colombia
-
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. దిగొచ్చిన కొలంబియా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత పవర్ఫుల్ అనేది మరోసారి స్పష్టమైంది. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు మరో దేశం దిగివచ్చింది. తమ దేశానికి చెందిన వలసదారులను మిలిటరీ విమానాల్లో తీసుకురావడాన్ని అనుమతించమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే కొలంబియా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.ట్రంప్ ఆంక్షల భయంతో అమెరికా మిలిటరీ విమానాలను అనుమతిస్తామని కొలంబియా తెలిపింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ తాజాగా ఒక అధికార ప్రకటనలో వెల్లడించింది. ‘అక్రమ వలసదారుల విమానాలను మిలిటరీ విమానాలతో సహా అనుమతించడానికి కొలంబియా ఒప్పుకుంది. ఈ పరిణామాల ద్వారా ప్రపంచానికి అమెరికాను గౌరవించాలని స్పష్టమైంది.అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అక్రమ వలసదారులను సాగనంపడాన్ని అన్ని దేశాలు ఒప్పుకుంటాయని ఆయన ఆశిస్తున్నారు’అని వైట్‌హౌజ్ తన ప్రకటనలో తెలిపింది. కాగా, తమ దేశానికి చెందిన వలసదారులను మిలిటరీ విమానాల్లో పంపడాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తొలుత వ్యతిరేకించారు. విమానాలను వెనక్కి పంపారు. అయితే ట్రంప్ ఆంక్షల భయంతో ఆయన కొద్ది గంటల్లోనే వెనక్కు తగ్గి డిపోర్టేషన్ విమానాలను అంగీకరించారు. తమ దేశానికి చెందిన వలసదారులను పంపడం కోసం తన ప్రెసిడెన్షియల్ విమానాన్ని కూడా వాడుకునేందుకు ఒప్పుకున్నారు.ఇదీ చదవండి: కొలంబియాపై ట్రంప్ కొరడా -
కొలంబియాపై ట్రంప్ కొరడా.. ఆ విమానాలు తిప్పి పంపినందుకే..
వాషింగ్టన్:తన మాట వినని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు మొదలు పెట్టారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై కొరడా ఝలిపించారు. త్వరలో ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ఆదివారం(జనవరి26) ఒక పోస్టు చేశారు. ‘కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాడు.ఇందుకే కొలంబియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా. కొలంబియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికిప్పుడు 25 శాతం టారిఫ్ విధిస్తాం. ఇది వారంలో 50 శాతానికి పెరుగుతుంది.కొలంబియా నుంచి అమెరికాకు రావడంపై ట్రావెల్ బ్యాన్. వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయి’అని ట్రంప్ వెల్లడించారు. కాగా, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలిటరీ విమానాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఎక్స్(ట్విటర్)లో తెలిపారు. తమ దేశానికి చెందిన వారికి గౌరవమిస్తూ పౌర విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. గత వారం కూడా మెక్సికో కూడా కొలంబియా తరహాలోనే ట్రంప్ వలసదారులతో పంపిన మిలిటరీ విమానాలను తిప్పి పంపడం గమనార్హం. ఇదీ చదవండి: పద్ధతిగా వస్తేనే ప్రయాణం -
WC Qualifiers: కొలంబియా సంచలనం.. అర్జెంటీనాకు షాక్
బొగోటా (కొలంబియా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టుకు 2026 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో షాక్ తగిలింది. 2022లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా... దక్షిణ అమెరికా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో కొలంబియా చేతిలో ఓడింది. బుధవారం జరిగిన పోరులో కొలంబియా 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై గెలిచింది. కొలంబియా తరఫున యెర్సన్ మస్క్యూరా (25వ నిమిషంలో), జేమ్స్ రోడ్రిగ్జ్ (60వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున నికోలస్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ మెస్సీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ అర్హత టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి అర్జెంటీనా 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోరీ్నలో తొలి 6 స్థానాల్లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ నకు అర్హత సాధించనున్నాయి. -
మెస్సీ లేకుండానే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ బరిలో ఆర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది. అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి. -
కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్
కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్ ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు ఆదనపు సమయం కేటాయించారు. ఎక్స్ట్రా సమయం కూడా ముగుస్తుండడంతో ఈ మ్యాచ్ పెనాల్టీ షుట్ అవుట్‌కు దారి తీస్తుందని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ అద్భుతం చేశాడు. 112వ నిమిషంలో గోల్ కొట్టిన మార్టినెజ్.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిగిలిన 8 నిమిషాల్లో కొలంబియా గోల్ సాధించకపోవడంతో అర్జెంటీనా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.🏆🇦🇷 ARGENTINA ARE COPA AMÉRICA CHAMPIONS!Argentina have beaten Colombia 1-0 thanks to Lautaro Martínez’s goal.🏆 Copa America 2021🏆 Finalissima 2022🏆 World Cup 2022🏆 Copa America 2024Insane job by this group of players and Lionel Scaloni. 👏🏻✨ pic.twitter.com/v0GOvHv9PS— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 కాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా కప్ కావడం గమనార్హం. దీంతో అతడికి తన సహచరులు అద్భుతమైన విజయంతో విడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇప్ప్పుడు తన జట్టు విజయం సాధించడంతో మెస్సీఆనందంలో మునిగి తేలుతున్నాడు. Angel di Maria unsung hero of the match Played his last game in Argentina hersey what a player #ARGvsCOL pic.twitter.com/hnu42h3ekZ— Harshit 🇮🇳 (@krharshit771) July 15, 2024 -
ఫుట్‌బాల్ జోష్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి. స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. -
23 ఏళ్ల తర్వాత...
చార్లోటి (నార్త్ కరోలినా): రెండోసారి కోపా అమెరికా కప్ చాంపి యన్‌గా నిలిచేందుకు కొలంబియా జట్టు విజయం దూరంలో నిలిచింది. గతంలో 15 సార్లు చాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వే జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా సొలిస్ గోల్ చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొలంబియా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి అర్ధభాగం చివర్లో కొలంబియా ప్లేయర్ మునోజ్ రెడ్ కార్డుకు గురై మైదా నం వీడాడు. దాంతో రెండో అర్ధభాగం మొత్తం కొలంబియా పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తంలో ఉరుగ్వే 62 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా కొలంబియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయడంలో విఫలమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో కొలంబియా ఆడుతుంది. 1975లో తొలిసారి ఈ టోరీ్నలో ఫైనల్ చేరిన కొలంబియా రన్నరప్‌గా నిలువగా ... 2001లో రెండోసారి ఫైనల్ ఆడి తొలి టైటిల్ సొంతం చేసుకుంది. -
Copa America: సంచలన విజయం.. ఫైనల్లో కొలంబియా
కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొలంబియా సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఉరుగ్వేను 1-0తో ఓడించింది. తద్వారా ఇరవై మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది.పోటాపోటీగా సాగిన ఆట 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా గోల్ కొట్టి కొలంబియా గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే, ఓటమిని జీర్ణించుకోలేని ఉరుగ్వే ఆటగాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఉరుగ్వే స్ట్రైకర్ నూనెజ్ సహా మరికొందరు ఆటగాళ్లు.. ప్రేక్షకులు ఉన్న స్టాండ్‌లోకి దూసుకొచ్చి కొలంబియా మద్దతుదారులపై పిడిగుద్దులు కురిపించాడు.దీంతో మ్యాచ్‌కు వేదికైన బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాహకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో 28 విజయాలతో అజేయంగా నిలిచిన కొలంబియా ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. మియామీ వేదికగా ఇరు జట్లు ఆదివారం టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. కాగా 2001లో కొలంబియా తొలిసారి ఈ టోర్నమెంట్లోట్రోఫీ గెలిచింది.30వసారి టైటిల్ పోరుకు అర్హత కాగా వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 30వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టుపై గెలిచింది.ఆట 22వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట 51వ నిమిషంలో మెస్సీ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేసుకుంది. అర్జెంటీనా తరఫున మెస్సీకిది 109వ గోల్ కావడం విశేషం. ఇక మెస్సీ 38 వేర్వేరు దేశాలపై గోల్స్ చేశాడు.అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టు తరఫున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 130 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీ ఘనత సాధించాడు.After defeat to Colombia, Uruguayan players entered the stands at Bank of America Stadium and began to throw punches. Liverpool forward Darwin Nunez amongst those at the forefront. pic.twitter.com/VE3unKObSa— Kyle Bonn (@the_bonnfire) July 11, 2024 -
ఇజ్రాయెల్‌కు షాక్.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు ఆగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్‌కు గట్టిపట్టున్న రఫాలో వారిని అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు పెట్రో రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
కొలంబియా పల్లెల్లో రోజూ స్టంట్లే
-
బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో షకీరా విగ్రహం ఆవిష్కరణ
గ్రామీ అవార్డు విజేత సింగర్ షకీరా బెల్లి డ్యాన్స్‌కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు! తన బెల్లి డ్యాన్స్‌తో అభిమానుల ప్రేమను కొల్లగొట్టిన ఈ కొలంబీయన్ సింగర్ క్యాంసం విగ్రహన్ని ఆమె సొంత సిటీ బారన్క్విల్లాలో ఆవిష్కరించారు. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో ఉన్న 6.5 మీటర్లు (21 అడుగుల) విగ్రహాన్ని బారన్క్విల్లా మేయర్ జైమ్ పుమారెజో, ఆమె తల్లిదండ్రుల సమక్షంలో నగరంలోని మాగ్డలీనా నది తీరంలో మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కాంస్య విగ్రహంలో షకీరా.. పొడవాటి రింగుల జుట్టుతో చేతులు పైకి ఎత్తి బెల్లి డ్యాన్స్ చేస్తున్న పోజ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహ రూప శిల్పి అయిన యినో మార్క్వెజ్ మాట్లాడుతూ..‘అమ్మాయిలు తమ జీవితంలో ఎటువంటి కలలు కంటారో. వాటిని ఎలా సాధిస్తారో షకీరా కాంస్య విగ్రహం ద్యారా తెలుస్తుంది’ అని తెలిపారు. స్థానిక పిల్లలకు సంబంధించి పలు పాటల కాన్సెర్టుల్లో షకీరాను చూశానని మేయర్ జైమ్ పుమారెజో తెలిపారు. షకీరా 2023లో మూడు లాటిన్ గ్రామీ అవార్డులు గెలుపొందారు. oh shakira, don't end the liberty statue like that pic.twitter.com/6w5a5HUaAw — alexander AG7 ERA (@grandesrockwell) December 26, 2023 మరోవైపు ఆమె ‘పైస్ డెస్కాల్జోస్’, ‘బేర్ ఫుట్’ అనే సంస్థల ద్వారా పిల్లల కోసం స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షకీరా మియామిలో ఉంటోంది. తన కాంస్య విగ్రహం ఆవిష్కరణపై మేయర్ కార్యాలయానికి ఆమె ఓ సందేశం పంపారు. ‘నా కాంస్యం విగ్రహం ఆవిష్కరించం పట్ల చాలా గొప్పగా భావిస్తున్న. ‘బారన్క్విల్లా’ సీటీ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సిటీ నాకు సొంత ఇల్లుతో సమానం’ అని షకీరా తెలిపారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద పూల సంబరం!
కొలంబియాలో జరుగుతున్న పూలసంబరాల ఫొటోలు ఇవి. ప్రపంచంలోనే అతిపెద్ద పూలసంబరాలు ఇవి. కొలంబియాలోని మెడలీన్ నగరంలో 1958 నుంచి ఏటా ఆగస్టులో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. అంతకుముందు ఈ వేడుకలను మే నెలలో నిర్వహించేవారు. కొలంబియాలో బానిసత్వం రద్దయిన సందర్భానికి ప్రతీకగా పూలసంబరాలను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ పేరుతో నిర్వహించడం ప్రారంభించారు. బానిసత్వం ఉన్నకాలంలో ఎత్తయిన ప్రదేశాలకు బానిసలు తమ వీపులపై మనుషులను మోసుకుపోయేవారు. పూల వేడుకల్లో మనుషులకు బదులుగా పూలబుట్టలను వీపులపై మోస్తూ ఊరేగింపు జరపడం ఆనవాయితీగా మారింది. ఈ సంబరాల్లో భాగంగా పాతకాలం కార్లను, బైకులను పూలతో అలంకరించి మెడలీన్ వీథుల్లో 11 కిలోమీటర్లు ఊరేగింపు సాగించారు. ఈసారి జరిగిన పూలసంబరాల్లో పూల ప్రదర్శనలు, భారీ పూల అలంకరణలతో మెడలీన్ నగరం పూలవనాన్ని తలపించింది. ఈ వేడుకల్లో భాగంగా అందాల పోటీలు, పుష్పాలంకరణ పోటీలు, సంగీత, నృత్య ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి.. దేశ విదేశాల నుంచి దాదాపు పాతికలక్షల మంది పర్యాటకులు ఈ పూలప్రదర్శనను తిలకించారు. (చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!) -
అమెజాన్ అడవుల్లో అద్భుతం
బొగొటా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక అద్భుతం జరిగింది. విమాన ప్రమాదంలో చిక్కుకొని అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఏకంగా 40 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటపడ్డారు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే ఒక అద్భుతమైతే, క్రూరమృగాలు తిరిగే అడవుల్లో 40 రోజులు ప్రాణాలతో ఉండడం మరో అద్భుతం. దట్టమైన అటవీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సైనికులు వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పౌష్టికాహార లోపంతో బాగా బలహీనపడిపోవడంతో పాటుగా ఆ చిన్నారుల శరీరంపై పురుగు పుట్రా చేసిన కాట్లు ఉన్నాయి. ఒకే తల్లి బిడ్డలైన నలుగురు చిన్నారుల్లో 13, 9. 4 ఏళ్లతో పాటుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోతారు : అధ్యక్షుడు పెట్రో అడవుల్లో కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు క్షేమంగా వెనక్కి తిరిగి రావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో మృత్యుంజయులు అన్న మాటకి వీరంతా ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. వీరు ప్రాణాలతో ఉండడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇదొక మేజికల్ డే అని సైనికులు చేసిన కృషిని అభినందించారు. అసలేం జరిగింది? అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలో అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి గత నెల మే 1న ఒక సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరింది. నలుగురు చిన్నారులు, వారి తల్లి, ఒక గైడ్, ఒక పైలెట్‌తో విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్ విఫలం కావడంతో దట్టమైన కీకారణ్యంలో కుప్పకూలిపోయింది. విమానం రాడార్ నుంచి అదృశ్యం కావడంతో అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆపరేషన్ హోప్ పేరుతో సహాయ చర్యలు మొదలు పెట్టారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల అనంతరం మే 16న అధికారులు విమాన శకలాలను గుర్తించగలిగారు. అక్కడ పైలెట్, గైడ్, చిన్నారుల తల్లి మృతదేహాలు మాత్రమే లభించడంతో పిల్లలు నలుగురు సజీవంగా ఉన్నారని నిర్ణారణకి వచ్చారు. పిల్లలు క్షేమంగానే ఉన్నారనడానికి సైనికుల గాలింపుల్లో పాలసీసా, సగం తిని పారేసిన పండు, జడకు కట్టుకునే రిబ్బన్ వంటివి దొరకడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశారు. పిల్లల అడుగు జాడలు కూడా చాలా చోట్ల కనిపించాయి. వాటి ఆధారంగా దాదాపుగా 150 మంది సైనికులతో పాటుగా జాగిలాల సాయంతో దట్టమైన అడవుల్లో గాలించారు. అడవుల్లో ఉండే గిరిజన తెగలు వారికి సహకారం అందించారు. మొత్తానికి ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత అధికారులు ఆ పిల్లల జాడ కనిపెట్టగలిగారు. హెలికాప్టర్లో రాజధాని బొగొటాలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలా మనుగడ సాగించారు? అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇన్నాళ్లూ పులులు, పాములు ఇతర క్రూరమృగాల మధ్య ఎలా మనుగడ సాగించారో వివరాలు తెలియాల్సి ఉంది.ఆ పిల్లలు హ్యూటోటో అనే స్థానిక తెగకు చెందినవారు. పుట్టినప్పట్నుంచి అటవీ ప్రాంతాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లకు కాసే ఏ పళ్లు తినాలో , క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలో కొంతవరకు వారికి అవగాహన ఉంది. అందుకే కీకారణ్యంలో తప్పిపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ కార్యక్రమాల్లో భాగంగా హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు బహుశా పిల్లలను కాపాడి ఉంటాయని సైనికాధికారులు భావిస్తున్నారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో వారి బామ్మ ఫాతిమా వాలెన్సియా ఆనందానికి హద్దులే లేవు. పిల్లల తల్లి పనిలో ఉన్నప్పుడు పెద్దమ్మాయి మిగిలిన చిన్నారుల ఆలనాపాలనా చూసేదని, అదే ఇప్పుడు అడవుల్లో వాళ్లు ఇన్నాళ్లూ గడపడానికి ఉపయోగపడిందని చెప్పారు. -
అద్భుతం జరిగింది.. సజీవంగా 40 రోజులకు దొరికిన చిన్నారులు
నమ్మకం వమ్ము కాలేదు. అడవితల్లే కరుణించిందా అన్నట్లుగా అద్భుతం జరిగింది. వన్య మృగాలు.. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంటపడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఆ నలుగురు చిన్నారులు. విమాన ప్రమాదంలో తల్లిని పొగొట్టుకున్నప్పటికీ.. తామైనా సజీవంగా బయటపడాలన్న వాళ్ల సంకల్పం ఫలించింది. దట్టమైన అమెజాన్ అడవుల్లో తప్పిపోవడంతో రంగంలోకి దిగిన కొలంబియా సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 40 రోజుల తర్వాత వాళ్ల జాడను కనిపెట్టింది. చివరకు.. అమెజాన్ అడవుల్లో పాపం పసివాళ్ల కథ సుఖాంతంమైంది. ఆ నలుగురి వయసు 13, 9, 4, 11 నెలలు. అయితేనేం దట్టమైన అమెజాన్ అడవుల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు. దాదాపు నెలకు పైనే పెద్దలెవరూ లేకుండా అడవుల్లో గడిపారు. 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను దగ్గరుండి కాపాడుకుంటూ వచ్చింది. సూర్యుడి వెలుతురు కూడా నేల మీద పడనంత చీకట్లు అలుముకునే అడవుల్లో.. ముందుకు సాగింది. దొరికింది తింటూ.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ముందుకు సాగింది. మే 1న వాళ్లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికాగా.. శుక్రవారం(జూన్ 9న) సాయంత్రం ఆ నలుగురు చిన్నారుల జాడను కొలంబియా సైన్యంలోని ఓ బృందం గుర్తించింది. 👉 కొలంబియా అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన రీజియన్ అది. విషపూరితమైన కీటకాలు, వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటూ దొరికింది తింటూ ఇన్నాళ్లూ గడిపారు ఆ చిన్నారులు. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అడవుల్లో దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ.. మధ్యలో సైన్యం ఆకాశం నుంచి జారవిడిచిన ఆహార పొట్లాలను సైతం అందుకున్నారాట. పౌష్టికాహర లోపం తప్పించి.. వాళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకపోవడం గమనార్హం. అంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే.. 11 నెలల ఆ పసికందు సైతం ఆరోగ్యంగానే ఉందని ఆర్మీ డాక్టర్లు ప్రకటించారు. పైగా ఆ చిన్నారి తన ఏడాది పుట్టినరోజును అమెజాన్లోనే చేసుకుందట(గడపడం). నలభై రోజుల క్రితం 👉 మే 1 ఉదయం, సెస్నా 206 అనే ఓ తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ, ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 👉 దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అది ప్రమాదానికి గురైంది. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. దీంతో వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారేమో అని సైన్యం భావించింది. అవాంతరాలు ఏర్పడ్డా.. 👉 వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. భీకరమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 👉 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తూ వచ్చారు. వాళ్ల ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొలంబియా మొత్తం వాళ్లు ప్రాణాలతో బయటపడాలంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. వాళ్లకు అలవాటేనా? 👉 అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) తెగకు చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. పైగా లెస్లీకి వాళ్ల బామ్మ అన్ని విధాల శిక్షణ ఇచ్చిందట. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేసిందామె. వాళ్లు ఊహించినట్లే లెస్లీ రక్షణ బాధ్యతలు తీసుకుంది. అమ్మలా వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. -
అమెజాన్ అడవుల్లో.. పాపం పసివాళ్లు
దట్టమైన అమెజాన్ అడవులు. నెల రోజులుగా అలుపెరగకుండా ముందుకు సాగుతున్న సైన్యం. పాపం.. ఆ నలుగురు పసివాళ్లు ఇంకా బతికే ఉంటారనే ఆశ వాళ్లను అలా ముందుకు పోనిస్తోంది. సజీవంగా ఆ చిన్నారులు ఇంటికి చేరాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు ఇప్పుడు. కొలంబియా అమెజాన్ అడవుల్లో నెల కిందట తేలికపాటి విమాన ఒకటి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అయితే.. అందులో ప్రయాణించిన నలుగురు చిన్నారులకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు బయటపడి ఉంటారని, అడవుల్లోనే ఎక్కడో ఒక దగ్గర సురక్షితంగా తలదాచుకుని ఉండిఉంచొచ్చని కొలంబియా సైన్యం భావిస్తోంది. ఆ ఆశతోనే భారీ సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 శాటిలైట్ చిత్రాల్లో.. పిల్లలు విమాన శకలాల నుంచి నడుచుకుంటూ వెళ్లిన కాలిముద్రలు, అలాగే వాళ్ల కోసం గాలిస్తున్న బృందానికి వాళ్లకు సంబంధించిన వస్తువులు, అడవుల్లో తాత్కాలిక ఆశ్రయం కోసం చేసుకున్న ఏర్పాట్లు, సగం తినిపడేసిన పండ్లు.. కిందటి వారం ఒక జత బూట్లు, డైపర్.. ఇలా ముందుకు వెళ్లే కొద్దీ పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులు దొరుకుతుండడంతో వాళ్లు బతికే ఉంటారన్న ఆశలతో గాలింపును ఉధృతం చేశారు. 👉 దొరికిన ఆధారాలతో వాళ్లు సజీవంగానే ఉన్నారని భావిస్తున్నాం. వాళ్లకు కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న జనరల్ పెడ్రో చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు చనిపోయి ఉంటే స్నిఫ్ఫర్ డాగ్స్ సాయంతో ఈపాటికే ఆ మృతదేహాలను కనిపెట్టేవాళ్లం. కానీ, అలా జరగలేదు కాబ్టటి వాళ్లు బతికే ఉంటారని మేం భావిస్తున్నాం అని ఆయన చెబుతున్నారు. 👉 ఏం జరిగిందంటే.. మే 1 ఉదయం, సెస్నా 206 తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. అయితే ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 👉 ఆపై అది ప్రమాదానికి గురైందని ధృవీకరించుకుని.. శకలాల కోసం గాలింపు చేపట్టారు. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. అయితే.. లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ కనిపించకుండా పోయారు. 👉 దీంతో 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావిస్తున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తున్నారు. 👉 విమాన ప్రమాదంలో ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో చిన్నారు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భీకరమైన,దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో.. రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. అడవి మార్గంలో ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఆ ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి. మూడు కిలోమీటర్లపాటు ఫోకస్ పడేలా సెర్చ్లైట్లను అడవుల్లో ఏర్పాటు చేసింది సైన్యం. తద్వారా పిల్లలు తమవైపు వస్తారనే ఆశతో ఉంది. ఆ నమ్మకమే బతికిస్తోంది.. కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) కమ్యూనిటీకి చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ చిన్నారుల తాత. లెస్లీ తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందేమోనని అంటున్నాడాయన. అయితే.. క్రూర వన్యప్రాణులతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు నెలవు ఆ ప్రాంతం. అలాంటి ముప్పును వాళ్లు ఎలా ఎదుర్కొంటారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారాయన. -
ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..
