Portugal
-
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ హెడ్ కోచ్‌గా పోర్చుగల్ స్టార్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఐ–లీగ్ టోర్నీలో గత రెండు సీజన్లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. పోర్చుగల్‌కు చెందిన రుయ్ అమోరిమ్ తక్షణమే హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి రాబోయే సీజన్ కోసం శ్రీనిధి జట్టును సిద్ధం చేయనున్నాడు. గత సీజన్లో హెడ్ కోచ్‌గా ఉన్న డొమింగొ ఒరామస్ ఇటీవల రాజీనామా చేయడంతో అతని స్థానంలో అమోరిమ్ వచ్చాడు.ఇక.. 2008 నుంచి అంతర్జాతీయ క్లబ్ ఫుట్‌బాల్‌లో కోచ్‌గా పని చేస్తున్న 47 ఏళ్ల అమోరిమ్ ఇప్పటి వరకు 10 క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన ఎస్సీ నోజ్మో క్లబ్ జట్టుకు ఈనెల 14 వరకు అమోరిమ్ కోచ్‌గా పని చేసి అక్కడి నుంచి శ్రీనిధి డెక్కన్ క్లబ్‌కు రానున్నారు. ‘శ్రీనిధి డెక్కన్ జట్టులో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాను. నా అనుభవాన్ని పంచుకొని జట్టు మరింత ఉన్నతస్థితికి ఎదిగేందుకు కృషి చేస్తా’ అని అమోరిమ్ వ్యాఖ్యానించాడు. మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ బోణీ చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది. భారత్‌లోని అతి పురాతన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్... గురువారం జరిగిన తమ మూడో లీగ్ మ్యాచ్‌లో 1–0 గోల్ తేడాతో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించింది. ఆట 39వ నిమిషంలో లాల్రెమ్సంగా ఫనాయ్ గోల్ సాధించి మొహమ్మదాన్ జట్టుకు విజయాన్ని అందించాడు.కోల్‌కతాలో 1889లో ఏర్పాటైన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ గత ఏడాది భారత దేశవాళీ టోర్నీ ఐ–లీగ్‌లో విజేతగా నిలిచి ఐఎస్ఎల్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఐఎస్ఎల్లో ప్రస్తుతం మొహమ్మదాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడి, ఇంకో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా వేదికగా నేడు జరిగే మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ జట్టుతో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో స్నేహిత్ ఓటమి బీజింగ్: చైనా స్మాష్–2024 వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ తరఫున నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగారు. మనుశ్ ఉత్పల్భాయ్ షా మినహా మిగతా ముగ్గురు తొలి రౌండ్లోనే ఓడిపోయారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 11–6, 7–11, 3–11, 3–11తో మా జిన్బావో (అమెరికా) చేతిలో... హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 6–11, 11–8, 5–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో... సత్యన్ 9–11, 13–11, 6–11, 11–9, 4–11తో జు హైడాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మనుశ్ షా 4–11, 11–5, 11–4, 3–11, 11–8తో చాన్ బాల్డ్విన్ (హాంకాంగ్)పై నెగ్గాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌కు చేరారు.సెమీఫైనల్లో రిత్విక్ చౌదరీ జోడీసాక్షి, హైదరాబాద్: బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గాబ్రియెల్ డియాలో (కెనడా)–సీటా వతనాబె (జపాన్) జోడీని ఓడించింది.గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జంటలు తమ సర్వీస్‌ను రెండుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో రిత్విక్–అర్జున్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)–తొష్‌హిడె మత్సుయ్ (జపాన్) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రామ్–తొష్‌హిడె జంట 6–3, 6–4తో అలెజాంద్రో మొరో కనాస్ (స్పెయిన్)–మార్కో ట్రున్‌గెలిటి (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. -
అత్యంత అరుదైన మైలురాయికి చేరువలో క్రిస్టియానో రొనాల్డో..!
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం రొనాల్డో సౌదీ సూపర్ కప్ టోరీ్నలో అల్ నాసర్ క్లబ్‌కు ఆడతున్నాడు. అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ నాసర్ క్లబ్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అల్ నాసర్ జట్టు చేసిన ఏకైక గోల్ రొనాల్డో ద్వారా వచ్చింది. రొనాల్డో ప్రొఫెషనల్ కెరీర్లో ఇది 898వ గోల్. మరో రెండు గోల్స్ సాధిస్తే రొనాల్డో కెరీర్లో 900 గోల్స్ పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఎర్విన్ హెల్మ్చెన్ (జర్మనీ; 987 గోల్స్), జోసెఫ్ బికాన్ (ఆస్ట్రియా–చెక్ రిపబ్లిక్; 950 గోల్స్), రొనాల్డ్ లెస్లీ రూకీ (ఇంగ్లండ్; 934 గోల్స్) కెరీర్లో 900 గోల్స్ మైలురాయిని దాటారు. -
EURO 2024: పోర్చుగల్ అవుట్.. చివరి మ్యాచ్ ఆడేసిన రొనాల్డో!
యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్‌లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్‌తో తలపడింది.ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకనూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్‌పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్‌కు దూసుకెళ్లింది.మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఇక ఆరోసారి యూరో కప్‌లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.పోర్చుగల్ వీరుడిగానే కాదు..అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది. -
క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే టాప్ టీమ్‌లలో ఒకటైన పోర్చుగల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో స్లొవేనియా దూకుడు చూస్తే విజయం సాధించేలా అనిపించింది. కానీ చివరకు పెనాల్టీ షూటౌట్లో విజయం పోర్చుగల్ సొంతమైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ లేకుండా 0–0తో సమంగా నిలవగా...షూటౌట్లో పోర్చుగల్ 3–0తో గెలుపొందింది. దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలిపించే అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్‌లో అతను పలు అవకాశాలు వృథా చేశాడు. ఎట్టకేలకు 105వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ లభించింది. అయితే రొనాల్డో కొట్టిన ఈ కిక్‌ను స్లొవేనియా గోల్ కీపర్ జాన్ ఆబ్లక్ సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో రొనాల్డో కన్నీళ్లపర్యంతం కావడంతో సహచరులు సముదాయించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు షూటౌట్లో గెలిచి పోర్చుగల్ ఊపిరి పీల్చుకుంది. పోర్చుగల్ తరఫున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వ గోల్స్ సాధించగా... స్లొవేనియా ఆటగాళ్లు ఎల్లిసిక్, బల్కోవెక్, వెర్బిక్ కొట్టిన షాట్లను పోర్చుగల్ కీపర్ డియాగో కోస్టా నిలువరించగలిగాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌తో పోర్చుగల్ తలపడుతుంది. 2016లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోర్చుగల్ గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–0తో రొమేనియాను ఓడించి క్వార్టర్స్ చేరింది. -
Euro Cup 2024: క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఎంబపే, రొనాల్డో జట్లు
యూరో కప్ 2024లో ఆరు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ఫైనల్-8కు చేరాయి. మరో రెండు బెర్త్‌లు ఖరారు కావల్సి ఉంది.ఇవాళ (జులై 2) జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్.. స్లొవేనియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంతో పాటు (90 నిమిషాలు) అదనపు సమయంలోనూ (30 నిమిషాలు) గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ల వరకు వెళ్లింది. పెనాల్టీ షూటౌట్స్‌లో పోర్చుగల్ మూడు అవకాశాలను గోల్స్‌గా మలచగా.. స్లొవేనియా మూడు అవకాశాలను వృధా చేసుకుంది. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా అద్భుతమైన ప్రదర్శన కనబర్చి స్లోవేనియా మూడు ప్రయత్నాలను అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలచడంలో విఫలమైన క్రిస్టియానో రొనాల్డో.. షూటౌట్స్‌లో ఓ గోల్ చేశాడు. పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లో కైలియన్ ఎంబపే జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నాలుగో క్వార్టర్ ఫైనల్ (జులై 7) -
జయహో జార్జియా
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో పాల్గొంటున్న తొలిసారే జార్జియా జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జార్జియా 2–0 గోల్స్ తేడాతో 2016 చాంపియన్ పోర్చుగల్ జట్టుపై సంచలన విజయం నమోదు చేసింది. రెండో నిమిషంలోనే క్వరాత్స్కెలియా గోల్‌తో జార్జియా 1–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను మికాట్జె లక్ష్యాన్ని చేర్చడంతో జార్జియా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న జార్జియా విజయాన్ని ఖాయం చేసుకుంది. పోర్చుగల్ దిగ్గజ ప్లేయర్, కెపె్టన్ క్రిస్టియానో రొనాల్డో 66 నిమిషాలపాటు ఆడి ఆ తర్వాత మైదానం వీడాడు. రొనాల్డోను పక్కా ప్రణాళికతో కట్టడి చేయడంలో జార్జియా డిఫెండర్లు సఫలమయ్యారు. జార్జియా చేతిలో ఓడినప్పటికీ ఇదే గ్రూప్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పోర్చుగల్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎఫ్’లోని మరో మ్యాచ్‌లో టర్కీ 2–1తో చెక్ రిపబ్లిక్‌ను ఓడించి నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారంతో యూరో టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. ఈనెల 29 నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌తో ఇటలీ; ఇంగ్లండ్‌తో స్లొవేకియా; డెన్మార్క్‌తో జర్మనీ; స్పెయిన్‌తో జార్జియా; బెల్జియంతో ఫ్రాన్స్; స్లొవేనియాతో పోర్చుగల్; రొమేనియాతో నెదర్లాండ్స్; ఆ్రస్టియాతో టర్కీ తలపడతాయి. -
Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్
