Football tournament
-
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
బ్యూనస్ ఎయిర్స్: తమ కెప్టెన్... దిగ్గజ ప్లేయర్ లయోనల్ మెస్సీ లేకపోయినా... అర్జెంటీనా జోరు తగ్గించలేదు. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టును అలవోకగా ఓడించిన అర్జెంటీనా దర్జాగా ప్రపంచకప్ టోర్నమెంట్‌కు 19వసారి అర్హత సాధించింది. దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్ టోర్నీకి ఆరు జట్లకు నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. తొలి బెర్త్‌ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు సొంతం చేసుకుంది. వాస్తవానికి బ్రెజిల్ జట్టుతో మ్యాచ్‌కు ముందే అర్జెంటీనాకు వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైంది. ఉరుగ్వే జట్టుతో మ్యాచ్‌ను బొలీవియా జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకోవడంతో అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్‌కప్ బెర్త్ దక్కడంతో... బ్రెజిల్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సీ గైర్హాజరీలో నికోలస్ ఒటామెండీ సారథ్యంలో బరిలోకి దిగిన అర్జెంటీనా 4–1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (4వ నిమిషంలో), ఎంజో ఫెర్నాండెజ్ (12వ నిమిషంలో), అలెక్సిస్ మాక్ అలిస్టర్ (37వ నిమిషంలో), గిలియానో సిమోన్ (71వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బ్రెజిల్ జట్టుకు మాథ్యూస్ కున్హా (26వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. దక్షిణ అమెరికా జోన్ నుంచి మొత్తం 10 జట్లు (అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, కొలంబియా, వెనిజులా, బొలీవియా, పెరూ, చిలీ) డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అర్జెంటీనా 31 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఐదు బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టుకు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. ఇరాన్ వరుసగా నాలుగోసారి... మరోవైపు ఆసియా జోన్ నుంచి ఇరాన్ జట్టు వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను ఇరాన్ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. 1978లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్ ఆ తర్వాత 1998లో రెండోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడింది. 2006లో మూడోసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్ 2010లో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. 2014లో నాలుగోసారి వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఇరాన్ ఆ తర్వాత 2018లో, 2022లోనూ పోటీపడింది. ఈసారి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఓవరాల్‌గా ఏడోసారి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 2026 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. ఆసియా నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్ టోర్నీ ద్వారా మరో జట్టుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్య దేశాలతోపాటు జపాన్, ఇరాన్, న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత పొందాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో క్వాలిఫయింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.19 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్జెంటీనా 19 సార్లు అర్హత సాధించింది. మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్లో... నాలుగుసార్లు గ్రూప్ దశలో... మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
ట్రోఫీ గెలిచిన 22 మందికి పోలీస్ ఉద్యోగాలు.. భారీ నజరానా కూడా!
సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు రికార్డు స్థాయిలో 33వసారి ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... విజేత జట్టులోని ఆటగాళ్లందరికీ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)లుగా నియమించనున్నట్లుప్రభుత్వం ప్రకటించింది.సంతోష్ ట్రోఫీ విజేతలకు బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జట్టులోని మొత్తం 22 మంది ప్లేయర్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు, ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయిందని మంత్రి తెలిపారు. అదే విధంగా.. జట్టులోని సభ్యులకు బెంగాల్ ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన సంతోష్ ట్రోఫీ ఫైనల్లో కేరళను ఓడించి బెంగాల్ జట్టు చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేర నజరానాతో పాటు ఉద్యోగం రూపంలో మంచి బహుమతి ఇచ్చింది. మరిన్ని క్రీడా వార్తలుక్వార్టర్స్లో యూకీ ద్వయంఆక్లాండ్: కొత్త ఏడాదిని భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ విజయంతో ప్రారంభించాడు. ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేసింది.బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–4, 6–4తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–జాన్సన్ (బ్రిటన్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ జంట రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్ తూఫాన్స్ గెలుపురూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన పోరులో హైదరాబాద్ 3–0 గోల్స్ తేడాతో యూపీ రుద్రాస్ను చిత్తు చేసింది. తొలి క్వార్టర్లో 2 గోల్స్ చేసిన హైదరాబాద్ మూడో క్వార్టర్లో మరో గోల్‌తో తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. మూడు ఫీల్డ్ గోల్స్ సాధించిన తూఫాన్స్ మరో మూడు పెనాల్టీ కార్నర్లను వాడుకోలేకపోయింది.మరో వైపు చివరి క్వార్టర్లో ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఐదు పెనాల్టీలు సహా మొత్తం ఆరు పెనాల్టీలు వచ్చినా రుద్రాస్ వాటిలో ఒక్కదానిని కూడా గోల్‌గా మలచలేకపోయింది. హైదరాబాద్ తరఫున జాకరీ వాలెస్ (6వ నిమిషం), రాజీందర్ సింగ్ (14వ నిమిషం), శిలానంద్ లాక్డా (32వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తాజా ఫలితం తర్వాత పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. గోల్స్ వర్షం కురిసిన మరో మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్ 6–5 గోల్స్‌తో టీమ్ గోనాసిక వైజాగ్‌పై గెలుపొందింది. ఈ గెలుపుతో డ్రాగన్స్ రెండో స్థానానికి చేరగా, గోనాసిక ఏడో స్థానంలో నిలిచింది. -
మళ్లీ ఓడిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో శనివారం దక్కన్ ఎరెనా మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో జమ్మూ కశీ్మర్ 3–0తో తెలంగాణపై ఘనవిజయం సాధించింది. తెలంగాణ రక్షణ పంక్తి లోపాలను ఆసరా చేసుకొని కశీ్మర్ స్ట్రయికర్లు, మిడ్‌ఫీల్డర్లు పదేపదే గోల్‌పోస్ట్‌వైపు దూసుకెళ్లారు. ఆట మొదలైన ఐదు నిమిషాల్లోనే జమ్మూ కశీ్మర్ ఖాతా తెరిచింది. హయత్ బషీర్ (5వ ని.లో) చేసిన గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగం ఇదే స్కోరుతో ముగిసింది. ద్వితీయార్ధంలో అరుణ్ నగియల్ (74వ ని.), ఆకిఫ్ జావిద్ ( 88 వ ని.) స్వల్ప వ్యవధిలో చేసి గోల్స్‌లో జమ్మూ జట్టు 3–0తో తెలంగాణపై ఏకపక్ష విజయం సాధించింది. కశీ్మర్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి విజయం కాగా... నాలుగు మ్యాచ్‌లాడిన ఆతిథ్య తెలంగాణ జట్టు ఇంకా బోణీ కొట్టలేదు. మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆతిథ్య జట్టు ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ గ్రూపు నుంచి సర్వీసెస్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ సరీ్వసెస్ 2–0తో రాజస్తాన్‌పై గెలుపొందింది. వరుసగా మూడు విజయాలతో నాకౌట్ చేరింది. రాజస్తాన్‌కు క్వార్టర్స్ చేరే అవకాశం మిగిలుంది. సోమవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో జమ్మూ కశీ్మర్‌పై గెలిస్తే రాజస్తాన్ నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. -
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గొడవ.. 100 మంది మృతి
సౌత్ ఆఫ్రికాలోని గినియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఆదివారం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.అనంతరం వందలాది మంది వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను కూడా ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ క్రమంలో వంద మందికిపైగా మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️❗️🇬🇳 - At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea. This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE— 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024 -
WC Qualifiers: కొలంబియా సంచలనం.. అర్జెంటీనాకు షాక్
బొగోటా (కొలంబియా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టుకు 2026 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో షాక్ తగిలింది. 2022లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా... దక్షిణ అమెరికా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో కొలంబియా చేతిలో ఓడింది. బుధవారం జరిగిన పోరులో కొలంబియా 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై గెలిచింది. కొలంబియా తరఫున యెర్సన్ మస్క్యూరా (25వ నిమిషంలో), జేమ్స్ రోడ్రిగ్జ్ (60వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున నికోలస్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ మెస్సీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ అర్హత టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి అర్జెంటీనా 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోరీ్నలో తొలి 6 స్థానాల్లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ నకు అర్హత సాధించనున్నాయి. -
ఇంటర్కాంటినెంటల్ కప్: సిరియా ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో సిరియా 2–0తో మారిషస్‌పై ఘన విజయం సాధించింది. ఈ పరాజయంతో మారిషస్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కాగా... సోమవారం జరిగే ఆఖరి పోరులో ఆతిథ్య భారత్‌తో సిరియా తలపడుతుంది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సిరియా ఫుట్‌బాలర్లు ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టు సంపాదించారు. పదేపదే ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా దాడులకు పదునుపెట్టారు. కానీ ప్రత్యర్థి డిఫెండర్ బ్రెండన్ సిటొరా చేసిన తప్పిదంతో సిరియా ఖాతా తెరిచింది. ఆట 32వ నిమిషంలో సిటోరా సెల్ఫ్‌గోల్‌తో సిరియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత రెండో అర్ధభాగంలో అల్ మవాస్ (70వ నిమిషంలో) సాధించిన గోల్‌తో సిరియా ఆధిక్యం (2–0) రెట్టింపైంది. మరోవైపు మారిషస్ కూడా రెండో సగంలో గోల్ కోసం చేసిన ప్రయత్నాల్ని సిరియా డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. -
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్‌దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్‌గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్‌బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్‌బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్‌లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్‌కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్‌రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్‌రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
‘శాఫ్’ టోర్నీ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత జట్టు
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నేపాల్ వేదికగా గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో మాల్దీవులు జట్టుపై గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదును పెట్టారు. కొరౌ సింగ్, కెల్విన్ సింగ్ టోరెమ్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా కదంతొక్కారు. ఈ క్రమంలో కెల్విన్ కొట్టిన షాట్‌ను ఎబందస్ యేసుదాసన్ గోల్‌గా మలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.తర్వాత కాసేపటికి గుర్నాజ్ సింగ్ ఇచ్చిన కార్నర్ పాస్‌ను మోనిరుల్ హెడర్ గోల్ పోస్ట్‌ను చేరలేకపోయింది. అయినా సరే భారత యువ స్ట్రయికర్లు నిరాశచెందక తమ ప్రయత్నాలను కొనసాగించారు. 18వ నిమిషంలో కొరౌ, 47వ నిమిషంలో కెల్విన్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలితమివ్వలేదు. రెండో అర్ధభాగంలోను గోల్ చేయడం కష్టంగా మారింది. చివరకు ఇంజ్యూరీ టైమ్ (90+5వ నిమిషం)లో మంగ్లెంతంగ్ కిప్జెన్ చేసిన గోల్ భారత్‌ను గెలిపించింది.ఫినిషింగ్ లోపాలతో గోల్స్‌గా మలచలేకపోయినప్పటికీ కొరౌ సింగ్, కెల్విన్, ఎబిందస్‌లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. సోమవారం జరిగే సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’ రన్నరప్, డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. -
మైదానంలో మూత్ర విసర్జన... ఫుట్‌బాలర్‌కు రెడ్‌కార్డ్
లిమా: పెరూకు చెందిన ఓ ఫుట్‌బాలర్ విజ్ఞత మరిచి ఫీల్డ్‌లోనే మూత్ర విసర్జన చేయడంతో ఆగ్రహించిన రిఫరీ రెడ్‌కార్డ్‌తో బయటికి పంపించాడు. లోయర్ డివిజన్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా అట్లెటికొ అవజున్, కాంటర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో అవజున్ జట్టుకు 71వ నిమిషంలో కార్నర్ కిక్ లభించింది. సెబాస్టియన్ మునొజ్ కొట్టిన కిక్‌ను కాంటర్సిల్లో గోల్ కీపర్ అడ్డుకున్నాడు. ఇది భరించలేకపోయిన మునొజ్ కనీస విజ్ఞత లేకుండా విరామ సమయంలో మైదానంలోనే మూత్ర విసర్జన చేశాడు. దీన్ని కాంటర్సిల్లో ప్లేయర్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అతనికి రెడ్‌కార్డ్ చూపి బయటికి పంపించాడు. ఫుట్‌బాల్ ఆటలో ఇలా మూత్రవిసర్జన చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆర్సెనల్ గోల్‌కీపర్ లెహ్మన్, ఇంగ్లండ్ లెజెండ్ లినెకర్లు కూడా ఇలాంటి చర్యకు పాల్పడి మైదానం వీడారు. -
యూరో కప్‌లో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ దిగ్గజం
జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం థామస్ ముల్లెర్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. తమ సొంత గడ్డపై జరిగిన యూరో కప్-2024లో జర్మనీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మెగా టోర్నీ క్వార్టర్ ఫైనల్లోనే జర్మనీ కథ ముగిసింది.ఈ టోర్నీలో మిల్లర్ కూడా తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలో తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ముల్లెర్.. తన ఫుట్‌బాల్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు."దేశం తరపున అత్యున్నతస్ధాయిలో ఆడటం ఎల్లప్పుడూ గర్వకారణమే. నా కెరీర్లో ఎన్నో విజయాలను చూశాను. కొన్నిసార్లు కన్నీళ్ల పెట్టున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను జర్మనీ తరపున అరంగేట్రం చేసినప్పుడు ఇవన్నీ సాధిస్తాని కలలో కూడా ఊహించలేదు. ఇన్నేళ్లగా నాకు మద్దతుగా నిలిచిన నా సహచరులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని" తన రిటైర్మెంట్ నోట్లో ముల్లర్ పేర్కొన్నాడు. కాగా అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా ముల్లెర్ జర్మనీకి ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. 2014లో ఫిఫా వరల్డ్ కప్ గెలుపొందిన జర్మనీ జట్టుకు ముల్లెరె కెప్టెన్ కావడం గమనార్హం. తన కెరీర్లో 131 మ్యాచ్‌లు ఆడిన ముల్లెర్.. 45 గోల్స్, 41 అసిస్ట్‌లు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. యూరోకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించి టైటిల్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. -
యూరో కప్-2024 సెమీస్ బెర్తులు ఖరారు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో సెమీఫైనల్ బెర్త్‌లు అధికారకంగా ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టర్కీని ఓడించి నెదర్లాండ్స్ నాలుగో జట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓటమి చవి చూసింది. మరోవైపు నాలుగో క్వార్టర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది.కాగా యూరో కప్ సెమీఫైనల్లో నెదర్లాండ్స్ అడుగుపెట్టడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ తమ సెమీఫైనల్స్ బెర్త్‌లను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
బ్రెజిల్‌కు చుక్కెదురు
లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్ బ్రెజిల్ జట్టు కథ ముగిసింది. ‘షూటౌట్’ ద్వారా ఫలితం తేలిన క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వే 4–2తో బ్రెజిల్ జట్టును ఓడించి 2011 తర్వాత ఈ టోరీ్నలో మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్స్ చేయలేదు. ‘షూటౌట్’లో ఉరుగ్వే తరఫున నలుగురు ప్లేయర్లు వల్వెర్డె, బెంటాన్కర్, అరాసెటా, ఉగార్టె... బ్రెజిల్ తరఫున ఇద్దరు ప్లేయర్లు పెరీరా, మారి్టనెల్లి గోల్స్ సాధించారు. మరో క్వార్టర్ ఫైనల్లో కొలంబియా 5–0తో పనామా జట్టు ను ఓడించింది. బుధవారం జరిగే తొలి సెమీఫైన ల్లో కెనడాతో అర్జెంటీనా; గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వేతో కొలంబియా ఆడతాయి. -
EURO 2024: పోర్చుగల్ అవుట్.. చివరి మ్యాచ్ ఆడేసిన రొనాల్డో!
యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్‌లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్‌తో తలపడింది.ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకనూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్‌పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్‌కు దూసుకెళ్లింది.మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఇక ఆరోసారి యూరో కప్‌లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.పోర్చుగల్ వీరుడిగానే కాదు..అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది. -
Copa America Cup: అర్జెంటీనా బోణీ.. మెస్సీ అరుదైన రికార్డు
అట్లాంటా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించింది.అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (49వ ని.లో), లాటారో మార్టినెజ్ (88వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మెస్సీ అందించిన పాస్‌లతో ఈ రెండు గోల్స్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెస్సీ వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్‌లో అత్యధికంగా 35 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.ఇప్పటి వరకు ఈ రికార్డు చిలీకి చెందిన సెర్జియో లివింగ్‌స్టోన్ (1941 నుంచి 1953 వరకు; 34 మ్యాచ్‌లు) పేరిట ఉంది. ఈనెల 26న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చిలీతో అర్జెంటీనా ఆడుతుంది. View this post on Instagram A post shared by CONMEBOL Copa América™ USA 2024 (@copaamericaeng) -
Euro Cup 2024: సెల్ఫ్ గోల్‌తో ఓడిన ఇటలీ
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టుకు చుక్కెదురైంది. మాజీ విజేత స్పెయిన్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. ఆట 55వ నిమిషంలో స్పెయిన్ ఫార్వర్డ్ అల్వారో మొరాటో హెడర్ షాట్‌ను ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుగి డొనారుమా నిలువరించాడు.అయితే ఇటలీ గోల్‌కీపర్ నిలువరించిన బంతి ఇటలీ డిఫెండర్ రికార్డో కాలాఫియోరి కాలికి తగిలి తిరిగి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. దాంతో ఇటలీ సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–1తో పోలాండ్ జట్టుపై, ఉక్రెయిన్ 2–1తో స్లొవేకియాపై గెలిచాయి. చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... -
ఫ్రాన్స్‌కు బిగ్ షాక్.. ఎంబాపేకు తీవ్ర గాయం! టోర్నీ నుంచి ఔట్?
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. సోమవారం డసెల్డార్ఫ్ అరేనా వేదికగా ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. 90 నిమిషాల గేమ్‌లో ఫ్రాన్స్ ఒక్క గోల్ సాధించగా.. ఆస్ట్రియా మాత్రం ఒక్కగోల్ కూడా నమోదు చేయలేకపోయింది.ఫ్రాన్స్‌కు బిగ్ షాక్..ఇక ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపె గాయపడ్డాడు. ఎంబాపే ముక్కుకు బలమైన గాయమైంది. ఈ మ్యాచ్ 86వ నిమిషంలో ఎంబాపే, ఆస్ట్రియన్ ఫార్వడ్డర్ కెవిన్ డాన్సో ఇద్దరూ అనూహ్యంగా ఒకరొకరు ఢీకొన్నారు.ఈ క్రమంలో కెవిన్ డాన్సో భుజం ఎంబాపే ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడి ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. వెంటనే ఫిజియో వచ్చి ఎంబాపేకు చికిత్స అందించాడు. అయినప్పటకి రక్తం ఆగకపోవడంతో మైదానం నుంచి అతడిని బయటకు తీసుకువెళ్లారు. మ్యాచ్ అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించగా.. ముక్కు ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఎంబాపే గాయంపై ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అప్డేట్ ఇచ్చింది. ముక్కు ఎముక విరిగినట్లు ఎఫ్ఎఫ్ఎఫ్ సైతం ధువీకరించింది."కైలియన్ ఎంబాపే ఆస్పత్రి నుంచి తిరిగి ఫ్రెంచ్ జట్టు బేస్ క్యాంప్‌నకు తిరిగి వచ్చాడు. సోమవారం డ్యూసెల్డార్ఫ్లో జరిగిన ఆస్ట్రియా-ఫ్రాన్స్ మ్యాచ్ సెకెండ్ హాఫ్‌లో ఎంబాపే ముక్కుకు గాయమైంది. దురదృష్టవశాత్తూ అతడి ముక్కు ఎముక ఫ్రాక్చర్ అయింది. మా కెప్టెన్‌కు తొలుత వైద్య సిబ్బంది చికిత్స అందించగా.. ఆ తర్వాతి ఆస్పత్రిలో డాక్టర్ ఫ్రాంక్ లే గాల్ పరిశీలించారు. అతడికి ముక్కు ఎముక విరిగినట్లు ఫ్రాంక్ లే నిర్ధారించాడు. అతడు కొద్ది రోజుల పాలు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు.అయితే ఎంబాపేకు వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అతడు గాయం నుంచి కోలుకునేందుకు వైద్యులు ప్రత్యేకమైన మాస్క్‌ను ఇవ్వనున్నారు. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నామని ఎఫ్ఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎంబాపే టోర్నీ మొత్తానికి దూరమైతే ఫ్రాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.🚨🇫🇷 Kylian Mbappé has just left the hospital after it was confirmed that he broke his nose.Mbappé will not undergo surgery despite initial indications, waiting to decide how to manage him for upcoming two games. pic.twitter.com/Fhbhft1OAO— Fabrizio Romano (@FabrizioRomano) June 17, 2024 -
Euro 2024: యూరో కప్‌లో బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్
ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో కప్-2024కు తెర లేచింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య జర్మనీ శుభారంభం చేసింది. శనివారం మ్యూనిక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 5-1తో జర్మనీ అద్భుత విజయం సాధించింది.ఈ తొలిపోరులో ఏ దశలోనూ పత్యర్ధికి జర్మనీ అవకాశమివ్వలేదు. ఈ మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత జమాల్ ముసియాలా, కై హావర్ట్జ్ ఫస్ట్‌హాఫ్‌లో మరో రెండు గోల్స్‌ను అందించారు. దీంతో ఫస్ట్‌హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో కూడా జర్మనీ అదరగొట్టింది. ఇక ఈ విజయంతో జర్మనీ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరాయి. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. హంగేరీ జట్టుపై 3-1తో స్విస్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఇక ఈ మెగా టోర్నీ జర్మనీలోని 10 పట్టణాల్లో జరగనుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి. -
‘యూరో’ పోరుకు వేళాయె!
ప్రతిష్టాత్మక ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నేడు తెర లేవనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి మ్యూనిక్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జర్మనీ జట్టుతో స్కాట్లాండ్ పోటీపడుతుంది. జర్మనీలోని 10 పట్టణాల్లో జరిగే ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 2020 యూరో టోర్నీలో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి. లీగ్ దశ ముగిశాక ఆరు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 12 జట్లు... మూడో స్థానంలో నిలిచిన నాలుగు ఉత్తమ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ‘యూరో’ టోర్నీని భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
ఉజ్బెకిస్తాన్‌తో.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు సౌమ్య!
తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ భారత మహిళల ఫుట్‌బాల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తాషె్కంట్ నగరంలో ఉజ్బెకిస్తాన్ జట్టుతో మే 31, జూన్ 4వ తేదీల్లో జరిగే రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో పోటీపడే భారత జట్టులో ఆమె ఎంపికైంది.30 మంది ప్రాబబుల్స్‌కు ఇటీవల రెండు వారాలపాటు హైదరాబాద్‌లోని శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టర్కీష్ కప్ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోనూ సౌమ్య సభ్యురాలిగా ఉంది.ఇవి చదవండి: నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ.. -
శ్రీనిధి డెక్కన్ జట్టును గెలిపించిన ఒలివేరా
కొడుమన్ (కేరళ): ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో 12వ విజయం చేరింది. గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 44వ నిమిషంలో నికోలా స్టొజనోవిచ్ గోల్‌తో గోకులం కేరళ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే శ్రీనిధి తరఫున విలియమ్ అల్వెస్ డి ఒలివేరా (47వ ని.లో, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
విజయమే లక్ష్యంగా సిరియాతో బరిలోకి...
ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత జట్టు నేడు జరిగే గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా జట్టుతో ఆడుతుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను జియో సినియా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో సిరియాపై తప్పనిసరిగా నెగ్గాలి. ఇతర గ్రూప్‌ల ఫలితాలు కూడా తమకు అనుకూలించాలని ఆశించాలి. -
భారత ఫుట్‌బాల్ జట్టుకు నిరాశ
కింగ్స్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు చివరిదైన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. థాయ్‌లాండ్‌లో నాలుగు దేశాల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు వర్గీకరణ మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. లెబనాన్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సందేశ్ జింగాన్ నాయకత్వంలోని భారత జట్టు 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. లెబనాన్ తరఫున ఆట 77వ నిమిషంలో కాసీమ్ ఎల్ జీన్ గోల్ సాధించాడు. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెపె్టన్ సునీల్ ఛెత్రి ఈ టోరీ్నకి దూరంగా ఉన్నాడు. -
‘షూటౌట్’లో భారత్ ఓటమి
చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు మూడో స్థానం కోసం పోటీపడనుంది. ఇరాక్ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 4–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం అదనపు సమయం ఆడించకుండా నేరుగా ‘షూటౌట్’ ద్వారా ఫలితాన్ని నిర్ణయించారు. ‘షూటౌట్’లో తొలి షాట్‌ను భారత ప్లేయర్ బ్రాండన్ ఫెర్నాండెజ్ గోల్ పోస్ట్‌కు కొట్టాడు. ఆ తర్వాత సందేశ్ జింగాన్, సురేశ్, అన్వర్ అలీ, రహీమ్ అలీ గోల్స్ చేశారు. ఇరాక్ తరఫున ఐదుగురు ఆటగాళ్లూ గోల్స్ సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు భారత్ తరఫున మహేశ్ 16వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. 28వ నిమిషంలో కరీమ్ అలీ గోల్‌తో ఇరాక్ స్కోరును 1–1తో సమం చేసింది. 51వ నిమిషంలో ఇరాక్ కెపె్టన్ జలాల్ హసన్ సెల్ఫ్ గోల్‌తో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో అయ్‌మెన్ గోల్‌తో ఇరాక్ 2–2తో స్కోరును సమం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న ఇరాక్‌పై భారత్ ఏనాడూ గెలవలేదు. ఇప్పటి వరకు రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఆరు మ్యాచ్‌ల్లో ఇరాక్ నెగ్గగా, మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. లెబనాన్, థాయ్‌లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పరాజిత జట్టుతో మూడో స్థానం కోసం భారత్ తలపడుతుంది. -
23 ఏళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా.. రికార్డుస్థాయిలో
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్ జట్టు రికార్డుస్థాయిలో 17వ సారి సొంతం చేసుకుంది. ఫైనల్లో మోహన్ బగాన్ క్లబ్ 1–0తో ఈస్ట్ బెంగాల్ క్లబ్‌ను ఓడించి 23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. ఆట 71వ నిమిషంలో పెట్రాటోస్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ క్లబ్ గెలిచింది. 135 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లు 16 సార్లు చొప్పున విజేతగా నిలిచి అత్యధికసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తాజా టైటిల్‌తో మోహన్ బగాన్ టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. -
ఎట్టకేలకు భారత్‌కు చేరుకోనున్న పాకిస్తాన్ జట్టు.. రేపే మ్యాచ్!
వన్డే ప్రపంచకప్-2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాకు వస్తుందో రాదో సృష్టత లేదు గానీ ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గోనేందుకు పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు బుధవారం(జూన్ 21) ఇండియాకు చేరుకోనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఛాంపియన్‌షిప్‌లో బెంగళూరు వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్యే జరగనుంది. వాస్తవానికి పాకిస్తాన్ జట్టు రెండు రోజుల ముందే భారత్ చేరుకోవాల్సిండగా.. వీసా సమస్య కారణంగా వారి ప్రయాణం ఆలస్యమైంది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం మారిషస్‌లో ఉంది. అయితే ఎట్టకేలకు వారికి వీసా క్లియరన్స్ రావడంతో మంగళవారం భారత్‌కు పయనం కానున్నారు. మంగళవారం సాయంత్రం 5: 30 గంటలకు మారిషస్‌లో బయలు దేరనున్న పాక్ జట్టు.. అదే రాత్రి(బుధవారం) ఒంటి గంటకు ముంబైకు చేరుకోనుంది. అక్కడ నుంచి నేరుగా మ్యాచ్ జరిగే బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ మ్యాచ్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జూన్ 21 సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఇక దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్-2023లో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో భారత్, కువైట్, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఉండగా.. గ్రూపు-బిలో లెబనాన్, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. చదవండి: Shoaib Akhtar ‘Daughter’: 2014లో పెళ్లి.. ఇంత పెద్ద కూతురు ఎలా? హీరోయిన్లా మెరిసిపోతోంది! ఎంతైనా అక్తర్.. MS Dhoni: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. CONFIRMED: The Pakistan NT will leave Mauritius at 5:30pm & reach Mumbai at 1am IST tomorrow. The flight to BLR is around 6am & will land at 8. Then comes the trip from the airport to the hotel, amid the rains. Going to be tough, esp. since rescheduling looks unlikely. #SAFF2023 pic.twitter.com/hpBpFvvd2q — Shyam Vasudevan (@JesuisShyam) June 20, 2023 -
Football: అదరగొట్టిన సౌమ్య గుగులోత్.. భారత్ శుభారంభం
Women's Olympic Football Tournament Paris 2024- Asian Qualifiers బిష్కెక్: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రౌండ్–1లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘జి’లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ విశేషంగా రాణించింది. నిజామాబాద్ బిడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ మ్యాచ్‌లో ఒక గోల్ చేయడంతోపాటు సహచరిణి అంజు తమాంగ్ రెండు గోల్స్ చేయడంలో సహాయం చేసింది. భారత జట్టుకు అంజు తమాంగ్ (6వ, 42వ ని.లో) రెండు గోల్స్ అందించగా... సౌమ్య గుగులోత్ (45+3వ ని.లో), షిల్కీ దేవి (61వ ని.లో), రేణు (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించి పెట్టారు. శుక్రవారం కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుతోనే భారత్ రెండో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘జి’లోని మూడో జట్టు తుర్క్మెనిస్తాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్ అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు -
I League: మళ్లీ టాప్ ర్యాంకులోకి శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఫుట్‌బాల్ ఐ–లీగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. మంగళవారం జరిగిన తమ 12వ లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి జట్టు 4–0 గోల్స్ తేడాతో రౌండ్‌గ్లాస్ పంజాబ్ ఎఫ్‌సీ జట్టును చిత్తుగా ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున కెప్టెన్ డేవిడ్ కాస్టెనెడా మునోజ్ రెండు గోల్స్ (30వ, 88వ ని.లో) చేయగా ... షహబాజ్ (12వ ని.లో), సొరైషామ్ దినేశ్ సింగ్ (62వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. 12 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో శ్రీనిధి జట్టు 12 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 8 విజయాలు, ఒక ‘డ్రా’, మూడు పరాజయాలతో మొత్తం 25 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 23న ముంబైకి చెందిన కెన్క్రె ఎఫ్‌సీ జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది. చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు India vs New Zealand: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి -
I- League: దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ.. టాప్‌లో శ్రీనిధి డెక్కన్
I-League 2022-23- ఇంఫాల్: భారత దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన తొమ్మిదో లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ 1–0 గోల్ తేడాతో నెరోకా ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 47వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ రామ్లున్చుంగా శ్రీనిధి జట్టుకు గోల్ అందించాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోఉంది. 26న రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 26న తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ జరగనుంది. లాల్‌బహదూర్ స్టేడియంలోని యోగా హాల్ వేదికగా జరిగే అండర్–7, 9, 11, 13, 15, 17, 19 బాల బాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. స్పాట్ ఎంట్రీలు స్వీకరించరు. టోర్నీలో పాల్గొనాలనుకునే వారు 7337578899 లేదా 7337399299 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ కోరారు. చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్ పటేల్... కుల్దీప్, పుజారా, గిల్ సైతం.. BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
FIFA World Cup 2022: ఆటతో అదరగొట్టారు.. సంచలన ప్రదర్శన.. ఉత్కంఠ
17 రోజులలో 56 మ్యాచ్‌లు...ఎన్నో ఉత్కంఠ మలుపులు, ఎన్నో ఉద్వేగభరిత క్షణాలు... 32తో మొదలైన సమరం ఇప్పుడు 8 జట్లకు చేరింది. లెక్కకు మిక్కిలి ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చినా ఒక్క మ్యాచ్ గెలవలేని ఖతర్ నిరాశపర్చగా... అర్జెంటీనాకు షాక్ ఇచ్చినా ముందంజ వేయలేని సౌదీ అరేబియా, నాలుగు సార్లు చాంపియన్ జర్మనీ నిష్క్రమణ తొలి రౌండ్లో హైలైట్‌గా నిలిచాయి. నాకౌట్ పోరులో రెండు మ్యాచ్‌లలో పెనాల్టీల ద్వారా ఫలితం తేలగా... క్రొయేషియా గోల్ కీపర్ ఆట, మొరాకో సంచలన ప్రదర్శన అభిమానులు మరచిపోలేరు. క్వార్టర్స్ సమరానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు సాగిన ఆటను చూస్తే... ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ వరల్డ్ కప్‌తో ఆ జట్టులో కూడా కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలెక్సిన్ మ్యాక్, ఎన్జో ఫెర్నాండెజ్, జూలియాన్ అల్వారెజ్ కీలక సమయాల్లో మెరుపు ప్రదర్శనతో జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ జోరు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో ఆటను చూస్తే 1982 తర్వాత ఈ తరహా దూకుడు చూడలేదని కొందరు మాజీ బ్రెజిల్ ఆటగాళ్లే చెప్పారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ నాలుగు గోల్స్ అద్భుతంగా, ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. రిచర్లిసన్ రూపంలో మరో స్టార్ ఉదయించాడు. టీమ్ తరఫున మూడు గోల్స్ చేసిన రిచర్ల్సన్... రొనాల్డో రిటైర్మెంట్ తర్వాత తమకు ‘9వ నంబర్ జెర్సీ’ రూపంలో లభించిన వరమని బ్రెజిల్ అభిమానులు చెబుతున్నారు. యువ ఆటగాళ్ల జోరు... గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈ సారి యువ ఆటగాళ్ల ప్రదర్శనతో చెలరేగింది. 2018 టోర్నీలో ల్యూకా మోడ్రిక్ ఒంటి చేత్తో జట్టును ఫైనల్ చేర్చగా...ఈ సారి అతనికి తోడు మరికొందరు జూనియర్లు జత కలిశారు. అటాకింగ్‌లో మార్కో లివాజా ఆకట్టుకోగా, జోస్కో గ్వార్డియల్కు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ డిఫెండర్’ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అతని కోసం యూరోపియన్ క్లబ్‌లు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోల్ కీపర్ డొమినిక్ లివకోవిక్ కూడా పెనాల్టీ సేవింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్‌తో మ్యాచ్‌లో ఇది కనిపించింది. కైల్ ఎంబాపె ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. 5 గోల్స్ సాధించిన అతను 2 గోల్స్‌లో సహకారం అందించాడు. అతని ప్రదర్శన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిపేలా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్‌లో మారడోనా తరహాలో జట్టులోని ఒకే ఆటగాడు ప్రభావం చూపించిన తీరుతో విశ్లేషకులు ఇప్పుడు ఎంబాపె ఆటను పోలుస్తున్నారు. ఉస్మాన్ ఎంబెలె ఈ టోర్నీలో సత్తా చాటిన మరో ఫ్రాన్స్ ఆటగాడు. మొరాకో మెరుపులు... ప్రపంచకప్ మొత్తానికి హైలైట్‌గా నిలిచే ప్రదర్శన మొరాకోదే. అనూహ్యమైన ఆటతో దూసుకొచ్చి తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆ జట్టు క్వార్టర్స్ చేరింది. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తోనే టీమ్ ముందంజ వేయగలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు ఒకే ఒక గోల్ ఇచ్చింది. అదీ సెల్ఫ్ గోల్ మాత్రమే! 2018లో అత్యధిక గోల్స్ చేసిన బెల్జియం, రన్నరప్ క్రొయేషియాతో పాటు ప్రిక్వార్టర్స్‌లో 2010 చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసిన తీరు అసమానం.ఇంగ్లండ్ జట్టులో సమష్టితత్వం బాగా కనిపించింది. జట్టు ఇప్పటి వరకు మొత్తం 12 గోల్స్ స్కోర్ చేయగా, వాటిని ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు సాధించారు. గత వరల్డ్ కప్‌లో ఒక్క హ్యారీ కేన్ మాత్రమే 6 గోల్స్ చేయగా, ఈ సారి అతను ఒకే ఒక గోల్ చేసినా... జట్టు మాత్రం దూసుకుపోతోంది. పోర్చుగల్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో చూపిన ప్రదర్శనతో ‘వన్ మ్యాన్ షో’కు తెర పడినట్లయింది. స్విట్జర్లాండ్‌పై 6–1తో విజయం వరల్డ్‌కప్ చరిత్రలోనే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తమ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కన పెట్టి టీమ్ చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. గొన్సాలో రామోస్ రూపంలో కొత్త స్టార్ ఉద్భవించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో చేసిన హ్యాట్రిక్‌తో అతను క్లబ్ ఫుట్‌బాల్‌లో ఒక్కసారిగా హాట్ స్టార్‌గా మారిపోయాడు. జొవా ఫెలిక్స్, బెర్నార్డో సిల్వ కూడా సత్తా చాటి పోర్చుగల్ టైటిల్ ఆశలు పెంచారు. - సాక్షి క్రీడా విభాగం ఐదు సార్లు విజేత అయిన బ్రెజిల్ ఈ సారి కూడా ఫేవరెట్‌గానే ఉంది. క్వార్టర్స్ పోరులో ఆ జట్టు గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఎదుర్కొంటుంది. ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో మూడో సారి తలపడనుండగా, నాకౌట్ దశలో తలపడటం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌లలో కూడా బ్రెజిల్ (1–0తో 2006లో, 3–1తో 2014లో) విజేతగా నిలిచింది. కోచ్ టిటె నాయకత్వంలో అటాకింగ్నే నమ్ముకొని బ్రెజిల్ ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు స్టార్ ప్లేయర్ నెమార్, అలెక్ సాండ్రో కూడా రాణిస్తే బ్రెజిల్‌కు తిరుగుండదు. క్రొయేషియా రికార్డును బట్టి చూస్తే ఫామ్‌లో ఉన్న బ్రెజిల్‌ను నిలువరించడం అంత సులువు కాదు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో సంచలనాలకు లోటేమీ లేదు. మోడ్రిక్, కొవాసిక్తో పాటు బ్రొజోవిక్ ప్రదర్శనపై జట్టు ఆధారపడుతోంది. మరో మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో అన్నీ సాధించిన మెస్సీకి వరల్డ్ కప్ మాత్రం ఇంకా కలే. తన ఐదో ప్రయత్నంలోనైనా దీనిని సాధించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ సారి అంతే స్థాయిలో రాణిస్తున్న అల్వారెజ్పై కూడా జట్టు బాగా ఆధారపడుతోంది. వ్యూహం ప్రకారం చూస్తే నెదర్లాండ్స్ ఒక్క మెస్సీని నిలువరిస్తే సరిపోదు. మరో వైపునుంచి అల్వారెజ్ దూసుకుపోగలడు. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ నేతృత్వంలో ఒక్కసారిగా పటిష్టంగా మారింది. అతని కోచింగ్‌లో డచ్ బృందం 19 మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోలేదు. ఫ్రెంకీ డో జోంగ్, డెన్జెల్ డంఫ్రైస్ కీలక ఆటగాళ్లు. ఇరు జట్ల మధ్య వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌లు జరగ్గా...అర్జెంటీనా 3, నెదర్లాండ్స్ 1 గెలిచాయి. మరో మ్యాచ్ డ్రా అయింది. -
FIFA World Cup 2022: బ్రెజిల్ గర్జన
దోహా: తమ నంబర్‌వన్ ర్యాంక్‌కు తగ్గ ఆటతో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 4–1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించి ఈ మెగా ఈవెంట్లో 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్రెజిల్ తరఫున వినిసియస్ (7వ ని.లో), నెమార్ (13వ ని.లో), రిచార్లీసన్ (29వ ని.లో), లుకాస్ పక్వెటా (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా తరఫున 79వ నిమిషంలో పాయిక్ సెంగ్హో ఏకైక గోల్ సాధించాడు. ఈనెల 9న జరిగే క్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషి యాతో బ్రెజిల్ తలపడతుంది. ఏడో నిమిషంలో రఫిన్హా ఇచ్చిన పాస్ ఇద్దరు బ్రెజిల్ స్ట్రయికర్లను దాటుకుంటూ వినిసియస్ జూనియర్ వద్దకు రాగా అతను గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను నెమార్ గోల్ చేయడంతో ఆధిక్యం 2–0కు చేరింది. మరోవైపు కొరియన్లు కూడా గోల్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో వాంగ్ హిచన్ కొట్టిన కిక్ గోల్‌పోస్ట్ లెఫ్ట్కార్టర్లో ఎంతో ఎత్తు నుంచి దూసుకొచ్చింది. కానీ బ్రెజిల్ గోల్‌కీపర్ అలీసన్ ఎడంవైపునకు హైజంప్ చేసి కుడిచేతి పంచ్‌తో బయటికి పంపాడు. ఇలా కొరియా స్కోరు చేయాల్సిన చోట అలీసన్ అడ్డుగోడ కట్టేశాడు. 29వ నిమిషంలో రిచార్లీసన్ కొరియా డిఫెండర్లను బోల్తా కొట్టించిన తీరు అద్భుతం. ‘డి’ ఏరియాకు ముందు బంతిని హెడర్‌తో నియంత్రించిన రిచార్లీసన్ కాలితో దగ్గరే ఉన్న మార్కిన్హస్కు పాస్ చేయగా... అతను దాన్ని రఫిన్హాకు అందించాడు. ఈలోపే రిచార్లీసన్ ‘డి’ ఏరియాలోని గోల్‌పోస్ట్ ముందుకు దూసుకొచ్చాడు. రఫిన్హా వెంటనే బంతిని పాస్ చేయడంతో రిచార్లీసన్ గోల్ చేశాడు. ఇదంతా ఏడు సెకన్లలోనే జరిగిపోయింది. ఇలా అరగంటలోపే బ్రెజిల్ ఎదురే లేని ఆధిక్యం సంపాదించింది. కాసేపటికి మళ్లీ 36వ నిమిషంలో నెమార్, రిచార్లీసన్ పాస్‌లతో బంతి కొరియా ‘డి’ ఏరియాలోకి వచ్చింది. అక్కడ వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు బ్రెజిల్ స్ట్రయికర్లు కూడా వచ్చినప్పటికీ కొరియన్ డిఫెండర్లు ఈ నలుగురిని కాచుకున్నారు. అయితే అనూహ్యంగా ఆఖరుగా ‘డి’ ఏరియాలోకి ప్రవేశించిన లుకాస్... బంతి అధీనంలో ఉన్న వినిసియస్ జూనియర్‌కు చేతితో సైగ చేశాడు. వెంటనే అతను కొరియన్ డిఫెండర్ల తలపై నుంచి బంతిని లుకాస్‌కు చేరవేశాడు. అతను కొరియన్ల కాళ్ల సందుల్లోంచి బంతి ని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. ఇలా తొలి అర్ధభాగంలోనే 4–0తో మ్యాచ్‌ను ఏకపక్షంగా లాగేసిన బ్రెజిల్ రెండో అర్ధభాగంలోనూ జోరు కొనసాగించింది. 5 వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నెమార్ నిలిచాడు. గతంలో మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), షాకిరి (స్విట్జర్లాండ్), పెరిసిచ్ (క్రొయేషియా) ఈ ఘనత సాధించారు. 2 వరుసగా ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరిన రెండో జట్టు బ్రెజిల్. గతంలో జర్మనీ (1986 నుంచి 2014 వరకు) మాత్రమే ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఓవరాల్‌గా 14వసారి బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి జర్మనీ (14 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. 26 ఈసారి ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో 26 మంది ఆటగాళ్లకు ఆడే అవకాశం కల్పించింది. మొత్తం ఎంపిక చేసిన 26 మంది ఆటగాళ్లకు ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించిన తొలి జట్టుగా బ్రెజిల్ నిలిచింది. 2 గత 60 ఏళ్లలో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లోని తొలి అర్ధభాగంలోనే నాలుగు అంతకంటే ఎక్కువ గోల్స్ సాధించిన రెండో జట్టుగా బ్రెజిల్ గుర్తింపు పొందింది. గతంలో నాలుగుసార్లు చాంపియన్ జర్మనీ జట్టు మాత్రమే (2014 సెమీఫైనల్లో బ్రెజిల్‌పై ఐదు గోల్స్) ఈ ఘనత సాధించింది. -
భారత్ లో ఫుట్ బాల్ ఎందుకు పాపులర్ కాలేదు..?
-
పూర్వ వైభవంపై జర్మనీ దృష్టి
ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 109 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా బ్రెజిల్‌తో సమానంగా జర్మనీ నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిస్తే, జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే 2014లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత జర్మనీ ఆటలో తిరోగమనం కనిపిస్తోంది. 2018 ప్రపంచకప్‌లో జర్మనీ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం యూరో టోర్నీలోనూ జర్మనీ ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖతర్’లో జర్మనీ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో చెప్పలేని స్థితి. –సాక్షి క్రీడా విభాగం జర్మనీ మాజీ చాంపియన్ స్పెయిన్‌తో మ్యాచ్‌ను మినహాయిస్తే... గ్రూప్ ‘ఇ’లోని ఇతర జట్లయిన కోస్టారికా, జపాన్లపై జర్మనీ విజయం సాధిస్తే తదుపరి దశకు అర్హత పొందడం ఖాయమనుకోవాలి. గుండోగన్, జమాల్ ముసియాలా, కాయ్ హవెర్ట్, లెరాయ్, మార్కో రెయిస్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: నాలుగుసార్లు చాంపియన్ (1954, 1974, 1990, 2014). ‘ఫిఫా’ ర్యాంక్: 11. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్ లో గ్రూప్ ‘జె’ విజేత. స్పెయిన్ సమన్వయంతో ఆడటంలో స్పెయిన్ ఆటగాళ్లు సిద్ధహస్తులు. గత ఆరేళ్లలో ఆ జట్టు ఆడిన మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ తేడాతో ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ ప్రపంచకప్‌లో తమ గ్రూప్‌లో జర్మనీతో మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది. పెద్రీ, ఫెరాన్ టోరెస్, మొరాటా, సిమోన్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 7. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ విజేత. జపాన్ వరుసగా ఏడో ప్రపంచకప్‌లో ఆడుతున్న జపాన్ మూడుసార్లు గ్రూప్ దశలో నిష్క్రమించగా, మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆసియా క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో జపాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. మంగోలియాపై 14–0తో, మయన్మార్‌పై 10–0తో నెగ్గిన జపాన్ రెండో రౌండ్లో ఏకంగా 46 గోల్స్ కొట్టి కేవలం రెండు గోల్స్ సమర్పించుకుంది. మూడో రౌండ్లో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దైచి కమాడా కీలక ఆటగాడు. జర్మనీ, స్పెయిన్లతో మ్యాచ్ ఫలితాలే ఈసారి జపాన్ ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2002, 2010, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 24. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్ గ్రూప్ ‘బి’ రన్నరప్. కోస్టారికా ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కోస్టారికా అద్భుతంగా రాణిస్తే తప్ప ఈసారి గ్రూప్ దశను దాటే అవకాశాలు కనిపించడంలేదు. జర్మనీ, స్పెయిన్లలో ఒక జట్టును ఓడిస్తే తప్ప కోస్టారికా ముందుకు వెళ్లడం కష్టమే. అర్సెనల్ జట్టుకు ఆడే జోయల్ క్యాంప్‌బెల్ కీలక ఆటగాడు. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2014). ‘ఫిఫా’ ర్యాంక్: 31. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్–ఓసియానియా క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. -
Qatar 2022 FIFA World Cup: మరో ప్రపంచకప్ వచ్చేసింది!
ప్రపంచపటంలో దిగువన పసిఫిక్ మహా సముద్రం పక్కన ఒక విశ్వ క్రీడా వినోదం చివరి దశకు చేరుకుంది. అది ముగిసిన సరిగ్గా వారం రోజులకే పశ్చిమాసియాలో అరేబియన్ ద్వీపకల్పం వద్ద మరో భారీ క్రీడా సంబరానికి తెర లేవనుంది. 16 జట్ల క్రికెట్ పోరు ముగియగానే క్రీడాభిమానుల కోసం 32 జట్ల ఫుట్‌బాల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అభిమానులను ఉర్రూతలూగించే ‘ఫిఫా’ వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. గల్ఫ్ దేశం ఖతర్ తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదికగా మారింది. నవంబర్ 20న ఆతిథ్య జట్టు మ్యాచ్‌తోనే మొదలయ్యే మెగా టోర్నీ పోరు 29 రోజుల పాటు గోల్స్ గోలతో ఊపేయనుంది. ఈ నేపథ్యంలో 22వ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు... తొలి మ్యాచ్: ఖతర్ VS ఈక్వెడార్ ఫార్మాట్: 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో మిగిలిన మూడు జట్లతో ఆడతాయి. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు చొప్పున 16 టీమ్‌లు నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్) అర్హత సాధిస్తాయి. ప్రిక్వార్టర్ దశలో ఎనిమిది గ్రూప్‌ల విజేతలు ఎనిమిది గ్రూప్‌ల రన్నరప్నే ఎదుర్కొంటాయి. మొత్తం మ్యాచ్‌ల సంఖ్య: 64 (గ్రూప్ దశలో 48; నాకౌట్లో 16) ► 2022 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు 2010 డిసెంబర్ 2వ తేదీన ఖతర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రకటించింది. 2022 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం మొత్తం ఐదు దేశాలు (ఖతర్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా) పోటీపడ్డాయి. 22 మంది సభ్యులతో కూడిన ‘ఫిఫా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసింది. ఓటింగ్ రౌండ్–1లో ఆస్ట్రేలియా... రౌండ్–2లో జపాన్.. రౌండ్–3లో దక్షిణ కొరియా... ఓటింగ్ రౌండ్–4లో అమెరికా నిష్క్రమించాయి. ► 92 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఖతర్ జట్టు తొలిసారి ఆడుతోంది. గతంలో ఏనాడూ ఖతర్ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేదు. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్‌కు నేరుగా టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ► ప్రపంచకప్‌లో పోటీపడుతున్న 32 జట్లలో ఖతర్ మినహా మిగతా 31 దేశాలు గతంలో కనీసం ఒక్కసారైనా ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగాయి. 2022 ప్రపంచకప్ కోసం 2019 జూన్ 6 నుంచి 2022 జూన్ 14 వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరిగాయి. 2018 ప్రపంచకప్‌లో ఐస్లాండ్, పనామా అరంగేట్రం చేసినా ఈసారి మాత్రం కొత్త జట్లు అర్హత పొందలేకపోయాయి. ► ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్ నిలిచింది. జర్మనీ (18 సార్లు) రెండో స్థానంలో, అర్జెంటీనా (13 సార్లు) మూడో స్థానంలో ఉన్నాయి. -
రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ఒక గోల్ ఆటగాడి రక్తం కళ్ల చూసింది. ఈ ఘటన వార్సాలో జరుగుతున్న చాంపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా గ్రూఫ్-ఎఫ్‌లో రియల్ మాడ్రిడ్, షాఖ్తర్ దొనేత్సక్ల మధ్య బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి షాఖ్తర్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇవ్వడంతో రియల్ మాడ్రిడ్ గోల్ కొట్టడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆట 95వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ ఢిఫెండర్ ఆంటోనియో రూడిగర్ హెడర్ గోల్ చేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. బంతిని తలతో బలంగా కొట్టే క్రమంలో రూడిగర్ పైకి ఎగరగా.. అదే సమయంలో షాఖ్తర్ గోల్ కీపర్ అనటోలీ ట్రూబిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రూబిన్ తలభాగం రూడిగర్ నుదుటన గట్టిగా గుద్దుకుంది. అయితే అప్పటికే బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోవడంతో రియాల్ మాడ్రిడ్- షాఖ్తర్ దొనేత్సక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాము క్వార్టర్ ఫైనల్ చేరామన్న సంతోషంతో రియల్ మాడ్రిడ్ సంబరంలో మునిగిపోగా.. జట్టు ఆటగాడు రూడిగర్ తల పగిలి రక్తం కారసాగింది. అటు పక్కన ట్రూబిన్ తలకి కూడా బలంగానే తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే ఇద్దరు కాసేపు పడుకున్నారు. ఆ తర్వాత రూడిగర్, ట్రూబిన్లను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా ట్రూబిన్ తల చుట్టూ బ్యాండేజీ వేయగా.. రూడిగర్ మొహానికి 20 కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rudiger scores the equalizer 🤍 He got into an accident with Shakhtar goalkeeper, hopefully both are well.pic.twitter.com/SkFpH0X1Lb — Omar Aref 🇦🇪 (@LosB1ancos_) October 11, 2022 చదవండి: కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. దూల తీరింది! 'బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు' -
Indonesia: మైదానంలో విషాద క్రీడ
మలాంగ్(ఇండోనేషియా): ప్రపంచ క్రీడా చరిత్రలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సాకర్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు పోలీసులు సహా 125 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఓడిపోయిన జట్టు మద్దతుదారులు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ఆగ్రహావేశాలతో ఘర్షణకు దిగడం రణరంగానికి దారితీసింది. ఇండోనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ సిటీలో కంజురుహాన్ స్టేడియంలో శనివారం ఈ దారుణం జరిగింది. ఇప్పటిదాకా 125 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా ప్రేక్షకులు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భాష్పవాయువు ప్రయోగంతో అలజడి కంజురుహాన్ స్టేడియంలో తూర్పు జావాకు చెందిన అరెమా ఎఫ్ఎస్ జట్టు, సురబయాకు చెందిన పెర్సిబయా జట్టుకు మధ్య శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. 32,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వీరంతా అతిథ్య జట్టు అరెమా ఎఫ్ఎస్ మద్దతుదారులే. పెర్సిబయా జట్టు చేతిలో అరెమా జట్టు 3–2 తేడాలో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. క్రీడాకారులపై, సాకర్ అధికారులపై నీళ్ల సీసాలు, చేతిలో ఉన్న వస్తువులు విసిరారు. దాదాపు 3,000 మంది బారికేడ్లు దాటుకొని ప్రధాన మైదానంలోకి ప్రవేశించారు. అరెమా జట్టు మేనేజ్మెంట్తో ఘర్షణకు దిగారు. సొంత గడ్డపై 23 ఏళ్లుగా విజయాలు సాధిస్తున్న అరెమా టీమ్ ఇప్పుడెందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ నిలదీశారు. అరుపులు కేకలతో హోరెత్తించారు. మరికొందరు స్టేడియం బయటకువెళ్లి, అక్కడున్న పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. భాష్పవాయువు గోళాలు స్టేడియంలోకి సైతం దూసుకెళ్లాయి. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారు. బాష్పవాయువును తప్పించుకోవడానికి అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట మొదలయ్యింది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడని పరిస్థితి. స్టేడియంలోనే 34 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రులకు తరలిస్తుండగా కొందరు, చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో ఇండోనేషియా సాకర్ అసోసియేషన్ ప్రీమియర్ సాకర్ లీగ్ లిగా–1ను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే చివరి విషాదం కావాలి: జోకో విడోడో ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడం, 125 మంది మరణించడం పట్ల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇదే చివరి క్రీడా విషాదం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాటి దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రజలంతా క్రీడాస్ఫూర్తిని పాటించాలని, మానవత్వం, సోదరభావాన్ని కలిగి ఉండాలని కోరారు. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కీడ్రలు, యువజన శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు జోకో విడోడో ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా సాకర్ ప్రతిష్టకు మచ్చ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాకర్ మ్యాచ్‌లకు తాము సన్నద్ధం అవుతున్న తరుణంలో స్టేడియంలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇండోనేషియా క్రీడలు, యువజన శాఖ మంత్రి జైనుదిన్ అమాలీ చెప్పారు. ఈ ఘటన తమ దేశ సాకర్ క్రీడా ప్రతిష్టను మసకబార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మే 20 నుంచి జూన్ 11 వరకు జరిగే ఫీఫా యూ–20 ప్రపంచ కప్‌నకు ఇండోనేషియా అతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. నిజానికి ప్రపంచ సాకర్ క్రీడా సమాఖ్య ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం స్టేడియంలో బాష్పవాయువు ప్రయోగించకూడదు. దేశీయంగా జరిగే క్రీడలపై ఫిఫా నియంత్రణ లేకపోవడం కొన్నిసార్లు పరిస్థితి అదుపు తప్పుతోంది. ఆట చూసేందుకు వచ్చి అనంత లోకాలకు.. ప్రపంచ క్రీడాలో చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. మైదానాలు రక్తసిక్తమయ్యాయి. ఆట చూసి ఆనందించేందుకు వచ్చిన అభిమానులు విగతజీవులయ్యారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు. విషాదాలు కొన్ని.. 1979 డిసెంబర్ 3: అమెరికాలోని సిన్సినాటీలో రివర్‌ఫ్రంట్ మైదానంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. 1980 జనవరి 20: కొలంబియాలోని సిన్సిలెజె పట్టణంలో బుల్‌ఫైట్ కోసం తాత్కాలికంగా కర్రలతో నిర్మించిన నాలుగు అంతస్తుల స్టేడియం కూలిపోయింది. ఈ ఘటనలో 200 మంది బలయ్యారు. 1988 మార్చి 13: నేపాల్‌లోని ఖాట్మాండు స్టేడియంలో సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా వడగళ్ల వాన మొదలయ్యింది. స్టేడియంలో తొక్కిసలాట జరిగి 93 మంది చనిపోయారు. 1989 ఏప్రిల్ 15: ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌లో హిల్స్‌బరో స్టేడియంలో అభిమానుల నడుమ ఘర్షణ జరిగింది. 97 మంది మరణించారు. 1996 అక్టోబర్ 16: గ్వాటెమాలాలోని గ్వాటెమాలా సిటీలో సాకర్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్వాటెమాలా, కోస్టారికా అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 84 మంది విగత జీవులుగా మారారు. 2001 మే 9: ఘనా రాజధాని అక్రాలో స్టేడియంలో ఘర్షణ, అనంతరం తొక్కిసలాట. 120 మందికిపైగా ప్రేక్షకులు బలయ్యారు. -
ఇండోనేషియా ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట,,, దాదాపు 180 మంది మృతి
-
ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం
జకర్తా: ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగి 174 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఓటమి భరించలేక మైదానంలోకి చొచ్చుకొచ్చారు అరెమా జట్టు అభిమానులు. వారిని నిలువరించేందురు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. అదే తొక్కిసలాటకు దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం వైపు పరుగులు పెట్టిన క్రమంలో కిందపడిపోయిన కొందరు ఊపిరాడక మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇండోనేషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘోర దుర్ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 22 మంది మృతి -
బ్రిటన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంది
1911 జూలై 29 న ఆంగ్లేయులపై మనం సాకర్‌లో విజయం సాధించాం. అందుకు గుర్తుగా ఏటా ఈ రోజున ‘మోహన్ బగాన్’ డే జరుపుకుంటున్నాం. కలకత్తాలోని ‘మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్’ తరఫున మన భారత జట్టు.. ఆంగ్లేయ క్రీడాకారుల జట్టు అయిన ‘ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్’తో తలపడి ‘ఐ.ఎఫ్.ఎ. షీల్డ్’ పైనల్ మ్యాచ్‌లో నెగ్గింది. బెంగాల్ విభజనతో దేశం ఆగ్రహావేశాలతో ఉన్న సమయంలో బ్రిటిషర్లపై మనం సాధించిన ఆ ఘన విజయం.. ‘మా జన్మభూమిలో మాదే పైచేయి’ అనే బలమైన సంకేతాన్ని బ్రిటన్‌కు పంపినట్లయింది. కలకత్తాలో మ్యాచ్ జరిగింది. బెంగాల్‌తో పాటు దేశం మొత్తం ఉత్సవం జరుపుకుంది. ‘బ్రిటిష్ వాళ్లను భారత్ ఓడించింది..’ అనే విజయగర్వం ప్రతి ఒక్కరిలోనూ తొణికిసలాడింది. మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ 1889లో ప్రారంభం అయింది. క్లబ్బుకి ఆ పేరే పెట్టడానికి కారణం ఉంది. కలకత్తాలో కీర్తి మిత్రా అనే క్రీడాభిమాని బంగ్లా పేరు మోహన్ బగాన్. ఆ బంగ్లాలో, ఆనాటి బెంగాల్ ప్రముఖుల సమక్షంలో క్లబ్ ఆరంభం అవడంతో క్లబ్‌కి కూడా మోహన్‌బగాన్ అనే నామకరణం చేశారు. 1911లో ‘వస్తారా మాతో పోటీకి’ అని ఇంగ్లిష్ వాళ్లే మొదట మోహన్ బగాన్ క్లబ్బుకు సవాల్ విసిరారు. ఆ సవాల్‌ని మనవాళ్లు స్వీకరించారు. ప్రతిష్ఠాత్మక ఐ.ఎఫ్.ఎ. షీల్డ్ టోర్నమెంట్లో విజయం సాధించారు. విశేషం ఏంటంటే.. బ్రిటిష్ జట్టు బూట్లతో బరిలోకి దిగితే, బగాన్ జట్టు వట్టికాళ్లతో దిగింది. ఇప్పటి మన క్రికెటర్లు మ్యాచ్ గెలిస్తే ఒంటిపై చొక్కాలు తీసేస్తారు కదా, అప్పటి బగాన్ విజేతలు ఆనందం పట్టలేక చొక్కాలు చింపుకుని చిందులేశారు. గాంధీ–ముసోలినీ మీట్ గాంధీజీ శాంతిప్రియులు. అహింసావాది. ఇటలీ నియంత ముసోలినీ అందుకు పూర్తిగా విరుద్ధం. బ్రిటిష్ వాళ్లంటే మనకు కంపరం కదా, బ్రిటిష్ వాళ్లకే కంపరం కలిగించిన ఫాసిస్టు పాలకుడు ముసోలిని. అలాంటి వ్యక్తిని కలవడానికి గాంధీజీ బయల్దేరి వెళ్లడం.. బ్రిటన్‌కి పెద్ద షాక్. గాంధీజీకీ అసలు ముసోలిని కలిసే ఉద్దేశమే లేదు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశానికని లండన్ వెళ్లి, సమావేశం అయ్యాక ఇండియా తిరిగి వచ్చేందుకు ఇటలీ షిప్ ఎక్కారు గాంధీజీ. షిప్ రోమ్‌లో ఆగినప్పుడు పోప్‌ని కలిసేందుకు గాంధీజీ ప్రయత్నించారు కానీ కుదరలేదు. అయితే గాంధీజీని ముసోలిని కలవాలని అనుకుంటున్నారన్న కబురు వచ్చింది. ఆరోజు డిసెంబర్ 12, 1931. గాంధీజీ పక్కనే ఆయన కార్యదర్శి మహదేవ్ దేశాయ్, అంతరంగికురాలు మీరాబెన్ ఉన్నారు. ముగ్గురూ కలిసి ముసోలినీ కలిశారు. గాంధీజీ, ముసోలినీ కొద్దిసేపు భారత రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత గాంధీజీ ఇండియా వచ్చాక బ్రిటన్ పత్రికలన్నీ రగడ చేశాయి. నియంత ముసోలినిని ప్రశంసించిన గాంధీజీ అని పత్రికలన్నీ చిలవలు పలవలు చేసి ఉన్నవీ లేనివి రాశాయి. నేడు ముసోలిని జయంతి. 1883 జూలై 29న ఆయన జన్మించారు. ఇటలీ అంతర్యుద్ధంలో దేశాన్ని అధోగతిపాలు చేసినందుకు కమ్యూనిస్టులు అతడిని 1945 ఏప్రిల్ 28న కాల్చిచంపారు. ముసోలినీ మార్క్సిస్టు. తనని తను ‘అధారిటేరియన్ కమ్యూనిస్టు’ అని చెప్పుకునేవారు. (చదవండి: మహాత్ముడి మాటే మహాదేవి బాట) -
మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం
పాంప్లొనా (స్పెయిన్): అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లయెనల్ మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’తో ప్రత్యర్థి జట్టును ఠారెత్తించాడు. ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 5–0తో ఘనవిజయం సాధించగా... ఈ ఐదు గోల్స్‌ను మెస్సీ (8వ, 45వ, 47వ, 71వ, 76వ నిమిషాల్లో) ఒక్కడే చేయడం విశేషం. గతంలో దేశం తరఫున ఆడుతూ మెస్సీ ఒకే మ్యాచ్‌లో 5 గోల్స్ చేయలేదు. ఈ క్రమంలో జాతీయ జట్ల తరఫున అత్యధిక గోల్స్ (86) చేసిన క్రీడాకారుల జాబితాలో మెస్సీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. తొలి మూడు స్థానాల్లో వరుసగా క్రిస్టియానో రొనాల్డో (117 గోల్స్–పోర్చుగల్), అలీ దాయ్ (109 గోల్స్–ఇరాన్), ముఖ్తార్ దహరి (89 గోల్స్–మలేసియా) ఉన్నారు. చదవండి: Kho Kho -League: ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు -
తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ తగిలి యువ ఆటగాడి హఠాన్మరణం
కోల్‌కతా: ఆటలోనూ ఎప్పుడు ఏ పరిణామం జరిగిందో చెప్పడం కష్టం. పేదింటి బిడ్డ. ఆటను నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి ఆటగాడి జీవితాన్ని విధి వెక్కిరించింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగాల్ ఫుట్‌బాల్ యువ కెరటం దేబోజ్యోతి ఘోష్(25) మ్యాచ్ మధ్యలో గాయపడి.. ఆపై గుండె పోటుతో కన్నుమూశాడు. ఈ హాఠాత్ పరిణామంతో తోటి ఆటగాళ్లంతా కన్నీరుమున్నీరు అయ్యారు. శనివారం దుబులియా బెల్పుకూర్ గ్రౌండ్లో నబాబ్ద్వీప్ సేవక్ సమితి, కృష్ణానగర్ సెంట్రల్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఘోష్ పాల్గొన్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దేబోజ్యోతి ఫుట్‌బాల్ బలంగా తాకింది. దీంతో అతడు స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. వెంటనే మ్యాచ్ నిర్వహకులు అతడిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా వాంతులు చేసుకున్న అతన్ని.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కృష్ణానగర్ షక్రిగఢ్ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఈ లోపే అతను కన్నుమూశాడు. గుండెపోటుతోనే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దేబోజ్యోతికి బెంగాల్ ఫుట్‌బాల్ సంచలనంగా ఓ పేరుంది. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆ కుటుంబానికి అతనే ఆసరా కూడా. గతంలో సంతోష్ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా గత ఏడాది కలకత్తా ఫుట్‌బాల్ లీగ్‌లో రైల్వేస్ తరుపున దేబోజ్యోతి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇందుగానూ.. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ అధికారులు ‘కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్-2022’ కోసం అతడిని ఎంపికచేశారు. ఈలోపే అతని జీవితం విషాదంగా ముగిసింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు బిగ్ షాక్.. ఇక కష్టమే! -
ఫుట్‌బాల్ మైదానంలో బాలీవుడ్ స్టార్ వింత ప్రవర్తన
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ మైదానంలో సందడి చేశాడు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన రణ్వీర్ తన వింత ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. క్రిస్టల్ పాలెస్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ మాంచెస్టర్ సిటీ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. కాగా ఈ ప్రీమియర్ లీగ్‌కు రణ్వీర్ సింగ్ అంబాసిడర్ పాత్ర పోషించాడు. మ్యాచ్ హాఫ్ టైమ్ ముగిసిన తర్వాత రణ్వీర్ తన ఫుట్‌బాల్ నైపుణ్యం ప్రదర్శించాడు. పెనాల్టీ చాలెంజ్ పేరుతో నిర్వహించిన ఫన్ గేమ్‌లో రణ్వీర్.. తన కాలికున్న బూట్లను తీసేసి.. కేవలం తన కాళ్లతోనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అనంతరం ఫుట్‌బాల్ స్టార్స్ చేసుకునే సెలబ్రేషన్‌తో మెరిశాడు. రణ్వీర్ సింగ్ చేష్టలు అభిమానులకు కాస్త వింతగా అనిపించినా.. సూపర్‌గా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను క్రిస్టల్ ప్యాలెస్ లీగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''హాఫ్ టైమ్ పెనాల్టీ చాలెంజ్‌ను రణ్వీర్ విజయవంతంగా పూర్తి చేశాడు.. కంగ్రాట్స్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక 2017 నుంచి రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు భారత్ నుంచి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫుట్‌బాల్‌కు భారత్ నుంచి క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే అంబాసిడర్ పాత్రలో ఇంగ్లండ్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్, టోటెన్హమ్ హాట్స్పుర్ స్టేడియాలకు రణ్వీర్ సింగ్ వెళ్లి వచ్చాడు. ఇక క్రిస్టల్ ప్యాలెస్ లీగ్, మాంచెస్టర్ సిటీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు ICC Test Rankings: దుమ్మురేపిన శ్రేయాస్ అయ్యర్, బుమ్రా Cool as you like 🤣@RanveerOfficial completes the Selhurst Park half-time penalty challenge 👏#CPFC pic.twitter.com/pBj1YBwlmO — Crystal Palace F.C. (@CPFC) March 15, 2022 -
IFA Shield: రన్నరప్ శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
కోల్‌కతా: భారత్‌లో రెండో అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐఎఫ్ఏ షీల్డ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) జట్టు రన్నరప్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఈ టోర్నీలో తొలిసారి పాల్గొన్న శ్రీనిధి డెక్కన్ జట్టు 1–2 గోల్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ జట్టు చేతిలో ఓడింది. శ్రీనిధి డెక్కన్ క్లబ్ గోల్‌కీపర్ సీకే ఉబైద్కు టోర్నీ ‘ఉత్తమ గోల్‌కీపర్’ పురస్కారం లభించింది. చదవండి: నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి -
IFA Shield: ఫైనల్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
IFA Shield Football Tournament- కల్యాణి (పశ్చిమ బెంగాల్): భారత్‌లో రెండో అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐఎఫ్ఏ షీల్డ్ ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. అదనపు సమయం వరకు జరిగిన సెమీఫైనల్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రైల్వేస్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున ఫాల్గుణి సింగ్ రెండో నిమిషంలో... 118వ నిమిషంలో మల్సాజువాలా ఒక్కో గోల్ చేశారు. రైల్వే జట్టు తరఫున 14వ నిమిషంలో కెల్విన్ కెల్లీ గోల్ చేశాడు. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ 2–1తో గోకులం కేరళ జట్టును ఓడించి బుధవారం శ్రీనిధి ఎఫ్‌సీతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. చదవండి: Max Verstappen: ఆఖరి బంతికి సిక్స్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం! -
ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్‌గా ఖాలిద్ జమీల్
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్‌ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్‌గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్ ఈస్ట్ డీలాపడగా... హెడ్ కోచ్ గెరార్డ్ నుస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. -
South Asia Football Tournament: ఫైనల్లో భారత్
మాలీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. టైటిల్ పోరుకు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి బృందం 3–1తో మాల్దీవులు జట్టును ఓడించింది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన భారత్, నేపాల్ జట్లు శనివారం జరిగే ఫైనల్లో తలపడతాయి. -
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ‘డ్రా’
‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున సారథి సునీల్ చెత్రీ 27వ నిమిషంలో గోల్ చేశాడు. చెత్రీకిది 76వ అంతర్జాతీయ గోల్ కాగా, బ్రెజిల్ దిగ్గజం పీలే గోల్స్ (77) రికార్డును సమం చేయడానికి చెత్రీ కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. బంగ్లా ప్లేయర్ అరాఫత్ (74వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. రోహిత్‌కు నిరాశ ఓస్లో (నార్వే): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రోహిత్ (65 కేజీలు)కు చుక్కెదురైంది. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన బౌట్లో రోహిత్‌పై ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిన తుల్గాతుముర్ ఒచిర్ (మంగోలియా) గెలుపొం దాడు. మ్యాచ్‌లో రోహిత్ 4–10తో వెనుకబడి ఉన్న సమయంలో ఒచిర్ ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని క్షణాల పాటు పట్టి ఉంచాడు. దాంతో రిఫరీ ఒచిర్‌ను విజేతగా ప్రకటించాడు. వాస్తవానికి రోహిత్ ప్రిక్వార్టర్స్‌లో ఓడగా... అతడిని ఓడించిన జగిర్ ఫైనల్‌కు చేరాడు. దాంతో రెపీచేజ్ ద్వారా రోహిత్ కాంస్యం బరిలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ 12–2తో సెలాహట్టిన్ (టర్కీ)పై నెగ్గాడు. మహిళల 55 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో భారత రెజ్లర్ పింకీ 6–8తో నినా హెమ్మర్ (జర్మనీ) చేతిలో ఓడి పసిడి పోరుకు దూరమైంది. అయితే రెపీచేజ్ పద్ధతి ద్వారా ఆమె కాంస్యం గెలిచే అవకాశం ఉంది. మరో భారత రెజ్లర్ సంగీతా ఫోగాట్ (62 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో... పురుషుల విభాగాల్లో సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుశీల్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్‌ల్లో తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు. చదవండి: Dronavalli Harika: ఒలింపిక్ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు -
యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు సౌమ్య..
Soumya Guguloth: వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్లలో పర్యటించే భారత మహిళల సీనియర్ ఫుట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా వచ్చే నెల 2న యూఏఈతో, 4న ట్యూనిషియాతో, 10న బహ్రెయిన్‌తో, 13న చైనీస్ తైపీతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! -
ఫ్రీడం కప్ ఫుట్‌బాల్ టోర్నీ విజేత 'సఫా'
హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో స్టేడియం ఆఫ్ హోప్ వేదికగా 'సర్వింగ్ త్రూ స్పోర్ట్స్' సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీడం కప్-2021 అండర్-17 ఫుట్‌బాల్ టోర్నీలో షబ్బీర్ అలీ ఫుట్‌బాల్ అకాడమీ(సఫా) విజేతగా ఆవిర్భవించింది. ఈ సెవెన్ ఎ సైడ్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో మొత్తం 14 జట్టు పాల్గొనగా.. సఫా, సఫా-బి జట్లు ఫైనల్‌కు చేరాయి. ఫైనల్లో సఫా జట్టు సఫా-బి జట్టుపై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి, ఆడిన తొలి అండర్-17 టోర్నీలోనే విజేతగా ఆవిర్భవించింది. సఫా తరఫున ఇమ్రాన్, ఖాదర్ గోల్స్ సాధించగా.. ఇమ్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు సఫా జట్టు పెట్రా స్పోర్ట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకోగా, అనంతరం యునైటెడ్ ఎఫ్‌సీ(2-0), ఎల్ఎస్ఏ రీపర్స్(3-1) జట్లపై విజయం సాధంచి సెమీస్‌కు అర్హత సాధించింది. కీలకమైన సెమీస్‌లో సఫా జట్టు రేవన్స్ ఎఫ్‌సీపై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. కాగా, టోర్నీ విజేతగా ఆవిర్భవించిన సఫా జట్టుకు సర్వింగ్ త్రూ స్పోర్ట్స్ సంస్థ అధినేత, ముఖ్య అతిధి శ్రీకాంత్ డేవిడ్ విన్నింగ్ ట్రోఫీని బహుకరించారు. జట్టులో ఆటగాళ్లందరికీ వ్యక్తిగత మెడల్స్ బహుకరించి వారిని అభినందించారు. విన్నింగ్ ట్రోఫీని జట్టు కెప్టెన్ ఖాదర్ అందుకున్నాడు. కాగా, ఈ విషయాన్ని సఫా జట్టు ప్రధాన కోచ్ షబ్బీర్ అలీ ప్రెస్ నోట్ ద్వారా మీడియాకు వెల్లడించారు. -
భారత మహిళల ఫుట్‌బాల్ శిబిరానికి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) ఆసియా కప్ టోర్నమెంట్ సన్నాహాల కోసం భారత సీనియర్ మహిళలకు ఈనెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ థామస్ డెనర్‌బై 30 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించాడు. ఈ ప్రాబబుల్స్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల సౌమ్య గుగులోత్‌కు చోటు లభించింది. గతంలో భారత అండర్–17, అండర్–19 జట్లకు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున కూడా అరంగేట్రం చేసింది. -
Lionel Messi: రెండేళ్ల కాంట్రాక్ట్.. దాదాపు 610 కోట్లు!
పారిస్: బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌ను వీడిన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయెనల్ మెస్సీ ఇక ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్–1లో కనిపించనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. మెస్సీ ఒప్పందానికి సంబంధించి నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మెస్సీతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక ప్రకటన నేపథ్యంలో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రతిష్టాత్మక కోపా అమెరికా 2021లో అర్జెంటీనా విజయం తర్వాత సెలవుల్లో ఉన్న మెస్సీ.. క్లబ్లో చేరిన మరుసటి రోజే ఈ మేరకు ప్రకటన జారీకావడం గమనార్హం. మెస్సీతో బార్సిలోనా క్లబ్.. కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని భావించగా ఈ హఠాత్పరిణామంతో ఫ్యాన్స్ విస్మయానికి గురయ్యారు. -
ఇటలీ నవ్వింది
‘ఇట్స్ కమింగ్ హోమ్... యూరో కప్ ప్రారంభమైన రోజు నుంచి ఇంగ్లండ్ అభిమానులు ఎప్పటిలాగే ఆశలు, అంచనాలతో హోరెత్తించారు. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మేజర్ టోర్నీలో ఫైనల్ చేరడంతో వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. సొంతగడ్డపై జరిగే తుది పోరులో కచ్చితంగా తమ జట్టే గెలుస్తుందని భావించి ముందస్తు సంబరాలకు సిద్ధమైపోయారు. కానీ యూరో కప్ ఇంగ్లండ్ ఇంటికి రాలేదు. లండన్ నుంచి సుమారు వేయి మైళ్ల దూరంలోని రోమ్ నగరానికి తరలి పోయింది. పెనాల్టీ షూటౌట్ వరకు చేరిన సమరంలో సత్తా చాటిన ఇటలీ యూరప్ చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు యూరో గెలవడం ఇది రెండోసారి కాగా... ఇంగ్లండ్ తొలి టైటిల్ విజయానికి మరోసారి దూరంగా నిలిచిపోయింది. లండన్: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ యూరో కప్ –2020ని ఇటలీ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో 3–2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కూడా ముగిసిన తర్వాత ఇరు జట్లు 1–1 గోల్స్ స్కోరుతో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అంతకుముందు తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ తరఫున 2వ నిమిషంలో ల్యూక్ పాల్ షా గోల్ సాధించగా... రెండో అర్ధభాగంలో లియోనార్డో బొనుసి 67వ నిమిషంలో ఇటలీకి గోల్ అందించి స్కోరు సమం చేశాడు. తాజా విజయంతో వరుసగా 34 మ్యాచ్‌ల పాటు ఓటమి ఎరుగని ఘనతను సాధించిన ఇటలీ 1968 తర్వాత మళ్లీ యూరో ట్రోఫీని గెలుచుకుంది. మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. హోరాహోరీ... 90 వేల సామర్థ్యం గల వెంబ్లీ స్టేడియం... కరోనా కారణంగా అధికారికంగా 67 వేల మందికే అనుమతి. అయితేనేం... తమ జట్టు ఆడుతోంది కాబట్టి టికెట్ లేని వీరాభిమానులు కూడా గేట్లు బద్దలు కొట్టి పెద్ద సంఖ్యలో స్టేడియంలోకి దూసుకొచ్చారు. ఫైనల్లో తొలి 30 నిమిషాల ఆట చూస్తే స్థానిక అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసేలా కనిపించింది. ఆట ఆరంభంలోనే ట్రిప్పియర్ ఇచ్చిన హాఫ్ వాలీ క్రాస్ పాస్‌ను నేరుగా ఇటలీ గోల్ పోస్ట్‌లోకి షా పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. 1 నిమిషం 57వ సెకన్లో షా చేసిన ఈ గోల్ ఒక యూరో ఫైనల్లో అత్యంత వేగవంతమైన గోల్‌గా గుర్తింపు పొందింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇటలీ మెల్లగా కోలుకునే ప్రయత్నం చేసింది. జట్టు మిడ్ ఫీల్డర్లు చక్కటి పాస్‌లతో బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఆధిక్యం అందుకున్న తర్వాత కూడా ఇంగ్లండ్ ఆశ్చర్యకరంగా డిఫెన్స్‌కే పరిమితమైంది. ముఖ్యంగా కెప్టెన్ హ్యరీ కేన్ కనీసం ఒక్క గోల్ స్కోరింగ్ అవకాశం కూడా సృష్టించకుండా పేలవ ప్రదర్శన కనబర్చడం జట్టును దెబ్బ తీసింది. రెండో అర్ధ భాగంలో ఇటలీ శ్రమకు తగిన ఫలితం లభించింది. వెరాటీ కొట్టిన హెడర్‌ను ఇంగ్లండ్ కీపర్ పిక్‌ఫోర్డ్ అడ్డుకున్నా... సమీపంలోనే ఉన్న బొనుసి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫల మయ్యాడు. అదనపు సమయంలో మాత్రం ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలమమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందకు షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో ఇటలీ 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సాకా గోల్ చేసి ఉంటే మ్యాచ్ సడెన్డెత్కు వెళ్లేది. అయితే తొలిసారి జాతీయ జట్టు తరఫున పెనాల్టీ తీసుకున్న సాకా కొట్టిన కిక్‌ను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డొనరుమా ఎలాంటి ఆందోళన లేకుండా ఎడమ వైపునకు డైవ్ చేస్తూ కూల్‌గా ఆపడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. ఇంగ్లండ్ ప్లేయర్ సాకా కొట్టిన చివరి షాట్‌ను నిలువరిస్తున్న ఇటలీ గోల్‌కీపర్ డొనరుమా పునరుజ్జీవం... నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్... 2018లో జరిగిన ప్రపంచకప్‌కు కనీసం అర్హత సాధించలేకపోయింది. ఇటలీ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విచారకర క్షణాలవి. ప్రదర్శన పాతాళానికి పడిపోయిన జట్టును తీర్చిదిద్దే బాధ్యతను కొత్త కోచ్ రాబర్టో మన్సినీ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇటలీ ‘పునరుజ్జీవం’ పొందింది. ‘యూరో’ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడిన పది మ్యాచ్‌లలో పది కూడా గెలిచి అజేయంగా, అందరికంటే ముందుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాదే జరగాల్సిన ఈ మెగా టోర్నీ కోవిడ్ కారణంగా ఏడాది వాయిదా పడింది. ఆ సమయంలో ఇటలీ దేశం తీవ్ర క్షోభను అనుభవించింది. కరోనా కారణంగా ఆ దేశంలో ఏకంగా 1 లక్షా 27 వేల మరణాలు నమోదయ్యాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌లో ఇదే పెద్ద సంఖ్య. గత 16 నెలల్లో వివిధ రూపాల్లో లాక్డౌన్లను ఎదుర్కొన్న ఇటలీకి ‘యూరో’ కొత్త ఆరంభాన్నిచ్చింది. ఈ టోర్నీలో సొంతగడ్డ రోమ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఫైనల్‌తో కలిపి ఇటలీకి వరుసగా 34 మ్యాచ్‌లలో ఓటమి అనేదే లేదు. అసాధారణ పరిస్థితులను అధిగమించి, తమకు ఊరటనందిస్తూ సాధించిన ఈ విజయానికి యావత్ ఇటలీ పులకించిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ ముగ్గురిపై ఆగ్రహం... 19, 21, 23... ఇంగ్లండ్ తరఫున మూడు పెనాల్టీలు వృథా చేసిన బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్ఫోర్డ్ల వయసులు ఇవి. చెప్పుకోదగ్గ అంతర్జాతీయ అనుభవం లేని కుర్రాళ్లు. అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యరీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం విషాదం! అవార్డులు గోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్) క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–5 గోల్స్) గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్ ప్లేయర్) డొనరుమా (ఇటలీ) -
మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్
రోమ్: యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. కొపెన్‌హగన్ వేదికగా డెన్మార్క్, ఫిన్లాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో అంతరాయం ఏర్పడింది. 42వ నిమిషంలో ఒక్కసారిగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియాన్ ఎరిక్సన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అతన్ని వైద్య సబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. క్రిస్టియన్ కుప్పకూలడంతో మ్యాచ్‌ను రిఫరీలు రద్దుచేశారు. ఇక క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అతను స్పృహలోకి వచ్చాడని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిస్టియన్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, క్రీడా ప్రముఖలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. చదవండి: ఇటలీ శుభారంభం -
పాజిటివ్ వస్తే మ్యాచ్ రెండు రోజులు వాయిదా
జెనీవా (స్విట్జర్లాండ్): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లలోని ఏ ఆటగాడైనా కరోనా బారిన పడితే... ఆ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌ను గరిష్టంగా రెండు రోజుల పాటు వాయిదా వేసే కొత్త రూల్‌ను రూపొందించనట్లు పేర్కొంది. అంతేకాకుండా జట్టు సభ్యుల సంఖ్యను 23 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఏ జట్టయినా తన మ్యాచ్‌ను ఆడకపోతే... 0–3తో ఆ జట్టు ఓడిందని, దానికి సంబంధిచిన పూర్తి పాయింట్ల్ల (3)ను ప్రత్యర్థి జట్టుకు అందజేసేలా నిబంధనను తీసుకొచ్చారు. జూన్ 11 నుంచి జూలై 11 వరకు 31 రోజుల పాటు యూరప్‌లోని 11 నగరాల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. 24 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మ్యాచ్‌ల సందర్భంగా 25 శాతం మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. -
హైదరాబాద్ ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’
వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. 16 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ 23 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ క్లబ్ 2–1తో జంషెడ్పూర్ క్లబ్‌ను ఓడించి ఈ టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఈస్ట్ బెంగాల్ తరఫున స్టీన్మన్ (6వ ని.లో), పిలింగ్టన్ (68వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జంషెడ్పూర్ జట్టుకు హార్ట్లే (83వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై సిటీతో గోవా క్లబ్ ఆడుతుంది. -
హైదరాబాద్ ఎఫ్‌సీ మ్యాచ్ డ్రా
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు మరో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం ఏటీకే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. ఆట 54వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ 1–0తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జావో విక్టర్ గోల్‌గా మలచడంలో హైదరాబాద్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఎఫ్‌సీ ఒక మ్యాచ్‌లో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో డ్రా నమోదు చేసింది. -
నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం
వాస్కో (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు రెండో విజయం సాధించింది. ఈస్ట్ బెంగాల్ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. 33వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ సుర్చంద్ర సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో నార్త్ ఈస్ట్ జట్టు ఖాతా తెరిచింది. 90వ నిమిషంలో రోచర్జెలా చేసిన గోల్‌తో నార్త్ ఈస్ట్ విజయం ఖాయమైంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ముంబైతో ఒడిశా... గోవాతో కేరళ బ్లాస్టర్స్ తలపడతాయి. -
బెంగళూరును గెలిపించిన ఛెత్రి
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలి విజయం నమోదు చేసింది. చెనైయిన్ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 56వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌గా మలిచి బెంగళూరును 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడతుంది. -
నార్త్ఈస్ట్ యునైటెడ్ బోణీ
వాస్కోడగామా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) బోణీ కొట్టింది. ఇక్కడి తిలక్ మైదాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 1–0తో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. జట్టుకు లభించిన పెనాల్టీని 49వ నిమిషంలో గోల్‌గా మలిచిన అపియా నార్త్ఈస్ట్కు విజయం దక్కేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై... ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్‌ను ఆరంభించింది. ముఖ్యంగా అహ్మద్ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో కదులుతూ నార్త్ఈస్ట్పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్ చేయడంలో సఫలం కాలేకపోయారు. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడుతుంది. -
ప్రేక్షకులుగా ‘సెక్స్ డాల్స్’.. భారీ జరిమానా
సియోల్ : మైదానాల్లో ప్రేక్షకుల స్థానంలో సెక్స్ డాల్స్‌ను వాడినందుకుగానూ ఎఫ్‌సి సియోల్ క్లబ్‌కి, కే లీగ్ భారీ జరిమానా విధించింది. స్టాండ్స్‌లో బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్‌ను వాడి అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకుగానూ 100 మిలియన్ ఓన్(దాదాపు 61 లక్షల రూపాయలు) భారీ జరిమానాను ఎఫ్‌సి సియోల్ క్లబ్‌కి విధించింది. ('వర్షాకాలం తర్వాతే దేశంలో క్రికెట్ మొదలవ్వొచ్చు') కరోనా మహమ్మారితో ప్రేక్షకులు లేక క్రీడానిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక కనీసం టీవీల్లోనైనా మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించేవారికి ఫీల్ మిస్సవ్వకుండా ఉండటానికి గ్రౌండ్లో భారీగా అభిమానులు ఉన్నట్టు బొమ్మలతో నింపింది దక్షిణ కొరియాకి చెందిన ఎఫ్‌సి సియోల్ క్లబ్. అయితే ఆ బొమ్మలని సెక్స్ టాయ్స్‌ని తయారు చేసే ఓ సంస్థ సరఫరా చేసింది. గ్వాంగ్జు, ఎఫ్‌సీ-ఎఫ్‌సీ సియోల్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించిన ప్రేక్షకులు ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపోయారు. వాటిలో కొన్ని సెక్స్ డాల్స్ కూడా ఉండటంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్టేడియం స్టాండ్స్‌లో ఖరీదైన షోకేస్ బొమ్మలని పెట్టాలనుకున్నామని, కానీ వాటిని ఉత్పత్తి చేసే సంస్థ చేసిన తప్పిదం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని ఎఫ్‌సి సియోల్ ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్‌ను కూడా తెచ్చి, వాటికి తమ టీమ్ టీషర్టులు తొడిగి స్టేడియంలో పెట్టిందని పేర్కొంది. (గందరగోళంలో క్రీడల భవిష్యత్: కశ్యప్) దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీని బహిష్కరించినప్పటికీ, స్టాండ్స్‌లో ఉన్న కొన్ని బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్లకి ప్రచారం కల్పిస్తున్నట్టుగా ఉన్నాయి. లైవ్‌లో మ్యాచ్ చూసిన అభిమానులు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. దీంతో, ఎఫ్‌సి సియోల్ క్లబ్ తమ అభిమానులకి క్షమాపణ చెప్పింది. కాగా, ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన 2020 కే లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. కాకపొతే, త్వరితగతిన వైరస్‌ని అరికట్టామని చెబుతున్న దక్షిణ కొరియాలో ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ముందే క్రీడలకి రంగం సిద్ధం అయింది. దీంతో మే 8 వ తేదీన కే లీగ్ మొదలయింది. ఖాళీ స్టేడియం స్టాండ్లతో పాటు, ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్‌లు ధరించి, కరచాలనం చేయకూడదనే నియమం విధించారు. ఉమ్ము వేయడం, చీదడం లాంటివి చేయకూడదని, క్రీడాకారుల మధ్య సంభాషణల్ని కూడా నిషేధించారు. కాగా, ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సియోల్ ఎఫ్‌సీ 1-0తో గ్వాంగ్ఝూపై గెలిచింది. (లాక్డౌన్: విరుష్కల మరో వీడియో వైరల్) -
జర్మనీలో ఆట మొదలైంది
బెర్లిన్: దాదాపు రెండు నెలల విరామం అనంతరం యూరప్‌లో తిరిగి ఫుట్‌బాల్ ఆట మొదలైంది. కరోనా విజృంభణతో జర్మనీలో ఆగిపోయిన బుండెస్లిగా 2019–2020 సీజన్ శనివారం ప్రారంభమైంది. దాంతో యూరప్‌లో ఆరంభమైన తొలి మేజర్ టోర్నీగా బుండెస్లిగా నిలిచింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆటగాళ్లను, సిబ్బందిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటామని జర్మనీ ఫుట్‌బాల్‌లీగ్ ప్రభుత్వానికి తెలిపింది. -
సాకర్‌కు సబ్స్టిట్యూట్ల కిక్
లాసానే: ఫుట్‌బాల్‌లో సబ్స్టిట్యూట్ల కిక్ పెరగనుంది. ఇప్పటికైతే ఇది తాత్కాలికమే అయినప్పటికీ ఇకపై ఐదుగురు ఆటగాళ్లు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగే అవకాశం త్వరలోనే రానుంది. కరోనా వైరస్ తర్వాత పునఃప్రారంభమయ్యే ఫుట్‌బాల్ టోర్నీల నిబంధనల్లో ఈ కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఆటగాళ్లను గాయాల నుంచి రక్షించేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్’ నిబంధన అమలు చేయనున్నారు. దీనిపై ఫుట్‌బాల్ నియమావళి రూపకర్తలు ఈ వారంలో ఆమోదముద్ర వేసి అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది తాత్కాలిక నిబంధనే అయినప్పటికీ కరోనాతో సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగే ఫుట్‌బాలర్లకు బిజీ షెడ్యూల్లో గాయాలు కాకుండా ఇది ఎంతో ఉపయోగపడనుంది. దీనికి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం బోర్డు (ఐఎఫ్ఏబీ) శుక్రవారం ఆమోదం తెలుపనుంది. గతవారమే ఈ అంశంపై ఐఎఫ్ఏబీ సానుకూలంగా స్పందించింది. ‘ఫిఫా ప్రతిపాదించిన ఈ ఐదుగురు సబ్స్టిట్యూట్ల అంశంపై ఆలోచిస్తున్నాం. మ్యాచ్ సమయంలో మూడు సందర్భాల్లో జట్లు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. ఒక వేళ ఎక్స్ట్రా సమయానికి దారితీస్తే ఆరో వ్యక్తిని కూడా వాడుకోవచ్చు’ అని తెలిపింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ముగ్గురు సబ్‌స్టిట్యూట్‌లకు మాత్రమే అనుమతి ఉంది. 2018 నుంచి అదనపు సమయంలో నాలుగో వ్యక్తిని అనుమతిస్తున్నారు. -
మాటల్లేవ్... ప్రేక్షకులూ ఉండరు
సియోల్: రెండు నెలల విరామం అనంతరం దక్షిణ కొరియాలో ఆట మొదలుకానుంది. కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనల నడుమ శుక్రవారం నుంచి అక్కడ ‘కె–లీగ్ టోర్నీ’తో ఫుట్‌బాల్ సీజన్ ప్రారంభమవనుంది. కోవిడ్–19 సంక్షోభం తర్వాత ఆసియాలో జరుగనున్న తొలి మేజర్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. అయితే ఈ టోర్నీని ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఫుట్‌బాలర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆట సందర్భంగా సహచరులతో మాట్లాడటం, కరచాలనం, గోల్ సంబరాలు చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. టోర్నీలో భాగంగా ప్రతీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీజన్ మధ్యలో ఏ ఆటగాడికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే... ఆ ఆటగాడి జట్టుతో పాటు, ఆ జట్టుతో తలపడిన ప్రత్యర్థి జట్లు రెండు వారాల పాటు టోర్నీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. మ్యాచ్‌కు ముం దు కరచాలనానికి బదులుగా శిరస్సు వంచి మర్యాదపూర్వకంగా పలకరించాలని ఆటగాళ్లకు సూచించారు. శుక్రవారం జరుగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జియోన్‌బక్ మోటార్స్‌తో సువెన్ బ్లూవింగ్స్ ఆడతుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ఆడనున్నాయి. మైదానంలో సహచరులతో మాట్లాడకుండా పుట్‌బాల్ ఆడటం అసాధ్యమని ఇంచియోన్ యుౖ¯ð టెడ్ కెప్టెన్ కిమ్ డు–హైక్ వ్యాఖ్యానించాడు. -
కరోనా: ‘ఫుట్‌బాల్ ప్లేయర్లు చనిపోయే అవకాశం తక్కువ’
బ్రెసీలియా: ‘‘ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కరోనా సోకినా.. వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు అథ్లెట్లు. శారరీక దారుఢ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చు’’అని బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు కష్టాలు పడుతున్నారని.. వారిలో చాలా మంది తిరిగి క్రీడల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఇందులో భాగంగా బ్రెజిల్లో నిర్వహించాల్సిన ఫుట్‌బాల్ టోర్నమెంట్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. మే ప్రారంభంలో బ్రెజీలియన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా విస్తరిస్తున్న తరుణంలో టోర్నమెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు) ఈ క్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో గురువారం రేడియో గైబాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా తమ ఆరోగ్య శాఖా మంత్రి సూచించారని తెలిపారు. అదే విధంగా ఆటగాళ్లకు ఒకవేళ వైరస్ సోకినా వారి ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా బ్రెజిల్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ పరిస్థితులు చక్కబడిన తర్వాతే మ్యాచ్ నిర్వహణ గురించి ఆలోచించాలంటూ.. ఆరోగ్య శాఖ సూచనలు కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఇక బ్రెజిల్లో కరోనా మరణాలు ఆరు వేలు దాటినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సావో పౌలో ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్, 1994 ప్రపంచ కప్ విజేత రాయ్ సైతం బోల్సోనారో తీరును తప్పుబట్టారు. కరోనా సంక్షోభాన్ని కట్టడి చేయలేని అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఇక ఆది నుంచి కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తూ.. ‘‘లిటిల్ ఫ్లూ ’’అంటూ బోల్సోనారో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.(‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’) (మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్ అధ్యక్షుడు) -
లాక్డౌన్ : అన్ని దేశాలకు భిన్నంగా బెలారస్..
మానవాళిని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. కరోనా కట్టడికి నడుంబిగించి.. పటిష్ట చర్యలు అమలుచేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా లాక్‌డౌన్‌ను విధించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నాయి. బహిరంగ సమావేశాలు, పాఠశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ అని మూసివేశారు. అయితే ఒక్క దేశం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అదే బెలారస్. ఈ దేశంలో కనీసం లాక్‌డౌన్‌ను కూడా పూర్తి అమలు చేయడం లేదు. అంతేగాక ఇక్కడ విచ్చలవిడిగా అన్నీ ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు అభిమానులు కూడా వెళుతున్నారు. ఇప్పటి వరకు బెలారస్లో 2919 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. (‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’ ) కరోనావైరస్ మహమ్మారి కారణంగా బెలారస్లో ఆటలను బహిష్కరించాలనే వారి సంఖ్య పెరుగుతన్నప్పటికీ ఆదివారం బెలారసియన్ టాప్-ఫ్లైట్ లీగ్ మ్యాచ్‌కు దాదాపు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ.. నినాదాలు చేశారు. కాగా ప్రస్తుతం జాతీయ సాకర్ లీగ్ ఆడుతున్న దేశం యూరప్‌లో బెలారస్ మాత్రమే. అంతేగాకుండా ఫుట్‌బాల్‌ను బహిరంగంగా స్టేడియంలో నిర్వహించడానికి ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో నుంచి అనుమతి కూడా తీసుకుంది. (హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం కేసీఆర్) అయితే ఈ ఆటకు చాలా మంది దూరంగా ఉన్నప్పటికీ దాదాపు 1000 మందికిపైగా హాజరయ్యారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. కాగా కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెలారస్ అధికారులను కోరింది. ఈ మాటలను పెడ చెవిన పెట్టిన బెలారస్ అధ్యక్షుడు దేశంలో లాక్డౌన్ అమలును వ్యతిరేకిస్తున్నాడు. దీనికి తోడు వైరస్‌పై ప్రజలు పెంచుకుంటున్న భయాలను ‘సైకోసిస్’గా కొట్టిపారేశారు. ఆర్థిక వ్యవస్థను కొనసాగించడం ముఖ్యమని చెప్పిన అలెగ్జాండర్.. మద్యంపై కూడా నిషేధం విధించలేదు. (అక్కడ నెమ్మదించిన మహమ్మారి.. ) -
క్వారంటైన్లో నువ్వు.. బయట నేను!
మాడ్రిడ్: ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎజ్విక్వైల్ గారే (33)కు కరోనా సోకింది. లా లీగా లీగ్‌లో వెలెన్సియా తరఫున ఆడుతున్న అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గారే కరోనా బారిన పడ్డాడు. దాంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఏడాది దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’ అని గారే తెలిపాడు. స్పెయిన్ జరగాల్సిన ఉన్న లా లీగాకు కూడా కరోనా సెగ తగలడంతో దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గారేకు కరోనా వైరస్ సోకింది. స్పెయిన్‌లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 9,190 కరోనా కేసులు నమోదవగా.. అందులో 300కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.(కరోనా వైరస్ ఓ సునామీ) భార్య భావోద్వేగ ఫొటో ఎజ్విక్వైల్ గారే కరోనా బారిన పడటంతో అతని భార్య తమరా గోర్రో ఆవేదన వ్యక్తం చేశారు. గారేను ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో క్వారంటైన్ (నిర్భంధం)లో ఉంచిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కరోనా మనిద్దరికీ అడ్డుగోడలా నిలిచి సెపరేట్ చేసిందంటూ భావోద్వేగ ఫోటో పెట్టారు. అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గారే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి:గ్రాండ్ ప్రిన్సెస్’లో చిక్కుకుపోయిన 100 మంది భారతీయులు కరోనా సోకి యువ కోచ్ మృతి View this post on Instagram ❤️JUNTOS EN LA DISTANCIA❤️ (Eze lleva mascarilla por recomendación médica) #mamamolona #quedateencasa #otroreto #👑 A post shared by Tamara Gorro (@tamara_gorro) on Mar 16, 2020 at 5:07am PDT -
31 వరకు దేశంలో ‘నో’ ఫుట్‌బాల్
న్యూఢిల్లీ: దేశంలో జరిగే అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఈ నెల 31 వరకు రద్దు చేస్తూ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం నిర్ణయం తీసుకుంది. దాంతో ఐ–లీగ్, డివిజన్–2, యూత్ లీగ్, గోల్డెన్ లీగ్, జాతీయ టోర్నీలు రద్దయ్యాయి. ఐ–లీగ్‌లోని 28 మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని ఏఐఎఫ్ఎఫ్ తొలుత అనుకున్నా... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ నెల చివరి వరకు దేశంలో ఎటువంటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని నిర్ణయించింది. -
తెలంగాణ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: వెటరన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో శనివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తెలంగాణ ఎలెవన్ 3–1తో వెస్ట్ బెంగాల్ జట్టుపై గెలుపొందింది. తెలంగాణ ప్లేయర్లు ఖలీల్ రహ్మాన్ (10వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... శ్రీనివాస్ (25వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. బెంగాల్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సుభాశ్ (27వ నిమిషంలో) వేశాడు. ఈ మ్యాచ్‌లో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి, మాజీ భారత ఫుట్‌బాల్ ప్లేయర్ జి.పి ఫాల్గుణ తెలంగాణ జట్టు తరఫున బరిలో దిగారు. -
హైదరాబాద్ ఎఫ్‌సీ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు
సాక్షి, హైదరాబాద్: తాజా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ సీజన్లో వరుస ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్ జట్టు తమ హెడ్ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు వేసింది. సీజన్‌లోని తదుపరి మ్యాచ్‌లకు ఆయనతో కలిసి పనిచేయడం లేదంటూ శనివారం ఒక ప్రకటన చేసింది. యాజమాన్యం, కోచ్ కలిసి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హైదరాబాద్ కోచ్‌గా ఫిల్ అందించిన సేవలకు క్లబ్ తరఫున నుంచి అతడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్లో మేము కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఫిల్ జట్టును నడిపిన తీరు అభినందనీయం. అతని భవిష్యత్తు గొప్పగా సాగాలని ఆశిస్తున్నాం’ అంటూ హైదరాబాద్ జట్టు సహ యజమాని వరుణ్ త్రిపురనేని ఆ ప్రకటనలో తెలిపారు. పుణే స్థానంలో ఐఎస్ఎల్ ఆరో సీజన్లో ఘనంగా అరంగేట్రం చేసిన హైదరాబాద్... ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోగా... మిగిలిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓడి టేబుల్ చివరి స్థానంలో ఉంది. -
బెంగళూరును గెలిపించిన సునీల్ చెత్రి
బెంగళూరు: ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్‌తో (59వ, 84వ నిమిషాల్లో) మెరిశాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో గోవాపై నెగ్గింది. గోవా తరఫున హ్యూగో (61వ నిమిషంలో) గోల్ సాధించాడు. నేటి మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో అట్లెటికో డి కోల్‌కతా తలపడుతుంది. -
హైదరాబాద్ ఖాతాలో ఏడో పరాజయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్–6 ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు ఓటములను ఖాతాలో వేసుకున్న హైదరాబాద్... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 1–2 గోల్స్ తేడాతో ముంబై చేతిలో ఓడింది. దీంతో టోరీ్నలో ఏడో పరాభవాన్ని మూట గట్టుకుంది. ముంబై ఆటగాడు సౌగౌ (6వ, 78వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధిం చాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బోబో (81వ నిమిషంలో) చేశాడు. నాలుగు రోజుల విరామం తర్వాత జనవరి 3వ తేదీన బెంగళూరు ఎఫ్‌సీతో ఎఫ్‌సీ గోవా తలపడుతుంది. -
బెంగళూరుపై కోల్‌కతా గెలుపు
కోల్‌కతా: క్రిస్మస్ పర్వదినాన అట్లెటికో డి కోల్‌కతా జట్టు సంబరాల్లో మునిగి తేలింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో అట్లెటికో తొలిసారి బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. ఐఎస్ఎలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మాజీ చాంపియన్ అయిన అట్లెటికో జట్టు 1–0తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీపై గెలుపొందింది. మ్యాచ్ మొత్తం మీద అన్ని విభాగాల్లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు జట్టే ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ విజయం మాత్రం అందుకోలేకపోయింది. మ్యాచ్ 47వ నిమిషంలో డేవిడ్ విలియమ్స్ చేసిన గోల్‌తో అట్లెటికో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్లెటికో (18 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. -
మళ్లీ ఓడిన హైదరాబాద్
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు ఆరో ఓటమి చవిచూసింది. ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో ఓడింది. ఒడిశా తరఫున డెల్గాడో (27వ ని.లో), జిస్కో హెర్నాండెజ్ (41వ ని.లో), పెరెజ్ (71వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. హైదరాబాద్ జట్టుకు బోబో (65వ ని.లో), రోహిత్ (89వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. -
చాంపియన్ భారత్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్ మెరిసింది. భూటాన్‌లో జరిగిన ఈ టోరీ్నలో విజేతగా నిలిచి 9 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. థింపూలోని చలిమితాంగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా 5–3తో బంగ్లాదేశ్‌పై టైబ్రేక్‌లో విజయం సాధించింది. భారత్ తరఫున షెల్లీదేవి, నిషా, పూరి్ణమ కుమారి, అమీషా, బబినా దేవి గోల్ చేయడంలో సఫలీకృతమయ్యారు. బంగ్లా జట్టు తరఫున నస్రీన్, సప్నా రాణి, రూమీ అక్తర్ తలా ఓ గోల్ సాధించారు. అంతకుముందు లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిలో గెలుపొంది మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలిచింది. సుమతి కుమారి (7వ ని.), లిండా కోమ్ (38వ ని.) చెరో గోల్ సాధించగా... ప్రియాంక (56వ ని., 66వ ని.,) రెండు గోల్స్‌తో చెలరేగింది. నేపాల్ జట్టు తరఫున మోన్ మయా దామయ్ (66వ ని.) ఒక గోల్ చేసింది. రెండో మ్యాచ్‌లో భారత్ 10–1తో భూటాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో సాయి సాంకే ( 63వ ని., 64వ ని., 72వ ని.,) మూడు గోల్స్‌తో విజృంభించగా... కిరణ్ (15వ ని., 21వ ని.), లిండా కోమ్ (19వ ని., 54వ ని.), సుమతి కుమారి (24వ ని., 86వ ని.) తలా రెండు గోల్స్ సాధించారు. ప్రియాంక (8వ ని.) ఒక గోల్ చేసింది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. అమీషా (భారత్), సప్నా రాణి (26వ ని.) చెరో గోల్ నమోదు చేశారు. ఈ టోర్నీలో భారత జట్టుకు హైదరాబాద్‌కు చెందిన మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడు, ఎస్బీఐ జట్టు ఫుట్‌బాల్ కోచ్ జీపీ ఫల్గుణ డిప్యూటీ మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ అలీ రఫత్ విజేతగా నిలిచిన భారత జట్టును అభినందించారు. -
అదే నా విజన్: నీతా అంబానీ
ముంబై: దేశంలో లక్షల సంఖ్యలో చిన్నారులను తమకు నచ్చిన క్రీడలకు పరిచయం చేయడమే తన విజన్ అని ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్(ఎఫ్ఎస్డీఎల్) చైర్పర్సన్ నీతా అంబానీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఐఎస్ఎల్ (ఇండియన్ సూపర్ లీగ్)వేదికను ఉపయెగించుకోవాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనిలో భాగంగా అండర్-17, అండర్-12 స్థాయిలో అమ్మాయిలకు టోర్నీలు నిర్వహించేందుకు తలపెట్టినట్లు నీతా పేర్కొన్నారు. 2019-20 సీజన్లో అండర్-17, అండర్-12 స్థాయి ఫుట్‌బాల్ లీగ్‌ను ప్రవేశపెట్టనున్నామన్నారు. అండర్-17 గర్ల్స్ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొంటాయని, ఇందులో వందకు మందికి పైగా క్రీడాకారిణులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. 2020లో అండర్-17 మహిళల ఫిఫా వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అప్పటిలోగా ప్లేయర్ల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఎఫ్ఎస్డీఎల్ పని చేయనున్నట్లు తెలిపారు. మరొకవైపు తొలి విడతలో కేవలం మూడు రాష్ట్రాల చిల్డ్రన్స్ లీగ్‌లు మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో 12 రాష్ట్రాలకు దాన్ని విస్తరిస్తామని నీతా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ముంబైలో జరిగిన సమావేశంలో నీతా అంబానీతో పాటు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)క్లబ్ యాజమానుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అక్షయ్ టాండన్, విజయ్ మద్దూరి, పార్థ్ జిందాల్, సంజయ్ గుప్తా, చిరంజీవి, జాన్ అబ్రహం, ప్రపుల్ పటేల్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, సంజయ్ గోయెంకా, అనిల్ శర్మ, చాణక్య చౌదరిలు హాజరయ్యారు. -
ఆఖరి స్థానంతో సరి
అహ్మదాబాద్ : సొంతగడ్డపై జరుగుతున్న ఇంటర్ కాంటినెంటల్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు ఆఖరి స్థానంలో నిలిచింది. సిరియా జట్టుతో మంగళవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 18వ నిమిషంలో నరేందర్ గహ్లోత్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 78వ నిమిషంలో ఫిరాస్ గోల్‌తో సిరియా జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో 2–4తో తజికిస్తాన్ చేతిలో... రెండో మ్యాచ్‌లో 2–5తో ఉత్తర కొరియా చేతిలో ఓడింది. ఓవరాల్‌గా ఒక పాయింట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన తజికిస్తాన్, ఉత్తర కొరియా జట్లు శనివారం జరిగే ఫైనల్లో తలపడతాయి. -
భారత్‌కు మూడో స్థానం
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లో జరిగిన కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు మూడో స్థానాన్ని సంపాదించింది. ఈ టోర్నీలో శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది. భారత్ నమోదు చేసిన ఏకైక గోల్‌ను ఆట 17వ నిమిషంలో అనిరుధ్ థాపా చేశాడు. కొత్త కోచ్ ఇగోర్ స్టిమాక్ పర్యవేక్షణలో భారత్‌కిదే తొలి అంతర్జాతీయ విజయం. -
చాంపియన్స్ లీగ్ విజేత లివర్‌పూల్
మాడ్రిడ్: మేటి యూరోపియన్ క్లబ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో లివర్‌పూల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం మాడ్రిడ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో లివర్‌పూల్ (ఇంగ్లండ్) 2–0 గోల్స్ తేడాతో టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. లివర్‌పూల్ తరఫున మొహమ్మద్ సలా (2వ నిమిషంలో), డివోక్ ఒరిగి (87వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. విజేతగా నిలిచిన లివర్‌పూల్ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 147 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. చాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడం లివర్పూల్కిది ఆరోసారి. గతంలో ఆ జట్టు 1977, 1978, 1981, 1984, 2005లలో విజేతగా నిలిచింది. -
అలా పిలవొద్దు!
ఒక మనిషి మీద ఏదైనా ముద్ర పడితే అదే చట్రంలోంచి ఆ వ్యక్తిని చూడటం సమాజానికి అలవాటు. ఒకసారి ఈ చట్రంలో ఇరుక్కున్నాక ఆ ముద్ర నుంచి బయటపడటం చాలా కష్టం. కశ్మీరీ యువతి అఫ్షాన్ ఆషిక్ ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తోంది. స్టోన్ పెల్టర్ గా సమాజం వేసిన ముద్రను చెరిపేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా తనను తాను నిరూపించుకోవాలనుకుంటోంది. దేశానికి ప్రాతినిధ్యం వహించి తనపై పడిన ముద్రను శాశ్వతంగా తుడిచేసుకోవాలని ఆరాటపడుతోంది.రెండేళ్లు వెనక్కు వెళితే 2017, డిసెంబర్ లో అఫ్షాన్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ ఫొటో ఆమె జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. ఆమె గురించి అందరికీ తెలిసేలా చేసింది. ‘ఆ సంఘటన తర్వాత నా జీవితం ఒకేలా లేదు. మంచికో, చెడుకో ప్రజలు నన్ను గుర్తు పడుతున్నార’ని అఫ్షాన్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది. ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులపైకి వీరావేశంతో రాళ్లు విసురుతున్న ఆమె ఫొటో అప్పట్లో ప్రసారసాధనాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరిగింది. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ’స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. దీని నుంచి బయటపడేందుకే ఆమె పోరాటం చేస్తోంది.తన స్థానంలో అప్పుడు ఎవరున్నా అలాగే చేసుండేవారని అఫ్షాన్ ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంది. తాను స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా మాత్రమే రాళ్లు రువ్వానని సైన్యానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసింది. ‘‘రెండేళ్ల క్రితం జరిగిన ఘటన ఇంకా నా కళ్ల ముందు కదలాడుతోంది. పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. మా విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. నా మీద వేసిన ఈ ముద్రను దయచేసి తొలగించండి’’ అంటూ అఫ్షాన్ వేడుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత నెల రోజులు ఆమె ఇంటికే పరిమితమైంది. తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆటకు దూరమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘‘పోలీసులపై నేను రాళ్లు విసిరిన విషయం మా నాన్నకు రెండు నెలల తర్వాత తెలియడంతో నన్ను కట్టడిచేశారు. నెలరోజుల పాటు కాలు బయట పెట్టకుండా చేయడంతో ఫుట్ బాల్ ఆడలేకపోడం నన్ను ఎంతోగానో బాధ పెట్టింది. ఒకరోజు భోజనం చేస్తుండగా నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాన’’ని చెప్పుకొచ్చింది. జమ్మూకశ్మీర్ క్రీడల శాఖ కార్యదర్శి ఆమెకు దన్నుగా నిలవడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. పోలీసులపై రాళ్లు విసిరిన విషయం తెలిసినప్పటికీ ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారని అఫ్షాన్ వెల్లడించింది. ‘‘ఈ ఘటన జరిగిన తర్వాత నన్ను ఎవరూ గుర్తు పట్టరన్న నమ్మకంతో శిక్షణకు వెళ్లాను. క్రీడల శాఖ కార్యదర్శి నా దగ్గరకు వచ్చి ‘సోషల్ మీడియాలో నువ్విప్పుడు పాపులర్ అయిపోయావ్’ అని చెప్పడంతో నేనేం చేశానని ఎదురు ప్రశ్నించాను. నాకేమీ తెలియదని బుకాయించాను. ‘నువ్వేమీ భయపడకు. నీకు అండగా నేనుంటాను. అసలేం జరిగిందో మీడియాతో చెప్పమనడం’తో ఒప్పుకున్నాను. నాకు ఆయన అండగా నిలిచార’’ని అఫ్షాన్ గుర్తు చేసుకుంది. 24 ఏళ్ల అఫ్షాన్ ఆషిక్ ప్రస్తుతం ముంబైలో క్రీడాజీవితం కొనసాగిస్తోంది. తాజాగా జరుగుతున్న భారత మహిళల లీగ్(ఐడబ్ల్యూఎల్)లో కొల్హాపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గతేడాది జమ్మూకశ్మీర్ జట్టుకు ఆడిన ఆమె కోచ్ సత్పాల్ సింగ్ సూచన మేరకు కొల్హాపూర్ టీమ్‌లో చేరింది. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ముంబైరావడానికి ముందు శ్రీనగర్ లో ఫుట్ బాల్ కోచ్ గానూ అఫ్షాన్ వ్యవహరించింది. స్వంతంగా యూనిక్ ఫుట్ బాల్ గాల్స్ పేరుతో స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి దాదాపు 150 మంది బాలికలకు ఆట నేర్పించింది.దీనికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. బాలికలకు ఓపెన్ గ్రౌండ్ ఇవ్వడానికి స్థానిక ఫుట్‌బాల్ అసోసియేషన్ ఒప్పుకోలేదు. అఫ్షాన్ పట్టు వదలపోవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్ లోని టీఆర్సీ మైదానంలో బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు సర్కారు నుంచి అనుమతి సాధించింది. ముంబై నుంచి తిరిగొచ్చేయాలని తన దగ్గర ఆట నేర్చుకుంటున్న బాలికలు అడుగుతుంటారని అఫ్షాన్ తెలిపింది. తన సహచర కోచ్ మసూద్ ప్రస్తుతం వీరికి శిక్షణ ఇస్తున్నాడని చెప్పింది.ఫుట్ బాలర్‌గా మారిన స్టోన్ పెల్టర్ గా తనను వర్ణించడాన్ని అఫ్షాన్ అస్సలు ఒప్పుకోదు. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగానే తనను గుర్తించాలని ఆమె ఆరాటపడుతోంది. ‘‘ఎవరైనా నన్ను స్టోన్ పెల్టర్ అని పిలిస్తే కాదని గొంతెత్తి ఆరవాలనిపిస్తుంది. నేను గోల్ కీపర్‌ని. ఫుట్ బాల్ ఆడేటప్పడు బాగా త్రో చేయగలను. ఏదో ఒకరోజు ఫుట్‌బాల్ క్రీడాకారిణిగానే నన్ను అందరూ గుర్తు పెట్టుకుంటార’’ని అఫ్షాన్ అభిలషించింది. ఆమె అనుకున్నట్టుగా జరగాలని మనమంతా కోరుకుందాం. – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
ఆస్ట్రోపార్క్ అపోలో జట్టుకు 3 టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: ఎఎఫ్సీ గ్రాస్రూట్స్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆస్ట్రోపార్క్ అపోలో జట్టు సత్తా చాటింది. హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో ఆస్ట్రోపార్క్ జట్టు 3 టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–9, 11, 13 విభాగాల్లో ఆస్ట్రోపార్క్ జట్టు విజేతగా నిలిచింది. అండర్–9 ఫైనల్లో ఆస్ట్రోపార్క్ 1–0తో సెంట్రల్ పార్క్ (కొంపల్లి)పై నెగ్గగా... అండర్–11 విభాగంలో 4–0తో టర్ఫ్సైడ్ జూబ్లీహిల్స్ జట్టును ఓడించింది. అండర్–13 కేటగిరీలో సెంట్రల్ పార్క్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్–15 కేటగిరీలో టర్ఫ్సైడ్ ‘ఎ’ జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను అందుకుంది. టర్ఫ్సైడ్ ‘బి’ జట్టు రన్నరప్‌లుగా నిలిచాయి. గ్రాస్రూట్స్ డే వేడుకల్లో 5 నుంచి 15 ఏళ్లలోపు వయస్సున్న వర్ధమాన ఫుట్‌బాలర్లు 100 మంది పాల్గొన్నారు. -
ఇలాంటి గిఫ్ట్ కూడా ఇస్తారా..?
చిన్నప్పుడు ఆటల పోటీల్లో నెగ్గితే ఏ గిఫ్ట్ ఇచ్చేవారు.. ఏ గ్లాసో.. స్టీల్ గిన్నెనో ఇచ్చేవారు. ఇప్పుడైతే కార్పొరేట్ చదువులు కాబట్టి ఓ షీల్డ్.. మెడల్ ఇస్తున్నారు. ఇంకా ఏం గిఫ్ట్‌లు ఇచ్చేవారు. ఓసారి గుర్తు తెచ్చుకోండి.. మహా అయితే ప్రైజ్‌మనీ ఇస్తారు. పెరూలోని జూలియాకా అనే పట్టణంలో మాత్రం ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగని బహుమతి అందజేస్తారు. అక్కడ ఏటా జరిగే ఫుట్సల్ ఫుట్‌బాల్ టోర్నీలో శవపేటికను గెలిచిన జట్టుకు ఇస్తారు. అది కూడా అలాంటిలాంటి పేటిక కాదండోయ్.. దాదాపు రూ.1 లక్ష విలువైన దాన్ని ఇస్తుంటారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి అంతకన్నా తక్కువ విలువైన శవపేటికను బహుమతిగా ఇస్తారు. ఈ పోటీల్లో దాదాపు 12 జట్లు హోరాహోరీగా పాల్గొని చివరకు శవపేటికను తీసుకెళ్తారు. జట్టు సభ్యులు భుజాలపై ఎత్తుకుని పాటలు పాడుకుంటూ ఆట మైదానం మొత్తం తిరుగుతుంటారు. అయితే పేటికను జట్టు సభ్యులు ఎలా పంచుకుంటారో తెలియదు.. బహుశా దాన్ని అమ్ముకుని వచ్చిన డబ్బును పంచుకుంటారేమో. పెరూలోని పునో ప్రాంతంలో శవపేటికల వ్యాపారం ఎక్కువగా జరుగుతుందట. అందుకే దానికి గుర్తుగా ఇలా బహుమతులుగా ఇస్తుంటారని ఆట నిర్వాహకులు చెబుతుంటారు. -
ఒలింపిక్స్ అవకాశాలు గల్లంతు!
మాండలే : ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మూడో దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు విఫలమైంది. మంగళవారం మయన్మార్‌తో జరిగిన ఈ మ్యాచ్ 3–3తో డ్రాగా ముగిసింది. ఫలితంగా టోర్నీనుంచి నిష్క్రమించిన జట్టు ఒలింపిక్స్ అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోయింది. గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిస్తే భారత్ ముందంజ వేసేది. ఈ గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 7 పాయింట్లతో భారత్, మయన్మార్ సమంగా ఉన్నా గోల్స్ తేడాతో (4–8) మయన్మార్ అగ్రస్థానం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సంధ్య రంగనాథన్ (10వ నిమిషం), సంజు (32వ ని.), రత్నబాల దేవి (64వ ని.) గోల్స్ సాధించగా... మయన్మార్ తరఫున విన్ టున్ హ్యాట్రిక్ (17వ ని., 21వ ని., 72వ ని.) గోల్స్ కొట్టింది. మ్యాచ్ 76వ నిమిషంలో చెలరేగిపోయిన సంజు గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా... మయన్మార్ గోల్ కీపర్ మే వే అద్భుతంగా అడ్డుకుంది. -
ఎదురులేని భారత్
బిరాట్‌నగర్ (నేపాల్): తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ భారత మహిళల జట్టు దక్షిణాసియా (శాఫ్) ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వరుసగా ఐదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4–0తో ఘనవిజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో దలీమా చిబ్బెర్ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌కు 22వ, 37వ నిమిషాల్లో ఇందుమతి రెండు గోల్స్ అందించిది. విరామ సమయానికి భారత్ 3–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మ్యాచ్ చివరి నిమిషాల్లో మనీషా గోల్ అందించడంతో భారత్ 4–0తో విజయా న్ని ఖాయం చేసుకుంది. రెండో సెమీఫైనల్లో ఆతిథ్య నేపాల్ 4–0తో శ్రీలంకను ఓడించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో నేపాల్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఇప్పటివరకు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ (2010, 2012, 2014, 2016) నాలుగుసార్లు జరుగగా... నాలుగుసార్లూ భారత్‌కే టైటిల్ లభించింది. -
గోల్కొండ, అబ్బాస్ యూనియన్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ ప్రీమియర్ కప్ టోర్నమెంట్లో గోల్కొండ ప్రభుత్వ హైస్కూల్, అబ్బాస్ యూనియన్, శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ జట్లు సత్తా చాటాయి. బుధవారం జరిగిన ఫైనల్లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఏకపక్షంగా సాగిన అండర్–18 కేటగిరీ టైటిల్ పోరులో అబ్బాస్ యూనియన్ ఎఫ్‌సీ 4–0తో అథ్లెటికో హైదరాబాద్ జేఎఫ్ఏ జట్టుపై ఘనవిజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో చాంపియన్ ఫుట్‌బాల్ అకాడమీ వాకోవర్ ఇవ్వడంతో స్కైకింగ్స్ ఎఫ్‌సీ జట్టు ఆ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు అండర్–15 బాలుర ఫైనల్లో గోల్కొండ ప్రభుత్వ స్కూల్ 1–0తో డెక్కన్ బ్లాస్టర్స్ జట్టును ఓడించింది. విజేత జట్టులో ఇబ్రహీం ఖాన్ ఒక గోల్ చేసి జట్టును గెలిపించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ 5–4తో ఫరీద్ ఫుట్‌బాల్ అకాడమీపై గెలుపొంది మూడోస్థానంలో నిలిచింది. అండర్–13 బాలుర ఫైనల్లో శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ 2–1తో యునైటెడ్ స్టడ్స్ ఎఫ్‌సీని ఓడించి విజేతగా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మొహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ అలీ రఫత్, కార్యదర్శి జీపీ ఫల్గుణ, శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ కేటీ మహీ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ ఫైనల్స్‌కు హైదరాబాద్ ఎఫ్‌సీ అర్హత
సాక్షి, హైదరాబాద్: రెడ్‌బుల్ నెమార్ జూనియర్స్ ఫైవ్–ఎ–సైడ్ క్వాలిఫయింగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్‌సీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బేగంపేట్‌లోని హాట్పుట్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటిన హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్‌సీ జట్టు ‘నేషనల్ ఫైనల్స్’కు అర్హత సాధించింది.ఈ టోర్నీకి అర్హత సాధించడం హైదరాబాద్‌కిది నాలుగోసారి. హైదరాబాద్ అంచె క్వాలిఫయింగ్ పోటీల్లో మొత్తం 126 జట్లు పాల్గొనగా... ఫైనల్లో హైదరాబాద్ 1–0తో ఐటీటీఐ జట్టుపై గెలుపొందింది. గతేడాది హైదరాబాద్ జట్టు నేషనల్ చాంపియన్‌గా నిలిచి వరల్డ్ ఫైనల్స్‌లో కూడా పాల్గొంది. నేషనల్ ఫైనల్స్ కోసం జనవరి 19 నుంచి మార్చి 10 వరకు దేశం లోని 15 ప్రధాన నగరాల్లో అర్హత పోటీలను నిర్వహించారు. ముంబై, పుణే, అహ్మదాబాద్, గోవా, ఢిల్లీ, జైపూర్, చండీగఢ్, గువాహటి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ఐజ్వాల్, షిల్లాంగ్ నగరాల్లో నిర్వహించిన క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఏప్రిల్‌లో జరుగనున్న నేషనల్ ఫైనల్స్‌లో పాల్గొంటాయి. అక్కడ సత్తా చాటిన జట్లు బ్రెజిల్ వేదికగా జూలైలో జరుగనున్న వరల్డ్ ఫైనల్స్‌కు చేరతాయి. -
రయ్యాన్ ఆరు గోల్స్...
సాక్షి, హైదరాబాద్: స్కూల్ ఇండియా కప్ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర ఆటగాడు రయ్యాన్ బిన్ సొహైల్ గోల్స్ వర్షం కురిపించాడు. వరుసగా ఆరు గోల్స్‌తో చెలరేగి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఫలితంగా స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 6–1తో ఛత్తీస్‌గఢ్‌పై ఘనవిజయం సాధించింది. నెమ్మదిగా మ్యాచ్‌ను ఆరంభించిన తెలంగాణ క్రమక్రమంగా పుంజుకుంది. మ్యాచ్ 27వ నిమిషంలో రయ్యాన్ చేసిన తొలి గోల్‌తో తెలంగా ణ ఖాతా తెరిచింది. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో రెండు నిమిషాల్లోనే ఛత్తీస్‌గఢ్ ఆటగాడు ఎం. కృష్ణ గోల్ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. తర్వాత ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడటంతో తొలి అర్ధభాగం 1–1తో ముగిసింది. రెండో అర్ధభాగంలో రయ్యన్ విజృంభించాడు. వరుసగా ఐదు గోల్స్‌తో ప్రత్యర్థి్థకి ముచ్చెమటలు పట్టించాడు. మ్యాచ్ 43వ నిమిషంలో నవీన్ అందించిన పాస్‌ను రయ్యాన్ అద్భుతమైన హెడర్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో తెలంగాణ 2–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత 53వ, 59వ, 66వ, 70వ నిమిషాల్లో రయ్యాన్ గోల్స్ చేసి జట్టుకు ఘనవిజయం అందించాడు. అద్భుత ప్రదర్శనతో చెలరేగిన రయ్యాన్ బిన్ సొహైల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. నేడు జరిగే తొలి సెమీస్‌లో పంజాబ్‌తో తెలంగాణ... రెండో సెమీస్‌లో హరియాణాతో పశ్చిమ బెంగాల్ తలపడతాయి. -
రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా సొహైల్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ ఇండియా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర స్కూల్స్ టీమ్‌ను బుధవారం ప్రకటించారు. ఈ జట్టుకు వీనస్ హైస్కూల్‌కు చెందిన రయ్యన్ బిన్ సొహైల్ కెప్టెన్‌గా, కేవీఎస్‌కు చెందిన వినీత్ పాండే వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. మేనేజర్‌గా ఎంఏ మనన్ మిరాజ్, కోచ్‌గా సయ్యద్ హసన్ నవాజ్ వ్యవహరించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఈనెల 15 నుంచి 21 వరకు స్కూల్ ఇండియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ జరుగుతుంది. జట్టు వివరాలు: అబ్బాస్ హుస్సేన్ (సెయింట్ మేషమ్ హైస్కూల్), మొహమ్మద్ ఇబ్రహీం, అబ్దుల్ సత్తార్, ఇంతియాజ్ అహ్మద్, మొహమ్మద్ ఇబ్రహీం ఖాన్ (గోల్కొండ స్కూల్), ఒమ్రాన్ కసాడి (స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్), డి. నవీన్, ఎస్. శ్రీకాంత్ (కుల్సుంపురా ప్రభుత్వ పాఠశాల), నిఖిత్ (ఆల్‌సెయింట్స్ హైస్కూల్), రయ్యన్ బిన్ సొహైల్ (వీనస్ హైస్కూల్), వినీత్ పాండే, ఆర్యమన్ యాదవ్ (కేవీఎస్, హకీంపేట్), ప్రదీప్ (ఉషోదయ హైస్కూల్), హంజా ఇబ్రహీం అలీ (గ్రీన్విచ్ అకాడమీ), అలీ అక్బర్ (ఫోకస్ హైస్కూల్), షరీఖ్ ముసద్దిక్ (ఇన్సైట్ ఇంటర్నేషనల్ స్కూల్), అబ్దుల్ రహమాన్ బిన్ (గుడ్ ఫెయిత్ హైస్కూల్), సయ్యద్ ఒమర్ అలీ (ది ప్రోగ్రెస్ హైస్కూల్). -
చాంపియన్ ఆగాఖాన్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: స్కూల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎస్ఎఫ్ఎల్)లో ఓక్రిడ్జ్ (గచ్చిబౌలి), ఆగాఖాన్ అకాడమీ, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు సత్తా చాటాయి. రెండు నెలల పాటు జరిగిన ఈ టోర్నీలో ఆసాంతం రాణించిన ఈ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. అండర్–13 కేటగిరీలో ఓక్రిడ్జ్, అండర్–15 విభాగంలో ఆగాఖాన్ అకాడమీ, అండర్–18 స్థాయిలో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు చాంపియన్కప్ ట్రోఫీలను కైవసం చేసుకున్నాయి. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరిగిన అండర్–13 బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ 2–1తో ఫ్యూచర్కిడ్స్పై గెలుపొందింది. అండర్–15 టైటిల్‌పోరులో ఆగాఖాన్ అకాడమీ 4–0తో ఫ్యూచర్కిడ్స్ను చిత్తుగా ఓడించింది. లీగ్ పద్ధతిలో జరిగిన అండర్–18 బాలుర పోటీల్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పోటీల్లో భాగంగా ఆగాఖాన్ అకాడమీ, ఓక్రిడ్జ్ గచ్చిబౌలి, గోల్కొండ స్కూల్లతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రీనిధి జట్టు గెలుపొందింది. ఈ కేటగిరీలో గోల్కొండ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. అండర్–18 స్థాయిలో సాహిల్ (ఆగాఖాన్) గోల్డ్ గ్లోవ్ అవార్డును అందుకోగా, కల్యాణ్ (శ్రీనిధి) గోల్డెన్ బూట్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ధ్రువ్ (శ్రీనిధి) ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. టోర్నీలో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా ఎస్ఎఫ్ఎల్ ఫార్మాట్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా లీగ్ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు చాంపియన్కప్ కోసం పోటీపడగా... మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రీమియర్ కప్ కోసం తలపడ్డాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు షీల్డ్ కప్ కోసం పోటీపడే విధంగా ఎస్ఎఫ్ఎల్ను రూపొందించారు. ఈ నేపథ్యంలో అండర్–13 ప్రీమియర్ కప్ పోరులో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ 2–0తో ఆగాఖాన్పై, షీల్డ్ కప్ పోరులో డీఆర్ఎఫ్ కల్లమ్ అంజిరెడ్డి విద్యాలయ 2–1తో ఫ్యూచర్ కిడ్స్‌పై గెలుపొంది టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. అండర్–15 ప్రీమియర్ కప్ మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2–1తో గోల్కొండ స్కూల్‌పై, షీల్డ్ కప్ మ్యాచ్‌లో కార్వాన్ ప్రభుత్వ పాఠశాల 3–1తో శ్రీనిధి ప్రభుత్వ స్కూల్‌పై గెలుపొంది ట్రోఫీలను గెలుచుకున్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ఫు ట్‌బాల్ సంఘం చైర్మన్ కేటీ మహి ముఖ్య అతిథి గా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఓక్రిడ్జ్‌కు రెండు టైటిళ్లు
రాయదుర్గం: హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ ప్రీమియర్ లీగ్ కప్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. అండర్–13, 15 విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–13 బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ 2–1తో ఫ్యూచర్ కిడ్స్‌పై విజయం సాధించింది. అండర్–15 తుదిపోరులో 2–1తో గోల్కొండ స్కూల్‌ను ఓడించింది. మూడు నెలల పాటు సాగిన ఈ టోర్నీ ఆసాంతం రాణించిన కొత్లూరి విశాల్ ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా రెండు కేటగిరీల్లో విజేతగా నిలిచిన ఓక్రిడ్జ్ జట్టును స్కూల్ ప్రిన్సిపాల్ అర్జున్‌రావు, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ డేవిడ్ రాజ్‌కుమార్ అభినందించారు. -
భారత్Xబహ్రెయిన్
షార్జా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ నాకౌట్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో సునీల్ ఛెత్రి సేన తలపడుతుంది. కెప్టెన్‌గా ఛెత్రికిది 107వ మ్యాచ్. మాజీ సారథి బైచుంగ్ భూటియా (107) రికార్డును సమం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కనీసం ‘డ్రా’ చేసుకున్నా టీమిండియా నాకౌట్ దశకు చేరుతుంది. బహ్రెయిన్‌తో ఒకవేళ ఓడినా భారత్‌కు నాకౌట్ అవకాశాలున్నాయి. మొత్తం ఆరు గ్రూపుల్లో నాలుగు జట్లు అత్యుత్తమ మూడో స్థానం ద్వారా నాకౌట్ చేరొచ్చు. ఇప్పటివరకు బహ్రెయిన్‌తో ఏడు సార్లు ముఖాముఖీగా తలపడిన భారత్ కేవలం ఒక్కసారి (1979లో) మాత్రమే గెలిచింది. బహ్రెయిన్ ఐదింట గెలుపొందగా... మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
యూఏఈదే పైచేయి
అబుదాబి: అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)... ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్‌ను 2–0 తేడాతో ఓడించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆతిథ్య యూఏఈ తరఫున ఖల్ఫాన్ ముబారక్ (41వ నిమిషం), అలీ మబ్కోత్ (88వ నిమిషం) గోల్స్ చేశారు. ఆటగాళ్లు పాస్‌లను చక్కగా అందుకోవడంతో బంతి ఎక్కువ శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని భారత జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడుల్లో ఫర్వాలేకున్నా... ఫౌల్స్ ఎక్కువగా చేసింది. పాస్‌లలోనూ వెనుకబడ్డారు. తొలి భాగం, రెండో భాగం చివర్లో ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకున్నా భారత్ నాకౌట్ చేరేది. ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో భారత్... సోమవారం జరిగే చివరి మ్యాచ్‌లో బహ్రెయిన్‌ను ఎదుర్కొంటుంది. -
చివరి మ్యాచ్‌లోనూ భారత్ పరాజయం
జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా): బ్రిక్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత అండర్–17 మహిళల ఫుట్‌బాల్ జట్టు పరాజయం పాలైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్... ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో 1–2తో చైనా చేతిలో ఓటమి పాలైంది. మన జట్టు తరఫున నమోదైన ఏకైక గోల్ మనీషా (25వ ని.లో) చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి సాధికారికంగా ఆడిన భారత జట్టు తొలి అర్ధభాగాన్ని 1–0 ఆధిక్యంతో ముగించినా... రెండో సగంలో రెండు గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైంది. -
పెరూకు పండుగొచ్చింది
లిమా: పెరూ... దక్షిణ అమెరికా ఖండ దేశం. మూడున్నర దశాబ్దాల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. అది కూడా చిట్టచివరి బెర్త్‌తో. దీంతో అక్కడ సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అప్పట్లో ఏకంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఇప్పుడిక ప్రపంచ కప్ ముంగిట ఆ దేశానికి ఫుట్‌బాల్ జ్వరం పట్టుకుంది. ఈ ఉద్వేగంలో మరో అడుగు ముందుకేసి... ఫిఫా కప్‌ను పోలినట్లే ‘ఖైదీల ప్రపంచ కప్’నే నిర్వహించేశారు. మొత్తం 16 కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న వారితో ఆయా దేశాల పేర్ల మీద జట్లను రూపొందించారు. జాతీయ గీతాల ఆలాపన, రిఫరీల పర్యవేక్షణ, పటిష్ఠ పోలీసు భద్రత... ఇలా అంతా ఫిఫా కప్‌ను తలపించేలా చేశారు. ఇంకా ఆసక్తికరమేమంటే, స్టేడియంలో ఖైదీల కుటుంబ సభ్యులే అభిమానులు. అదీ పరిమితంగానే. లురిగాంచో జైలు జట్టుకు పెరూ దేశం పేరు, చింబోట్ కారాగార జట్టుకు రష్యా పేరు పెట్టారు. రెండింటి మధ్య జరిగిన తుది పోటీలో లురిగాంచో జట్టు పెనాల్టీ కిక్‌తో గెలుపొందింది. ఆటగాళ్లకు కప్‌తో పాటు బంగారు పతకాలు, క్రీడా దుస్తులను బహూకరించారు. డ్రగ్స్ సరఫరా–వినియోగంతో పాటు క్రైం రేట్ ఎక్కువగా ఉండే పెరూలో జైళ్లు నేరగాళ్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వానికిదో సమస్యగా మారింది. ఫిఫా ప్రపంచ కప్‌నకు అర్హత సాధించిన సంతోషం అందరికీ పంచేందుకు చేసిన ఆలోచన నుంచి వచ్చిందే ఖైదీల ప్రపంచకప్. హమ్మయ్య... కెప్టెన్‌ను ఆడనిస్తున్నారు దీనికంటే ముందు పెరూ ఓ పెద్ద ఇబ్బందిని తప్పించుకుంది. అది తమ కెప్టెన్ పావ్లో గ్యురెరో విషయంలో ఎదురైంది. జట్టు ప్రపంచ కప్‌నకు అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన గ్యురెరో డ్రగ్స్ వినియోగం అభియోగాలు ఎదుర్కొన్నాడు. దీంతో క్రీడల మధ్యవర్తిత్వ కోర్టు అతడిపై 14 నెలల పాటు నిషేధం విధించింది. ఇది పెరూకు అశనిపాతమైంది. అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడి, వినతులతో స్విట్జర్లాండ్ ఫెడరల్ సుప్రీంకోర్టు... అతడిపై నిషేధాన్ని ప్రపంచకప్ ముగిసేవరకు పక్కన పెట్టింది. -
ఐఎస్ఎల్ చాంప్ చెన్నైయిన్
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సీ మళ్లీ మెరిసింది. ఈ లీగ్‌లో రెండోసారి టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3–2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్‌ను గెలిపించారు. డిఫెండర్ మెల్సన్ అల్వెస్ (17వ ని., 45వ ని.) అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు. ఆట ఆరంభంలోనే భారత స్టార్ సునీల్ చెత్రి (9వ ని.) గోల్ చేసి బెంగళూరును ఆధిక్యంలో నిలబెట్టగా... ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే మెల్సన్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధంలో మిడ్‌ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో (67వ ని.) కీలకమైన గోల్ చేయడంతో... ప్రత్యర్థి జట్టు బెంగళూరు తరఫున మికు (ఇంజూరి టైమ్ 90+2) చివరి నిమిషాల్లో గోల్ చేసినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్‌లో నాలుగు హెడర్ ద్వారానే వచ్చాయి. చెన్నైయిన్ జట్టు 2015 సీజన్లోనూ టైటిల్ గెలిచింది. లీగ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్‌సీ స్టార్ సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్‌కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్‌రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులు అందుకున్నారు. -
ముఫకంజా ముందంజ
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజి జట్టు గెలుపొందింది. మంగళవారం జరిగిన కాలేజి బాలుర మ్యాచ్‌లో ముఫకంజా 4–1తో ఎంవీ సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజిపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3–0తో కేజీరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఓడించింది. సీనియర్ బాలుర విభాగంలో ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్ జట్టు 1–0తో గ్లెండేల్ అకాడమీపై గెలుపొందింది. -
ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవాలు
-
అట్టహాసంగా ఫుట్‌బాల్ టోర్నమెంట్
పాల్వంచ : స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడామైదానం నందు కొత్త కృష్ణారెడ్డి స్మారకంగా రెండు రోజుల పాటు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల స్థాయి టోర్నమెంట్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పోటీలకు మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్బంగా నిర్వహకులు కొత్త వెంకట రెడ్డి, మిరియాల కమలాకర్, అరుణ్ రెడ్డిలు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. అనంతరం జరిగిన పోటీల్లో సింగరేణి ఫుట్ బాల్‌క్లబ్ ఇల్లెందు జట్టుపై, 21 సెంచరీ ఫుట్ బాల్ క్లబ్ ఖమ్మంపై 2–0తో విజయం సాధించాయి. రెండవ మ్యాచ్‌లో పోలీస్ గ్రౌండ్ ఫుట్ బాల్ టీం, టీటీఎఫ్‌సి పాల్వంచ టీం డ్రాగా ముగించుకున్నాయి. పోటీలకు వచ్చిన క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించారు. ఈకార్యక్రమంలో ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కెఇ.సెల్యుకస్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, దేవసహాయం, సెక్రటరీ కె.ఆదర్ష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ 0 దక్షిణ కొరియా 10
ప్యాంగ్యాంగ్ (ఉత్తర కొరియా): ఆసియా కప్ మహిళల క్వాలిఫయింగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు రెండో ఘోర పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–10 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. దక్షిణ కొరియా తరఫున లీ జెయుమ్ మిన్ మూడు గోల్స్, జీ సు యున్ రెండు గోల్స్ చేయగా... కాంగ్ యు మి, లీ మిన్ ఎ, లీ యున్ మి, యూ యుంగా, లీ సో డామ్ ఒక్కో గోల్ సాధించారు. ఇదే టోర్నీ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య ఉత్తర కొరియా చేతిలో టీమిండియా 0–8 గోల్స్ తేడాతో ఓడింది. -
టైటిల్ పోరుకు కోల్‌కతా
ముంబై: మూడో సీజన్లోనైనా ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై సిటీ జట్టు సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. 2014 చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా జట్టుతో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్ రెండో అంచె మ్యాచ్‌ను ముంబై సిటీ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. ఫలితంగా రెండు అంచెల సెమీఫైనల్‌ను కోల్‌కతా జట్టు 3–2 గోల్స్‌తో ముంబైపై నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈనెల 10న కోల్‌కతాలో జరిగిన తొలి సెమీఫైనల్ తొలి అంచె మ్యాచ్‌లో కోల్‌కతా 3–2తో ముంబై సిటీని ఓడించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై జట్టు ఫైనల్ చేరుకోవాలంటే రెండో మ్యాచ్‌లో రెండు గోల్స్ తేడాతో నెగ్గాల్సింది. కానీ ఆ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా జట్టు ఐఎస్ఎల్లో ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి. 2014 తొలి సీజన్లో కోల్‌కతా విజేతగా నిలిచింది. గత ఏడాది మాత్రం సెమీఫైనల్లో ఓడిపోయింది. కేరళ బ్లాస్టర్స్, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య బుధవారం జరిగే రెండో సెమీఫైనల్ రెండో అంచె మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో కోల్‌కతా జట్టు తలపడుతుంది. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిపత్యం చలాయించినా అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఆట 34వ, 43వ నిమిషాల్లో కోల్‌కతా ఆటగాడు రాబర్ట్ వరుసగా రెండు ఎల్లో కార్డులకు గురై మైదానం నుంచి నిష్క్రమించాడు. దాంతో మ్యాచ్ చివరి వరకు కోల్‌కతా పది మంది ఆటగాళ్లతోనే ఆడినా దీనిని ముంబై సద్వినియోగం చేసుకోలేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే కోల్‌కతా, ముంబై ఆటగాళ్ల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కోల్‌కతా ఆటగాడు యువాన్ కార్లోస్ ముంబై ప్లేయర్‌ను తలతో ఢీకొట్టడంతో రిఫరీ అతనికి రెడ్ కార్డు చూపెట్టారు. ఫలితంగా ఫైనల్‌కు కార్లోస్ దూరమయ్యాడు. -
కేరళ బ్లాస్టర్స్‌ను గెలిపించిన బెల్ఫోర్ట్
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ తొలి అంచె మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ జట్టు కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఢిల్లీ డైనమోస్‌పై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు భారీగా ఎగబడ్డారు. సుమార్ 50 వేల మంది ప్రత్యక్షంగా తిలకించిన ఈ మ్యాచ్‌లో కేరళ సొంతగడ్డపై తన జైత్రయాత్రను కొనసాగించింది. హోమ్ గ్రౌండ్లో సచిన్ జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకై క గోల్‌ను బెల్ఫోర్ట్ 65వ నిమిషంలో సాధించి కేరళకు అద్భుత విజయాన్నందించాడు. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఒక్క గోల్ అయిన లేకుండానే ఈ సెషన్ ముగిసింది. అనంతరం రెండో అర్ధభాగంలో బెల్ఫోర్ట్ అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలచడంతో కేరళ గెలుపొందింది. -
కేరళ, కోల్‌కతా మ్యాచ్ డ్రా
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా అట్లెటికో డి కోల్‌కతా, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. కేరళ తరఫున వినీత్ (8వ ని.లో), కోల్‌కతా తరఫున పియర్సన్ (18వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్ డ్రా
ఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో ‘డ్రా’గా ముగిసింది. కోల్‌కతా తరఫున హ్యూమ్ (17వ ని.లో), గ్రాండీ (71వ ని.లో)... ఢిల్లీ తరఫున మిలన్ సింగ్ (63వ ని.లో), మలూడా (74వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
వినీత్ సూపర్ షో
కొచ్చి: నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన వినీత్ (85వ, 89వ నిమిషాల్లో).... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు నాలుగో విజయాన్ని అందించాడు. చెన్నైరుున్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో మెండీ గోల్‌తో చెన్నైరుున్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 67వ నిమిషంలో కాడియో గోల్‌తో కేరళ స్కోరును 1-1తో సమం చేసింది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వినీత్ గోల్‌తో కేరళ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి సెకన్లలో వినీత్ మరో గోల్ చేయడంతో కేరళ విజయం ఖాైయెుమంది. తాజా గెలుపుతో కేరళ 15 పారుుంట్లతో రెండో స్థానానికి చేరుకుంది. -
ముంబైని ఆదుకున్న కోస్టా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై ఎఫ్‌సీ సిటీ జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసింది. చెన్నైరుున్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌ను ముంబై జట్టు 1-1తో సమంగా ముగించింది. ఆట 51వ నిమిషంలో లాల్‌పెకులా గోల్‌తో చెన్నైరుున్ జట్టు 1-0తో ముందంజ వేసింది. ముంబై జట్టు స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఇక చెన్నైరుున్ జట్టుదే విజయం అనుకుంటున్న తరుణంలో.. మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ముంబై ఆటగాడు లియో కోస్టా అద్భుత గోల్ చేసి స్కో రును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌లో పుణేతో గోవా జట్టు తలపడుతుంది. -
ఐఎస్ఎల్తో భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి
ప్రాన్స్ దిగ్గజం హెన్రీ అభిప్రాయం ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ వల్ల భారతదేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధి చెందుతుందని ప్రాన్స్ దిగ్గజం థియరీ హెన్రీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెల్జియం జట్టుకు సహాయక కోచ్‌గా పని చేస్తున్న ఆయన రెండు రోజులుగాభారత్లో పర్యటిస్తున్నారు. ‘లీగ్‌లో అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి ఆడటం వల్ల భారత్‌లోని యువ క్రీడాకారులు చాలా మెరుగుపడతారు. దీని ఫలితం మున్ముందు మరింత కనిపిస్తుంది’ అని హెన్రీ చెప్పారు. కోల్‌కతా కోచ్ సస్పెన్షన్ న్యూఢిల్లీ: పదే పదే రిఫరీల నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకు అట్లెటికో డి కోల్‌కతా జట్టు కోచ్ జోస్ మోలినాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. -
అగ్రస్థానానికి ముంబై ఎఫ్‌సీ
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై ఎఫ్‌సీ జట్టు 1-0తో అట్లెటికో డి కోల్‌కతా జట్టుపై విజయం సాధించింది. ముంబై తరఫున ఫోర్లాన్ (79వ ని.)గోల్ చేశాడు. ఈ విజయంతో ముంబై ఎఫ్‌సీ పారుుంట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. -
గోవాకు తొలి గెలుపు
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో గోవా ఎఫ్‌సీ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడి, నాలుగో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న గోవా ఐదో మ్యాచ్‌లో విజయాల బోణీ చేసింది. ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గోవా 1-0తో నెగ్గింది. 41వ నిమిషంలో ఫెలిస్బినో గోల్‌తో గోవా ఖాతా తెరిచింది. ఆ తర్వాత ముంబై స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా సఫలం కాలేకపోరుుంది. -
ఢిల్లీ, నార్త్ ఈస్ట్ మ్యాచ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా నార్త్ ఈస్ట్ యునెటైడ్, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఆట 38వ నిమిషంలో లూరుుస్ గోల్‌తో ఢిల్లీ డైనమోస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 51వ నిమిషంలో అల్ఫారో గోల్‌తో నార్త్ ఈస్ట్ స్కోరును సమం చేసింది. ఈ లీగ్‌లో నార్త్ ఈస్ట్ జట్టుకిది తొలి ‘డ్రా’కాగా... ఢిల్లీకి వరుసగా రెండోది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతాతో ఎఫ్‌సీ గోవా తలపడుతుంది. -
అట్లెటికో డి కోల్‌కతా బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో అట్లెటికో డి కోల్‌కతా జట్టు విజయాల బోణీ చేసింది. కేరళ బ్లాస్టర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అట్లెటికో జట్టు 1-0తో నెగ్గింది. 53వ నిమిషంలో జావీ లారా ఏకై క గోల్ చేసి అట్లెటికో జట్టును గెలిపించాడు. చెన్నైరుున్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను అట్లెటికో 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. -
పోలాండ్ షూట్... స్విస్ అవుట్
► తొలిసారి క్వార్టర్స్‌కు చేరిన పోలాండ్ ► షూటౌట్లో స్విట్జర్లాండ్‌కు నిరాశ ► యూరో కప్ టోర్నీ సెయింట్ ఎటెని (ఫ్రాన్స్): కీలకదశలో ఒత్తిడిని అధిగమించిన పోలాండ్ జట్టు ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోలాండ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4తో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో అరగంటపాటు అదనపు సమయం పొడిగించారు. అయితే అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోవడంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో స్విట్జర్లాండ్ తరఫున రెండో కిక్‌ను జాకా వృథా చేయగా... మిగతా నలుగురు ఆటగాళ్లు స్కోరు చేశారు. మరోవైపు పోలాండ్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లూ సఫలమై చిరస్మరణీయ విజయాన్ని సాధించారు. యూరో టోర్నీ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశకు చేరుకున్న పోలాండ్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన పోలాండ్ అవకాశం దొరికినపుడల్లా స్విట్జర్లాండ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఎట్టకేలకు ఆ జట్టు 39వ నిమిషంలో ఖాతా తెరిచింది. ఎడమవైపు నుంచి గ్రోసిస్కీ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న బ్లాస్జికౌస్కీ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో పోలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు స్కోరును సమం చేయాలనే ఏకైక లక్ష్యంతో జోరు పెంచారు. అయితే పోలాండ్ గోల్‌కీపర్ లుకాస్ ఫాబియాన్స్కీ వారికి అడ్డుగోడలా నిలిచాడు. ఇక పోలాండ్ విజయం ఖాయమైందని అనుకుంటున్న తరుణంలో... స్విస్ స్టార్ జెర్దాన్ షాకిరి 82వ నిమిషంలో గాల్లో తేలుతూ బైసైకిల్ కిక్‌తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నిర్ణీత సమయం ముగిసేలోపు రెండుసార్లు పోలాండ్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా ఆ జట్టు ఆటగాళ్లు వృథా చేసుకున్నారు. అయితే షూటౌట్లో మాత్రం గురి తప్పకుండా విజయాన్ని ఖాయం చేసుకున్నారు. వేల్స్ జోరు... తొలిసారి యూరో టోర్నమెంట్లో ఆడుతోన్న వేల్స్ జట్టు మరో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. నార్తర్న్ ఐర్లాండ్‌తో శనివారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో వేల్స్ జట్టు 1-0తో గెలుపొందింది. ఆట 75వ నిమిషంలో నార్తర్న్ ఐర్లాండ్ ఆటగాడు మెకౌలే ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో వేల్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వేల్స్ స్టార్ ప్లేయర్ గ్యారెత్ బేల్ ఆడిన క్రాస్ షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు నుంచి తప్పించబోయిన నార్తర్న్ ఐర్లాండ్ ఆటగాడు మెకౌలే బంతిని తమ గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో వేల్స్ ఖాతాలో గోల్ చేరింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్ చేసిన బేల్ నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు సెల్ఫ్ గోల్ చేయడంలో కీలకపాత్ర పోషించడం విశేషం. -
బ్రెజిల్‌ను నిలువరించిన ఈక్వెడార్
► 0-0తో మ్యాచ్ డ్రా ► కోపా అమెరికా కప్ టోర్నమెంట్ లాస్ ఏంజిల్స్: ప్రపంచ మాజీ చాంపియన్ బ్రెజిల్‌ను ఈక్వెడార్ జట్టు సమర్థవంతంగా నిలువరించింది. దీనికి తోడు వివాదాస్పద రిఫరీ నిర్ణయం బ్రెజిల్‌కు అనుకూలంగా మారడంతో ఓటమి నుంచి గట్టెక్కింది. ఫలితంగా కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా బ్రెజిల్ గోల్ చేయడంలో విఫలమైంది. అయితే ద్వితీయార్ధం ఈక్వెడార్ ఆటగాళ్ల నుంచి ఎదురుదాడి ఎక్కువ కావడంతో బ్రెజిల్ ఇబ్బంది పడింది. 66వ నిమిషంలో ఈక్వెడార్ ఆటగాడు మిలర్ బోలనోస్ సంధించిన క్రాస్ షాట్‌ను అడ్డుకోవడంలో బ్రెజిల్ గోల్ కీపర్ విఫలం కావడంతో బంతి నెట్‌లోనికి వెళ్లింది. అయితే సంబరాల్లో మునిగిన ఈక్వెడార్ రిఫరీ నిర్ణయంతో షాక్ తిన్నది. క్రాస్ షాట్ ఆడడానికి ముందే బంతి ఎండ్ లైన్ దాటిందని ప్రకటించడం ఆ జట్టును అసహనానికి గురి చేసింది. 83వ నిమిషంలో లుకాస్ (బ్రెజిల్) హెడర్ వైడ్‌గా వెళ్లడంతో గోల్ మిస్ అయ్యింది. అయితే ఆట ముగిశాక బ్రెజిల్ ఆటగాళ్లను 53 వేలకు పైగా ఉన్న ప్రేక్షకులు గేలి చేశారు. పెరూ విజయం సీటల్: మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పెరూ 1-0 తేడాతో హైతీని ఓడించింది. ద్వితీయార్ధం 61వ నిమిషంలో స్ట్రయికర్ గెరెరో తమ జట్టుకు ఏకైక గోల్‌ను అందించాడు. హైతీ డిఫెన్స్ సమర ్థవంతంగా అడ్డుకోవడంతో పెరూకు మరిన్ని గోల్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. కోస్టారికా, పరాగ్వే మ్యాచ్ డ్రా ఓర్లాండో: గ్రూప్ ‘ఎ’లో భాగంగా పరాగ్వే, ఈక్వెడార్ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇంజ్యురీ సమయంలో డిఫెండర్ కెండాల్ వాస్టన్ రెడ్ కార్డుకు గురవ్వడంతో కోస్టారికా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. 33 డిగ్రీల అధిక వేడిలో మ్యాచ్ జరగడం కూడా ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టింది. -
కొలంబియా శుభారంభం
అమెరికాపై 2-0తో విజయం కోపా అమెరికా కప్ సాంటా క్లారా (అమెరికా): కోపా అమెరికా కప్ సెంటినరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో కొలంబియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 2-0 గోల్స్ తేడాతో ఆతిథ్య అమెరికా జట్టును ఓడించింది. జేమ్స్ రోడ్రిగెజ్, క్రిస్టియాన్ జపాటా ఒక్కో గోల్ చేసి కొలంబియా విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. దాంతో సొంతగడ్డపై శుభారంభం చేయాలని ఆశించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. 67,439 మంది ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ అయిన స్టేడియంలో ఆద్యంతం కొలంబియా ఆధిపత్యం చలాయించింది. ఆట ఎనిమిదో నిమిషంలోనే జపాటా గోల్‌తో కొలంబియా ఖాతా తెరిచింది. ఎడ్విన్ కార్డోనా కొట్టిన కార్నర్ షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న జపాటా గోల్‌గా మలిచాడు. 42వ నిమిషంలో కొలంబియా ప్లేయర్ ఫరీద్ దియాజ్ కొట్టిన షాట్‌ను అమెరికా డిఫెండర్ చేతితో అడ్డుకోవడంలో రిఫరీ కొలంబియాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. ఈ కిక్‌ను రోడ్రిగెజ్ లక్ష్యానికి చేర్చడంతో విరామ సమయానికి కొలంబియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ కొలంబియా ఆటగాళ్లు సమన్వయంతో కదులుతూ అమెరికాపై ఒత్తిడిని కొనసాగించారు. దాంతో అమెరికా నిర్ణీత సమయంలోపు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌ల్లో కోస్టారికాతో అమెరికా; పరాగ్వేతో కొలంబియా తలపడతాయి. -
చాంపియన్ చెన్నైయిన్
ఊహకందని మలుపులతో సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్‌కు అద్వితీయ ముగింపు లభించింది. గతేడాది సెమీస్‌లోనే నిష్ర్కమించిన చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఈసారి ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా అవతరించింది. లీగ్ దశలో టాపర్‌గా నిలిచిన గోవా ఎఫ్‌సీతో జరిగిన టైటిల్ పోరులో చెన్నైయిన్ చివరి నిమిషాల్లో అద్భుతం చేసి ఔరా అనిపించింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నైయిన్ జట్టు నిర్ణాయక గోల్ సాధించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. చివరి నిమిషాల్లో తడబడిన గోవా తుదకు తగిన మూల్యం చెల్లించి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. * ఐఎస్ఎల్ ట్రోఫీ హస్తగతం * ఫైనల్లో గోవాపై 3-2తో విజయం * రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం ఫటోర్డా (గోవా): పరిస్థితులు ఎలా ఉన్నా చివరి క్షణం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో చెన్నైయిన్ జట్టు రుచి చూసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్లో చాంపియన్‌గా ఆవిర్భవించింది. గోవా ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైయిన్ జట్టు 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 90వ నిమిషం వరకు 1-2తో వెనుకబడిన చెన్నైయిన్ జట్టుకు గోవా గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని ‘సెల్ఫ్ గోల్’తో ఊపిరి పోయగా... ఇంజ్యూరీ టైమ్‌లో (90+2వ నిమిషంలో) మెండోజా గోల్ సాధించి చెన్నైయిన్ జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. చివరి క్షణం వరకు అప్రమత్తంగా లేకపోతే దాని మూల్యం ఏస్థాయిలో ఉంటుందో గోవా జట్టుకు ఈ మ్యాచ్ ద్వారా తెలిసొచ్చింది. మ్యాచ్ అంటే ఇదీ.. అనే తరహాలో సాగిన అంతిమ సమరంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తాజా విజయంతో గోవాలో ఎప్పుడు ఆడినా తమదే గెలుపనే సెంటిమెంట్‌ను చెన్నైయిన్ మరోసారి నిజం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్, భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని సహ యజమానులుగా ఉన్న చెన్నైయిన్ జట్టుకు విజేత హోదాలో ట్రోఫీతోపాటు రూ. 8 కోట్ల నజరానా అందగా... రన్నరప్ గోవాకు రూ. 4 కోట్లు లభించాయి. సెమీస్‌లో ఓడిన కోల్‌కతా, ఢిల్లీ డైనమోస్ జట్లకు రూ. కోటీ 50 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ ఇచ్చారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో పాటు గోవా సహ యజమాని, క్రికెటర్ కోహ్లి తన గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మతో హాజరయ్యారు. ఆద్యంతం హోరాహోరీ... భారీగా తరలివచ్చిన సొంత ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన గోవా ఆరంభం నుంచి తమ బలాన్నే నమ్ముకుంటూ దూకుడు కనబరిచింది. వేగంగా పాస్‌లు ఇచ్చుకుంటూ గోల్స్ కోసం ప్రయత్నించింది. ఆరో నిమిషంలో ప్రత్యర్థి తలతో ఢీకొన్న గోవా స్ట్రయికర్ డుడు గాయపడడంతో మైదానం వీడాడు. తొలి 25 నిమిషాలు ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. 33వ నిమిషంలో గోవాకు ఫ్రీకిక్ చాన్స్ లభించింది. అయితే లియో మౌరా సంధించిన షాట్ గోల్ పోస్ట్ కుడివైపునుంచి బయటికి వెళ్లింది. ఐదు నిమిషాల వ్యవధిలో గోవాకు కొయెల్హో హెడర్ గోల్ ప్రయత్నం చేసినా తృటిలో తప్పింది. దీంతో తొలి అర్ధభాగం గోల్స్ నమోదు కాకుండానే ముగిసింది. అయితే ద్వితీయార్ధంలో ఆట స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. 53వ నిమిషంలో చెన్నైయిన్ స్టార్ స్ట్రయికర్ మెండోజాను ఇన్సైడ్ బాక్స్‌లో ప్రణయ్ కిందపడేయడంతో పెనాల్టీ అవకాశం దక్కింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పెలిస్సారి జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలోనే గోవా స్కోరును 1-1తో సమం చేసింది. రోమియో అందించిన క్రాస్‌ను సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హవోకిప్ మెరుపు వేగంతో గోల్‌పోస్టులోకి పంపి సంతోషం నింపాడు. కానీ 59వ నిమిషంలో తమకు లభించిన రెండో పెనాల్టీని చెన్నైయిన్ సద్వినియోగం చేసుకోలేపోయింది. మెండోజా షాట్‌ను గోవా కీపర్ లక్ష్మీకాంత్ సులువుగా అడ్డుకున్నాడు. 87వ నిమిషంలో గోవాకు లభించిన ఫ్రీకిక్‌ను జోఫ్రే గోల్‌తో 2-1 ఆధిక్యం సాధించింది. అయితే ఈ ఆనందాన్ని స్వయం తప్పిదంతో గోవా కోల్పోయింది. 90వ నిమిషంలో బంతిని ఆపే ప్రయత్నంలో గాల్లోకి ఎగిరిన కీపర్ లక్ష్మీకాంత్ చేతిని తాకుతూ గోల్ కావడంతో స్కో రు తిరిగి సమమైంది. అయితే అదనపు సమయం (90+2వ నిమిషం)లో మెండోజా సూపర్ గోల్‌తో చెన్నైయిన్ విజేతగా నిలిచింది. చెన్నైయిన్ జట్టుకు బ్రూనో పెలిస్సారి (54వ నిమిషంలో), మెండోజా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోవా గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని 90వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. గోవా తరఫున హవోకిప్ (58వ నిమిషంలో), జోఫ్రే (87వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. -
వాలెన్సియా హ్యాట్రిక్
చెన్నై: వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు చక్కటి విజయాన్ని అందుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ రెండో సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో వాలెన్సియా హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో 4-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని కంగుతినిపించింది. ఈ సీజన్లో వాలెన్సియాకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. మూడో నిమిషంలోనే ధన గోల్ చేయగా వాలెన్సియా (16, 80, 81వ నిమిషాల్లో) వరుసగా మూడు గోల్స్ సాధించాడు. ఇంజ్యూరీ (90) సమయంలో కేరళకు జర్మన్ ఓదార్పు గోల్ అందించాడు. నేడు అట్లెటికో డి కోల్‌కతా, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. -
గోవా గోల్స్ వర్షం
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్లో ఎఫ్‌సీ గోవా జట్టు మరోసారి అదరగొట్టింది. మంగళవారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించింది. ఫలితంగా 7-0తో ఘనవిజయం సాధించింది. పసలేని ప్రత్యర్థి ఆటతీరును ఉపయోగించుకున్న డూడూ (42, 64, 67వ ని.లో), హావోకిప్ (34, 52, 79వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయారు. మరో గోల్‌ను రినాల్డో చేశాడు. ఐఎస్ఎల్లో ఓ జట్టు ఇంత భారీ తేడాతో ఓడడం ఇదే తొలిసారి. అలాగే ఈ లీగ్‌లో ఇది వందో మ్యాచ్ కావడం విశేషం. బుధవారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాతో చెన్నైయిన్ జట్టు ఆడుతుంది. -
ఐఎస్ఎల్: పుణే, ముంబై మ్యాచ్ డ్రా
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా ముంబై, పుణే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లకు ఇది మూడో ‘డ్రా’ కావడం గమనార్హం. ఈ ఏడాది ఈ లీగ్‌లో ఒక మ్యాచ్‌లో గోల్ నమోదు కాకపోవడం ఇది రెండోసారి మాత్రమే. గతనెల 10న కేరళ బ్లాస్టర్స్, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ గోల్స్ నమోదు కాలేదు. ప్రస్తుతం గోవా, పుణే జట్లు 15 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌తో అట్లెటికో డి కోల్‌కతా జట్టు ఆడుతుంది. -
కోల్‌కతా విజయం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కేరళ బ్లాస్టర్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 3-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 29వ నిమిషంలో మోహన్ చేసిన గోల్‌తో కోల్‌కతా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 42వ నిమిషంలో జెర్మాన్ గోల్‌తో కేరళ బ్లాస్టర్స్ 1-1తో స్కోరును సమం చేసింది. 84వ నిమిషంలో ఇజుమి గోల్ చేసి కోల్‌కతాకు 2-1తో ఆధిక్యాన్ని అందించగా... తర్వాతి నిమిషంలోనే జెర్మాన్ మరో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. ఇక మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకుంటున్న దశలో 90వ నిమిషంలో ఇజుమి గోల్ చేసి అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు విజయాన్ని అందించాడు. -
ఐఎస్ఎల్: కేరళ బ్లాస్టర్స్ గెలుపు
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణే ఎఫ్‌సీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 2-0 గోల్స్ తేడాతో గెలి చింది. ఆట 45వ నిమిషంలో డాగ్నల్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన కేరళ జట్టుకు 60వ నిమిషంలో వాట్ రెండో గోల్‌ను అందించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన కేరళ బ్లాస్టర్స్ ఆ తర్వాతి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం కేరళ జట్టు ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో గోవా ఎఫ్‌సీ జట్టు ఆడుతుంది. -
గెట్..సెట్.. కిక్
నేటి నుంచి ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నైయిన్, కోల్‌కతా అమీతుమీ చెన్నై: గతేడాది విశేష ఆదరణ పొందిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) చెన్నైలో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్సీల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఆటగాళ్లతో పాటు చురుకైన దేశవాళీ కుర్రాళ్లు ఈ టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. టోర్నీ కోసం అన్ని ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాయి. గతేడాది టోర్నీ మధ్యలో అనూహ్యంగా వెనుకబడిన కొన్ని జట్లు ఈసారి టైటిల్ కోసం అనుభవజ్ఞులైన ఆటగాళ్లను రంగంలోకి దించుతున్నాయి. ఈసారి కూడా ఎనిమిది ప్రధాన నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఐఎస్ఎల్ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్‌లతో పాటు ధోని, కోహ్లిలకు కూడా ఐఎస్ఎల్ జట్లలో భాగస్వామ్యం ఉండటంతో క్రికెట్ అభిమానులు కూడా దీనిపై దృష్టిపెడుతున్నారు. ఓవరాల్‌గా క్రికెట్ తర్వాత దేశంలో మరింత ఆదరణ పెంచుకునే దిశగా ఫుట్‌బాల్ అడుగులు వేస్తోంది. ఘనమైన ఏర్పాట్లు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పులతో పాటు లేజర్ షో, బాలీవుడ్ సెలబ్రిటీల హంగామా ఈ వేడుకకు మరింత ఆకర్షణ తేనుంది. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, ఆలియా భట్, అర్జున్ కపూర్లు తమ నృత్యాలతో అలరించేందుకు సిద్ధమవుతుండగా, మ్యూజిక్ డెరైక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతంతో ఓలలాడించనున్నాడు. కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఫ్రాంచైజీల సంతోషం ఓవైపు భారత్‌లో క్రికెట్ సీజన్ మొదలవుతున్నా... ఫుట్‌బాల్‌కు ఆదరణ తగ్గకపోవడం ఫ్రాంచైజీలను సంతోషపరుస్తోంది. గతేడాది రూ. 55 కోట్లు మాత్రమే ఉన్న స్పాన్సర్షిప్ ఆదాయం ఈసారి గణనీయంగా రూ. 100 కోట్లకు చేరడమే దీనికి నిదర్శనం. గతేడాది చాంపియన్: అట్లెటికో డి కోల్‌కతా గతేడాది రన్నరప్: కేరళ బ్లాస్టర్స్ 8: టోర్నీలో పాల్గొంటున్న జట్లు 49: టోర్నీ జరిగే రోజులు 61: మొత్తం మ్యాచ్‌ల సంఖ్య