
ఇక్కడ ఫొటోలో ఉన్నవి కాఫీ కప్పులే! అయితే ఏంటి అనుకుంటున్నారా? ఆగండాగండి. ఆషామాషీ పింగాణీ కప్పులో, ప్లాస్టిక్ కప్పులో కావు, అచ్చంగా కాఫీతోనే తయారు చేసిన కాఫీ కప్పులివి. కాఫీని కాచి వడబోసుకున్నాక మిగిలిపోయిన వ్యర్థాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కప్పులను తయారు చేశారు.
పొరపాటున జారిపోయి నేలమీద పడినా, పింగాణీ కప్పుల మాదిరిగా ఇవి అంత తేలికగా పగిలిపోవు. చాలాకాలం మన్నుతాయి. వీటిలో కాఫీ పోసినప్పుడే కాదు, ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇవి కాఫీ పరిమళంతో ఘుమఘుమలాడుతుంటాయి. కొలంబియాకు చెందిన రికార్డో, డేనియేలా అనే దంపతులు తమ బృందంతో కలసి ‘క్రీస్ కప్స్’ పేరిట ఈ కాఫీ కప్పులను రూపొందించారు.
చదవండి: దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..!
Comments
Please login to add a commentAdd a comment