మనం ఎంతగానో ప్రేమించే భాగస్వామీ లేదా ప్రియమైన వాళ్లు దూరమైతేనే తట్టుకోలేం. అలాంటిది ఎవరి వల్లనో మనవాళ్లను పోగొట్టుకుంటే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ మాదిరి రివేంజ్ తీర్చుకోవడం అందరి వల్ల సాధ్య కాదు కూడా! కానీ కొందరూ మాత్రం చూస్తూ కూర్చోలేరు. ఏం చేసేందుకైనా తెగించి మరీ తమ రివేంజ్ తీర్చుకుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందినదే కొలంబియాకు చెందిన మహిళ. వివరాల్లోకెళ్తే.. కొలంబియాకు చెందిన మహిళ భర్త.. పేరు మోసిన డ్రగ్ వ్యాపారి రుబెన్ డారియో విలోరియా బారియోస్ చేతిలో హతమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని సదరు మహిళ ఎలాగైనా అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఆ మహిళ.. డ్రగ్ వ్యాపారి కోసం గాలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులతో చేతులు కలిపింది. ఆమె అనుకున్న ప్లాన్ ప్రకారమే..వలపు వల విసిరి మరీ అతడిని ప్రేమలోకి దించింది. అతడితో ప్రేమాయాణం సాగిస్తూనే అతడికి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడూ ఇంటిలిజెన్స్ అధికారులకు చేరవేసింది. ఒక రోజు ఆ మహిళ తన ‘ప్రియుడి’కి మోంటారియా అనే వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేసింది. ముందుగానే అతడికోసం మాటువేసి ఉన్న ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. అతడిపై డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారి కల్నల్ గాబ్రియేల్ గార్సియా అన్నారు. అతడిని జువాంచో అని కూడా పిలుస్తారని చెప్పారు. ఆ మహిళ సాయంతో పేరు మోసిన నిందితుడిని పట్టుకోగలిగామని అన్నారు. చివరికి బాధిత మహిళ తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితుడు రుబెన్ డారియోకి 22 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. (చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు') -
మణికట్టు గాయం బాధిస్తున్నా..‘రజతం’తో మెరిసి! మీరాబాయి అరుదైన ఘనత
World Weightlifting Championship- 2022- బొగోటా (కొలంబియా): మణికట్టు గాయం బాధిస్తున్నా... భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వెనక్కి తగ్గలేదు. ప్రయత్నిస్తే పతకం రాకపోదా అని ఆశాభావంతో మొండి పట్టుదలగా బరిలోకి దిగిన ఈ మణిపూర్ తార అనుకున్నది సాధించింది. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. 28 ఏళ్ల మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు బరువెత్తింది. జియాంగ్ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించగా... జిహువా (చైనా; 198 కేజీలు) కాంస్యం దక్కించుకుంది. రెండో పతకం ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మీరాబాయికిది రెండో పతకం. 2017లో ఆమె 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ‘మణికట్టు గాయం వేధిస్తున్నా దేశానికి పతకం అందించాలనే పట్టుదలతో ప్రయత్నించి సఫలమయ్యాను. వచ్చే ఏడాది ఆసియా క్రీడల్లో, ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తా’ అని మీరాబాయి తెలిపింది. మీరాబాయి అరుదైన ఘనత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన నాలుగో భారత మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. గతంలో కుంజరాణి దేవి (7 రజత పతకాలు), కరణం మల్లీశ్వరి (2 స్వర్ణాలు, 2 కాంస్యాలు), నీలంశెట్టి లక్ష్మీ (1 రజతం, 1 కాంస్యం) ఈ ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో మీరాబాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు View this post on Instagram A post shared by Vijay Sharma (@sharma1970vijay) Despite her wrist injury, she still won a silver medal at the WC with a total lift of 200kg Congratulations @mirabai_chanu on winning silver in women's 49kg at the WWC. She beats Olympic champ Hou Zhihua 198kg from China. 2017 WC🥇 2020 Olympics🥈 2022 WC🥈 Proud of you 👍 pic.twitter.com/cK8hq1W0Go — Anurag Thakur (@ianuragthakur) December 7, 2022 -
వైరల్ వీడియో: ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
-
ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
వైరల్: ‘దేవుడు మరో అవకాశం ఇస్తే..’ ఇప్పుడున్న జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాలని కోరుకుంటారు ఎక్కువ మంది!. కానీ, ఈ అందమైన శివంగి మాత్రం అలా కాదు.. తాను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటోంది. అది శారీరకంగా కాదు.. మానసికంగా!. డబ్బు కోసమో, సుఖం కోసమో ఆమె అస్సలు ఆశపడడం లేదు. ఎందుకంటే.. వ్యవస్థలో చెడుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె.. తనలాగే బతకాలనుకుంటోంది కాబట్టి! కొలంబియా మెడెలిన్‌కు చెందిన డియానా రామిరెజ్diana ramirez.. ఈ మధ్య తరచూ వార్తల్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఆమె అందం. ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసాఫీసర్‌గా ఇంటర్నెట్లో ఆమెపై ఓ ప్రచారం నడుస్తోంది. అఫ్కోర్స్.. ఈమె కంటే అందగత్తెలు ఉండొచ్చు. కానీ, ఇప్పటికైతే ఈమెదే హవా నడుస్తోంది. View this post on Instagram ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరున్న మెడెలిన్ వీధుల్లో పోలీస్ అధికారిణిగా డియానా రామిరెజ్ పహారా కాస్తూ కనిపిస్తుంటుంది. రోజులో 14 గంటలు ఆమె డ్యూటీలోనే గడుపుతోంది. ఈ సర్వీసులో ఇప్పటిదాకా వీరోచితంగా ఛేజ్ చేసి ఆమె ఎంతో మంది నేరగాళ్ల ఆటకట్టించింది కూడా. అందంగా ఉంది.. రిస్క్ చేసి ఈ ఉద్యోగం చేయడం ఎందుకు? హాయిగా ఏ మోడల్ కుదరకుంటే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కావొచ్చు కదా అని కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు ఆమెకు. కానీ, ఆమె మాత్రం ‘నో’ అని తెగేసి చెప్తోంది. ‘‘ఒకవేళ మరోసారి కెరీర్‌ను ఎంచుకోమని దేవుడు అవకాశం ఇస్తే.. నేను పోలీస్ వృత్తినే ఎంచుకుంటా. ఎందుకంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం నాకు ఇష్టం. ఈ వృత్తి నాకు ఎంతో నచ్చింది. పోలీస్ వ్యవస్థ కూడా నాకు అంతే గౌరవం ఇచ్చింది. రంగు, రూపం, అందం ఇవన్నీ పుట్టుకతో వచ్చినవి. కానీ, శాశ్వతమైంది మాత్రం ఆత్మవిశ్వాసమే. నా తల్లిదండ్రులు నాలో దేశభక్తిని నింపారు.నా దేశం కోసం.. నేరరహిత సమాజం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వీడే ప్రసక్తే లేదు. రిస్క్ చేయడంలోనే మజా ఉంటోంది కదా అని చెబుతోందామె. తాజాగా డియానా రామిరెజ్ను బెస్ట్ పోలీస్/మిలిటరీ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుకు నామినేట్ చేశారు అక్కడ. బాధ్యత గల వృత్తుల్లో ఉంటూ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎక్కువ మందిని ఆకట్టుకునేవాళ్లకు ఈ గుర్తింపు ఇవ్వాలని ఇన్‌స్టాఫెస్ట్ అవార్డుల పేరుతో ఓ మీడియా హౌజ్ అవార్డులను ప్రదానం చేయడం ప్రారంభించింది అక్కడ. -
World U20 Championship: కాంస్యం నెగ్గిన రూపల్ చౌదరీ
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం వచ్చింది. కొలంబియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల 400 మీటర్ల విభాగంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రూపల్ చౌదరీ కాంస్య పతకాన్ని సాధించింది. 17 ఏళ్ల రూపల్ 400 మీటర్ల దూరాన్ని 51.85 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. యెమీ మేరీజాన్ (బ్రిటన్; 51.50 సెకన్లు) స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో రూపల్ ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 4X400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రజతం నెగ్గిన భారత బృందంలో రూపల్ సభ్యురాలిగా ఉంది. -
Shakira Tax Fraud Case:మ్యూజిక్ క్వీన్ షకీరాకు జైలు శిక్ష ముప్పు
మాడ్రిడ్: కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు. ఆమె దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012– 2014 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల మేర పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెటిల్మెంట్ చేసుకోవాలన్న లాయర్ల సూచనను షకీరా తిరస్కరించారు. షకీరా పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేర్చారని ఆమె తరపు ప్రజా సంబంధాల సిబ్బంది వెల్లడించారు. -
‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..!
ఇక్కడ ఫొటోలో ఉన్నవి కాఫీ కప్పులే! అయితే ఏంటి అనుకుంటున్నారా? ఆగండాగండి. ఆషామాషీ పింగాణీ కప్పులో, ప్లాస్టిక్ కప్పులో కావు, అచ్చంగా కాఫీతోనే తయారు చేసిన కాఫీ కప్పులివి. కాఫీని కాచి వడబోసుకున్నాక మిగిలిపోయిన వ్యర్థాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కప్పులను తయారు చేశారు. పొరపాటున జారిపోయి నేలమీద పడినా, పింగాణీ కప్పుల మాదిరిగా ఇవి అంత తేలికగా పగిలిపోవు. చాలాకాలం మన్నుతాయి. వీటిలో కాఫీ పోసినప్పుడే కాదు, ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇవి కాఫీ పరిమళంతో ఘుమఘుమలాడుతుంటాయి. కొలంబియాకు చెందిన రికార్డో, డేనియేలా అనే దంపతులు తమ బృందంతో కలసి ‘క్రీస్ కప్స్’ పేరిట ఈ కాఫీ కప్పులను రూపొందించారు. చదవండి: దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..! -
కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్
బొగొటా: దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్ 7న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆఫ్రో–కొలంబియన్ అయిన ఫ్రాన్సియా మార్కెజ్(40) చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన మార్కెజ్ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు . తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్మెంటల్ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పోల్ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు. కానీ, పార్టీలోని మిగతా సీనియర్ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు. -
ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
కార్టజినా: 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్‌జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్‌తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది! -
ప్రేయసి ముద్దే.. పోలీసులకు పట్టించింది
అతనొక భయంకరమైన నేరస్తుడు. సుమారు 200 దేశాల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 196 దేశాల్లో ఇంటర్‌పోల్ అతని అరెస్ట్ కోసం రెడ్ వారెంట్ జారీ చేసింది. ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ప్రియురాలి అత్యుత్సాహంతో ఎట్టకేలకు బుక్కైపోయాడు. ఆమెకు ముద్దు పెట్టి పోలీసులకు దొరికిపోయాడు. అదెలాగంటే.. మెక్సికన్ డ్రగ్ లార్డ్, సినాలోవా కార్టెల్ మాఫియా ముఖ్యనేత జోవాక్విన్ గుజ్మన్ అలియాస్ ఎల్ చాపో గుర్తున్నాడా? ప్రస్తుతం అతను జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతని ముఖ్య అనుచరుడు, ఎల్ పిట్ గా పేరొందిన ‘బ్రియాన్ డొనాసియానో ఒలుగ్విన్ వెర్డుగో’ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికీ డ్రగ్స్లావాదేవీలు, అక్రమ రవాణా కొనసాగిస్తూ.. ఎల్ చాపోనే మించిపోయాడు. అలా 39 ఏళ్ల ఎల్ పిట్‌పై.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు జారీ అయ్యాయి. చివరికి.. అతగాడి గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహమే అతన్ని పట్టించింది. కొన్నిరోజుల కిందట ఫేస్ బుక్ లో అమెరికా డ్రగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులకు ఓ ఫొటో కంటబడింది. ఓ పర్యాటక ప్రాంతంలో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఉన్నది ఎల్ పిట్ అని గుర్తించిన అమెరికా డ్రగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతడు కొలంబియాలో ఉన్నట్టు కనిపెట్టారు. పక్కా స్కెచ్‌తో.. వెంటనే కొలంబియా అధికారులకు సమాచారం అందించారు. దాంతో పక్కా ప్లాన్ వేసిన కొలంబియా పోలీసులు క్యాలీ నగరంలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎల్ పిట్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అతడు కొలంబియాలోనే ఉంటున్నాడట. మెక్సికో, అమెరికా దేశాలకు వేల కోట్ల విలువైన కొకైన్ ను తరలించేందుకు కొలంబియాలోని (రివల్యూషనరీ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) 'ఫార్క్' గెరిల్లా దళాల సాయం కోరేందుకు అతడు కొలంబియాలో మకాం వేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో.. మెక్సికోలో మోడల్ అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్యాలీలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో దిగినట్లు తెలిసింది. ఆపై ఆమె ప్రఖ్యాత టూరిస్టు కేంద్రం లాస్ క్రిస్టాలెస్ కు తీసుకువచ్చింది. అక్కడ పర్వతంపై ముద్దు పెట్టుకుంటూ ఇద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. దొరికిపోయాడు. ఇదే మెక్సికోలో అయి ఉంటేనా? అయితే దాడుల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎల్ పిట్ కొలంబియా పోలీసులకు 2,65,000 డాలర్ల లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడట. అంతేకాదు, ఇదే ఘటన మెక్సికోలో జరిగుంటే తన సాయుధ దళాలు కొద్దిసేపట్లోనే తనను విడిపించి ఉండేవని పోలీసులతో చెప్పాడట. గట్టి భద్రత మధ్య అతడిని పలు కేసుల విచారణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియాకు తరలించనున్నారు. -
కొండ చరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయి 14 మంది మృతి
Mudslide In Western Colombia: కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన బురదలో కూరుకుపోయి 14 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి పెద్ద మొత్తంలో బురదనీరు చేరడంతో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. అంతేగాక పెరీరా మునిసిపాలిటీలోని రిసరాల్డాలో కొండ చరియాలు విరిగిపడటంతో ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. దీంతో పెరీరా మేయర్ కార్లోస్ మాయా ఈ ప్రాంతంలో కొండచరియాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అయ్యో జగదీశ్ ! చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయావే!!) -
FIFA 2022: ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. బ్రెజిల్..
FIFA 2022: Brazil Qualify For World Cup By Beat Colombia- సావోపాలో (బ్రెజిల్): ఖతర్ వేదికగా 2022లో జరిగే ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఐదు సార్లు చాంపియన్ బ్రెజిల్ అర్హత సాధించింది. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ దక్షిణ అమెరికా రీజియన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 1–0తో కొలంబియాపై విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున లుకాస్ (72వ నిమిషంలో) గోల్ సాధించాడు. దాంతో టోర్నీలో బ్రెజిల్ 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం 34 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తద్వారా టోర్నీలో మరో ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి దక్షిణ అమెరికా జట్టుగా బ్రెజిల్ నిలిచింది. చదవండి: ‘గోపీచంద్ మరిన్ని విజయాలు అందించాలి’ Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్‌తో.. కానీ.. -
పచ్చదనం కోసం ప్రాణత్యాగం
మన కళ్లముందే ఎవరినైనా అడ్డంగా నరికి చంపేస్తూ ఉంటే మనకెందుకొచ్చిన గొడవలే అని కళ్లుమూసుకుని అక్కడ్నుంచి జారుకునే వాళ్లే ఎక్కువమంది. కొందరు మాత్రం అలా ఉండలేరు. బాధితుల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాడతారు. వాళ్లు హక్కుల నేతలు. ఇంకొందరుంటారు. మనుషులనే కాదు పచ్చటి చెట్టుకొమ్మను నరికినా, స్వచ్ఛజలాలను పాడుచేసినా, పీల్చే గాలికి ప్రమాదం ముంచుకొచ్చినా తట్టుకోలేరు. వీళ్లు పర్యావరణవేత్తలు. చిత్రం ఏంటంటే ఈ ఇద్దరూ అంటే అక్రమార్కులకు ముచ్చెమటలే! వీళ్లని ఊరికే ప్రాణాలతో ఉంచడం ఎందుకని కనికరం లేకుండా చంపేస్తూ ఉంటారు. పచ్చదనాన్నీ, పర్యావరణాన్నీ ప్రేమించే ఆకుపచ్చయోధులపై జరిగే హత్యలకు కొలంబియా రాజధానిగా మారిపోయింది. బ్రెజిల్, మెక్సికో, హోండురస్, కొలంబియాల్లో పర్యావరణవేత్తగా పనిచేయడం అంటే మృత్యువుతో సహవాసం చేయడమే. ఆఫ్రికా దేశాల్లోనూ పర్యావరణ వేత్తలపై హత్యాకాండలు ఏటేటా పెరుగుతున్నాయి. కెన్ సారో వివా. నైజీరియాలో ఒగోనీ తెగకు చెందిన మేధావి. రచయిత. టీవీ ప్రొడ్యూసర్. హక్కుల నేత. అంతకు మించి పర్యావరణ వేత్త. రాయల్ డచ్‌కు చెందిన షెల్ ఆయిల్ కంపెనీ నైజీరియాలో అడ్డగోలుగా క్రూడ్ ఆయిల్ కోసం జరిపే తవ్వకాల కారణంగా ఒగోనీ తెగ సాగు చేసుకునే పంటపొలాలు కాలుçష్యంతో నాశనమైపోతున్నాయి. ఈ దుర్మార్గం పైనే కెన్ సారో వివా అహింసాయుత పోరాటం చేశాడు. తన జాతి జనుల కోసం తానే ఓ ఆయుధం అయ్యాడు. 3 లక్షల మందితో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించాడు. ఆయిల్ కంపెనీ పెద్దలతో పాటు సైనిక పాలకులకూ శత్రువైపోయాడు. ఓ హత్యకేసులో ఇరికించి వివాతో పాటు మరో 8 మందిని ఉరితీసి చంపేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా భగ్గుమంది. నైజీరియాను కామన్వెల్త్ దేశాల సభ్యత్వం నుంచి మూడేళ్ల పాటు నిషేధించారు. వివాను హత్యకేసులో ఇరికించిన దొంగసాక్షులు షెల్ కంపెనీ యాజమాన్యం తమకు ఉద్యోగాలు, డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పించిందని న్యాయమూర్తి సమక్షంలోనే ఒప్పుకున్నారు. కానీ ఏం లాభం? అప్పటికే వివాను చట్టబద్ధంగా హత్యచేశారు. 2020లోనే ప్రపంచ వ్యాప్తంగా 227 మంది పర్యావరణవేత్తలు దారుణ హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న హత్యల్లో మూడొంతులు లాటిన్ అమెరికాలోనే కావడం విశేషం. 2019–20లో ఒక్క కొలంబియాలోనే 64 మందిని చంపేశారు. ప్రపంచంలోనే బొగ్గు ఎగుమతుల్లో కొలంబియా 5వ స్థానంలో ఉంది. ఈ బొగ్గంతా కూడా అడవులను అడ్డంగా నరికి, చెట్లను కాల్చి తయారు చేసిందే కావడం ఆందోళన కలిగించే అంశం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ను పరిరక్షించుకోడానికి కొందరు, ఇష్టారాజ్యంగా గనుల తవ్వకాలతో ఎన్నో తెగలు, జాతుల జీవావరణాలను నాశనం చేస్తున్నారని కొందరు... తమ ప్రాణాలను పణంగా పెట్టారు. పర్యావరణానికి తూట్లు పొడిచే వాళ్లు పొడుస్తూనే పోతే, పర్యావరణ వేత్తలను ఇలాగే చంపుకుంటూ పోతే ఈ ప్రపంచమే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్యావరణ హననంతో రుతుచక్రం గతి తప్పే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు ప్రాణికోటిపై పగబట్టే ప్రమాదం రెట్టింపు అవుతుందంటున్నారు సైంటిస్టులు. పర్యావరణ పరిరక్షణ అంటేనే అదేదో మేధావులకు సంబంధించిన వ్యవహారం కాదు. మనందరి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పర్యావరణ వేత్తలు ముందుకు వస్తోంటే వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోవడం క్షమించరాని నేరం. సహించరాని ఘోరం. ఒక పర్యావరణ వేత్త తయారు కావాలంటే కొన్నేళ్లు పడుతుంది. అటువంటిది ఒక్క గొడ్డలి వేటుకో, ఒకే ఒక్క తూటాకో పచ్చదనం కోసం పరితపించే మహర్షులను పొట్టన పెట్టుకుంటున్నారు. మాఫియా ముఠాలకు ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నేతలు అండగా నిలవడం వల్లనే ఈ నరమేధం సాగిపోతోంది. మన దేశంలోనూ పారిశ్రామిక కాలుష్యాన్ని ప్రశ్నించినందుకో, గనుల తవ్వకాల పేరిట ఆదివాసీల ఆవాసాలను దెబ్బతీస్తున్నారని పోరాడుతున్నందుకో గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు లేపేస్తోన్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద పెద్ద డ్యామ్‌లను కట్టద్దంటేనూ.. ఇష్టారాజ్యంగా అడవులు తెగనరికేయద్దంటేనూ.. వాటిపై వ్యాపారం చేçసుకునే వాళ్లకీ.. ఆ వ్యాపారుల కొమ్ముకాసే రాజకీయ నేతలకీ మా చెడ్డ కోపం వస్తుంది. ఆ కోపం నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తుంది. ఈ భూమి.. దాని చుట్టూరా ఉన్న ఆవరణం.. చల్లటి సెలయేళ్లు.. ఆకుపచ్చ వనాలు... వాటితో పాటే కోట్లాది జీవరాశులు ఆనందంగా, ఆరోగ్యంగా పదికాలాల పాటు ఉండాలని కోరుకునే పర్యావరణవేత్తల గొంతులు కోయడం అంటే మన ఊపిరిని మనమే అడ్డుకోవడమంతటి మూర్ఖత్వం. ఈ పచ్చదనం మనం ఉన్నంత కాలం అనుభవించాలి. మన తర్వాత తర్వాతి తరాలకు పదిలంగా అందించాలి. దీన్ని అనుభవించే హక్కు మాత్రమే మనకి ఉంది. నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా నాశనం చేస్తోంటే దాన్ని అడ్డుకోవలసిందే. ఆ పనిచేస్తోన్న పర్యావరణవేత్తలను ముందుగా మనం కాపాడుకుంటేనే పర్యావరణం పదిలంగా ఉంటుంది. అలా జరగాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణవేత్తలపై జరుగుతోన్న దాడులకు అడ్డుకట్ట వేయడానికి కృత నిశ్చయంతో ముందుకు కదలాలి. -
టీకాలకు లొంగని ఎంయూ వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
WHO Warns On MU Variant Of Covid 19 జెనీవా: కోవిడ్–19 మహమ్మారిలో ప్రమాదకరమైన కొత్త రకాలు పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంయూ (బి.1.621) అనే కొత్త వేరియంట్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలకు లొంగడం కష్టమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లను తట్టుకొనే శక్తి ఈ కొత్త వేరియంట్‌కు మెండుగా ఉందని తెలిపింది. బి.1.621 వేరియంట్ కరోనాను తొలుత ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో గుర్తించారు. అనంతరం యూరప్‌తోపాటు అమెరికా, యూకే, హాంకాంగ్‌లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తాజాగా తమ వీక్లీ బులెటిన్‌లో వెల్లడించింది. (చదవండి: న్యూయార్క్‌లో తుపాను బీభత్సం) ఇప్పటిదాకా 39 దేశాల్లో ఎంయూ రకం కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. ఎంయూ అనేది నిశితంగా గమనించిదగ్గ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్) వేరియంట్ అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎంయూ వేరియంట్ కేసులు 0.1 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. కొలంబియా, ఈక్వెడార్‌లో మాత్రం దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఎంయూ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్ఓ ఆగస్టు 30న వాచ్‌లిస్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన బీటా వేరియంట్ తరహాలోనే ఎంయూ వేరియంట్ సైతం మనుషుల్లో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు తమ ప్రాథమిక అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. (చదవండి: కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్న టీఎస్ఆర్టీసీ..!) -
29వసారి ఫైనల్లోకి అర్జెంటీనా
బ్రెసిలియా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు 29వసారి ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1 తో సమంగా నిలిచాయి. అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (7వ ని.లో), కొలంబియా తరఫున దియాజ్ (61వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్స్ చేయకపోవడంతో షూటౌట్ అనివార్యమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో బ్రెజిల్‌తో అర్జెంటీనా తలపడుతుంది. కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా 14 సార్లు విజేతగా నిలిచింది. చివరిసారి ఆ జట్టు 1993లో టైటిల్ గెల్చుకుంది. -
వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు
బొగోటా: లోకంలో మనుషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురి సంగతి ఏమో కానీ అప్పుడప్పుడు మనుషుల్ని పోలిన మనుషులు అక్కడక్కడ ఎదరుపడతారు. వారు మంచి వారైతే పర్లేదు.. కానీ నేరస్తులు, పోలీసులు హిట్ లిస్ట్‌లో ఉన్నవారైతేనే ఇబ్బంది. తాజాగా ఫేస్బుక్ ఫౌండర్, అమెరికన్ మీడియా మాగ్నేట్ అయిన మార్క్ జుకర్‌బర్గ్‌కి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన పోలికలతో ఉన్న ఓ నేరస్తుడి కోసం కొలంబియా పోలీసులు గాలిస్తున్నారు. అతడిని పట్టిస్తే 3 మిలియన్ డాలర్లు(రూ.22,30,23,000) బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫేస్‌బుక్‌లోనే ఈ ప్రకటన చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. గతవారం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో హెలికాప్టర్లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు రక్షణ మంత్రి డియెగో మొలానో, అంతర్గత మంత్రి డేనియల్ పలాసియోస్, నార్టే డి శాంటాండర్ సిల్వానో సెరానోతో సహా కొందరు అధికారులున్నారు. అదృష్టం కొద్ది ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా కొలంబియా పోలీసులు నిందుతుల స్కెచ్ గీయించారు. వీరిలో ఒక వ్యక్తి అచ్చం ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్లానే ఉన్నాడు. కొలంబియా పోలీసులు నిందుతుల ఊహాచిత్రాలను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. ‘‘ఈ ఫోటోలో ఉన్నవారిని పట్టుకోవడంలో మాకు సాయం చేయండి. మిస్టర్ ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్, అతని పరివారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దాడి చేసిన నేరస్థుల చిత్రాలు ఇవి. వీరిని పట్టించినవారికి 3మిలియన్ డాలర్ల బహుమతి అందిస్తాం. వీరి గురించి సమాచారం తెలిసినవారు ఈ నంబర్లకు 3213945367 లేదా 3143587212 కాల్ చేయండి’’ అని మెసేజ్ చేశారు. ఈ ఫోటోలో ఓ వ్యక్తి అచ్చు మార్క్ జుకర్‌బర్గ్‌లా ఉండటంతో అది అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటినులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘కొంపతీసి జుకర్‌బర్గ్‌ని అరెస్ట్ చేస్తారా ఏంటి’’.. ‘‘ఒకవేళ నిందితుడు దొరికినా నేను జుకర్‌బర్గ్‌ని అంటే ఏంటి పరిస్థితి’’ అంటూ నెటిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించబోతోందెవరు..? -
Copa America 2021: బ్రెజిల్ శుభారంభం
సావ్‌పాలో: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బ్రెజిల్ 3–0 గోల్స్ తేడాతో వెనిజులాపై గెలుపొందింది. బ్రెజిల్ తరఫున మార్కినోస్ (23వ నిమిషంలో), నేమార్ (64వ నిమిషంలో), గాబ్రియెల్ (89వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు. అనంతరం గ్రూప్ ‘బి’ లోనే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ కొలంబియా 1–0తో ఈక్వెడార్‌పై నెగ్గింది. కొలంబియా ఆటగాడు కార్డోనా (42వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. -
టీవీ లైవ్ షోలో షాకింగ్ ఘటన : వైరల్ వీడియో
సాక్షి,న్యూఢిల్లీ: టీవీ లైవ్ షోలు, చర్చలు సందర్బంగా గెస్ట్‌ల మధ్య వివాదాలు, తీవ్ర ఘర్షణ, ఒక్కోసారి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం లాంటి అనేక వింత వింత ఘటనలు చోటు చేసుకున్న ఉదంతాలను గతంలో అనేకం చూశాం. తాజాగా కొలంబియాలోని ఓ వార్తా ఛానెల్లో లైవ్ షో సందర్భంగా అనూహ్య ఘటన జరిగింది. ఈ ఊహించని పరిణామానికి అక్కుడున్నవారూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊరట చెందారు. లైవ్ ప్యానెల్ చర్చ సందర్భంగా అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఈఎస్పీఎన్ కొలంబియాకు చెందిన జర్నలిస్ట్ కార్లోస్ ఓర్డుజ్ లైవ్ షోలో ప్యానెలిస్టులలో ఒకరు. చర్చా కార్యక్రమం నడుస్తుండగానే అకస్మాత్తుగగా టీవీ సెట్ కార్లోస్‌పై పడింది. దీంతో అతను ముందున్న టేబుల్‌ను వేగంగా ఢీకొన్నాడు. ఈ సమయంలో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో స్క్రీన్ కిందే చిక్కుకుపోయాడు. దీంతో యాంకర్‌తోపాటు అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో యాంకర్.. షోకు కాసేపు విరామం ప్రకటించక తప్పలేదు. అయితే గాయపడిన జర్నలిస్టు క్షేమంగానే ఉన్నాడని, అతడి ముక్కుకు చిన్న గాయమైందంటూ టీవీ యాంకర్ తెలిపారు. మొత్తానికి జర్నలిస్టు స్వల్ప గాయాలతో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై విభిన్నంగా సందిస్తున్నారు. మరోవైపు తాను క్షేమంగానే ఉన్నానంటూ కార్లోస్ కూడా ట్వీట్ చేశారు. అలాగే తనపై అభిమానం ప్రకటించిన, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. UPDATE: ESPN anchor Carlos Orduz reassures viewers he is fine after being hit by falling set piece: “I must tell you I am fine, thank God, after a medical check-up and examination, any issue was ruled out, only a bruise and blow to the nose (no fracture).” — Mike Sington (@MikeSington) March 10, 2021 Shocking video. ESPN anchor crushed live on the air by falling set piece. Thankfully he was uninjured. pic.twitter.com/CeFxy8AksY — Mike Sington (@MikeSington) March 10, 2021 UPDATE: ESPN anchor Carlos Orduz reassures viewers he is fine after being hit by falling set piece: “I must tell you I am fine, thank God, after a medical check-up and examination, any issue was ruled out, only a bruise and blow to the nose (no fracture).” pic.twitter.com/JbtIIOlUmf — Carlos Orduz (@orduzrubio) March 10, 2021 -
భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ యాంకర్
-
షాకింగ్ వీడియో: లైవ్‌లో యాంకర్‌పై కూలిన స్టూడియో సెట్టు
బొగోటా: కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్‌లో ఉన్న యాంకర్‌పై ఉన్నట్టుండి స్టూడియో సెట్టులోని ఓ భాగం కూలింది. అయితే అదృష్టవశాత్తు అతడికి పెద్దగా గాయాలేం కాలేదు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. యాంకర్‌పై సెట్టు కూలిన సమయంలో అక్కడ మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు వారిలో ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా షో కంటిన్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కార్లోస్ ఓర్డుజ్ అనే యాంకర్ కొలంబియా ఈఎస్పీఎన్కు చెందిన ఒక షో ప్యానెలిస్టులలో సభ్యుడు. ఈ క్రమంలో ఈ నెల 10న షో నిర్వహిస్తుండగా.. సెట్లో ఉన్న భారీ మానిటర్ లాంటి నిర్మాణం అతనిపై పడింది. దాంతో అతడి ముఖం డెస్క్‌కు తగిలింది. ఈ ఘటనలో అతడు డెస్క్‌కు అతుక్కుపోయినట్లు కనిపించడం వీడియోలో చూడవచ్చు. ఇక ఇదే షోలో ఓర్డుజ్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా పాల్గొన్నారు. యాంకర్‌పై సెట్ కూలడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి తేరుకుని.. కాసేపు షోని కంటిన్యూ చేసి.. ఆ తర్వాత బ్రేక్ అని చెప్పి.. కట్ చేశాడు. వెంటనే ఓర్డుజ్ని లేపి ఆస్పత్రికి తరలించారు. అతడికి పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు వైద్యులు. ఈ క్రమంలో తన గురించి కంగారు పడినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు ఓర్డుజ్. సెట్ కూలిన ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. క్షేమంగానే ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. చదవండి: లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్ ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?.. -
ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?..
బొగోటా : కొందరు కిక్ కోసం సాహసాలు చేస్తారు.. మరికొందరు బతకటం కోసం.. ఒకరిది ఆనందం.. మరొకరిది అవసరం. జీవితాన్ని సెటిల్ చేసే పని కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేసినా బాగుంటుంది.. కానీ, చిన్న చిన్న పనులకు కూడా ప్రాణాలకు తెగించాల్సి వస్తే! దారుణంగా ఉంటుంది. ప్రసుత్తం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కొలంబియాలోని ఓ గిరిజన తెగకు చెందిన వారు. ఊరు దాటాల్సి వచ్చిన ప్రతిసారి చుక్కలు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొలంబియా, ప్యూబ్లో రికాలోని అగుట నది ఒడ్డున ఎంబెరా చామి అనే ఓ గిరిజన తెగ నివాసం ఉంటోంది. దాదాపు 2000 మంది ఉంటున్న ఆ తెగ వేరే ఊరికి వెళ్లాలంటే అగుట నదిని దాటాల్సి ఉంటుంది. నదిపై వంతెన ఉండటంతో వారి ప్రయాణాలు సాఫీగా సాగేవి. ( బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి ) అయితే గత నవంబర్‌లో వచ్చిన వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. దీంతో నది దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది. చిన్న పిల్లలు మొదలుకుని ముసలివారి వరకు నదికి అటువైపు నుంచి ఇటువైపునకు కట్టిన తాడును పట్టుకుని ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఒడ్డు చేరుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువతి నది దాటడానికి పడ్డ కష్టానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరద ఉధృతిలో తాడును పట్టుకుని ఆమె నదిని దాటుతున్న దృశ్యాలు ఊపిరాగిపోయే ఉత్కంఠ రేపుతున్నాయి. కానీ, సదరు యువతి నది దాటిందా లేదా అన్నది తెలియకుండానే వీడియో ముగిసింది. తర్వాత ఏమై ఉంటుందా అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. -
‘నువ్వు నిజమైన అమ్మాయివి కాదు కదా’
న్యూఢిల్లీ: ‘‘నువ్వు నిజమైన, పరిపూర్ణ మహిళవు కాదు కదా’’.. మోడలింగ్ షూట్‌కు వెళ్లిన ఆర్చీ సింగ్‌ను ఉద్దేశించి ఓ ఏజెంట్ నోటి నుంచి వచ్చిన మాట. ఇలాంటి ఎన్నెన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి ఆమెకు. ఎందుకంటే తొలుత ఆమె అతడుగా ఉండేవాడు. తనలోని నిజమైన ఆత్మను గుర్తించి స్త్రీగా మారాలని నిశ్చయించుకున్నాడు. పదిహేడేళ్ల వయస్సులో తన సెక్సువల్ ఐడెంటిని బయటపెట్టిన ఆర్చీ.. ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. మిస్ ట్రాన్స్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఈ క్రమంలో అనేకసార్లు ఆమెకు వినిపించిన మాట.. ‘‘నువ్వు నిజంగా అమ్మాయివి కాదు’’.. ఇందుకు ఆర్చీ సమాధానం ఒక్కటే.. ‘‘ నేనూ మహిళనే.. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ ఒక స్త్రీకి ఉండే గుణాలన్నీ నాలో ఉన్నాయి. నేను అమ్మాయినే అని రుజువు చేసేందుకు ప్రభుత్వం నాకిచ్చిన ఐడీ నా వద్ద ఉంది. నేను సర్జరీ చేయించుకుని పూర్తిగా స్త్రీగా మారిపోయాను’’ అని. కానీ ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరే సంకుచిత మనస్తత్వం గల కొంతమంది వ్యక్తులు ఆమెను కావాలనే తమ సూటిపోటి మాటలతో గుచ్చిగుచ్చి వేధించేవారు. అయినా ఆర్చీ సింగ్ ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోలేదు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ 2021లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. కొలంబియాలో జరిగే అందాల పోటీలకు సన్నద్ధమవుతోంది.(చదవండి: షేపవుట్..? ఫొటోషూట్..) కుటుంబం అండగా నిలబడింది ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ఆర్చీ సింగ్ జన్మించింది. ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న సమయంలో తన మానసిక పరిస్థితి గురించి తల్లిదండ్రులకు చెప్పింది. తొలుత వాళ్లు ఆందోళన చెందినప్పటికీ.. అర్థం చేసుకుని ఆర్చీకి అండగా నిలబడ్డారు. ‘‘నాలో దాగున్న నన్ను.. కేవలం నన్ను మాత్రమే నేను చూడాలనుకున్నాను. వేరే ఎవరిలాగానో నటించడం నా వల్ల కాలేదు. మోడలింగ్ చేయాలనేది నా కల. ఈ కెరీర్ ఆరంభించకముందు సోషల్ వర్క్‌లో భాగమయ్యాను. ట్రాన్స్జెండర్ల గురించి సమాజంలో ఉన్న అపోహలు, అనుమానాలు, చిన్నచూపు తొలగిపోయేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. మోడలింగ్ వల్ల ఇది మరింత విస్త్రృతమైంది. నాకొక చక్కని వేదిక దొరికనట్లయింది’’ అని ఆర్చీ సింగ్ తన గతం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది. ఇక సమాజంలో తమ పట్ల ఉన్న వివక్ష గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ, అందం లేని కారణంగా నాకెప్పుడూ అవకాశాలు రాకుండా పోలేదు. కేవలం నేను ట్రాన్స్ వుమన్ అయినందు వల్లే ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నా. అయితే వాటన్నింటినీ అధిగమించి నేడు అంతర్జాతీయ వేదికపై నడిచే అవకాశాన్ని దక్కించుకున్నాను. జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి మనిషి తనలోని మానవత్వాన్ని, తోటి ప్రాణులను ఆదుకునే గుణాన్ని మాత్రమే తన గుర్తింపుగా చేసుకోవాలి. సెక్సువాలిటీ లేదా చేసే పని ఆధారంగా ఫలానా అనే గుర్తింపు కంటే ముందు మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి’’ అని తన ఆలోచనలు పంచుకుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ట్రాన్స్జెండర్ల పట్ల చిన్నచూపు ఎక్కువగా ఉందన్న ఆర్చీ.. ప్రకృతిసిద్ధంగా జరిగే మార్పులకు తమను నిందించాల్సిన పనిలేదని, ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ 2021 టైటిల్ విజేతగా నిలవడమే తన ముందున్న ప్రస్తుత లక్ష్యం అంటున్న 22 ఏళ్ల ఆర్చీ సింగ్.. తనలాంటి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపడతానని పేర్కొంది. -
అమానుషం.. పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది
బొగోటా(కొలంబియా): ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దారుణాలకు అడ్డులేకుండా పోతుంది. పసి మొగ్గలను కూడా వదలడం లేదు మృగాళ్లు. ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన చిన్నారులు అకృత్యాలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కొలంబియాలో దారుణం వెలుగు చూసింది. అమ్మ ప్రేమ, నాన్న గారం.. స్నేహితులు, ఆటలు తప్ప మరొకటి తెలియని పదేళ్ల చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గత 26 రోజులుగా పసి గుడ్డును ఆ చిట్టితల్లి కాపాడుకుంటుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధితురాలి పేరు వెల్లడించలేదు. మరో దారుణం ఏంటంటే తనకు ఏం జరిగిందో.. ఎవరు తనపై ఇంత పశుత్వాన్ని ప్రదర్శించారో ఆ చిట్టితల్లి చెప్పలేకపోతుంది. ఎనిమిదో ఏట నుంచే చిన్నారిపై ఈ దాడి మొదలయ్యిందని అధికారులు భావిస్తున్నారు. ప్రాడో మున్సిపాలిటిలో నివసిస్తున్న బాలికను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని మెడికల్ కేర్ సెంటర్లో ఉంచి సంరక్షిస్తున్నారు. ఈ క్రమంలో తొలిమా గర్నరర్ రికార్డో ఒరోజ్కో మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీని గురించి ఆమె ఏం మాట్లడలేకపోతుంది. కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులని అనుమానిస్తున్నాం. బాధితురాలి సవతి తండ్రి(43), అక్కడే పొలాల్లో పని చేసే మరో వ్యక్తి(23)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇక ఇలాంటి దారుణాలు ఎక్కువగా బయటపడటం లేదు. చాలా కేసుల్లో కొడుకు, అంకుల్, తాత, సమీప బంధువులు నిందితులుగా ఉంటున్నారు. దాంతో ఈ దారుణాలను కప్పి పుచ్చుతున్నారు. ఇక కొలంబియాలో అత్యాచారం, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో అబార్షన్ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే చిన్నారి విషయంలో ఇది ఎందుకు పాటించలేదో తెలియడం లేదు’ అన్నారు. -
సముద్రంలో సజీవంగా..
-
రెండేళ్ల క్రితం తప్పిపోయి.. సముద్రంలో సజీవంగా
బొగోటా: కొలంబియాలో వింత సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ సముద్రంలో సజీవంగా కనిపించిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొలంబియా సముద్ర తీరంలో నీటిపై తేలుతున్న సదరు మహిళను బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మత్స్యకారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పేరు ఎంజెలికా గైటన్. ఆమె రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు వెల్లడించింది. గైటన్ ఆర్సీఎన్ రేడియోతో మాట్లాడుతూ... తాను మళ్లీ పుట్టానని, దేవుడు తన మరణాన్ని కోరుకోలేదంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె దాదాపు ఎనిమిది గంటల పాటు నీటిపైనే తేలుతూ ఉన్నట్లు చెప్పింది. (చదవండి: 'ఒక్క పనితో మా మనసులు దోచేసింది') ‘20 సంవత్సరాలుగా నా భర్త చేతిలో గృహహింసకు గురయ్యాను. నా భర్త ఎప్పుడూ నన్ను చిత్రహింసలకు గురిచేసేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. నాకు ఇద్దరు పిల్లలు. వారు చిన్న పిల్లలు కావడంతో అతని నుంచి విడిపోలేక హింసలను భరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. పోలీసులు ఒక్కరోజు అతడిని జైలులో ఉంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించే వారు. అయినా అతడు మారలేదు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మరింత కొట్టేవాడు. ఈ క్రమంలో 2018లో నా భర్త నన్ను చంపాలని చుశాడు. నన్ను నేను కాపాడుకునేందుకు ఇంటి నుంచి పారిపాయాను. నాకు ఆశ్రయం లేకపోవడంలో 6 నెలలు వీధుల్లోనే గడిపాను ఆ తర్వాత నాకు కామినో డిఫే రెస్క్యూ సెంటర్లో ఆశ్రయం దొరికింది’ అని చెప్పింది. (చదవండి: ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత) అయితే అక్కడ ఉండటానికి గడువు పూర్తి కావడంతో నిరాశ్రయురాలిని అయ్యానని, దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కొలంబియా సముద్రంలో దూకినట్లు పేర్కొంది. సముద్రంలో దూకిన ఆనంతరం స్పృహ కోల్పోయానని ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని పేర్కొంది. తనను రక్షించిన వ్యక్తులు నీటిలో అసస్మారక స్థితిలో ఉన్నానని చెప్పినట్లు గైటాన్ వివరిచింది. ఇక ఆమెను రక్షించిన మత్స్యకారులు మాట్లాడుతూ.. మేము తీరంలో చేపల వేటకు వెళుతుండగా దూరంగా ఆమె నీటిలో తెలుతూ కనిపించిందన్నారు. అది ఎంటన్నది తమకు స్పష్టంగా కనిపించకపోవడంతో చెక్క అయి ఉంటుందనుకున్నామన్నారు. కాసేపటకి ఆమె రక్షించాలంటూ చేయి పైకిత్తడంతో ఏంటో చూడటానికి దగ్గరికి వెళ్లామని, అక్కడికి వెళ్లి చూడగా గైటాన్ అపస్మారక స్థితిలో కనిపించిందని వారు చెప్పారు. (చదవండి: ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి) -
కొలంబియా గ్యాంగ్ కన్నుపడితే
బనశంకరి: టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి అత్యాధునిక పరికరాలను వినియోగించి శ్రీమంతుల ఇళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న కొలంబియా దేశానికి చెందిన ముఠాను గురువారం బెంగళూరు ఈశాన్యవిభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 6 కేజీల బంగారు ఆభరణాలు, 9 పిస్టళ్లు, 23 తూటాలు, మూడు పాస్‌పోర్టులు, ఒక నకిలీ పాస్పోర్టుతో కలిపి రూ.2.50 కోట్ల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్లు గుళేద్, మురుగన్‌లతో కలిసి మాట్లాడారు. కొలంబియాకు చెందిన పడిల్లా మార్టినేజ్, స్టెఫానియా మనోజ్‌మోసాల్హే, క్రిస్టియన్ యేనీస్‌నవరో ఒలాదే అనే ముగ్గురు ముఠాగా కలిసి చోరీలకు చేస్తున్నారు. పక్కాగా దోపిడీలు వీరు టూరిస్ట్ వీసా తో నేపాల్ మీదుగా ఢిల్లీ కి చేరుకుని ముఠా నాయకుడు మింగోస్తావో అలియాస్ తావోను సంప్రదించి అతడి సలహా మేరకు బెంగళూరులో అడుగుపెట్టారు. ఒక సర్వీస్ అపార్టుమెంట్లో నివాసం ఉండేవారు. ఎత్తైన గోడలను సైతం సులభంగా దూకే పార్కుర్ అనే విన్యాసంలో నిపుణులు. సైకిల్లో తిరుగుతూ నిర్జన ప్రదేశాలు కలిగిన శ్రీమంతులు ఇళ్లను ఆచూకీ కనిపెట్టి అత్యాధునిక పరికరాలను వినియోగించి దోపిడీలకు పాల్పడేవారు. ఇళ్ల ముందు ఎక్కువ న్యూస్‌పేపర్లు పడి ఉంటే అందులో ఎవరూ లేరని భావించేవారు. సాయంత్రం 7 గంటల తరువాత బైక్ లేదా కారులో వచ్చి ఇంటిని దోచుకుని ఉడాయించేవారు. కరోనా వారియర్స్ ధరించే పీపీఈ కిట్ తరహాలో శరీరాన్ని పూర్తిగా కప్పుకుని, చేతులకు గ్లౌస్లు వేసుకుని చోరీలు చేసేవారు. ముఠాలోని మహిళ స్టెఫానియాను ఎంచుకున్న ఇంటికి పంపేవారు. కాలింగ్ బెల్ నొక్కేది, ఎవరూ తలుపు తీయకపోతే వాకీటాకీ ద్వారా దగ్గరలో ఉండే గ్యాంగ్ సభ్యులకు సమాచారం ఇచ్చేది, అందరూ కలిసి ఇంటిని గుల్ల చేసేవారని కమిషనర్ తెలిపారు. ఇలా దొరికారు కన్నడనటుడు శివరాజ్‌కుమార్ పక్కఇంట్లో చొరబడ్డారని తెలిసి సంపిగేహళ్లి పోలీసులు అక్కడికి వెళ్లగానే కారు ను అక్కడే వదిలిపెట్టి 15 అడుగుల ఎత్తుగల గోడ దూకి ఉడాయించారు. వారు వదిలివెళ్లిన కారు, వాకీటాకీ ఇతర పరికరాలు, సీసీటీవీ చిత్రాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రెండునెలల పాటు ప్రత్యేక పోలీస్‌బృందం తీవ్రంగా గాలించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఠా సూత్రధారి గుస్తావో కోసం గాలిస్తున్నామని తెలిపారు. చోరీ చేసిన బంగారు నగలను కరిగించి నిల్వచేసేవారు. ఆఫ్రికా దేశాలకు చెందిన ఇస్మాయిల్, ఆంబ్రోస్ అనేవారితో కలిసి కొత్తనూరు, సంపిగేహళ్లి, అమృతహళ్లి, చిక్కజాల, విద్యారణ్యపుర తో పాటు 31కి పైగా చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. ఆధునిక సామగ్రి వాడకం మొబైల్ ఫోన్ జామర్, పెప్పర్ స్ప్రే, చాకు, డ్రిల్ కిట్ మిషన్, బిట్ మిషన్, లేజర్‌కటింగ్ మిషన్, రింగ్ స్కానర్, కటింగ్‌ప్లేయర్ తదితర సాధనాలు వీరి వద్ద ఉండేవి. మాన్యతాటెక్‌పార్కులోని ఒక ఇంట్లో జర్మన్‌లాకర్‌ను సైతం సులభంగా బద్దలు కొట్టి దోచుకున్నది వీరేనని తేలింది. -
కరోనా మృతదేహాల కోసం ప్రత్యేకంగా..
బొగోటా: మహమ్మారి కరోనా వైరస్ ఎన్నోన్నో హృదయవిదారక దృశ్యాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటువ్యాధి సోకి మరణించిన వారిని కుప్పలుతెప్పలుగా ఖననం చేసిన దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. దక్షణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోనూ మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాతో మరణించిన తమ వాళ్ల మృతదేహాలతో పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు వీధుల్లో నిలబడిన ఫొటోలు కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్‌ను కలచివేశాయి. ఆస్పత్రి పడకలనే శవపేటికలుగా మార్చే ఆవిష్కరణకు దారిచూపాయి. ఈ విషయం గురించి రొడాల్ఫో మాట్లాడుతూ.. ‘‘ ఈక్వెడార్‌లోని గ్వాయేకిల్‌లో మృతదేహాలతో కొంతమంది వీధుల్లోకి వచ్చారు. మహమ్మారి కారణంగా అంత్యక్రియలు కూడా సరైన పద్ధతిలో నిర్వహించుకునే వీల్లేకుండా పోయింది. అందుకే శవపేటికలుగా రూపాంతరం చెందే బెడ్లను తయారుచేశాం’’అని తెలిపారు.(‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) ‘‘ఈ బెడ్లకు మెటల్ రెయింగ్స్ ఉంటాయి. కింది భాగంలో బ్రేకులతో కూడిన చక్రాలు అమర్చాం. ఇది 150 కిలోల బరువును మోయగలుగుతుంది. ఈ బయోగ్రేడబుల్ బెడ్- కఫిన్స్ 92 నుంచి 132 డాలర్ల ధరలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీంతో మృతదేహం నుంచి వైరస్ వ్యాపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది’’అని పేర్కొన్నారు. తొలుత కొలంబియాలోని లెటీసియాలో ఉన్న ఓ ఆస్పత్రికి ఈ బెడ్లను విరాళంగా ఇస్తున్నామని రొడాల్పో తెలిపారు. బొగోటాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో నెలకు 3 వేల బెడ్ల చొప్పున తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కొలంబియా, ఈక్వెడార్‌లతో పాటు పెరూ, చిలీ, బ్రెజిల్, మెక్సిక్, యూఎస్‌కు వీటిని ఎగుమతి చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.(అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) -
కరోనా : జైలులో తిరుగుబాటు.. 23 మంది మృతి
బొగోటా : కరోనా వైరస్ వ్యాప్తిపై జైళ్లలోని ఖైదీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న వేళ జైలులో కనీస పారిశుద్ధ్యం కరువైందని, సరైన వైద్యసదుపాయాలు లేవని ఆరోపించిన ఖైదీలు అధికారులపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో 23 మంది ఖైదీలు మరణించగా, 83 మంది గాయపడ్డారు. ఈ ఘటన కొలంబియా రాజధాని బొగోటాలోని లా మోడెలో జైలులో చోటుచేసుకుంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. లా మోడెలో జైలులో పరిశుభ్రత లేదని అందువల్ల తమకు కరోనా సోకే అవకాశం ఉందని ఖైదీలు ఆరోపించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. జైలు అధికారులపై తిరగబడటమే కాకుండా.. అక్కడ ఉన్న సామాగ్రికి నిప్పుపెట్టారు. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ అధికారులు వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23 మంది మృతిచెందారు. ఈ ఘటనపై న్యాయశాఖ మంత్రి కాబెలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 32 మంది ఖైదీలు, ఏడుగురు భద్రతా సిబ్బంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. జైలులో పథకం ప్రకారమే అల్లర్లు జరిగాయని చెప్పారు. జైల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య లేదని.. అల్లర్లు సృష్టించేందుకే ఖైదీలు ఇలా చేశారని అన్నారు. జైలులో ఏ ఒక్క ఖైదీకి కూడా కరోనా సోకలేదని, ఎవరినీ ఐసోలేషన్‌లో ఉంచలేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఈ విషయం తెలసుకున్న ఆ జైలులోని ఖైదీల బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమవారి పరిస్థితి ఎలా ఉందో వెల్లడించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత బలగాలు జైలు వద్దకు చేరకున్న తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించాయని వారు అంటున్నారు. చదవండి : లాక్డౌన్ : రోడ్లపైకి జనం.. కలెక్టర్ ఆగ్రహం భారత్‌లో స్మార్ట్ఫోన్ల తయారీ నిలిపివేత.. -
బాయ్‌ఫ్రెండ్స్ సర్ప్రైజ్.. ప్రియురాళ్లు స్టన్!
-
ముసుగులు తొలగించారు.. ప్రియురాళ్లు షాక్!
కొలంబియా : ఆ బాయ్‌ఫ్రెండ్స్ టూర్లో ఉన్న తమ ప్రియురాళ్లకు జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. వారిచ్చిన సడెన్ సర్ప్రైజ్కు షాకైపోయిన వారి ప్రియురాళ్లు ఏం మాట్లాడాలో తెలియక కొన్ని క్షణాలు నోళ్లు వెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన జానీ రోడ్స్, టామ్ మిచెల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ దక్షిణ అమెరికా టూర్లో ఉన్న తమ ప్రియురాళ్లను సర్ప్రైజ్ చేద్దామనుకున్నారు. ఆ సర్ప్రైజ్ ఓ మంచి డ్యాన్స్‌తో ఉంటే ఇంకా బాగుంటుందనుకున్నారు. ఇందుకోసం బాగా ప్రాక్టీస్ చేశారు. అంతా ఓకే అనుకున్నాక 14గంటలు ప్రయాణించి తమ ప్రియురాళ్లు టూర్లో ఉన్న కొలంబియాలోని కార్టజెనాకు చేరుకున్నారు. వాళ్లు అక్కడి ఓ హోటల్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కుట్టించిన ముసుగు ఉన్న దుస్తులు ధరించి వారు కూర్చుని ఉన్న హోటల్ టేబుల్ ముందకు వెళ్లారు. కష్టపడి నేర్చుకున్న స్టెప్పులతో ఎక్కడా తడబడకుండా ప్రియురాళ్ల ముందు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. డ్యాన్స్ కోసం సిద్ధమవుతున్న జానీ రోడ్స్, టామ్ మిచెల్ టేబుల్ దగ్గర కూర్చున్న వారి ప్రియురాళ్లు డ్యాన్స్‌ను ఎంతో ఆసక్తిచూడటం మొదలుపెట్టారు. డ్యాన్స్ చేయటం అయిపోయిన తర్వాత జానీ,టామ్లు తమ ముసుగులు తొలిగించారు. అంతే! వారి ప్రియురాళ్లు ఒక్కసారిగా షాక్ అయినట్లు చూస్తూ ఉండిపోయారు. తమ బాయ్‌ఫ్రెండ్స్ ఇచ్చిన సడెన్ సర్ప్రైజ్కు ఏం మాట్లాడాలో తెలియక వారిని హత్తుకుపోయారు. టామ్ ప్రియురాలు ఇమిలీ పోటర్ మాట్లాడుతూ.. ‘ ఎవరో ఇద్దరు కొలంబియన్లు మా దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని అనుకున్నాము. ఇది నా జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్. కొద్దిసేపు నా కాళ్లు చిగురుటాకులా కంపించిపోయాయ’ని తెలిపింది. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!
బ్రిటీష్ రాచరిక కుటుంబం జీవితం నుంచి విడిపోయి తాము స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కే ప్రకటించి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. హ్యారీ దంపతులు తమ కుమారుడితో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను బ్రిటీష్ కొలంబియాలోని విక్టోరియాలో నీటి ఒడ్డునున్న ప్యాలెస్ లాంటి బంగ్లాలో గడిపారు. ఇక ముందు జీవితం ఆ బంగ్లాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. దాదాపు 18 మిలియన్ డాలర్లు విలువచేసే ఆ బంగ్లాను వారు రష్యాకు చెందిన ఓ బిలియనీర్ నుంచి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి హ్యారీ దంపతులు, వారి ప్రతినిధి నిరాకరించారు. ఆ రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్లో షేర్ హోల్డర్ అవడం వల్ల కంట్రీ క్లబ్ పేరుతో ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కొత్త చట్టం ప్రకారం ఆస్తులు అమ్మినప్పుడు కచ్చితంగా దాని వెల ఎంతో ప్రకటించి అంత మొత్తానికి పన్ను చెల్లించాలి. ఆ పన్నును తప్పించుకునేందుకే రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్ ద్వారా ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం 11,416 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రధాన బంగ్లాలో ఐదు బెడ్ రూమ్‌లు, ఎనిమిది బాత్ రూమ్‌లు, ఓ హాలు, కిచెన్ ఉన్నాయి. దానికి వెలుపల అతిథుల కోసం 2,349 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బెడ్ రూమ్‌లు, రెండు బాత్ రూములు గల చిన్న భవనం ఒకటి ఉంది. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’
కరాకస్ : దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వెనిజులా నుంచి లక్షలాది మంది పౌరులు పొట్టచేతబట్టుకుని... పెరు సహా ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. తమకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ చిల్లర పోగుచేసుకుంటూ దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వ్యవహారశైలి వల్లే ఆ దేశ పౌరులకు ఇలాంటి దుర్గతి పట్టిందంటూ ప్రతిపక్షాలతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వెనిజులన్ మహిళ దీనస్థితిని కళ్లకుగట్టే వీడియోను ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ మంగళవారం షేర్ చేసింది. ‘ మీరు ఈరోజు వినాల్సిన సుందరగానం ఇది’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో...తన తొమ్మిది నెలల పాపాయిని చేతుల్లో పెట్టుకుని...గానం చేస్తూ ఆ తల్లి డబ్బు యాచిస్తోంది. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ‘తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొడుతూ... హాయిగా పడుకోవాల్సిన ఆ చిన్నారి నేడు ఇలా రోడ్డుపై అమ్మ చేతుల్లో నిద్రపోతోంది. ఈ దుస్థితి కారణం ఎవరు’ అంటూ దేశ అధ్యక్షుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఏడాది కాలంలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది వెనిజులన్లు పెరూకు వలస వచ్చారు. వారిలో చాలా మందిని అక్రమవలసదారులుగా గుర్తించిన పెరూ ప్రభుత్వం... పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నవారిని మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతినిచ్చింది. వీసాలు లేని వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొలంబియా యుద్ధాన్ని కోరుకుంటోందని...వారి కుట్రలు తిప్పికొట్టేందుకు తమ సైన్యం సన్నద్ధంగా ఉన్నదంటూ వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటన జారీ చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన సైన్య దళాధిపతులతో సమావేశమైన ఫొటోలను విడుదల చేశారు. ‘కొలంబియా యుద్ధం, హింస కోరుకుంటోంది. అందుకు మేము ధీటుగా బదులిస్తాం’ అని మదురో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: అమెరికాతో తెగదెంపులు! ఇక ఈ ఏడాది జరిగిన వెనిజులా ఎన్నికల్లో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించుకున్నారు. ఇందుకు నిరసనగా మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.అప్పటి నుంచి దేశంలో రాజకీయ అనిశ్చితితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కొలంబియా సహా ఇతర దేశాలు వంతపాడాయి. ఈ క్రమంలో అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో.. అగ్రరాజ్యంతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
అద్భుత విన్యాసంలో అకాల మరణం
కొలంబియా వైమానిక దళానికి చెందిన ఇద్దరు సైనికులు అద్భుత విన్యాసం చేస్తూ దురదృష్టవశాత్తు అకాల మరణం పొందారు. సంప్రదాయబద్ధమైన మెడిలిన్ పుష్ప ప్రదర్శన ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రదర్శనలో ఇరువురు సైనికులు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని కొలంబియా రక్షణ శాఖ ప్రకటించింది. పుష్ప ప్రదర్శనను పురస్కరించుకుని హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న కేబుల్ చివరన జాతీయ జెండాను కట్టారు. ఆ జెండా రెపరెపలాడే విధంగా పై కొసన ఒక సైనికుడు, కింది కొసన ఓ సైనికుడు జాతీయ జెండాను కలిపి పట్టుకొని వేలాడుతుండగా, హెలికాప్టర్ స్థానిక ఓలయ విమానాశ్రయానికి వచ్చింది. వారు అక్కడ దిగాల్సిన సమయంలో హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న కేబుల్ తెగిపోయింది. దాంతో ఇద్దరు సైనికులు నేలను ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. దీంతో బంబేలెత్తిన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు. మెడిలిన్‌లో ప్రతిఏట జరిగే పుష్ప ప్రదర్శనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదర్శనకు అదనపు ఆకర్షణను తేవడానికి, అలాగే దేశభక్తిని చాటి చెప్పేందుకు ఈ షోను ఏర్పాటు చేయగా విషాద సంఘటన చోటు చేసుకొంది. -
ప్రపంచ ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ
సాక్షి, విజయవాడ: వచ్చే నెలలో కొలంబియాలో, ఆ తర్వాత టర్కీలో జరిగే ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్ జట్టులోకి ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. భువనేశ్వర్‌లో జరిగిన ట్రయల్స్‌లో ఈ విజయవాడ ఆర్చర్ నంబర్‌వన్‌గా నిలిచింది. తద్వారా రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లతో పాటు జూన్‌లో నెదర్లాండ్స్ ఆతిథ్యమిచ్చే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా ఈ తెలుగు అమ్మాయి భారత్ జట్టులో బెర్త్ సంపాదించింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 2880 పాయింట్లకుగాను 2801 పాయింట్లు స్కోరు చేసింది. -
కొలంబియాలో విమాన ప్రమాదం
బొగటా: కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులోని మొత్తం పన్నెండు మంది చనిపోయారు. ప్రమాదంలో తరైరా, డోరిస్ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 1930లో అమెరికాలో తయారైన డగ్లస్ డీసీ–3 విమానం శాన్ జోస్ డెల్ గ్వావియేర్, విల్లావిసెన్సియో పట్టణాల మధ్య కూలిపోయిందని అధికారులు చెప్పారు. విమాన ఇంజిన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని అధికారులు వివరించారు. అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ మృతులకు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ప్రమాదానికి గురైన విమానాన్ని నిర్వహిస్తున్న లాజార్ ఏరియో కంపెనీ ఘటనపై స్పందించడానికి నిరాకరించింది. -
మండే ఎండలకు ప్లాస్టిక్ పూత విరుగుడు
ఎండాకాలంలోనూ భవనాలు చల్లగా ఉండేలా చేసేందుకు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుక్కున్నారు. సూక్ష్మస్థాయి గాలిబుడగలు ఉన్న ప్లాస్టిక్ పూతను వాడటం ద్వారా భవనాల ఉష్ణోగ్రతలను మూడు నుంచి ఆరు డిగ్రీ సెల్సియస్ వరకూ తగ్గించవచ్చునని వీరు అంటున్నారు. పెరిగిపోతున్న వేడిని తగ్గించుకునేందుకు పైకప్పులను తెల్లటి పెయింట్ వేసుకోవడం ఓ పద్ధతి అని మీరు వినే ఉంటారు. అయితే ఈ పద్ధతిలో ఓ చిక్కు ఉంది. సూర్యకిరణాల్లోని పరారుణ కాంతి కిరణాలను ఈ పెయింట్ అడ్డుకోలేదు. మిగిలిన కాంతిలోనూ సగం మాత్రమే మళ్లీ అంతరిక్షంలోకి తిప్పి పంపగలదు. గాలిబుడగలు ఉన్న పెయింట్‌తో ఈ చిక్కులేవీ ఉండవు. దాదాపు 96 శాతం సూర్యకాంతిని తిప్పి పంపడంతోపాటు అంతేస్థాయిలో వేడిని కూడా నిరోధించగలదు ఇది అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యాన్ యాంగ్ తెలిపారు. నీటితోపాటు సాల్వెంట్, ప్లాస్టిక్‌ను ఉపయోగించడం ద్వారా కొత్త రకం పెయింట్‌ను తయారు చేయవచ్చునని వివరించారు. బంగ్లాదేశ్‌తోపాటు అమెరికాలోని అరిజోనా ఎడారి ప్రాంతంలో తాము ఈ పెయింట్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని, అరిజోనాలో ఆరు డిగ్రీ సెల్సియస్ వేడి తగ్గితే.. గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్‌లో ఇది మూడు డిగ్రీ సెల్సియస్‌గా ఉందని వివరించారు. -
మ్యాచ్‌కు ముందే పెళ్లి ప్రపోజల్
ప్రేమకు కులం, మతం, భాష, సరిహద్దులతో సంబంధం లేదని ,రెండు మనసులు కలిస్తే చాలని మరోసారి నిరూపితమైంది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఓ భారత జర్నలిస్ట్.. కొలంబియన్ చెస్ ప్లేయర్‌ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయడం చర్చనీయాంశమైంది. సరిగ్గా టీమ్‌మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా.. భారత జర్నలిస్ట్ నిక్లేష్ జైన్.. కొలంబియా చెస్ స్టార్ విమ్ ఎంజెలా లోపెజ్కు తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. నిక్లేష్ మోకాళ్ల పై కూర్చోని మరి రింగ్‌ను బహుమతిగా ఇస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఎంజెలాకు హిందీలో ప్రపోజ్ చేయడం ఎంజెలాతో పాటు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. తన ప్రపోజల్‌కు ముగ్దురాలైన ఎంజెలా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ‘వాస్తవానికి ఆమెలా నేను ఓ చెస్ ప్లేయర్. గతంలోనే తనముందు పెళ్లి ప్రస్తావన తేవాలనుకున్నాను. కానీ చెస్ ఒలింపియాడే సరైనదని భావించాను. ఈ టోర్నీలో 189 దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇది మా ఇద్దరికి దేవాలయం వంటిది. అందుకే ఇక్కడ ప్రపోజ్ చేయాలని నిర్ణియించుకొని.. తన చెల్లి సాయం తీసుకున్నాను. గతేడాదిన్నరగా మేం ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన సమస్య భాష. ఆమె స్పానిష్ తప్ప ఇంగ్లీష్ మాట్లాడలేదు. మొబైల్ ట్రాన్స్లెట్ యాప్ సాయంతో మాట్లాడుకునేవాళ్లమని’ తెలిపాడు. అమెరికా చెస్ గ్రాండ్ మాస్టర్ సుసాన్ పొల్గర్... ‘అతను హిందీ మాట్లాడుతాడు(భారత్).. ఆమె స్పానిష్ మాట్లాడుతుంది(కొలంబియా). వీరిద్దరని చెస్ లవ్‌లో పడేసింది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్‌కు ఆమె అంగీకరించింది. వారిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అభినందనలు.. ఇది ఒలంపియాడ్ లవ్’ అంటూ అద్భుత వ్యాఖ్యలతో వర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. Olympiad LOVE! He speaks Hindi (India). She speaks Spanish (Colombia). But they found love through chess! He popped the question at @BatumiChess2018 playing hall before round 2. She said yes! ... And they are learning English, quick! 😂 Congratulations! @WOMChess @FIDE_chess pic.twitter.com/wtqmW26f6P — Susan Polgar (@SusanPolgar) September 25, 2018 -
కొవ్వును మార్చేస్తారు.. ఒళ్లు కరిగిస్తారు?
శరీరంలో రెండు రకాల కొవ్వులుంటాయి. ఆరోగ్యకరమైన బ్రౌన్‌ఫ్యాట్ ఒకటైతే.. హాని కలిగించే తెల్లటి కొవ్వు ఇంకోటి. తెల్ల కొవ్వుతో సమస్యలెక్కువ. బోలెడంత శక్తిని ఠక్కున కరిగించేయగల శక్తి బ్రౌన్‌ఫ్యాట్ సొంతం. అంటే.. బ్రౌన్‌ఫ్యాట్ ఎక్కువ ఉంటే.. ఎంత తిన్నా ఒళ్లు మాత్రం చేయం అన్నమాట! దీనిర్థం.. ఊబకాయం రాదు.. మధుమేహం, గుండెజబ్బులు వంటివీ దూరంగా ఉంటాయి! అంతా బాగానే ఉంది కానీ.. ఈ బ్రౌన్‌ఫ్యాట్‌ను పెంచుకోవడం ఎలా? చాలా సింపుల్ అంటున్నారు కొలంబియా ఇంజినీరింగ్ శాస్త్రవేత్త సామ్ సియా! శరీరంలోంచి తెల్లకొవ్వు కొంత సేకరించి.. పరిశోధన శాలలో దాన్ని బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చేసి.. మళ్లీ శరీరంలోకి జొప్పిస్తే సరి అంటున్నారు సామ్. ఒక భాగంలోని కొవ్వును తీసి ఇంకోభాగంలోకి ఎక్కించడమనే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ప్రక్రియను ఇప్పటికే చాలామంది నిరపాయకరంగా చేస్తున్నారని, కొవ్వును మార్చి మళ్లీ చేర్చడం మాత్రమే తాము కొత్తగా ప్రతిపాదిస్తున్నామని వివరించారు. తెల్లకొవ్వును బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చే విషయంలో తాము ఇప్పటికే విజయం సాధించామని, వైద్యులు క్లినిక్‌లో చాలా సులువుగా చేయగల పద్ధతి ఇదని సామ్ తెలిపారు. బ్రౌన్‌ఫ్యాట్‌ను పెంచేందుకు శరీర భాగాలను విపరీతమైన చల్లదనానికి గురి చేయడం ఇంకో పద్ధతి కూడా అందుబాటులో ఉన్నప్పటికీ దీనివల్ల అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. పరిశోధన శాలలో ఎలుకల తెల్ల కొవ్వును బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చేక్రమంలో సామ్ బృందం దశలవారీగా పరిశీలనలు జరిపింది. మారుతున్న కొవ్వు ఆరోగ్యానికి మేలు చేసేదిగానే ఉందని నిర్ధారించుకున్న తరువాతగానీ దాన్ని మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టలేదు. బ్రౌన్‌ఫ్యాట్‌ను సూచించే రసాయనాలు, మైటోకాండ్రియా ప్రక్రియలను నిర్ధారించుకున్న తరువాత మళ్లీ దాన్ని ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. రెండు నెలల తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాలను తాము మనుషుల్లోనూ చేశామని, చర్మం అడుగున ఉండే తెల్లకొవ్వును సేకరించి పరిశోధన శాలలో బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చామని సామ్ వివరిస్తున్నారు. శరీరం బరువు తగ్గించేందుకు భవిష్యత్తులో ఇదో మెరుగైన పద్ధతి కావచ్చునని సామ్ అంచనా. రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించేందుకు, బరువు పెరక్కుండా చూసేందుకూ ఉపయోగపడవచ్చునని అంచనా. కొవ్వుతో కూడిన ఆహారం తీసుకుంటున్న ఎలుకలపై తమ పద్ధతి అంతగా పనిచేయలేదని సామ్ స్పష్టం చేశారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ పద్ధతి లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. -
బ్రిడ్జి డిజైన్‌లో లోపం.. కూల్చేసిన అధికారులు
బొగొటా : 10 మంది కార్మికుల మరణానికి కారణమైన నిర్మాణంలో ఉన్న నాసిరకం బ్రిడ్జిని కొలంబియా అధికారులు కూల్చివేశారు. కొలంబియా రాజధాని బొగొటా, విల్లావిసేన్సియో నగరాలను కలిపే హైవేపై చిరజరలోని లోయ పైనుంచి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతిచెందారు. డిజైన్‌లో లోపం కారణంగానే బ్రిడ్జి ప్రమాదానికి కారణమైందని తేలడంతో, భద్రతా చర్యల్లో భాగంగా బ్రిడ్జిని కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. 100కిలోల పేలుడు పదార్థాలు, 30 డిటోనేషన్ పరికరాలను ఉపయోగించి క్షణాల్లో బ్రిడ్జిని భూస్థాపితం చేశారు. నాసిరకం పనుల కారణంగా ప్రాణ నష్టంతో పాటూ భారీ మొత్తంలో డబ్బు వృథా అయింది. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
కొలంబియాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూల్చివేత
-
ఫిఫా వరల్డ్ కప్: ఓటమితో ‘చావు’ బెదిరింపులు
బాగోట: ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ సమరంలో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడి ఇంటిదారి పట్టిన కొలంబియా ఆటగాళ్లకు అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా పెనాల్టీ షూటౌట్లో గోల్స్ చేయడంలో విఫలమై జట్టు ఓటమికి కారణమైన కొలంబియా ఆటగాళ్లు మాటీస్, కార్లోస్ బాకాను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ‘కార్లోస్.. నిన్ను ద్వేషిస్తున్నా. మీ అందరిపై ద్వేషంతో ఉన్నా. నీ ఉదాసీనత, నీ ఆటలో లోపం, జంతువును సూచించే నీ పేరు (స్పానిష్‌లో బాకా అంటే ఆవు). ఇలా అన్నింటినీ ద్వేషిస్తున్నా’ అని ఓ అభిమాని ట్విట్టర్లో పోస్టు చేశాడు. మాటీస్ను ఉద్దేశించి.. ‘నువ్వు చనిపోతావనే నమ్మకం ఉంది’ అని మరో అభిమాని తెలిపాడు. ‘మాటీస్కు అదే చివరి మ్యాచ్. ఎందుకంటే అతను ఇప్పటికే చనిపోయాడు’ అని వేరొక అభిమాని పేర్కొన్నాడు. మరొకవైపు తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చే అభిమానులు కూడా ఉన్నారు. ‘బాకా, మాటీస్ చనిపోవాలని కోరుకోకండి. గతంలో ఆండ్రూస్ ఎస్కోబార్‌కు జరిగిందే మళ్లీ పునరావృతం కావాలని అనుకుంటున్నారా? ఇది కొలంబియానేనా?’ అని ఇంకో అభిమాని పోస్టు చేశాడు. 1994 ప్రపంచకప్‌లో యుఎస్‌తో మ్యాచ్‌లో సెల్ఫ్‌గోల్ కొట్టినందుకు కొలంబియా వీధుల్లో ఆండ్రూస్‌ను కాల్చిచంపారు. దాంతో ప్రస్తుత హత్యా బెదిరింపులు కొలంబియా ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
ఇంగ్లండ్ నవ్వింది...
ఆధిపత్యం నీదా... నాదా? అన్నట్లు సాగింది ఆట. నీ గోల్‌కు నా గోల్ జవాబంటూ సమమైంది స్కోరు. అదనపు సమయంలోనూ ఎవరికీ దక్కలేదు గెలుపు. అటు ఇటు తిరిగి పెనాల్టీ షూటౌటే తేల్చింది ఫలితం. మరో ఉత్కంఠ పోరాటంతో ముగిసింది ప్రి క్వార్టర్స్. మాస్కో: ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రిక్వార్టర్స్ దశను ‘పెనాల్టీ నాకౌట్’గా పేర్కొనవచ్చేమో! మొత్తం 8 మ్యాచ్‌ల్లో మూడింటి ఫలితం షూటౌట్లోనే తేలింది మరి! మంగళవారం అర్ధరాత్రి కొలంబియాతో ఇక్కడ జరిగిన పోరులో ఇంగ్లండ్ ఈ తరహాలోనే 4–3తో విజయం సాధించింది. అంతకుముందు 57వ నిమిషంలో పెనాల్టీని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ కేన్ గోల్‌గా మలచడంతో ఇంగ్లండ్‌కు ఆధిక్యం దక్కింది. కొలంబియా స్టార్ ఎరి మినా ఇంజ్యూరీ (90+3వ ని.)లో స్కోరు కొట్టి లెక్క సమం చేశాడు. అదనపు అరగంట సమయంలోనూ మరో గోల్ కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. నాలుగు, ఐదు కిక్‌లను కొలంబియా ఆటగాళ్లు నెట్లోకి కొట్టడంలో విఫలం కాగా, మూడో కిక్ మినహా మిగతా వాటిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. ఆసాంతం సమఉజ్జీలుగానే... బంతిపై నియంత్రణ, పాస్‌ల కచ్చితత్వంలో మ్యాచ్ మొదటి నుంచి రెండు జట్లు సమంగానే నిలిచాయి. అయితే, ప్రత్యర్థి కంటే గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఆడిన ఇంగ్లండే ఎక్కువ దాడులు చేసింది. 16వ నిమిషంలో కేన్ కొట్టిన హెడర్ గోల్ బార్‌కు కొద్ది దూరంలో వెళ్లింది. రహీమ్ స్టెర్లింగ్, కీరన్ ట్రిప్పియర్ల జోరుతో తర్వాత సైతం అవకాశాలు వచ్చాయి. మరోవైపు కొలంబియా కీపర్ డేవిడ్ ఒస్పినా అప్రమత్తత, శాంటియాగో ఎరియాస్, జువాన్ క్వాడ్రాడోల ప్రతిదాడులతో ఇంగ్లండ్‌ది పైచేయి కాలేదు. క్రమంగా పుంజుకున్న కొలంబియా ప్రత్యర్థి వెనుకంజ వేసేలా చేసింది. మొదటిభాగంలో 53 శాతం బంతి ఇంగ్లండ్ పరిధిలోనే ఉంది. పెనాల్టీ చెల్లించుకున్నారు... రెండో భాగంలో ప్రారంభంలోనే తప్పులు చేసిన కొలంబియా మూల్యం చెల్లించుకుంది. 54వ నిమిషంలో శాంచెజ్... కేన్‌ను కూలదోయడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ దక్కింది. కీపర్ ఒస్పినాను ఊరిస్తూ కేన్ కొట్టిన బంతి నెట్లోకి చేరింది. ఇక్కడినుంచి రెండు జట్లు వరుసగా సబ్స్టిట్యూట్లను దింపాయి. మ్యాచ్‌లో తీవ్రత పెరగడంతో 52–69వ నిమిషాల మధ్యలో ఏకంగా ఆరు ఎల్లో కార్డులు చూపించాల్సి వచ్చింది. ఇందులో కొలంబియానే నాలుగు ఎదుర్కొనడం గమనార్హం. రెండు జట్లకు రెండేసి అవకాశాలు వచ్చినా అవి గోల్‌పోస్ట్ సమీపం నుంచి పక్కకు వెళ్లాయి. ఇంజ్యూరీలో కార్నర్ కిక్‌ను డి బాక్స్ వద్ద నుంచి మినా హెడర్ గోల్‌గా మలిచాడు. అదనపు సమయం మొదటి భాగంలో కొలంబియా, రెండోభాగంలో ఇంగ్లండ్ పోరాడినా గోల్ చేయలేకపోయాయి. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. ►ప్రస్తుత ప్రపంచకప్‌లో షూటౌట్లో తొలి షాట్ తీసుకున్న మూడు జట్లూ ఓడాయి. ►1996 ‘యూరో’ టోర్నీలో స్పెయిన్‌పై షూటౌట్లో గెలిచాక మరో మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ షూటౌట్లో గెలుపొందడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఇంగ్లండ్ ఎనిమిది షూటౌట్లను ఎదుర్కొనగా... ఆరింటిలో ఓడిపోయి, రెండింటిలో మాత్రమే గెలిచింది. ►2006 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఈ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ►1939లో టామీ లాటన్ తర్వాత ఇంగ్లండ్ తరఫున ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ కొట్టిన ప్లేయర్‌గా హ్యారీ కేన్ నిలిచాడు. ►ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ ఆడిన గత 15 నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎనిమిది అదనపు సమయానికి వెళ్లడం విశేషం. -
గ్రూప్‘హెచ్’ టాపర్ కొలంబియా
సమారా: గ్రూప్ ‘హెచ్’ టాపర్‌గా కొలంబియా ప్రపంచకప్‌లో నాకౌట్ చేరింది. సెనెగల్‌తో గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 1–0 తేడాతో గెలుపొందింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎరీ మినా (74వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. బంతిపై 43 శాతమే నియంత్రణ దక్కినా... అటాకింగ్ గేమ్‌తో సెనెగల్ పోరాడింది. అయితే, మినా అద్భుతమైన హెడర్ గోల్‌తో కొలంబియాకు ఆధిక్యం అందించాడు. దీనిని సమం చేసేందుకు అవకాశం చిక్కని సెనెగల్ ఉసూరుమంటూ నిష్క్రమించింది. జపాన్‌పై పోలాండ్ నెగ్గడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. కొలంబియా 6 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక్క జట్టు కూడా నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి -
కొలంబియా చిందేసింది
జేమ్స్ రోడ్రిగ్స్... గత ప్రపంచ కప్‌లో ఆరు గోల్స్‌తో కొలంబియాను క్వార్టర్ ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆటగాడు. ఈ సారి టోర్నీలో జపాన్‌తో తొలి మ్యాచ్‌లో అతను గాయంతో కేవలం అరగంట ఆటకే పరిమితమయ్యాడు. జట్టు పరాజయానికి అది కూడా కారణమైంది. కానీ తన విలువేమిటో అతను పోలాండ్‌తో మ్యాచ్‌లో చూపించాడు. రోడ్రిగ్స్ తన అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌లో కీలక పాత్ర పోషించి కొలంబియాను గెలిపించగా... రెండు పరాజయాలతో పోలాండ్ నాకౌట్ అవకాశాలు కోల్పోయింది. మరోవైపు క్వాలిఫయింగ్‌లో చెలరేగి ప్రపంచకప్‌కు ముందు భారీ అంచనాలతో బరిలోకి దిగిన పోలాండ్ కెప్టెన్ లెవాండోస్కీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాడు. రెండు వరల్డ్‌కప్‌లకు దూరమైన తర్వాత ఈ సారి అర్హత సాధించిన పోలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి యూరోప్ జట్టుగా నిలిచింది. కజన్ ఎరీనా: గత డిసెంబర్లో వరల్డ్ కప్ గ్రూప్‌లు ఖరారైన తర్వాత పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ... రోడ్రిగ్స్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ‘గత వరల్డ్ కప్‌లో నీ అద్భుత గోల్స్ చూశాను. ఈసారి రష్యా నుంచి నా గోల్స్ గుర్తు పెట్టుకుంటావని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత సవాల్ విసిరాడు. అయితే పోలాండ్ ఎత్తులేమీ కొలంబియాపై పని చేయలేదు. లెవాండోస్కీ విఫలం కాగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోడ్రిగ్స్ తన జట్టును గెలిపించుకున్నాడు. ఆదివారం రాత్రి ఏకపక్షంగా సాగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో కొలంబియా 3–0తో పోలాండ్‌పై ఘన విజయం సాధించింది. కొలంబియా తరఫున యెరీ మినా (40వ నిమిషం), రాడమెల్ ఫాల్కావో (70వ నిమిషం), యువాన్ క్వాడ్రాడో (75వ నిమిషం) గోల్స్ సాధించాడు. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న పోలాండ్... 16వ స్థానంలో ఉన్న కొలంబియాకు ఏ దశలోనూ పోటీనివ్వలేక చేతులెత్తేసింది. తాజా విజయంతో కొలంబియా నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ గ్రూప్‌లో గురువారం జరిగే మ్యాచ్‌లలో జపాన్‌తో పోలాండ్, సెనెగల్‌తో కొలంబియా తలపడతాయి. హోరాహోరీగా... టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లలో ఓడిన రెండు జట్లు కాస్త ఒత్తిడిలోనే బరిలోకి దిగాయి. అయితే ఆరంభం నుంచే కొలంబియా దూకుడుగా ఆడింది. ఏ దశలోనూ ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శించలేదు. రోడ్రిగ్స్‌తో పాటు క్వాంటెరో, క్వాడ్రాడో ప్రత్యర్థి వైపు పదే పదే దూసుకుపోయారు. మరోవైపు పోలాండ్ కూడా సెనెగల్‌తో ఓడిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కానీ లెవాండోస్కీని సమర్థంగా మార్కింగ్ చేయడంలో కొలంబియా సఫలమైంది. ఎట్టకేలకు 40వ నిమిషంలో కొలంబి యాకు అవకాశం వచ్చింది. ఫాల్కావోను పోలాండ్ ఆటగాళ్లు అడ్డుకోవడంతో జట్టుకు పెనాల్టీ దక్కింది. రోడ్రిగ్స్ ఇచ్చిన షార్ట్ కార్నర్‌ను క్వాంటిరో ప్రశాంతంగా అందుకొని మళ్లీ వెనక్కి పంపించాడు. చురుగ్గా ఉన్న రోడ్రిగ్స్ మళ్లీ క్రాస్ షాట్ కొట్టగా...దానిని హెడర్ ద్వారా మినా గోల్‌పోస్ట్‌లోకి పంపిం చాడు. తొలి అర్ధభాగం ముగిసే సరికి బంతి దాదాపు సమాన సమయం ఇరు జట్ల ఆధీనంలో ఉంది. కొనసాగిన జోరు... విరామం తర్వాత పోలాండ్ కౌంటర్ అటాక్ చేసింది. ఈ క్రమంలో కొన్ని అవకాశాలు సృష్టించుకోగలిగినా కొలంబియా కీపర్ డేవిడ్ ఒస్పినా వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఒక దశలో లెవాండోస్కీ గోల్ కొట్టేందుకు అత్యంత చేరువగా వచ్చినా మిడ్ ఫీల్డ్ నుంచి అతను కొట్టిన లాంగ్ పాస్ పోస్ట్‌ను ఛేదించలేకపోయింది. ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అతనికి తగిన సహకారం లభించలేదు. ఆ తర్వాత కొలంబియా తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 70వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించి దూసుకొచ్చిన క్వాంటిరో పాస్ అందించగా, ఫాల్కావో ఎలాంటి తప్పూ చేయలేదు. గాయంతో గత వరల్డ్‌కప్‌కు దూరమైన ఫాల్కావో ఈ గోల్‌తో ఉద్వేగంగా సంబరాలు చేసుకున్నాడు. ఐదు నిమిషాల తర్వాత కొలంబియా మళ్లీ చెలరేగింది. పోలాండ్ ఆటగాళ్లందరినీ వెనక్కి తోస్తూ జోరుగా దూసుకొచ్చిన రోడ్రిగ్స్ అందించిన క్రాస్ పాస్‌ను క్వాడ్రాడో గోల్‌గా మార్చడంతో ‘లాస్ కాఫిటోర్స్’కు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత మిగిలిన సమయంలో కొలంబియా పట్టు నిలబెట్టుకోగా, పోలాండ్ నిరాశగా వెనుదిరిగింది. చంపేస్తామంటూ బెదిరింపులు... జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో నిమిషంలోనే కొలంబియా ఆటగాడు కార్లోస్ సాంచెజ్ రెడ్‌కార్డుకు గురై నిష్క్రమించాడు. పది మందితోనే ఆడిన కొలంబియా చివరకు పరాజయం పాలైంది. ఇప్పుడు అతడిని చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. 1994 ప్రపంచకప్‌లో సెల్ఫ్ గోల్ చేసినందుకు కొలంబియాకు చెందిన ఎస్కోబార్‌ను కొందరు దుండగులు కాల్చి చంపిన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని జట్టు కోచ్ జోస్ పోకర్మన్ అన్నారు.‘సాంచెజ్ చాలా బాధలో, ఆందోళనలో ఉన్నాడు. అలాంటి సమయంలో మేమంతా ఈ విజయాన్ని అతనికి అంకితం ఇచ్చి సాంచెజ్ను ఆనందంలో భాగం చేయాలనుకుంటున్నాం. బెదిరింపులు నిజమా కాదా చెప్పలేను కానీ మాకూ సమాచారముంది. ఇలాంటి విషయాలను చిన్నదిగా చూడలేం. ఫుట్‌బాల్ ఆట మాత్రమే కాదని ఇప్పుడనిపిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
జై జపాన్...
మ్యాచ్‌లో 2 నిమిషాల 56వ సెకను... కొలంబియా డిఫెన్స్‌ను ఛేదించుకొని జపాన్ ఆటగాడు యుయ ఒసాకా దూసుకొచ్చాడు. అతని షాట్‌ను కొలంబియా గోల్ కీపర్ డేవిడ్ ఒస్పినా సమర్థంగా అడ్డుకోగలిగినా... బంతి అతడి చేతుల్లోంచి వేగంగా మళ్లీ వెనక్కి వచ్చింది. అక్కడే కాచుకున్న షిన్జి కగావా బంతిని అంతే వేగంగా మళ్లీ పోస్ట్ వైపు పంపించాడు. అయితే కొలంబియా మిడ్‌ఫీల్డర్ కార్లోస్ శాంచెజ్ బంతిని ఆపే ప్రయత్నంలో అనూహ్యంగా తన కుడి చేతిని అడ్డంగా తెచ్చేశాడు! అంతే... మరో మాటకు తావు లేకుండా రిఫరీ అతడికి రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపడం, ఆ వెంటనే పెనాల్టీ కిక్‌ను కగావా గోల్‌గా మలచడం చకచకా జరిగిపోయాయి... ఆ క్షణం నుంచి పది మందితోనే ఆడిన ప్రత్యర్థి బలహీనతను వాడుకున్న జపాన్ సంచలనం నమోదు చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో ఒక దక్షిణ అమెరికా జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా ఘనతకెక్కింది. సరాన్స్క్: ‘ఫిఫా’ ప్రపంచ కప్ పోరును జపాన్ అద్భుత విజయంతో ఆరంభించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో జపాన్ 2–1 గోల్స్ తేడాతో కొలంబియాను చిత్తు చేసింది. జపాన్ తరఫున షిన్జి కగావా (6వ నిమిషం), యుయ ఒసాకా (73వ నిమిషం) గోల్స్ సాధించగా... కొలంబియా తరఫున యువాన్ క్వాంటెరో (39వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ 3వ నిమిషంలోనే శాంచెజ్ రెడ్ కార్డుకు గురి కావడం కొలంబియా అవకాశాలను దెబ్బ తీసింది. ఈ వరల్డ్ కప్‌లో రెడ్ కార్డ్ శిక్షకు గురైన తొలి ఆటగాడు శాంచెజ్ కాగా... వరల్డ్ కప్‌లో మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి చూస్తే ఇది రెండో వేగవంతమైన కార్డు. 1986 వరల్డ్ కప్‌లో ఉరుగ్వే ఆటగాడు అల్బర్టో బటిస్టా 54వ సెకన్లోనే రెడ్ కార్డును ఎదుర్కొన్నాడు. జపాన్ దూకుడుగా... టాస్ గెలిచిన కొలంబియా కెప్టెన్ తొలి అర్ధ భాగంలో ఎటు వైపు నుంచి ఆటను మొదలు పెట్టాలనే విషయంలో కొంత గందరగోళానికి గురి కావడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి నిమిషంలోనే జపాన్ ఆటగాడు ఒసాకా మెరుపులా దూసుకొచ్చి దాదాపు గోల్ చేసినంత పని చేసినా, కీపర్ ఒస్పినా సమర్థంగా అడ్డుకోగలిగాడు. అయితే మూడో నిమిషంలో శాంచెజ్ చేసిన పొరపాటుకు కొలంబియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. శాంచెజ్ ‘హ్యాండ్ బాల్’ దెబ్బకు పెనాల్టీ కిక్ లభించిన జపాన్ దానిని సద్వినియోగం చేసుకుంది. ఒత్తిడిని అధిగమించిన కగావా దానిని గోల్‌గా మలచడంతో జపాన్ ఆధిక్యంలో దూసుకుపోయింది. అనంతరం కొలంబియా పది మందితోనే ఎదురుదాడికి ప్రయత్నించింది. 15వ నిమిషంలో రాడమెల్ ఫాల్కావ్ గోల్‌కు చేరువగా వచ్చినా, జపాన్ కీపర్ దానిని నిరోధించగలిగాడు. ఆ తర్వాత 26వ నిమిషంలో కూడా క్వాడ్రాడో గోల్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎట్టకేలకు మరో 13 నిమిషాల తర్వాత కొలంబియాకు ఫ్రీకిక్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. అడ్డుగోడగా నిలబడిన జపాన్ బృందాన్ని ఏమార్చి యువాన్ క్వాంటెరో చక్కటి గోల్ చేశాడు. గోల్‌ను అడ్డుకునేందుకు అంతా పైకి ఎగరగా క్వాంటెరో మెల్లగా కింది వైపు నుంచి దానిని పాస్ చేశాడు. ఉదాసీనత కనబర్చిన జపాన్ కీపర్ ఎయిజి కవాషిమా ఆఖరి క్షణాల్లో అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అది గోల్ కాదంటూ కవాషియా వాదించినా... రీప్లేలో బంతి పోస్ట్‌లోకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. తగ్గని జోరు... రెండో అర్ధ భాగంలో కూడా జపాన్ జోరు కొనసాగింది. కొన్ని సార్లు కొలంబియా సమర్థంగా అడ్డుకోగలిగినా ఎక్కువ భాగం జపాన్ ఆధిపత్యమే నడిచింది. రెండో అర్ధ భాగం తొలి 15 నిమిషాల్లో 74 శాతం సమయం బంతి జపాన్ ఆధీనంలోనే ఉండటం దీనిని చూపిస్తోంది. 57వ నిమిషంలో తకషుయ్ కొట్టిన బలమైన షాట్ నేరుగా కీపర్ చేతుల్లో పడటంతో జపాన్ కొంత అసహనానికి లోనైంది. 59వ నిమిషంలో కొలంబియా తమ స్టార్ జేమ్స్ రోడ్రిగ్స్‌ను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దింపింది. 70వ నిమిషంలో జపాన్ సీనియర్ ఆటగాడు కిసుకే హోండాను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకు రావడం వెంటనే ఫలితాన్ని అందించింది. తర్వాతి నిమిషంలో త్రుటిలో గోల్ చేజార్చుకున్న అతను మరో రెండు నిమిషాలకే గోల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఇచ్చిన అద్భుతమైన క్రాసింగ్ పాస్‌ను ఒసాకా హెడర్‌తో పోస్ట్‌లోకి పంపడంతో జపాన్ సంబరాలు చేసుకుంది. చివర్లో బంతి తమ నుంచి చేజారిపోకుండా జపాన్ చురుగ్గా వ్యవహరించడంతో కొలంబియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ►ప్రపంచకప్ చరిత్రలో 1978 తర్వాత దక్షిణ అమెరికాకు చెందిన నాలుగు జట్లు తమ తొలి మ్యాచ్‌లో నెగ్గకపోవడం ఇదే తొలిసారి. ► జపాన్ ప్లేయర్ కెసుకె హోండా వేర్వేరు మూడు ప్రపంచకప్‌లలో తమ జట్టు సహచరులు గోల్స్ చేసేందుకు పరోక్షంగా సహాయపడ్డాడు. ►1966 తర్వాత ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ అతడే కావడం విశేషం. ►ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగి జపాన్ తరఫున ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన పెద్ద వయస్కుడిగా ఇజి కవాషిమా (35 ఏళ్ల 91 రోజులు) రికార్డు నెలకొల్పాడు. -
ఒకటి కొలంబియా... రెండోది పోలండ్!
ఏ జట్టుకీ చెప్పుకోదగ్గ చరిత్ర లేదు...మేటి కాకపోయినా మెరుపు ఆటగాళ్లైనా లేరు... ఒకటి ఓడినా, మరోటి గెలిచినా సంచలనమేం కాదు... ప్రపంచ కప్‌ను ఒక్కసారి కూడా అందుకోని... ఈసారైనా విజేతగా నిలుస్తాయన్న ఆశ లేని జట్లు... ఇలాంటివాటి సమాహారమే గ్రూప్ ‘హెచ్’! ఇందులో పోలండ్, కొలంబియా ముందడుగేయొచ్చు... కొలంబియా ఎంతోమంది యువ ప్రతిభావంతులున్న జట్టు కొలంబియా. 2014లో క్వార్టర్స్‌కు చేరింది. ఆ ప్రదర్శనను పునరావృతం చేయగలదు. అయితే, క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తడబడింది. బెర్తు ఖాయమయ్యేందుకు చివరి మ్యాచ్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు వరుసగా రెండోసారి అర్హత సాధించింది. కీలకం: జేమ్స్ రోడ్రిగెజ్. అత్యంత ప్రతిభావంతుడు. 2014లో ఉరుగ్వేపై చేసిన గోల్‌కు ఫిఫా పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఫామ్ అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కోచ్: జోస్ పెకర్మాన్. అర్జెంటీనా దేశస్తుడు. కొలంబియా విజయాల వెనుక ఘనతంతా ఇతడిదే. ప్రపంచ ర్యాంక్: 16 చరిత్ర: అయిదుసార్లు అర్హత సాధించింది. 2014లో క్వార్టర్స్‌కు చేరింది. పొలోమంటూ... పోలండ్ పుష్కర కాలం తర్వాత అర్హత సాధించింది. 1974–86 మధ్య చక్కటి ప్రదర్శన కనబర్చి బలమైన జట్టుగా ఎదుగుతున్నట్లు కనిపించింది. కానీ, ప్రదర్శన దిగజారి తర్వాత మూడు ప్రపంచ కప్‌లకు క్వాలిఫై కాలేకపోయింది. 2002, 2006లలో గ్రూప్ దశ దాటలేదు. గత రెండు కప్‌లకూ దూరమైంది. కీలక ఆటగాళ్లైన రాబర్ట్ లెవాన్‌డౌస్కీ, జాకబ్ బ్లాస్జికౌస్కీలకు ఇదే చివరి కప్ కావడం... రష్యా దగ్గరగా ఉండటంతో అభిమానులు ఆ దేశానికి పొలోమంటూ ప్రయాణమయ్యే సన్నాహాల్లో ఉన్నారు. 2016 యూరో కప్‌లో క్వార్టర్స్‌కు చేరిన జట్టే ఇప్పుడూ ఉంది. నాడు చాంపియన్‌గా నిలిచిన పోర్చుగల్ చేతిలో పోలండ్ పోరాడి ఓడింది. మరోవైపు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో 4–0తో ఓడటం పోలండ్ డిఫెన్స్ బలహీనతలను బయటపెట్టింది. అయినప్పటికీ గ్రూప్‌లో మిగతా జట్లతో పోలిస్తే ముందడుగు వేసే అవకాశాలు దీనికే ఉన్నాయి. కీలకం: లెవాన్‌డౌస్కీ. 29 ఏళ్ల ఈ స్ట్రయికర్ దేశం తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు. అర్హత మ్యాచ్‌ల్లో 16 గోల్స్ కొట్టాడు. యూరప్ ఆటగాళ్లలో ఇదే అత్యధికం. మరో స్ట్రయికర్ బ్లాస్జికౌస్కీ (32) పైనా అంచనాలున్నాయి. కోచ్: ఆడమ్ నవాల్కా. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రత్యర్థులపై ఆధిపత్యం కోసం ఎదురుదాడి చేసేలా జట్టును తయారు చేశాడు. ప్రపంచ ర్యాంక్: 8 చరిత్ర: మొత్తం 8 సార్లు అర్హత సాధించింది. 1974, 82లలో మూడో స్థానంలో నిలిచింది. స్టార్లు లేని జపాన్ ఇతర జట్ల మాదిరిగా చెప్పుకొనేందుకు ఒక్క స్టార్ కూడా లేని జట్టు జపాన్. కానీ, షింజి కగావా, షింజి ఒకజాకి వంటి ఆటగాళ్లకు యూరోపియన్ లీగ్‌ల్లో ఆడిన విశేష అనుభవం ఉంది. సౌదీ అరేబియా, ఆస్ట్రేలియాలను పక్కకునెట్టి క్వాలిఫయింగ్ పోటీల గ్రూప్ బిలో టాప్‌లో నిలిచి ప్రపంచ కప్ బెర్తు కొట్టేసింది. కీలకం: షింజి కగావా. అనుభవజ్ఞుడైన మిడ్ ఫీల్డర్. ఇతడితో పాటు ఒకజాకి, యుటో నగమోటో, కిసుకి హోండా రాణిస్తే జపాన్ నాకౌట్ అవకాశాలు మెరుగుపడతాయి. కోచ్: వహిద్ హలిల్హొడ్జిక్. బోస్‌ని యా దేశస్తుడు. అల్జీరియా 2014 ప్రపంచ కప్‌నకు క్వాలిఫై కావ డంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ ర్యాంక్: 61 చరిత్ర: 1998 నుంచి వరుసగా అర్హత సాధిస్తోంది. 2002, 2009లో 9వ స్థానంలో నిలవడం అత్యుత్తమం. సంచలనాల సెనెగల్ కేవలం రెండోసారి అర్హత సాధించింది. 2002లో అడుగు పెడుతూనే అప్పటి డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఆ కప్‌లో క్వార్టర్స్ చేరిన ఏకైక ఆఫ్రికా జట్టుగా నిలిచింది. తర్వాత మూడు కప్‌లకు అర్హత పొందలేకపోయింది. ఈసారి ఫిఫా చొరవతో సంచలనాత్మక రీతిలో బెర్తు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 2–1 తేడాతో సెనెగల్ ఓడింది. అయితే, రిఫరీ నిర్ణయాలపై అనుమానంతో ఫిఫా రీ మ్యాచ్ ఆడించింది. 2–0తో గెలుపొందిన సెనెగల్ ప్రపంచ కప్ కోసం ఫ్లైటెక్కింది. చురుకైన ఆటగాళ్లుండే సెనెగల్... మళ్లీ మళ్లీ సంచలనాలు సృష్టించే సత్తా ఉన్నదే. కీలకం: శాడియో మానె. వేగవంతమైన కదలికలకు పెట్టింది పేరు. జట్టులో అతి కీలక ఆటగాడు. కోచ్: అలీయు సిసె. 2002 కప్‌లో జట్టు కెప్టెన్. ఇప్పుడు కోచ్‌గా అతడి ఆధ్వర్యంలోనే రెండోసారి అర్హత సాధించడం విశేషం. ప్రపంచ ర్యాంక్: 27 చరిత్ర: 2002లో క్వార్టర్స్‌కు చేరింది. -
ఆ 11 లక్షల కోట్ల రూపాయల సంపద...ఎవరిది ?
-
ఒక పిజ్జా ఇవ్వండి..!
‘డబ్బులు చెట్లకు కాస్తాయా ఏమన్నా’.. ఈ సామెత మనం చాలా సార్లే వింటుంటాం.. అయితే ఈ ఫొటోలో ఉన్న కుక్కకు మాత్రం అలా కాదు.. దీనికి డబ్బులు చెట్లకే కాస్తాయి.. అదెలా అనుకుంటున్నారా..? దీని పేరు నీగ్రో.. దీనికి ఏదైనా తినాలనిపిస్తే చాలు దుకాణానికి వెళ్లి చెట్ల ఆకులు ఇస్తుంది. వెంటనే ఆ దుకాణదారుడు దానికి కావాల్సింది ఇచ్చేస్తారు. నీగ్రో కొలంబియాలోని కాసనేర్ మాంటెర్రీ అనే యూనివర్సిటీలో ఉంటుంది. నీగ్రోను అక్కడి టీచర్లు దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు నీగ్రో అంటే చాలా ఇష్టం. దీంతో వారంతా అప్పుడప్పుడు తినుబండారాలు కొనిస్తూ ఉంటారు. వారు డబ్బులిస్తూ దుకాణంలో కొనడం చూసిన మన నీగ్రోకు ఓ ఐడియా వచ్చింది. విద్యార్థులు తినుబండారాలు కొనివ్వనప్పుడు తాను కూడా తినుబండారాలను కొనుక్కోవాలని డిసైడ్ అయింది. విద్యార్థులు ఏదో ఇచ్చి కొనడం క్షుణ్నంగా పరిశీలించిన నీగ్రో.. చెట్ల ఆకులు తీసుకెళ్లి ఇస్తూ ఉండేది.. దుకాణదారులు కూడా ముచ్చట పడి ఏదో ఒకటి ఇస్తుంటారు. ప్రతి రోజూ బిస్కెట్ల కోసం వస్తూ ఉంటుందని గ్లాడిస్ బరెటో అనే దుకాణదారుడు చెబుతున్నాడు. నీగ్రో చాలా తెలివైన కుక్కండీ బాబోయ్ అని అక్కడి వారంతా తెగ సంబరపడతారు.. -
వెనెజులాలో ఆర్థిక సంక్షోభం
-
శృంగార పాఠాలు.. 40 ఏళ్ల జైలు శిక్ష
కొలంబియా : విద్యార్థులకు మంచిబుద్ధులు చెప్పివారిని సమాజ హితకారులుగా మార్చాల్సిన పంతులమ్మే దారి తప్పింది. విద్యార్థులను తన శారీరక అవసరాలకు ఉపయోగించుకుంటూ.. వారికి పరీక్షల్లో ఇచ్చినట్లు గ్రేడ్లు కూడా ఇచ్చింది. ఆమె విపరీత చేష్టలకు బెదిరిన తల్లిందడ్రులు కేసు పెట్టడడంతో విషయం మొత్తం బయటకు పొక్కింది. ఈ ఘటన కొలంబియా దేశంలో జరిగింది. యోకాస్తా (40) అనే టీచరమ్మ కొలంబియాలోని మెడిలిన్ సిటీలోని ఒక ప్రయివేట్ బాలుర పాఠశాలలో పనిచేస్తోంది. నాలుగు పదులకు చేరిన ఈ పంతులమ్మ 15 నుంచి 19 మధ్యనున్న టీనేజ్ విద్యార్థులను స్పెషల్ తరగతుల పేరుతో.. ఇంటికి పిలిపించుకుని.. వారితో శృంగారంలో పాల్గొనేది. అంతేగాక విద్యార్థులకు స్కూల్లో ర్యాంకులు, గ్రేడ్లు ఇచ్చినట్లు ఈమె.. వారికి గ్రేడ్లను కూడా ఇచ్చేది. టీనేజ్ విద్యార్థులను ఆకర్షించేందుకు ఆమె వాట్సప్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాలను సైతం ఇందుకు ఉపయోగించుకునేది. ప్రారంభంలో చదువు చెబుతున్నట్లు వారిని నమ్మించి.. నెమ్మదిగా వారిని ఆకర్షించేది. పంతులమ్మ చేసే పనులు నచ్చని ఒక విద్యార్థి పేరంట్స్కు చెప్పడం.. పోలీసులు విచారణ, కోర్టు కేసులు మొదలయ్యాయి. కోర్టు విచారణలనే టీచరమ్మ పద్దతి నచ్చని.. ఆమె భర్త విడాకులు తీసుకున్నట్లు తేలింది. పంతులమ్మ వ్యవహరాన్ని పూర్తిగా విచారించిన కోర్టు.. ఆమెకు 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. -
ఓడినా... ‘చరిత్ర’ సృష్టించారు
భారత కుర్రాళ్లు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడారు.. అయితేనేం ఫిఫా ప్రపంచకప్‌లో దేశం తరపున మొట్ట మొదటి గోల్‌తో చరిత్రలో భాగమయ్యారు.. డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్ ఈ అద్భుతానికి కారకుడయ్యాడు. కార్నర్ కిక్‌ను తన అద్భుత హెడర్‌తో చేసిన గోల్‌తో ఫుట్‌బాల్ అభిమానులు పులకరించారు. ప్రత్యర్థి జట్లు తమకన్నా ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తరుణంలో ఒక్క గోల్ అయినా చేస్తారా...అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ కొలంబియాతో ఆడిన తీరు నిజంగా అపూర్వం. అయితే పలుమార్లు గోల్స్ అవకాశాలు వచ్చినా అనుభవలేమితో కోల్పోవడం నిరాశ కలిగించింది. ఓవరాల్‌గా తమ తొలి మ్యాచ్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ గణనీయమైన మార్పు కనిపించిన కుర్రాళ్లు భారత ఫుట్‌బాల్ భవిష్యత్‌పై నమ్మకాన్ని పెంచారు. న్యూఢిల్లీ: ప్రారంభ మ్యాచ్‌లో అమెరికాతో ఎదురైన బలహీనతలను అధిగమించిన భారత కుర్రాళ్లు ఈసారి ఆకట్టుకున్నారు. దీంతో ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో గెలిచేందుకు కొలంబియా చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు ఈ మ్యాచ్‌ను భారత్ 1–2తో ఓడినా తమ కలను మాత్రం విజయవంతంగా నెరవేర్చుకుంది. మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్ 82వ నిమిషంలో చేసిన గోల్.. ఫిఫా టోర్నీలోనే భారత్‌కు తొలి గోల్‌గా నిలిచింది. ఓటమితో నిరాశపరిచినా స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశాభిమానుల మనస్సులు మాత్రం గెలుచుకున్నారు. కొలంబియా తరఫున రెండు గోల్స్‌ను జువాన్ పెనలోజా (49, 83వ నిమిషాల్లో) సాధించాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. అమెరికాపై రాణించిన కోమల్ తాటల్ ఈసారి బెంచీకే పరిమితమయ్యాడు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిన భారత్ తమ తదుపరి రౌండ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను 12న భారత జట్టు ఘనాతో ఆడుతుంది. హోరాహోరీ ప్రథమార్ధంలో ఇరు జట్ల నుంచి హోరాహోరీ ప్రదర్శన ఎదురైంది. ఆరంభంలో భారత్ వెనకబడ్డా ఆ తర్వాత పుంజుకుంది. 5వ నిమిషంలోనే కొలంబియా గోల్ కోసం ప్రయత్నించినా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. అయితే బంతిని మాత్రం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. తొలి పది నిమిషాలపాటు బంతిపై పట్టు సాధించేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. రైట్ ఫ్లాంక్ నుంచి కొలంబియా అటాకింగ్ గేమ్‌కు దిగినా భారత్ అడ్డుకోగలిగింది. అయితే 16వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసేందుకు అద్భుత అవకాశం దక్కింది. అభిజిత్ చరిత్ర సృష్టించినట్టే అనిపించినా అతడు కొట్టిన షాట్ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లడంతో నిరాశ తప్పలేదు. 37వ నిమిషంలో కొలంబియా ఆటగాడు కాంపాజ్ హెడర్‌ను భారత గోల్ కీపర్ ధీరజ్ మెరుపు వేగంతో అందుకోవడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. 42వ నిమిషంలోనూ ధీరజ్ ఇదే రీతిన ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకోగలిగాడు. మరోవైపు ఇంజ్యూ రీ సమయంలో రాహుల్‌కు లభించిన మరో సువర్ణావకాశం గోల్ పోస్టు బార్‌కు తగిలి విఫలమైంది. భారత్ తొలి గోల్ ద్వితీయార్ధం ఆరంభమైన వెంటనే కొలంబియా జోరు కనబరిచింది. 49వ నిమిషంలో పెనలోజా ఎడమ కాలితో సంధించిన షాట్.. టాప్ కార్నర్ ద్వారా భారత గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. అయితే 55వ నిమిషంలో రాహుల్ స్కోరును సమం చేసినట్టుగా కనిపించినా అతడు కొట్టిన హెడర్ షాట్ వైడ్‌గా వెళ్లింది. అయితే భారత అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచకప్ గోల్ 82వ నిమిషంలో నమోదైంది. సంజీవ్ స్టాలిన్ నుంచి వచ్చిన కార్నర్ షాట్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి హెడర్ ద్వారా గురి తప్పకుండా జీక్సన్ చేసిన గోల్‌తో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అటు స్కోరు 1–1తో సమమైంది. కానీ ఈ ఆనంద క్షణాలను కొలంబియా మరుసటి నిమిషంలోనే ఆవిరి చేసింది. గోల్ కీపర్ ధీరజ్‌ను బోల్తా కొట్టిస్తూ పెనలోజా ఎడమవైపు నెట్‌లోనికి బంతిని పంపడంతో ఒక్కసారిగా స్టేడియం నిశ్శబ్దంగా మారింది. గ్రూప్ ‘ఎ’లో జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా జట్టు 1–0తో ఘనాను ఓడించింది. గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌ల్లో మాలి జట్టు 3–0తో టర్కీని.. పరాగ్వే 4–2తో న్యూజిలాండ్‌ను ఓడించాయి. -
మరో సవాల్‌కు సిద్ధం
న్యూఢిల్లీ: ఫిఫా అండర్–17 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓటమి పాలైన భారత కుర్రాళ్లు నేడు (సోమవారం) మరో పోరుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా తమకన్నా మెరుగైన స్థితిలో ఉన్న కొలంబియాతో భారత్ తలపడుతోంది. పటిష్ట అమెరికాతో అన్ని విభాగాల్లో వెనకబడి 0–3తో చిత్తుగా ఓడిన భారత్ ఈసారి తమ వైఫల్యాలను సరిచేసుకుని బరిలోకి దిగాలని భావిస్తోంది. తదుపరి రౌండ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌కు ఓ విజయం అవసరం. అయితే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టే కొలంబియాపై తమ శక్తికి మించిన ఆటను ప్రదర్శించాల్సి ఉంటుందని మిడ్‌ఫీల్డర్ లించ్పిన్ సురేశ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో తాము నైజర్ జట్టును ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాడు. తొలిసారిగా ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆ జట్టు శనివారం రాత్రి తమకన్నా మెరుగైన స్థితిలో ఉన్న ఉత్తర కొరియాపై నెగ్గింది. అటు భారత కోచ్ లూయిస్ నార్టన్ కూడా తమ తొలి మ్యాచ్ ఫలితంపై నిరాశగా ఉన్నారు. కొలంబియా కూడా గట్టి పోటీనివ్వడం ఖాయమని, అయితే సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. చివరి నిమిషం వరకు పోరాడతామని, ఈ మ్యాచ్‌లో నెగ్గితే చరిత్ర సృష్టించినట్టేనని అన్నారు. నిజానికి అమెరికాతో పోరులో భారత కుర్రాళ్లు అక్కడక్కడ మెరుపు ఆటను ప్రదర్శించి తమ తొలి గోల్‌కు దగ్గరగా రాగలిగారు. అయితే అన్నింటా ఆధిపత్యం చూపిన యూఎస్ జట్టు ఆ అవకాశాలను అడ్డుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో సిక్కిం కుర్రాడు కోమల్ తటాల్ అందరినీ ఆకర్షించాడు. తన డ్రిబ్లింగ్ నైపుణ్యంతో జట్టుకు పలు గోల్ అవకాశాలను సృష్టించగలిగాడు. అలాగే అనికేత్ జాదవ్‌తో పాటు డిఫెన్స్ ఆటగాళ్లు అన్వర్ అలీ, జితేంద్ర సింగ్ తమ శాయశక్తులా అమెరికాకు గట్టి పోటీనివ్వగలిగారు. అన్నింటికీ మించి గోల్‌కీపర్ ధీరజ్ సింగ్ అత్యద్భుతంగా రాణించి అడ్డుగోడలా నిలవకపోయుంటే అమెరికా చేతిలో భారీ గోల్స్ తేడాతో పరాజయం ఎదురయ్యేదే. యూరోప్ జట్లతో పోలిస్తే శారీరకంగా, సాంకేతికంగా వెనుకబాటులో ఉండడం భారత కుర్రాళ్లను దెబ్బతీస్తున్న అంశం. కసితో కొలంబియా.. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో కొలంబియా కూడా ఘనా చేతిలో 0–1తో పరాజయం పాలైంది. ఇప్పుడు తమ కన్నా బలహీన భారత్‌పై సాధ్యమైనన్ని ఎక్కువ గోల్స్‌తో విరుచుకుపడి తమ పాయింట్లను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. -
వెంట్రుకలు కథ చెప్తాయి...
కొలంబియా దేశానికి బానిసలుగా వెళ్లిన ఆఫ్రికన్లు నాలుగు వందల ఏళ్లుగా తమ తలకట్టు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ‘ఆశల ఆల్లిక’ పేరుతో ప్రతి సంవత్సరం జూలై నెలలో అక్కడ జడల పోటీ నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటిచెబుతున్నారు. జుట్టుదేముంది అనుకోవద్దు. దాని వెనుక మానవజాతికి ఉన్నంత చరిత్ర ఉంది. నల్ల జుట్టు, తెల్ల జుట్టు, రాగి రంగు జుట్టు... జుట్టు స్వభావం ఒక జాతిని నిర్దేశిస్తుంది. విభజిస్తుంది. ఒక జాతి మీద మరొక జాతిని ఆధిపత్యం చెలాయించమని కోరుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో సమూహం ఈ వివక్షను ఎదుర్కొందిగానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఎదుర్కొన్నది ఆఫ్రికన్లే. అందుకే వారు ‘మా జట్టు మా సొంతం’ అంటున్నారు. కొలంబియాలో కష్టాలు: ఉత్తర, లాటిన్ అమెరికాల్లోని రాగి, బంగారు గనులు, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయడానికి ఆఫ్రికా దేశాల నుంచి నల్లవాళ్లను పట్టుకొచ్చేవారు. వీళ్లను ఇక్కడ బానిసలుగా చేసుకునేవారు. వీళ్లకు గొడ్డు చాకిరీ ఉండేది. స్త్రీలు అతి కష్టమ్మీద దొరికే తీరికలో తన పిల్లలకు జుట్టు దువ్వుకునేవారు. ఆఫ్రికన్లది రింగుల రింగుల జుట్టు. వారు జడలు కట్టిన రీతిలో జుట్టును అలంకరించుకోవడం పరిపాటి. అయితే ఇందుకు ఏమాత్రం సమయం దొరికేది కాదు. అమెరికన్ యజమానులు అందుకు అవకాశం ఇచ్చేవారు కాదు. పైగా జుట్టును జడలుగా వేసుకోవడానికి అంగీకరించేవారు కాదు. దీనికి కారణం ఏమిటంటే... బానిసలు ఈ జడలను సంకేతాలుగా ఉపయోగించుకునేవారు. ‘ఫలానా విధమైన’ జడను వేసుకుంటే ఈ రాత్రికి ఊరి నుంచి పారిపోబోతున్నట్టు అర్థం అనే సిగ్నల్ ఇచ్చే వీలుండేది. అంతే కాక చిక్కటి జడలలో తాము పని చేసే గనుల నుంచి బంగారం దాచుకునేవారు. గనుల నుంచి పారిపోతే ఆ బంగారం ఉపయోగపడుతుందని వారి ఆలోచన. అందువల్ల కూడా యజమానులు వారిని జడలు వేసుకోవడానికి వారించేవారు. ఆశల అల్లిక: 1850లలోనే కొలంబియా దేశంలో బానిసత్వం రద్దయ్యింది. అయినప్పటికీ అక్కడ ఉన్న నల్లవాళ్ల కట్టు, బొట్టు, సంస్కృతుల మీద దాడి కొనసాగింది. చూసి చూసి ఆఫ్రికన్లు తిరగబడ్డారు. సాంస్కృతిక స్వాతంత్య్రం కావాలని, ‘మా జుట్టు మా స్వేచ్ఛ’ అని చాటి చెప్పడానికి గత పదేళ్లుగా ఆ దేశంలోని నైరుతి ప్రాంత నగరమైన ‘కాలి’లో ‘ఆశల అల్లిక’ పేరుతో శిరోజాలు అల్లే పోటీని ప్రతి ఏటా జూలైలో నిర్వహిస్తున్నారు. కొలంబియాలో ఉన్న ఆఫ్రికన్ యువతులు, ఆడపిల్లలు అక్కడికి వచ్చి పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. గంటల తరబడి తమ కేశాలను జడలు అల్లి ఆశ్చర్యకరమైన తలకట్టును ప్రదర్శిస్తారు. బహుమతులకంటే... ఈ విషయం దేశ విదేశాలలో ప్రచారమై ‘మన తల కట్టును మనం గౌరవించుకోవాలి’ అనే భావన పెరుగుతోంది. భారతదేశంలో జడ ఒక అందమైన తలకట్టు. దాని చిన్న చూపు చూసేవారు ఇలాంటి కథనాలు చూసి ఏమంటారో! -
కొలంబియా షాపింగ్ మాల్లో పేలుడు
బొగొటా: కొలంబియా రాజధాని బొగొటా మరోసారి నెత్తురోడింది. ఆదివారం జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించారు. ఇక్కడి సెంట్రోఆండి యానో లోని రద్దీగా ఉన్న షాపింగ్ మాల్లో బాంబు పేల్చి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముష్కరులు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, పేలుళ్లలో శక్తిమంతమైన మందుగుండును ఉపయోగించారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో 23 ఏళ్ల ఫ్రాన్స్ దేశ మహిళ ఉన్నట్లు చెప్పారు. ఆరునెలల క్రితం ఆమె పేదలకు సేవచేయడానికి వలంటీర్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక దేశంలోనే అతి పెద్ద తీవ్రవాద సంస్థ అయినా నేషనల్ లిబరేషన్ ఆర్మీ లేదా ఈఎల్ఎన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అధ్యక్షుడు జాన్ మాన్యుయేల్ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ మరణించిన వారిపట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. గత ఫిబ్రవరిలో జరిగిన దాడుల్లో 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. -
9 వేల డాలర్లు... గుటకాయ స్వాహా
భర్త మీద కోపంతో దాచుకున్న డబ్బు మొత్తాన్ని అమాంతం మింగేసిందో భార్య. కొలంబియాలోని బుకర్మంగాకు చెందిన 28 ఏళ్ల శాండ్రా మిలెనా అనే ఒక యువతి ఈ నెల 22న విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. తొలుత గ్యాస్ట్రిక్ సమస్యగా భావించిన వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. కానీ శస్త్రచికిత్సలో వైద్యులను నివ్వెరపరిచే ఒక దృశ్యం కనిపించింది. ఆమె కడుపు నిండా 100 అమెరికన్ డాలర్ల కరెన్సీతో నిండిపోయి ఉంది. వైద్యులు దాదాపుగా డబ్బు మొత్తాన్ని బయటకు తీసివేశారు. అలా తీసివేయగా వచ్చిన డబ్బు 5,700 డాలర్లు (రూ. 3.66 లక్షలు) వచ్చింది. దీంతో వైద్యులు వెంటనే పోలీసులను పిలిపించారు. పోలీసులు సదరు యువతిని విచారించగా అందరూ నిర్ఘాంతపోయే వాస్తవాన్ని పోలీసులకు తెలిపింది. తాను, తన భర్త పనామాకు వెళ్లి చక్కని జీవితాన్ని గడపాలని భావించినట్లు, దానికోసం ఇద్దరం కలిసి కొంత సొమ్మును కూడబెట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే తమ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని తెలిపింది. దీంతో తామిద్దరం విడిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కూడబెట్టిన డబ్బుతో పాటు, ఫర్నీచర్, మోటార్‌సైకిల్ అమ్మగా వచ్చిన డబ్బును చెరిసగం పంచుకోవాలని తన భర్త ప్రతిపాదించాడని తెలిపింది. దీనికి తాను ఒప్పుకున్నట్లే నటించి ఆ డబ్బు తన భర్తకు దక్కకూడదనే కోపంతో కరెన్సీ మొత్తాన్ని మింగేశానని చెప్పింది. శాండ్రా మింగిన మొత్తం 9 వేల డాలర్లు (రూ. 5.78 లక్షలు) విలువ చేసే 100 డాలర్ల కరెన్సీ కావడం గమనార్హం. -
కూలిన విమానం.. 8 మంది మృతి
బొగోటా: కొలంబియాలో ఓ సైనిక విమానం ప్రమాదానికి గురైంది. మిలిటరీ బేస్ నుంచి బొగోటాకు బయలుదేరిన సెస్నా కరవాన్ అనే సింగిల్ ఇంజిన్ విమానం సెంట్రల్ కొలంబియాలో కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఓ సీనియర్ మిలిటరీ అధికారి ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి ప్రతికూల వాతవరణ పరిస్థితులే కారణంగా భావిస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. కొలంబియా అధ్యక్షుడు మాన్యుయల్ సాంటోస్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కొలంబియా విలయం: 254కు పెరిగిన మృతులు
మొకోవా: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదతోపాటు ముంచెత్తిన బురద విలయానికి దక్షిణ అమెరికా దేశం కొలంబియా విలవిలలాడుతోంది. దేశ నైరుతి ప్రాంతంలోని మొకోవా నగరం మొత్తాన్ని బురద ప్రవాహం ముంచెత్తింది. దీంతో అనేక ఇళ్లు, వంతెనలు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. ఎక్కడచూసినా బురద తప్ప మరేమీ కనిపించని పరిస్థితి నెలకొంది. విలయం కారణంగా చనిపోయినవారి సంఖ్య సోమవారం నాటికి 254కు పెరిగింది. దేశాధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ మొకోవాలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. (బురద విలయం ఫొటోలు ఇక్కడ క్లిక్ చేయండి) గత శుక్రవారం భారీ వర్షం కురవడంతో మొకోవా, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహించిన కారణంగానే మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, చివరికి మహా విపత్తుకు దారితీసింది. ఈ విషాదం నేపథ్యంలో దాదాపు 200 మంది గల్లంతుకాగా, 300 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. అనేక ఆవాసాలు ధ్వంసమయ్యాయి. స్థానిక అధికారులు, సైనిక సిబ్బంది, పోలీసులతో కూడిన విపత్తు బృందాలు గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టాయి. గడిచిన మూడు రోజులుగా మొకోవాలో, పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు దొరకకపోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. -
వరదల్లో 200 మంది మృతి
-
వరదల్లో 200 మంది మృతి
బోగోటా(కొలంబియా): పుటమయో ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి సుమారు 200 మంది మృతిచెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందల కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. సుమారు 25 ఇళ్లు పూర్తి ధ్వంసమయ్యాయి. శుక్రవారం రాత్రి ఒక్క రోజే 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వల్ల ఆ ప్రాంతంలో నదులు పొంగి ప్రవహిస్తోన్నాయి. కొన్ని చోట్ల కార్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో కొలంబియా ప్రెసిడెంట్ జువన్ మాన్యుల్ సాంటోస్ ఎమర్జెన్సీని ప్రకటించాడు. -
అక్కడ అలా..ఇక్కడ ఇలా..
ప్రేమ మంత్రం : ఎంత అందమైనది ఫిబ్రవరి నెల! వాలెంటైన్స్ డే కి ముందు ఒక వారం, తర్వాత ఒక వారం.. అన్నీ.. ప్రేమికుల రోజులే. ఫిబ్రవరి 7 ‘రోజ్ డే’. ఫిబ్రవరి 8 ‘ప్రపోజ్ డే’. ఫిబ్రవరి 9 ‘చాక్లెట్ డే’. ఫిబ్రవరి 10 ‘టెడ్డీ డే’. ఫిబ్రవరి 11 ‘ప్రామిస్ డే’. ఫిబ్రవరి 12 ‘హగ్ డే’. ఫిబ్రవరి 13 ‘కిస్ డే’. ఇవన్నీ అయ్యాక.. ఫైనల్‌గా వాలెంటైన్స్ డే. ఆ తర్వాత కూడా ఏదో ఒక రూపంలో ప్రేమ పరిమళిస్తూనే ఉంటుంది. ఫిబ్రవరి 15 హ్యాపీ శ్లాప్ డే. 16 హ్యాపీ కిక్ డే. 17 హ్యాపీ పెర్ఫ్యూమ్ డే. 18 హ్యాపీ ఫ్లర్టింగ్ డే. 19 హ్యాపీ కన్ఫెషన్ డే. 20 హ్యాపీ మిస్సింగ్ డే. 21 హ్యాపీ బ్రేకప్ డే. అయ్యో! బ్రేకప్ కూడా ప్రేమికుల రోజేనా! ఎందుక్కాదూ. బ్రేకప్ కూడా ప్రేమలోంచి పుట్టిందే కదా. బ్రేకప్ తర్వాత పుట్టేదీ మళ్లీ ప్రేమే కదా. అక్కడ అలా..: కొలంబియాలో ఇవాళ్టి నుండి మహిళల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఆ దేశంలో మహిళలు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడడం ఇదే తొలిసారి. 2023లో జరిగే ‘ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్’ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలంటే.. కొలంబియా ఇప్పుడీ జాతీయస్థాయి ఉమెన్స్ లీగ్‌ను నిర్వహించడం తప్పనిసరి. కొలంబియా ఇక్కడ ఇలా..: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అజాదీ స్టేడియంలో ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. స్టేడియం కిక్కిరిసి ఉంది. సందర్శకుల మార్గం నుంచి ఎనిమిది మంది అబ్బాయిలు స్టేడియం లోపలికి ప్రవేశించారు. వాళ్ల దగ్గర పాస్‌లు ఉన్నాయి. వాటిని తీసుకుని లోపలికి అనుమతిస్తూ, ఆ ద్వారం దగ్గరి భద్రతా సిబ్బంది ఎందుకనో తలగోక్కున్నారు. నొసలు చిట్లించారు. నోటి మీద వేలేసుకున్నారు. ఇవన్నీ జరిగే లోపు అబ్బాయిలు జంప్ అయ్యారు! అయితే వాళ్లు పూర్తిగా జంప్ కాకముందే అక్కడికక్కడ ఆపేసి, ‘యు ఆర్ నాట్ ఎలౌడ్’ అనేశారు సెక్యూరిటీ! ‘ఎందుక్కాదు?’ అని బుకాయించారు అబ్బాయిలు. ‘ఎందుక్కాదంటే... అబ్బాయిల డ్రస్ వేసుకున్నంత మాత్రాన అమ్మాయిలు అబ్బాయిలు అయిపోరు’ అనేసి వెనక్కు పంపించారు స్టేడియం స్టాఫ్. విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అబ్బాయిల వేషంలో వచ్చిన ఎనిమిది మంది అమ్మాయిలు వాళ్లు! ఇరాన్లో అమ్మాయిలు కానీ, మహిళలు కానీ స్టేడియంకి వెళ్లి మగాళ్లు ఆడే ఫుడ్‌బాల్ గేమ్ చూడడం నిషేధం. క్రీడాకారుల ఆట తీరును బట్టి గ్యాలరీలలో ఉండేవాళ్లు అసభ్య పదజాలం ఉపయోగిస్తారనీ, అలాగే.. అమ్మాయిలు కనిపిస్తే వెకిలిగా చూస్తారనీ ఇరాన్ ప్రభుత్వం ఈ నిషే«ధాన్ని ఏళ్లుగా అమలు చేస్తోంది. 1979 నాటి ఇస్లాం విప్లవంలో ఇరాన్ అనేక నిబంధనలు, నియమాలు ఏర్పరచుకుంది. అందులో ఒకటి.. ఆడవాళ్లను మగాళ్ల స్టేడియంలలోకి అనుమతించకపోవడం. పాపం.. వేషం మార్చుకుని మరీ స్టేడియంలోకి వచ్చారంటే.. ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో కదా ఆ అమ్మాయిలకు! - ఇరాన్ డాక్టరు గారికి బుద్ధిలేక.. పేషెంటుకు ప్రేమలేఖ : డాక్టర్ సచీంద్ర అమరగిరి వయసు 59. లండన్‌లో పేరున్న సర్జన్. ఇంకో ఏడాది గడిస్తే 60 ఏళ్లు వచ్చి ఉండేవి. సీనియర్ సిటిజన్ అన్న గౌరవం కూడా దక్కేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నారు డాక్టర్ సచీంద్ర. ‘ఛీ ఫో.. నువ్వు డాక్టరుగా పనికిరావు. డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చావు’ అని యు.కె.మెడికల్ ట్రిబ్యునల్ ఆయన్ని వైద్యవృత్తి నుంచి బహిష్కరించింది. ఈ పెద్ద మనిషి అంత పెద్ద తప్పు ఏం చేసినట్లు? రాంగ్ ట్రీట్మెంట్తో రోగిని ఏకంగా పైకే పంపించేశారా?! పంపలేదు. ఒకవేళ పంపినా ఆయనకు అంత పెద్ద శిక్ష పడి ఉండేది కాదేమో! మరేం చేశాడు? ఏం చేశాడా.. ప్రేమలేఖ రాశాడు. ప్రేమలేఖా? ఎవరికి? ఒక పేషెంటుకి!! కడుపునొప్పితో బాధపడుతూ ఆయన క్లినిక్‌కి వచ్చిన ఒక అందమైన యువతిని ట్రీట్ చేస్తూ ఆమెతో ప్రేమలో పడిపోయాడు డాక్టర్ సచీంద్ర. అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రేమలేఖ కూడా రాశాడు. విషయం బయటికి పొక్కి, ఇదిగో... మన దాకా వచ్చింది! రెండో ప్రపంచ ప్రేమ : ఎడిత్ స్టెయినర్ వయసు 92 ఏళ్లు. ఆమెది హంగేరి. జాన్ మ్యాకీ వయసు 96 ఏళ్లు. అతడిది స్కాట్లాండ్. మొన్న ఈ దంపతులు 71వ వాలెంటైన్స్ డేని జరుపుకున్నారు! వీళ్లదొక అపురూపమైన ప్రేమకథ. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు జర్మనీలోని ఔష్విట్జ్ క్యాంప్‌లో వందలమందిని నిర్బంధించారు. వారిలో ఎడిత్ కూడా ఒకరు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. యుద్ధం అయ్యాక నిర్బంధ శిబిరాల్లో ఉన్నవాళ్లను విడిపించే క్రమంలో ఔష్విట్జ్ శిబిరానికి వెళ్లిన సైనికులలో జాన్ మ్యాకీ కూడా ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 23. ఆ రోజు ఎడిత్, జాన్ ఒకర్నొకరు పరిశీలనగా చూసుకోలేదు. ‘బతుకు జీవుడా’ అని ఎడిత్ బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. జాన్ మ్యాకీ మిగతా శిబిరాల్లోని వారికి విముక్తి కల్పించే పనిలో పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ ఒక డాన్స్ హాల్లో కలుసుకున్నారు. ‘ఆ రోజు థ్యాంక్స్ చెప్పలేకపోయాను’ అంది ఎడిత్. ‘ఇవాళ గానీ చెబుతారా ఏంటీ?’ అని భయం నటించాడు జాన్. అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు అబ్బాయికి నచ్చింది. ప్రేమ మొదలైంది. యుద్ధం ముగియగానే 1946లో పెళ్లయింది. వధువును స్లాట్లాండ్ తీసుకెళ్లాడు వరుడు. అప్పట్నుంచీ ఏటా వాలెంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట డుండీ సిటీలోని కేర్ హోమ్‌లో ఉంటోంది. నాడు ఎడిత్, జాన్ నేడు ఎడిత్, జాన్ -
17 ఏళ్ల బాలుడు.. 30కి పైగా హత్యలు!
బొగొటా(కొలంబియా): వరుస హత్యలతో వణుకు పుట్టిస్తున్న ఓ పదిహేడేళ్ల బాలుడిని కొలంబియా పోలీసులు పట్టుకున్నారు. ఫ్రిజోలిటో అనే మారుపేరు గల ఆ బాలుడి పూర్తి వివరాలను అక్కడి పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఫ్రిజోలిటో 12 ఏళ్లకే మొదటి హత్యకు ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి ఎదురులేకుండా ఎదుగుతూ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాకు నాయకుడయ్యాడు. తన పనికి అడ్డువచ్చిన హతమార్చటమే లక్ష్యంగా పెట్టకున్నాడు. ఇప్పటి వరకు 30 మందికి పైగా చంపేశాడు. ఇతని చర్యలతో కాలి పట్టణ వాసులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. ఇటీవలే కాలి పట్టణంలోని షాపింగ్ మాల్ వద్ద ఫ్రిజోలిటో ఇద్దరు వ్యక్తులను చంపేశాడు. నాలుగు నెలలుగా గాలిస్తున్న కాలి పట్టణ పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం ఫ్రిజోలిటోను పట్టుకున్నారు. ప్రస్తుతం బాల నేరస్తులను ఉంచే ప్రదేశానికి అతడిని తరలించారు. ఫ్రిజోలిటో ప్రమాదకరమైన బాలుడని కాలి పోలీస్ చీఫ్ హ్యూగో కాసస్ వెల్లడించారు. -
ఇంధనం అయిపోవడంతోనే 71 మంది మృతి
బొగొటా: గత నెల 29వ తేదీన కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో 71 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో 19 మంది బ్రెజిల్‌కు చెందిన చెపకొయిన్స్ ఫుట్‌బాల్ క్లబ్ క్రీడాకారులు, సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంపై జరిపిన విచారణలో.. ఇంధనం అయిపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని కొలంబియన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు గుర్తించారు. విమానం మెడిలిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో సమీపంలోని కొండల్లో కూలిపోయింది. ప్రాధమిక దర్యాప్తులో ఇంధనం అయిపోవడంతో పాటు.. విమానం నిర్ధేశించిన దానికన్నా ఓ 500 కిలోలు ఎక్కువ బరువుతో వెళ్తున్నట్లుగా కూడా గుర్తించామని అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన విమాన పైలట్ మిగుయల్ కైరోగా.. ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడని ఎయిర్‌లైన్స్ సెక్యూరిటీ సెక్రెటరీ ఫ్రెడ్డీ బొనిల్లా తెలిపారు. కూలిపోవడానికి కేవలం రెండు నిమిషాల ముందే విమానం పూర్తిగా ఫెయిల్ అయిన విషయాన్ని పైలట్ రిపోర్ట్ చేశాడని ఆయన తెలిపారు. -
తీవ్ర విషాదానికి ముందు..
-
తీవ్ర విషాదానికి ముందు..
తీవ్ర విషాదాన్ని నింపిన బ్రెజిల్ ఫుట్ బాల్ దేశీయ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో యావత్ ప్రపంచ క్రీడాకారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉత్సాహంతో ఉరకలెత్తుతూ బయలుదేరిన బ్రెజిల్ చాపెకో ఎన్సో ఫుట్ బాల్ క్రీడాకారులు అంతలోనే అసువులు బాయడం పెను విషాదాన్ని నింపింది. కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్‌లో పాల్గొనేందుకు విమానం ఎక్కడానికి ముందు ఫుట్ బాల్ టీం సంతోషంగా తీసుకున్న ఫోటోలు చూసి మృతుల బంధువులు, సన్నిహితులు బావురుమన్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో..ఎవరూహించెదరు.. అన్నట్టుగా వారి సంతోష క్షణాలతో నిండిన ఫోటోలు మరింత విషాదాన్ని నింపాయి. అలాగే ఫైనల్ కు చేరిన సందర్భంగా టీం ఆనందంగా గడిపిన వీడియో ఒకటి నెట్ లో ఎక్కువగా షేర్ అవుతోంది. ఆ దేశవిమానయాన శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ విమానంలో తొమ్మిదిమంది విమాన సిబ్బంది సహా ఇతర కోచ్ లు, ముఖ్య అతిధులు, జర్నలిస్టులు మొత్తం 81 మంది ఉన్నారు. సీపీ 2933 అనే ఈ చార్టెడ్ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోవడంతో దాదాపు మొత్తం టీం ప్రాణాలు కోల్పోగా , ముగ్గురు సాకర్ టీం సభ్యులు, ఇద్దరు విమాన సిబ్బంది, ఒక జర్నలిస్టు ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు బ్లాక్ బాక్స్ లో వాయిస్ రికార్డర్ లో ఇంధనం అయిపోయిందన్న పైలట్ మాటలను గుర్తించినట్టు బీబీసీ రిపోర్ట్ చేసింది. కాగా ఫుట్ బాల్ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో బ్రెజిల్ లో మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. -
75మందిని బలిగొన్న విమానం