
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి.
స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది.