Newyark
-
కమర్షియల్ ఫ్లైట్లలో తరలుతున్న బంగారం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్‌పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్‌లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.న్యూయార్క్‌కు బంగారం తరలింపుసాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్‌లో గోల్డ్ బార్లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్‌ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్‌కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలుబంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్‌కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్‌లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్‌కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
మన సర్పంచులు @ ఐరాస
మహిళాసాధికారతపై ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో ప్రసంగించడానికి భారతదేశం నుంచి ముగ్గురు సర్పంచులకు ఆహ్వానం అందింది. ఈ నెల 3న అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి నిర్వహిస్తున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి నుంచి సర్పంచ్ హేమకుమారి, త్రిపుర నుంచి సుప్రియాదాస్ దత్తా, రాజస్థాన్ నుండి నీరూ యాదవ్ పాల్గొంటున్నారు.‘భారతదేశంలో స్థానిక సంస్థల పాలనలో మహిళల భాగస్వామ్యం, వారు ఎలా దారి చూపుతున్నారు’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారతదేశం నుంచి ముగ్గురు మహిళా ప్రతినిధులతో ఒక ΄్యానెల్ చర్చ ఉంటుంది. ఈ కార్యక్రమంలో వారు తమ విజయగాథలను పంచుకుంటారు. అలాగే లింగ సమానత్వం, అభివృద్ధి కోసం వారి వారి పంచాయితీలలో చేసిన కృషిని కూడా పంచుకుంటారు. వీరిని మూడు రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.మూడు కీలకమైన స్తంభాలు: హేమకుమారిపశ్చిమగోదావరి జిల్లా పేకేరు గ్రామ పంచాయతీలో స్థిరమైన అభివృద్ధి, లింగ సమానత్వం కోసం కార్యక్రమాలను చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసింది. సర్పంచ్‌గా హేమకుమారి 2021లో పదవిని చేపట్టినప్పటి నుంచి మూడు కీలకమైన స్తంభాలపై దృష్టి సారించి పరివర్తన కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. అవి.. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం. సరైన ΄ోషకాహారం, ప్రసవానికి సంబంధించిన అవగాహన పెంచడానికి క్రమం తప్పకుండా హెల్త్ క్యాంపులు, విద్యాకార్యక్రమాలను చేపట్టింది. దీని ఫలితంగా ముప్పు అధికంగా గల గర్భధారణ కేసుల సంఖ్య, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఈ విషయాలపై హేమకుమారి తాను చేసిన ప్రయోజనకరమైన పనులను, వచ్చిన ఫలితాలను తెలియజేయనుంది.హాకీ సర్పంచ్: నీరూయాదవ్ రాజస్థాన్‌లోని బుహనా తహసీల్‌లోని లంబి అహిర్ గ్రామ సర్పంచ్ నీరూ యాదవ్ ‘నాయకత్వ అనుభవం’పై తన అభి్రపాయాలను వెల్లడించనున్నారు. నీరూ యాదవ్ 2020లో లంబి అహిర్ గ్రామపంచాయితీకి సర్పంచ్ అయ్యింది. బాలికలు, మహిళల సాధికారత కోసం నీరూ యాదవ్ ఎన్నోపనులు చేశారు. భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడానికి ఐక్యరాజ్యసమితి నీరూని పిలవడానికి కారణం ఇదే. పంచాయితీ పనులతో పాటు రాష్ట్ర మహిళలకు స్ఫూర్తిదాయకంగా తన పంచాయితీలోని బాలికల హాకీ జట్టును తన సొంత ఖర్చుతో సిద్ధం చేసింది. ఈ చొరవ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే ఆమెను హాకీ సర్పంచ్ అని పిలుస్తారు. గ్రామ పంచాయితీని ΄్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చొరవ తీసుకుంది. పాత బట్టల సంచులను తయారు చేయడం ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించింది. గ్రామ ప్రజలరె పర్యావరణం వైపుగా ్ర΄ోత్సహించేలా కొత్త ప్రచారాన్ని ్రపారంభించింది. ప్రతి నెలా వృద్ధులకు, వికలాంగులకు వారి ఇళ్ల వద్దకే పింఛన్ వెళ్లేందుకు శ్రీకారం చుట్టింది. పంచాయితీ స్థాయి సర్పంచ్ పాఠశాలను ్రపారంభించి, బాలికలకు కంప్యూటర్ విద్యతో పాటు డిజిటల్ అంగన్వాడీ, మోడ్రన్ ప్లే స్కూల్స్‌ను ఏర్పాటు చేసింది. చిన్న పల్లెటూరిలో ఉండి కూడా గొప్ప పని చేయగలమని నీరూ నిరూపించింది.చర్చావేదిక: సుప్రియా దాస్ దత్తా ఫార్మసీలో డిప్లమా చేసిన సుప్రియా దాస్ దత్తా త్రిపుర నివాసి. సెపాహిజాల జిల్లా పంచాయితీ అధ్యక్షురాలు. ప్రజాతీర్పులో మహిళల భాగస్వామ్యాన్ని చాటడానికి సుప్రియ బలమైన న్యాయవాదిగా ఎదుగుతున్నారు. సుప్రియ తన జిల్లాలో మహిళల కోసం చర్చా వేదికను ్రపారంభించారు. ఇక్కడ ప్రజలు జిల్లా పంచాయితీ అధికారులకు ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి సమస్యలపై తమ ఆందోళనలు, ఆలోచనలను తెలియజేయవచ్చు. సుప్రియ చేస్తున్న పనులను ప్రధాని మోదీనీ ఆకట్టుకున్నాయి. పిల్లల సంరక్షణ సౌకర్యాలను ్ర΄ోత్సహించడంలో కూడా చురుకుగా పాల్గొంటున్నది. లోతుగా పాతుకు΄ోయిన సామాజిక నిబంధనలను పరిష్కరించడం ద్వారా లింగ సమానత్వాన్ని సాధించవచ్చని సుప్రియ గట్టిగా నమ్ముతోంది. సమాజంలో తాను ΄ోషించే పాత్ర ద్వారా మహిళలు పురుషులకంటే ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించాలనుకుంటోంది. -
పన్నూ హత్యకు కుట్ర: వాషింగ్టన్ రిపోర్టుపై స్పందించిన యూఎస్
న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఖలీస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య చేసేందుకు ఓ భారతీయ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికపై అమెరికా స్పందించింది. పన్నూ హత్య కుట్రకు సంబంధించిన ఆరోపణల దర్యాప్తులో తాము నిరంతరం భారత్‌తో టచ్‌లో ఉండి, ఈ వ్యవహారంపై పని చేస్తున్నామని అగ్రరాజ్యం అధికార ప్రతినిధి వేదాంత పటేల్ తెలిపారు.‘పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విచారణపై పూర్తి జవాబుదారితనాన్ని ఆశిస్తున్నాం. అమెరికా.. భారత్‌తో ఈ విషయంలో నిత్యం టచ్‌లో ఉంటుంది. ఈ కేసులో పురోగతి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మరింత సమాచారం తెలుసుకుంటున్నాం. పలు స్థాయిల్లో అమెరికా ఆందోళనను ప్రత్యేక్షంగా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. నేను ఈ విషయంలో మరింత జోక్యం చేసుకోలేను’ అని వేదాంత పటేల్ తెలిపారు.ఇక.. వాషింగ్టన్ పోస్ట్ వెల్లండించిన నివేదికపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ భారత్ విదేశంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ అన్నారు.ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి ప్రమేయం ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్‌గా గుర్తించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
Toronto: న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్‌లో మంటలు
టొరంటో: కెనడాలోని టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 74 మంది ప్రయాణికులున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విండ్‌షీల్డ్ వద్ద మిరుగులు వచ్చాయి. దీంతో పాటు కాక్‌పిట్‌లో వైరు కాలిన వాసనను పైలట్ గమనించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేశాడు. వారు ఓకే అనడంతో పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్ చేశాడు. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలోని న్యూయార్క్‌లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్ జయసుఖ్ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతి న్యాయమూర్తిని నామినేట్ చేశారు. న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. 46 ఏళ్ల బల్సరా 2017 నుంచి న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌లో యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యూఎస్ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు. బల్సరా న్యూ రోషెల్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి ఇంజనీర్‌గా పనిచేశారు. తల్లి నర్సు. బల్సరా 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుండి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుండి ఏబీ పట్టా పొందాడు. ప్రస్తుతం బల్సరా తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో ఉంటున్నారు. -
22 నెలలకుపైగా న్యాయ పోరాటం.. భారతీయ అమెరికన్‌కు ఊరట
న్యూయార్క్: అమెరికాలో 22 నెలలకు పైగా న్యాయ పోరాటం తర్వాత ఓ భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఊరట కలిగింది. తాను కొనుక్కున్న ఇంటిలో తిష్టవేసిన జంట ఎట్టకేలకు ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ భారతీయ అమెరికన్ ఊపిరి పీల్చుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో బ్యాంక్ వేలంలో జెరిఖోలోని ఫ్రెండ్లీ లేన్‌లోని 1,536 చదరపు అడుగుల ఇంటిని బాబీ చావ్లా అనే ఇండియన్ అమెరికన్ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటి గత యజమానులైన బారీ, బార్బరా పొలాక్ ఆ ఇంటిని విడిచి పెట్టకుండా తిష్ట వేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. తాను ఆ ఇంటి కోసం పన్నులు, తనఖా చెల్లింపులు, ఇతర బిల్లుల రూపంలో ఇప్పటివరకు 85 వేల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు చావ్లా పేర్కొన్నాడు. ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన చావ్లా తల్లిదండ్రులను బారీ పొలాక్ తిడుతూ "పాకిస్తాన్‌కు వెళ్లిపోండి" అంటూ అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది. నిందితులు 1990లో 2,55,000 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2006 నాటికి తమ తనఖా చెల్లించడం మానేశారు. కోర్టు పత్రాల ప్రకారం, 2008లో ఇల్లు జప్తునకు రాగా బారీ, బార్బరా పొలాక్ జంట ఒక దశాబ్దానికి ఇల్లు జప్తు కాకుండా దశాబ్దానికిపైగా కేసును లాక్కొచ్చారు. ఇంటి జప్తు నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ఏడు సార్లు దివాలా పిటిషన్లు వేశారు. బార్బరా పొలాక్ గత నెలలో తాజాగా మరోసారి దివాలా పిటిషన్ వేయడంతో ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం ఆగిపోయింది. కాగా గతవారం కేసును విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి పోలాక్స్ను మళ్లీ దివాళా పిటిషన్లు దాఖలు చేయకుండా నిరోధించారు. దీంతో ఆ జంట చివరకు డిసెంబర్ 22న ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు. "ఇది క్రిస్మస్ అద్భుతంలా అనిపిస్తోంది, నేను నమ్మలేకపోతున్నాను" అని ది న్యూయార్క్ పోస్ట్‌తో బాబీ చావ్లా అన్నారు. తాను ఆ ఇంటిని తన ఆరు నెలల గర్భిణీ సోదరి, ఆమె భర్తకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. -
‘న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’!
అమెరికాలో నివసిస్తున్న ఒక సిక్కు వేర్పాటువాది హత్యకు భారత్ నుంచే కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నిఖిల్ గుప్తాపై నేరం రుజువైతే, అతనికి గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా ఈ ఆరోపణలపై అమెరికా నుంచి అందిన ఇన్‌పుట్‌పై విచారణ జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడానికి నవంబర్ 18న భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అందించే వివరాల ఆధారంగా భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టనుంది. ఇదిలాఉండగా నవంబర్ 20న గురుపత్వంత్ సింగ్ పన్నుపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎయిరిండియాలో ప్రయాణించే వ్యక్తులను భయాందోళనకు గురిచేసేలా పన్నూ సోషల్ మీడియా సందేశాలను జారీ చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియాలో ప్రయాణించేవారు ప్రమాదంలో ఉన్నారని పన్నూ సందేశం పంపాడు. నవంబర్ 19న ఎయిరిండియాకు అనుమతి ఇవ్వబోమని కూడా ఆయన పేర్కొన్నాడు. కాగా దీనికిముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కెనడా ఆరోపణలన్నింటినీ భారత ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. కెనడాతో భారత ప్రభుత్వ దౌత్యపరమైన వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెరికా న్యాయ శాఖ ఈ ప్రకటన వెలువరించడం విశేషం. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు హర్దీప్ సింగ్ నిజ్జర్ చీఫ్. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న ఇతను ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురయ్యాడు. ఇతని హత్యపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని భారత్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. అయితే కెనడా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు అందించలేదు. ఇది కూడా చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం -
ట్రంప్ మోసగాడే: తేల్చేసిన న్యూయార్క్ జడ్జి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు దాదాపు పదేళ్లపాటు తప్పుడు ఆర్థిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్ మోసానికి పాల్పడ్డారంటూ ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా పలు ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, అక్రమంగా రుణాలు పొందారని న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోన్ తెలిపారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్నారు. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం కేసు విచారణ నేపధ్యంలో ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ట్రంప్, అతని ముగ్గురు పిల్లలు సంయుక్తంగా వారి కంపెనీల విలువను పెంచి, బ్యాంకులు, బీమా సంస్థలకు చూపారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆరోపించారు. ట్రంప్‌కు, ఆయన సంతానానికి 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని, న్యూయార్క్ లో ట్రంప్ వ్యాపారం చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. ట్రంప్‌కు విధించాల్సిన శిక్షపై నిర్ణయం తీసుకునే ముందు న్యూయార్క్ జడ్జి ఆర్థర్ ఎంగ్రోన్ అక్టోబర్ 2న నాన్-జ్యూరీ ట్రయల్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నారు. విచారణకు ముందే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని అతని లాయర్లు న్యూయార్క్ న్యాయమూర్తిని గతంలో కోరారు. కాగా న్యూయార్క్ జడ్జి ఇచ్చిన తీర్పు.. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బకానుంది. ఇది కూడా చదవండి: చైనా ముంగిట మాద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్ సై? -
నన్ను అర్థం చేసుకునేవారు దొరికారు.. సామ్ పోస్ట్ వైరల్
సమంత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉంది. తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లిన సామ్.. ఈ నెల 20న అక్కడ నిర్వహించిన 'ఇండియా డే పరేడ్'కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత అక్కడే ఉంటూ న్యూయార్క్ నగరమంతా చుట్టేస్తుంది. నగరంలో ఉన్న పర్యటక ప్రదేశాలకు వెళ్తూ.. అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. అంతేకాదు వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా సామ్ న్యూయార్క్‌లోని ఓ పార్క్‌కు వెళ్లింది. అక్కడ కాసేపు వాకింగ్ చేస్తూ.. ప్రకృతి ఒడిలో సేద తీరింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఉదయం ఇలా ఉండాలి.. నాకు నచ్చిన ప్రదేశం ఇది’ అంటూ రాసుకొచ్చింది. ఫైనల్లీ అర్థం చేసుకునేవారు దొరికారు సమంతకు కాఫీ అంటే చాలా ఇష్టం. రోజుకు ఎన్ని సార్లేనా కాఫీ దాగేస్తుందట. అయితే న్యూయార్క్ పర్యటనలో సామ్‌కి కాఫీ కరువైనట్లుంది. ఎక్కడికి వెళ్లినా చిన్న కప్‌లో కాఫీ ఇస్తారు. కానీ సామ్‌కి అది సరిపోవడం లేదేమో. అందుకే ఎవరో జంబో సైజ్ కాఫీ ఇచ్చారు. దీంతో తప్పిఉబ్బిపోయిన సామ్.. మొత్తానికి నన్ను అర్థం చేసుకునేవాళ్లు దొరికారు అంటూ కాఫీ చేతులో పట్టుకున్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. మరి సామ్ మనసుని అర్థం చేసుకుని కాఫీ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టేసింది. ఆరోగ్యం బాలేదని వెకేషన్ ఎంజాయ్ చేస్తావా? సమంత కొన్నాళ్ల కిత్రం మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకుంది. ఆరోగ్యం కాస్త కుదిట పడగానే పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. సిటడెల్‌తో పాటు ఖుషీ మూవీ షూటింగ్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. అంతేకాదు ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో కూడా పూర్తిగా పాల్గొనపోవచ్చునని సమాచారం. (చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) కొద్ది రోజుల క్రితం ఖుషి బృందం నిర్వహించిన ఓ ఈవెంట్లో పాల్గొంది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానుంది. అయితే తన ఆరోగ్యం బాగోలేదని, ప్రమోషన్స్‌కి రాలేనని సామ్ చెప్పిందట. ఇప్పుడు మాత్రం సామ్ న్యూయార్క్‌లో ఖుషీ ఖుషీగా తిరుగుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ప్రమోషన్స్ కి రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా..? అని కామెంట్ చేస్తున్నారు. సినిమాలకు బ్రేక్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఖుషి చిత్రం తర్వాత ఆమె ఎలాంటి చిత్రాలను ఒప్పుకోలేదు. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసిందట. ఈ ఏడాది కాలమంతా తన ఆరోగ్యానికి కేటాయించాలని సామ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మయోసైటిస్ బారిన ఆమె.. దాని నుంచి పాక్షికంగా కోలుకోగానే పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్ చేసింది. సిటడెల్ వెబ్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ షూటింగ్‌ని కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి చిత్రాలను ఒప్పుకోలేదు. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసిందట. ఈ ఏడాది కాలమంతా తన ఆరోగ్యానికి కేటాయించాలని సామ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘ఖుషీ’ఈవెంట్లో ఫుల్ జోష్ కొత్త సినిమాలకు సైన్ చేయని సామ్.. విడుదల కాబోయే చిత్రాల ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొంటుంది. ఇటీవల ఖుషీ చిత్రబృందం మ్యూజికల్ కాన్సర్ట్‌ని నిర్వహించగా.. అందులో సమంత ఫుల్ జోష్‌తో పాల్గొంది. అంతేకాదు విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ కూడా చేసింది. దీంతో సామ్ ఆరోగ్యం కుదుట పడిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఇదే జోష్‌లో వరుసగా సినిమాలు చేయాలని కోరుకున్నారు. అత్యవసరంగా అమెరికాకు.. ఖుషీ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత.. మ్యూజికల్ కాన్సర్ట్ అయిన వెంటనే తల్లితో కలిసి హడావుడిగా అమెరికాకు వెళ్లింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమంత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత.. చికిత్స కోసమే అమెరికాకు వెళ్లిందనే ప్రచారం నెట్టంట జోరుగా సాగుతోంది. కొన్నాళ్ల పాటు సామ్ అమెరికాలోనే ఉండి, పూర్తిగా కోలుకున్నాకే తిరిగి ఇండియా వస్తుందని అంటున్నారు. అరుదైన గౌరవం..అందుకే అమెరికాకు సమంత అమెరికాకు వెళ్లింది చికిత్స కోసం కాదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 20న న్యూయారర్క్లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామ్ పాల్గొనబోతుందట. అక్కడ నిర్వహించే వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో ఆమె పాల్గొనబోతుంది. ఆ వేడుక కోసమే సమంత తల్లితో కలిసి అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఈ వేడుకకి సామ్ తో పాటు నటుడు రవికిషన్, నటి జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందింది. Our cutie with mom off to New York 🤌🏼🫶🏼 Happy safe journey Sammy❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/bk0svKb7zS — RoshSam💌 (@RoshSamLover) August 18, 2023 -
కన్నీటి గాథ: నొప్పి భరించలేకపోతున్నా! కాలు తీసేయండి మహా ప్రభో!
టైలా పేజ్ అనే యువతి తన దీనగాథను సోషల్ మీడియా ప్లాట్ఫారం ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. బాధను భరించలేక తన కాలును తీసేయండంటూ వైద్యులను పలు విధాల ప్రాధేయపడిన ఉదంతాన్ని ఆమె షేర్ చేసింది. ఆమెకు భరించలేనంతగా కాలి నొప్పిరావడంతో దానిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన ఫుట్‌బాల్ కోచ్.. న్యూయార్క్ పోస్ట్‌లో వెలువడిన ఒక రిపోర్టు ప్రకారం బ్రిటన్‌కు చెందిన టైలా పేజ్‌కు అపెండిక్స్ తొలగించినప్పటి నుంచి కాలి నొప్పిని ఎదుర్కొంటోంది. అంతకుమందు ఆమె ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసింది. ఆమెకు కాలినొప్పి ఎంతగా ఉండేందంటే ఆ నొప్పితో ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉండేది. నొప్పిని భరించలేకపోతున్నానంటూ కనిపించిన అందరితోనూ చెప్పుకుని రోదించేది. కాలు త్రీవంగా ప్రభావితం టైలా 2016లో కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన పడింది. ఈ సమయంలో ఆమె భరించలేనంత నొప్పిని అనుభవించింది. ఈ వ్యాధి సాధారణంగా కాలు లేదా చేయిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కుంగదీస్తుంది. దీనిని ‘సూసైడ్ డీసీజ్’ అని కూడా అంటారు. ఈ నొప్పి సాధారణంగా ఏదైనా గాయం అయిన తర్వాత, సర్జరీ లేదా స్ట్రోక్, గుండెపోటు వచ్చిన తరువాత మొదలవుతుంది.ఈ నొప్పి కారణంగా టైలా ఏ పనీ చేయలేకపోయేది. ‘కాలి నొప్పి భరించడం అసాధ్యంగా మారింది’ తన అనుభవాన్ని వివరించిన ఆమె.. ‘ఒకానొక సమయంలో కాలును కదపడం కష్టంగా మారింది. విపరీతంగా నొప్పి వచ్చేది. చల్లని గాలి తాకినా, కాలు నీటిలో పెట్టినా భరించలేనంత నొప్పి పుట్టేది. కుర్చీలో కూర్చోలేకపోయేదానిని. స్కూలులో కొద్దిసేపు ఉండి వచ్చేసేదానిని’ అని తెలిపింది. భరించలేని నొప్పి కారణంగా ఆమె స్నానం చేయలేకపోయేది. దుస్తులు స్వయంగా ధరించలేకపోయేది. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడటంతో మానసికంగా కుంగిపోయింది. తల్లి ఓదార్పుతో.. ఆ సమయంలో ఆమె తల్లి తన కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఒకనాడు టైలా ఇక తాను ఆ కాలుతో జీవించలేనని అభిప్రాయపడింది. తన శరీరం నుంచి ఆ కాలిని తొలగించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ‘చేతులు ఎత్తి వేడుకుంటున్నాను.. నా కాలు తీసేయండి’.. అని వైద్యులను శతవిధాల వేడుకుంది. 2019లో ఆమెకు ఆపరేషన్‌చేసి, కాలిని తొలగించారు. అప్పుడామె ఎంతో సంతోషించింది. ఇకపై భరించలేనంత నొప్పి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సంబరపడింది. ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్.. -
అమెరికాను ముంచేసిన మంచు.. 60 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో హిమోత్పాతం దేశాన్ని గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. One car tried to drive my hill and Queen Anne and hit all these parked cars who clue down the hill… insane. DON’T DRIVE. #seattle pic.twitter.com/wJsor6byDa — Kaybergz (@kay0kayla) December 23, 2022 కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది. ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్ సబ్ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది. My dads places in Crystal Beach after the winter storm pic.twitter.com/BnntAihoMz — Bat Boy Slim (@TerjeOliver) December 26, 2022 -
మంచు గుప్పెట్లోనే అమెరికా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే పౌరులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దారుణమైన వాతావరణ పరిస్థితులను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని న్యూయార్క్‌వాసులు చెబుతున్నారు. బఫెలో తదితర చోట్ల హరికేన్లను తలపించే గాలులు ప్రజల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. రోడ్లు, రన్‌వేలపై ఏకంగా 50 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. దాంతో పలు విమానాశ్రయాలను రెండు రోజుల పాటు మూసేశారు. శని, ఆదివారాల్లో కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. అయితే పలుచోట్ల పరిస్థితిని అధికారులు క్రమంగా చక్కదిద్దుతున్నారు. బహుశా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగు పడొచ్చని భావిస్తున్నారు. -
‘గోల్డెన్ కనరీ’ వజ్రం.. ధర రూ.123 కోట్లు.. అంచనా మాత్రమే!
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పెద్ద పసుపు రంగు ‘గోల్డెన్ కనరీ’ వజ్రం ఇది. దుబాయ్‌లోని సోత్‌బేస్ ప్రదర్శనలో ఉంచారు. దీనిని ఈ ఏడాది డిసెంబర్లో న్యూయార్క్‌లో వేలం వేయనున్నారు. 1980లలో కాంగో దేశంలో వజ్రాల గని సమీపంలో లభించినపుడు దీని బరువు 890 క్యారెట్లు. తర్వాత పలుమార్లు సానబట్టి ముక్కలుగా మారింది. చివరకు 303.10 క్యారెట్లకు తగ్గించారు. అదే ఈ వజ్రం. డిసెంబర్ 7న న్యూయార్క్‌లో ఇది రూ.123 కోట్ల ధర పలకొచ్చని ఒక అంచనా. ఇదీ చదవండి: పింక్ వజ్రానికి రికార్డ్ ధర.. రూ.480 కోట్లకు వేలం -
‘థ్యాంక్ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..!
వాషింగ్టన్: చిన్న చిన్న గొడవలకే కొందరు సహనం కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడి చేసి వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. అలాంటి సంఘటనే అమెరికాలోని బ్రూక్లిన్‌లో వెలుగు చూసింది. ‘థ్యాంక్ యూ’ చెప్పలేదని మొదలైన వాగ్వాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు దారి తీసింది. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. పార్క్ స్లోప్‌లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్ దుకాణం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైంది. తెల్ల రంగు టీషర్ట్ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్ తెరిచాడు. అయితే, డోర్ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు. దాంతో తాను తెరవాలని కోరలేదని, థ్యాంక్ యూ చెప్పనని స్పష్టం చేశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు నిందితుడు. తీవ్రంగా రక్తస్రావమైంది. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ బ్రూక్లిన్ మెథొడిస్ట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య -
Live Video: డబ్బు కోసం ఇంత ఘోరమా?.. కారుతో ఢీకొట్టి మరీ..!
వాషింగ్టన్: డబ్బుల కోసం కొందరు దండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతూ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి రక్తపు మడుగులో పడిపోయిన అతడికి చెందిన ఆభరణాలు, డబ్బులు లాక్కెళ్లారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్నాడు. ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని న్యూయార్క్ పోలీస్ విభాగం(ఎన్‌వైపీడీ) ట్విట్టర్లో షేర్ చేసింది. నగరంలోని బ్రోంక్స్లో గత శనివారం ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. ‘ఓ 39 ఏళ్ల వ్యక్తిని కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత బలవంతంగా అతడి వస్తువులు, డబ్బులను లాక్కెళ్లారు.’ అని పేర్కొంది ఎన్‌వైపీడీ. ఈ వీడియోలో.. బ్లాక్ సెడాన్ కారు బాధితుడిని వెనకనుంచి ఢీకొట్టింది. దాంతో రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయాడు. కొద్ది క్షణాల్లోనే కారులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు బాధితుడి వద్ద నుంచి వస్తువులు లాక్కెళ్లారు. 🚨WANTED for ROBBERY: Do you know these guys? On 7/23/22 at approx. 6:40 AM, opposite 898 E 169 St in the Bronx, the suspects struck a 39-year-old male with a car, then proceeded to forcibly take his property. Any info? DM @NYPDTips, or anonymously call 800-577-TIPS. pic.twitter.com/RngQ1JUA4C — NYPD NEWS (@NYPDnews) July 24, 2022 సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర విభాగం బృందాలు బాధితుడిని హుటాహుటిన లిన్‌కోల్న్ ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు కారు దిగి చోరీకి పాల్పడగా మరో వ్యక్తి కారులో ఉన్నట్లు చెప్పారు. దుండగుల గురించి సమాచారం తెలిసినవారు తమకు ఫోన్ చేయాలని, ఆన్లైన్లో సమాచారం అందించాలని కోరారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
Polio virus: పదేళ్ల తర్వాత పోలియో కలకలం.. తొలి కేసు నమోదు!
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు దశాబ్దం తర్వాత పోలియో కలకలం సృష్టించింది. పదేళ్ల తర్వాత తొలి కేసు నమోదైనట్లు అమెరికా గురువారం ప్రకటించింది. రాక్లాండ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్‌గా తేలినట్లు న్యూయార్క్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. వ్యాధుల నియంత్రణ నిర్మూల కేంద్రం వివరాల ప్రకారం.. అమెరికాలో చివరి సారిగా 2013లో పోలియో కేసు నమోదైంది. నోటి ద్వారా పోలియే వ్యాక్సిన్(ఓపీవీ) తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలోనే నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌కు స్వస్తి పలికింది అమెరికా. ‘ అమెరికా వెలుపల ఓపీవీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధునాత వ్యాక్సిన్ల ద్వారా కొత్త రకాలు ఉద్భవించవు.’ అని పేర్కొంది న్యూయార్క్ ఆరోగ్య విభాగం. వైరస్ వ్యాప్తిని గుర్తించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించింది. పోలియో టీకా తీసుకోని ప్రజలు వెంటనే వేసుకోవాలని హెచ్చరించింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయంగా చేస్తున్న కృషి వల్ల పోలియో అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్ ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలపైనే అధిక ప్రభావం చూపుతుంది. 1988 నుంచి కొత్త కేసులు 99 శాతం తగ్గాయి. అప్పటి నుంచి 125 దేశాలను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. మొత్తం 3,50,000 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మాత్రం 1960లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. నేరుగా పోలియో సోకిన కేసు 1979లో నమోదైంది. ఇదీ చదవండి: New Polio Virus In London: పోలియో వైరస్ కొత్త టైప్ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే! -
Omicron: న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
న్యూయార్క్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ బి.1.1.529 హడలెత్తిస్తోంది. ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఈ వేరియంట్లో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా కొత్త వేరియంట్ B.1.1.529కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్ ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ జాబితాలో చేర్చింది. చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది? అయితే ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పటివరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. చదవండి: Omicron: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు -
అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు!
న్యూయార్క్: న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ జూ పార్కులో అరుదైన జాతికి చెందిన మంచు గుడ్లగూబ సందడి చేస్తోంది. 130 ఏళ్ల క్రితం అమెరికాలో కనిపించిన ఈ జాతి గుడ్లగూబ మళ్లీ పార్కులో దర్శనమివ్వడంతో పక్షి ప్రేమికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని చుసేందుకు అక్కడకు క్యూ కడుతున్నారు. ఆ పక్షితో తీసుకున్న సెల్ఫీలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ గుడ్లగూబ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అరుదైన జాతి గుడ్లగూబను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘నమ్మలేకపోతున్నాం.. ఇది ఎంత అందంగా ఉంది’, ‘అరుదైన హిస్టారికల్ మంచు గుడ్లగూబను చూస్తుంటే అద్బుతంగా ఉంది’, ‘మళ్లీ దీనిని చూసే అవకాశం రావడం అదృష్టం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..) కాగా ఈ మంచు గుడ్లగూబలు సెంట్రల్ పార్కులో 1890లో అమెరికాలో ఎక్కువగా ఉండేవని, ఆ తర్వాత రానురాను అవి కనుమరుగయ్యాయని జూ నిర్వహకులు తెలిపారు. అమెరికా నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షిశాస్త్ర విభాగ కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు. అయితే ఇవి ఆర్కిటిక్ ప్రాంతంలోని టండ్రాల్లో నివసిస్తుంటాయని, శీతాకాలంలో మాత్రం దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక మంచు గుడ్లగూబను చూసేందుకు పర్యటకులంతా పొటెత్తుతున్నారు. దాంతో పర్యాటకులను చూసి ఆ గుడ్లగూబ భయాందోళనకు గురవుతుండంతో జూ అధికారులు వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఈ పక్షిని చూడాలంటే బైనాక్యులర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని పర్యాటకులకు సూచిస్తున్నారు. (చదవండి: ‘పులికి ఉన్న జ్ఞానం కూడా లేదు’) The SNOWY OWL of the Central Park North Meadow was not much bothered by the crows that gathered around it earlier and that have now returned. People are staying behind distant fences and being quiet and respectful. pic.twitter.com/BKjGPRiKCZ — Manhattan Bird Alert (@BirdCentralPark) January 27, 2021 -
బంగారం.. క్రూడ్ బేర్..!
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లపైనే కాకుండా కమోడిటీలపైనా ప్రభావం చూపింది. గత కొద్ది నెలలుగా లాభాల బాటన పయనిస్తున్న పసిడి ధర, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్‌కు (31.1గ్రా) సోమవారం భారీగా పతనమైంది. ఈ వార్త రాసే 10.30 గంటల సమయంలో 50 డాలర్లకుపైగా (3 శాతం) నష్టంతో 1908 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం ఒక దశలో కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకుసైతం పడిపోయి, 1,886 డాలర్లను కూడా తాకింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పసిడి ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత ఏ రోజుకారోజు పసిడి పురోగతి బాటనే పయనిస్తూ, వారంరోజుల్లోనే ఆల్‌టైమ్ గరిష్టం 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు తర్వాత లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. అయితే దీర్ఘకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర సోమవారం ఈ వార్త రాసే సమయానికి రూ.1,400 నష్టంలో రూ. 50,324 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, మంగళవారం భారత్ స్పాట్ మార్కెట్లలో ధర భారీగా తగ్గే వీలుంది. క్రూడ్ కూడా...: మరోవైపు నైమెక్స్‌లో లైట్ స్వీట్ ధర కూడా బేరల్‌కు 2 శాతం నష్టంతో 39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ధర కూడా దాదాపు ఇదే స్థాయి నష్టంతో 41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మైక్రోసాఫ్ట్ చేతికి టిక్‌టాక్..!?
న్యూయార్క్: జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించే దిశగా తన యంత్రాంగం పరిశీలన చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అదే సమయంలో టిక్‌టాక్‌ను నిషేధించాల్సి వస్తే అందుకు ప్రత్యామ్నాయాన్ని కూడా కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నట్లు వెల్లడించారు. కాగా టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలు, హక్కులు సొంతం చేసుకునేందుకు దాని మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో, అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్న క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టిక్‌టాక్‌ను కొనుగోలు విషయంలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. ఇక టిక్‌టాక్ మాత్రం.. ‘‘మేము అసత్య వార్తలు, ఊహాగానాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయము. మాకు టిక్‌టాక్ దీర్ఘకాలిక విజయంపై నమ్మకం ఉంది’ అని తెలిపింది. కాగా గతకొన్ని రోజులుగా అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా కంపెనీలు డ్రాగన్ ప్రభుత్వానికి తమ డేటాను చేరవేస్తున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా చైనీస్ యాప్‌లు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అగ్రరాజ్యం ఉపక్రమించింది. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఇందుకు సంబంధించిన చర్చలు సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, బిలియన్ డాలర్లతో కూడిన ఒప్పందం గురించి మైక్రోసాఫ్ట్ శ్వేతసౌధంతో కూడా సంప్రదింపులు జరిపినట్లు పేర్కొనడం.. బిజినెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. (ఐరాసలో ఈసారి ట్రంప్ ఒక్కరే) కాగా యూఎస్ జాతీయ-భద్రతా అధికారులు మ్యూజికల్.లై కొనుగోలును సమీక్షిస్తున్నారన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆమెరికా సాయుధ దళాలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన ఫోన్స్‌లో టిక్ టాక్ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయాలని ఆదేశించారు. టిక్‌టాక్‌ను నిషేధించడాన్ని అమెరికా పరిశీలిస్తోందని విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో జూలై నెల ప్రారంభంలో పేర్కొన్న విషయం తెలిసిందే. (ట్రంప్ బాధ్యతారాహిత్యం) -
భగ్గుమంటున్న అగ్రరాజ్యం
వాషింగ్టన్/మినియాపొలిస్: మినియాపొలిస్‌లో రాజుకున్న అశాంతి అగ్గి అమెరికాలోని ఇతర నగరాలకూ వ్యాపిస్తోంది. జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్‌అమెరికన్‌ను శ్వేత జాతి పోలీసు అధికారులు పొట్టనబెట్టుకోవడంపై ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఫ్లాయిడ్ మృతికి నిరసనగా వాషింగ్టన్లో ఆదివారం శాంతియుతంగా ప్రదర్శన జరిగింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. న్యూయార్క్‌లో ఓ యువతి అరెస్ట్ దృశ్యం ఆందోళనలకు కేంద్ర బిందువైన మినియాపొలిస్‌లో పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం 4 వేల నేషనల్ గార్డులను రంగంలోకి దించింది. ఇండియానాపొలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. రెండు రోజుల క్రితం డెట్రాయిట్, మినియాపొలిస్‌ల్లో జరిగిన ఘటనల్లోనూ ఇద్దరు మరణించారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారుల దాడిలో 13 మంది పోలీసులు గాయపడగా నాలుగు పోలీసు వాహనాలు కాలిబూడిదయ్యాయి. న్యూయార్క్‌లో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడం కొట్లాటలకు దారి తీసింది. గురువారం నుంచి ఇప్పటి వరకు 22 నగరాల్లో 1,669 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇందులో సగం అరెస్టులు లాస్ఏంజెలిస్లోనే జరిగాయి. లాస్ఏంజెలిస్ నగరంలో నిరసన కారులు భవనాలు, వాహనాలకు నిప్పుపెడుతుండటంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అట్లాంటా, డెన్వెర్, లాస్ఏంజెలిస్, మినియాపొలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్ సహా 12కు పైగా నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. నా రెస్టారెంట్ కాలిపోయినా సరే.. మినియాపొలిస్ నిరసనలకు బంగ్లాదేశీయుడు, స్థానిక ‘గాంధీ మహల్ రెస్టారెంట్’ యజమాని రుహేల్ ఇస్లాం(44) మద్దతుగా నిలిచారు. మినియాపొలిస్ పోలీస్ ఆఫీస్ దగ్గర్లో ఇతన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ రోజు జరిగిన ఘటనపై రుహేల్ కుమార్తె హఫ్సా (18) ఫేస్బుక్లో పెట్టిన పోస్టు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆ రోజు నాన్న పక్కనే కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నా. నాన్న ఎవరితోనో ఫోన్లో.. నా బిల్డింగ్‌ను తగలబడనివ్వండి. బాధితులకు మాత్రం న్యాయం దక్కాలి. బాధ్యులను జైల్లో పెట్టాలి..అని అంటుండగా విన్నాను. మాకు నష్టం జరిగినా సరే, పొరుగు వారికి సాయంగా, బాసటగా నిలవాలన్న మా సంకల్పం ఏమాత్రం సడలదు’ అని అందులో హఫ్సా పేర్కొంది. -
అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం?
న్యూయార్క్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ రేటును అదుపు చేయకుంటే మరిన్ని మరణాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సారి మరణాలు వేల సంఖ్యలో ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అసలు సవాలు ఇప్పుడే! అమెరికాలో లాక్డౌన్ కొనసాగుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ న్యూయార్క్ దాని పరిసర ప్రాంతాలను మినహాయించి చూస్తే ఐదు రోజుల్లో నమోదైన కేసుల సగటు ప్రతి లక్ష మందికి 6.2 నుంచి 7.5కు పెరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. న్యూయార్క్‌లో కొన్ని రోజులుగా కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టాయి కానీ చాలా ప్రాంతాల్లో పెరిగాయి. పరీక్షలు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న వాదన అమెరికా విషయంలో పనిచేయదని, వాస్తవంగా కేసులు ఎక్కువయ్యాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్త జువో ఫెంగ్ జాంగ్ తెలిపారు. న్యూయార్క్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అయోవాలో మంగళవారం రికార్డు స్థాయిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా టైసన్ ఫుడ్ పోర్క్ ప్లాంట్‌లో దాదాపు 730 మందికి వైరస్ సోకింది. కాన్సస్‌లోని షానీ కౌంటీలో వారం రోజులుగా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని ఒక నివేదికలో వెల్లడైంది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన రోజు నుంచే కేసుల పెరుగుదల నమోదు కావడం ఇక్కడ గమనార్హం. భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆగస్టు నాటికి అమెరికా మొత్తమ్మీద కోవిడ్ కారణంగా 1.34 లక్షల మంది మరణించే అవకాశముందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్టఫర్ ముర్రే సిద్ధం చేసిన మోడల్ హెచ్చరించడం తెల్సిందే. చదవండి: ‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం పోరులో మలిదశలో ఉన్నాం వాషింగ్టన్: కరోనా వైరస్ కేసుల గ్రాఫ్‌ను ఇప్పటికే చదును చేసిన అమెరికా.. మలిదశలో సురక్షితంగా.. దశలవారీగా లాక్డౌన్ నిబంధనలను సడలించే ప్రక్రియలో ఉందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. పౌరుల చిత్తశుద్ధి కారణంగా వైరస్ గ్రాఫ్‌ను చదును చేయగలిగామని, తద్వారా లెక్కలేనని అమెరికన్ పౌరుల ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆయన ఫీనిక్స్‌లో మాస్క్‌లు తయారు చేసే ఫ్యాక్టరీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. వారం రోజులుగా దేశం మొత్తమ్మీద కేసులు, మరణాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ అంశం ఆధారంగానే ట్రంప్ గ్రాఫ్ వంపును చదునుచేసి చెబుతున్నట్లు అంచనా. ఈ మహమ్మారి కారణంగా అమెరికా వస్తు సేవల సరఫరా అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పిందని, స్థానికంగా వస్తువుల తయారీ కేంద్రాల నిర్మాణం జరగాలని చెబుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ట్రంప్ ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ కరోనా ఓ గట్టి ప్రత్యర్థేనని కానీ.. దానిపై విజయం సాధిస్తున్నామని భరోసానిచ్చారు. అమెరికా ఇప్పుడు వెంటిలేటర్లు వంటి అత్యవసర సరుకులను అందివ్వడం ద్వారా నైజీరియా వంటి దేశాలను ఆదుకునేపనిలో ఉందని అన్నారు. -
యువత అతీతం కాదు
రోమ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వయో వృద్ధులను ఎక్కువగా బాధిస్తున్నప్పటికీ యువత ఈ మహమ్మారికి అతీతమేమీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వైరస్ తాకిడికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోగా.. జన జీవనం అస్తవ్యస్తమైనట్లు తెలుస్తోంది. వ్యాపారాలు, విద్యాలయాలు మూతపడిపోవడం, లక్షల మంది ఇళ్ల నుంచే పనిచేసుకోవడం మొదలుపెట్టడంతో మహానగరాలూ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇటలీలో ఒక్కరోజే 793 మంది మృతి చెందారు. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 11,737కు చేరుకుంది. ఇందులో 4వేలమంది ఇటలీ వారే కావడం గమనార్హం. వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 160 దేశాల్లో 2.75 లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పీడితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాతోపాటు న్యూయార్క్, ఇల్లినాయిల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కోరాయి. మరోవైపు వైరస్‌కు పుట్టినల్లు అయిన చైనాలో వరుసగా మూడవ రోజూ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియాసిస్ శనివారం రోమ్‌లో మాట్లాడుతూ జబ్బు లక్షణాలు లేకపోయినా యువత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడికి వెళుతున్నారన్న విషయంపై వ్యాధి సోకే అవకాశాలు పెరిగిపోతాయని స్పష్టం చేశారు. యూరప్‌లో కట్టడి చర్యలు ముమ్మరం ఇటలీసహా యూరప్‌లో వైరస్ కట్టడి చర్యలు ముమ్మరమయ్యాయి. ఇటలీలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్త మరణాల్లో 36 శాతానికి చేరుకుందంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ దేశంలో వ్యాధి బారిన పడుతున్న ప్రతీ100మందిలో 9మంది మరణిస్తున్నారు. ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లోనూ నిబంధనలను అతిక్రమించిన వారిపై భారీ జరిమానాలు విధించడం మొదలైంది. బ్రిటన్ తాజాగా పబ్బులు, హోటళ్లు, థియేటర్లను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి తగిన పరిహారం అందించాలని నిర్ణయించారు. ఇరాన్లో మరో 123 మంది.. ఇరాన్లో కరోనా మరణ మృదంగపు ధ్వనులు పెచ్చరిల్లుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 123 మంది కరోనాకు బలవడంతో శనివారం నాటికి దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1556కు చేరుకుందని ఆరోగ్యశాఖ అధికారి కియానౌష్ తెలిపారు. ఇరాన్లో 20,610కి వైరస్ సోకిందని వివరించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదని మార్చి 17 తేదీ నుంచి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి కొన్ని లక్షల మంది రోడ్డు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లారని ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సంస్థ తెలిపింది. కాలిఫోర్నియాలో వేయిపైనే అమెరికాలోని ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం, 19 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలూ ఒక్కటొక్కటిగా మేల్కొనడం మొదలైంది. ఏడు రాష్ట్రాల్లో పది కోట్ల మందిని ఇళ్లకే పరిమితం చేసేశారు. ఏడు వేల కేసులు, 39 మరణాలు సంభవించిన న్యూయార్క్‌తోపాటు ఇల్లినాయిలో ప్రజలను ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ అవసరం లేదని చెప్పారు. అమెరికా, మెక్సికోల మధ్య రాకపోకలు అత్యవసర అవసరాలకు పరిమితం చేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఉపాధ్యక్షుడు పెన్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు శుక్రవారం తెలిసింది. దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ 230 మంది వ్యాధి కారణంగా మరణించారు. ఆఫ్రికన్ దేశం గబాన్లో తాజాగా ఒక కొత్త కరోనా కేసు బయట పడింది. దక్షిణ అమెరికా దేశాలు క్యూబా, బొలీవియాలు తమ దేశ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించగా కొలంబియా కూడా ప్రజలందరికీ నిర్బంధ ఐసొలేషన్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ► సీబీఎస్ఈ టోల్‌ఫ్రీ నంబర్: వైరస్ నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు 1800118004 నంబర్‌పై ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ► శానిటైజర్ల ధర: మాస్కులు, శానిటైజర్ల ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. వాటి గరిష్ట ధరలను శనివారం ప్రభుత్వం నిర్ణయించింది. 200 మి.లీటర్ల శానిటైజర్ ధర రూ.100 మించకూడదు. రెండు పొరల సర్జికల్ మాస్క్ ధర రూ. 8, మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర రూ.10 మించకూడదు. ► కూలీలకు నగదు: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం కూలీలకు రూ. 1,000 నగదును, భవన నిర్మాణ కూలీలకు ఒక నెల రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ► సార్క్‌కు విరాళం: కరోనాను ఎదుర్కొనేందుకు సార్క్ కరోనా ఎమర్జెన్సీ ఫండ్‌కు అఫ్గాన్ ప్రభుత్వం ఒక మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వగా, మాల్దీవుల ప్రభుత్వం రెండు లక్షల డాలర్ల నిధులు ప్రకటించింది. కరోనా విలయం స్థూలంగా.. ప్రపంచవ్యాప్తంగా మరణాలు 11,737 వైరస్ సోకినవారు 2,77,106 ప్రభావితమైన దేశాలు 164 ఇళ్లకు పరిమితమైనవారు 100 కోట్లు ► కొలంబియాలో మంగళవారం నుంచి గృహ నిర్బంధం అమల్లోకి రానుంది. ► అమెరికాలోని కాలిఫోర్నియా, ఇల్లినాయి, న్యూయార్క్, పెన్సెల్వేనియా, న్యూజెర్సీ, కనెక్టికట్, నెవెడాల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితం. ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరిపై కరోనా వైరస్ ప్రభావం ఉంది. దేశం మరణాలు కేసులు ఇటలీ 4,825 53,578 చైనా 3,255 81,008 ఇరాన్ 1,556 20,610 స్పెయిన్ 1,326 24,926 ఫ్రాన్స్ 450 12,612 నిబంధనలు కఠినతరం స్విట్జర్లాండ్‌లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు చేశారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడదని, రెండు మీటర్ల ఎడం కంటే తక్కువ ఉంటే ప్రజలకు జరిమానా విధించాలని నిర్ణయాలు తీసుకుంది. హైతీ, డొమనికన్ రిపబ్లిక్, జోర్డాన్, బుర్కి నా ఫాసోల్లోనూ కర్ఫ్యూలు అమల్లోకి వచ్చాయి. కరోనా కారణంగా పర్యాటక రం గంపై ఎక్కువగా ఆధారపడే క్యూబాలో ఇతర దేశస్తులకు ప్రవేశాన్ని 30 రోజులపాటు నిషేధించారు. ఐవరీ కోస్ట్, బుర్కినా ఫాసోలు త్వరలోనే సరిహద్దులను మూసేయనుండగా బ్రెజిల్ సోమవారం ఆ పని చేయనుంది. యూ రప్, ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాకపై నిషేధం విధించింది. వ్యాపారాలకూ దెబ్బే స్మార్ట్‌ఫోన్ రవాణా ఫిబ్రవరి నెలలో కనిష్ట స్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ తగ్గింపు 38 శాతం తక్కువ. ఎయిర్ కెనడా, ఎయిర్ ట్రాన్స్సాట్లు ఏడు వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి తొలగించింది. పారిశ్రామిక ఉత్పత్తిని గ్వాటెమాలా నిలిపివేయనుంది. -
కరోనా ఎఫెక్ట్ ఎలా ఉందంటే..
థాయ్‌లాండ్: కరోనా (కోవిడ్-19) వైరస్ టెర్రర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. చాలా దేశాల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. అటు ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. నిన్న మొన్నటి వరకూ కిటకిటలాడిన పర్యాటక ప్రదేశాలు, విమానాశ్రయాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. యూరప్ దేశాల్లో ఎప్పుడు ఏం మూతపడతాయన్న భయంతో జనం సూపర్ మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. వాటర్ బాటిల్ నుంచి టాయిలెట్ రోల్ వరకూ ఇలా భారీ స్థాయిలో నిత్యావసరాలు కొనుక్కొని.. ఇళ్లనే సూపర్ మార్కెట్లుగా మార్చేస్తున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే... ఇక థాయ్‌లాండ్‌లోని లోప్‌బురిలో పర్యాటకులు రాక.. వారిచ్చే ఆహారం లేకపోవడంతో వందలాది కోతులు ఆహారం కోసం రోడ్ల మీద పడ్డ దృశ్యాలు వైరల్‌గా మారాయి. (కోవిడ్-19పై కేంద్రం కీలక నిర్ణయం!) మరోవైపు కరోనా వైరస్ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. అమెరికా ప్రభుత్వం అక్కడి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వైట్ హౌస్ సహా అత్యవసర సేవలు మినహా) ఇంటి నుంచే పని చేని చేయాలని ఆదేశించింది. (కోవిడ్: చైనా రాయబారికి అమెరికా నోటీసులు) వేలాదిమంది ప్రయాణికులతో కిటకిటలాడే న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, సియాటిల్, షికాగో విమానాశ్రయాలు బోసిపోయాయి. జేఎఫ్‌కె ఎయిర్‌పోర్టు, న్యూయార్క్ లండన్‌లో ప్రయాణికులు లేకపోవడంతో బోసిపోయిన ట్రైన్ కువైట్‌లో కోవిడ్ పరీక్షల కోసం ఇరాన్ కేబినెట్ సమావేశం -
లవ్ ఇన్ న్యూయార్క్
లేడీ సూపర్‌స్టార్ నయనతార నేడు 35వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్రెడీ న్యూయార్క్‌లో అడుగుపెట్టారామె. అయితే ఒంటరిగా కాదులెండి. తన బాయ్‌ఫ్రెండ్, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి న్యూయార్క్ వీధుల్ని చుట్టేస్తున్నారు. వీలున్న ప్రతీ సంద ర్భాన్ని సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటారు నయన్, విఘ్నేశ్. హాలిడేలను జాలిడేలుగా మార్చుకుని ట్రిప్స్ వేస్తుంటారు. ఈ మధ్యనే విఘ్నేశ్ బర్త్‌డేని ఘనంగా జరిపారు నయనతార. ఇప్పుడు నయన్ బర్త్‌డే కోసం విదేశాల్లో వాలారు. అక్కడ వాళ్లు చేస్తున్న సందడిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు విఘ్నేశ్. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుందని టాక్. -
ఆయనకు ఒంట్లో ఆల్కహాల్!
న్యూయార్క్: బయటకెళ్లి ఆల్కహాల్ కొనకుండా ఇంట్లోనే ఆల్కహాల్ దొరికితే ఎంత బావుండునో అని మద్యపాన ప్రియులు కోరుకుంటారు. అలాంటిది ఏకంగా ఒంట్లోనే ఆల్కహాల్ ఉత్పత్తి అయితే ఇంకెంత బాగుండు అనుకుంటారు కదా! అతడెంత అదృష్టవంతుడోనని ఆశ్చర్యపోతారు. దీన్ని అనుభవిస్తున్న ఓ వ్యక్తి మాత్రం దీన్ని దురదృష్టకరమని భావిస్తున్నాడు. న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆపి ఆల్కహాల్ స్థాయిని పరీక్షించారు. ఉండాల్సిన స్థాయి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు. అయితే ఇలాంటి ఓ కేసు గురించి విన్న అతని బంధువు అతడికి సహాయం చేసింది. ఆహారంలో ఉన్న పిండిపదార్థాలను గ్లూకోజ్‌గా కాకుండా, ఆల్కహాల్‌గా మార్చే ఓ ప్రత్యేక సూక్ష్మజీవి కడుపులో ఉండటంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఓ డాక్టర్ పర్యవేక్షణలో అతడిని ఉంచారు. అధిక పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని అతడు తీసుకున్నపుడు రక్తంలో ఆల్కహాల్ స్థాయి పెరగడాన్ని గుర్తించారు. పిండిపదార్థాలు అధికంగా లేని ఆహారాన్ని స్వీకరించినపుడే ఆల్కహాల్ స్థాయి లేదు. దీంతో అతన్ని కోర్టు మన్నించింది. ఈ అంతుచిక్కని వ్యాధి పరిశీలన దశలోనే ఉందని పరిశోధకులు బార్బరా కార్డెల్ అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఆల్కహాల్ సేవించినట్లు కనిపిస్తారు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
ఐక్యరాజ్యసమితికి నిధుల కొరత!
న్యూయార్క్: ప్రపంచ సమస్యలు తీర్చే పెద్దన్న ఐక్యరాజ్యసమితిని నిధుల కొరత వేదిస్తోంది. ఐక్యరాజ్యసమితి సుమారు 230 మిలియన్ డాలర్ల లోటులో ఉన్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. అరకొరగా ఉన్న నిధులు ఈ నెలాఖరుకు ఖాళీ అయ్యే అవకాశముందని తెలిపారు. సమితి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఉద్దేశించి ఆయన రాసిన లేఖలో నిధుల కొరతను ఆయన ప్రస్తావించారు. ‘ఈ ఏడాది సాధారణ బడ్జెట్‌కు సభ్య దేశాల నుంచి కేవలం 70శాతం మాత్రమే నిధులు లభించాయి. దీంతో సెప్టెంబర్ ఆఖరుకు 230 మిలియన్ డాలర్ల నగదు లోటు ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న నిధులు సైతం ఈ నెలాఖరుకు అయిపోయే అవకాశం ఉంది. అందుకే ఖర్చు తగ్గింపులో భాగంగా వివిధ సమావేశాలు, సదస్సులు వాయిదా వేయను న్నాం. కొన్ని సేవలను తగ్గించనున్నాం. అతిముఖ్యమైన పర్యటనలు తప్ప మిగిలిన వాటిపై ఆంక్షలు విధించనున్నాం. ఈ పరిస్థితికి కారణం సభ్యదేశాల నిర్లక్ష్యమే’అని ఆ లేఖలో గుటెర్రస్ పేర్కొన్నారు. కాగా, నగదు కొరత ప్రమాదాన్ని ముందే ఊహించిన గుటెర్రస్ ఈ ఏడాది ఆరంభంలోనే సభ్య దేశాలను హెచ్చరించారు. ఆయా దేశాలు చెల్లించాల్సిన మొత్తాన్ని వీలైనంత త్వరగా జమచేయాలని సూచించారు. 2018–19కి గాను సమితి 5.4 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రకటించగా, ఇందులో 22శాతం నిధులు అమెరికా నుంచి వచ్చినవే. -
నాన్నను చూడకు..పాకుతూ రా..
న్యూయార్క్ నగరంలో అనూహ్య ప్రమాదంలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటన కొంత సంతోషాన్నివ్వగా, మరింత విషాదాన్ని నింపింది. అవును.. విషాదం ఎందుకంటే ఫెర్నాండో బాల్బునా (45) అనే వ్యక్తి తన పాప (5)తో సహా రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ఫెర్నాండో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పాప ప్రాణాలతో బైటపడింది. సోమవారం ఉదయం బ్రోంక్స్ లోని కింగ్స్బ్రిడ్జ్ రోడ్ స్టేషన్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షలు కథనం ప్రకారం పాపను ఎత్తుకున్న ఒకవ్యక్తి పాపతో సహా రైలు పట్టాలపై దూకేశాడు. దీంతో ఇద్దరు సహ ప్రయాణికులు వారి రక్షించేందుకు ట్రాక్‌లపైకి వెళ్లారు. కానీ అప్పటికే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, అదృష్టవశాత్తూ పాప బైటపడింది. అయితే పట్టాలపై ఇరుక్కున్న పాపకు జైరో టోర్రెస్ ధైర్యం చెప్పి కాపాడిన వైనం ప్రశంసలందుకుంటోంది. ‘నాన్నకు ఏమైంది.. అంటూ బెదిరిపోతున్న పాపను ఊరడించిన జైరో.. నాన్నవైపు చూడకు..నన్నుచూడు..నాదగ్గరకు రా..పప్పీలా పాకుతూ నావైపు రా అంటూ ఆమెను పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంకి తీసుకొచ్చాడు. ఈ ఘనటపై మృతుని భార్య, పాప తల్లి తన పాపను రక్షించింనందుకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే ఫెర్నాండో సబ్వే ట్రాక్‌పైకి దూసుకెళ్లినట్లు సాక్షులు చెప్పారనీ, సంఘటనా స్థలంలోనే అతను మృతి చెందినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అంతం ఐదు కాదు.. ఆరు!
న్యూయార్క్: ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా భూ వినాశనం ఐదు సార్లు కాదు.. ఆరు సార్లు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది 26 కోట్ల ఏళ్ల క్రితం సంభవించింది. ఆరు వినాశనాలూ పర్యావరణ విధ్వంసం కారణంగానే చోటుచేసుకున్నాయి. అగ్ని పర్వతాలు భారీ విస్ఫోటనం చెంది లావాను వెదజల్లాయని, దీంతో లక్షల చదరపు కిలోమీటర్ల భూమి లావా ప్రవాహంతో నిండిపోయిందని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖెల్ రాంపినో వెల్లడించారు. భూమి ఇప్పటికే ఆరు వినాశనాలను ఎదుర్కొంది. ఈ ఆరు వినాశనాల్లో పర్యావరణ విధ్వంసం కారణంగా భూమిపై అనేక జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. ఇదే ప్రస్తుతం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. -
క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..
ముంబై : న్యూయార్క్‌లో ఏడాది పాటు క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ నీతూ కపూర్‌తో కలిసి మంగళవారం ఉదయం ముంబైకు చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన రిషీ కపూర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అక్కడే ఉన్నారు. అమెరికాలో చికిత్స పొందుతున్న రిషీ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించగా, న్యూయార్క్‌లోనే ఇప్పటివరకూ ఆయన సేదతీరారు. గతంలో న్యూయార్క్‌ను సందర్శించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్‌ను పరామర్శించారు. రణ్‌బీర్ కపూర్ తన గర్ల్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి పలుమార్లు రిషీ కపూర్‌ను కలుసుకున్నారు. -
భారత సంతతి మహిళకు కీలక పదవి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన అమెరికన్ న్యాయవాది శిరీన్ మాథ్యూస్‌కు అమెరికాలో కీలక పదవి దక్కింది. ఆమెను ఫెడరల్ న్యాయవాదిగా నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. మాథ్యూస్‌ను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆమె కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా, క్రిమినల్ హెల్త్‌కేర్ కేసులకు సమన్వయకర్తగాను వ్యవహరించారు. ఫెడరల్ కోర్టులలో ఇదివరకే ఐదుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. సాబానార్త్ అమెరికా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కూడా మాథ్యూస్ తన సేవలను అందించారు. ఆమె నియామకాన్ని సెనెట్ ఆమోదించాల్సి ఉంది. వైద్య పరికరాలకు సంబంధించి మిలియన్ డాలర్ల అవినీతిని బయటపెట్టిన ఘనచరిత్ర ఆమె సొంతం. పెన్షన్ల కోసం పోరాడినందుకు సామాజిక భద్రత అవార్డు సైతం లభించడం విశేషం. -
తిరిగొస్తున్నా
ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్. క్యాన్సర్ చికిత్స కోసమే వెళ్లారని సమాచారం. ఆ మధ్య దర్శకుడు రాహుల్ రవైల్ ‘రిషీ కపూర్ క్యాన్సర్ నుంచి పూర్తిగా నయం అయ్యారు’ అని పేర్కొన్నారు. తాజాగా రిషీ ఇండియా తిరిగి రావడానికి రెడీ అయ్యారని తెలిసింది. ‘ఆగస్ట్ నెలాఖరుకల్లా నేను ఇండియా రావొచ్చు. డాక్టర్ ఏమంటారో చూడాలి. కోలుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. తిరిగొచ్చేసరికల్లా 100శాతం ఫిట్‌గా ఉంటాను’ అని పేర్కొన్నారు రిషీ. ట్రీట్మెంట్ తీసుకుంటున్న కాలంలో ఆయన కుటుంబం, ఇండస్ట్రీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయన్ను న్యూయార్క్ వెళ్లి పలకరిస్తున్న సంగతి తెలిసిందే. -
ముంబై-న్యూయార్క్ విమానాలు నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుంచి న్యూయార్క్ విమాన సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్గంలో తగినంత డిమాండ్ లేకపోవడంతో ఎయిరిండియా నష్టాల పాలైంది. దీంతో ఈ మార్గంలో తన విమాన సేవలను నిలిపిస్తోంది. డిసెంబర్ 2018 లో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ముంబై-న్యూయార్క్ డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించిన సంస్థ డిమాండ్ తక్కువగా ఉండటంతో ఇకపై ఈ సర్వీసులను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. ముంబై-న్యూయార్క్ మధ్య వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడిపిస్తున్న ఎయిరిండియా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత కారణంగా ఫిబ్రవరిలో తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేసింది. అయితే జూన్‌లో పునఃప్రారంభించాలని భావించినా.. ఇకపై ఈ సర్వీసులను కొనసాగించలేమని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వింటర్‌కు సంబంధించి అక్టోబర్ మూడవవారం నుంచి మార్చి రెండో వారం వరకు అందించే ఎయిరిండియా విమాన సేవలు ఇందులో భాగం కాదని వివరించారు. -
కునుకు లేదు.. కన్నీళ్లే
సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిసి ఆమె అభిమానులంతా షాక్ అయ్యారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సోనాలీ న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుని క్షేమంగా ఇండియా తిరిగొచ్చారు. అభిమానులే అల్లల్లాడిపోతే క్యాన్సర్ ఉందన్న వార్తను విన్నప్పుడు సోనాలి బింద్రే ఎలా తీసుకున్నారు? ఎలా తట్టుకున్నారు? ఈ ప్రశ్నకు ఓ షోలో సోనాలీ సమాధానమిస్తూ – ‘‘ముందుకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఓ మైగాడ్ అనుకున్నాను. వేగంగా వెళ్లే ట్రైన్ వచ్చి బలంగా తాకినట్టు ఆ వార్త నన్ను కుదిపేసింది. ఆ రాత్రంతా నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నాను. బాగా ఏడ్చాను. ఎందుకంటే.. నాకే ఎందుకిలా జరుగుతుంది? అంటూ బాధపడే ఆఖరి రోజు ఇదే కావాలని బలంగా కోరుకుంటూ ఏడ్చాను. ఇకమీదట అంతా సంతోషమే, నవ్వులే ఉండాలని అనుకున్నాను. మనకు నచ్చనివి జరిగినప్పుడు నమ్మడానికి ఇష్టపడం. ఆ రాత్రి నాకు క్యాన్సర్ అనే విషయాన్ని అంగీకరించగలిగాను. క్యాన్సర్‌ను యాక్సెప్ట్ చేశాను. ఆ సమయంలో నా భర్త గోల్డీ బెహల్, సుస్సానే ఖాన్, గాయత్రీ నాతోనే నిలబడ్డారు. గోల్డీ, నేను 16 ఏళ్లుగా కలసి ఉంటున్నాం. క్యాన్సర్ గురించి తెలిశాక గోల్డీ నా జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటిరోజు ఉదయాన్నే సూర్యుడు రావడాన్ని ఫోటో తీశాను. ‘స్విచ్చాన్ ది సన్‌షైన్’ అంటూ నా ఫ్రెండ్స్‌కు ఆ ఫోటోలు పంపించాను’’ అని పేర్కొన్నారు సోనాలి. -
తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!
న్యూయార్క్: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) స్టూడెంట్ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్ రోజ్ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్బీ కిల్లర్’ అనే పెన్‌డ్రైవ్ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్లో షూట్‌చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్‌చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. -
ట్రంప్‌ను వెనక్కునెట్టిన మోదీ
న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో ప్రధాని ఫాలోయింగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఫేస్బుక్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కు నెట్టి మోదీ ముందువరుసలో నిలిచారు. బీసీడబ్ల్యూ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం మోదీ వ్యక్తిగత అకౌంట్‌కు ఇప్పటివరకు 43.5 మిలియన్ లైకులు వచ్చాయి. అధికారిక అకౌంట్‌కు 13.7 మిలియన్ల లైకులు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 23 మిలియన్ లైకులతో రెండో స్థానంలో నిలవగా, జోర్డాన్ క్వీన్ రాణియా 16.9 మిలియన్ లైకులతో మూడో స్థానంలో ఉన్నారు. బ్రెజిల్ నూతన అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రపంచంలోనే విశేషాదరణ పొందుతున్న యువనాయకుడిగా పేరు దక్కించుకున్నారు. దీని గురించి బీసీడబ్లూ అధికారి చాడ్ లాట్జ్ మాట్లాడుతూ.. ‘జనాలను తమవైపు ఆకర్షించుకోవడానికి నాయకులు ఫేస్‌బుక్‌ను సులువైన సాధనంగా వినియోగించుకుంటున్నారు. ప్రజలతో మమేకమవడానికి, వారి భావాలను పంచుకోడానికి ఫేస్బుక్-లైవ్ నుంచి ఫేస్బుక్-స్టోరీస్ వరకు అన్నింటినీ విజయవంతంగా ఉపయోగించుకుంటున్నారు’ అని తెలిపారు. ట్రంప్ తన ఫేస్బుక్ ఖాతాను తెరిచినప్పటి నుంచీ ఇప్పటివరకు 50 వేల ప్రకటనలను పోస్ట్ చేశారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ ప్రణాళికను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి, గత సంవత్సరం డిసెంబర్లో 74 పెయిడ్ యాడ్స్‌ను పోస్ట్ చేశారు. కామెంట్లు, లైకులు, షేర్స్‌తో కలిపి ప్రపంచ నేతల్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 10 శాతం పెరిగింది. ఇప్పటివరకు అధికంగా 2.5 మిలియన్ల ఫ్యాన్సుని సాధించుకున్న జెర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫిబ్రవరిలో అకస్మాత్తుగా తన ఫేస్బుక్ పేజ్ని డిలీట్ చేశారు. -
బతికే అవకాశం తక్కువన్నారు
క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు నటి సోనాలీ బింద్రే. తన పోరాట ప్రయాణం గురించి ఆమె పలు సందర్భాల్లో పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సోనాలి. వాటిలోని సారాంశం ఈ విధంగా... ‘‘మన అనుభవాలు మనల్ని ఎలా మార్చాయని వివరించడానికి ప్రత్యేకమైన విధానం ఏదీ లేదు. మనలో వచ్చిన ప్రతి పరివర్తనకు దృశ్యరూపం ఉండకపోవచ్చు. క్యాన్సర్ చికిత్స కోసం గోల్డీ బెహల్ (సోనాలీ భర్త) నన్ను న్యూయార్క్ తీసుకుని వెళ్లారు. అక్కిడికి వెళ్లిన తర్వాతి రోజే డాక్టర్లను సంప్రదించాం. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ చేయించుకున్నాక తెలిసింది.. నాకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో ఉందని. పైగా నా పొత్తి కడుపు అంతా క్యాన్సర్ వ్యాప్తి చెందిందని, నేను బతికే అవకాశం ముప్పైశాతమే ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా మనసు బద్ధలైంది. కలత చెందాం. కానీ అధైర్య పడలేదు. చికిత్సలో భాగంగా చాలా కాలం కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. అయితే నేను చనిపోబోతున్నాననే ఆలోచన నాకు రాలేదు’’ అంటూ తాను కోలుకోవడానికి కారణం భర్త, స్నేహితులు, సన్నిహితులు అని పేర్కొన్నారు సోనాలీ బింద్రే. -
మళ్లీ పనిలో పడ్డా
న్యూ ఇయర్ బ్రేక్‌ను పూర్తి చేసి మళ్లీ షూటింగ్స్ బిజీలో పడిపోయారు పూజా హెగ్డే. న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం ఈ బ్యూటీ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు పనికి ఫుల్స్టాప్ పెట్టి హాలిడేస్‌ను ఎంజాయ్ చేశారు. హాలీవుడ్, హ్యారీపోటర్ షూటింగ్ చేసిన ప్రదేశాలన్నీ చుట్టేశారు. రీసెంట్గా హాలిడేస్‌ను పూర్తి చేసిన పూజ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్‌తో చేస్తోన్న లవ్‌స్టోరీ సెట్లో జాయిన్ అయ్యారామె. ‘‘లాంగ్ హాలిడే తర్వాత ఈ ఏడాది మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. హాలిడే మూడ్ వదిలేసి మళ్లీ పనిలో పడ్డా’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1920ల కాలంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరుపుకోనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది. -
విదేశాల్లో వేడుకలు!
గత ఐదేళ్లతో పోలిస్తే సినిమాల విషయంలో రజనీకాంత్ ఈ ఏడాది స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ‘కాలా, 2.ఓ’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తేవడమే కాకుండా ‘పేట్టా’ అనే మరో సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ఈ ఏడాదిని బిజీ బిజీగా గడిపారు రజనీకాంత్. అందుకే ఇప్పుడు ఆయన హాలీడేను ప్లాన్ చేసుకున్నట్లు కోలీవుడ్ టాక్. ఫ్యామిలీతో కలిసి రజనీ న్యూయార్క్ వెళ్లారన్నది తాజా సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను రజనీ కుటుంబం అక్కడే జరుపుకుంటుందట. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ కానున్న ఆయన తాజా చిత్రం ‘పేట్టా’ ప్రమోషన్ కోసం జనవరి మొదటివారంలో రజనీ ఇండియాకి తిరిగొస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. తెలుగులో ‘పేట’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాళవిక మోహనన్ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. రజనీకాంత్ నెక్ట్స్ మూవీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
పాక్ మహిళకు ఐరాస పురస్కారం
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66)కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవహక్కుల పురస్కారం–2018 అస్మాను మరణానంతరం వరించింది. పాకిస్తాన్లో సైనిక జోక్యానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అస్మా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు. న్యూయార్క్‌లో మంగళవారం సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్నాండా ఈ అవార్డును అస్మా కుమార్తె మునైజే జహంగీర్‌కు అందజేశారు. అస్మాతో పాటు టాంజానియాలో బాలికా విద్య కోసం ఉద్యమిస్తున్న రెబెకా గ్యుమీ, బ్రెజిల్లో తొలి ఆదివాసీ మహిళా న్యాయవాది జోనియా బటిస్టా, ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ డిఫెండర్స్(ఐర్లాండ్)కు 2018కి గానూ ఈ మానవహక్కుల పురస్కారం లభించింది. -
నిక్కి యావజ్జీవ శిక్ష విధించింది
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, అమెరికన్ గాయకుడు నిక్ జోనస్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి వివాహ బంధంపై న్యూయార్క్‌కు చెందిన ‘ది కట్’ అనే మ్యాగజీన్లో వచ్చిన ఓ కథనంపై ప్రియాంకా చోప్రా మండిపడ్డారు. ‘‘ఇలాంటి పిచ్చి కథనాలను నేను పట్టించుకోను. అసలు దీని గురించి కామెంట్ చేయాలని కూడా అనుకోవడంలేదు. ఇలాంటివి నా పరిధిలోకి రావు కూడా. ప్రస్తుతం నేను సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇలాంటి వార్తలు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయలేవు’’ అన్నారు ప్రియాంక. ఇంతకీ ‘ది కట్’ మ్యాగజీన్ కథ ఏంటంటే.. ప్రియాంక గురించి ఆ పత్రిక విలేకరి మరియా స్మిత్ ఓ కథనం రాశారు. ‘అసలు ప్రియాంక, నిక్ జోనస్‌ల ప్రేమ నిజమేనా? పాపం నిక్.. అందరి కుర్రాళ్లలాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రియాంకతో ప్రేమాయణం సాగించి వదిలేద్దామనుకున్నాడు. కానీ, గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్ అయిన ప్రియాంక ఏకంగా అతన్ని వివాహం చేసుకునేలా చేసింది. పెండ్లి పేరుతో నిక్‌ను శాశ్వతంగా కట్టేసుకుని, ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది’’ అని ఘాటుగా రాశారు. ఇవి జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు అంటూ ఆ పత్రికపై తీవ్రమైన విమర్శలు రావడంతో చివరకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పింది. సోనమ్ కపూర్, నిక్ సోదరుడు జో జోనస్, హాలీవుడ్ నటి సోఫీ టర్నర్ వంటి పలువురు ప్రియాంక గురించి సదరు పత్రిక అలా రాయడం సరి కాదని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
వైరల్: అసభ్య సంజ్ఞల యుద్ధం
ఈ వేలు మా నాన్నలోని పవర్.. ఈ వేలు నా మీసంలోని పవర్ అంటూ హరికృష్ణ పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగ్ చూశాం. కానీ వేళ్లతోనే యుద్ధం చేసుకున్న ఇద్దరు వ్యక్తులను మరో వ్యక్తి వీడియో తీసి పెట్టడంతో వైరల్ అయింది. న్యూయార్క్‌లోని ఎన్వైసీ వీధిలో ఇద్దరు వ్యక్తులు ఎందుకో గొడవకు దిగారు. అటుగా వెళుతున్న గయ్ బుల్లెచ్ వీరి గొడవను వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ గొడవలో పంచ్‌లు, ముష్టిఘాతాలు ఉన్నాయేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆ ఇద్దరు ఒకరికొకరు అసభ్యకరమైన సంజ్ఞను (మధ్య వేలును) చూపించుకుంటూ రెచ్చిపోయారు. వారిలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా సమస్య ఎదురైనా వేలును చూపించడం మాత్రం ఆపలేదు. ఈ చర్య పలువురిని నవ్వించడంతో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఇది ఫేక్ వీడియో అని ఒకరు, జీవితం అంత సాఫీగా సాగదు అనడానికి ఇది నిదర్శనమని మరొకరు కామెంట్ చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. -
యుద్ధం ముగిసిపోలేదు!
నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె న్యూయార్క్‌లో ఉంటూ కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తన అనుభూతులను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటారు. తాజాగా తాను ముంబై రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్‌ను షేర్ చేశారామె. దాని సారాంశం ఇలా ఉంది.. ‘‘ఇంటికి దూరంగా న్యూయార్క్‌లో ఉన్నప్పుడు చాలా విభిన్నమైన స్టోరీలు నా చుట్టూ ఉన్నాయని తెలుసుకున్నాను. దేనికదే విభిన్నం. నా స్టోరీలో భాగంగా ఇప్పుడు నేను ఇంటికి వెళుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను. నేను న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ నా మనసు మాత్రం నా కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్యనే ఉంది. వారందర్నీ తిరిగి కలవబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నా యుద్ధం ఇంకా ముగిసిపోలేదు (క్యాన్సర్ చికిత్సను ఉద్దేశిస్తూ). కానీ హ్యాపీగానే ఉన్నా. ఈ హ్యాపీ ఇంట్రవెల్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. జీవితంలో నేను చేసే సాహసాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి’’ అన్నారు సోనాలి. -
కొంచెం ఆలస్యంగా...
