
న్యూఢిల్లీ: దేశంలో జరిగే అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఈ నెల 31 వరకు రద్దు చేస్తూ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) శనివారం నిర్ణయం తీసుకుంది. దాంతో ఐ–లీగ్, డివిజన్–2, యూత్ లీగ్, గోల్డెన్ లీగ్, జాతీయ టోర్నీలు రద్దయ్యాయి. ఐ–లీగ్‌లోని 28 మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని ఏఐఎఫ్‌ఎఫ్ తొలుత అనుకున్నా... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ నెల చివరి వరకు దేశంలో ఎటువంటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని నిర్ణయించింది.