యూరో కప్ 2024లో దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా ఇవాళ (జూన్ 19) జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్.. చెక్ రిపబ్లిక్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్ ప్రొవోద్) చెక్ రిపబ్లిక్, ఆతర్వాత పోర్చుగల్ (69వ నిమిషంలో, రాబిన్ హ్రనాక్) గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డోచెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్, పోర్చుగల్ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్‌లు ఆడాడు.జార్జియాను చిత్తు చేసిన తుర్కియేగ్రూప్-ఎఫ్‌లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్ ముల్దర్ (25వ నిమిషం), ఆర్దా గులెర్ (65వ నిమిషం), ముహమ్మెద్ కెరెమ్ (97వ నిమిషం) గోల్స్ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్ 32వ నిమిషంలో గోల్ చేశాడు.ఇవాల్టి మ్యాచ్‌లు..క్రొయేషియా వర్సెస్ అల్బేనియా (గ్రూప్-బి)జర్మనీ వర్సెస్ హంగేరీ (గ్రూప్-ఏ) -
వీడియో: గాల్లో రెండు విమానాలు ఢీ.. పైలట్ మృతి
లిస్బన్: పోర్చుగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా పైలట్ మృతిచెందాడు.వివరాల ప్రకారం.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. కాగా, ఆదివారం ఎయిర్‌షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్ మృతిచెందాడు. మరో పైలట్(పోర్చుగల్)కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక, పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Breaking : Planes collide at Portugal air show, killing at least one. pic.twitter.com/NFY2fxWtZ3— The Spot (@Spotnewsth) June 2, 2024 -
Viral Video: కన్నీటి పర్యంతమైన క్రిస్టియానో రొనాల్డో
దిగ్గజ ఫుట్‌బాలర్, పోర్చుగల్ స్టార్, అల్ నసర్ క్లబ్ తురుపు ముక్క క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్ కప్ ఫైనల్లో తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. సహచరులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. మైదానంలో చాలా సేపు కూర్చుని బాధతో కృంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. రొనాల్డో బాధను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆట పట్ల స్టార్ ఫుట్‌బాలర్‌కు ఉన్న కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినా.. క్లబ్ తరఫున ఆడినా రొనాల్డో ప్యాషన్ ఒకే తీరులో ఉంటుందని కితాబునిస్తున్నారు.Nothing hurts a football fan more than seeing Ronaldo cry pic.twitter.com/YSMsZKBE9z— Trey (@UTDTrey) May 31, 2024కాగా, సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిన్న (మే 31) జరిగిన కింగ్ ఆఫ్ ఛాంపియన్ కప్ ఫైనల్లో రొనాల్డో ప్రాతినిథ్యం వహించిన అల్ నసర్ జట్టు.. చిరకాల ప్రత్యర్ది అల్ హిలాల్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత ఈ మ్యాచ్ (ఎక్స్ట్రా సమయం తర్వాత) 1-1తో టై కాగా.. పెనాల్టీ షూటౌట్లో అల్ హిలాల్.. 5-4 తేడాతో అల్ నసర్పై పైచేయి సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో అల్ హిలాల్ తరఫున అలెగ్జాండర్ మిత్రోవిచ్ (7వ నిమిషం).. ఆల్ నసర్ తరఫున అయ్మాన్ యాహ్యా (88వ నిమిషం) గోల్స్ చేశారు.ఇదిలా ఉంటే, అల్ హిలాల్ జట్టు ఇటీవల ముగిసిన సౌదీ ప్రో లీగ్‌లో కనీవినీ ఎరుగని ప్రదర్శనలు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్‌లో అల్ హిలాల్ రికార్డు స్థాయిలో 34 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. క్లబ్ ఫుట్‌బాల్ చరిత్రలో ఏ జట్టు ఈ స్థాయి విజయాలు సాధించలేదు. ఈ లీగ్‌లో కూడా రొనాల్డో జట్టు అల్ నసర్ రన్నరప్‌తో సరిపెట్టకుంది. రొనాల్డో తదుపరి UEFA యూరో ఛాంపియన్షిప్ 2024లో పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో క్రిస్ తన జాతీయ జట్టైన పోర్చుగల్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణం
లిస్బన్: అవినీతి ఆరోపణలపై పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టా రాజీనామా చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆయన ఇంటిపై ఇటీవల పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా కోస్టా ముఖ్య సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి కేసులో కోస్టాపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని కోస్టా స్పష్టం చేశారు. దర్యాప్తులో ఏం తేలినప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని ఆయన తేల్చి చెప్పారు. కోస్టా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్‌ను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో తెలిపారు. దేశంలో మళ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదన్నారు. అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించింది. పర్యాటక రంగం పరుగులు పెట్టింది. పెట్టుబడిదారులకు పోర్చుగల్ గమ్యస్థానంగా మారింది. ఇదీ చదవండి.. థాయ్ మాజీ ప్రధానికి పెరోల్ -
ఆ దీవి భూతల స్వరం! సకల ప్రకృతి..
ప్రకృతి వైవిధ్యమంతా ఆ దీవిలో ఒకేచోట కనువిందు చేస్తుంది. అందుకే పర్యాటక నిపుణులు ఆ దీవిని ‘ప్యారడైజ్ ఆన్ ఎర్త్’ అని అభివర్ణిస్తున్నారు. ‘ఇలా దాస్ ఫ్లోరిస్’ అనే ఈ దీవి పోర్చుగల్‌లో ఉంది. ఈ దీవిలో అందమైన బీచ్‌లు మాత్రమే కాదు, సహజమైన సరోవరాలు, జలపాతాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు చుట్టూ పచ్చగా కనిపించే దట్టమైన వనాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. గుత్తులు గుత్తులుగా రంగు రంగుల పూలతో అలరారే అపురూపమైన ‘హైడ్రేంజ’ మొక్కలు ఈ దీవిలో విరివిగా ఉండటంతో ఈ దీవికి ‘ఇలా దాస్ ఫ్లోరిస్’– అంటే పూలదీవి అనే పేరువచ్చింది. ఈ దీవి తీరంలో డాల్ఫిన్లు విరివిగా కనిపిస్తాయి. ఈతకొడుతూ సేదదీరాలనుకునే వారికి, కొండలపై ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఈ దీవి అనువుగా ఉంటుంది. ఈ దీవిలో జనాల సందడి చాలా తక్కువ. చాలా చోట్ల ఖాళీగా మిగిలిన ఊళ్లు, ఆ ఊళ్లలోని పాతకాలం ఇళ్లు కనిపిస్తాయి. ఈ దీవికి వెళ్లే పర్యాటకులు కొందరు ఖాళీ ఊళ్లలో ఖాళీగా మిగిలిన పాత ఇళ్లనే శుభ్రం చేసుకుని తాత్కాలికంగా బస చేస్తుంటారు. పర్యాటకుల రాక ఇటీవలి కాలంలో పెరుగుతుండటంతో పోర్చుగల్ ప్రభుత్వం ఇక్కడ ఖాళీగా మిగిలిన ఊళ్లలోని ఇళ్లకు మరమ్మతులు జరిపి, వాటిని కాటేజీలుగా మార్చి పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ‘ఫోర్బ్స్’ పత్రిక ఈ దీవిని యూరోప్‌లో వెలుగుచూడని రత్నాలలో ఒకటిగా అభివర్ణించడం విశేషం. (చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో..) -
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు
మందుబాబులకు వైన్‌లాంటి బాటిల్ కనపడితే పండగే. ఎవ్వరైన ఫ్రీగా ఇచ్చినా వారి ఆనందానికి అంతుపొత్తు ఉండదు. అలా కాకుండా వైన్ ఓ నదిలా ఉప్పోంగి వరదాల విరుచుకుపడితే ఎలా ఉంటుంది. ఇళ్లన్నింటిని వైన్ వరద ముంచెత్తింది.ఈ హఠాత్పరిణమానికి ప్రజలంతా షాక్‌కి గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన పోర్చుగల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోర్చుగల్‌లోని సావో లోరెంకో డిబైరోలో ఆదివారం ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఆ చిన్న పట్టణంలోని వీధులన్నీ వైన్‌తో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు ఆ వైన్ప్రవాహానికి నేలమట్టమయ్యాయి. ఏంటి ప్రకృతి విపత్తు అన్నంతగా ఓ నది పొంగి వరదాల బీభత్సం సృష్టించినట్లు వైన్ వరదాల కొట్టుకొచ్చింది. ఈ రహస్యమైన వైన్ నది ఎక్కడది. ఇదెలా సాధ్యం అని సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళానికి గురయ్యారు ప్రజలు. ఒలింపిక్‌లో ఉండే స్మిమ్మింగ్ పూల్‌ని నింపేంత వైన్ కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రహస్యమైన వైన నది టౌన్ డిస్టిలరీ నుంచి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇక్కడ రెండు మిలియన్ లీటర్లకు పైగా రెడ్ వైన్ బారెల్స్‌ను మోసుకెళ్లే ట్యాంకులు ఉన్నాయని, అవి అనుకోకుండా పగిలిపోవడంతో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు అధికారులు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక విభాగాన్ని రంగంలోకి దింపారు. అగ్నిమాపక సిబ్బంది వైన్నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వైన్ నీటితో బురదమయంగా మారిన భూమిని డ్రైగా చేసి యథాస్థితికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ వైన్ వరద కారణంగా జరిగిన నష్టాన్ని, ఏర్పరిచిన బురదను క్లీన్ చేసి మరమత్తులు నిర్వహించడమే గాక ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. The citizens of Levira, Portugal were in for a shock when 2.2 million liters of red wine came roaring down their streets on Sunday. The liquid originated from the Levira Distillery, also located in the Anadia region, where it had been resting in wine tanks awaiting bottling. pic.twitter.com/lTUNUOPh9B — Boyz Bot (@Boyzbot1) September 12, 2023 (చదవండి: సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!) -
రొనాల్డో ఖాతాలో మరో ట్రోఫీ
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండేళ్ల తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ఆసియాకు చెందిన అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా) తరఫున బరిలోకి దిగిన రొనాల్డో తన జట్టును అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్‌లో విజేతగా నిలిపాడు. అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన ఫైనల్లో రొనాల్డో కెప్టెన్సీ లోని అల్ నాసర్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. రొనాల్డో రెండు గోల్స్ (74వ, 98వ ని.లో) చేశాడు. -
రొనాల్డో అరుదైన ఘనత.. గిన్నిస్ రికార్డుతో చరిత్ర! అతడి తర్వాత..