క్యాన్సర్ వ్యాధికి భయపడకుండా, బాధపడకుండా.. ధైర్యంగా చికిత్స చేయించుకుంటూ, ప్రతి క్షణాన్నీ మిస్ కాకుండా ఆనందంగా గడుపుతున్నారు సోనాలి బింద్రే. గురువారం కుటుంబంతో కలసి న్యూయార్క్‌లో దీపావళి పండగను జరుపుకున్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం సోనాలి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ సెలబ్రేషన్స్ ఫొటోలను ట్వీటర్లో షేర్ చేశారు. ‘‘ముంబైలో సంబరాల కంటే కొంచెం లేట్‌గా న్యూయార్క్‌లో మొదలుపెట్టాం. మనలాగా సంప్రదాయ బట్టలు వేసుకుందాం అంటే ఇక్కడ లేవు. పూజ కూడా సింపు ల్గా చేశాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు సోనాలి. -
అమెరికాను భయపెడుతున్న ‘ప్యాకెట్లు’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి, మాజీ అధ్యక్షుల నివాసాలకు, బిలియనీర్ జార్జ్ సోరస్ ఇంటికి, సీఎన్ఎన్ మీడియా సంస్థకు అనుమానాస్పద ప్యాకెట్లు వస్తున్నాయి. పార్శిల్ని విప్పి చూడగా వాటిలో పేలుడు పరికారాలు బయటపడుతున్నాయి. వీటిని చూసిన సీఎన్ఎన్ ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ అలారమ్ మోగించి తన సిబ్బందిని బయటకు పంపించింది. తొలుత ఈ ప్యాకెట్లు మంగళవారం బిల్ క్లింటన్ నివాసానికి, బుధవారం ఒబామా నివాసానికి వచ్చాయని ఎఫ్‌బీఐ ప్రకటించింది. అయితే ఈ ప్యాకెట్లు వచ్చిన సమయంలో హిల్లరి దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. వీటి గురించి దర్యాప్తు కొనసాగుతుందని ఎఫ్‌బీఐ అధికారులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. We are aware of a suspicious package found in the vicinity of the Clinton residence in Chappaqua, NY, and our JTTF has engaged with our federal, state and local partners to investigate. As this is an on-going investigation, we will have no further comment at this time — FBI New York (@NewYorkFBI) October 24, 2018 అయితే మాజీ అధ్యక్షులు, ప్రముఖుల ఇళ్లకు వస్తోన్న ఈ అనుమానాస్పద ప్యాకెట్ల అంశాన్ని వైట్ హౌస్ ఖండించింది. ఇలాంటి భయపెట్టే చర్యలు చట్ట వ్యతిరేకమైనవని, అసహ్యమైనవని పేర్కొంది. వీటికి పాల్పడే వారు ఎవరైనా సరే.. తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించింది. అంతేకాక ఈ ప్యాకెట్ వచ్చిన వారందరికి భద్రత కల్పిస్తామని వెల్లడించింది. -
ఎంచక్కా మాయమైపోండిక!
న్యూయార్క్: హ్యారీపోర్టర్ సినిమా చూశారా.. అందులో హీరో అప్పుడప్పుడు మాయం అవుతూ ఉంటాడు.. దీనికి కారణం హీరో వీపు వెనుక ధరించే పరదా వంటి వస్త్రం.. అలాంటి వస్త్రమే మనకు దొరికితే.. ఎంచక్కా మాయమై పోవచ్చు కదా.. అయినా అది సినిమా.. నిజంగా ఉంటుందా అనే కదా మీ అనుమానం. అది త్వరలోనే నిజం కానుంది. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు అలాంటి సాంకేతికతనే అభివృద్ధి చేశారు. వస్తువుపై పడే కాంతి తరంగాల పౌనఃపున్యాన్ని మార్చడం ద్వారా ఈ సాంకేతికతను తయారుచేశారు. దీంతో ఏ వస్తువునైనా అన్ని దిశల నుంచి కనిపించకుండా అంటే మాయం చేయొచ్చన్న మాట. కాంతి గురించి అధ్యయనం చేసే ‘ది ఆప్టిక్ సొసైటీ’అనే కంపెనీ కొత్త పరికరాన్ని అభివృద్ధిపరిచింది. ‘స్పెక్ట్రల్ ఇన్విజిబిలిటీ క్లోక్’అని పిలిచే ఈ పరికరంతో ఏ వస్తువునైనా కనిపించకుండా చేయొచ్చు. ఈ పరికరం కాంతి పౌనఃపున్యాన్ని మారుస్తుందన్న మాట. ఇప్పటి వరకు ఒకే రంగు కాంతి వచ్చే వస్తువులను మాత్రమే మాయం చేసే సాంకేతికత ఉంది. అయితే తాజాగా అభివృద్ధి పరిచిన సాంకేతికతతో అన్ని రంగులున్న వస్తువులను కూడా మాయం చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వివరాలు ఆప్టికా అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమ య్యాయి. అయితే దీన్ని మరింత అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్త జోస్ అజానా పేర్కొన్నారు. -
చైతూ ఆటా పాటా
న్యూయార్క్‌లో తన మార్క్ కనిపించేలా చిందేస్తున్నారు హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ప్రవీణ్. ఎమ్ సహనిర్మాత. ‘‘న్యూయార్క్‌లో జరుగుతోన్న ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఒక సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. చైతూ అక్కగా భూమిక, ఓ కీలక పాత్రలో మాధవన్ కనిపించనున్నారు’’ అని పేర్కొంది చిత్రబృందం. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: కీరవాణి. -
త్వరలోనే ఏలియన్స్‌ను కలుస్తామట.!
న్యూయార్క్: గ్రహాంతరవాసులు ఉన్నారనే వాదనను మరింత బలపర్చేలా మరో శాస్త్రవేత్త కీలక ప్రకటన చేశారు. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మిచియో కాకు.. త్వరలోనే మనం ఏలియన్స్‌ను కలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అది కూడా ఈ శతాబ్దంలోనే జరగొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే ఏలియన్స్‌తో మన ముఖాముఖి ఎలా ఉంటుందన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. వాళ్లు మనతో స్నేహంగా మాత్రం ఉండబోరని కాకు అంచనా వేశారు. త్వరలోనే ఏలియన్స్ సంభాషణను రేడియో టెక్నాలజీ సాయంతో వినగలుగుతామని, అయితే వాళ్ల మాటలు విన్నంత మాత్రాన వాటిని అర్థం చేసుకోలేమన్నారు. వాళ్లతో మాట్లాడటం చాలా కష్టమని, ఎందుకంటే వాళ్లు కొన్ని పదుల కాంతి సంవత్సరాల దూరంలో ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాళ్ల టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ముందు వాళ్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని కాకు సూచించారు. ఏలియన్స్ వస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, వాళ్లు మనల్ని అడవి జంతువుల్లాగా చూసే ప్రమాదం ఉందని ఈ సైద్ధాంతికి భౌతిక శాస్త్రవేత్త ఆందోళన వ్యక్తంచేశారు. -
న్యూయార్క్ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలో చిక్కుకున్న 12 మందిని సహాయక బృందాలు రక్షించాయి. బ్రాంక్స్ ప్రాంతంలో ఉన్న ప్రాస్పెక్ట్ అవెన్యూ అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.50 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 160 మంది అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గత పాతికేళ్లలో న్యూయార్క్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదమని నగర మేయర్ బిల్ డే బ్లాసియో తెలిపారు. -
న్యూయార్క్‌లో ‘ఉగ్ర’ పేలుడు
న్యూయార్క్: అమెరికా నగరం న్యూయార్క్‌లోని రద్దీగా ఉండే ఓ మెట్రో స్టేషన్లో ఐసిస్ ఉగ్రవాది సోమవారం పేలుడుకు పాల్పడ్డాడు. అదృష్టవ శాత్తూ బాంబు పాక్షికంగానే పేలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడగా వారి ప్రాణాలకేమీ అపాయం లేదని పోలీసులు తెలిపారు. న్యూయా ర్క్‌లోని మన్హటన్ ప్రాంతంలో ఉండే ‘పోర్ట్ అథారిటీ’ బస్ టర్మినల్ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడే మెట్రో స్టేషన్ కూడా ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన అకాయెద్ ఉల్లా (27) అనే ఐసిస్ ఉగ్రవాది ఇంట్లోనే పైప్ బాంబు తయారుచేసుకుని వచ్చి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో పోర్ట్ అథారిటీలో పేలుడుకు పాల్పడ్డాడు. బాంబు పాక్షికంగా పేలడంతో ఉగ్రవాదికి కూడా గాయాలయ్యాయి. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ ఘటన గురించి సమాచారం అందించారు. పేలుడు వల్ల మెట్రో స్టేషన్లో గందరగోళం నెలకొంది. అమెరికాలోని వివిధ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
అక్కడకు విమానాలు నడపలేం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో పాటు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపుతున్న ప్రమాదకర గణాంకాలతో యునెటైడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ న్యూయార్క్- ఢిల్లీ విమానసేవలను తాత్కాలికంగా నిలిపేసింది. మరో వారం రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో యెనైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పలు క్లిష్టపరిస్థితుల్లోనపూ విమాన సేవలు అందిస్తున్న పలు సంస్థలు.. విమాన సర్వీసులును రీ షెడ్యూల్ చేయడం. ఆలస్యంగా నడడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న నిర్ణయం మిగిలిన విమాన సంస్థలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయోనని పౌర విమానయాన శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. -
ఘోరం.. కారు మంటల్లో కాలిపోయింది
న్యూయార్క్ : అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన యువతి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా తగలబడిపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో చెలరేగిన మంటల్లో ఆమె దుర్మరణం పాలైంది. ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్పష్టమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ అహ్మద్ (23) అనే వ్యక్తి హర్లీన్ గ్రెవాల్ అనే భారతీయ సంతతికి చెందిన 25 ఏళ్ల మహిళను ఎక్కించుకున్నాడు. ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఉంది. అప్పటికే కొంచెం మద్యం సేవించిన అతడు బ్రూక్లిన్-క్వీన్ ఎక్స్‌ప్రెస్ వేలో ఓ కాంక్రీట్ పిల్లర్‌కు ఢీకొట్టాడు. దీంతో వెంటనే మంటలు చుట్టుముట్టాయి. అయితే, కారు దిగిన సయీద్ వెనుకాలే ఉన్న ప్యాసింజర్ అయిన హర్లీన్‌ను పట్టించుకోకుండానే మరో కారులో ఆస్పత్రి వెళ్లిపోయాడు. దీంతో ఆర్తనాదాలు చేస్తూ నడిరోడ్డులో నిస్సహాయ స్థితిలో ఆమె కాలిపోయి చనిపోయింది. కాగా, కారును డ్రైవర్ సయీద్ సోదరుడు మాట్లాడుతూ తన సోదరుడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడని, అయితే కారు డోర్ ఇరుక్కుపోయి ఆమె బయటకు రాలేకపోయిందని అన్నారు. అందుకే సయీద్ చేతులు కూడా కాలిపోయాయని తెలిపాడు. కాగా, పోలీసులు మాత్రం సయీద్‌పై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. -
బాలీవుడ్‌కు దారేది!
తమిళసినిమా: ఉత్తరాది భామలు దక్షిణాది చిత్రాలవైపు చూస్తుంటే మనవాళ్లకు మాత్రం ఇప్పటికీ బాలీవుడ్‌పై మోజు ఏమాత్రం తగ్గలేదని నయనతార మరోసారి రుజువు చేశారు. అంతేకాదు డబ్బెవరికి చేదు పిచ్చోడా అన్నట్టుగా తనకు సినిమాలే చాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించను అని పెద్దపెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన నయనతార, చివరికి ఒక శాటిలైట్ సంస్థ ఆఫర్‌గా ప్లాట్ అయిపోయి దాని ప్రచారయాడ్లో నటించేసింది. అదేవిధంగా ఇప్పటి వరకు దక్షిణాది చిత్రాలు చాలు, ఉత్తరాదికి దూరం అంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిందీ చిత్రాలపై మోజు పడుతోంది. దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న నయనతారకిప్పుడు నిజానికి చేతినిండా చిత్రాలున్నాయి. అయినా తన పరిధిని పెంచుకోవడం కోసమో లేక మరింత ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆశతోనే బాలీవుడ్ రంగప్రవేశానికి పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం. నయనతార ఇప్పుడు మరో పనిలో కూడా బిజీగా ఉంది. తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివతో షికార్లు కొడుతున్న నయనతార ఇటీవల ఆయన పుట్టిన రోజును న్యూయార్క్‌లో జరిపి వార్తల్లోకెక్కింది. అయితే అక్కడ ఈ భామ స్వకార్యం, స్వామి కార్యం అన్నట్టుగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కి వెళ్లిన బాలీవుడ్ క్రేజీ నటి ప్రియాంకచోప్రాను కలిసి కాసేపు ముచ్చటించిందట. పనిలో పనిగా తనకు హిందీ చిత్రాల్లో నటించాలనే ఆసక్తిని ప్రియాంకచోప్రా ముందు వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అవకాశాలను సంపాదించుకోవడానికి దారేంటని సలహాను కూడా అడిగేసిందట. మొత్తం మీద నయనతార బాలీవుడ్ రంగప్రవేశానికి సిద్ధం అవుతోందన్నమాట. -
60 కోట్ల పిల్లలకు నీటి కొరత
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది పిల్లలు 2040 లో తీవ్ర నీటి కొరత ఎదుర్కోనున్నారని యూనిసెఫ్ పేర్కొంది. ప్రతి నలుగురి పిల్లల్లో ఒకరు ఈ సమస్య ఎదుర్కొంటారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలు తక్కువ నీటి వనరులతో జీవిస్తారని హెచ్చరించింది. మంగళవారం యూనిసెఫ్ విడుదల చేసిన రిపోర్ట్‌ను ఈఎఫ్ఈ న్యూస్ సంస్థ బుధవారం వెల్లడించింది. నీరు లేకుండా జీవించడం కష్టమని, కానీ ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు తీవ్ర మంచి నీటి కొరత ఎదుర్కుంటారని తెలిపింది. ఆరోగ్యంగా జీవించాలంటే తాగే నీరు ఎంతో ముఖ్యమని, కానీ భవిష్యత్తు తరాలకు హానీ కలుగుతుందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోని లేక్ తెలిపారు. దీనికి కారణం నీటిని వృధా చేయడమేనన్నారు. జనాభా పెరుగుదలతో నీటి వాడకం పెరుగుతుందని, ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పడే 36 దేశాల్లో నీటి కొరత అధికంగా ఉందని, తక్కువగా నీటిని వాడుకోవాలని హెచ్చరించింది. తీవ్ర నీటి కొరతకు ప్రధాన కారణాలు వాతావరణం వేడెక్కడం, సముద్రాల విస్తీరణం పెరగడం, మంచు కరగడం, కరువులని తెలిపింది. ఇప్పటికే 66 కోట్ల మంది నీటి సమస్య ఎదుర్కుంటున్నారంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 800 మంది పిల్లలు డయేరియాతో మరణిస్తున్నారని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎక్కువ మంది పిల్లలకు మంచి నీరు అందకపోవడం వల్లే డయేరియా భారిన పడుతున్నారని తెలిపింది. రాబోయే రోజులోనైనా ప్రభుత్వాలు నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని యూనిసెఫ్ సూచించింది. -
ఓటమి తర్వాత హిల్లరీ తొలిసారి..
న్యూయార్క్: ‘కాలం.. విజేతలనే తప్ప పరాజితులను గుర్తుంచుకోదు’ అనే సామెత హిల్లరీ క్లింటన్ విషయంలో తప్పే. రెండున్నర శతాబ్ధాల ప్రజాస్వామిక చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడిన మొదటి మహిళగా ఆమె పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మంగళవారంనాటి ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన ఆమె బుధవారం అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆ తర్వాత మీడియా కంటికి కనపడలేదు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన్ ట్రంప్ గురువారం ప్రస్తుత ప్రెసిడెంట్ ఒబామాతో భేటీ అయిన వార్తలు ప్రధానంగా ప్రసారమయ్యాయి. హిల్లరీకి సంబంధించిన సమాచారమేదీ వెలుగులోకి రాలేదు. బహుశా ఆమె తీవ్ర విషణ్నవదనంలో ఉండిపోయారని కొందరు భావించారు. కానీ.. శుక్రవారం అమెరికా సహా ప్రపంచంలోని ప్రధాన వార్త సంస్థలన్నింటికీ హిల్లరీకి సంబంధించిన(ఫలితాల తర్వాత మొదటిసారి వెలుగులోకి వచ్చిన) ఫొటోలను ప్రచురించాయి. ఈ ఫొటోలో కూతుర్ని ఎత్తుకుని ఉన్న మహిళ పేరు మార్కోట్ గెర్స్టర్. హిల్లరీకి డై హార్డ్ ఫ్యాన్. ఉండేది న్యూయార్క్ శివారులోని వెస్ట్ చెస్టర్ కౌంటీలో. అదే కౌంటీలోని చెపాక్ ప్రాంతంలో హిల్లరీ దంపతులు నివసిస్తారు. ఫొటో గురించి మార్కోట్ తన ఫేస్ బుక్ పేజీలో ఇలా రాసింది..‘నా అభిమాన నాయకురాలు(హిల్లరీ) ఓటమి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇంట్లో కూర్చుని ఎంతో బాధపడ్డా. ఎన్నాళ్లిలా ఉంటామని నా చిన్నారిని తీసుకుని పార్క్ కు వెళ్లా. అక్కడ కాస్త రిలాక్స్ అయి వెనుదిరుగుతుండగా.. నా ఎదురుగా హిల్లరీ! ఒక్కసారి షాక్ కు గురయ్యా. వెంటనే తేరుకుని తనను ఆలింగనం చేసుకున్నా. బిల్ క్లింటన్ కూడా పక్కనే ఉన్నారు. కుక్కపిల్లను పట్టుకుని ఇద్దరూ వ్యాహ్యాళికి వచ్చినట్టున్నారు. హిల్లరీ మేడం నన్ను ఓదార్చింది. లైఫ్ మస్ట్ గో ఆన్.. తరహా మాటలతో ఊరటనిచ్చింది. ఎక్కువసేపు వాళ్ల సమయం తీసుకోకుండా నమస్కారం చెప్పా..’అని ముగించింది. నిజమేమరి, ఎన్నికల ఫలితాలపై ఒబామా చెప్పినట్లు, సూర్యుడు ఉదయించక మానడు.. న్యూయార్క్ లోని హిల్లరీ ఇల్లు.. -
వైద్య చరిత్రలో మరో రికార్డిది!
- 13 నెలల కవలలకు 27 గంటలపాటు ఆపరేషన్ - విజయవంతంగా కపాలాలను వేరుచేసిన అమెరికన్ వైద్యులు న్యూయార్క్: తెలుగు బాలికలు వీణా-వాణిల లాగే తలలు అతుక్కుని పుట్టిన ఈ చిన్నారులది అమెరికాలోని న్యూయార్క్ నగరం. 13 నెలల ఈ కవలల పేర్లు జేడన్, అనియాస్. వీళ్లిద్దరినీ వేరు చేసేందుకు అక్కడి మాంటెఫెర్ పిల్లల ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన 27 గంటల ఆపరేషన్ వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. నికోల్, క్రిస్టినా దంపతులకు రెండో సంతానంగా జన్మించిన కవలలకు తలలు అతుక్కుని ఉన్నాయ. విడివిడిగా కాకుండా కపాలాలు రెండూ కలిసిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రులు డాక్టర్ జేమ్స్ గుడ్ రిచ్ ను సంప్రదించారు. అప్పటికే కష్టతరమైన ఆపరేషన్లు ఎన్నో చేసిన అనుభవం ఉందాయనకు. అయితే జేడాన్, అనియాస్ లది కష్టతరమైన కేసు. చిన్న తేడా వచ్చినా పిల్లల ప్రాణాలు పోతాయి. చివరికి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆపరేషన్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. డాక్టర్ జేమ్స్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది వైద్యులు 27 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. మొదటి 16 గంటలు పిల్లల తలలను వేరుచేయడానికే పట్టింది. తర్వాత త్రీడీ టెక్నాలజీ సాయంతో కపాలాలను వేరుచేశారు. సర్జరీకి మరో 11 గంటలు పట్టింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన వెంటనే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు. -
చూశారంటే ప్రేమలో పడతారు!
న్యూయార్క్: నేటి రోజుల్లో చాలామంది నిజమైన ప్రేమ లేదనే అంటుంటారు. అంతా అవసరాలు, సౌకర్యాలకోసం ఏర్పాటుచేసుకునే బంధాలే తప్ప బాధ్యతలు, భావోద్వేగాలు వాటిల్లో లేవని అంటుంటారు. కానీ, న్యూయార్క్‌లో మాత్రం ఓ వృద్ధ జంటను చూస్తే నిజంగా ప్రేమంటే ఇదేరా అనుకోకతప్పదేమో.. అది న్యూయార్క్‌లోని ఓ విమానాశ్రయప్రాంగణం. అందరూ తమతమవారికోసం ఎదురుచూస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్ అందులోనే ముఖాలు. కానీ, ఓ పెద్దాయన మాత్రం హుందాగా తయారై చేతిలో పూలబొకే పట్టుకుని ఎంతో ఆత్రంగా ఓపికతో ఏమాత్రం అసహనం లేకుండా ఎయిర్ పోర్ట్ ప్రవేశ ద్వారం వైపు చూస్తున్నాడు. ఇంతలో ఓ సిల్వర్ రంగు జుట్టున్న పెద్దావిడ బయటకు వచ్చింది. ఆయన ముఖంలో చిరునవ్వులు.. ఆమె ముఖంలో చిరునవ్వులు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ ఆయనను చేరి ఒక్కసారిగా హత్తుకుపోయింది. గాఢంగా ముద్దుపెట్టుకొంది. ఆ క్షణంలో అక్కడ ఉన్నవారంతా వారిని చూసి ఓ క్షణంపాటు కదలకుండా ఉండిపోయి వారిని చూస్తూ నిండైన ప్రేమలో మునిగిపోయారు. ఈ వీడియోను క్రిస్ జీక్యూ పెర్రీ అనే సంగీత దర్శకుడు యూట్యూబ్‌లో మంగళవారం పెట్టగా ఇప్పటికే దాదాపు 22 మిలియన్ల మంది వీక్షించారు. -
అక్రమ సంబంధాల గుట్టువిప్పిన హ్యాకర్లు
న్యూయార్క్: వివాహేతర సంబంధాల కోసమే వెలసిన ‘ఆశ్లే మాడిసన్’ అనే ఓ ఆన్లైన్ డేటింగ్ సైట్‌పై హ్యాకర్లు దాడి చేయడంతో ఈ సైట్ ద్వారా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నవారి గుట్టు కాస్త రట్టయింది. దీంతో కొంత మంది కొంప కొల్లేరుకాగా, వందలాది మంది సంబంధాలు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఇలా సంబంధాలు కుప్పకూలిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కోకథ. వారా కథలను ‘విష్పర్’ అనే యాప్ ద్వారా బయటపెట్టి లబోదిబోమంటున్నారు. ‘నా ప్రేయసిని నేను కోల్పోయాను. నా ఇల్లు కూడా పోయింది. పిల్లలకు కూడా మొహం చూపించలేక పోతున్నాను’ ఇది ఒకరి కథ. ‘నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులై పోయింది. సమాజంతో మొహం ఎత్తుకోలేక పోతున్నా’ ఇది మరొకరి బాధ. ‘నేను ఛీట్ చేశాను. కానీ నేను దొరకలేదు. మరొకరితో రాసక్రీడలు సాగిస్తున్న నా ప్రేయసి దొరికి పోయింది. అయినా ఆమెను క్షమించేశాను. అయినా ఆమె నన్ను విడిచి మరొకరితో వెళ్లి పోయింది’ ఇది ఇంకొకరి ఆవేదన. ‘నా మనసంతా కకావికలమైంది. గుట్టు చప్పుడు కాకుండా మరొకరితో సాగిస్తున్న సంబంధాలను ఇంకేమాత్రం భరించలేను’ ఇది మరొకరి రియాక్షన్. ‘నేను చేసిన ఛీటింగ్‌కు క్షమించమని వేడుకున్నా. అయినా నా ప్రేయసి నన్ను కాదని వెళ్లి పోయింది’....ఇలాంటి సీరియస్ కథలేకాకుండా. ప్రతీకార ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. ‘నేను ఆయన కోసం షాపింగ్ చేస్తుంటే అక్కడ మరో యువతితో కులుకుతాడా? అందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేనూ మరో యువకుడితో రాత్రి గడిపాను’ లాంటి వ్యాఖ్యలు కూడా విష్పర్లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ డేటింగ్ సైట్‌ను అర్జంట్‌గా మూసివేయకపోతే తమ దాడులను ఇలాగే కొనసాగిస్తామని, గుట్టుచప్పుడు కాకుండా నెరపుతున్న వివాహేతర సంబంధాలను రట్టుచేసి రచ్చ చేస్తామని కూడా ‘ఆశ్లే మాడిసన్’ సైట్ సీఈవోను హ్యాకర్లు హెచ్చరించారు. 2012లో ప్రారంభమైన ‘విష్పర్’ను కూడా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినీ విద్యార్థులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్ లేకుండా గ్రీటింగ్ కార్డుల రూపంలో యూజర్లు ఈ యాప్ ద్వారా తమ సందేశాలను పంపించే వీలుంది. -
దీపావళికి సెలవివ్వని మేయర్
వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ డి బ్లాసియో ఒక ప్రకటనతో హిందువుల ఆగ్రహానికి గురయ్యారు. గత మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితాలో దీపావళి పండుగ లేకపోవడంతో స్థానిక హిందువులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ముస్లింల పండుగలైన ఈద్ - ఉల్- ఫితర్, ఈద్ అల్- అదా లను ప్రభుత్వ సెలవుల జాబితాలో చేర్చిన అధికారులు దీపావళి పండుగను మాత్రం చేర్చలేదు. దీనిపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ విచారం వ్యక్తం చేసింది. వేలాదిగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దీపావళి పండుగను సెలవుల జాబితాలో చేర్చక పోవడం విచారకరమని ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ షీతల్ షా అన్నారు. 40 సంస్థలతో మేయర్ ను కలిశామని, దీపావళికి సెలవు ప్రకటించాలని కోరామని తెలిపారు. స్థానిక గణేష్ టెంపుల్ ప్రెసిడెంట్ ఉమ మైసోర్కర్ దీనిపై స్పందిస్తూ... సిటీలోని కుటుంబాలు ఒకచోట చేరి సంబరంగా చేసుకొనే పెద్ద పండుగ దీపావళి అన్నారు. సెలవు లేదని పిల్లలు అంతగా బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ నమ్మకాలకంటే స్కూలు, పరీక్షలు ముఖ్యం కాదన్నారు. న్యూయార్క్ సిటీలో ముస్లిం పండుగలకు సెలవులను ప్రతిపాదించిన కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్ మేయర్ నిర్ణయాన్ని అభినందిస్తూనే.. దీపావళి పండుగను కూడా ఆ జాబితాలో చేర్చాలని ఆశించారు.