ఉజ్బెకిస్తాన్‌తో.. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు సౌమ్య! | Soumya Gugulot Has Been Named In India's Squad For The International Friendly Against Uzbekistan | Sakshi
Sakshi News home page

ఉజ్బెకిస్తాన్‌తో.. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు సౌమ్య!

Published Tue, May 28 2024 9:34 AM | Last Updated on Tue, May 28 2024 9:34 AM

Soumya Gugulot Has Been Named In India's Squad For The International Friendly Against Uzbekistan

తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తాషె్కంట్‌ నగరంలో ఉజ్బెకిస్తాన్‌ జట్టుతో మే 31, జూన్‌ 4వ తేదీల్లో జరిగే రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో పోటీపడే భారత జట్టులో ఆమె ఎంపికైంది.

30 మంది ప్రాబబుల్స్‌కు ఇటీవల రెండు వారాలపాటు హైదరాబాద్‌లోని శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టర్కీష్‌ కప్‌ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోనూ సౌమ్య సభ్యురాలిగా ఉంది.

ఇవి చదవండి: నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement