
పాంప్లొనా (స్పెయిన్): అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లయెనల్ మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’తో ప్రత్యర్థి జట్టును ఠారెత్తించాడు. ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 5–0తో ఘనవిజయం సాధించగా... ఈ ఐదు గోల్స్‌ను మెస్సీ (8వ, 45వ, 47వ, 71వ, 76వ నిమిషాల్లో) ఒక్కడే చేయడం విశేషం.
గతంలో దేశం తరఫున ఆడుతూ మెస్సీ ఒకే మ్యాచ్‌లో 5 గోల్స్ చేయలేదు. ఈ క్రమంలో జాతీయ జట్ల తరఫున అత్యధిక గోల్స్ (86) చేసిన క్రీడాకారుల జాబితాలో మెస్సీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. తొలి మూడు స్థానాల్లో వరుసగా క్రిస్టియానో రొనాల్డో (117 గోల్స్–పోర్చుగల్), అలీ దాయ్ (109 గోల్స్–ఇరాన్), ముఖ్తార్ దహరి (89 గోల్స్–మలేసియా) ఉన్నారు.
చదవండి: Kho Kho -League: ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు
Comments
Please login to add a commentAdd a comment