museum
-
వైకే యాంటిక్ హోం మ్యూజియం: అబ్బురం, అద్భుతం
గతమెంతో ఘనం.. నేడు జీవనమే గగనం..అనే నానుడి అందరికీ తెలిసిందే..నగరంలోని వైకే యాంటిక్ హోంలో ఏర్పాటు చేసిన మ్యూజియం చూస్తే ఇదే అక్షర సత్యం అని అనిపించక మానదు.. మన పూర్వీకులైన తల్లిదండ్రులు, తాత ముత్తాతల జీవన శైలి మనకు అబ్బురంగానూ.. అద్భుతంగానూ అనిపిస్తుంది.. నేటి ఆదునిక పోకడలు అనారోగ్యాలు తెచ్చిపెడుతోంటే.. నాటి జీవన శైలివైపుకే మరలా అడుగులు పడు తున్నాయి.. వంట పాత్రల నుంచి ఆహార పదార్థాల వరకూ కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే నానుడి నుంచి.. ఆ పాత మధురం.. అనే రీతిలో నేటి తరం జీవన శైలి మారుతోంది.. ఇత్తడి, రాగి, మట్టి పాత్రలకు ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిమాండే ఇందుకు నిదర్శనం.. – సాక్షి, సిటీబ్యూరోమన పూర్వీకులు వంట చేసుకోవడం మొదలుకుని తినడానికి వాడే గిన్నెలు, ప్లేట్లు, పాత్రలు, సంగీత పరికరాలు, పెద్ద పెద్ద శబ్ధాలు చేసే పరికరాలు.. ఇలా అన్నీ ఒకే చోట కనువిందు చేస్తే.. ఆ ప్రాంతం నుంచి వెనిక్కి రావడానికి మనుసు ఒప్పుకోదు. అలాంటి ప్రదేశాల్లో ఒకటి సికింద్రాబాద్‌లోని వైకే యాంటిక్ హోం మ్యూజియం. పిల్లలకు మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయడం, పూర్వీకుల జీవన విధానంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రదేశాలు ఎంతో తోడ్పడతాయి. దాదాపు 1400 సంవత్సరాల నాటి కాలంలో వినియోగంలో ఉన్న వస్తువుల నుంచి 20వ శతాబ్దం వరకూ అప్పటి జీవన విధానంలో వినియోగించిన అనేక పరికరాలు, వస్తువుల, ఆయుధాలు ఈ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. మన పూర్వీకులకు చెందినవే కాకుండా ఇతర దేశాలకు చెందిన పలు రకాల చారిత్రక, సాంస్కృతిక వస్తువులు ఇక్కడ సందర్శనకు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు ప్రవేశం ఉచితం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మ్యూజియంలోకి అనుమతిస్తారు. 9963822339 లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తొలుత పది వస్తువులతోమాది కాకినాడకు సమీపంలోని సోమేశ్వరం. కుటుంబాన్ని చెన్నైకి తరలించే క్రమంలో మా అమ్మ పురాతన వస్తువులను వెంట తెచ్చుకుంది. వాటిని చూసినవారు చాలా బాగున్నాయని ప్రశంసించేవారు. దీంతో ఇలా అందరికీ మధురజ్ఞాపకాలను అందించే వస్తువులను సేకరించాలని నిర్ణయించుకున్నా. 50 ఏళ్ల నుంచి సికింద్రాబాద్‌లోని లోతుకుంటలో ఇంటినే మ్యూజియంగా మార్చాను. తొలుత 10 వస్తువులతో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం వెయ్యికిపైగా వస్తువులకు చేరింది. – వై.కృష్ణమూర్తి, మ్యూజియం నిర్వాహకులు అమ్మ గుర్తుకొచ్చిందిమేం చిన్నప్పటి నుంచి వినియోగించే చాలా రకాల వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. స్నానాలకు నీరు వేడిచేసే పాత్ర, పచ్చడి పెట్టుకునే పింగాణీ కుండలు, కంచు, ఇత్తడి సామాగ్రిని చూసిన వెంటనే అమ్మ గుర్తుకొచ్చింది. కాలంతో పాటు పాత్రలు మారిపోతున్నాయి. – సుభాషిణి, బేగంపేట్ -
పక్షులకూ ఓ మ్యూజియం
టెక్కలి: ఏటా శీతాకాలం ఆరంభంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా ప్రాంతం నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ వలస పక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుంటాయి. తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రంలో గల చింత, రావి, తుమ్మ, గండ్ర, జూము, వెదురు తదితర చెట్లపై ఆవాసాలు చేసుకుని సమీపంలో చిత్తడి నేలల్లో వేట కొనసాగిస్తాయి. సమీపంలో గల చిత్తడి నేలలో 120 రకాల పక్షులు ఉన్నట్లు అంచనా. దూరం నుంచి పక్షులు చూడడం ఆనందించడం సహజం. పక్షులను దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఇక్కడ పక్షుల మ్యూజియం ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ పక్షుల విన్యాసాలను తిలకించడానికి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. విదేశీ పక్షులైన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల విన్యాసాలతో పాటు ఈ పక్షుల మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తోంది.మ్యూజియంలో నమూనాలు..విదేశీ పక్షుల ప్రత్యేకతలు ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆయా ప్రత్యేకతలు మ్యూజియంలో నమూనాలు పరిశీలిస్తే.. పెలికాన్: పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు 14 సెంటీమీటీర్లు. దీని రెక్కల పొడవు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకేసారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాసంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతి సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. రోజుకు 2 సార్లు ఆహారం కోసం బయటకు వెళ్తుంటాయి. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 ఏళ్లు.పెయింటెడ్ స్టార్క్: పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 ఏళ్ల కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 ఏళ్లు.120 రకాల పక్షుల్లో కొన్ని పక్షుల ప్రత్యేకతలు..పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాసంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. -
రాహుల్ గాంధీకి ప్రధాని మ్యూజియం లేఖ
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్‌కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది. ఈ మేరకు.. సెప్టెంబర్‌లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్‌బాటెన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్‌లో ఉన్నాయి.నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’ -
ఎనిమిదో వింత పక్షి మ్యూజియం
పక్షి మ్యూజియం అంటే... రకరకాల పక్షుల రూపాలు, వాటి రెక్కలు, గుడ్లు, పొదిగిన పిల్లల రూపాలను ఒక చోట పొందు పరిచిన మ్యూజియం కాదు. పక్షి ఆకారంలో ఉన్న మ్యూజియం. జటాయు పక్షి ఆకారంలో ఉన్న ఈ మ్యూజియం పరిమాణం కూడా జటాయువులాగ భారీగానే ఉంటుంది. రెండు వందల అడుగుల పొడవు, నూట యాభై అడుగుల వెడల్పు, డెబ్బై అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ మ్యూజియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ మ్యూజియం కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలో ఉంది. ఈ మ్యూజియాన్ని జటాయు ఎర్త్ సెంటర్ అంటారు. ఈ మ్యూజియం ఉన్న కొండ ప్రదేశాన్ని జటాయు నేచర్ పార్క్ అంటారు.జటాయు పురజటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో కీలక పాత్ర జటాయువుది. ఆ ఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మాణం లోపల జటాయువు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్‌వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది.రామాయణం గొప్పదనం ఇదేవెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు. శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. సీతాపహరణం సమయంలో రావణాసురుడిని అడ్డగించిన జటాయువును రావణాసురుడు సంహరించాడని రామాయణం చెబుతుంది. ఈ ఘట్టానికి వేదిక ఈ జటాయుపుర అని కేరళవాళ్లు చెప్పుకుంటారు. తెలుగు వాళ్లుగా మనం అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా చెప్పుకుంటాం. రామాయణం గొప్పదనం అది. దేశం అంతటా ప్రతి ఒక్కరూ కథను స్వాగతిస్తూ ఐడింటిఫై అవుతారు.జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
కూతురితో ప్రియాంక విహారం.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అలా!
-
దస్తన్ ఆటో వరల్డ్ కార్ల మ్యూజియం
రోల్స్‌రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్‌జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్‌లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్లో చూడవచ్చు. ఈ కలెక్షన్‌కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్‌లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్‌రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదైంది. ప్రియమైన ప్రయాణం!ఈ మ్యూజియంలో ఉన్న బైక్‌లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్‌కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు. గంట కొట్టే కారుమ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్‌లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మెగా మ్యూజియం గురించి తెలుసా?
మ్యూజియం అంటే కళాఖండాలు, పురాతన వస్తువులు ఉంటాయని తెలుసు. అయితే చిన్నపిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియం గురించి మీకు తెలుసా? అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇండియానా పోలిస్ అనే ప్రాంతంలో ’The Children’s Museum of Indianapolis.’ ఉంది. ప్రపంచంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజియం ఇది. 1925లో మేరీ స్టీవర్ట్ కారీ అనే ఆయన దీన్ని ప్రారంభించారు. మొదట చిన్నగా మొదలైన ఈ మ్యూజియం అనంతరం విస్తరిస్తూ 1976లో అతి పెద్ద మ్యూజియంగా మారింది. 4,72,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియంలో ఐదు అంతస్తులున్నాయి. ఇక్కడ దాదాపు 1,30,000కు పైగా రకరకాల వస్తువులు, కళాఖండాలు ఉన్నాయి. ఏటా పది లక్షలమందికి పైగా ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. వారికి సేవలందించేందుకు నాలుగు వందల మంది ఉద్యోగులు, 1500 మంది వాలంటీర్లు ఉంటారు.చిన్నారుల్లో సైన్స్ పట్ల, సామాజిక అంశాల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. ఇందులో సైన్స్, చరిత్ర, జంతువులు, వైద్యం, సామాజిక, ఆర్థిక అంశాలను సూచించే అనేక వస్తువులున్నాయి. అవన్నీ పిల్లలకు చూపించడం ద్వారా వారిలో ఆ అంశాలపై అవగాహన పెంచుతారు. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో అంశానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. డైనోసార్ల జీవితం, వాటి మరణం వంటి అంశాలను వివరించేందుకు ఇక్కడ ప్రత్యేక విభాగం ఉంది. అది చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది.కేవలం వస్తువులు చూసి వెళ్లిపోయేలా కాకుండా ఈ మ్యూజియంలో పలు క్రీడా కోర్టులు ఏర్పాటు చేశారు. చిన్నారులు అక్కడికి వెళ్లి వారికి నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. మ్యూజియంలో ‘లిల్లీ థియేటర్’ కూడా ఉంది. అక్కడ చిన్నారుల కోసం ప్రత్యేకంగా నాటకాలు, షోలు ఏర్పాటు చేస్తుంటారు. -
విచిత్ర వాహనాలు: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు. ఇందులో షూ ఆకారంలో ఉన్న వాహనం రోడ్డుపై ప్రయాణిస్తుండటం చూడవచ్చు. ఈ వాహనం ఒక వ్యక్తి అభిరుచి వల్ల పుట్టినట్లు తెలుస్తోంది.వీడియో షేర్ చేస్తూ.. ''ఎంత చమత్కారమైనా తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించే వ్యక్తులు లేకుంటే ఈ ప్రపంచ ఆసక్తిగా ఉండదు. ఈ వీడియోలో కనిపించే వెహికల్ చాలా చమత్కారంగా ఉంది. ఇలాంటి కార్ల పట్ల ఏదైనా అభిరుచికి మేము మద్దతిస్తాము అని అన్నారు. నేను ఈ సారి ఎప్పుడైనా హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను'' అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..నిజానికి ఇలాంటి కార్లను హైదరాబాద్ వ్యక్తి సుధాకర్ రూపొందిస్తున్నారు. విచిత్ర రూపాలలో తయారు చేసిన కార్లను సుధా కార్ మ్యూజియం పేరుతో ఓ మ్యూజియం సృష్టించి అక్కడ ప్రదర్శించారు. ఇక్కడ వివిధ ఆకారాల్లో వాహనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వివిధ ఆకారాల్లో వాహనాలను తయారు చేయడంతో ఈయన గిన్నిస్ రికార్డులో సైతం చోటు సంపాదించుకున్నారు.If there weren’t any people who doggedly pursued their passions—no matter how quirky—this world would be far less interesting..I’m embarrassed to say I hadn’t heard about the Sudha Car Museum in Hyderabad—even though I travel there often—until I recently saw this clip.… pic.twitter.com/c4LASs1JRV— anand mahindra (@anandmahindra) October 26, 2024 -
ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
గడ్డకట్టే చలిలో గజగజలాడిపోయిన ప్రజలు అని వార్తల్లో వింటుంటాం. అంతెందుకు అందరూ ఇష్టపడే టైటానిక్ మూవీలో 1912 నాటి విపత్తు ఘన చూపించారు. ఆ మూవీలో అంట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతం ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయిన సీన్లోని హృదయవిదారక దృశ్యాలు అందర్ని కంటతడి పెట్టిస్తాయి. అయితే దీని గురించి సినిమాల్లోనూ, వార్తల్లో వినటమే గానీ గడ్డకట్టే చలి ఎలా ఉంటుందో అనేది రియల్‌గా తెలియదు. ఆ ఫీల్ కావాలనుకుంటే ఈ మ్యూజియం వద్దకు వెళ్లిపోండి. అమెరికాలో టెన్నెస్సీలోని టైటానిక్ మ్యూజియం ఈ సరికొత్త అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. టైటానిక్ ఓడ మునిగినప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఉష్ణోగ్రత(రెండ డిగ్రీల సెల్సియస్)ని చవిచూడొచ్చు. 400కి పైగా టైటానిక్ ప్రామాణిక కళాఖండాలు కలిగి ఉన్న మ్యూజియం సందర్శకులకు ఓ గొప్ప అనుభూతిని అందిస్తోంది. గడ్డకట్టే నీటిలో అనుభవాన్ని పొందుతున్న సందర్శకులు వీడియోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ప్రతి సందర్శకుడు మంచుకొండను తాకిని ఫీల్ కలుగుతుందని చెబుతుండటం చూడొచ్చు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి టైటానిక్ ఓడ మునిగిపోయినప్పుడూ చనిపోయిన యాత్రికులు ఎంత బాధ అనుభవించి ఉంటారో అని తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ పోస్టులు పెట్టారు.At the Titanic Museum you can find this basin filled with water, set to the exact temperature that the people in the surrounding waters would have had to swim in after the ship sank. The ocean temperature was about 30°F.pic.twitter.com/38e9jjXjEh— Massimo (@Rainmaker1973) September 11, 2024 (చదవండి: ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!) -
ఇదిగో కూజా..!
ఇదేమిటో గుర్తు పట్టారా? దాదాపు మూడు వారాల క్రితం ఇజ్రాయెల్‌లోని హెక్ట్ మ్యూజియంలో ఏరియల్ గెలర్ అనే నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తాకడంతో కింద పడి ముక్కలైపోయిన 3,500 ఏళ్ల నాటి అరుదైన కూజా ఇది. పట్టి చూస్తే తప్ప పగిలిన ఆనవాళ్లు కని్పంచకుండా రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ సారథ్యంలోని బృందం దాన్ని అత్యంత నైపుణ్యంతో ఇలా తిరిగి అతికించింది. బుధవారం నుంచి కూజాను మ్యూజియంలో మళ్లీ ప్రదర్శనకు ఉంచారు. ఇంతటి అరుదైన కూజా పగిలిపోయినా మ్యూజియం సిబ్బంది హుందాగా స్పందించిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. బాలున్ని గానీ, అతని తల్లిదండ్రులను గానీ వాళ్లు ఏమాత్రమూ నిందించలేదు. పైగా ‘పిల్లలన్నాక ఇలా చేస్తుంటారు, మరేం పర్లే’దంటూ ఊరడించారు. జరిమానా చెల్లిస్తామన్నా అలాంటిదేమీ అక్కర్లేదన్నారు. మ్యూజియం చీఫ్ దగ్గరుండి మరీ వారికి మ్యూజియం అంతా తిప్పి చూపించారు. గిల్టీ ఫీలింగ్ నడుమ సరిగా చూశారో లేదోనని పది రోజులు పోయాక మరోసారి మ్యూజియం సందర్శనకు ఆహా్వనించారు. ఆ సందర్భంగా చిన్నారి గెలర్ ఒక మట్టి కూజా తీసుకెళ్లి బహూకరించడంతో సిబ్బంది తెగ ఆనందపడిపోయారు. బాలునితో చాలాసేపు గడపడమే గాక పగిలిన కూజాలను ఎలా అతికిస్తారో ప్రత్యక్షంగా చూపించారు. ‘‘పురాతత్వ వస్తువులను తాకి చూస్తే వాటిపై అనురక్తి కలుగుతుంది. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?! అందుకే అవి సందర్శకులకు చేతికందే సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం’’ అని మ్యూజియం చీఫ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అతికించిన కూజాను రక్షణ వలయం వంటివేవీ లేకుండా తాజాగా మళ్లీ సందర్శకులకు అందుబాటులోనే ఉంచడం విశేషం! -
మ్యూజియంలో చోరీకి వచ్చి.. పోలీసులకు చిక్కాడిలా..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల స్టేట్ మ్యూజియంలో చోరీకి వచ్చిన దొంగ తాను ఊహించని రీతిలో పోలీసుల చేతికి చిక్కాడు. మ్యూజియంలోని కోట్లాది రూపాయల విలువైన వందల ఏళ్లనాటి పురాతన వస్తువులతో పారిపోయేందుకు ఆ దొంగ విఫలయత్నం చేశాడు.ఈ ఉదంతం గురించి పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా మీడియాకు వెల్లడించారు. స్టేట్ మ్యూజియంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి రాత్రంతా లోపలే ఉండిపోయాడు. ఉదయం భద్రతా సిబ్బంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మ్యూజియంనకు చేరుకుని అతనిని అరెస్టు చేశారు. నాణేలను, ఇతర వస్తువులను దొంగిలించి, మ్యూజియం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ దొంగ గోడపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో కదలలేకపోయాడు. తరువాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఆ దొంగ దగ్గరి నుంచి గుప్తులు, సుల్తానేట్ కాలానికి చెందిన 100 నాణేలతో పాటు పురాతన నగలు, పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నాణేల విలువ దాదాపు రూ.10 నుంచి 12 కోట్ల వరకూ వరకు ఉంటుందని సమాచారం. ఈ సంఘటన నేపధ్యంలో భోపాలోని మ్యూజియం భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం మ్యూజియంనకు పటిష్టమైన భద్రతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
మ్యూజియం మళ్లీ పిలిచింది
ఇజ్రాయెల్‌లో ఓ మ్యూజియంలో ఇటీవల 3,500 ఏళ్ల నాటి మట్టి కూజాను పొరపాటున కింద పడేసిన నాలుగేళ్ల ఏరియల్ గెలర్ గుర్తున్నాడా? అంతటి పురాతన కూజాను పగలగొట్టినా మ్యూజియం సిబ్బంది ఆ బాలున్ని కనీసం తిట్టకపోవడం, గాభరా పడ్డ అతని తల్లిదండ్రులను ‘మరేం పర్లేదం’టూ కూల్ చేసి అందరి మనసూ గెలుచుకోవడం తెలిసిందే. అంతేగాక మ్యూజియం చీఫ్ స్వయంగా దగ్గరుండి మరీ ఆ చిన్నారికి అన్ని వస్తువులనూ తిప్పి చూపించారు. ఈ సంఘటన దక్షిణ ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీలో హెక్ట్ మ్యూజియంను 10 రోజుల క్రితం జరిగింది. అయితే కూజాను పగలగొట్టిన కంగారులో మ్యూజియంలోని వస్తువులను బాలుడు సరిగా చూడలేదని భావించిన సిబ్బంది అతన్ని మరోసారి ఆహా్వనించారు. ఆ మేరకు ఏరియల్ గత శుక్రవారం తల్లిదండ్రులతో పాటు వెళ్లి సందర్శించాడు. ఈ సందర్భంగా ఒక మట్టి కూజాను వెంట తీసుకెళ్లి మ్యూజియానికి ప్రత్యేకంగా బహూకరించాడు! దాని వెనక దాగున్న ఆ పసిహృదయపు మనోభావాలను గౌరవిస్తూ సిబ్బంది దాన్ని ఆనందంగా స్వీకరించారు. మ్యూజియం క్యూరేటర్లు బాలునితో చాలాసేపటిదాకా గడిపారు. ఇలా పగిలిన వస్తువులను ఎలా అతికిస్తారో అతనికి ప్రత్యక్షంగా చూపించారు. సిబ్బందికి హేట్సాఫ్: తల్లిదండ్రులు మ్యూజియం వర్గాలకు ఏరియల్ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేముండే ప్రాంతం లెబనాన్‌కు అతి సమీపంలో ఉంటుంది. నిత్యం బాంబు దాడులే. ఆ ఆందోళనల నుంచి కాస్త ఊరట కోసం 10 రోజుల కింద మ్యూజియానికి వెళ్తే అనుకోకుండా ఇలా జరిగింది. దాంతో మా పని అయిపోయిందనుకున్నాం. దానికి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యాం. కానీ మ్యూజియం సిబ్బంది మా వాడిని గానీ, మమ్మల్ని గానీ ఆ రోజు పల్లెత్తు మాట కూడా అన్లేదు. వాస్తవానికి నరకప్రాయంగా మారాల్సిన ఘటనను మాకో మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చారు’’అంటూ ఆనందం వెలిబుచ్చారు. ఈ మొత్తం ఉదంతం బాలల్లో చరిత్ర పట్ల ఉత్సుకత, ఆసక్తి రేకెత్తిస్తే తమకు అంతకంటే కావాల్సిందేమీ లేదని మ్యూజియం డైరెక్టర్ ఇనబల్ రివ్లిన్ అన్నారు. ఏరియల్ మ్యూజియం పునఃసందర్శన తాలూకు వీడియో వైరల్‌గా మారింది. అందుబాటులోనే ఉండాలి! పగిలిన కూజాను మ్యూజియం నిపుణులు 3డీ టెక్నాలజీ ద్వారా అతికిస్తున్నారు. వారం రోజుల్లో అది తిరిగి పూర్వరూపు సంతరించుకుని మళ్లీ ప్రదర్శనకు అందుబాటులోకి వస్తుందని రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ తెలిపారు. ‘‘ఇలాంటి పురాతన వస్తువులు సందర్శనకు వచ్చేవారికి చేతికందేంత సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?!’’ అని ఆయన అభిప్రాయపడటం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ టూ డెడ్లీ మమ్మీల మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా! ఇదొక..?
ఇది మమ్మీల మ్యూజియం. మెక్సికోలోని గ్వానాజ్వాటో పట్టణంలో ఉంది. పలు దేశాల్లో 1870 నుంచి 1958 కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలను సేకరించి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచారు. ప్రపంచంలోని భీతిగొలిపే మ్యూజియంలలో ఒకటిగా ఈ మమ్మీల మ్యూజియం పేరుమోసింది. ‘ఎల మ్యూజో డి లాస్ మోమియాస్’ పేరుతో ఈ మమ్మీల మ్యూజియంను 1969లో ఇక్కడ నెలకొల్పారు.ఈ మ్యూజియం సేకరణలో మొత్తం 111 మమ్మీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరీ శిథిలంగా మారడంతో, ప్రస్తుతం వాటిలోని 59 మమ్మీలను మాత్రమే సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. గ్వానాజాటో మునిసిపాలిటీకి, మెక్సికో జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థకు మధ్య మమ్మీల నిర్వహణపై వివాదం నడుస్తుండటంతో ఇవి కొంత నిర్లక్ష్యానికి లోనయ్యాయి. స్థానిక సంస్థ నిర్లక్ష్యం వల్లనే మమ్మీలపై ఫంగస్ పెరిగి, అవి పాడైపోతున్నాయనేది జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థ ఆరోపణ. -
ఇప్పటి వరకు నెక్టైలకు మాత్రం ఎక్కడా మ్యూజియం లేదు.. కానీ?
ప్రపంచంలో రకరకాల పురాతన వస్తువులకు మ్యూజియంలు ఉన్నాయి. ఇప్పటి వరకు నెక్టైలకు మాత్రం ఎక్కడా మ్యూజియం లేదు. ఆ లోటు తీర్చడానికి క్రొయేషియాలో కొందరు ఔత్సాహికులు నెక్టైల కోసం ప్రత్యేకంగా ‘క్రావాటికం’ పేరుతో ఒక మ్యూజియంను ఇటీవల ప్రారంభించారు. నాలుగు శతాబ్దాల కిందట నెక్టైల వాడుక మొదలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రకరకాల నెక్టైలను సేకరించి ఇందులో ప్రదర్శనకు ఉంచారు. వీటిలో ప్రముఖులు ధరించినవి, వివిధ కాలాల్లో ఫ్యాషన్లలో వచ్చిన మార్పులకు అద్దంపట్టేవి, ప్రపంచంలో పేరు పొందిన ఫ్యాషన్ డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించినవి– ఇలా ఎన్నో రకాల నెక్‌టైలు ఇక్కడ కొలువు దీరాయి.క్రొయేషియాలోని జగ్రేబ్ నగరంలో 130 చదరపు మీటర్ల స్థలంలో ఏర్పాటైన ఈ మ్యూజియంలో నెక్ టైల చరిత్రకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా పొందుపరచారు. నెక్టైల తయారీకి వాడిన పట్టుదారపు పోగులను, పట్టుగూళ్లను కూడా ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియంను తిలకించడానికి పిల్లలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. విద్యార్థులకు టికెట్ ధర 5 యూరోలు (రూ. 453), పెద్దలకు టికెట్ ధర 8 యూరోలు (రూ.725). ఈ మ్యూజియం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.అమ్మకానికి దయ్యాల దీవి..దీవుల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రపంచంలో కొత్తేమీ కాదు. సాధారణంగా అమ్మకానికి వచ్చే దీవులు ఆహ్లాదభరితంగా, నివాసయోగ్యంగా ఉంటాయి. కొన్నిచోట్ల పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ, కొద్దిపాటి మరమ్మతులు చేయించుకుంటే, ఉపయోగించుకోవడానికి భేషుగ్గా ఉంటాయి. అయితే, తాజాగా అమ్మకానికి వచ్చిన దీవి మాత్రం అలాంటిలాంటి దీవి కాదు, దయ్యాల దీవిగా పేరుమోసిన దీవి.ఇది ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని ప్లిమత్ తీరానికి ఆవల ఉన్న డ్రేక్స్ దీవి. ఆరు ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఉన్న ఈ చిన్న దీవి కొన్ని శతాబ్దాల పాటు సైనిక అవసరాలకు ఉపయోగపడింది. బ్రిటిష్ సైన్యం ఈ దీవిని వ్యూహాత్మక రక్షణ స్థావరంగా ఉపయోగించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధానికి చాలాకాలానికి ముందే బ్రిటిష్ సైన్యం దీనిని విడిచిపెట్టేసింది. ఈ దీవిలో పద్దెనిమిదో శతాబ్ది నాటి సైనికుల స్థావరాలు, సొరంగ మార్గాలు, అప్పట్లో వారు ఉపయోగించిన ఫిరంగులు, ఇంకా ఉపయోగించని ఫిరంగి గుళ్లు నేటికీ ఇక్కడ పడి ఉన్నాయి.రెండు శతాబ్దాలకు పైగా ఖాళీగా పడి ఉన్న ఈ దీవిని ఫిలిప్ మోర్గాన్ అనే బ్రిటిష్ వర్తకుడు 2019లో 6 మిలియన్ పౌండ్లకు (రూ.64.59 కోట్లు) కొనుగోలు చేశాడు. ఈ దీవిలో 43 గదుల హోటల్ నిర్మించడానికి అనుమతి కూడా పొందాడు. ఇక్కడ ఆకస్మిక సంఘటనలు జరగడం, సైనికుల ఆత్మలు సంచరిస్తున్నాయనే ప్రచారం ఎక్కువ కావడంతో ఫిలిప్ మోర్గాన్ తన ప్రణాళికలను విరమించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ దీవిని అమ్మకానికి పెట్టాడు. దీనిని కొనుగోలు చేయడానికి గుండెధైర్యం ఉన్నవాళ్లు ఎవరు ముందుకు వస్తారో చూడాలి మరి! -
వాల్స్.. వండర్స్.. ప్రతి గోడా ఓ కళాఖండంలా..
ఖైరతాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.. అయితే మనలో చాలా మంది అనారోగ్యంపాలైనప్పడు ఆస్పత్రులకు వెళ్లక తప్పదు..వెళ్లాలి కదా..! ఇప్పుడేమంటారు? అంటారా.. అదేనండి.. ఆస్పత్రులు అనగానే చాలా మంది బెదిరిపోతారు.. ఎందుకంటే ఓ వైపు మందుల వాసన, మరోవైపు ఫినాయిల్కంపు, ఎక్కడ చూసినా గోడలకు రోగాలకు సంబంధించిన పోస్టర్లు, చూట్టూ రోగులు.. అబ్బో నా వల్ల కాదు బాబోయ్ అంటారు. అలాంటి వారు కూడా ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే మాత్రం ఎంచక్కా మ్యూజియంకో, ఎగ్జిబిషన్‌కో వెళ్తున్నట్లు రెడీ అయిపోతారు.. అదే నగరంలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. క్యారికేచర్స్గా డాక్టర్స్ ఫొటోలు.. ఆయా డిపార్ట్మెంట్ల ముందు డాక్టర్ల ఫొటోలను పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల్లాగా కాకుండా లైటర్వేయిన్తో క్యారికేచర్స్గా ప్రత్యేకంగా రూపొందించి ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలను చూసి హాస్పిటల్‌కు వచ్చిన వారు ఎంజాయ్ చేయడంతో పాటు ఉత్సాహంగా ఫోన్లో ఫొటోలు భద్రపరుచుకుంటున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న మనిషికి ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచి్చనప్పటికీ ఆప్యాయంగా... ప్రేమగా పలకరించే వైద్యులు, వారి బాధలు చెప్పుకునేంత సమయం.. ఓర్పు, సహనం కలిగిన వైద్యులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే హాస్పిటల్‌కు వెళ్లామనే ïఫీలింగ్ పేషెంట్లకు కలిగించేందుకు కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాయి పలు హాస్పటల్స్. ఈ తరహా ప్రయత్నమే చేస్తోంది నగరంలోని బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. రొటీన్ వాతావరణానికి భిన్నమైన అనుభూతిని కలి్పంచేలా ఓ మ్యూజియంకు వెళ్లామనే అనుభూతి, పేషెంట్‌ను పేషెంట్‌గా కాకుండా ఒక గెస్ట్‌గా ఆహా్వనించే పద్దతి, ఎక్కడ ఏ సమస్య వచి్చనా వెంటనే హాజరై సలహాలు, సూచనలు చేసే సిబ్బంది ఉంటే ఆ రోగికి సగం జబ్బు నయమైపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు. సంస్కృతిని ప్రతిబింబించేలా..హాస్పిటల్లోకి వెళ్లగానే బాబోయ్ హాస్పిటల్‌కు వచ్చామనే ఫీలింగ్ లేకుండా ఉండేవిధంగా లోపలికి అడుగు పెట్టగానే తెలుగు సాంప్రదాయ పద్దతిలో చేతులు జోడించి నమస్కారంతో స్వాగతం పలికే సిబ్బంది మొదలుకొని డాక్టర్ల వరకూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఓపి పరిసరాల్లో ఉండే గోడలపై భారతీయతను ప్రతిబింబించేలా తెలుగు పండగలు, అలనాటి క్రీడలు, అన్ని మతాలనూ ప్రబోధిస్తూ ఫొటోలు, తెలుగు రాష్ట్రాల చీరలు, రామాయణం, మహాభారతం, మనదేశ సంప్రదాయ నృత్యాలు, తల్లిప్రేమను ప్రతిబింబించే ఫొటోలు, మెడిసిన్ హిస్టరీని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, ఆయా డిపార్ట్మెంట్ల ప్రాముఖ్యతను తెలిపే ఫొటోలు, మన శరీరం ఆకృతిని నిర్దేశిస్తూ శరీరంలో ఉండే అస్థిపంజరం నమూనాలు, పెయింటింగ్స్ పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చే వారు ప్రతి ఫ్లోర్లో మనస్సు నింపుకొని వెళ్లే విధంగా ఉండటం కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ప్రత్యేకత.సిబ్బంది పద్దతి నచ్చింది..మేము ఉండేది కొండాపూర్, మా చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా గంటన్నర ప్రయాణం చేసి బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కు వస్తాం. ఇక్కడి వాతావరణం, నర్సులు, ఇతర సిబ్బంది పద్దతి మాకు బాగా నచ్చింది. బాధ్యతతో వ్యవహరించే డాక్టర్లు, హాస్పిటల్లో ప్రతి ఫ్లోర్లో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం మాలో బరోసాను పెంపొందిస్తుంది. – జే.సుమిత్ర, కొండాపూర్, గృహిణిసేవా ధృక్పథంతో...మేమంతా సేవా ధృక్పథంతో పనిచేస్తున్నాం. మా అందరి గురువు డాక్టర్ గురవారెడ్డి. ఆయన అడుగు జాడల్లో రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి బాధలు చెప్పుకునేంత సమయం ఇస్తూ, వారి ఆనందంలో భాగస్వాములవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడి సిబ్బంది ఒక కుటుంబంలా పనిచేయడం ఎంతో సంతోషం. – డాక్టర్ నివేదిత సాయిచంద్ర, న్యూరో ఫిజీషియన్కంఫర్ట్ ఇవ్వగలగాలి..రొటీన్ పద్దతికి స్వస్తిచెప్పి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించేలా మ్యూజియం, హార్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. రానున్న సంవత్సరంలో పేషెంట్‌ను గెస్ట్‌లా భావిస్తున్నాం. ఆస్పత్రిలో మంచి వాతావరణం ఉండటం వల్ల సగం జబ్బు నయమవుతుంది. గోడలను రకరకాల పెయింటింగ్స్, డిజైన్స్, ఫొటోలతో ఏర్పాటు చేశాం. అన్ని బాధలూ మేము తగ్గించకపోవచ్చు, కానీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని, కంఫర్ట్‌ని ఇవ్వగలగాలి. ఇంగ్లిష్‌లో ఓక సామెత ఉంది ‘యు మే నాట్ క్యూర్ ఆల్ ది టైం.. బట్ యు కెన్ కంఫర్ట్ ఆల్ ది టైం’ అనేది నేను బలంగా నమ్ముతాను. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. -
నిజమే..! ఇదొక వాంపైర్ మ్యూజియం..!!
దయ్యాలు, భూతాలు, పిశాచాలు వంటివి పాతకాలం జానపద సినిమాల్లోను, ఇప్పటికాలం హారర్ సినిమాల్లోను చాలామంది చూసి ఉంటారు. భూత ప్రేత పిశాచాల గురించి పరిశోధనలు సాగించే వారు పురాతనకాలం నుంచి కూడా ఉన్నారు.భూత ప్రేత పిశాచాలను ఆవాహన చేయడానికి తాంత్రికులు ఉపయోగించే వస్తువులను, మనుషులను భయపెట్టే ప్రేతాత్మలను నిరోధించడానికి ఉపయోగించే వస్తువులను, ప్రేతాత్మలను ఆకర్షించే వస్తువులను జాగ్రత్తగా సేకరించి ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలనే ఆలోచన మాత్రం చాలా అరుదైనది.ప్రేతాత్మలపై పరిశోధనలకే జీవితాన్ని అంకితం చేసిన ఫ్రెంచ్ మేధావి జేక్విజ్ సిర్జంట్ పారిస్‌లో అచ్చంగా భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన వస్తువులతో ‘మ్యూజియం ఆఫ్ వాంపైర్స్’ను నెలకొల్పాడు. ఇందులో మానవ కంకాళాలు, పురాతన తాంత్రికులు ఉపయోగించిన జంతువుల మమ్మీలు, ప్రేతాత్మలను తరిమికొట్టే ఆయుధాలు వంటివి భద్రపరచాడు. గుండెదిటవు గల పర్యాటకులు ఈ మ్యూజియంను చూసి పోతుంటారు. -
ఆ ఇల్లే.. ఓ మ్యూజియం!
చెక్క ఫ్యాన్ ను చూశారా? వందేళ్ల కిందటే వంట పాత్ర కమ్ హాట్ క్యారేజ్ ఉండేది తెలుసా? రేడియో ఉండాలంటే లైసెన్ ్స కావాలా? ఇలా మనం చూడని.. మనకు తెలియని ఎన్నో వస్తువులు, కళ్లు చెదిరే కళాఖండాలు, అబ్బురపరచే చిత్రాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. వీటిని చూడాలన్న ఉత్సుకత.. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే పరవాడలోని కోరుపోలు గంగాధరరావు ఇంటికి వెళ్లాల్సిందే! ఆయన 22 ఏళ్ల ఈ ప్రయాణాన్ని తెలుసుకోవలసిందే!గంగాధరరావు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని బపాడుపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలో పుస్తకాల్లో ఉన్నది చెప్పడంతో పాటు వాటిని పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తే వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చినట్టవుతుంది కదా అనే ఆలోచన వచ్చింది ఆ టీచర్‌కి. ఆ బాటలో సాగిపోతుండగా ఒకరోజు ఆయనకు అల్యూమినియం, రాగి నాణేలు లభించాయి.వాటి మీద ఆసక్తి పెరిగి నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం ప్రారంభించాడు. అది కాస్త ఒక యజ్ఞంలా మారి ‘మోస్ట్ కలెక్షన్ ఆఫ్ వెరైటీ టెన్ రూపీస్ కాయిన్స్’ అంశంపై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ కాయిన్ ్స అంశంలో మూడుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరును నమోదు చేసింది. 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కూ దరఖాస్తు చేసుకున్నారాయన. నాణేలు సరే.. కనుమరుగైపోతున్న వస్తువులనూ ఈ తరానికి చూపించాలన్న ఆలోచనా చేశారు గంగాధరరావు.తక్షణమే వాటి సేకరణాæ మొదలుపెట్టారు. అలా ఆయన ఇల్లు ఇప్పుడు 100 నుంచి 300 ఏళ్ల నాటి ఇత్తడి కొలత పాత్రలు, కంచు గిన్నెలు, గోకర్ణాలు, బోషాణం, రంగం పెట్టెలు, బ్రిటిష్ కాలం నాటి పాత పేపర్లులాంటి పలురకాలకు చెందిన రెండువేలకు పైగా వస్తువులతో మ్యూజియమ్‌ను తలపిస్తోంది. ఆ వస్తువుల్లో ఆసక్తిరనమైన కొన్ని..మ్యూజియం ఏర్పాటే లక్ష్యం.. "అప్పట్లో వాడిన ప్రతి వస్తువుకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆ వస్తువుల్లో ఆరోగ్యం ఉండేది. ఆ ప్రాముఖ్యతను, ఆ సంప్రదాయాలను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే మన పూర్వీకులు వాడిన ప్రతి వస్తువును సేకరించి భద్రపరచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. అవి అందరికీ అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఓ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సహకరిస్తే నా కల నెరవేరుతుంది". – గంగాధరరావు, పరవాడచెక్క ఫ్యాన్..దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెక్క ఫ్యాన్‌కు పేటెంట్ కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో ఈ ఫ్యాన్ ను వినియోగించేవారు. ఇందుకోసం పంకా మ్యాన్ అనే ఉద్యోగం ఉండేది. చెక్క ఫ్యాన్ తిప్పడమే ఆ ఉద్యోగి పని. 1920లో తయారైన ఈ ఫ్యాన్ కోసం గంగాధరరావు రూ. 45 వేలు పెట్టి.. ఢిల్లీ నుంచి తెప్పించారు.స్టీమ్ క్యారేజ్..1917లో తయారైన ఈ స్టీమ్ క్యారేజ్ సుమారు పది కిలోల బరువు ఉంటుంది. ఇందులో వంట వండుకోవడమే కాక వండిన వంటను 10 నుంచి 12 గంటల పాటు వేడిగానూ పెట్టుకోవచ్చు. దీన్ని గంగాధరరావు రూ. 16 వేలు వెచ్చించి రాజస్థాన్ , జైపూర్ నుంచి తీసుకొచ్చారు.రేడియోలు.. లైసెన్సులు..మొదటితరం నాటి 10 రకాల రేడియోలను ఆయన సేకరించారు. అప్పట్లో రేడియో ఉండాలంటే పోస్టాఫీస్ నుంచి లైసెన్స్ తీసుకోవలసి వచ్చేదట. ఆ లైసెన్ ్స కాపీలూ మాష్టారి వద్ద ఉన్నాయి. అంతేకాదు బ్రిటిష్ వారి గెజిట్స్, స్వాతంత్య్ర ఉద్యమం నాటి పోస్ట్కార్డ్స్నూ ఆయన సేకరించారు.సేకరణలో కష్టాలెన్నో.. ఇలాంటి వస్తువులన్నింటినీ సేకరించేందుకు మొదట్లో గంగాధరరావు.. ఫలానా వస్తువు ఫలానా చోట ఉంది అని తెలియగానే సంబంధిత వ్యక్తులకు ఉత్తరాలు రాసేవారట. తర్వాత ఫోన్లు రావడం, వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ కావడంతో పని కొంత సులువైందంటారు. ఫలానా చోట వస్తువు ఉందంటే ముందుగా డబ్బులు చెల్లిస్తే.. వారే ఇంటికి పంపిస్తున్నారట. ఇందులో కూడా పోటీ ఉంటుంది. ఒకసారి మిస్ అయితే ఆ వస్తువు మళ్లీ దొరకదు.అందుకే ఎంత కష్టమైనా వెంటనే డబ్బులు చెల్లించి వస్తువు సేకరిస్తున్నారు. దీనికోసం ఆయన ప్రతి నెలా తనకు వచ్చే ఆదాయంలోంచి 20 శాతాన్ని కేటాయిస్తున్నారు. తను సేకరించిన వస్తువుల కోసం ఇప్పటివరకు రూ. 10 లక్షలకు పైనే వెచ్చించారు. ఆయనకు ‘ఎఖఅNఖీఐఖ్ఖఉ ’ అనే యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆయన సేకరించిన ప్రతి వస్తువు గురించి ఇందులో వివరిస్తుంటారు. దీనికి 2.58 కోట్ల మంది వ్యూయర్స్, 1.38 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.‘గోల్డ్ స్పాట్ గురించి చెబితే దాదాపు 5 లక్షల మంది చూశారు. గోల్డ్ స్పాట్ జ్ఞాపకాలను పంచుకుంటూ 20 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. లూనాపై వీడియో చేస్తే కూడా అంతే వైరల్ అయింది. నా దగ్గరున్న వస్తువులను చూడ్డానికి హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు. నా యూట్యూబ్ చానెల్ వీడియోలు చూసి చాలామంది సినిమా డైరెక్టర్లూ నన్నూ అప్రోచ్ అవుతున్నారు.. నేను సేకరించిన వస్తువులను తమ సినిమాల్లో ఉపయోగించుకుంటామంటూ! ఈ రెస్పాన్స్ భలే సంతోషాన్నిస్తోంది. నేను పడ్డ శ్రమ, పెట్టిన ఖర్చును మరచిపోయేలా చేస్తోంది’ అంటారు గంగాధరరావు. – గొరకల పూర్ణచందర్, సాక్షి, విశాఖపట్టణం -
న్యూయార్క్‌లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
అమెరికాలోని న్యూయార్క్లోగల బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు హఠాత్తుగా దాడికి దిగారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.అయితే పోలీసుల రాకకుముందే నిరసనకారులు బ్రూక్లిన్ మ్యూజియం వద్దకు చేరుకుని, ఆ ప్రాంగణంలో టెంట్లు వేసి, భవనంపై ‘ఫ్రీ పాలస్తీనా’ పేరుతో గల బ్యానర్లను ఎగురవేశారు. మ్యూజియం వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో న్యూయార్క్ నగర పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కొంతమంది నిరసనకారులు పోలీసు అధికారులపై ప్లాస్టిక్ బాటిళ్లను విసిరారు.ఘటనా స్థలంలో పోలీసులకు, ఆందోళనకారులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికిముందు పాలస్తీనా మద్దతుదారులు బార్క్లేస్ సెంటర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నవారు డప్పులు కొడుతూ, పలు నినాదాలు చేస్తూ మ్యూజియం వైపు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు... » ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది. » రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు. » మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు. » ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి. »తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. -
పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
ఎన్నో రకాల మ్యూజియంలు చూసుంటారు. ఇలా పిల్లుల కోసం ప్రత్యేకంగా ఉన్న మ్యూజియంని ఇంత వరకు చూసి ఉండరు. మన దేశంలో పిల్లిని పొద్దునే చూడటం అపశకునంగా భావిస్తారు గానీ పాశ్చాత్యులు పెంపుడు జంతువుగా పిల్లిని పెంచుకుంటారు. వాళ్లు ఏకంగా ఈ పిల్లుల కోసం ప్రత్యకంగా మ్యూజియంని ఏర్పాటు చేశారు. మరింత విశేషమేమిటంటే ఆ వ్యూజియంలో పిల్లి మమ్మీలు కూడా ఉంటాయట. ఇంతకీ ఆ మ్యూజియం ఎక్కడ ఉందంటే.. ప్రపంచంలో వింత వింత మ్యూజియంలు ఎన్నో ఉన్నాయి. మలేసియాలోని ఈ పిల్లుల మ్యూజియం కూడా అలాంటిదే! మలేసియాలోని కుచింగ్ నగరంలో ఉందిది. కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యంలో దీనిని 1993లో నెలకొల్పారు. ఈ పిల్లుల మ్యూజియంలో పిల్లులకు సంబంధించిన దాదాపు నాలుగువేలకు పైగా కళాఖండాలు, వస్తువులు కొలువుదీరి మార్జాలాభిమానులకు కనువిందు చేస్తాయి. ఇందులో పిల్లులకు చెందిన పెయింటింగ్స్, శిల్పాలు, ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన ప్రాచీన మార్జాల మమ్మీ వంటి అరుదైన వస్తువులు, పిల్లులకు సంబంధించిన ప్రకటనలు, అరుదైన జాతుల పిల్లుల చిత్రపటాలు, ఫొటోలు వంటివి అబ్బురపరుస్తాయి. ఈ పిల్లుల కళాఖండాలను తొలిసారిగా 1988లో మలేసియా ఉన్నతాధికారి దివాన్ తున్ అబ్దుల్ రజాక్ ‘పుత్ర వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ప్రదర్శించారు. తర్వాత కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యం వీటిని సొంతం చేసుకుని, నార్త్ సిటీ హాల్ దిగువ అంతస్తులో శాశ్వతంగా ఈ పిల్లుల మ్యూజియంను ఏర్పాటు చేసింది. (చదవండి: సీతాకోక చిలుక పాలు గురిచి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
కుందేళ్లకు అంకితమైన మ్యూజియంగా గిన్నిస్ రికార్డు!
మనం జంతువుల అవశేషాలకు సంబంధించిన మ్యూజియంలు, మానవ మ్యూజియంలు, పిరమిడ్ మమ్మీల మ్యూజియంలు వంటవి గురించి విన్నాం. అంతేగానీ కేవలం కుందేళ్లకు అంకితమయ్యే మ్యాజియం గురించి విని ఉండలేదు కదా!. కానీ అలాంటి విచిత్రమైన మ్యూజియం ఒకట ఉంది. ఎక్కడంటే.. ప్రపంచంలో చాలా చిత్రవిచిత్రమైన మ్యూజియమ్లు ఉన్నాయి. వాటిలో ఈ కుందేళ్ల మ్యూజియం ఒకటి. పూర్తిగా కుందేళ్లకే అంకితమైన ఈ మ్యూజియం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియా ఆల్టడెనా ప్రాంతంలోని లేక్ అవెన్యూలో ఈ మ్యూజియమ్‌ను 1998లో ప్రారంభించారు. దాదాపు ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పదహారు గ్యాలరీలతో ఏర్పాటైన ఈ మ్యూజియంలో ఎక్కడ చూసినా కుందేళ్లకు సంబంధించిన కళాఖండాలు, వస్తువులే కనిపిస్తాయి. కాండిస్ ఫ్రాజీ, స్టీవ్ లుబాన్‌స్కీ అనే దంపతులు కుందేళ్ల మీద ఉన్న ఇష్టంతో ఈ మ్యూజియమ్‌ను ప్రారంభించారు. ఇందులో సిరామిక్, గాజు వంటి వస్తువులతో తయారు చేసిన కుందేలు బొమ్మలు, గడ్డి నింపిన కుందేళ్లు, కుందేలు ఆకారంలోని సీసాలు, డబ్బాలు వంటి 8,473 కళాకృతులు ఉన్నాయి. కుందేళ్లకు సంబంధించిన అత్యధిక వస్తువులు గల ప్రదేశంగా ఈ మ్యూజియమ్ గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. (చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి!) -
మైమరిపించేలా మ్యూజియం!
అవి శతాబ్దాల మన చరితకు చిహ్నాలు. తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న వెలకట్టలేని పురాతన వస్తువులు. వీటిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించడం మన బాధ్యత. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పురాతన వస్తువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంకి పరిమితమైన మన వాటా వారసత్వ సంపద సైతం సీఎం వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి చేరుకుంటోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. సాంకేతిక సొబగులద్దుకుని సందర్శకులను ఆకట్టుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో దశల వారీగా మ్యూజియంలను అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడలోని బాపూ మ్యూజియంను విద్య, విజ్ఞాన సందర్శనాలయంగా తీర్చిదిద్దారు. 2020 అక్టోబర్ 2వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ఈ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏలూరు, అనంతపురంలోని జిల్లా మ్యూజియంలకు నూతన భవన నిర్మాణాలు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ మ్యూజియాలను అధునాతనంగా మార్చారు. మరో రూ.70 కోట్ల ప్రతిపాదనలతో ఏడు మ్యూజియంలకు కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మైలవరం(కడప), కాకినాడ, గుంటూరు, కర్నూలు, పెనుకొండ, కడప, రాజమహేంద్రవరం మ్యూజియంలకు కూడా సాంకేతిక హంగులు అద్దనుంది. మన సంపద వెనక్కి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి దక్కాల్సిన వేల ఏళ్లనాటి చారిత్రక, వారసత్వ సంపదను తీసుకురావడంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పటి స్టేట్ మ్యూజియంలోని సుమారు 56వేలకు పైగా పురాతన వస్తువులు, నాణేలు, చిత్రపటాలు పదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో సీఎం జగన్ చొరవతో ఏపీ పురావస్తు శాఖ అధికారులు పలు దఫాలుగా తెలంగాణ అధికారులతో చర్చలు జరిపి చివరికి పురాతన వస్తువుల విభజన ప్రక్రియను ముగించారు. త్వరలో వాటిని ఏపీకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పురావస్తు సంపద పరిరక్షణకు పెద్దపీట విభజన తరువాత రాష్ట్రానికి స్టేట్ మ్యూజియం అంటూ ఏదీ లేదు. ఈ నేపథ్యంలో అతిపెద్ద స్టేట్ మ్యూజియంను నిర్మించేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు రాజమహేంద్రవరం నగరాన్ని ‘హెరిటేజ్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు రూ.400 కోట్ల ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లతో టాయ్ మ్యూజియం నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని లక్షలాది శాసనాలు, ఎస్టేం పేజీలు (శాసనాల కాపీలు)పరిరక్షణకు ప్రత్యేకంగా ‘శాసన మ్యూజియం’ను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. దీనిద్వారా ఇప్పటి వరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. దక్షిణాదిలో తొలిసారిగా.. స్మారక, సందర్శనీయ స్థలాల అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బాపూ మ్యూజియం, కొండపల్లి కోటలో అగుమెంట్ రియాలిటీ, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే, కియోస్‌్కలు, వర్చువల్ రియాల్టీ, లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్, డిజిటల్ వాల్బుక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించిన ఏలూరు, అనంతపురం మ్యూజియాల్లో కూడా అమలుచేయనున్నారు. గణనీయమైన పురోగతి ప్రజా సంక్షేమంతో పాటు మన వారసత్వ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యతను సీఎం జగన్ చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజియంలు గణనీయమైన పురోగతిని సాధించాయి. ప్రపంచ స్థాయి ఏఆర్, వీఆర్ టెక్నాలజీలను ప్రవేశపెట్టాం. తద్వారా సందర్శకులకు అర్థవంతమైన భాషలో, సరళంగా వారసత్వ చరిత్ర తెలుస్తోంది. మ్యూజియంల అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తాం. త్వరలోనే స్టేట్ మ్యూజియంను కూడా నిర్మిస్తాం. – ఆర్కే రోజా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసుల శాఖ మంత్రి -
అంబేద్కర్ జీవిత చరిత్ర? మ్యూజియంలో నమ్మలేని విశేషాలు
-
మానవ అవయవాల గురించి తెలుసుకోవాలంటే?ఈ మ్యూజియంకు వెళ్లాల్సిందే!
ఇంతవరకు ఎన్నో రకాల మ్యూజియంలను చూసుంటారు. ఆర్ట్‌కి సంబంధించి, డిఫెరెంట్ ఫోటోలు, లేదా పురాతన వస్తువులు, మమ్మీలు, కొన్ని రకాల వజ్రాలు తదితర విభిన్న మ్యూజియంలు గురించి మాత్రమే విన్నాం. కానీ ఇది అన్నింటికంటే విభిన్నమైన మానవ శరీర అవయవాలకు సంబంధించిన మ్యూజియం. మనిషి శరీరంలోని అవయవాల గురించి సబ్జెక్ట్ పరంగానో వైద్యుల ద్వారానో విని ఉంటాం. కానీ వాటి పనితీరుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఈ మ్యూజియంకు వెళ్లాల్సిందే. ఇందులో మానవుని తల నుంచి కాలి వరకు ఉన్న అంతర్గత అవయవాల పనితీరుని నేరుగా చూడొచ్చు తెలుసుకోవచ్చు. ఇది నిజంగా మంచి థ్రిల్లింగ్ ఫీల్‌ని కలుగజేసే మ్యూజియం అనే చెప్పాలి. ఇది ఎక్కడ ఉంది? ఆ మ్యూజియం ఎప్పుడు ఏర్పాటు చేశారు? తదితర విశేషాల గురించే ఈ కథనం.! ఈ అసాధారణ మ్యూజియం నెదర్లాండ్స్‌లోని లైడెన్ నగరంలో ఉంది. ఆ మ్యూజియం భవనంలో మొదట సుమారు 35 మీటర్ల పొడవైన ఉక్కు కొలోసన్(మనిషి విగ్రహం) ఉండగా, మరోవైపు ఏడు అంతస్తుల భవనం కనిపిస్తుంది. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ పెద్దలకు సుమారు రూ. 1300/- వరకు ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఆరేళ్లు దాటిని వారికే అనుమతి ఉంటుంది. ఈ మ్యూజియం సైన్స్ పట్ల తెలియకుండానే ఆసక్తి పెరిగేలే చేస్తుంది. నెదర్లాండ్స్‌లో ఉన్న ఈ మ్యూజియం ప్రపంచంలోనే తొలి ఇంటరాక్టివ్ మ్యూజియం అఫ్ హ్యూమన్ బయాలజీ. మానవుని లోపల అవయవాల పనితీరుని విజ్యువల్గా చూడొచ్చు. మీకు వాటి గురించి అర్థమయ్యేలా వివరించేలా వివిధ భాషల్లో గైడ్ చేసే ఆడియాలు కూడా ఉంటాయి. మీరు ఎంట్రీకి ముందే మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. మీరు ఏ ఫ్లోర్లో ఏ గదికి వెళ్తారో.. అక్కడ ఆ గదికి ఎంట్రవ్వగానే ఆ భాష ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. మొట్టమొదటగా చర్మంతో మొదలై.. కాలి వరకు ప్రతి భాగాన్ని సందర్శిస్తూ వెళ్తాం. మనం ఆయా రూంలకు సమీపించగానే ఆ గదిలోని అవయవం నిలబడి వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. మన శరరీంలోని ఈ భాగం పని ఇదా? అని ఒకరకమైన ఫీల్ కలుగుతుంటుంది. ముఖ్యంగా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వ్యవస్థల పనితీరు చూసేందకు త్రీ డీ గ్లాస్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఆఖరికి రక్తం సరఫరా అయ్యే విధానం కూడా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకోగానే రక్తం ఎలా కదులుతుందో కళ్లకు కట్టినట్లు కనిపించడమే కాదు ఆడియోలో వివరిస్తారు కూడా. ఇలా.. అన్నవాహిక, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, కండరాలు, ఎముకలు, కళ్లు ,చెవులు, ఇతర అంతర్గత అన్ని అవయవాలను చూడొచ్చు. అలాగే శరీరానికి ఏదైన గాయం అయ్యితే కనిపించే మార్పులు కూడా చూపిస్తుంది. వైద్యులుగా ట్రైయిన్ అయితే చూసే వాటన్నింటిని మనం కూడా నేరుగా చూడటమే గాక తాకడం, తెలుసుకోవడం వంటివన్నీ చేస్తాం ఈ మ్యూజియంలో. ఇక్కడ ఉన్న ఇంకో సదుపాయం ఏంటంటే..ముందుగానే మీ పేరు, పుట్టిన తేది తదితరాలు నోట్ చేస్తారు కాబట్టి మ్యూజియం జర్నీ ముగియగానే మీ అంతర్గత వ్యవస్థ గురించి కూడా వివరించి మరీ రిపోర్ట్ అందజేస్తారు నిర్వాహకులు. కాగా, ఈ మ్యూజియాన్ని మార్చి 14, 2008న అప్పటి ఇంగ్లాండ్ రాణి బీట్రిక్స్ ప్రారంభించారు. ఈ మ్యూజియం నిర్మాణం 2006 చివరిలో ప్రారంభమైంది. దీన్ని సుమారు 27 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. ఈ మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మ్యూజియంలలో ఒకటి. ఈ మ్యూజియంని నిర్వాహకులు దీన్ని సందర్శించే వ్యక్తులు వారి శరీర నిర్మాణం, సంబంధిత సమస్యల గురించి క్లియర్‌గా తెలుసుకుంటారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపై అవగాహనే గాక ఒక గొప్ప పరిజ్ఞానాన్ని కూడా పొందుతారని అన్నారు.. (చదవండి: ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!) -
అతిపెద్ద బాలల మ్యూజియం!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాలల మ్యూజియం. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఉంది. మేరీ స్టూవర్ట్ కారే అనే సంపన్న వ్యాపారవేత్త 1924లో బ్రూక్లిన్ బాలల మ్యూజియం చూశారు. దాని ప్రేరణతోనే ఆమె ఇండియానాపోలిస్‌లో స్థానిక దాతల సహకారంతో 1925లో ఈ మ్యూజియంను నెలకొల్పారు. దీనిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 1946లో కొత్త నిర్మాణం చేపట్టి ప్రస్తుతం ఉన్న చోటికి తరలించారు. దాదాపు 4.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో పిల్లల వినోద విజ్ఞానాలకు పనికొచ్చే బోలెడన్ని వస్తువులు ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన పురాతనమైన ఆటవస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియంకు ఏటా దాదాపు పదిలక్షల మందికి పైగానే సందర్శకులు వస్తుంటారు. (చదవండి: వలలో అరుదైన చేపలు..దెబ్బతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మత్స్యకారుడు!) -
ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!
ఐదు వేల వస్తువులను చూడటానికి రెండు కళ్లు చాలవు. చుట్టి రావడానికి కనీసం రెండు గంటల సమయం కావాలి. పదిహేడు దేశాలను ఒక్క చోట ప్రతిక్షేపించిందీ మ్యూజియం. అందులో మన దేశమూ ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు. మనదేశంలో చూడలేకపోయిన బౌద్ధక్షేత్రాల ప్రతీకలను ఇక్కడ చూద్దాం. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం... శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉంది. క్యాండీలోని నేషనల్ మ్యూజియం భవనంలోనే ఉంది. ఇంటర్నేషనల్ మ్యూజియంలో శ్రీలంక, ఇండియా, జపాన్, చైనా , భూటాన్ దేశాలతోపాటు మొత్తం 17 దేశాల బౌద్ధ విశేషాలున్నాయి. ఇండియా గ్యాలరీ ఏర్పాటు బాధ్యతలను మన విదేశీ వ్యవహారాల శాఖ పూర్తి చేసింది. నిర్వహణ బాధ్యతను పదేళ్ల కిందట ‘శ్రీ దలాడ మలిగవ’కు అప్పగించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం ఇది. బౌద్ధానికి చెందిన ఫొటోలు, శిల్పాలు, ప్రతీకాత్మక శిల్పాలు, చిత్రాలు, నేషనల్ మ్యూజియంలో క్యాండీ రాజులు (17,18 శతాబ్దాల నాటివి) ఉపయోగించి ఆయుధాలు, ఆభరణాలు, దైనందిన జీవనం ఉపయోగించిన వస్తువులు, చారిత్రక శకలాలు... అన్నీ కలిసి ఐదు వేలకు పైగా ఉంటాయి. క్యాండీ రాజ్యం 1815లో బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయినప్పుడు రాసుకున్న ఒప్పంద పత్రం ప్రతిని కూడా చూడవచ్చు. మ్యూజియంలోపల బ్రిటిష్ ఆనవాళ్లు మరేవీ కనిపించవు. కానీ మ్యూజియం ఏర్పాటులో కీలకంగా పని చేసిన సిలోన్ గవర్నర్ సర్ హెన్రీ వార్డ్ విగ్రహం ఉంది. తెలుగు– సింహళ బంధం ఇండియా విభాగంలో మన అమరావతి బౌద్ధ స్థూపం నమూనా కూడా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బౌద్ధం విలసిల్లిందని చెప్పడానికి దోహదం చేసే ఆధారాలను, ఆనవాళ్లను చూడవచ్చు. సాంచి స్థూపం నమూనా, సారనాథ్ స్థూపం దగ్గర అశోకస్తంభం మీద గర్జించే సింహం నమూనా శిల్పం, ఎల్లోరా గుహలు వాటిలోని శిల్పాలు, అజంతా గుహలు– అందులోని వర్ణ చిత్రాలు, అశోకుని ధర్మచక్రం, మనం జాతీయ చిహ్నం నాలుగు సింహాల ప్రతిమలను చూడవచ్చు. ఇంకా... చైనా బుద్ధుని విగ్రహాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మిగిలిన అన్ని దేశాల బుద్ధుడి ప్రతిమల్లోనూ ఏకరూపత ఉంటుంది. కానీ చైనా బుద్ధుడు భిన్నంగా ఉంటాడు. పెంగ్షుయ్ వాస్తులో భాగంగా లాఫింగ్ బుద్ధ మనకు పాతికేళ్ల కిందటే పరిచయమై ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని బుద్ధుడిగా స్వీకరించడానికి పెద్దగా ఇబ్బంది పడమన్నమాట. ఇక ఆశ్చర్యంతోపాటు ఒకింత అయోమయానికి గురి చేసేది భవిష్యత్తు బుద్ధుడి ఊహాశిల్పం. ఆ బుద్ధుడు మల్టీటాస్కింగ్‌కి ప్రతీకగా ఉంటుందా శిల్పం. మ్యూజియంతోపాటు ఈ భవనంలోనే కొన్ని గదుల్లో సావనీర్ విభాగం ఉంది. శ్రీలంక గుర్తుగా కప్పులు, ఫ్రిజ్ మ్యాగ్నట్ల వంటివి చాలా రకాలున్నాయి. అప్పటి అతిథిభవనం! ఈ మ్యూజియం రెండస్థుల భవనం. మ్యూజియంగా మార్చకముందు ఈ భవనం గెస్ట్‌హౌస్‌గా రాజ్యాతిథుల విడిదిగా ఉండేది. రాణివాస మహిళలకు కూడా కొంతకాలం ఇందులో నివసించినట్లు చెబుతారు. క్యాండీ రాజ్యం ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి సగౌరవంగా అభివాదం చేయాల్సిందే. మ్యూజియం భవనం, యునెస్కో గుర్తించి వరల్డ్ హెరిటేజ్ సైట్ టూత్ రిలిక్ టెంపుల్, రాజుల ప్యాలెస్‌లు ఒకే క్లస్టర్లో ఉంటాయి. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!) -
అబిడ్స్‌లో రాంజీ గోండ్ మ్యూజియం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు రాంజీగోండ్ పేరిట ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్‌లోని గిరిజన సంక్షేమశాఖ స్థలంలో కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డిల చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరిపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. రూ.35 కోట్లపైగానే వ్యయం రాంజీగోండ్ మ్యూజియం ఏర్పాటుకు రూ.35 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. రూ.10 కోట్లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు. మొదట్లో బాపూఘాట్ వద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భూ సమస్య కారణంగా ఆదిలోనే ఆగిపోయింది. దీంతో అబిడ్స్‌లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మ్యూజియంలో ప్రధానంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు, చరిత్ర, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి తెస్తారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఈ మ్యూజియం నిర్వహణ ఉంటుంది. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. టీసీఆర్టీఐ భవన ప్రారంభోత్సవం కూడా... మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరంసంజీవయ్య సంక్షేమభవన్ ఆవరణలో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ (టీసీఆర్టీఐ)భవనం నిర్మించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు విడుదల చేసింది. నాలుగు అంతస్తుల్లో సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి కేంద్రం ఇప్పటివరకు రూ.6.5 కోట్లు ఇచ్చినట్టు అధికారులు చెబుతు న్నారు. గిరిజన సంక్షేమశాఖలో టీసీఆర్టీఐ ఒక భాగమే అయినా, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమ వారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భవనాన్ని కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. -
స్వరాజ్య పోరులో గర్జించిన మన్యం
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం (టీఎఫ్ఎఫ్ఎం) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్య పోరాటంలో గర్జించిన మన్యం మొనగాళ్ల చరిత్రను ఈ మ్యూజియం భావితరాల కళ్ల ముందు ఉంచనుంది. గిరిజన పోరాట యోధుల చరిత్రతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి స్ఫూర్తి నింపే సంకల్పంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. రూ.35 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియంను నాలుగు జోన్లు(భాగాలు)గా నిర్మిస్తున్నారు. బ్రిటిష్ పూర్వ యుగం, బ్రిటిష్ పాలన, స్వాతంత్య్ర పోరాటం(తిరుగుబాటు), బ్రిటిష్ వాళ్లు పలాయనం (స్వాతంత్య్రం తర్వాత) అనే నాలుగు ప్రధాన విభాగాలుగా గిరిసీమ చరిత్రను భావితరాలకు అందించే గొప్ప ప్రయత్నానికి ఈ మ్యూజియం వారధిగా నిలవనుంది. మన్య సీమతో పెనవేసుకున్న ఖోండ్ తిరుగుబాటు (1835–37), సవరా తిరుగుబాటు (1853), లాగరాయ్ పితూరి (1914–16), మన్యం (రంప) తిరుగుబాటు(1922–24), మూకదొర తిరుగుబాటు (1924–26), చెంచు తిరుగుబాటు(1938)తోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన గిరిజన తిరుగుబాట్లకు సంబంధించిన ఘట్టాలకు ఈ మ్యూజియం నెలవు కానుంది. గాండ్రించిన మన్యసీమ స్వాతంత్య్ర పోరాటంలో మన్యసీమ కేంద్రంగా గాండ్రించిన మొనగాళ్ల చరిత్రతోపాటు అనేక వీరోచిత ఘట్టాలు ఈ మ్యూజియంలో కొలువుదీరనున్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతోపాటు గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను మ్యూజియంలో నెలకొల్పనున్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు. గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చోని వీక్షించేలా డిజిటల్ థియేటర్ నిర్మిస్తున్నారు. ట్రైబల్ థీమ్ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్ థియేటర్, స్వాగత ప్లాజా నిర్మిస్తున్నారు. చరిత్రను పదిలం చేసే పనులు షురూ.. మ్యూజియం నిర్మాణం పనులు వేగవంతం చేయడంతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన చరిత్రను పదిలం చేసే పనులు ఊపందుకున్నాయి. ఇందుకు సంబంధించి గత నెల 18న అల్లూరి జిల్లా సీతంపేట ఐటీడీఏలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ), వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారులు, పశు సంవర్ధక శాఖ, జిల్లా పర్యాటక అధికారి, ఉప విద్యా అధికారి, గిరిజన ఉపాధ్యాయులు, వెలుగు సొసైటీ సభ్యులు, గిరిజన తెగల గ్రామ స్థాయి కమిటీల సమన్వయంతో చారిత్రక ఆధారాలను సేకరించేలా సమాయత్తం చేశారు. మన్యం కేంద్రంగా సాగిన స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన ఆధారాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన సామగ్రిని సేకరించేలా దిశానిర్ధేశం చేశారు. గిరిజన జీవన విధానానికి అద్దం పట్టేలా.. గిరిజన కళాఖండాలు, వస్తువులు, నమూనాలు రెండేసి చొప్పున సేకరించి ఒకటి మ్యూజియంకు, మరొకటి స్థానికంగా ఐటీడీఏలలో భద్రపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గిరిజన తెగకు సంబంధించిన వస్తువుల (కళాఖండాలు) జాబితాను సిద్ధం చేయనున్నారు. వాటిని వీలైనంత పెద్ద సైజులో ఫొటోలు తీయిస్తారు. వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. గిరిజనులు ఉపయోగించిన నీటి కుండలు, సీసా పొట్ల కాయలు, సంగీత పరికరాలు, చేపలు పట్టే సామగ్రి, వేటకు వాడిన ఉచ్చులు, నూనె వెలికితీత యంత్రాలు, చెక్క ఇల్లు, గుళిక విల్లు, విల్లు, బాణాలు, వ్రస్తాలు, ఆభరణాలు (పూసల తదితర లోహాలతో కూడిన నగలు), వ్యవసాయ పనిముట్లు, పరికరాలు సేకరిస్తారు. గిరిజన జాతరలు, పండుగలు, మౌఖిక సంప్రదాయాలు, పాటలు, దేవుళ్లు, దేవతలు, సంప్రదాయ నిపుణులు, వివాహ తంతు, స్మారక స్తంభాలు, చెక్క క్రాఫ్ట్, కుండలు, ఇనుప వస్తువులు, ముసుగులకు సంబంధించిన అనేక వస్తువులు, సవివరమైన చరిత్రను అందుబాటులోకి తెస్తారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017 నుంచి కనీసం భూమిని కూడా కేటాయించకపోడంతో దీని నిర్మాణం చేపట్టలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మ్యూజియం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ శాఖల సమన్వయంతో భూ కేటాయింపు సమస్యను సీఎం వైఎస్ జగన్ కొలిక్కి తెచ్చారు. 2021లో చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రం గర్వించే స్థాయిలో గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియం తాజంగిలో రూపుదిద్దుకుంటోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి శరవేగంగా నిర్మిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే తపనతో ఉన్నాం. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలోని 10 రాష్ట్రాలకు గిరిజన స్వాతంత్ర పోరాట యోధుల మ్యూజియాలను మంజూరు చేసింది. జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మణిపూర్, గోవాలకు మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. వాటిలో మన రాష్ట్రానికి రూ.15 కోట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతోపాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించింది. – కాంతిలాల్ దండే, కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ -
తిరుమలలో రెండు ఎస్వీ మ్యూజియంల ఆధునీకరణ : టీటీడీ ఛైర్మన్ భూమన
-
ఆస్కార్ మ్యూజియమ్‌లో మెమోరీస్ గుర్తు చేసుకున్న ఇండియన్ స్టార్స్
లాస్ ఏంజిల్స్‌లోని ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్, సంగీత దర్శకుడు–గాయకుడు–నిర్మాత ఏఆర్ రెహమాన్. ఆ మ్యూజియమ్లోనే హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ ‘ది గాడ్‌ఫాదర్’ (1972) సినిమాను వీక్షించారు కమల్, రెహమాన్. 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) సినిమాకుగాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్‌ను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. నాటి విశేషాలను కూడా కమల్‌తో కలిసి ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ గుర్తు చేసుకున్నారు. అలాగే కమల్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించిన ఫొటోలను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా, కమల్‌హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్ వీడియో లాంచ్ ఇటీవల అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన కమల్‌హాసన్ ఇంకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా చేసిన మైఖేల్ వెస్ట్మోర్ను కలిసిన కమల్‌హాసన్ తాజాగా ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమా షూటింగ్లో కమల్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. -
మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్.. మన భవిష్యత్తు ఇలాగేనేమో (ఫొటోలు)
-
రాష్ట్రంలో బొమ్మల కొలువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టాయ్ (బొమ్మల) మ్యూజియం కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, నైపుణ్యాన్ని ప్రతిబింబించే బొమ్మలను ఇందులో ప్రదర్శించనున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంపెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన విజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం టాయ్ మ్యూజియాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మూడేళ్ల కిందట తొలి దశలో గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రతిపాదించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. రెండేళ్ల క్రితం గుజరాత్లో తొలి బొమ్మల మ్యూజియం పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విజయనగరంలో బొమ్మల మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇప్పటికే పురావస్తు, ప్రదర్శనశాలల శాఖ.. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దేశం నలుమూలల నుంచి.. మన రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పాటు జమ్మూకశ్మీర్ (పేపర్ బొమ్మలు) పంజాబ్ (ఫోక్), రాజస్థాన్ (గుడ్డ, స్టఫ్డ్), గుజరాత్ (ఎర్ర మట్టి), మహారాష్ట్ర (చెక్క, వంట సామగ్రి), కర్ణాటక (చెన్నపట్న బొమ్మలు), తమిళనాడు (తంజావూరు), తెలంగాణ (నిర్మల్), పశ్చిమ బెంగాల్ (నాటుంగ్రాం), మధ్యప్రదేశ్ (తమలపాకుతో చేసేవి), బిహార్ (కన్యాపుత్రి), ఉత్తరప్రదేశ్ (చెక్కబొమ్మలు), అసోం (ఆషారికండి) తదితర సుమారు 50కిపైగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల నుంచి కొబ్బరి పీచు, రబ్బరు, ప్లాస్టిక్, మెటల్, పింగాణీలతో చేసిన కళాకృతులు, బొమ్మలను సేకరించి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ సాంప్రదాయ బొమ్మలతో పాటు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందించేలా రోబోటిక్, ఎల్రక్టానిక్ వంటి సుమారు లక్ష నుంచి రెండు లక్షల బొమ్మలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా మ్యూజియం సందర్శనకు వచ్చే చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జాతీయ, స్థానిక సంస్కృతికి అద్దం పట్టడంతో పాటు శాస్త్రవేత్తలు, కళాకారులు, ప్రముఖ వ్యక్తుల గురించి బొమ్మల మ్యూజియం పరిచయం చేయనుంది. అలాగే పరిశోధన, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాన్నిప్రోత్సహించనుంది. గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్దది.. కాగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. చిల్డ్రన్స్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో రతన్‌పూర్, షాపూర్ గ్రామాల మధ్యలో గిఫ్ట్ సిటీ సమీపంలో 11 లక్షలకు పైగా బొమ్మలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పురాతన కాలం నుంచి ఆధునిక యుగం వరకు అనేక రకాల బొమ్మలను ప్రదర్శించనున్నారు. ఇస్రో–డీఆర్డీవో సహాయంతో ఎల్రక్టానిక్, బ్యాటరీ, సౌర ఆధారిత చిన్న అంతరిక్ష నౌక, పృథ్వీ, అగ్ని క్షిపణులు, ఉపగ్రహాల సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించేలా బొమ్మలను తయారు చేయనున్నారు. ఇప్పటివరకు అమెరికాకు చెందిన మిస్సౌరీ రాష్ట్రంలోని బ్రాన్సన్ టాయ్ మ్యూజియం 10 లక్షల బొమ్మలతో అతిపెద్ద మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఇందులో మోడల్ రైళ్లు, విమానాలు, కార్లు, సూపర్ హీరో, డిస్నీ వరల్డ్ వంటి బొమ్మలు 1800 సంవత్సరం నుంచి తాజా టెక్నాలజీ వరకు ఉన్నాయి. వారసత్వ, విజ్ఞాన, పరిశోధన కేంద్రంగా.. బొమ్మల మ్యూజియం చారిత్రక, వారసత్వ విజ్ఞానాన్ని భద్రపరుస్తుంది. సందర్శకులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. విద్యార్థులకు విజ్ఞానం, పరిశోధకులకు రీసెర్చ్ సెంటర్‌గా ఎంతో ఉపయోగపడుతుంది. విజయనగరంలో స్థలం అందుబాటులో ఉండటంతో బొమ్మల మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపించి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటంలో విశేష కృషి చేస్తోంది. అందుకే జిల్లాల్లో మ్యూజియాలను అభివృద్ధి చేస్తున్నాం. – జి.వాణీమోహన్, కమిషనర్, పురావస్తు–ప్రదర్శనశాలల శాఖ భవిష్యత్తు తరాలకు అందించడానికే.. భారతదేశం గొప్ప కళలకు ప్రసిద్ధి చెందింది. వాటిని మన భవిష్యత్తు తరాలకు అందించడమే టాయ్ మ్యూజియాల లక్ష్యం. అందుకే దేశ వ్యాప్తంగా రకరకాల బొమ్మలను సేకరించి ఇందులో ప్రదర్శిస్తాం. ఈ మ్యూజియాలే పెద్ద వర్క్‌షాపు సెంటర్లుగా మారనున్నాయి. బాల్యంలో స్నేహితులతో కలిసి బొమ్మలతో ఆడుకుంటే చిన్నారుల్లో మానసిక ఎదుగుదలతో పాటు సామాజిక స్పృహ, సృజనాత్మకత పెరుగుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. టాయ్ మ్యూజియం ద్వారా కొంత వరకు దీన్ని అధిగమించవచ్చు. – రజత్‌భార్గవ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
పోర్చుగల్‌లో ఈ ఇళ్లు చాలా ఫేమస్.. అంతలా ఏముందంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శిలాగృహం. అలాగని ఇదేదో రాతియుగం నాటిది కాదు. అచ్చంగా ఆధునిక కాలంలో నిర్మించినదే! ఇది పోర్చుగల్‌లోని గిమెరెస్‌లో ఉంది. కొండ ప్రాంతంలో ఒకదానినొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఒక స్థానిక ఇంజినీర్ ఫామ్‌హౌస్‌లా ఉపయోగించుకునేందుకు దీనిని 1972లో నిర్మించుకున్నాడు. విచిత్రమైన ఈ నిర్మాణాన్ని చూడటానికి జనాల తాకిడి నానాటికీ ఎక్కువ కావడంతో, దీని యజమాని వేరేచోట ఫామ్‌హౌస్‌ను నిర్మించుకుని తరలిపోయాడు. ఇందులోని ఫర్నిచర్‌ని, ఇతర వస్తువులను అలాగే ఉంచేసి, దీనిని మ్యూజియంలా మార్చడంతో, ఈ కట్టడం పోర్చుగల్‌లో పర్యాటక ఆకర్షణగా మారింది. -
ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట!
కైరో: మమ్మీఫైయింగ్ ద్వారా ఈజిప్ట్ ఫారో చక్రవర్తులను, రాణులను భద్రపర్చడం.. వాటిని పిరమిడ్ల కింద మమ్మీలుగా బయటకు తీస్తుండడం తెలిసిందే కదా. ఈజిప్ట్‌లో, ప్రపంచంలోని పలు దేశాల మ్యూజియంలో మమ్మీలను చూడడం షరామామూలే కావొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఒక కిల్లర్ షార్క్‌ను మమ్మీఫైయింగ్ చేసి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. ఈజిప్ట్ నగరం హుర్ఘదా ఎర్ర సముద్ర పరిధిలో ఉన్న ఓ రిసార్ట్ తాజాగా జరిగిన ఘోరం గురించి తెలిసే ఉంటుంది. 23 ఏళ్ల రష్యన్ యువకుడిని అతని తండ్రి సమక్షంలోనే దాడి చేసి.. చంపి తినేసింది ఓ షార్క్(టైగర్ షార్క్). సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ఆ తండ్రితో సహా అక్కడున్నవాళ్లందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ టైంలో తనను రక్షించమంటూ ఆ వ్యక్తి కేకలు వేయడం గమనించొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది కూడా. అయితే.. ఆ తర్వాత ఆ షార్క్‌ను చంపేశారు కూడా. అది పక్కా కమర్షియల్ రిసార్ట్. ఎప్పుడూ బోట్లు సంచరిస్తూనే ఉంటాయి. అలాంటి చోట ఈ ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరగడం.. నీళ్లలోకి లాక్కెళ్లి మరీ 20 సెకండ్లలోనే అతన్ని చంపి మింగేయడం లాంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మృతుడి శరీర భాగాలను జాలర్లు నీటి నుంచి సేకరించగా.. మరికొన్ని భాగాలు షార్క్ పొట్టలో దొరికాయి. ఇదిలా ఉంటే.. ఆ టైగర్షార్క ప్రవర్తన గురించి పరిశోధకుల్లో ఆసక్తి నెలకొంది. అంత వేగంగా అది దాడి చేసి చంపినందుకు నరమాంసభక్షకిగా అభివర్ణిస్తున్నారు వాళ్లు. అంతేకాదు దానిని పరిశీలించేందుకు ఇప్పుడొక అవకాశం దొరికిందని.. అందుకే దానిని భద్రపర్చాలని నిర్ణయించుకున్నట్లు మెరైన్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్, రెడ్సీ రిజర్వ్స్ వాళ్లు చెబుతున్నారు. సోమవారం నుంచి ఆ షార్క్ బాడీకి ఎంబామింగ్ చేయడం ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే.. ఆ షార్క్‌ను ఇనిస్టిట్యూట్‌లోని మ్యూజియంలో భద్రపరుస్తారట. దాని ప్రవర్తనకు అధ్యయనం చేసేందుకు దానిని భద్రపరుస్తున్నామని, తర్వాతి తరాలకు ఆ కిల్లర్ షార్క్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు దొరికిన భాగాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఆ తండ్రి.. పుట్టెడు దుఖంతో ఆ అస్తికలను తీసుకుని రష్యాకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: శవపేటిక నుంచి సౌండ్ రావడంతో.. -
మీరెప్పుడూ చూడని మెర్సిడెస్ బెంజ్ కార్లు (ఫోటోలు)
-
అరుదైన శిలా ఫలకం.. అంతులేని నిర్లక్ష్యం!
.. సూర్యాపేట జిల్లా ఫణిగిరి గుట్టపై 2003లో జరిపిన తవ్వకాల్లో క్రీస్తుశకం 1– 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన 3 అడుగుల సున్నపు రాయి ఫలకం వెలుగు చూసింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే క్రమంలో జరిగిన పరిణామాల చిత్రాలను మూడు వరుసల్లో దానిపై చెక్కారు. అరుదైన ఇలాంటి ఫలకాలకు అంతర్జాతీయ విపణిలో విపరీతమైన డిమాండ్ ఉంది. తవ్వకాలు జరిపిన కొత్తలో ఈ శిలా ఫలకాన్ని ప్రభుత్వ ఆదీనంలోని ఓ గదిలో భద్రపర్చగా.. 2003 సెపె్టంబర్లో దొంగలు దాన్ని ఎత్తుకుపోయారు. పోలీసు బృందాలు జల్లెడ పట్టి సమీపంలోని ఓ ఊరిలో దానిని స్వాదీనం చేసుకున్నారు. కానీ శిలా ఫలకం అప్పటికే రెండు ముక్కలు కావడంతో.. తాత్కాలికంగా అతికించారు. అయితే ఈ ఫలకాన్ని సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటూ కోర్టు ఆదేశించడంతో.. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో సిమెంట్ బేస్ సాయంతో కదలకుండా ఏర్పాటు చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం ఈ శిల్పాన్ని విమానంలో ముంబై మ్యూజియానికి తీసుకెళ్లి, తీసుకొచ్చారు. ఆ సమయంలో పగులు విచ్చుకోవటంతో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతికించారు. ఈసారి అమెరికాకు తరలించి.. అమెరికాలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో బుద్ధుడి జీవిత పరిణామ క్రమానికి సంబంధించిన భారతీయ శిల్పాలతో అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి మన దేశం నుంచి 94 శిల్పాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి 9 ఉన్నాయి. వీటిలో కరీంనగర్ మ్యూజియంలో ఉన్న నాగ ముచిలింద శిల్పం పగుళ్లతో ఉండటంతో.. దాన్ని వదిలేసి మిగతా 8 శిల్పాలను ఇటీవల విమానంలో తరలించారు. ఇలా తరలించిన వాటిలో ఫణిగిరి సున్నపురాయి ఫలకం కూడా ఉంది. అరుదైన ఈ శిలా ఫలకాన్ని అంత దూరం ఎలా తరలిస్తారని ఇటీవల కొందరు కేంద్ర పురావస్తు శాఖకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు రెండు శిల్పాలు ధ్వంసం దాదాపు 20 ఏళ్ల క్రితం స్టేట్ మ్యూజియం నుంచి బాదామి చాళుక్యుల కాలం నాటి ఎర్ర ఇసుకరాతితో చేసిన దుర్గాదేవి ప్రతిమను విదేశాలకు పంపగా.. రవాణాలో విగ్రహం ముక్కు భాగం దెబ్బతిన్నది. బెర్లిన్‌లో జరిగిన తేజస్ ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లిన ఓ నాగ శిల్పం వెనక భాగంలో దెబ్బతిన్నది. ఇలా అరుదైన శిల్పాలు దెబ్బతిన్న ఘటనలున్నా.. ఇప్పటికే దెబ్బతిని, తిరిగి అతికించిన శిలా ఫలకాన్ని విదేశాలకు తరలించడం అడ్డగోలు చర్య అని ఓ విశ్రాంత ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అరుదైన ఘటన: మ్యూజియంలో ఆమె గుండె..16 ఏళ్ల తర్వాత ఆ మహిళే..
ఏదైన కారణం చేత మన శరీరంలో కొన్ని అవయవాలను తీసేస్తే గనుక మనం వాటిని చూసే అవకాశం ఉండదు. వైద్యులు కూడా శస్త్ర చికిత్స చేసే టైంలో తొలగించిన అవయవాన్ని మన కుటుంబ సభ్యులకు చూపిస్తారు. ఐతే మన శరీరం నుంచి వేరుచేసిన అవయవాలను చూడటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఇక్కడొక మహిళకు మాత్రం తన గుండెను తాను చూసుకునే అరుదైన అవకాశం లభించింది. అది కూడా మ్యూజియంలో అంటే నమ్మశక్యంగా లేదు కదా!. అసలేం జరిగిందంటే..లండన్‌లోని హాంప్‌షైర్‌లోని రింగ్వుడ్కి చెందిన 38 ఏళ్ల జెన్నిఫర్ సుట్టన్ ప్రస్తుతం చాలా బిజీ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంది. ఆమె విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడూ కొండలపై నడవడానికి, కొన్ని రకాల వ్యాయామాలు చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు గ్రహించింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా నిర్బంధ కార్డియోమయోపతి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల శరీరంలో రక్తాన్ని పంపు చేసే గుండె సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఆమె త్వరితగతిన గుండె మార్పిడి చేయించుకోనట్లయితే చనిపోతుందని డాక్టరు చెబుతారు. సుట్టన్‌కు అప్పుడు 22 ఏళ్ల వయసు. ఓ పక్క వేగంగా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఆమెకు 2007లో తనకు సరిపోయే మరొకరి గుండె లభించినట్లు తెలిసింది. ఆ తర్వాత సుట్టన్‌కు చకచక గుండె మార్పిడి సర్జరీ జరిగిపోవండ వంటివి జరిగిపోయాయి. కానీ ఆమె ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యింది. ఎందుకంటే 13 ఏళ్ల వయసులో సుట్టన్ అదే ఆపరేషన్ కారణంగా అమ్మను కోల్పోయింది. ఐతే సట్టన్కి సర్జరీ అనంతరం స్ప్రుహలోకి రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ తదనంతరం తన గుండెను సుట్టన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్కి లండన్ హంటేరియన్లోని హోల్బోర్న్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతిచ్చింది. దీంతో సరిగ్గా ఆమె 16 సంవత్సరాల తర్వాత తన గుండెను చూసుకుంది. ఇది తన శరీరీంలో ఉండేది కదా అనే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందని, ఇది తనకు అసాధ్యమైన గొప్ప బహుమతిగా అభివర్ణించుకుంది సుట్టన్. ఈ గుండె తనని 22 సంవత్సారాలు జీవించగలిగేలా చేసిందని అందుకు గర్వంగా ఉందని చెబుతోంది. దాత వల్లే కదా ఈ రోజు బతికబట్టగట్టిగలిగాను అందువల్ల అవయవ దానాన్ని పోత్సహించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రణాళికలను వాయిదా వేసే అలవాటు ఉన్నవారిని ఈ రోజు నుంచే అలాంటి చర్యలను తీసుకునేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను బిజీ లైఫ్‌తో ఉన్నానని, తన హృదయాన్ని పదిలంగా ఉంచుకుని సాధ్యమైనంత ఎక్కువ కాలం బతికేలా ఆరోగ్యంగా ఉండేందకు యత్నిస్తానని ఆనందంగా చెబుతోంది సుట్టన్. (చదవండి: పనోడి సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..) -
తవ్వి తీశారు.. అప్పగించటం మరిచారు
కొండాపూర్‌లో మ్యూజియాన్ని మూడేళ్లుగా మూసి పెట్టిన కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), అంతకంటే పెద్ద ఘనకార్యాన్నే చేసింది. పన్నెండేళ్ల క్రితం తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులను సంబంధిత ఉన్నతాధికారి ఇప్పటివరకు వాటిని మ్యూజియంకు హ్యాండోవర్ చేయలేదు. ఆ తవ్వకాల్లో ఏయే వస్తువులు లభించాయో నివేదికనూ అందజేయలేదు. తవ్వకాల్లో దొరికిన వస్తువులెన్ని? అవి ఎక్కడున్నాయి? వాటిల్లో అన్నీ ఉన్నాయా? లేదా? వంటి విషయాలేవీ బయటి ప్రపంచానికి చెప్పలేదు. నివేదిక ఇవ్వకున్నా ఏఎస్ఐ పన్నెండేళ్లుగా చేష్టలుడిగి చూస్తుండటం విడ్డూరం. పుష్కర కాలం కిందట ఆ తవ్వకాలకు నేతృత్వం వహించిన అధికారి, ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో తవ్వకాల్లో దొరికిన చారిత్రక సంపద విషయం గందరగోళంగా మారింది. సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డికి చేరువలో ఉన్న కొండాపూర్ అద్భుత శాతవాహన కేంద్రం. క్రీ.పూ.2వ శతాబ్దం–క్రీ.శ.2వ శతాబ్దం మధ్య ఇది వ్యాపార, ఆధ్యాత్మి క పట్టణం. 19వ శతాబ్ద ప్రారంభం, 1940, 1970ల్లో పలుమార్లు ఇక్కడ తవ్వకాలు జరిగాయి. చరిత్రపరిశోధకులు గొప్పవిగా భావించే అనేక ఆధారాలు వెలుగు చూశాయి. రోమన్లు వచ్చి ఇక్కడ స్థిరపడి అంతర్జాతీయస్థాయిలో వాణిజ్యాన్ని నిర్వహించినట్టు తేలింది. అగస్టస్ కాలం నాటి బంగారు నాణేలూ ఇక్కడ దొరి కాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న చైనా పోర్సలీస్ బొమ్మలను తలదన్నే బొమ్మలు అక్కడ 2 వేల ఏళ్ల నాడే మనుగడలో ఉన్నట్టు తేలింది. నాటి బంగారు ఆభరణాలు, మణులు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చల లాంటివెన్నో వెలుగు చూశాయి. ఓ పట్టణానికి సంబంధించిన అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ 86 ఎకరాల స్థలాన్ని ఏఎస్ఐ తన ఆధీనంలోకి తీసుకుని ఓ మ్యూజియంను నిర్మించింది. తవ్వకాల్లో వెలుగు చూసిన వాటిల్లోంచి కొన్నింటిని ప్రదర్శనకు ఉంచింది. మరోసారి తవ్వకాలు.. 2009 నుంచి 2011 వరకు ఏఎస్ఐ మరోసారి తవ్వకాలు జరిపింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తవ్వకాల విభాగం (4) సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మహేశ్వరి ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. అందులోనూ వేల సంఖ్యలో విలువైన వస్తువులు, శాతవాహన కాలం నాటి నాణేలు భారీ గా వెలుగు చూశాయి. అయితే.. ఏయే వస్తువులు దొరికాయి? వాటి ప్రత్యేకతలేంటి? అనే నివేదికను మాత్రం ఏఎస్ఐ బహిర్గతం చేయలేదు. ఎంతోమంది అడిగినా స్పందించలేదు. ఈలోపు అధికారి మహే శ్వరి వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఆమె నివేదిక పోవడం, లభించిన వస్తువులను ఇక్కడి అధికారులకు హ్యాండోవర్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటిని పెట్టిన గది తాళంచెవులు కూడా అప్పగించలేదు. దీంతో తవ్వి తీసినా కూడా అవి అజ్ఞాతంలోనే ఉండిపోయాయి. పరిశోధనలకు ఆస్కారమే లేక.. కర్ణాటకలోకి మస్కిలో తవ్వకాలు జరిపినప్పు డు 33 బంగారు నాణేలు వెలుగు చూశాయి. మస్కి తవ్వకాల్లో లభించిన 33 ఫనమ్ బంగారు నాణేల్లో కేవలం ఒకటి మాత్రమే హోయసల రాజ్యానిదని, మిగతావన్నీ అంతకు చాలా ముందుగా ఉన్న విష్ణుకుండినులు సహా ఇతర పాలకులు అని వాటిని పరిశోధించిన ప్రముఖ నాణేల నిపుణుడు డాక్టర్ రాజారెడ్డి తేల్చారు. అలాంటి కొత్త విషయాలు కొండాపూర్‌లో 2009లో జరిపిన తవ్వకాల్లో దొరికిన నాణేల్లోనూ ఉంటాయన్న ఉద్దేశంతో వాటి పరిశోధనకు కేంద్రప్రభుత్వం నుంచి 2015లో అనుమతి పొందారు. అయితే.. నాటి అధికారి వాటిని హ్యాండోవర్ చేయకపోవటంతో పరిశోధనకు కేటాయించలేమని అధికారులు చెప్పారు. అలా పరిశోధనలేవీ జరగలేదు. (చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన) -
కొండా‘పూర్’ మ్యూజియం: అదో పట్టణం, బౌద్ధ కేంద్రం కానీ..
కొండా‘పూర్’ మ్యూజియం అదో పట్టణం.. అందమైన ఇళ్లు, భూగర్భ గృహాలతో కళకళలాడింది. అదో వ్యాపార కేంద్రం.. అత్తరు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేది.. అందుకు ప్రత్యేకంగా కయోలిన్ క్లేతో అత్తరు బుడ్లను తయారు చేసేవారు.. ఈ వ్యాపారంలో ప్రముఖ పాత్ర రోమన్ వ్యాపారులదే. అదో బౌద్ధ కేంద్రం.. స్తూపం, చైత్యం, ఆధ్యాతి్మక మందిరాలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి. ఇదంతా ఎక్కడో కాదు, సంగారెడ్డి పట్టణానికి చేరువగా ఉన్న కొండాపూర్ కేంద్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు కాదు, క్రీ.పూ. 2వ శతాబ్దం– క్రీ.శ.2వ శతాబ్దం మధ్య కాలం నాటి సంగతి. సాక్షి,హైదరాబాద్: శాతవాహనులు పాలించిన ప్రాంతంలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో లభించిన నాణేల్లో సగానికంటే ఎక్కువ లభించిందిఈ కొండాపూర్ ప్రాంతంలోనే. రోమన్ చక్రవర్తి అగస్టస్ హయాంలో చెలామణిలో ఉన్న బంగారు నాణేలూ ఇక్కడ లభించాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి.. పులుమావి శాతకరి్ణ, యజ్ఞశ్రీ శాతకర్ణి లాంటి వారు అక్కడికి వచ్చి ఉంటారన్నది చరిత్రపరిశోధకుల మాట. ఇప్పుడు పోర్సోలిన్ అనగానే చైనా తయారీ బొమ్మలు గుర్తుకొస్తాయి. కానీ రెండు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ ఆ మట్టితో బొమ్మలు రూపొందించారు. ►ఇంత ఘనమైన చరిత్ర ఉన్న కొండాపూర్ ప్రాంతంలో 19వ శతాబ్దం నుంచి జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఎన్నో గొప్ప ఆధారాలను ప్రదర్శనకు ఉంచిన ఓ మ్యూజియం ఉంది. అయితే, అది మూడేళ్లుగా మూతపడి ఉంది. రాష్ట్రంలో కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న ఏకైక మ్యూజియం ఇదే కావటం గమనార్హం. ►ప్రచారం లేకపోవడంతో... మ్యూజియం భవనం నిర్వహణ బాగానే ఉన్నా, కట్టడ పటుత్వం దెబ్బతినటంతో రూ.2.5 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కానీ దానికి అనుమతి రాకపోవటంతో, ఉన్నదాన్నే బాగుచేసి, కొత్త గ్యాలరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇంతలో కోవిడ్ మహమ్మారి విస్తరించటంతో 2020లో దాన్ని మూసేశారు. ఆ తర్వాత మరమ్మతులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఫలితంగా మ్యూజియం మూసే ఉంది. దీంతో విలువైన, సున్నితమైన వస్తువులను చూసే వీలు లేకుండాపోయింది. అంత గొప్ప మ్యూజియం ఉందన్న ప్రచారం లేకపోవటంతో ప్రజలకు దాని గురించే తెలియకుండా పోయింది. ►విదేశాల్లో ఉంటే కిటకిటలాడేదేమో.. ముందస్తుగా ఫోన్ చేసి చెప్పి ఇటీవలే ఆ మ్యూజియాన్ని సందర్శించి అబ్బురపడ్డాను. 2 వేల ఏళ్ల క్రితమే మన చరిత్ర ఇంత గొప్పదా అనిపించే స్థాయి ఆధారాలు అక్కడ ఉన్నాయి. కానీ, వాటి ని చూసేందుకు జనమే రారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఇంత గొప్ప ఆధారాలతో విదేశాల్లో మ్యూజియం ఉంటే జనంతో కిటకిటలాడేది. – చిన వీరభద్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ►త్వరలో పునరుద్ధరిస్తాం కొండాపూర్ మ్యూజియం మన అద్భుత చరిత్రకు నిదర్శనం. దాని విషయంలో నిర్లక్ష్యం చేయం. కొత్త భవనం అనుకున్నా, ఉన్నదాన్నే బాగుచేద్దామని నిర్ణయించి పనులు జరుపుతున్నాం. త్వరలో మ్యూజియాన్ని పునరుద్ధరిస్తాం. – మహేశ్వరి, ఏఎస్ఐ రీజినల్ డైరెక్టర్ చదవండి: ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా! -
విశాఖలో ఈనెల 11న సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన
-
భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా..గిరిజన మ్యూజియం
సాక్షి, అమరావతి: గిరిజన స్వాతంత్య్ర వీరుల చరిత్రను భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి నింపే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన మ్యూజియం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రా కశ్మిర్‌గా పేరుగాంచిన లంబసింగికి సమీపంలో రూ.35 కోట్లతో ట్రైబల్ ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియం పనులు ఇప్పటికే 62.25 శాతానికి పైగా పూర్తయ్యాయి. గిరిజన పోరాటం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చేలా కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే అరకు, కర్నులు జిల్లా శ్రీశైలం, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మ్యూజియంలున్నాయి. అల్లూరి సీతారామరాజుతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో గర్జించిన గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను నెలకొల్పనున్నారు. గిరిజన యోధుల చరిత్రను భావితరాలకు అందించేలా శిల్పాలు, ఫొటోలను ఏర్పాటు చేస్తారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు. గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చుని వీక్షించేలా డిజిటల్ థియేటర్‌ను నిరి్మస్తున్నారు. ట్రైబల్ థీమ్ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్ థియేటర్, స్వాగత ప్లాజాలను నిర్మిస్తున్నారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీని నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. 2021లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగిలో 21.67ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేగంగా నిర్మాణ పనులు నాలుగు విభాగాలుగా చేపట్టిన మ్యూజియం నిర్మాణాన్ని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియంను మంజూరు చేసి రూ.15 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లతో పాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించడంతో మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. – రవీంద్రబాబు, మిషన్ డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ -
జైలుకు పోవాలన్న ఆతృత వాళ్లకెందుకు?
సంగారెడ్డి టౌన్: జైలు.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఖైదీలు. తెల్లని చొక్కా, దాని మీద నెంబరు.. తెల్ల నిక్కర్.. తెల్ల టోపీ. అయితే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే వారికోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ‘ఫీల్ ది జైల్’ పేరుతో సంగారెడ్డిలో ప్రత్యేక కారాగారం ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటి మ్యూజియం, జైలు కూడా ఇదే. నిజాం కాలంలో.. నిజాం కాలంలో మొదట సంగారెడ్డి జైలు ఏరియాలో గుర్రపుశాల నిర్మించారు. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అదే ఏరియాలో 1.5 ఎకరాల్లో జైలు ఏర్పాటు చేశారు. ఇందులో పదుల సంఖ్యలో బ్యారక్‌లు ఉన్నాయి. ఒక్కోదానికి తెలంగాణ, మొఘల్, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనల పెయింటింగ్ వేయించారు. బ్రిటీష్ కాలం నాటి ఫొటోలు కూడా గదుల్లో ఏర్పాటు చేయించారు. టైపు రైటర్లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్ క్లాక్ లు, గంటలు.. ఇలా ప్రతీ వస్తువు ప్రదర్శన కోసం ఉంచారు. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి.. జైలు మ్యూజియమే కాదు.. జైలు జీవితాన్ని అనుభవించాలనుకునేవారికి అధికారులు సంగారెడ్డి జైలులో అవకాశం కల్పించారు. ఇందుకోసం రోజుకు రూ. 500 చెల్లించాలి. వారికి సాధారణ ఖైదీలాగే ఖాదీ దుస్తులు, చొక్కా, నిక్కర్ లేదా ప్యాంట్, ప్లేట్, గ్లాస్, మగ్గు, సబ్బు, మంచి భోజనం, నిద్రించేందుకు దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. టీ, టిఫిన్ ఇచ్చేవారు. యోగా, క్రమశిక్షణ నేర్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచేవారు. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరిగేవి. జాతిరత్నాలు సినిమాతో పాటు ఇతర సినిమాల్లో జైళ్ల్ల సీన్ల షుటింగ్ కూడా ఇక్కడే జరిగాయి. ఉదయం 6.30 నుంచే.. ఉదయం 6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉండేది. 7.30 గంటలకు టీతో పాటు టిఫిన్, తర్వాత పరేడ్ 8 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం ఉండేది. 9.30 గంటలకు మ్యూజియం సూపర్వైజర్ రౌండ్‌కు వచ్చేవారు. ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డించేవారు. 11 గంటల నుంచి తిరిగి విద్యాదానం కొనసాగేది. మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి. 1.30 నుంచి సాయంత్రం 4 గంట ల వరకు కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవ గాహన కల్పించేవారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేయడం వంటి ట్రైనింగ్ ఉండేది. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత 6 గంటలకు లాకప్‌లో ఉంచేవారు. ఇలా ఇక్కడ సుమారు 50 మంది వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఇదంతా గతం. కరోనా ఎఫెక్ట్‌తో జైలు మూతబడింది. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలకు కాంపౌండ్ వాల్ పడిపోయింది. ప్రభుత్వం స్పందించి ఫీల్ ది జైల్‌ను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఫీల్ ది జైల్ ప్రారంభించాలి శిథిలమైన ఫీల్ ది జైల్‌కు రిపేర్ చేయించాలి. పర్యాటకశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలి. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి అవకాశం కల్పించాలి. ఈతరం వారికి జైలు అంటే ఎలా ఉంటుందో తెలియజేయాలి. – అఖిల్ యాదవ్, సంగారెడ్డి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి సంగారెడ్డిలోని మ్యూజియం జైలును పునరుద్ధరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. జైలు జీవితంపై యువతకు అవగాహన కల్పించాలి. చెడుమార్గంలో నడవకుండా, నిజజీవితంలో జైలు జీవితమంటే ఎంత నరకమో తెలియజేయాలి. – కూన వేణు, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు -
స్త్రీ శక్తి: లండన్ మ్యూజియానికి పింక్ శారీ!
ఎగరడానికి రెక్కలు సవరించిన కాలం అది. ‘పోనీలే’ అని రాజీపడే జీవులు సమరశంఖం కోసం గొంతు సవరించిన కాలం అది. ‘గులాబీ గ్యాంగ్’ అంటే పోరాట చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర లండన్ మ్యూజియానికి చేరనుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యూజియంలలో లండన్ ‘డిజైన్ మ్యూజియం’ ఒకటి. ప్రపంచ నలుమూలలకు సంబంధించి భిన్నమైన డిజైన్లకు ఇదో వేదిక. ఈ వేదికపై స్త్రీ శక్తిని ప్రతిఫలించే, ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీర సగర్వంగా రెపరెపలాడనుంది. 2006లో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఏ కొద్దిమందో మహిళలలో తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు. పట్టపగలు రోడ్డు మీదికి వెళ్లాలన్నా భయపడే రోజులు. మరోవైపు కట్నపు వేధింపులు, గృహహింస! అలాంటి సమయంలో ‘మనం ఏం చేయలేమా!’ అనే నిస్సహాయతలో నుంచి పుట్టుకు వచ్చిందే గులాబీ గ్యాంగ్! ‘నువ్వు నేను కాదు... మనం’ అనే నినాదంతో బృందంగా ముందుకు కదిలారు. పింక్ శారీని యూనిఫామ్‌గా చేసుకున్నారు. ఈ బృందానికి సంపత్‌పాల్‌దేవి నాయకత్వం వహించింది. పదుల సంఖ్యతో మొదలైన గులాబీ గ్యాంగ్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తాజాగా... లండన్ ‘డిజైన్ మ్యూజియం’ క్యూరేటర్ ప్రియా ఖాన్చందాని నుంచి సంపత్పాల్దేవికి ఇమెయిల్ వచ్చింది. అందులో ఉన్న విషయం సంక్షిప్తంగా...‘ప్రియమైన గులాబీ గ్యాంగ్ సభ్యులకు, మీ ధైర్యసాహసాలకు సంబం«ధించిన వార్తలను ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు అవి ఎంతో ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తుంటాయి. మీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీరను ఆఫ్‌బీట్ శారీ టైటిల్‌తో మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నాము’ ‘మా పోరాట స్ఫూర్తి విదేశీగడ్డపై అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మా సభ్యులలో ఒకరు ధరించిన చీరను పంపబోతున్నాం’ అంటుంది సంపత్‌పాల్‌దేవి. -
Lionel Messi: తగిన గౌరవం.. రూమ్‌నే మ్యూజియంగా
ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఖతార్‌లో మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను ఓ మ్యూజియంగా మార్చాలని ఖతార్ యూనివర్సిటీ నిర్ణయించడం ఆసక్తి రేపింది. దోహాలో మెస్సీతోపాటు అర్జెంటీనా స్ట్రైకర్ సెర్గియో ఆగెరో ఒకే హోటల్ రూమ్‌లో ఉన్నారు. మెస్సీ గౌరవానికి సూచకంగా ఇక నుంచి ఆ రూమ్‌ను ఎవరికీ ఇవ్వకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో మెస్సీకి సంబంధించిన వస్తువులతో ఓ చిన్న మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఒక న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. ఈ మ్యూజియాన్ని విద్యార్థులు, టూరిస్టులు సందర్శించే అవకాశం కల్పించారు. "అర్జెంటీనా టీమ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను అలాగే ఉంచుతాం. ఈ రూమ్‌కు కేవలం సందర్శకులకు మాత్రమే అవకాశం కల్పిస్తాం. ఆ హోటల్ రూమ్ ఇక భవిష్యత్తులో మరెవరికీ కేటాయించం. మెస్సీకి చెందిన వస్తువులు విద్యార్థులు, భవిష్యత్తు తరాలకు ఓ పాఠంగా నిలుస్తాయి. అతడు వరల్డ్‌కప్ సందర్భంగా సాధించిన ఘనతలేంటో వారికి తెలుస్తాయి" అని ఖతార్ యూనివర్సిటీ డైరెక్టర్ హిత్మి అల్ హిత్మి చెప్పారు. ఖతర్ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్‌కప్ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్ టాప్ బస్సులో రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు. Here's a quick tour of La Albiceleste's base camp at Qatar University! The room where the Argentinian captain, Lionel Messi, stayed in during the World Cup will also be turned into a mini museum soon!#Qatar #ARG #Argentina #Qatar2022 #FIFAWorldCup #LaAlbiceleste #LionelMessi pic.twitter.com/0UsdkBvcdX — The Peninsula Qatar (@PeninsulaQatar) December 27, 2022 చదవండి: పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
ఎపిగ్రఫీ మ్యూజియం సిటీకి బదులు తిరుచ్చికి..?
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల (ఎపిగ్రఫీ మ్యూజియం)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రక్రియకు ఆదిలోనే అవాంతరం ఎదురవుతోంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆమోదించిన ప్రతిపాదనే బుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో కాకుండా తిరుచ్చిలో ఏర్పాటు చేసేలా తమిళనాడుకు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, ఢిల్లీలోని మరికొందరు తమిళ ఐఏఎస్ అధికారులు ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వెరసి.. భాగ్యనగరానికి మరింత పర్యాటక శోభ తీసుకు రావాల్సిన ప్రాజెక్టు కాస్తా మనకు దక్కకుండా పోయే పరిస్థితి నెలకొంది. తొలుత హైదరాబాద్‌లో ఏర్పాటుకు కసరత్తు..: దేశంలో శాసనాలకు ప్రత్యేకంగా మ్యూజియం లేదు. మైసూరు కేంద్రంగా ఏఎస్ఐలో భాగంగా శాసనాల విభాగం ఉంది. దీని పరిధిలో లక్నో, చెన్నై, నాగ్‌పూర్‌లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మైసూరులో 75 వేల శాసనాలకు చెందిన నకళ్లు ఉన్నాయి. కానీ ప్రజలు సందర్శించేలా మ్యూజియం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాలను భద్రపరిచేందుకు, పర్యాటకులు వాటిని తిలకించేందుకు వీలుగా ఎపిగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో ఏర్పా టు చేయాలని చరిత్ర పరిశోధకులు గతేడాది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో వెంటనే స్థానికంగా మ్యూజియం ఏర్పాటుకు వీలుగా కసరత్తు ప్రారంభమైంది. ఓ చిన్న పెవిలియన్‌తో సరిపెట్టేలా..: కానీ ఏఎస్ఐలో పనిచేసే తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ అధికారి కేంద్ర మంత్రి ప్రతిపాదనకు గండికొట్టి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని తమిళనాడులోని తిరుచ్చిలో ఏర్పాటు చేసే పని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఎపిగ్రఫీ మ్యూజియం బదులు సాలార్జంగ్ మ్యూజియంలో ఓ చిన్న పెవిలియన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీంతో ఏఎస్ఐ తెలంగాణ సర్కిల్ అధికారులు సాలార్జంగ్ మ్యూజియంలో ప్రతిపాదిత పెవిలియన్ కోసం 132 శాసన కాపీలను ప్రదర్శించేందుకు ఓ జాబితా రూపొందించారు. రూ. 20 లక్షలు వెచ్చించి పెవిలయన్ గ్యాలరీలు సిద్ధం చేశారు. మైసూరులోని ఎపిగ్రఫీ డైరక్టరేట్లోని శాసన నకళ్లలో 23 వేలకుపైగా తమిళ భాషవే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తమిళనాడుకు తరలించేందుకు ఆ అధికారులు తెరవెనక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుచ్చిలో జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ఆ అధికారుల యోచన. అయితే దీన్ని అడ్డుకోవాలని చరిత్ర పరిశోధకులు కిషన్‌రెడ్డిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. -
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్‌కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
తీరొక్క భూములు.. చూడచక్కని అడవులు
సాక్షి, సిద్దిపేట: దేశంలో ఉన్న అటవీప్రాంతాలు, వివిధ రకాల కర్రలు, నేలల రకాలు అన్నీ ఒకే దగ్గర తిలకించేవిధంగా ఏర్పాటు చేశారు. అది ఎక్కడో అనుకుంటున్నారా! ఎక్కడో కాదు.. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో(ఎఫ్ఆర్సీఐ) ఏర్పాటు చేసిన మ్యూజియంలో కొలువుదీరాయి. 52 ఎకరాల్లో ఏర్పాటుచేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో బీఎస్సీ ఫారెస్ట్ నాలుగేళ్లు, ఎమ్మెస్సీ ఫారెస్ట్ రెండేళ్ల కోర్సులు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు రెండేళ్లపాటు అడవులను సందర్శించి వీటిని సేకరించారు. ప్రజలకు దేశంలో అటవీప్రాంతాలు, నేలల రకాలపై అవగాహన కోసం మ్యూజియం రూపొందించారు. మ్యూజియంలోకి వెళ్లగానే అడవిలోకి వెళ్లినట్లుగా ఉండే విధంగా వివిధ రకాల జంతువుల బొమ్మలు, చెట్లు ఏర్పాటు చేశారు. భూములు... అడవులు మ్యూజియంలో ఎన్నో అంశాలు తెలుసుకునేవిధంగా ఏర్పాటు చేశారు. దేశంలో భూములు, పంటల రకాలు, రాష్ట్రంలోని అడవుల గురించి తెలిసే విధంగా చిత్రాలను ఉంచారు. తడి ఆకులు, పొడి ఆకురాల్చు, ముళ్ల అడవులు, పొడి సతత హరితారణ్యాలకు సంబంధించి వాటి స్వరూపాన్ని తెలిపే అంశాలను లిఖించారు. రాష్ట్ర వృక్షం జమ్మి, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పుష్పం తంగేడు, రాష్ట్రపక్షి పాలపిట్టలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు చిత్రాలను ఏర్పాటు చేశారు. శిల్పాలు, ఖనిజాలు, శిలాజాలు, మృత్తికలు చిత్రరూపంలో ఉన్నాయి. జంతువుల పాదాల అచ్చులు ఏ జంతువు పాదం అచ్చు ఏ విధంగా ఉంటుందో ఫొటోలతో ఏర్పాటు చేశారు. జింక, పులి, నీటి ఏనుగు, సింహం, చిరుత, ఎలుగుబంటి, నక్క, ఏనుగుల పాదాల అచ్చులను ఏర్పాటు చేశారు. కప్పకు సంబంధించిన లైఫ్ సర్కిల్‌ను ఫొటోల రూపం ఏర్పాటు చేశారు. సాధారణంగా నాలుగు, ఐదు రకాల సీతాకోక చిలుకలనే మనం చూసి ఉంటాం. అదే ఫారెస్ట్ కళాశాల మ్యూజియంలో 32 రకాల సీతాకోక చిలుకలు, 10 రకాల గొల్లభామలు, మిడతలు, తేనెటీగలు ఉన్నాయి. సాయిల్ ప్రొఫైల్ భూముల్లో ఎన్ని పొరలు ఉంటాయి. ఏవిధంగా ఉంటాయో తెలియదు. అందరికీ తెలిసేవిధంగా ఫారెస్ట్ కళాశాలలో సాయిల్ ప్రొఫైల్ ఏర్పాటు చేశారు. భూమిలో ఐదుపొరలు ఉండనున్నాయి. అవి ఆర్గానిక్ ఆరిజన్, టాప్ సాయిల్, సబ్ సాయిల్, రాక్ ప్రాంగ్మెంట్స్, బెడ్రాక్లు ఉన్నాయి. ఇవన్నీ గాజుపాత్రలో ఏర్పాటు చేశారు. కర్రల సమూహం తెలంగాణలో చాలారకాల చెట్లను నరికి తయారు చేసిన కర్రల చెక్కలను గృహ అవసరాలకు వినియోగిస్తుంటారు. ఈవిధంగా ఉపయోగించే 17 రకాల చెట్లకు సంబంధించిన చెక్కలను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టేకు, బండారు, తుమ్మ, సీసం, తెల్లమద్ది, ఇప్ప, కరక్కాయ, చిల్ల, కానుగ, ఇప్ప, రోజ్ఉడ్, మిత్రదైనా, గుంపెన, లాటిణోలియా, గ్జలేలియా, తునికి, నారెప్పల చెట్టుకు సంబంధించిన కర్ర చెక్కలున్నాయి. వివిధ రకాల కర్రలతో తయారు చేసిన చెక్క బొమ్మలు, వివిధ ఆకృతులు మ్యూజియంలో ఉన్నాయి. రెండేళ్లు పట్టింది ఇవన్నీ సేకరించేందుకు.. డాక్టర్ కపిల్ సిహాద్తోపాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లు రెండేళ్లపాటు తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. దేశంలో, రాష్ట్రంలో అటవీప్రాంతాలు, వివిధ రకాల కర్రలు, జంతువులు, నేలల రకాల గురించి అందరికీ తెలిపేందుకే ఈ మ్యూజియం ఏర్పాటు చేశాం. పాఠశాల విద్యార్థులు ప్రతి నెలా ఫీల్డ్ విజిట్లకు వెళ్తుంటారు. అలా వెళ్లేవారు ఎఫ్సీఆర్ఐలో ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తే ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. – వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్సీఐ డిప్యూటీ డైరెక్టర్ -
మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా!
సాక్షి, ముంబై: ఫన్నీ విడియోలు, విభిన్న ఫోటోలు, పోస్ట్‌లతో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకోవడం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు బాగా అలవాటు. అంతేకాదు యూజర్ల ప్రశ్నలకు అంతే చమత్కారంగా బదులివ్వడం కూడా వ్యాపార దిగ్గజానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మహీంద్రా షేర్ చేసిన వీడియోలోని వాయిస్ తనదేనా కాదా అని తెలుసుకోవాలనుకునే ట్విట్టర్ వినియోగదారుడికి ఆయనిచ్చిన సమాధానం నెటిజనులను ఆకట్టుకుంటోంది. విషయం ఏమిటంటే..ది మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ గురించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో టైటిల్స్‌లో వాయిస్ ఆనంద్ మహీంద్రఅని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆయన నేరేషన్లో ఈ వీడియో కథనం సాగుతుంది. అయితే “సార్, ఇది మీ వాయిస్?” అని ఒకరు సంభ్రమాశ్చర్యాలతో అడిగారు. దానికి సమాధానంగా మీకు నచ్చితే నా వాయిస్సే.. నచ్చకపోతే నాది కాదు..(ఊరికే సరదాగా అంటున్నా..అది నా వాయిస్సే) అంటూ రిప్లై ఇచ్చారు మహీంద్ర. దీంతో కమెంట్లు వెల్లు వెత్తాయి. “చివరికి మనం రోజూ చూసే ముఖానికి వాయిస్‌ని లింక్ చేయడం అద్భుతం. మీ డిక్షన్ వాయిస్ క్లారిటీ భలే ఉంది సార్ శుభాకాంక్షలు” ఒకరు "వావ్ మీరు వాయిస్ ఆర్టిస్ట్ కావచ్చు సార్" అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా అట్లాంటాలోని వరల్డ్ ఆఫ్ కోకా కోలా , స్టుట్గార్ట్లోని మెర్సిడెస్-బెంజ్ మ్యూజియం వంటి కార్పొరేట్ మ్యూజియంలు 1990ల నుండి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే గత దశాబ్దంలో అనేక భారతీయ వారసత్వ సంస్థలు, టాటా, అరవింద్ లిమిటెడ్ ఇలాంటి మ్యూజియంలను ప్రారంభించాయి. తాజాగా ఈ జాబితాలో మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ పేరుతో మహీంద్ర కూడా చేరింది. జీవితం స్థిరంగా లేనట్లే, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో మహీంద్రా గ్రూప్‌కు సంబంధించి ఒక సజీవమైన, శ్వాసించే సంస్థ మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ " అని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ముంబైలోని మహీంద్ర ప్రధాన కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే ముందస్తు అనుమతితో దీన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. If you’re happy with it, it is my voice and if you don’t like it, it isn’t! ( Just kidding; yes it’s my voice) https://t.co/TG1yczLSrk — anand mahindra (@anandmahindra) July 11, 2022 Presenting The Museum of Living History, where #PurposeMeetsDesign. It celebrates the philosophy, DNA, core values, and culture of the @MahindraRise Group and is a collection of stories that define us. Located at our HQ in Mumbai, it’ll soon be open for viewing by appointment pic.twitter.com/c5ew7YaEsZ — anand mahindra (@anandmahindra) July 11, 2022 -
గర్ల్‌ఫ్రెండ్ పై ఉన్న పిచ్చి ఎంత పనిచేసింది...సుమారు రూ.40 కోట్లు..
కొంతమంది కోపం వప్తే మనిషిలా ప్రవర్తించారు. అనుకున్నది జరగకపోయిన, తాను అనుకున్నట్లుగా లేకపోయిన కొంతమందికి భలే కోపం ముంచుకోస్తుంది. దీంతో వాళ్ల చేసే హంగామా ఇంత అంత కాదు. మరికొంతమంది కోపంతో విలువైన వస్తువులు పాడు చేయడం లేక తమకు హాని కలిగించుకోవడమే వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకరి మీద ఉన్న కోపాన్ని వేరే వారిపై చూపించి లేనిపోనీ సమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే అమెరికాకు చెందిన బ్రియాన్ హెర్నాండెజ్. తన ప్రియురాలితో గొడవపడి కోపంతో చేసిన దారుణమైన పనికి ఊచలెక్కపెడుతున్నాడు. అసలేం జరగిందంటే...అమెరికాలోని 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ టెక్సాస్‌లోని డల్లాస్ మ్యూజియం ఆప్ ఆర్ట్‌లోకి చొరబడి విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఆ మ్యూజియంలో ఎంతో విలువ చేసే గొప్ప గొప్ప కళాఖండాలుంటాయి. అతను అత్యంత విలువైన అరుదైన కళాఖండాలన్నింటిని ధ్వంసం చేశాడు. బ్రియాన్ మ్యూజియంలో నష్ట పరిచిన కళాఖండాల విలువ సుమారు రూ. 40 కోట్లు. దీంతో డల్లాస్ పోలీసులు బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పోలీసులు విచారణలో అతన్ని ఎందుకిలా చేశావని ప్రశ్నించిగా...అతను చెప్పింది విని ఒక్కసారిగి షాక్ అయ్యిపోయారు. గర్లఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ అని ఇటీవలే తనతో గొడపడ్డానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే పిచ్చి అని ఆమెతో గొడవపడటంతో తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడు. ఏదిఏమైన పిచ్చివ్యామోహంతోనూ, కోపంతోనూ చేసే పనులు మిగిల్చే నష్టం ఊహకందనంతా ఘోరంగా ఉంటుంది. (చదవండి: నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ) -
ప్రజాస్వామ్య బలోపేతం దేశానికి గర్వకారణం
న్యూఢిల్లీ: మన దేశం నేటి ఉన్నత స్థితికి చేరడం వెనుక స్వాతంత్య్రానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాల కృషి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఒకట్రెండు మినహాయింపులు తప్పిస్తే ప్రజాస్వామ్య విధానాలను బలోపేతం చేయడంలో దేశం గర్వించదగ్గ సంప్రదాయాన్ని నెలకొల్పిందని చెప్పారు. గురువారం మోదీ ప్రధానమంత్రి సంగ్రహాలయ(ప్రధానమంత్రుల మ్యూజియం)ను ఇప్పటి వరకు పనిచేసిన 14 మంది ప్రధానులకు అంకితం చేశారు. మొదటి టికెట్ కొనుగోలు చేసి మ్యూజియంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం ఎంతో సముచితమన్నారు. పలువురు మాజీ ప్రధానమంత్రుల కుటుంబసభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గాంధీ కుటుంబం హాజరు కాలేదని ప్రధాని కార్యాలయం తెలిపింది. కార్యక్రమానికి హాజరైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తన తండ్రి కళ్లద్దాలను మ్యూజియంకు అందజేశారు. దివంగత నేతకు కాంగ్రెస్ సముచిత గౌరవం ఇవ్వలేదంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌కు నివాళులు.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ఘన నివాళులర్పించారు. పార్లమెంట్లో అంబేడ్కర్‌కు నివాళి కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగం అనే బలమైన పునాదిని బీఆర్ అంబేడ్కర్ మన దేశానికి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. Speaking at the inauguration of Pradhanmantri Sangrahalaya in Delhi. https://t.co/I2ArKZRJdg — Narendra Modi (@narendramodi) April 14, 2022 మ్యూజియం ప్రత్యేకతలు ► ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో 15,600 చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు బ్లాకులు, 43 గ్యాలరీలతో ఈ సంగ్రహాలయాన్ని నిర్మించారు. ► రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తిగా ఈ మ్యూజియానికి డిజైన్ చేశారు. ► భారత స్వాతంత్ర్య సంగ్రామం, రాజ్యాంగ నిర్మాణం, ప్రధానులు ఎదుర్కొన్న వివిధ సవాళ్లు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని మ్యూజియంలో చూపించనున్నారు. ► వాటితో పాటు దివంగత ప్రధానులు ఉపయోగించిన వస్తువులనూ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. ► నేత తరానికి ఆనాటి ప్రధానుల సేవలు, నాయకత్వ పటిమ, దార్శనికత, విజయాల గురించి తెలియజేసేందుకు ప్రధానమంత్రి సంగ్రహాలయ ఎంతో దోహదం చేయనుంది. ► టికెట్ ధర 100 రూపాయలు. విదేశీయులకు మాత్రం 750 రూపాయలు. ► ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లకు మాత్రం సగం ధర ఉంటుంది. ► విద్యాసంస్థల తరపున వెళ్తే మాత్రం.. 25 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. -
ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంకు తొలి టిక్కెట్టు కొనుగోలు చేసిన ప్రధాని మోదీ
-
రూ. 99 వేల కోట్ల..నిజాం నగలున్నాయి
బంజారాహిల్స్: సీఏం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవాలంటే.. హైదరాబాద్‌లో నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని ప్రిన్స్ మోజంజాహ్ మనవడు హిమాయత్ అలీ మీర్జా అన్నారు. రూ.99వేల కోట్ల విలువ చేసే నిజాం జ్యువెలరీ హైదరాబాద్‌కు రావాలంటే ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని మషెల్లా మంజిల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని తాను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశానని తెలిపారు. ప్రస్తుతం నిజాం ఆభరణాలు ఆర్బీఐ కస్టడీలో ఉన్నాయని.. వాటిని హైదరాబాద్ తరలించాలని 4 నెలల క్రితం ప్రధానమంత్రి మోదీకి తాను లేఖ రాశానన్నారు. అందుకు ప్రధాని సుముఖత చూపుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారన్నారు. అందుకే... రాష్ట్ర ప్రభుత్వం భద్రతతో కూడిన మ్యూజియం నిర్మించి ఇస్తే వెంటనే తరలిస్తామని కిషన్‌రెడ్డి ఇటీవల హామీ ఇచ్చారని చెప్పారు. నిజాంకు సంబంధించిన 2 వేల ఎకరాల భూములు 70ఏళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల నిరుపయోగంగా ఉన్నాయని.. ఆ వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తానని, అనువైన స్థలం ఎంపిక చేసి అక్కడ మ్యూజియం నిర్మించాలని అన్నారు. ఈ మ్యూజియం నిర్మాణంతో సీఎం కేసీఆర్ ప్రతిష్ట పెరుగుతుందని, సుమారు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దీనివల్ల పర్యాటకంగానూ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా నిజాం భూములను స్వాధీనం చేసుకొని మ్యూజియం నిర్మించాలని ఆయన కోరారు. -
వన్స్‌యూ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్
►కాకతీయ పౌరుషానికి ప్రతీక అయిన రాణీ రుద్రమదేవి 1289లో ప్రాణాలు వదిలారు. ఆ విషయం 1970లలో వెలుగు చూసింది. ఆమె ఎప్పుడు చనిపోయిందో ప్రపంచానికి ఇన్ని శతాబ్దాల తర్వాత తెలియచెప్పింది ఓ శాసనం. ►విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 1529 అక్టోబర్ 17న మరణించారన్న విషయం గతేడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని తూమకూరు ప్రాంతంలో లభించిన ఓ శాసనమే వెలుగులోకి తెచ్చింది. సాక్షి, హైదరాబాద్: చరిత్రలో శాసనాలకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతాకాదు. చరిత్రను ఎలాంటి వక్రీకరణల్లేకుండా భావితరాలకు అందిస్తున్నవి నాటి శాసనాలే. ఇప్పుడు అలాంటి శాసనాలకు ఓ ప్రత్యేక ప్రదర్శనశాల సిద్ధం కానుంది. భాగ్యనగరం కేంద్రంగా నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖ చర్యలు చేపట్టింది. దేశంలో ఇప్పటికే పూర్తిస్థాయి మింట్ మ్యూజియంకు హైదరాబాద్ వేదిక కానుండగా ఇప్పుడు ఎపిగ్రఫీ మ్యూజియం కూడా ఇక్కడే ఏర్పడనుండటం విశేషం. నేటి తరం కోసమే... కాగితాలు లేని కాలంలో ఓ చారిత్రక ఘట్టాన్ని భవిష్యత్తు తరానికి అక్షరబద్ధం చేసి అందించేందుకు ఉన్న ఏకైక మార్గం శాసనం వేయించడమే. అందుకే చరిత్రను ఆధారసహితంగా మనకు అందించేవి శాసనాలే. కానీ ఈ విషయంలో మన దేశం ఎంతో వెనకబడి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా శాసనాలు చదివేందుకు ప్రభుత్వపరంగా ఉన్న నిపుణులు కేవలం 30 మందే. అలాగే కొందరు ఔత్సాహికులు తప్ప ఇప్పుడు శాసనాలు చదివి పరిష్కరించేవారు లేకుండా పోతున్నారు. నేటి తరానికి వాటిపై అవగాహనే ఉండటం లేదు. ఈ తరుణంలో ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు కానుండటంతో శాసనాలను వెలుగులోకి తెచ్చి పదిలం చేసే వ్యవస్థ ఏర్పడేందుకు మార్గం సుగమం కానుంది. ఆ నినాదంతో మొదలై.. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం పరిధిలో జాతీయ స్థాయిలో ఎపిగ్రఫీ విభాగం కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా కొనసాగుతోంది. అక్కడ ఎపిగ్రఫీ డైరక్టరేట్ ఉండగా, లక్నో, నాగ్‌పూర్, చెన్నైలలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. కానీ సిబ్బంది కొరత, రాష్ట్రాల పరిధిలో పురావస్తు శాఖలు నిర్వీర్యమైపోవడం, వాటికి కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో సమన్వయం లేకపోవడం.. వెరసి ఎపిగ్రఫీ విభాగం సరిగ్గా పనిచేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఎపిగ్రఫీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ కొందరు విశ్రాంత ఎపిగ్రఫిస్టులు, ఔత్సాహిక పరిశోధకులు దాదాపు 50 వేల మంది ఇటీవల ఆన్లైన్ వేదికగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమ ప్రతినిధులు కొందరు ఇటీవల విశ్రాంత ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. వారి డిమాండ్లతోపాటు ఎపిగ్రఫీ మ్యూజియం అంశం చర్చకు వచ్చింది. ఫలితంగా జాతీయ స్థాయిలో ఓ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు అంశం కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌లో ఆ మ్యూజియంను ఏర్పాటు చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. త్వరలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భవనాన్ని ఎంపిక చేయనున్నారు. ఉన్న భవనాల్లో ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేయాలా, కొత్త భవనం నిర్మించాలా అన్న విషయాన్ని తేల్చనున్నారు. ►జాతీయ స్థాయిలో లభించిన, కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో సందర్శకుల ముందుంచుతారు. కేంద్రం చేపట్టనున్న చర్యలు... ►కొత్తగా కనీసం 100 వరకు ఎపిగ్రఫీ పోస్టులు ఏర్పాటు చేసి భర్తీ చేస్తారు. ►శాసనాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తారు. ►శాసనాల గుర్తింపు, వాటి పరిరక్షణ విషయంలో రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పాటు చేస్తారు. ►డిజిటలైజేషన్ ద్వారా శాసనాల పూర్తి విషయాలను సందర్శకుల ముందుంచుతారు. ►శాసనాలకు సంబంధించిన సదస్సులు నిర్వహిస్తారు. -
అవాక్కయ్యే విషయం: ఒక సగం ఆడ.. మరో సగం మగ
Dual Gender Stick Insect That Is Half Male And Half Female: ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. గ్రీన్‌బీన్ స్టిక్ ఇన్సెక్ట్ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన లారెన్ గార్ఫీల్డ్ దాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. ఇదేమిటా అని శాస్త్రవేత్తలకు చూపిస్తే.. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు. సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు. -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం..!
-
1957 నుంచి సేకరిస్తూ.. చివరికి ఆ ఇల్లే మ్యూజియంగా మారింది
సాక్షి,డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కానీ, విశాఖ నగరంలోని రెడ్డి కంచరపాలెం వాసి బసవ రవిశంకర్‌రెడ్డికి మాత్రం చాలా అభిరుచులున్నాయి. వాటన్నింటినీ పట్టుదలతో సాధించుకున్న ఘనత ఆయనది. రవిశంకర్‌రెడ్డి విదేశీ కాయిన్స్, కరెన్సీతో పాటు పురాతన వస్తువులను కూడా భద్రపరచడంలో దిట్ట. 1957 నుంచి భారతదేశంలో వాడే ద్విచక్రవాహనాలు ఆయన వద్ద ఉన్నాయి. అరుదైన భారతీయ నాణాలు, నోట్లను సేకరించడమే కాకుండా 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లతో పాటు 67 దేశాల స్టాంపులు సేకరించారు రవి. చదివింది డిప్లమో అయినా తన మెదడుకు పదునుపెట్టి కువైట్, అబుదబీ దేశాల్లో పనిచేసిన అనుభవంతో తయారు చేసిన రిమోట్‌తో అర కిలోమీటరు దూరం నుంచే ఇంట్లో లైట్లు వేయడం ఆపడం చేస్తుంటారు. ఇది ఆయన సొంతంగా తయారు చేసుకున్నదే. 1957 నుంచి 27 ద్విచక్రవాహనాలు జావా, లాంబ్రెట్టా, మినీ రాజ్‌దూత్, ఏజీడీ ఇలా పాత వాహనాలను సేకరించి భద్రపరిచారు. 1990లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వంద మీటర్ల ఎత్తు, 32 టన్నుల బరువును ఉపయోగించి రెండు అతిపెద్ద క్రేన్ నమూనాలు(ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ ట్రావెల్ క్రేన్, రష్యన్ క్రేన్) తయారు చేశారు. ఈ రెండు క్రేన్లను మ్యూజియంకు అందజేశారు. తన ఇంటి గేట్‌ను రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ చేయడం, రిమోట్ లైట్ సిస్టమ్, జీరో పవర్ కన్జంప్షన్‌తో ఆటోమేటిక్ ఓవర్ హెడ్, డబుల్ షీటర్ సైకిల్ వంటివి సృష్టించారు. ఇలాంటి మరెన్నో వినూత్నమైన వస్తువులను రూపొందిస్తున్నారు రవిశంకర్‌రెడ్డి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 50 ఏళ్లు పురస్కరించుకున్న సందర్భంగా కోల్‌కతా మింట్ విడుదల చేసిన రూ.50 మొదటి కాయిన్‌ను 2018లో రవిశంకర్‌రెడ్డి రూ.3,560కు బుక్ చేసుకుని పొందారు. ఆ తర్వాత రూ.500 కాయిన్ సంపాదించారు. మూడేళ్ల కిందట రూ.200 నాణెం సేకరించారు. రెండేళ్ల కిందట రూ.1000 నాణెం సొంతం చేసుకున్నారు. గతంలో రూ.10, రూ.20, రూ.100, రూ.150..వంటి కాయిన్లను సేకరించారు. నాలుగు నెలల కిందట రూ.75, రూ.350, రూ.550 నాణాలు సేకరించిన రవిశంకర్‌రెడ్డి.. రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకుని ముంబాయి మింట్ విడుదల చేసిన రూ.250 కాయిన్‌ను సొంతం చేసుకున్నారు. రూ.4,390కు ఈ కాయిన్‌ను కొనుగోలు చేశారు. 40 గ్రాముల సిల్వర్‌తో కూడిన ఆ కాయిన్ ఇటీవల ఆయన చెంతకు చేరింది. బ్యాక్‌వర్డ్స్ బ్రెయిన్ సైకిల్ ఇదే.. రవిశంకర్‌రెడ్డి తాజాగా బ్యాక్‌వర్డ్స్ బ్రెయిన్ సైకిల్‌ను రూపొందించారు. హ్యాండిల్ ఎడమ వైపు తిప్పితే టైర్ కుడి వైపు, హ్యాండిల్ కుyì వైపు తిప్పితే టైర్ ఎడమవైపు వెళ్తుంది. ఈ సైకిల్ నడిపేవారు రెగ్యులర్ సైకిల్ నడపలేరన్నారు. ఈ సైకిల్ రూపొందించేందుకు 2 నెలల సమయం పట్టిందని, రూ.8,500 ఖర్చుతో దేశంలోనే తొలిసారిగా తానే రూపొందించానని చెప్పారు. దీని పేటెంట్స్ కోసం దరఖాస్తు చేయలేదని, చూడడానికి మామూలు సైకిల్గానే కనిపిస్తుందన్నారు. బుర్రపెట్టి నడపాలన్నారు. అక్కడ అన్నీ ప్రత్యేకం ఆ ఇల్లు ఓ జంతర్ మంతర్. ఇంట్లోకి అడుగుపెట్టగానే లైట్ వెలుగుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మరో గదిలో లైట్ వెలుగుతుంది. ముందు గది లైట్ ఆగిపోతుంది. యాప్ ద్వారా అలెక్సా.. బెడ్రూమ్ స్విచ్ ఆన్ లైట్ అనగానే వెలుగుతుంది. అలెక్సా.. స్విచ్ ఆన్ ఫ్యాన్ అనగానే ఫ్యాన్ తిరుగుతుంది. మూడంతస్తుల మేడ పై నుంచి అలెక్సా.. ఓపెన్ ద మెయిన్ గేట్ అనగానే వెంటనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఇళ్లంతా జంతర్‌మంతర్‌లా ఉంటుంది. సాంకేతికతను ఉపయోగించి.. నోటి మాటతో లైట్లు, ఫ్యాన్లు ఆపరేట్ చేస్తున్నారు. వినూత్న సైకిళ్లు తన మేధాశక్తితో అధునాతనంగా సైకిళ్లు రూపొందిస్తున్నారు. యునీ సైకిల్, డ్యూయల్ సైకిల్, కోస్టర్ బ్రేక్, రెట్రా డ్రైవ్, సైడ్ వేస్, బైసింపిల్(చెయిన్ లెస్) తదితర మోడళ్లను తయారు చేశారు. గతేడాది రెట్రా డ్రైవ్ సైకిల్‌ను రూపొందించారు. ఇండియాలోనే తొలి సైకిల్ ఇది అని రవిశంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ముందుకు తొక్కితే డబుల్ స్పీడ్(గంటకు 10 కిలోమీటర్లు)తో వెళ్తుందని, వెనక్కి తొక్కితే సింగిల్ స్పీడ్(గంటకు 5 కిలోమీటర్లు)తో నడుస్తుందని చెప్పారు. వ్యాయామం చేసేందుకు ఈ సైకిల్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. -
మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి
Mitchell Santner Smashes Museum Window Hitting Big Six.. న్యూజిలాండ్‌లో క్రికెట్ మైదానాలు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్ భారీ సిక్స్‌లు కొడితే బంతులన్నీ స్డేడియం బయటే ఉంటాయి. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్ దెబ్బకు స్టేడియంలోని మ్యూజియం అద్దాలు పగిలిపోయాయి. సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా బేసిన్ రిజర్వ్ పార్క్‌లో వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే! మ్యాచ్‌లో సాంట్నర్ 35 బంతుల్లో ఆరు సిక్సర్లు.. నాలుగు ఫోర్లతో 59 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా సాంట్నర్ కొట్టిన ఒక సిక్స్ స్డేడియంలోని మ్యూజియం అద్దాలను పగలగొట్టింది. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన బంతిని అంపైర్లు బయటికి తీయలేకపోయారు.. కారణం మ్యూజియానికి తాళం ఉండడమేనట. దీంతో కొత్త బంతి తీసుకొని ఆటను కొనసాంచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో నార్త్రన్ నైట్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ 64, కెప్టెన్ బ్రేస్‌వెల్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్రన్ నైట్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! "The ball is stuck in there, next time they go to open it they will find a white Kookaburra in there" 😂 Mitch Santner finds a window in the Museum Stand.#SparkSport #SuperSmashNZ@cricketwgtninc @SuperSmashNZ pic.twitter.com/9e8j5XMdcB — Spark Sport (@sparknzsport) January 24, 2022 -
సాంకేతికతతో సమస్యల పని పట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తల సహకారం అందుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు. వాళ్ల ఆశలు కార్యరూపం దాల్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సూచించారు. బలమైన శాస్త్ర సాంకేతిక పునాది తో రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ సీఎస్ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ రాక్ మ్యూజియం’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ.. వినూత్న శాస్త్రీయ విధానాలతో సామాన్యులకు శాస్త్ర సాంకేతికతను మరింత చేరువ చేయవచ్చన్నారు. ఇలాంటి ఆలోచనలతో ప్రజల సమస్యలను పరిష్కరించే అంశాలకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ అంటే చార్మి నార్, గోల్కొండ కాదని.. ఇదో సైన్స్ సిటీ అని అన్నారు. లక్నో, డెహ్రాడూన్ నగరాలకు పొంచి ఉన్న భూకంప ముప్పుపై రూపొందించిన మ్యాప్‌లను మంత్రి విడుదల చేశారు. రాక్ మ్యూజియంలో రకరకాల రాళ్లు ‘ఓపెన్ రాక్ మ్యూజియం’లో భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 530 లక్షల నుంచి 33 లక్షల సంవత్సరాల కాలం నాటి 35 రకాల రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. భూమి అడుగు భాగాన 175 కిలోమీటర్ల లోతులో బయటపడిన రాళ్లనూ ప్రదర్శనకు పెట్టారు. సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం త్యాగి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే వివరించారు. -
పోలవరం ప్రాజెక్టు వద్ద.. అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియం
సాక్షి, అమరావతి : చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే పాత పురావస్తు భవనాలను ఆధునీకరించడంతో పాటు కొత్త మ్యూజియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోని రామన్నగూడెంలో సుమారు రెండెకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మ్యూజియాన్ని నిర్మించనుంది. ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. వృత్తి నైపుణ్యానికి ప్రతీక.. గతంలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో.. ఆదిమ మానవులు అలంకరణలో వినియోగించిన టెర్రకోట పూసలు (బంక మన్నుతో చేసిన పూసలు).. రాతి, దంతపు పూసలతో పాటు కుండలు, ఇనుప గొడ్డలి, కొడవలి, పొట్టేలు బొమ్మ తలను గుర్తించారు. ఇక్కడ లభించిన బ్లాక్ అండ్ రెడ్ వేవ్ కుండల (కుండ పైభాగం ఎరుపు, కింద భాగం నలుపు) తయారీ (కాల్చే విధానం) ఆనాటి మానవుల వృత్తి నైపుణ్యానికి అద్దంపడుతోందని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యంగా పూసల తయారీ, ఇనుప పనిముట్లను రూపొందించడంతో పాటు మట్టి కుండలపై గ్రాఫిటి గుర్తులు, బ్రాహ్మి అక్షరాలు వారిని వృత్తి నిపుణులుగా రుజువు చేస్తున్నాయి. ముంపు గ్రామాల సంస్కృతికి ప్రతీకగా.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవనాడి. అంతటి ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఒకప్పుడు ఆదిమ మానవ సంస్కృతి విరాజిల్లింది. వేల సంవత్సరాల కిందటే వారు గొప్ప జీవన విధానాన్ని అవలంబించారు. ఆనాటి గుర్తులు, వస్తువుల సమాహారంతో ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముంపు గ్రామాల సంస్కృతిని భావితరాలకు అందించేందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. – జి. వాణిమోహన్, కమిషనర్, రాష్ట్ర పురావస్తు శాఖ క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల క్రితం.. ఆదిమ కాలం నాటి (మెగాలిథిక్) మానవుని ఆనవాళ్లు, జీవన విధానానికి పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట, తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలంలోని రాయనపేటలో గతంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ద్వారా సామాజిక, సంస్కృతి, జీవన విధానంలో ఈ ప్రాంతం ఎంతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉత్తర, దక్షిణ భారతదేశ వర్తక వాణిజ్యానికి వారధిగా నిలిచినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర భారతదేశంలోని డెక్కన్ ప్రాంతంలో ఉత్పత్తి అయి ప్రత్యేక అలంకరణలో వినియోగించే రాళ్లను ఇక్కడి తవ్వకాల్లో గుర్తించడం విశేషం. ఈ క్రమంలోనే క్రీస్తుపూర్వం మూడువేల సంవత్సరాల కిందటి మానవుల జీవనాన్ని ప్రతిబింబించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్నారు. పురావస్తు శాఖాధికారులు ప్రాజెక్టుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సర్వే నిర్వహించి సుమారు 500 విగ్రహాలను గుర్తించి వాటి సమగ్ర వివరాలను నమోదు చేశారు. వీటిని మ్యూజియంలో భద్రపరచనున్నారు. -
ఆ కల నెరవేరకుండానే చనిపోయిన పునీత్ రాజ్‌కుమార్
Puneeth Rajkumars Ancestral House In Gajanur Made Into Museum: కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆసక్మిక మరణం సినీ పరిశ్రమను కలిచి వేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ ఈ ఏడాది అక్టోబర్29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి ముందే తన పూర్వీకులు, తన తండ్రి, సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ స్వస్థలమైన గాజనూర్లోని ఇంటిని మ్యూజియంగా మార్చాలని అనుకున్నాడట. ఇప్పటికే శిథిలావస్ధకు చేరుకున్న ఆ ఇంటిని అందంగా పునరుద్ధరించి ఓ మ్యూజియంగా మార్చాలని భావించాడట. ఇందులో భాగంగా పునీత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఆ ఇంటిని సందర్శించి మ్యూజియం ఏర్పాటుకు తగిన ప్రణాళికలు రూపొందించారట. అయితే దురదృష్టవశాత్తూ గుండెపోటుతో పునీత్ మరణించాడు. తాజాగా పునీత్ కలను నిజం చేయడానికి ఆయన మేనల్లుడు గోపాల్ రంగంలోకి దిగాడు. ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు శరవేగంగా పనులు ప్రారంభించాడు. మరో రెండు నెలల్లో రెన్నోవేషన్ పనులు పూర్తవుతాయని చెప్పుకొచ్చాడు. -
150ఏళ్ల నాటి మానవ అస్తిపంజరం అక్కడ చూడొచ్చు!
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): మారుతున్న జనరేషన్..నానాటికీ అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగం అనేది అత్యంత కీలకం. మనిషి పుట్టుక ఎలా? తల్లి గర్భంలో శిశువు.. వందల ఏళ్ల నాటి జంతు కలేబరాలు.. వివిధ రకాల జలచరాలు. శతాబ్దంన్నర నాటి మానవ అస్తిపంజిరం. ఇలా.. మానవ.. జంతు పుట్టుకలతో కూడుకున్న ప్రయోగశాల విశాఖ మహానగరంలో ఒకే ఒక కళా శాలలో ఉంది. అదే ఏళ్ల చరిత్ర గల ఏవీఎన్ కళాశాల. ఏవీఎన్ కళాశాలలో స్వాతంత్య్రం రాకముందు జువాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌తో పాటు మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల/మ్యూజియంలో విశాఖలో మరెక్కడా దొరకని.. లభించని అనేక వస్తువులు పొందుపరిచారు. ఈ మ్యూజియంలో వేలాది స్పెసిమెన్స్, 100కు పైగా ఓస్టీయాలజీ స్పెసిమెన్స్, 75 రకాల మోడల్ స్పెసిమెన్స్తో పాటు 878 బాటిల్ స్పెసిమెన్స్, 700 పర్మినెంట్ స్లైడర్స్ ఉన్నాయి. మానవుని పూర్తి అస్తిపంజిరం (ఒరిజనల్), డాల్ఫిన్ అస్తిపంజిరం, ఏనుగు పుర్రె, హ్యూమన్ బ్రెయిన్, 6,7,8 నెలల మానవ పిండాలు, మానవుని గుండె, రెండు తలల బాతుపిల్ల, ఫైవ్ లెగ్డ్ ఫ్రాగ్, తొండం గల పంది పిండం..ఇలా ఎన్నెన్నో మానవుని..జంతువుల అవయవాలు సేకరించారు. అంతేగాక మైక్రోస్కోప్స్..మోనుక్యులర్ అండ్ బైనాక్యులర్, ఆటోక్లేవ్స్, సెంట్రిఫూగ్స్, ఎపిడయోస్కోప్, ఫొటోగ్రఫి ఎక్విప్మెంట్, రోటరీ మైక్రోటోమ్, డైనోసర్,హిమోగ్లోబిన్మీటర్స్, హిమోసైటోమీటర్స్, వాటర్ బాత్..సెవరల్ బయాలజికల్ చార్ట్స్ ఉన్నాయి. వీరంతా ఇక్కడి వారే.. ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, మెరైన్ లివింగ్ రిసోర్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ రమణమూర్తి, ఏయూ జువాలజీ విభాగ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ లలితకుమారి, ఆంధ్రా మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ బి.దాలినాయిడుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేసిన కేవీ రావు, తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ కె.సత్యగోపాల్, న్యూఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పి.రమేష్‌నాయుడు, సినీ ప్రముఖుడు ఎస్వీ రంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, మాజీ మేయర్ రాజాన రమణి, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, సైంటిస్ట్ డాక్టర్ శొంటి రమేష్‌తో పాటు ఎందరో ఇదే కళాశాలలో..ఇదే విభాగంలో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లారు. కళాశాల జువాలజీ.. ఫిషరీస్ విభాగాధిపతులు వీరే.. 1940లో కళాశాలలో జువాలజీ విభాగం ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎ.శ్రీనివాస్ విభాగాధిపతిగా సేవలందించారు. అనంతరం 1945 నుంచి 1975వరకు వీఎస్ వేంకటేశ్వర్లు, 1975 నుంచి 1990 వరకు బీహెచ్‌వీ సీతారామస్వామి, 1990 నుంచి 1993 వరకు డాక్టర్ బి.నాగేశ్వరరావు, 1993 నుంచి 2002 వరకు డాక్టర్ జి.శివరామకృష్ణ, 2002 నుంచి 2010 వరకు బి.విజయభాస్కరరావు విభాగాధిపతులుగా సేవలందించగా 2010 నుంచి ఇప్పటి వరకు డాక్టర్ కె.పుష్పరాజు విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు.. గ్రేటర్ విశాఖ పరిధిలోనే గాక ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరెక్కడా లేని ప్రయోగశాల/మ్యూజియం ఏవీఎన్లోనే ఉంది. ఎంతో మంది ఈ కళాశాల నుంచే ఉన్నత పదవులు అధిరోహించారు. మానవ పిండాలకు సంబంధించి ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థులు కూడా తరచూ ఇక్కడకే వస్తుంటారు. –ఆచార్య డి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్, ఏవీఎన్ కాలేజ్ చాలా అరుదైనది ఏవీఎన్ కళాశాల జువాలజీ నుంచి సినీ నటుడు ఎస్వీ రంగారావు, ఐఏఎస్ అధికారి కేవీ రావు వంటి వారు ఎందరో ఇక్కడే విద్యనభ్యసించారు. ఏవీఎన్ కళాశాల జువాలజీ మ్యూజియంలో అరుదైన స్పెసిమెన్లలో సహజ మానవ అస్తిపంజిరం, డాల్ఫిన్ అస్తి పంజిరం, 6,7,8 నెలల మానవ పిండాలు, రెండు తలల బాతు పిల్ల, తొండం గల పంది పిండం వంటివి ఎన్నో సేకరించాం. –రాంకుమార్, జువాలజీ ఇన్చార్జి -
నింగీ.. నేలా చూద్దామిలా!
కాకినాడ రూరల్: సాగరతీర సందర్శకులకు విజ్ఞానం, వినోదం పంచేందుకు సమయం సమీపిస్తోంది. కాకినాడ సూర్యారావుపేట బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ఇందుకోసం ముస్తాబవుతోంది. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన మన రాష్టంలో విశాఖ తరువాత కాకినాడ తీరం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి బీచ్‌కు నిత్యం వేలాదిగా ప్రజల తాకిడి ఉంటుంది. కోవిడ్ కొంత ప్రభావం చూపినా బీచ్ పూర్వ వైభవం మళ్లీ పొందుతోంది. భవిష్యత్తులో ఇది పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకూ తీరాన్ని మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ఇక్కడ యుద్ధ విమాన ప్రదర్శన శాల ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. టీయూ–142ఎం యుద్ధ విమానంతో.. బీచ్‌లో థీమ్ పార్కు ఇప్పటికే ఆకట్టుకుంటుండగా యుద్ధ విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తొలుత ట్రైనీ యుద్ధ విమానం ఏర్పాటు చేసి ప్రదర్శనకు అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకుని మరో యుద్ధ విమానం ఏర్పాటుకు కృషి చేసింది. దేశ రక్షణ రంగంలో దాదాపు 28 ఏళ్ల పాటు సేవలందించి 2017లో వైదొలగిన టీయూ–142ఎం విమానాన్ని ఇక్కడ నిలపాలని సంకల్పించి సఫలీకృతమైంది. ప్రపంచంలోనే అతి భారీ, పురాతన యుద్ధ విమానాల్లో ఇది ఒకటి కావడం విశేషం. 53 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తు, 100 టన్నుల బరువు (ఇంధనంతో కలిపితే 185 టన్నులు) కలిగిన ఈ యుద్ధ విమానాన్ని చెన్నై నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. బయటి నుంచి చూడటమే కాకుండా లోపలికి వెళ్లి అన్నీ చూసేందుకు వీలుగా దీనిని రూపుదిద్దారు. త్వరలోనే ఈ విమానం మ్యూజియం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. యుద్ధ విమానం సేవలు, ఆయుధాలు, శత్రువులపై దాడి, స్వీయరక్షణ వంటి అంశాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. విడి భాగాలను రోడ్డు మార్గంలో తీసుకువచ్చి బిగించారు. సందర్శకులు లోపలకు వచ్చి, బయటకు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. పనుల్లో కొంత జాప్యం నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో దీనిని ప్రారంభింపజేయాలని అధికారులు తొలుత భావించారు. ఇందులో భాగంగా తూర్పు నావికాదళం ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సెప్టెంబర్‌లో వచ్చి పరిశీలించారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న పార్కులో కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కుడా) (గతంలో గుడా) రూ.5.89 కోట్లతో చేపట్టిన విమాన మ్యూజియం పనుల వివరాలను కలెక్టర్ సి.హరికిరణ్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, వైస్ అడ్మిరల్‌కు వివరించారు. డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలని పనులు చేపడుతున్న తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సంస్థ (విశాఖ) ప్రతినిధి శ్రీనివాస్‌కు సూచించారు. అయితే పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సదరు కాంట్రాక్టు సంస్థకు మొదటి విడత బిల్లు సుమారు రూ.2 కోట్లు గురువారం చెల్లించింది. దీంతో పనులకు అడ్డంకులు తొలగాయి. జనవరి నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. -
Visakhapatnam: ఆ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి..
సాక్షి, విశాఖపట్నం: అందమైన బీచ్‌రోడ్డులో సరదాగా విహరిస్తూ ముందుకు సాగుతుంటే.. సాగరగర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్‌మెరైన్.. దాని ఎదురుగా గగనతలంలో శత్రువులను గడగడలాడించిన టీయూ–142.. ఆ పక్కనే గాల్లో దూసుకుపోయే సీ హారియర్ యుద్ధ విమానం.. ఇలా వీటన్నింటిని చూస్తూ.. ఒక కప్పు కాఫీ తాగుతూ.. బీచ్ రోడ్డులో సరదాగా షాపింగ్ చేస్తే ఎంతో బాగుంటుందో కదా.. ఈ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి. బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాట్లకు సన్నహాలు సాగుతున్నాయి. విశాఖ నగరాన్ని నంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శకులకు మరింత శోభను అందించేలా బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణానికి వీఎంఆర్డీఏ చురుగ్గా అడుగులు వేస్తోంది. రూ.40 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికలు, డీపీఆర్ సిద్ధం చేసింది. రూ.10కోట్లతో సీహారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. సిద్ధమవుతున్న సీహారియర్ ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి సందర్శకుల మనసు దోచుకుంటోంది. సాగరతీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరోస్పేస్ నుంచి కొనుగోలు చేసిన ఈ సీహారియర్ నౌకాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హంస యుద్ధనౌకలో 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ యుద్ద విమానాన్ని వీఎంఆర్డీఏ సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్మృతి భవన్లో దీనికి సంబంధించిన మ్యూజియం నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీనిని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. సముద్రపు గాలులకు ఇది తుప్పు పట్టకుండా వీఎంఆర్డీఏ ప్రత్యేక కోటింగ్ పెయింట్ వేయించింది. త్వరలోనే ఇది రాజీవ్ స్మృతి భవన్‌కు చేరనుంది. చదవండి: (WorkFromHomeTowns: 24/7 విద్యుత్ సరఫరా.. హై స్పీడ్ ఇంటర్నెట్) ఇంటిగ్రేటెడ్ మ్యూజియం సీ హారియర్ మ్యూజియం అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. బీచ్‌రోడ్డుకు వచ్చే ప్రతి సందర్శకుడికీ సరికొత్త అనుభూతి కలిగించేలా మ్యూజియంను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన నేపథ్యంలో వీఎంఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం బీచ్‌రోడ్డులో అందుబాటులోకి రానుంది. రాజీవ్ స్మృతి భవన్లో సీహారియర్ మ్యూజియం పనులు వేగవంతం చేశారు. కోవిడ్ కారణంగా ఆలస్యమైనా.. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు వీఎంఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ప్రయత్నిస్తోంది. 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నారు. ఫుడ్ కోర్టులు.. షాపింగ్‌లు... ఇంటిగ్రేటెడ్ మ్యూజియంలో భాగంగా రాజీవ్ స్మృతి భవన్లో సీ హారియర్ మ్యూజియం మార్చి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. రూ.10 కోట్లతో మ్యూజియం అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా రూ.10 కోట్లతో సబ్‌మెరైన్ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో రూ.20 కోట్లతో ఫుడ్ కోర్టులు, షాపింగ్ చేసుకునేలా సరికొత్త దుకాణాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. సీహారియర్ మ్యూజియంలో వివిధ రకాల యుద్ధ విమానాల గురించి తెలుసుకునేలా సమగ్ర సమాచార ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. టీయూ–142 మ్యూజియం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్చ్ మాదిరిగా సబ్‌మెరైన్ మ్యూజియంను తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా ఇంటిగ్రేటెడ్ మ్యూజియంలో విభిన్న హంగులు కొత్త అనుభూతిని అందివ్వనున్నాయి. సావనీర్ షాప్, సిమ్యులేషన్ గేమ్స్, కాఫీషాప్‌తో పాటు జోన్ల వారీగా విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు. టీయూ–142, సబ్‌మెరైన్, సీ హారియర్ విమానాలకు గుర్తులుగా కీచైన్లు, పుస్తకాలు, ట్రేలు, కాఫీ కప్పులు, జ్ఞాపికలు.. ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులతో కూడిన షాపింగ్ దుకాణాలు కొలువుదీరనున్నాయి. చదవండి: (చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు: కొడాలి నాని) సరికొత్త బీచ్‌ను చూస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తయారు చేశాం. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను కమిషనర్ సూచనల మేరకు అమలు చేస్తున్నాం. సీహారియర్ మ్యూజియం అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. మ్యూజియంను సందర్శించడంతో పాటు జ్ఞాపకాలను తీసుకెళ్లేలా షాపింగ్ సౌకర్యం, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. రాజీవ్ స్మృతిభవన్ మునుపటి రూపు చెక్కు చెదరకుండా నిర్మిస్తున్నాం. బీచ్‌లో నడుస్తుంటే వేలాడే సీహారియర్ని ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ప్రత్యేకమైన విద్యుత్ దీపాల ధగధగలతో మ్యూజియం మెరవనుంది. – భవానీశంకర్, వీఎంఆర్డీఏ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇలా.. సీహారియర్ మ్యూజియం వ్యయం - రూ.10 కోట్లు సబ్‌మెరైన్ హెరిటేజ్ మ్యూజియం వ్యయం - రూ.10 కోట్లు అండర్ గ్రౌండ్ పార్కింగ్ - రూ.17 కోట్లు ల్యాండ్ స్కేపింగ్, విద్యుదీకరణ వ్యయం - రూ.3 కోట్లు మొత్తం ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు వ్యయం - రూ.40 కోట్లు -
జనజాతీయ గౌరవ్ దివస్‌గా బిర్సా ముండా జయంతి: మోదీ
-
రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ
రాంచీ: ధార్తీ ఆబాగా ప్రసిద్ధి చెందిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ధార్తీ ఆబా ఎక్కువ కాలం జీవించలేకపోయినప్పటికీ భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేలా భారత చరిత్రలో లిఖించబడిని ఒక మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు ముండాకు భారతదేశ గిరిజన సమాజ గుర్తింపును చెరిపివేయాలని కోరుకునే భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిని గొప్ప వ్యక్తి బిర్సా . (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) ఆధునికత పేరుతో వైవిధ్యంపై దాడి చేయడం, ప్రాచీన గుర్తింపును, ప్రకృతిని తారుమారు చేయడం సమాజ శ్రేయస్సుకు మార్గం కాదని భగవాన్ బిర్సాకు తెలుసు. ఆధునిక విద్యకు అనుకూల మార్పు కోసం వాదించాడు. అంతేకాదు తన గిరిజన సమాజంలోని లోటుపాట్లను గురించి మాట్లాడే ధైర్యం చూపించాడు." అని అన్నారు. ఈ మేరకు మోదీ బిర్సా ముండా మెమోరియల్ ఉద్యాన్ మ్యూజియంను జాతికి అంకితం చేశారు. జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ మ్యూజియం రాంచీలోని బిర్సా ముండా తుది శ్వాస విడిచిన ఓల్డ్ సెంట్రల్ జైలులో ఉంది. అంతేకాదు ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉన్న ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యూజియం ఆదివాసీలు తమ అడవులు, భూమి హక్కులు, సంస్కృతిని పరిరక్షించడానికి వారు ప్రదర్శించిన శౌర్యాన్ని, త్యాగాలను ప్రతిబింబిస్తుందని ఇది దేశ నిర్మాణానికి చాలా ముఖ్యమైనదని అని మోదీ అన్నారు. పైగా ముండాతో పాటు, బుధు భగత్, సిద్ధూ-కన్హు, నీలాంబర్-పీతాంబర్, దివా-కిసున్, తెలంగాణ ఖాదియా, గయా ముండా, జాత్రా భగత్, పోటో హెచ్ భగీరథ్ మాంఝీ గంగా నారాయణ్ సింగ్ వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఈ మ్యూజియం హైలైట్ చేస్తుంది. (చదవండి: యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
మన్యంలో మ్యూజియం.. ప్రకృతి అందాల మధ్య ఏర్పాటు
సాక్షి, అమరావతి: తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ పాలకులపై వీరు సాగించిన సాయుధ పోరాటానికి కేంద్రంగా నిలిచిన విశాఖ జిల్లా తాజంగిలో మన్యం వీరుల స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టింది. ప్రకృతి సహజసిద్ధమైన రమణీయ అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘ఆంధ్ర కాశ్మీరం’ లంబసింగి ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అందమైన ఉద్యానవనం మధ్య అరుదైన విశేషాలతో రూపుదిద్దుకోనున్న ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం మన్యం పోరాటాన్ని ప్రతిబింబించనుంది. మొత్తం రూ.35 కోట్లతో చేపట్టిన ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్–టీఎం–ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్) ఆధ్వర్యంలో ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో డిజైన్ చేశారు. యాంపి థియేటర్‌తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియోలను సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సంప్రదాయ గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. మ్యూజియం పరిసరాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దనున్నారు. అలాగే, అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఆధునిక రెస్టారెంట్, రిసార్ట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ నిర్మాణం పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. మొదటి తిరుగుబాటు ఇక్కడే.. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం విప్లవ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో ఇది చాలా కీలక ప్రాంతం. పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి–నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునే వారు. వీరికి కూలీ సరిగ్గా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు తెగబడేవారు. దీంతో తెల్లదొరల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగుబాటు బావుటా ఎగురవేశాడు. గాం గంటందొర, గాం మల్లుదొరలతో కలిసి పోరాటం చేసి వారిని తరిమికొట్టాడు. ఇంతటి విశిష్టత కలిగినందునే మన్యం వీరుల మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజంగి ప్రాంతాన్ని ఎంపిక చేసింది. మ్యూజియంలో 4 జోన్లు.. విశాఖ మన్యంలో నిర్మించనున్న ఈ మ్యూజియంను ఏ, బీ, సీ, డి అనే నాలుగు జోన్లుగా విభజించి పలు అంశాలను ప్రదర్శిస్తారు. అవి.. ► జోన్–ఏలో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు ముందునాటి గిరిజనుల పరిస్థితులు, వారి జీవన విధానం, అప్పటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. ► జోన్–బిలో గిరిజనుల జీవితాల్లోకి తెల్లదొరలు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష, జంతు జాలాలను కళ్లకు కడుతూ డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటుచేస్తారు. ► జోన్–సీలో బ్రిటీషర్ల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, వారి పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. ► ఇక జోన్–డీలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. -
హాల్ ఆఫ్ ఫేమ్: అమరవీరులకు వందనం!
హాల్ ఆఫ్ ఫేమ్... ఇది మనకు పెద్దగా పరిచయం లేని మ్యూజియం. ఇండో– పాక్, ఇండో–చైనా యుద్ధాల్లో మనదేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరుల జ్ఞాపకార్థం సహ సైనికులు నిర్మించిన మ్యూజియం. ఈ ప్రదేశం మొత్తం మనకు కశ్మీర్గానే పరిచయం. కానీ తాజా విభజన ప్రకారం ఇది లధాక్ కేంద్రపాలిత ప్రాంతం. లధాక్ రాజధాని నగరం లేహ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో లేహ్– కార్గిల్ రోడ్లో ఉంది. కెప్టెన్ రాసిన ఉత్తరం హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం రెండంతస్థుల భవనం. ఒక అంతస్థులో ఓపీ విజయ్ గ్యాలరీ ఉంది. ఇందులో సియాచిన్ గ్లేసియర్‌లో డ్యూటీ చేసే భారత సైనికులు ధరించి దుస్తులు, ఇతర వస్తువులు, కార్గిల్ యుద్ధంలో మనం ఉపయోగించిన ఆయుధాలతోపాటు ప్రత్యర్థి సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కూడా చూడవచ్చు. లెస్ట్ ఉయ్ ఫర్గెట్ పేరుతో ఒక గోడ ఉంది. ఆ గోడకు కార్గిల్ యుద్ధ చిత్రాలున్నాయి. ‘ఆపరేషన్ విజయ్’ డాక్యుమెంటరీ చూడవచ్చు. ‘ద లాస్ట్ పోస్ట్’ పేరుతో మరో గోడ ఉంది. ఇది కదిలే చిత్రాల గోడ. యుద్ధఘట్టాల ఫొటోలు డిస్ప్లేలో ఆటో ప్లే అవుతుంటాయి. కెప్టెన్ వైజయంత్ థాపర్ అమరుడు కావడానికి కొద్దిరోజుల ముందు తన తల్లిదండ్రులకు రాసిన ఉత్తరం మనసును కదిలిస్తుంది. మైనస్ యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఎముకలు కొరికే చల్లదనంతో ఉండే సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులు నివసించే బంకర్లు, గుడారాలు, వెచ్చని దుస్తుల నమూనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. లధాక్ చారిత్రక ప్రదర్శన మరో అంతస్థు లధాక్ చరిత్ర, సంస్కృతిని తెలిపే చిత్రాలు, వస్తువుల సుమహారం. ఇక్కడ ఉన్న సావనీర్ దుకాణంలో టీ షర్టులు, కప్పులు, కాఫీ మగ్గులు, పశుమినా శాలువాలుంటాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఐఆర్సీటీసీ తిరిగి పర్యాటకద్వారాలు తెరిచింది. డిస్కవర్ లధాక్ ఎక్స్ ఢిల్లీ (ఎన్డీఏ 12) ప్యాకేజ్‌లో లేహ్‌కు సమీపంలో ఉన్న హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం కూడా ఉంది. -
తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం
కొమరాడ (విజయనగరం)/పద్మనాభం (భీమిలి): అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన లంబసింగికి సమీపంలోని తాజంగిలో అల్లూరిని శాశ్వతంగా స్మరించుకునేలా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను ప్రభుత్వం నిర్మించనుందని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్లతో నిర్మించనున్న తాజంగి మ్యూజియం నిర్మాణానికి సీఎం జగన్ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె చెప్పారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అల్లూరి మ్యూజియం విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంగిలో ఆదివారం ప్రభుత్వ పరంగా నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడారు. పాండ్రంగిలో అల్లూరి పేరు మీద రూ.3 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. -
చరిత్రను భద్రపరచాలి!
తెలుగు సినిమా చరిత్ర విశేషాలతో ఓ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, అలా చేయడం తన కల అని నాగార్జున అంటున్నారు. ఈ విషయం గురించి నాగార్జున మాట్లాడుతూ – ‘‘సినిమాల భద్రత, పునరుద్ధరణ అంశాలకు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాల క్రితం మా స్టూడియో (అన్నపూర్ణ)లో ఓ వర్క్‌షాప్ నిర్వహించాం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందిందో ఆ వర్క్‌షాప్ ద్వారా మరింత తెలుసుకున్నాను. చరిత్ర సృష్టించిన తెలుగు క్లాసిక్ సినిమాలను భద్రపరిచేలా ఓ మ్యూజియమ్‌ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనిపించింది. మా నాన్నగారు (దివంగత ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు) దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. దురదృష్టవశాత్తు ఆయన నటించిన కొన్ని క్లాసిక్ సినిమాలను భద్రపరచలేకపోయాం. అయితే ప్రస్తుత సాంకేతికతతో కొన్ని క్లాసిక్‌లను మెరుగుపరిచే అవకాశం ఉంది. అవన్నీ కూడా మ్యూజి యమ్‌లో పెట్టదగిన సినిమాలే’’ అన్నారు. -
Corona effect: మమ్మల్ని ఎవరూ చూడట్లే..
చార్మినార్: పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న నేపత్యంలో పర్యాటక ప్రాంతాలు మూత పడడమే ఇందుకు ప్రధాన కారణం. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో భారత పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి మే 15 వరకు చార్మినార్ సందర్శనను నిలిపి వేశారు. వారం రోజులుగా చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు సాలార్జంగ్ మ్యూజియంల వద్ద సందర్శకుల సందడి తగ్గింది. దీంతో చిరువ్యాపారాలు కూడా గణనీయంగా తగ్గి పోయాయి. ► గతేడాది లాక్డౌన్ సమయంలో చార్మినార్ కట్టడాన్ని మూసి వేసిన ఏఎస్ఐ తిరిగి ఈఏడాది మళ్లీ సందర్శనను నిలిపివేసింది. ► దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటక ప్రాంతమైన చార్మినార్ కట్టడంతో పాటు సాలార్జంగ్ మ్యూజియం సందర్శనను నిలిపి వేశారు. ►కుతుబ్‌షాహీల కాలంలోని కళాకారుల విశిష్ట కళా నైపుణ్యానికి అద్దంపట్టేలా చార్మినార్ కట్టడాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తిలకించడానికి రోజూ సందర్శకులు ఇక్కడికి వస్తుండటంతో చార్మినార్ పరిసరాలు సందర్శకులతో సందడిగా కనిపించేవి. ► వారం రోజులుగా చార్మినార్ మూసి వేయడంతో సందర్శకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. ► ఇక ఇప్పటికే మక్కా మసీదు లోనికి విజిటర్స్‌ను అనుమతించడం లేదు. ► దీంతో పాతబస్తీ చార్మినార్–మక్కా మసీదు రోడ్డులో చిరువ్యాపారాలు తగ్గిపోయాయి. ► వినియోగదారుల సందడి కనిపించడం లేదు. ( చదవండి: నకిలీలతో జాగ్రత్త.. మందులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి ) -
వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో!
ఇరవై రెండు మంది రాజులు, రాణులు ఒకే దారిలో ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరు రథంపై ఊరేగింపుగా వెళుతుంటే కేవలం అదొక ఉత్సవంగా మాత్రమే ఉండదు. కన్నుల పండుగైన మహోత్సవంలా ఉంటుంది. ఈజిప్టు రాజధాని కైరోలోని ప్రజలు వీధులలో బారులు తీరి ఈరోజు (శనివారం) అటువంటి మహోత్సవాన్నే (జులుస్)వీక్షించబోతున్నారు. ఆశ్చర్యంగా.. అబ్బురంగా.. భయం భయంగా!! ఆశ్చర్యమూ, అబ్బురమూ ఎందుకో చెప్పనక్కర్లేదు. భయం మాత్రం.. ఆ రాజులు, రాణులు ‘మమ్మీలు’ అయినందుకు! భయం అంటే భయం అని కాదు. థ్రిల్లింగ్‌గా అనుకోండి. నైట్రోజన్ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ .. చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు కనురెప్ప వేయకుండా నిలబడి తదేకంగా చూస్తూ వేల ఏళ్ల కాలంలోకి ప్రయాణించవచ్చు. అవే మమ్మీలు మనం రోజూ వెళ్లొచ్చే రహదారిలో రథంపైన ఒక బారుగా కదులుతూ కనిపిస్తుంటే వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. ఇవాళ కైరోలో స్థానికులకు అలాంటి అపూర్వమైన సందర్భం అనుభవంలోకి రాబోతోంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘కొలువు తీరుతారు’. ఈ నెల 18 నుంచి ఈ మమ్మీలన్నీ ఆ కొత్త ప్రదేశంలో తమ యథా‘పూర్వ’స్థితికి కొనసాగింపు గా సందర్శకుల వీక్షణ కోసం ఎదురు చూస్తుంటాయి. ‘మ్యూజియంలో ఉన్నవాటిని ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చు. మ్యూజియంలోంచి రోడ్డు మీదకు వచ్చిన మమ్మీలను చూడ్డానికే త్వరపడాలి. మళ్లీ అవకాశం ఎప్పటికో గానీ రాదు’ అని ఈజిప్టు పురావస్తు శాఖ చాటింపు వేయిస్తోంది. బహుశా ఈ రోజు కనీసం 40 నిముషాల పాటు కైరో ప్రధాన రహదారి స్తంభించిపోవచ్చు. ఇంతవరకు మమ్మీలు ఉన్న ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి ఇప్పుడు తరలబోతున్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్’కి మధ్య దూరం 8 కి.మీ. సాధారణ ప్రయాణ దూరం 13 నిముషాలు. పదమూడు నిముషాల ప్రయాణానికి మమ్మీలకు నలభై నిముషాలు పట్టబోతోందంటే.. మమ్మీలు ఎంత నెమ్మదిగా, ఎంత పదిలంగా, ఎంత కదిలీ కదలనట్లుగా బట్వాడా అవబోతున్నాయో చూడండి. మమ్మీల రథయాత్ర (అవును. అలంకరించిన రథాల మీదనే గాజు పెట్టెలలోని మమ్మీలను అమర్చి, చుట్టూ ‘పొత్తిగిలి’ ఏర్పాటు చేసి ప్రాణం పోకుండా వాటిని తీసుకెళతారు). ఆల్రెడీ ప్రాణం పోయిన వాటికి మళ్లీ ప్రాణం పోవడం ఏమిటి? ఇది పురావస్తు ప్రేమికుల భాష. ప్రాణం పోయాక కూడా మమ్మీలు వేల ఏళ్లపాటు భద్రంగా ఉన్నాయంటే ప్రాణంతో ఉన్నట్లుగా వారు భావిస్తారు. కదలికల వల్ల కాళ్లో, వేళ్లో, కళ్లో కాస్త చెదిరినా వాటి ప్రాణం పోయినట్లే. మళ్లీ వాటిని అతికించడానికి ఓ పెద్ద సర్జరీనే అవసరం అవుతుంది. సర్జరీ చేసినట్లు కనిపిస్తే అప్పుడది అతికించినట్లే అవుతుంది తప్ప అమరిక అవదు. అందుకే అంత జాగ్రత్త. ఈ మహా ఊరేగింపునకు ఈజిప్టు ప్రభుత్వం ‘ఫారోస్ గోల్డెన్ పరేyŠ ’ అనే పేరు పెట్టింది. ప్రాచీన ఈజిప్టు పాలకుల్ని ఫారోలు అంటారు. అందుకే పరేడ్‌కు ఆ పేరు. ఈ పరేడ్ ఒక క్రమబద్ధమైన విధానంలో జరుగుతుంది. ముందు వయసులో పెద్దవారు, తర్వాత వారికన్నా చిన్నవారు. ఇదీ మమ్మీల రాజులు, మమ్మీ రాణుల వరుస. మమ్మీలను ఉంచిన రథాల అలంకరణ పూర్తిగా ఈజిప్టు సంప్రదాయ శైలిలో ఉంటుంది. అలంకరణ రథానికే తప్ప మమ్మీల గాజు పెట్టెలకు కాదు. మమ్మీలు ఇప్పుడున్న మ్యూజియం శతాబ్దం క్రితం నాటిది. తరలబోతున్న మ్యూజియం ఇటీవలి కాలం నాటిది. 2017 లో ప్రారంభం అయింది. మమ్మీలను ఆ కొత్త మ్యూజియంలో దించాక వాటిని కాస్త ఎత్తున, ఆధునీకరించిన కుదుళ్లలో వీక్షలకు మరింత చక్కగా కనిపించేలా అమర్చుతారు. మిగతా పరిరక్షణ విధానమంతా మామూలే. సమతుల ఉష్ణోగ్రతల వద్ద మమ్మీలను ఉంచడం ప్రధానం. అందుకోసం కొత్త మ్యూజియంలో మెరుగైన ఏర్పాట్లు ఉన్నాయి. మ్యూజియంలో అవసరం లేదు కానీ.. రథయాత్రలోనే మమ్మీలకు గట్టి ‘స్థిర’ భద్రతలు ఉండాలి. ప్రయాణ మార్గంలో ఎగుడు దిగుళ్లను ఇప్పటికే చదును చేసి ఉంచారు. ఒక్కో మమ్మీని పెట్టిన పెట్టె పసిడివర్ణంలోని ఒక్కో రథంలో ఉంటుంది. ఆ రథంపై ఆ మమ్మీ పేరు, ఏ రాజ్యానికి పాలకుడు / పాలకురాలు అనే వివరాలు ఉంటాయి. అందరి కన్నా ముందు వరసలో రెండవ సీకెనార్ తావో చక్రవర్తి రథం ఉంటుంది. క్రీ.పూ. 1560–1555 కాలం నాటి పాలకుడు ఆయన. ‘ధైర్యవంతుడు’ అని పేరు. ఆయన వెనుకే తొమ్మిదవ రామ్సీస్ మమ్మీ రథం కదులుతుంది. క్రీ.పూ. 12వ శతాబ్దం చక్రవర్తి రామ్సీస్. ఆ వెనుక రెండవ రామ్సీస్ చక్రవర్తి, ఆ వెనుక మహా రాణి హాట్షిప్సట్. అతి శక్తిమంతురాలిగా ఆమె ప్రసిద్ధి. ఆ వెనుక ఒకరొకరుగా వయసుల వారీగానే కాకుండా చారిత్రక ప్రాధాన్యాన్ని బట్టి కూడా మెల్లిగా ‘కదులుతారు’. వాళ్ల కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ రథయానం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగుతుంది. ఊరేగింపులో చక్కటి వాద్య ధ్వనులు ఉంటాయి. ఈజిప్టు కళాకారుల నృత్యాలు ఉంటాయి. ఈ తతంగం అంతా లైవ్‌లో టీవీలో ప్రసారం అవుతుంది. దొరికిన చోటు కైరోలోని చరిత్రాత్మక ప్రాంతమైన ‘తహ్రీర్ స్క్వేర్’ లో ఉన్న ‘ఈజిప్షియన్ మ్యూజియం’లో గత వందేళ్లుగా ఈ 22 రెండు మమ్మీలు ఉన్నాయి. 1881 నుంచి, ఈజిప్టులో నైలు నదికి తూర్పుఒడ్డున ఉన్న లక్సర్ నగరంలో జరుగుతూ వస్తున్న పురావస్తు అన్వేషణల్లో బయట పడిన ఈ మూడు వేల ఏళ్ల నాటి ఈ మమ్మీలను ఈజిప్షియన్ మ్యూజియంకి చేర్చాక, 1950 లలో ఒక చిన్న అద్దాల గదిలోకి మార్చి, సందర్శకుల వీక్షణ కోసం ఒక దాని పక్కన ఒకటిగా పెట్టి, వాటిపై ఆ మమ్మీలు ఎవరివో వివరాలు రాసి ఉంచారు. డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి వీటిని నేషనల్ మ్యూజియంలోకి మార్చడం కోసం నైట్రోజన్ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. -
Jodeghat Museum: జోడెన్‌ఘాట్ వీరభూమి
‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్‌ఘాట్ గ్రామంలో ఉంది. జోడెన్‌ఘాట్‌లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది. భూమి కోసం పోరాటం కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్కొస్తాడు. అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్‌కు వెళ్లాడు. నిజామ్ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్‌ఘాట్‌కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్‌ఘాట్‌లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది. చదవండి: కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి అండర్‌వాటర్‌లో మ్యూజియం.. అదెక్కడంటే? -
అండర్‌వాటర్‌లో మ్యూజియం
జల్పం!జాసన్ డి టేలర్... అండర్‌వాటర్ మ్యూజియమ్ల సృష్టికర్తగా ప్రసిద్ధుడు. మెక్సీకో నుంచి మాల్దీవుల వరకు ఎన్నో అండర్ వాటర్ మ్యూజియమ్ లను సృష్టించాడు. ఈ బ్రిటీష్ శిల్పకారుడు తాజాగా ఫ్రాన్స్‌లోని లెర్నెస్ ద్వీపాలలో జలగర్భ మ్యూజియంను ఆవిష్కరించాడు. ఇందులో మొత్తం ఆరు భారీ విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆరు ఆడుగుల ఎత్తు, పది టన్నుల బరువు ఉంటుంది. వీటిని తయారు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇవేమీ ప్రముఖుల విగ్రహాలు కాదు. 9 సంవత్సరాల స్కూలు పిల్లాడి నుంచి ఎనభై సంవత్సరాల జాలరి శిల్పాల వరకు ఇందులో ఉన్నాయి. -
అక్కడ చెట్టూ పుట్టా పీవీ జ్ఞాపకాలే!
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు.. బహుభాషా కోవిదుడు, మేధావి, రాజకీయ చతురుడు, దార్శనికుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో ఉన్న ప్రత్యేకతలెన్నో. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన జీవితం విద్యార్థుల మొదలు రాజకీయ నేతల వరకు ఓ పాఠం లాంటిది. పీవీ ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు తన సొంత గ్రామమైన వంగరలో ఓ విజ్ఞానవేదిక రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్మిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని మరో నెలరోజుల్లో పనులు మొదలుకానున్నాయి. 2022లో ఆయన జయంతి నాటికి వేదికను ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు ఎకరాల్లో నిర్మాణం.. వంగరలో పీవీ విజ్ఞాన వేదిక పేరుతో నాలుగు ఎకరాల్లో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. పీవీ నరసింహారావు రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవులు నిర్వహించి ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రధానిగా దేశముఖచిత్రంపై చెరగని ముద్ర వేశారు. ప్రతి శాఖలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయన చూపిన ప్రత్యేకతలు ప్రతిబింబించేలా ఇది రూపుదిద్దుకోనుంది. దాన్ని కళ్లకు కట్టేలా చిత్రాలు, శిల్పాలతో తీర్చిదిద్దనున్నారు. రైతులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా విధానం, భూసంస్కరణలు, పల్లె ప్రగతి.. ఇలా ప్రతి అంశానికి ఇందులో చోటుదక్కనుంది. పర్యాటకులు పీవీ గురించి తెలుసుకునేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇక పర్యాటకులకు ఫుడ్ కోర్టులు, ఉద్యానవనాలు లాంటివి ఇక్కడ సమకూరనున్నాయి. మధ్యలో పీవీ విగ్రహం కొలువుదీరనుంది. మ్యూజియంగా పీవీ ఇల్లు వంగర గ్రామంలో పీవీ నరసింహారావు నివసించిన ఇంటిని మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన వాడిన వస్తువులు, ఆయన ఛాయాచిత్రాలు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది. పీవీ కుటుంబంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భేటీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రతిబింబించేలా ఓ విజ్ఞాన వేదికను నిర్మించను న్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. పీవీ శత జయంతి వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావుతో కలసి శుక్రవారం ఆయన పీవీ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. వంగర గ్రామంలో విజ్ఞాన కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 7 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని వారికి అందించారు. వంగర గ్రామాభివృద్ధి, పీవీ నివాసాన్ని మ్యూజియంగా మార్చటం, విజ్ఞాన వేదిక థీమ్ పార్కు ఏర్పాటుపై వారికి వివరించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అధికారులతో కలసి వంగరలో పర్యటించి అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పీవీ కుటుంబంతో చర్చించానన్నారు. సిద్దిపేట–వరంగల్ రహదారిపై ఆర్చి, విగ్రహం -
బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే..
నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో బుద్ధుడి ధాతువు(ఎముక) ప్రధాన ఆకర్షణ. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది ఏపీకి తరలనుంది. అలాగే గుంటూరులో జరిగిన ‘కాలచక్ర’ఉత్సవాలకు వెళ్లిన తెలంగాణ వస్తువులు తిరిగి ఇక్కడికి రానున్నాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురావస్తు సంపద బట్వాడా మొదలైంది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అధీనంలో ఉన్న పురాతన సంపద పంపకం జరుగుతోంది. రెండు రాష్ట్రాల వైపు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల ఆధ్వర్యంలో ఈ పంపకం సాగుతోంది. 1956కు ముందున్న వస్తువులన్నీ తెలంగాణకే చెందుతాయని కమిటీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత సమకూరిన వాటిలో.. ఏ ప్రాంతంలో లభించినవి ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానికి చెందనున్నాయి. 1956 తర్వాత ఖరీదుకు సమకూర్చుకున్నవి 58:42 దామాషా ప్రకారం (ఏపీకి 58.. తెలంగాణకు 42) పంచనున్నారు. తొలుత స్టోర్లలో ఉన్న వాటిని పంచుతున్నారు. ఆ తర్వాత ప్రదర్శనలో ఉన్నవాటిని బట్వాడా చేయనున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉన్న నాణేలకు సంబంధించి ఏపీకి ఇప్పటికే 30 వేల నాణేలను కేటాయించారు. వాటిని విడిగా ఏపీ అధికారులు స్థానికంగా భద్రపరుచుకున్నారు. మొత్తం 3.65 లక్షల వస్తువులను పంచుకోవాల్సి ఉంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి పురావస్తు సంపద పంపకాలకు కసరత్తు జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరక కొలిక్కి రాలేదు. ఆరున్నరేళ్ల తర్వాత ఓ నిర్ణయానికి రావడంతో బట్వాడా ప్రక్రియ మొదలైంది. 1956కు ముందు తెలంగాణతో ఏపీకి సంబంధం లేనందున అంతకుముందున్న పురాతన సంపదపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉం టుందన్న విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పురావస్తు పంపక కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి, కన్వీనర్ రాములు స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండు ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఉన్నం దున ఏ ప్రాంతంలో లభించిన వస్తువులపై ఆ ప్రాం తానికే హక్కు ఉంటుందని తేల్చినట్టు తెలంగాణ కమిటీ సభ్యుడు రంగాచార్యులు తెలిపారు. చదవండి: ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు నాణేలే ఎక్కువ.. ప్రపంచంలో బ్రిటిష్ మ్యూజియం తర్వాత అత్యధిక నాణేలు ఉన్నది హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలోనే. ఇక్కడ 3.45 లక్షల నాణేలున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌కు 53 వేలు చెందుతాయని తాజాగా అధికారులు లెక్కలు తేల్చారు. వీటిల్లోంచి 30 వేలను గత పక్షం రోజుల్లో దశలవారీగా అందజేశారు. నాణేల్లో బంగారువి 17 వేలుంటే, ఏపీకి ఇచ్చేవి 5 వేలుగా గుర్తించారు. ఇక తెలంగాణలో లభించినా.. కొన్ని ఏపీ ప్రాంత సామ్రాజ్యాలకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో వాటిని ఏపీకి ఇవ్వాలన్న యోచనలో తెలంగాణ అధికారులున్నట్లు సమాచారం. నల్లగొండ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడినవి ఏపీ ప్రాంతానికి చెందిన వెంగీ చాళుక్యుల సామ్రాజ్యానికి చెందినవి కావటంతో వాటిని ఏపీ కోరుతోంది. బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే.. నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణల్లో బుద్ధుడి ధాతువు ఒకటి. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది బుద్ధుడి ఎముక. దీంతోపాటు ఆయన చితాభస్మం కూడా ఉంది. ఇది విశాఖపట్నం సమీపంలోని బావికొండలో 1980లో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసింది. ఇవి ఉన్న పాత్రలో బుద్ధుడి కాలానికి సంబంధించి చిన్న బంగారు, వెండి వస్తువులున్నాయి. ఆ పాత్రను నాంపల్లి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడది ఏపీకి తరలివెళ్లనుంది. తెలంగాణలో మరెక్కడా బుద్ధుడి ధాతువు లేనందున దీన్ని హైదరాబాద్‌లోనే ఉంచేలా ఏపీని కోరాలని అధికారులు నిర్ణయించారు. అలాగే కృష్ణాజిల్లా మోటుపల్లిలో చోళుల కాలానికి చెందిన నటరాజ, పార్వతి, నాయనార్ల తామ్ర విగ్రహాలున్నాయి. ఇవి కూడా మ్యూజియంలో ప్రధానాకర్షణ. ఇవీ ఏపీకి వెళ్లనున్నాయి. అమరావతి శిల్పాలు తెలంగాణకు.. చెన్నై రాజధానిగా 1953కు ముందు ఏపీ కొనసాగినప్పుడు ఆంధ్రాలోని అమరావతిలో లభించిన అద్భుతశిల్పాలు చెన్నై, తంజావూరు మ్యూజియంలలో ఉంచారు. 1917లో నాటి తెలంగాణ స్టేట్ పురావస్తు అధికారులు పరస్పర మార్పిడిలో భాగంగా తమిళనాడు నుంచి కొన్ని శిల్పాలు తెచ్చారు. ఇందులో అమరావతివి కూడా ఉన్నాయి. అవి 1956కు ముందు వచ్చినందున ఇప్పుడవి తెలంగాణ లోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఫణిగిరి, నేలకొండపల్లి సహా వివిధ ప్రాంతాల్లో లభించిన కొన్ని వస్తువులు ఏపీలో ఉన్నాయి. అవి తెలంగాణకు రానున్నాయి. ఇక దలైలామా ఆధ్వ ర్యంలో గుంటూరులో జరిగిన కాలచక్ర ఉత్సవాల సమయంలో కూడా తెలంగాణ నుంచి పెద్ద సం ఖ్యలో శిల్పాలు, ఇతర పురాతన వస్తువులు గుంటూరుకు తరలాయి. అవి తెలంగాణకు వస్తాయి. -
ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు
-
వైరల్ : ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు
రోమ్ : మ్యూజియం అంటేనే పురాతన వస్తువులు, శిల్పాలు ఉంటాయి. వీటిని ఏ మాత్రం కదిలించినా విరగడం ఖాయం. అందుకే ప్రతి శిల్పానికి తాకేందుకు వీలు లేకుండా అద్దాలు అమర్చి ఉంటాయి. కానీ ఇటలీలోని పోసాగ్నోలోని జిప్సోథెకా ఆంటోనియో కనోవా మ్యూజియంలో శిల్పాలను అద్దాల్లో పెట్టకుండా మూములుగానే పెట్టి ప్రదర్శనకు ఉంచారు. మ్యూజియంకు వచ్చే పర్యాటకులు శిల్పాల మీద కూర్చొని మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. తాజాగా ఆస్ట్రియాకు చెందిన ఒక టూరిస్ట్ మ్యూజియంను సందర్శించాడు. దాదాపు 200 ఏండ్ల పురాతనమైన ఒక శిల్పం మీద కూర్చొని ఆ పర్యాటకుడు ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది.(మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు) ఫోటో దిగిన తర్వాత అతని ప్రవర్తన కొంత వింతగా కనిపించింది. ఏదో జరిగిపోయినట్టు అక్కడే నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. మ్యూజియంలో ఉన్నవాళ్లు అన్ని వైపులకు వెళ్లి శిల్పాలను చూస్తుంటే ఆ వ్యక్తి మాత్రం అక్కడక్కడే తిరుగుతున్నాడు.అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడనేది అక్కడున్నవారికి అర్థం కాకపోయినా.. సీసీ కెమెరాలు పసిగట్టాయి. ఇంతకీ విషయమేంటంటే.. అతను ఫోటో దిగుతున్నప్పుడు చేయి బలంగా తాకడంతో శిల్పం కుడికాలి బొటనవేలు విరిగిపోయింది. అది ఎవరికీ కనిపించకూడదనే ఉద్దేశంతోనే అక్కడే తిరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అతనికి కొంచెమైనా బుద్దుండాలి.. సున్నితంగా ఉండే శిల్పాల మీద కూర్చొని ఎవరైనా ఫోటోలు దిగుతారా' .. 'శిల్పాల చుట్టూ కనీస భద్రత లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
పీవీ మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్
సాక్షి, మాదాపూర్: మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు మ్యూజియాన్ని వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ప్రా రంభించారు. సురభి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కళాశాలల ప్రాంగణంలో ఈ మ్యూజియం ఏర్పాటుచేశా రు. ఈ కార్యక్రమంలో సురభి విద్యాసంస్థల చీఫ్, పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి, పీవీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
అంత కష్టపడి చివరకు ఏం చేశాడంటే..
సిడ్నీ : సాధారణంగా ఎవరైనా దొంగతనానికి వస్తే ఏం చేస్తారు.. ఏవైనా విలువైన వస్తువులు, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లడం చూస్తాం. కానీ ఆస్ట్రేలియాలో సిడ్నీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం అర్థరాత్రి మ్యూజియంలోకి చొరబడి డైనోసార్‌తో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత కౌబాయ్ టోపీతో పాటు మ్యూజియంలోని కొన్ని ఫోటోలు ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. దీనిపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందించారు. (అది మనుషులకు ప్రమాదం: డబ్ల్యూహెచ్‌వో) 'గత ఆదివారం రాత్రి ఒంటి గంటకు ది ఆస్ట్రేలియన్ మ్యూజియంలోకి ఓ వ్యక్తి అక్రమంగా చొరబడ్డాడు. సుమారు 40 నిమిషాల పాటు అతను మ్యూజియంలో స్వేచ్ఛగా సంచరించాడు . కొద్దిసేపటికి అక్కడ ఉన్న ఓ డైనోసర్ శిలజం దగ్గరికి వెళ్లాడు. దాని నోట్లో తన ముఖం పెట్టి సెల్ఫీలు దిగాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. డైనోసార్‌తో సెల్ఫీ తర్వాత అక్కడే ఉన్న ఒక కౌబాయ్ టోపీని, ఓ ఫోటోను ఎత్తుకెళ్లాడు. అదృష్టమేంటంటే ఆ వ్యక్తి మ్యూజియంలో ఉన్న కొన్ని విలువైన పురాతన వస్తువుల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఈ విషయాన్ని మాత్రం తాము సీరియస్‌గా తీసుకుంటాం.ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని పట్టుకొని తీరుతాం' అంటూ పేర్కొన్నారు. మ్యూజియంలోకి చొరబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి పునర్ నిర్మాణంలో భాగంగా సిడ్నీ మ్యూజియాన్ని గత ఏడాది నుంచి మూసివేశారు. అయితే పనులన్ని పూర్తైనా ఇంతలో కరోనా మహమ్మారి రావడంతో మరోసారి మ్యూజియాన్ని మూసివేశారు. ('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') -
అమెరికాకు మన కళాఖండాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెలుగు చూసిన అతి పురాతన శిల్పాలు అమెరికాలో తళుక్కుమననున్నాయి. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో జరగబోయే ప్రదర్శనలో మన కళాఖండాలు కొలువుదీరనున్నాయి. అమెరికా, యూరప్, భారత్ ల నుంచి 150 కళాఖండాలకు మాత్రమే ఈ ప్రదర్శనలో చోటు దక్కనుండగా, అందులో తెలంగాణకు చెందినవి దాదాపు 13 వరకు ఉండబోతున్నాయి. దాదాపు 100 రోజుల పాటు అవి అక్కడ ప్రదర్శనలోనే ఉంటాయి. మన దేశం నుంచి కళాఖండాల తరలింపు ప్రక్రియకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. చాలా దేశాల్లో బౌద్ధానికి సంబంధించి సజీవ సాక్ష్యాలుగా ఉన్న అలనాటి గుర్తులతో తరచూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు న్యూయార్క్‌లోని మెట్రోపాలిట¯Œ మ్యూజియం వచ్చే ఏడాది నవంబర్ 20 నుంచి ఫిబ్రవరి 14 వరకు బుద్ధుడి జీవితంపై ఓ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. దీని ఇతివృత్తం భారత్‌తో ముడిపడి ఉండటం విశేషం. ‘ది ట్రీ అండ్ సర్పెంట్: ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇ¯Œ ఇండియా’పేరుతో ఇది ఏర్పాటవుతోంది. ఎంపిక చేసిన యూఎస్ మ్యూజియం ఈ ప్రదర్శనను న్యూయార్కు మ్యూజియం నిర్వహిస్తోంది. ఏడాది నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన ఆ మ్యూజియం ప్రతినిధులు తెలంగాణలో కూడా తిరిగి 13 ప్రదర్శనాంశాలను ఎంపిక చేశారు. ఇందులో ఫణిగిరి బౌద్ధ స్థూపం వద్ద లభించిన అరుదైన తోరణాలు, తల విరిగి రెండు మీటర్ల ఎత్తున్న బుద్ధుడి సున్నపు రాయి విగ్రహం, అష్ట మంగళ చిహ్నాలు చెక్కి ఉన్న సున్నపురాయి బుద్ధ పాదాలు, బుద్ధుడి జీవితాన్ని మూడు భాగాల్లో చెక్కిన మూడున్నర అడుగుల ప్యానెల్ ఉన్నాయి. ధూళికట్టలో లభించిన గొడు గుతో కూడిన బుద్ధుడి పూజా మందిరం, బుద్ధుడికి రక్షణగా పడగవిప్పిన పాము ఉండే నాగముచిలింద తదితరాలున్నాయి. ఇవి ఫణిగిరిలోని స్టోర్ రూమ్, నగరంలోని స్టేట్ మ్యూజియం, హెరిటేజ్ తెలంగాణ ప్రధాన కార్యాలయం, కరీంనగర్ మ్యూజియాల్లో ఉన్నాయి. ఇవన్నీ క్రీ.శ. 2వ శతాబ్దానికి పూర్వమైనవి. భారీ బీమా.. ఈ కళాఖండాలను అమెరికాకు తరలించటం, తిరిగి తీసుకువచ్చే క్రమంలో దెబ్బతినటం, దోపిడీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటికి భారీ మొత్తంలో బీమా చేయబోతున్నారు. గతంలో ముంబై, ఢిల్లీ మ్యూజియాల్లో జరిగిన ప్రదర్శనకు స్టేట్ మ్యూజియం నుంచి తరలించిన బుద్ధ ప్యానెల్‌కు రూ.2 కోట్ల బీమా చేశారు. ఇప్పుడు ఈ అన్ని విగ్రహాలకు దాదాపు రూ.25 కోట్ల మేర బీమా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి పంపాం ‘అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రదర్శనకు తెలంగాణ నుంచి కూడా కొన్ని కళాఖండాలు పంపబోతున్నాం. న్యూయార్క్ మ్యూజియం ప్రతినిధులు ఎంపిక చేసిన వాటికి సంబంధించి అమెరికాకు పంపేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ప్రభుత్వం నుంచి ఎన్నింటికి అనుమతి వస్తే అన్నింటిని పంపుతాం.’ – దినకర్ బాబు, ఇంచార్జి డైరెక్టర్, హెరిటేజ్ తెలంగాణ