Cristiano Ronaldo World Record- రెక్జావిక్ (ఐస్లాండ్): పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు దిగ్గజం, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయి అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూరో–2024 చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గ్రూప్ ‘జె’లో ఐస్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో బరిలోకి దిగడంద్వారా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. 38 ఏళ్ల రొనాల్డో ఆట 89వ నిమిషంలో చేసిన గోల్‌తో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 1–0తో ఐస్లాండ్ను ఓడించింది. గ్రూప్ ‘జె’లో పోర్చుగల్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా రొనాల్డో (123 గోల్స్) పేరిటే ఉంది. మ్యాచ్‌కు ముందు రొనాల్డో ఘనతకు గుర్తింపుగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్ 2016 తొలిసారి యూరో చాంపియన్‌గా అవతరించింది. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో స్పోర్టింగ్ సీపీ, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్ జట్లకు ఆడిన రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రొ లీగ్‌లో అల్ నాసర్ క్లబ్ జట్టుకు ఆడుతున్నాడు. జాతీయ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్–10 ఆటగాళ్లు ప్లేయర్ - దేశం - మ్యాచ్‌లు రొనాల్డో - పోర్చుగల్ - 200 బదర్ అల్ ముతవా - కువైట్ - 196 సో చిన్ అన్ - మలేసియా - 195 అహ్మద్ హసన్ - ఈజిప్ట్ - 184 అహ్మద్ ముబారక్- ఒమన్ - 183 సెర్జియో రామోస్- స్పెయిన్ - 180 ఆండ్రెస్ గ్వార్డాడో - మెక్సికో - 179 అల్దెయా - సౌదీ అరేబియా - 178 క్లాడియో స్వారెజ్- మెక్సికో - 177 గియాన్లుగి బఫన్ - ఇటలీ - 176 . చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? -
పోర్చుగల్‌లో ఈ ఇళ్లు చాలా ఫేమస్.. అంతలా ఏముందంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శిలాగృహం. అలాగని ఇదేదో రాతియుగం నాటిది కాదు. అచ్చంగా ఆధునిక కాలంలో నిర్మించినదే! ఇది పోర్చుగల్‌లోని గిమెరెస్‌లో ఉంది. కొండ ప్రాంతంలో ఒకదానినొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఒక స్థానిక ఇంజినీర్ ఫామ్‌హౌస్‌లా ఉపయోగించుకునేందుకు దీనిని 1972లో నిర్మించుకున్నాడు. విచిత్రమైన ఈ నిర్మాణాన్ని చూడటానికి జనాల తాకిడి నానాటికీ ఎక్కువ కావడంతో, దీని యజమాని వేరేచోట ఫామ్‌హౌస్‌ను నిర్మించుకుని తరలిపోయాడు. ఇందులోని ఫర్నిచర్‌ని, ఇతర వస్తువులను అలాగే ఉంచేసి, దీనిని మ్యూజియంలా మార్చడంతో, ఈ కట్టడం పోర్చుగల్‌లో పర్యాటక ఆకర్షణగా మారింది. -
దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం
యూరో–2024 క్వాలిఫయింగ్ టోర్నీలో మాజీ విజేత పోర్చుగల్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘జె’లో భాగంగా సోమవారం తెల్లవారుజామున లక్సెంబర్గ్‌తో మ్యాచ్‌లో పోర్చుగల్ 6–0తో గెలిచింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్స్‌తో మెరిశాడు. ఆట 6వ, 31వ నిమిషంలో రొనాల్డో జట్టు తరపున గోల్స్ కొట్టాడు. మిగతావారిలో జావో ఫెలిక్స్(ఆట 15వ నిమిషం), బెనార్డో సిల్వా(ఆట 18వ నిమిషం), ఒటావియో(ఆట 77వ నిమిషం), రాఫెల్ లావో(ఆట 88వ నిమిషం)లో గోల్స్ సాధించారు. కాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో ప్రస్తుతం రొనాల్డో 122వ గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. లిష్టెన్స్టయిన్తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్ చేశాడు. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో జట్టును గెలిపించడంలో విఫలమైన రొనాల్డో జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోకప్ 2024 క్వాలిఫయర్‌లో మాత్రం దుమ్మురేపాడు. గ్రూప్-జెలో భాగంగా గురువారం లిచెన్‌స్టెయిన్, పోర్చుగల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రొనాల్డోకు 197వది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక దేశం తరపున(పోర్చుగల్) తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 196 మ్యాచ్‌లతో కువైట్‌కు చెందిన బాదర్ అల్-ముతావాతో సమంగా ఉన్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా మొరాకోతో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ రొనాల్డోకు 196వ మ్యాచ్. ఇక మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్‌తో అదరగొట్టాడు. ఆట 51వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఆట 63వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో పోర్చుగల్ 4-0 తేడాతో లిచెన్స్టెయిన్ను చిత్తుగా ఓడించింది. ఇక ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున 197 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 120 గోల్స్ కొట్టి ఆల్‌టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 💚❤️1⃣9⃣7⃣ Take a bow, @Cristiano 👏👏👏#EURO2024 pic.twitter.com/ArgPz0MEYD — UEFA EURO 2024 (@EURO2024) March 23, 2023 -
బాబీ.. ఓ కురు వృద్ధ శునకం!
లిస్బన్: పోర్చుగల్ వాసికి చెందిన బాబీ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన ఈ కుక్క వయసు ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్ల 226 రోజులు. ఆస్ట్రేలియాకు చెందిన బ్లూవై అనే కుక్క 29 ఏళ్ల 5 నెలలు జీవించి 1939లో చనిపోయింది. ఈ రికార్డును బాబీ తుడిచిపెట్టింది. పోర్చుగల్ ప్రభుత్వ పెట్ డేటాబేస్ ప్రకారం దాని వయస్సును నిర్ధారించారు. ఈ జాతి కుక్కల సరాసరి ఆయుర్దాయం 12–14 ఏళ్లు. బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లుండగా బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు. -
ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి..
ఫుట్‌బాల్ ఆటలో రెడ్,యెల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగా చూస్తుంటాం. గ్రౌండ్లో గొడవకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తే రెడ్‌కార్డ్ జారీ చేస్తారు. రెడ్‌కార్డ్ జారీ చేస్తే మ్యాచ్ ముగిసేవరకు మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్ ఇచ్చి వదిలేయడానికి యెల్లోకార్డ్ జారీ చేయడం చూస్తుంటాం. ఈ రెండుకార్డులు కాకుండా మరొక కార్డు ఉంటుంది. అదే వైట్‌కార్డ్. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి వైట్‌కార్డ్ చూపించింది లేదు. తాజాగా మాత్రం మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ వైట్‌కార్డ్ చూపించడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. శనివారం పోర్చుగల్‌లో బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య మహిళల ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో కాసేపట్లో తొలి హాఫ్ ముగుస్తుందన్న దశలో స్టాండ్స్‌లో ఒక అభిమాని అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గమనించిన రిఫరీ వైట్‌కార్డ్ చూపించాడు. క్రీడలో వైట్‌కార్డ్ అనేది క్రీడాస్పూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. రిఫరీ వైట్‌కార్డ్ చూపెట్టగానే మెడికల్ సిబ్బంది సదరు అభిమానికి మెడికల్ ట్రీట్మెంట్ అందించారు. జరుగుతున్నది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి ఇరుజట్ల మేనేజ్మెంట్కు క్రీడాస్పూర్తి చూపించాలనే ఇలా చేసినట్లు రిఫరీ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇక పోర్చుగల్ సహా ఫుట్‌బాల్ అంతర దేశాలలో వైట్‌కార్డ్ జారీని ప్రవేశపెట్టారు. ఇటీవలే ఫుట్‌బాల్ అంతర్జాతీయ గవర్నింగ్ బాడీ ఆటగాడు గాయపడితే కంకషన్ ప్లేయర్(సబ్‌స్టిట్యూట్) వచ్చేందుకు వైట్‌కార్డ్ ఉపయోగించడం మొదలుపెట్టింది. అలాగే ఖతర్ 2022 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లోనూ వైట్‌కార్డ్‌ను ప్రవేశపెట్టినప్పటికి రిఫరీలు వాటిని ఉపయోగించలేదు. తాజాగా ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తొలిసారిగా వైట్‌కార్డ్ ఉపయోగించి రిఫరీ చరిత్ర సృష్టించాడు. As equipas médicas de Benfica e Sporting receberam cartão branco após assistirem uma pessoa que se sentiu mal na bancada 👏 pic.twitter.com/ihin0FAlJF — B24 (@B24PT) January 21, 2023 చదవండి: 'అలా అయితేనే టీమిండియాను కొట్టగలం'.. ఆసీస్‌కు సూచనలు 'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు -
Cristiano Ronaldo: కళ్లు చెదిరే రీతిలో.. కాసుల పంట
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు బంపరాఫర్ తగిలింది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ముందే మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో అప్పటినుంచి ఏ క్లబ్‌కు సంతకం చేయలేదు. తాజాగా ఆ ఎదురుచూపులకు రొనాల్డో తెరదించాడు. ఇకనుంచి రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ (రెండేండ్లు) రొనాల్డో.. అల్ నజర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలకు పైగా ఉందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1770 కోట్లు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంలో ఇదే డీల్ పై పలు రకాల కథనాలు వినిపించాయి. అప్పుడు రొనాల్డో వీటిని కొట్టిపారేసాడు. తాను ఎవరితో ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు భారీ డీల్‌తో ప్రేక్షకుల ముందు రావడం గమనార్హం. ఇక ఫిఫా ప్రపంచకప్‌లోనూ రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్‌గా పోర్చుగల్‌ను ఫైనల్ చేరుస్తాడనుకుంటే క్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. అంతేగాక ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.అంతకముందు ఫిఫా ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్నాడు. అదీగాక మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్ తో గొడవ ఈ వివాదం మరింత ముదిరేలా చేసింది. History in the making. This is a signing that will not only inspire our club to achieve even greater success but inspire our league, our nation and future generations, boys and girls to be the best version of themselves. Welcome @Cristiano to your new home @AlNassrFC pic.twitter.com/oan7nu8NWC — AlNassr FC (@AlNassrFC_EN) December 30, 2022 చదవండి: Pele: భారత్‌తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి -
పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఈసారి కచ్చితంగా కప్ కొడుతుందనుకున్న రొనాల్డో సేన అనూహ్యంగా మొరాకో చేతిలో ఓటమి పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రొనాల్డో అయితే తనకిదే చివరి మ్యాచ్ అన్నట్లుగా వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. పోర్చుగల్ ఓటమితో అభిమానులు నిరాశలో ఉంటే.. మాజీ పోర్న్ స్టార్, మోడల్ మియా ఖలీఫా మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో సేన క్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టిన సందర్భంగా మొరాకోకు కంగ్రాట్స్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేసింది. మొరాకో జెండాను పెట్టిన పక్కన ఆశ్చర్యార్థకం గుర్తులను పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది.ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. రెండో అర్థభాగం చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్‌కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్‌ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్‌గా మ్యాచ్‌ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. 🇲🇦!!!!! — Mia K. (@miakhalifa) December 10, 2022 చదవండి: FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం FIFA WC 2022: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' -
FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం
FIFA World Cup 2022- Virat Kohli- Cristiano Ronaldo: ‘‘క్రీడా రంగానికి నువ్వు చేసిన సేవ ఎనలేనిది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను అలరించిన తీరు మరువలేనిది.. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం.. కేవలం నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం అది. ప్రతి మ్యాచ్‌లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన ఆశీర్వాదం లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అవుతాడు. నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడి(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- GOAT)వి నువ్వే! మా అందరిని ఇంతగా అలరించిన నువ్వు ట్రోఫీ గెలవకపోతేనేం..? టైటిల్ సాధించకపోతేనేం? అదేమీ పెద్ద విషయం కానేకాబోదు. నీ ఆట తీరుతో మా మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీ గురించి వర్ణించడానికి ఎలాంటి ట్రోఫీలు, టైటిళ్లు అక్కర్లేదు’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను ఉద్దేశించి ఈ మేరకు ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కల చెదిరింది! ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా మొరాకో చేతిలో ఓటమితో.. టైటిల్ దిశగా సాగాలనుకున్న పోర్చుగల్ ఆశలకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఖతర్ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లోనే పోర్చుగల్ కథ ముగిసింది. కాగా ఇంతవరకు ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కన్నీరే మిగిలింది! అదే విధంగా.. ఆ జట్టు కెప్టెన్, మేటి ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ టోర్నీ కానుందన్న అభిప్రాయాల నేపథ్యంలో అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ ట్రోఫీ సాధించాలనుకున్న 37 ఏళ్ల రొనాల్డో కల కలగానే మిగిలిపోయినట్లయింది. ఈ పరాజయాన్ని తట్టుకోలేక అతడు కన్నీటిపర్యంతమైన తీరు అభిమానుల చేత కంటతడి పెట్టించింది. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) రొనాల్డోపై కోహ్లి అభిమానం ఈ క్రమంలో రొనాల్డోపై అభిమానం చాటుకుంటూ కోహ్లి సోషల్ మీడియా వేదికగా అతడికి అండగా నిలబడ్డాడు. ఇన్‌స్టాలోనూ ఈ మేరకు రొనాల్డో ఫొటో పంచుకోగా.. గంటల్లోనే వైరల్‌గా మారింది. నాలుగు గంటల్లోనే 30 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కోహ్లి.. కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. అయితే, టెస్టుల్లో టీమిండియాను నంబర్ 1గా నిలపడం సహా 72 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ఎన్నో ఘనతలు తన ఖాతాలో ఉన్నాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! సంజూ శాంసన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పరాయి దేశం The moment ❤️ Peter Drury's commentary of the moment ❤️🔥 You cannot not replay this special narration of the special night for #Morocco by a special commentator 🎙️#MARPOR #Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Lh03wXs792 — JioCinema (@JioCinema) December 11, 2022 -
FIFA: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! మరీ ఇలాంటి ముగింపా?!
FIFA World Cup 2022- Cristiano Ronaldo: ఇద్దరక్కలు.. ఓ అన్న.. ఇంట్లో నాలుగో సంతానం. నిజానికి అప్పటికే పేదరికంలో మగ్గుతున్న కారణంగా ఆ తల్లి నాలుగో బిడ్డను కనకూడదు అనుకుంది. అబార్షన్ చేయించుకోవాలనుకుంది. కానీ, దేవుడు అలా జరుగనివ్వలేదు. ఆ బిడ్డ భూమ్మీద పడ్డాడు. ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించాడు. స్టార్ ఫుట్‌బాలర్‌గా ఎదిగి.. తల్లిని గర్వపడేలా చేశాడు. లెక్కకు మిక్కిలి అభిమానులు, లెక్కలేనంత డబ్బు! తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో రికార్డులు సాధించిన రారాజు.. మరీ ఇలా, ఇంత ఘోరంగా తన ప్రయాణం ముగిసిపోతుందని ఊహించి ఉండడు! ఇంతటి అవమానకర పరిస్థితుల్లో ‘ఆఖరి మ్యాచ్’ను ఆడాల్సి వస్తుందనే ఊహ కూడా కనీసం అతడి దరికి చేరి ఉండదు! కెరీర్లో ఒక్క ప్రపంచకప్ టైటిల్ అయినా ఉండాలని అతడు ఆశపడ్డాడు. అందుకు తను వందకు వందశాతం అర్హుడు కూడా! కానీ విధిరాత మరోలా ఉంది! నువ్వు ఎన్ని అంతర్జాతీయ గోల్స్ చేస్తేనేం? ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డీఓర్ అవార్డులు గెలిస్తేనేం? ఎన్నెన్ని చాంపియన్స్ లీగ్ మెడల్స్ సాధిస్తేనేం? మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడివి అయితేనేం? ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫుట్‌బాలర్‌గా నీరాజనాలు అందుకుంటేనేం? ఈ ఒక్క లోటు నిన్ను, నీ అభిమానులను జీవితాంతం వేదనకు గురిచేయడం ఖాయమన్నట్లుగా.. గుండెకోతను మిగిల్చింది. చిన్నపిల్లాడిలా అతడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు చూసి అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ‘‘మరేం పర్లేదు రొనాల్డో.. నువ్వు ఎప్పటికీ మా దృష్టిలో చాంపియన్‌వే’’ అని పైకి చెబుతున్నా.. హృదయాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ వాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు!- సాక్షి, వెబ్‌డెస్క్ తల్లితో రొనాల్డో వీళ్లకు ఉన్నంత పాపులారిటీ ఎవరికీ లేదు! నిజానికి ఆధునిక ఫుట్‌బాల్‌లో స్టార్లు ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేర్లు.. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. సాకర్ గురించి పెద్దగా తెలియనివాళ్లకు కూడా వీరి పేర్లు సుపరిచితమే అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది అభిమానం చూరగొన్న.. చూరగొంటున్న మెస్సీ, రొనాల్డో ఆటలో తమకు తామే సాటి. తమకు తామే పోటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మేటి ఫుట్‌బాలర్లు ఉన్నా వీరిద్దరికి దక్కినంత పాపులారిటీ మరెవరికి దక్కలేదనడం అతిశయోక్తి కాదు. గర్ల్‌ఫ్రెండ్, తమ పిల్లలతో ఇలా అదొక్కటే లోటు! చాంపియన్స్ లీగ్ సహా ఇతర క్లబ్ టోర్నీలలో తమదైన ఆట తీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా స్టార్ మెస్సీ, పోర్చుగల్ మేటి ఆటగాడు రొనాల్డో.. తమ కెరీర్లో ఎన్నెన్నో రికార్డులు సాధించారు. అరుదైన ఘనతలు తమ ఖాతాలో వేసుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఎందులోనూ వీరికి లోటు లేదు. అయితే, విచిత్రంగా ఈ ఇద్దరు ఫుట్‌బాల్ స్టార్లు తమ కెరీర్లో జాతీయ జట్టు తరపున ఇప్పటి వరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవకపోవడం గమనార్హం. మెస్సీ, రొనాల్డో మెస్సీ ముందడుగు.. పాపం రొనాల్డో అర్జెంటీనా ఇప్పటి వరకు రెండు సార్లు(1978, 1986) ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడగా.. పోర్చుగల్ ఖాతాలో ఒక్క టైటిల్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్-2022లో ఈ ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను ముందుకు నడిపి ఫైనల్లో తలపడితే చూడాలని, ఏ ఒక్కరు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఫుట్‌బాల్ అభిమానులు అంచనాలు వేశారు. అంతేగాక 37 ఏళ్ల రొనాల్డో, 35 ఏళ్ల మెస్సీ తమ కెరీర్లో ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికి ఈ ఏడాది టోర్నీ చిరస్మరణీయం కావాలని కోరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌పై అర్జెంటీనా గెలుపుతో మెస్సీ చిరకాల కల నెరవేరేందుకు ముందుడుగు పడగా.. మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమితో రొనాల్డో వరల్డ్‌కప్ ప్రయాణానికి తెరపడింది. అరుదైన రికార్డు ఫిఫా ప్రపంచకప్-2022లో ఘనాతో ఆరంభ మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడం ద్వారా రొనాల్డో తన ఖాతా తెరిచాడు. తద్వారా ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్ సాధించాడు. ఇక గ్రూప్- హెచ్లో ఉన్న పోర్చుగల్ ఈ మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించింది. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఉరుగ్వేను 2-0తో ఓడించింది. అనంతరం దక్షిణా కొరియా చేతిలో 2-1 ఓటమి పాలైనప్పటికీ గ్రూప్ టాపఱ్గా ఉన్న పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అవమానకర రీతిలో.. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణా కొరియా ఆటగాడితో రొనాల్డో వాగ్వాదం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ అయిన రొనాల్డోను పక్కనపెట్టడం ఫ్యాన్స్ అవమానకరంగా భావించారు. ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో వచ్చిన యువ ప్లేయర్ గొంకాలో రామోస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా.. స్విస్పై పోర్చుగల్ 6-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో స్విస్‌తో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన రొనాల్డో క్వార్టర్స్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీసుకు డుమ్మా కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అవమానం తట్టుకోలేకే ఇలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కీలక మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడం పట్ల అతడి గర్ల్‌ఫ్రెండ్ జార్జినా కూడా అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయగా.. 50 లక్షలకు పైగా మంది ఆ పోస్టును లైక్ చేసి రొనాల్డోకు మద్దతుగా నిలిచారు. అయినా, మేనేజ్మెంట్ తీరు మారలేదు. మొరాకోతో క్వార్టర్ మ్యాచ్ ఆరంభంలోనూ రొనాల్డోను ఆడించలేదు. 51 నిమిషంలో అతడిని సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ క్రమంలో తనకు గోల్ కొట్టే అవకాశం రాగా.. మొరాకో గోల్ కీపర్ అడ్డుపడటంతో రొనాల్డోకు నిరాశే మిగిలింది. సెమీస్, ఆపై ఫైనల్ చేరి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలన్న పోర్చుగల్ సారథి కల ఇలా ముగిసిపోయింది. నిజానికి 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాలేదు. అయితే, రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే! ఎంతటి మొనగాడు అయితేనేం?! 18 ఏళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్-2003లో తొలిసారిగా మెగా ఈవెంట్లో ఆడిన రొనాల్డోకు టైటిల్ లేకుండానే కెరీర్ ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ ప్రెస్మీట్లో కూల్‌డ్రింక్ బాటిల్‌ను పక్కకు జరిపి.. వాటర్ గ్లాస్ అందుకున్నందుకే సదరు కంపెనీ బ్రాండ్ వాల్యూ అమాంతం పడిపోయేంత ప్రభావం చూపగల.. పాపులర్ ఆటగాడు ఇలా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని చిన్నపిల్లాలడిగా కన్నీటిపర్యంతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు సగటు అభిమాని. ఎంతటి మొనగాడికైనా గడ్డుకాలం అంటే ఇలాగే ఉంటుందేమోననంటూ కామెంట్లు చేస్తున్నారు. -సుష్మారెడ్డి, యాళ్ల చదవండి: Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే!