coffe
-
కాఫీ రుచి బెటర్‌గా ఉండేందుకు ట్రిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
ఒక కప్పు కాఫీ ఉదయాన్నే సిప్ చేస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి కాఫీ స్ట్రాంగ్‌గా రుచిగా తయారు చేసుకోవాలంటే చాల పద్ధతులు ఉన్నాయి. కానీ అవేమీ అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే ఈజీగా స్ట్రాంగ్ కాఫీ తయారు చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి కాఫీ ప్రిపరేషన్‌కి పరిశ్రమలకు మాత్రం కోట్లలో ఖర్చు అవుతుందట!. చాలామంది స్ట్రాంగ్‌గా ఉండే కాఫీనే ఇష్టపడతారు. మంచి రంగు రుచి సువాసన ఉండాలను కుంటారు. అందుకని కాఫీ గింజలను గ్రైండ్ చేసుకుని మరీ తయారు చేసుకుంటారు. అయితే ఈ డ్రై కాఫీ గింజలు గ్రైండ్ చేసటప్పుడు స్టాటిక్ ఎనర్జీకి గురవ్వుతాయి. దీంతో సరిగా డ్రైండ్ అవ్వవు. అందువల్ల వేస్ట్ కూడా తెలియకుండా వెళ్లిపోతుంది. అంటే కొన్ని సరిగా నలగకపోవడంతో వేస్ట్ రూపంలో వడకట్టినప్పుడు కాఫీ కొంత వేస్ట్‌గా పోయి రుచి తగ్గుతుందట. అలా కాకుండా పూర్తిస్థాయిలో గ్రైండ్ అయ్యి రుచిగా ఉండాలంటే కాస్త నీటిని జోడిస్తే మరింత రుచిగా కాఫీ తయారవ్వుతుందట. దీని వల్ల కాఫీ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. మనకు కావాల్సిన రుచి, రంగు సువాసన ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ డ్రై కాఫీ తయారు చేయాలంటే కాఫీ పరిశ్రమలకు మాత్రం భారీ ఆర్థిక సమస్యలు ఎదురవ్వుతాయని అన్నారు. ఈ స్రాంగ్ డ్రైనెస్ కాఫీ తయారీ నాణ్యతను మెగుపరచడం అనేది కాఫీ పరిశ్రమలకు మాములు నష్టాలను తెచ్చి పెట్టదని కూడా అంచనా వేసి మరీ పరిశోధకులు వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ దందా! జస్ట్ ప్రెగ్నెంట్ చేస్తే చాలు..ఏకంగా లక్షలు ..!) -
నన్ను అర్థం చేసుకునేవారు దొరికారు.. సామ్ పోస్ట్ వైరల్
సమంత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉంది. తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లిన సామ్.. ఈ నెల 20న అక్కడ నిర్వహించిన 'ఇండియా డే పరేడ్'కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత అక్కడే ఉంటూ న్యూయార్క్ నగరమంతా చుట్టేస్తుంది. నగరంలో ఉన్న పర్యటక ప్రదేశాలకు వెళ్తూ.. అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. అంతేకాదు వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా సామ్ న్యూయార్క్‌లోని ఓ పార్క్‌కు వెళ్లింది. అక్కడ కాసేపు వాకింగ్ చేస్తూ.. ప్రకృతి ఒడిలో సేద తీరింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఉదయం ఇలా ఉండాలి.. నాకు నచ్చిన ప్రదేశం ఇది’ అంటూ రాసుకొచ్చింది. ఫైనల్లీ అర్థం చేసుకునేవారు దొరికారు సమంతకు కాఫీ అంటే చాలా ఇష్టం. రోజుకు ఎన్ని సార్లేనా కాఫీ దాగేస్తుందట. అయితే న్యూయార్క్ పర్యటనలో సామ్‌కి కాఫీ కరువైనట్లుంది. ఎక్కడికి వెళ్లినా చిన్న కప్‌లో కాఫీ ఇస్తారు. కానీ సామ్‌కి అది సరిపోవడం లేదేమో. అందుకే ఎవరో జంబో సైజ్ కాఫీ ఇచ్చారు. దీంతో తప్పిఉబ్బిపోయిన సామ్.. మొత్తానికి నన్ను అర్థం చేసుకునేవాళ్లు దొరికారు అంటూ కాఫీ చేతులో పట్టుకున్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. మరి సామ్ మనసుని అర్థం చేసుకుని కాఫీ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టేసింది. ఆరోగ్యం బాలేదని వెకేషన్ ఎంజాయ్ చేస్తావా? సమంత కొన్నాళ్ల కిత్రం మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకుంది. ఆరోగ్యం కాస్త కుదిట పడగానే పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. సిటడెల్‌తో పాటు ఖుషీ మూవీ షూటింగ్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. అంతేకాదు ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో కూడా పూర్తిగా పాల్గొనపోవచ్చునని సమాచారం. (చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) కొద్ది రోజుల క్రితం ఖుషి బృందం నిర్వహించిన ఓ ఈవెంట్లో పాల్గొంది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానుంది. అయితే తన ఆరోగ్యం బాగోలేదని, ప్రమోషన్స్‌కి రాలేనని సామ్ చెప్పిందట. ఇప్పుడు మాత్రం సామ్ న్యూయార్క్‌లో ఖుషీ ఖుషీగా తిరుగుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ప్రమోషన్స్ కి రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా..? అని కామెంట్ చేస్తున్నారు. సినిమాలకు బ్రేక్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఖుషి చిత్రం తర్వాత ఆమె ఎలాంటి చిత్రాలను ఒప్పుకోలేదు. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసిందట. ఈ ఏడాది కాలమంతా తన ఆరోగ్యానికి కేటాయించాలని సామ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..!
ఇక్కడ ఫొటోలో ఉన్నవి కాఫీ కప్పులే! అయితే ఏంటి అనుకుంటున్నారా? ఆగండాగండి. ఆషామాషీ పింగాణీ కప్పులో, ప్లాస్టిక్ కప్పులో కావు, అచ్చంగా కాఫీతోనే తయారు చేసిన కాఫీ కప్పులివి. కాఫీని కాచి వడబోసుకున్నాక మిగిలిపోయిన వ్యర్థాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కప్పులను తయారు చేశారు. పొరపాటున జారిపోయి నేలమీద పడినా, పింగాణీ కప్పుల మాదిరిగా ఇవి అంత తేలికగా పగిలిపోవు. చాలాకాలం మన్నుతాయి. వీటిలో కాఫీ పోసినప్పుడే కాదు, ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇవి కాఫీ పరిమళంతో ఘుమఘుమలాడుతుంటాయి. కొలంబియాకు చెందిన రికార్డో, డేనియేలా అనే దంపతులు తమ బృందంతో కలసి ‘క్రీస్ కప్స్’ పేరిట ఈ కాఫీ కప్పులను రూపొందించారు. చదవండి: దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..! -
కాఫీ ఎక్కువైతే.. కంగారే!
పొద్దున లేవగానే కాఫీ చుక్క గొంతులో పడనిదే రోజు గడవదు చాలామందికి. కానీ అదే కాఫీ పరిమితి మించితే మాత్రం కంగారు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి కంటి దాకా ఎన్నో సమస్యలనూ కాఫీ తెచ్చిపెడుతుందని ఈ అంశంపై పరిశోధనలు చేసిన ఈస్తటిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ అహ్మద్ ఎల్ మాంటసర్ హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటి.. వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగంటే.. వయసు పెరిగిపోద్ది.. బాగా వర్క్ ప్రెషర్తోనో, ఇంకేదో ఒత్తిడితోనో కాఫీ తెగ తాగేస్తూ ఉంటాం. చిత్రమేంటంటే.. కాఫీ ఎక్కువైతే కిడ్నీలు కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. మరి ఈ కార్టిసాల్‌తో మన చర్మంలోని గ్రంధుల నుంచి నూనె స్రావాలు పెరుగుతాయని.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు, ఇతర సమస్యలు వస్తాయని మాంటసర్ చెప్తున్నారు. దీనికితోడు ఆల్కహాల్ తరహాలోనే కెఫీన్ అధికంగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని, చర్మం పొడిబారి కాంతివిహీనంగా మారుతుందని అంటున్నారు. అంటే.. ఈ సమస్యలతో ఎవరైనా వారి వయసుకు మించి కనబడతారని వివరిస్తున్నారు. – సాధారణంగా రోజూ తాగే నీటితోపాటు.. ప్రతి కప్పు కాఫీకి మరో గ్లాసు నీళ్లు అదనంగా తాగాలని హార్మోన్ స్పెషలిస్టు సోఫీ షాటర్ సూచిస్తున్నారు. దానివల్ల సమస్య కొంత ఉపశమిస్తుందని అంటున్నారు. రిలీఫ్ కాదు.. చిరాకు.. కాఫీ ఎక్కువైతే శరీరంలో అడ్రినల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని.. దీనితో రక్తపోటు పెరిగి, నిద్రలేమికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సరిగా నిద్ర లేకపోవడం వల్ల మానసిక సమస్యలకు కారణమవుతుంది. కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో 33శాతం మందికి నిద్ర సమస్య వస్తోందని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. ఇక అధిక కెఫీన్ వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి.. మానసిక ఆందోళన పెరుగుతుందని, ఏకాగ్రత తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. – కాఫీ అలవాటును నియంత్రించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవడానికి రెండు, మూడు గంటల ముందు నుంచీ కాఫీకి దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్ట్రోక్.. మైగ్రేన్ ప్రమాదం కూడా.. కాఫీలోని కెఫీన్‌కు వ్యసనంగా మారే లక్షణం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కాఫీ తీసుకున్నప్పుడు మెదడు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రక్తనాళాలు సంకోచానికి గురవుతాయని.. తాగడం ఆపేసినప్పుడు వ్యాకోచించి తలనొప్పి వస్తుందని అంటున్నారు. ఇది కొందరిలో మైగ్రేన్‌కు దారితీస్తుందని వివరిస్తున్నారు. అందువల్లే తలనొప్పి అనిపించినప్పుడల్లా కాఫీ తాగుతూ.. అదో అలవాటుగా మారుతుందని పేర్కొంటున్నారు. కొందరిలో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం, కండరాలు మెలితిప్పినట్టు, తిమ్మిరిగా అనిపించడం, చేతులు వణకడం..వంటివీ తలెత్తుతాయని అంటున్నారు. – ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు కాఫీ వినియోగాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. కంటి సమస్యలకూ దారి.. అధిక కెఫీన్ రక్తపోటును పెంచడం వల్ల.. కళ్లకు రక్తాన్ని సరఫరా చేసే సన్నని రక్తనాళాలు దెబ్బతిని, కంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదమూ ఉంటుందని అంటున్నారు. – రోజుకు మూడు కప్పులకు మించి కాఫీ తాగితే.. కంటి సమస్యలను కొని తెచ్చుకోవడమేనని, తగ్గిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
ప్రియుడితో కలిసి ప్లాన్; భర్తకు కాఫీలో విషం
మైసూరు: భర్తను చంపిన కేసులో భార్యను, ఆమె ప్రియున్ని మైసూరులో బన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు హత్యకు గురి కాగా, అతని భార్య ఉమా, ప్రియుడు అవినాశ్ పట్టుబడినవారు. వెంకటరాజు దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమెకు అవినాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అడ్డు తొలగించుకోవాలని ఇటీవల భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చారు, అతడు స్పృహ తప్పిన సమయంలో తలదిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారు. -
చిక్కటి కాఫీ.. చక్కటి మిరియం
మన మన్యం కాఫీ కమ్మదనమే వేరు. ఆ ఘుమఘుమలు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాయి. గిరి రైతుకు సిరులు కురిపిస్తున్న ఆ పంట ఈ ఏడాదీ విరగ్గాసి లాభాలు అందించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కాఫీ అంతర పంట మిరియం పాదులు కూడా గింజ కడుతుండడంతో ఏజెన్సీ రైతులు ఆనందంతో ఉన్నారు. కాఫీ, మిరియాల పంటలు ఒకేసారి గింజ దశలో కళకళలాడుతుండడం విశేషం. పాడేరు : విశాఖ ఏజెన్సీలో కాఫీ, అంతర పంట మిరియాలు ఈ ఏడాదీ గిరిజన రైతులకు సిరులు కురిపించనున్నాయి. ఏటా ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు జీవనోపాధికి కాఫీ పంట ప్రధానంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరుంది. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ ఏజెన్సీని అనేక దేశాలు గుర్తించాయి. ప్రపంచంలో బ్రెజిల్ లోని కాఫీ పంట నంబర్ వన్‌గా నిలుస్తుండగా మన దేశానికి సంబంధించి కర్ణాటక తర్వాత విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ పంటకు నాణ్యతలో మూడో స్థానం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిజనులంతా ఏటా కాఫీ తోటల సాగును విస్తరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విశాఖ ఏజెన్సీవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ తోటలకు ఎంతో మేలు చేసింది. కాఫీ మొక్కలకు పూల పూత కూడా ముందుగానే ఏర్పడింది. వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ మొక్కలకు గింజ దశ కూడా వేగంగా ఏర్పడింది. ఎక్కడ చూసినా కాఫీ తోటల్లో మొక్కలన్నింటికీ కాఫీ గింజలు కాపు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడులు అధికంగా ఉంటాయని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లక్షా 14వేల ఎకరాల్లో ఫలసాయం ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో 2.21లక్షల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. 2,05,464 మంది గిరిజన రైతులు కాఫీ తోటలు సాగు చేస్తున్నారు. 1.58 లక్షలకు పైగా ఎకరాల కాఫీ తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నా పూర్తిస్థాయిలో 1.14లక్షల ఎకరాల్లోని తోటలే అధిక దిగుబడి నిస్తున్నాయి. ఈ తోటల్లో ప్రస్తుతం కాఫీ కాపు అధికంగా ఉంది. ఏజెన్సీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గింజ దశలో ఉన్న కాఫీ పంటకు మరింత మేలు చేస్తుంది. ఈ ఏడాది కూడా అక్టోబర్ నెలకే ఫలసాయం రావొచ్చు. ఈ ఏడాది మరింత దిగుబడి వాతావరణ పరిస్థితులు అనుకూలమై కాఫీ తోటలకు ఎంతో మేలు చేస్తుండడంతో ఈ ఏడాది కూడా కాఫీ దిగుబడులు మరింత పెరగనున్నాయని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది 11వేల మెట్రిక్ టన్నుల క్లీన్ కాఫీ గింజలు దిగుబడి సాధించగా ఈ ఏడాది 12వేల మెట్రిక్ టన్నులు అధిక దిగుబడులు వస్తాయని కేంద్ర కాఫీబోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల నుంచి కాఫీ తోటలకు వాతావరణం మేలు చేస్తుండడం గిరిజన రైతులకు మంచి దిగుబడులిస్తున్నాయి. మిరియం ముందస్తు పూత ఏజెన్సీలోని కాఫీ తోటల్లో అంతర పంటగా సాగవుతున్న మిరియాల పాదులకు వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. దీంతో ఎన్నడు లేని విధంగా ముందస్తుగానే మిరియాల పాదులకు కూడా పూత ప్రారంభమైంది. పాదులకు గెలలు ఏర్పడడంతో మెల్ల మెల్లగా గింజ కడుతుండడంతో గిరిజన రైతులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, మిరియాల గింజలు ఒకేసారి గింజ దశలో కళకళలాడుతుండడం విశేషం. ఏజెన్సీవ్యాప్తంగా 98వేల ఎకరాల కాఫీ తోటల్లో ఎకరానికి వంద మిరియాల పాదులు ఉన్నాయి. ప్రతి ఏడాది 3వేల మెట్రిక్ టన్నుల మిరియాల దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులన్నీ మిరియాల పాదులకు మేలు చేయడంతో ఆయా పాదులు పూతదశకు చేరుకున్నాయి. -
కిలో ప్లాస్టిక్..కప్పు కాఫీ..
సాక్షి, విశాఖపట్నం: ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని శాసిస్తోంది. పర్యావరణాన్ని ప్రమాదంలో పడేస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా మంది ఇస్తుంటారు. వాటిని ఆచరణలో పెట్టమంటే మాత్రం ఒకడుగు వెనక్కు వేస్తుంటారు. కానీ.. పర్యావరణంపై నిజమైన ప్రేమ ఉన్నవారు మాత్రం సంకల్పంతో ముందడుగు వేస్తారు. సరిగ్గా అలాంటి వినూత్న ఆలోచనతోనే ప్లాస్టిక్ నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు ఇండియా యూత్‌ఫర్ సొసైటీ ప్రతినిధులు. ఇందుకోసం బీచ్‌రోడ్డులో ఓ ప్రత్యేక పార్లర్‌ను ఈ నెల 27న ప్రారంభించనున్నారు. మీకు కాఫీ తాగాలని ఉందా? అయితే.. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, ఇతర వ్యర్థాలు తీసుకురండి.. మంచి కాఫీని సముద్రం ఒడ్డున కూర్చొని ఆస్వాదించండి... ఆకలిగా ఉందా..? బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకాలస్యం.. మొత్తం ప్లాస్టిక్‌ని పోగెయ్యండి.. మంచి సమతులాహారాన్ని లాగించెయ్యండి..? ఇదేంటి..? ప్లాస్టిక్‌కు.. కాఫీ, టిఫిన్‌కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా.? ఇదే ఇప్పుడు ట్రెండ్.. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఇండియా యూత్ ఫర్ సొసైటీ బీచ్‌రోడ్డులో మొబైల్ పార్లర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27న బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా ‘ప్లాస్టిక్ పార్లర్’ను ప్రారంభిస్తున్నారు. గివ్ ప్లాస్టిక్.. గెట్ ప్రొడక్ట్స్ నినాదంతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ఈ పార్లర్ మొదలు పెడుతున్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు.. దేశవ్యాప్తంగా ‘ప్లాస్టిక్ ఇచ్చి పుచ్చుకో’ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ బియ్యం ఇచ్చిన కార్యక్రమంతో ఈ ఉద్యమం మొదలైంది. ఇటీవల హైదరాబాద్‌లో దోసపాటి రాము అనే సామాజిక వేత్త.. ప్లాస్టిక్ కవర్లు ఇస్తే.. నర్సరీలో నచ్చిన మొక్కని తీసుకెళ్లి పచ్చదనాన్ని పెంపొందించండి అంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో తాజాగా ఇండియా యూత్‌ఫర్ సొసైటీ ప్రతినిధులు ప్లాస్టిక్ పార్లర్‌ను ప్రారంభిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ పార్లర్‌ను నడుపుతామని సొసైటీ అధ్యక్షుడు అప్పలరెడ్డి తెలిపారు. మొత్తంగా 30 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించామని వివరించారు. ప్రజల్లో అవగాహన కలి్పంచి.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. విశాఖ నగర ప్రజలంతా తమ ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పార్లర్లో ధరలివీ.. ►కప్పు కాఫీ కావాలంటే.. 1 కిలో ప్లాస్టిక్ ఇవ్వాలి ►ఒక క్లాత్ బ్యాగ్ కావాలంటే.. 2 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి ►ఒక జ్యూట్ బ్యాగ్ కావాలంటే.. 4 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి ►100 మి.లీ. పాలు, 2 బిస్కెట్లు, నట్స్, 1 అరటిపండు, ఉడకబెట్టిన గుడ్డు మెనూతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తినాలంటే.. 3 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి -
కాఫీ పై వరద కత్తి!
17 వ శతాబ్దంలో తొలిసారిగా కాఫీ ఘుమఘుమల రుచి మన దేశానికి పరిచయం అయ్యి, ఆ తరువాత ఇక్కడ నిలదొక్కుకుంది. దీంతో మన దేశపు కాఫీని ’’ఇండియన్ మాన్సూన్ కాఫీ’’ అని కూడా పిలుస్తారు. ఏదేమైనా కేరళ, కర్ణాటకను ముంచెత్తిన వరద పోటు కాఫీకి కూడా తప్పలేదు. కాఫీ ఉత్పత్తిలో కర్నాటక తొలిస్థానంలో ఉంటే కేరళ ద్వితీయస్థానంలో ఉంది. దేశానికి అవసరమైన కాఫీ ఉత్పత్తికి కీలకమైన రాష్ట్రాలు కర్ణాటక, కేరళ. కర్ణాటకలో 71 శాతం, కేరళలో 21 శాతం కాఫీ ఉత్పత్తి జరుగుతుంది. కేరళ రాష్ట్రంలోని కాఫీ పంటలనూ, కేరళని ఆనుకుని ఉన్న కర్ణాటక కాఫీ ఉత్పత్తి కేంద్రాలైన కొడగు, చిక్మంగుళూరులను ఈ వరద ప్రభావం తీవ్రంగా దెబ్బతీసింది. వరదలతో ఈ రెండు రాష్ట్రాల్లోని కాఫీ పంటకు కోలుకోలేని దెబ్బపడింది. అయితే కేవలం కాఫీ పంట దెబ్బతినడమే కాకుండా ఏళ్ళతరబడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోన్న కాఫీ మొక్కలను సైతం ఈ వరదలు కూకటివేళ్ళతో పెకిలించాయి. కాఫీ తోటలపై విరిగిపడిన కొండచరియలతో పంట సర్వనాశనం అయ్యింది. దీని ప్రభావం దేశంలోని మొత్తం కాఫీ పరిశ్రమపై కూడా ఉండనుంది. కాఫీ తోటల్లో పనిచేస్తోన్న కార్మికుల ఇళ్ళు కూడా ధ్వంసం అయ్యాయనీ కర్ణాటక ప్లాంటర్స్అసోసియేషన్(కెపిఎ) ఛైర్మన్హెచ్.టి.ప్రమోద్తెలిపారు. 2017-18లో మనదేశంలో కాఫీ ఉత్పత్తి 3.16 లక్షల టన్నులు. అయితే ఈ వరదల వల్ల కాఫీ పంటల నష్టం 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. కేరళలో కాఫీ పంట... కేరళ 20.8 శాతం కాఫీ ఉత్పత్తితో దేశంలో రెండవ స్థానంలో ఉంది. కేరళలోని ఈశాన్య ప్రాంతమైన వయ్‌నాడ్ జిల్లాలో కాఫీ ఎక్కువగా పండిస్తారు. అరబికా, రోబస్టా లాంటి కాఫీ పంటల్లో 80 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఎంత ఉత్పత్తి? దేశంలో కాఫీ పంటల పరిధిలో ఉన్న మొత్తం భూభాగంలో 19 శాతం కేరళ రాష్ట్రంలో ఉంది. వయ్‌నాడ్, ట్రావెన్కోర్, నెల్లియంపట్టి ప్రాంతాల్లో 85,000 హెక్టార్ల కాఫీ ప్లాంటేషన్స్ఉన్నాయి. కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో దేశంలోని మొత్తం కాఫీ పంటలో 25 శాతం ఉత్పత్తి అవుతోంది. దేశంలోని 70 శాతం కాఫీని ఉత్పత్తి చేస్తోన్న కొడగు, చిక్కమంగుళూరు, సక్లేష్పూర్(హస్సన్) జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లొచ్చని భావిస్తున్నారు. కర్ణాటకలోని మడికేరికి సమీపంలోని ముక్కోడ్లు గ్రామస్తుడైన విశ్రాంత సైనికాధికారి రిటైర్మెంట్అనంతరం కాఫీ ప్లాంటేషన్‌లోకి అడుగుపెట్టారు. దాదాపు 8 ఏళ్ళ సుదీర్ఘశ్రమ అనంతరం ఇప్పుడిప్పుడే ఆదాయం వస్తోంది. ఇంతలోనే ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పంటంతా మట్టిపాలైంది. ’’కనీసం నా పొలం సరిహద్దులేవో కూడా గుర్తించలేని పరిస్థితి నాకెదురైంది’’ అని సైనికాధికారి కొల్లప్ప వ్యాఖ్యానించారు. ’’కొడగులో దాదాపు 5000 ఎకరాల్లో కాఫీ పంట పూర్తిగా ధ్వంసం అయ్యింది’’ అని కూర్గ్ ప్లాంటర్స్ క్లబ్ నిర్వాహకులు కె.సి.బొప్పన్న తెలిపారు. కాఫీ ఉత్పత్తుల రవాణాకి సైతం అడ్డంకులు... కాఫీ ఉత్పత్తులను ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడంలో కూడా రెండు రాష్ట్రాలూ తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రవాణామార్గాలు మూసుకుపోవడంతో కొడగు, మంగుళూరు లేదా కొచ్చికి ఈ ఉత్పత్తులను చేరవేయడం అసాధ్యంగా మారింది. కాఫీ ఉత్పత్తులను రవాణా చేసేందుకు లారీ యాజమాన్యాలు సైతం సంసిద్ధంగా లేవని కర్ణాటక కాఫీ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ రాజన్ తెలిపారు. ఎంతమందికి ఉపాధి? కర్ణాటక కొడగు ప్రాంతంలో మొత్తం 2 లక్షల మంది కాఫీ తోటల్లో ఉపాధిపొందుతున్నారు. చిక్‌మగళూరు లోనే 1.3 లక్షల మంది కాఫీ తోటల్లో పనిచేస్తున్నారు. కేరళలో దాదాపు 44,000 మందికి కాఫీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. వయ్‌నాడ్, ట్రావెన్కోర్, నెల్లియంపట్టి ల్లో అత్యధికంగా కాఫీ తోటలున్నాయి. వయ్‌నాడ్‌లో 30,000 మంది ఉద్యోగులు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ట్రావెన్కోర్లో 10,000 మంది, నెలియంపట్టిలో 2,669 మంది ఉద్యోగులున్నారు. ఇంత మందికి ఉపాధినిస్తోన్న కాఫీ పరిశ్రమ వరదతాకిడితో అతలాకుతలమైంది. దీనిపైన ఆధారపడి పనిచేస్తోన్న వ్యక్తులూ, వారిపైన ఆధారపడిన వేలాది కుటుంబాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. -
చిక్కని కాఫీపై చక్కని ఫొటో
పేరున్న కాఫీ షాపుల్లో కాఫీ ఆర్డర్ చేస్తే దాని నురగపై హృదయాకారంతో పాటు వివిధ రూపాల్లో చిత్రాలను కేవ్ పెయింటింగ్ ద్వారా చిత్రీకరించడం చూస్తుంటాం..కాని సరికొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కాఫీ నురగపై ఫొటోలు, పదాలతోపాటు కావలసిన రీతిలో గ్రాఫిక్స్నుకూడా చిత్రీకరించవచ్చు. ఇజ్రాయిల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్టీమ్సీసీ తాజాగా ప్రవేశపెట్టిన రిపిల్ మే కర్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ తన ఫస్ట్‌క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల లాంజ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.