ఈ ఫొటోలో కనిపిస్తున్నది శిలాగృహం. అలాగని ఇదేదో రాతియుగం నాటిది కాదు. అచ్చంగా ఆధునిక కాలంలో నిర్మించినదే! ఇది పోర్చుగల్‌లోని గిమెరెస్‌లో ఉంది. కొండ ప్రాంతంలో ఒకదానినొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఒక స్థానిక ఇంజినీర్ ఫామ్‌హౌస్‌లా ఉపయోగించుకునేందుకు దీనిని 1972లో నిర్మించుకున్నాడు.
విచిత్రమైన ఈ నిర్మాణాన్ని చూడటానికి జనాల తాకిడి నానాటికీ ఎక్కువ కావడంతో, దీని యజమాని వేరేచోట ఫామ్‌హౌస్‌ను నిర్మించుకుని తరలిపోయాడు. ఇందులోని ఫర్నిచర్‌ని, ఇతర వస్తువులను అలాగే ఉంచేసి, దీనిని మ్యూజియంలా మార్చడంతో, ఈ కట్టడం పోర్చుగల్‌లో పర్యాటక ఆకర్షణగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment