నన్ను అర్థం చేసుకునేవారు దొరికారు.. సామ్‌ పోస్ట్‌ వైరల్‌ | Samantha Ruth Prabhu's Latest Instagram Post Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: నన్ను అర్థం చేసుకునేవారు దొరికారు.. సామ్‌ పోస్ట్‌ వైరల్‌

Published Wed, Aug 23 2023 1:14 PM | Last Updated on Wed, Aug 23 2023 2:42 PM

Samantha Latest Instagram Post Goes Viral - Sakshi

సమంత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉంది. తల్లితో కలిసి న్యూయార్క్‌ వెళ్లిన సామ్‌.. ఈ నెల 20న అక్కడ నిర్వహించిన 'ఇండియా డే పరేడ్'కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత అక్కడే ఉంటూ న్యూయార్క్‌ నగరమంతా చుట్టేస్తుంది. నగరంలో ఉన్న పర్యటక ప్రదేశాలకు వెళ్తూ.. అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. అంతేకాదు వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా సామ్‌ న్యూయార్క్‌లోని ఓ పార్క్‌కు వెళ్లింది. అక్కడ కాసేపు వాకింగ్‌ చేస్తూ.. ప్రకృతి ఒడిలో సేద తీరింది. ఆ ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘ఉదయం ఇలా ఉండాలి.. నాకు నచ్చిన ప్రదేశం ఇది’ అంటూ రాసుకొచ్చింది. 

ఫైనల్లీ అర్థం చేసుకునేవారు దొరికారు
సమంతకు కాఫీ అంటే చాలా ఇష్టం. రోజుకు ఎన్ని సార్లేనా కాఫీ దాగేస్తుందట. అయితే న్యూయార్క్‌ పర్యటనలో సామ్‌కి కాఫీ కరువైనట్లుంది. ఎక్కడికి వెళ్లినా చిన్న కప్‌లో కాఫీ ఇస్తారు. కానీ సామ్‌కి అది సరిపోవడం లేదేమో. అందుకే ఎవరో జంబో సైజ్‌ కాఫీ ఇచ్చారు. దీంతో తప్పిఉబ్బిపోయిన సామ్‌.. మొత్తానికి నన్ను అర్థం చేసుకునేవాళ్లు దొరికారు అంటూ కాఫీ చేతులో పట్టుకున్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. మరి సామ్‌ మనసుని అర్థం చేసుకుని కాఫీ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. ఆ విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టేసింది. 

ఆరోగ్యం బాలేదని వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తావా?
సమంత కొన్నాళ్ల కిత్రం మయోసైటిస్‌ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి చికిత్స తీసుకుంది. ఆరోగ్యం కాస్త కుదిట పడగానే పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌ కంప్లీట్‌ చేసింది. సిటడెల్‌తో పాటు ఖుషీ మూవీ షూటింగ్స్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్‌ ఒప్పుకోలేదు. అంతేకాదు ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో కూడా పూర్తిగా పాల్గొనపోవచ్చునని సమాచారం.

(చదవండి: జైలర్‌ కంట కన్నీరు.. ఆ డైలాగ్‌ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్‌)

కొద్ది రోజుల క్రితం ఖుషి బృందం నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొంది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానుంది. అయితే తన ఆరోగ్యం బాగోలేదని, ప్రమోషన్స్‌కి రాలేనని సామ్‌ చెప్పిందట. ఇప్పుడు మాత్రం సామ్‌ న్యూయార్క్‌లో ఖుషీ ఖుషీగా తిరుగుతోంది. దీంతో నెటిజన్స్‌ ఆమెను ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. ప్రమోషన్స్ కి రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా..? అని కామెంట్‌ చేస్తున్నారు. 

సినిమాలకు బ్రేక్‌
సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఖుషి చిత్రం తర్వాత ఆమె ఎలాంటి చిత్రాలను ఒప్పుకోలేదు. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసిందట. ఈ ఏడాది కాలమంతా తన ఆరోగ్యానికి కేటాయించాలని సామ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement