ప్రతిష్టాత్మక బాలన్‌ డి'ఓర్‌ అవార్డు గెలుచుకున్న రోడ్రి | Rodri Wins Ballon D'Or Award 2024 | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక బాలన్‌ డి'ఓర్‌ అవార్డు గెలుచుకున్న రోడ్రి

Published Tue, Oct 29 2024 1:47 PM | Last Updated on Tue, Oct 29 2024 3:33 PM

Rodri Wins Ballon D'Or Award 2024

స్పానిష్‌ ఫుట్‌బాలర్‌, మాంచెస్టర్‌ సిటీ మిడ్‌ ఫీల్డర్‌ రోడ్రీ ప్రతిష్టాత్మక బాలన్‌ డి'ఓర్‌-2024 అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం రోడ్రీతో రియల్‌ మాడ్రిడ్‌కు చెందిన వినిసియస్‌ జూనియర్‌, జూడ్‌ బెల్లింగ్హమ్‌తో పోటీ పడ్డారు. మాంచెస్టర్‌ సిటీ గత సీజన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ గెలవడంతో రోడ్రీ కీలకపాత్ర పోషించాడు. అలాగే స్పెయిన్‌ ఈ ఏడాది యూరో టైటిల్‌ గెలవడంలోనూ కీ రోల్‌ ప్లే చేశాడు. ఇంగ్లీష్‌ క్లబ్‌ నుంచి బాలన్‌ డి'ఓర్‌ అవార్డు గెలుచుకున్న తొలి ఫుట్‌బాలర్‌ రోడ్రీనే. 

మహిళల విషయానికొస్తే.. ఈ ఏడాది బాలన్‌ డి'ఓర్‌ అవార్డు స్పెయిన్ కే చెందిన ఐటానా బొన్మాటీకి దక్కింది. బొన్మాటీ బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఉత్తమ యువ ఫుట్‌బాలర్‌ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు లామిన్ యామల్‌కు దక్కింది. ఉత్తమ పురుషుల జట్టుగా రియల్ మాడ్రిడ్, ఉత్తమ మహిళల జట్టుగా బార్సిలోనా అవార్డులు దక్కించుకున్నాయి. పారిస్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement