Samantha Went USA With Her Mother, Airport Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Samantha Airport Video: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?

Published Sat, Aug 19 2023 6:23 PM | Last Updated on Sat, Aug 19 2023 7:21 PM

Samantha Went USA With Her Mother, Airport Video Goes Viral - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమాలకు గ్యాప్‌ ఇవ్వబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మయోసైటిస్ బారిన ఆమె.. దాని నుంచి పాక్షికంగా కోలుకోగానే పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్‌ చేసింది. సిటడెల్‌ వెబ్‌ సిరీస్‌తో పాటు విజయ్‌ దేవరకొండ ‘ఖుషీ’ షూటింగ్‌ని కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి చిత్రాలను ఒప్పుకోలేదు. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసిందట. ఈ ఏడాది కాలమంతా తన ఆరోగ్యానికి కేటాయించాలని సామ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

‘ఖుషీ’ఈవెంట్‌లో ఫుల్‌ జోష్‌
కొత్త సినిమాలకు సైన్‌ చేయని సామ్‌.. విడుదల కాబోయే చిత్రాల ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొంటుంది. ఇటీవల ఖుషీ చిత్రబృందం మ్యూజికల్‌ కాన్సర్ట్‌ని నిర్వహించగా.. అందులో సమంత ఫుల్‌ జోష్‌తో పాల్గొంది. అంతేకాదు విజయ్‌ దేవరకొండతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్‌ కూడా చేసింది. దీంతో సామ్‌ ఆరోగ్యం కుదుట పడిందని ఫ్యాన్స్‌ సంబరపడ్డారు. ఇదే జోష్‌లో వరుసగా సినిమాలు చేయాలని కోరుకున్నారు. 

అత్యవసరంగా అమెరికాకు.. 
ఖుషీ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత.. మ్యూజికల్‌ కాన్సర్ట్‌ అయిన వెంటనే తల్లితో కలిసి హడావుడిగా అమెరికాకు వెళ్లింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమంత వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత.. చికిత్స కోసమే అమెరికాకు వెళ్లిందనే ప్రచారం నెట్టంట జోరుగా సాగుతోంది. కొన్నాళ్ల పాటు సామ్‌ అమెరికాలోనే ఉండి, పూర్తిగా కోలుకున్నాకే తిరిగి ఇండియా వస్తుందని అంటున్నారు. 

అరుదైన గౌరవం..అందుకే అమెరికాకు
సమంత అమెరికాకు వెళ్లింది చికిత్స కోసం కాదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 20న న్యూయారర్క్‌లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామ్‌ పాల్గొనబోతుందట.  అక్కడ నిర్వహించే వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్‌ లో ఆమె పాల్గొనబోతుంది. ఆ వేడుక కోసమే సమంత తల్లితో కలిసి అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఈ వేడుకకి సామ్‌ తో పాటు నటుడు రవికిషన్‌, నటి జాక్వైలిన్‌ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement