కొంతమంది కోపం వప్తే మనిషిలా ప్రవర్తించారు. అనుకున్నది జరగకపోయిన, తాను అనుకున్నట్లుగా లేకపోయిన కొంతమందికి భలే కోపం ముంచుకోస్తుంది. దీంతో వాళ్ల చేసే హంగామా ఇంత అంత కాదు. మరికొంతమంది కోపంతో విలువైన వస్తువులు పాడు చేయడం లేక తమకు హాని కలిగించుకోవడమే వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకరి మీద ఉన్న కోపాన్ని వేరే వారిపై చూపించి లేనిపోనీ సమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే అమెరికాకు చెందిన బ్రియాన్ హెర్నాండెజ్. తన ప్రియురాలితో గొడవపడి కోపంతో చేసిన దారుణమైన పనికి ఊచలెక్కపెడుతున్నాడు.
అసలేం జరగిందంటే...అమెరికాలోని 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ టెక్సాస్‌లోని డల్లాస్ మ్యూజియం ఆప్ ఆర్ట్‌లోకి చొరబడి విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఆ మ్యూజియంలో ఎంతో విలువ చేసే గొప్ప గొప్ప కళాఖండాలుంటాయి. అతను అత్యంత విలువైన అరుదైన కళాఖండాలన్నింటిని ధ్వంసం చేశాడు. బ్రియాన్ మ్యూజియంలో నష్ట పరిచిన కళాఖండాల విలువ సుమారు రూ. 40 కోట్లు.
దీంతో డల్లాస్ పోలీసులు బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పోలీసులు విచారణలో అతన్ని ఎందుకిలా చేశావని ప్రశ్నించిగా...అతను చెప్పింది విని ఒక్కసారిగి షాక్ అయ్యిపోయారు. గర్లఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ అని ఇటీవలే తనతో గొడపడ్డానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే పిచ్చి అని ఆమెతో గొడవపడటంతో తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడు. ఏదిఏమైన పిచ్చివ్యామోహంతోనూ, కోపంతోనూ చేసే పనులు మిగిల్చే నష్టం ఊహకందనంతా ఘోరంగా ఉంటుంది.
(చదవండి: నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ)
Comments
Please login to add a commentAdd a comment