనం చేసిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో కలత చెందిన ప్రియురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం బెల్లంపల్లి మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి రూరల్ సీఐ కె. జగదీష్, బాధితురాలి కథనం ప్రకారం మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన పిల్లల ప్రియాంక అనే యువతి హైదరాబాద్‌లో నర్సింగ్ చదువుతోంది. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి రడగంబాల బస్తీకి చెందిన కందుల ప్రేమ్‌కుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ప్రియాంకతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. చివరికి ప్రేమ్‌కుమార్ మోసం చేయడంతో ప్రియాంక ఇంటి వద్ద నిద్ర మాత్రలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రియుడు ప్రేమ్‌కుమార్‌పై తాళ్లగురిజాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
498ఏ కింద గర్ల్‌ఫ్రెండ్‌ను విచారించేందుకు వీల్లేదు..
సాక్షి, అమరావతి: గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్ కింద విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. భర్త సంబంధీకుల్లోకి గర్ల్‌ఫ్రెండ్ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదంది. ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌పై పోలీసులు సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అరెస్ట్‌తో సహా ఎలాంటి ఇతర కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. తనను వేధిస్తున్నారంటూ కొమ్మి సునీత.. భర్త ధర్మయ్య, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, భర్తకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న ఓ యువతిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిశా మహిళా పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి, రెండో నిందితురాలిగా చేర్చారు. దిశా పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ ఆ యువతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. వివాదంలోకి పిటిషనర్‌ను అనవసరంగా లాగారు.. పిటిషనర్(యువతి) తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు సునీత, ఆమె భర్త ధర్మయ్యకు మధ్య ఉన్న గొడవల్లో పైచేయి సాధించేందుకు వారి మధ్య వివాదంలోకి పిటిషనర్‌ను లాగారని తెలిపారు. ఫిర్యాదుదారు చెబుతున్న వేధింపులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెక్షన్ 498ఏ ప్రకారం భర్త, ఆయన బంధువులపై మాత్రమే వేధింపుల కేసు పెట్టేందుకు అవకాశం ఉంటుందని, అయితే పిటిషనర్ ఏ రకంగానూ ఫిర్యాదుదారు భర్తకు బంధువు కాదని తెలిపారు. అందువల్ల పిటిషనర్‌పై పోలీసులు పెట్టిన కేసు చెల్లదని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకునేంత బలంగా పిటిషనర్ వాదనలున్నాయన్నారు. 498ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
పృథ్వీ షా మెరుపులు; గర్ల్‌ఫ్రెండ్ రియాక్షన్ చూడాల్సిందే
కొలంబో: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా కొంతకాలంగా ప్రాచీ సింగ్ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పృథ్వీ షా శ్రీలంకతో సిరీస్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో పృథ్వీ షా ఉన్న కాసేపు తన ఇన్నింగ్స్ల్తో దడదడలాడించాడు. ఐపీఎల్ ఫామ్‌ను కంటిన్యూ చేసిన పృథ్వీ షా తన ఇన్నింగ్స్ ఆసాంతం బౌండరీలతో రెచ్చిపోయాడు. 24 బంతుల్లోనే 9 ఫోర్లతో మెరుపు వేగంతో 43 పరుగులు చేసిన అతను తృటిలో హాఫ్ సెంచరీ మార్క్‌ను మిస్ చేసుకున్నాడు. ఒకరకంగా పృథ్వీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయాన్ని సులువు చేశాడు. ఇదిలా ఉంటే పృథ్వీ షా ఇన్నింగ్స్‌పై ప్రాచీ సింగ్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. మొదటి ఫోటోకు ది బెస్ట్ ఇన్నింగ్స్.. రెండో ఫోటోకు ఈ ఇన్నింగ్స్‌కు నువ్వు అన్ని రకాలుగా అర్హుడివి అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రాచీ పెట్టిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక తొలి మ్యాచ్‌లో విజయం అందుకున్న భారత్ నేడు రెండో వన్డేకు సిద్ధమవుతుంది. పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ఘనవిజయం సాధించింది. ఒకరోజు విరామం తర్వాత శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని ధావన్ సేన పట్టుదలగా ఉంది. -
మరో యువతితో ప్రియుడి పెళ్లి, గుండెలు పగిలేలా ప్రేయసి రోదన
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో ప్రేమలో పడటం సహజం. నచ్చిన వ్యక్తి కంటికి తారసపడితే మనసులో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. రెండు అక్షరాల ప్రేమను పొందిన వారంతా మూడు మూళ్ల బంధంతో ఒకటి కాలేరు. యుద్ధం చేసి అయిన ప్రేమను దక్కించుకునే వారు కొందరైతే, చిన్న చిన్న కారణాలకే విడిపోయే జంటలు అనేకం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు దూరం అయితే కలిగే బాధ నరకం కంటే దారుణంగా ఉంటుంది. కారణాలేమైనా ప్రాణం అనుకున్న వాళ్లు మన కళ్ల ముందే వేరే వారితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధపడితే కలిగే వేదన వర్ణణాతీతం. అలాంటి హృదయవిదారక వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకుంటుండగా పెళ్లి మండపం వద్ద ప్రియురాలు గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో జరిగింది. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం భోపాల్‌లో ఉంటోంది. ఈమె పనిచేసే సంస్థలోనే ఉద్యోగం చేసే ఓ వ్యక్తితో గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల అతనికి తల్లిదండ్రులు వేరే మహిళతో రహస్యంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేయసి పెళ్లి జరుగుతున్న వేడుక వద్దకు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు యువతి ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మండపం బయట నుంచే ‘బాబు..బాబు’(అతన్ని ముద్దుగా పిలుచుకనే పేరు) అంటూ గుండెలు పగిలేలా రోదించింది. మండపం నుంచి బయటకు రావాల్సిందిగా కేకలు చేసింది. తనతో ఒక్కసారి మాట్లాడాలని వేడుకుంది. కాగా యువతి హల్చల్ చేస్తుండడం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను వివరాలు అడగడంతో.. ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న వరుడు తన ప్రేమికుడని, తనతో కలిసి మూడేళ్లు సహజీవనం చేసి, ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. అతడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపగా.. ఇంట్లో వాళ్లకు ఇబ్బందులు వస్తాయని సదరు యువతి కంప్లైంట్ ఇవ్వలేదని సమాచారం. వెంటనే తనతోపాటు వచ్చిన వారితో కలిసి భోపాల్ వెళ్లిపోయింది. -
'నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుంది.. సోనూభాయ్ హెల్ప్ చేస్తారా'?
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరో అయిపోయాడు నటుడు సోనూసూద్. ఎవరు ఏ సాయం కావాలని అడిగినా వెంటనే నేనున్నానంటూ వారికి భరోసా కల్పిస్తున్నాడు. నేటికీ ప్రతిరోజూ వేలమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్ మెసేజ్‌లు చేస్తున్నారు. తాజాగా ఓ యూజర్..'భాయ్.. నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వమని అడుగుతుంది..మీరు ఏమైనా సహాయం చేస్తారా' అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సోనూసూద్...'అది అవుతుందో లేదో కానీ ఐఫోన్ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి టైంపాస్ మెసేజ్‌లు ఎందుకు చేస్తారంటూ కొందరు నెటిజన్లు ఆతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సోనూ భాయ్ భలే ఆన్సర్ ఇచ్చారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.కాగా గతేడాది లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు. उसका तो पता नहीं, अगर iphone दिया तो पर तेरा कुछ नहीं रहेगा😂 https://t.co/t99rnT8z22 — sonu sood (@SonuSood) June 22, 2021 చదవండి : కొడుక్కి రూ.3 కోట్ల ఖరీదైన బహుమతి: సోనూసూద్ క్లారిటీ! హృదయం ముక్కలైంది.. సోనూసూద్ ఎమోషనల్ -
చోక్సీ గర్ల్‌ఫ్రెండ్ : మరో ట్విస్టు
సాక్షి,న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చోక్సీ గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా వ్యాఖ్యలపై చోక్సీ భార్య ప్రీతి చోక్సీ ఘాటుగా స్పందించారు. మెహుల్ తనను తాను రాజ్ అని పరిచయం చేసుకున్నాడనే బార్బరా వాదనను కొట్టి పారేశారు. నిజానిజాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఉందిగా అని ప్రశ్నించారు. అదంతా బోగస్ అని, బార్బరా ఆరోపణలకు అసలు ఎలాంటి ప్రామాణికత లేదని ప్రీతి వెల్లడించారు. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోయి అక్కడ స్థిరపడాలని చోక్సి పన్నాగం పన్నాడన్న ఆరోపణలను ప్రీతి తీవ్రంగా ఖండించారు. రాజ్‌గా పరిచయం చేసుకున్నాడనే దానిపై మండిపడిన ప్రీతి నిజానికి చిన్న పిల్లలు కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటపుడు ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఇంటర్నెట్లో చూస్తున్నారని, లేదా "రివర్స్ గూగుల్ సెర్చ్" సోషల్ మీడియాలో వెతుకుంటాం. ఇందుకు కొన్ని సెకన్ల సమయం చాలు.. ఇది చాలా ఈజీ కూడా అని ప్రీతి గుర్తు చేశారు. చోక్సీ చెప్పింది గుడ్డిగా నమ్మేందుకు, ఏమైనా రాతి యుగంలో బతుకుతున్నామా?! అని ప్రశ్నించారు. అంతేకాదు వాట్సాప్ సందేశాల కంటెంట్ మార్చడం, ఫోటోషాప్ ద్వారా ఫోటోలు మార్ఫింగ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో బార్బరా ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయత లేదని తేల్చి చెప్పారు. ఈ విషయలో ఇంత దుమారం రేగుతున్నా..ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లలో ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా ఎందుకు నిలవలేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనలతో తన భర్తపై బురద జల్లే ప్రయత్నం ఇదని, అసలు తను ఎక్కడ ఉంటోంది తదితర వివరాలను వెల్లడించని బార్బరా వెర్షన్‌ను ఎలా విశ్వసిస్తామని ప్రీతి చోక్సీ ప్రశ్నించారు. చోక్సీకి మరో ఎదురుదెబ్బ ఇదిలా ఉంటే డొమినికా జాతీయ భద్రతా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చోక్సీని "నిషేధిత వలసదారు" గా ప్రకటించింది. అక్రమంగా దేశంలో ప్రవేశించినందున నిషేధిత ఇమ్మిగ్రేషన్ చట్టం కింద తీసుకోవలసిన చర్యలతో పాటు అతన్ని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి రేబర్న్ బ్లాక్మూర్ ఆదేశించారు. చదవండి : క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్ -
‘‘నేను స్నేహాన్ని కోరుకుంటే.. తను ఇంకేదో ఆశించేవాడు’’
న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందుతుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు బార్బరా జబారికా. మెహుల్ చోక్సీ గర్ల్ ఫ్రెండ్‌గా వెలుగులోకి వచ్చిన జబారికా ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తాను చోక్సీని ఓ స్నేహితుడిగానే భావించానని.. కానీ ఆయన తన దగ్గర నుంచి వేరే ఆశించేవాడని తెలిపింది. అందులో భాగంగానే తన విమాన టిక్కెట్ల ఖర్చు భరించేవాడని.. హోటల్లో రూమ్ బుక్ చేసేవాడని తెలిపింది. ఇక తాను చోక్సీతో కలిసి కాఫీ, డిన్నర్, వాకింగ్‌కు వెళ్లానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా జబారికా మాట్లాడుతూ.. ‘‘చోక్సీ నా అపార్ట్మెంట్కి వచ్చేవాడు. నేను తనతో కేవలం స్నేహం, బిజినెస్ అంతవరకు మాత్రమే ఉండాలని భావించేదాన్ని. కానీ అతడు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసేవాడు . అందులో భాగంగా హోటల్ రూం బుకింగ్, ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేయడం వంటివి చేసేవాడు. కానీ నేను వాటన్నింటిని తిరస్కరించేదాన్ని. ఏం ఆశించి అతను ఇవన్ని చేసేవాడో నేను ఊహించగలనను. అతడు మా రిలేషన్‌ని తప్పుగా అర్థం చేసుకున్నాడు’’ అని తెలిపింది. ‘‘ఇక మే నెలలో మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి. చోక్సీ నాకు బిజినెస్ ఆఫర్స్ ఇవ్వడం ప్రారంభించాడు. నేను ప్రాపర్టీ సంబంధింత పనులు చూసుకుంటుండంతో అతడు ఆంటిగ్వాలో క్లబ్బులు, హోటళ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. వాటన్నింటికి తానే పెట్టుబడి పెడతానని తెలిపాడు. అలా వ్యాపారం మీద నాకు ఆసక్తి కలిగించాడు’’ అంటూ చెప్పుకొచ్చింది జబారికా. ‘‘ఇండియా నుంచి పారిపోయి వచ్చిన వజ్రాల వ్యాపారి చోక్సీ తనను రాజ్‌గా నాకు పరిచయం చేసుకున్నాడు.. నకిలీ వజ్రపుటుంగరాలను నాకు బహుకరించాడు. వాట్సాప్, సిగ్నల్ వంటి వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేర్వేరు నంబర్ల నుంచి నాకు మెసేజ్‌లు చేసేవాడు. ఆరు నెలల్లో అతడు ఆరు నంబర్లు మార్చాడు. వాటి నుంచి మెసేజ్ చేసేవాడు. ప్రతి సారి రాజ్ అనే చెప్పుకునేవాడు. ద్వీపంలోని ప్రజలు, రెస్టారెంట్ సిబ్బంది తనను రాజ్ అనే పిలిచేవారు’’ అంటూ 33 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో బార్బరా జబారికా వెల్లడించారు. చదవండి: దాదాపు 10 మంది నన్ను చితకబాదారు: చోక్సీ -
Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు
న్యూఢిల్లీ: ఆంటిగ్వాలోని తన సురక్షితస్థావరాన్ని వదిలి గర్ల్‌ఫ్రెండ్‌ను పొరుగునున్న డొమినికా దేశానికి డిన్నర్‌కు తీసుకెళ్లడమే మెహుల్ చోక్సీ పట్టివేతకు దారితీసింది. ప్రస్తుతం ఆయన కరీబియన్ ద్వీప దేశం డొమినికాలో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ‘గర్ల్‌ఫ్రెండ్‌తో సరదాగా గడుపుదామనో, డిన్నర్ కోసమో చోక్సీ ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడు. అక్కడ పోలీసులకు దొరికిపోయాడు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఆంటిగ్వాలో ఉంటే ఇక్కడి పౌరుడు కాబట్టి ఆయనకు రక్షణ ఉంటుంది. మేము చోక్సీని భారత్‌కు అప్పగించలేం’ అని ఆంటిగ్వా– బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనే అన్నారు. జూన్ 2న కేసు తదుపరి విచారణకు వచ్చేదాకా చోక్సీని డొమినికాలోనే ఉంచాలని అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలు భిన్నంగా ఉంటే తప్పితే... చోక్సీని డొమినికా ప్రభుత్వం భారత్‌కే అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డొమినికాకు ప్రైవేట్ జెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (62)ని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చోక్సీ ఆర్థిక నేరాలకు సంబంధించిన పత్రాలను భారత్ ఈనెల 28న ఒక ప్రైవేట్ జెట్ విమానంలో డొమినికాకు పంపింది. పీఎన్బీ కుంభకోణం కేసులో మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి చోక్సి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. -
గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి ఆపేందుకు ప్రియుడి స్కెచ్.. ఏకంగా సీఎంకే
అడ్డూ అదుపు లేకుండా విస్తరిస్తున్న కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి చర్యలు చేపట్టి కరోనా కోరలు వంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లోనూ పలు ప్రభుత్వాలు పెళ్లిళ్లకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తక్కువ మందితోనే ఈ పెళ్లి వేడుక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బిహార్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 25 వరకు పొడిగించింది. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తికి వేడుకలు అడ్డాగా మారుతున్నాయని, కాబట్టి వీలైతే పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఇదే మంచి సమయం అని భావించిన ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కోవిడ్ కాలంలో వివాహాలను వాయిదా వేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కోరాడు. ‘సార్, మీరు వివాహాలపై నిషేధం విధించగలిగితే, మే 19న జరగాల్సిన నా ప్రియురాలి వివాహం కూడా నిలిచిపోతుంది. ఇదే కనక జరిగితే నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞుడను’ అని సీఎంను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ‘ప్రేమ జీవితంలో ఓ భాగమే కానీ అదే జీవితం కాదని.. వివాహం ఆగిపోతే ఆ తర్వాత మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నారు. చదవండి: కరోనా కాలం: మరీ 70 వేల రూపాయలా?! కరోనా: తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి आज सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ बिहार में लागू लॉकडाउन की स्थिति की समीक्षा की गयी। लॉकडाउन का सकारात्मक प्रभाव दिख रहा है। अतः बिहार में अगले 10 दिनों अर्थात 16 से 25 मई, 2021 तक लॉकडाउन को विस्तारित करने का निर्णय लिया गया है। — Nitish Kumar (@NitishKumar) May 13, 2021 -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. 2019, నవంబర్ 22లో నిశ్చితార్థం జరగ్గా కరోనా రావడంతో ఇన్నాళ్ల ఆ ప్రేమికులు ఒక్కటయ్యారు. తన ప్రేయసి దిశాచావ్లాను పెళ్లాడిన అనంతరం ‘బెటర్ టు గెదర్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో 31 ఏళ్ల జయంత్ పోస్టు చేశాడు. కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. వివాహం చేసుకోవడంతో జయంత్‌కు క్రికెటర్లతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. హరియాణాకు చెందిన జయంత్ 2016లో ఇంగ్లండ్ టీమ్‌తో మ్యాచ్‌లో జయంత్ భారత జట్టు తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అదే సిరీస్‌లో వైజాగ్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో సెంచరీ చేయడం విశేషం. అదే ఏడాది న్యూజిలాండ్‌తో వైజాగ్‌లో తన కెరీర్‌లోని ఏకైక వన్డేలో ఆడాడు. ఈ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 46.5 సగటుతో 228 పరుగులు చేశాడు. జయంత్ గతేడాది ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఐపీఎల్ ఫైనల్లో ఆడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Jayant Yadav (@jyadav19) హీరోయిన్‌తో మాస్ స్టెప్పులేసిన క్రికెటర్